కాశీమజిలీకథలు/ఆరవ భాగము/64వ మజిలీ

వికీసోర్స్ నుండి

గావున నేమనుటకు నోరాడదు. గాని స్వయంప్రభ స్వతంత్రురాలై కులపాలికా ధర్మముల విడనాడినది. తోచినంతయుం గావించినది. చెప్పినంతయుం జేసినది. నాడు చెప్పినమాట పరిహాసమను కొంటిని. యధార్ధమేనట. అని యా కథ యంతయు నామూలచూడముగా వక్కాణించినది.

మేదినీకాంతుఁ డావృత్తాంతము విని స్వాంతమునఁ జింతయు, వగపును, విషాదము, ప్రమోదము, పశ్చాత్తాపము లోనగు గుణంబులన్నియు నొక్కసారి జనింపఁ దెంపుసేయనేరక పీఠమున కొఱగి పెద్ద తడువు ధ్యానించి తనకుఁ దాన సమాధానపరచికొని భార్యకిట్లనియె. సాధ్వీ ! కర్మసూత్రగ్రంధితంబైన జంతువు దానివిడిచి పోవుటకు శక్యంబగునా? అది యెట్లు లాగిన నట్లు పోవలసినదే. మన మేమిచేయుఁ గలము? పొనిమ్ము. అతండు మహానుభావుడని యానందింతము. దౌహిత్రులాభంబు గలుగునని మురియుదము. అని చెప్పుచుండ రాజపత్ని యది యట్లుండె, భూరిశ్రవునికి వార్త నంపితిమిగదా యతనికేమని చెప్పవలయును? ఈ యపకీర్తి మన యావజ్జీవము బాధించునుగదా? అందులకేమి చింతించితికాని యడిగిన నతం డాలోచించి ప్రస్తుతము ముహూర్త మాపితిమనియు వెండియుం దెలియఁ జేయుదనుక రావలదనియు వ్రాయింతుమని చెప్పి యట్ల గావించెను.

రాజపత్ని యర్థసంతోషముతో నాధా ! ఆయోగి పూర్వజన్మంబున నెక్కుడు పుణ్యంబు గావించుటంబట్టి నాపట్టి చేపట్టినది. ఇఁక చెట్టునీడల వసియింపనేల? మీరు పోయి సబహుమానముగా మనయింటికిం దీసికొనిరండు. లేనిచో సరివారు పరిహసింతురని బోధించిన ---నకనాధుండేమిచేయుటకుం దోచక విధిలేక యమ్మరునాఁడు తగు పరివారము సేవింప మేళతాళములతో నగ్గిరిపరిసరమున కరిగి యయ్యతికి నమస్కరించుచు స్వామీ! మిమ్ము నాకూఁతురు భర్తగా వరించిన దఁట. మీరిందుండనేల? వీటిలోనికి రండు. ఉద్యానవనము తపోవన మగుంగాక యని కోరిన నతండు రాజా! నీ కట్టియభిప్రాయముండిన ద్రోసివేయనేల? ఇదిగో? వచ్చుచున్నాఁడ నని లేచి తన్నిర్దిష్టంబగు నందలమెక్కి యధిక వైభవముతో నగరుఁ బ్రవేశించెను.

అని యెరింగించి వేళయతిక్రమించుటయు మణిసిద్ధుఁ డవ్వలి కథ తదనంతరోవసధంబున నిట్లని చెప్పం దొడంగెను.

అరువది నాలుగవ మజిలీ

చ. అలరుచుఁ బెండ్లియన్న విని యాజ్యము వోసినక పోతుంది
    రలుక వహించి మండెడునృపాత్మజ నోజఁ దనంతవచ్చి స
    కౌనంగఁ జేసి తప్పుగా ? వెరులను త్వరత్వ
    తృణ నియమ ప్రభావములు మాకు వంది మత్రమా.

అని పరిహాసమాడిన మిత్రునితో

చ. అమరగమున్ను శంకరునియంతటివాఁడల బ్రహ్మచారి రూ
    పము ధరియించి పార్వతిఁ గృపామతిఁ గై కొనడే ! సుభద్ర న
    య్యమరవరాత్మజుండు మహాయతియై గయిపట్టలేదె త
    త్క్రమమున నింద్రమిత్రుని సుతన్ వరియించితి నెనుదప్పొకో.

అని చావడిలోఁ గూర్చుండి సహదేవుఁడు వసుమిత్రుఁడను మిత్రునితో సంభాషించుచుండ నొకపరిచారికవచ్చి రాజపుత్రా ! మీసహోదరి సావిత్రి మిమ్ము లోపలికి రమ్మన్నది. వేగిరండని పిలచిన నతం డిప్పుడేవత్తు నిందుండమని వసుమిత్రునకుఁజెప్పి యంతఃపురంబున కరిగి చెల్లెలింగాంచి గారవించి కుశలంబడుగుటయు నక్కలకంఠి యిట్లనియె.

అన్నా ! నీవరిఁగి కొంచెముకాలమైనను యుగాంతరము లయినట్లున్నదిగదా? ఎందెందుఁ దిరిగితివి. ఏమేమి వింతలంజూచితివి. తలచిన కార్యము నెరవేరినదా? సవిస్తరముగా నుడువుమని యడుగుటయు నారాజుపుత్రుండు నవ్వుచు నిట్లనియె. సోదరీమణి! నీ యాలోచన వడువున నడిపించిన కార్యమేల సాఫల్యము కాకపోయెడిది. వినుము నీతోఁ జెప్పియొక్కరుండ పురమువెడలి కతిప్రయాణంబున నా గిరిదుర్గపురంబున కరిగి యారాజపుత్రిక చారిత్రము దెలిసికొనుచు గొన్ని దినము లందుంటి. ఆ వాల్గంటి వీణావతి వీణ విఱగఁగొట్టినది మొదలు పట్టణ ప్రజలెల్ల నప్పలవపాణి యిఁక బెండ్లి యాడదు. సన్యాసులలోఁగలసి పోఁగలదని నిశ్చయించుకొని యుండిరి. దానిచేష్టలును నట్లేయున్నవి. ఆమెవీక్షణ దర్శనమైనం చాలునని యెన్నియో ప్రయత్నములుఁ జేసితినిగాని యేమియు ఫలము లేకపోయినది. అప్పుడే నీ కాయుత్తరమువ్రాసి యంపితనిగదా? పిమ్మట నీవు పరిచారిక శారికంబంపి చేయఁదగిన కృత్యములు బోధించితివికదా ? అంతలో దైవికముగా నామిత్రుండు వసుమిత్రుండనువాడు నాకన్ను లంబడియెను. మేమొండొరులము గౌఁగలించుకుని క్షేమ సమాచారములం దెలిసికొంటిమి. పిమ్మట నీవు చెప్పిన యుపాయంబునకు మిక్కిలి సంతసించుచుఁ దానుకూడ సహాయముఁ జేయుదునని వాగ్దానముఁ జేసెను.

అప్పుడు మేము గూఢముగా నారచీరెలును --------------- , రుద్రాక్ష మాలికలు కమండలువులు లోనగువస్తువులెల్ల సంగ్రహించి యా ప్రాంతమందున రత్నకూటశైలపాదంబున వెలసియున్న స్వయంప్రభాదేవి యాలయములో వసియించి యా వేషము వైచుకొంటిని. శారికకు యోగినీవేషము వైచితిని. వసుమిత్రుండు వీటిలో నుండి యచ్చట జరిగినచర్యలన్నియుఁ దెలిసికొని యెప్పటికప్పుడువచ్చి మాతోఁజెప్పునట్లు నియమించితిని. అతండుమిగుల బుద్ధిమంతుండగుట నంతఃపురములలో నుద్యానవనములలో నగరులో జరుగు విశేషములన్నియుం దెలిసికొని గూఢచారుల నియమించి యా వృత్తాంతములెల్ల ముందుగనే మాకుఁ దెలియజేయుచుండువాఁడు. దైవసహాయము లేనిది ఏ కార్యము కొనసాగదు. వీణావతివలనం గొనిన మణిహారమే నా కార్యమునకుఁ బ్రధానసాధనమైనదిగదా? శారికయు మంచి నేర్పుతోఁ దనపాత్రకుఁదగిన చర్య లద్భుతముగా నడిపినది. ఇక జెప్పునది యేమున్నది. క్రమంబున నారాజపుత్రిక మా పన్నిన వ్యూహంబులోఁబడి నన్ను వివాహమాడినది మూఁడుదినములు మా యొద్దనేయున్నది. అంతలో రాజకింకరులు వీణావతింబట్టి తెలుసుకొనివచ్చిరి. అది నన్నెఱింగినదగుట మాగుట్టు బై లఁబడునను తలంపుతోఁ నా రాజపుత్రిక యింటికిఁజనిన వెంటనే మా వేషములు తీసివేసి వడివడిగా నిచ్చటి కరుదెంచితిమి. ఇదియే జరిగిన వృత్తాంతమని యా కథ యంతయు సొంతముగా వక్కాణించెను.

ఆయ్యుందంతమువిని యక్కాంత మిక్కిలి సంతసించుచు అన్నా ఈ నడుమ నొకవిశేషముజరిగినది వినుము. ఇంద్రమిత్రుఁడు తనకూఁతురుస్వయంప్రభను నీకిచ్చి వివాహముఁ జేయిటకు ముహుర్తము నిశ్చయించి శుభలేఖల నంపుటయు నేను మన జనకుని ప్రోత్సాహపరచి యంగీకరించితిమి. ప్రత్యుత్తరమును వ్రాయించితిని. వానికిబదులు ప్రస్తుతము హూర్తమునిలిపినట్లు పత్రికలు వచ్చినవి. అందలి కారణ మేమియో తెలియవలసియున్నది. యతి వేషము ధరించి నీ వరిగితివని వా రెఱుంగ లేదుగదా ! అని యడిగిన నతం డాలోచించి యా రహస్యము వారి కేమియం దెలియదు. అందులకు వే రెద్దియేని కారణ ముండవచ్చును. మరియు మేము వచ్చిన తరువాత నచ్చట జరుగువిశేషములం దెలిసికొని రమ్మని వసుమిత్రుని మిత్ర నొక్కని నందుంచి వచ్చినారము. అతండు వచ్చిన నంతయుం దెలియగలదని పలికెను.

కపట శివానందయోగి కథ

అట్లు మాట్లాడు చుండగనే యొక పరిచారిక వచ్చి రాజపుత్రా ! వసుమిత్రుని మిత్రుఁడు వాకిట నిలిచియున్నవాడు. మీతో జెప్పవలసినమాట లవసరమై యున్నవట యని చెప్పిన సంభ్రముతో సహదేవుండుచెల్లెలినిలోపలికంపి వాని నచ్చటికిఁ దీసికొని రమ్మని చెప్పెను. తదానతి వసుమిత్రుఁడును, మిత్రుఁడును లోపలికి వచ్చిరి. మిత్ర మిత్రుఁడు రాజపుత్రుని మన్ననల కానందించుచు దేవా! లోకములో వంచకులు పెక్కండ్రుకలరు. తాడిఁదన్ను వాని తలఁ దన్ను వాడన్న వాడుక యదార్థమై యున్నది. మనము రాజపుత్రికను వంచించితిమి. మనల నిపుడు మరియొకఁడు వంచించుచున్నాఁడు వినుండు. మీ రరిగిన మరునాడే యా యూరివాఁడెవ్వడో మనగుట్టుఁ దెలిసికొనియున్నవాఁడు కాఁబోలు. మన మా ప్రాంతమందు బారవైచిన జటావల్కలముల సంగ్రహించి నీవలెనే యతి వేషధారియై యొక యాడుదానికి యోగినీవేషము వైచి యా మంటపములోఁ గూర్చుండి జపము చేసికొనుచున్నటుల నటించుచుండెను.

ఆమరునాడు నేనేమిటికో యచ్చటికిఁ బోయినంత వారిరువురు గనంబడిరి. మీరు మరల వచ్చిరాయని భ్రాంతినొంది దాపునకుఁబోయి చూచితిని. వేషము లవియేకా నిరూపము లవికావు. అది రహస్య స్థలమగుట మరియొక తపస్వు లచ్చటికివచ్చి జపముఁ జేసికొనుచుండిరని తలంచితిని. కాని జటావల్కలాదులు మనము సంపాదించినవగుట గురుతుపట్టి వారును డాంబికులేయని నిశ్చయించి యా రహస్యముం దెలిసికొను తలంపుతో నా ప్రాంతమందే తిరుగుచుంటిని. వారును మీవలెనే సామాన్యులతో మాట్లాడక మౌనవ్రతమే యవలంబించిరి.

మరికొన్ని దినముల కమ్మహారాజు దైవికముగా రత్నహారము దొరకెనని వార్త విని సంతసించుచు నక్కపటయోగివద్దకరిగి కృతజ్ఞతఁ జూపి రత్నములతోఁ గూర్చిన రుద్రాక్షమాల యొకటి వాని కిచ్చెను. అయ్యారే ! ప్రశ్న మొకఁడు సెప్పఁ గానుక మరియొకనికి లభించినదిగదా ! తరువాత నే యా భూపతి కూఁతునకు వివాహ ప్రయత్నము గావించి మీ తండ్రిగారికి శుభలేఖలం బంపెను. అంతలో స్వయంప్రభ గాంధర్వవిధిని యతి కుమారుం బెండ్లి యాడినట్లును గర్భవతియైనట్లును విని ప్రస్తుతము తరలిరావలదని యిక్కడి కుత్తరము వ్రాయుచు నానూయావియే తనకల్లుఁడని నిశ్చయించుకొని యా కొండదండ కరిగి యా యోగినితోఁ గూడ వాని నందల మెక్కించి యింటికి కొనిపోయెను. మరియు నమ్మరుసటి దినంబునఁ బౌరులకెల్లఁ దెల్లమగునట్లు భద్రగజంబుపై నాటక్కరి నెక్కించి మేనంతయు బంగారుమయముగా నలంకరించి యూరేగింపుచుండిరి. పౌరులెల్లరు నత్యద్భుత ప్రభావ సంపన్నుండగు యోగియాతఁడే యనుకొని దేవునికివలె మంగళహారతు లీయఁదొడంగిరి.

అక్కటా ! ఆ యుత్సవ మంతయు గన్నులారంఁజూచి యోర్వఁజాలక చేయునది యేమియునులేక వేవేగమ పరుగెత్తుకొని వచ్చితిని. దేవా! మనము నాటిన వృక్షము వానికి ఫలములిచ్చుచున్నది. ఆలస్యమైనచో వాఁడె స్థిరపడగలడు. ఏదియో ప్రతీకార మొనరించి వానిం ద్రోసిపుచ్చి యా వైతవము దేవర యనుభవింపవలయునని యతండా కథనంతయుం జెప్పెను.

అప్పుడు వసుమిత్రుండు పక్కున నవ్వుచు మిత్రమా! వాఁడెవ్వడో నీపై వాఁడుగదా ! మంచి యుపాయ మాలోచించెనని పల్కుచుండ సహదేవుం డేమియుందోచక కళవరమందు డెందముతో చెల్లెలి కవ్విధ మంతయు నెరింగించెను. నిపుణమతియగు నా యువతి యా కథనిని అన్నా ? మించినదేమియును లేదు. తొందర పడకుము. స్వయంప్రభ గర్భవతి యయ్యెనని వింటిమి. ఆ సతి దృఢవతగదా ? హేమయు బుద్ధిమంతురాలు. విమర్శింపక తొందరపడువారుకారు. మరియు నీ వొక యుత్తర మిటులవ్రాసి పంపుము. కార్యసాఫల్యమగునని చేయఁదగిన కృత్య మంతయు బోధించి సంతోషముఁ గలుగ జేసినది.

అతండప్పుడే యొక యుత్తరమువ్రాసి వసుమిత్రుని మిత్రునికిచ్చి పంపెను. అతండా చీటినిగొని యతి రయంబున గిరిదుర్గమున కరిగి యుద్యానవనద్వార --------------- దైవికముగా బండియెక్కి యెక్కడకో బోవుచున్న హేమ వార్త విని యా జాబా బండిలోఁ బడవైచెను. హేమయు నా చీటిఁ చూచి బండి నిలిపి యా చీటివిప్పి యిట్లు చదివినది. ప్రేయసీ ! నీవు గర్భవతివైతివి. ఇప్పుడు నీ యిష్టమునకు వినిమయముగా నందుండ లేచిపోయితిని నేనిప్పుడు గ్రొత్తయోగములం దెలిసికొన హిమవత్పర్వత ప్రాంతముల యందున్న మా గురువుకడ కరుగుచున్నవాఁడ. వెండియు శీఘ్రమే రాఁగలను. నీ కుమారునెత్తుకొని దీవింతు, ముద్దు పెట్టుకొనియెద. ఆ బాలుఁడే నీతండ్రి రాజ్యమున కధికారి. మనము ఆ తపోవనమున కరుగుదము, విచారింపకుము. ("అద్వైత శివానందయోగి")

అని యున్న యుత్తరము ముమ్మారు జదివి విస్మయముఁజెందుచు బండి వెలుపలకుఁ దొంగిజూచి యా చీటినిచ్చినవా రెవ్వరని యడుగుటయు నందున్న యతండు అమ్మా ! నేను. నేను అని బదులు చెప్పెను. నీ కీ యుత్తర మెవ్వ రిచ్చిరని యడిగిన హేమతో అమ్మా ! వినుము. కొన్ని దినముల క్రిందట నేను రత్నకూటగిరి ప్రాంతమున కరిగితిని. అందు స్వయంప్రభాదేవి కోయలలోఁ దపము జేసికొనుచున్న యోగి యమ్మగారితోఁగూడ నెక్కడికో పయనము సేయుచు శకునము దీర్చిన నా మొగ మెగా దిగా జూచి యోరీ నీ దేయూరని యడిగెను. నేను వెఱచుచు చేతులు జోడించి స్వామీ: మా కాపురము గిరిదుర్గపురమే. మేము కాపు వారమని చెప్పితిని. అప్పుడాయన యొక్కింత తలయెత్తి యాలోచించి యోరీ ! రాజపుత్రిక స్వయంప్రభ నెరుగుదువా? దాని సఖురాలు హేమ పేరు వినియుంటివా యని యడిగెను.

స్వామీ ! ఇరువురపేరులు వినియుంటి. పరిచయముమాత్రము లేదు. నా చేయవలసినపని యేదియేని యుండినఁజెప్పుడు గింకరుండనై శ్రద్ధాభక్తులతోఁ జేసి కృతకృత్యుఁడ నయ్యెదనని యతివినయముతో బ్రార్ధించితిని. అప్పడాయన మరేమియును లేదు. ఈ యుత్తరము హేమ కందియ్యవలయును. సమయమరసి యుపాయము చేసికొని యిత్తువేని నిన్ను వృద్ధిబొందునట్లు దీవించెదనని పలికిన సంతసించుచు స్వామీ ! తప్పక నిది యామెకీయఁగలను నన్ను దీవింపుడని పలుకుచు నీ యుత్తరముఁ బుచ్చుకొంటి. అయ్యోగియు నామెయు నుత్తరముగాఁ బోయిరి. నాటంగోలె మీ నిమిత్తము తిరిగి తిరిగి విసిగిపోయితిని. నేడు నా పుణ్యంబునం గనంబడితిరని జెప్పెను.

ఆ మాటలువిని ఓయీ ! నీకు పారితోషిక మిప్పించెద నీ విచ్చటికిరమ్ము. పొమ్మని పలుకుచు హేమ బండి వెనుకకు మరలించి రాజపుత్రియొద్ద కరిగినది. స్వయంప్రభ హేమంజూచి యేమే ? ఇంతలోనే వచ్చితివేమి ? అయ్యోగినిఁ జూచి రమ్మంటినిగదా శకునము కాలేదాయని పలుకుటయు నమ్మగువ యాశ్చర్యముతో కాంతా ! వింతలు వినంబడుచున్నవి. ఈ పత్రికం జూచికొమ్మని చేతికిచ్చెను.

రాజపుత్రి యా యుత్తరముఁ జదివికొని యయ్యారే ! ఇది మిక్కిలి చిత్రముగా నున్నదే ? మదీయ వైరాగ్య నాటకమున కిది విదూషక వేషాభినయ ప్రదర్శనమె గాఁబోలు. మరి యా యూరేగింపు యోగి యెక్కడనుండి వచ్చెను. నీవు వేగఁబోయి నతనిఁ జూచిరమ్ము. అంతయుం దెలియఁగలదని పలుకుటయు హేమ వెండియు బండియెక్కి రాజభవనమున కరిగినది.

అందు రాజపత్ని హేమంజూచి స్వయంప్రభ భర్తంజూచి రమ్మని నిన్నుఁ బంపినది కాఁబోలు. ఆయన రూపము కంతు వసంతాదుల మించియున్నదని పొగడితివే ? చాలుచాలు. సామాన్యులలో హీనుఁడు. మాట్లాడినం దప్పుగదా? స్వయకృతాపరాధమునకు శిక్ష లేదు. ఆ గదిలో నున్నవాఁడు చూచిపొమ్ము. అని పలికినది.

అప్పుడు హేమ యామెయొద్ద నేమాటయుఁ బలుక వెరచుచు మెల్లగా నా యోగియున్న యింటిదాపునకుం బోయినది. అప్పుడతం డా యింటిలో రత్నవేదికపై గూర్చుండి యిరువురు తరుణులు వింజామరలు వీచుచుండఁ గన్నులు మూసికొని తావళముఁ ద్రిప్పుచుండెను ముందొక యోగిని కూర్చుండి యున్నది. ద్వారదేశమున నిరువురు రాజభటులు కావలియుండిరి. హేమం జూచి రాజభటులు మెల్లగా రమ్ము సద్దుజేయ వద్దని హస్తసంజ్ఞఁ జేసిరి.

ఆ మాటవిని నవ్వుచు స్వయంప్రభా సఖురాలు హేమయనునది దర్శనమునకు వచ్చినదని చెప్పుము. అని పలుకుటయుఁ బ్రతీహారు లయ్యోగిని కత్తెరం గెరింగించిరి. ఆమెయు బ్రవేశమునకు సెలవిచ్చినది. హేమ లోనికిఁబోయి నమస్కరించినది. ఆతండు కన్నులు మూసికొని తెరపక యట్లే జపమాలం ద్రిప్పుచుండెనుగావున హేమం జూడలేదు. హేమ యట్లే నిలువంబడి యతనిమొగ మెగాదిగఁ జూచి తొంటియోగి కాడని నిశ్చయించినది. అంతలో నతండు గన్నులు దెఱచి హేమను గూర్చుండుమని కనుసన్నఁ జేసెను.

హేమ స్వామీ ! నన్ను మీరు మరచిపోయితిరా యేమి? నా పేరు హేమయండ్రు. నాఁడు రాజపుత్రికను గురించి కోవెల వెనుక పెద్ద తడవు నాతో మాట్లాడిన విషయము జ్ఞాపకమున్నదియా? అని యడిగిన నతండట్లు జరిగినదిగాఁ దలంచి అవును. మాట్లాడితిని. జ్ఞాపకమువచ్చినది అనిచెప్పెను. స్వామీ ! మీ రూపము వెనుకటికంటె చాలమారినది. సుఁడీ ! ఈ యోగిని న న్నెరుంగ నట్లూరకున్న దేమి ? నాయొద్ద మౌనముద్రవిడిచి వెనుక మాట్లాడినది కాదా ! యనుటయు నతండు హేమా ! మేము నీ సఖురాలి గురించి సంసార ప్రసంగములో దిగవలసి వచ్చినది. అందువలన జ్ఞానవాసనతగ్గి లోకవాసన బలియుచున్నది. తేజము కొఱంతయగుటకుఁ గారణ మదియే సుమీ ! మరియు వచ్చిన వారితో నెల్ల మాట్లాడు చుండిన తపంబున కంతరాయమని వెనుకటికంటె మౌనముద్ర నెక్కుడుగాఁ గావించితిమి. అని యేదీయో చెప్పెను. స్వామీ ! మీరు నా చెలికత్తియ మూలమున సంసారములో దిగితిమని పలికితిరి. అది కపటము. మీమూలముననే నా సఖురాలు సంసారములో దిగినదని పరిహాస మాడినది. ఆ మాటల కతండు నవ్వుచు హేమా ! మీరు మిగుల ప్రౌఢురాండ్రు. నాగరికలు. మీతో మేము సమముగా నుత్తరము సెప్పగలమా? అనుటయు నది స్వామీ ! మా ప్రౌఢిమ యిప్పుడేమి తెలిసికొంటిరి. రేపు మా యుద్యానవనములోఁ బ్రవేశించినపుఁడు చూతురుగాక. అని మర్మోక్తు లెన్నియో యాడి నేనా స్వయంప్రభ కాంతరంగిక సఖురాలను మీగుట్టు బయలఁ బెట్టనులెండి. రహస్య మేదియేని యున్నఁ జెప్పవచ్చుననుటయు నతం డించుకఁ బొంకుచు నిట్లనియె

హేమా ! మేము తపోధనులము. పెద్దగాఁ బలకఁ జాలము. రెండు దినములలో నచ్చటికే వచ్చుచున్నాము. గావున నిప్పుడు చెప్పవలసిన దేమియు లేదని పలికెను. పిమ్మట హేమ యటఁగదలి యుద్యాన వనమునకుఁ బోయి స్వయంప్రభతో నిట్లనియె సఖీ ! మనల వంచించుట కెవ్వఁడో మాయావి యట్టివేషము వైచికొనియెను. మాటాడి చూచితిని. మాటలను రూపములును భాపములును జాల విపరీతముగా నున్నవి. అమ్మగారుకూడ రూపమున కాక్షేపించినది, మన ముత్తరము రానిచో నింత విమర్శింపక పోవుదుముగదా ? మన మిప్పుడీ యోగి యా యోగి కాడని చెప్పిన నయ్యగారికిఁ గోపము వచ్చును. నమ్మించుటయుఁ జాలకష్టము ముందు ముందు దెలియపరచెదము గాక వంచకులఁ గపటమున మరల వంచించుటయే లెస్స. ఇప్పుడేమియు మాట్లాడవద్దు. ఇట్లు చేయుదుమని చెవిలో నేదియో చెప్పినది. ఆ మాటలువిని యాబోటి కానిమ్ము. నీకుం దోచినయట్లు చేయుము. నన్ను సంసారనాటకములో వేషము వేయించితివిగదా యని పలికినది. అందులకుఁ దగిన సన్నాహమంతయు హేమ యమరించినది.

మరిరెండుదినము లరిగిన వెనుక నా యోగి నందలముపై నెక్కించి యా యుద్యానవనములోఁ బ్రవేశ పెట్టిరి. అప్పుడు హేమ సఖులతో నెదురుగావచ్చి యొకయింటిలోనికిఁ దీసికొనిపోయి యిదియే వరుండు గదియని చెప్పినది అందు వ్యాఘ్రాజినములు, దర్భాసనములు, కమండలువులు వల్కములు పెక్కమరింపఁబడి యున్నవి. ఆ గదిలో నొకమూల నినుపచిక్కములతోఁ జేయబడిన మంచము మీఁదఁ బులితోలు పరుఁపబడియున్నది.దానిఁ జూపుచు నిదియే తమకు శయన స్థలమని చెప్పిరి.

మరియు నారేయి స్వామీ ! నేఁడు నూతన శయనోత్సవము జేయవలసి యున్నది. మా రాజపుత్రికను మిమ్ములను నేకశయ్యయందుఁ గూర్చుండఁ బెట్టి చేడియలందరు వేడుకపనులఁగావింతురు. అందులకు మీరు కినియరుగదాయని యడిగిన నతండు రాజపుత్రిక తనశయ్యకు వచ్చినం జాలునని సంతోషముతో తనరుహాక్షి మేము మాత్రము వట్టి ఛాందస్సుల మనుకొంటివా యేమి నవరసముల నెరింగినవారమే? మీ యిష్టమువచ్చిన వేడుకం గావింపుఁడు. కోపమేమియుం జేయనని చెప్పెను.

అప్పుడొక్క దాశీకన్యక నలంకరించి దీసికొనివచ్చి మంచముపైఁ గూర్చుండఁ బెట్టిరి. ఆ యతి రెండవదెసఁ గూర్చుండెను. పిమ్మట వధూవరులచే మొదట గంధముఁ బూయించిరి. తరువాత నొక ధూర్త బావగారూ ! మీ జడ లంటించుకొని నట్లున్న వేమని పలుకుచు జడలు లాగినది. అవి చేతిలోనికూడి వచ్చినవి. మరియొక్కతె యీ గడ్డము జటలవంటిదే కాఁబోలునని లాగినది. వేఱొకతె వల్కలము చించినది. ఇంకొకతె ముళ్ళు గ్రుచ్చినది. ఒకతె గోమయోదకముఁ జల్లినది. ఒకతె యుమిసినది. అతండు పెద్దతడవు దనుకఁ బరిహాస కృత్యములని తలంచి యతియిష్టమున నా చర్యల సహించు కొనుచుండెను. అవి క్రమ క్రమముగా ముదిరి ప్రహారణములుగా మారినంతఁ దాళలేక అయ్యో ! అయ్యో ఇదియేమి హాస్యము ఇదియేమి వేడుక? రాజపుత్రికయే మరియు బాధించుచున్నదే ? నిలువలేను రక్షింపుడు. రక్షింపుడు పోనిండు, పోనిండని యరచుచు మంచము దిగి యిటు నటు పరుగిడుచు కేకలు పెట్టుచుండెను. ఆ రోదన ధ్వనివిని రాజపుత్రిక హేమను నట్లు చేయవలదని మందలించినది.

అప్పుడు హేమ ధూర్తాంగనలతో వలదు వలదు. ఇఁకనూరకుండుడు. అయ్యగారికి హాస్యరసము తెలియదు. కోపము చేయుచున్నారని పలుకుచు స్వామీ ? మీరు త్రికాలవేదులుగదా? నేఁడిటుల జరుగునని తెలియదాయేమి? ఒకదినము హాస్యమునకే మీరిట్లు భయపడుచున్నారే? ఇంతకన్నఁ జేయదగిన రహస్యములు చాలఁ గలిగియున్నవి. వానికెట్లు తాళగలరని యడిగిన నతండు వివశుండై యిట్లనియె.

అబ్బా ! ఈ దెబ్బల కెవ్వఁడు తాళఁగలడు. నాకు రాజపుత్రిక యక్కరలేదు. నాదారి నన్నుఁ బోనీయుఁడని బ్రతిమాలుటయు హేమ అన్నన్నా ! మా రాజపుత్రికం బెండ్లియాడి విడచిపోవుదుననిన సమ్మతింతుమా ? నిలు నిలుమని యదలించినది. ఆరాత్రి అతనికి కాళరాత్రివలె భయంకరమై తోచినది.

అని యెరింగించుటవరకు వేళ యతిక్రమించుటయు నవ్వని కథ మణిసిద్ధుండు తదనంతరావ పధంబున నిట్లని చెప్పఁదొడంగెను.

అరువది యైదవ మజిలీ కథ

అయ్యో ! స్వయంప్రభాదేవి వరమునం బుట్టియు మనపట్టి యిట్టి నికృష్టపు నింద పాల్పడుచున్న దేమి ? కొన్ని దినములు బెండ్లియే యాడనని బాధపెట్టినది. తరువాత సన్యాసిని పెండ్లియాడితినని చెప్పినది. ఆ మాటనమ్మి ---------- భోగినిఁజేసి తీసికొని వచ్చితిమి. వానింజూచి తాను వరించిన సన్యాసి


మరియొకండని యిప్పుడు తెలియఁజేయుచున్నది. ఆ తగవట్లుండ భూరిశ్రవుని కుమారునికి దీనినిత్తుమని శుభలేఖలు వ్రాసితిమిగదా ? అతండు మన