కవిత్వతత్త్వ విచారము/ద్వితీయ భాగము

వికీసోర్స్ నుండి



ద్వితీయ భాగము

మొదటి ప్రకరణము

                                             కాలసరణి - 'హేతుసరణి

కథను వివరించు పద్ధతులు రెండు. విషయముల జరిగినట్లు కాలక్రమానుసారముగా జెప్పట, కాలక్రమమును వదలి స్వారస్య మగు నే సందర్భమునైన ప్రారంభించి పిదప వెనుక ముందఅగా కథను బెంచి పూర్తిచేయుటయు ఇందునకు దృష్టాంతములు. భారత రామాయణములు కాలక్రమానుసారముగా వ్రాయంబడి నవి. ఈ యితిహాసముల లో వీరుల వంశావళులు, వారి జన్మము, వయసు, పెరుగం బెరుగ సంభవించిన కష్టనష్టములు, ఇత్యాదులు కాలో పగతంబైన వరుస మేరకుఁ జూపఁబడియుండుట సర్వజన విదితము. ప్రభావతీ ప్రద్యుమ్నముం గమనింపుఁడు. కాలముంబట్టి కథ నేర్పఱిచియున్నఁ దౌలుత వ జనాభుని వృత్తాంతము, వాని తపో మహిమ , నాకలోక దండయాత్ర, మహేంద్రపరాజయము, వర్ణింపఁబడి యుండును. కవి యిటు నవలంబించిన మార్గము వేఱు. ఇంద్రుఁడు శ్రీకృష్ణదర్శనార్థమై విజయం చేసి ' యని ప్రారంభించి, కార్యమేమని యూతఁ డడుగుcడు , తాను దత్పూర్వ కథ కొంతమటుకు విన్నవించినట్లు కారణములు వెల్లడిచేయుటకు నైన చర్చలచేఁ గథయొక్క యూదిని దీసికొని వచ్చినాఁడు. దీనికిఁ బా శ్చాత్యు లిడిన పేరు ‘తర్క క్రమము' అనఁగా కార్యమునుండి వితర్కించుచుఁ గార్యములు పుట్టుటకు దత్పూర్వమే ప్రసిద్ధికి వచ్చియుండిన హేతువుల నరయుట. తర్క క్రమమను మాటకైన ' కారణ క్రమము' అనుట స్పష్టతరము . కాల కారణ క్రమములకుఁ గల వ్యత్యాసముఁ జూపుట కొక నిదర్శనము : ప్రాతఃకాలమున నిద్రలేచి భూమి తడిగా నుండుటc గాంచితి మేని యా తేమనుబట్టి రాత్రి వానకుణిసి యుండు నను హేతువు దెలిసికొందుము. వస్తువుల స్థితి—అనగా నునికికి వచ్చిన విధమును—పరికించి చూచిన వాన దొలుతటిది. తేమ తరువాతిది. మనకు వస్తువులం గూర్చిన యెఱుక పరముగా జూచినఁ దేమ యూదిమ సత్తు. వాన దానినుండి దెలిసికొనఁ బడిన యనుమానము, కావున స్థితిపరం పరలనిర్ణయింపఁ జూచితి మేని యూదిమధ్యాంతములఁ గాలము
117

Í 18 కవిత్వతత్త్వ విచారము

ప్రకార మరయవలయు. వస్తువులు పుట్టిన జాడ నటు విడిచి, దానికి హేతువులైన వానిని వెచు కుచు వెనుక కును, దానినుండి సంభవించిన ఫలముల నరయుచు ముందు నకును విచారములు సల్పితి మేని యయ్యది కారణ క్రమము. వస్తువు యొక్క తత్త్వము ప్రకాశితమగుటకు నీ రెండు విధంబులు ననుకూలించినవ. వానను బ్రథమమునఁ బేర్కొని హేతువును గొనియాడి వానియందుఁ దదనంతరము పుట్టినది తేమయన్నను ఒక్క కేు. తేమను దొల్లఁ జూపి యూ సిద్ధికి నేమి కారణ మని యూ లోచించి వాన హేతువని యుటు తరువాత స్థాపించినను ఒక్క కేు. ఆలోచన యొక్క ప్రారం భావసానములు భిన్నములు గాని యది పోవు త్రోవ యొుండే. ಇಲ್ಲು ద్వివిధ గతుల జరించినను సిద్ధాంతవ్యత్యాసము లేమి కి గార మేమన, స్వభావమునఁ గార్యకారణజాలంబు నిర్వికల్ప మగు క్రమమును దాల్చి యునికి. వానచే నేల తడి యగుటయు, నేల యంతయు దడియుటకు వానఁ దప్ప నిం కే హేతువును లేకుండు టయు, నిజములైన. నీ ప్రత్యయముల నొకదానినుండి యింకొక దానిని వ్యక్తపఱుచుట సుసాధమ. నికరముగా నీయవయవమునే యూధారముగఁ గొని యో జింపవలయునను నిష్కర్షయుండదు. హేతువులయు c దత్ఫలములయు ననవరత సాంగత్యమే యు భయ క్రమములకుఁ దావలము.

వస్తుతత్త్వ పరిశీలక శాస్త్రములలోఁ గాల క్రమమునకుఁ బ్రసిద్ధి యెక్కువ ఎందుకన, ఎయ్యది సృష్టిలో నాది యో దాని నే గ్రంథము నను ఆదిగాఁ జూపిన శాస్త్రమునకు వైశద్యము. కావ్యములయందు దత్త్వముగాదు ప్రధానము. మఱి రసము. అట్లగుట మొత్తము మీఁద గాలక్రమమును విసర్జించిన బాగు. ఎందుకన,

'కృతినాయకుని తల్లి గర్భము ధరించినది. పది నెలలకు సుతోదయము. పిమ్మటC బెరిగినాఁడు. చదువు సాములు నేర్చి నాఁడు, ' ఇట్లని వ్రాసితి మేని రసము రెండు విధములఁ జెడును. నాయకుఁడు పుట్టి పెరిగిన విషయములలో మన కేమి యక్కఱ ! లోకములో నున్నవారందఅు పుట్టకయు పెరుగుదురా ! మఱి వాని యందు మనకుండు శ్రద్ధకు హేతువు వాని యొక్క గొప్పతనము. గొప్పతనమునఁగా గుణములచేతనో, తన పడినపాట్లచేతనో, తాను సాధించిన మహెూద్దండ కార్యములచేతనో, మన మనసులఁ దన యొద్దికి లాగికొను గుణము. కావున నట్టి ముఖ్యాంశములను, వానితో గాఢమగు చెలిమిఁ జెందిన విషయములను మా ! తము

ద్వితీయ భాగము 119

ప్రచురించిన రసము సాంద్రముగ నుండును. లేనియెడ బా నెఁడు నీళ్ళలో వైచిన గచ్చకాయంత బెల్లమువలె నది హీన మగును.

రామాయణ భారతముల విషయానుక్రమణిక

          రెండవది . పుట్టె, పెరిగె, నేర్చె, దేశయాత్ర వెడలె నిట్లని వాసిన నొక సంగతిఁ దెలిసినంత నిఁక ముందు ఘనమైన కార్యమో ఫల మో గలుగునను శంక మనకు C గలుగదు. కావున ను ద్వే గముతోఁ జదువు దమను కుతూహలము వొడమ దు. ఇఁక ముందేమి వచ్చునో చూతమని మనసు తహతహ గొనదు. కథయందు నవధానము జీర్ణమగును. ప్రస్తుత విషయముతోఁ దృప్తిఁ జెంది యుందు ము. తరువాతి వృత్తాంతములు తామై నిదానముగ వచ్చు వఱకు ను దేక ములేక వేచియుందు ము. చూడుఁడు. రామాయణ ములో, రావణుడు సీత నెత్తి కొని పోవువ అకుఁ గథ కొంచెము కొంచెము గా విడిచి విడిచి చదివినను ఆయా సము దోcపదు. అటు పిమ్మట "అయ్యో ! సీతగతి యేమాయెనో ! పగదీర్పక శ్రీరాముఁ డూరకుండునా ! యుద్ధ మెట్లు చెల్లినది ! ఆ పరమసాధ్విని రావణు డు చెచినా డా ! ప్రాణములతో నుండనిచ్చెనా ! భర్త యు మఱఁది యు నా మెను రక్షింపఁజాలి రా ! చెఱఁదలఁగినను సౌఖ్య పడె నా ! " ఇత్యాది బహుభంగుల హృదయ మల్లలనాడి యూ పె జీవితము తుదముట్టువఱకు నన్ని వివరముల నెఱుంగ నలజడి గొనును. కావ్యము ముగింపునకు వచ్చినను నా పెపై మనకుండు చింతయు ప్రీతియు గౌరవమును ముగియవు. అనేకులు వాల్మీకి బహిరంగము చేసినది చాలదని, తమ తమిఁ దృప్తి జెందుటకై యయోధ్యలో పట్టాభిషేకానంతర మాయమ్మ యెన్ని క్రీడావినోదం బు ల ననుభవించెనని యూ హించి యూ యమ సుఖము దమ సుఖముగా నానందింతురు. "భోగము లెన్నియున్న నేమి ? ఆనాఁటి పరిభవ మమ్మానవతి హృదయముఁ యు నా ? శల్యమువలె నాటి వేదన యొనర్చకున్నె ? అట్లగుట శ్రీరాములకు వ్యసనము దోఁపఁ గూడదని బయట నాటలు పాటలు నవ్వులు నెన్ని పచరించినను లోన నానాఁటికిఁ గ్రాఁగి క్రుంగకున్నె !" అని యాక్రోశించువా రెందఱు ! మఱి, పారంపర్య నీచమును నీతియని భావించు నితరులు " రాము డు మన యట్టిఁడ ! పరుని యింటఁ గాcపుర మున్న యాలియెడ సందియముఁ దాల్పకుండునా ? తాల్పఁడేని

120 కవిత్వతత్త్వ విచారము

మగవాఁడా ! కావునఁ దప్పక వెలి వేసి యుండును" అని యెంతురు గాఁబోలు ! ఇట్లు పల్లెఱంగుల నమ్మహాదేవి నొక నిమిషమైన నెడఁ బాయఁజాలక మనస్వాంతము లాయమంజుట్టి రక్షక సైన్యము లట్లు గాచుచు నా మె కారోపింపఁబడిన యవస్థల దాల్చును . దీని కేవి ప్రమాణము లందు రో, మీ యనుభవమును, పురి బానుపుంఖముగ బయలు వెడలిన ఉత్తర రామాయణము, మైరావణ చరిత్ర మున్నగు ను పరామాయణములును, వాల్మీకి యొక్క మాహాత్మ్య మేమనవచ్చును! అతని భావనాశక్తి తాఁకినఁ జాలును, మనకుండు బడుగో బక్క యోడ్రైన ప్రతిభయును సాంగత్య పేరణచే యావచ్ఛక్తిని బట్టవట్టి బయటఁ బెట్టి విజృంభణముతో నెందఱు పట్టినను నాపరానిదై " భావాంబరవీధి" విహరించును ! కవి బ్రహ్మల చందమిట్టిది. తామిడిన యారగింపుతో రక్తి పూర్తియై యంత మొందదు. మఱి యూరగింప నారగింప నింకను గావలయునను స్పృహ ప్రజ్వరీల్లును ఆత్మకేళియందు విరతి కాస్పదమైన రతి యెక్కడిది. రామాయణంబున సీతాపహరణ మెట్టులో భారతమున ద్రౌపదీ వస్తాపహరణము నట్టిద. పాంచాలీపరిభవము రక్తముతోఁ గాని తదితరములతోఁ గడిగివేయఁ గాదని మనసునకుఁ దట్లని మనుజులున్నారా ? ఆ కార్యము నెఱవేఱువఱకు నందే చిత్తములు హత్తి యూపిరాడనట్టు లుండును. అయిన నొక విజ్ఞప్తి. ఇప్పడు వ్యాప్తిలోనుండు భారతము దాని కాదికవియైన వ్యాసుఁడు వ్రాసినది గా దు. వ్యాస ప్రోక్తము గొంత భాగము మాత్రము. గ్రంథము సుప్రసిద్ధమగుడు జైనులు, వైష్ణవులు, బౌద్ధులు, స్మార్తులు, వీరశైవులు, పౌరాణికులు మొదలగు తెగల వారందఱుఁ దమతము సిద్ధాంతముల నందులోఁ జొనిపి యూ యితిహాసమును బాడు సేసిరి గాని, మూలక వియొక్క భావ గాంభీర్యము గణనాతీతమగుటం జేసి యది యింక ను బొత్తిగఁ బూడి యింకి, నిర్మూలము గాకున్నయది - ఇది మన దేశము యొక్క భాగ్యములలో ప్రాథమికము. మతముల వాతఁబడియు జీర్ణముగాక బ్రతికి యుండుటకన్న మించిన మాహా త్మ్యము త్రిలోకముల మూలమూలగా వెదకినను దొరకదు ! అట్టి మాహాత్మ్యముగల భారతముం దలపోసిన నానందముచేఁ గనుల నీరు గ్రమ్మునే కాని, నాలుక తుదకు మాటలువచ్చునా ! పలుకులు

  • ఇప్పటి భారతము “జయ' యను పేరిటి చిన్న వీర కావ్యముయొక్క పరిణామము. “జయనామకంబునను " రాజితభంగి జగత్రయంబునన్ బూజిత కీర్తియై నెగడు” (స్వర్గా. 89)
 ద్వితీయ భాగము 1 21

దుస్తరములుకదా! మనసు దుర్భరమైన. ఆరణ్య శాంతి త్రయములు ముక్కాలు మువ్వీసము కృత్రిమ పర్వములు. తక్కినవానిలో నా కవి వ్రాసిన ఫక్కినే విశుద్ధముగ ని కాలము వఱకు వచ్చిన నెవి యును లేవు, గాని సరాసరి కి శుభ్రములని యంగీకరింపఁబడఁ జాలినవి యు. కావ్యక్షోభ నాపాదించు రెండు దుర్విపత్తులందుండుట రసికుల పాపఫలము ! ఎవ్వియన. దుర్యోధనుఁడు పాండవుల నడవికిఁ దో లుట యెుకటి. పండ్రెండేండ్లుగూడ నజ్ఞాతవాస మే విధించియుండినఁ బాండవుల బ్రదు కెట్లయినఁ గానిండు, మనకు వైరస్యములేని కావ్య శ్రవణానందముగల బ్రదుకు దప్పియుండదు . పాండవుల యరణ్య ప్రవేశ ముచే మనకైన ప్రాప్తి యేమని తెల్పుడు ? దానికన్న నెన్నియో మడుంగులు క్లేశకరమగు వర్ణాశ్రమాది లంగూర్చిన మతవిహీన దీర్ఘ ప్రసంగ ప్రవేశము. అరణ్యరోదన మcట! దానికన్ననెనీయొ మడూంగులుకెల దిక్కులేనిది కావ్యములలో వేదాంతరోదన! ఆ ధర్మరాజు శుద్ధముగ వదరు బోతు! బఘులను జూచినదే దండముఁబెట్టి దూర ముగా C దన నీడయైన వారికి సోకనట్లు తొలఁగిపోవుచుండిన నెంత పుణ్యముగా నుండును ! కాలక్షేపార్ధము అడిగిన ప్రశ్నలే యడు గుచు, నుత్తరము లెంత విరుద్ధములు గ నున్న గంగిరెద్దురీతిఁ దల యూ ఁచుచు నాయన సల్లాపములు సలి పె! మన కవి ప్రలాపములు! రెండవ విపత్తు ఏదియుం దురో ఆ భీష్ముఁడు పెద్దమనుష్యుని రీతి గుటుకు మని చచ్చి జన్మసాఫల్యము నొందక కొన్ని నెలలు క్రిందఁ బడి యునికి ! మన గ్రహచారముగాకున్న భారతవీరుల నెల్ల నుత్తముఁడని పొగడ్డఁ గన్న యూతఁడు పరస్పరాసంగత విచారముల నెల్ల మన నెత్తిని గట్టియుండునా ? బుషి సందర్శనము, భీష్మాప దేశము అను నీ రెండు తరుణములు సాకులుగఁ జేసి కొని హిందూ దేశములో నెన్ని వాదము లు, వేదములు, మతము లు, తత్త్వములు బయలు వెడలెనో వానినన్పింటిని సులభముగ లోకు బ్రసరింపఁజేయు కొఱకై యీ యుత్తమోత్తమ కావ్యములో నిమిడ్చి దానిని కంటక పాషాణ వన్యసత్త్వ భయంకర మైన మహా రణ్యముఁగా నొనర్చిరి. కవిత్రయమువా రీ చిక్కుల విడఁదీసి విడిచి యాంధ్ర భారతము మాతృక కంటె రసవత్తరముగ నొనర్చిరి కాని, జనాప వాదశంకం జేసి యే మో, వారు పూర్తిగా సవరింపలేదు . రామాయణమునందు కథా సంయోగము అఖండము. ముఖ్యాంశ ములనుండి దృష్టి ని పెడత్రోవకుఁ దీ సికొని పోవు సంగతు లంతగా

మహభారతము 'సంహిత' యనఁబడుట కిదించుక కారణము.
దర ము

122 కవిత్వతత్త్వ విచారము

లేవు. భారతమున ను పశాఖలు మెండు. కొన్పి శాఖలును గావు, ఏ సంబంధమును లేనివగుట. కావున నప్పడప్పడు దారిఁ దప్పి పరిభ్ర మించువారమై పిమ్మటగష్టపడి కథా రాజమార్గమునకు వచ్చు లోపల తత్పూర్వము పఠించిన భాగములు మఱపునకు వచ్చుటయు సహజము. మఱపునకు రాకున్నను వానిచే హృదయములో దీపించిన భావనాశక్తిం గొని పరిగణించిన భారతమునకు గౌరవ మధికము. ఒక్క యధికమన్నం జాలదు . హస్తిమశ కాంతరమన్నను సత్యము నకు న గౌరవము రాదు ?

ఈ యితిహాసములు సైతము కాలక్రమముగా వ్రాయ ఁబడక కార్యకారణరీతిగా కథల కెల్ల నా ధారభూతమగు విషయముతో నుపక్ర మింపఁబడి యుండినచో స్వారస్యమింకను నుద్ధురముగ నుండును. ఇవి త్రోక్కిన మార్గముననే వీనిలోని గుణములు మాత్రము లేని చిల్లర కావ్యములు తఱుచు పోయి యున్నవి.

             " అనేక విధ పదార్థ ప్రపంచ సంచితం బు, నుపపర్వ మహా పర్వోప శోభితంబు"గను నుండుట యొక్క కతముగ, నాదినే భారతమునఁ గథాసంగ్రహము నిర్వర్తింపఁ బడి యుండుటయు, "ద్వాపరాంతమునఁ బాండవధార్త రాష్ట్రలకు మహా ఫెూర యుద్ధం బయ్యె"నని వక్కాణింపఁబడి యుండుటయును. ఇందు చేc గథ కొంతమట్టునకు నే క్రీభావముం జెందుట, చదువరులకు ముఖ్యాంశ ములు గజిబిజిలేక యేర్పడుటయు నను గ్రేష్టములైన సిద్ధులు సేకు లినవి. రామాయణము నందు ను కాలానుసరణముచే గలుగు నైక్య భంగము సమర్థించు కొ ఆ9కుంటో లె సంక్షేపముగ నాది నే కథా భాగములు దెలుపబడియున్నవి.

కార్యక్షారణ క్రమమునఁ గథను వర్ధిలఁజేసినవారు ఆంధ్ర ప్రాచీన కవులలో నాకుఁ దెలిసిన సూరన్నదప్ప నింకెవరును లేరు. బహుశః ఈ మార్గ సంచారమునకు మొదలిడిన వాఁడి తఁడే యే మో! ఈ విషయమై ప్రభావతీ ప్రద్యుమ్నముంగూర్చి చర్చించుచో నొంత వ్రాసియుంటిమి. గాని యందును నది కళాపూర్ణోదయము ననుక రించినదని చెప్పలేదు. కార్యకారణ సమ్మేళనముచే నే క్రీభూతముగా వ్రాయ బడిన గ్రంథములలో గళాపూర్ణోదయము ప్రథమమ. స్వతంత్రముగ నవీన భంగుల రచించుట కవి యొక్క మహాప్రతిభకు ఫలము, సాక్షియును.

ద్వితీయ భాగము 123

కళాపూర్ణోదయమునఁ గార్యక్రమము ముఖ్యపద్ధతి కాలక్రమముంబట్టి చూచిన నీ కథకు నాదిమ భాగము పంచ మాశ్వాసములోని సరస్వతీ చతుర్ముఖుల లీలా కేళి. ఆ నఁగా సామాన్య కవులు వ్రాసియుండినఁ బంచమాశ్వాసము ప్రథమా శ్వాసమై యుండును. చూచితిరా ! ఈ కవియొక్క కూర్పులోఁ గథా ప్రారంభమునకుఁ గావ్యప్రారంభమునకు నెంతదవ్వో ! ఇట3 దూరస్థములీయ్యు నల్లిక చెదరక జిగిబిగిగా నున్నందున నియ్యవీ గాడా శ్లేషముం గాంచియున్నవి. కథ పూర్తిగాఁ దెలియుటకు నై దాశ్వా సములు చదివి తీరవలయు. ఇఁక కథ నెఱుంగవలెనన్న కుతూహల మన్ననో ప్రథ మూ శ్వాసములోనే యంకురితము! "రంభానలకూబరుల వలనఁ గడపట వినంబడిన వాక్యంబొక్కటిఁ దలంచి కొని కృతాం జలియై" కల భాషి ఇది నారదునితో c దా విన ప్రకారం బు నీరీ తి విన్నవించుచున్నది .

సీ. ......................................
    ఏను వృథాబ్రాంతి నింతనంతను దాని
                 వెంబడిఁ జని పల్కు వింటినొకటి
     వినుఁడది, యర్దేశతనయుఁడో యబల ! యి
                  న్నారదు మాటలు నడుమవేఱ

     తే. పొడమె నేమయ్యెనల “కళాపూర్డుసుద్ధి"
        కడమచెప్పమన్న రంభ యప్పడ తెలుపనె
        నీకు మరి చెప్పరాకుంట నీ కథయును
         నీకు నాతోడు నుమ్మబ్బ నీకు మనియో.
                                                  (కళా. ఆ. I, ప. 191)

             ఇధియే కళాపూర్ణునింగూర్చిన తొలుతటి ప్రస్తావన. ఔత్సు క్యముఁ బ్రేరేచు విధములు చూడుడు. రంభ తన ప్రియు నికి నైనఁ జెప్పరానికథ యెట్టిది? ఏ కారణముచేత నా మె మౌనధారిణియా యొ? నను మొదలగు ప్రశ్నలు తమంతట నావిర్భవించి, సమాధానము తెలియు వ అకుc గథ నుండి మరలC గన్నెత్తనీక చేయును. కావ్య ములలోని యే క్రీభావ మనఁబడు గుణంబదియ. అనఁగాఁ నొక పట్టున, నొక గ్రుక్కగా సర్వముఁ గ్రోల మేని దనివినీయమి. భాగ భాగముగఁ జదువఁబోయినఁ దృప్తిలేదు. ఏలన, సమాప్తివ అకు

124 కవిత్వతత్త్వ విచారము

“తే. ఏ నెఱుఁగ వేడ్కపడుచున్న దాననో త
                             పో ధనోత్తమ యా కళాపూర్జుఁ డనగ
                             నెవ్వఁ డాతని సుద్దిమున్నేమి చెప్పె
                             నెద్ది చెప్పరాదనియె నాయిగురుఁబోఁడి' (కళా. ఆ. i, ప. 192)

అని పలికిన కల భాషిప్ పలుకు లా యమ వేగాదు మనవియును. మండుకొ అవి నెగCద్రోసినట్లు నారదుఁడు "ఇది యు లతయు నపూ ర్వంబు నాకునుం జెప్పరాదు" అని యానతిచ్చు తఱికి మన యుద్రేక మా (పరానిదయ్యెడు ! నారదుఁడు ఈ కథ యత్యపూర్వ వునుట, క విపాత్రముల మూలమునఁ దన కృతిని దానే యటనట విమ ర్శించుట కింకొక ప్రమాణము. రంభానల కూ బరులకు నీ యపూర్వ వృత్తాంతముం గూర్చిన ప్రసంగ సమయుము న వివరించుచు నారదుఁడు కలభాషిణి) తోఁ దన ప్రియు నకైనఁదా దెల్పమికి నా యాప్సరస చెప్పిన విధంబు విను ముని యిట్లనియెు .
                       “సీ. ... ... యో పౌరుషాభరణ తత్కథలు వ
                                చ్చిన నేమి యంటేని వినుము దెలియ 
                            నాకథ లిఁకఁ జెప్పినట్టివారును విని
                                  నట్టి వారును ధాత్రియందుఁ బుత్
                            ర పౌత్రప్రపౌత్రాది బహుసంతతియు దన
                                  ర్పుచుఁ జిరకాలంబు ప్రచురసంప 
                            దభివృద్ధి శోభిత శుభసౌఖ్యముల గాంతు 
                                   రను మాట యున్నది యూదియంద
                           ' యేను నీ కది చెప్పిన దీనికొఱకు
                             నవనిఁ బుట్టఁగవలయునో యని వెఱచెదఁ 
                            బ్రాణవల్లభ యువి తావకాంగసంగ 
                            సౌఖ్యమునఁ జేర్చు నాకు నిష్టంబులగునె

                     తే. అదియు వింటిని గదయని యనియెదేని
                        యేను వినినట్టి పిమ్మట నిట్టిమాటఁ
                        బలీకె నొక్క యమో పు వాగ్విలసనుండు
                         గావున వచింప విననిఁక గాదు నాకు.”
                                                                                      (కళా. ఆ, 1, ప. 201, 202)

ఈ మూటలతో మన యొక్క యుత్కంఠ గొంతునకు మీఁదు గాc బో వును! ఉత్తంఠకుఁ ධී යා అద్భుతమును వచ్చి చేరును. ఎట్లయిన, కేవల నిరర్థక వ్యాఖ్యానమైన ఫలశ్రుతిఁగూడఁ గథలో ముఖ్యాంగ                                              ద్వితీయ భాగము 125


ముగ జేర్చినాడే యను విస్మయ మొక్కటి! మఱి, యీ ఫలములు దేవతల కశుభములగు గావున వినవలయునను సంభ్రమ మింకను నుద్దాఢమగును. ఒక పక్షము వారికి మేలుగను, మఱియొక పక్షము వారికిఁ గీడుగను అవతరించిన యీ చరిత్ర మేరీతి భూలోకములో వ్యాపింపఁ గలదని యాశ్చర్యపడమా ! కథ దేవలోకములోఁ బుట్టి యుండుట ఈ వ ఱకే స్పష్టము . ఇఁక దేవతలు దెల్పనిది మనకుఁ దెలియ టేభంగిని ? కథయే మో తెలిసియేయున్నది. లేకున్న నీ కావ్య మెక్కడిది ? నారదుడును

“తే. అతివ ! విను రంభకును గల యుట్టి భయము
                                       నాకుఁ గల్గుటఁ దత్కథ నీకుఁ జెప్ప
                                       గూడ దట్లయ్యు మిక్కిలి కువలయమున
                                      వెలయఁ గలదది వెలయు త్రోవలును గలుగు !"
                                                                            (కళా. ఆ. 1, ప. 204)

అని చెప్పచున్నాఁడు. అతని వాక్య మ మోఘము ! అట్లగుట నెవ్వ రికిని నపాయంబు నా పాదింపని యే మంత్రముచే గవి యీ క్రియ సమర్థించునో యని యబ్బురపాటును, దొ ట్రుపాటును జదువరు లకుఁ దల మున్క లౌఁగదా ! మనల నేకా గ్రావధానులం బరవశ చిత్తులం జేయుటకంటె శిల్ప సౌభాగ్యమెయ్యది ? కల్పన యనఁగా నిట్లుండునదే కల్పన. ఊపిరి యాడకుండునంత యు ద్వేగముం గలిచునది.

ఆధార విషయమును గార్యముచే రోయcబడిన కారణముగాc జూపుటయే గాదు. మీఁది యుదాహరణములం జూచిన నంగ ప్రాయములను చిల్లర విషయములంగూడఁ గాలసరణిగ నీ కవి వర్ణన సేయఁడని తెలియుచున్నది. రంభానల కూబరు లాడుకొను చున్న కళాపూర్ణ గాథలు అటు తరువాత నడిచిన కల భాషి ఇటీ నారద ప్రసంగమునం దేలుచున్నవి. దీనింగూర్చిన నిదర్శనము లీ గ్రంథ ములో లెక్కకు మీఱి యున్నవి. నారదుఁడు గాన విద్యాభ్యాసము నకై ద్వారకకు రాకపోకలఁ జేయుట ప్రథమ ద్వితీయాశ్వాసము లలో నివేదితము. దీనికిం గారణము కల భాషిణి మణి స్తంభుల సంభాషణములో నారదునికిఁ దుంబురునితో నైన మాత్సర్యము నకు హేతువు, ఆ నారదుఁడే మణికంధరునితో ఁ జెప్పినట్లు సిద్దుఁడు వివరించిన, తుంబురునికి గానవిద్యా ప్రభావంబున వైకుంఠ లోకములో c బూర్వ మెప్పడో నడచిన యునితర భావ్య సత్కారము.

126 కవిత్వతత్త్వ విచారము

కాలక్రమమును బాటింపక నాటక రీతిగాఁ బాత్రములచే కథను బెంపొందించుటలో సూరన్న యద్వితీయుఁడు. ఈ కౌశల మీతని క్రిఁ బరిపక్వము గామి చేతనో, య లంకార శాస్త్రములకు విధేయుఁ డైనందుననో, ద్వారకాపుర వర్ణనము ప్రభావతీ ప్రద్యుమ్నమున నున్నంత సొంపుగా నిటలేదు. కవియే నేరుగ వర్ణించునట్లు వ్రాయుట యొక దోషము మఱియు C బురజనవర్ణనము C గూడ, జేసియున్నాఁడు. ఇది గర్ఘ్యము. ఏలన, కావ్యమున నే యే పాత్ర ములు వచ్చునో వానిని మాత్ర ముచితస్థలముల వర్ణింపవలయునే కాని, కథారంభమున నిష్ ప్రయోజన వర్ణనములం జేయుట య సంగతి యను వికారము.

కల్పనాదోషములు

షష్ణా శ్వాసములోని 189 వ పద్యము వఱకు నుండు నంత ప్రొఢముగఁ దరువాతి భాగములు లేవు. ఈ గ్రంథమంతటితో సమాప్తి జేసియున్న సమ్మాన్యతరమై యుండును. ఏడవ , ఎనిమిదవ యా శ్వాసములలో భావనాశక్తి, ప్రతిభ మొదలగు కవిత్వ శక్తులు బలహీనములు. తుదకు మధుర లాలసా పరిణయూదులు వర్ణింపఁ బడకున్నను తత్పూర్వకథచే నూహ్యముల కావున వానిని బొందించియుంట వునరుక్తిఁ బోనిది. ప్రధానా బ్యానముతో నైక్యము వీని కత్యల్పము. అట్లుండియు నీ నిరర్ధక ప్రస్తావనకు గవి యేల ప్రవర్తించినాఁ డనుట చింతనీయము.

కథాంగము లేక భావ ముం దాల్చి యొక నేర్పడి యున్నఁ గళకు ప్రాశస్త్యము. అట్టి గాఢ సంయోగమునకు షష్ణా శ్వాసములోని పూర్వోదిత పద్యమునకుఁ దరువాతి భాగములన్నియు విచ్ఛేద హేతువులు. ఇది యెఱింగి ప్రతి క్రియ చేయ నెంచినవాఁడై కాఁబోలు, కథ యొక్క యాదినుండి యంత్యమువ అకు 'పూసలలో దారమట్లు' యిమిడియుండు గతి మణిహార వృత్తాంతముంగూర్చి యున్నాఁడు. ఈ హార వృత్తాంతముం దిలకింపుఁడు.

మణి హశీర వృత్తాంతము

దీనికి నాదిమ ప్రభువు విష్ణువు. అతనిని దపస్సుచే మెప్పించి దానిని బడసిన వాఁడు సుగ్రహుఁడు. పిమ్మట బ్రాహ్మణ శాపమున నతండు దనదొల్లటి యెఱుకయంతయు హ తంబుగాcగా, నూతనావ తార మెత్తినవాని ಯಿಲ್ಲು సత్వదాత్ముఁడను పేరcబరఁగి రాజు గాc

ద్వితీయ భాగము 127

గొంతకాల ముండి పిమ్మటC గళాపూర్ణునికి మంత్రిగాఁ గుది రె. సుగ్రహుఁడు మున్ను దేవతా లయములోఁ బెట్టి మఱచిన యూ మణి హారమును మధురాపుర పు బ్రాహ్మణుఁ డొకఁడు తీసికొనిపోయి తన యింట బహు వర్షములు పూజ సేయుచు నుంచి కొని ద్వారక కరిగి శ్రీకృపనికి సమర్పించెను. శ్రీకృష్ణCడును "దండకాకృతి సమజ్జ్వల సంస్తవ లీల కెంతయున్ ఘనముగ మెచ్చి యిచ్చె మణికంధర నామునకున్" మణి కంధరుఁ డలఘు వ్రతునకు, నతఁడు కళాపూర్డు నకును, నాతఁడు శిశుప్రాయ యగు మధురలాలసకుని గ్రమముగ నొసంగిరి. అట్లగుట నీ హారమును సరస్వతీ చతుర్ముఖ విలాస క్రీడయుం బోలెఁ గథ నేకీభూతముం జేయు కల్పనలలో నొక్కటి. పూర్వోత్తరభాగంబు లన్నిటికిని ఈ హారము సామాన్యము. కథ నెల్లఁ బ్రాఁకి యుండు తీ ఁగవంటిది.

         ఈ రీతి కల్పన మహెూత్తరమైనదయ్యు నిష్కళంకంబు గాదు. ఎట్లన, ఆ హారముయొక్క నాయక మణి యెవ్వరి హృదయ స్థలంబున నెంతవరకు సో కరియుండునో, యంతతడవును వారికి సర్వజ్ఞత్వము, వాక్యపటుత్వమును సిద్ధించునని విప్పవు వరము. దాని సత్యము ననుభవమునకుఁ దెచ్చికొనులోపల సుగ్రహుండు శాపహతుఁడాయె ! మధురాపురి బ్రాహ్మణుఁడన్ననో దానిని గంఠ ములో ధరింపక పూజ సేయుచు బహు వర్షము లున్నాఁడఁట ! వాని భార్యయొక్క చిత్త స్థిర్యమెంత దృఢమో! ఆ పెగూడ దొంగతనము గా నైన దానిని వేసికొనలేదు. శ్రీకృష్ణుఁడు మణికంధరుని మెడలో వేసి నాఁడు గాని యది "బాలతఁ గనుపట్టు విష్ణుని కలాపము గావునఁ దద్భుజాంతర స్థితికి చాల కొప్పి గళ సీమన యొంతయు గుప్తమై " యుండెనఁట! 'బాలతఁగనుపట్టు' అను విశేషణము సమంజసమా? పూజారి బ్రాహ్మణుఁ డిచ్చినది బాలకృష్ణునకా? షోడశసహస్ర మహిషీ యు తునకా ! పిమ్మట శిశువుగానున్న మధురలా లసకుఁ గళా పూర్జుఁడు వేయఁగా నాయకరత్న యాపె హృదయంబు సోఁకునట్టు పడినది ! సమయముఁ జూచి పడవలసినచోటఁ బడినవిగదా! ఎంత తెలివిగల పతకము! అట్లు సర్వజ్ఞమైన యబ్బాలికామణి యనేకులు పూర్వ వృత్తాంతముందెల్పి సత్వదాత్ముని చరిత్రమునకు వచ్చు నప్పటి కాపె "యటునటుఁ గదలఁగఁ దన్మణి హృదయస్థలముఁ బాసి కడకేఁగుటఁ దెలివి యుడిగెను!" ఇట్లు వ్రాయుట కామరూప ధారణమునకన) నభావ్యము. ఏలన, సత్యముగా నుండునా యను

128 కవిత్వతత్త్వ విచారము

శంకఁ గలుగఁ జేసి కథయందు నమ్మికను భ్రమను బోఁగొట్లుఁ గావున, ఇఁక ముందఱి వృత్తాంతమింకను ప్రాయోభావమునకు దూరము .

                       “వ. నాఁడట్లు బోధోదయం బగుటయునుడుగుటయు నేతన్మూలంబులని
                            యెవ్వరు నెఱుంగకుండుటను నిది సామాన్య హారంబ యను తలంపున
                            మా వారు దాఁచి మఱచుటఁ జేసి నాఁటనుండి నేఁటిదాఁక నిద్దివ్యహారం
                            బెన్నఁడును ధరియించుటయు లేదు. నేఁ డాభరణ భరణసమయం
                            బునఁ బ్రసంగవశంబునఁ దలంచికొని చెలులు తత్ ప్రాప్తి ప్రకారం
                            బెఱింగింప నిది సుముహూర్త లబ్ధంబైన ప్రథమ భూషణంబనియు
                           భవద్దత్తంబనియు నత్యాదరంబునఁ దెప్పించి హృదయభాగ స్పర్శ
                           నాయకరత్నంబు గా నిపుడు ధరియించి యున్నదాన."
                                                                                 (కళా. ఆ, 8, ప. 189)

ఇందలి యసంభావ్యములు రెండు. కన్యగా నుండునపుడు ఆ రాజుగాలియైన సోఁకునా దేవుcడా యని వ్యథగూర్చుచున్న విరహవేదన కాలమున, పెండ్లినాఁడు, ఎన్నఁడును రాని ప్రసంగ వశము ఇప్పడేల పైఁబడవలయును ? రెండవది హృదయభాగ స్పర్శ నాయకరత్నంబుగా' ధరింపబుద్ధి నిష్కారణముగా నేల పొడమవలయు ? లోకములో నదృష్టములు, నిర్ణేతుకములు నైన యాకస్మికములు లేక పో లేదు గాని, పదేపదే వలసిన చోట్లనెల్లఁ గాకతాళీయ న్యాయముల నాశ్రయించుట కల్పనకు మిక్కిలిఁ గొఱఁత. కామరూపములు, దివ్యదృష్టి , ఇత్యాదులు అన్నికష్టము లకు ననుకూలించు సాధనములు గాన బ్రశస్తములు గావు. సర్వ సందర్భములలోఁ జేరజాలినవి యినా కథలో దప్పక చేర్పఁదగిన యంశములని చెప్పవీలులేదు గనుక, నిట్టి వేసందర్భములను జేర్ప కుంట మేలు. కథ కెల్ల సూత్రమువలె నుండు నీ హార మిన్ని వక్ర ముల కాస్పదమగుట చింతా వహము !
                షష్టాశ్వాస మధ్యభాగమునకుఁ దరువాతి భాగములు తుచ్ఛ ప్రబంధ రీతిని వ్రాయcబడిన భావవిహీన ఘట్టములు గావున వానిని ప్రత్యేకముగ విమర్శించుటొప్ప. తత్పూర్వభాగములలోఁ బ్రతిభ, భావము, కృతినిర్మాణ చాతుర్యము, నివన్నియు బుష్కలముగ ప్రకాశించునట్లు రచించిన యీ మహాకవి ని రసవర్ణములకుం టకుఁ గారణములు, కాలదోషములును, అలంకార శాస్త్రముల యెడ వినయవినమ్రుఁడై 'సకల లక్షణ సంపన్నము' గా వ్రాయ బూనిన

ద్వితీయ భాగము 129

దౌర్భాగ్యపుఁ బ్రతిజ్ఞయును. మహాకావ్యమని శాస్త్రకారులచేఁ బేర్డ్లోనఁ బడినదాని నుత్పాదింపఁబోయి కవిత్వమున కుత్పాత మాపాదిచె ననుట స్పష్టము .

పథమ భాగములోని పౌర బాటులు

ప్రథమ భాగమున కాలదోషము లంతగా లేవు. అనంగా ప్రబంధముల తీరు తక్షువ యనుట. మఱి సర్వలక్షణ సంపన్నతచేఁ గలిగిన దోషములు పెక్కులున్నవి. మణికంధరుఁడు తపస్సు చేయుటకు ను పోద్దాత మో యనునట్లు నిస్సంగత్వ దోష భాజనమైన యాత్రాభివర్ణన మొకటి చేయంబడి యున్నది. ఈ యాత్రలచేఁ గథకు గలుగు ఫలములు రెండు. వైపుల్యము, వైరస్యము. ఆ ! ఒక యూహమై దీనిని సార్థకమందమా ! ఈ బుషి తపో భంగము నకై రంభ రాఁబోవుచున్నది కదా ! ఆ పెకు నసహ్యము గలుగకుండు ನಿಲ್ಲು కొన్ని స్నానములు చేయించి శుభ్ర కాయునిఁగాఁ జేసి యుంత మని కవి తర్కించి యుండునా ? తర్కించియుండెఁబో. కోరిక యూ డే రు మార్గమిది గాదుగదా. ఎట్లన, వీరెన్ని మునుకలు వేసిన నేమి ? తపస్సులోఁ గూర్చుండి యేకాగ్రముగ మై మఱచి కొన్ని వత్సరములు — వత్సరము లెల ? – వాసరములున్నంజాలదా ! — మలయ మారు తమువలె ప్రజ్వరిల్లుటకు : అనాదరణ పాత్రమగు నీ |పసంగములకు నాహుతి గా నీcబడినవి సుమారు నలువదియైదు పద్యములు !

కలభాణకిని నలకూబరునిపైఁగల మోహము కృతార్థమగు టకు నీ తీర్థయాత్ర యొక్క యిక్కట్టు చూడు డు. నలుకూబరునిఁ జూచి వలచిన పిదప నారదుని శిష్యురాలై గానవిద్యాభ్యాసమునఁ గడపిన యేండ్లు నాలుగు. ఇట్లంత కాలయాపన ముప్పడే యుయి యుండఁగాఁ ద్వరలోదపోవర్ణనముం బ్రదర్శించి హృదయసాఫల్య మంద అకుఁ జేసియుంచిన బాగు. ఆ మధ్యమున యాత్రకై యొకటి రెండేండ్లు వినియోగించుట శృంగారభంగము. కల భాషిప్ కి వయసు ముదరక యుండునా ? మఱియు , నా నాలుగేండ్లు నీప్సితిసిద్ధి కొఱ కైన సన్నాహమునఁ గడపఁబడెఁగాన నా పె యోర్చియుండుట సహ జము . ఈ యాత్రలో దగులఁబెట్టిన కాలము నా మె యే రీతిఁ గడి పెను ? నలకూ బర స్మరణలోనా ? విరహవిషయమైన సఖులతోడి

  • నేను ప్రథమభాగ మనునది 6 వ యాశ్వాసములోని 189-వ పద్యమువజకు నుండు భాగమనియు, ద్వితీయ భాగము దక్కినది యనియుం దెలియునది.
130 కవిత్వతత్త్వ విచారము

సల్లాపములలోనా ? కవి యాయమ నొంటిగా విడిచి మఱచి యుండుట మహాపాపము. పొరపాటు ! యాత్ర వలనఁ గలిగిన ఫల మిదియే !

ఈ ఘట్టమునకన్న సందర్భశుద్ధిలేనిది పంచమాశ్వాసములో 1 32 వ పద్యము మొదలు 174 వ పద్యము వరకునుగల పసి పాపచేఁ జేయఁబడిన యోగవిద్యా విషయక మైన దీర్ఘ ప్రసంగము. ఈ విమోచన మార్గ ప్రదర్శనము శుద్ధముగ ననవసరము. అసంగ తము. అసమ్మతమును !
              దోషవిచారణ యటుండనిచ్చి యీ కావ్యము ను త్కృపతమం బని పరఁగంజేసిన గుణంబుల నభినందింతము.

సద్గుణములు

నాటకరీతిని సంభాషణాదులచే వృత్తములం బ్రకటించుట యందు నీ గ్రంథము అసదృశము. సామాన్యక వులు రాజు నొక్కని బేర్కొని యతని దేహమనో లక్షణముల ముప్పదినలువది పద్దెము లచే పొడవుగను అసంగతమును గ్రంథాది నే వల్లింతురు ! అనఁగా తత్పూర్వకవులరీతినే మాఱుమాటలఁ జేయు స్తవమనుట. వంది మాగధస్తుతులచే నెవ్వని గొప్పతనమును సాక్షాత్కారముం జెంది ನಿಲ್ಲು తోఁపదు. గుణములు చర్యలచేఁ బ్రకటితములగు, ఏ నడవడియులేని వాని మనఃప్రకృతి నెఱుంగఁ బోలునా ? కావున కథలో నాయకుండొనర్చు కృత్యములచే నతని శీలము తెఱంగు మనకు బోధయగు నట్లోనర్పనగునుగాని, ప్రత్యేకముగ ధర్మముల జాబితానొకటి వ్రాసి యతని మెడఁ గట్టినఁ గవియొక్క బుద్ధిలేమి దక్క నింకెద్దియుఁ దెల్లంబుగాదు. అనేక కార్యములతో నిండి నట్లు కథం గల్పింప లేనివారికి జాపితా పద్ధతియే గతి, దుర్గతి. ఈ సార్వభౌముండు చైతన్యమును వహించిన సంగ్రహధర్మశాస్త్రము అనుటలో సత్యము సుఖమును రెండును సున్పలు. మఱియు, ప్రదర్శింపఁబడు కార్యజాలములతో సంబంధములేని గుణముల వర్ణించుట పనికిమాలిన పెత్తనము. సంబంధముగల గుణముల మాత్రము వర్ణించుట కర్తవ్యమేని, కార్యసంబంధములచే నవి యొకరు చెప్పక చూపకయు తమంతఁ దేటపడవా ? యుద్ధమున నవక్ర విక్రమము చూపెడు నభిమన్యుఁ గూర్చి వేఱుగ నితఁడు ధైర్యశాలియని శ్లాఘింపకున్న మన మెఱుఁగ లేమా ? అట్టి శ్లాఘనలు గూడదని కాదు నా మతము. మణి పాత్రముల మూలమునఁ జేయ

ద్వితీయ భాగము 131
            బడినఁ గథ నెఱ్ఱలువా అని రైుక్యమును వహించి స్వారస్యముగ నుండు . కళాపూర్ణోదయములో రాజవర్ణనఁ జేయలేదు, ప్రభావతి లోను జేయలేదు. ఇందులకు గతంబేమి యొక్కో! బహుశః గ్రంథా ది ని రెంటియందు ను రాఁ దగిన మహాత్ముఁడు కృష్ణుఁడు. ఇతCడు సుప్రసిద్ధుఁడు గావునఁ గవి యతనిగూర్చిన ప్రస్తావనము లనావశ్య క్షములని విరమించెనో ! యో జింపుఁడు, తెలిసిచేసిన మనకేమి ? తెలియక చేసిన మనకేమి ? పాకము బాగున్న నా మోదించుటయే సరి.
                   కథా ప్రారంభముననే యెంత వడిగా నెన్ని పాత్రముల బ్ర వే శింపఁ జేసి నాcడో తలపోసి యానందాశ్చర్యముల భరింపఁడు ! ఉపద్యానవనములో కల భాషిణి చెలికత్తెలతో (గూడి డోలా విహారంబు సల్పుచుండఁగా నారదునితో నా కాశమార్గంబునఁ బోవుచుండు మణి కంధరుడు .
 "మ. తమిఁ బూఁ దీఁగల దూఁగు టుయ్యెలలఁ బంతాలాడుచుం దూఁగు నా
          కొమరుంబ్రాయపు గబ్బి గుబ్బెతలయంఘ్రుల్ చక్కఁగాఁజాఁగి మిం 
            టి మొగంబై చనుదెంచు ఠీవి గనుఁగొంటే దివ్యమౌనీంద్ర నా 
           క మృగీనేత్రల మీఁదఁ గయ్యమునకుం గాల్చాచు లాగొప్పెడిన్."
                                           (కళా. ఆ. , ప. 147)</poem>
         <అని ప్రశంసించిన ప్రకారము సరి గాదని నారదుండు</poem>
            మ. భళిరా సత్కవి వెదు నిక్కమతగన్ భావింవ నీవన్న య
               టైల ప్రాయంపు మిటారిక తైల బెడంగే నెందునుం గాన, వా
              రలడోలాచలనోచ్చల చ్చరణముల్ తైవిష్టపస్త్రీల యో
             దలఁదన్నం జనునట్లు మించెననినన్ దప్పేమి యొప్పేయగున్
                                                                                      (కళా. ఆ. 1, ప. 148)

</poem>

"క. అని పలుకునపుడు నికటం
                               బున నలకూబరుఁడు దాను మొగిలు మఱుఁగునన్
                               ఘనమగు దివ్య విమానం
                               బునఁ జనుచున్ రంభ విశదముగ నది వినియోన్."
                                                                                   (కళా. ఆ. I, ప. 150)

ఆది నే యీ రీతి నైదు గుర నెదుర నిల్పుటయగాదు. మూట మాటకును గథ పెరుగునట్లు చేయు మాహాత్మ్యమున సూరన నిస్తు లుcడు. ప్రథమాశ్వాసము ముగియు సరికి కథామధ్యమున మునిఁ

132 కవిత్వతత్త్వ విచారము

గిన వారమై, యెట్లు, వచ్చితిమో, 'యాది యొయ్యది, అంత్య మే దిక్కున నుండు ' నని విస్మయానందముల నోలలాడుచుం దుము. మణికంధరుని స్తుతి వ్యర్థచేష్ట గా దు. ఆ కా శమునఁ జేయ బడి యుండినందున గల భాషిణి వినియుండదు . అటు వినమి యావశ్యకము లేనిచో నలకూ బరునిపైని వలపు చేనైన దైన్యముతో నారదు నాశ్రయించి యుండదు. మఱియు నా పొగడిక రంభకు నసూయా కారణము. ఆ యు సూయ చేఁ గదా యూ పె నారదుని క్రో మాటలాడుటకై వచ్చి నల కూబరు ఁడు " నర భామల పోCడుములకు బ్రమయకయున్నే" యని దరహా సము చేయుట ! నారదుండును ప్రతిహాసముఁ జేయ ( బూని,

“క. నినుబోలు వనిత నీకును
         వనజముఖీ యితనిఁబోలువాఁ డితనికి నెం
         దును గల్గి కలచునో యీ
          ట్టి తనిగాఢపు మదము సొంపులీవులు చనునే."
                                                               (కళా. ఆ. 1, ప. 165)

అని పల్కు తరికి కథయొక్క యప్తిభారములో సగము సంపూ మయ్యెను. పిమ్మట లెక్కకు వచ్చునో రా దోయనునట్టి చిల్ల విషయముం బోని.

  • వ. అంత నమ్మహామునీంద్రుని యాజ్ఞానుసారంబుగాఁ దద్విమానంబు

      కలభాషిణి విహరించుచున్న యెలదోఁటలోనికిం దిగియె నట్టియెడ
      రంభా నలకూబరులును వినయపూర్వకంబుగ నతనిచేత ననిపించుకొని
     యప్పడెదుటఁ గాన్పించు వాసుదేవ పాసాదరాజంబునకుం జేయెత్తి
    మ్రొక్కి నిజేచ్ఛం జనిరి"
                                         (కళా. ఆ. 1, ప. 167)

అను వాక్యముతోఁ గల భాషిgధి నలకూ బరుని వలచుటకును గళా పూర్ణుని సుద్ది వినుటకును సహజమైన సమయముఁ గల్పించి తక్కిన సగము ననాయాసముగ ముగించిన యీ కవియొక్క ప్రతిభ యవాచ్యము గదా ! ప్రథమాశ్వాసము కథకు నాల వా ల ము. సమస్తములైన కార్యములయుఁ గారణ బీజంబులందు C జల్లబడి యున్నవి.

ఐక్యమును లక్షణము

                      సామాన్యకవులతోఁ బోల్చిచూచిన సూరన్న కళాకౌశల

 ద్వితీయ భాగము 133

మింకను వైశద్యముతో వెలుఁగును. మన ప్రబంధములు తఱుచు కథానాయకుఁడగు రాజు అనునొక్క పాత్రముతో బ్రౌ రబ్లుములు. ఆయననుగూర్చిన య ప్రస్తుతవర్ణనము ముగియటకుఁ ఓట్లునది యొక గంట. పిమ్మట నర్మసచివఁడో యెవఁడో యొకఁడు వచ్చుట, అటు తర్వాత వేఁట వెడలుదు రేమొ. అక్కడనొక సఖీజన పరి వేష్టి తయగు కోమలాంగిని జూచి రాజును విదూషకుఁడును. (నర్మస చివులు విదూషకులుగ నుండుటయు విదూషకులు నర్మసచివులుగ నుండుటయు హిందూ రాజధర్మము గదా !) రెండుగంట లొకరితో నొకరు శ్లేష లు, అతిశయోక్తులు, ఉత్పేక్షలుఁ బేల్చునప్పటికిని බ්ධි దయ్యాలతో నిండిన కావ్యమని దూరముగఁ బాఱవైతుము ! కళాపూర్ణోదయముతో నుపమింపదగినది, మూలము స్కంధము సామాన్యముల యయ్యు, వివిధ గతుల దెసలవ్యాపింప శాఖోప శాఖలు గలిగి కను పండువుగ నుండు మహావృక్షము. సామాన్య ప్రబంధములు , కొలుకులు ఒకదాని వెంట నింకొకటి యతికించు టచే నేర్పడిన గొలుసులవంటివి. ఐక్యము వీనిలో లేదు. కొలుకులైనఁ జేర్చవచ్చును. ఎన్నియైనఁ దీసివేయవచ్చును. వైపుల్యము దక్క నింకెద్దానికిని లాభనష్టము లుండవు. ఆకృతి మా అదు. వృక్షములు మొదలగు సజీవములవలె నుండు కావ్య ముల నేయంగమునైన ఛేదించుటకుఁగాదు. నూతనాంగములఁ జేర్చుటకుcగాదు. చేసినను పరిమాణ భేదమే గాదు. ఆ కార మును వికృతమగును. ఐక్యమను కథా లక్షణమును బరీ క్షించు పద్ధతి యేదనఁగా, ఉన్న భాగములఁ దీసివేయవచ్చునా క్రొత్తవి యే వైనఁ జేరవచ్చునా యుని విమర్శించుట. ఈ కార్యములు పొ సఁ గనివైన నైక్యము స్ఫుటము, సాధ్యములైన నైక్యభావ మపక్వము.

'మానవ ప్రకృతిని అద్దము వలెఁ జూపు శక్తిగలవాఁడు సంభా షణలC దీర్చుటలో ఁ దిక్కన్నకు సరివచ్చువాడును" అని సూర నార్యుని ప్రశంసించినందుకు దార్కాణమైన ముఖ్యభాగములలో ఁ గొన్ని యే వనంగా యిరువురు రంభలు నలకూబరులును బ్ర వేశించి చిత్రవిచితగతులఁ బొరఁబాటుతో సంచరించియు నే యనుచితము లకు ననీప్సితములకును బాల్వడక కృతార్థులగు తృతీయ చతుర్ధా శ్వాసములోని ఘట్టములు.

           సూరన్నయు షేక్స్పియరును ఒకరి పేరొక రెఱుంగనైనఁ జాఅనియంత దవ్వలనున్న సమకాలీనులు. జాతిమత వేషభాషాదుల

134 కవిత్వతత్త్వ విచారము

వ్యత్యస్తులు. అట్లుండియు నీ వింత నేమి చెప్ప ? షేక్స్పియరు వ్రాసిన కామెడీ ఆఫ్ ఎరర్స్ అనఁగా తబ్బిబ్బుల ప్రహసనము అను నాటక మునకును, రంభా నలకూ బర ద్వయ విలాసము నకును పెక్కు పోలిక లున్నవి ! రెంటియందు ను భేదము లేని రూపముగల నాయకు లిరువురు నాయిక లిరువురు అయ్యెపాత్ర ముల నిరూపించుటకు నసాధ్యమైన భ్రమ తటస్టించి, నాయికా నాయకులు తమ వలచినవారని యొుండొరులతోఁ జేరియుండు వేళ "అయ్యో పాపము. అన్యునిచే నీ కన్య చెఱుపఁబడి యెనా" యను సంశయము మనకుఁ దో(చి మనసు కల(తపొందించును. కాన. కథ యామూలాగ్రముగ విశదీకరింపఁబడు సరికి తమ తమ యభి మతముల కనుకూలములైన విధంబుల దాంపత్యము లేర్పడినవని చూపి. మనకు దిగ్భ్రమము వాయుటతోడన పట్టరాని నవ్వును సంతోషమును గవి గలిగించును ! ఇట్టి కథా సందర్భ మెంతో యపు రూపము . అట్టిదానిని హిందూ దేశము లో సూరన్నయు నాంగ్ల ద్వీప మ్మన షేక్స్పియరును నెట్టి సంబంధములును లేనివారయ్యు నే గ్ర కాలమునఁ దల పోయుటc దలంచితి మేని, యిది కాలయోగ ప్రభా వ వూ ? ఆకస్మిక విచిత్రమా ? యని విస్మయభరితాంతః కరణుల మగుదుము.

రంభానలకూ బరా పహాస ఘట్టము

             మృగేంద్రవాహనా తిరస్కారంబున దూరముగఁ గొట్టుకొనిపోఁ బడి యొక పూ (బొదరింటఁ గల భాషిణితోఁబడిన మణి స్తంభుఁడు ఆమెను బలాత్కరింపఁబూనఁగా నవ్వరవర్ణిని “ఈ పాతకి బల్మిఁ బట్జడుఁ గృపన్ వీక్షింపరే కావరే !" యని మొఅయిడఁగా "వెఅవక యెవ్వడు రా వెతఁబఅ పెడు నిట్లతివ?" నని, నలకూ బరుఁడు, పూఁ బొదరింట రంభ తో వినోదము లాడుచుండినవాఁడు (ఇతఁడు నల కూ బరాకారుఁడగు మణికంధరుఁడు) సరసము చాలించి, తన సింహనాదము విని పా ఆలిపోయెడు సిద్ధిని వెంబడించి పట్టుకొని తిరిగివచ్చులోపల, కుబేరనందనుని నైదా అు సంవత్సరములనుండి ధ్యానించుచు సమాగమ సమయంబు నిరీక్షించుచున్న కల భాషి ఇది, మునుపు నారదుఁడిచ్చిన వరప్రభావంబునం జేసి రంభాకారముం దాల్చినదై, యా నలకూబరుని త్రోవఁబట్టి యతనిం గాంచి ప్రెమ బక్షపాతంబుఁదోcపబల్కు భార్యచందంబున

ద్వితీయ భాగము 135

శా. ......... ... ..ఆక్కటకటా ! యే మంచునిస్ దూరుదువ్
గేలక్ష గిదువు గీదు వేమియునులేకే యిమ్మెయిన్ వత్తురే ?
 చాలన్ దూరము గాఁగ నేనిదె పరిశ్రాంతిం గడున్ నొచ్చితిన్
 జాలుంజాలుఁ గరంబు మెచ్చఁదగు నీచందంబు ప్రాణేశ్వరా !
                                               (కళా. ఆ. 3, ప. 157)

యుని ప్రీతియు నిష్టురతయు మె అయఁబల్కి సమాధానముఁ జెప్పి, నిజవాంఛా సాఫల్యమునకు విఘ్నముగానున్న సిధుడ్నిఁ దొలగించు టకై నాథునింగూర్చి చెప్పచున్నది.

“క. వీఁడా యట్లన్యాయపుఁ
                    బోఁడుములకు బూనినట్టి పుణ్యుఁడు, పూవి
                    ల్కాఁడో వల్లభ యెంతటి
                      వాఁడైన నగున్ విశంకవర్తనుఁ డెందున్”
                                                    (కళా. ఆ, 3, ప. 159)

           నలకూబరాకారుఁడును సమ్మతించి వానిని వదలిపెట్టి "నీవు నిర్బంధింపఁ జూచిన స్త్రీ యెక్కడ ? చూపుము" అని ధట్టించి యడుగుడును, తానే యా స్త్రీ యగుటంజేసి కల భాషిణిలోని నవ్వు వెలికిరానీక కష్టపఱుపబడిన యుత్తమనారీమణులయెడలఁ బుర~ఘలకన్న దట్టముగ స్త్రీలకు నుండు సహజమగు కరుణయ బశ్చాత్తాపమును బోఁద్రోయని విధంబున

"సీ. .......................
వీనితో నిదియేమి విడిచిపెట్టుము వీఁడు
               తను ನಿಲ್ಲು డించి వెళ్ళిన నెడఁగని
యూ యింతిదాఁగి యెం దరిగెనో
                  యెచటఁ జూపెడు?'
                            (కళా. ఆ, 3, ప. 166)

అని యూ సిద్ధునిఁ బంపించివేసినదై, యిఁక నిజమైన రంభ వచ్చి యొక్కడ కార్యభంగ మొనర్చునోయని శంకించి యతఁడు బయలు వెడలి వచ్చిన చోటికిం దూరముగఁ దీసికొనిపోనుంకించినదై, యే శంకకు నవకాశమియ్యని యుక్తిగా.

             <poem>"
              ........................... ...దాని
             మనమిఁక వెదకుదమని తాను నతఁడు”
                                          (కళా, ఆ, 3, ప. 166) 136                                 కవిత్వతత్త్వ విచారము

సిద్ధుఁడు దొల్తబరుగెత్తిన తెరువునఁ గడుదవ్వుగాఁ జనియె! పాపము! ఎన్నియో నాళ్ళుగా వేచి వేసరిన లలనారత్న మీకల భాషిణి! సర్వము పక్వదశకువచ్చు సమయమున నెన్నో విఘతములఁ బడవలసిన సంతపు రాలు ! వరసాంగమముచే నిట్టి. స్త్రీలకుఁ గల్గు సుఖమును నాత్మతృప్తియును బ్రభావతుల కుండవు ఉండఁదగవు! ಇಲ್ಲು కష్టముల నెల్లఁ దరించి యు భిమత కేళిందేలి నాయక సంయోగ మహదానందయై.

"శా. ..... ... . . . . . . . . . . . .
       లోలత్వంబున నుండ నచ్చటికి నాలోలత్పదక్రేణిచొ
       స్పాలోకించుచు రంభ వేతొకతె డాయన్ వచ్చెఁ జిత్రంబుగన్ !”
                                                            (కళా. ఆ. 3, ప. 170)

      ఈ పెయ యప్సరస మయీన రంభ . నలకూబర " విడు విడురా" యన్నమాటకు మనసు చివుక్కురుమనఁగా మణికంధ రుఁడు తన్నుఁ బట్టిన శని వలె వెడలిపో వఁ గా హృదయ కాంతుఁ డగు నలకూ బరునిం గది సి యుందమని పయనమవుతు తఱికి నా మణ్ కంధరుఁడు తనివిఁదీఅని వాఁడగుటంజేసి తన తపశ్శక్తి వినియో గించి నలకూబరాకారుఁడై తనుఁగలిసికొనఁగా కుబేరనందనుండే యను భ్రమచే త్రికరణ సుఖముల ననుభవించుచు నీవఅకునుండి నయది. అట్లా నలకూ బరాకారుఁడు ఆర్త స్త్రీ విలాపంబు విని దద్రక ణకై వెళ్ళి కొంచమున రాక చాల కాలము ముసలCగా, తమిబట్ట లే ద్ర తామసము నోర్వక యతని రోయుచువచ్చి యతనిఁ గన్నులారఁ జూ చుటయే గాదు, అతని యొద్దనున్న తన ప్రతిబింబమునఁదగు నింకొక రంభను గన్నులుబుకునట్లు పొడగను చుండగా నలకూ బ రుండును దిక్కు దెలియనివాఁడై

" తే. నీదు ప్రతిబింబమదియొ దాని ప్రతిబింబ
      మీవో యేమని చెప్పదు నిగురుఁబోఁడి !
       యేర్పఱుపరాకయున్న వారీవు నదియు
       దీనికరుదంది చూచెదఁ దిరిగి తిరిగి.

క. తుదనేమి చెప్పనాదం
       డఁదొలంగిన దాని నిను దడంబడకుండన్
       మదిలోన నేర్పణించుట
       నుదుర్లభము • . . . . . . .”
                                                               (కళా. ఆ, 3, ప. 176)

ద్వితీయ భాగము 137

అని పల్కుచు విభ్రాంతుఁడయ్యెను. అయ్యా ! కల భాషిణి కి వచ్చిన కష్తముము ! లేక లేక క్లేశపడి సంపాదించిన యర్ధము క్షణ భంగురమయ్యెడు తెఱంగైన నా దైన్యము చెప్పఁదీ అునా? అపుడా లతాంగి యేమన్నది ?

"సీ. అట్లైనఁ బ్రాణనాయక నినుఁ గౌ(గిటఁ
                    బాయనే వెఱతు నీ మాయలాడి
      యీ రూపుతో మనకెడ సేయ నేతెంచి
                        నదియు తొల్లియు నొక్క యనుర జంత
      జనకనందనకు రామునకును నెడ సేయఁ
                         గడఁగి వచ్చుట వినఁబడుచునుండుఁ
     గావున దీని నిక్కడఁ జట్టుఁబట్టున
                         నుండఁగ నిచ్చీన నొప్పకుండు
      వట్టిమొగమాట లాలించి గట్టి గాఁగ
     నదరవై చుచుఁ జనుమంచు నౌరనీవు
     గదలెదు సుమంచు సంభ్రమ మ్మొదవ నపుడు
     కాంతు కంఠంబు నొకకేలఁ గౌగిలించె"
                                  (కళా. ఆ. 3, ప. 177.)

ఇకపై నీయిద్దఱ సవతుల కొట్లాట వర్ణింపఁబడియుండు తెఱుంగు వర్ణింప నా తరముగా దు ? ఇది యద్భుతావహము. స్త్రీ ప్రకృతికి దర్పణము. రసవత్తరము ! ఎన్నిసా మెతలు, నీతులు, తిట్లు, తలత్రిప్పలు ! తుట్టతుదకు కన్నీళ్ళును ! సత్యరంభ వచన ములు కొన్ని చూడుఁడు !

"క. వినుమూ యేర్పాటు దనం
           తన యగుచున్న యది యెట్లుఁదప్పదు నత్యం
           బనఁగా దైవంబనఁగా
           జనులకు లేకున్న నెట్లు జగములు నడచున్”
                                                            (కళా. ఆ. 3, ప. 1182)

“సీ. ఆల్లప్పడొకచోటఁ జల్లని సురపొన్న
                                నీడ మెచ్చుచును నాతోడఁగూడి
            యందుఁ బల్లవశయ్యఁ గందర్ప వ్రేళినిం
                            పొందుచోఁ బటమటి యందు నొక్క



కవిత్వతత్త్వ విచారము 138

వనిత యాక్రందనధ్వని వినఁబడుటయు
                      నీవు దిగ్గున లేచి పోవుచుండ
         నేను నీతోడన యేతెంచుచో నొక
                          యిణ్ణి డాపలివంక కేగుటయును
         జూచి నిలిచితి నేను నిల్చుటం గనుఁగొని
         యొచట నెట్టిది హత్తెనో యెఱుక పడద
         వేగిరింపక నీవ భావించుకొనుము
        కల్ల నిజములు క్రమముగాఁ గానవచ్చు"
                                                   (కళా. ఆ. 3, ప. 184)

దీనికిమాయా రంభ యిచ్చెడు ప్రత్యుత్తరము :

చ. ..............................
            మన చరితంబుఁ జెప్పెను నమస్తము వేల్పులసాని చెప్పిన
            ట్ల నిజము గాఁగ నివ్వరవిలాసిని యెచ్చటనుండి చూచెనో !
                                                                 (కళా. అ. 3, ప. 185)

తే. నపుడట నినుఁగూడి యలరినదియు
                 నట్ల నీవేగుచో వచ్చినదియుఁ దాన
                యగుచుఁ దోఁప నందదిగ్రి యెట్లాడనేర్చె
                మగువగాదుర యిది ! పెనుదగర గాని ! 186

"క. వినువల్లభ ? కన్నుండం
                  గనుపాపం దివియు నేర్పుగల ముని ముచ్చీ
                 వనిత తగ దిచట నుండన్
                 వెనుకను దిద్దుకొనవచ్చునే యొకటైనన్" 188

ఆని నలకూ బరునిఁ బిలిచి కొని వెడలఁ గలభాషిణి యుపాయంబుఁబన్నగా; నిఁకనూరకున్న వరుడు దక్కడని సైరణ దొలంగ బెట్టి, నలకూబరుఁడు చాటుగా నింతవ అకుఁ జేసి సంవాద మప్రయోజకమని నేఱుగా సవతి నా క్షేపించుచు

"క త్రుళ్ళఁగ నేటికి నిలునిలు
                 మిల్లలికినఁ బండు వగునె యింతటిలోనే
                  వల్లభునకుఁ గడు నచ్చిన
                  యిల్లాలవెయేను లాతినే పోఁదోలన్”

 ద్వితీయ భాగము 139

"క. మగఁడా పట్టెంబునఁ దలఁ
                 దెగఁ గొట్టినఁ గొట్టుఁగాక, తెగ తేరఁగ నీ
                 కెగవిడిచి పోయెద నె ప్రా
                వగ నాకాణాచియైన వలపులపంటన్ !

               క. ఈ రీతిని మధ్వల్లభుం
                గోరిక మెడఁ గౌగలించుకొని నీవుండన్
               సైరించుట కొఱగాదిది
               రారమ్మిఁక నోర్వఁజుమ్మ రావే యనుచున్.

             క. వెడదెరువు లిచట ఁ జెల్లవు
             పుడమి నహహ దొంగలానఁ బొడిచినఁ గోకల్
             విడుతురె గడియుంతునె యొ
              క్కడి గతిమాలిన పిశాచికవో నీ మాటల్ !

                వ. అనుట్రయు నా యింతి సైరింపక

      మానిని. అంత మడింపకు వే యని వల్కిన నంత మదింఎకువే యనుచున్
                           గంతులడంచెద లెమ్మనిపల్కిన గంతులడంచెద లెమ్మనుచున్
                          రంతుల నేమి ఫలంబని పల్కిన రంతుల నేమి ఫలంబనుచున్
                          బంతముచూడఁగదేయని పల్కినఁ బంత చూడఁగదేయనుచున్

               సీ. ఒటనుమీ యన్న నొట్టునుమీ యంచు
                                నేమేమి యనిన నేమేమి యనుచుఁ
                   గానీగదే యన్నఁ గానీగదే యంచు
                                నింకేల యనిన నింకేల యనుచు
                   నోసిపోవే యన్న నోసిపోవే యంచు
                                     నౌనంటి వనిన నౌనంటి వనుచు
                    మఱవకుమిదియన్న మఱవకుమిది యంచు
                                        నీవెంత యనిన నీవెంత యనుచు
                    నొకతె మగనికి నాశించుటొప్పదనిన
                    నొకతె మగనికి నాశించుటొప్పదనుచుఁ
                    బట్టియాడె నా రంభతోఁ బ్రథమ రంభ
                   ప్రియుఁడు విలుమన్న నిలువక పెద్దరొదగ.
                               (కళా. ఆ. 3, 191–192–193–194–195–196)

                                రూపమునఁ బ్రతిబింబములు, మూటల బ్రతిధ్వనులు !

1 40 కవిత్వతత్త్వ విచారము మాటలేగాని దెబ్బల సరసము పొంతకైనఁబోరు ! కరములు అభిన యములకే గాని కొట్లాటకుఁగావని స్త్రీల నైజమతము గాదా ! ఇవ్వడు వున వాగ్యుద్ధము రేఁగుచుండఁగా నారదులు విచ్చేసి నలకూబరునితో హాస్యములాడిరి ! పిమ్మట నతఁడు తనకై పోరుచున్న రంభల నిరువురిం జూపి వీరిలో ! తథ్యమిథ్యాభావము లేర్పఱుపుఁడని వేడఁగా నా కలహ భోజనులు

             క. .. .. . . . . . . . . తథ్యమిథ్యా
                   భావంబులకేమి నీకు భావింపఁగ స్వా
                   భావికమే యీ యాకృతి
                   భావము నిజమెద్ది యూ ప్రపంచమునందున్'</poem<poem>>

   క. నీపట్టురువడ నొక్క తెఁ
    జూపి యొకతె గర్వమడఁపుచున్ వలయుగతిన్
    ప్రాపింపవచ్చు భోగము
    నీ పుణ్యంబినుమడించి నేఁడు ఫలించెన్ !
                                        (కళా. ఆ, 3. ప. 210-211)
ఆని యానతిచ్చి తమ దారిఁ దా మే గిరి. రంభ లు మరల నెప్పటి యట్ల వాగ్యుద్ధమునకుం దొరకొనిరి. అం దొక్క తె

" క. అఱపు లుడిగి పోపో నీ
      యఱచేతంబడ్డు వచ్చినప్పడు మమ్మున్
      గఱచెదవు గాని తగునెడ
      మొఱయిడు మది యెట్టి దైవములు వినియెడినో !”
                                                       (కళా. ఆ. 3, ప. 218)
  అనుటయు సత్యరంభ

             "క. కానిమ్మ వేగిరిలపకు
                  నీ నుదుటనె ప్రొద్దు పొడిచెనో యే దైవం
                  బైనను విననిప్పడె యిదె
                  నిజమేర్పరచి నీకొనర్చెద శిక్షల్י"
                                                        (కళా. ఆ, 3, ప. 220)

అని బదులిచ్చి యొక్క మంచి యుపాయంబుఁ జింతించి నల కూబరాకారునితో గల సి విజ్ఞవీగుచుండెడు రంభను 'రా' దేవ సభకుఁ బోవుదము. అని యా పెకు ఖేచరత్వంబె లేమి నాతనికిం

ద్వితీయ భాగము Í 41 బోధించుటకై పిలుచుడు, దైవమా ! ఇఁక కల భాషిణి గతియెట్లు ? కోరినవారి రూపములఁదాల్చ వరము నారదులచేఁ బడ సెనేని, కామగమనము బడయదాయెఁ, గావున రంభ చేతిలోఁ జక్కగఁ జిక్కినదై, చిన్నతనము రాకుండునట్లు బింకములైనఁ బలికి త్రోవఁ జూచి కొందమను స్త్రీ సహజమైన గరువతనంబు మెఱయ నేమను చున్నది చూడుఁడు !

“సీ. అప్పరః స్త్రీలలో నగ్రగణ్యత్వంబు
                      జగదుపత్లోకి తంబుగ వహించి
     యూర్వశీ మేనకాద్యుత్తమ స్త్రీలు రా
                     వమ్మ పోవమ్మ నా నతిశయిల్లి
      యెన్నండు నెచ్చోట నెవ్వారిచేవ్రేలఁ
                       జూపించుకొనక ప్రస్తుతికినెక్కి
      నలకూబరుండు ధన్యతముండునా గరు
                        వతనంబుచే నీకు వన్నెఁదెచ్చి
        యొప్పనే యింకఁ గడపటి నిప్పిశాచి
       నాకు సరిచేసికొని దేవలోక సభకు
       నీవు సూ నీవు నుమ్మని యేవిధమునఁ
       గలహమాడెద నిది నీవె తలఁచిచూడు."
                                        (కళా. ఆ, 3, ప. 228)

క. కోపము పాపమునకుఁ బొ
   తపెనుఁదగవునకుఁ దగఁగనే తిట్లాటల్
   ప్రాపించునో పడంతుల
   కోపురుషశ్రేష్ట యవియు నొక్క బ్రతుకులే ! 229

వ. ఆదియునుగాక.

క. రంభకు నహహా యొకప్రతి
    రంభ గలిగి తిగిచి తెచ్చె రచ్చల కనినస్
    స్తంభింపనీరు హాస్యా
    రంభణ మీపోరు నిర్జరవిటుల్ నగుచున్.

230

క. నానడకలకును యోగ్యము
   గానిది యిపు డిచట నైనఁ గలహమ, బ్రదుకె
   ట్టెన నగుఁగాని యిఁక నీ
   యాన ధరణి విడిచి దివికి నడు గటు వెట్టన్ ! 231

142 కవిత్వతత్త్వ విచారము

క. ఈ కలహ మపుడు వినఁబడు
      నాకంబున సురల యూననము లేగతి నా
       లో క్రింతుఁ దెగినఁ దెగనీ
      నాకు మరుఁడు నిన్ను నిలుమనన్ రాకురునికిన్ ! 232

\

ఇప్పడే కాదు. ఇఁక ముందును నాకలోకమునకు నడుగు వెట్ట
 దఁట ! మనుష్యాంగన పోఁ జాలదు. ఈ లోపముఁ గప్పిపుచ్చుటకై
యేమి యుక్తి ! ' మఱియు తెగినఁ దెగనీ నా కుమరుఁడు" అనునది
'కార్యము మించిపోయినది యోటమి తప్పదు " అని యెఱింగియు,
 తానే ముందుగా నతని వదలినట్లు నటించియైన మానము రక్షించు
 కొందు ను అని యెంచి చేసిన యింకొక యుక్తి యిది ! సరి. నల
 కూబరుఁడు సంశయాత్ముఁడై యా పెను మెడపట్టి పాయం ద్రోసెను.
 నిర్దిద్ర మోహఫలమా యిది సత్యరంభయు నాయు మను కత్తిచేతఁ
 గాయము వాయుము, అని శపించెను ! ఉదార చిత్తులకు కష్టములే
 గదా ప్రాప్తి ! కలభాషిణి యేకచిత్తయై యిన్నేండ్లు తపించినందు
 లకు ఫలము లిట్టివి ! అయినను పరునిచే నా క్షణ కాల మా దరింప
 బడుటయే ఈ కడగండ్ల కెల్ల మించి మీఱిన ప్రతిఫలముగా నా మహ
 నీయురాలికిఁ దోcపక యుండదని నమ్మెదను ! గొప్పవారికి వ్రతమే
 సుఖము . తుచ్ఛులకు సుఖ మే వ్రతము ! ప్రబంధములోని నాయ
 కల కెల్ల నీ కల భాషిణి శిరోమణి వంటిదగుటను. కవి యొక్క చమ
 త్కృతిని విడఁదీసి చూపుటకునై యీ ఘట్టము నింత విస్తరించి
 ప్రదర్శించినాఁడను. పాపము. ಇಲ್ಲು ఖిన్న మానసరైన యవ్వర
 వ ధూతిలకంబు కల భాషిణి యేగుటయు, నాయమదలఁచుకొన్న
 మన కెల్లరకు దుఃఖము రాకపోదు. ఇక రంభం దలఁచికొన్న
 నవ్వు తప్పదు ! ఏలన ఇంత గాఢముగ నా దైవత కాంత కొట్లాడిన
 దెందుకు ? నలకూ బర ప్రాప్తికై దొరికిన దెవ్వరు ? ఆ మోటుదపసి
 మణికంధరు డు ! వానియొక్క నిజము c దెలిసి యుండి నయో డ
రంభ ఛీ యని కన్నెత్తియైనఁ జూడక యరిగియుండదా ? ఏమో
 యింద్రు డాజ్ఞపించెనని వానిం గలిసి నది గాని మోహము చేఁగాదు
. మనసులేని పరిణయములో cబడి స్రుక్కు చుండవలెనని స్వతంత్ర
 లైన పుణ్యాంగనల కేమి విధి !
       'సరే కాని, కల భాషిgటికి మాత్ర మిట్టి యనిష్టము ప్రాప్తింప
లేదా ! ఆ పె గోరినదియు నలకూబరు నే, తుదకు ననుభవించినది
 మణికంధరుని. అట్లగుట రంభకన్న నా మె యెట్లు పరిహాసమునకుఁ

 ద్వితీయ భాగము 143

దకువపాతము ? అని యడుగుదురేమో ! ఈ వివరమిఁక ముం దేర్పడును. మణికంధరునితో డి కూటమియు నా పెయొక్క వాంఛి తంబ కాన దాని చే విమనస్క త యూ పెకుఁ బాటిల లేదు .

ಇట్ళు రంభ నలకూ బరునిం గూడి తనకు విజయము సిదించి
 నను , అతనికై తాఁబడ్డ పాట్లుదలఁచి, ఇది వఱకు వైరముచే దన
 యందు నుదయించిన స్టైర్యము, కాఠిన్యము నా వైరితోడ యంత
రాన మొందఁగా, సీ జన సహజమగు మెత్తఁదనము తన్నాక్రమింప,
మేనసు నొప్పిచేఁ గోపంబు వగపుగా

సీ. .....................................
    ప్రియుఁ జూచిఁ జూచి మగవారి ప్రేమ లిట్టివిగదా
                    యాట్ట్ నమ్మఁగవచ్చు నిచ్చలోనఁ
    బ్రాణాశ యటు దండవాసినమాత్ర నీ
                     ద్రిమ్మరి నెచ్చోటఁ దెచ్చికొంటి
   నిన్ను నేమన నున్నది నిరభిమాన
   గుణత నినుఁ జేరు నన్ననుకొనుట గాక
   నాకునా యిన్ని పాట్లంచు" నా కులమతి
   నడలెఁ గన్నుల బొట బొట నశ్రులొలుక.
                                                 (కళా. ఆ. 3, ప. 241)

ఆహా ! యీ సంగతి యెంత స్వభావికముగ నున్నది? సవతి
యుండువఱకు గన్నుల నిప్పలు. అపె పోయిన వెంట గన్నుల
నీళ్ళు! ఒక నిమిష మెండ. మఱునిమిషము వాన ! ఈ లీలా
లాలిత్యము ప్రెమ భరాలసలగు స్త్రీలకే కదా ! కొందఱు దీనిని
చపలత యందు రు . ఈ చపలత లేకున్న వారికట్టి యాకర్షణ
శక్తియు మనసుల రంజింపఁజేయు పటిమయు నుండునా ? నిశ్చల
తత్త్వము లెవరికిఁ గావలయును ? జడులైనవారికిఁ దప్ప. స్త్రీల
యందు కోపము మిక్కుటమైన దాని ప్రతి కార్యమగు నేడ్పును తప్పదు.

వియో గాంతముం గాంచిన యీ వధూవరు లిట్లు ఒండొరుల
నూ రార్చుచు ను పశమన క్రియల కుత్సహించుచుండఁగా.

“మ. .................. . . వేబొక్కడం
     తనవచ్చెన్ నలకూబరుం డచటికిన్ 'నా రూపమందాల్చి వం
     చన నెవ్వాఁడుర చేరినాఁడఁట దురాశన్ రంభా' సంచున్ వెనన్?"
                                                      (కళా. ఆ. 3, ప. 243)

144 కవిత్వతత్త్వ విచారము వీడేఁ నిక్కంపు నలకూబరుఁడు. పురుషులలో నీసును రోష మును హెచ్చిన నవి మాటలఁ దీఅవు మఱి పోటుల దీఱుఁగాని, వచ్చిన రెండు నిమిషములకే వాదములు. సత్యములు, సామెతలు వీని పొంతఁబోక ప్రధాన కార్యమున కాయత్తుఁడై రెండవ నల కూబరుఁడు

          "మ. మది నా మాటలు నమ్మవేనియు నిఁకన్ మమ్మిద్దరటన్ దైర్య సం
                 పదఁ బెంపారఁగ దవ్వల న్నిలిచి యోపద్మాక్షి! వీక్షింపు మే
                 నిదె ఖండించెద వీని మామకమహా హేతిప్రకాండంబుచేఁ
                దుదశోధించెదు గాని నీకుఁగల యుక్తు ల్మీఱ నాసత్యమున్."
                                                                   (కళా. ఆ. 3, ప. 249)

అన్నాడు. న్యాయనిరూపణమునకుఁ గత్తుల వంటి ధర్మరాజు లెవ్వరు లేరని గదా మగతనముగల వారి సహజమతము ! యుద్ధ మను మాట లేచుసరికే, రంభ తన కృత్రిమనాథుని గట్టిగా బట్టు కొని, యే జగడము ప్రారంభము గాక మున్నే,

“చ. ... ... ... ... ... భూరికృపన్ నను గావ రే ప్రియన్
     మనుపరె వేల్పులారా ! యొక మాయపురక్కసుఁ డాక్రమించి తాఁ
     దునుముచు నున్నవాఁడలుకతోడ నిరాయుధు" నంచు........
                                                      (కళా. ఆ. 3, ప. 250)

రం నేడ్చుటకు మొు ద లిడినది . ఈ యేడ్పునకుఁ గారణము భీతి. దీనికి ముందేడ్చినది కొట్లాట, కోపము, వీని చేనైన యల సట, కోలు పోయిన యభిమానము, అలుక ఇత్యాదులచే నైన వ్యసనభావముచే.
          నారదుఁడు రంభ ల నపహసించి పోవు వాఁడు ఊరక పోలేదు. నలకూ బరుని కడకుఁ బోయి యతనితో 'నీ యాకారము దాల్చి యిం కెవ్వడో రంభను గూడియున్నాఁడు. త్వరలో వెళ్ళి సొత్త దక్కించుకొనుము' అని యుపదేశింపఁగా నాపల్కుమై సత్య నలు కూబరుఁడు వచ్చి యా మిధునము యొక్క సల్లాపములకు విమాత మొనరించెను. పిమ్మట నయ్యిరువురు బాహుయుద్ధము నకుం గడఁగి పోరు చుండcగా భ

"ఊ. ................................ నిలుండు నం
    రంభము మాని యేనడుగు ప్రాక్తనవర్తన మొక్కటిన్ రహ
    న్సంభవమైనదాని వరుసన్ వచియింపుడు మీఱ లిత్తన్'
                                                            (కళా. ఆ. 3, ప. 269)

ద్వితీయ భాగము 145

అని వారి నిల్పి 'కళాపూర్జుఁడను వాని విషయమై మన కేమి ప్రసంగంబెచ్చట( గలిగె ననీ యడుగఁగా ప్రథముడు నిరుత్తరుఁ య్యె. ద్వితీయుఁడు సరిగా నుత్తరంబిచ్చె. అతను రంభ జుగుప్సతో 'నీ రోతవానిచెంత నిన్నా శ్ళెట్లుంటినో దైవమా!' యని వాని న్విడనాడి కుబేరుతనయుం బరిగ్రహించె. అతండు మోసగాడైన మణికంధరుని నల్పావశిష్టాయువుఁగా శపించె.

స్త్రిపురుషుల భిన్నప్రకృతు లీవర్ణనములచెంత విశదముగc జూపcబడినవి ! తా మవ లబించు పద్ధతుల భేదమున్నను గామ మను పురుషార్ధమందు స్త్రీ పురుషు లిరువురు సమూనలాల సులు గదా ! మఱియు రాగవిషయమైన యీర్ష్యయందును తుల్యస్వభా వులు. స్త్రీ పురుషుల యీ సహజమగు నేకీభావమును గవి మరువ లేదు. చూడుడు

కల భాషిణి మాయదారియని యేర్పడిన పిదప నలకూ బరా కారుఁడు ఆ పెంజూచి 'నీ పేరెయ్యది యెట్టిదాన ? ' వని యుడిగె, అప్పడు తత్ ప్రతిరంభ సైరింపక :

"శా. ఇందాఁకన్ నినుఁ జేరనీక ననునట్లేంతే మనోజవ్యథన్
      గుందంజేయుట చాలకేమడిగెద గొంటనన్వృధాయంచు,నా
      కందర్పత్వరఁ గానలేవనుచు నొకంజాక్షిఁ బోఁద్రోబ్బెఁదా
           నెందున్ నిల్గనీక పేరవఁలుకతో నెంతేఁగడున్ దవుగన్."
                                                       (కళా. ఆ. 3, ప. 235)

వైరితో మాటాడుచున్నాఁడే యను నీసును దొట్రుపాటును దో పగా రంభ త్వర పెట్టుచున్నది. ఆ ఘట్టముతో సమవర్తనము సమన్వయమం గాంచు లీల నిప్పడు, అడుగునది స్రి. ఈర్ష్యయునా త్రముc జూపువాఁడు పురుషుఁడ

వ. రంభ యక్కపటవ ర్తనుంజూచి నీవెవండ వెవ్విధంబున నిట్టి రూపంబు
     ధరింుంచి నన్ను వంచించితని యడుగుటయు నత్య నలకూబరుండు.

సీ. ఇందాఁక నినుఁ జేరనీక నన్నిట్లల*
     యించుట చాలక యింకనిలిపి
     వాని నేమడిగె దెవ్వడు గాక నీకేమి
     యిది కాకదంత పరీక్షనుమ్ను |

  • ఇరువురి వాక్యములయు భావములయు సాదృశ్యము గమనింపుఁడు. ఆపి మాటల నాపె మీఁదనే ప్రయోగించుచున్నాఁడు.
146 కవిత్వతత్త్వ విచారము

నామన్మధార్తియెన్నఁగవలదే చాలు రారమ్మటంచు నారంభ నపుద తోడ్కొని చనియెడు వేడ్కతో మోముఁ దా మర వికసింపఁగా సురపథమునకు........ (కళా. ఆ. 3, వ. 271, ప. 272) దొంగ, వైరియని దె లి సి యు సాంతము గా వాని చరిత్రము సావకాశము గా వినుటకు రంభ గోరినఁ జూచి నలకూ బరుని మనసు మొగము లెంత కమలిన వో ! * నే నిక్కడ సమస్య విడదీసినట్లు వ్రాసియున్నాను. కావ్య ములో నెవ్వరెవ్వరైనదియు చతుర్ధాశ్వాసములోని కొన్ని భాగము లం జది వినఁ గాని గోచరింపదు గాన, తుదముట్టువఱకు సంశయ ములు దీఅవు. అద్భుతరస మన్ననో యడుగడుగునకు, గొంత పెరుగు చుండును. ప్రథమ రంభ యెవరు ? తత్ ప్రతి రంభ యో వరు ? నలకూబరులెవ్వరు ? పాపము, కల భాషి టిని అనిష్టు c డెవఁడైనఁ గలఁచెనా ? నిర్వికల్పచిత్త సిద్ధివికల్పముం ל סס: סיז ఇట్లని యనేక విధంబులC బలవరింపుచుఁ గలవరింపుచు భయభ్రాంతులతోఁ జదువు దుము. వీరల స్థితిగతులరయువ అకు నన్యచింత యను పేరైననుండదు. చదువరులకిట్లు విస్మయము, సంభ్రమము సావధానత గలిగించు కృతు లాంధ్రంబున నింకెవ్వి యును లేవు. శృంగార విశేషములు భావనాశక్తిలేని కవులనేకులు శృంగార వర్ణనలు చేసి యున్నారు గాని యు వి రెండు- విధముల దుష్టములు. ఒకటి, వారి శృంగారమనునది తుచ్ఛసుఖ విషయాసక్తియైన శరీర తాపము గాని మనో రాగము గాదు. రెండవది, శృంగారమును నాయికానాయకుల చిత్తప్రకృతుల ననుసరించి యనేక రీతుల నుండునని మనవారికి C దెలియదు గాఁబోలు ! జావళీశృంగారముఁ దప్ప నిం కేరీతియు వా రెఱుంగరు . అందఱి శృంగారము నొక రుచిగలిగినదే. నానా భంగులఁ గాక, యేుకరీతిగా నెల్లెడల నుండుటచే రోఁత గలుగక మాను నెట్లు ? అసలు వాస్తవమైన శృంగారముగాదు. మఱి దానినే యమి తరాశి గా ముందు దెచ్చిపెట్టి ప్రతిదినమును ఆరగింపఁజేయు చుండిన నెట్టి మోటుపందికైన వెగటు రాదా ? కళాపూర్ణోదయమున నైదునకుఁ దక్కువగాని విధముల ద్వితీయ భాగము 147 శృంగారము వర్ణింపఁబడియున్నది. ఇందు జావళీలకుఁ జేరినది యొకటి మాత్రమ. అయ్యది యప్రశస్త మనఁదగిన భాగములో నుండుటచే దాని ప్రస్తావన యిటఁ జేయను. తక్కినవానిలో నొక దానివలె నొకటి యుండదు . అన్చియు రమణీయముల. కామము అనునది జాతి. సామాన్య ప్రబంధకవులకు దెలియకున్నను దాని యందు పజాతులు లెక్కకు మీఱి యున్నవి. స్త్రీ పురుషులలో ప్రతి వారు ను వలచు విధములు వేఱు. ఆచారము రీతిఁ జేయఁబడు తిలకవ స్థాది రచనలో సయితము తమకు సొగసులని తోఁచెడు భంగుల చిత్త మేర్పడునట్లు పచరింతురు గాదె ! ఇంటి పెద్దలు, ఇరుగుపొరుగు వారు c జూచి పది మాటలాడుటకు నాస్పదములైన బహిరంగపు వర్తనలయందే వ్యక్తి సర్వవ్యాపిగా నుండఁగా, మన సులో నుద్భవిల్లు రాగము ల లో ప్రత్యేక భావములు చందములు నుండక యచ్చుగొట్టిన రీతి నందఱు నేక గతిం జరింతురా ? సంపూర్ణమగు ననువర్తనము తలపాగఁ జట్టుటలోనే లేదఁట ! ఇఁక మనసును గన్నును పోవు జాడలలో నుండునా ? శృంగారము శాస్త్ర ప్రకారముగాఁ దీర్పఁబడు విగ్రహము గాదని యెఱుంగని మన వారి విలక్షణత నేమనవచ్చును ? సామాన్యముగఁ జైతన్యముల లోనే యేక క్రమము అప్రకృతము. మానవులలో నదిచెల్లునా ? సాధ్యమా ? ෆු උද් మనుష్య భావముల నెల్ల నుత్కృష్టతరమగు చెూహమున కట్టి జడ సంప్రదాయము శక్యమా?

         మనకవ లీ సంగతి నెఱుంగక కామమునకు నాచారము c దీర్చియుండుటకుఁ గారణములు, వారి మౌఢ్యము, హిందువుల జీవితము యొక్క రీతియును. ఎట్లన, “మన లోఁ బెండ్లికి మనసు నకును సంబంధములేదు. పరిణయము వ్యవహారములలో నొకటి. చిత్తజము గాదు మఱి పితృపితామహజము. మనసును నిరోధించి పీడించు వర్గములలో ముఖ్యములు జాతి భేదములు. తమ తమ యుపశాఖలను మీఱి హృదయము వ్యాంపింపఁ గూడదఁట దీని వలనఁ గలుగు ఫలమే మనంగా, అమనస్క వివాహములు. అనఁగా దేహ మొకచోట చిత్త మింకొకచోట. మాట లిక్కడ తలఁపు లక్కడ. చిత్తము శివునిమీఁద. భక్తి రంకులాఁడిమీఁద !"
            అటగుట వధూవర సంగమము ఆచారాను సరణముగా ఁ జేయఁబడు కర్మము, ప్రాయికముగ కామిత మనుట కల్ల. పెండ్లిం బట్టి చిత్త వికృతయును శృంగారభావమును, చట్టదిట్టముల ప్రకా రము అలంకారాది శాస్త్ర సూత్రముల యూదేశము చొప్పనఁ, బోవు 148                     కవిత్వతత్త్వ విచారము

వినయ మర్యాదలుగల మంచివస్తువని యెంచిరో ! సందేహమేల ? యెంచిరి. మనవారి నమ్మిక మీరెఱుఁగరా ? కూతురా ! ఫలానా పక్కీరు శాస్త్రి నీకు పురుషుఁడు. నేను నిర్ణయించినాను. నగలతోడ నీ మనస్సును మూటంగట్టి వాని యింట్లో పదిలము గానుంచి సుఖపడవలసినది. నా మాటయిది. ఇంక నీ కేమి యీ పనితోఁ బెత్తనము ? చెప్పినట్లు చేయుమనియే గదా తలి దండ్రుల సంభావన ! పెండ్లిలో నన్ని మంత్రములు C దంత్రములు నుండును. ఒక్కటిదప్ప ! ఎయ్యది ? ఆత్మతంత్రము వివాహము సంస్కార మఁట ! హృదయ బహిష్కారమనఁ గూడదేమో !

ఇట్లగుట శృంగార భావములును నోరు లేని కొడుకులుc గూఁతులుంబలె శాస్తో పదిష్ట క్రమముల మేర మీ అక యాచారముల ననుష్టించి సర్వసామాన్యముగ నుండునని భ్రమించి, ఈ సామాన్య స్వరూపము నలంకార శాస్త్రములు కనిపెట్టి వెల్లడిచేసినట్లు మఱ యొక్క భ్రాంతింజెంది, యవి చెప్పినట్ల తఱచు మనకవులు వ్రాసి యున్నారు. కామమునకు C గారణ మొక్కటిగాదు. మఱి పెక్కులు. పోవుమార్గములు, ಶೌ ಲು) ఉపభావములు, చూపు చిన్నెలును ప్రతి వారియందును నవీనములు. అనన్యములు. ఫలములు నట్టివే. పేమచే విషముఁ బెట్టువారు లేరా ? తన కుం దక్కకపోయిన నొరులనుం జెందఁ గూడదని హృదయ ప్రియులను గొందఱు మృత్యువు వాతఁ ద్రోయుదురు ! కొందఱు ప్రాణములనైన నర్పించి వారికి మేలుచేయు జూతురు. బలాత్కరింప నెంచువారు నున్నారు. పరస్పర ప్రీతిలేని కూటమి హేయమని రోయువారుం గలరు. భయము, శోకము మొదలగు వానిచే వికలితస్వాంతలైయుండు స్త్రీలమూర్తులు గొందఱకు నాcప రాని మోహాతిరేకముఁ గలిగి o చును ! శాస్త్ర దృష్టితోఁగాక దేవుఁడిచ్చిన సొంతపు గన్నులతోఁ జూచు వారికి నిట్టి విశేషములు సులభముగ గోచరింపఁ గలవు.

సూరన ప్రతిభావంతుఁడు. కనుక సంపూర్ణముగఁ బాండిత్య బద్ధుఁడు గాఁజాలఁడు. స్వశక్తియే గురువుగ నూతన మార్గములం ద్రో క్కి యాతఁడు ప్రకటించిన యసాధారణ శృంగారములకు ముఖ్య నిదర్శనము లీ క్రిందివి. శల్యాసుర విషయము. సుగాత్రీ శా లీనుల వృత్తాంతము. సరస్వతీ చతుర్ముఖ విలాసము. కల భాషిణీ చరిత్రము. శల్యాసురుని కథ శల్యాసురునిఁ గూర్చి చెప్పవలసిన సంగతులు కొన్నియే.  ద్వితియ భాగము 149

మృగేంద్రవాహన తన బంధువగు మహిషాసురుం జంపిన సూడు మనంబునం బాయమి C బగCదీర్చు నుపాయము నన్వేషించు చుఁడగా, నభినవ కౌముదియను చంద్రకిరణ సంభూత యప్పరః కన్య యెదురైన C జూచిన మూ త్రాన హృదయమును, 39 హృదయము తోడ నిన్నాళ్ళుగా పట్టిన పట్టును గోలుపోయినవాఁడై, నన్నేలు కొమ్మాయని యూ కాంతను వేఁడుకొనఁగా, నా మెయు c జల ఁబు దాల్చి వదియై

క. ............నిన్నుమదైంచినవా నిని దక్క నే వరింపను వినుమిది నా ప్రతిన దీని విడనిఁక ననియెన్. (కళా. ఆ. 6, ప. 39)

చ. ఆనుడుఁ దదు క్తిక్రూరతకు నద్దనుజుండు గడుస్ పునంబుగాc గినిసియుఁ బోవనిచ్చె నొక కీడును చేయక యవ్విలాసినిన్...... (ప. 40)

   ఎంత బలవంతులైన నేమి ? క్రా మినీ కటా క్ష పాశ బద్ధు లేమి చేయఁగలరు ? మోహము యొక్క ప్రభావ మద్భుతము. క్రూరు లను మృదు చిత్తులC జేయును. మృదు చిత్తులఁ గ్రూరులC జేయును ! ఏనుఁగును బిసతంతువుతో ఁ గట్టినట్లు ప్రబల వీరుల నిస్సత్త్వులంబలె బంధించును ! ఈ శల్యాసురునిఁ దలంచుకొన్న సంతాపమయ్యెడి ! పాపము ! నేఁడు గాకున్న నింకఁ గొన్ని యేండ్ల కైనఁ దన నిర్వికల్ప హృదయ సమాధింజేసి, ప్రీతి మైCగాకున్న దయచేనైనఁ జేపట్టదా యని కాలము వేచియుండిన నిష_పటి ! నిశ్చలమైన మోహముగలవారు కాలము నోర్చుటకు శక్తులగుదురు. ప్రబంధ స్త్రీపురుషుల యొక్క తహతహలు తొట్రుపాటులును తఱుచు చాంచల్య భావులకుఁ జేరినవి. గొప్పవారు మనసులు గల సినఁ జాలునని కాయసాయుజ్యము చిరమునఁగాని లభింపక పోయినను ఓర్పుతోనుందురు. అంగసుఖము నభిలషించు తుచ్ఛు లకు సంభ్రమము సహజము. దమము మొదలగు ను దారగుణము లుండవు. ఐరోపా కవులు వర్ణించు శృంగారములో దేహ సంయోగ ముంగూర్చిన వేగిరపాటు అంతగా నుండదు. హిందూ దేశములో నాదిమధర్మము ఇంద్రియ నిగ్రహమCట ! ఇది యే మాత్రము స్త్రీ పురుషుల లక్షణ మో కావ్యములC జదివినవారికి తెలియును !

9ویچہ؟ నోటిలో సదా వేదాంతములు పలుకుచుండువారియంత దుర్మారులు

  • 150 కవిత్వతత్త్వ విచారము

లోకములో నుండరనుట కిదియొక తార్కాణము. సనాతన ధర్మ

గ్రస్త మీదేశము ! ఐరోపా వారు తఱుచు హేతువాదులు. పరమ0
గూర్చి పెదవుల చేటుగా జపించువారము మనము, ఇహమునం 

దాసక్తులు వారు. అట్టండియు నాజనములలో నుండునంత

యింద్రియ నిగ్రహ మిక్కడ నున్నదనుటకుఁ గాదు.
     ఈ సల్యాసురుఁడు ప్రబంధనాయకులకన్న నిస్సంశయముగ
మేలైనవాఁడు. మృగేంద్రవాహనా శక్తి యిచ్చిన య మోఘమగు 

కత్తిందాల్చి మణికంధరుని నరయుటకై పోవు నభినవ కౌముదిం

గాంచి, తన్నే చంపుటకు వచ్చుచున్నదో ! అట్లైనం దన్నుం జంపు
వారు చత్తురను నమ్మహాశక్తి వరమున్నదిగదా ! అట్లగుట నా పె
నాశమొందునో యని, తన పాటూమాచి, ప్రియు రాలి శుభాశుభ
ములం దల పోయుచు నా సాధు,
 చ, • • • • • • • • ...నంభ్రమించుచున్
మతిగలఁగంగనిట్లనియె నాపయి వచ్చిన నీకు నిష్టదై
వతముల యాననుమ్ము ! వరవర్టిని ! యెందుఁదలంక నేను  దు
ర్మతినయి నీవు నాకుఁదెగి వ్రుగైదవో యని తల్లడిల్లెదన్ !

సీ. అనుడు నయ్యింతి యోయసురేంద్ర నీవు నా

                  హానికి నోర్వ కిట్లాన లిడఁగ
 నకట నీమీఁద రానంత యెఱుంగని
               దాననే యేను నీ తలఁపు బడిన
నడిచెద నని తన్నుఁ గడచి చనంగఁ ద
                 ద్వాక్యరీతి నిజాభివాంఛితమున
కనుకూలమైన యట్టె తోఁచుటయు నతఁ
               డక్కన్య వెనువెంట నంత నంత

నరిగె నెందును నిలువక యజ్ఞముఖియు మిగుల నెడఁబాయ కొక్కొక్క మిషముతోడ నప్పటప్పటి కొక్కింత యూలసించి కూడనిచ్చుచు నెలయించికొనుచుఁ జనియె.

                                                (కళా, ఆ. 6, ప. 62–63)

నమ్మినవాఁడు కవుడులేని మానిసి ! వానిని మోసగించుట యేమికష్టము ! ఆ యప్సరసయందును దోషములేదు. ఇష్టములేని

వాఁడు పైఁబడ గమకించిన ద్వేషముఁబూనని స్త్రీలుందు రా ? ఐన
Jక్కటి, వధకు నుత్సహించినను గొంచెము కనికరముఁజూపి

器。 ద్వితీయ భాగము 151 యుండిన నా కాంతకు గౌరవము హెచ్చుఁగాని తగ్గియుండదు. నిండుమనస్సుతో [పేమించిన వాఁడెంత యనిష్టుడైనను, దనకింత మనోహరణ శక్తి యున్నదిగదాయని సంతోషమును, ఈ నిరాశ కి ప్లేల యితఁడు బలియగుచున్నాఁడని పశ్చాత్తాపమును ఏమాత్రముం జెందని కఠిన హృదయులగు స్త్రీలుందు రా ? యోజింపడు. ఇట్లు తన్నలయించుచుం బోవుచుండఁ దన ప్రతాపము ఆ పె కెఱుకపఱుచువాఁడై యా పెను దాఁక కుండునట్లు శలల ప్రయో గముఁ జేసి జంతుజాలంబుల సంహరి(చి యిట్లనియె : "నన్ను వరింపుము. లేనిచో నీవు చనెడు చోటులన్నియు నా బలముచేత నాశముచేయుదును. దాన నీకు నపకీర్తి కాన నాపయింగూర్చి కరుణ లేక యున్నను, భూతకోట్ల రక్షింపవలయునను దయచేనైన నాకుఁ బత్నివగుము' అయ్యో ! వానియూర్తి యెట్టిది ? తనకుఁ బరమార్ధము ఆ స్త్రీ. ఆమెను నొప్పింపడు. ఆమెపైఁ గినియcడు. ఇcక లోకమంతయు హింసి :చి, యూ హింస మాన్పుటకై యా పె యంగీకరించినను జాలుననుచున్నాఁడు. ఆహా ! కాఠిన్యము మార్ణవము రెండును వానియందున్నవి గదా ! మఱియు నీ కాఠిన్య మునకు మార్దవమే కారణము ! మోహమాహాత్మ్య మిట్టిది. వెన్న ఆూయగు ను . ఆూయి వెన్నయగును ! తన్నీరీతిని వెంబడించు నా యుసురను మణికంధరునిచేతఁ జంపించి, పిమ్మట నా మణికంధరుని రెండవ జన్మము వేచియుండి యు తఁడు గళాపూర్ణుఁడై జనింప తన పూర్వవృత్తంబు వివరించి గాంధర్వవిధిని వివాహమాడి యఖి నవ కౌముది, పట్టమహిషియై యుండెను. శల్యాసురుని తరువాత గతియే మా యనో తెలియదు. వానిది వ్యసనకరమును వ్యర్ధమునైన శుష్క జీవితము ! నిష్కళంక ప్రీతిచే విశోభితము. సుగా త్రిశాలీనుల విచిత్రకథ సుగాత్రి శారదపూజారియైన యొక బ్రాహ్మణునికూఁతురు, దాని వరుఁడు శాలీనుఁడు. ఇల్లటపుటల్లుఁడు. అలంకారములు, డంబములు, అట్టహాసములును వీనికి సరిపడవు. పల్లెటూరివాఁడు ಏುಣ వాసుల కుర్చీలు, మేజాలు, నిలువుటద్దములను జూచి వెఱఁగు వెఱపు నంది పోవు మాడ్కి, నేయలంకారములు లేక యుండు వారినే గాని, తళతళలు, పళపళలు, ఘలఘలలు, ఘుమఘుమలు మెరయవచ్చెడు స్త్రీలC దిలకింపఁడు. సర్వ 152 కవిత్వతత్త్వ విచాఠము శృంగార సన్నాహములతో భార్య పడకింటికి రా c గా, ఇదేమి కొఱవి దెయ్యమో , గజ్జలపిశాచ మో యుని కన్నెత్తియైనఁ జూడ కుండెను ! ఆ భార్య కాపురుషుని తిక్కతెలియదు. శాకుంతలము లోని “మ. నలినంబెంతయు నాచు చుట్టినను విన్నాణంబె చూపన్ గడున్ మలినంబయ్యను, మచ్చ చంద్రునకు సౌందర్యంబె కావించు, వ ల్కలముంగట్టియు నీ లతాంగి గడుఁ జెల్వంబందియొప్పారు, మం జులమౌ రూపు నలంకరింపనిది యొచ్చో నేదియుం గల్గునే?* అను పద్యము యొక్క స్వారస్యము నీ సుగాత్రి యెఱుఁగు నంతటి ప్రాఢయై యుండినయెడ, కొందఱు రసికులకు సహజ సౌందర్యము వలె మనోహరమగు రచన యొద్దియు లేదనియు, దివ్యసుందర విగ్రహయగు తరుణికి సామాన్యపు గడు సుచీరలు, తాటాకుల కమ్మలును ధరించిన నదియు మనసును నీరు గా(జేయు ఒక విశేష మైన చెలువ మనియం నా మెకుఁ దెలిసియుండును. వేపల్లెలోని గోపికలు పట్టుచీరలు, సరిగె వస్త్రములు, నవరత్నఖచిత భూషణ ములును లేనివారు. నయమైన పట్టలుగట్టి, పూవులతో నలంకృత లై యే పనిపాట్లు లేక యుద్యాన వనములలో చివ రాకు మెత్తల మీఁదఁ బొరలాడుచుండు రాచక న్నెలవలెఁ గాక, వెన్నలC దీయుట, ఆలC గాంచుట, గృహకృత్యముల నెఱవేర్చుట మొదలగు శ్రమములచేఁ బ్రొద్దు పుచ్చుచు దేహముల నారోగ్యముగను, మనసుల C గపటము కాఠిన్యములేని విశుద్ధములుగను నుంచి కొని యుండెడి వారు . అట్ల య్యును ప్రబంధ నాయికలకన్న నెన్నియో ముడుంగులు వారు ప్రీతికరలనుట భాగవతములో దశ మ స్కంధము C జదివిన వారికి వేఱుగఁ జెప్పవలయునా?t శాలీనుఁడు రసిక శిఖామణి కాబోలు ! తన భార్య కృత్రిమములగు తళుకు బెళుకులను వదలి గొల్లభామ రీతి నున్నఁగాని దగ్గఱఁ జేర్పనని సంకల్పించి కొన్నాఁడేమో ! అత్తగారు ఇంక ను శ్రద్ధతో సాగసులు దిద్దిదిద్ది కూ (తును రెండు మూఁడు నాళ్ళట్లయని పెను. వృథా ప్రయాస ! "వట్టిరాక సో క్ర లొనర్చె వాని సతియు". పెండ్లి కూఁతు రూరక యుండి నను జెలికత్తె లూరకుందురా ? జీతములకుఁ బ్రతిఫలముగా బోధనలు 来源 ఈ పద్యము రచించినవారు మామక మిత్రులగు రా, అనంత కృష్ణశర్మ గారు. మన నాటకములలో వీరిని రాజస్త్రీలవలె చిత్రించియుండుట రనభంగము. ద్వితీయ భాగము 153 చేయని చోఁ గృతఘ్నత యుని యే మో ! ఆ లజ్ఞావతికి నే కాంతంబున నిట్టనిరి : ఆ. పాలఁతి ! యూలిమగని పోఁడుము లేమియుఁ గలిగినట్టి చొప్ప గానరాదు మీ తెఱంగు చూడ మేల్మేలు దంపతు లిరువురును వివేకు లేమిచెప్ప o (కళా. ఆ. 4, ప. 65) క. కాంతుఁడు చితజ్ఞుఁడైనను కాంతకు సిగ్గువడఁ జెల్లుఁగాక కటకటా ! కాంతుఁడు సిబ్బితికాఁడై కాంతయు నట్టెననెట్లు కాపురమింకన్. 66 ఆ. నలినవదన ! యెన్ని నాక్ళైనఁ జిన్ని కూఁ తురవుగావ నివు తొడఁగి పలికిఁ దగిన సేవఁజేయు కగునె యూరకయుండ నాతఁడేమియు ననఁడనుచు నిట్లు. 67 క. మగవాఁడు భాగ్యవంతుఁడు మగువకు నొప్పగునె యిట్లు మానపుబిగి గ ట్టిగఁ దాల్పఁ దనంతన యూ డిగ మిటునటు సేయ నతని డెందము కరఁగున్. 68 క. గారామునఁ దోడ్తోడన రారమ్మనఁ డనుచు మగుడి రానేటికిఁ గ ర్పూరంబుతోడి 2יה?יס లీరాదోయాకు మడచి యీ రాదొ ! చెలీ ! 69 క. వెంగలివి గాక నీవో యంగన భోగములపంట యామనియగు నీ బంగారు వంటి ప్రాయము సంగతియే యకట ! రిత్తశయ్యకు నొనఁగన్, 7 0 క. యావనము గలిగినప్పడ పూవుంబోఁడులకుఁ బతుల భోగంబులుగా కావిభవములకుఁ గొఱయే యోవనజా లౌక్షి ప్రాయమడిగిన వెనుకన్. 7 1 154 కవిత్వతత్వ విచారము క. ఆన విని యీ పెడమాటల నను నేటికిఁ జంపెదరు వినన్ సైపవునా కని సిగ్గునఁ బలుకుచునాఁ డొనరిచి చూచెను దదీయ యుక్తుల తెఱఁగున్” 72 ఈ సంభాషణ యతి మధురము. అక్లీ లావాక్యములు లేవు. జాతీయములు. లోకోక్తులు వీనిచే సువాసితము. చెలికత్తె లిట్లు గరువముగా C బలుకుట కావ్యములలో నరిది. కడపటి పద్య మత్య ద్భుతము. ముగుదక న్నెయొక్క బయటి సిగ్గును, లో నియూ శను సొగసుగఁ జూపుచున్నయది ! ఈ నూతన చికిత్సలు ఫలమీయక పోయెను. పాపము ! సుగా త్రి యేమి చేయును ? రాజకుమారిగా నుండినచో c జందనా దులఁ బట్టించుకొని చిగురుటాకుఁ బాన్పుపై హాయిగా మూర్ఛవోయి యుండును ! పూజారిబిడ్డ. శాస్త్ర ప్రకారము శృంగారమను పథ్యము దప్పక సేవించి ప్రకటింపవలయునన్న నుద్యానవన ముండవలెను. శీతలో పచారములకు సేవకురా డ్రుండవలయును. సరస్సులుండ వలయును. మఱియు పచ్చకర్పూరము, పునుగు, జవాది, అర(టి బొందెలు, చందనము మొదలగు సంబారములు లేనిది శాస్తోక్త ముగాఁ గామము నా వాహన చేయనగునా ! అట్టి నీటులు ధనికుల కే గాని సామాన్యులకుఁ జెల్లదు. పబంధములలోని మోహము మాత్రము నిక్కమైన యెడల, రాజుల యిండ్లలోనే గాని యిం కెక్క డను రతి మన్మథులు వాసము చేయరని చెప్పవచ్చును ! సుగాత్రి క్రీ దిగcదీపు లెవ్వియుఁ బట్టలేదు.

  • వ. నాకును మంగళసూత్రం వీపాటి శుభస్థితి నుండుటయే పదివేలనుచు నెంచికొనియు వేరొకలాగున నుండక యతనికి నాయురభివృద్ధి కరంబులని వివిధాలంకారంబుల నెప్పడు నేమఱకయ తాల్చుచుఁ దన తల్లియేమియు నతనిని ట్టాడకుండం బ్రార్థించుచుండె.”

(కళా. ఆ, 4, వ, 73) భర్తకు నొక పిచ్చి యైన భార్యకు నొక పిచ్చి ! తన యలం కారము లాయనకు నాయురభివృద్ధికరము లనుట పిచ్చియైనను మేలు చేయు మంత్రములలో నొకటి గాన ననింద్యము. ఈ యోర్పును, వినయమును, సుఖపరిత్యాగబుద్ధియు, సంతుష్టియు శృంగార భావములు గావా ? పతిపైఁగల ప్రీతిని సూచింప వా ? అత్తగారికి మాత్రమున శాంతము గుదురదాయె ! మనుమఁడు  ద్వితీయ భాగము 155

గలుగకున్నఁ దనకు మోక్షము గలుగదని యేమో ! ఈ దౌర్భాగ్యపు

టల్లుఁడు తోఁటలోనైనఁ గృషి చేసి ప్రయోజకుడు గానీ యని
యూ తనిని బూఁదోటలో మాలిపనికి నియోగించెను ! శాలీనుఁడు
సత్వగుణుఁడు. చెప్పినదంతయుఁజేసి రచ్చలేక యుందమ నెడు
వాcడు . మరియు , ఇల్లటపలఁడు అట్టి యల్లురకు మర్యాదలెక్కువ
యుండు నా ? ఒక్క భేదముఁ జెందక నిత్యము తోఁటపనులం
జేయుచుండెను. అప్పడు సుగాత్రి—

తే. తల్లిమాటలచే నిట్లు తన విభుండు తనువు బడలఁగ బూఁదోఁట పనులు సేయఁ

జూడనోర్వక తాను నచ్చోటికరిగి
తోడుపడియెద నని చూచు ప్రీడ నుడుగు.
                                                       (కళా. ఆ. 4, ప. 84.)
       పిమ్మటC గొన్నాళ్ళకు లజ్జC బాయఁద్రోచి పురుషునకు సహా
యముగఁ దా నును దోcటపనులను జేయ

"ఊ ................................. . . . . . . . . . . . . . . ఎప్పటియట్ల యటంకృతాంగియై

యెంతయు నింపుతోడఁ జనియెన్ బ్రియుఁడున్న వనంబులోనికిన్
                                                                        (ప. 94)
క. చనియూతఁడు దా సలిపెడు
పనులకు నీయకొనకున్న బలిమిఁ గడంగెన్
దన సొమ్ములెల్ల నొక మఱు 

గున నిడి పిరిసుట్టు సుట్టికొనిన వలువతోన్. 95

సీ. తోరంపుఁ జనుదోయి త్రుళ్ళింతల నిడంగఁ

                     దగుచోట్ల గుద్దంటఁ ద్రవ్విత్రవ్వి

వ్రేఁగైన పిఅుదు బల్విడిఁ జలిం పంగను

                 వడినిట్టునట్టును నడిచి నడిచి

యడుసుతుంపరు చెక్కుటద్దంబులను బర్వ

         మళ్ళకు మడవలు మార్చి మార్చి

నడుములేఁదీవియ నకనకల్గుడువనిం

             పునఁదగు మోఁపులు మోసి మోసి

చిఱుచెమటచేర్చు వింతక్రొమ్మెఱుఁగుతోడఁ

గొమురు మేనొప్ప సారెకుఁ గొప్పవదల 156                కవిత్వతత్త్వ విచారము

నేమిటికినైనఁ దా మున్న యేగి యేగి

యెల్లపనుల నొనర్చె నింపెసక మెసఁగ.                                                               96

ఇన్నాళ్ళుC గరగని యూతని మనసు ఈ నవ్య మోహనమూర్తిచే జయింపబడెను !

చ. .........................................................ఆనా బడలిక చూడలే కిడుమపాట్లకుఁజొచ్చి నలంగితంచు నె

క్కుడుతమకంబుతోడ, దలఁగ్రుచ్చి కవంగిటఁగూర్చెనత్తఱిన్.
                                                                  (ప. 99)
      పశుప్రాయమగు శృంగారమునకన్న నిది యెంత మేలు? చూచి
చూడక మునుపే కామినులఁ గవయ నుంకించుట లోలత్వము.
నీచము ! ఇక్కడ, భార్యయెడఁ గూరిమి, ఆ పె తన సహాయమునకై 

స్వయముగా వచ్చినందుకు మెప్ప ? బడలి నందుకు C గనికరము . గొప్పబుద్ధిఁ జూపినందుల కుదారవర్తనయను గౌరవము. ఇట్లు

స్నేహము మర్యాద. వీని కనుకూలములైన భావములతోఁ గలిసిన
శృంగారము చూపCబడియున్నది. ఇది Uశేషము. మానసికము.
శాశ్వతము. పెఱయవి యంగరాగములు. తుచ్ఛములు. చంచల
ములు. మనసుతో  గలసినట్లు కామేచ్ఛ వర్ణించుట మనలో నంతగా
లేదు గాన నీచరిత్రము నవ్యలీలాలలితంబు.

తన మనోరథము ఫలించినందుకు c గారణ మా పెకుఁ దెలియ

దయ్యె. ఎట్లు దెలియును ! కార్యము లనేకములు గణించి పరిశీ

లించినఁ గాని కారణము నేర్పఱుట దుర్లభము. ఒక్క నాఁటి

యనుభవముచే నిర్ధారణ చేయ నశక్యము. అట్లగుట నాఁటి రాత్రి
సుగాత్రి సంతోషముతో " నెప్పటికంటె మిగుల నలంకరించు"కొని
కేళికా భవనమునకు రాcగా "తోఁటపనులు, సేయు మూర్తి మదిన్
హత్తి పాయకునికి" శాలీనుఁడు ఈ ప్రచండ వేషముఁ జూడనైనఁ
జూడక యేదో ధ్యానమున మౌనియై కదలకయుండఁజూచి, భార్య
శోకాశ్చర్య నిమగ్నయై వేచి వేచి విసిగి, 
     ఉ.    ఆ లలితాంగి చాలఁదడవచ్చట నమ్మెయి నుండి సాహసో
            ద్వేలతనంతఁ జేరి కడుఁద్రిమ్మటచే శ్రమ మొంది నారుగా (
            బోలునుబోదునా నిదురఁ బోయెదరే యని కప్పరంపుఁ దాం
            బూలముదావి భుగ్గురని ముంచుకొనం జెవిదండఁ బల్కగన్.                                     ద్వితీయ భాగము                                         157
                క. పైకొన్న పరాకున నతఁ
                   డే కోర్కిని వచ్చితనియె, నింతయు వగతో
                   లోకము వారలు పతికడ
                   కే కోర్కిని వత్తు రనుచు నెంతయుఁ బొలసెన్.
              క. ఓ నాయక ! ఇతరమ్ములు
                 పోనిమ్మా పాటియైన బుద్ధిగలిగి నా
                 మాననములోని కోర్కులఁ
                 పూనిక నడిగితిరి లోక పూజిత నైతిన్.
            మ. ఆకటా ! యేమని దూఱుదాన మిము నాథా వేఁగుజామయ్యెఁ బొం
                దికగాఁ బాదములొత్త రమ్మనుట గానీ, యొంటి యే మోగదా
                నికటక్షోణికి నేగుదెమ్మనుట గానీ కొంతనెయ్యంపుఁ బూ
                నికతోఁ గన్నులువిచ్చి చూచుటయకానీ లేద యొక్కింతయున్.
           ఉ. నేఁ డలతోఁటలో నపుడు నిబ్బరమైన మదీయ భాగ్యమున్
               బోడిమియేమి పాకమునఁ బొందెనొ ! మీకృపయట్లు గాంచిపెస్
              వాఁడిదనర్చు నాచనువునన్ మిము నెమ్మెయినంటిఁగాని, యే 
              నాఁడును బుణ్యసాధ్వికి గుణంబదిగాదని యే నెఱుంగుదుస్.
                                                                    (కళా. ఆ. 4, ప. 109-113)
         తే. ఆంతఁ దొలునాఁటియట్ల యత్యాదరమునఁ
             బోయి పూఁదోఁట పనులెల్లజేయుచుఁ బతి
            మన్ననలుగాంచి యెంచెఁ డన్మతికిఁ నట్టి 
            సొంపులేగాని భూషణా లింపుగామి.
                                                         (కళా. ఆ. 4, ప. 123)
      ఇట్లాతని మనోవృత్తింగాంచి తగురీతి నాఁడు మొదలు
వర్తించునదై యెల్ల సుఖం బులం గాంచి పరమసాధ్వీలలామమన నా
సుగా త్రి ప్రసిద్ధి వడ సెను !
      ఏకాంత గోష్టి. వర్ణించునపుడును గవి యెంత నాణెముదో cప
వ్రాయుచున్నాఁడో చూడు Cడు ! ఇది సభ్యమైన వర్ణన. దీని జదువC
దలవంచికొను నవసర మెవ్వరికి నుండదు. మనవా రనేకులు
శృంగారమునకు 'శుచిత్వమునకును, బరస్పర శత్రుత్వ మాపా
దీ0చిరి. ఇదిసత్యమునకు స్వభావమునకు రెండింటికిఁ దప్పిన
యూహ, గొప్పవారి [పేమలు పరిశుభ్రములు నిర్మలములు. మృగ 

ప్రాయుల శృంగారములు వికారములు తుచచముಲು ; 158 కవిత్వతత్త్వ విచారము

         సర న్వతీ చతుర్ముఖ విలాన ఘట్టము

ఒక విషయముఁ బట్టిచూచిన సరస్వతీ చతుర్ముఖ విలాస

ఘట్టము" వంటిది యాంధ్రంబున నెక్కడను లేదు. ఏవిషయమన,
ప్రకృతిని పాత్రముల జీవితముతోఁ గలసినట్లు వర్ణించుట.
                         ప్రకృతివర్ల నావిధములు
         ప్రబంధకవులు వర్ణించిన జాడ వేఱు. వృక్షములు కొండలు
లతలు మొదలగు వస్తుప్రపంచమంతయు నుప్రెక్షకు సామగ్రి.
అందును స్త్రీ సామ్యముగాను, శృంగార క్రీడగాను ఉత్పేక్షించు
టకు. వసు చరిత్రములోని యుద్యానవనము గూర్చిన ప్రశంస
లిందుకు, బ్రమాణములు :
   "చ.   ఒనరహిమావకుంఠనములూడ్చి తెమల్చిన పత్రభంగముల్
          సన నసియాడుచున్ మొగడ చన్నులు పల్లవపాణిఁగప్ప నూ
         తనిలతి కాలతాంగుల నుదారగతిం జలివాపి నెయ్యపుం
         బెనఁకువనేర్పె దక్షిణనమీరణుఁడొయ్యనఁ దావులంటుచున్."
                                                           (వను. ఆ. 1, ప. 127)
   “చ. జనపతిదారసిల్ల నొక నంపఁగి తావులకొమ్మ రాగవ
        ద్దన సుమనోభిరామయయి కాఁకవహింపఁగఁబోలు !కానిచో 
        ననుపమపంచసాయక కరాంచలచంచలచాపశింజినీ
        జనితకరోధరుంకృతివి సైఁపకయొన్నె పరాగపాండువై.”
                                                         (వసు. ఆ. 1, ప. 156)
    ఈ యుత్ పేక్షల నుద్ధరించుటకై యెత్తఁబడిన సాధనములు
సకృత్తుగ సహజోపములు. బహుళముగ శ్లేష. ఏ వస్తువుల లోనైన
స్త్రీలు లీనలు. దానికి సరిపోవునట్లు స్త్రీలలో నే వస్తువైన లీనము ! 

ప్రబంధ ప్రపంచము స్త్రీమయము. ఆcడుమళయాళము. ವೆಬ್ದು,

చేమలు, పక్షులు, సరస్సులు, నదులు, గుట్టలు, అన్నింటనుండియు
నుత్ పేక్షయను పుటము వేసి శృంగారభస్మముఁ జేయవచ్చును ! 

'ప్రభావతి మంచి దుక్కి సాగిన పొలము" అని సూరన వర్ణించి

యుండుట జ్ఞప్తియున్నదా ? సూరన్నయందును ఈ దుర్లక్షణము
     *ఈ పుట్లమునను ఒక లోపము. వానకురియుచుండగా మగనితో సమముగ
దామను క్లేశముల ననుభవింపవలెనను సుగాత్రియొక్క కోరిక వ్యర్థముగ నా చినుకుల
వారు తడియలేదట. తడిసిన నొండొరు లింకను చల్లగా నుండియుండరా !                            ద్వితీయ భాగము                                      159

లున్పవ. కాని, పాండిత్యమును బో ( ద్రోచి భావముమీఁద దృష్టి

యుంచి వ్రాయుస్థలముల నీ దోషము పొంతఁబోఁడని నా యఖె
ప్రాయము. కారణములు సమయోచితముగఁ జూపCబడును.
    దుష్ట ములగు నుత్ప్రేక్షలు ప్రాచీనకవులయందుఁ గానరావు.
పెద్దనాదులయందును అంతగా నుండవు. ఈ యుక్తిక విత్వమునకు
మార్గదర్శియు గురు ప్రాయుఁడు నైనవాఁడు రామరాజభూషణుఁడు.
అతని వలె నింకెవరును జేయలేదు. చేయంబోరును. వసుచరిత్రకు
ననంతరము బయలు వెడలిన కావ్యములలో నీచిత్రములు మెండు.
పదములలో శ్లేషయు, శబ్దాలంకారములును, భావములలో విపరీ
తో త్ పేక్షలును సర్వకవులు అవలంబించిన వేడుకలు.
    రామ రాజభూషణునకుఁ బూర్వము వెణ్ణి వెణ్ణి యుత్ పేక్షలు 

దక్కువగ నుంటకు, తదనంతరము మితిమీరి యుండుటకును

గారణము స్పష్టము. శ్లేష యొక్క సహాయము లేనిది సహజోపమల
సమర్ధింపనగుcగాని, పిచ్చి యుత్ (పేక్షల సమర్ధింప నసాధ్యము

. వసుచరిత్రకు మునుపు శ్లేష విస్తారము ప్రచారమునకు రాలేదు.

తరువాత వచ్చినది. శ్లేషయు, శబ్ద వైచిత్రియు, భావ వైపరీత్యమును
సమన్వితములు. వీని వేండ్రముచేఁ గవిత్వములోని రసమంతయు
నెండిపోయినది.
         ಇಲ್ಲು స్త్రీమయముగా వర్ణించుటకుఁ గారణము అది శృంగార
మునకు నుపకరణమను నూహ. ఈ యూహ యాభాసము. ఎక్కడఁ
జూచినను స్త్రీలు చెదలవలె మిలమిలలాడుచుండిన వారియందు
మన కే మాత్రముఁ బ్రీతి యుండదు. అతిచే జనించు రసము
రోఁత, అపురూపముగానిది యల్పమూల్యము. విరక్తి దట్టముగఁ
బట్టువడవలయునన్న నాఁడు మళయాళములో నొక దినమున్నఁ
జాలు. పదాఅు వేలుం జిల్లర కాంతామణుల మందc జేర్చినవా
డగుటుఁ గాదె శ్రీకృష్ణుఁడు నిత్యబ్రహ్మచారియనఁ బ్రశస్తుడయ్యె !
ఆయన వలె దూరీకృతరక్తులు నిర్జితేంద్రియు లొరులుండరు ! సర్వ
వ్యాప్తి గానుండు వస్తువుపై బుద్ది యంతగాఁ బోదనుటకు నా 

భగవంతుడే సాక్షి ! అరుదైన కొలఁది గిరాకి హెచ్చునను బజారు

న్యాయమునైన ప్రబంధ కారు లెఱుంగమి వారి చిత్రకవిత్వముకన్న

మించిన చిత్రము !

                 భారతమందలి స్వభావవర్ణనావిధానము
        భారతకవులు ప్రకృతివర్ణన యెంతయు మనోహరముగఁ జేసి 160                 కవిత్వతత్త్వ విచారము

యున్నారు. తఱుచుగ నుపమానములనైన వాడరు. వస్తువు సుందర ముగానున్న దానిని నిజరూపముతో సాక్షాత్కరించినట్లు వర్ణించిన

ప్రత్యక్షానందమీయ దా ? పోలిక లేల ? ఉత్పేక్ష లేల ? నురుగులు 

గ్రమ్ముచుండఁగా నలల పరంపరలచేఁ దీరము మీCద గొట్టు కాడు

సముద్రము తనంతట గంభీరముగాదా ? అద్దాని జూచినప్పడు మన
మానందించుట యుత్ పే క్షతో నా ? దానియందు చూపు హత్తి యిటు 

నటుఁ దిరుగకుండుట చేనా ? భారతములో నుపమానోత్పేక్షలతో (

గలసిన స్వభావ వర్ణనము లున్నవిగాని, యు వి స్వచ్ఛందముగ నప్ర 

యత్నపూర్వకముగ వచ్చినవి. సొగసుగ వనములగుండా దారిచేసి కొని పాఱు నదిని స్త్రీ కిం బోల్చుట సర్వదేశములలోను బ్రబలిన

యలంకారమగుట నైజమనవచ్చును. ಇಟ್ಟು చేయుటలోను నసాధు
వగు క్రియ యొకటున్నది. ఏదన, నదియందలి ప్రత్యవయవము
నకును స్త్రీ యువయవ మొండు సరిపోలినదని, యక్లే స్త్రీ యం
గాంగములకుఁ దోడుపోయిన భాగములు నది యందున్నవనిగాని 

చూపుట. ప్రత్యవయవ సమన్వయము చిత్రపుటూహ రసాన్వితము

కాదు. మొత్తపుటర్ధముగా సహజోపములు, ధ్వని మొదలగువానిచేఁ
గూర్పఁబడు సంబంధము మంచిది. ప్రత్యంగ క్రమమునకుం 

బోయిన C కుయుక్తులు దప్పవు. ఆకారము సమిష్టి నే భావము

ను ప్పతిల్లఁజేయునో, దాని నారసి, ప్రముఖములైన సాదృశ్యము
లున్నవానిని సూచించి విరమించుట బాగు. దీనిచేఁ జదువరులకును
లాభము. ఎట్లన, కవి చూపించిన పోCబడింబట్టి యింకను గొన్ని
సామ్యములను మన మే యేర్పఱచుకొనుటకు నవ కాశ ముండుటచే
బుద్ధికిఁ బనులును దానఁ జొఱవయుఁ గలుగును. ప్రతిపదటికగా 
బాకీ యే మాత్రము లేక యంతయు విశదపఱచిన మన మనః
పరిశ్రమకు వీలుండదు. కానఁ గొంతవడికి మాంద్యము విసుగును
జనించును. పూర్లోపముల కన్న లుఫ్టోపములు రసవత్తరములు.
భావానుకూల్యములు.
         ప్రాచీనులలోఁ గొందఱు కవులు (అందును ముఖ్యముగా
బమ్మెర పోతనామాత్యుఁడు) ఇంకొకవిధమైన యపభ్రంశము నాశ్ర
యించినట్లు తో cచెడిని. ఏదన, వనవర్ణనము మొదలగునవి చేయు
నపుడు పదాడంబరమునకై నిఘంటువులలోని చెట్ల పేర్లన్నియుఁ
బ్రయోగించుట దృష్టాంతము.
   " ఉ. ఆందుఁ దమాలమాలవకుళార్జుననింబ కదంబ పాటలీ
         చందన నారికేళ పునసార శిరీషలవంగలుంగ మా                  ద్వితీయ భాగము                           161
      కందకుచందనక్రముక కాంచన బిల్వకపిత్తమల్లి కా
      కుంద మధూకమంజులనికుంజములందనరారి వెండియున్.”
                                                                      (భాగ. తృ .స్కం.)

వ. అది మఱియును మాతులుంగలవంగలుంగ చూతకేతకీ భల్లాతకామ్రాతక

సరళ పనసుదరీ వకుళవంజుళవటకుటజ కుందకురవక కురంుకకోవి
దార ఖజ్జూరనారికేళ సిందువార చందనపిచుమందమంచార జంబూజం
బిర మాధవీమధూక తాలతక్కోలతమాల హిం శ్రాల రసాల సాల పియూ ళు

బిల్వామలకక్రముక కదంబ కరవీర కదలీకపిత్రకాంచన కండరాళ సిరీష శిo శ శ్లోక్షపళాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువ తలికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదం కురితపలవిత

కుసుమిత ఫలితలలితలివిటపవిటపివీరున్నివహాలంకృతంబును...............................

ఇతాది....

                                                         (భాగవతము,అ.స్క0)

వ్యక్తివర్లన ముత్కృష్ణము ఇట్లూరక వృక్షానామములC బేర్కొన్న నేమి యందము ' ఆ చెట్ల యొక్క గుణమని, ఆ కారము మొదలగు విశేషముల నెఱుక

పఱుచు విశేషణములC జేర్పకున్న సవురమునకు గవి వర్ణనము 

నకును భేద ముండునా ? అరటిచెట్టు, ఆని చెప్పిన మాత్రాన

విను వారి కది Oుట్టి రుని యేర్పడదు. మనసు ముందఱ ప్రతిమ వలె
వస్తువు గన్పట్టవలయునన్న సామాణ్యగుణముఁ బేర్కొనినఁగాదు.

ముల , జూపవలయు, నిదర్శనము . మనుష్యుఁడు ఆ న మనకు నేరూపమును గోచరింపదు. విశేషణముల బోయిన ప్రతిమయు C దీఱు చువచ్చును. ఎక్లీన , చి డు తల ఏరియు C బోసి కొని యున్నాఁడు. పంగనామాలు, తి లో గరుడ స్త్రంభము, కుడి చేతిలో గంట. అనునప్పటికి (63) ప్రత్యక్ష మునకు వచ్చును. దాసరి వారిని బరి లించిన ఇంకను విశేషణములఁ బూన్చిన, నేడో యెుక్ర డా పరి గా క్ష, స్లమగు నొక రీతి కిం జేరినవాఁడు ముందువచ్చి ఘోషిం యురCటిచెట్టు గూరి \ యు , అరటిచెట్టన మాత్రాన రఁటిచెట్లో ! కాండము గుండ్రముగా బలిసియున్నది. సూ ణములు సోఁకి లో నదూరక యిటు దిరిగిపోవునంత పైన యాకు లున్నవి. ఘనమైన యొుంబము చే వంగిన తల . ఈ రీతిఁ జిల్లర చిల్లర సంగతులు గలుపుచు వచ్చితి మేని 162 కవిత్వతత్త్వ విచారము యాకారము రంగులు దీఱి యేదే నొక విగ్రహముగ మనసున పత్రి

ఫలించును. ఇట్లు గాక పేరు ల జాపి తా యెదుట నుంచిన, మన 

మేమి వర్తకులమా దానియెడ నా చర ముంచుటకు ?

         సమష్టిగా వ్రాయుట నిఘంటుకారుల పని. వ్యక్తి నొకదాని
హృదయమున సాక్షాత్కరింపఁ జేయుట కవి యొక్క ముఖ్యోద్యమ 

ములలో నొండు. ఇది చేయంజాలని వా Cడు పండితుఁడు గా

వచ్చునే గాని కవిగా నేరcడు. తన మనసులో నే దే నొక యాకృతిని
చక్కఁగ నేర్పఱచి పదములమూలముగ దానిని రసికులకు వ్యక్త
పఱిచిన నదియ కవిత్వము. నదిని వర్ణించిన నన్ని నదులకుం 

జెందిన తీరు నఁ జేయుట కళ గాదు. మఱి యే దే నొక్క తెఱం

గగునది దో (పవలయు. అ ప్లే సరస్సులు మొదలగు ప్రకృతి
మూర్తులం గూర్చియు.
       పాత్రముల వర్ణించునపుడును ఈ తత్త్వము నేమాత్రము
మఱవరాదు. ప్రబంధ కవులలో ననేకులు వసుచరిత్రాను కారులు.
పద్ధతి నే మాత్రముఁ దెలియనివారు. వీరినాయికలు పరస్

పప్రతిబింబములు. ప్రత్యేకించిన గుణము, చర్య, రూపము, ఏదియు లేదు. నాయకులు నమ్టే.

       కవులు వర్ణించిన ప్రకృతులు పాత్రములు నుత్కృష్టములా
యుని శోధించుట కొక యుపాయమున్నది. ఏదన. ఆ వర్ణనలC
జదువుటచే చిత్రకారుఁడు విస్పష్టమును అనన్యమునైన ప్రతిమను
వ్రాయఁగలడా యుని వితర్కించుట. బమ్మెర పోతనామాత్యుని
వనములు సరస్సులు నన్నియు గురిగింజలట్లు ఏక రూపములు.
ఏక రూపము అనుటయు C దప్ప ఏక నామము లన్న నింకను
సత్యము ! ఏలన నిఘంటువులలోని పేర్లున్నవిగాని, యుయ్యై
వస్తువులకుఁ గాలాదుల ననుసరించిన చర్యలెవ్వియు నా రోపింపఁ
బడనందు న నవి దృష్టములు గావు.
         పాత్రములC బరిపూర్ణములుగా వర్ణించుట యెంత తప్
వనాదుల సైతము" సర్వలక్షణ సంపన్నా"ముల (గా వర్ణించుట 

యంత తప్ప. పోతన యొక్క చెట్లన్నియు C బుట్టి పెరుగు తా

వీజగతి నొక్కటే ! ఎద్దియన. నిఘంటువు ! భూసారాది తారతమ్య 

ముల చేత నొక జాతికి వృద్ధికరమగు నేల యింకొక దానికి క్షయ

కరము. మఱియు ఒక నేలలో పెరుగు వృక్షములు సైతము
సరిగా నాయి కా నాయకులు వచ్చునది చూచి యన్నియు C బుష్పఫల
భరితములు గావు. వనములు, తోఁటలు మొదలగునవి చూచిన                       ద్వితీయ భాగము                                             163

వారందఱకు నిది తెల్లంబ . కవులకు గాదు. పాపము ! వా రేమి

చూచిరి ? నిఘంటువులం దప్ప.
           ప్రబంధకవులలో పాత్రవర్ణనమునఁ గనంబడు దోషము
లన్నియు ప్రకృతివర్ణనమున నున్నవి. దేనినిగాని తాము భావించి 

నట్టియో, చూచినట్టియో వ్యక్తిగా వర్ణింపరు. సర్వసామాన్

గుణంబులఁ బేర్కొని యాకృతిని నిర్ణయింపఁజాలని యంత
సమష్టిగా వ్రాయుదురు. ෆුයි. ఉన్నదియున్నట్టు, కన్నది కన్నట్టుగాక
చదివినది చదివినటుగా వ్రాయుటచేఁ గలిగిన యుత్పాతము !
             నన్నయభట్టు ప్రకృతివర్ణనము సేయు రీతి

భారత కవులలో నీ దోషమంతగా లేదు. విశేషణములు లేని

జాపితాలు మృగ్యములు. అమ్మహనీయుల రీతిఁ జూపుటకునై
కొన్ని యుదాహరణముల నుడి వెద :

నిరణం కారములు.

      "మానిని.  ఏచితనర్చితలిర్చిన క్రోవుల నిమ్మగుఠావుల జొంపములం
        బూచిన మంచియశోకములన్ సురపొన్పలఁ జొన్నల గేదఁగులన్
        గాచిబెడంగుగఁ బండిన యాసహ కారములం గదళీతతులం
        జూచుచు వీనులకింపెనఁగన్ వినుచుకా శుకకోకిల నుస్వరముల్.

కవిరాజ విరాజితము.

       చనిచని ముందట నాజ్యహవిర్ధత సౌరభధూమలతాతతులం 
       బెనగిన మ్రాఁకుల కొమ్మలమీఁద నపేతలతాంతములైననుబా
       యనిమధుప ప్రకరంబులఁజూచి ధరావిభుఁడంతనెఱింగెఁ దపో
        వనమిదియల్లదె దివ్యమునీంద్ర నివానము దానగునంచు వెనన్."
                                                   (భా. ఆ. ప. ఆ. 4, ప. 20-21)
లయ గ్రాహి.

కమ్మనిలతాంతముల కుమ్మొనసి వచ్చు మధుపమ్మల నుగీతనినదమ్ము

                                                                            లెనఁగంజూ

తమ్ములలనత్కిసలయమ్ముల సుగంధిముకుళమ్మలను నానుచు

                                                                 ముదమ్మొనరవాచా

లమ్ములగు కోకిల కులమ్మలరవమ్మ మధురమ్మగుచు విన్చెననిశమ్మ

                                                                 ను మనోభా

రమ్ముల నశోకనికరమ్ములును జంపక చయమ్ములును గించుక

                                          వనమ్ములును నొప్పెన్                 164                                 కవిత్వతత్త్వ విచారము

లయ గ్రాహి.
చందన తమాలతరులందు నగరుద్రుమములందుఁ గదళీవనములందు లవలీమా
 కందతరుషండములయందుననిమీల దరవిందసరసీవనములందు వనరాజీ
 సందఖిత పుష్పమకరందరసముం దగులుచుందనువు సౌరభమునొందజనచితా
నందముగ బోషితులడెందములలందురఁగ మందమలయూనిల సుమందగతి వీచెన్.
                                                     (భా. ఆది. ఆ, 5, ప. 138–139)

          చ. కురిసెఁ బ్రచండవృష్టి పున ఘోషము లెల్లఁ గెలంకులన్ భయం
              కరములుగాఁ గరాళ కరకాతతు లొప్పఁ దటిల్లతాళివి
              స్పురితముగాఁ బ్రపూర్ణజలపూరము తగ్గిరికుంజభూరిని
              ర్డరతటినీతటి నికటసాలచయంబు విమూలితంబుగన్.
                                                              (భా. ఆర. ఆ. 3, ప. 297)

క. లలితమథు స్రవ ఫలములు
         విలసిత మృదుపత్రతతులు వృత్తన్కంధం
         బులు నవిచలితచ్ఛాయలు
        గలబదరీతతులఁజూచి కడువిస్మితులై,
                                            (భా. ఆర. ఆ. 3, ప. 308)

సాలంకారములు

మ. ప్రమదాసాదిపయః ప్రపూర్ణ మిదిగో ! పద్మాకరంబంచుఁద
   త్కమలామోద సుగంధమారుతము వీఁకన్ మున్నెజింగించెన
   స్రమణంబిల్చె సరోవరంబనిలజన్ రాజీవ రాజీవస
  త్సమదాళి వ్రజచక్రవాక బకహంస క్రౌంచనాదంబులన్.
                                                 (భా. ఆది. ఆ. 6, ప. 172)

సీ.రంగదుత్తుంగతరంగ హస్తంబుల
                నాడెడు నది వోలె, నతుల వేగ
వాతవిధూతమై వఱలెడునది వోలెఁ
            బర్వతకందరోపాంత తతులఁ
దొడరెడు నదివోలె ధ్రువ ఫేనవితతుల
                   నగియెడునదివోలె, నాగన

సీ.

ద్వితీయ భాగము Í 65 మకరకులక్షుభ్యమాణమై తద్బాధ కోపనియదివోలె, నుచ్చభీమ నినదమగుచునున్న నీరధియొద్దకు (భా. ఆర. ఆ. కి, ప. 38} నురనది ధరణీతలంబున కరుగుదెంచి కలహంసగతియు నిర్మల ఫేనహాసంబు నాకీర్ణమీన విలోకనములు నాలోలపవనవాచాలితకల్లోల రసిక మృదూక్తులు నెసఁగుచుండఁ బ్రీతితో భగీరథుఁడను దూతచేత నీతయై మహాముని పరిపీతరిక్త మగు సరిత్పతిఁగూడి యూ సగరజులకు హితముగా దానినించె నాతతజలముల (భా. ఆర. ఆ శి, ప. 83) నానావర్ణశిలా విహ గానేక మృగాభిరామమై భూ నారీ నానాభరణ విభూషిత పీనోన్నతకుచముఁబోలె వెలిఁగెడు దానిన్ లలితాచ్ఛస్ఫటిక శిలా తలములపైఁబాఱు విమలతర నిర్హరిణీ జలపూరముల నుదారో ల్లలదురు పశిరాలి నుజ్జ్వలంబగుదానిన్ (భా. ఆర. ఆ శి; 3. 292–293) మిశ్రమలు : š. ఖరకిరణ తాపమున నురు తరదవదాహమున శోషితములైన వనాం తరతరుతతి కాప్యాయన కరమై వర్ణాగమంబు గడుబెడఁగయ్యెన్, విశద శారదాంబుద పరివేష్టనమునఁ బొలుచు గగనంబు ప్రతిబింబమో యనంగ వికచకాశవనీ పరివేష్టనమున నతిశయిల్లె నిర్మల క్రమలాకరములు. కవిత్వతత్త్వ విచారము భూసతికిం దివంబునకుఁ బొల్పెనఁగంగ శరత్సమాగమం బాసకలప్రమోదకరమై విలసిల్లె మహర్షి మండలో పాసితరాజహంసగతి భాసి ప్రసన్న నరస్వతీక మ జ్ఞా సనశోభితం బగుచు నబ్దజయానముతో సమానమొ, శారదరాత్రు లుజ్జ్వలలసత్తడతారకహారపంక్తులం జారుతరంబు లయ్యె వికనన్నవకైరవగంధి బంధురో దారసమీర సౌరభము దాల్చి సుధాంశువికీర్యమాణ క ర్పూరపరాగ పాండురుచిపూరములం బరపూరితంబులై, స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోయి నిరస్తనీరదా వరణములై దళత్కమల వైభవజృంభణ ముల్లసిల్లను ద్ధురతరహంససారసమధువ్రత నిన్వనముల్ సెలంగఁగాఁ గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళ ఁజూడఁగన్. దానాంభః పటలంబునం బృథుపయోధారావళిం దాల్చి గ గ్ధానిర్దోషము బృంహితచ్ఛలనఁ బ్రచ్ఛాదించి ప్రావృట్పయో డానీకంబు శరద్భయంబున నిగూఢాకారతన్ డిగై నాఁ గా నొప్పారె మదోత్కట ద్విరదసంపుంబుల్ వనాంతబునన్. కలనీలకంఠ కోలా హల లీలలు సెందే రాజహంసకులములన్ దిలకించె న ప్తపర్గా వలి విగళితకుసుమ కుటజవాటికల గెడన్. అతి గాంభీర్య విభూతి నేకచుళి కాహంకార నిశ్శేష శో షితపాథోధిపయస్కుఁడైన ముని దోఁచెం బుణ్యతేజోమయా కృతి నయ్యామ్యదిగంతవీధి, బ్రకట క్రీడాకళాగర్వ గ త మండూక కళంకితాంబు శుచితాసిద్ధి ప్రదాచార్యుఁడై * నిరలంకారము ల నcదగు పద్యములలో ధూర్జటి వ్రాసిన “可°。 ప్రాతఃకాలతుషార శీకరచయప్రాప్తిన్ లసన్ మౌక్తికో పేతాగారములట్లు చెల్వనఁగు తద్బిందుచ్చటాజాతవి ద్యోతచ్ఛాయలఁ గొంతసేపు బహురత్నోదీర్ణ గేహంబులై లూతా కల్పితతంతుసద్మములు వొల్చుం జూడఁ జి తంబుల్పై.” అను పద్య మత్యద్భుతము !

  • ఆ. భా. 4, 141–146 ద్వితియ భాగము } {} {

ఉత్పేక్ష భాస్కరరామాయణమున సీతాపహరణ ఘట్టమున స్థావర జంగమ మయమైన ప్రపంచమంతయు నాయమకై యాక్రోశించె నని యెంత యుదాత్త రేఖగా నుత్పేక్షింపఁ బడినదో చూడుఁడు. తే. ఓలి శృంగంబునెత్తినకేలుగాఁగ నిర్హరంబుల పెను మోఁత నిగిడిబెరయ గిరుల జనక రాజాత్మజ పరిభవంబు జగములెఱుఁగ నాక్రోశించు వగిదిఁదోఁచె. {భాస్క ఆర. ద్వితీ, ప. 151) సీత ! పరమపావనమూర్తి ! శ్రీరాముని భార్య. దౌష్ట్యమున నా మెను బలాత్కరించి కొనిపోయినవాఁడు సర్వలోకాధీశుఁడగు రావణుఁడు. రాక్షసవంశ సంహార కారణమైన దీ యాగడము. ఇట్టి జగత్ ప్రధాన సందర్భంబులఁ బ్రకృతియు మనుష్యమాత్రులరీతిని సుఖ దుఃఖాది వికారములందాల్చిన ట్లుత్పేక్షించుట సమంజ సముగాని, చీమకు దోమకు వాసియైన నాయి కానాయకుల పాటులం గూర్చి లక్షించునదిగా వర్ణించుట గాంభీర్యమునకు గొఱఁత. వస్తువుల కొలందులు గణింపక వర్ణించిన నఁగుబాట్లగును. ప్రబంధములలోని ముఖ్యదోషములలో నీ వివేచన విహీనవర్ణన మొక్కటి. ఏ కుగ్రామముఁగాని, యెట్టి నికృష్ణరాజులంగాని, వీర కావ్యముల ధోధgధిగా వర్ణింతురు. పట్టణ ప్రాసాదములు మిన్ను ముట్టునఁట l భర్మ హర్మ్యములు గవాక్షములలో చంద్రుడు దూఱి పోవునఁట ! ఇ(క రాజు గారో యూ పురికిఁ దగినవారు ! పంచ పాండవులు, దాశరథులు అందఱును గరఁగించి బ్రహ్మపోతఁ బోయగా నవతారమెత్తిన పురుష స్వరూపులు ! కానిండు ! ఈ బల పరాక్రమములకు దగిన శౌర్యప్రారంభముల నొడఁగూర్చినఁగదా యా గుణములు సార్థకములగుట. అట్టి కథాకల్పనా శక్తియో సున్న ! మహాకవుల యూహలలోఁ గొన్ని దొంగిలించి కొన్ని విడిచి పెట్టుటలో లాభములేదు. కైకొన్న నన్నియలిఁ గొనవలయు, లేదా, పూర్ణముగా వదలి తన నైజము కొలఁది వ్రాయవలెను. లేనిచో పరస్ప రా సంగతి బాధ చే సందర్భశుద్ధి చెడును. ప్రబంధవర్ణనలు తావు మార్చవచ్చును, ప్రథమాశ్వాసముతో నిది ద్వితీయమునకుఁ బరివర్తించినను లోపముగాఁ దో(పదు. మఱి బొత్తిగాఁ దీసివేసినను, ఇక్కడ నేదియో యుండవలయు 168 కవిత్వతత్త్వ విచారము నను సంకోచము గల్గదు. అప్రస్తుతములనుటకు నీ కారణములు చాల వా ? సరస్వతీ చతుర్ముఖ శృంగార సంవాదము ప్రకృతమను సరింతము. ప్రకృతిని కథా పాత్రములతో సమ్మేళించినట్లు వ్రాసియుండుట సరస్వతీ చతుర్ముఖ విలాసము యొక్క ముఖ్యాంతరము. రంగము సరోవరము. శారదా దేవి ప్రణయకోపమున నవ్వలి మొగంబు గాఁ బొర లి నందున, నా మె ముఖచంద్రమండలము ఆ కాసారములోని మణి స్తంభమునఁ బ్రతి బింబితమగుడు, బ్రహ్మయు దానినిం జూచుచునైన నానందింత మని కొంత సే ప కేుయుండి, యెంతకును బ్రియు రాలి కోపము దీఱ నందున, సమీప వృక్ష శాఖాధిప్మితమాగు రాచిల్కతో "చెలువ యుబుసుపోదు, కథయొక్కటి జెప్పవుగా" యనుటయు "........ నో దేవ మీరు చెప్పెదరేని వినియదనని" యూ శుకంబు విన్నవింప, ఏనుమని యాతండును అప్పడు జరిగిన శృంగార ජීව ෆෆ ද්‍රියි) కథఁ జెప్పినట్లుగా శ్లేషచేసి వివరింపఁ దొడంగెను . ఎట్లన, ਾ ਹੰੁ ੪ పురములో నొక రాజు. అతని పేరు కళాపూర్జుఁడు (ముఖచంద్రుడు). అతఁడు స్వభావునిచే (స్వభావముచే) నొ ద్ర యెఱ్ఱని మgచి శలాక ను (మోవిని) విల్లును (కనుబొమలును) బాణములును (చూపులు) బడసి సరి రాజుల నెల్ల జయించెను. ఈ రీతిగా c దాను మన్మథా వేశముచే నా మెంగది యుట మొదలైన రాగంపు జెయ్వులెల్లఁ బ్రక టించుడు భాషా యోష యు కృత్రిమ కోపంబున నిజమైన ಯಿ ಲೈ సంబు గా, చిట్టింపఁబడిన కనుబొమల తోను వెల్లివిరసివచ్చు చిరు నవ్వులతోను ఆ చిలుకంజూచి "యా కళాపూర్జుఁడు మఱి యేమి యయ్యె నతని తలిదండ్రులెవ్వరు, అడుగుము" అనవుడు, చిలుకయణ నట్లడుగ బ్రహ్మదేవుండింకను జమ త్కారముగా నేమను చున్నాఁడు ! అతనికిఁ దండ్రి సుము బాసత్తి. తల్లిమణి స్తంభుడు (స్తంభ శబ్దము పులింగము గనుక నందు ప్రతిబింబి తంబనుట) అట్లనుసరికి. వాణిహాసముతో గ్రక్కునఁ గ్రమ్మణి కౌఁగలించి యంతలోననయారయెన్ని తబ్బిబ్బులు తద్దరిల్లకుఁడంచు ధవుని వీఁపు ద్వితీయ భాగము 169 చఱచి యెట్టెట్టులారాజు జనని మొగది యును జనకుఁడౌఁడు వాఁడునాయనుచు మఱియు మిగులనవ్వచుఁజెప్పడామీఁదు ప్రాణ రమణ ! మఱియేమియయ్యే నారాజనుటయు. {కళా. ఆ. 5, ప. 24) పాలయలుక సగము విరిసినది. పిమ్మట మఱికొన్ని స్నేహ క్రీడలు నడవఁగా, నిదేమి, యూలకుండరని కోపించుకొన్న సరస్వతీదేవికి హృదయ ప్రమోదంబుగా నీ క్రొత్త సంగతులను జేర్చి శతానందుఁడు కథ పెంచి చెప్పిన శారదాదేవియు కపట రోషంబుతో "చాలుఁ జాలు మీ కథ. ఇప్పటి మన వృత్తమంతయుఁ జెప్పచున్నారు . ఇంకెంతదూరము చెప్పెదరో యుని యూరకుంటిఁ గాని తొలి నుండి నా కు c దెలియదనుకొన్నారా ?" యని యూ కథ యందలి ప్రస్తుత వర్తమానమును మృదు మధుర వచనముల వా్యూనముఁజేసి చూపుచున్నది. ఐదవ యాశ్వాసములో నలువది యవదగు నీ వచన మెల్లరు c జదువఁదగినది. వచనరచనలకుఁ దండ్రియట్టివాఁడు నన్నయభట్టు. అతని ప్రాడి మ యన్యులకు లేదు. ఒక్క చిన్నయసూరి మాత్రము ఇంకొక విధమైన వచన శైలిని బక్వమునకుఁ దెచ్చి నన్నయతో సమానుఁడై యున్నవాఁడు, ఈ యిరువురి దానికన్నఁ దక్కువయని చెప్పఁదగిన దయ్యను, సూరన్న వచనము సామాన్యముగాదు. వాgచీదేవి వ్యాఖ్యానము చక్కెర లొలుకునది ! రంగము కార్యము పరస్పర సద క్వాచిత్క ఘట్టములలో నిది యొకటి. ఇక్క దానిఁ జేర్చినాఁడు. ،قكټ రహస్యమును రంభతోఁ జెప్పినందున శారదా శాపంబుచే నీ చిలుక తొలుతఁ గల భాషిణియై పుట్టి, పిమ్మట జన్మాంతరమున మధుర లాల సరియై, భూలోక మున నిజనాథుని గళాపూరుని గాథలు ప్రకటించి నరులకు వరపాయంబగు శ్రుతి ఫలము ననుభవించి సుఖమును గీర్తిని గాంచినది . సరస్వతీ చతుర్ముఖుల సంభాషణలు చర్యలు పొగడ్డకు మీఱినవి. అతఁడు దన సతి నెన్స్లో విధములఁ క్రేత్జ్ పేూ భ్రనములుఁ దేల్పగc, నీ మెయు నవ్వనడంపజాలకున్నను క్రె నుక నటించుచు వలదు వలదని ప్రార్థించు పద్యములు మనలం బరువశుల జేయునవి ! వాగ్రమణీమణి యీ దుండగము లింకఁ జాలింపఁ డని వేడి కొనుచు, 170 సీ. తరల. కవిత్వతత్త్వ విచారము మనమంత యేక తంబునఁ జెప్పికొనినట్టి కథయిదెతోన యిక్కడనుబుట్టె నింతమాత్రముగాక యిటమీఁద నీ కథ బృథివిపైఁ గలుగఁ జెప్పితిరి మీరు తొలుత నె యిది &బ్రహ్మవలన వచ్చినయది యనగఁ దన్మూల మెయ్యదియొు యనఁగ వాబ్ముఖప్రతిబింబ వర్ణన యనఁగ ని ట్టి ప్రసక్తినిది సంపుటిల్లె ననఁగ వచ్చెనగుఁబాట్లు నాకు మీవలన నాథ నన్ను మన్నించి యికనైనను దడవక మీరలూరకయున్న నెవ్వారునంత వినరు గాన గుప్తంబు గావింపవచ్చు. (కళా. ఆ. 5, ప. 58) అనుండుం బైపయిమాటగాక యిది యాహా యాత్మశృంగార శో భన లీలారసమేరి కప్రియము నీపల్కున్ మనోవర్తనం బును నేకంబగునేని నాలుకతుదన్ముక్కంటి కొమ్మావిలా సిని యేనమ్మెదనంచు బ్రహ్మనగిపించెన్ మేలుమాటన్ సతిన్. 59 ఘనయత్నంబుగ నవ్వడంచికొనుచుం గంజాక్షియన్ నాథ యే మనినన్ గోపమువచ్చుచున్నదిసుఁడీ యత్యంతమున్ నన్నికం జెనయన్ రాకుఁడు చాలునవ్వులనివైచెన్ గాంతు మీఁదన్ నిజ స్తనగుచ్చప్రతిమల్లహల్లకద జోద్యత్కందుకం బంతటన్. 60 అనయంబుం జల మొప్పఁగామణియు నాయబ్దాననుండట్ల యా డెను, మానుండిదియంచు వాణియును వేడెన్, జేరి తానొక్కచే తన కంఠంబున గౌగిలించి యొక చేతన్ గడ్డముంబట్టి చె క్కునఁ జెక్కానుచు నొక్కచన్మొన యురః కోణంబుతోరాయఁగన్. 61 అతఁడు నేలపెనంగెదోజలజాక్షి పల్కెటులున్న నీ కత ప్రకాశితమౌట నీమదిఁ గాంక్షితంబ యవశ్యమున్ క్షితిఁ బ్రసిద్ధముగాఁగనున్న విచిత్రనత్కథ నీ కన మ్మతమె యట్లగునేని యేమహిమం బ్రసిద్ధత గల్లెడిన్. 62 నీకుఁ బ్రియమది వేట వర్ణింపనేల ? నీవిపుడు పల్కు పల్కు స్వాభావికంబు ద్వితీయ భాగము ; 71 పతుల యనురాగలీల లే పగిదినైన వెలయుఁ గోరియు దాఁచుటింతల గ33బు. §3 అనిన విని భారతీదేవి యూ వారిజాసనుం జూచి " మీర లింత చలము గొని సమర్ధింప నా కు నౌఁగాదన నేల ?" యని యూ బ్రి డి లినది . కల భాషిణి యొక్క మనోహర చరిత్రము ఈ కథ యందలి పాత్రములపైకి నాకుఁ బ్రియతమ కల భాషి. నీ . నిక్కువమైన శృంగార భావములకుఁ బ్రకాశకురాలు. శాస్త్రకారుల శృంగార మనుదయ్య మంతగా సోఁకనిది. జన్మమున వార కాగిత. గుణములఁ బ్రబంధ నాయికలగు కుల స్త్రీల కన్న మేలైనది ! ఏక కాలంబున నిరువురియెడ మనసు దగిలినదానిఁ గా వర్ణించుట కాధారముగా, కవి యీ పెను గణికంజేసినఁ దప్పలేదని ಯುಟ್ಲಿ పుట్టుక నారోపించినాఁడో ? పరిశీలింపుఁడు. ఎట్లును ఈ పె నీచపాత్రము గాదు. మఱి మహెూదారచరిత్ర. సర్వజన స్తవనీయ. కృష్ణుని కొలువునకు నప్పడప్పడు నారదుఁడు వచ్చుచుండ నతని తోడన వచ్చు శిష్యుఁడగు మణికంధరుని సాహిత్యపటిమకు to ୧୫ సంపదకును మెచ్చి వా నియో డ బద్ధానురాగయై యుండి యు , జాతి దోషంబు చేc గాఁ బోలు నలకూబరుని రూపలావణాది సౌభాగ్యంబు లకు మెచ్చి త్రదా లోక నంబునం దనియక వాని విమానంబుతోC గొంతదవ్వరిగి యంతమగిడి యూతని తెఱంగెఱుంగంగోరి నారదుం జేరి ప్రార్థింపుడు, నమ్మునియు రంభకు వైరిని నొక్కర్త నిల్ప నెంచినవాఁడు గావున, క. సవతియన నింక నొకతెన్ భువిలోపల వేఱ వెదకఁ బోవలయునె ? యో ధవళాక్షి ! నీవకానే రవె దైవనియుక్తిఁ గొంత ప్రాప్తిగలిగినన్ 蔓 (కళా. 178 هنة و 1 . وع) అని పల్గుచున్నాఁడు. హృదయపూర్ణమైన వలపు వినయము, అధైర్యము, దైన్యము మొదలగు భావములతోఁ గలసియుండును. విఱవీగదు. అభీష్ట సిద్ధి నిశ్చయమని యుదాసీనతయు గర్వముఁ గారేచదు. దీనికి దృష్టాంతముగఁ గలభాషిణి యిచ్చిన ప్రత్యుత్త రముఁ జూడుఁడు ! 172 కవిత్వతత్త్వ విచారము “క. ...........అంతటి రూప శ్రీవైభవసతికిఁ గాక సిద్ధించునె యా దైవనియుక్తియు మాబోం ట్లేవిధమునఁ బాట్లువడిన నిద్ధవివేకా !” (కళా. ఆ. ], ప. 179) నారదుఁడు సర్వజ్ఞ (డు, మణికంధరునికి నా పెపైఁ గోరిక యుండుట నెఱింగినవాఁడు గావున, నీ నూతన రాగజ్వాలలో నా ప్రాఁత వలపెక్కడ భస్మమగునో యని దానికిం బ్రతిక్రియ చేయుటకోయన, 'నా శిష్యుఁడు చేసిన దండకము చదువు మమ్మా ! విందము' అని యా పెచేఁ జెప్పించుచున్నా Cడు. అది యట్లుండె, ఈ తరుణియు నారదుని మూలముగ వాంఛి తంబు సఫలం బౌ నను నుద్దేశముచే నా తనికి శిష్యురాలుగా నేర్పడి యు తనితో గానవిద్య నభ్యసించెను. నారదుండును గాన శిక్షా నంతరము న నిజ కళా పాండి త్యముంగూర్చి కృష్ణుని కాంతలు మఱుఁగున నేమను కొనుచున్పారో వినిరమ్మని యాజ్ఞాపించిన నలకూబరునిఁ గైవసము చేసికొను మంత్రమున కిదియ యవసరమని కల భాషిణి యుఁ దన ಗುಟ್ಟು దో (పనీక. నేను మీదాననగుట మీ గాన కథలు వడిన నవ్వేళఁ గొడవలు దడవరే మొ ! (కళా. ఆ. 2, ప. 4) నా కపేక్షితమైన నాతిరూపు ధరింప సామర్థ్యమబ్చిన నా మగువల నఖులరూపముఁ దాల్చి సముచితంబగు さ%C జని వారి హృదయంబుఁ గనఁగవచ్చు (కళా. ఆ. 2, ప. 44) అనc గా నారదుండును దాను రంభ కిచ్చిన శాపమునకు నిది యునుకూల మని యూ వరమునిచ్చెను. నల కూ బర దర్శనము మొద లిదివ అకుఁ గడచిన కాలము నాలుగేండ్లు ఇది మఱవకు Cడు ! పిమ్మట నలకూ బరచింతతోఁ బరితపించుచు నొకనాఁడు కాల యాపనార్థము వీgదియ (గొని యుద్యానవనములో వాయించుచుం డగా మణి స్తంభుండు గానాకర్ణనవ్యాజమున పచ్చుడు, నతని సహా యమున కృతార్థతనొంద నెంచినదై, యతఁడు నేఁ బోయివచ్చెదనని సీ. ద్వితీయ భాగము 173 పల్కినఁ దన దుఃఖము దైన్యము బయలుపడునట్లుగా ်ပဲ လိမ္မိ) వి0చినది. 夢 @ 翰 邊 陸 曾 蠱 郵 囑 మహాత్మ నిన్ను నాపాలి భాగ్య దేవతగ నమ్మియుంటి నా జీవితంబు నేమిగాఁజేసి పోయెద వెఱుఁగఁ జెప్పమ ! (కళా. ఆ. 3, ప. 53) క. ఈ వేళన యూతనికడ కేవిధముననైనఁ జేర్చుటింతియ తక్కం ద్రోవ మఱి లేదు నన్నుం గావన్ క్షణభంగురములు గాంతలతాల్ముల్. (కళా. ఆ. 3, ప. 55) క్షణ భంగురము లనుచున్నది యిన్నాళ్ళు గా చియుండి యు! ఇది యు సహజము. మఱి దైన్యము హెచ్చి హెచ్చి పిఱికిపట్టువంటి సాహసము పొడమును. ప్రాణ కంటకమగు సంకటము. ఇంకను సిగ్గు నభి మానము ను మర్యాదను బాటింప నౌనా ? కావున నన్యము లం దనాదరయై యే మనుచున్నది ! సీ. ఓ సిద్ధపురుష మీరేసరణిని, గొని చన్న నేమగుఁ దక్కుశంకగలదె నీ మహత్త ్వముఁ గానని జడాత్ములేనున్న నేమికన్న మహాత్ములించుకయును వేబొక్క గతిగ భావింపర మముబోంట్ల నంన్పర్శమాత్రంబు సమ్మతింప నుచితంబు గాదంటి రుచితంబె మఱి నాదు బలుపలుకులేల యింక నా చెలులు గిలులు నేగుదెంచి విప్ను మొనర్తు రితమెఱుఁగక కావనం గొనిపొమ్ము శీఘ్రంబ నీదు వెనుకనిడికొని నన్ను మద్విభుని కడకు. (కళా. ఆ. 3, ప. 61) వీఁడు కపటసిద్ధుఁడు. ఈ చెలువంపు రాశిని మృగేంద్రవాహనా శక్తికి బలియి నెంచినవాఁడు ! "శుద్ధముగాఁగ నీ మనసు శోకము సర్వము c బుచ్చి వైచెద" నని మిథ్యాప్రత్యయము c బలికి, యూ పెం బిలిచి కొనిపోయి, యమ్మవారి గుడియొద్ద నిలిపి పూజా ద్రవ్యములు 174 కవిత్వతత్త్వ విచారము దేc బోయెను. అప్పడు సుము బూస్పత్తి, మిక్కిలియు ముసలిది వచ్చి సిద్ధుని చరిత్రం బెఱింగినదిగాన, ప్రియ మును దయయును దోcపఁ గల భాషి దిం జూచి యిట్లనియె. கி. வ: ႕ လဲ e e o a t t e o a to 4 to go & & 6 s is o # * * * * ... ... ... ... లత్రాంగీ యొచటనుండి చేరితి వకటా ! కలుషపుఁ బావురుఁ బిల్లిని జిలుకయుఁబలె నిద్దురాత్ము సిద్ధుండనుచున్. (కళా. ఆ. 3, ప, 84) కలుషాత్ముఁడు క్రమ్మఱి ويع రాకమునుపె తొలఁగి పోవరాదా యెటకే నోకూన యీ మనోజ్ఞత రాకృతియేఁ జూడఁజాల నసిపాల్గాఁగన్. 86 హజమగు రహస్యజ్ఞాన వాంఛయు నడఁచి పెట్టుట సుముఖాసత్తియొక్క వాత్సల్యఘనతను సూచించెడిని. నలకూ బ రుని సంగమంబుఁ గాంక్షించి వచ్చిన యాబాలకు నీ వృత్తాంత మెంత చింతావహంబు గా నుండదు ! తాను ద్వారకాపురిలో ననుభ వించిన వైభవమును, తుదకుఁ దనకిట్లు ప్రాప్తించిన పశుమరణ మును దల పోసి దుఃఖి తమానసయై, తదనంతరంబు డెందంబు డిందు పఱిచి కొని, యూ వృద్ధురాలితో గద్దదకంఠము గా, “శా. అమ్మా ! నీ పలు కెల్లనెంతయు నిజంబైయిప్టు గాన్పించె, నే నిమ్మాయావి ప్రకార మిట్టగుట నూహింపంగలే కొక్క య ర్థమ్మున్ వీనికృపన్ గడింతునని యత్యంతాశ పేరేపఁగా నిమ్మాడ్కిం దెగివచ్చితిం దెరువులే దీపాటుఁ దప్పింపఁగన్" (కళా. ఆ. 3, ప. 95) மூ ல் యెట్టకేని నిరా సవలని ధైర్యముం దాల్చినదై. “5. మీఁదట రాఁగల మేలు కీళ్ళేరికిఁ దప్పింపరామి యెంతయు ధ్రువంబు ఇంక వాఁడువచ్చి యేమేమి సేయునో చచ్చుటెట్లో యను విచారమునను బెగడుచుండనేల జగదంబయాశక్తి సేయవలసినట్లు సేయుఁగాక !” (కళా. ఆ. 3, ప. 102) ద్వితీయ భాగము 175 అని పల్కుచుండ సిద్ధుఁడు క్రమ్మఱి యాపెం డాసి "యింక శక్తి బూజించి పోవుదము రా" యని పిల్వఁగా, నయ్యో పాపము ! మరణము ಅಲ್ಲು ప్రత్యక్ష భీకరముగా నుండిన నెవరిగుండి యులు నీరు గావు ? గడ్డిపరకనైన శరణ్యమని యూఁతగాఁగొనఁ జూడమా ! అట్లగుట నీ బాలభీరువు, దారుణమ్ముల నెన్నఁడు జూచియైన నెఱుంగనిది, ధృతి నీరయిపోగా నా వృద్దాంగనంజూచి, క. ఏ నొంటిఁ జోవ వెఱతున్ లోనికి నోయమ్మ ! నీవనున్ రాఁగదె నా తో నన నెవ్వరు నేటికి నేనుండఁగ ననుచు సిద్ధుఁడింతిం బలికెన్. (కళా. ఆ. 3, ప. 116) పలికి, దానిభయచేష్ట భావించి యింకC దడ సిన విఘ్నంబగు నని లో నికి బల్ని నీ డ్చుకొని పోవుట కా కనె) ను గొప్ప పట్టి యీ డఁగా ు నాయి గొప్పె పట్టి యీడ్వి “.. ... . . . . . . . . . . . . . . . . ... ... ప్రాణభయమునఁ గలఁగి యోయవ్వ! నీకు బిడ్డనే కావవే నాకు నడ్డపడవె ! 117 యనుచు నా వృద్ధనారి మాటునకు నొదిగె.” సుము ఇూసత్తియు C దన మెడఁ గత్తి కడ్డముచేసి యూ మెను గా పాడినది. మృగేంద్రవాహనయుఁ గల భాషిణి వెండ్రుకలు దృఢ ముష్టింబట్టి మఱియుఁ బైకి C గత్తి నెత్తిన యా సిద్ధు ననతి దూరం బునఁ బడవైచెను. వాఁడు కత్తినిగాని కల భాషిణినిగాని విడువక య చని, మాయా నలకూబరుఁడు రంభయుఁ గ్రీడించుచుండిన భూసామీప్యమున " మెత్తని క్రొత్తలిరు పాన్పుమీఁదఁ బడెను ". తలిరులను దాcడ్రినఁగాక రాక మూ ను నా ? సిద్ధత్వ మెటC బోయెనో ? కామవికార మా దేశమయ్యెను ! పాండవమహిషింగూర్చి కీచకుఁడు కంపిత మానసుఁడైన ఘట్టంబునఁ దిక్కన పాంచాలి సౌందర్యము వర్ణించిన యనిర్యాచ్య మాధురీ ధురీణంబులగు సీస పద్యములంబోనివి యొుకటి రెండు ఈ సందర్భమునఁ గన్పడు. రసికులు పోల్చి పరిక్రింతురు గాక ! “సీ. అమృతంబు దొలఁకునట్లమరంగ వెల్వలఁ బాఱు ముఖేందు బింబంబుతోడ బాలకర్ణద్వయీ కూలంకషంబులై తల్లడంబందు నేత్రములతోడఁ 176 కవిత్వతత్త్వ విచారము గడుఁ జెమర్చినయట్టి కలికిలేఁ జెక్కుల నంటెడు విగళత్కచాళితోడ వలిగుబ్బ పాల్లిండ్లు నిలువ కిట్టట్టు సం క్షోభించు పయ్యెద కొంగుతోడ వెరపు నొక యొజ్జయై వింతవిలసనములఁ గఱపఁ జూపట్టు సౌందర్య గరిమతోడ సరభ సాకర్షణ క్షోభ చకితయైన మదను జయిలక్ష్మిరీతి నమ్మగువ దనర." (కళా. ఆ, 3, ప. 146) సిద్ధుండు చూచినా ఁడు. చూచినదే రెండవ మాటలేక పరిరంభ ణమునకు మొదలిడినాఁడు ! బుషుల రసికత లూ మాత్రమే క్ర రా ! సౌమనస్యమున బయి పవి ల కు C బాళయుగాండ్రకు మృగము లకును భేదము శూన్యము ! ఆ బాల యు నది సైరింపక రక్ష ణార్థము పేరెలుంగున నా క్రోశించిన, చూ రకూ నల కూబరుండు న వచ్చుటయు ! తరువాతిక్రమములును బూర్వమే వివరిQపం బడియో . ఆ న లకూ బరు ని కెదురు గా రంభాకారియై Cూపె చను దెంచు ఠీవి c దిలకింపఁడు ! సీ. తిరముగా ముడువమి విరియు బాకెడు కొప్ప చోడ్తోడ నొక కేలఁదురిమికొనుచు వల్లెవాటుగఁ గొంత వలువ చన్హవ నిల్పి పెరచేత నీవి గల్పించుకొనుచు నుదుటిపై నొక్కింత చెదరిన ముంగురుల్ పాపటకును బొందు పఱుచుకొనుచు సారె కు జారెడు శ్రవణ కల్లారంబు లందంద మూఁపున నానుకొనుచుఁ జమటనంటిన పానుపుఁ జివురుఁ దునుక లెడనెడ నఖక్షత్రా శంకఁ దడవి కొనుచు రంభ యేతెంచె మిగుల సంరంభ మమరఁ దొలుతఁ బ్రియుఁడెగుడెంచిన త్రోవ బట్టి. (కళా. ఆ, 3, ప. 156) మనోరథ మొక్ర రీతి ఫలించె నే కాని పరిపక్వమయ్యెననుట నిర్వివాదముగాదు. అయిన నేమి ! ఈ పె ప్రబంధముల రాచక న్నె గాదు గావున, కొంచెముతోఁ దృప్తిఁజెందగల యుదారురాలు ! ఆ కొంచెమునకు మారు బేరముగ మరణ శాపము వచ్చిపడినను, ద్వితీయ భాగము 177 "ఎట్లును గాంక్షితంబు సిద్ధించె. ఇఁక జావుగలిగిననేమి ? శక్తి గుడియొద్ద దేహత్యాగం బొనర్చెద" నని యుచటికి వచ్చి, యా స్థానం బునఁ దనవలెనే శాపగ్రస్తుండై మణికంధరుఁడును ; దేవీకటాక్ష మన ముదిమి వీడి కుమారీ రూపంబున విరాజిల్లు సుము బ్లూ సత్తియు, మణి స్తంభుఁడును గుమి (గూడ, వారు వారు చెపి వృత్తాంతము లంబట్టి తన్నుంగలసిన యు తండు కుబేరనందనుండు గామి శోకభ రాలసయగుడు నా పెంజూచి మభ్కంధ కుం డిట్లని {1 క్ర, o رجے: ہے یے .حسی, و نحاسيسة 壘 學 @ 鹼 顧 ■ 酶 @ 藝 తరుణి ! యట్లపురూపం బున నున్నవాఁడ నేఁజమ్ము' (కళా, ఆ. 4, ప. 10) అని పలికి, “చ. జలజదళాక్ష ! యేను మునిశాప భయంబున నెందు నేరిక్రిం దెలివిపడంగనీక మది ధీరతఁ ద్రిప్పదుఁగాని నీషయం గలదుసుమీ తలంపు మనగానకళాభ్యసనంబు వేళలన్ ఫలమిటులొందె దానికిని భాగ్యవిశేష వశంబునన్ దుదస్” 16 చ. అనుడుఁ గృతార్థనైతిఁ గుటిలాత్మకుఁ డెవ్వఁడు నన్ను నట్లు వం చనమునఁ గూడునోయను విచారమువా సెను, నీదుపొందు నా కు నభిమతంబె నీకుఁదగనన్న తలంపున నీ తలంపునే గనమినిద్రిప్పదున్ హృదయకాంక్ష నినుంగనుఁగొన్న వేళలన్. 27 అని చెప్పి, ఇక్కడకు "నీకుఁదగనన్న తలంపు" నలకూబరుని యందు Oబలెఁగలదు అని తనమాటల నమ్మదురో మొగమూటము లని వాపోవుదురోయను శంకంజేసి, గరువము నభిమానముఁగల కోమలమానస యగుటచే శపథంబులు ప్రమాణంబులు ననుచి తంబు లని భావించి “యాసుద్ధుల్ హృదయైక సాక్షికములేమన్నన్ వృథాయిత్తజిన్" అని వచించి, నలకూ బరునిపై మనసు పోవుటకుఁ గారణ మొండు డొ • • • • • • • • • • సమచింతతావక రూపరేఖ చొ ప్పే నొక కొంత గల్గఁగని యిచ్చఁ గుబేరతనూజుఁ గోరితిన్. 20 ية క. శాప భయంబున నెఱయఁగ నీపైఁ గోరిక మఱల్చి నిధిపతిసుతు నే 178 కవిత్వతత్త్వ విచారము

  పాపపు వేళను జూచితి                                                                       నోపయిసొబ గేను మఱి గనుంగొన గుఱిగాన్,                                 21

క. ఆయక్షతనయుఁడని ని

 న్నే యేఁ బొందితిఁ దుదన్ వనిన్ మనభాగ్య

శ్రీ యేమని చెప్పదుఁ బడఁ బోయినఁ బూఁ బాన్పునఁ బడుపోలిక యయ్యెన్. 22

 ఉ:  శ్రీయుతమైన దివ్యమణి చేతికినబ్బఁగఁ బాఱవైచి త

చ్ఛాయ యొకింతయున్కిఁగని చాలఁగృశించితి గాజుపూసకై నా యవివేక మేమనుకొనం దుదఁదన్మణియబ్బెనన్న న త్యాయత తత్సమాగమ సుఖాప్తికి నోఁచమి నెంచి కుందెదన్. 23 ఆ. ఇట్టి మాటలిప్పడే నాడుకొనుటయు ననుచితంబ వారవనిత పలుకు లిచ్చకంబులనక యెవ్వరు నమ్మెద రదియుఁగాక దృష్టమన్యవాంఛ. 24 అనిఒ లజ్ఞా శోకంబులడర నవనతముఖియై యున్న కలభాషిణికి సమాధానము జెప్పి నిదర్శనముగా సుగాత్రీ శాలీనుల చరిత్రంబు వక్కాణించి మణికంధరుం డా పెకుందు ను బోఁగొను. ఈదర్శన మేలయనఁగా, ఒకరిపై బ్రేమయుండినను వారేదేనొక క్రొత్తరీతి నుండి నం గాని మతిసమ్మతింపదను శృంగార న్యాయమునకు ! ఇది శృంగార విశేషములకుం జేరిన భావప్రకృతి. భార్యయందైనఁగాని, సర్వకాలముల సర్వావస్థల నేకరీతియగు మక్కువం దాల్చినవా రుండరు. ఏదేనొక విలాసము వహించి యొప్పారిరేని తమి తనంతట రేఁగును. మనుష్యులును బలుమూర్తులు గలవారని యంటిమి గదా! హృదయ వికాసము గలిగించునవి యందు c గొన్నిమాత్రమ. మఱి ఒకరికొక మూర్తిపైఁ బ్రీతి. ఇంకొకరి కింకొక మూర్తిపైఁ బ్రీతి. రేఖలు, లీలలు, విలాసములును తత్తద్ధృదయసారముల ప్రకారము సుఖ దుఃఖూవహము లగుట వింతగా దు. అయిన నొక్క టి. పైఁజెప్పిన న్యాయము ఏక పురు పునందును వివిధ కాలముల స్త్రీలకు రాగము మాఱుచుండుటకు హేతు భూతము. ఒక నియందలి ప్రీతి వాని మూర్తి ననుసరించి హెచ్చుట తగ్గుట తెలిసెను. కాని కలభాషిణి వృత్తము వేఱు. ఏకకాలము నందే యిరువురియెడఁ జి తము హతి నటునYది. ఇది బావరమా ?  ద్వితీయ భాగము

                                                                                                                     179 
               

అభావ్యమా ? మనసు ఒకే కాలమున నిద్ర అపై సమముగఁ బా అునా ? అనేకులపై మోహ ముండుట నిజమా ? ఇది కష్టతరమైన ప్రశ్చ. మణికంధరుని వలచినది నలకూబరునిని వలచినప్ రీతి నిరువురిమీఁద దుర్భర మోహముం బూనియుండిన వాృg స్త్రీని చరిత్రముం జదువుటచే నెఱుంగుదును. ఆ పె యెవ్వరన, సుమారు నూఱు సంవత్సరముల క్రింద ఫ్రాన్స్దేశములో గణ్యయు విద్యా గంభీరయు C గా నుండి వెలసిన 'లెస్ పినాస్' అనునా క్షే TS” ca) &S యిట్టి వర్తనము ఆస్త్వాభావిక మనరాదు, అపురూప మనవచ్చు: అపురూప శృంగారముల సూచించిన సూరన్నయే • రవిగాన్వ. గాంచెడు కవి !'

            కలభాషిణి యొక్క తదనంతర వృత్తాంత మింకను గౌర వార్ధము. తన శాపంబుఁ దలంచి కొని త్వరలో జీవంబు విడుచు టయు కర్తవ్యమని රිටිට් ට ඨි సిద్ధుని జవి, 'ఇంక జూల ? నీ ఖడ్గము అకుంఠితోద్యోగము. రంభా శాపమును దాని గ్రి సహాయ కారి. క్లానం త్వరలోఁ గార్యంబు ముగించి తత్ఫలంబగు సామ్రాజ్య సుఖంబు ననుభవింపుమా' యని ధృతి మైఁ బలికైన సిమ్హ : ప్రత్యుత్తర మిచ్చుచున్నాడు, "నా భార్య నిన్ను వేయఁగ$డదని కాళి కాదేవిపై యాన పెట్టి యుండుటచే మునుపే వృక్ష ప్తో ... యన్ని పాట్లఁ బడి తిని. ఇCక నామాట వలదు. శ్ర కత్తిని మgది కంధరున కిచ్చెదను. అతఁడు దానిని నీపైఁ బ్రయోగించి రాజ్య లక్ష్మీ మహనీయుండగుఁగాక ! అట్లని మణికంధరుని నతి ప్రయాస మై నీ క్రూరకర్మమునకు ననుమతుం జేసిన, కల భాషిణియు క్రో రి కోరి కాంచిన వరుఁడు విధి (పేరణంబునఁ దనకు యముడుగా గా కాల వైపరీత్యంబునకు చోద్యంబున, అప్రమేయ శాంతియు వైంది ధీర భావయై
             “వ........... మణి స్తంభునకుఁ దదంగనకుం బ్రణామంబులు సేసి కన్నీళ్ళు గ్రుక్కికొనుచు “నీకలంకపాటు తక్కిన భయమునకుఁగాదు సుండు, మిమ్ము నెప్పడు గురుభావంబున నారాధింపచుండ లేమికిం గాని" యనుటయును సుముఖానత్తియు నోయమ్మ మననెమ్మనంబుల కూర్మి యింతటన పోయెనో మీఁదట నైన నీపతియు, నీవుఁ గోరినట్లు మమ్మ గురుభావంబున నడుపుకొనియెద రనినఁ గలభాషిణి పునః పునః ప్రణామంబు లాచరించి ముకుళిత కరకమల యగుచు నిట్లనియె                             (కళా. ఆ, 4, వ. 177) 180                     కవిత్వతత్త్వ విచారము
        శా.  పూతంబైన మదీయపుణ్యయుగమో పుణ్యంపుటిల్లాలనీ
             పాతివ్రత్యము చందమున్ విన మదిన్ భావింపఁగా నెట్టి దు
             ర్నీతి ప్రక్రియ వారికైనఁ గృపతో నీవిచ్చినంగల్గు నా
             పాతివ్రత్యము నాకుమీఁ దనయినం బ్రాపింప దీవింపవే !     ప. 178 
         క.  నావుడుఁ బరమ పతివ్రత
              వై వెలయుము రాజ్యవైభవానుభవం బెం
              తేవర్తిల్లఁగ నలరుచుఁ
              బ్రోవుఁడు మముబోంట్ల నీవిభుండును నీవన్.                       179
        ఉ.  అట్టిటుఁ జంచలింపకు దృఢాత్మత నుండుమటంచు నిప్పడే 
             మిట్టివి నీకు దెల్పునవి యెయ్యవి పెండ్లికిఁ బోవునట్లు గ
             న్పట్టుచు నున్న దాన వతిభవ్యవికాసమునుబ్బుఁ జూడ నిన్
             గ ట్టిగ నెన్న దేవతవుగాని నరాంగనవే మృగేక్షణా !                     180 
        చ.  అని తనుఁ బల్కునజ్జలరుహాక్షిని వీడ్కొని సిద్ధు వక్ర మున
             గనుగొని నన్ను నంపితిరె ఖడ్గము నిచ్చెదరే యటంచు నా 
             తని బలుకత్తిఁ బుచ్చుకొని తా మణికంధరు చేతికిచ్చి యో
             గ్యనియమ గంధమాల్యవతియై కలభాషిణి నిర్విశంకతోన్.              181 

   శక్తికి నభిముఖియై కూర్చుండెను. స్వహస్తముతోఁ గుత్తినిచ్చు మేల ? ప్రియునకు మనస్సంకోచము వాయుట కొఱకు సత్యమైన వలపునకు లక్షణ మే యిది. తమ కెన్ని వచ్చిన నేమి ? ప్రియులు సుఖంబున్నఁ జా లు : ఖడ్గ ప్రదానానంతరము అతని మనసు గట్టి పడునట్లుగా
       “క.  సమరంబున నెదిరించిన
             సమదాహిత వీరవరులఁ జక్కడఁచుటనై 
             జము మీకునిట్టి యెడలన్
             భ్రమయక చేమ అవకునికి పటు శౌర్యమునన్."                       184 
    అని తెలిపి కలభాషిణీదేవి యతనిచేత నిరస్త్రజీవయాయొ !
         ఈ పాత్రముం గూర్చి యింత విపులముగ వ్రాసినందుకు క్షమాపణార్థమై కారణములఁ జూపవలయు. సూరనార్యుని వాజ్మయ సృష్టి నెల్ల నియ్యది నిస్సంశయముగ నగ్రగణ్యము. దీనికిం దీటుగు చరిత్ర మింకెయ్యదియు මීඨ . శృంగార వర్ణనముం జేయుటలో ను ప్రబంధముల వెజ్జులేవియు వేయ లేదు. నల కూబరునికై నాలుగేండ్లకన్న నెక్కువగఁ గాచియుండెఁగదా ! ఇష్ట ముండినఁ జెలికత్తెలతో మొఱలిడుట, ఉద్యానవనములోఁ బడి                                                ద్వితీయ భాగము                                                  181

పొరలుట, చంద్రాది దూషణము ఇట్టి వికారచేష్ట లన్నియుఁ జేసి ನಿಲ್ಲು చెప్పియుండవచ్చును. కాని, కవి యీ విషయములC దలంప నైన లేదని తోఁచుచున్నది. భావనాశక్తిమై వ్రాయువారలకు మనసు పాత్రములయంద లీనముగనుండుఁ గావున సహజ రాగములు దప్ప నితరములు దట్టవు. మఱియు, నీ శాస్త్రీయ ఘోషలకు మధురలాలసా చరిత్రములో C బ్ర వేశమున్నది గాన నిటు ననవసరముల ని కవి వానిని విడిచి పెనేమో ! కారణము లేయేటనైనఁ బోనిండు ! మనకు లభించినదన్ననో మనసువశము గాక పోవునంత రమణీయమైన కథ. కవికిఁ గృతజ్ఞతమై సమస్కారము, రసికులకు స్వాగతమును !

                                         శోకాంతవర్ణన  లనిషేధ్యములు
     ఇంత మంచి సుందరమగు పాత్రము వర్ణనము ళోకాంత ముగా జెప్పట కిష్టము లేమి చేతనో, మఱి, మన కవులకుం బట్టిన దౌర్భాగ్య మతంబు కతంబుననో, మణికంధర ఖండితముస్తకయగు నా లలనాశిరోమణ్ కాళికాదేవి కరుణా ప్రసాదంబున "పునస్సహిత మస్తక యు, నిజపురీ వర్తినియునై తన బంధుమిత్రాదుల నల రించుచు " సుమారు రెండు సంవత్సరము లుండి పిమ్మటC గాల ప్రాప్త మరణ యాయొనని కరుణ రస ప్రధానమగు నీ భాగము యొక్క సొంపును గవి వికలంబొనర్చి యుండుట భాషాదుర్దశ గదా ? రసములలో శోకము నొక్కటి. ఇది మాత్రము నిషేధ్య మన నేల ? శోక ప్రధానముగా వ్రాసినఁ గవిత్వము మొక్క పోవునా ? మొత్తము మీ ఁద భారత మే శోకాంతమcట ! దానికి రాని తక్కువ పెఅవానికి వచ్చునా ?
                                          కల్పనాస్టాలిత్యముల
 
       ఇట్టి యుద్ గ్రంథమునఁ గల్పనా భంగము లుండుట చింత నీయము ! కృష్ణుని భార్యలయొద్ద కల భాషిgచీ నారదులు గానవిద్య నేర్చికొనుటకై కడపి న కాలము నాలుగేండ్లు మ8వీకంధరు ( డంతః పురములోనికిఁ బోఁగూడదని యే మో వాని కీ ప్రయాస మావంతయు లేకయ "పుండరీ కా క్షుని యనుగ్రహ విశేషంబున సకల రహస్య సంగత విద్యాసంపన్నతచేత నారద కల భాషిణులయట్ల యత్యధి కుండవు" భాగ్యము లభించినది ! ఈ యనుగ్రహ విశేషముం బ్రయోగించి వారిని సద్యః కాల విద్యామహనీయత ఘటించి కల భాషి ఇది విరహ కాలమును మట్టుచేసి యుండ రాదా ? కృష్ణ కాంతల శిక్షయు ననావశ్యక మాయె, దానితోఁ గల్పనయు న్యూనమాయె.