కవిత్వతత్త్వ విచారము/ప్రథమ భాగము/మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

66 కవిత్వతత్త్వ విచారము

ముందు పూజ్యు లగుదురు గాక !

      “తే. అక్కజంబుగ నిప్ప డత్యంత దీప్తి
           వెలుఁగుచున్నావు భారతీ ! విమలమహిమ
           నాంథథేశేఅంబుతౌ మార్పు  లనుబవించి,
            యేమి చెప్పదుఁ? గలకాల మింక నెట్లో!"


మూఁడవ ప్రకరణము


కళాపూర్ణోదయము


కళాపూర్ణోదయ మాంధంబున నద్వితీయమైన గ్రంథమ. ఏజాతికిం జేరినదిగాదు. తనఁతట నొక క్రొత్తరకము. ఆంధ భారతాదులు సంస్కృతే తిహాసములకుం బరివర్తనములు. మన వసుచరిత్రాదులయందుఁ గథలు నవీనములుగావు. ప్రాచీనగ్రంథ ములనుండి గ్రహింపఁబడినవి. ఈ విమర్శనములకు గుఱియైన కావ్యమన్ననో కవియొక్క స్వసృష్టి బాణునిచే సంస్కృతమున రచింపంబడిన కాదంబరివంటిదని యందురు గాని, దానినుండియైన సూరనార్యుఁడు విషయముల గ్రహించినట్లు గానము. ప్రబంధ కవ లెవ్వరిలోనూ గనఁబడని ప్రతిభయు, భావనాశక్తియు, సందర్భ శుద్ధియు, పాత్రోచిత పద్యరచనయు నిందు సుప్రసిద్ధములు. ఇంత భావ గాంభీర్యము గలదియు నూతన పద్ధతులం బోవునది యునైనను కాలదోషము నెట్లు పూర్ణముగఁ దప్పించుకొనఁ గల్గును ? ప్రబంధ కవుల యందలి స్టాలిత్యములు నిందును బెక్కులు గలవు. కాని దోషములకన్న గుణములెన్నియో మడుంగు లెక్కువయని దృఢము గను మనఃపూర్తిగను జెప్పట కేయూతంకమును లేమి చదువరుల కెల్లను స్పష్టము. దీనివలె భావనాశక్తిచే నిర్మింపబడినదియు, తేజ రిలునదియునైన గ్రంథము తెనుగులో లేదు. పరదేశ భాషల యందలి పుస్తకములతోఁ బోల్చిచూచినను దీని క్రి గౌరవ హాని యే మాత్రమును గలుగదని నా యూశయము. మనకు నిది యేకము తనవంటిది මීබියි. ప్రశస్తములగు దేశాంతరకృతులతోఁ దులదూఁగఁ గలది యగుట, నన్యులు పరీక్షించినను దలవంచుకొన వలసినది గాదు.

                                        ప్రథమ భాగము                                            67

భావనాశక్తి స్వచ్ఛంద ప్రచారములలో నొకటి. అట్లగుట

దానిని సమగ్రముగఁ దాల్చినకవులకు నదియొక గొప్పవరముగాఁ
దోcపదేమో ! కావున నే కదా మహా కవులును శిల్పులును హను
మంతునివలెC దమ యా న్నత్యమును దా మెఱుంగకుండుట ! కాళి
దాసు వా క్రుచ్చిన విధము నెఱుంగరా ?
                ‘కడుశిక్షితులైనను దమ
                యెడనమ్మిక దమకుఁ గలుగ దెన్నఁడు మదిలోన్ ?)
          వారి క్రే మెూ వారి వాక్కులు సహజములుగ సాధారణము
లుగఁ గాన్పించును. వినువారికన్ననో యాయద్భుతము చెప్పఁ
దరముగాదు ! సూరన యు కళాపూర్ణోదయము తన రచించిన
గ్రంథములలో నుత్త మోత్తమమని యేంచినాఁడో లేదో యనుట
సందిగ్ధము. ఎట్లన : నంద్యాల కృష్ణ విభుఁడు తన్నుద్దేశించి
పల్కినట్లుగా
       “మ.  ఇటమున్గారుడ సంహితాదికృతు లీ వింపాందఁగా బెక్కొన
         ర్చుటవిన్నారము, చెప్పనేలయవి, సంస్తుత్యోభయశ్లేష సం
        పుటనన్ రాపువ పాండవీయ కృతి శక్యంబే రచింపంగ నె
       చ్చట నెవ్వారికి, నీక చెల్లెనది భాషాకావ్యముం జేయఁగన్.”

అని వ్రాసియుండుటయేగాక, రాఘవ పాండవీయములో కృతిపతి

యైన పెద వేంకటాద్రి తన్నుఁ బ్రశంసించుచు
    “శా.  రెండర్ధంబుల పద్యమొక్కటియు నిర్మింపంగ శక్యంబు గా
           కుండున్, దర్గతి ; గావ్యమెల్ల నగునే నో హెుయనం జేయదే
          పాండిత్యంబున నందునుం దెనుఁగుఁ గబ్బంబద్భుతంబండ్రు, ద
          క్షుం డెవ్వాఁడిల రామభారతకథల్ జోడింప భాషాకృతిన్.”

అని సెలవిచ్చినట్లును వర్ణించియుండుటCజూడ శ్లేష కావ్యములం

గల గౌరవము తదితరముల యెడ నతని కుండెనాయని సంశయింప 

నందు గలదు. కాని రాఘవ పాండవీయ రచనానంతరమున నతఁడు శ్లేష నంతగా వాడక చాలించుటం జూడ దానియందలి

యూ దరము లా ఘవ మయ్యెననియు నూహింపవచ్చును. ద్వ్యర్థి
కావ్యముల కెల్ల శిరోమణి యనందగుదానిని ఘటించినవాఁడయ్యు,
కళాపూర్ణోదయ ప్రభావతీ ప్రద్యుమ్నములలో ప్రబంధకవులవలె
శ్లేష నంతగా వాడక యుంట కతన నదిశక్తిలేమిచే విసర్జింపఁబడినది 

68 కవిత్వతత్త్వ విచారము

గాదు. మఱి ర కిలేమి చేనని యనుమానించుట సహేతుకము. ఏది యెట్లుండె. లోకులును, అనఁగా పండితులన్నమాట, రాఘవ

పాండవీయమును బంచ మహాకావ్యములలో నొకటిగా ననుగ్ర
హించి రే కాని అఖండభావ గాంభీర్యమైన కళాపూర్ణోదయమునకు
నట్టి పట్టము గట్టరైరి. ఐన నిదియొక యెదురు చూడబడని వింత
గాదు.
                         కవి యొక్క ప్రతిజ్ఞయు దత్ఫలములును
   ఈ కావ్యము యొక్క గుణదోషములు రెండింటికిని నాస్పద
మైనది సూరనార్యుడు ప్రారంభమునఁ జేసికొన్న ప్రతిజ్ఞయ. కృతి 

నిర్మాణ విషయమైన సంకల్పమును గవి యే వివరించియున్నాఁడు.

చూడుడు. "సకల లక్షణ లక్షితంబైన మహా ప్రబంధంబు కీర్తి
కారణంబుని...యెద్దియే నొక్క సరస ప్రబంధ నిబంధనమునకు "

గౌతూహలియై యుండునపుడు, రాజుగారు "నిర్దిద్రలీలావిచిత్రంబగు దానిం" జేయుమని యాజ్ఞాపింపఁగా, ప్రభువుగారి గౌరవమునకును

దన శక్తికిని దగినరీతి "నపూర్వకథాసంవిధాన వైచిత్రీమహనీయం
బును, శృంగారరస ప్రాయంబును, బుణ్యవస్తువర్ణనా కర్ణనీయం
బును నగు కళాపూర్ణోదయంబను మహాకావ్యంబు" రచింపఁ గడం
గెను ! కవి యొక్క యుద్దేశమే యీ గ్రంథ మిన్ని లక్షణముల
గలియుండవలయునని. కవి తన యఖి మతము నెఱవేర్చికొన్నాఁడు
ಗ್ನಿ, ಯುಲ್ಲು పంతముఁబట్టి వ్రాసినందున నిష్కళంకమైన కృతి
యేర్పడినదా లేదా యనుట సందేహము! కథ యు ప్రకృతియందలి 

వస్తువులవలె దనంతటఁ దనయందలి సత్త్వముంబట్టి పుట్టి

పెరుగు గుణముగలది. దానిని సాజముగ పెరుగనిచ్చి, యప్పు
డప్పడు సవరించుచు సంస్కరించుచు దోహదము చేయుచు వచ్చిన
మేలా ? మొదటినుండి యే యీయివా రసములు తప్పక యిచ్చెడు
దానిని గల్పించెదను అని సంకల్పించుకొని పిమ్మటి దాని యుత్పత్తిఁ
జేయుఁజూచుట మేలా ? యోజింపడు. భావనాశక్తి కారణశక్తి
యొక్క సేవనమునకు నిల్చిన మహత్తు గాదు. మఱి స్వైరిణి.
గుఱ్ఱముల నడిపినట్లు గతి వేగము గుదించి త్రిప్పి కొంతకుఁ గొంత 

వశ్యము చేసికొన నగుఁగాని, యపరిమితముగా దాని స్వేచ్ఛావిహార

మును నివారించితి మేని అది చెడును. పరిశ్రమము తగినంత లేమి
మందమగును. కృశించి నశించినను నశించునే మో ! సకల లక్షణ
లక్షితములు ఐహిక సంప్రదాయముల ప్రకారము నిర్లక్ష్యములు. 

ప్రథమ భాగము 69

నిర్లక్ష్యములు గాకున్నను నిర్దోషములు గావు.

    సూరనార్యున కీ యుద్యమముచేఁ గలిగిన మేలు గీడు లెవ్వి యన : అపూర్వకథా సంవిధానమునకుం బూనుటచే నుపజ్ఞకు భావనాశక్తికిని మంచి ప్రవేశము దొరకినది. ప్రాచీనకవు లితరుల కథల భాషాంతరీకరించిన వారగుటను, ప్రబంధకవు "లాద్య సత్కథ" లైకొని కై సేఁ తలకుం దొడంగుటచేతను, ఆ యిరుదెఱఁగుల కృతికర్తల యందును మాతృకలులేని యెన్నికలును భావనాశక్తియలి వ్యాపించుటకుఁ దరుణము కఱవాయెను. కళా పూర్ణోదయము సామాన్య ప్రబంధములకంటె నెక్కువ రసవంత ముగ నుండుట కిదియొక కారణము. మఱి భారతమంత సరసము గాని దగుటకు మూల మే మనఁగా సర్వలక్షణములును బలాత్కార ముగనైన దెచ్చి రాసి వేయవలయునని కవి సంకేతము చేసికొన్న వాఁడగుటచే కథ సహజముగc బక్వమునకు రాక యచ్చటచ్చట నూందర వేయబడి యుండుట. అయిన నొక్కటి. కథ కంటికిఁ గనcబడనంతటి కృశత్వము నొంది యుండుట ప్రబంధములలోని కొఱతలలో నొకటియని మును పే చెప్పఁబడియెఁగదా ! ఈ లోప మును చాల మట్టునకు పూరించి ఈ కావ్యములోని కథకుఁ బుష్టి తెచ్చిన తంత్రములలో "సర్వలక్షణ సంపన్న"తా సమయము ప్రముఖము , ఎట్లన, రసములు తొమ్మిది. "శృంగార వీర కరుణాద్భుత హాస్య భయానక భీభత్స రౌద్ర శాంతము"లని. ప్రతియొక్క రసము నకుఁ జెందిన భావాను భావము లెన్నియో యున్నవిగాని, మనవారు శృంగారమునకుఁ జెందినవానిం దప్ప దక్కినవాని నంతగాఁ దలపోయలైరి. అందుచేత ప్రబంధములలో నన్ని రసములుఁ బ్రదర్శింపఁ బడవయ్యె. అటు చేయవలయునన్న వివిధములయిన కార్య జాలములతో నిండిన విస్తృత కథయొక్క ప్రాపు తప్పక యుండవలయు . ఒక యుద్యానవనమునందు ఒక జత నాయి కా నాయకుల కన్న నొకటి రెండు రసములకన్న నెక్కువ పుట్టించుట దుర్లభము ! రమారమిగా నిర్ణయించితి మేని, ప్రబంధములలో అద్భుతహాస్యభీభత్సభయానక రౌద్రరసములు మృగ్యములు. వీర శాంత కరుణా రసంబులును శోషితంబులు. మనవారిచే శృంగార మనఁబడు " నొక్క రసముమాత్రము దట్టముగఁ గాఱుచుండును.

  • ఇది నిజముగా శృంగారమనుట నిర్వివాదముగామి యిఁక ముందు సూచింపఁబడును.

70 కవిత్వతత్త్వ విచారము మన సూరకవి కళాపూర్ణోదయమున నీ యన్ని రసములకును స్థానము లేర్పఅుచు కోరికగలవాఁడౌటచే వాని కన్నింటికిఁ జోటుదొరకునంత విశాలమగు కథ గల్పింపవలసినవాఁడయ్యె. అందుచే నిట కథ తుచ్ఛముగాదు, మఱి మిక్కిలియు ప్రాబల్యము గలయది. అయిన నొక దురదృష్టము. ఒకే కథలో నన్నిరసములు నిముడ్పవలెనన్న నా కథను దా అుమాఱుగ నీడ్వనిదిగాదు. అనఁ గా అసంగతమైన యంగములఁ దెచ్చిపెట్టి స్వారస్యము నక్కడక్కడఁ జెడఁగొట్టి కథకు వికారము గల్పించినాఁడని నా మనవి. సమగ్ర పరిపూర్ణత మనుజులకు సుఖముగ జీర్ణమునకుఁ దెచ్చికొను నాహుతిగాదనుట మూ టి మూ టికి జెప్పటయేల? అట్టి కఠినం పుc బదార్ధముల కాసించి కవి కష్టముల పాలైనాఁడు. అయినను మొత్తముమీఁద నీ యిచ్ఛయు శుభకరము. ఇది లేకున్నఁ గళాపూర్ణోదయము ప్రబంధములలోఁ గలసిన గ్రంథముగా నుండియుండునేమో! ఆ దుర్గతికిం దప్పించిన మంత్రము నింద్యమనరాదు !

             కల్పనా సామర్థ్య మీకవికింబలె నాంధ్రులలో మరెవ్వరికిం

గానము. తిక్కనాదులకు నుండవచ్చునేమో ! ప్రత్యక్షమునకు రా నవకాశము లేనివారగుటకతన వారింగూర్చి యీ యాలోచనఁ ಪೆಟ್ಟು కొనుటలో ఫలములేదు. ఇక ప్రబంధకవులన్ననో, ఒక్క కథ యొక్క ప్రధానాంశములయంద కాదు. సందర్భముల నేర్పఱుచుట యందును గల్పనఁ గలవారుగారు. గొట్టెల మంద రీతి నొకరు పోయిన దారినే తల వంచికొని యందఱుఁ బోయరి గాని, స్వేచ్ఛా గమనముఁ దాల్పరైరి. సూరనార్యునియందు ప్రబంధకవులకుంగల వర్ణనా శక్తితోడ కథా కల్పనాశక్తియు, వివిధములైన సందర్భములను సంధానమునకుఁ దెచ్చు ప్రతిభయు, సహవాసములు, మఱియు భావనాశక్తికి దోడు భాషాశక్తియుఁ గలవాఁడగుటఁ దా నే యించు మించు సర్వకవితాలక్షణ సంపన్నుఁడనం జెల్లు గాదె? కవిత్వము భవ్యంబగుటకు భావము భాష రెండును గల సి మెఱయవలయుట. నిత్యసమయము. సూరనార్యుఁ డీ రహస్యము నె ఆలీం గిన వాడనుటకు నిదర్శనమేమనగా : కవితాస్వరూపమును ప్రభావమును వర్ణించి తా వ్రాసిన "లయ విభాతి. చలువగల వెన్నెలలు చెలువునకు సౌరభము

                     గలిగినను, సౌరభముఁ జలువయు దలిర్పం,
                     బొలుపెనఁగు కప్పరపుఁ బలుకులకు గోమలత
                     నెలకొనిన, సౌరభముఁ జలువపసయుం, గో                                     ప్రథమ భాగము 71
                            మలతయును గలిగి జనముల మిగుల బెంపెనఁగు
                            మలయషవనంపు గొ దమలకు మధురత్వం.
                            బలవడిన నీడుమఱి గలదనఁగ వచ్చుఁ గడు
                           వెలయఁగల యీ నుకవి పలుకులకు నెంచన్.”
                                                                   (కళా. ఆ. 1, ప. 186)

అను పద్యము. భావము శైలిని మించినదా, శైలి భావమును మించి నదా యని వెఱఁగొనరించు నగ్రగణ్య పద్యములలో నిది యొకటి! కవిత్వ ప్రశంసల నెన్నింటినో చూచియున్నానుగాని, మనోహరము లైన యిన్ని యాకృతుల నెదురనిల్పి మైమ అచునట్లు చేయుమాటల నింకెయ్యెడను గనలేదు. వినలేదు ! ఊహనుండి యూహకుఁగా బావము మీఁది కెగయుచుఁ దుదకుఁ గంటికి గనరాని యంత యాన్నత్యమును వహించినది గదా !

                             కవికృత శైలివిషయక విచారములు

సూరనార్యుఁడు శైలివిషయమై చేసిన చర్చలను, బహు చమత్కారముగఁ బాత్రము లొకళ్ళకళ్ళ వాక్యములం బ్రశంసించి ನಿಲ್ಲು వ్రాసియున్నాఁడుగాని, తానే నేరుగఁ జదువరుల సంబోధించి నట్లు వ్రాయలేదు. ఈ కవితో సమకాలికుఁడైన షేక్స్ఫియర్' అను నాంగ్లేయ కవిచక్రవర్తి కొన్నియెడలఁ దన శైలింగూర్చి సగము నవ్వటాలకుంబలెఁ బ్రసంగమ్ముఁ జేయందలంచి స్వయముగ వ్యాఖ్యానంబుఁ జేయుట యనుచితంబు కాదు. కథాగమనమునకు విరుద్ధము నని యెంచి, పాత్రముల యొుండొరుల వచనముల విమ ర్శించినట్లు సేసి, యూ మార్గమునఁ గొంతకుఁ గొంత దన యభిప్రా యంబు వెలువరించుట గలదు. సూరన్నయు మార్గ మవలం భించినవాఁడే. నేరుగా కవియే కథలో మాటాడుట కథయందు మన కుండవలయు నవధానమునకును దానిచేఁ గలుగు మైమఱపునకును విచ్ఛేద హేతువు. కావునఁ గవి బోధనలు సైతము పాత్రముల మూలమునఁ బ్రచురించుట నాటక సందర్భమునకుఁ బోషకము. కావ్య మనునది జగత్తురీతి నుండవలయును. ఎట్లన, జగంబు మన యెదుర నున్నది. దానిమీదఁ దృష్టి చెదరకుండుటకో యన జగత్కర్త యదృశ్యభావుఁడయి యున్నాఁడు. కావ్యమును జదివి యానందించుచుఁ గవిని మఱచితి మేని, యది కృతఘ్నత యేమోగాని, యవియే కవియొక్క కృతార్థతకు గుఱుతు. మఱియు, పాత్రల మఱుఁగుననుండి వారిచేఁ జెప్పించినఁ దనకు గర్వము, 72. కవిత్వతత్త్వ విచారము ఆత్మస్తుతి మొదలగు నేరములు మోపఁబడవు. సూరన శైలింగూర్చి చేసిన విచారములన్నియు బాత్రముల

చాటున కథకును దనకును, భంగము రాని మాడిక్కిc   చేసి
యున్నాఁడు. అనఁగా బయట( బడక య తనకృతినిదానే విమర్శించి
యున్నాఁడనుట.

దృష్టాంతరము. మణికంధరుఁడు చేసిన దండక రూపమైన Š ష్ణస్తవముంగూర్చి కల భాషి ఇది ప్రశంసించిన తెఱంగు : “సీ. పొనఁగ ముత్తెప్పనదుల్పోహళించినలీలఁ

              దమలోన దొరయు శబ్దములఁ గూర్చి
       యర్ధంబు వాచ్యలక్ష్య వ్యంగ్యభేదంబు
             లెఱిఁగిఁ నిర్దోషత నెసగఁ జేసి 
       రసభావములకు నర్షంబుగ వైదర్బి
              మొదలైన రీతు లిమ్ముగ నమర్చి 
        రీతుల కుచితంబులై తనరారెడు
               ప్రాణంబు లింపుగాఁ బాదుకొల్పి

తే. యమర నుపమూదులును యమకాదులు నగు

      నట్టి యర్థశబ్దాలంక్రియలు ఘటించి
     కవితఁ జెప్పఁగ నేర్పు నత్కవి వరునకు
వాంఛితార్ధంబుం లొనఁగనివారు గలరె ?”                                     (కళా.ఆ.1, ప. 185)

භුධි వ్యర్థ పద్యంబు గాదు. ఎట్లన ఇందులోని విశేష ముం జూడుcడు. కలభాషిణి యింక ముందు మణికంధరుని మీఁదఁ దాను దొలినుండియు మోహము దాల్చినదని చెప్పఁబోవుచున్నది. కాన వాని కా మాటయందు నమ్మిక పుట్టుటకై యీ పొగడ్ర యను వయ్యెడి. మఱియు మనసు దగిలినవారల చెయ్వులు బహు ప్రశస్త ముగ మనకుఁ దోcచుట స్వాభావికము, అట్లగుట శైలి యంత బాగుగలేదని పండితులు నిరూపించినను, నీశ్లాఘనకుఁ గోరత రాదు. కారణము లేమనఁగా : అది కల భాషిణి వచనము. ఆమె మనసు ప్రకారము వ్రాయబడినది. అత్యుక్తిగా మీకుc దోcచినను గలభాషిణికి దోcచియుండదు గదా ! మఱియు నామె వారాంగన. వారాంగనలకు, ముఖస్తుతులు ఆతిశయోక్తులును జీవనాధారముగాన నైజములు. కాcబట్టి యహంభావముచేఁ గవి యాత్మస్తుతిఁ జేసి నాఁడని స్థాపింప వలను గాదు. అతని ಾಲಿ చెడ్డదిగా నుండినను సరే ఈ పద్యము సమయోచితమ. ఇఁక శైలి యీ వర్ణనకుఁ దగినదిగా  ప్రథమ భాగము 73 3 నుండిన నసలు దోష మే లేదు చూచితిరా ! ఈ కవి మహిమ ! ఈ సీసము యొక్క సాగసు కథయొక్క పెంపకమునకు ననుకూలము. కవియొడం జెల్లినను జెల్లవచ్చును. చెల్లదన్నను అనిమి త ప సంగము గాదు !

                        ప్రభావతీ ప్రద్యుమ్నము కొన్ని సందర్భముల
                         గళాపూర్ణోదయము ననుక్రమించెడును
     కళాపూర్ణోదయములో భావనాశక్తి య ఖండమన్న నా విజ్ఞప్తికి నిదియొక తార్కాణ. ఒక్క యు ఖండమగుటయు కాదు. కొన్నియెడల మితిని మీ ఆకి యతిశయ దోషముం జెందియున్నదన్నను, గవి యెడ నన్యాయముc జేసినవారము గా ము. ప్రభావతీ ప్రద్యుమ్నము నం దన్ననో కవిత్వవిద్య యింక ను బక్వమునకు వచ్చినది. అనఁ గా శుద్ధరచనను మాత్రము గమనించి చూచిన వెనుక వ్రాయబడిన యీ గ్రంథము దానికిఁ బూర్వమగు కళాపూర్ణోదయమునకన్నఁ గొన్ని విషయముల మిన్న. ఎట్లందు రో, శైలి యింక ను మంచి పాకమునఁ బడియున్నది . లోకోక్తులు మొదలగు నలంకారము లెక్కువ యగుటయు కాదు , రమ్యములును. అన్వయ సౌలభ్యము నధికము కాని భావనాశక్తి యెంతయుc దక్కువ . బహుశః కవి వయసు ముదిరినవాఁడైనందున రాగములు కృశించియుండును. రా గాదుల విజృంభణము లేనిది భావనా శక్తి యడరనేర్చునా? ఏది యెట్లుండె . కళాపూర్ణోదయ సందర్భము అC గొన్నింటిని ప్రభావతీ ప్రద్యుమ్పము లోను అనుకరించి యున్నాఁడు. తొల్లటి గ్రంథమందు (గల నూతన కల్పనలు వెనుకటి దానిలో లేవు. మఱియు నందలి కల్పనలు గొన్ని చిల్లర మార్పులతో నిందు బొందింపబడి యున్నవి. భావనాశక్తి వ్రాలెననుట కింకను సందేహ మేల ? 

చూడు డు, మణికంధరుని తపోభంగముఁ జేయుటకై వచ్చి కార్యసిద్ధి గడించిన రంభ యా మోటు ద పసి శృంగారములకుఁ గరంగని దగుటను, నలకూ బరాయుత్త చిత్త యగుటను, జేసి యొు కా నొకప్పడు

“క . కళలంటి కఱఁచి తన చె

              య్వులఁ జొక్కెడు తపసి మది చివుక్కురుమనఁగ 
              నలకూబర ! విడువిడురా ! 
            యలసితి ననిపల్కె మన్మథాతి వివశతన్.”             (కళా.ఆ. 3, ప. 47)

(10) 74 కవిత్వతత్త్వ విచారము అన్యనాథునిఁ బేర్కొనుట మణికంధరుని కోపమునకు గారణము గదా ! ప్రభావతీ ప్రద్యుమ్నములో నాయి కా నా యిద్ర్చ లకుఁ గోపము c దెచ్చిపెట్టవలయునని యుద్దేశించి కవి యూ కళా పూర్ణోదయము సంగతి వంటి దానినే చేర్చియున్నాఁడు. "శా. ప్రద్యుమ్నుండు ప్రభావతీ రతి విహార ప్రొఢి సారస్య సం .

              పద్యుక్తిం గడుజిక్కి దక్కితి రతీ ! మత్ర్పాణమా ! నీకు నం
              చుద్య త్పేవ్రు సమృద్ధిఁ బల్కె నదియూ యోషాలలామన్ శ్రవ
            న్సద్యఃపాత నిశాతిశూలసమమై చాలంగ నొంచెన్వెసన్."     ఇత్యాది
                                                                     . (ప్రభా. ఆ. 8, ప. 106)
   ఒకచో రంభ ‘నలకూబరా !' యని స్మరించుట. వే బ్రొక చోట ప్రద్యుమ్నుఁడు “రతీ !' యని పల్కుట. సామ్యము స్పష్టము. కాని మొదటి సందర్భము యొక్క కౌశల్యము రెండవదాని యందు జూపట్టదు. తారతమ్యము లేమనఁగా : ప్రభావతమ్మగారికి వచ్చిన పాలయలుక వర్ణనకై దిగుమతి కాఁబడిదే కాని కథా సాంగత్య మే మాత్రమును దానికి లేదు. వచ్చిన నెవరికి లాభము, రాకున్న నెవనికి నష్టము ! చాలీచాలని దాని క్రి శ్లేష వాసనయు మిగుల గాటు ! ఇక కళాపూర్ణోదయ సందర్భమన్ననో సర్వవిధముల నుత్కృష్టము. ప్రభావతి రాజకన్య. వయసున  ිට බ්‍රි చిన్నది . రతీదేవి పురు పున కన్న పెద్దమ్మకదా ! కాఁబట్టి కోమలాంగియైన ప్రభావతితో ముచ్చటించు నపుడు ఈ జ్యేష్ణా దేవిని దలఁచుకోవలిసిన విధి యేమి ? పాపము. రంభగతి వేఱు. మోటుదపసి యొక్కడ ? రసిక శిఖా మణియు ధనవంతుఁడు నైన నలకూ బరుఁ డెక్కడ ? ఇంతేగాదు. మణికంధరుఁడు నలకూ బర రూపముందాల్పఁడేని కథ సాగదు. ఇరువురు రంభ లు, నిరువురు నలకూబరులు నుండుట యావశ్య కము. రంభ 'నల కూబరా' - యుని కనులు మూసికొనుట, యింక ను గామ తృప్తి వడయని మణికంధరునికి నలకూబర వేష ముందాల్చు టకు నమోఘమైన హేతువు ! కావున నీవైరస్యము దండుగప్రణయ కలహముగాదు. మఱి కథా వృద్ధికి నావశ్యకమ.
               శైలిని గూర్చిన తర్కములు
    కవి యొక్క శైలివిషయమం గూర్చిన చర్చయు ని ప్లే. కళా పూర్ణోదయములో నిది కథా కల్పనకుం జేరిన యవశ్యక్రియలలో నొకటి. ప్రభావతీ ప్రద్యుమ్నము లో నిట్టిది యొకటున్నది గాని, ప్రథమ భాగము 75

యది విడువఁబడఁ గూడని యంత కలయికతో వెలయునది గాదు. ఆపద్య మేదన, ఇందు (డు శుచిముఖిని కొనియాడుచు నాడిన ; "సీ. శబ్దసంస్కార మెచ్చటను జాఱఁగ నీక

                               పదమైత్రి యర్థ నంపదలఁ బొదల
               దలఁ పెల్ల నక్లిష్టతను బ్రదీపితముగాఁ
                            బునరుక్తి దోషంబు పొంతఁబోక
              యా కాంక్షితస్పూర్తి యాచరించుచును శా
                             ఖా చంక్రమ క్రియఁ గడవఁ జనక
              ప్రకృతార్ధభావంబు పాదు కోనదుకుచు
                           నుపపత్తి యెందు నత్యూర్జితముగ

తే. నొకటఁ బూర్వోత్తర విరోధ మొందకుండఁ

             దత్తదవయవవాక్య తాత్పర్య భేద
            ములు మహావాక్య తాత్పర్యమునకు నొనరఁ 
               బలుక నేర్చుటబహుతపః ఫలము గాదె !”                           (ప్రభా. ఆ, 2, ప. 3)

అనునది. రెండు గ్రంథములలోని యీ రెండు పద్యములం బోల్చి చూచితి మేని నీ రెండవకృతి రచించు లోపలఁ గవి కొంతమట్టునకు శైలింగూర్చిన యభిప్రాయము మార్చినాఁడనియు c జెప్పట కవ కాశ మయ్యెడి. కళాపూర్ణోదయ పద్యముంబట్టిచూచినఁ గవి యు లంకార శాస్త్రములయెడ బహు భక్తిగలవాఁడనియు, నర్థాలంకారములు మాత్రము గాక శబ్దాలంకారములును అవశ్యాను ఫ్టేయములని భావించినట్లును, గానం బ డియో డి . ప్రభావతీ ప్రద్యుమ్న పద్యములో నలంకారశాస్త్రముం గూర్చిన విచారచిహ్న లెవ్వియును లేవు. శబ్దాలంకారములంగూర్చి కవి యువ్విళ్ళూరకపోవుటయే కాదు, అర్థాలంకారములనైన ధ్యానించినట్లు పోకడగానము. భావములు, అర్ధములు, తాత్పర్యములు, అవయ వసంయోగము మొదలగు తలఁపులతోఁ జేరిన లక్షణములమీఁద నే కాగ్రమగు దృష్టిని నిలుపుట మేలని యెంచెనేమో ! ప్రభావతీ ప్రద్యుమ్నములో చిత్రకవిత్వ మత్యల్పము. ఇంచుమించు శూన్యమును, కళాపూర్ణోదయమున నంత యెక్కువ గాకున్నను దానియందుకన్న నధికమ. ప్రబంధ ములయందుంబ లె నమితముగాదు. రసనాశ మొనరించునంత విపరీతపు వాక్సరణి యీ కవి యెంతదపసుచేసినను సాధ్యమగు వరముగాదు. ఏలన, భావ గంభీరుఁడు గాన. ప్రభావతీ ప్రద్యుమ్నము విషయమునఁ బ్రబంధసంబంధి శైలిలోగాదు. కళాపూర్ణోదయము 76 కవిత్వతత్త్వ విచారము మొత్తముమీఁద విషయమున ప్రబంధసంబంధి గాదు. శైలియం దచ్చటచ్చట నావాసనం దాల్చినదియ. మొత్తముమీఁద ననుటచే నా అవయా శ్వాసముయొక్క యంత్యభాగము మొదలు గ్రంథ సమాప్తి పర్యంతము తుచ్ఛమైన ప్రబంధ ధోరణిలో నే కారణము చేతనో వ్రాయంబడి యుంట సూచితము. సూరనార్యుని రచనా పరిణామముం జూచి రా ! అఖండ శ్లేషపూరితమైన రాఘవ పాండవీయముతో ప్రారంభించి, తుదదా (కు సరికి ప్రభావతి యందు శ్లేష కవిత్వము వచ్చునో రాదో యను నంత తక్కువ పఱచి యున్నాఁడు.

                  సూరన్న యొక్క చిత్రక విత్వము
    భారతము నత్యంతాదరముతోఁ బఠించినవాడయ్యు, కాల దోషంబుచే శబ్దచిత్రములం బ్రకటించుటకు నోర్చిన వాఁడయ్యె ననుటకు నిదర్శనముగఁ గొన్ని పద్యము లుదాహరింతము :

"సీ. విశ్రాంతి విరతిఁ గావింపక సారవ .

                            త్సాహిత్య సౌమనస్యంబు లెఱిఁగి
        సమయంబుఁ దప్పక శ్రవణ కఠోరంబు
                           లైన శబ్దముల నత్యాకులాత్మఁ
       జేయక, సత్పరిచిత సుకుమార వా
                       క్సరళితాభిప్రాయఁగా నొనర్చి
       పరగు శిధిలతఁ బాటిల్లఁగా నీక
                     యేచందములయందు నేమరిలక
తే.     పఱఁగు కవియు దోహ కరుఁడును యశము దు
        గ్దమును బడయు, నట్లు గానినాఁడు
       కృతి దురావ మొదవు కీర్తియుఁ బాలు నీ 
        కుంట గాదు, హాస్యయోగ్యఁ జేయు.”                        (కళా. ఆ. ], ప. 8)
ఇందు శ్లేష ప్రధానము.
  • సీ. క్షేపు దర్పము చివ్వి శీతాంశు రుచి నవ్వి
      పాలమున్నీటిపైఁ గాలు ద్రవ్వి'
                                                                      (కళా. ఆ. 1, ప, 76)

"సీ. మెఱుఁగుటద్దపుమించు మించుబాగులనింపు .

                             నింపచక్కనిముద్దు నెమ్మొగంబు"
                                                                     (కళా. ఆ. 1, ప. 135)  ప్రథమ భాగము 

  "క. మాయమ్మానను నీవే,
               రాయలవై కావదేవ రాజే జే జే
               మాయూతుమ లానినయది
             పాయక సంతోషమున్న పలమిలసామీ. ” (కళా. అ. 6, ప. 161)

      ప్రథమాగమా దు లు మదాశయుని  పురోహితాదుల నోడించు టకై సంస్కృతాంధ్ భాషా శ్లేషములతో నీ పద్యమును బల్కి వారిని వెగడువఱిచి రాజు నకుం దమ్ముం దెలిపి క నిరి. ఈ సందర్భము కాళిదాసుని చరిత్రచే సూచితంబు. చిత్రకవిత్వమైన నేమి ? కథా వృత్తముతో ననుసంధించినదియు ప్రధానమును గావున నిది సమంజసమే. ఇంతటC గవి విరమించి యుండిన నెంతో బాగుగ నుండె. ఇంక ను నీలాటి పద్యము వినవలయునని కళాపూర్ణుండు కుతూహలుఁడయి వీరి నడి గి నట్లు ను, ఆ రా జు యే క్క వినోదార్థముగా

“క. తా వినువారికి సరవిగ,
            భావనతో నాను నతివిభావిసు తేజా
            దేవర గౌరవ మహిమన,
           మావలసినకవిత మరిగి మాకు నధీశా. " (కళా. ఆ. 6, ప. 172)

అను  పద్యము  ప్రథమాగముండు నివేదించినట్లును వ్రాసియు న్నాఁడు. ఈ రెండవకల్పన   పనిలేని   పాండిత్య  ప్రకటనమేగాని, యప్పటి వృత్తాంతముంబట్టి సహజముగ నేర్పడిన సరసము గాదు. మఱికంధరుని తీర్థయా త్రాభివర్ణనములో నతఁడు సేవించిన క్షేత్ర ముల కనేక ములకుఁ గవి యంత్యప్రాస నియమమాపాదించి యుండు ట బమ్మెర పోతన విలాస ప్రభావమేమో !

“మ. యమునం జూచెను వీచి కాచయమునం బ్రాంచద్ఘన శ్యామతో యమునన్ సారసకై రవోచ్చయమునన్ ... ..." ఇత్యాది

                                                        (కళా. అ. 2, ప. 111)
       మఱియు రగడలేనిది రాగము గుదురదని కాఁబోలు శ్రీరామ స్తోత్రము నొకటి వ్రాసి మణికంధరుని జిహ్వకు నంటించినాఁడు. ఇట్లనేకరీతుల శబ్దచిత్రము సంఘటించి యున్నాఁడు గాని, యిది కావ్యమునకు వన్నె(దెచ్చు పద్ధతియనుట గడు సాహ సము.
                   ప్రభావతీ ప్రద్యుమ్న విమర్శనము
     ప్రభావతీ ప్రద్యుమ్నమునం దిట్టి విఱుపు ల పురూపములు. 78                 కవిత్వతత్త్వ విచారము 

మఱియు కథా ప్రారంభముననే పాత్రములను బ్ర వేశింపఁ జేయుటఁబట్టి కవియే నేరుగ మనకు బోధించుట యే మాత్రము లెదు. అట్లగుటచే వర్ణనలు పాత్రముల మూలము నఁ జేయ(బడి కథలో మిళితములై యున్నవి. చూడు cడు. మొదలెత్తగ నే

“క. శ్రీరమణీ రమణీయమ
               హెూరస్థలుఁ డచ్యుతుఁడు సమజ్జ్వల మహిమన్
               ద్వారక నుండఁ గ నొకనాఁ
               డారూఢాదరత నింద్రుఁ డవ్విభుకడకున్."

అని యింద్రకృష్ణులకు ప్రవేశముఁ గల్పించి, ఇంద్రమా తలి సంవాద రూపమున C బురవర్ణనముం జేసియున్నాఁడు. ఇంద్రుఁడు చింతాక్రాంతుఁడై యుండఁబట్టి పురవర్ణనాదులచే నతనికి మఱపుc గల్పింపఁజూచుట సారధి ధర్మమేకదా ! కావున నియ్యది ప్రబంధ ముల నెల్ల సర్వసాధారణములగు దిక్కులేని వర్ణనలకుం జేరినదిగాదు. మఱి సార్థకము.

      కథతో గాథాన్వయములేని సంగతులు ప్రభావతీ ప్రద్యుమ్నము నందు మృగ్యములు. అవయవముల సంయోగము పరస్పరతయు నిందుంబలె నాంధ్ర గ్రంథముల నెచ్చటం గానము. త్వరపడు వారికి శ్రీకృష్ణుని యజ్ఞము అక్లిష్టవృత్తాంతముగాఁ దోఁపవచ్చుఁ గాని, యదియు c గార్యసాధనమున కుపకరణ ప్రాయము. ఎట్లన, దైత్యరాజు ననుమతిఁ బొందిగాని యేరికిం జొరరానిపురము నేరీతిఁ బ్రద్యుమ్నుఁడు ప్రవేశింపఁ గలఁడని, శ్రీకృష్ణుఁడు తలపో యు చుండఁ గా నాయజ్ఞములో భద్రుఁడను నటునికిని బ్రాహ్మణ
వటువులకును వాగ్వాదము జరుగు కాలములో, వటువులు. భద్రు నుద్దేశించీ.

"సీ. ఏము మ్రుచ్చులమె యూహింప మ్రుచ్చుఁదనాల
                          పుట్టిన యిండ్లు మీ బోంట్లకాక
          యాటవాండ్రని నమ్మి యనుమతింపఁగ నెట్టి
                          పురమైన నశ్రమంబునను జొచ్చి
          పగలెల్ల నాటల బ్రమయించుచును సందు
                          గొందులెల్ల నెఱింగి కొనుచు రేలు
          కన్నగాండ్రగుచు నంగ ళ్ళు ప్రవేశించి
                          యందు నెంతటివార లడ్డమైనఁ

 ప్రథమ భాగము | 9

         తే. జక్కడఁచుచుఁ బేను గ్రుక్కిన పాటిగా
               నిష్టమైన యర్థ మెల్లఁ బడసి
               బ్రతుకుచునికి మీ స్వభావ మింతయును ద
               ప్పదు యథార్థ మనుచుఁ బలుకుటయును.”
                                                            (ప్రభా. ఆ. 1, ప. 108)

        ఆ మాటలనే తనయ పే క్ష కుత్తరంబుగ వనజాక్షుఁడు గ్రహించి తన యుపాయము సిద్ధించెఁగదా యని సంతసించి ప్రద్యుమ్నా దుల నట వేషమున వజ్రనాభపురికింబంప నిశ్చయించెను. నట వేషముననున్న ప్రద్యుమ్నుఁడు వజ్రనాభుసభలో నటించుచుఁ జేప్పిన •

"చ. సకలవిశేష శోథనకుఁ జాలినయో నెరజాణ వజ్రనా
              భకులవతంసరత్నమ ప్రభావతిరోహిత కంటకంబు తా
              వకమగు చూపునాపయి బ్రవర్ధితరాగతఁ బర్వెగాన న
              త్యకలుషవృత్తి నా సుకృతమంతయు నేఁడుసుమీ ఫలించుటల్.
       తే. నీకు నామీఁదఁగల యట్టి నెయ్యమును, మ
              హాదరము నీవు పనిచిన హంసి చెప్ప
              నాత్మలో ననవరత నాట్యప్రసంగ
              మున నిను భజించు వేడుక పునము నాకు."
                                                         (పభా. ఆ, 4, ప. 105, 106)

అను పద్యములును మఱుఁగుననుండి చూచుచున్న ప్రభావతికిఁ దనకూర్మిఁ దెలుపునట్టివ కాన కథకు ననుకూలములే. ఇట్లే యన్ని విషయములును గథానుసారము వచ్చునవియే కాని, ముగ్గురు మూఁడు లోకములైన ముసలిది యమలోక మను మాడ్కి (గథను జీల్చి చెఱుపునవిగావు.

                       భావ లోపములు
          రచనాదోషములు లేకున్నను గళాపూర్ణోదయమునకన్న నిది నికృష్టమనుటకు భావలో పములు కారణములు. ఇందులో వచ్చు స్త్రీ పురుషులు గొందఱే. అందును గృష్ణాదులు పురాణ పురుషులు. వీరి సమాచారము ప్రాఁతకథ. ఇఁక ప్రద్యుమ్ను Cడన్ననో విరహాది వేదనలకు నిదానమైన ప్రబంధపురుషుఁడే కాని యెక్కువ పరి వృత్తి గలవాఁడు గాఁడు. ఇఁక ప్రభావతియన్పనో, నాకుం జూడ నెంతయు నసహ్యురాలు ! రూపమున్నది. నాథుఁడెప్పడు వచ్చి 80                        కవిత్వతత్త్వ విచారము

పైబడునను తహతహ దట్టముగ నిండియున్నది. రూపమును గామా వేశ ముం దాల్చిన పాతివ్రత్య మున్నం జాలునా ? ఇందులోని శృంగారమనునది జావళులకుఁ దోడుపోయినది ! తండ్రికిఁ బతికిని యుద్ధము సంభవించెఁగదా ఎవరు గెల్చినను దనకు దుఃఖ మేగదా యను నాలోచన యీ పతివ్రతా శిరోమణి మనసున కేల తట్టును 2 ప్రద్యుమ్నుఁడు భార్య నుద్దేశించి 'నీ తండ్రిని జంపకున్న మన బ్రతుకు నిలుచు మార్గ మెద్దియులేదు' "ఒండొక త్రోవఁ ద్రోక్కఁగాఁ గూడద, యేమి సేయుదును ఫెూరవిచారము పు నాత్మలో" నని పలుకగా, దేవి గారు, "విభునిం దముఁ గాచికొనంగ వేఱు త్రోవ నెమ కి కా నకంతc బితృవత్సలభావముఁ బా బ్రునూ క్రిన" ద(ట ! ఈ భావము నీ మహాకావ్యమున నింతకుముం దెక్కడను జూపినది కాదు. అణుమాత్రమైనఁ దాల్చియుండె ననుటకు c జిన్నె లెవ్వి యును లేవు. మఱి యెంతో గారాబముతోఁ జూచుచుఁ, గోరిన కోర్కులెల్ల నడిగిన మాత్రన దీర్చు కన్నతండ్రి కనుగప్పి గాంధర్వ వివాహ క్రీడకుఁ జొచ్చిన కన్యామణి ! అట్లగుట నీ మెకుఁ బితృ వత్సలభావ మెక్కడిది ? ఉండెఁబో, ఎంతో భద్రముగ మన కెవరికి నెఱుఁగఁబడకుండునట్లు ఎక్కడనో పాతి పెట్టినది ! తండ్రిం గూర్చిన హృదయాందోళన మే మేని గలదా ! హిందూపతివ్రతలకు నుండరాదేమో ! మన శాస్త్ర ఘోషలలోఁ బరిచయము గలవారి నడిగి తెలిసికొనుండు. ఇట్లు ప్రభావతి మన సన్యాసులవలె తనకు లేని దాని ధైర్యముతోఁ బారనూ క్రి

“క. తాన చని మూల నున్న య
              నూన తదీయూసిఁ దెచ్చి యొసంగి గెలువుమీ
              దానవపతిఁ దక్కిన యను
              మానము మానుమని పలికె మానవతి పతిక్షా!”
                                                              (ప్రభా. ఆ, 5, ప. 198)

        అది రా ! సౌకుమార్యము, సౌమనస్యము మొదలగు కోమల గుణంబుల యుపరావతారముగదా యీ మానవతి! ఈపరమపవిత్రు రాలితో ద్రౌపదిఁ బోల్చి చూడుఁడు ! భీమసేనుఁడు కీచకవధార్థమై ప్రతిజ్ఞC జేయుచు 
      "తే.  ఎల్లీ యెల్ల విధంబుల నెందుఁజొచ్చె
            నేని, నాధర్మతనయుండు దానవచ్చి                             ప్రథమ భాగము  

81
            యడ్డపడెనేని, నీవ పెంపారు కరుణఁ
            గాచితేని నాచేఁ బడుఁ గీచకుండు."
                                                    (భా. విరా. ఆ. 2. ప. 232)

అని ద్రౌపదితో C గఠినా కరంబుగాఁ జెప్పటలో, నాపాంచాలి, తనకట్టి యువజ్ఞ సేసినను, నా సూతుఁడు కామాంధుండు గావుటఁ బశ్చాత్తాప పాత్రుండని కనికరించి క్షమించి కావ (జూ చునంత యుదారచిత్త రా లని ధ్వనిఁ గల్పించినందు న నామహాదేవికిఁ గొఱఁతఘటిల్లెనా ?

                            పాతివ్రత్యతత్త్వము
        నడవడియును వస్త్రమ మూల్యముగా కుదురవలయునన్న నొకేతరగతి పోగులు రంగులు C జేర్చినఁ జాలునా ? నానావిధములైన వర్ణములు గల తంతువులు విచిత్రరీతి నొండొంటికి వన్నె యలవడు మాడ్కి మిశ్రపఱిచినఁ గదా నాణేము సిద్ధించును ? ఈ తత్త్వము నెఱుంగమిం గాదె పతివ్రతలన్న నొక్క పతి చింత చప్ప నిం కేదియు లేని మూడు రాండ్రని భ్రమించియుండుటయు, తద్ద్వారా దేశమునకే కాదు స్త్రీలకు సైతము దైన్య కారణములైన నీతుల బోధించుటయును! ఒకానొక పతివ్రత పురుషు ఁ డెవ తెనో యొక స్త్రీని గోరిన దానిని వలపించి తే (బో యొ న ( ట ! అందుచే నా మెకు పంచభూతములను వశపరచుకొనునంత మాహాత్మ్యము సేకు తెనcట ! భార్యను దూ తిక గాఁ జేయువాఁ డెంతమాత్రపు మగవాఁడో భర్తకై యన్యస్త్రీలఁ జెరుప జూచునదియు నా మాత్రపు టాఁడు దియే ! పతియే యcట దైవము ! వేఱు దేవుఁడు, దయ్యము, దేశము, జాతి, మానము, గౌరవమును దేనిని సడ్డ సేయరాదంట ! ద్రౌపదీదేవి ఉద్యోగపర్వములోను మరి కొన్నియెడలను జేసినరీతిఁ బురుషులకు వ్యతిరిక్తముగా మాట్లాడుట మహాపాపము ! పురుషుని వాక్యము నపారి షేయమగు వేదముగా భజించుటయ శాస్త్ర విహితధర్మము, కర్మము ! ఈ దౌర్భాగ్యప్రలాప ముల మొత్తపు టర్థమేమనగా "మగవారమైన, మాకు నాఁడు వారైన మీరు బానిసలుగా నుండు ( డు. మఱి మా పనులన్ననో కారణముఁ జెప్పి న్యాయములు గౌరవ ప్రాప్తములు అని చూపఁగాదు. ఏల నన, రాష్ట్రము, స్వాతంత్ర్యముఁ గోలు పోయి దాసులమై యుండుటCబట్టి యొురు ల కను సన్నల మెలఁగవలయు నే కాని, క్షాత్రభంగిని మానము మనస్సాక్ష్యము నిరూపించిన త్రోవఁబోవ మా వలనఁగాదు. అట్లగుట మా చర్యలంగూర్చి చర్చింపకు Cడు, ఏమీయని యడుగకుఁడు, మీ రట్లు చేసితిరేని బయటనేగాదు, మూలింట (గూడ మాకు గౌర

(1 1 \ 82 కవిత్వతత్త్వ విచారము

వము దక్కదు . అందఱి యొద్దఁ దన్నులు వడి వచ్చువారము. మీరైనఁ బూజింపకున్న మా కభీమాన మబ్బు టెటు ? మేము దాసులము. మీరు మాకు దాసులైనచో దాసానుదాసు లయ్యెదరు. అనఁగా దేవసన్నిభులరు, సేవచేత దేవతలగు సూక్ష్మము ఈ కర్మ భూమిలోఁ దొలుతఁ గని పెట్టఁబడిన హాయియైన తంత్రము ! దాని లాభమంతయు ధారాళముగ మీరే యనుభవింపుఁడు !" అనుట ! పతిని దప్ప నింకేమియు స్మరింపఁగూడదఁట ! ఈ స్వరూపములనే యు వికలమగు దృష్టితోఁ జూచుచుండిన నెటువంటివారికైనఁ గనులు నిల్చునా ? ఎంతగొప్ప ప్రతాపమూర్తులైన శూరులు వీరులని వీరినే యెంచుచుండుట సాధ్యమగును ! దేశము గొప్పగానుండు TSP Go ములో స్త్రీలకు నొక కుటుంబము మీఁదనే కాదు, రాజకార్యములు, చరిత్రాది శాస్త్రములు, సైన్యములు మొదలగు మానర క్షక ప్రకృతులు ఇత్యాది లౌ క్రిక గణంబుల య0 దెల్ల శ్రద్ధాదృష్టి వాఱుచుOట సహజము. గాంధారి ద్రౌపది మొదలగు భారత స్త్రీలను, గార్టీ మైత్రేయిరా ప్రభృతులగు ఋగ్వేద యుగములోని లోకోత్తర చరిత లును, మనవారినుండియే యీ విషయమునం జూపఁదగు సాక్షులు. రాజ్యము స్వాతంత్ర్యములేని దయ్యెనేని నిల్లువిడిచి బయటికి వచ్చుటకు భయము. ఏలన, తమవారికిఁ దమ మానము రక్షించు శక్తి లేమింజేసి పౌరుషోద్ధరులైన పతులయెడ స్త్రీలకు స్వాభావికమగు తవులు మెండు. అదిలేని పతులు ఇఁక నీతిశాస్త్రములచేతనైనను దమయందు వారి హృదయములను భద్రపఱచికొందమను యుక్తిఁ బన్ని పతివ్రతాలక్షణములం బ్రకటించిరే మో ! సాహసవంతుఁడు జనముల నాకర్షించుట నీతిచేఁగాదు. మఱి ప్రకృతి చే. మఱియు, 'ಇಲ್ಲು గ్రామము కులము వీనిం దప్ప, పెఱవాని జోలి మన కేల ? అధిక ప్రసంగము లీనాళ్ళలో నపాయకరములు." "ఉడుమున కేటికయ్యా ఊరిలో పెద్దతనము !" అని యన్ని పరాక్రమములు నుడిగి గుమ్మము కచేరీలకు దిగిరేని స్త్రీలకే కాదు పురుషులకు సైతము గృహచింత దప్ప మటేమి యుండగలదు ? పాతివ్రత్య మొక్కండు దక్క స్త్రీలకే ధర్మములు కూడవను సిద్ధాంతము దేశమునఁ బురు పులు భంగమునకు లోనయి నిరాశచే నిరుద్యోగులై యుంటచే వచ్చిన చే టేగాని, బాగుగా విచ్చలవిడి వర్తించు బుషుల శాసనము గాదు. ఇది యట్లుండె.

ఒక వేళ ప్రభావతీదేవి రాక్షసరాజు కూఁతు రగుటం జేసి కఠి
           నాత్మురాలుగ నుండుట ప్రకృతి నిషిద్ధముగాదని యందు రేమో ;

ప్రథమ భాగము
                                                                                   83

ఆయమ్మ యొక్క జననవృత్తాంతమును వర్ణించుచు, నీ త్రిలోక సుందరి సామాన్యజనులను వేగిరము వేగిరముగ వక్క ముక్కలుగా సృజించు బ్రహ్మచే సృజింపCబడినది గాదనియు, సిష్కారణముగ నా త్రిపురసుందరి స్వయముగ నిదానించి చూచి సర్వసామగ్రులు గూర్చి బాగునకుఁ దెచ్చిన కన్యామణియనియుఁ గవి చెప్పియుండు టంబట్టి, యా వాద మొప్పకోదగినది గాదు.

ప్రాచీనుల మోహ తాపము

నిజము చూడఁబోయినఁ బ్రభావతీ ప్రద్యుమ్నము శైలి నొక్క దానిం దప్ప తక్కిన విషయములలో సామాన్య ప్రబంధముల మీఱి నది గాదు. కథ మిక్కిలి సన్నము. చిత్రరూపములు, దూతికలు మొదలగు మధ్యవర్తులమాటలు, వీనిచే నాకాలమువారికిఁ గామాగ్ని యున్నట్టు Cడి ప్రభవిల్లి మనసులను దేహములను దహింపఁజేయు నంత తైక్ష్యమును బహుత్వరలోఁ గాంచుట సర్వసాధారణ మే మో ! బహుశః వారెల్ల నెండిన కులో ! ఇప్ప డింగ్లీషు ముక్కలు చదువు వారు ' నేరుగాఁ జూచి మాట్లాడిననే కాని యూ దందహ్యమానత మాకుఁ బట్టువడదు' అని యా క్షేపించుటఁ జూడఁగా కాలవైప రీత్యము బోధపడియెడిని. మనది ప్రత్యక్ష మోహము. మన పెద్ద లింతకన్న ను ద్రేకముగలవారగుటంబట్టి వినిన నేచాలును ! గుప్పన మండెడివారు . వకళ్ళమూలమై పరోక్ష మోహమువారికి ప్రధానము. అయిన నాకొక సంశయము. మన పెద్దలు వేద వేదాంత వికా స భాసుర విచిత్ర చరిత్రులే ! రాగరహితులే. శమదమాది సంపత్స మే తులే ! అట్టుండియు నీయొక్క విషమసమయంబున మాత్ర మేల యింత చాంచల్యము వడసిరో తెలియcజాలము గదా ! అవ్యా జాద్భుతములలో నిదియొకటి. నిర్ణేతుక జూయమాన చిత్తవిభ్రమ మును వేదాంతవిచారమును సమ్మేళించి యుండుట యాశ్చర్యము గదా ! ఆశ్చర్యమైనను అప్రకృతమా ? కాదేవెూ ! ఎట్లన, ఇంద్రి యముల నిగ్రహింపవలయు నిగ్రహింపవలయునని జపము చేయు చుండు వారు, ఆ యింద్రియములయందే నిగాయుంతురు గాన, నదియొక విధమైన యున్మాద హేతువు. కాకున్న నందఅకన్న ముందుగ జితేంద్రియులైన మహర్డు లప్సరసలC జూచి చూడక యున్న యేల యువ్విళ్లూరు దురు ! గంతులు వేయుదురు ! మఱియు భరతఖండము క్షీణదశకు వచ్చినది మొదలు గొప్ప గొప్ప ప్రయత్నములు గొంతెమకోరికలైనందుననేమో కాని తుచ్ఛములు 82 కవిత్వతత్త్వ విచారము

వము దక్కదు. అందఱి యొద్దఁ దన్నులు వడి వచ్చువారము. మీరైనఁ బూజింపకున్న మా కభీమాన మబ్బు టెట్లు ? మేము దాసులము. మీరు మాకు దాసులైనచో దాసానుదాసు లయ్యెదరు. అనగా దేవసన్నిభులరు, సేవచేత దేవతలగు సూక్ష్మము ఈ కర్మ భూమిలోఁ దొలుతఁ గని పెట్టఁబడిన హాయియోన తంత్రము ! దాని లాభమంతయు ధారాళముగ మీరే యనుభవింపుఁడు !" అనుట ! పతిని దప్ప నింకేమియు స్మరింపఁగూడదఁట ! ఈస్వరూపములనే యవికలమగు దృష్టితోఁ జూచుచుండిన నెటువంటివారికైనఁ గనులు నిల్చునా ? ఎంతగొప్ప ప్రతాపమూర్తులైన శూరులు వీరులని వీరినే యెంచుచుండుట సాధ్యమగును ! దేశము గొప్పగానుండు కాలు ములో స్త్రీలకు నొక కుటుంబము మీఁదనే కాదు, రాజకార్యములు, చరిత్రాది శాస్త్రములు, ನಿಮಿಲು మొదలగు మానరక్షక ప్రకృతులు ఇత్యాది లౌ క్రిక గణంబుల యం దెల్ల శ్రద్ధాదృష్టి వాఱుచుంట సహజము. గాంధారి ద్రౌపది మొదలగు భారత స్త్రీలను, గార్టీ మైత్రేయి ప్రభృతులగు ఋగ్వేద యుగములోని లోకోత్తరచరిత లును, మనవారినుండియే యీ విషయమునం జూపఁదగు సాక్షులు. రాజ్యము స్వాతంత్ర్యములేని దయ్యెనేని నిల్లువిడిచి బయటికి వచ్చుటకు భయము. ఏలన, తమవారికిఁ దమ మానము రక్షించు శక్తి లేమింజేసి పౌరుషోద్ధరులైన పతులయెడ స్త్రీలకు స్వాభావికమగు తవులు మెండు. అదిలేని పతులు ఇఁక నీతిశాస్త్రములచేతనైనను దమయందు వారి హృదయములను భద్రపఱచికొందమను యుక్తిఁ బన్ని పతివ్రతాలక్షణములం బ్రకటించి రేమో ! సాహసవంతుఁడు జనముల నాకర్షించుట నీతిచేఁగాదు. మఱి ప్రకృతి చే. మఱియు, 'ಇಲ್ಲು గ్రామము కులము వీనిం దప్ప, పెఅవాని జోలి మనకేల ? అధిక ప్రసంగము లీనాళ్ళలో నపాయకరములు." "ఉడుమున కేటికయ్యా ఊరిలో పెద్దతనము !" అని యన్ని పరాక్రమములు నుడిగి గుమ్మము కచేరీలకు దిగిరేని స్త్రీలకే కాదు పురుషులకు సైతము గృహచింత దప్ప మటేమి యుండగలదు ? పాతివ్రత్య మొక్కండు దక్క స్త్రీలకే ధర్మములు కూడవను సిద్ధాంతము దేశమునఁ బురుషులు భంగమునకు లోనయి నిరాశచే నిరుద్యోగులై యుంటచే వచ్చిన చేపేగాని, బాగుగా విచ్చలవిడి వర్తించు బుషుల శాసనము గాదు. ఇది యట్లుండె.

            ఒక వేళ ప్రభావతీదేవి రాక్షసరాజు కూఁతు రగుటం జేసి కఠి
    నాత్మురాలుగ నుండుట ప్రకృతి నిషిద్ధముగాదని యందు రేమో ;                                  ప్రథమ భాగము
83

ఆయమ్మ యొక్క జననవృత్తాంతమును వర్ణించుచు, నీ త్రిలో క సుందరి సామాన్యజనులను వేగిరము వేగిరముగ వక్క ముక్కలుగా సృజించు బ్రహ్మచే సృజింపఁబడినది గాదనియు, నిష్కారణముగ నా త్రిపురసుందరి స్వయముగ నిదానించి చూచి సర్వసామగ్రులు గూర్చి బాగునకుఁ దెచ్చిన కన్యామణియనియు c గవి చెప్పియుండు టంబట్టి, యూ వాద మొప్పకో దగినది గాదు.

                              ప్రాచీనుల మోహ తాపము
               నిజము చూడఁబోయినc బ్రభావతీ ప్రద్యుమ్నము శైలి నొక్క దానిం దప్ప తక్కిన విషయములలో సామాన్య ప్రబంధముల మీఱి నది గాదు. కథ మిక్కిలి సన్నము. చిత్రరూపములు, దూతికలు మొదలగు మధ్యవర్తులమాటలు, వీనిచే నాకాలమువారికిఁ గామాగ్ని యున్నట్టు Cడి ప్రభవిల్లి మనసులను దేహములను దహింపఁజేయు నంత తైక్ష్యమును బహుత్వరలో  గాంచుట సర్వసాధారణ మేమో ! బహుశః వారెల్ల నెండిన కులో ! ఇప్ప డింగ్లీషు ముక్కలు చదువు వారు 'నేరుగాఁ జూచి మాట్లాడిననే కాని యీ దందహ్యమానత మాకుఁ బట్టువడదు' అని యాక్షేపించుటఁ జూడఁగా కాలవైప రీత్యము బోధపడియోడిని. మనది ప్రత్యక్ష మోహము. మన పెద్ద లింతకన్న ను దేక ముగలవారగుటంబట్టి వినిన నేచాలును ! గుప్పన మండెడివారు . వకళ్ళమూలమై పరోక్ష మోహమువారికి ప్రధానము. అయిన నాకొక సంశయము. మన పెద్దలు వేద వేదాంత వికా స భాసుర విచిత్ర చరిత్రులే ! రా గరహితులే. శమదమూ ది సంపత్స మేతులే ! అట్టుండియు నీయొక్క విషమ సమయంబున మాత్ర మేల యింత చాంచల్యము వడసిరో తెలియఁజాలముగదా ! అవ్యా జాద్భుతములలో నిది యోుకటి. నిర్ణేతుక జూయమాన చిత్తవిభ్రమ మును వేదాంతవిచారమును సమ్మేళించి యుండుట యాశ్చర్యము గదా ! ఆశ్చర్యమైనను అప్రకృతమా ? కాదేమో ! ఎట్లన, ఇంద్రి యముల నిగ్రహింపవలయు నిగ్రహింపవలయునని జపముచేయు చుండు వారు, ఆ యింద్రియములయందే నిగా యుంతురు గాన, నదియొక విధమైన యున్మాద హేతువు. కాకున్న నంద అకన్న ముందుగ జితేంద్రియులైన మహర్డు లప్సరసలఁ జూచి చూడక యున్న యేల యువ్విళ్లూరు దురు ! గంతులు వేయుదురు ! మఱియు భరతఖండము క్షీణదశకు వచ్చినది మొదలు గొప్ప గొప్ప ప్రయత్నములు గొంతెమకోరికలైనందుననేమో కాని తుచ్ఛములు కవిత్వతత్త్వ విచారము

స్వాత్మైక విషయములునైన సుఖములం దప్ప నింకెందును బుద్ధిపాఱుట యరుదాయెను. చిల్లరచింత లెక్కువ. కీర్తికరము లసాధ్యము లైనందున భోగములే పరమార్ధములని గణింపవలసిన వారమైతిమి. జీవితమనునది యుండఁగా కాల క్షేపము పొంటెనైనఁ బురుషార్థ మొకటి యుంచుకొనక తీఱునా ! " వ్రతముపోయె. యశస్సు పోయె! ఇంద్రియానుభవమైన దక్కనీ" యని మనకుం దెలియక మన మనసీజాడల కుపక్రమించెనో ! చూడుఁడు. ఐరోపా వారు శృంగారవర్ణన మెంతో దివ్యముగఁ జేసియున్నారు. వారు రాజసతేజులు. మనలో నాలుకంబట్టినది సత్త్వగుణము. మనసున బట్టినది తమోగుణము.

పాశ్చాత్యుల శృంగార వర్ణనము

వారియొక్కయు మన యొక్కయు శృంగారమునకు ముఖ్య తారతమ్యము లేవనగా : మన వలె వారంగవర్ణనమంతగాఁ జేయరు. చేసినను మొగము కన్నులు మొదలగు బాహిరభాగములమాత్రము ప్రశంసింతురు. మనలో నఖ శిఖపర్యంతము విప్పివిప్పి చూపుట యందఱు నాశ్రయించిన కావ్యలక్షణము. పడకటింటిలోని క్రి వెళ్ళిన వెనుకఁగూడ చెలికత్తె లా మెను వదలినను వదలుదురు గాని కవి యేమో యొుక నిముసమైన వదలఁడు. తెప్పవేయక యశ్లే చూచు చుండును. రవిగానని చోఁ గవిగాంచుట" మనలోని ముఖ్యసంప్ర దాయము. వేదాంత విద్యాదీప్తిమంతమైన యీ పుణ్యభూమిలో నీ రుచి ముదిరి యుండుటకుఁ గారణమేమన, స్త్రీలను జాగ్రత్తగ మఱుఁగున నుంచుటయే ! శీలరక్షణార్థము చేయఁబడిన యేర్పాటే యళ్లీలములకెల్ల మూలము ! ఎట్లన, నివారింపఁ బడిన దానికుండు చవి యనివారితముల కుండదు. చూడవలదన్ననే గదా యన్నింటి కైన నందము ! సమ్మోహనాస్త్రమన్న నిదే ! వలదని యడ్డగించితి మేని దానియందలి వలపు అనర్గళమగును. దమమును జెఱుచునది నిర్బంధము. నిలుపునది స్వాతంత్ర్యము. 'అతిరహస్యముఁ బట్ట బయలు’ అన్నట్లు ఎయ్యది గుప్తమో దానియందే యందఱకు దృష్టి ఇంకను బరిష్కారముగ సాంగోపాంగముగ విమర్శించి చూతమను కుతూహలము సహజము. మనదేశములో నెవతెయైన నొక స్త్రీ నాగరికత గలయది వీథిలోఁ బోవునేని, ఆ యూరివారి కన్నులన్నియు బిఱ్ఱబిగిసి యా మెపైఁబడు. మీకుఁ దెలియదా ? ఈ మర్యాదలేమి కేమి కారణ మెూ పచ్చిపచ్చి విశదవర్ణనలకును  ప్రథమ భాగము 85 నదియె కారణము. చూపునకుండు తహతహను దెరలచే నాCప వచ్చును. మనోదృష్టి మేరమీఱి చూడఁ బ్రయత్నించిన నివారక సాధనమేమి ? సౌమనస్యము. అది మనవారిలో నింకను దగినంత వృద్ధికిరామి తెల్లంబు.

      అంగముల  వర్ణించునపుడును,    ఐరోపాలోని   కవులు   ఆ                                                  యంగము   లేరీతిభావమును  బ్రదర్శించుననుటC  జూపుదురేకాని,                                            భావస్థగీతంబులుగాని   యవి   యసంభావ్యములని   వానిమాటC                                                        దలపెట్టరు.  భావములను  వెలువరించుట  ముఖనేత్రాదులకుఁగల                                                   చక్కందనమున  కాదిమమైనట్టియు హృద్యమైనట్టియు  లక్షణము.                                                    వీనిలోc గొన్నింటిమాత్ర మనుభావము లను పేర మన శాస్త్రకారులు                                                   గణీ0చి, వారాంగనల యభినయము రీతి, శిక్షమేరకు నడుపCబడు                                            త్రిప్పుటలలోఁ    జేర్చిరిగాని,    మొత్తముమీఁద   నంగవర్ణనమును                                                    మనసుతోచc గలసినట్లు చేయుశక్తి,  యీ యాధ్యాత్మిక దేశములో                                                    బ్రుంగుడువోయి యెన్నో శతాబ్దములైనవి.
      స్త్రీల  గుణగణములను శ్లాఘనతో వర్ణించుట పాశ్చాత్యుల                                                               లోని సదాచారము.  ఏలన, గుణముల గణింపక  యూకారమును                                                   మాత్రము  చూచి వలపుగొనుట యా జనములలో     నభావ్యము.                                                         స్త్రీపురుషులు ధారాళముగ నొండొరులతోచc గలసి మెలసియుందురు;                                                 కాన, రూపమునకుఁ దళుకు తక్కువ. ఇCక వలపు జనింపవలయు                                                       నన్న నడవడి, చరిత్రము,  చదువు, సద్గుణములు, కీర్తికరములగు                                        కార్యములయం  దాసక్తి   మొదలగు     నాత్మ    సంబంధములైన                                                          యోగ్యత లావశ్యకములు.  కావున నాయికా నాయకులకు    నివి                                                    యుద్దీపన విభావములగుట వీనిని వర్ణించుట శృంగార కావ్యములలో                                           ముఖ్యము.
       మనవారిలో స్త్రీలకు మనోవికాసములేనిగతి పట్టినది. కావున                                                        రూప మొక్కటియ మోహమున కాలంబనము పశుప్రాయకృత్యమే                                                 కామితార్థము. వీనికిందగిన వర్ణనలమాట చెప్పవలయునా ! ఆపా                                                     రములు.
      పురుషులు గడింప  నెంచు సాహసోద్యమములలో  సైతము                                                          స్త్రీలు తోడుపడఁగలవారని పాశ్చాత్యులనమ్మిక. ప్రకృతిశాస్త్రములు,                                            తత్త్వములు మొదలగు విద్యలC గృషి చేయుటయందును భార్యలు                                                       భర్తలతో సంగమింతురు. వారు సహాధ్యాయులైన స్నేహితు ಲట్లు                                                  నానావాంఛి తంబుల సఫలముఁ జేయఁ జూచుచుందురు గాన,                                                             శృంగార కావ్యములు శుక్రాచార్యుల రీతిని ఒంటికంటితో నొకే 86                           కవిత్వతత్త్వ విచారము

స్థలముననే తిక్కెత్తినట్లు చూచుచుండునవి గావు. హిందువులేలో స్త్రీలకుండు స్థితిని నే నేల వివరింప ? వంటిల్లు పడకటిల్లు ఈ రెంటికి వెలియైన నెందులకుం బనికి రాదు ! పురుషు లకు వారికిని దేహసాంగత్యమే కాని మనస్సాంగత్యమెక్కడిది ? వారు చేరి మాట్లాడుట యరుదు. మాట్లాడవలయునని నవీన నాగరికులు పంతము వట్టినను అన్నవస్త్ర విహారాది సరసములు దప్ప నింకేపలుకులకు వీలులేదు ! కావుననే కావ్యకన్యకలు సంభోగ విషయములందప ప నిం కే ప్రపంచము c దెలియనట్టి వారుగా నుండుట, రాజకన్యలు గావున పాపము వంటపనియుం దెలియదు. మఱి తెలిసిన దొక్కటే. ఈ దేశములోని స్త్రీలు విషయవాంఛా పూర్తికి ననుకూలములయిన పాత్రములుగఁ జూడc బడుచున్నారేకాని, పురుషులతో సమానముగ నన్నివిధముల వెలయు శక్తిగలవారు గాఁ జూడఁబడుటలేదు. ఇప్పటివారిస్థితిలో నట్లు చూచుటకును గాదు. బ్రిటిష్ వారి ప్రోత్సాహము సౌరాజ్యము వీని చే నిఁక ముందు బాగు పడుదురేమోకాని, యా యౌన్నత్యము వారధిష్టించువఱకు జీవించి యుండి సుఖించుటకు నావంటివారు మార్కండేయులుగారు 1 *

       కామమనునది పురోవృద్ధి హేతువని యూరోపియనుల భావన. ఎట్లన వరించు స్వాతంత్రముండఁబట్టి యేదేనొక హృదయాకర్షక మగు విశేషము గలిగియో నేర్చియో యున్నంగాని యే కాకులుగా జీవనము గడుపవలసినదే. కాఁబట్టి స్త్రీల మెప్పకొఱకై యెల్లరు శ్రమకోర్చి శక్త్యనుసారము గొప్పతనము నంద (జూతురు. మఱియు స్త్రీలును దెలివి తేటలఁ దే ఱినవారు గాన నట్టివారి సావాసము శ్రేయో హేతువు. ఒకానొక కవి యూదేచించినరీతి శూరుని లక్షణ మే మనఁగా.
        “తే. ఒక్క కాంతనుగోరి, మహెూద్యమములఁ                                                                               బూని సాధించుటలచేతఁ బూజ సేసి                                                                                      రాజ్యమును దైవమును భార్యరాగమడరఁ                                                                                   బ్రితులం జేయుటయు కాని వేఱుగాదు.”                (టేనిసన్)                                                                 అట్లగుట స్త్రీలమీఁది మోహము వీరకృత్యములకుఁ బ్రేరేప కము , అభ్యుదయ కారకము. హిందూ దేశములో స్త్రీలు అధః పతితలై యున్నందున వారి వెంటం బోవుట పాతాళ యాత్ర. మఱి వెంటం బోకున్నఁ దీఱదు గనుక, వారిని, విద్య, స్వాతంత్ర్యము మొదలగు
                      *గాంధీమహాత్ముని ప్రభావముచే నీ పరిణామము ఇటీవల సృష్టికి వచ్చినది. ఇందునకు దేశ సేవిక లొక దృష్టాంతము.                                           ప్రథమ భాగము                                                    ð í

దానం బుల చేత, నుత్తమ పదవికిం దెచ్చిననే కాని యీ దేశ మెన్న టికి శుభములకుఁ బాత్రంబు గాదు. ఇపుడు వేయి సంవత్సరము లుగ మన దేశములలో నుత్పన్నములగు గ్రంథములలో స్త్రీలు గొప్ప దశకు బురికొల్పు వారనుమాట తుట్రాగాలేదుగదా ! ప్రబంధముల లోని నాయికలు ‘ నామీఁద వచ్చిపడు " మనుటదప్ప నింకే యశ స్కరములగు పాటులకైన నాయుకుల ( బురికొల్పుట చూచినారా ? ఇది శుద్ధ పశుప్రాయమైన కేళి. దీనిఁ గామ మనరాదు. అన్నచోఁ బురుషార్ధమును సూచించు నా పదము చెడును ! కామినులు గార్హణీయ లనియు నికర్ష హేతువు లనియు విరక్తి వ్యాఖ్యానము లెన్నియో యున్పవి. తొలుత మగవారు మగతనము గోలుపోవుట చేఁగదా యూడువా రీ పాడుస్థితికి వచ్చిరనుట మఱచి తమ దోషములచేఁ దప్తులై, కీడ్వడినవారిని, దామే దూషించుటం జూడ, మనవారు మనుష్యులా కారా యను సంకోచము రాకమానునా ? ఇంకనైన వారిని మీఁది క్రి ( దేవలయునన్న ప్రోత్సాహ వాక్యములచే ధైర్యవతులం జేయవలయునేగాని తిట్లచే వారు ముందుకు రాc జాలుదురా ?

                         మిశ్రరసములుగాc గావ్యముల దీర్చుట మంచిది
       వట్టి శృంగారమును మాత్రము వర్ణించుట యా రసమునకు వైరస్యముఁ గలిగించుట. మనుష్య ప్రకృతి యెట్టిదనఁగా నే మార్పునుజెందక యేకరీతినియుండు వస్తువులయందు అవధానము చాలకాలము నిలుపఁజాల నియడి ! అవధానమును సుఖమును సమన్వితములు. ఎయ్యది తృప్తికర మో దానియందు మనసుంచుట సులభము, సహజమును. క్లేశకరముల మీఁద బలవంతపెట్టినను మనసు నిలకడఁ గాంచదు. భోజనపు వేళ మితముగ నేయి వేసి కొనిన రుచి, అది దప్ప వేతేమియు లేకున్నను, మఱి యమితముగ నయ్యది స్వీకరింపఁబడినను దానియందు రోయింపు జనించును, ఆరోఁతతోడ మనసును ఇతర పదార్ధము లే మే నున్నవా యని కోప ముతో నలుదెసలను భార్యను పరికించును. ఐరోపాలోని కవులు* ఈ తత్త్వము నతిక్రమింపక వ్రాసిరి. అనంగా కావ్యము లనేక
  • ఇచట నైరోపాలోని కళలఁగూర్చి చెప్పఁబడిన స్తుతియంతయు భారతాదుల రచించిన మనపూర్వులయందును జెల్లును. చెల్లనివారెవరనఁగా దేశక్షయ కాలపు హిందూకవులగు ప్రబంధకారులు. 88 కవిత్వతత్త్వ విచారము

క్రమముగఁ బోనీక రసముల మిశ్రము చేసి యన్నింటియందు నభిరుచి స్థిరముగ నెలకొను నట్లో నర్చిరి. మన శృంగార కావ్యములు ఏకరస ప్రధానములగుట నీరసములు, వెగటు , రో (త ఇత్యాది జుగుప్పారసములకు నాకరములు .

                                   నీతికి ( గ వితకు { బ్రత్యక సంబంధము లేదు
ఇట్లనుటచే నిటీవలి మన శృంగార కావ్యములు నీతి బాహ్య ములు, చెడ్డవి యని రేఁగుట కారంభించిన పరమ పార్యశుద్ధ్య ధురం ధరులలో ( జేరిన వాఁడనని యెన్నబో కుడీ ! కావ్యము, శిల్పము , నీతిశాస్త్రము గాదు. ధర్మశాస్త్ర ముఁ గాదు. శిల్పము యొక్ష యుత్తర్ష నికర్షముల నేర్పఱుప వలయునన్న దాని రచనా సంవిధానము లC బట్టి నిరూపింప నగునే గాని, భగవద్గీతలయంత పారిశుభ్య మిందులో లేదు. రామానుజ భాష్యము వలె ముక్తిదాయకము గాదు" అని వా పోవుట నిర్నిమిత్త ప్రలాపము. తుదకు గోప్యములC బచ్చిగా వర్ణించినను నీతిశాస్త్రముంబట్టి ఖండించుట తెలివితక్కువ. మఱి రసభంగమూ కాదా యనుటయే శిల్పవిమర్శనము యొక్క ఒక్క పరీక్ష. తక్కిన పరీక్ష లిట యధిక (ప సంగములు. ఆభాసములు. నాకుం జూడ ప్రబంధములయందు మనకుఁ బ్రీతిలేమి కిఁ గార ణము వా నియందు నీతిలేమి గాదు. మఱి రససCషో షకములగు స్థితిగతు లకు వెలియై , రసికుల కెల్ల నవి వైరస్యము మెండుగఁ గల్పించుట. శిల్పము యొక్క ముఖ్యోద్దేశము మనసును హరించుట. ఈ వశీకరణ శక్తి యుండినయెడ నీతి లేకున్న నే కొడు వయు లేదు. అది లేనిచో నుపనిషత్తుల నుడక ఁబెట్టి ధృతియంతయు C దీసి యందు నించినను నే ఫలమును లేదు. కావున మన భాషకు నీతి ముదురునట్లు చికిత్స, దోహదము, ప్రాయశ్చిత్తము జేయవలయునను పరమ పారిశుద్ధ్యదురంధరుల కొక దండము వెట్టి దూరముగఁ బొమ్మను టయే కర్తవ్యము . ఇష్టములేకున్న నీ గ్రంథముల వారు చదువ నేల? ఎవరు ను బతిమా లుకో లేదుగదా ! ఇంట్లో గొళ్ళెము వేసి పాపముల ( జొరనీక భద్రముగా నుండినను సరే. మఱి ధర్మోద్ధరణ క్రియకై పోలీసు వారి శరణుఁ జొచ్చిననుసరే ! మన త్రోవ మనది.
                                        కవిత దేశీయుల నడవడిక సూచకము

పాశ్చాత్యుల యొక్కయు హిందువులమగు మన యొక్కయు శృంగారవాక్యముల తారతమ్య విమర్శనముచేc దేలినవి కవిత్వ  ప్రథమ భాగము 89

తత్త్వ విషయములే కావు. మఱి కాల దేశములచే సిద్ధాంతములైన జనుల జీవితములకును గృతులకును నిత్యసంయోగ ముండుట యింక ను బ్రధానమైన యంశము. కావ్యములు ఊహా మాత్రము లనుట గొంతవఅకుఁ గాని సమగ్రముగ నిజముగాదు. ఎంత యూ హింపఁ జాలిన నేమి ? మన చుట్టు (బట్టువారల భావముల గతుల యే మాత్రమునులేని యూహలఁ జేయు మనకు సాధ్యమా o జనుల నావరించియుండు స్థితులు కొంతకుఁగొంతయేని దప్పక కావ్యదర్పణ మునఁ బ్రతిబింబింపక పోవు. కావ్యపరిశీలనము చక్కగఁ జేసితి మేని జనుల నడవడి, చరిత్రము, జీవించు విధము లును బొత్తిగా గోచరింపక పోవు. ప్రబంధములయెుక్క దౌర్భాగ్యము దేశ దౌర్భాగ్యము యొక్క ప్రతిబింబము. నిష్కారణ ముగ భాషను బట్టి పీడించిన పిచాచి గాదు.

                                                                                                                                                      ప్రభావతీదేవివర్ణనమతుచ్చము                                                                                                                                        ప్రభావతీ ప్రద్యుమ్నము నానారస శోభితంబు గాయు. ఉండు నొకరసము సైతము తగినరీతుల విలసనములు గల్గి నా నా కారముల 0 దాల్చిన మహెూత్తర మాయగా నుండమిచే విసుగు నిచ్చుచున్నది యని తోఁచెడివి. "లోకో భిన్నరుచి" నామాట నా మటుకు. ఐనను గారణములజూపుట విధి. శుచిముఖి ప్రభావతీదేవింగూర్చి ప్రద్యు

మ్పునితోఁ ඩී ෆ්ෆ దీర్ఘ ప్రసంగమం జూడుఁడు.

                            “సీ.  నెత్తమ్ములనుచుఁ గ్రున్నెలలంచు
                                  వటఫలశ్రీలంచుఁ దాబేటి చిప్పలనుచు
            అను రెండవ యా శ్వాసములోని 6 4 ప పద్యము మొదల్కొని
                             *క . ఏయంగకమును భావన
                                    చేయక వ్రాయంగరాదు చేసిననానం
                                    దాయత్తమదిఁ జొక్కు(బ 
                                     రాయత్తపు బుద్ధిఁ జెలువ నలవియెవ్రాయస్.”
                                                                                   (అను 96 వ పద్యము వఱకును)
ఇందుcగలయశ్లీల దోష మటుండ నిండు. అది మన సదా చారముల లో నొకటి. చెలువ ము శుద్ధముగలేని కుయుక్తులు నుపమాభాసములు నెన్ని ! నాభి యనునది గంభీరమైన చెఱువఁట ! నూగారు మన్మథుని చిమ్మనిఁ గ్రోవియCట ! పయ్యదయను వలలో 90                                             కవిత్వతత్త్వ విచారము

బయటఁ బోయి విహరించి వత్తమని కుచకుంభములు పక్షులరీతిఁ గొట్టుగొనుచున్నవఁట ! బొడ్డు నొక సొగసు ! అది పొన్న విరి ! ఆయమ్మయూరువులు ఏనుగు తొండములకంటె నెక్కువ ! అన్నిఁటి కైనను మీఱిన తుచ్ఛసామ్యమం జూడుడు. జంఘులు శాలిగర్భ ములు. వజ్రాల కాంతి నీళ్ళు. అందెలు మళ్ళు. మీఁగాళ్ళు కచ్ఛపములు ! బురదయే మో కవి చూపలేదు ! ఒక వేళ నీవర్ణనమే కాబోలు ! ఇట్టి బలత్కారోపములకుం బూనినచో, గాడిదె, గుఱ్ఱము, క్రోఁతి, కొంగ మొదలగు ప్రపంచకములోని యే వస్తువుతో నైన స్త్రీలచc బోల్చి వర్ణింపవచ్చుగదా ! సరే కాని నాకొక సందేహము. ఇంత విశదముగ భాగభాగమును బెదవుల చప్పరించుచు శుచిముఖి వర్ణించెఁగదా ! దాని క్రీయంగోపాంగదర్శన మెట్లబ్బెనో ! పూర్వము కన్యామణులు కోకలువిప్పి తాండవమాడుచుంట గలదా ! లేక యందఱికిని వస్త్రములను మానమును వ్యర్ధముచేయు దివ్యదృష్టి యుండెనా ? మఱియు, పింగళిసూరన్న కృతులలో పాత్రములు సాధారణముగ దీర్ఘ చర్చల జేయరు. కవి బహుచమత్కారముగ మాటమీఁద మాటవచ్చి విషయము విశదమగునట్లు సంభాషణ లేర్పఱుచును. నాటక కౌశలమని పేర్కొనఁబడిన ప్రతిభలో నిది యొక కళ. ఈ శక్తిలో నితఁడు తిక్కనతో సమానుఁడన్నను బైమాటగాదు. నిదర్శన మిక ముందు నివేదింతును. ఇంత సమర్ధు డయ్యును అంగవర్ణనా శృంగారమునకుం బూనెనేని యాశ క్తిఁ గోలు పోయినవా (డౌట యెంతయు ఁ జింతనీయము. శుచిముఖి యొక్క యుపన్యాసము ముప్పది పద్యములకన్న నెక్కువ. ఇంత సేపు బ్రద్యుమ్నుఁడు నోరు చచ్చిన జీవంబుపలె నిలుచుండుటc జూడ, అతనికే కాదు, మనకుఁగూడ నలసట ! పాత్రములను ముందు నిల్పిన పిమ్మట నెల్లరు నప్పుడప్పుడే మైనఁ జేయుచున్ననే వినోదము. ఒకరు నోరు బ్రద్దలగునట్లు మాటాడుచు తక్కినవారు కొయ్య బొమ్మలరీతిని, పల్లెటూరివాండ్రవలెను, నోరుదెరచికొని ఱెప్ప వేయక నిలువఁబడియుండిన ప్రకృతికి రసమునకు రెండిఁటికిని కీడు. సామాన్యులగు కవులలో నీ దోషము లుండిన విచారము లేదు గాని, మహా కవియు సంభాషణ రచనలలో దక్షుడునైన సూర నార్యుఁడీ లోపమున వ్రాలుట మనసుగుందించు చెడుగు .<poem>

                ప్రభావతి యొక్క కామనిర్భరత యేవంపుఁబాటుగా దోcచునే

కాని రమణీయమని యెన్పుట దుస్తరము. వచ్చిన యావేశముం జూడుఁడు.  ప్రథమ భాగము 91 ఉ. ఇట్టి మనోహరాంగుఁ డొకఁ డెందయినం గలఁడేని, కల్గియుం గట్టిగ నాకతండు బిగి కౌcగిటఁజేర్పఁగ వచ్చునేని, నే నిట్టట్టుఁ గొంకినన్ విడక యిష్ట విహారము లెల్లఁ గాంక్షఁ జే పట్టి యొనర్చునేని, రసభావము లెట్టివి యొక్కొ యత్తజిన్ !"

            (ప్రభా. ఆ.3,ప.41)                                                                                                    మఱి చెలికత్తె ప్రభావతియొక్క విరహ చిహ్నములను శుచి ముఖికిం జూపుట దిలకింపుడు.
            సీ.   నెలఁత ముక్కరయందు నీలంబుగాదు సూ
                              తెలిదళుకొత్త ముత్తియము గాని, 
             యువిద సందిళ్ళ బాహుపరులు గావు సూ
                               మితిచూడ నిడిన యూర్మికలుగాని, 
             సుదతి పాలిండ్లఁ గస్తురి నల్పు గాదు సూ 
                                 కనుదోయి కాటుక కప్పుగాని, 
                 రమణి కర్ణికల వజ్రపు దీప్తిగాదు సూ
                                 ప్రాగెంపుదునకల రంగుగాని, 
          తే.      యూర్పువేఁడిమిఁ గృశత బాష్పోదయమున 
                   గండపాండిమ దత్తత్ర్పకారములను 
                   గానఁబడియెడు నోవిహంగమ పురంద్రి 
                   యింక నీచేతనున్నదీ యింతిబ్రతుకు" 
                                                                                      (ప్రభా. ఆ. 3, ప. 87)
                చెలికత్తెలీరీతిఁ జెయి వేసి విప్పిచూపుటకోర్చెడు రాజకన్యక లెంత సుకుమారులు ! పూర్వము ఱవి కెల ధారణ మే యున్నట్టు లేదు. రాణివాసములో నే మైలయు సోఁకక పెరిగిన కన్యామణి తన భావము ప్రకటించురీతి వినుండు .
                         “సీ.   ఆ రతికిఁ గరంబు లైతిరే నవ్విభుఁ
                                              గౌగలింపఁగ నబ్బుఁగరములార !
                                ఆ యింతికిఁ గుచంబు లైతిరే నతని వ
                                             క్లోనిపీడన మబ్బుఁ గుచములార !
                                ఆ లతాంగికిఁ జెక్కులైతిరే నారమ్య
                                               శీలుచుంబన మబ్బుఁ జెక్కులార!
                                 ఆ నెలంతకు వీనులై తిరే నా కళా
                                                విదు మంతనం బబ్బు వీనులార !                92                                      కవిత్వతత్త్వ విచారము
                               తే.     యట్లుకా నోచనేల నాకైతి రకట
                                       యనిన నిజావయవంబుల కాత్మవగచు 
                                       బాల్యమునఁ దన్ను రమణ సౌభాగ్యకలిత 
                                       యనిన సాముద్రికుల మాట లరసితిట్టు.”
                                                                                    (ప్రభా. ఆ, 3, ప. 104)
            ಇట్లు అంగములంగూర్చి పలవించుట గఱికలకైనఁ దగునా ? మోహమనఁగా వీరికి దేహక్రీడయే కదా ! ఇదియాశృంగారము ! " అయ్యో ! నాకుచములారా ! మీరు ఆయమ్మను జేరియుండిన సుఖపడుదురుగదా !" యని యెవరైనఁ దలంతురా ! ఆత్మతృప్తి గోరుదురేకాని, యంగాంగములకుఁ బ్రత్యేక సుఖ మున్నదని భ్రమించివాని ప్రారబ్దమునకై విలపించు వారున్నారా? శృంగార ప్రకృతి మన కవులకు నగోచరార్థము. సుఖ మెఱుంగునది మనసు, ఇంద్రియములకు నెఱుక నహి . అవిజ్ఞానము కర్మము మొదలగు క్రియల కుపకరణములు. మనసు ప్రపంచముం దెలిసి కొనుటకు, నిచ్ఛారీతిఁ గార్యముల జేయుటకు ననువైన మార్గములు. వానికి ప్రత్యేకముగ సుఖము ననుభవించు ప్రభావము లేదు.
                           “సీ.      ఓ హంసి ! నిన్ను నేనొక్కటి తుదిమాట
                                                  యడగేద నీహృదయంబు నందుఁ
                                      గలయట్లు చెప్పమీ కల్లలాడిన నీకు
                                                    నాతోడు సుమ్ము ప్రాణసఖీ వీవు 
                                      తడయక ప్రద్యుమ్ను కడకింక నొకమాఱు
                                                      పోయి దుస్తరమైన నా యవస్థ
                                      చెప్పి చేరికఁ గొంత చేయవచ్చునొ రాదొ
                                                        యీ దురాశాపాశ మెందుఁ దెగని
                           తే.       బంధమై ప్రాణముల వెలువడఁగ నీక
                                     యాచcగి పెంచెడు మదనాగ్ని నహరహంబు 
                                     నీవు చని యవగాములు నిశ్చయించి 
                                     యూశఁ దెగఁ గోయుమదియె మత్ర్పాణరక్ష.”
                                                                                        (పభా. ఆ. 3, ప. 107)
                   వరుండు వలచివచ్చిన నుత్తమురాండ్రు సంతసింతురు . ఒడంబడుదురు. ఈ కన్యయో వాఁడు, కరుణ, పశ్చాత్తాపము వీనిమై వచ్చినను జాలుననుచున్నది ? వలపునఁ గూడ బిచ్చమడుగు                                            ప్రథమ భాగము                                                  93

రెట్టివారు ? దానితోc దుష్టిజెందువా రింకను నెట్టివారు. ఈ లసత చిత్తవికారముగాదు. మనోవిభ్రణముగాదు. ఆత్మ స్పర్శని శరీరతాపము. రోగికి మందువలె, వినికిచేతనే ప్రజ్వరిల్లు న్నెలకు నాయక సంగమమును తాపహరము. మనోహర మనుట ంకు. మన్మథుఁడు మనోభవుఁడట! దానికన్న నంగభవుఁడనుటలో ర్ధ ముత్కటము !

              “క.  అని నిజ శంకల కన్నిటి
                   కిని బరిహారములు సెప్పి గెంటక యుండఁ                                                               దనయాస నిలుప దితిసుత
                   తనయ రమణుఁ గవయ మిగులఁ గమకించు మదిన్.”
            వ.        హంసిం జూచి.
            “సీ.      నీ చెప్పినట్ల యిన్నియునైన మొదలఁ ద
                                త్పుర మెంత దవ్వి నీ వరుగుటెపుడు
                         పోయి వేళయెఱింగి పొసఁగ నవ్విభున కీ
                                  దృశమైన నా కోర్కిఁ దెలుపు టైపుడు
                         తెలిపిన నేవిప్నుములకు లోపడక నా 
                                     పై నతఁ డనుకంపఁ బూనుటెపుడు
                          పూని తా నిచటికి రానొక్క నెపమున
                                      గురునాజ్ఞ దొరకించు కొనుటయెపుడు
     తే.      వట్టి పెనుమత్సరపురాశి వజ్రనాభుఁ
               డస్మదిచ్ఛకు ననుకూలుఁ డగుటయెపుడు                                                                విరహవారిధి నేఁగడ వెళ్ళుటెప్పడు                                                                                             వలవని దురాసిలను గుమూరిలులె గాక.”
                                                                             (ప్రభా. ఆ. 3, ప. 120, 121, 122)
              ఇది గఱువతనము ! మితభాషలేని జావళీ సరసము ! కల ూం స ప్రద్యుమ్నునితో నమ్మగారి వేదనల నెంత మఱుఁగు వెట్టి నుడివెడినో యాలకింపఁడు !
"చ. కొసరక చూపుచేతఁ గడుఁగోలిన నీ చెలువంబు చెల్వమా ననమున నెంతమిక్కిలి ఘనంబుగ హత్తెనొ కాని యప్పడో రసిక శిఖావతంన ! యుదురత్నమ ! కాకరకాయ రీతీగాc గిసలయపాణి చన్నుఁగవక్రెవ గగుర్పొడిచెం బొరింబొరిన్."  94 కవిత్వతత్త్వ విచారమ

“ఉ. వావిరినెల్ల ప్రొద్దును భవత్పరిరంభణచుంబనాది నా
                   నావిధభోగలీలకు మనంబున నువ్విళులూరుచున్కి వ్రీ డావతి దెల్పెఁ గొన్ని నిశలం గనుమూసినయంతమాత్రఁబై పై విలసిల్లు కుట్టమితభావ విశేష విజృంభణంబులక్.”</poem <poem>“ఉ. కలలం గూడినవేళ నెట్టి పొలయల్కల్పుట్టెనో, యేమి నీ
                      వలనం దప్ప ఘటిల్లెనో, యెఱుఁగఁ,దత్స్వప్నాగమామర్షదవి హ్వతిత స్వాంతయుఁబోలెఁ నిద్రనెఱయకా వర్ణించెఁ బద్మాక్షి య క్లు ల హెూరాత్రములందుఁ బద్మకుముదస్పూర్తిన్విడంబించుచున్."

(ప్రభా. ఆ. 4, ప. 75, 76, 77) ఇది జావళీలకన్న నికృష్టమైన పాళయగాండ్ర శృంగారము! ಇಟ್ಟಿ యనౌచిత్యములఁ బలికిన జనబాహుళ్యమునకు వేదాంత వాదములచే నగుదానికన్న నెక్కువ విరక్తి తటస్థించును. ఇదియ సరససల్లాపమని భావించు మృగప్రాయు లింకను మనదేశమున నున్నారా ?
            ప్రభావతీదేవి కన్నెయయ్యు నారితేఱిన గణికలకృత్యముల శ్రద్ధగాఁ జేయుటయం దెంత ప్రొఢయో యీ పద్యమునఁ దెల్లం బయ్యెడిని. -
                  "సీ.కెళీ గృహంబు ముంగిట గర గరికలా
                                   లోకించు గంధాంబు సేకమరయు,                                                                నలుకు పూఁతలఁ బరిమళముఁ బరీక్షించు

రంగవల్లికల తెఱంగుఁ జూచు, నకి నల మంచంబు జాడ విమర్శించుఁ

 గుంకుమ పఱపు భంగులు గణించు,                                                                                                హెుంబట్టు తలగడ యొప్ప విచారించు
          నగరు ధూపముల సోయగములెంచు,
      తే. నలరు టోవర్లుమేల్కట్లు నంగరాగ

పూర్ణపాత్రికలును గందవొడి బరణులు జాలవల్లిక లాదిగా సముపభోగ సాధన శ్రీలు పరికించు సారెక బల.”

                                                                                  (ప్రభా. ఆ. 4, ప. 144)                             ಇಲ್ಲು భోగసాధనములెల్ల సమకూర్చి సర్వసన్నాహ సమేతు రాలయ్యు బ్రియుఁడు రాఁ గొంత దామసించినందున, మఱియొక్క విరహప్రలాపమునకు మొదలుజొచ్చి యేమనుచున్నదనఁగా.                   ప్రథమభాగము
                                                                                           95
      “క.  వత్తు నవశ్యము నేఁడని
           చిత్తము తమిరేఁచి యంతఁ జింతయొకతె పై 
           హత్తిన నదివృథ వచ్చినఁ
           బుత్తురు మగవారిమాట పొసగదు నమ్మన్.”

(ప్రభా. ఆ. 4, ప. 147) ఇట్లుత్కంఠC గోనియుండి యు శాస్త్ర ప్రకారము చంద్రోపాలంభ నము సమకూర్చిన యీ పెయొక్క మన స్ట్సెర్యమును, కవియొక్క సందర్భశుద్ధిని పొగడుటకు నాది శేషునకైన నలివియా ? పిమ్మట చంద్రునివదలి దక్షిణా నిలునిఁ బట్టినది. అటుతర్వాత నతని క్రొ క్రింత విరామ దానం బొసంగి, మన్మథునిపైకి దూ ఁకి, యూ యుల సటు చేత శాస్త్ర క్రమముగC, బ్రాణములు కంఠగతములుగాఁ గా, ఇదే చచ్చెదను జూడు ' మని "తెప్పలు దేలవైచుచు" క్రిందబడిన నొప్పి గదాయని "పూలపాన్పున వ్రాల బోవుటయు" పూర్తిగా వ్రాలలేదు! ఈ తమాషా నంతయు ప్రచ్ఛన్నరూపముతో డ్రామారీతిగాఁ జూచు చుండిన ప్రద్యుమ్నుఁడు ప్రత్యక్షమై పట్టుకొనఁగా, అమ్మకు నెక్కడలేని సిగ్గువచ్చినది. పాపము ! ప్రభావతి యెంత మంచిది! తన బాధలు దనకుండఁగా నలంకార శాస్త్రమున కే బాధ యు రా (గూడదని పరోపకారవృత్తియై, ప్రతిదూషణమును, ప్రతిదశను దప్పక యాదరించి చూసినది గదా ! వరుఁడును ఎంత ధీరో దాత్తుఁడు ! ఈ నాట్యములన్నియు ముగియువ అకుఁ దమిని బిగఁ బట్టిన యోర్పుకాఁడు ! అయ్యో ! దరిద్రమా ! అనివార్యమైన మోహమును గోఁతిఁవలె నాడింపఁజూచుట శృం గా ర మా ! వికార మా ! ఇంతటితో ఁ బోయో నా ? ప్రభావతి ముప్పది పద్యముల రోదనము శ్వాసము బిగబట్టి, పూజారులు మంత్రముల నేకరువు వెట్టినట్టు త్వరత్వరగాఁ జేయుచుండఁగా, 'ఏమమ్మా' యనియైన నడిగినఁ గాలయాపనముగదా యని యుచితమౌనముం దాల్చిన శుచిముఖీరాగవల్లరులు, వధూవరులు పడుకటింటికిం బోయిన వెనుక వెన్నాడి మధ్యస్థలములకుం జొచ్చుట మనవంటి వారికి జోఁతయనిపించును. వారెంతో దయతో నా గాంధర్వపుఁ బెండ్లి కూఁతును బిలుచుకొనివచ్చుట, బుద్ధులు గఱపుట మొదలగు వేడుకలున్నవి “తిగిచిన రాక యీడిగిలంబడిన" దఁట ! చెలికత్తె లును శాండో కుస్తీ చేసిన బలశాలినులుగావున నెట్లో తుట్టతుదకు దేవి గారిని “ఏనుగుఁ గంబా నకుఁ దెచ్చినట్లు" తెచ్చి విభునిముందఱ నిలిపి యొక చిన్న యు పన్యాసమిచ్చి వెళ్ళినారు. వెళ్ళినారని 96

                            కవిత్వతత్త్వ విచారము

తోఁచుచున్నదిగాని నిజము చెప్పలేను ! ఇవియ మనవారి రాగములు. కోమలత, మార్దవము, సౌకుమార్యము మొదలగు సౌమనస్యంబులకు వెలియైనవగుట నాగరికపుఁ జందముగలవారికి నింపుగావు. మఱి పూర్వకాలపు నవాబులు, రాజులు, పాళయ గాండ్రు మున్నగు మోటు వారికి తగియుండు నేమో. భావించు టయు బహు ప్రయాసమ. ప్రభావతీదేవి తరువాత శాస్రోక్తరీతిని బొలయలుక దాల్చగా నాయుమ (దేర్పం బ్రయత్నించి, యెంతకుఁ దేఱకున్న (నియమితకాలము నిండని దా యమ్మ తేటిన నది తప్పగదాయని ? యోజింపనంత మూడుఁడు) ప్రద్యుమ్నుఁడు నిప్లురముగా "దానవునకు నుదయించినదానవ గావున లతాంగి ! ζ) దయ చాలదు" అని, భార్యమీఁదఁ గోపము వచ్చిన నా మె ಬ್ರಿಟ್ಟು పూర్వోత్తరాల నెల్లఁ దడవి తడవి వాపోవవలయు, నను సనాతన హిందూగృహస్థధర్మము నుద్ధరించుటయు మిక్కిలి చిత్రము. ఈ పాలయల్కకు (పేరకము శ్లేష, మగఁడు ఒకయర్థము నూ నిన వాఁడై "రతీ ! భవదుత్తమరతీ !" అని ధ్యానించుచుండCగా, నందు వేజోకయర్థము గని పెట్టిన ప్రభావతి

“పట్టపు దేవియైనరతి
                      బ్రాంతినె పల్కెదవేమొ నాథ ! నే
                      గట్టిగ నారతి ప్రమదఁగాను!
                      ప్రభావతి యండ్రు నన్నిలన్ !”

అని యతనికిఁ దన పేరెత్తి చెప్పనంత కోపనయగుట సహజము. ఈ ణయకలహముచే ప్రద్యుమ్నునికి విరహవేదన రెండవ తరం గము రీతిఁ బొంగి పొరలఁగా, హంసకు దనకష్టముఁ దెలుపుచు, నా మూట గా ( బ్రాణేశ్వరితో జెప్పమని యేమని వ్రాయుచున్నాఁడు. ద్విరదగతిరగడ “ఓహంసి నీచేత

నీమోవి చిగురుఁ దేనియలు ಗ್'ಠಡಿ యూస
                    ನಿಮುಲು నవ్వవెన్నెల చలువగొను నాస
                    నీమృదు కపోల సన్నిధిని మోమిడు నాస
                    నీమోహనశ్రోణి నిమురఁగలిగెడు నాస
                    నీదు పాలిండ్ల నానెడు వక్షమను నాస
                    నీదు శృంగార కళనెలవులంటెడి యాస
                    నీదు మణితామృతమునింతుఁ జెవిననునాస.”

                                                                     (ప్రభా. ఆ, 5, ప. 152)                            
                                   ప్రథమ భాగము                                  97
          పశుకృత్యమే కామమునుట యిందుచే సువ్యక్తముగదా !మఱి  యిట్టి వ్రాఁతల నితరులకు • వ్రాయువాని మనశ్శుభ్రత యెట్టిదో ! కవి ప్రద్యుమ్ను నిట్టి నీచపాత్రముం జేయుట యాతఁడు గొల్లఁ డని యూ ?
         దోషవిచారము చాల దూరము చేసితిమి. ఇందునకుఁ గారణ ములు రెండు నిష్పక్ష పాతబుద్ధితో నారయుట విమర్శకుల ధర్మము. రెండవది కళాపూర్ణోదయము యొక్క గొప్పతనము కొలత యెత్తఁ గోరిన సాధారణ ప్రబంధములకుం దానికింగల వ్యత్యాసము ప్రకటించుట యావశ్యకము. ఇంతే కాని దోషములC జూపినందున గుణములు లేవను సన్యాయ్యాపవాదము మోపువారము గాము.
                      కావ్యములోని మంచి గుణములు
           ఎంత దక్కువ పడినను స్వభావమును బూర్తిగఁ బోగొట్టుకొన ੇ ਹੋ ? అర్లే యెన్నిలోపములున్నను సూరన తన నైజము నేల విడుచును ! ఈ కావ్యములో కొన్ని యద్భుత విశేషములున్నవి. అవి యనితర సాధ్యములు. మానవ ప్రకృతి నద్దము వలెఁ జూపించు నవి. సంభాషణములు విస్మయావహములు. నాటక ధర్మములను బోషించియున్నాఁడు. స్థాలిత్యములతో మిశ్రమైనదను చింతయే గాని నాకు గుణము మగ్నమైనదని క్షణమైన నెంచినవాఁడఁగాను. ఈ గ్రంథమున నాశ్చర్యకరమైన పాత్రము శుచిముఖి. ఈ హంసి యొక్క దిట్ట తనము, బిగువు, నేర్పు, తీcపిమాటలు, మెత్తమనసు, చమత్కారము నాహ్లాదకరములు. అనేక పాత్రములు ప్రదర్శింపC బడు స్థానముల వర్ణనలు తఱుచుగ సంభాషణ మూలముగఁ జేయC బడియున్నందున నివి పాలు పెక్కినవి. సంభాషణములనఁ గా దీర్ఘ ప్రసంగములుగావు. అవి సామాన్య ప్రబంధ కారుల విలాపములు. మఱి యిందు ( గలసి మెలసినట్లు పలుకCబడు వచనములు. మాట మీఁదు గా మాట వచ్చిన నే యందము. బడిపంతులవలె అరగంట వ్యాఖ్యానముం జేసిన నాటక సరణి చెడును. కథయందు నిరర్ధ కాంగములు మెండుగ లేవు. కల్పనయెుక్క జిగిబిగి కళాపూర్లో దయమునకన్న సాంద్రమని నా విజ్ఞప్తి. ప్రత్యేక వర్ణనలు భావ సమృద్ధములు. చూడు Cడు. ప్రద్యుమ్నుఁడు పోలో' యనఁ బ డు గుఱ్ఱపు సవారి చెండాట నాడుచుండుట కవి యెంతరమ్యముగ వర్ణించియున్నాఁడో !

خ۹ حسد سه ۶ر 98 కవిత్వతత్త్వ విచారము


    "సీ.  తొలుదొల్లనయ్యేక తురగంబు మండల                                                            గతిచారియగుచు నిక్కంబు దోఁచె                                                                                                  నావెనుకను నరూపాశ్వాలి చెదరక

చక్రాకృతిని బర్వునరణిదోఁచె నంతటననతిన్పుటావయవంబుగా

     నెనసియేకాంగ వేష్టనతఁ దోఁచెఁ                                                                                              దుదిఁ దద్విభూషణ ద్యుతిరాజి మాత్రంబు
      కొఱవి త్రిప్పినరీతి మెఱసిదోఁచె
  తె.   నంతకంతకు గతివేగ మగ్గలింప                                                                                           రాఁగవాగె యెచ్చరిక పరాకుజియ్య                                                                                          యను జనులు రిచ్చవడి తమపని మఱువఁగఁ                                                                       బరఁగునమ్మేటినెఱరౌతు ప్రొఢికతన.”
                                                                                               (ప్రభా. ఆ. 2, ప. 32)

ఇట్టి వేగము అనుభవమున లేకున్నను, ఒక వేళ నంత వేగము తటస్థించినయెడల కవి వర్ణించిన యాకృతులు గోచరించుట 'రఁకల్ రాట్నము' జూచినవారికెల్లఁ దెల్లము. అత్యుక్తియుండిన నిట్లుండ నొప్ప, శుద్ధముగ నసాధ్యమని తోఁపఁగూడదు. యపురూపములైనను భావ్యములుగనున్న స్వారస్య మెక్కువ. విరాళిపాలైన ప్రద్యుమ్నుఁడు నిర్ణేతుకములగు నుత్సాహ నిరుత్సాహ స్థితులందాల్చి లేనిపోని కారణముల నూహించుట మోహగ్రస్తులకు స్వాభావికమైనస్టితి. ఇది యీ కవి వరించినట్టూ లితరు లెవ్వరుఁజెసినజాద నాకు0 దెలియదు.విను0డూ

   "చ. శుచిముఖి మాట యోుండరసి చూడఁగ నెంతయు నాసపా టోన
         ర్చుచుమదిఁ ద్రిప్పచున్న యది, చూడ్కికి నన్ను నెపోలువాని నా
         రుచిరతరాంగి చిత్తరువ రూపొకటిన్ రహిఁజూడఁ జెప్పెఁ ద
         ద్వచనము చొప్ప నేమినియతంబు సమాకృతులెందుఁ గల్గవే."
                                                                                   (ఆ. 2-4)
   "చ. ఇది పదిలంబుగా నడుగకే నపుడక్కట కోర్కి దాఁచిన
         టిదొరతనంపు నీటు ప్రకటించితిఁ, బాపపు లజ్జ నన్ను నో
         రదిమె, ననాదరంబు తెఱఁగై యది హంసికిఁ దోఁచె నేమొ ! ని ల్వదమణియించుకైన, గఱువల్బవి గాని కథల్వచింతురే!”.

ప్రథమ భాగము 99
             ఉ. ఏనొక యించుకంత మనసిచ్చిన మాటలు పల్కకుండగాఁ 
                 గాని మరాళి యద్దనుజ కన్యకకైనను నొత్తిచూచి యే 
                 మైన ననంగఁ బూనునని యాత్మకుఁ దోఁచుచు నున్న దిప్టు, కా
                 దేని (పసంగముం దిగిచి యేల నుతించుఁ దదీయరూపమున్.    6
            మ. అటుగాకద్భుత రామణీయక గుణాఢ్యంబైన సద్వస్తువుం
                 బటు వాచార సికుల్ ప్రసంగమయినన్ బారంబుముట్టన్ రసో
                 త్కటతు జెప్పక మానఁజాల రను పక్షంబొండు భావించినన్             ఘటియిల్లున్ వనితాంగ వర్ణనకు నిక్కం బన్యధా సిద్దియున్.                          7
             చ. హరియును వాసవుండు, దము నంపిన కార్యము హంసి దానయై
                 ధరణికిడి చెప్పి మదుదగ్రమనస్థితిఁ గాంచు టెన్నగా
                 సురరిపుఁ జంప నన్ననుపు సుద్దులు వట్టఁగ బోలు నెల్లడన్  సరసిజనేత్రు దక్షిణ భుజంబవు నీవని పల్కినందునన్.                                8
             ఉ. అన్నియు నేకవాక్యముగ నారయ నాసలు వెంచుపక్ష మే
                 యున్నది కొంతమించి యిది యోజన సేయఁగ నాదురూపె యా  
                 కన్నియచేతి చిత్ర ఫలకంబున నున్నది యెవ్వరచో
                  నన్ను నెఱుంగవ్రాయననినన్ శివప్రాయుట వింటిఁజూడఁగన్.    9
              ప్రభావతీ   రాగవల్లరుల   యే కాంత గోష్టులు  బహు రమ్య   ములు.   అందఱకన్న నుత్తమపాత్రంబగు     శుచిముఖిం   బ్రశంసించి    ప్రభావతీ   ప్రద్యుమ్నుల    నింతటితో      వదలుదము .     వారును     వదలినఁ జాలునని యు త్కంఠమై    గ్రుక్కిళ్ళు      మ్రింగుచున్నారు !
                                        శుచిముఖీ చరిత్రము
   వజ్రనాభుని  పురంబులోని  విశేషంబులు  మీ రెఱింగి  తెలుపుం డని మరాళముల    నింద్రుఁడు  నియమించు  నపుడు,  ఈ హంసి కథలో  బ్రవేశించి, యతనితో  జిత్ర ఫలక    వృత్తాంతముఁ దెల్చి,     యి (క  దైత్యునకుఁ గల మాసన్నమయ్యెనని   ధైర్యము   చెప్పినది. ఆ సందర్భములో    నింద్రునితో జెప్పినట్లు    రాగవల్లరీ    ప్రభావతులకు      ప్రద్యుమ్నుని      విషయమై నడచిన సంవాదమును    నివేదించి     నది .     పిమ్మట    ప్రద్యుమ్నునికి   వలపుపట్టునట్లు     నాయకురాలిని   వర్ణించుట   పూర్వమే   తెలిపియున్నాము. అందును   బింకమును   స్త్రీ   స్వభావమును   వెల్లడి   సేయుచున్నది.   ఎట్లన,  ఈ కార్యమునకై   యేతెంచినదయ్యు   ప్రద్యుమ్నునితో "రహస్యమైనదియె  యౌ ను 
    100                                 కవిత్వతత్త్వ విచారము
  భవత్పరిపృష్ట మెంతయున్, జనక ని మే ష ముం దడయసంగతి 
  గాదును    మాకు నైన నీ, వనఁగ జనార్దనుండనఁగ నారయ భేదము 
  లేదు గావునన్, వినుపింతు" నని బిగువ బేరము గన (బ అచినది !
  మఱి కన్యామణి సౌందర్యముంగూర్చి నిమిష ము నిలువ నో పని 
  దయ్యు గంట పుడు వివరముల లెక్క ప్రకారము వినుతించియు,
    తన ప్రతిభను గొంత చెప్పనదియై
  “ఉ. ఎమ్మెయిఁ బ్రజ్ఞ మీఱ వచియించెదనన్న వచింపలేన య
       క్కొమ్మ బెడంగులోన నొక కోటితమాంశమునైన, నంత మా 
       త్రమ్మ మదు క్తిశక్తి యనరా దతివాజ్మహిమాఢ్యనేను, మా 
       యమ్మ సరస్వతీసతి తనంతటిదానిగ నన్ను దిద్దుటన్.”
  “చ. నలినజురా వాస మొుక నాఁడు ననుం దనచేతి ప్రోదిరా
       చిలుకను వాదుకుం గవితఁ జెప్పఁగఁ దా నియమించి యందునా 
        పలుకులఁ గొంతవాసిగని భావమునంగడు మెచ్చుచున్న ఖాం 
         చలమున నాదురెక్కలను చక్కఁగ దువ్వచు గారవింపుచున్."
   చ. ప్రబలములైన కౌతుక కృపారస వత్సలతాదరంబులని
       శబలితచిత్తయై యపుడు నా కుపమాతిశయోక్తి కామధే 
       ను బిరుదమిచ్చి తల్లిఖితనూపురమున్ భువనైక మాతయు 
       య్యబల మదంఘ్రుఁదా దొడిగె నాటిరుదు బదిచూడుమేర్పడన్.
                                                           {ప్రభా. ఆ. 2, ప. 90,92,97)
       అని  విడిచి  బిరుదమునకు  దర్శన  ప్రాయ   వాక్యములాడినది !  అన్నింటికైనను  సొగసైన  ఘట్టము  ప్రభావతీ  శుచిముఖుల    వాగ్యుద్ధము. తన రహస్యము  ప్రకాశముగచేయక  ప్రద్యుమ్నుని  పృత్తాం  తముఁ దెలిసికొన వలయునని   ప్రభావతియు,   ఆగుట్టు   దీసికాని    యాపెకోర్కి   నెరవేర్చగూడదని హంసియు ,  నొండో రు లం జఆలిచి  మల్లయుద్ధ   నైపుణింజూపుట (అనఁగా మాటల మాత్రము)    యుత్త    మోత్తమ    ప్రదర్శనములలో   గణ్యము.   స్త్రీ   స్వభాపము నెంత    నేర్పుతోఁ   గనుపఱచుచున్నాఁడు,   ఆ ఘట్టమునంతయు  జదివినఁ      గాని   దాని    చవిగ్రోలలేము.
       (మూఁడవ యాశ్వానము 44 వ పద్యము మొదలు 75 వ పద్యమువఱకు)
         క.  ఇటు  గాక  లోకముల  నిం
              తటిచెలువుఁడు గలఁడె గలిగినను నుబ్చెద యి                                      ప్రథమ భాగము                      101
             చ్చట నచ్చట గలఁ డని య
             క్కట నన్నిట్లేచు టంబకరుణ తెరంగె.
         సీ. అని పల్కు పలుకు నాయవనరంబనఁ దత్స
                           మీపంబునం దనురూపవతిని 
             శుచిముఖి సంచరించుచు విని యిత్తన్వి
                           చిత్తంబు వడసి యేఁ జెలిమికలిమి 
             హత్తిచుకొనుటకు  సనుగుణం  బగు వేళ
                            యిదియ యటంచు నూహించి మదిని 
             దగునుపాయంబు వితర్కించి యపుడు య
                            దృచ్ఛనవోలె నా తెఱవయోుదుట
         తే. నడ్డముగ నల్లనల్లన యరుగుచు నవి
              మర్శదృష్టిచేఁ బలుమఱు మరలి మరలి 
              చిత్ర ఫలకంబు వంకవీక్షించెఁ గొంత 
              సరిగడచుదాక నొకవింతసరణి మీఱ.
         క. అపు డమ్మరాళి చందం
             బుపలక్షించుచుఁ గపోలయుగ్మము దరహా 
             సపుఁ కాంతిఁ దనరఁగా నా 
             చపలేక్షణ తనదు ప్రాణ సఖి కిట్లనియెన్. 
         క. కఱదులపులుఁ  గిది   తానే 
             మెఱుఁగునోకో తిరిగి తిరిగియినా ఫలకముపైఁ
             బఱపెడుఁ   జూడ్కుల   నా  నా
               మెఱుఁగుంబోఁడికి మరాళి మృదుమథురోక్తిన్.
   వ.   ఇట్లనియె .   నోపడంతి  నీపలికినట్లు మా యట్టితిర్యగ్డంతువు లేమియు   నెఱుంగమి యథార్థంబయైనను నేను నీచేత చిత్ర ఫలకం బబ్రపడి చూచు టకుం గారణంబు వినుము. మున్నొక్కచోట నొక్కపురుషుం జూచి తత్సమాన రూపునిమఱి యెందునుం గానక యిప్ప డిందు నతని కైవడి దోఁచిన నిది తదీయ రూపంబెఱింగి వ్రాసిన తెఱంగో యటు గాక యట్టివాఁడె వేళొక్కఁ డెక్కడనైనం గలిగెనోయని యించుక విమర్శించి వీక్షించితి నన విని ప్రభావతి యద్భుత ప్రమోదసందేహంబులు డెందంబునం గ్రందుకొనుచుఁ గందPంప నప్పలుఁగుందప్పక చూచి యిట్లనియె.
  శా.  ఏ మేమీ యిఁక నొక్కమాటు చెపుమా యీ వున్న రూపిట్లయో 
         యేమైనం గలదో విభేద మిట రమ్మీ క్షింపు మింకన్ వచ 102               కవిత్వతత్త్వ విచారము
             స్సామర్థ్యం బరయన్ మహాత్మవని యన్మద్బుద్ధికిం దోచె దా
             హా మూభావము గానలేవె మదిలో హంసీ భయం బేటికిన్
        వ . ఆనిన  నది  మదిరాక్షి  నీక్షించి  యిట్లనియె.
        క. నీవనినయట్ల యేను భ
            యావహులను గానివారి నాకృతిన కనం
            గా వలఁతినైనఁ బిలువక
           యే వెట్టినె చేర నిరువు రేకత మాడన్.
    వ. అనిన వెఱఁగంది యా యిందుముఖి సఖియునుం దానును నొండొరుల మొగంబులు చూచి నగుచుఁ జెవులకుం జవులు మివుల నలవరించి గులుకు టెలుంగుగల కలికిపలులకె వలచిమొలచు కుతుకంబున నతివశంవద హృదయలై తమకిద్దఱకుం దాని పెద్దబుద్ధులు సుద్దులు ముద్దు రప్పించుచుం దద్దయు నుద్దీపిత రాగంబు లగుచుండు రాగవల్లరి యాగఱువతనంబులాగు లేగరితలందును మున్నుకన్న విన్చయవియె దీనికఱుదు లెంత యరుదులు. చూచితే యంచు నాయంచపై నాదరాహ్లాద మేదురనిరీక్షణంబుల నీక్షించి యోపక్షికులభూషణంబ నీభాషణంబు నిక్కంబ మిక్కిలి నక్కఱపడి వేఁడక పోడలగుగఱువ లిరువు రేకాంతమాడుచోటి కేటికిఁ బోయెద రిది యట్లుగాదు గదా యేమొక్క సందియంబు నివర్తించుకొనఁగోరి యిత్తటి నత్యంత ప్రార్ధ నంబు గావించుచున్నవారము గావున నీ కన్న యప్పరుషుని యొప్ప నిప్పలకపై వ్రాసినరూపంబు చొప్ప నొక్కటియగునో కాదో యీ దండకు వచ్చి నిచ్చలంబుగాఁ జూచి నిశ్చయించి చెప్ప మిప్పడుచు నేను నిట్టివాఁడెందును లేఁడుకలఁడను వివాదంబునం బన్పిదంబు చఱచినవారము.
           క. అనుటయుఁ బందెము కొఱకై
               నను వేజోకపనికి నైన నా కది తెలియం
               బని గలదె మీకు నాచే 
               వినవలసినయర్థ మరసి వినిపింతుఁ దగన్.
          తే. అనుచు శుచిముఖి తనమాట కాపడంతు
              లీక్షితాన్యోన్యవదనలై యెంతదూర 
              మరుగుచున్నది దీనివాక్యాశయ మని 
              మివల వెఱఁగందఁ గొంత చేరువకుఁ బోయి.
          క. సవిమర్శదృష్టి నాటిత
              కవిధాన మొకింత నడపి కడుఁ బదిలముగా
              వివరింప నతనిరూపము
              యవు నౌ నదీ యిందు నందియము లేదనియెన్.       
                          ప్రథమ భాగము                                  103


           చ.  అనుటయు రాగవల్లరి మహత్తర మోద విశేషసంభ్రమం 
                బునఁ బఆ9తెంచి యప్పలుఁగు ముద్దియ, దద్దయు ముదు గౌరవం 
                బును జిగురొత్త నెత్తుకొని పోయి ప్రభావతిదండఁ బెట్టి యొు 
                య్యనఁ గొనగోళ్ళ దత్తనురుహంబులు దువ్వచుఁ గూర్మి నిట్లనున్.

          ఉ.  అంచవు గావు నీవు నను నారసిప్రోవఁగ మూర్తిమత్వమం 
               గాంచిన భాగ్యదేవతవు గాని మదు క్తి తెఱంగు నేఁడు గె
              ల్పించితివే జగంబునను లేఁడిటువంటి మనోహరాంగకుం
             డంచుఁ గలంచు నిజ్జలరుహానన మానక నా దుచిత్తమున్.
          వ. అసిన విని ప్రభావతి నిజవయస్యం జనాచి.

          తే.  రాగవల్లరి నీ వేల వేగిరించె
               దింతమాత్రంబ చాలునే యీప్సితార్థ
               సిద్ధి కతనిలక్షణము లీచిత్రమూర్తి 
               యందు నేమైనఁ గల వేమొ యడుగవలయు.
          వ.  అనిన విని యాహంసి యాచిత్రరూపంబు నిరూపించి   ప్రభావతి ఉద్దేశించి    యిట్లనియె.

          ఉ. ఆరయ నింక నే మడిగె దల్లవె యాతఁడు శంబరుం ద్రిలో 
              కారిన ద్రుంచునప్పటి ప్రహారక్షిణంబు లురంబునందు నా
              హా రతికంక వాంకములు నల్లవిగో మెడయందు వీరశృం
              గారకళాఢ్యు నిట్లతని గట్టిగ నెవ్వ రేరెంగి    వ్రాసిరో.
         వ. ఈ లక్షణ కథనంబుచేత నతనినామజాత్యాదు లత్యంత సుపృసిద్ధంబులు   మీరు మీయంతనె యొరింగెదరు గావలయు నంతఃపురవాసినిలు గావున నెఱుంగరో యుని యొకింగించెద నంటినేని.
        చ.ఎనయఁగ నెవ్వ రెంతమన సిచ్చివచించిరి తాను వారితోఁ 
           బనుపడ నంతమాత్ర ప్రతిభాషణ మాడుట యుక్తమండ్రు మీ 
           కొనరఁగఁ బన్నిదంపు గెలుపోటలు దీర్పఁగ నిప్పడేను జె 
           ప్పినదియ చాలు నింకఁ దలపెట్టుట చెల్లద యెక్కుడేమియున్.
       తే. నీవ కద ప్రభావతి యన నిన్ను మున్న 
           తరుది నే వింటి, రాగవల్లరియో బోటి
           పేరు నీ విప్ప డన వింటి మీరిరువురు
           నీ యెఱుక మఱచెదరు నూ పోయివత్తు.  104                                                కవిత్వతత్త్వ విచారము
      ఉత్సాహ. అనుచు గగనభాగమునకు నంచ యొగయఁ జూచినన్
                  దనుజకన్య కాలలామ తనదు రెండుచేతులన్ 
                  వినయ మొప్పఁ బొదుగఁ బట్టి వేనవేలు భంగులన్
                  దనరఁ బ్రియము జెప్పచును ముదం బెలర్ప నిట్లనున్   
        సి.  నిద్దంపుఁబండువెన్నెలగాయు తెక్కల
                             యొప్ప చూడఁగ నొక్కయుత్సవంబు 
             మెఱుఁగుఁదీగెలబాగు మించు పక్షాంత హా
                              టకరేఖ లరయ నొందొక ప్రియంబుఁ 
             గమనీయ మగు మహాగమనగాంభీర్యాది
                              విలసనం బీక్షింప వేతెయింపు 
            మాధుర్యధుర్యకోమల వచనామృతం
                                 బనుభవింపఁగఁ గౌతు కాంతరంబుఁ
        తే. గలుగఁ జేయుచు నువ్విళ్ళు గొలుపునీదు 
            సంగతి యొకింత గని యెట్లు జారవిడుతు 
            నింక రాగవల్లరి పేరు నీవు నిజము 
            ననగ నీతో నొనర్తు నెయ్యంపుఁజెలిమి.
       అ.  ప్రణయ మొప్ప మిగులఁ బ్రార్ధించుచున్నట్టి
            నన్ననుగ్రహించి    నాదుచెలిమి 
             కొడఁబడంగవలయు నోహంసభామినీ
             యనుచు వేఁడుకొనఁగ నంచ పలికె.
       ఉ.  ఇప్పడు నీవు చెల్మికిని హేతువుగాఁగ గణించినట్టి నా
            యొప్పను గిప్పఁ దా నెచట నుండు రహస్యవిచారవిప్ను  మౌ
            టెప్పడు నీకుఁ దోఁచె నపు డింతయు రోసెదు దీనిచేత మీ 
            యిప్పటిమంతనంపుఁబని యేమఱ కంపుఁడు పోయివచ్చెదన్.
       వ.  అనిన విని రాగవల్లరి హంసీమతల్లికం జూచి యిట్లనియె.
       క.   పోయెదఁ బోయెద నం చి 
            బ్లోయంచలతల్లి యేల యుడ్డాడింపన్ 
            మా యే కాంతపుఁబనికిని
             నీయునికి విరోధిగాదు నిర్వాహకమున్.

వ. ఇదే నిమిత్తంబుగా సంఖ్యంబు గావలయునని ప్రార్థించెదము గాని కేవలంబైన తాపక రామణీయకంబుననకాదు. నీదుపలుకుం దెరువులు పరికింప నిది నీవును దెలియుట విస్పష్టంబ రైనను శుద్ధాంతస్థితి దోషంబునం ప్రథమ భాగము 105

జేసి యేమయియీ మాట మాటు పెట్టక గొబ్బునం జెప్ప నేర కున్నవారము చెప్పి వేఁడికొనక యే పనికిని నీవు చొరమి మొదలన పదిలంబుగాఁ దెలిపిన దానవు గావున.

ఉ. వట్టిమఱుంగుఁ బెట్టి నుడువం బని లే దది యెల్ల భేరి జో
కొట్టుట కాకని నైలువఁ గూడునె మాటల నీవు గంటి న
న్నట్టిశుభాంగుఁ డీరమణియానల కాస్పద మిప్పు డాతని
టిగ నన్వయాది కథనంబున దెల్పి యనుగ్రహింపవే.

తే. ఇప్పడిది చెప్ప కెడ సేయు టీలతాంగి
బ్రాణసంకటపఱుచు టోపక్షిరమణి
 కావునను గానవలయు శీఘ్రంబ చెప్పి
వెనుక నెఱిఁగింతు నీకు మావృత్తమెల్ల.

వ. అనిన శుచిముఖి వచనవక్రత చాలించి యిట్లనియె.

ఉ. అంతిపురంబుకన్యలఁట యాత్మ తెఱం గభిథాప్రయుక్తి నొ
క్కింతయు నేర్పరింపరట యిట్లన నిట్లని నాకు నాకె య
 ర్ధాంతరము ల్గడించుకొని యంజక యెట్లు యువస్తుతుల్ ప్రపం
 చింతు నటంచు నుంటి నికఁ జెప్పెద మీరలు గుట్టుదెల్పుటన్.

ఈ భాగము కవి వ్రాసినదియా ? స్వభావసిద్ధమా ? స్వభావ మును మఱపింపఁ జేయునట్టి శిల్పమ. శిల్పముగాని యన్యము కృత్రిమము . ప్రకృతి ననుసరింపనిచోఁ గళకు సత్యమురాదు. మఱి యనుసరించుటఁ దప్ప నింకేవిషయములేకున్న సత్యమున్నను సొగసుండదు. అనుసరించినట్టేపోవుచుఁ గ్రమక్రమముగ మీఱి మెఱయుట కళాసామ్రాజ్యము. ఒకానొకరు చెప్పిన రీతి, ప్రకృతి యా కారము. ఆ యూకారమును చక్కఁగా నలంకరించి మెఱుఁగు పెట్టినరీతిని తగిన విషయముల సంగతిని బొదిగి సజీవమై లేచి వచ్చునట్లు చేసిన నయ్యది కళ. ఈ భాగము దివ్యము. పాము జాడ పామునకు గుర్తు. స్త్రీల జాడ స్త్రీల కే యెఱుక. శుచిముఖి యొక్క బిగువు బింకములు పొడుపుమాటలు, యుక్తులు వర్ణింపఁదరమా ? ప్రభావతిని బొమ్మరీతి నాడించునామె వాచాలత స్తుత్యతీతము.

కల్పనా స్ఖాలిత్యములు

           కల్పనయందు నీ కావ్యము నిర్దుష్టమని యంటిమి . అమ్మాటకు

బాధకము లొండు రెండు గన్పట్టెడి. సునాభుని కూఁతులకు గదసాంబులు పతులగుదురని నారదు లా శీర్వదించి పోcగా. 106 కవిత్వతత్త్వ విచారము

నాకన్యలు "ఎక్కడిద్వారక, ఎక్కడి గద సాంబు లిదివిన్నఁ బెను చేటు స్వామి చేత, నసురులకుఁ బగవీడఁట యాపురంబు" అని. యాశీర్వాద బలముచే వెల్లివిరిసిన తమి "భోగయోగ్యమగు ప్రాయము" నకు మున్నే తమ్ముఁ దొందర పెట్టఁ జాలఁ బరిత పించిరట ! ఋషుల యాదేశము విన్నమాత్రన మనసు చెప్పిన దిక్కునకుఁ ద్రిప్పుట, మనవారి సాధుగుణ మును వినయమును జూపు చిత్రమే మో ! భోగయోగ్యమగు ప్రాయము కుదరక మును పే పతిచింతందాల్చు సామర్థ్యము గలవా రౌ ట గాcబోలు, బాల్య వివాహములకు నిజమైన నిదానము ! ఈ విషయము లటుండ నిండు. ద్వారకాపురిలోని గదసాంబు లంగూర్చి సునాభుని కూఁతు లకుఁ దెలిసిన యా మాత్రము వారియక్క గారైన ప్రభావతికిఁ దెలియక పో నేల ? ప్రద్యుమ్నుఁడు భర్తయని యెఱింగియు దిక్కు లేని పక్షి రీతి నా పె రోదనముఁ జేయుట కృత్రిమ ముగ్ధత్వమా ? మఱియు , కృష్ణుఁడు అనామ ధేయు Cడు గా (డు. దనుజ శత్రువు ! అట్లగుట న తనియు నతని యింటివారియు సంగతులు గడు రహస్యములుగానుండునా ? అందును ముఖ్యముగా విరోధుల యిండ్లలో ! అందును ఇంద్రునిపై దండెత్తి గెల్చిన వజ్రనాభుని పురిలోను, గృహములోను ! వజ్రనాభుని పురింజొచ్చు నుపాయమునకు సూచక ముగ నుంటయ భద్రుని చరిత్రము యొక్క ముఖ్యోద్దేశము. ఉపా యాంతరము లున్నయెడల నీచరిత్రంబు వ్యర్ధంబగును. క్రా న నితరములగు వెరవులు సాధ్యములని కవి కనఁబ అచియుండుట గొప్ప పొరబాటు. కథ యొక్క కూర్పు బిగి తప్పిన దనుటకుఁ దార్కాణములు.

“తే, అప్పడు ప్రభావతికి నొక్కయతివ విరులు
గొనుచుఁ బోవంగ నందు నింపునఁ జరించు
 తేఁటిగమిలోనఁ దానొక్క తేఁటియగుచు
 నేగె మాయామనుండు రతీశ్వరుండు.”

(ప్రభా. ఆ. 4, 127)

తేటియైనవాఁడు హంస యేల కాఁ గూడదు ! ఆ పురిఁ బ్ర వే శము హంసలకు సుగమము. అవి వాలాయముం బోవుచు వచ్చు చుండునవి. ప్రథమ భాగము 107

చ. తడవులఁ బట్టియేము సతతంబును బోదుము వాని వీటికిన్
గడుమతి చాలమిం గడుపు గక్కుణితి న్సురలోకనాథ

(ప్రభా. ఆ. 1, ప. 118)

అని శుచిముఖి యింద్రునితో నివేదించి యతని కొఅకై వేగుపని నడపుట కొప్పకొన్నది. కావున "మాయాఘనుఁడు రతీశ్వరుండు" భద్ర వేషముఁ దాల్చినది చూడఁగా "గోటితోఁ బోవుదానికి గొడ్డలి తెచ్చినట్లు !" సునాభుని తనయులకు నీప్సితసిద్ధికిఁ గారణము చిలుక రాయబారము. ఇంతే కాదు. వజ్రనాభుఁడు ప్రాణములతో నుండఁగానే

"శా. ... ••• ••• ••• ••• ••• ... ... ... సంగ్రామవృ
 త్తాంతంబుల్ విని తార్జ్య వాహనుఁడు చక్రాద్యాయుధ ప్రోల్లన
త్కాంతిక్రాంతదిగంతరుండయి వడిన్ దావచ్చె నచ్చోటికిన్.

(ప్రభా. ఆ. 6, ప. 212)

సమూ రాధనకు బ్రాహ్మణులవలెఁ దండోపతండములుగా నింకెందఱు వచ్చిరో ఇఁక వజ్రనాభుని పురమన్ననో "తపమున బ్రహ్మC బ్రసన్నుఁజేసి, మేరువు పొంత మారుతా తపములకు న్నిజాను మతిఁ దక్కC బ్ర వేశ మొనర్చరానిది" గా నతనిచే నిర్మింపఁ బడినది ! అనుమతిలేక కృష్ణుఁ డిప్పుడు చొచ్చినట్లు ఇCక గొంత ముందుగా వచ్చియుండిన నెవరైనఁ దలఁ దీసియుందురా ? విష్ణువు యొక్క మహాత్మ్యమున కతిశయము c గల్పఁబోయి, బ్రహ్మ సంకల్పమునకు కథాకల్పనమునకును విచ్ఛేదముఁ దెచ్చి పెట్టి కొని యుండుట మంచిబేరము గాదు. మఱియు ప్రభావతియొక్క గది నుండి తన విడిది వఱకు రాకపోకలు నిర్విఘ్నముగ నెఅ వేఱుటకై ప్రద్యుమ్నుఁడు భూవివరమొకటి గల్పించెనఁట ! ఇదియు నిరర్ధక శ్రమము. కాకి, పిల్లి, ఎలుక ఇత్యాది గృహజంతువుల రూపముం దాల్చి యథేచ్ఛముగ నేల సంచరింపరాదు ? ఈ కావ్యములో నొక్క కామము చేతనే గాదు, ఊరకయు నిట్టి చిత్ర భ్రమ లప్ప డప్పడు గల్గుచుండున ఈ గ్రంథములో జాతీయములు లోకోక్తులును విశేషముగా వాడఁబడియున్నవి. సంఖ్యయందకాక గుణమునందును నవి గొప్పలు. కాని అతికిఁబోయిన నెగ్గు తప్ప' దనుట నీరీతి శైలి నుండియుఁ జూపవచ్చును. ఈ యుపమానముం జూడుఁడు ! ప్రభావతీ దేవియొక్క సౌందర్యమును ప్రద్యుమ్నునికి 10.8 కవిత్వతత్త్వ విచారము

శుచిముఖి వాగ్దర్పంబున విప్పి చూపుటలో

"చ. కొనరక చూపుచేతఁ గడు గ్రోలిన నిచెలువంబు చెల్వమా
నసమున నెంత మిక్కిలి పునంబుగ హత్తెనొ కాని యప్ప డో
రసిక శిఖావతంన యదురత్నమ కాకరకాయ రీతిగాఁ
 గిసలయపాణి చన్నుఁగవ క్రేవ గగుర్పొడిచెం బొరింజౌరిన్."

'కా కరకాయ' యు (ట ! ఎండు జిల్లెడు కాయ యున రాదా ! పంతముఁబట్టి యే పైన గుణములు బలాత్కారముగ లాగివేయఁ జూచినచో విఱుపులు తప్పవు.

ఈ కథలోనుండు పక్షులకు వంశమూలములైన పాత్రములు కళాపూర్ణోదయములోని చిలుకలు. ఈ విషయమునందును ప్రభావతీ ప్రద్యుమ్నము తత్పూర్వగ్రంథము ననుసరించియున్నది. సరస్వతీ దేవి చిలుక యు , ఇంద్రుఁడు రంభ తో మణికంధరుని తపో భంగ విషయమైన సందేశము నానతిచ్చిన విధంబును గల భాషిణితో దెలుపు చిలుక యు, శుచిముఖికిని, సునాభుని సుతలకు దూతిక యైన క్షీరమునకును గొలము సాములు. ఈ కవికి బక్షులయం దాదరము ఎక్కువ కాcబోలు !

తుచ్ఛ శృంగారములకుఁ గారణములు మన యునాచారములు

ప్రభావతీ ప్రద్యుమ్నములోని దోషములంగూర్చిన ప్రస్తావము మనసు గట్టిచేసి యెట్లో చేసితిమిగాన, కవిపరమైన ప్రతివాదము లును ఇట సమర్పింపంబూనుట సహజమును సంతోషకరమునైన ధర్మము . శృంగారరసవిషయములగు నా భాసములకుఁ గవి కాదు ఉత్తరవాది. మఱియట్టి యనిష్టములే యింద్రభోగములని రోతఁ జెందక గ్రహించు మన సంఘము ! భావనాశక్తి యెంత యుద్ధురమై యుండిననేమి ? హనుమంతుఁడు సముద్రము దాఁటఁ జాలినను దన నీడఁ దా దాఁటఁ జాలునా ? అట్లే , తన యావజ్జీవము నెట్టి స్థితిగతుల నడుచునో వాని సాంగత్య మేమాత్రములేని తలంపులను దెచ్చుట తరముమీఱిన కోరిక. ఇందులకు మతతత్త్వములనుండియే ప్రబలప్రమాణములఁ జూపవచ్చును. దేవలోక మననేమి ? ఈ లోకములోని సుఖములు లభించుటకు నాస్పదమైన పదవియే కదా! అనఁగా నీ లోకములోని దుఃఖములు నిర్మూలింపఁ బడినట్టును సుఖములు అమేయములైనట్లును భావించిన దేవలోక మేర్పడును. పర మనునది యిహముచే సృజింపఁ బడిన ప్రతిబింబ మేగాని ప్రథమ భాగము 109

యన్యముగాదు. యౌవనము మంచిది. ముదిమి చెడ్డది. అట్లగుటచే దేవతలు నిత్యయౌవనులనియు, మనము యజ్ఞములఁ జేసిన నిత్య యౌవనుల మగుదుమనియు మనుజుఁడు పేరాశచే నెంచు చున్నాఁడు . నిత్యయౌ వనమున్న రంభ లుండవలయు. లేనిచో నది నిష్ఫలము. ఈ రీతి నైహికముల ననుసరించి యీ ప్రపంచమున మనకు C గల సుఖములు, ఆశలు అను సామగ్రితోఁ గట్టCబడిన మాయా లోకములే వైకుంఠము, కైలాసము మొదలగు పరమ పదవులు. తుదకు దేవునినైననుసరే, మనుషులం బోనివానిగా నూహించుచున్నామే గాని, యతఁ డతీతుఁడని నోటిమాటయున్నను భావమున నట్టి Cడుగా సాక్షాత్తరింపఁజేయుట యసాధ్యము. అతనికి వేయిచేతులున్నవని సిద్ధాంతముండెఁబో ! వేయి మనదిగాకున్నను చేతులను వస్తువులు మన వేగదా ! మన యొక్క యంగములు, ప్రాణము, మనసు వీనితో నే మాత్రము సాదృశ్యములేని భగవంతు నొకనిఁ గల్పించి స్మరించుట యలవియా ? యోజింపుఁడు ! అట్లగుటC గా వ్యవర్ణనములును అనుభవబద్ధములగు పేమి వింత ! అవి యీ లోకములోని రసములను ప్రకటింపఁజేయు కృతులు. కావున సంఘములో నుండు సౌరభ మో దుర్గంధమో వానియందును బర్వియుండుట నైజము . అనివార్యము. రాజకన్యకయయ్యు, దేవేంద్రుని జయించినవాని కూఁతురయ్యు ప్రభావతీదేవి పచ్చిపచ్చి కూఁతలఁ దన మధురమైన నోటితోఁ బ్రేలుట మనకుఁ దలఁపఁగా నెంతో జుగుప్స ! శుద్ధాంత కాంతామణియcట ! ఇఁక చర్యలో

ఉ. “వావిరి నెల్లప్రాద్దు. . . (ఇవి వెనుక నుదాహరింపఁబడినవి) మ. కలలంగూడిన . . . . . . . .

చర్య లట్లున్నను నష్టములేదు. ఆమె మూట లంతకైనఁ బచ్చివి !

“మనసునఁ గాకున్న మాటలయందైన

సౌకుమార్యములేని చానలేల ? "వారి యందు స్త్రీయను శబ్ద మ ప్రయుక్తము . వాస్తవము విచా రించిన నీలో పములకు c గారణము మన దురాచార హేయ జీవితమే

గదా ! శుద్ధాంతములఁట ! " పో ( తుటి (గ కైనం బొలయ రాని చోట్లCట !"

శుద్ధాంతవాస ప్రభావము

సరి ! కల లకు గోడ లడ్డమా ! మనసునకు బీగములు బంధ 110 కవిత్వతత్త్వ విచారము

ములా ! శుద్ధాంతము లేర్పఅుచుట యను లఘు కార్యముచే శుద్ధాంత రంగములు సమకూ అునా ? మఱియు, నీ మఱుఁగే గదా మానము విడుచుటకుఁ బేరకము ! ఎట్లన, ఇట్టివారు చెలులు, దూతి కలు, దాసీజనులు మొదలగు మధ్యవర్తుల మూలముగా C దప్ప నితరము ෆෆෆ నుత్తమమార్గములఁ దమ నైజమగు వలపును దృప్తి C బొందింపఁ జాల రు . మధ్యస్థము పిలిచిన పిమ్మట మౌనము (గొని యుండు టెట్లు ? మఱుఁగుగానైన సగము చూపి చూపక యుండు టెట్లు ? శుద్ధాంత మనఁగా సేవకులు మొదలగు నీచులతో సావా సమన్న మాట ! గరువతనము కిది యనుకూల మా ? మఱియు, నట్టి కన్య లకు నితర చింతలే యుండవుగాన తమ చింతయే ప్రధానము. రాజ్యము, దేశము, జ్ఞానము, ధర్మము , వీనింగూర్చిన విచారములు సున్న. అప్రయోజకముగా నుంచcబడి యుండుటచే మనసు పరిశ్రమలేక కృశించి నశించును. ఇట్టివారు స్వసుఖ పరాయణు లగు పేమి చిత్రము ? మఱి సుఖ మనఁ గా వీరికి దేహసుఖమనుటఁ దప్ప నింకే యర్థమైనఁ గలనైనఁ దో (పగలుగునా ? ఏ పనిపాటు లును లేక తిని, కండ క్రొవ్వి, మదాంధలై కాలము భారముగ నుండునట్టి జవ్వనులు శుద్ధాంతముల నున్నను సంతసానులట్ల ప్రవర్తింతురు. విచ్చుకత్తుల పా రా లెక్కువయా కొలఁది సందు దొరికి నంజాలు ! సమయము వ్యర్థపుచ్చక త్వరలో ఁ గార్యము దీర్చు కొందమను తొట్రుపాటును గలుగును. అది యుదయ మయ్యెనేని, మానము, మఱుఁగు , సౌమరస్యముఁగల శృంగార మెక్కడిది ? శృంగారమునకు బదులు జావళీలు వచ్చి చేరును. పాపము. మన దేశములో నెందతో స్త్రీలకు దూతికాముఖమైన మోహమే గదా గతి ! కన్ను లుపయోగింపఁబడనందున వీరి కవి మందము లగు నేమో ! చెవులు అనవరతోద్యోగములో నుండునవిగాన చుఅుకుగల వగు నేమో ! చిత్ర ఫలకమో, చెప్పడుమాటయో కామసందేశ పద్ధ తులు ! ఇవి దప్ప వేఱుమార్గములు మృగ్యములు !

   "పురుషుఁడే దేవుఁడు ప్రస్వేద గ్రాత్రుడైనను అ స్వేద గాత్ర తుల్యుఁడు" అని పద్మగంధులు యోజించుటకు ను యో జింపఁ జేయఁబడుటకును గల కారణములలో శుద్ధాంతనివాస మొకటి. ఎట్లన, బయట ఁ బోయినఁగాని లోక వర్తమానము లెఱుకకు రావు. కూపస్థ మండుకముల కా కూప మే పాలసముద్రము. రాజ్యాంగముల నుద్ధరించుటలో నిపుణులైన మంత్రులు, దేశభక్తిచే విరాజిల్లు ప్రతినిధులు, యుద్ధరంగమున శత్రువుల నోడించి నిత్య యశో ప్రథమ భాగము 1 11

భాసితులై దేశదేవతలఁ బోని సేనానాయకులు, ప్రకృతిశాస్త్రవిచక్షణులు తత్వార్థదక్షులు, ఇత్యాది చరితార్థుల సంగతి పాంతఁబోక , cగుమ్మములోఁ గూరు చుండి దొరతనము-అనఁగా నింటివారిమీద చేయు మహా రాజును దప్ప నింకెవరిని జూడని భార్యకు వాడెయఖండపరిపూర్ణుడుగాఁ దోఁచునేమో ! ఒకేయాకారము గుఱి వెట్టి యస్ఖలితంబుగఁ జూచుచుండిన నది నిరాకారబ్రహ్మమట్టులు పరిణ మించునే మో ! కాకి బిడ్డ కాకికి ముద్దు తమ తల్లినిమించిన రూప వతులు గుణవతులు లేరని చిన్నబిడ్డలు నమ్ముదురు. పెద్దవారై యు నేకులం జూచినపిమ్మటC బోల్చి జూడ నారంభించి తక్కినమ్మల యుత్తమత్వము నొప్పికొనుట గలదు. ఇంకొక రెక్కువవా రున్నా రనినంతనే తల్లిమీఁద ప్రేమపోవునా ? పోవునని బుద్ధిశాలినియైన యే తల్లియేని నసూయ వహించునా ? జనముల తారతమ్య నిరూ పణకృత్య మొు కటి. అనురాగపాత్రములని భావించు కృత్యము వేఱొకటి. ఈ రెండును సర్వత్ర యైక్యభావముం బూనునవిగావు చూడు Cడు. శంకరాచార్యుఁడు ఘనుఁడైన తార్కికుఁ డన్న మాత్రముననే యతనిని గౌCగలించికోవలయునని యందఱకు బుద్ధి వొడముట యావశ్యక మా ? నైజమా ? తర్కము బలముగా నుండ వచ్చును. రూపము దక్కువగా నునికి, గుణము సర్వసమ్మతము గామి. దానితో సంశ్లేషింపఁజాలిన ప్రకృతులు విరుద్ధములు గావు. అట్లగుట వ ల పున కుత్పాదికములగు వేయి హేతువులలో నొకటి యున్నయెడ సర్వస్త్రీలును వానిపైC బడుదురని నమ్మవారును, నమ్మి యట్లు నడచువారును మనుష్యులా? జడులా? స్త్రీల విషయమై మాత్సర్యముం దాల్చువారికి రెండు విధములగు భ్రమలు గలవు. ఏవియన, తాము పరిపూర్ణులై యున్నంగాని వారు హృదయ పరి పూర్ణముగఁ దమ్ముఁ గామింప రనియు, నెవనియందైన నేదైన సుగుణము అధికముగా దేదీప్యమానమై యున్నచో, వాఁడు గంటఁ బడే నేని, తక్కిన గుణముల సంగతి యాలోచింపక, వానిపై నుద్దండముగాఁ బడుదురనుటయు, ఈ యెన్నికలు రెండును హేతు రహితములు. సర్వగుణ సంపన్నుఁడైనవానితో విసుగు దవిలిన మనసుతో గుఱ్ఱపు వాని వలచువారు లేరా ? తుదకు ఉన్నతులగు పురుషులు సైతము, ఏన్నో తబ్బిబ్బులకు లోపములకు నాకరము లైన భార్యలమీఁదఁ జూపు ప్రేమా వేశమును, నిరంజనుఁడైన దేవుని యందుఁ బ్రకటింపఁ జాలు దురా ? చిత్తము పలుపోకలఁ బోవునది. గోడలచే నెట్లునిరుద్ధము గాఁ జాలదో య ట్లే కారణమునకును 112 కవిత్వతత్త్వ విచారము

దుర్నిరోధము. ఇది స్వభావసిద్ధమని యంద ఱెఱింగియుండియు, నైరోపా కవులు ప్రయోగించినట్టు ఈ న్యాయము మనవారు తమ కృతులలో వ్యాప్తికిఁ దెచ్చియుండలేదు. మీఁద వివరించిన భ్రమలవలనఁ గలిగిన క్షోభములు రెండు. రాజుగారు దేవి నొకదాని సంపాదించి పురమున నూరేగునపుడు పౌర స్త్రీ లందఱుఁ గామాతురతమై వానింజూడ పరిపరి వికార వేషము లతో వచ్చిరని ప్రబంధముల వర్ణింపఁబడి యుండుట. ఈ కవుల యూహ యేమనఁగా “రాజు ! ఇంక వానిం గల య (గోరక తరుణు లెట్లో ర్తురు ! మనము రెండణాల దక్షిణ నాశించి యే తారతమ్యముల నెంచక ధనికులను దొంగభక్తి నాశ్రయించుచున్నాము గదా! స్త్రీలును, మనకన్న నెట్లు శ్రేష్ఠలు! నికృష్ఠజన్మలే గావున వారిలో నిట్టి పిచ్చి యెక్కువ !" యని కాఁ బోలు ! రెండవది " భర్త దేవుఁడు. గుఱుక పెట్టెడు ప్రాణాయామబ్రహ్మ ! వాని నే యంశ మందైన మీఱినవా రెవ్వరు లేరు. ఒక్క లేరనుటయే కాదు. సృజింపఁ బడరు. పడఁ జాలరు !" అని భక్తిఁ దాల్చియుండవలయునను పాతివ్రత్య ధర్మ ప్రకటనము, ఏమి యీ జనులకుఁ గల దైన్యమహిమ ! పరిపూర్ణు లని తలంపCబడరేని భార్యలు చీ యుని వదలిపో దురా ! భార్యలు మాత్ర మంత పరిపూర్ణలా ? మనుష్యులలో మనుష్యులమని యెల్లరు నున్న సంసారము సా (గదా ! మఱి సభలకుఁ బిలిచి కొని పోయిన వివేకానందస్వామి, గొకలే మున్నగు మహనీయులం గాంచి, "వీరు గొప్పవారు" అని భార్యలు మెచ్చి కొని రేని, మనసు మాఱినవారౌదురను భయముం దాల్చు మగవారి నీచతకొలఁది నిర్ణయింపఁబోలునా? స్త్రీలు గుణము కొలఁది వలచువారైరిపో. అది గ్రేయో హేతు వేగాని యనిష్టసాధక మా ? వారి హృదయానందము నర్థించియైనఁ బురు షార్థము సాధింపఁ జూ తు ముగదా !

మోహ ప్రకృతి

మన గ్రంథములలో చిత్తవిజ్ఞాన మత్యల్పము. అనఁగా పూర్వ కావ్యములఁ దప్పఁ దక్కిన యర్వాచీన గ్రంథములలో ననుట. పురుషుc డెందఱ స్త్రీలనైన గోరవచ్చునఁట! తప్పులేదు! తప్పేల ? దక్షిణ నాయకుఁడు ! కృష్ణమూర్తి ! స్త్రీలు అన్యపురుషులమీద మనసు పోనిచ్చిరేని, అయ్యో ఎంత పాపము ! పాతాళమును మఱింత లో c తుగా ద్రవ్వినఁగాని యా పాపము నింపలేము ! కన్ను గదల్చినజాలు ! ఆపె బంధకి ! దుర్మార్గురాలు ! మగవారి కొక ప్రథమ భాగము 113

న్యాయము, స్త్రీల కొక న్యాయముగా నేల విధింపఁబడెనో చెప్పవారు లేరు ! అది యుటుండనిండు! స్త్రీయనునది జడము గాదు. తిర్య గ్జంతువుఁ గాదు. ఆత్మ గలిగిన మనవంటి చేతనము. మన మేరీతిని స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు, కొడుకులు, భార్యలు (బహువచనము హిందూ జనులలో నయోగ్యము గాదు) మొదలగు ప్రాణసములతో సహేతుకముగనో, నిర్హేతుకముగనో, కాలవశమున భేదింతు మో, ఆరీతినే స్త్రీలును భేదముఁ గొనకుండుటకు వారేమి యంత్రములా ! మానవులు గారా ? భేదమును గొనినంతనే మనల నెవ్వరుఁ దుచ్ఛులని గణింపరు. మఱి కారణము లారసి తీర్మా నింతురు. మనలో స్త్రీ నడవడి (గూర్చి సిద్ధాంతము చేయునపుడు ఖండన మే గాని విచార మెక్కడిది ? అట్లగుట గొప్ప బుద్ధిచేఁ బ్రేరిత మైన భర్త మీఁది విరక్తి యనునది యొక టున్నదని మనవారికిఁ దెలిసినను, బహిరంగము గ నొప్పకొనరు. కావ్యముల నిట్టి చిత్ర చరిత్రలు వర్ణింపఁబడి యుండలేదు. చూడు Cడు. తన భర్త కులాభి మానము విడిచినవాడైన బత్ని యేల వానిని వదలరాదు ? అన్యా సక్తుడై యిచ్చిన బాస మఱచినఁ దనకు నట్టి మఱ పేల రా ఁదగదు ? లంచము కొఱకో పగచేతనో మాతృద్రోహముఁ జేయువాఁడై తన దేశము నకు నా శముఁగోరి శత్రురాజులకు సాయము చేయC కడఁగెడు దు రాత్ముని భార్య శిరశ్ఛేదనముఁజేసిన నకృత్యమా ? సుకృత్యమా ? మఱి దేశ భక్తుడై నిరంతర యత్నములచే దేశాభ్యుదయము నభి వృద్ధి జేయువాని నేల ప్రీతిపాత్రుడని చేరువఁ జేర్చికొనరాదు ? ఒక పతివ్రతా ధర్మమున్న నిం కేధర్మములును బనికి రావా ? అవి అస్తమించునా ? వాని ను పాసింపకున్న నవి క్రీడు తేకుండునా ? ఈ పాడు పాతివ్రత్యము నుద్ధరించు ప్రకృతియొక్క గృహము మాత్రమె . అదియే పతిభక్తికి రంగస్థానము l దేశోద్ధారక ధర్మములకైనను నిది యొక్కువయా ? అలనాఁడు మహమ్మదు గోరీకి నాహ్వాన సందేశ మంపి దేశము నొరులకు సమర్పించిన జయచంద్రున కతని రాణి విష మో తవుడో పెట్టియుండిన నామె కొక దేవాలయము కట్టించి పూజ సేయ కుందు మా ? పతిభక్తి నేటఁ గలిపిన వారందఱు నొక్క లెక్కయునుట మున యూ చారము ! పతులను గుణముల (కొలది వర్ణించి వారి ని విసర్జించిన భార్యల యుద్దేశములను గారణములను గణించి, వీరియందును గౌర వలాఘవముల నిరూపించి చూచితి మేని, భర్తను వదలినవారిలో ననేకులు మహాత్మురాండ్రని యేర్ప డును. మఱియు వదలినవారిలో న నేకులు పేద బుద్ది గలవారని, 1 14 కవిత్వతత్త్వ విచారము

పిఱి కివారని, నీచాత్మురాండ్రనియుఁ దెలియక పోదు !

ఏదేని యొక్క ధర్మమును మాత్రము పట్టి మనుష్యుల చరిత్రల గణింపఁజూచుట మౌఢ్యము. అందును ఆ ధర్మమునుండి తొలఁగిన వారి స్వభావము, స్థితిగతులు, కారణములు, కాంక్షలు, వేనినిం బాటింపక తీర్పుచేయుట కన్నులు పోయి న కబోది మతము. దీనిచేఁ గావ్యములకు గొప్ప లోపము సంభవించినది. ఏది యన, శృంగార మనిన నేక విధమైన శరీర రాగమని యెట్లు భ్రమించిరో, యట్లే జారశృంగారము నేక గతిం బో వునది యని యోజించి, నరుల మనసులు నానారూపములైన చిక్కులం దాల్చిన వనుటఁ దెలిసికొనక, విసుగు పుట్టించునంత యభిన్నవర్ణనలC జేయు దౌర్భాగ్యము. జార స్త్రీ లెల్లఁ జెడ్డవారయఁట ! కండకావర ముచే నన్యులC గోరు వారcట ! ప్రబంధముల లోని పతివ్రతలు మాత్రము కండకావరము చేఁ గోరు వారు గా రా ? ఇంకే వరము వారి కున్నది ? శృంగారము నీచశృంగారము. దానికి ఁ దగినట్లు జారత్వ మును నీచముంజేసి జతఁగూర్చిరి. మనుష్య స్వభావమును బరీక్షించి వ్రాయక యలంకారశాస్త్రములఁ దలనిడికొన్నందుకుఁ గలిగిన యధోగతి యిది !

సరాసరికి నీగృహకృత్య పతివ్రతలకన్న నైరోపా మొదలగు వృద్ధిభూములలోని పలు గాకులు మేలు. రుష్యావారికిని జపాను వారికిని కొన్ని యేండ్లక్రింద ఘోరయుద్ధము ప్రాప్తమైనపుడు, రుష్యావారి రణసన్నాహముల యొక్కయు, కోటలయొక్కయు, సైన్యముల యొక్కయు మర్మముల నెఱుంగ జపాను రాజ్యములోని నారీమణులు కొందఱు బుద్ధిపూర్వకముగ వేగుపనికిఁ బూనినవారై, తరుణములందు శత్రు సేనానాయకుల పరిరంభణములకుం గూడ సమ్మతించి, యమూల్యవృత్తాంతములను దేశమునకు దానముచేసి యుపకార రాజ్యపట్టమహిషులైరని వినియున్నాము గాదె ! వీరిని నీచ చరిత్రలని భావింపనొప్పునా ? గృహధర్మము , దేశ ధర్మము విరుద్ధగతులం బో వునవియైనచో దేశ ధర్మము నెడ నెక్కువ గౌరవ ముఁ గలవా రా నికృష్టులు ! గృహమునకు మించినది లేదను వారా ? యోజింపుడు ! దృష్టి ననుసరించి కొలఁదు లేర్పడును. సంఘపరమైన దృష్టితో తత్త్వపరిశీలనము చేయువారికి హిందువుల నీతులు మొత్తముమీఁద హీనములని తోcపక మానపు. ధర్మముల పరస్పర ప్రాతికూల్యము ఐరోపియనులు విమర్శించినట్లు మన వారు చేయలేదు. కారణము, మూఢభక్తిపరాయణులు గావున. ప్రథమ భాగము 1 15

యోజించి యనుష్ఠించిన గుణదోషములు గాన్పించును. యోజన లేక చేయువారికి సందేహ మెక్కడిది, సత్యాసత్య విమర్శ మెక్కడిది ? తాటాకులో వృద్దప్రచారములో ప్రమాణములు. మనసుగాదు, కావున C గావ్యములోని కన్యకలకెట్లో, సిద్ధాంతులకు నారీతినే మనస్సనునది యడుగంటిన ప్రకృతి.

వీరయుగముల స్వాతంత్ర్య మఖండము

మూఢభక్తి ప్రాబల్యమునకు రాని భారత కాలములో ధర్మ ముల యన్యోన్య వైరముం గూర్చిన శోధన లుండెననుటకు దృష్టాంత ములుగలవు. అన్న మాట ప్రకారము తమ్ములు నడువవలసిన వారై నను భీమార్జునులు ధర్మజుం గినిసి తూలనాడలేదా ? సత్యము భూతదయ ఈ రెంటికిని బొత్తుగలుగనిచోట్ల, భూతదయయే శ్రేష్ఠ తరమని కృష్ణుని యుపదేశము. పతులకు లొంగి వినయవిధేయు తలమై నడువవలసిన విధిగలదయ్యు ద్రౌపది సమయముల ధర్మ రాజాది పురు పులఁ గరినా క్ష రంబు గాc జిన్నఁ బుచ్చి పలికి క్షత్రియ ధర్మోద్ధరణంబు గావించి యసదృశకీర్తి వైభవోపేతయై వెలింగెC గదా ! ఈ వెనుకటినాళ్ళ చప్పిcడి పతివ్రతామణు లా మెను మీఱి వెలయువారా ? చవి సారములేని పాత్రములకు దారిచూపినది రామాయణము . భరతుcడు మొదలగువారు నిర్వికల్పులు. భారత వీరులు సవికల్పులు, మనుష్యులు, దారుయంత్రములు గారు. " సంతతక్షముండు సంతతతేజుండు నగుట పాపమందు రనఘ మతులు" అని ‘తాcబట్టిన కుందేటికి మూఁడే కాళ్లు" అని వాదించు మూర్థమానసులC దీసివైచినది ద్రౌపది. ఆమె దివ్యచారిత్రమే నుత్తమ నిదర్శనము. పౌరుషము గలవారు విమర్శము , కారణశక్తి, నిర్భయ హేతువాదము, వీనిం జూచి జడియరు. దైన్యముంగుడుచు శుష్క సత్త్వలకు నన్యశాసితములగు నాచారా దులు ప్రధానములు. స్వాతంత్ర్యము లేనివారగుటచే స్వేచ్ఛా యోజన ప్రాగల్భ్యము వారికి నలభ్యము. ఇఁక విమర్శనము. కార gదాను సార ప్రచారము, ఇవి యెక్కడివి ?

"హిందూ దేశములోని కవులు స్వబుద్ధి నుపయోగింపక శాస్త్ర ములు, ప్రాచీన గ్రంథకర్తలు, పోయిన దారినే గొట్టెలమందవలెఁ బోయినవారగుట వారి కావ్యములఁ బరిశోధించుటచే నా కాలమున దేశస్థితి జనుల నడవడి ఇత్యాది చారిత్రకాంశముల గుఱుతెఱుంగుట దుర్ఘట" మని యొకానొకరు నుడివిరి. ఇందు సత్యము లేకపో లేదు. 1 16 కవిత్వతత్త్వ విచారము

కాని యీ కవులు వర్ణించిన జాడలును తమ కాలమునాఁటివారి జీవితముచే ఘనముగఁ గాకున్నను నల్పముగనైన నిర్ధారితములు గాన, వీనిచేఁ జరిత్రాంశములఁ గనుఁగొనవచ్చుననియు, భాష యొక్కయు దేశముయొక్కయు చరిత్రమును అన్యోన్య సామ్య ముందాల్చిన యవి గాని యే మాత్రము సంబంధము లేనివగుట యశక్యమనియు, స్థిరీకరించుట యీ దీర్ఘ వ్యాఖ్యానము యొక్క ముఖ్య తాత్పర్యము

     సూరన్న ప్రదర్శించిన య భవ్యశృంగారము, దేశీయుల యనాచారముంబట్టి యేర్పడిన వికార మన్నంతన, యీ కవి నిర్దోషి. యని చెప్పట కష్టము. రస సంపోషణమునకు బ్రతికూలములైన విషయముల పొంతఁ బో నేల ? పో యొcబో యిదియు నుత్తమ నాయికానాయకుల స్వభావమని చాట నేల ! జనసామాన్యముకన్న నెక్కువ సౌమనస్యము లేకుండుటయు నొక కళంకము గదా ! మఱియు అట్టి సౌమనస్యము కవి గలవాఁడని కళాపూర్ణోదయమం బట్టి నిరూపించితి మేని-నిరూపింపఁ గలమను దైర్యమున్నదియాయుత్తమగుణమును ప్రభావతీ ప్రద్యుమ్నము చెయు కాల మునఁ గోలు పోయి యుండుట యొక దోషము. పశ్చాత్తాపముఁ గలిగించు క్షయము ! వయసు హెచ్చుటచేతనో, మఱి యెందుననో, భావనాశక్తి వాడువాఱియుండును ! కల్పనా ప్రతిభ మిక్కుటముగ నుండిననాళ్ళలో వ్రాయంబడినదగు కళాపూర్ణోదయము యొక్క గుణదోష ప్రకటనమును మఱల నందుకొందము.