కవిత్వతత్త్వ విచారము/ప్రథమ భాగము/రెండవ ప్రకరణము
రెండవ ప్రకరణము
పింగళి సూరనార్యుఁడు మధ్యకవులకుఁ జేరినవాఁడు గావున ప్రాచీన గ్రంథములను ముఖ్యముగా భారతమును బహుశ్రద్ధతోను భక్తితోను బఠించియుండును. ఇందుల కమ్మహేతిహాసములోని గుంభనల జ్ఞప్తికిఁ దే (జాలినంత సాదృశ్యముగల రచనలC ごやCä3 యుంట యొక సాక్ష్యము. చూడుఁడు. కర్ణుఁడు తన యన్నయాట యో బ్రీంగిన పిదప ధర్మరాజు చింతించిన విధంబు : “ఆ. అతని మేను గుంతి యట్టులకైవడి యరయ నేను జూచి యాత్మ నెద్ది కారణంబొ యిట్లుగా ననుచుండుదు నేమి సేయువాఁడ నింకఁ జెప్పమ !?? (శాంతి. 1 ఆ.) ఈ రీతినే సుము ఇూసత్తియు మణిస్తంభు ( డు దన భర్తయని యెరుంగని దగుటంజేసి యతని నే మే మో పల్కి, పిమ్మట నతడు ప్రచ్ఛన్నశాలీనుఁడని యెఱిఁగినదై యతని నుద్దేశించి యూడిన ప్రకారము : సీ. ఇందాఁక నెఱుఁగ నేనేమి యంటినో మిమ్ము ననుచుఁ గన్నీళ్ళు రా నడఁచికొనుచు, సడపులమాటల నగవుల మీ యందుఁ దొంటికైవడి గొంత దోఁచుచున్న, వసుధమానిసిఁబోలు మానుసులులేరె యనుచునుండుదు * 4 (కళా. ఆ. 4. ప. 165) మఱియు C గణ్వాశ్రమ వర్ణనావసరమున నాదిపర్వములో : “సీ. శ్రవణసుఖంబుగా సామగానంబులు నదివెడు శుకముల చదువుదగిలి కదలక వినుచుండు కరులును, గరికరశీతలచ్ఛాయఁదచ్ఛీకరాంబు కణముల చల్లని గాడ్పానపడివానిఁ జెందిసుఖంబున్న సింహములును భూసురప్రవరులు భూతబలుల్జెచ్చిపెట్టు నీవారన్న పిండతతులు. ఆ. గడఁగి భక్షింప నొక్కటఁ గలసియూడు చున్న యెలుకలుఁ బిల్లులునొండు సహజ వైరివర్గంబులయు సహవానమపుడు సూచి మునిశక్తి కెంతయుఁ జోద్యమంది” 52 కవిత్వతత్త్వ విచారము అను పద్యమును జూచి మణికంధరుని తపోవనము వర్ణించుచుఁ బింగళి సూరన్న పైరీతి ననుకరింపం జూచియు యమకమునకై స్వారస్యముఁ జెడఁగొట్టుకొన్న గతియు గా ంచుcడు ! సీ. ఆవులునాకఁ గన్నరమోడ్చు పులులును బులుల చన్లుడు వంగఁబోవు లేళ్లు లేళ్ళ చల్లాటరంజిల్లెడు హరులును హరులు గోళ్ళనుగోక నలరుకరులు కరులకటాళి వైఖరినాడు పాములు పాములఁ బాలించు బభ్రుతతులు బభ్రుతతులప్రక్కఁ బాయనియెలుకలు నెలుకలఁ బెంచుపిల్లులునుగలిగి భారతపద్యములోని సొగసు దీనియందు లేదు. ఏలన, అందు జంతువులకునుండు నన్యోన్యతను జూపుటలో నిష్కారణ చేష్టలు వర్ణింపక హేతుసంగతములగు చర్యల నారోపించుటయే కాదు. "భూ సుర ప్రవరులు భూతబలు లైచ్చిపెట్టు నీవా రాన్నపిండతతులఁ గడఁగి భక్షింప" ఇత్యాది విశేషముల చే నా మృగములకును ముని జనులకును గల మచ్చికను సూచించి యున్నాఁడు గాన నీ వర్ణనము మనోహరముగా నున్నది. సూరన్న పద్యములో పదములచే నర్థము నిర్ణయమునకు వచ్చినది గాని, యర్ధవ్యక్తికై పదములు ప్రయోగింపఁ బడినట్లు గానము. మఱియు జంతువుల పట్టినిగూర్చి యది దానిని గీరెను, ఇది వేరొక దానిని గోఁకెను, అనుటలో మనోదృష్టికి నింపైన రూపములు బ్రత్యక్షముగఁ గానరావు. "కడఁగి భక్షింప నొక్కటఁ గలసి యాడుచున్న" యను మాటచే నాటలో మచ్చిక పడిన జంతు వుల చెల్లాటములు స్ఫురణకు రాకపోవునా ? భీష్మాటోపమును వర్ణించుచున్న భారతములోని కొన్ని వచన ముల ననుసరించి, కళాపూర్ణోదయములో అష్టమాశ్వాసములోని "ఇత్తెఱఁగున నప్పార్థివోత్తముం డత్యంతచిత్రంబైన" ఇత్యాది దీర్ఘ వచనములు వ్రాయంబడియున్నట్లు దోఁచెడిని. "సూరనార్యుడు కొన్నియెడల నన్నెచోడుని నను క్రమించి యున్నాఁ"డని శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు వ్రాసియున్నారు. శ్రీనాథుని వైఖరియు నీ కావ్యమునఁ గొన్నిచోట్లఁ గానవచ్చెడిని. కవులయందు C గాన్పించు నిట్టి సాదృశ్యములు విచార్యములైనను మిలి ముఖ్యములని భావించుట తగదు . పోలికలంబట్టి చౌర్యము నొడిగట్టుట తగదు. సందర్భము లభిన్నములుగ నున్నచోట్ల భాష యు ఁ గొంత సాదృశ్యముం దాల్చుట య ప్రకృతము గాదు. విషయము, శైలి యివి పరస్పర సమన్వితములు. అట్లగుట విషయ సంభూతమైన పదసాదృశ్యము కావలయునని తెలిసి తెచ్చిపెట్టు ప్రథమ భాగము 53
కొన్న కల్పనయని సంశయించుట పొరపాటు. అయినను సాదృశ్య ములు విశేషించి బహుళముగ నుండిన నితరులఁ జూచి వ్రాసి నాఁడను నిర్ణయ మనివార్యమ. "పిల్లవసుచరిత్ర"ము లనంబడు నిటీవలి ప్రబంధము లన్నియు రామ రాజ భూషణుని బిచ్చములు కావా? ಇట్లు మన సూరన యుత్కృపులైన గ్రంథకర్తల జాడల నెఱిఁగినవాఁడయ్యుఁ గొంతవ అకు నంత మంచివి గాని మార్గముల నవలంబించియున్నాఁడు. దీనికిఁ గారణమేమనఁగాఁ ఎట్టివాఁడును దన కాలములో Uశేషములని యెన్నంబడిన రీతుల విరచింపఁ జూచుట సహజము. సమ కాలికుల మెప్పలువోలెఁ దీపియైన మెప్ప లెవ్వి ? మఱియు మనకవి మిగుల బీదవాఁడు గాబోలు ! ఈ యను మానమున కాధారములైన యంశములు గొన్ని శ్రీ వీరేశలింగము గారి కవి చరిత్రలో సూచింపఁబడి యున్నవి. కుటుంబ రక్షణార్థము ద్రవ్యార్జనమునకై యత్నించుట దోషమా ? కాదు. ఆ కాలమున నిప్పటియట్లు ప్రజలు పుస్తకములఁ గొనుటచే నాదాయము గడించి జీవింపఁ జూచుటకు వీలు శుద్ధముగ లేమింజేసి, యితఁడు రాజుల నాశ్రయింపవలయు విధికి లొంగిన వాఁడాయెను. బమ్మెర పోతన వలె " మదంబ నిను నాఁకటి క్రిం గొనిపోయి యల్ల కర్ణాట SびPもD కీచకులకమ్మఁ ద్రిశుద్దిగ నమ్ము భారతీ" యుని చెప్పఁజాలిన ధీరులు వేయింటి కొకరైన నున్నారో లేరో ! రాజాశ్రయమున బ్రదుకుపాటు గోరు వారు వారి ఇష్టానుసారము వ్రాయక యేమి చేయుదురు ? ఇఁక రాజులన్ననో పరిపాలన కార్యములఁ దగిలి కాలంబు గడుపువారు. సొంతమగు బుద్ధితో విమర్శింపఁ జాలినంత పండితులగుట యరిది. కావున నట్టివారాచారముంబట్టి గుణదోష నిర్ణయముం జేయుట నైజము. సూరనార్యుని కాలములో ప్రాచుర్యమునకు వచ్చిన కవితారీతి ప్రబంధ రచన. అట్లగుటఁ దానును బ్రబంధ ధోరణి నే వ్రాయవలసిన వాఁడయ్యె. ఐనను భావగంభీరుఁడును వివేక వంతుఁడును అగుటంబట్టి సంపూర్తిగ ప్రబంధ రీతి కూపంబునం బడలేదు. ఒక యడుగు గట్టున, ఒక యడుగు పల్లమునఁగా నిలిచి, తన యిష్టమునకు రాజుల యిష్టమునకును రెంటికిని మధ్యమున, సంపూర్ణముగ నిగ్రహముగాని యనుగ్రహముగాని 53), త్రిశంకుస్థానమున నిలిచెను. "అన్యు మనముల్", నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాఁడు ధన్యుఁడు" గదా ! ఈ కవి ధన్యుఁడాయెనో లేదో ఆయన లెక్క పుస్తకములు మనకు జిక్క 54 కవిత్వతత్త్వ విచారము
లేదు గాన స్థిరీకరింపనేరము ! ఎదియెట్లుండె కవితాస్వర్గమునఁ ద్రిశంకుస్థితిం దాల్చియున్నాఁడు ! అయినను దల క్రిందుగా వేలాడుచుండలేదు. తల మీఁదుగనేయున్నది. కావున నెల్ల విధముల మనకు సంభావనీయుఁడు. తనకు శరణ్యులైన పభు వుల చిత్తవృత్తి ననుసరించువాఁడనుటకుఁ గళాపూర్ణోదయము నుండియే యొకదృష్టాంతముం జూపవచ్చును. చూడుఁడు. కృతి కర శైవుఁడు. దీనికి నితఁడు దార పుత్రాది బాధలేని యావన కాలేమ్లో వ్రాసినదని యూహింపఁదగిన రాఘవపాండవీయములో నితనిఁగూర్చి చిన వేంకటాద్రి చెప్పిన యీ పద్యమే సాక్షి: ఉ. దక్షతయింతగల్మి విశదంబుగఁ గాంచియు నీ మదిన్ ఫలా పేక్షఘనంబుగామి నిది యిట్టనగొంకెద నీకుపో లలా టేక్షణభక్తిశీల, రచియించుట కష్టముగాదె శ్రీవిరూ పాక్షున కంకితంబుగ శుభార్ధము రాఘవపాండవీయమున్. ఇఁక భర్తలైన నంద్యాలవారన్ననో వైష్ణవము కొంత ముదిరిన మహనీయులు ! "శ్రీ విష్ణుపదభక్తిచే ధర్మసంపత్తి ధర్మసంపత్తి చేతను జయంబు" వడసిన పుణ్యులు. అందును గృతిపతియైన కృష్ణమహీపాలుఁడు "మాధవ పదపద్మసమారాధన విధిసాధితా విరత భద్రుండు" ఇంతమాత్రమా; "విశ్రుత తిరుమలతాతాచార్య శ్రేష్టాన్వయ సుదర్శనాచార్య తనూజ శ్రీనివాసగురు చరణాశ్రయణ సమార్జితాఖిలాభ్యుదయుఁడు !" మఱియు "వైష్ణవమతశీలుఁడు" కావటంబట్టి రాఘవపాండవీయ ప్రభావతీ ప్రద్యుమ్నములలో శివ స్తుతితోఁ గావ్యారంభముం జేసిన భక్తుఁడు కళాపూర్ణోదయము విష్ణువునకు నగ్రార్చనంజేసెను ! మరియు మణికందరుని తీర్థ యాత్రను వర్ణించుచో విష్ణుస్థలములఁగూర్చి ప్రసంగించెఁగాని శైవ స్థలముల నంతగాఁ బొగడలేదు. అచ్చోట్లను, తక్కిన శాస్త్రముల నెల్ల నాకలించి "యువి యాత్మలమెచ్చని పాంచరాత్ర సిద్ధాంత విధాసమర్ధన సమర్థకృతార్థ మతి ప్రదీప్తలును" "శ్రీమహితాష్ట్రాక్షరీ జపమంత్ర పరాయణులును" "దేవతాఁతర చింతనావిదూరులును" నీతనికిఁ గానవచ్చిరేకాని, శైవసిద్ధాంత సమర్ధకులుగాని, పంచాక్షరీ జప పరాయణులుగాని యొకలైనఁ గంటఁబడలేదు. తుదకు వైష్ణవ మతము యొక్క ప్రధానతత్త్వమును బోధించుచు "లక్ష్మీనారాయేణ సంవాద"మును జూపి ప్రబంధమును ముగించెను ! పాపము ! దారిద్యముచేఁ గుందింపఁ బడనివాఁడెవఁడు; ఇట్లు యావనమున 56 కవిత్వతత్త్వ విచారము
యనివార్యమని యెంచితి మేని, కళాపూర్ణోదయము కేవల కవికల్పత మైన కథగావునఁ బ్రబంధములలో చేరనిదగును. ఈ బహిష్కా రము కష్టముగాదు! నష్టముగాదు! మఱి గొప్పతనమున కొక కారణ మనియు జెప్పవచ్చును. ప్రబంధములే మో నూతనమైన మహా సృష్టియని మనపూర్వులు భ్రాంతిఁ గొన్నట్లున్నది. కృష్ణదేవరాయలు మను చరిత్రకారుని "ఆంధ్రకవితాపితామహుc" డను బిరుదంబుతో బూజించెను. అనఁగా కవిత్వమును సృష్టి కి దెచ్చినవాఁడని ధ్వని ! అల్లసాని పెద్దనకుం బూర్వ మొక కవిబ్రహ్మ యుండె ఁగాని వానిని మన వారు మఱచిరో, స్థానభ్రష్టునిఁజేసిరో, లేక యొక్కొక్క మన్వంతరమున కొక బ్రహ్మ యేర్పడుట మంచి విభాగమని యెంచిరో! నాకుంజూడ ప్రబంధములును భారతాదుల గొంతవరకు ( బోలియున్నవి పరమాపూర్వములుగావు. ఎట్లన : ఈ రెండువిధములైన రచనల యందు . కథ ప్రాచీనము. భారతము మూలమునకు ప్రతి పదార్థ టీక గాదు. మఱి రససంపోషణార్థము కవిత్రయమువారు కొన్నియెడలఁ బెంచియు c గొన్నియెడల సంక్షేపించియు వ్రాసియున్నారు. ప్రబంధ ములు మాత్ర మేమియెక్కువ? నిజమే. వీనియందు వర్ణనలు బహుళముగ నున్నవి. పూర్వకవులు నాలుగు పద్యము లెక్కువ యను సందర్భమున వీరు నలువది యున్నను జాలదని ఘోషిం తురు ! ఈ మాత్రము పరిమాణ భేద మున్నంతనే వస్తు భేద మున్న దను టెట్లు? అనఁగా ప్రాచీనకవులయు మధ్యకవుల యు గ్రంథము లకు భేదములు లేవని నా తాత్పర్యముగాదు. మఱి ప్రబంధములు మూలరహితములైన యాదిమ విధానములు గావనుట. ఈ సృష్టి యందును ప్రాఁతవాసనలు లేకపోలేదు. ఇంక భేదముల వివర మెట్లనిన : ప్రబంధములలో కథ ముఖ్యము గాదు. మఱి వర్ణనలకు నవకాశ మబ్బుటకై తెచ్చిపెట్టుకొన్న నెపము. అనగా వర్ణనలు కథాసాంగత్యము లేనివనుట, సందర్భశుద్ధి లేనివనుటకు పర్యాయ వచనము. కథ ముఖ్యము గాక పోవుట మాత్రము గాదు. ఒకే యంత్ర శాలలోఁ జేయcబడిన సరకులవలె నీ కథలన్నియు నించుమించు ఏకస్వరూపముం దాల్చిన యవి. అనగా చర్వితచర్వణమునకు ప్రథమ భాగము 57
జేరినయవి* వీని సామాన్యక థాక్రమం బెట్టిదనిన.
ప్రబంధముల కథా సార ము
ఒక పట్టణము ఒక. రాజు వీరికేమి గ్రహచారముపట్టినదని తెలియకముంథే ప్రథమశ్వాసము సంపూర్నము.చెవియౌ కనొ జ్ఞానేంద్రియముగ రాజుగారు కన్యామణి యెుకటున్నదని గ్రహించి యందుమతి కొంచెమును గోలుపోవుట. తన స్నేహితునితో విరహ
విషయమైన ప్రసంగము చేయుచుఁ గన్యామణి శరీర మేమాత్రము విడువక విమర్శించుట! వేఁటకుఁ బోవుట ఇత్యాదులు. ద్వితీయా శ్వాసము ముగిసెను. కన్యామణి మాత్ర మూరకుండునా యేమి ? ఆ యమ్మ తబ్బిబ్బు ఇంతంత యని చెప్పఁగాదు. శ్లేషలు వెట్టన నేమి తృప్తి ! శ్లేష లు వెట్టినఁ గొంత పర్వాలేదు. తనవలెనే చంద్ర ముఖులైన చెలకత్తె లం జేర్చుకొని నాయకుని సౌందర్యవిషయమయి యొక రెండు గంట లుపన్యాస మిచ్చువేళకు మూCడవయాశ్వాసము ముగింపునకురా రాకేమి చేయును? కన్యామణి యొక్క కాఁకకు నుప శమనము చేయుటకై చెలు లా మె నుద్యానవనమునకుఁ బిలిచికొని
పోవుట సరోవర సందర్శనము. ఆ ప్రాద్దు మాత్ర మందఱును స్నానముఁ జేయుట, చన్నీళ్ళువడు వేళకు గగుర్పాటు వణకు
మొదలైన శృంగారావస్థలు తిక్కెక్కినట్లు ప్రబలుటయు, యజ
మానురాలిని చివురుటాకుల శయ్యపైC బరుండఁజేసి వస్త్రములు
సడల్చి శైత్యోపచారములు చేయుటయు, నవియు నిష్ఫలంబగు టయు, చంద్రోదయ వర్ణనము. ఏమో వినోదము చూతమని వచ్చిన చంద్రుని నా శుకపిక వాణు లందఱుఁ గలసి యేకకంఠ ముగC దిట్టుటయు, మలయమారుతమన్మథదూషణము మొదలగు నోరూరఁ జేయు సంగతులు గలిగి “క. సర్వజనంబులు చదువ న ఖర్వంబగు కౌతకంబుఁ గాంచెడు తెఱఁగుల్ పర్వంగఁజేసి నాల్గవ పర్వంబది యస్తమించు భామినులలరన్ !"
- మనుచరిత్రము వసుచరిత్రము వీనికి నడుమ వ్రాయఁబడిన గ్రంథములును ఇంత గుణశూన్యములుగావు. ప్రబంధ ధోరణి మిక్కిలి ప్రకటనమునకు వచ్చిన తదనంతర కాలపు గ్రంథములు హీనములు. చేమకూర వేంకటపతి కృతులు దప్ప
అను సమయము గూఢము. (8) 58 కవిత్వతత్త్వ విచారము
ఇంతైన వెనుకc బెండ్ కాకబోవునా ! సూర్యోదయ వర్ణనము
(కారణము మృగ్యము) ఇంక నెవియైన మఱిచిపోయి యుండిన నిదే సమయమని యీ యన్ని వర్ణనములును, పరిణయము, దంప తులు పురప్రవేశము చేయుట, ఆ పురములోని స్త్రీలందఱుఁ దొ ట్రు
పాటుతో వీరినిఁ జూడవచ్చి బదులిచ్చుటకో యనం దమ యంగ
సందర్శనము అందఱకును జేసి ఋణవిముక్తులగుట ! శయ్యా గృహ ప్రవేశము. చెలికత్తియలు క్రొత్తగా సిగ్గుదాల్చిన కన్యామణికి నింపైన నీతులు చెఫుట, ప్రథమసంయోగము యొక్ష సాంగూపాంగ
వర్ణనము ! శ్రుతి ఫలము సంతానప్రాప్తి ! ఇత్యాది నానా చిత్ర ములం బ్రదర్శించి యైదవయాశ్వాసము సమాప్తి Cజెందును. ఈ విషయము నే ఆళాశ్వాసముల గ్రంథముగా వ్రాసినను బాధలేదు. అయ్యది కష్టనష్టములకు నతీతము లాభమునకు న తీత మే !
పాత్రములన్నియు నొక్క తీరుందాల్చిన బొమ్మలు. అలం
కార శాస్త్ర ప్రకారము చెక్కఁబడినవి. ఆ యా కావ్యములలోని
పాత్రములు నిర్జీవముల యట్టుండుటతోఁ బోయిన నెంతో పుణ్యము!
అవి కావ్యముల యందలి పాత్రలును ఒండొంటి ననుకరించునట్టి
ప్రతిబింబములు. పేరు ఊరుమాత్రము మార్చియుందురు. ఇంక నీమాత్రముఁ జేయక వ్రాయ(గడంగనగునా ? స్వభావము, చరి త్రము, నడవడి, తీరు మొదలగు లక్ష్యగుణము లన్నియు నెరవలి
సౌత్తులు.
వసుచరిత్ర
ఉపజ్ఞ మనకు ఘటిల్లదేని యది యొక గొప్ప లోపమని
చింతించుట మన ప్రకృతి. రామరాజభూషణుఁడు కథాకల్పన మందు ఉపజ్ఞ లేకుండిన నెంతో మేలని యూదేశించెనుగదా ! ఇది యస్వాభావికమైన తలపోఁత. వర్ణనలయం దు పజ్ఞ వ్యాప్తికి వచ్చిన గృతికి సానవెట్టినట్లని యూ(తడు సెలవిచ్చి, యూ పద్ధతికి నిదర్శ
నము నేర్పఱుచుటకో యనఁ దన రచించిన వసుచరిత్రములో నత్యద్భుతములు ననన్యసాధ్యములునైన వర్ణనలు బహు చమత్కా
రముగఁ జేసియున్నాఁడు, ఈ మహాకవి చందమునఁ గొన్ని
రకముల వర్ణనములు చేయు వారెవరును లేరు. ఈ వర్ణనలయందు
దోషములు లేకపోలేదు. అందు ముఖ్యములు : అవి కథా వేగము
నకు నడ్డులు. కథ యేలేదు, కథా వేగ మెక్కడిది యని యాక్షే
పించితిరేని నా కుసమ్మతమే. ప్రత్యేకముగ జూచిన మనోహరములై ప్రథమ భాగము 59
నను గధాంగములతో పొందిక లేనివి. భావనాశక్తిచే న ప్రయత్నము ననర్గళమునుగా వచ్చిన స్వచ్ఛంద ధారలుగావు. మఱి సామ్య శక్తిచే బలాత్కారముగC దేcబడిన యుపమోత్ ప్రేక్షలు. సామ్య మంటిమి. వసుచరిత్రములోని సామ్యములు వస్తు స్వభావములం బట్టి తటస్థించినవియుంగావు. మఱి నా మాది భాషాశక్తిచేఁ గృతము లైన యవి. శ్లేషచే నుత్పత్తికి వచ్చు నలంకారములవలె గొడ్డువారిని నీరసభావములు వేరందు లేవని వక్కాణింప నుద్యుక్తుడనై నందు లకు మి క్షమాపణము వేడెదను. ఇన్ని లోపములుంది నప్పటికిని వసుచరిత్ర మిగుల గొప్ప గ్రంథమనియు, భాషకు మండనాయ మానమనియు జెప్ప నెవడును సంకోచింపఁ బనిలేదు . ఇందు గారణము లెవ్వియనగా: భాషా జ్ఞానమునకిది మంచి యూధారము. పదములలో నెంత సత్తువ యున్నదని చూడగోరు వారికిథీనియంత ప్రయోజన కారియగు గ్రంథ మింకొకటి లేదని చెప్పవచ్చును. మఱియు సామ్యశక్తివలె గవితకు బ్రాణంబు గాక పోయినను సమ్మానార్హములైన శక్తులలో నొకండు. కావున దాని నమేయంబుగ దీపింపఁజేసిన రామ రాజభూషణుఁడు సర్వజనస్తోత్రపాత్రుఁడు. ఇట్టి వర్ణనల కితం డించుమించు ఆదిమ కర్త యగుటచేనవి యొకరి ననుసరించి వ్రాయబడినవిగావు. తన మనస్సున తొలుతc బుట్టినవి. అట్లగుటచే నైజములు. అకృత్రిమ ములు. కాన రుచ్యములు. ఆనందకరములు. శ్లేషాది దుష్కర దుర్బోధ రచనలకుం బూనినను శైలి మంజులగుణముం గలయది. అతిశ్రావ్యము. సాధారణముగఁ జమత్కారము విపరీతముగ నున్న యెడ సుఖముండు టయరది. దృష్టాంతములు. ఏకాక్ష రపద్యములు. ఇందులో సుఖ మేమైనఁ గలదా ? సంగీతములోఁ దలవంపులగు నట్లు దీర్ధాలు దీయుచు స్వరములు వేయుచున్న యెడ "అబ్బా ! ఏమి సామర్థ్యము ! ఎంత సేపు గ్రుక్కపట్టుచున్నాఁడు !" అని ఆశ్చర్యము భరిం తుము గదా ! ఆశ్చర్యమునకు సమానమైన యానంద మెక్కడిది ! కంఠ వ్యాయామ మింత ఘనముగచేయ లేకున్నను సొంపుగా మధురకంఠముతో సామాన్యులైన స్త్రీపురుషులు పాడిన నెంత హాయి ! అనగా కళ యందు రెండు గుణములుఁ జూపించవచ్చును. సుఖము, చమత్కారము. శిల్పము యొక్క యభిమతము సుఖముగాని చమత్కారము గాదని వేఱ చెప్పనేల ? వసుచరిత్ర చమత్కార ప్రధానమయయ్యును సుఖమును బొత్తిగాc బో Cగొట్టుకొన్నదిగాదు. కావున నే దానియందు మనకుండు గౌర 60 కవిత్వతత్త్వ విచారము
వాదరములు. కేవలచిత్రకవిత్వము భాషతో జేయు కుస్తీ వంటిది. "భాషను ఎన్నివిధముల వంగదీసినాఁడు ! ఎన్ని బంధముల స్రుక్కించినాఁడు !" అను నాశ్చర్యమును బుట్టించును. నిజమైన కవిత గలిగించెడు నాశ్చర్యము వేఱు. ఏదన "సర్వజన వేద్యములగు సామాన్యములైన ఈ సంగతులు పదములు ఇత్యాది సామగ్రులఁ గొని యెంత యాహ్లాదకరమైన కృతిగాఁ గూర్చినాఁడు ! మనకు నా పదములు తెలియు (గదా ! సంగతులు దెలియును గదా ! తెలిసి యేమి కట్టుకొంటిమి !" అని చింతయు విస్మయమును దాల్చుట. దొమ్మరివాఁడు చేయు నద్భుతములను జూచి మనము చింతఁ దాల్పము. ఏలన, పరిశ్రమముఁజేసిన మనమును వానివలె సమర్ధుల మగుదుమను నమ్మిక గలదు గాన. తిక్కననుం దలంచి నపుడు నా బ్రతుకేలయని మన మను టెుంథులకు ! "దినదినము వాడు పదముల తోనే యతఁ డెట్టికూర్పులం బన్ని నాఁడుఇథి పరిశ్రమచే వచ్చు విద్య కాదు. స్వాభావిక ప్రతిభ. ఇంకొక జన్మ మెత్తినగాని యీడేరునట్టిది గాదు !" అను విచార ముద్బుద్దము గావుటచే.
వసుచరిత్రములోని కొన్ని పద్యములు చిత్ర కవిత్వముం జూచినఁ బాఱిపోవలయు ననువారి సైత మాకర్షించునంత రమణీ యములు. ఇంచుక యుదాహరణము జూపెద:
చ. చలిత లతాంత కాంతియను చందురు కావి చెఱంగుదాఁటి స
మ్మిళిత వయో విలాసముల మీటిన విచ్చు ఫలస్తనాగ్రముల్
వెలువడఁ గప్పెఁ దత్తణమ వేల్లితద్రోహద ధూపధూమకుం
తలముల విచ్చి దాడిమ లతాలలితాంగి నృపాలు చెంగటన్.
(1 అ 164 ప.)
సీ. ధరయే యపాంనుల తలచూపరాకుండఁ
దనకూర్మి టేని నప్పననె ముంచె
సతియే యచండిక పతిఁ జట్టుకూఁతురై
జగడాలు పచరించి నగముచేసె
కమలయే నిశ్చల రమణుపేరెదకు మో
పైనిల్చి యతని పేరడుగుపఱచె
వాణియే మితసూక్తి వదలదు తలవాఁకి
లి నిజేశుమాట మోచెననఁజేసె,
ఆ. ననుచు భూ కాంత శ్రీకాంత హరునికాంత
నజని కాంతను నిరసించి యా సిరంగ ప్రథమ భాగము 61
పార్టివుని కాంత తిమ్మాంబ పతికి గుశల
కీర్తి బలవృద్ధి నిర్మలస్ఫూర్తు లొనగు (ఆ.1.ప.36)
సీ. చుట్టఁ జట్టుకొని శేషుఁడు నిద్రవోవును
ముది పన్నగములలో మొదటివాఁడు
మొనయుఁ డాదిమ కూర్మము ముడుంగుమేనుమో
పినఁ బెద్దవారిలోఁ బెద్దవాఁడు
సమధికాశా ప్తి హస్తము సాఁచుఁ బద్మినీ
వైరిదిక్కరి తలవడఁకువాఁడు
తనయొంటి పంటిచేతనయుంటునాదికా
లము ఫెూణి పాండురోమములవాఁడు
ఆ కదలలేఁడగ్రి బహువయః క్రమమువాఁడ టంచు వారల నిరసించి యవనికాంత తనభుజాదండమున నుండఁదనరుచుండు భావజవిభుండు వేంకటక్ష్మావరుండు.( ఆ.1. ప. 81)
సీ. మెూహాపదేశ తమోముద్రితములైన కనుదమ్ముల హిమాంబు లునుపరాదు శ్రమబిందుతార కాగమఖిన్నకుచకోక ముల జంధ్రదనామంబుదలఁపరాదు పటుతావపటపాక పరిహీణతను హేమ మికఁ బల్లవపటార్చిడఁగ రాదు శీర్యదాశావృంత శిధిలతానులతాంత మసియూడ వీవనల్వినరరాదు తే. లలన క్రిశంగ కీలికీలాకలాప సంతత్రాలీఢ హృదయ పాత్రాంతరాళ పూరిత స్నేహ పూరంబు పొంగిపొరలఁ జల్లని పటీర నలిలంబు నల్లరాదు. (అ. 3. ప. 210)
ఉ కొండఁటవిల్లు వేదలలకుండలిరాజఁటనారి, యమ్మనం
తుండఁట, బైటిపల్లియలు దున్మినవాఁడఁట యొండురెండు భ
ర్గుండిది నిండు పౌరుష మొకోయని గెల్వవెముజ్జగంబు ను
ద్దండత నొక్కతుంట విలుదాలిచి యంటినఁ గందు తూపులన్ !
(ఆ. 3. ప. 202) 62 కవిత్వతత్త్వ విచారము
ఈ విషయ మిట్లుండె. కథావిషయమున నుపజ్ఞయావశ్యకము గాదని గురువు చెప్పె. అతని శిష్యులనందగు తరువాత ప్రబంధ కవు లెల్లరు వర్ణనలంగూడ నుపజ్ఞ పనిలేదనియేమో, వసుచరిత్ర లోని యూహలన యనుసరించువారై బిల్ల వసుచరిత్రముల ననేక ములం బ్రకటించి, యాకార్యములందు రోఁత హెచ్చించి గురువు నకుం గూడ లఘుత్వ మాదేశమగునట్లు చేసి కవిత్వము భావ సంబంధము లేని పథసంబంధిగా నొనర్చి పాడునకుం దెచ్చిరి.
ప్రబంధముల నాటక సరణి మృగ్యము
ప్రబంధములలో నాటక కౌశలము మృగ్యము. పాత్రోచితమైన భాష శ్లేషబంధురములైన కావ్యములలో మందునకైన దొరకునే ! చెలికత్తె నోరు దెఱచిన నేమి గన్యామణి నోరు దెఱచిన నేమి? బయట బడునది ! శ్లేషయేఅంథును,అభంగశ్లేషను, ఘటింప వలయునన్న సాంస్కృతిక శైలి యుండియ తీరవలయును. ఏ రసము నే భావమును వెలయింపఁ బూనినను దీర్ఘ సమాసములతోఁ జేయుట విధి. ఏక సమానమైన వృత్తముల నేడ్చునప్పడును బ్రయోగించు కోమలాంగులఁ దలఁచుకొన్నచో వారి శ్వాసకోశము లెంత పునములని యాశ్చర్య మయ్యెడిని !
ప్రబంధములకు దేశ క్షయమునకు గల సంబంధము
శ్రీకృష్ణదేవరాయల కాలములో విజయనగర మెంతో విఖ్యాతి గాంచి యుండెను. రాయచూరు మహాయుద్ధమున హిందువులు మహమ్మదీయుల నోడించి వారి రాజ్యములం బ్రవేశించి యడ్డులేని యధికారము వెలయించువారైరి. దేశమునఁ బౌరుషము దేదీప్య మూమాముగా నున్నందునఁ గావ్యములయందును నది ప్రతిఫలింపక పోలేదు. రాయల కృతమైన యాముక్తమాల్యద, మనుచరిత్ర, పారిజాతాపహరణము, కాళహస్తిమాహాత్మ్యము వీనియందెల్ల నవ్యత యను గుణమున్నది. మఱియు గొన్ని కొన్ని భావములు కవి నిండు హృదయంబుతో వ్రాసియుండుటయుఁ దేటతెల్లంబ.తాళికొట యుద్ధమున హిందువులు పరాజితులైరి. మహమ్మదీయులు విజయ నగరమును ధ్వంసముచేసి పాడుగోడలు తప్ప నింకెవ్వియు నందు నిల్పకపోయిన వెనుక దేశమున నరాచకము ప్రవర్తిల్లెను. చిల్లర పాళయగాండ్రు స్వతంత్రులైరి. విచ్ఛేదము దౌర్బల్యమునకు మూలముగదా ! అంతటితో హిందువులు మఱలనైనఁ బగసాధించి ప్రథమ భాగము 63
నష్టమును బూరించుకొందమను నాశను వదలుకొని రే మో ! ఇట్టి పశ్చాత్తాప కాలమున బుద్ధి యెట్లుపారును ? హృదయ మే యానం దము దొరుకునని వికసించును ? కావున నన్నిశక్తులుఁ బోయి పండితులకు నేకశక్తియైన జ్ఞానశక్తి మాత్రము మిగిలెఁ గాఁబోలు ! అసలు పూర్తిగా నడుగంటని వసుచరిత్ర కాలములో నున్నంత ప్రజ్ఞయు, మగంటిమియు తరువాతి నాళ్ళవారమైన మనకు నంద రాని వైనందున నేమో రసహినములు, ఏక క్రమములు, అనవ్య ములునైన కావ్యములు పుంఖానుపుంఖములుగ వెడలినవి! ఇవియు లేక పోయి యుండిన దేశము పరిపూర్ణాంధకారముపాలయి యుండుఁ గాన, నీ మాత్రము వెలుతురైన నిలపినందులకుఁ బండితులను బాళయ గాండ్రను మనము కొనియాడవలయం.
ఐరోపా లో రాజులు నాశన మెత్తినను ప్రజయను నింకొక ప్రకృతి ప్రతాపవంతమై యుండుఁ గావున, కవిత కేవలము నగరి నా శ్ర యించి బ్రదుకు విద్యగాదు. హిందూదేశములో మనుస్మృతి దెబ్బ దగిలిన నాఁటినుండి ప్రజ యీవఱకును లేవలేక పడియున్నది. దానిది పరాశ్రయమైన బ్రతుకు ! కృష్ణదేవరాయలు, శివాజీ వీరిం బోలిన మహనీ యు లవతరించి రేని, జనసామాన్యమును వారి వెంట కుక్కలగుంపువలెఁ బోయి యెవరిమీఁదఁ బడుమన్నను బడును గాని, నాయకులు లేనిచో దిక్కులు దెలియక మరలC బ్రాచీన కర్మమును బారంపర్య హీనస్థానమును అవలంబించును. “క. ఏమీ ! రాజులు మంత్రులఁ దామతి దుర్బుద్ధులైన ధరయెల్లను గ్రిం దై మాఁడి మడియునో ! జన సామాన్యము సంపు చరిత చక్కనిదైనన్."
మనవారిలో సంఘచరితమను భావమే యున్నదో లేదో ! భావమే లేనిది ప్రవృత్తి యెక్కడిది ? తమ తమ కుటుంబములయు, తెగలయు క్షేమచింతయే గాని రాష్ట్రము గూర్చిన చింతలు లేని వారగుటం జేసి, వీరి ప్రారంభములచే దేశమున కే మాత్రము మాన ప్రాణరక్షణములు సమకూ అవు. అట్లగుట వీరి కృత్యములు గంభీ రోద్యమములు. వీరిచేఁ దెలివియు విరివియు c గాంచు కవిత సాధారణ జనులపై నేల దృష్టి యుంచును ? తన కడుపుమీద దప్ప నింకెద్దానిమీదఁను గన్ను మనసుc బోనివానిపైఁ బరుల కన్నులు మనసులు నేలపాఱును చీయని వాపోవుటకుఁ దప్ప ! ఐరోపా 64 కవిత్వతత్త్వ విచారము
లోని కవీశ్వరులు గొందఱు కాపువారు. సైనికులు మొదలైన తక్కువ వృత్తులవారి బదుకులును వర్ణనార్హములని భావించి యోంతో సుందరముగఁ గావ్యములలో వ్రాసియున్నారు. మన గ్రంథముల మాత్రము చదివి యీ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రము యొక్క స్థితి గతుల నరయఁ జూచువారికి, ఈ దేశము బీదసాదలపై నాదరము గల కవి యెవఁడైన నున్నాడా ? తుదకు, బీదసాదలైన నున్నారా ? యును సంశయము పట్టినను దప్ప వారిదిగాదు ! శ్లో కర సము వర్ణింప వలయునన్న ననుకూలమగు సందర్భ మెయ్యది ? క్రొవ్వు కాతెడు నాయి కానాయకుల యూహా మాత్రములైన కష్టములా ? ప్రజలు దినదినమునఁ గన్నీరు గార్చుటకైన నవకాశము లేక కుడుచుచుండు పరిపరి విధములైన గోడులా ? శాంతర సమునకుఁ బోషక మెయ్యది? తమకు నష్టముఁ దేనట్టివైన రాజులయొక్క యుదారచర్యలా ? ఆకCట మాఁడి మలమల మాడుచు నింటికి వచ్చి వంట సిద్ధము కాకుండినను భార్యపై గోపింపక కన్నులు మూఁతపడుచుండ విధిని ధ్యానించుచు నొక మూలఁ గూర్చుండు పొలము కాcపు యొక్క నడవడి యూ ? ఆహా ! జనసామాన్యము యొక్క ప్రతిదిన వృత్తములలో నెంత భావము, రసము, గుణము ఉపగతములై యున్నవో మన కవులకుం దెలియవుగదా ! రాజపుత్రులను, రాజ కన్యలను, చాలనందులకు బ్రాహ్మణులను, వేశ్యలనుబట్టి ఝుంఝూట మాడుటదప్పఁ గవితకు మేలైన యన్యకర్మములు లేవా?
సామాన్యజను లీ రీతి నలక్ష్యముగాఁ జూడబడుటకు హేతువు లెవ్వియన : ఈ దేశమునఁ బ్రజ సాధించుటకుఁ జేయి, తన్నుటకుఁ గాలు, మొఅవెట్టుటకు నోరు ఏదియు లేని పశువు ! ఐరోపాలోని జనులు రాజసగుణ శోభితులు. మన పాలిటి భాగ్యము తామస మో. దాని తోఁబుట్టువగు సత్త్వమో యేదో యెుక్ర జడత్వబీజము ! జాతి భేదములవలన శ్రేష్ఠకులులకు తదితర పక్షమున మర్యాదయు గౌరవమును గలుగమి శ్రేష్ఠులకు మాత్ర మర్ధింపఁదగినను నియతిని విద్య దాల్చినదగుట. దీనివలని దుర్దశలు రెండు. మొదటిది. విద్య నచ్చిన యుత్తమ వర్ణులకు తక్కినవారితోడి సాంగత్యము తక్కువ గావున వారింగూర్చి వ్రాయజాలినను వ్రాయ నేరరు. రెండవది. విద్యాదానమునకుం బాత్రమగాని జనబాహుళ్యము ఎంత దెలిసిన దయ్యును అక్షరములు రానిలోపంబున వ్రాయ నేరరు. అథవా ఒక రిద్దఱు కవితాశక్తి నెట్లో సంపాదించిరి పో ! ప్రాశస్త్యముననున్న పద్ధతి రీతిఁ జెప్పి యగ్రజాతివారిని మెప్పింపవలయునని గదా ప్రథమ భాగము 65
వారు ముఖ్యముగా దలంతురు ! అట్లగుట నల్పజీవితమును వారు సరుకు సేయుదు రా ? చేయరు. జాతికి జాతికి స్పర్ధయేర్పడుట వలన పాండిత్యము ప్రకటించి బ్రాహ్మణుల మీఅవలయునని రామ రాజ భూషణుఁడు యత్నించె నే మోయనుట విచార్యము ! ఏది యెట్లున్న నేమి ? అగ్రజాతులవారి యహంభావము, అశ్రద్ధ, ఆచారము ఇవి వేరుగను, అన్యజాతివారిని దమ మార్గమునకు నథీనులఁగా జేయుటయు, కవిత్వోచితమైన విషయమును మిక్కిలి సంగ్రహపఱచినవి. ఒక్క రాజులను రాజకన్యలను వదలినయెడఁ గవితకు గతి మోక్షము లుండవుగాఁ బోలు ! ఆంధ్ర కవిత్వము రాజు లను రాణులను నమ్మి జీవనము జరుపుకొనునది గనుక, వారైశ్వర్య మును గోలు పోయినతోడనే తానును వైరస్యమును వికృత వేషమును దాల్చవలసిన దాయెను. ప్రజలలో సత్త్వము స్థిరముగలేనిది కవిత నిత్యసౌభాగ్యము పడయ నేర్చు టెట్లు ?
మన యొక్క రాజుల దినములలో సైత మలవడనంత విన్యాసము నేఁడు ఆంధమును జెందియుండుటకు, బ్రిటిష్ వారి పరిపాలనమాహాత్మ్యమును, దానిచే మనయందు ప్రభవిల్లిన వృద్ధి నతిశయముగఁ జెందు దమను నుత్సాహమును ముఖ్యకారణములు. విద్యయు నెల్లరు శక్తి కొలఁది నిరాటంకముగ గ్రహింపవచ్చును. ఔనత్యమునకు సంఘ దురాచారముల నిర్మూలము జేయుట విడువ రానిసమయమగావుననాంధసాహితీపునరుద్ధరణ ప్రభావులైన శ్రీ వీరేశలింగముగారిచే దారి చూపఁబడిన యనేకులు, ప్రజల యొక్క మేలిమి నాసించి , వారలకు, దెలియనట్లు అనేక ముఖ్య విషయములఁ గూర్చి వ్రాయుచుండుటచే, భాష యందలి ప్రీతియు గౌరవమును, అభిలాషయయి, కుతూహలమును మును పెన్నఁడుఁ దాల్చి యుండనంత వ్యాప్తినిఁ బెంపును వహించుచున్నవి. ప్రకృతము కావ్యములు, నాటకములు, ప్రహసనములు ఇత్యాది కృతులతో నివేదింపఁబడు విషయముల సంఖ్యములు. సర్వజన హితములు. ప్రాతమార్గములనే యాపద్దతు లరిగిపోవునట్లు గొల్లైల మందలవలెఁ బో వునవిగావు. మఱియు దేశాభ్యుదయమను మహెూ ద్దేశము గల వె టు C బౌరుషోద్దీపకములు. నాయి కా నాయకులు సగమునకు సగము పలాయితులైరి. రాజులు రాణులును ప్రచ్ఛ న్నులై యే మూలం దాఁ గిరో యెందడcగిరో ! వెతకcబ డు వారు లేరు. వెదకు వారు ను లేరు ! కలియు గాది నుండి యింతదాఁక జముకు ఖర్చునకు రాని సాధారణజనులు నేఁటికిఁగదా గణ్యులైరి ! ఇఁక 66 కవిత్వతత్త్వ విచారము
ముందు పూజ్యు లగుదురు గాక !
“తే. అక్కజంబుగ నిప్ప డత్యంత దీప్తి వెలుఁగుచున్నావు భారతీ ! విమలమహిమ నాంథథేశేఅంబుతౌ మార్పు లనుబవించి, యేమి చెప్పదుఁ? గలకాల మింక నెట్లో!"
మూఁడవ ప్రకరణము
కళాపూర్ణోదయము
కళాపూర్ణోదయ మాంధంబున నద్వితీయమైన గ్రంథమ. ఏజాతికిం జేరినదిగాదు. తనఁతట నొక క్రొత్తరకము. ఆంధ భారతాదులు సంస్కృతే తిహాసములకుం బరివర్తనములు. మన వసుచరిత్రాదులయందుఁ గథలు నవీనములుగావు. ప్రాచీనగ్రంథ ములనుండి గ్రహింపఁబడినవి. ఈ విమర్శనములకు గుఱియైన కావ్యమన్ననో కవియొక్క స్వసృష్టి బాణునిచే సంస్కృతమున రచింపంబడిన కాదంబరివంటిదని యందురు గాని, దానినుండియైన సూరనార్యుఁడు విషయముల గ్రహించినట్లు గానము. ప్రబంధ కవ లెవ్వరిలోనూ గనఁబడని ప్రతిభయు, భావనాశక్తియు, సందర్భ శుద్ధియు, పాత్రోచిత పద్యరచనయు నిందు సుప్రసిద్ధములు. ఇంత భావ గాంభీర్యము గలదియు నూతన పద్ధతులం బోవునది యునైనను కాలదోషము నెట్లు పూర్ణముగఁ దప్పించుకొనఁ గల్గును ? ప్రబంధ కవుల యందలి స్టాలిత్యములు నిందును బెక్కులు గలవు. కాని దోషములకన్న గుణములెన్నియో మడుంగు లెక్కువయని దృఢము గను మనఃపూర్తిగను జెప్పట కేయూతంకమును లేమి చదువరుల కెల్లను స్పష్టము. దీనివలె భావనాశక్తిచే నిర్మింపబడినదియు, తేజ రిలునదియునైన గ్రంథము తెనుగులో లేదు. పరదేశ భాషల యందలి పుస్తకములతోఁ బోల్చిచూచినను దీని క్రి గౌరవ హాని యే మాత్రమును గలుగదని నా యూశయము. మనకు నిది యేకము తనవంటిది මීබියි. ప్రశస్తములగు దేశాంతరకృతులతోఁ దులదూఁగఁ గలది యగుట, నన్యులు పరీక్షించినను దలవంచుకొన వలసినది గాదు.