కవిత్వతత్త్వ విచారము/తృతీయ భాగము

వికీసోర్స్ నుండి

                                                     

తృతీయ భాగము

మొదటి ప్రకరణము

                                             మధుర లాలస ప్రభావతియొక్క యక్క
    ఈ పొరఁబాటులంగూర్చిన ప్రస్తాపములు ముఖ్యములుగావు. ఏలన, షష్టాశ్వాసము తుద మొదలు క్షమార్ధములుగాని దోషములు దట్టముగ నుండుటచేత, వీని చింత యావశ్యకము. మణికంధ రుఁడు కళాపూర్ణ డై పుట్టి రాజ్యముఁ జేయుచుండఁగా, నతని కొలువుకూటములో శిశువగు మధురలాలస యొకనాఁడు హారము యొక్క నాయకమణి హృదయస్థమగుటఁజేసి యా కళాపూర్ణాది పాత్రంబుల చరిత్రంబు లత్యద్భుతంబున మందలించినది. రాజు గారి కిదివఅకే యు భినవ కౌముది భార్య యూయెను. మధురలాలస తాను కళాపూర్ణుని భార్య యగుటకై యవతరించినదని తెలిపెఁ గావున.
              “క.  ఆ మధురలాలసా కథ
                    లేమియు శుద్ధాంతమునకు నేగకయుండన్ 
                    భూమిపతియడఁచె నభినవ
                    కౌముది విననేలయనుచు ఘనయత్నముతోన్."
                                                                      (కళా. ఆ, 6, ప, 190)
     ఇది హాస్యమా ? ప్రయోజక మా ? ఎట్లును అభినవ కౌముది కోపతాపములు లేక ద్వితీయ వివాహమునకు సమ్మతించుచున్నది గావున నీ జాగ్రత్త యేమియు C బనికిరాదు !
     ఇఁక కవి శృంగారమునకు దిగి పాడు ప్రబంధ ధోరణికిం జేరిన ముఱికినంతయు నింపైన సుగంధమని దట్టముగఁ బట్టించు చున్నాఁడు ! మధురలాలసకు యావనము వచ్చినది. కవితకు వచ్చినది ముదిమి ! యా వనము వచ్చుసరికి కవి కృతమైన యం గాంగ పరీక్షయు వచ్చునుగదా ! ఆయమ్మ యా కాలమునఁ బెద్ద తో ఁటవలె నుండెనఁట !
            సీ.   గురుతర స్తనకేళిగిరులును గంభీర
                                 తరనాభి కూపమతల్లికయును 
                  జారురోవూల్డి శృంగారధారాసర
                                ణియు నంగుళీకిసలయచయంబు
                                            182                                            తృతీయ భాగము                                       183

సుకుమారబాహు వల్లికలును రమ్యోరు
                                  కదళికా స్తంభ ప్రకాండములును
                  సులలితాధర బింబఫలవిలాసము పుష్ప
                                  విసర పాండిమహాసవిభ్రమంబు
                  గలిగి పలుకులు శుకపిక కలకలముగఁ
                  గుంతలంబులు మధుకర కులముగాఁగ
                  శంబరా రాతి కేళీవనంబుఁబోలె
                  సుదతి యపుడొప్పె నొక వింత సోయగమున.

                                                                                                (కళా. ఆ, 6, ప. 206)

ఈ సంగతి యీ మాత్రము. ఇఁక నింతలో ఁ గళాపూర్ణుఁడును అభినవ కౌముదీ విహారముల చేతను రాజ కార్యములచేతను మధుర లాల సను మరచినాడ(ట ! అన్ని యద్భుతముల శిశుప్రాయమునన చెప్పిన దానిని, సమీపమున సామంతు నింటఁ బెరుగు దానిని మఱచుటయట ! ఈ మఱపునకుఁ గారణము కళాపూర్ణుని యొక్క బుద్ధిహీనతగాదు, వు ఆలీ కవియొక్క ! ఈ మఱపు రానిచో శాస్త్రీయ మగు హెుయలున కవ కాశ ముండదు. అలంకార క్రమములు వేయకుండినఁ గావ్యము చెడునను భ్రమచేత రాజునకుఁ భ్రమఁ బెట్టినాఁడు ! ఈ చిత్తశోష రాజునది గాదు. శౌస్త్ర విధేయతంబూనిన కవిది.

ఆ మధురలాలసకో యుద్రేకము బలమైనది ! ఉద్రేక లక్షణా లన్చియు మశూచి కాఁక తాకిన లేచు బొబ్బలవలె నంకురించినవి ! మొగము తెల్ల బాఱినది. ఉండు కొంచెము మతియు C బోయినది ! "ఒక్క తెఁ బిల్వఁబోయి మఱియొక్క తెఁ బేర్కొని బిల్చు" నఁట ! “ఒక్కెడ కేగఁజూచి మఱి యొు కె_డ కేగు" నట ! భోజనశాలకుఁ బోవుదమని లేచి పెరటితట్టునకు మఱచినట్లు వెళ్ళునే మో ! పురు పునితో మాటలాడి యుండకపోయినను,

సీ. ఏమి కన్నులఁగన్న హృదయేశు రూపంబు
                           దో (పక యదిమన్ను దోఁపకుండె
                 నేమి వీనుల విన్న హృదయేశు మధురోక్తి
                           తోపక యది మున్ను దోపకుండె,
                                                                                (కళా. ఆ. 6, ప. 214

)

ఈ గారిడీ తంత్రము అమానుషమ ! పైశాచముగావచ్చును ! ఇట్లనేక విధంబు ల రేవగలును జాగ్రత్సుషుపు లC గామవికారముల 184 కవిత్వతత్త్వ విచారము

నాచారము రీతిఁ బ్రకటింపఁ జొచ్చినఁ జెలికత్తెలు వెఱఁగంది మామూలు విచారణ లకు ప్రారంభించిరి. ఈ చెలికత్తెవిషయమై నాకొక సందేహము ! యజమాను రాలి యుడుకుఁ బొడఁగను వేళలఁ ద మకుఁ గొంత కా (క యొక్క దాయేమి ? ඩ්රි కష్టము నరయు కవులు లేరుగా ! వారు ప్రతిక్రియఁ జేయుటకై " శుద్ధముగ నుప యోగములేని చికిత్సయని ప్రబంధము ఆవలన దెలిసియుండి యు నా మె నుద్యానవనమునకుం దోడ్కొని పోయిరి . ఇది మొదలు కవి గతానుగతికముగా వ్రాయుచున్నాఁడే గాని, స్వబుద్ధి పొంతఁబోవునట్లు గానము. భావములు నవ్యములు గావు. రుచిరములుఁగావు. పాట ప్రాఁత. మాట రోఁత ! మధురలాలసయుఁ దత్సఖులును జల క్రీడలాడిరి. దేహమునకు శాంతమే మోగాని యూడిన తరువాత "నవీనవస్త్రాభరణ గంధమాల్యంబు ల నలంకృత లైరి". సరియే కాని ఈ భారమగు వస్తుసామగ్రి నెవరు మోచి కొని తెచ్చి సిద్ధముగ నిడిపోయిరో పత్తాలేదు ! అప్పడు రాజుగారు తటుక్కున వచ్చిరి. ఇCక రాకున్న వారికీ కన్నె జ్ఞప్తికి వచ్చు టెట్లు 2 తిక్క బలియు టెట్లు ? సరి. పరస్పర దర్శనము సంప్రాప్తము

చ. వినుకలిచేతమున్ మిగుల వింతలు గాగ విరాళిఁగొన్న య
వ్వనజదళాక్షి యట్లు దనవల్లభురూపముఁ గన్నులారఁగాఁ
గనుఁగొని . . . . . . . . . . . . . . . . .*
                                     (కళా. ఆ. 6, ప. 239)

అని యున్నది. దీనికి బూర్వ మెన్నఁడును జూడకున్న గళా పూర్ణుఁడని గుర్తెట్లు గలిగె ? మఱియు

ఏమ గన్నులఁగన్న హృదయేశు రూపంబు
దోఁపక యదిమున్నె దోఁపకుండె”

నని పూర్వమే యాపె యుపద్రవముంగూర్చి వ్రాసియుండు టం జూడ కన్నులC జూడకమున్నే హృదయమున రూపమావిర్భ వింపఁగల వింతమానిసియో యీ మదాశయు పుత్రి ! లేక చిత్ర ఫల మే మైన నీ వినోదముల కాధారముగా నుండునా ! ఊహ్యము. కళాపూర్జుఁడు "ఎట్టకేలకుఁజనియె దిరిగి". ఈ ముద్దరాలును తియ్యని పచ్చి పచ్చి యోజనులకుం దొడంగుచున్నది ! "ఇంకెట్టు లమ్మా ! తోఁ టు కేల పిలుచుకొని వచ్చితి మే ? ఆ రామములు మన్మధపక్షములు గదా !" యని చెలులెల్ల నొక చిన్న లెక్చరు వేయునప్పటికి నంగనామgచియు,  తృతీయ భాగము 185

                   క. ... ... ... ... ... అంగజతాపం
                      బున నుస్సురుస్సురనుచుం
                      గనురెప్పలు దేలవైచి కడుసొలయుటయున్.
                                                                       {కళా. ఆ. 6, ప. 249)
                  ఇఁక శైత్యోపచార ప్రారంభము !
       స         విరిదమ్మి తావులు వెదఁజల్లు కొలనిచెం
                                          గటఁగమ్మ పన్నీటి కాలువలును
                   గడు నివతాళించు కప్రపటనఁటుల
                                           యిరవులఁ బూవుఁ జప్పరముఁ బన్ని
                  వట్టి వేళ్ళను దడిగట్టి శ్రీగంధపు
                                          టసలునమెత్తి తదంతరమునఁ 
                  కర్పూర వేదికం గావించి చల్లని
                                         చెంగల్వరేకుల సెజ్జఁదీర్చి 
                  చిలుకుదేనియతోడి గొజ్జంగిపూవుఁ
                  దలగడయమర్చి యందు నా జెలువనునిచి !
                 జగతిఁగల నర్వశైత్యపచారవిధులు
                నలిపిరందును గడఁగాన కలసిరంత.
                                                         (కళా. ఆ, 6, ప. 251)
           ఈ పద్యములోని విశేషములఁ దలచుకొన్న నాకు గుండియు లదరుచున్నవి ! అబలలు, పూఁబోండ్లు, కోమలాంగులు అనఁబడు సఖీజనములు, గున్నయేనుగులవంటి యిరువదిమంది కూలివాండ్రు చేయుట కన్న నెక్కువ పనిని ఇంత త్వరలో నేలాగునఁజేసి ముగించిరి ! కార్య మెంత సేపుపత్రైను ? ఆదివ ఆ9కు నంగనామgది సొలసియే యుండెనా ? లేదా, శాస్త్రప్రకారము మంచిలగ్నము చూచి యీ వేళకు నామె మూర్ఛపోవునని యెఱింగి యాక్రియ లన్నియు ముందునాఁడే తయారుచేసి యెదురు చూచుచుండి రా ? నా కుంజూడ నిట్టి పద్యములు కవులు తొలుతనే వ్రాసి పెట్టి పిమ్మట నది యే కథ యైన నేమి, యక్కడక్కడఁ దూర్చి పెట్టుదురేమో !
               ఉ   . . . . . . . . . . . . . . . . . . . . . . . . .۴غه

. . ... ... ...పూవిననకఱ్ఱలు గొజ్జగినీట మాటికిం

                      దొప్పగఁదోఁచి వీచుచుఁ జనుంగవపై, నరకాళ్ళ, బాణులన్   
                     లప్పలు గాఁగఁ జందనమలందుచుఁ గొందలమందిరందఱున్. 252 186                                 కవిత్వతత్త్వ విచారము
                                                                 ఏమి సౌకుమార్యము ! ఇతరులు దేహమునట్లు తో ముచు

గుజ్ఞమును మాలీసుచేసినట్లు చేయుచుండఁగా సంతోషముచే సకి లించు గుణము గలుగవలయునన్న పాలియగాండ్ర యిండ్లలో నవతారమెత్తవలెను ! లేకున్న నట్టిగడుసుదనము అరిది. ఆ సంగతి యటుండనిండు. ఈ యుపచారములు నపచారములు జరుగుచుం డఁగానంద అు గప్ చుప్ అని యూరకుండిరి. మాటలేదు. అవి ముగిసినదే మౌనముద్రం బగులఁగొట్టి చిలుకల వలెఁ గిలారింప ξύο ζήδ. "అయ్యో ! అమ్మా ! చెప్పవే నీకష్టము ప్రాణ సఖితో " నని యొుక నంగనాచి ప్రార్ధింపఁగా (ఇదివరకును ఏమియుఁ దెలియకయా యిన్ని దోహదములు చేసియుండుట ? ) మధుర లాల స యెట్లో మనసును నాలుకను దృఢ పఱుచుకొని యేమను చున్నది.

       ఉ. ఓ హరిణాక్షి నీకు నిఁక నుల్లముదాఁపఁగ నేటికిన్ జగ
           న్మోహనమూర్తితోడ నటమున్నొక నాఁటినిశన్ విలాస స 
            న్నాహముమీఱ మద్విభుఁడు יס కలలోపలవచ్చి తేర్చెఁగా 
            మూహవక్షేళి నద్భుత సుఖైకమయంబది యేమిచెప్పదున్ !         261 
     కుల స్త్రీలు ? ఒక్క యుషాదేవి చూపిన దారిండ్రొక్కు గొట్టెలు ! ఇట్టి యేడ్పు నెవరైన నొక రేడ్చిన సంగీతముగా నుండును. అందఱుఁ గూసినఁ బెద్దరోఁత !
            “ముదితా చలువలు గిలువలు
            మదికి నసహ్యంబు లతని మన్ననఁ దక్కన్.”

అనుచున్నది. అట్లయిన మొదలే యేల వలదనరాదు ! చెలికత్తెలు గసియెత్తునట్లు శ్రమపడుచుండఁగా హాయిగాఁ బండుకొని వేఁడుక చూచుట న్యాయమా ?

   ಇಲ್ಲು వీరు రహస్యములు మార్చుకొనుచుండఁగా వెన్నెల యయ్యెను? నాకు నిక్కడ నొక ధర్మసంకటము. ఈ కాంతా తిలక ముల జాతి యేమి ? ఏమి విపరీతప్పఁ బ్రశ్నయందురో ! నా శంకకు గారణములఁ బరీక్షింపుఁడు. జలక్రీడకు నెంతయూలస్యమైనను మధ్యాహ్నము 1 గంటకు వచ్చియుందురు, ఆ వెనుక చలి దుర్భరము గావున, పుష్పాపచయాది లీలలు, అంగనామణి యొక్క వికారములు, సఖీజన రాజకుమారికా ప్రశ్నోత్తర మాలికలు, ఇవి నడచుసరికి చంద్రోదయము. పన్నమనాఁడనుకొన్నను ఆరు ఆరున్నర గంటలకుఁ గదా చందుఁడు పొడచూపియుండును.                                        తృతీయ భాగము                                                     187
     ఇంతసేపు ఎదిగిన కూఁతురు, భోజనాదులకు రాక, యొక్క డనో ద్రిమ్మరుచున్న, హిందూ జాతి తల్లులు ఆయుధపాణులై, అనగా పొరకను, చేటను దాల్చి, రోయుటకు వెన్నాడక యూరకుందు రా? అట్లుండిరేని వారు హిందువులా ? మనువు నోటిలో మన్ను వేయు టకుఁ గదా యిట్టి దురాచార వర్ణనము.
                       ఉ. కావునఁ జంద్రుగింద్రుఁ జిలుకం గిలుకం బికముం గికంబు నన్ 
                           గావుమటంచు వేఁడకుఁడు నాబ్రదుకీ రిపజాతికిం బ్రియం
                           బే వివరింపమీకుబలెఁ బెంచినవారికి ముద్దు గాక పె 
                           న్చావురుఁ బిల్లికిన్ గలుగునా మొగమాట మొకింతచిల్కపైన్. 217

ఇది కడ మాట బజారులో తుద బేరముందు రే, యట్టిది !

  చూడు Cడు ! వేశ్యయైన కల భాషి ఇది రాజకులములో ఁ బుట్టి నందున నెట్టి యపభ్రంశములకుం బాలాయె నో ! మన దేశములో ( గుల స్త్రీలకన్న వార కాంతలే యుత్తమలనుటకిదియొక తార్కాణము. మన యిల్లాండ్రు ఏకత్తెలుంగారు. వంటక తైలు దప్ప ! విద్యయు, స్వయంవరణముఁ గల వారు గాన, గgచికలు సౌమనస్యమున మిన్నలు, తక్కినవారి బ్రదు కెట్టిది ? శారీరక క్రియలచే నిండినది. ప్రబంధములలోని శృంగారము ఉత్తమమైనదిగాదు. ఈ నాయికా నాయకులు తాపోద్దీపిత దేహులుగాని బాధిత మా నసు లుగారు. బాల్యవివాహ వినాశిత దేశములో శృంగారానుభవము లాఘవమగు శేుమి వింత ?
   సంభాష ణ మూలముగ కథకు నభ్యుదయ పరంపరల ఁ గల్పిం చుట మొదలగు కవితాశక్తులన్నియు నీ ఘట్టములకు వచ్చుసరికి సూరన్నలో నుండక లేచిపోయినట్లున్నది. ప్రతిభ లేని పాడుకొంప లీ భాగములు !
      అంగనామ విని బట్టిన బాధలన్నియు C బురుష వృషభునిఁ గూడ బట్టినవి. అతఁడు నర్మసచివు నొక్కని సంపాదించి గుసగుస లా డెడిని. కాఁ బోవు నిల్లాలి యంగాంగముల వినువారికి నో రూరఁగ వర్ణించుట మొదలగు దుస్సహ తంత్రము లెన్నియేనిఁ గలవు. ప్రియు రాలిని దుష్యంతుఁడు మఱచినట్లు క్రా శ్రీ దాసుఁడు వర్ణించిన రీతితో ఁ గళాపూర్ణుని మఱపుకథను బోల్చిచూచిన, నీ సందర్భమున సూరన్న కవిత్వమెంత శుష్కించినదో తెలియును. పెండ్లి వ్యాపా రము. ఆపె చెలికత్తెలు ఈయన సచివులతో మంతనమాడి ముడి గట్టుటకు నేర్పాటులు చేయుదురు ! వలపనుదానిని ఉప్పను     188                                                        కవిత్వతత్త్వ విచారము

బప్పనుంబలె నంగడిలో c బెట్టి విక్రయించుట యీ కర్మభూమి యొక్క మహాధర్మము ! కళాపూరుఁడు మధురలా ల సను బెండ్లి యాడుటకై యభినవ కౌముదమ్మగారి యనుమతిని దానే కోరుట లేదు. రాయబారులను బంపుచున్నాఁడు ! భార్యాభర్తలకును మధ్యస్థమా ? ఏమీ ! భార్యకు పురుషుని పడుకలోనేగదా పాలు ! మనసులో లేదుగదా ! అభినవ కౌముదికి సరేయనుటదప్ప నింకే స్వాతంత్ర్యమున్నది ! వివాహము తటస్థమయినది. శుభకార్య ములో "పెద్దపూ (బోండ్లు" రాకపోకలు చేసిరట. ఎంత ముసలి వారైనను పూఁబోండ్లే ! శైలియు వ్రాలుచున్నది. పెండ్లియైనది.

                                           అసహ్యశృంగారము
         వధూవరు లే కాంతము గోరుచున్నారు. చెలికత్తెలు గొంచె మున వదలరు. కవియన్ననో యీ సమయమునఁ బ్రాణముఁబోయి నను వారిని వదలఁబోఁడు ! ప్రథమ విఘ్నము తల్లి. అవసరముగా వెళ్ళుచుండఁగా కూ (తును నిలఁబెట్టి యూ పెకు బుద్ధివచ్చునట్లు ఇచ్చిన యుపన్యాసము ఒక గంట దీర్షము ! అంగనామgటికి తాల్మి లేనితమిచేఁ గలిగిన తబ్బిబ్బులఁజూచి జరగఁబోవు తమాషాలం దలంచి, చెలికత్తెలు హాస్యముఁ జేయుటలో వినియోగింపఁబడిన కాలము అరగంట. అలంకార రచనాదులకుc బట్టిన కాలము 2 గంటలు ! 
     ఒకటి. నిష్కారణముగ మధురలాలస "విభుండిఁక వచ్చు టెప్పడొకొ విఘ్నము లేమయినన్ ఘటిల్లునో" యని తన కే ద్రోహముఁ జేయని యభినవ కౌముదిమీఁద దోషారోపణ కుం దొడఁగు చున్నది ! ఈ యమ్మ దౌర్భాగ్యపు విరాళిని కలభాషిణి యొక్క యుదారచరితంబుతో నుపమించి చూడుఁడు ! పిమ్మట "మెడికల్ ভ০ তত্তে ప్రొఫసర్ల" రీతిని పురుషుని శరీర భాగముల వర్ణించు చున్నది ! చాలీచాలని దానికి తన పరువేర్పడునట్టు బాగుగ విడఁదీసి యాడెడుమాట వినుండు !

“ తే. ఆ లలిత చరణములొత్తు కేలుగేలు

                      కోర్కిఁ దద్వక్షమునఁజేర్చు కుచము కుచము 
                       దివుట దద్రహఃకథ విను చెవులు చెవులు
                      పలుకులేల తద్రతిఁగన్న బ్రదుకు బ్రదుకు.”                                   తృతీయ భాగము                                  189
            పోతనామాత్యుని "కమలా క్షు నర్చించు కరములు కరములు" అను మహెూత్తర పద్యమునకుఁ బట్టిన గ్రహచారమా యూ యును గమనము !
      రెండు. చెలిక తెలు దార్చుటకై వచు \ట. అంగనామణి కి

لیتt مســ

                       ము. పాదియైనాథులుదారుఁ గాపురములింపుల్ మీరగాఁ జేయుచుస్
                              గది పెండేసి కొమాళ్ళ గూతులఁ దగన్ గన్నట్టి యిల్లాండ్రకున్
                              మదిలజ్ఞాదులు లేవె నీకుబలె సన్మానంబుతోఁ జక్కవ
                         ... చ్చెదొ యే మేఁగలదే.
           ఇత్యాది వివరము లC దెల్పుట, విను వారి చెవులు వ్రయ్య
          లగుట మొదలగు దారిద్ర్యములు గొన్ని !
           మూ ( డు . అంగనావు చి యీ రీతి నుండC గా రాజు గవాక్ష మూలమునఁజూచి యుత్కంఠ యా (పలేకపోవట. దానికి గుర్తుగా నింకను గాలము వ్యయమగునట్లు, ఆపె తన్నుంగూర్చి చేసిన మాడ్కి, యా పె యంగములను మిక్కిలి విమర్శతో వర్ణించి బుణ విముక్తుఁడగుట ! నీరసములైన యుపములు ఉత్ పేక్షలును భార్యపై దీపింపఁజేయుట.
                           క. సమదాక్షి మీనసంచా
                               రమునఁ దొలంకుచును ము   
                               వెళ్ళిపారఁ గ్రేవల
                              నమరించిన పిల్లకొలఁకు లంగనవీనుల్ !”                   I 24
                     పిల్లకొలఁకులఁట ! అందులో నుండి కాఱు ద్రవ మో 
                            చ. అనుపమముల్ రతిస్మరులయాటలు సర్దములంచుఁ గప్పి పె
                                 ట్టిన పువబంతులీ సతి కడింది చనుంగవ తేంట్లు కేవలం
                                   దును జొరకుండఁజేరిచిన తోరపు సంపఁగి పూవుదండలీ
                                  వినుతభుజంబు లాతుదల వేడ్కకు నిడ్డ చిగుళ్ళు హస్తముల్. 130
                 ఉ. మానవతీపతంసము సమగ్రనితంబ విజృంభణంబు జం

ل బూనది సైకతస్థలము పాల్పువహింపుచుఁ జాలనొప్పెడుస్

                       నునుమంచువోలె వెలిపట్టు మడుంగు బెడంగుచూపనా
                       సవసారసాళిపరిపాటి నుదంచిత కాంచి మించఁగస్. 132 190                                              కవిత్వతత్త్వ విచారము
               తే, అతివ తొడలును జపునంబు నరసి చూడఁ
                    గొమరు మీ బ్రెడు జమిలితొండముల శిరసు
                      తోడి వలరాచవారి యద్భుతపు హస్తి
                        యగ్రభాగంబు చూపఱ కాత్మఁ దోఁప. 135
               చ. జలజ దళాయతాక్షి మృదుచారుతర ప్రపదద్వయీ విని 
                   ర్మలరుచి పుల్లుపుల్లుమను రత్నప్పటందెల మోఁత జృంభణం
                   బుల నవకంపుఁ గచ్ఛపము పొల్పునదల్పుచు గెల్పుఁ దెల్పెడున్
                    గలుగునె యింక దీనికి జగంబులలో నుపమా ప్రసంగముల్. 155
         ఇత్యాది. ఈ పద్యములం బట్టి విచారింపఁగా నేర్పడిన విషయములివ్వి : రాజు గారి దూరదృష్టి బలము. అంగనామణి చీర యే మాయెనో ! ఆ పె గిర్కీలు కొట్టుచుండెఁ గాఁ బోలు ! లేకున్న నన్నిభాగములు గనుపడునా ? ఈ యుపమ లెందునకుఁ బనికి రావనియు, రోతలనియు వేఱుగఁ జెప్పవలయునా ? వీని క్రిం గారకము భావనాశక్తిగాదు. మఱి సామ్యశక్తి. అందులోను గుయుక్తి, కాముకుఁడఁట ! తాళలేనివాఁడట ! ఆలోచనాశక్తిచేఁ తట్టనట్టి పదునెనిమిది పద్యములు గొణ (గె నట ! రసాభా సమన ס: יה నిదియే గదా !
         ఈ పాండిత్య మంత్రములు ముగించిన పిదప చెలికత్తెలువీరొక తడా బ్లూ - ఆ పెకుఁ గరణియముల బోధించి, కళాపూర్ణుని "చరణంబు విలాసిని యూరువులందుఁ జేర్పఁజేసి బలిమి నావనజ ముఖి చేతఁ బట్టించి సంవాహన మొనర్పఁ జేసిరి". ఇది శుద్ధముగ అనావశ్యకము అసహ్యమును !
        అయ్యో ! మృగప్రాయ శృంగారమా ! ఈ చెలికత్తెలు మన్మ థుని పురోహితురాండ్రు !
        ఈ యోడారు వంటి కవిత్వములో,
            తే, వరునిచిట్టంపుఁ జేఁతలఁగరము ప్రేమ
                మెఱుప్పవోలెఁ దళుక్కున మెఱయుఁగాని 
                 నెలఁత సిగ్గను మొగిలులో నిలువలేద
                 యిదియు మిక్కిలి నింపయ్యో నతని మదికి.
                                                                    (కళా. ఆ. 7, ప. 154)
అని పద్యముమాత్రము సూరన యొక్క నైజప్రభావమును సూచింపఁ జాలినంత రమణీయముగానున్నది. తక్కినవి భావ                                       తృతీయ భాగము                              191
            ఈ యా శ్వాసము లంగూర్చి విక్షేపముగఁ జర్చించుటకు నా కిష్టములేదు. సామాన్య ప్రబంధముల ಯಿಟ್ಟು ಲ యువి నిరర్థక పద్య పూరితములు. కల్పనాశక్తి యే దిక్కునఁ బోయెనో ! సంభాషణ చాతుర్య మెందు గ్రుం కెనో ! ప్రతిభ యెటుమాయమా యెనో ! అలంకారాది శాస్త్రములయందలి మూఢభక్తి పటుతమము !
                       తుచ్ఛశృంగారములకు హేతువులు
       స్త్రీ వర్ణన చేయుటకు మనకవులకుఁ దెలియదు గాఁ బోలు ! కారణ మే మన ఇంటిలో నుండు రసములు జిహ్వకేగాని మనసునకు వికాసము నిచ్చునవిగావు. బాల్యవివాహము, విద్యావిహీనత ఇత్యాది దురాచార హ తులగుటుంజేసి యిల్లాండ్రు సరసములకుం బనికి రారు. ఇCక సరసములకుఁ దగినవారు దానిని జీవనోపాయవృత్తిగా నాశ్ర యించెదరు. వారి యందు మఱుఁగు, మా నము, జంకు, మర్యాద మొదలగు నుదాత్తగుణంబు లల్పంబులు. ఎట్టి హీనలయ్యుఁ గుల కాంతలకన్న మేలగుటంబట్టియే మొ వారికి • భోగము వారు' అను పేరు గలిగె, తక్కిన యాcడువారు భోగమునకుం దగరు. వారిం బ్రేమించుట దానధర్మము. జన్మపరిత్యాగతుల్యము !
                             భారత కవుల శృంగార వర్ణనము దివ్యము
           పచ్చిపచ్చిగా వ్రాయుట శృంగార మెన్నఁటికిఁగానేరదు. మహాకవుల శృంగారవర్ణనములో శృంగారము, శుచిత్వము సమ న్వితములు. ఆంధ్రకవ లద్దానికి విరుద్ధంబగు భ్రమ నేల దాల్చిరో ! ಅಲ್ಲು చేయుటకుఁ గారణములేదు. ఏలన, ప్రామాణిక కవులగు కవిత్రయము వారు మంచిత్రోవను విభావించియుండు కతనమున. భారతములో గోప్యాంగవర్ణన శృంగారమునకై యెక్కడను జేయఁ బడియుండలేదని తోఁచుచున్నది. నిదర్శనముగా
                                          నన్నయభట్
                  ఆదిపర్వములోని శృంగారపద్యముల వినుఁడు.
                 సీ. పలుకులముద్దును గలికి కాల్గన్నుల
                                                తెలుపును వలుదచన్నుల బెడంగు
                     నలఘు కాంచీపదస్థలముల యొప్పను
                                           లలితాననేందు మండలమురుచియు 192                            కవిత్వతత్త్వ విచారము
                     నళినీలకు టిల కుంతలముల కాంతియు
                                           నెలజవ్వనంబున విలసనమును 
                      నలసభావంబును బొలుపును మెలఁపును
                                                   గలుగునరికను ) >
                                                                              (ఆది. ఆ, 3, ప. 27)
                            క. కనకావడాత కోమల
                                తనులతఁ దనుమధ్య గమలదళనేత్రను యో
                                 జనగంధి నవని నాథుఁడు
                                 గనియోను సురకన్యవోని కన్నియ నంతన్.
                                                                            (ఆది. ఆ, 4, ప. 169)
                            ఉ. దాని శరీర సౌరభము దానివిలోల విలోకనంబులున్
                                దాని మనోహరాకృతియు దాని శుచిస్మిత కాంతివక్రమున్
                                  దాని విలాసముం గడుముదంబునఁజూచి మనోజబాణ సం
                                   తానహతాత్ముఁడై నృపతి... ... ... ... ...
                                                                                           (ఆది. மு. 4, 5. 170)
                            ఉ. చారుసువర్ణహాసి నవచంపకభూషయు సిందువారము
                                క్తారమణీయయున్ వకుళదామవతంసయునై యపూర్వశృం 
                                గార విలానలీల యెనఁగం చన ముందటనున్న మాద్రినం
                                భోరుహనేత్రఁజూచి కురుపుంగవుఁడంగజరాగమత్తుఁడై
                                                                                                    (ఆది. ఆ. 5, 145)
                              సీ. త్రిభువనలక్ష్మి యేతెంచి యే కాంతమి
                                                      ಪ್ಲೇಲಿಟ್ యున్నది యివ్వనమున
                                  గగణమణి ప్రభ గగనంబునందుండి
                                                     యవనీతల ప్రాప్తమయ్యె నొక్కొ 
                                     శంభుండు లావణ్య సద్గుణ సముదాయ
                                                          మింద యిమ్ముగ సంగ్రహించె నొక్కొ
                                      దీనియంగమును బొందిన యివ్విభూషణ
                                                            శ్రీయేమి పుణ్యంబుఁ జేసెనొక్

కొ యమరకన్యయొక్కొ యక్షకన్యకయెుక్

                           సిద్ధకన్యయొక్కొ & సమృద్ధి 
                           సర్వలక్షణ ప్రశస్తాంగి యిది దివ్
                           య కన్యయగు ననంత కాంతి పేర్మి,
                                                                (ఆది. ఆ, 7, ప. 72)                                             తృతీయ భాగము                                         193
                   ఉ. నెఱికురులున్ విలోలసితనేత్రయుగంబును నొప్పలొల్కు వా
                       తెఱయును దీనియాననముఁదెల్పు గరంబు మనోహరంబు నా 
                       యెఱిఁగిన యంతనుండి నతినిట్టి లతా లలితాంగిఁజూచి యే
                       నెఱుఁగ సురేంద్రకన్యకలు నిట్టిరె రూపవిలాస సంపదన్.
                                                                             (ఆది. ఆ. 7, ప. 77)
     ఇందు తొడలు, మీఁగాళ్ళు ఇట్టి గూఢార్థములు లేవు. అవి గల సందర్భము లాదిపర్వమున ಮಿ)ಗೆಣ್ಣಿಮಿ ಲು ..

ఎక్జా

                                             (పెగ్గడ ఎజ్ఞా
పెగ్గడ వ్రాసిన యరణ్యపర్వ శేషములో ద్రౌపదీహ:
            * ఊ. నీలపయోదమండలము నిశ్చలలీల వెలుంగఁ జేయుచున్
                    గ్రాలెడువాలు గ్రౌమ్మెఅుఁగు కైవడిఁ దద్వనభూమియంతయున్
                    లాలితదేహకాంతి పటలంబులఁజేసి వెలుంగఁజేయు న
                    బ్బాల వినీలకుంతల విభాసినిఁజూచి సవిన్మయాత్మఁడై.”
                                                                                      (ఆది. ఆ. 6, ప. 541)
                 ఉ. లీలయెలర్పఁగా నబలలేఁజిగురాక్షును బోలె నొప్ప కెం
                      గేలు కదంబ శాఖతుదిఁ గీల్కొనఁజేసి వనంతవిభ్రమో
                      న్మీలితబాలవల్లిక్రియ మేలగు చూడ్కుల కించి పావక 
                     జ్వాలయపోలెఁ జిత్తము నిజం బెరియింపఁ దొడంగెఁ జూచితే.
                                                                                          (3. 148)
                           సీ. మగృనేత్రదారుణ మృగసమాకులమైన
                                                   యివ్వనాంతరమున నేక తంబ
                                 యిట్లు నీయున్కికి నెయ్యది మూలమి
                                                       వ్వనదేవతవి సురేశ్వరునితోడ
                                 3○f) ధరిత్రికి నరుగుదెంచిన శచీ
                                                     దేవివో హరియురతుఁ దొరంగి 
                              Tâûc గ్రుమ్మరు పద్మగేహవో భవదీయ
                                                   జనకత్వమున సమజ్జ్వలితుఁడైన 
                             పుణ్యుఁ డేవంశమునవాఁడు పాలఁతి నీదు
                               జీవితేశ్వరుఁడగు సుఖజీవితాత్ముఁ
                                డెవ్వఁడబల నీ నామమై యింపు మిగుల
                              శబ్దమెయ్యది నాకు నిజంబుఁ జెపుమ, (ఆర. ఆ. 6, ప. 151)         194                                కవిత్వతత్త్వ విచారము
                 హనుమంతుఁడు సీతాదేవిని వర్ణించుట
                     : సీ, కన్నీరు జడిగొని క్రమ్మఁ బ్రాకెక్కిన
                                                గవ్రుకపోల భాగములు గలిగి
                        యవశమై యొరఁగిన యంగవల్లిక పొంత
                                                     నున్న భూమీరుహ మ్మూతఁగాఁగ
                               వెడలు నిటూర్పుల వేఁడిమిఁ బగిలిన
                                                            యధర పల్లవము గారాకుఁబోల
                                     దలఁపల సందడి దందడించినదాల్మి
                                                                 కదలు శిరకంపగతుల బెరయ
                              నున్న పుణ్యమూర్తినుత్తమసౌందర్య 
                                నవనతాన్య నార్తయైనదాని.                 (ఆర. ఆ. 7, ప. 28)
                                 తిక్కన్న -
            విరాటపర్వములోఁ దిక్కన్న వ్రాసిన శృంగారవర్ణనము అనన్య సాధ్యమని వేఱుగఁ జెప్పవలయునా ? ఔచిత్యశోభితము. చెనటియగు కీచకు నట్టివాఁడు సైతము నిజంబగు ననురాగ ప్రభా వంబునం జేసి కళాపూర్ణాదుల కన్న మేలుగ ನಿಗ್ಗುತೆನಿ విధమునఁ గాక గఱువతనంబునఁ బలికెడు. నిక్కువమైన ప్రీతియున్న నే స్త్రీనింగూర్బియైన నసహ్యకరములగు వర్ణనల మృగప్రాయులు గాని వారెవరైనఁ జేయుదురా ? విరాటపర్వములోని యా పద్యము లన్నియు నుదహరించెద, లేకున్నఁ బక్షపాతమను నపవాదమే గాక, తిక్కన తెలిసి వ్రాసినాడో గ్రుడ్డియేటుగా వ్రాసినాడో యనియుఁ గొందఱు శంకింపనగు అన్నింటిని నివేదించిన నేశంకకు నవకాశముండదు.
                ద్రౌపదియొక్క సైరంద్రీవేషము :
                           సీ, పఱమొయిల్గప్పినఁ బాడ నునుఁగాంతి
                                               గదలిన యమృతాంశు కళయనంగఁ
                                బెనుమంచుమీఁద బర్విన వికాసము దప్పి
                                                   చెలువగుందిన సరోజిని విధమున
                             ధూమంబుపొదవినఁ దుఱఁగలి మెఱుఁగులు
                                                      నలఁగిమూసిన దీపకళిక పగిది
                             ధూళిపైఁ బొరసినఁ దొంగలించుట మాని
                                                    లావణ్యమెడలిన లతిక మాడ్కి 

తృతీయ భాగము 195

గంధకారికావేషంబు కతనమూర్తి యుజ్జ్వలత్వంబు మఱువడియుండఁ బాండు తనయమహిషి . . . . . . . . . . (విరా. ఆ. 8, ప. 294)

నగరులో ఁ జొచ్చు లీల :

సీ. పదతలంబుల కెంపు పరఁగినతలము కుం కుమలిప్తమైన చందము వహింప

నంగంబునునుఁగాంతి యడరిన గోడలు

వేదులు మణిమయవిధమునొందఁ గనుఁగవ మెఱుఁగులు గదిరిన ముందర పుష్పోపహారంబు పొలుపుదాల్ప

వేనలికప్పుపర్వినమీఁదు నీలదు

కూలంబు మేల్కట్టు కొమరు వడయఁ

దానుజొచ్చినకతన మత్స్యక్షితీశు 

నింటనిమ్మెయిఁ గ్రొత్తయొప్పెసక మెనఁగ

నమ్మహాదేవి యున్నెడ కల్లనల్లఁ
బాండురాజతనూభవ పత్నియరిగె.               (విరా. ఆ. 1, ప. 308)
కీచకుని ద్రౌపది వర్ణన :

సీ. ఇయ్యింతి ప్రాపన....................

కుసుమబాణుని బాణముల్గూఢనైదు
గరిఁగి నేరిమినాటించి కరువుగట్టి 
పోసిచేసి చైతన్య సంపుటముఁదగ మ
టించిరో కాక యిట్టి చేడియలుగలరె.                (ఆ. 2, ప, 27) 


ద్రౌపది ಸ್ಥಿತಿ :

సీ. వెఱవక ననుఁజూచె వీఁడనియెదఁ గలు షించిన నొండొండ చెమట విడమ

ననుచిత కృత్యంబు లాచరించు విధాతృ 

బలిమికి నివ్వెరపాటు దోcప నిచ్చట దిక్కులే రెవ్వరు నాకను భయమున మేనఁ గంపంబు పట్టఁ జేయఁగ నేమి యుపాంబులేమి నా ననమున వెల్లఁ దనంబుగదుర నున్న పాంచాలిఁ గను(గొని ........... (అ. 2, ప. 33) 196 కవిత్వతత్త్వ విచారము కీచకుని యుత్కంఠ :

సీ. తన్వంగి మవ్వంపు( దనులత నెసఁగెడు
నునుఁగాంతి వెల్లువ మునుఁగఁ బాఱఁ
 గిసలయహస్త కెంగేల నేపారు క్రొ
మ్మించను లేయెండ మిగులఁ బర్వ
 గమలాస్య ముద్దు మొగంబు లేమెఱుఁగుల
మొత్తంబు సరిచుట్టు ముట్టికొనఁగ
 ధవళా క్షి తొంగలితర్జుచు టెప్పల చెన్న
కప్పను చీకటి గవియుదేర
బెగ్గలంబంతకంతకు నగ్గలింప
 నొదవు చెమటతోఁ జిత్తంబు సెదరి యెందు
మెలఁగఁ దలఁపేది యా సింహబలుఁడనంగు
పట్టి యాడెడు జంత్రంబు పగిదినుండె.

(ఆ. 2, ప. 37)

సీ. తెలిగన్నుఁ గవకాంత పొలుపార నించుక
గనువిచ్చి చూచినఁ గాదె యబల
చెలువంపు నెమ్మోము నెలమి సొంపినుమడి
గా నల్లనవ్వినఁగాదె యింతి
దంతమౌక్తికరుచి దలకొన మరుమాట
పలికినఁ గాదె యుత్పల దళాక్షి
యుల్లంబు సరనత దెల్లంబుగా లీలఁ
గైకొన్నఁ గాదె పంకరుహ వదన
యనుచుఁ జూచుఁ జేరు నమ్ముగ్ధ పలుకులు
వినఁగఁ గోరుఁ గేలు దనదుకేలఁ
గీలుకొలుపఁ దలఁచుఁ గీచకాధముఁడు ని
జానురక్తిఁ దెలుపనప్పళించు.

(ఆ. 2, ప. 45)

సీ. సుదతి నీమై చక్కఁ జూచుట కోడెదఁ
గనుచాటు పొరయునో యని తలంచి
మదిఁ బొనర్చినమాట మగువనీ పెంపునఁ
గుదిసి నా నాలుక తుదికిరాదు
పడఁతి నీ కరములుపట్టఁగ దివిరి శం
కించి వడంకెడుఁ గేలు సూడు
నెటినిట్టిదని యింతి నీ నెమ్మనంబెన్ని
భంగుల నరసినఁ బట్టువడదు

                                 తృతీయ భాగము                        197

చెలువ యింక నొక్కించుక సేపు నీ వ నాదరంబున నెప్పటి యట్లయున్న మన్మథుఁడు సమయించిన మగుడనన్నుఁ బడయవచ్చునె యెన్ని యుపాయములను.

                                                          (ఆ. 2,ప. 4)

కీచకుఁడు ద్రౌపదిని ముఖస్తోత్రము చేయుట :

సీ. నెత్తమ్మిరేకుల మెత్తఁదనముఁదెచ్చి
యచ్చునఁ బెట్టినట్లంద మొంది
చక్రవాకంబుల చందంబుఁ గొనితెచ్చి
కుప్పలు సేసినట్లోప్పమెఱసి
చందురునునుఁగాంతి కందేర్చి కూర్చి బా
గునకుఁ దెచ్చినయట్లు కొమరు మిగిలి
యళికులంబులకప్పఁ గల యంతయును దెచ్చి
నారు వోసిన భంగి నవక మెక్కి
యంఘిర్తలములు గుచములు నాననంబుఁ
గచభరంబును నిట్లున్న రుచిరమూర్తి
యనుపమాన భోగములకు నాస్పదంబు
గాదె యీ త్రిప్పలేటికిఁ గమలవదన.

(ఆ. 2,ప. 52)

సుధేష్ణ కీచకుని మనసు మరల్పన్ గోరి చేసిన కాంతాజన వర్ణనము.

సీ. లలితంబులగు మట్టియల చప్పుడింపార
నంచకైవడి నడనల్లవచ్చి
యెడమేనినెత్తావి సుడియంగఁ బయ్యెద
సగము దూలించిపై మగుడఁ దిగిచి
సోలెడు నెలదీఁగె లీల.c గ్రాలుచు వింత ..
చెలువంబు దలకొనఁ జేరినిలిచి
తెలిగన్నుఁ గవకు నెచ్చెలియైనలేఁత న
వ్వొలయంగ నరసంపుఁ బలుకు పలికి
మెఱయు చెయ్వులరాగంబు మెయికొనఁగ
నెడఁద సాగయించుమాటల నెలిమి మిగుల
నిన్ను ననురక్తిఁ గొలుచు నన్నెలఁతలుండ
నీరసాకార సైరంద్రిఁ గోరఁదగునె.

(ఆ. 2, ప. 64) 198 కవిత్వతత్త్వ విచారము

కిచకుని ప్రత్యుత్తరము :

సీ. గండు మీలకుఁ బుట్టి కాముబాణములతో
గలసి యాడెడు నట్టి కన్నుఁ గవయు
బినకాండముల శిక్షఁబెరిగి లేఁదీఁగల
మెచ్చకయున్నట్టి మృదుకరములుఁ
జిగురులతో సంధి సేసి యంబుజముల
పైనెత్తి చనునట్టి పదతలములుఁ
గలకంఠముల చేతఁ గఱచిన విద్య వీ
ణలకిచ్చునట్టి తిన్నని యెలుంగు
నత్తెరంగున రేఖయు నవ్విధంబు
గరువచందంబు నమ్మెయి కలికితనము
నట్టి చెన్నను సైరంద్రియంద కాక
కలవె యొరులకు నెఱుఁగక పలికి తబల !

(ఆ. 2, ప. 67)

కీచకోత్కంఠ :

సీ. లీల నాముందట నాలేమ వొలసినఁ
జూడ్కికిఁ జుబ్బన చూర్జిగాదె
కనువిచ్చి నన్ను నాతనుమధ్య సూచినఁ
దనువున కమృత సేచనముగాదె
చిరునవ్వు బెరయ నచ్చెలువ నాతోడఁ బ
ల్కినఁ జెవులకు రసాయనముగాదె
యెలమి నన్నెలఁత నన్నెలయింపఁదివిరిన
నెడఁద కానందంబు నిక్కగాదె
యానితంబిని మక్కువ ననఁగి పెనఁగి
యింపు పొంపిరి వోవ నన్నేలుకొనఁగఁ
దలఁచి పొందిన నది జన్మఫలముగాదె
యనుచు వలరాజు బారికి నగ్గమయ్యె.

(ఆ. 2, ప. 86)
కీచకు దర్శనంబున ద్రౌపది యవస్థ :

సీ.దైన్యంబు తలపోఁతఁదలకొన్నఁ జెలు వ కా
ననమున వెల్లఁదనంబుగదిరె
భయరన వేగంబు పైకొని ముట్టినఁ
గాంతకుఁ దనులతఁ గంపమడరె

తృతీయ భాగము 199

బెగడంతకంతకు మిగిలిన నింతికిఁ
                            బదముల నట తొట్రుపాటు బెరసె
            దల్లడం బొందినఁ దన్వికి నవయవం
                            బులనెల్ల పుర్మాంబుకళిక లెస గె
           దలఁకువుట్లెఁగొంకు కొలఁదికి మీటె నెం
           బాటుదో చె ముట్టుపాటు దొడరె
           వెఱఁగుపాటు దనికె నెఱనాడె నొవ్వనె
           వ్వగలువగల నీనె దిగులు వొదివె.
                                                           (ఆ. 2, ప. 106)

            కీచకుఁడు దీనుఁడై ప్రార్థించుట :
                     సీ . కాంతి దళ్కొత్తు నీకడగంటి చూడ్కితోఁ
                                   బొందఁ గానని మేను పొగులుటయును 
                          దీపారు నీ పల్కు దెల్లంబుగా వినఁ
                                   గానని వీనులు కందుటయును 
                          నింపగు నీచెయ్వు లెలమిమైఁ గొనియాడఁ
                                   గానని కోర్కులు గలఁగుటయును 
                          సొగయించు నీకేళిఁ దగిలి యానందంబుఁ
                                    బొందఁ గానని మది గుందుటయును
                          బాయ నాదగు జన్మంబు ఫలమునొంద 
                          భావజన్మని పూనిక పారమెయ
                          నన్ను బంటుగా నేలుము నలినవదన
                          యింక నీసిగ్గు దెరయోలమేల నీకు.
                                                                       (ఆ.2,వ .138)
              
          పరిభవానంతరమున :
                      సీ. ఎలదీఁగఁ గప్పిన లలిత పరాగంబు
                                   క్రియ మేన మేదినీ రేణువొప్పఁ 
                          జంపకంబున నవసౌరభం బెనఁగెడు
                                   కరచి నాసిక వేఁడిగాడ్పు నిగుడఁ 
                          దోయజదళములఁదుది మంచుదొరఁగెడు
                                   గతెగన్నుఁగవ నశ్రుకణములురుల
                          నిందు బింబముమీఁది కందుచందంబున
                                    గురులు నెమ్మొగమున నెరసియుండ 
                          నర్వజనవంద్యయైన పాంచాలి సింహ
                          బలునిచే నివ్విధంబున భంగపాటు 200                                        కవిత్వతత్త్వ విచారము

దనకు వచ్చిన నెంతయు దైన్యమొంది
యవ్విరాటుని సభఁజేర నరిగి నిలిచి.
                                 (ఆ. 2, 8, 138)

కీచకుండు ద్రౌపదీ సమక్షంబునఁ జేయు బాలిశచేష్టలు

దుర్విలాపంబులు నెంత సహజములు ! చూడుఁడు :


సీ. ఎవ్వనితోనైన నెలుఁగెత్తి యొక్కింత
                     పనిలేని వెంగలి పలుకుఁ బలుకు
    మట్టియ లొండొంటి బిటుదాఁకఁగ
                    నేల నందంద మునిగాళ్ళ నప్పంచుఁ
     గడువికారంబుగా నొడలెల్ల విఱుచుచు
                        మలఁగి రిత్తకుర్విత్త సెలఁగి నవ్వఁ
    దాళంబుగాఁ గరతలమునఁ బెలుచఁగం
                    బంబు వేయుచు వెడపాటఁ బాడు
    మలయు నంతంతఁ జేరువ(బొలయు నింతి
    దన్నుఁ జూడమి కెంతయుఁ దల్లడిల్లు
    నిక్కడక్కడ వఁడుఁ దగు లినుమడింపఁ
    జూచు నత్తన్విఁ జొరిఁ బొరిఁ గీచకుండు.
                                                       (ಆ. 2, ಏ.250)

కీచకుని పశ్చాత్తాపకరమగు మహావస్థ :
          సీ , వామాక్షిరుచిర లావణ్యంబు భావించుఁ
                                దన్వంగి రూపు చిత్తమున నిలుపుఁ
              గంబుకంథర చెన్నకైవడిఁ దలపోయు
                             నంగన సౌకుమార్యముఁ దలంచు
               భామిని సహజ విభ్రమమెదఁ గీలించుఁ
                                బడఁతి చెయ్వులు మదిఁ బట్టుకొలువు
              మానిని గరువంపు మాట పొందూహించు
                              దళితాబ్దముఖి తిన్నఁదనము మెచ్చు
               నడరి కోర్కులు చిట్టుముట్టాడ వెడఁగు
               పడిన యుల్లంబు పట్టునఁ బఱుపఁ దనకు
              వశముగాకున్న నెంతయు వంతనొందుఁ
               జింతయెనకంబు వడిగొని చిక్కువఅుప.
                                                                     (ఆ. 2, ప. 258)

 తృతీయ భాగము 201

సీ. పొడసూపినట్లయిన వడిఁబట్ట సమకట్టి
                   పరికించి కానక బమ్మరించు
    మెలఁగినయట్లయినఁ బలికింపఁ దలంచి ని
                    రూపించి లేమి నశ్రులు వహించు
    గదసిన యట్లయినఁ గౌగిలింపఁ గడంగి
                     యూరసి బొంకైన నలఁతనొందు
    నొడఁబడ్డ యట్లయిన నడరి పైకొనఁ జూచి
                      చెన్నఁటి యగుట నిశ్చేష్టఁ బొరయు
     లలిత వివిధ విహారంబులకు లతాంగి
     యెలసి పొలసిన యట్లయిన నెలమిఁగలసి
     యభిమతక్రీడ సలుపంగ నప్పళించి
      వెదకి రిత్తబయల్గని విహ్వలించు.
                                              (ఆ. 2, 3. 301)

ఉద్యానవనవిహార ఫలము :
        సీ. ఇంపైన ప్రియకాననిచ్చి నిల్చినమథు
                             వాదట నాను ముత్తాళివిభునిఁ
           జెట్టుపల్పచరించి చుట్టుఁ గ్రుమ్మరి మనో
                             రమ నియ్య కొలుపు మరాళవిభుని
           ఫలరన మొుండోంటి కెలమిఁ కంచులనిచ్చు
                              మెయిన చొక్కెడు శుకమిధునములను
            గమిబాసి తలిరు జొంపమునకు మెయిమెయిఁ
                           దాఁకంగఁ జనుపికదంపతులను
            జూచి చూచి యుల్లంబున నేచి కోర్కు
            లడరఁ జిడిముడిపడు మ్రాను పడు వెడంగు
            పడు వెనుంబడుఁ దల్లడబడుదురంత
            చింత బారికి నగపడు సింహబలుడు.
                                                              (ఆ. 2, ప. 306)

         కీచకవధానంతరమున జయశీలయై పాంచాలి సుధేష్ణం జకాడ
బోవునప్పడం :

         సీ. ముదమున నెలమి సొంపాదవి నెమ్మొగమునఁ
                              దోఁపంగవచ్చినఁ ద్రోచిత్రోచి
              లలి నుల్లసిల్లుచు లలితలోచన దీవు
                               లడర నుంకించిన నాఁగి యూఁగి

202 కవిత్వతత్త్వ విచారము

సంతసంబున బాలిశములగు చెయ్వులు దొడరఁ జూచిన జేయ కుడిగి యుడిగి మనమున నుబ్బమై మాట నాలుకకురాఁ గడ(గిన నాడక కడపి కడపి ధీరమై యిట్లు సమ్మద పూరమునకు గరువతనమును బలితంపఁ గట్టకట్టి వెలఁదియెరుఁగని యదివోలె వికృతిలేక యల్ల నెప్పటి యట్టుల యరుగుటయును. (ఆ. 3, ప. 56)

ఉత్తరంగూర్చిన పద్యములు నిట్టివ. ఆంధ్రమున శృంగార వర్ణనము తిక్కనయంత మనోహరముగఁ జేసినవా రెవరును లేరు. శుచి సౌందర్యములు నిత్యసంయోగములు.వీర కావ్యములో నించుక సందర్భ మలవఱిచి కొని యింతచేసిన ప్రతిభాశాలి శృంగార కావ్యమే వ్రాసియుండిన దాని రామణీయకము హృదయమున లయించునట్టి లావణ్యము గలదిగానుండదా ? ఒక వేళ నేకరస ప్రధానమగుట నతియను దోషంబునఁ దానుం బడియుండునా ? చెప్పలేము. ఇట నుదాహృతములగు పద్యములఁ జదివి నేత్రముల హర్దా శ్రువులు గ్రమ్మనట్లానందింపని వారాంధ్రమండలి నుండరు.
                     కళాపూర్ణోదయమునందలి మిగత కథ
  కళాపూర్ణోదయములోని మీఁది వృత్తాంతముల సంగ్రహముగ విమర్శింతము. ఈ భాగమునఁ గల్పన లేదు, కథ లేదు. ఒక విషయమునకు నొక విషయముగా నిష్ణారణమై నటించి పుస్తకముఁ బొడుగు (జేయుట కవి యుద్దేశ మేమో ! ఆ సర్వలక్షణ సంపన్నతా ప్రతిజ్ఞయొక్క దు ప్ర్పకృతి యిటC దేటతెల్లంబు. రాణులిద్దఱకును జెలికత్తెల మాటలచేఁ బ్రేరితమైన కొట్లాట ఘటిల్లినది. నీచపాత్ర ములేగదా మన రాజులకు రాణులకు మంత్రులు : రాజు అభినవ కౌముది కాళ్ళు పట్టుకొనుచున్నాఁడు.  కృష్ణమూర్తి యీ మర్యాదకు సృష్టికర్త ! ఎన్నడొ సత్యభామ కాళ్లు పనో లేదో, రాజు లందఱు నాయన యుపదేశములనెల్ల నిదియే సులభసాధ్యమని యో Oచి యవలంబించి సనాతనాచారములోఁ జేర్చిరి.

పిమ్మట రాజుగారు సవతులు యలుక దీర్చుటకై పెద్దామెను గానవిద్యావిశారదం జేయుదుననియు, చిన్నయా మెకు (ఆ పె కాళ్ళ మీఁద బడినాఁడు. లేకున్న నీ మెమాత్ర మూరకుండునేమి ?) నీ తృతీయ భాగము 203

కాళ్ళకు అష్టదిగ్రాణుల కిరీటముల యందలి మణులం దెచ్చి గజైలో నగలో చేసి పెట్టెదననియు ప్రతిజ్ఞఁజేయఁగా అమ్మలిరువురు శాంతించి చల్లఁబడిరి. సవతుల కొట్లాటకై రాజు లేట్లాడుట మనలో ప్రాచీనధర్మమే మో! ఐరోపావారిని నిందించునపు డీ న్యాయమును జ్ఞప్తియందుంచుకొన్న నన్యాయము పలుకకుందుము. అలంకార శాస్త్రములలో నేమి చెప్పినాఁడు ? " నయవిరచన యాత్రాజి దూత్య నిభు వర్ణనము" అనియా ? సరియే. ఈ భాగములో నే సంగతియైన వేసిన నొక్క పే. వేయకున్న నొక్క కేు, కాబట్టి వేయుదము, అని నిర్లేతుక జాయమాన శుక్ర నీతిని బ్రసంగించుచున్నాఁడు కవి ! సత్వదాత్ముండను యిన్నేండ్లు భూమి నేలిన ప్రభువునకు నుపదేశము చేయుట ముసలివాని కుపనయనము చేసినట్లు :

                          “ఇవి యననియు నిపుడు ప్రసం 
                           గవశంబునఁ జెప్పఁబడియెన్ గాని."
యనుచున్నాఁడు, ప్రసంగవశమా ! శుద్ధాబద్ధము. అలంకారశాస్త్ర వశమునఁగాదా ? ఇంక సంధి యొకటి బాకీ యుండ లేదా ? అది మగధ రాజుతోఁ జేయు దము. ఈ మగధ రాజు వృత్తాంతము నాకు

దిగ్భ్రమ, గల్గించుచున్నది. మధురలాల సా వివాహ సమయంబున,

                          “ఆశ్వలోచనముల కాత్మవస్త్రముకొంగు
                           మూటుగా నొనరించే మగధరాజు ”
              కాన నితఁడు సామంతుఁడుగదా ? ఇంతలో,
                  శా...............................................
                    నీరాష్ట్రంబున కెనర్చుటకుఁ బాగ్రాహుఁ డివ్వేళలన్
                    సారోదారుఁడు మాగధుం డిపుడు తత్సంధానమర్షంబగున్.
                                                                                       (కళా. ఆ. 7, ప. 270)

ఆనీ ప్రబలశత్రువైనట్లు మంత్రి చెప్పట యెట్టు ? మఱియు, స్వభావు డిచ్చిన విల్లునమ్ములునుండ మాగధుని మైత్రి యెందుకు, ఏటిలో వేయుట క్రా ? ఈ దిగ్విజయముగూడ సందర్భశుద్ధిలేనిది. ఏలన? మదా శయుcడు సకల రాజుల గెలుచునట్లు వరంబుగొన్నవాఁ డగుట నతఁ డటుచేసి సార్వభౌముఁడై యుండఁగా, నతనినిی కళా పూర్ణళడు గెల్చెనన్న నీ యధిక ప్రసంగము లన్నియు నివారిత ములై యుండును. అవును. "ఆజి" యని సూత్రమున్నదే ! ఇంత 204 కవిత్వతత్త్వ విచారమ

సర్వలక్షణ ప్రాప్తికి దానిని మెడగట్టుకోవలదా ? ధుత్యమ కొంత సూర్యాస్తమయ వర్ణనము . దీని యగత్యమేమో దేవునకే యెఱుక ! అందులోని కుయుక్తులో !

తే, నింగి యనియెడి ప్రత్తిచేనికిని రక
      బలియిడిరనంగ నెఱనంజ దొలుత నమరఁ
     దఱుచుగాదన విరిసిన దొరుగుఁ బ్రతి
      విళ్ళునా ఁజుక్కలెంతయు నుల్లసిల్లె!
                                                   (కళా. ఆ. 8, ప. 12)

ఆకాశము ప్రత్తిచేను ! రక్తబలి యిచ్చినారఁట ! చుక్కలు ప్రత్తి విళ్ళు! ఇట్లు వ్రాసిన మనవారి కేమో యానందము ! కష్ట తరముగనున్నఁ జాలును. మనోజ్ఞమని యెంతురు, ఆశ్చర్యము నకును నా మోదమునకును మనవారిలో వ్యత్యాసమేలేదు ! తరువాత జంద్రోదయము. ఇంకొక వికారాలంకారము !

“తే. కాలమను కువిందుఁడు చంద్రికాపటంబు
            నేయబనిన మగ్గనమొకో యనంగ
            వనమయూ ఖాళి గొనసాగి మివులనొప్పె
            విధుడమరె వాని గృహబిత్తి వివరమనగ
                                                  (కళా. ఆ. 8, ప. 15)

భావప్రధానముగ వక్కాణించు మయూరుఁడే సూర్యుని కిర ణము లాయన 'మీసాలు'గ నుపమించినాఁడు ! ఇఁక, తక్కువ కవుల మాటలేల ? అపురూపమే సురూపమని మనవారి భ్రాంతి. ఎంత క్లేశపడి సంపాదింతు మో యంతసుఖమని యెన్నిక ! పాతా ళమువఅకు ద్రవ్వి గులకజాయిం దెచ్చిన నది బుద్ధిబలమా, లేమియూ ?

పిమ్మట సూర్యోదయ వర్ణనము, మఱికొన్ని దుష్ట యోచనలు: సూర్యబింబము "గగనాఖ్య పనసవృక్ష ప్రకాండో పరిభ్రాజితంబగు పక్వఫల" మఁట ? ప్రబంధముల శ్రాద్దమునకై తేఁబడిన యెజ్జ గుమ్మడికాయ యనరాదా ! యోజనాశక్తికిం జేరిన చమత్కారము నకును భావముల నలరించు శక్తికిని ఎంత భేదము !

కళాపూర్ణుని ఙ్ఞు నేర్చిన ప్లే యున్నది. చతురంగము లలో నొక్కొక్క ద్ధమున కొక్కొక్క యంగము మాత్రము పూనినట్లు వ్రాసియున్నాడు. ఇది యా యంగసంగరముల వెవ్వే అుగ వర్ణించుటకై చేసికొన్న దబ్బర మర్యాదగాని, జయకాంక్షఁబోవు

 తృతీయ భాగము 205
                                      రాజులు వరించునది గాదు. గౌడేశ్వరునితోఁ జేయబడినది యశ్వ యుద్ధము.          ఇందులో నింక నొక యసంభావ్యము గలదు. "పిరం గు లు జబురు జంగులు దుపాకులు" మొదలగు నాధునికో పకరణ ములు వాడఁబడినవCట ! ఈ వికృతికిఁ గవి యెట్లో ర్చెనో ! పిమ్మట నింకొక రాజు తో గజయుద్ధము. ఈ రీతిని గటారు ల తోడి పోరుఁ మొదలగు వానిని, భారత కాలము నుండి మొగలాయీల నాటి వఱకుఁ ప్రఖ్యాతికి వచ్చిన పద్ధతుల నన్నిటిని ఏక కథలో నేక కాలమున నడచిన క్లే వర్ణించియుంట కాలౌచిత్యము నకు మారణ క్రియ ? ఆంధ్రదేశీయులు కటారి సాధనలో బహు నిపుణులని యెన్నఁ బడి ನಿಲ್ಲು ఈ దిక్కుమాలిన భండన క్రియ వలనఁ దెలియవచ్చు చున్నది. ఇదివఱకుఁ గళాపూర్జుఁడు పోరినది శస్త్రములతో. ఇఁక ముందైన స్వభావు ఁ డిచ్చిన ధనుర్బాణముల నుప యోగింతు మని యేమో యన్నట్టుండి భీష్మపర్వములోని యుద్ధముంబోనిది యొండు పొందింపCబడియున్నది. అస్త్రపరంపరలు నిగుడుచున్నవి. జయ లక్ష్మీ యేు చాంచల్యమును లేక కథా నాయకుని జేరియుండుట యా మె తలవ్రాత, బ్రహ్మచే వ్రాయబడినది గాదు. మఱి యుత్త ములు గాని కవులచే ! కృతార్టCడై రాజు స్వపురికిం బోవుచున్నాఁడు. 
                                              కాలౌ చిత్యము
      'కాలౌచిత్యము" అను పదమును వాడి తిమి. కాన కవిత్వ తత్త్వమునకుం జేరిన యీ విషయము గొంత విచారింపక పోఁగాదు. కాలముచే మనుష్యుల గుణములు మారు చుండుట యను భవ విదితము. ప్రబంధ విదితము గాదు. కథానాయకుఁడు సాధారణ ముగఁ గాలాతీతుఁడు ! నిరామయ నిరంజనతలకుం జేరిన యువ తార పురుషుఁడు ; ప్రారంభమున నే వయసు, గుణములు, క్రో రి కలు, చర్యలు నుండునో, యవసానమునను నవియే. పెరుగుట లేదు. పరిణామముం బొరయుని లోహ విగ్రహముల యుట్టి నిర్వి కారు (డు. స్త్రీల విషయమున నొకటి రెండు సంగతులకై వయః ప్రభావమున సూచింతురు . ఆ వెవ్వియన సమర్తా డె ననుటకును, బిడ్డఁగ నె ననుటకును ! క్రొత్త పెండ్లికూతురైనను, ప్రాఁత పెండ్ల మె నను, లేఁత పడుచెనను, ముదురు ముసలియైనను వారల లో భేద మంతగా నుండదు, పసిప్రాయమున నాయ్క నాయకునికై యెట్లువ్విళ్ళూరుచుండునో, వయస్తునను ఆరీతినే యూపె వంపును రాగంపు విలసనములు సుండును. అనఁ గా పుస్తకములలో నను 206                                     కవిత్వతత్త్వ విచారము

మాట ! ప్రకృతిని గాదనుట తెలిసియో తెలియక యో కట్టుకొన్న మగవారి కెల్లఁ దెలియును. పాశ్చాత్యులు మనుష్యజీవిత పరిశీలన సమర్ధులగుటను, స్వయంవిమర్శమై వ్రాయువారు అగుటను, కాల సృష్టి పరిణామముల వర్ణించుటలో నద్భుత చరిత్రులు ! కాలో చిత్య మున నర్ధములు రెండు. ప్రతిపాత్రమును గాలానుగుణ పరివర్త నములకుఁ బాత్రమైనట్లు వర్ణించుటయు, కథలోని వివిధ సందర్భ ములు కాలముతోఁ జేరికగలవిగా నుండునట్లు గల్పించుటయు ననునవి. ఇందు ప్రథమ భావముమీఁద వివరించితిమి. ద్వితీయా ర్ధమునకు సూరనార్యునే నిదర్శనముగాఁగొని వ్యాఖ్యానం బొనర్తము. కళాపూర్ణోదయములోని సందర్భములకు కాలవిషయమునఁ గల పరస్పరాసాంగత్యము పాటింపుఁడు ! నారదు (డు మణికంధరుఁడు శ్రీకృష్ణుని యాత్రితులు. మణికంధరుఁడు కళాపూర్జుఁడు గాఁబుట్టి దిగ్విజయముఁ జేయుసరికి ద్వారకాపుర సముద్రములో మునిఁగి పోయి యుండెను. అనగా కళాపూర్జుఁడు రాజ్యము చేసినది కలి ప్రారంభము ననుకొందము. ద్వాపరాంతమునన్నను బాధకము గాదు. అప్పడు పిరంగులుఁ దుపాకులు నెక్కడివి ? రెండవది రుక్మిణీ కాంతునికిఁ దరువాత నీ రాజు వలె సద్గుణు లెవ్వరు లేరని కురుకాది దేశాధీశులు కానుకలు పెట్టినారఁట; పాండవుల మనుమ డైన పరీక్షిత్తు సార్వభౌముఁడాయెనని జగత్ ప్రసిద్ధమగు కథ యుండఁగా,నీ కళాపూర్ణుని వానితోఁ బోటీకిం బెట్టుట "కొండంగని తగరు దాఁకఁ గోరుట గాదే !" ప్రపంచ ఖ్యాతములగు కథలతో విరోధించినట్టి కల్పనలు అయోగ్యములు.

               సుగ్రహుండు ఎన్నెన్నో తపస్సులుచేసి యవస్థలుపడి హారము పడసిన వాఁడు. పిమ్మట నా హారము ఒక బ్రాహ్మణుని యి Oట నెన్నియో యేండ్లుండినది. తరువాత నాయో ( గృష్ణార్పితము. &9 వెనుకc గృష్ణునిచే మణికంధరునికి లభించినది. వా ( డు గానవిద్య, యాత్ర, తపస్సు — ఇత్యాదులలోఁ గడపిన వత్సరములు కనీసము ఆఱు. అట్లగుట మణికంధరునియొద్దఁ జేరినది మొదలు మధుర లాలస రెండవ తూరి ధరించువఅకు జరిగిన యేండ్లు సుమారు ఇరువదినాలు. ఇఁక సుగ్రహుని వయస్సెంత యుండునో యూహింప నలవిగాదు. అట్టి దీర్ఘాయుష్మంతుఁడగు సుగ్రహుఁడు సత్త్వదాత్ముం డను పేరంబరిగినవాఁడు. మధురలాలసకు మేనమామ ! సుగ్రహు నింగూర్చిన యూభాసముల క్రింకను ముగింపుగానము. రూపానుభూతి యతని నెఱింగి యుండకపోవుట సిద్ధము ! శాపంబుచే మతి                                      తృతీయ భాగము                                                                     207

మాత్రము గోల్పోయి యా కారంబు మా అని యతని నేకస్థలమున నుండియు నా మె యేల గుర్తింపక పోయె ? రాణివాస మందమా ? కళాపూర్ణుని యభ్యంతర మందిరములోఁ బ్ర వేశింపఁగల యతఁడు మదా శ యుని యుంతిపురమున ( గాలిడ ననర్హుఁడై యుండునా ? సదుత్తరములు చింత్యములు.

    కళాపూర్ణుఁ డారీతిని వివిధయుద్ధంబులఁ దన కేక్రీడు చేయని రాజులను భార్యకై పూనిన వైరముచే నోర్చి జయశీలుఁడై పురము ప్రవేశింపఁగా, పౌర స్త్రీలు అతనిఁజూచుటకై వినోదకరములగు వేష ములతో వచ్చుచున్నారు . నేఁ జెప్పనేల ? సాధ్యమైనంతవఅకు మీరే కన్నుల విప్పి చూడుఁడు !

.ఉ క్షోణితలేంద్రుఁ జూడ నొక కొమ్మ వడింబఱతెంచి యుల్లస

                    ద్వేణి భరంబుతో మొగపు తీఁగె వలగ్నము నందమర్చి యొు డ్డాణము                                 తీఁగె గానిడి, మెడన్ వలగొన్నది చాల కడ్డమై                                                                                   పాణుల నుండఁగౌను మఱి బాగుగఁ గానుక వెట్టు కైవడిన్.
                                                                                            (కళా. ఆ. 8, ప. 139)

ఉ. గుబ్బెత యోర్తువచ్చె నృప కుంజరుఁ జూడ రతార్త నీవిఁ దా

            గొబ్బునఁగట్టుచున్ బయఁట కొంగది మాన్పఁగఁ బోలెఁ గాళ్ళపైఁ                                                   బ్రబ్బికొనన్ గుచోద్ధత భరంబునకుం బయికాఁపు వోలెఁ ద                                                           బ్బిబ్బుగఁ జేతికిన్ దొరకి పెన్మిటి వస్త్ర మరోవృతంబుగన్.               140

ఏమిది ? ఉన్నట్టుండి రాజు సగము రాత్రిలో వచ్చెనా o

తే, ఇత్తె అంగునఁ బౌరులకెల్ల నేత్ర

                                          పర్వమొనరించు రూప వైభవముతోడఁ                                                గ్రముక కంఠోత్తర మహాపుర ప్రవేశ                                                                                              మాచరించి. . . . . . . . . . . . . . . .• • • • • • •

ఇదేమి యన్యాయము ! పౌరుల కెల్ల నఁట ! స్త్రీల కే గదా Tూ జులు ముఖ్యముగ దర్శనమిచ్చుట ? ఇట్టి యుపచారములును శృంగారములా ?

మధురలాల స పెండ్లియైనప్పడే యంతవిరాళిఁదాల్చిన యగ్జి తునుక గావున నా మె వయసు 15-16 అనుకొCదము. పెండ్లియైన యేఁడున కే దిగ్విజయమని యాలోచించినను ద్వారక ములిఁగి చాల కాల మైయుండదు. కళాపూర్ణుఁడు సింహాసన మెక్కిన తరువాత మునిఁగెనా, తత్పూర్వమే మునిఁగెనా ? పూర్వమైయుండిన నిరువ  208 కవిత్వతత్త్వ విచారము

దేండ్ల క్రిందట మునిఁగిన యూరింగూర్చి కళాపూర్ణుఁడు విచారణ లకు మొదలిడుట యధికాలస్య ప్రసంగము. తరువాతగా నుండిన, నెల్లరాజులను జయించిన వాఁడుగదా, శ్రీకృష్ణ బలరాములను భీమార్జునులను మార్కొనెనా ? మజి, తనకుం గురువును దైవము నని కృష్ణుని సేవించివచ్చెనా ? అదియట్లుండె, అభినవ కౌముది యొక్క వయసు మొదలైనవి యురయుదుము. కల భాషిణి మణికంధరునిచేఁ జచ్చి పునర్జీవితయైద్వారకను మెలంగినది రెండేండ్లు. ఆవ అకే యభినవ కౌముది ప్రాయముది. శల్యా సురుఁడు వెన్నాడి కొన్నేండ్లు తిరిగియుండును గాన, 17 సంవత్స రము లన్నఁ దక్కువ లెక్క. ఈమెకుఁ దగిన నాధు ( డుగా నుండ వలయునని కళాపూరునకు గ సద్యోయ వనము విధింపఁ బడి యొు, కళాపూర్ణుఁడు పుట్టునప్పటికి నా పె వయసు 18 యనుకొను (డు. మధురలాలసా వివాహ మప్పటికి నా మెకు అధమ పక్షము 3 4 - 35 సంవత్సరములు నిండియుండును. ఎట్లు లేదన్నను ముప్పదికిఁ దక్కువయుండదు. ఇన్నాళ్ళు సంసారము చేసిన యూ పెకును, క్రొత్త పెండ్లికూ (తునకును రూప యావన వర్తన విభ్రమాదుల నేతారతమ్యమైన నుండునట్లు కవి వర్ణించినాఁడా విచారింపుఁడు ! నా కుంజూడలేదు. 15, 16 ఏండ్లు గొడ్రాలుగా నుండిన యా మె తటుక్కని మధురలాలసకన్నఁ గొంచెము ముందుగఁ బుత్రునిఁ గనెనఁట ! ఇప్పటివారిలో నిట్లు తటస్థించిన నెన్ని సందేహములు పట్టవు ! మధురలాలసకు బిడ్డ నీదలఁచి, పట్టపు దేవిని విడుచుట బాగుగాదనియు, నీ క్రియల నించుమించు వారు సరిపోలిన జతగా నేర్పడినట్లు ప్రదర్శింపవలయుననియు నెంచి చేయఁబడిన జ్యేష్టాంశ హేయకల్పన  !

                                       విషయమున ననౌచిత్యములు

సుగ్రహుని వయసు కృతయుగము లెక్కలోఁ జేర్పవలసి నదే. మన వారిలో మాటలు వేదమయములు. చేఁతలు బూతులు. చేవాంతములకును మానహీనములగు ననుషానములకును అన వరతానవసితమైత్రి. పరమయోగీశ్వరుఁడైన శివుఁడు "దేహార్ధమునఁ దాల్చ, దీఁగెబోఁడి !" అక్కథకుండగు వ్యాస శిష్యుఁడు సూతమహా మునీంద్రుఁడు, ఉపవాస వ్రతములచే డస్సి యెండిన శౌనకాది మహర్షుల హృదయముల రసము లూరునట్టుగా, స్త్రీలవర్ణనలు పోగు పోగుగా విడఁదీసినట్లు చెప్పచున్నాఁడనుట ప్రబంధములలో  తృతీయ భాగము 209

ప్రసిద్ధి. విరాగియైన వనవాసికి రాజకన్యలయు బోగముసానులయు రహస్యవృత్తము లెట్లు తెలిసె ? కష్టపడి యార్జించిన దూరదృష్టి దూర శ్రవణాదులకు ఫలముగా నీ సుఖముల ననుభవింపకపోయి నను, విమర్శనముతో సావకాశము గC బరీక్షించి తెలిసి కొను నానంద మైన ననుభవించినాఁడు పో ! పచ్చిపచ్చి మూటలతో పెద్దమనుష్యుల యెదుట సిగ్గులేక విపుల వ్యాఖ్యానములకుం దొడంగ నాతని పరమ పవిత్రమైన నోరెట్లాడెను ? పరమపావనులగు మునులు ఏ జుగుప్సయు లే డ్ర గ్రుక్కిళ్ళు మ్రింగుచు నెట్లు వినిరి ! ఇట్టి రుచికరములగు కథలు చెప్పవాఁడు కావుననేగదా బయిషీశ్వరు ಲಲ್ಲು జపతపముల వదలి యతనిచుట్టు బెల్లమును ముట్టడించెడు చీమల వలె మూగియుండుట ! సూతమహాముని కీ కళాపూర్ణోద యము నారోపింపకుండుట సూరనార్యుని ఘన తకుఁ దా వల ము. అయిన నింకొక విధమైన యనుచితముఁ జేసియున్నాఁడు. ఇంత దనుక చవులూరెడు కామక్రీడలు వర్ణించి రతివర్ణనకు నాహుతిగా నీయCబడిన పద్యములు సుమారు 25 తటుక్కున వైష్ణవ రాద్ధాంత ముతో భక్తిరసముఁ గొంతదింపి గ్రంథసమాప్తి యొనర్తమని, లక్ష్మీ నా రాయణ సంవాదమ నెడు గతి మెూ క్షమును లేని ఘట్ట మొకటి తెచ్చి వేసి కొనినాఁడు. కృతిపతికిఁ గామ మోక్షములు రెండును గాంకి త్రము లేమో !. ఈ లోకమునకొకటి. ఆ లోకమునకొకటి ! కానc ద ప్పేమియు లేదుగాని, కావ్యముల నీ రీతి నిహపరముల పరముగా బిగువుతో నీడ్చిన వానియైక్యము తునుగును. అట్లగుట నియ్యవి సౌభాగ్యవిరుద్ధములు. కలయిక లేని రసము లC గలుపఁ జూచిన నరుచి. పా లలో చక్కెర వేసిన నిర్దోషము. ఉప్ప వేసినచో !

హిందూ దేశీయులు మనసు మెత్తనివారు. కాయములంత కంటె మెత్తన ! సత్త్వగుణమను సాకు పెట్టుకొని యెన్ని దెబ్బలు పడినను "నావిగావివి పరమాత్మకుం జేరినయవి" యని యపహాస్య మునకుం బాత్రములగు వింత కారణముల గొణిగికొనుచు, వంచిన తలయెత్తక, వణఁ కెడు నొడలునాపక, పాబ్రెడు కాలునిలుపక, పోవుచుందురు ! రాజసగుణమగు తేజము ప్రధానమని మనకు C దెల్పుటకోయన, సూరన్నయా దౌర్భాగ్యపునయ విరచనలో రచించిన యూ మూడు పద్యముల ప్రతాపముఁ గనుండు .

క. సకలకళా నిపుణులు సే

     వకులై కొలువఁగఁ బ్రతాపవంతుఁడు గొలిపి 210                                                                                                                                                                       కవిత్వతత్త్వవిచారము                                                                                                                                    సకలకళలు నొక ప్రతాపసంపదతోడన్

చ. ఇనుఁడొకచో నొకింత యుదయించిన మాత్రన విచ్చిపోవు హె చ్చిన పెనుఁజీఁకటుల్ నిరవశేషముగా నవియట్లు నిచ్చిపో వనయము శీతధాముని కభౌఘమృజావిధినైన వీనిచే తన కనకాడె యేరికిఁ బ్రతాప కళాగుణతారతమ్యముల్ (కళా. ఆ. 7, ప. 245–246) ఒకఁడొక కేలవంచె నధికోన్నతిఁ బేర్చిన మేరుశైల నా యకుఁ బెఱవేల్పులందఱుఁ జిరాశ్రయణంబున వంపలే రొ కిం చుకయును బుద్ధిలో నరసిచూడ జగంబున నుగ్రుఁడన్ ప్రసి ద్ధికి బుధుఁడన్ బ్రసిద్ధికిని దెల్లముగా నివిస్తూ ఫలస్తితుల్. (కళా. ఆ. 7, ప. 247) చ. ఎఅుక ప్రధానమే. దానికన్న వేయింతలు ప్రధానము పరాక్రమము ! ఉపన్యాసములుగావ వృద్ధికిఁ గారణములు. మఱి కార్యసాహసమును, దీక్షయు. ఉపసంహారము భావనాశక్తిచే ననర్గళముగ ప్రభవిల్లు భాగములయొక్క చక్కందనము పాండిత్యబలంబు మై నేర్పడినవానికి రావనుట ΟΩ Το విమర్శనముచే విదితంబు. సూరనార్యుఁడు రెంటియందును ప్రగల్భఁడు. రెంటినిం జూపింప నిశ్చయించినవాఁడగుట నాంధ్రం బున నసదృశంబగు కావ్యంబు కళాపూర్ణోదయంబు సృజింపఁ బడియె. ఇది నిర్దోషంబు గాక పోయినను అనన్య సాధారణ గుణగణ విభాసితంబగుటc గావ్యోత్తమంబనఁ జెల్లునది. ఇందు నవరసము లున్నవి. అష్టాదశ వర్ణనములున్నవి. ఏకర సంబుగFకునికి మేల. అయినను సర్వరసముల వర్ణనలC జేర్చి యొక కథ వ్రాయC జూచుట యసాధ్యము గాక పోయినను, సామాన్య సాధ్యంబుగాదు. భారత రామాయణము లట్టి విస్తారేతిహాసముల దప్ప నన్యంబుల సకల సౌభాగ్యములకు నాస్పదంబుండదు. అపారపారావారంబుం బోని మహాచరిత్రముం గల్పించినంగాని, రససంచయంబు లెల్ల నందు యుక్తగతిని నిలువఁజాలవు. అట్లగుట నీ గ్రంథమున నసంగత ప్రశంసల వేయవలసెను. ఆ పర భాగము ప్రబంధము లకుఁ జేరినది పరిమితప్రాశస్త్యము. పూర్వభాగము అమేయ  తృతీయ భాగము 211

  ప్రభావము. దాని గుర్చి యెంత నుతించిను  అత్యుక్తి గలుగదు.అందలి కల్పనలు . సందర్బములు మహేంద్రజాలములట్లు ఆశ్చ్ర్యరములు . శైలి ప్రావీణ్య మన్ననో వాచతీతము . మౌనము ఁగోలి హృదయము పరవశముగ  నాందింపవలయున కాని మాటలదమి యఱదు పాత్రముల వచనములు మధుర సుధారలు .
     అట్లగుట  శ్రీ పింగళిసురనార్యునియెడఁ గృతఙతయు భక్తియు జూప నెంచినవాను  సహజము దమకుం  గల రసతృష్ణను ద్ృప్తినొందిప  దలుచున వారు నైన రసికు లెల్లర ని కవికులొత్తంసుని  బలుమాఱపటించి కృతార్దు లగుదురు   గాక!