Jump to content

కాశీమజిలీకథలు/ఆరవ భాగము/61వ మజిలీ

వికీసోర్స్ నుండి

మంత్రులకుం చెప్పుచు నా వారకాంతలం బట్టితేర శ్రూరులకు కింకరులఁ బెక్కండ్ర నలుదెసలకుం బంపించెను.

అని యెరింగించువఱకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుడు తరువాతి కథ యవ్వలి మజలీయం డిట్లని చెప్పఁదొడంగెను.

అరువది యొకటవ మజిలీ

సఖీ ! మిక్కిలి వెలఁగల వస్తువయని యించుకయు నాలోచించితిమికాము. అప్పుడు నాబుద్ధి మొద్దువోయింది. "బుద్ధిఃకర్మానుసారిణి" అను నార్యోక్తి యేల తప్పును. ఈ మణిహారమెవ్వరిచేతఁజిక్కునో వారే యీదేశము బాలింపఁగలరఁట ప్రమాదమైన పనిచేసితిమిగదా? ఈరాజ్యమిఁక నారుమాసములకు భోగముది పాటింపఁ గలదని మనపట్టణమున నెల్లరు నద్భుతముగఁ జెప్పుకొనుచున్నారు. శుద్ధాంతములో నేకాంతముగా ననుకొనినమాట యెట్లు వెల్లడియైనదో తెలియదు. ఈ యుపద్రవమునకు వెఱచుచు మీ తలిదండ్రులు నిద్రాహారములుమాని చింతించుచున్నారు. దీనికి ప్రతిక్రియ యేమియుం దోచుకున్నది. అని విచారించుచు హేమ చెప్పుటయు విని స్వయం ప్రభ యిట్లనియె.

అతివా ! కాలగతి నతిక్రమింప బ్రహ్మాదులకు శక్యమగాదన్న మనబోటుల మాటఁజెప్పనేల? పోవుదాని మనమాపఁగలమా! పోనిమ్ము. భాగ్యహీనులమైతి మేని వైరాగ్యముబలసి తపంబు జేసికొనియెదము గాక నదియు నుపకారమే యని చెప్పుచుండగనే యొకపరిచారికవచ్చి హేమను రాజపత్ని తీసికొనిరమ్మనెనని చెప్పినది. హేమయు లజ్జాశోకసంభ్రమములలో పరిచారికవెంట రాజపత్ని యంతః పురమున కరిగి మరలవచ్చినది. స్వయంప్రభ హేమంజూచి అమ్మ నిన్నేమిటికి రమ్మన్నది. విశేషము లేమని యడిగిన నమ్ముగువకు హేమ యిట్లనియె.

సుందరీ ! నీయందు తలిదండ్రులకుఁ గలప్రీతి నేమనిచెప్పుదును. నీవలన నీ యుపద్రవము కలిగినది కావున నిందులకై నీవెక్కుడుగా నుడుకుచుందువని తలంచి నిన్నో దార్చుటకై నన్ను రప్పించిం. ఆహా ! ఏమి వారియక్కటికము. రాజ్యాంతమైనపనిఁజేసినను నీయందు నించుకయు నలుగరుగ ? మరియు నీపురప్రాంత మందలి రత్నగిరి పాదమున వెలసిన స్వయం ప్రభాదేవి యాలయమున నెవ్వఁతో యోగివచ్చియున్నవాడఁట. అతండు త్రికాలవేదియనియు నత్యద్భుతప్రభావ సంపన్నుడనియు విని నిన్న నయ్యగారు కొలఁదిగ పరిజనులు సేవింప గూఢముగా నప్పర్వతమున కేగి దూతికాముఖంబునఁ దమరాక తెలియఁజేసిరట. ఆయోగిపుంగవుండును దర్శనమీయకయే వచ్చినపనియంతయుఁ బూసగ్రుచ్చినట్లు చెప్పి నీరాజ్యమున కేమియు భంగములేదు. హారమువచ్చి నీకూతురు యం బడఁగలదు. వెరవకుమని యోదార్చెనఁట ఆమాటవిని భూపతి మిగుల సంతసించుచు నింటికి వచ్చియత్తెఱఁగంతయు మీయన్ను కెరింగించెను. అత్తపస్వి సత్యవచనుండని నమ్మి నీతలిదండ్రు లానందము జెందుచున్నారు. మన రాజ్యమున కేమియు భయములేదని నీకునుఁ జెప్పుమనిరి. ఇదియే యచ్చటివృత్తాంతమని యా రహస్యమంతయుం జెప్పినది. యోగులనినను తాపసు లనినను యవభూతలనినను నామత్త కాశిని చిత్తము సంతోషాయత్తమగుచుండును. కావున నయ్యోగి మాటఁ దలపెట్టినంత మురియుచు హేమతో తరుణీ ! ఆయోగివరుని చరిత్రము మనము తెలిసికోవలసి యున్నది. ఎంతవాఁడునుగాక యేకాంతోదుదంతంబుల నెరింగినట్లు చెప్పఁగలడా ? వానియందద్భుత సామర్ధ్యంబు లున్నమాట వాస్తవము. కావున నీ వేకాంతముగా నందరిగి యగ్గురువరుని కులశీలనామంబు లెట్టివో తెలిసికొని రమ్ము. అని యనేక ప్రకారముల బ్రతిమాలుకొనినది.

హేమ యామాటవిని నవ్వుచు పొలతీ ! నీధైర్యముకొనియాడఁదగియున్నదిగదా రాజ్యముపోవునని యించుకయు విచారింపవు. యోగులచరిత్రములతో మనకేమిపని యడుగవలసిన మాటలయ్యగారే యడిగి వచ్చిరిగదాయని యేమేమో ప్రతికూలవాక్యములు చెప్పటయు నొప్పుకొనక యప్పడఁతి మహాత్ముల దర్శనంబున ననేక లాభంబులు గలుగును. పోయి చూచి రమ్ము. పోవవేని నాయనయని పలుకుటయుఁ గులుకుచు నప్పొలఁతుక గిరిదుర్గంబున కప్పుడే యరిగి వచ్చినది.

దానిం జూచినతోడనే యా చిగురాకుబోణి మోము వికసింప హర్ష పులకితగాత్రయై మించుబోణీ ! అమ్మహత్ముని దర్శించితివా? ప్రశ్నావకాశ మేమైనం గలిగినదా? అతం డెన్ని యేండ్లవాడు? తపం బెట్టిది. కులశీల నామంబు లెట్టివి? అంతయు సవిస్తరముగా వక్కాణింపుమని యడిగిన నవ్వుమొగముతో నమ్మగువ యిట్లనియె.

అద్వైత శివానందయోగి కథ

బోటీ ! నేఁటియుదయమున నీవిచ్చిన పుష్పోపాయనములుగొని యా కొండదండ కరిగితిని. అమ్మవారి యాలయ ప్రాకారమున నీశాన్యముననున్న కళ్యాణమండపము నడుమఁగూర్చుండియా యోగి జపముఁ జేసికొనుచుండెను. ఆయన ప్రక్కనేఁగూర్చుండి యొక యోగిని తావళముఁ ద్రిప్పుచున్నది. అమ్మకచెల్లా! అమ్మహాత్ముని సౌందర్యము వర్ణింప సహస్రముఖునికి శక్యముకాదుగదా ? అట్టి వానిని సన్యాసిగాఁ జేసిన కమలాసనుని నిందింపక మానరు.

సీ. పగదీర హరునిఁగెల్వఁగ దృఢవ్రతమూని
          తపమొనరించు కందర్పుఁ డొక్కొ
   మరు డెందుధరుకంటి మంటనీల్గ విరక్తి
          సంచార మొనరించు చైత్రుఁ డొక్కా

    పుడమిఁ ద్రిమ్మర వేడ్క బొడమిన జడదారి
           యాకృతిం దిరుగు జయంతుఁ డొక్కొ
    అఖిల మండలములఁ కాధిపత్యము సేయ
           నియమమూనిన కళానిధియొ కాక

గీ. కలుగనేర్చెనె యిటువంటి చెలువ మిట్టి
    సుందరం బిట్టి లావణ్య మెందునైన
    కావివల్వ జహకరకములఁదాల్చి
    యుర్విఁదిరిగెదు సామాన్యయోగి కరయ.

అని వర్ణించుచుండ వారించుచు స్వయంప్రభ ఓసీ! తత్ప్రభావముం గొనియాడక సౌందర్యమును వర్ణించెదవేమిటికి? ఆమాట నిన్నెవ్వరడిగిరి? తరువాత కథఁ జెప్పమనుటయు నా హేమ మరల నిట్లనియె తదీయు రూపవిభ్రమవిలాసాదులకు నాశ్చర్యమునొందుచు నేను మెల్లగాఁబోయి యా బాలయోగినిదాపునఁ గూర్చుంటిని. ఆపడఁతి నడుమ నడుమఁ గన్నులందెరచి చూచుచున్నదిగావున నన్నుఁజూచి పూఁబోణీ! నీవెవ్వతెవు? ఏమిటికివచ్పితివని యడిగిన నేను నమస్కరించి ప్రత్యుత్తర మీయబోవునంతలో నత్తాపసకుమారుండు పుండరీకదళంబులం బోలిన తన చక్కని విశాలనేత్రంబులఁదెరచి యపాంగ విలోకనంబుల నన్ను బవిత్రురాలిఁ జేయువాడుబోలెఁ జూచుచు బోటీ! నీవు స్వయంప్రభ సఖురాలవుకావా? నీపేరు హేమకాదా? ఆ చ్చిగురుబోణిపంపునంగాదే నీ విచ్చటికివచ్చితివి? మాకంతయుం దెలిసినదని పలుకుటయు తదీయ దివ్యదృష్టివిశేషంబుల కచ్చెరువందుచు నే నెదుర నిలువంబడి నమస్కరించి స్వామీ! మీరు త్రికాలవేదులు. దూరదృష్టి దూరశ్రవణంబులు మీకు కలవు. మీయొద్ద రహస్యములు దాగునా ? నాసఖురాలి చిత్తనైర్మల్యము నేను వేర మీకు విశదీకరింప నవసరములేదు సర్వము మీరు యెరుంగుదురని సంభ్రమముతోఁ బలికితిని. అప్పుడాయన శిష్యురాలులేని స్వమీ ! మీ రింతలోఁ దపోవిఘ్నము సహించి కాంతాప్రసంగమునకుం బూనుకొననేల ? ఇది కడువిస్మయము గొలుపుచున్నది. పరమార్దోపదేశమునకైన నాకింత సమయ మీయరుగదా ? ఆ రాజపుత్రి మంచిది కాఁబోలునని నుడివిన నజ్జడదారి యిట్లనియె.

సహోదరీ! ఆ రాజపుత్రిక చిత్తశుద్ధి యెట్టిదనుకొంటివి? ఆ వైరాగ్యము, ఆ వేదాంత వార్తాశ్రవణశక్తి, ఆవిషయపరాఙ్ముఖత, ఆ శాంతము మహర్షులకైన లేవని చెప్పవచ్చును. అంతయు నంతద్ధృష్టిం జూచుటంజేసి యింతదనుకఁ దత్ప్రసంగమున కనుమోదించితిని. ఇఁక జాలు పొమ్మనమని పలుకుచు నా యతి తల్ల జుండు వెండియుం గన్నులు మూసికొనియెను.

పిమ్మట నాయోగిని నాచేయి పట్టుకొని దూరముగాఁ దీసికొనిపోయి బాలా! నీసఖురాలి పుణ్యము మిక్కిలి స్తోత్రపాత్రమైయున్నదిగదా! ఆహా! అమ్మహాత్ముడు స్వయముగా నా పొలతి సౌశీల్యముం గొనియాడెఁ గదా! ఇల్లును వాకిలినివిడచి బంధువుల వదలి తనతోఁ గుమ్మరుచున్న నాతో సైత మింతవింతగా మాటాడడు. నిక్క మక్కలికి యట్టిది కాఁదలంచెదను. నిన్నేమిటి కచ్చెలువఁ బుత్తెంచినది. ఆ సర్వజ్ఞు డెరింగినను నాకుఁ జెప్పఁడుగదా? నాకామెతో మైత్రిజేయవలయునని యున్నది. సద్గోష్టియు సజ్జనసహవాసమును ముక్తికారణములు గదా? యని యడిగిన సంతసించుచు నే నీవృత్తాంతమంతయుంజెప్పి వెండియు నిట్లంటి.

దేవీ ! పరిచయము గొంచమైనను నీయౌదార్యము ప్రాగల్బ్యమును గలుగఁజేయు చున్నది. తెలియకడిగినమాటఁ దప్పుగాగణింపక క్షమింపుము. నీవును నా సఖురాలిపోలిక బ్రాయమునఁ మిక్కిలి చిన్నదానవు? రూపము జగన్మోహనమైనది. ఇట్టితరి వైరాగ్యవృత్తిని వర్తించుటకుఁగతంబేమి? మరియు నీ తాపసకుమారుండు మారునింబోలియున్న వాఁడు చక్రవర్తి లక్షణములన్నియు వీనియందు వర్తించు చున్నవి. ఇట్టి తొలిప్రాయమునందీ మహానుభావుండు మునివృత్తింబూనుట చిత్రముకాదా? పూనెఁబో ఇంతలో నింతమహిమ నెట్లు సంపాదించెను. మహాత్ములసామర్ధ్య మగోచరముగదా? వీరి యభిఖ్యమెట్టిది? కులమెయ్యది? జన్మభూమియేది? నీతల్లిదండ్రులెవరు? నీవీయోగికెప్పుడు శిష్యురాలవైతివి? మీ వృత్తాంతము వినుటకు నేనర్హురాలనేని వివరింపుమని యెంతయో నైపుణ్యముగాఁ బ్రార్థించితిని.

నామాటవిని యాబోటి బాలా? వేరచెప్పనేల? నాకథయంతయు నీ సఖురాలికథపోలిక వహించియున్నది. ఈగురునిపేరు యద్వైత శివానందయోగి ఈయన గొప్పకులమువా డగుటకు సందియములేదు. బాల్యమున శంకరుండు ప్రత్యక్షమై మంత్రోపదేశము చేసెనట. దానంచేసి విరక్తుండై లోకోపకారార్ధమై క్రుమ్మరుచున్నవాఁడు. రూపవంతుఁడై యభిజ్యాత్యుండై విద్యాశాలియై ప్రాభవార్హుండయ్యు విషయ పరాఙ్మఖతగలిగి గర్వమనునది యెరుంగక వస్తువిరాగముతోఁ దపము గావించుచున్న యీమహాత్ముని ప్రభావము లోకులవలనవిని నేనంతకుమున్న జనించియున్న వైరాగ్య ప్రవృత్తితో దత్వశ్రుజోతుకనై గురునన్వేషించుచుంటిం గావున నీతండ సేవ్యుండని నిశ్చయించి బంధువులవిడనాడి యొక్కనాఁడు మావీటి దాపున శివాలయములో నున్నతరి సంసారసాగరమునకు దరివై తరింపఁజేయుమని ప్రార్థించుచు నీతని యడుగుదమ్ములంబడి శరణువేడుకొంటి. కరుణా బంధురుండగు నిమ్మహాత్ముండు మదీయబుద్ధి పారిశుద్ధ్య మంతయు నంతర్దృష్టిఁ గనుటంజేసి నాశ్రుశూష కంగీకరించి మంత్రోపదేశముఁ గావించెను. నాఁటగోలె సహోదరుగాఁ దండ్రిగాఁ జూచుకొనుచు నీయోగి వెనువెంట నరుగుచుంటి నా వెనుక వాల్లంటులు పెక్కండ్రు శిష్యురాండ్రుగాఁ జేరుటకువచ్చిరిగాని వారినెల్ల నిరాకరించెను ఈతని చెంత కాంతాప్రసక్తి యించుకయుం బనికిరాదు. శ్రీశుకాదులకైన నించుక వంక యున్నదిగాని పరకాంత వైముఖ్యమున నతని కేలోపమునులేదు ఈతని చిత్తవృత్తి ననుసరించి నేనొకరితన తిరుగుచుంటి. నాకంటె నీసఖురాలియోగికినచ్చిన మచ్చకంటియని తోచుచున్నది ఇదియే మావృత్తాంతము. ఇంతకన్నఁ జెప్పఁదగినది నీవు వినదగినదియును లేదు. స్వయంప్రభను జాలచాల నడిగితిననిచెప్పు మిఁక బొమ్ము. అయ్యగారు పిలుచువేళయైనదని పలుకుచు నయ్యోగిని నాకనుజ్ఞ యిచ్చి వెండియు నామంటపము దాపునకుఁబోయినది. నేనింటికివచ్చితి నివియే యచ్చటి విశేషములని చెప్పినది.

ఆ వృత్తాంతమంతయు విని యక్కాంతారత్నము అమృతహ్రదంబున మునిగినట్లు సంతసించుచు సఖీ! తపఁ పభావమెట్టిదో తెలిసికొంటివిగదా ? ఎట్టి సార్వభౌముండైన నమ్మహాత్ముని పాద రేణువునకు సాటివచ్చునా? అందులకే నేను దపంబు తపంబని పరితపించుచున్నదాన ఆ గుట్టుతెలియక నన్నూరక మీరు రట్టుసేయుచున్నారు. అయ్యోగిని కడుఁ బుణ్యాత్మురాలుగదా! అమ్మహాభాగుని సేవఁ జేసి కృతార్థురాలగుచున్నది. అయ్యో ! ఆ చిన్నది నాతో మైత్రిచేయుదునని చెప్పి యున్నదిగదా యిచ్చటికేమిటికి రమ్మంటివిగావు. మరియు నాశుశ్రూష నాతండంగీకరించు విషయమై యేమియునడిగితివి కావేమి? ఈ రెండుపనులు కొంత చేసికొనివచ్చితివని యాక్షేపించిన హేమ యిట్లనియె.

సఖీ! నేనంత యెఱుంగనిదాననుగాను. ఆమెను మన యింటికి రమ్మనుట లాఘవముగాదా ? మనమే యామెదర్శనమునకుఁ బోవలయును. ఆ యోగివరుండు నిన్నుఁ బెద్దగా మెచ్చికొనుచుండ నీశుశ్రూషకేల యంగీకరింపఁడు. నేనేమియు నడుగకమున్నే నీ సుగుణములన్నియు నెఱిఁగినట్లు వక్కాణించెనే? అతని తపఁప్రభావ మనన్య సామాన్యమైనదని పొగడినది.

అప్పుడు స్వయంప్రభ సంజాతసంభ్రమయై యించుక యాలోచించి హేమా ! నేనొకసారి యమ్మహాత్ముని దర్శనముచేసి రావలయు నిందుల కుపాయముఁ జెప్పుము. దేవతాముని దర్శనంబుల కరుగునప్పుడు వాహనంబుల నెక్కి పోరాదు. అగ్గిరి యెంతదూరమున్నది. మనము పోయిన విని మనవారు మందలింతురా ? యేమనియెదవని యడిగిన నప్పరిచారిక విచారించి ముదితా! నీవిదివఱ కిల్లు వెడలిన దానవు కావు. పెద్దలయాజ్ఞలేక యందుఁ బోరాదు. అక్కొండ దవ్వుగా నున్నది. నడచిపోవుట కష్టము. అని చెప్పినది.

ఆమాటలు సమ్మతింపక మహాత్ముల దర్శనంబున కరుగునప్పుడు పెద్దల యాజ్ఞ యవసరము లేదు. నడువలేకున్న గూఢముగా యానం బమరింపుము. నేనెట్లయిన నమ్మహాత్మునిఁ జూడకమానను. నీవిందులకు సహకారిణివైనచో మిక్కిలిపుణ్యము రాగలదు. అని బెద్దగా స్తుతిఁజేసి దాని నప్పనికిఁ బూనుకొను నట్లొడంబరచినది. మఱునాఁ డరుణోదయమున నమ్మహాత్ముని దర్శించుటకు నిశ్చయించుకొనినవారుగావున నాఁటి రాత్రియెల్లఁబయనము సవరించుకొని వేకువజామున స్నానముఁజేసి పీతాంబర ముల ధరించి మనోహర మణిభూషవిశేషముల నలంకరించుకొని ఫలపుష్పోపహారములం గైకొని హేమ ముందునడుచుచుండ నాంతరంగికసఖులచే వహింపఁబడిన శిబిక నెక్కి యరుణోదయము కాకమున్న స్వయంప్రభ యగ్గిరిప్రాంతమునకుఁ జేరినది

అప్పుడు చిత్రభానుండును బ్రత్యూషానుగుణ్యంబగు వేషంబుఁదాల్చి చిత్రభాను భూషావిశేషంబుల నలకరించుకొని యుదయగిరికూట సభాకూటంబునకు విచ్చేసెను. అప్పుడల్లంత ప్రాంతంబున చతురంతయాసముడిగి యక్కాంతారత్నము అదే మణికూటము అల్లదే యాశ్రమము. అదిగో మంటపము అని హేమ గురుతుఁ జూపుచుండ నుప్పొంగుచు చూచి మరికొంతదూరము నడచి సఖీ! నీవు ముం దరిగి వారేమి చేయుచున్నారో చూచి సంజ్ఞఁ జేయుము. ఏ నత్తరి పుత్తెంతునని దాని నంపినది.

హేమయు నుపాయ నభాజనములంగైకొని మెల్లఁగా నమ్మంటపము దాపునకుఁ బోయినది అం దయ్యోగినిమాత్రమే జపముఁ జేసికొనుచున్నది. హేమఁజూచి సంతసించుచు విశేషములేమని యడిగినంత నక్కాంతకు స్వయంప్రభ తమ దర్శనమున కరుదెంచినదని చెప్పినది. అప్పలుకువిని యుబ్బుచు గొబ్బునలేచి యా చిగురుబోణి యేదీ ! యేది ! ఎందున్నది చూపుమనుటయు హేమ రాజపుత్రికను రమ్మని సంజ్ఞచేసినది. అప్పు డక్కలకంఠి యుత్కంఠతతో నడుగులు తడఁబడ వడివడి నడుచుచు యమ్మంటపముకడకు వచ్చినది.

చేతుల ఫలము లుంచుకొని వీపున జారుముడి వ్రేలాడ పీతాంబరధారణియై మణిభూషావిశేషములచే మిరుమిట్లుఁ గొల్పుచు యరుదెంచిన యమ్మించుబోడిఁజూచి విస్మయముఁజెందుచు యోగిని తత్కరంబుఁ బట్టుకొని ముద్దువెట్టుకొని యామె నమస్కారము లంది దీవించుచు నిట్లనియె రాజపుత్రీ !నీచారిత్రమంతయు మాయయ్యగారు దివ్యదృష్టిం జూచి వక్కాణించిరి. నీవు రాచపట్టి వనుమాటయేగాని నీవైరాగ్యము శౌనకాదులకు లేదు. నీవుశృంగారభాజనమైనను నీహృదయము జ్ఞానపూర్ణమై యున్నది. నీ చెయ్వులు లీలాకలితములైనను నీ సంకల్పములు ముముక్షు మనఃకల్పములుగదా? నిన్నుఁగాంచుటచే నేఁడు నాకన్నులు సాద్గుణ్యము నందినవి. ఆహా: ఏమినీ సౌందర్యము! ఏమి నీప్రాయము ! ఏమి నీయైశ్వర్యము ! ఒక్కొక్కటియే లోకాతీతమై యొప్పుచుండ గరువముఁ జెందక సిరులఁ దృణముగా నెంచి చక్కదనము లెక్కగొనక పరువము విరక్తి పాలుఁజేసి కాల్నడకతో మమ్ముఁ జూడవచ్చితివి ! నీభక్తికి మేరయున్న దాయని యూరక స్తోత్రములు సేయుచు నమ్మంటపమున నొక దర్భాసనముపైఁ గూర్చుండఁ బెట్టినది.

ఆమె స్తుతిపచనము లేమియు రాజపుత్రికకు హృదయరంజనములు కాలేదు. ----------- స్తోత్రములు కృపాపాత్రములని గౌరవముతో మన్నించి నవ్వుచు పికస్వర ------------------- వెలయ నిట్లనియె. తల్లీ ! నీవనిన సద్గుణంబులు నాయం దొక్కటియునులేవు. నీ యక్కటికపుచూపే నాపై నీకీ ప్రీతిఁగలుగఁ జేసినది. సంకల్పములెన్ని యేని యుండవచ్చును. వానివలన బ్రయోజనమేమి? త్రికరనంబు లనేక మార్గంబున నడపింపలేని నాఁబోటివారు భయలోకంబులకుం జైడుదురుగదా ! సంసార పంకమగ్నురాలగు నన్నింత పెద్దఁజేసి నుతించుట ఎంతగానున్నది. ఇప్పుడు నీవన్న సద్గుణంబు లన్నియు నీయందు యున్నవి. రూపము ప్రాయము సంపదలు లక్ష్యము సేయక యిమ్మహాత్ముని బాదసేవఁజేయుచున్నావు ధన్యురాలవు. నిన్నుఁగాకయొరులఁ బొగడవలయునా? నాయం దున్నతిభావము విడిచి శిష్యురాలిగా గణించి దుర్గుణముల శిక్షించి భవసాగరమునుండి లేవనెత్తుము. నేను వట్టిమూఢురాల. నా కేమియుం దెలియదు. మదీయ పురాకృత సుకృతము నేటికి ఫలించినది. లేనిచో నంతఁపుర కారా గారమున వసించియున్న నాకు మీవంటివారి దర్శనమగునా? నన్ను గురుకటాక్ష పాత్రురాలిగాఁ జేసి రక్షింప నీదే భారము. తొలుత నీ పదమే పట్టుచున్న దాననని పలుకుచు నామె పాదంబులకు సాష్టాంగ నమస్కారముఁ గావించినది.

అప్పు డాయోగిని యా గజగామినిని గ్రుచ్చియెత్తి కౌఁగలించుచు మించుబోణి ! నిన్నును నన్నును రక్షించువాఁడు వేర యున్నవాఁడు. అతని చరణము పట్టుదువుగాక ! ఏనును నీబోటిదాననే సుమీ! అతండు స్త్రీలపొందు బొత్తుగా సహింపకున్నను నీగుణము లగ్గించుట నీ సేవకనుమోదించును. అతండుసర్వమును దానై యుండును గావున సర్వవృత్తాంతములు కరతలామలకముగఁ దెలిసి కొనఁగలడు. చక్రవర్తుల లక్ష్యపెట్టడు. జ్ఞాను లనిన గౌరవించును. ఒకప్పుడు నీ చరిత్ర మంతయు నెరిఁగినట్లే చెప్పెను. పెక్కు లేల ? నీ నిమిత్తమే యిగ్గుహాంతరమున నింతకాలము వసియించెనని తలంతును. కానిచో నీపాటి కే యరణ్యమునకో పోవలసినవాఁడే వారితో సమయ మరిఁగి మాట్లాడవలయును. బాహ్యప్రచారము గలిగినప్పుడు నీరాక వినిపించివచ్చెద. నీ యభిలాషయెద్దియో చెప్పుమని యెంతయో నై పుణ్యముగా నడిగిన నక్కాంతారత్న మిట్లనియె.

తల్లీ ! నా కే కోరికయు లేదు. తుచ్ఛభోగములకు నా మనసు దూరము. స్వయంప్రభవలె నొకయాశ్రమముఁ గల్పించుకొని తపం బొనరింపవలెనని యున్నది. ఇందులకుఁ జాలవిఘ్నములు గలుగుచున్నవి. నా తలిదండ్రులు మదేకశరణులగుట నాకుఁ బెండ్లిజేసి నావలనఁ గలిగిన సంతతివలన నానందింపఁ దలఁచికొని యున్నారు. అది దుఃఖముల కాలవాలమని యెఱుఁగక నాఁడుదానికిం బెండ్లి యాడనిచోఁ బరము లేదని శాస్త్రవేత్తలచే నాకు బోధింపఁ జేసిరి. దానిఁ జేసి నా హృదయము సందేహ డోలిక నెక్కి యూగుచున్నది. ఈ సందియ మిమ్మహాత్మునివలనఁ దీర్చికొనవలసి యున్నది. మఱియు నాకుఁ బరమార్ధోపదేశముఁ జేసి శిష్యురాలిగా నేలికొనఁ గోరుచున్నదాన అని తన యభిలాష యంతయు నెఱింగించిన నయ్యోగిన నవ్వుచు నిట్లనియె. రాజపుత్రీ ! నీ వడిగిన మొదటిప్రశ్నముఁ గురించి యీవర కాయనకును నాకును బెద్దగా వాదము జరిగినది. మా సంవాదము వింటివేని నీ సందియముఁ దీరఁగలదు. ఎట్టి విరక్తిఁ గలిగియున్నను నెట్టి సుజ్ఞానముఁ జెందియున్నను ఎట్టి ప్రజ్ఞావతియైనను యువతి వివాహ మాడకతీరదు. ఎవ్వనినో యొకని భర్తగా వరింపక తప్పదని ధర్మశాస్త్రములలో నున్నదట. అవివాహతయగు కాంత లోకాంతమున వంతఁజెందునని యయ్యగారును సెలవిచ్చి నన్నిప్పుడు పెండ్ల యాడక తీరదని నిర్బంధించుచున్నారు. నే నటుపై మహాత్మా ! ఆఁడుదానికి భర్తను వరించినపిమ్మట నతని యానతిలోనై యుండవలయును గదా ! అతండు సంసారసక్తుండగుటఁ గామాసక్తిం బ్రవర్తించిన విరక్తిఁగల నెలఁత యేమిచేయందగినది. భోగములు విరక్తికి బాధకములు గదా ! సంతతిఁ బడసిన పడఁతికి నిడుమలేగాని సుఖమున్నదియా? వివేకమెక్కిడిది. మమత్వము బాధింపక విడుచునా ? అనురాగమెట్లు పోగలదు. క్రమంబున సంసార పంకమగ్నయై యధోగతిం బొరయకమానదు. పూఁబోణులకుఁ బెండ్లి వలన నిన్ని బాధకములున్నవి. ఈ ముక్తి కేమి ప్రత్యుత్తరమిత్తురు. వీనింబట్టిచూడ నాఁడుది ముక్తిఁ జెందదని తెల్లమగుచున్నదని యడిగితినని చెప్పిన ముప్పిరిగొను సంతసముతో స్వయంప్రభ యంగునితో నిర్దేశించుచు తల్లీ ! అదియే వేయవలసినప్రశ్న. లెస్సగా నడిగితివి. వైరాగ్యముగల వనిత కామాసక్తుం బెండ్లియాడి యిడుములఁ గుడువవలయునని ధర్మశాస్త్రవేత్తలు చెప్పియుండరు. దాని కెద్దియో ప్రతికూలముండకపోదు. ఆ మాట కయ్యగారేమని యుత్తర మిచ్చిరో నుడువుము. అనుటయు నయ్యోగిని వెండియు నిట్లనియె.

వనితా ! వినుము. నా మాటవిని యయ్యగారు నవ్వుచు సోదరీ ! విరించి కామములనే స్త్రీరూపముగా నిర్మించెను. వాండ్రు కామశూన్య లెట్లగుదురు. వారిమూలముననే పురుషులు కామాసక్తు లగుచున్నారు. అగ్ని కాష్టంబులఁ తృప్తిఁ బొందనట్లు యువతి కామంబులఁ దృప్తిఁ బొందదు. అని భారతములో వ్రాయఁ బడియున్నది. కామినులు కామ విముఖులగుటయే యరుదు. లయ్యెనేని విరక్తునే వరించి పతివ్రతయై ముక్తిఁబొందఁగలదు. తెఱవకు నంతకన్న వేఱొక తెరువులేదు. విరక్తుండు కాంతం బరిగ్రహించునా యందువేమో ! పరోపకారమునకై పరిణయం బగుట మహర్షులకు వాడుకయై యున్నది. అగస్త్యుండును లోనగు మహర్షు లందులకే పెండ్లియాడిరి. కామాసక్తింగాదని యేమేమో బోధించి నా మాటల కన్నిటికి నుత్తరములు సెప్పి వాగ్బంధముఁ గావించెను

వారికన్న మనకెక్కుడు తెలియునా ? అందుల కంగీకరించి యట్టి యుత్తముని వెదకుచుంటి. నీ వడిగిన నీకును నాయుత్తముని ఇప్పుడు సందియములేదు. యువతి పతివ్రతయై ముక్తిఁ బొందునఁట. అని చెప్పుచు గుడిదెస -- గురువుగారు లేచు వేళయైనది. చూచి వచ్చెద నిందుండుమని పలుకుచు నా గుడిలోనికిఁ బోయినది.

అప్పుడు రాజపుత్రి హేమతో సఖీ! ఈఁబోటిమాటలు వింటివా ! ఈ తపస్వి నన్నుఁ గూడఁ బెండ్లియాడుమని నిర్బంధించునా యేమి? అయ్యో ! ఆడుదానినై పుట్టితి నేమిపాపము, పెండ్లియాడి బిడ్డలఁగని సంసారకూపములోఁ బడిపోవలసినదా? సీ ! ఇంతకన్న మరణమే శ్రేయము. అని పలికిన హేమ యిట్లనియె. కాంతా ! నీకింత భేదమేమిటికి? ఆయన నిన్నుఁ బెండ్లియాడుమని నిర్బంధించినపుడు నాకు విరక్తుండెవ్వఁడును దొరకడు. నీవే నన్ను భార్యగా స్వీకరించుమని కోరుకొనుము. ఏమని యుత్తరమిచ్చునో చూతముగాక యనుటయు స్వయంప్రభ చాలు చాలు. మంచి మాటయే చెప్పితివి. అట్టిమాట యనినచో నప్పుడే శపించి విడచును. తాపసులు ముక్కోపులని యెరుంగవు కాఁబోలు. నీ పరిహాసోక్తులకేమి పోనిమ్ము అదిగో ! ఆయోగిని యేదియో చేతంబట్టుకొని వచ్చుచున్నది. నీ వవ్వలికిం బొమ్మని పలికినది.

అంతలో రత్నమాల హస్తంబుదాల్చి యోగిని యా మంటపము దాపునకువచ్చి రాజపుత్రీ! ఈ హార మెవ్వరిదో చెప్పుకొనుము. అని పలుకుచు చేతికిచ్చుచున్నది. అచ్చిగురుబోణి దానిం బుచ్చుకొని విస్మయ మభినయించుచు హేమా ! యిటురా. చూడు మిదిగో మన హారము. ఇమ్మహాత్ముండు తెప్పించి యిచ్చే. ఔరా ! ఏమి యీ వింత. దేవీ ! ఈహార మెట్లువచ్చినది అచ్చట నేమి జరిగినది. ఏమని చెప్పితివి ? అమ్మహర్షి యేమని యుత్తరము సెప్పెను. వడిఁగా జెప్పుమని యడిగిన నామె యిట్లనియె

రాజపుత్రీ ! తపంబునకు సాధ్యముగానిది యున్నదియా ? నీరాకయు మన సంవాదము లోనగు విషయంబు లన్నియు నాయన దివ్యదృష్టిం గాంచిరి. నేను పోయినతోడనే పెండ్లివిషయమై యిదివరకు నీకుఁ జెప్పినది నిక్కువము. వేఱొక్కటి చెప్పనవసరములేదు. అని నేనడుగకమున్నే నా కుత్తరము సెప్పి ధ్యానోప గతంబైన యీ మణిహారము నాకిచ్చి యంతలోఁ గన్నులు మూసికొనియెను. లోక ప్రసక్తినిమిత్త మమ్మహాత్ముఁడు చెప్పిన విని స్వయంప్రభ తత్ప్రభావమునకు త్ముని దర్శనము సేవింపుమని యమ్కంచుకోగం దాలంటే. యా కోమాలోకి తీసికొని సుండిప అని పలుకుచు వారిం ఇమ్మహాక్కుండు తెప్పించి. ఓట్లు వచ్చినది అచ్చం యుత్తరము సెప్పెను. త్యజముందుకు నమ్మ చేయింబసుకొని ev సేవింపవచ్చినది. కూత వసతుకారిం తీయందని.

పిలిచినది. అప్పుడు.

చ. అదుణగభస్తి రోచులకు నల్లనవిచ్చెడు తమ్ములట్లు త
    త్పరసిజపత్ర నేత్ర తన సన్నిధి నున్నది యన్నయంత న
    చ్చెరువుగఁ గన్నుదోయి వికసింపఁ గనుంగొనె నాతపస్వి సుం
    దరిపరిధాన దివ్యమణిదామల సత్ప్రభ నాస్వయంప్రభన్.

దివ్యరూపంబునం ప్రకాశించుచున్న యత్తాపసోత్తమునిం జూచి యా చిగరుబోఁణి వెఱఁగుపడుచు క్రొందమ్మిణ, గమ్ము తుమ్మెదలట్ల ఫాలమునం గ్రాలు ముంగుఁరుల గరంబున సవరించు గొమ్ముడి వీపునవ్రేలాడ నా చేడియ రెండు చేతులు జోడించి యమ్మహాత్ముని పాదంబుంబడి నమస్కరించినది.

అప్పు డతం డవ్వాల్గంటిని గ్రీగంటం జూచుచు మేనఁ బులక లుద్భవిల్ల మెల్లన నప్పల్లవపాణి పాణింబట్టి యెత్తి ముద్దు వెట్టుకొనియెను. పిమ్మట నయ్యోగినియు రాజపు త్రికచేయిఁ బట్టుకొని సుందరీ ! మనమింక నిందుండరాదు. అవ్వలఁ బోదము రమ్మని పలుకుచు నచ్చేడియను మంటప సమీపమునకు దీసికొని పోయి యాహా ఏమి నీ అదృష్టము కన్నెత్తియైన నెవ్వరిం జూడని యిమ్మహాత్ముండు నిన్ను లేవనెత్తి చేయి ముద్దుపెట్టుకొనియెను. ఇదియే శుభసూచకము. ప్రొద్దెక్కినది గావున నిఁక నీ వింటికిం బోవచ్చును. హేమకుఁ బ్రసాదమిచ్చి వెనుక నం పెదము. ఈ మణిహారము నాయన నడిగి రేపు నీయొద్ద కంపఁగలదాననని యేమేమో చెప్పి యప్పొలతుక సంతసముఁ గలుగఁజేసినది. రాజపుత్రికయు హేమతో రహస్యముగా మరికొన్ని విశేషములం దెలిసికొని రమ్మని చెప్పి యప్పుడే యందలమెక్కి యొరులెరుంగకుండ నంతఃపురంబున కరిగినది.

ఆ సాయంకాలమునకే హేమ స్వయంప్రభను గలిసికొసినది. స్వయంప్రభయు హేమం జూచి చిగురుఁబోడీ! నేను వచ్చిన తరువాత నచ్చట నేమి జరిగినది? నీవా మహాత్మునిం జూచితివా ? మరల నా ప్రశంస యేమైనం దెచ్చినా? యని యడిగిన నప్పరిచారిక యిట్లనియె దేవీ! మహాత్ములు కడు దయాహృదయులు గదా ! నీవు వచ్చినపిమ్మట నయ్యోగి మరలఁ గన్నులు మూసికొని జపముఁ జేసి కొనలేదు. ఆ గుడిలోఁ గూర్చుండి వా రిరువురు పెద్దతడ వేదియో మాట్లాడికొనిరి. కొంతతరి కత్తలోదరి నాదరి కరుదెంచినది. అమ్మా: నాకుఁ బ్రసాదమిచ్చి యం పెదరా? పోవుదు ననుటయు నా బ్రహ్మచారిణి పోదువుగానిలే? నేను మీపనిమీదనే యుంటిని. ఇంతదనుక నీ సఖురాలి పెండ్లిగురించి ప్రస్తావించితిని. అయ్యతికుమారుండు యువతి పెండ్లియాడక తీరదని రూఢిగా నుడివెను. మహాత్మా ! ఆచిన్నది మిక్కిలి విరక్తిఁజెందియున్నది. విషయాసక్తులం బెండ్లియాడనొల్లదు. మీవంటి విరాగుల వరింపగలదు. అట్టివారెట్లు లభింతురు. మీరు వెనుక నాతోఁబరోపకారులైన మహర్షుల -------------- బరిగ్రహింతురని చెప్పితిరి. మీవలన మంత్రోపదేశముఁ బొందితికాని ------------------- మిమ్మేమనుటకు వీలుపడినదికాదు. ఇప్పుడా పెదలి మిమ్ము వరింతునని చెప్పిన దప్పా! చెప్పుడు. మీకుఁబత్నియైన పిమ్మట నన్ని మంత్రము లుపదేశింపవచ్చును. పార్వతికిఁ బరమేశ్వరుండు తారక ముపదేశింపలేదా? ఈ మాటలకేమి చెప్పుదురని నిర్బంధించి యడిగితిని. నా కేమియు నుత్తరము చెప్పక యవ్వలికిఁ బొమ్మని సంజ్ఞజేసి కన్నులుమూసుకొనిరి. పిమ్మట నే నిచ్చటికి వచ్చితిని. అని చెప్పిన సంతసించుచు నే నిట్లంటిని.

అమ్మా ! నీ కాయనయొద్ద చనువు గనుక నిట్టిమాట యడిగితివి. మే మనగలమా ? నా సఖురాలియెడఁ గల కనికర మంతయుఁ జూపితివి. ఆ విషయ మిదివరకే నాహృదయంబునం బొడమియున్నది. అమ్మహాత్ముఁ డంగీకరించిన స్వయంప్రభ లోపాముద్రాది మహాప్రతివ్రతా సంఘములోఁ జేరునుగదా! ఆ ముని కుమారుండు రూపంబునఁ గంతు వసంతాదుల మించి యున్నవాఁడు లోపమేమి యున్నది. నీమది నకారణముగాఁ బొడమిన సంకల్పము భగవంతుండు సఫలముగాఁ జేయుగాక. అని పలికినది. అప్పు డామె యించుక ధ్యానించి మించుబోణీ ! నీ సఖురాలి యభిమతం బేమో తెలిసికొనిరమ్ము. పిమ్మట విచారించెద ననుటయు. అమ్మా ! మా సఖురాలు నీయాజ్ఞఁ దాటునదికాదు. అందులకు సందియమా? విషయాసక్తుల వరించు విషయము సంశయించుచున్నది. నిస్సంగులననిన యనుమతింపక మానదని పలికితిని.

ఆమె బోటీ ! స్వవచనవ్యాఘాతమున కమ్మహాత్ముండు వెరువక మానఁడు. అతి దయాళుండగు దీనుల మొఱ నాలించును. ఇందులకు వచ్చిన లోపము లేదుగదా! ఇరువురును విరక్తులే ! మణికనకములకుఁ బోలె నొండొరుల సంఘటనంబనకు వన్నె హెచ్చగలదు. ఆ యోగివరు నే నెట్లో సమాధానము పరచెదను. నీవుపోయి నీ సఖురాలి నెల్లి తీసికొనిరమ్ము. గాంధర్వవిధి నిరువురకుఁ బెండ్లి గావింతుమని పలుకుచు నయ్యోగిని లోపలకుఁ బోయినది. నే నామె యనుమతిఁ బడసి యిక్కడకు వచ్చితిని. తరువాత కృత్యమునకు నీవే ప్రమాణమని పలికి యూరకొన్నది.

అప్పుడాచిన్నది కన్నులు మూసికొని రెండుగడియలు ధ్యానించి తలయెత్తి హేమంజూచుచు సఖీ ! ఈ కృత్యము కర్తవ్యమని నీకుఁ దోచినదా? యని యడిగినది. చాలు చాలు. అతం డంగీకరించునా లేదా యని విచారింపక కర్తవ్యమా యని యడుగుచుంటివా? ఆహా ! ఏమి ! నీ మోహము ? ఆ మహానుభావుండు నీ చెట్ట పట్టిన నీపాటిబోటి యేలోకమునందైన గలిగియుండునా ? అప్పుడుగదా నీ నీమమునకు ఫలము ! నాఁడుగదా నీవు ధన్యురాల వగుటయని హేమ బోధించినది.

స్వయంప్రభ దీర్ఘవిశ్వాసపూర్వకముగా హేమా ! నీమాట కాదననేల? నీకిది యుచితమని తోచినచో నట్లే కావింపుము. విధి పరిపాక మెట్లున్నదో యెవ్వరు సెప్పఁగలరు పోనిమ్ము. ఆ మహాత్మునికి శుశ్రూష జేయుచుఁ గృతార్ధురాల నగుదుంగాక. అతండు విరక్తుఁడు గావునఁ దుచ్ఛభోగముల కాసక్తుడుకాడు. నాకుఁ గన్యాత్వ విమోచన మగును. తల్లితండ్రు లిందులకు సమ్మతింపరు సుమీ ! వారు చక్రవర్తి కుమారున కిత్తుమందురు. అందులకు నా డెందమొల్లదు. ఇది రహస్యముగానే జరుపనగుఁ దగినయత్నము గావింపుమని చెప్పినది.

ఆమాట యాబోఁటినుండి వెడలినంత, సంతసముఁజెందుచు సుందరీ ! గాంధర్వమునకు విధి యేమియునులేదు. ఒండొరుల వరించుకొనుటయే కల్పము. నేఁడువలె రేపుగూడ మనము గూఢముగాఁ బోవుదము. వెంటనే యతండు నీ పాణిగ్రహణముఁజేసి నీకన్నెరికము వాయఁ జేయఁగలడు. ఇదియ సన్నాహమని పలికినది అప్పుడు రాజపుత్రి క్రొత్తసంకల్పములు మనంబునం బొడమిన హేమా ! అమ్మహర్షి కుమారుడు నాపాణిగ్రహణము సేయుటకు సమ్మతించునా సమ్మతించునుబో ! పిమ్మట మనమేమి చేయఁదగినది? జహవల్కముల ధరించి మాయనచెంత నెప్పటి నుండి వసింపవలెను? అతం డెందేనిఁ బోయిన మనముగూడఁ బోవలయునా ? వద్దు. వద్దు. ఇందే మునివృత్తిఁ దపముఁ జేసికొనుచుండుము. పెండ్లి యాడుమని యిఁక నా తలిదండ్రులు నిర్బంధించరుగదా? అని వివాహానంతరముఁ జేయదగిన కృత్యములఁ గూర్చి వితర్కింపుచుండ హేమ నవ్వుచు జవ్వనీ ! అనంతర మంతయు నతనే బోధింపఁగలడు. ఇప్పుడు తొందరపడయెక నేమిటికని పలికిన నులికిపడుచు నప్పడుచు అతను డంటివేమిటికి? అతనుఁ డెవ్వడన నోహో ! ప్రమాదమున నతఁడనఁబోయి యతనుఁ డంటి నతనుఁడన మదనుఁడు కాఁడు. గొప్పవాడనియుం జెప్పనొప్పు. తెలిసినదా యని పలికినది.

ఈరీతి నా యిరువురు నారాత్రి సంభాషించుచుండగనే కోడికూత వినబడినది. అప్పుడు హేమ తొందరపడి యా సుందరిని మంగళస్నానముఁ జేయించి నూత్నాంబర మాల్యానులేపనాద్య లంకారములఁ బెండ్లి కూతుంజేసి యందల మెక్కించి యతిరహస్యముగ సూర్యోదయము కాకమున్న యన్న గరకందరమునకుఁ దీసికొని పోయినది. అయ్యిందువదన దూరమునంద యందలము దిగి ముందుగా నందలి విశేషములఁ దెలిసికొని రమ్మని హేమ నంపుటయు నా మచ్చకంటి మంటపము దాపునకుఁ బోవుడు యోగిని యెదురువచ్చి నీ నెచ్చెలి వచ్చినదియా ? నీమాట కనుమోదించినదా యని యడిగిన నమ్మా ! మీయాజ్ఞ కన్యధాత్వమేల, పెండ్లికూతుఁ జేసియే తీసికొనివచ్చితిని. అయ్యగారు సమ్మతించినవార్త వినవలసియున్నదని పలికినది.

నీమాట నీవు చెల్లించికొంటివి. నామాట నేనేల రిత్తఁబుచ్చుదాన నెట్లో బ్రతిమాలి యంగీకరింపఁ జేసెద. నమ్మగువ నిమ్మంటపములోఁ గూర్చుండఁ బెట్టుము. ఇది కళ్యాణమంటపము. అమ్మునికుమారు నిచ్చటికి తీసికొనివత్తు. దేవునిసాక్షిగా వీరిరువురకుఁ బరిణయము జరుగుఁ గావుత మని చెప్పినది. అప్పుడు హేమ పోయి స్వయంప్రభను తీసికొనివచ్చి మంటపములోఁ గూర్చండఁ బెట్టినది. ఆయోగిని యా యువతి నమస్కారములందుకొని పెండ్లికూఁతువు రమ్మని దీవించుచు నాలయము లోనికిఁబోయి యమ్మునికుమారుని రమ్మని పిలిచినది. అబ్బా ! నీవుపట్టినపట్టు విడువవుగదా ! తపంబున కంతరాయముగా నాకీ గొడవ యేమిటికిఁ దెచ్చిపెట్టెదవు? మహర్షులు పరోపకృతికై పెండ్లియాడుదురని మాటవరుస కనినందులకు నాపనియే పట్టుచుంటివి. పో పొమ్మనుచుండ గడ్డము పట్టుకొని స్వామీ! మీరట్లనరాదు. మీయెరుంగని ధర్మములు గలవా ? ఆ చిన్నది మంటపముపైఁ గూర్చుండియున్నది. తద్గుణంబులు మీమదికి నచ్చినవియేగదా ? పాప మానారీమణి సంసారతాపమునకు వెఱచి మీచరణ సరసిజముల శరణు వేడినది. శరణాగత రక్షణము కడుఁ బుణ్యమని చెప్పుదురు. రండు రండు. నిస్సంగు లేమిచేసినను దోసములేదని యాదిశంకరులే నుడివియున్నారని పల్కుచు చేయిఁబట్టుకొని యా మంటపము దాపునకు లాగికొని వచ్చినది.

స్వయంప్రభ దిగ్గునలేచి నిలువంబడి సిగ్గున దలవాల్చికొనినది. సిగ్గె ------- బాలికలకే మగఁడనిన సిగ్గు గలుగుచుండ నగ్గరిత సిగ్గున కగ్గమగుటం యబ్బురమా? అయ్యోగినియు హేమయుఁ బెండ్లి పెద్దలై చెరియొకరిదెన నిలువంబడి తత్కృత్యంబుల నిర్వర్తింపఁజేసరి. చెలీ ! నన్నేమిచేయు మనెదవు? తపోవిఘ్నుమగుచున్నది. వేగఁబోవలయుఁ జెప్పుమనుటయు నామె నిలు నిలుండు. తొందర పడకుఁడు. రాజపుత్రీ ! యిటురా. చేయి సాచుము. అని చెప్పి తత్కరంబతనిచేఁ బట్టించినది నీవే నా భర్తవు. త్రికరణముల నిన్ను వరించితిని. నన్ను భార్యగా స్వీకరింపుము. అని స్వయంప్రభచేఁ బలికించుచు నొకపుష్పమాలిక యమ్మునితిలకుని మెడలా వైపించినది. పిమ్మట నవరత్నమాలఁ దీసి యయ్యోగిపుంగవుం డయ్యంగన మెడలో వైచి చెలీ? నీవుచెప్పినపని చేసితి. నిఁక నేను పోవచ్చునా యని పలుకుటయు నామె చెఱగులు ముడివైచి యిరువురకుఁ బుష్పము లందిచ్చినది సిగ్గువిడచి విచ్చలవిడి వా రొండొరుల శిరముపైఁ దలంబ్రాలుగా నా పూ మొగ్గల విరఁజిమ్ముకొనిరి.

పిమ్మట నమ్ముని యందు నిలువక తపంబునకై కోవెలలోని కరిగెను. హేమయు నమ్మా ! యిఁక మేముఁ బోయివత్తుమాయని యడుగ నయ్యోగిని యమ్మా ? అట్లనియెదవేల ? వివాహమైన వెనుక దీక్ష గనుక వధూవరు లేకస్థలమందు మూఁడు రాత్రు లుండవలయు, పిమ్మటఁ పోవచ్చునని చెప్పినది. అప్పుడా హేమ యించుక యాలోచించి దేవీ ! మా రాజపుత్రి మూఁడురాత్రులు నిందుండఁగలదు. నే పోయివచ్చెద. మా యుద్యానవనములో మేమిద్దరము లేనిచోఁ బరిచారికలు శంకింతురు. ఈమె భారమంతయు నీదే సుమీ యని పలుకుచు స్వయంప్రభకు జెప్పవలసిన మాటలం జెప్పి యొప్పించి తా నా యుద్యానవన సౌధమునకుం బోయినది. అని యెరింగించువరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డవ్వలి మజిలీయందు తదనంతరోదంతం బిట్లని చెప్పఁ దొడంగెను.

అరువది రెండవ మజిలీ

అయ్యా ! మే మేమి నేరముఁ జేసితిమి అక్రమముగా మమ్మిట్లు బద్దులుఁగా జేసికొని పోవుచుంటిరే ! ధర్మస్వరూపులైన రాజులే యన్యాయములు సేవింపుచుండఁ గాదనువా రెవ్వరు ? రాజపుత్రిక పారితోషిక మిచ్చినం గైకొంటిమి. అది యిప్పుడే సహదేవుడను రాజకుమారున కమ్ముకొంటిమి, ఇప్పుడా మండనముఁ దెమ్మనిన నెట్లు తెత్తుము. అందలివి మణులో గాజుపూసలో యెవరు పరీక్షించిరి అని దీనస్వరముతో వేడుకొనుచుండ వీణావతినిఁ తల్లినిం బట్టుకొని రాజభటులు వారిని గిరిదుర్గమునకుం దీసికొని వచ్చిరి.

రాజదూతలు వేశ్యలవలనఁ గొంతలంచము గొనినవారగుట నంతగా వారిని బాధింపక గౌరవముగానే యొకబసలోఁ బ్రవేశ పెట్టిరి. అప్పటి కింద్రమిత్రుడు గ్రామాంతర మరిగియున్నవాఁడు గాన వెంటనే యాబోటుల వారి యపరాధము విమర్శింపఁ గొల్వుకూటమునకు తీసికొనిపోవ నవసరము లేకపోయినది. ఈ లోపల వీణావతి తనకు మండనముఁ భారితోషికముగా నిచ్చిన రాజపుత్రిక యొద్దకుఁబోయి తమనిర్బంధములఁ జెప్పికొని వచ్చెదము సెలవిండని రక్షకభటుల గోరికొని యొకఁనాడు ప్రాతఃకాలమున నయుద్యాన వనమున కరిగినది.

వెనుక తనకుఁ బరిచయము కలిగిన యొకపరిచారికం జేరి నారాక భర్తృదారికకు నివేదించి రమ్మని కోరిన నా దూతిక గురుతుపట్టి వీణావతీ ! మా రాజపుత్రిక మూఁడు దినములనుండి పీడఁజెందియున్నది. ఈవలకు వచ్చుటలేదు. నేఁడు కొంచెము నెమ్మదిగా నున్నది. ఇంతకుముందే పూవుఁదోటఁజూచి పోయినది. డప్పరిగపై నిప్పుడు హేమతో నెద్దియో ముచ్చటించుచున్నది. అవసరముఁజూచి నీవార్త నెరింగించి వచ్చెద నాలస్యమునకు శంకింపక నిందేయుండుమనిచెప్పి యప్పరిచారిక యుప్పరిగకుం బోయినది అప్పుడు తలుపులువైచుకొని రాజపుత్రిక హేమతో నిట్టు సంభాషించుచున్నది.

సఖీ ! హేమా ! నీతో నేమి చెప్పుదును. ఏమనుటకును. వాక్కు రాకున్నది. సీ ! నా నీమము లన్నియును గంగపాలైనవి. వినుము నీవరిగిన వెనుక లజ్జాభయ విషాదములతో నయ్యోగినివెంటఁ దిరుగుచుంటి ఆమెకు మంచిమాటల జెప్పుచు సంతోషముతోఁ గాలక్షేపముఁ గావించినది. అందలి పూవులం గోసుకొనివచ్చి నన్నుఁ ఏంజేసి భోజనం మనం నవరా పౌరునిక మ ంకరించిన నీవు మునిపుత్రుడును మూడు రాత్రు లేకశయ్యాగతుపై సమండవలెను. నయ్యోగిని రాజపు