కాయగూరలను కాశిలోవదలుట
Jump to navigation
Jump to search
జంఘాలశాస్త్రి యిట్లు పలికెను.
"మన మహారాజుగారికి మఱియొక యాస్థానము మఱి యింక నొక యాస్థానము లభింపఁదగిన యవకాశము సిద్ధించినది. ఆస్థాన ప్రజలందఱు మహా వైభవముతో నుత్సవములు చేయుచున్నారు. జయజయ ధ్వానములు వీధులవెంటఁ, బల్లెలవెంటఁ, బట్టణములవెంట, నాస్థానమునందంటనే కాక యాయన నెఱిఁగియున్నంతవఱ కన్నిచోటుల, దేశమునందంతట నా ప్రభుని పవిత్రనామముతోఁ బ్రబలుచున్నవి.