కాశీమజిలీకథలు/ఆరవ భాగము/60వ మజిలీ

వికీసోర్స్ నుండి

నాకీస్త్రీలాలసత్వము గలిగినది. ఇది పరిహాసాస్పదము గాకపోదు. విరహసంతాపము క్షణక్షణ మభివృద్ధిఁ జెందుచున్నది. కాలయాపనము సైప. పెండ్లి మాటఁ దల పెట్టి నంతనే గృతాంతచర్యలం గావించు న న్నెలంత తనంత వచ్చి నన్ను వరించునట్లెట్లు ! గావింతువో తెలియకున్నది. ఇది నన్నోదార్చుట కనినమాట కాదుగద? నిజము చెప్పుము. చెప్పుమని యడిగినమాటయే యడుగుచు నున్మత్తుండువోలె ప్రలాపించుచుండ నావేదండగమన యతనికిఁ జేయవలసిన కృత్యము లన్నియు బోధించి యోదార్చినది.

అరువదియవ మజిలీ కథ

స్వయంప్రభావిరక్తి కథ

సాధ్వీ! స్వయంప్రభ చేసినపని వింటివా? వీణావతియను వేశ్యాంగన సంగీతముపాడునపుడు శృంగారశ్లోకములు పాడెనని కోపముతో దానివీణ విరుఁగ ద్రొక్కినదఁట. ఇంత కఠినురాలయ్యెనేమి? దానిబుద్ధి యెట్లుమరల్పుదుము. ఈ వైరాగ్య మెవ్వరుపదేశించిరి. దానిచెంతఁ బెండ్లియనినంత నేయివోసిన యగ్ని జ్వాలవోలెఁ బ్రజ్వరిల్లునఁట యేమి చేయుదుము. అని యింద్రమిత్రుఁ డొకనాఁడు భార్యతోఁ బ్రశంసించెను. ఆమెయు మనోహరా! మీరు విచారింపవలదు. దానికిఁ జిన్నతనము వదలలేదని యిన్నిదినము లుపేక్షించితిని. గట్టిగాఁజెప్పిన వినక యేమి జేయునుఁ రేపువోయి మందలించెదం గాక యని ప్రాణనాధునకు సమాధానముఁ జెప్పి యమ్మరునాఁడు రాజపత్ని స్వయంప్రభయున్న యుద్యానవన సౌధంబున కరిగినది.

అట్టి సమయంబున రాజపుత్రికయు సఖురాలితో నిట్లు సంభాషించుకున్నది.

హేమా! నీ మాటలేమియ నాకు రుచింపపు. పెండ్లి యేమిటికిఁ మన మెంతకాలము బ్రతుకుదుము. మానవశరీరములు జలబుద్బుదములకన్నఁ జంచలము లని యెరుంగవా! బ్రతికియున్న స్వల్పకాలములోఁ దగునీమంబుగలిగి పరము సాదించుకొనవలయుంగదా? పెండ్లియాడిన పిల్లలు కలుగుదురు. వాండ్రవలన మమత్వము పెరుగును. అదియే దుఃఖములకెల్ల మూలకారణము. స్వప్న ప్రాయమైన సంసారమునందు నాకేమియు నభిరుచిలేదు. మహాత్ములతోఁగలిసి తపమొనరించి ముక్తి బొందవలయునని యున్నది. నన్ను బలుమారు పెండ్లిం యని బాధింపకుము. నీపాదంబులకు మ్రొక్కెదనని యుపన్యసించుచుండ తలుపుమాటునుండి యంతయు నాలించి యొక్కింతతడవు విచారించి పదపడి వారియెదుట పడినది. అప్పుడు పరిజనులందరు తొందరపడుచు పీఠములు సవరించిరి. స్వయంప్రభయు హేమయు దిగ్గునలేచి నమస్కరింప దీవింపుచు నామె వారినెల్లఁగూర్చుండ నియమించి కూఁతు గద్దియదాపునకుఁ తనపీఠము లాగికొని శిరంబుడుకుచు కన్నుల భాష్పంబులుగ్రమ్మ నిట్లువాక్రుచ్చినది. అమ్మా ! నేనును నీతండ్రియు సంతతి నిమిత్తము పడిన యిడుము లెవ్వరును పడలేదనియుఁ ఒడబోవరనియుఁ దృఢముగా నుడువగలము తుదకు స్వయంప్రభాదేవి యనుగ్రహమునఁగదా నీవు గలిగితివి. నీపై గొండంత యాసపెట్టికొనియుంటిమి. నీవు పుట్టనిదివోలె మీతండ్రి నీకు మంచిమగనిని తేవలయుననియుఁ బెండ్లి దినములలో గొప్పవైభవము సేయవలయుననియు నూరక యుర్రూటలూగుచున్నారు. నీకెప్పుడు ప్రాయమువచ్చును ఎప్పుడు పెండ్లి చేయుదును. ఎప్పుడు దౌహిత్ర లాభము గలుగునని గడియ యుగములాగున గడుపుచున్నారు. నేటికి నీకు యుక్త వయసువచ్చినది కులకళారూపవైభవముల ననురూపుండైన వరునివరించి యౌవనము సార్దకము చేసికొనుము. సంగీతము పాడిన బోగముదాని వీణ విరుఁగఁగొట్టితివట. ఇదియేమి యాగడము! పెండ్లిమాట తలపెట్టిన తిట్టుచున్నావఁట యిదియేమి పాపము ఈ మార్గమెవ్వ రుపదేశించిరి? అని పెద్దతడపు యుక్తియుక్తముగా సుపన్యసించినది.

స్వయంప్రభ యామాటలన్నియువిని యేమియుమాటాడక తలవాల్చుకొని కూర్చుండుటయు హేమ సఖి! ఇప్పుడమ్మగారి మాటల కుత్త రము సెప్పవేమి? మాయెుద్ధ నేమేమో చదివెదవే నీవేదాంత మీమెకుఁగూడ గొంచెము విసుపింపు - మందలి మంచి చెడ్డలామెయే విచారించుం గాకయని పలికిన విని యక్కలికి తలయెత్తి యిట్లనియె.

అమ్మా! మద్యాసక్తులకు మద్యంబువోలె విషయాసక్తుల కీ ప్రపంచమెంత యేని రుచిగాఁ గనంబడును. వివేకించిచూడ నంతయు నసహ్యమేసుమీ ! పేగులతో తెల్లఁబడిన యెముకలకు రక్తమాంసములు పూసి పైన చర్మముగప్పి మూత్ర పురీషంబులచే నిండింపఁబడిన యీ శరీరమెంత మనోహరమైనదో విచారింపుము. పంసభూతవికారంబైన యీదేహంబునంగాక యభిరుచి వహింతురా? శరీరగుణంబులగు మదమాత్సర్యాదులు నయ్యింద్రియార్ధములను జ్ఞాతులని తత్వవేత్తలు చెప్పుచున్నారు. మోహారణ్యంబుననడచు పరధికునకు వ్యాఘ్రాదిక్రూరమృగంబు లెట్లుపద్రవ కరంబులో బాను క్రోధాది గుణంబులÄ మనుష్యులను మోసము చేయునవియని మహర్షులు చెప్పి చిన్నారు. పిల్లలకు తల్లిదండ్రులే శత్రువులు. పుట్టినదిగోరి వాండ్రకు జ్ఞాన సింహ మగకియ నాలని యుఎల్లలనియు గాపురమనియు సంభోగమని ము మించి ఎత్తుకున్నారు. 37 ' దముహర్ర నమ్మకం యూన్ సిల్లలంగిని జ్ఞానయు ఎంచుకున్నారు. 81 తల్లీ ! యింతయేల మీ చరిత్రము చలచికొనుఁడు. సామ్రాజ్య సుఖసంపన్నులయ్యు గొన్నిదినంబులు సంతతిలేక చింతించిరి. నే గఁలగిన పిమ్మట నాయందు ప్రాణములుంచుకొని మదీయ క్లేశములన్నియు మీదవైచికొని పరితపించు చుంటిరి. నేను పెండ్లియాడితినేని నా మగనివలనను సంతతివలనను గలిగెడి యిడుములకు తుదిమొదలులేదు. ఈరీతి సంసారములో జింతాపరంపరలు బాధించుచునే యుండును. ఇక నిశ్చింతయెప్పుడో చెప్పుము. నీవు పెండ్లి యాడి పడిన యిడుమలు చాలక నన్నుఁగూడఁ బెండ్లి యాడి కష్టములఁ బడుమని బోధించెదవా? నాయందు గలిగిన యక్కటికమున కిదియా ఫలము! మీరు సంతోషములని తలంచెడు నవి యన్నియు దుఃఖహేతువులుసుమీ! తల్లీ! నీకు పదివేల సమస్కారములు. నాకు పెండ్లివద్దు. పిల్లలువద్దు. రాజ్యమువద్దు. ఈ యుద్యానవనమే తపోవనము చేసికొని స్వయంప్రభవోలె తపంబుజేసికొనుచుండెద ననుగ్రహింపుమని మృదు మధుర వేదాంత వాగ్గుంభనలఁ బ్రత్యుత్తర మిచ్చిన పుత్రికం గౌగలించుకొని రాజపత్ని గోలున నేడ్చుచు నిట్లనియె.

హా ! తల్లీ ! నిన్నూతగాఁ బూనికొని దేహయాత్ర నడుపుకొనదలంచిన తల్లి దండ్రుల శోకసముద్రమున ముంచి నీపూనిన వ్రతమేమి సాద్గుణ్యమొందెడిని అడవిని వసించు తాపసులు మాత్రము పెండ్లి యాడమానిరా ? సతులకుఁ బతి దేవతావ్రతముకన్న నీమము గలదా? పతివ్రతలై యరుంధతి లోనగువారెట్టి ప్రభావము సంపాదించిరో యెరుంగవా సంసారము నాటకమువంటిదేయైనను పాత్రలు నద్వేషానుగుణ్యముగ నభినయించుట యుచితముగదా? పెండ్లి యాడి పతివ్రతవై నేమంబుల నెక్కుడు సామర్థ్యము సంపాదించుకొనరాదా? నీమది జక్కగా విచారించు కొనుము. క్రోధాదులు శృతువులని చెప్పితివే? నీవా కోపమేమిటికి విడిచితివికావు. వీణావతి వీణ విరుఁగఁగొట్టితివఁట. కోపముననా శాంతముననా చెప్పుము. కన్ను లింకనుఁ ఉన్న గరువలేదు. పెద్ద'పోకలు ఐ'పుచుంటిని. ఈ పేను సీకెందు నిన్నడియేకాని దానిపాటి తెలివితేటలు నీకుగలిగినవికావని మందలించుచు మొతలోని హారములు సవరించుచుఁ డటాలున నేడియో జ్ఞాపకమునిచ్చి అమ్మా? గత్నహారము లేదేమి? అదియు విరక్తిచే నిమితిలో యందుగన వనీ భర్తగకుండ తీసిపారవేసితివా యేమి? నీ ముడ్రికా పేటిక నుండి సంగ్రహించి సీరంగముల ప్రనిత కక్కరలేనిచో నది యిటు తెమ్ము. తీసికొనిపోయెదనని చెప్పిన వి టీ అయ్యగా కాహారము ముదీకాపేటికలోని బెట్టుటకుఁ గారణ ఏమి? సం చేసినా రక్తి కలవని చెప్పినదిగాన జ్ఞాపకములేదు. ఆది నింపనీయకనే గడుపులయు హేమ స్వయంప్రధ మొగము జూచుచు నేదియో కన్ను సన్నఁజేసినది. ఆమెయు హస్త సంజ్ఞచే వారించినది. అప్పుడు వారీచిహ్నము లెరింగి రాజపత్ని యా హార మెందున్నదో తీసికొని రండని తొందరపెట్టినది హేమ తెలతెలఁబోవుచు దేవీ? నీయొద్ద దాచనేల? భర్తృదారిక వీణ విరిగినందులకు చింతించుచు నామండనము వీణావతికిఁ బారితోషికముగా నిచ్చి వేసినది. ఈమె యౌదార్యము సామాన్యమనుకొంటిరా యని యాకథ యంతయుఁ జెప్పినది.

ఆ నుడివిని యప్పడతి యొడలెఱుంగకఁ బెద్ధతడ నెడదనడలుచు నత్తొడవు గొడవ పుడమియొడయని కెరిగింపనందు వెడలి వడివడి తన నెలవున కరిగినది. ఆమె రాకవిని యింద్రమిత్రుడు సుద్ధాంతమున కరిగి కామినీ! ఏమిచేసికొనివచ్చితివి? అమ్మాయి నెమ్మదిగానున్న దియా? నీమాటలేమైనం బాటించినదియా? అని యడిగిన డగ్గుత్తికతో నమ్మత్తకాశిని యమ్మాయియు నామాటయుచక్కగానే యున్నవి. అది యటుండనిండు. కొండొకపండువునకు మీముద్రికా పేటికలోనున్న రత్నమండనము మీరెరుఁగకుండ దీసి యమ్మాయికిచ్చితిని. అది తాను జేసిన యపకృతికి ప్రతీకారముగా వీణావతికి యా హారమిచ్చినదట. ఈ ప్రసంగములో నాగొడవ బయల్పడినది. దానియ దెద్దియో యద్భుత సామర్ధ్యంబున్నదని మీరనినమాట కొంచెము జ్ఞాపకమున్న డదియెట్టిదని యడుగుచుండఁగనే యతం డాహాకారముతో మూర్ఛఁ మునింగెను.

అప్పు డప్పడతి గడగడవడంకుచు నొడయని సేదదేర్చి ప్రాణేశ్వరా ! ఇట్లు మూర్ఛపొయితిరేల? దాన రాఁబోవు ముప్పుడెట్టిది. చెప్పుడు చెప్పుఁడని యడుగుచుండ నిట్టూర్పు నిగుడించుచు సీ! సీ! ఎప్పటికి నీ యాఁడుజాతికి వివేకము కలుగదుగదా? అతిరహస్యవస్తువయని యెరింగియు దానిం బైకిఁ దీసిన నీబుద్ధి మాంద్యత కేమనఁదగినది. అయ్యో! మదీయ సామ్రాజ్యం బన్యాధీనంబగు యోగంబు తటస్థించినది. ఆహా! హా! యని దుఃఖింపుచుండ వారించుచు నమ్మించుబోణి యందలి కారణమేమియో చెప్పమని ప్రార్ధించినది.

ఈరత్నమాల యెవ్వని యధీనమందుండునో యాత డారుమాసములు మించకుండ నీరాజ్యమున కధీశుండగును దానికట్టివరమున్నది ఇందులకే కాదా యా హారము సాముద్రికాపేటికనుంచి ప్రాణపదంబుగ కాపాడుచుంటిని. అని తనపతి వచియించినంత నక్కాంతయుఁ భయాక్రాంతస్వాంతయై విలపింపఁ దొడంగెను.

కొండొకవడికి నొండొరుల నోదార్చికొనిరి. నృపతియునప్పుడు కొల్వుకూటమునకుంబోయి యా రహస్యంబు సెప్పక వేరొకనెపముపన్ని పెద్దవారెరుఁగకుండ స్వయంప్రభను భ్రమపెట్టి వీణావతి రత్నమాల నెత్తుకొని పోయినదని మంత్రులకుం చెప్పుచు నా వారకాంతలం బట్టితేర శ్రూరులకు కింకరులఁ బెక్కండ్ర నలుదెసలకుం బంపించెను.

అని యెరింగించువఱకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుడు తరువాతి కథ యవ్వలి మజలీయం డిట్లని చెప్పఁదొడంగెను.

అరువది యొకటవ మజిలీ

సఖీ ! మిక్కిలి వెలఁగల వస్తువయని యించుకయు నాలోచించితిమికాము. అప్పుడు నాబుద్ధి మొద్దువోయింది. "బుద్ధిఃకర్మానుసారిణి" అను నార్యోక్తి యేల తప్పును. ఈ మణిహారమెవ్వరిచేతఁజిక్కునో వారే యీదేశము బాలింపఁగలరఁట ప్రమాదమైన పనిచేసితిమిగదా? ఈరాజ్యమిఁక నారుమాసములకు భోగముది పాటింపఁ గలదని మనపట్టణమున నెల్లరు నద్భుతముగఁ జెప్పుకొనుచున్నారు. శుద్ధాంతములో నేకాంతముగా ననుకొనినమాట యెట్లు వెల్లడియైనదో తెలియదు. ఈ యుపద్రవమునకు వెఱచుచు మీ తలిదండ్రులు నిద్రాహారములుమాని చింతించుచున్నారు. దీనికి ప్రతిక్రియ యేమియుం దోచుకున్నది. అని విచారించుచు హేమ చెప్పుటయు విని స్వయం ప్రభ యిట్లనియె.

అతివా ! కాలగతి నతిక్రమింప బ్రహ్మాదులకు శక్యమగాదన్న మనబోటుల మాటఁజెప్పనేల? పోవుదాని మనమాపఁగలమా! పోనిమ్ము. భాగ్యహీనులమైతి మేని వైరాగ్యముబలసి తపంబు జేసికొనియెదము గాక నదియు నుపకారమే యని చెప్పుచుండగనే యొకపరిచారికవచ్చి హేమను రాజపత్ని తీసికొనిరమ్మనెనని చెప్పినది. హేమయు లజ్జాశోకసంభ్రమములలో పరిచారికవెంట రాజపత్ని యంతః పురమున కరిగి మరలవచ్చినది. స్వయంప్రభ హేమంజూచి అమ్మ నిన్నేమిటికి రమ్మన్నది. విశేషము లేమని యడిగిన నమ్ముగువకు హేమ యిట్లనియె.

సుందరీ ! నీయందు తలిదండ్రులకుఁ గలప్రీతి నేమనిచెప్పుదును. నీవలన నీ యుపద్రవము కలిగినది కావున నిందులకై నీవెక్కుడుగా నుడుకుచుందువని తలంచి నిన్నో దార్చుటకై నన్ను రప్పించిం. ఆహా ! ఏమి వారియక్కటికము. రాజ్యాంతమైనపనిఁజేసినను నీయందు నించుకయు నలుగరుగ ? మరియు నీపురప్రాంత మందలి రత్నగిరి పాదమున వెలసిన స్వయం ప్రభాదేవి యాలయమున నెవ్వఁతో యోగివచ్చియున్నవాడఁట. అతండు త్రికాలవేదియనియు నత్యద్భుతప్రభావ సంపన్నుడనియు విని నిన్న నయ్యగారు కొలఁదిగ పరిజనులు సేవింప గూఢముగా నప్పర్వతమున కేగి దూతికాముఖంబునఁ దమరాక తెలియఁజేసిరట. ఆయోగిపుంగవుండును దర్శనమీయకయే వచ్చినపనియంతయుఁ బూసగ్రుచ్చినట్లు చెప్పి నీరాజ్యమున కేమియు భంగములేదు. హారమువచ్చి నీకూతురు యం బడఁగలదు. వెరవకుమని యోదార్చెనఁట ఆమాటవిని భూపతి మిగుల సంతసించుచు నింటికి వచ్చియత్తెఱఁగంతయు మీయన్ను కెరింగించెను.