కవిత్వతత్త్వ విచారము/ప్రథమ భాగము/మొదటి ప్రకరణము
కవిత్వతత్త్వ విచారము
ప్రథమ భాగము
మొదటి ప్రకరణము
కళాపూర్ణోదయమును రచించిన మహాకవి పింగళి సూరన్న, ఇతని జీవితముంగూర్చి శ్రీ కందుకూరి వీరేశలింగము గారి సుప్రసిద్ధ మైన కవులచరిత్రలో వ్రాయఁబడిన దానికన్న నా కెక్కువ దెలియదు. మఱి దెలిసికొనుటకు నుద్యమించిన వాఁడనుగాను. నా ప్రధానోద్దేశ్యము కృతి విమర్శనగాని చరిత్ర శోధనంబుగాదు. నాయీ కార్యమునకుం బ్రయోజకంబులైన యీతని జీవితాంశములు రెండు. శ్రీకృష్ణదేవరాయల కాలమునకుఁ దరువాతివాఁడనుటయు, ప్రాయశః రామరాజ భూషణ కవికిఁ బూర్వికుఁడనుటయు, మఱియు నింగ్లాండు దేశములోని కవులలో నగ్రగణ్యుండైన షేక్స్పియరునకు నితఁడు సమకాలీనుఁడై యునికియు సుసాధ్యమ.
ఆదికవుల గుణదోషములు
ఆకాలంబున నాంధ్రదేశమునఁ బ్రబలము గానుండిన కవితారీతి ప్రబంధరచన, ప్రబంధకవులకే మధ్య కవులనియుఁ బేరు గలదు. ఆదికవులయు వీరియు జాడలు వేఱు. అనేక విషయముల విరుద్దములును.
నన్నయాదులు సందర్భానుగుణములగు వర్ణనలందక్క నితర విధముల నూతన కల్పనలకుం దొడంగక సంస్కృతమున నుండు కథాదిక విషయములం దెనిగించుటలోఁ దమ శక్తిని ముఖ్యముగ వినియోగించిరి; అనగా, నీకవులు మొత్తముమీద భాషాంతరీ కర్తలే కాని యపూర్వ సృష్టిక్రియా నిపుణులుగారు. ఇట్లనుటచే వీరిపై దోషారోపణము జేయుచున్నానని నాపైఁ గినియకుఁడు! వీరికి ప్రతిభయు భావనాశక్తియు నమేయములు. అవి ప్రకాశమునకు వచ్చిన మార్గము లెవ్వియనగా:
1. తాము వ్రాసిన కృతులు భాషాంతరీకరణములయ్యును స్వకపోలకల్పితములగు కావ్యములం బలె నెడతెగని యేకధారగా బ్రవహించునట్లు రచించుట.
2. మాతృకలలోనుండు నసమంజసములు నప్రయోజన ములునైన భాగములను బ్రక్షిప్తములనో సంక్షిప్తములనో చేసి కవితా రసము పలుచనగాకుండునట్లు సాంద్రంబుగ సమర్థించుట ఇందుకుఁ బ్రశస్తమైన నిదర్శనము మన భారతము, సంస్కృత మున నానాజనులు నానా విధములఁ దూర్చియున్న వెజ్జివెణ్ణి వేదాంతములు ధర్మాధర్మములు మొదలగు నసంబద్ధ చర్చలతో నిండి చూచువారికి దిక్కులు తెలియనట్లు విపులముగఁ బెరిగి చీCకు పొదవలె నుండు గ్రంథమును దెనుగున భగవద్గీతాద్యసంగత ప్రకరణములను సంగ్రహముగ వ్రాసి చదువరులకు నమందా నందము నిచ్చునట్లు పరివర్తించిన కవిత్రయము వారి రసజ్ఞతను అర్హ తకొలదిఁ బొగడ నెవరితరము ! ఇంకను సంకోచింపలేదేయని, విచారముఁ బూనదగుcగాని యింతచేసిరిగదా యని దూషింపఁ జూచుట బుద్ధిపొరపాటు.
గద్య పద్య తారతమ్యము
ఆధునికులలో నొక్కరు తెనుగుభారతము సంస్కృతమునకు సరియైన భాషాంతరీకరణముగాదనియు, నందుచే విషయగ్రహణ ముంగూర్చిన బాధలు కొన్ని వాటిలెననియు సెలవిచ్చుటయకాక, యది కారణంబుగఁ దాము నూతనాంద్రీకరణంబునకుం బూనవలసినవారై తమ విధిని కవిత్రయము వారి యౌదాసీన్యమును నిందించునట్లు దోచెడిని. ఉత్తమగ్రంథముల నెందఱెన్నీ రీతుల వ్రాసినను దగదని చెప్పగూడదు గాబోలు! అయినను అట్టి వాదములలో నించుక మతిభ్రమణ మున్నదేమో! ఎట్లన : విషయము ప్రధానమైనది గద్యము. రసప్రధానము పద్యము. అట్లగుటఁ బ్రతిపదార్థానురూపంబగు రచన వచనమునం జెసిన నొప్పగుcగాని పద్య రూపముగ నొనరించిన వ్రాయు వారికి సుఖము లేదు. చదువువారి కంతకుమున్నే లేదు! ఇఁక కావ్యముగ దెనిగింప నెంచిరివో! అపుడు సమయోచితములైన సంక్షేప విక్షేపముల జేగూర్చినఁగాని మనసు కరిగించునట్టి రుచియు భావోదేకంబులు గలుగనేరవు. ఈ న్యాయం బెఱుంగని శుష్క పండితులు పద్య రూపముగ భాషాంతరీకరణముం జేసిరయేని క్షేశంబు దక్క నింకొండు ఫలంబు బుట్టదు. కవీశ్వరుల కృతుల నన్యభాషలలో బ్రాచుర్యముం దెచ్చుటకు నా కవీశ్వరులతో సమానమైన ప్రతిభ గల వారికే కాని యలcతులగు లాఁతి వారి క్రేనాఁటికిం జెల్లదు.
3. పాత్రోచితములైన మాటలం బ్రయోగించియు విషయ మునకుం దగిన రీతిని. సొగసైన వర్ణనములం జేసియు వృత్తములు సాక్షాత్తుగ నెదుటఁ గనులఁగట్టినట్టు చేయుట. ఇదియే యన్నిఁటికిని మించిన కవితాలక్షణము. "కన్నులఁ గట్టినట్టు కలఁ గాంచిన రూపము ముందు నిల్చినట్లు" ఆకృతులు మనసునకుం దట్టవేని యయ్యది నిక్కమైన కవిత గానేరదు. ఈ మహేంద్రజాల కౌశల్యమున కాధారమైన గుణము భావనాశక్తి.
భావనాశక్తి
భావనాశక్తి యనంగా విషయముల మనసులోఁ బ్రతిబిం బించునట్లు చేయు సామర్థ్యము. ఒక్క ప్రతిబింబించుట యన నేల! ప్రత్యక్షముగ నవతారమెత్తునట్లు చేయుట. చూడుఁడు. సీత, ద్రౌపది, సావిత్రి, దమయంతి, శూర్పణఖ మొదలగు స్త్రీలు కవి కల్పనమునకుఁ జేరినవారయ్యును మనకుఁ జరిత్రములలోని స్త్రీలకంటెను, మఱియు మనము నిత్యమును జూచుచు వాదాడుచు నున్న యిరుగుపొరుగు భాగ్యశాలినుల కన్నను నెన్నియో మడుంగులు సత్త్వముం దాల్చినవారై స్ఫురించుచున్నారుగదా! చూడం బోయినఁ బాండవులు, దుర్యోధనాదులు, రామభరతులు మొదలగు మనస్సృష్టి మానవులు మిథ్యలా? మనమె మిథ్యలా? ఈ తీరునఁ గృత్రిమముల సంుతము మూర్తీభవింపఁ జేయు వారే మహాకవులు. అట్టివారు వ్యాకరణమునకు భంగము గలిగించిన నేమి? వచనమున వ్రాసిన నేమి? వారి కే కొదువయు రాఁ బోదు. వ్యాకరణము యతి ప్రాసములు అన్నియుఁ దప్పక కుదిరినను భావనాశక్తి లేని యెడల నట్టి పాండిత్యము జీవము లేని యూ కారము బలె జడంబుగఁ గాన్పించును. ప్రదిమలు వ్రాయుటలో బహుసమర్జుఁడైన యొక శిల్పివర్యునియెడకు, చిల్లరశిల్పి యొకcడు పోయి తన లిఖించిన చిత్రపటముం జూపి, “దీనియం దేమైన దోషము లున్నవా?" యని ప్రార్ధింపుడు నాతం డిట్లనియె "అయ్యా! గీఁతలు వర్ణములు మొదలగు గుణములన్నియుఁ జక్కగ గుదిరి యున్నవి కాని, యీ సుందర విగ్రహమునకుఁ బ్రాణములే యున్నట్టు గానమే!" అది విని "ఏ రీతిని దిద్దిన దీనికిఁ జైతన్యముబ్బును తెలుపవే మహాత్మా!" 20 కవిత్వతత్త్వ విచారము
యని యా విద్యార్థి దీనుఁడయి వేడుఁడు, "అయ్యా! నీ చింతఁ తీర్ప నావలనఁగాదు. నీ యడిగిన వరంబు సాజమైన భావనాశక్తిచే లభ్యము. ఇట్టిట్లు చిత్రించుటచే ఘనుఁడ వగుదువని చెప్పి చేయించుటలో ఫలము లేదు. వాని వాని మనోబలము కొలదిఁ బరి పూర్ణత్వము సిద్ధించునేకాని యలంకారశాస్త్రముల ననుసరించుట నిష్ప్రయోజనము !" అని యా కళాకో విదుఁడు వా క్రుచ్చెను. జన్మముచేతన కవిగావలయుఁగాని పఠనము అభ్యాసము నివి యుండినమాత్రము చాలదు. తోడంబుట్టిన చాతుర్యముండినచో నివి సహాయభూతములై వృద్ధిని వికాసమును గల్పింపవచ్చును. స్వాధీనంబగు మనో గాంభీర్య మలవడియుండదేని కృషిఁజేయుట విత్తునాటక యెరువు వఱచినట్లు. కొన్ని పురుగులు మాత్రము సృష్టికి వచ్చునేమో ?
వేమన
ఈ తత్వమునకుఁ బ్రమాణమైనవాఁడు వేమన. ఇతనికి పుస్తకజ్ఞానము ఇంచుమించు సున్న వ్యాకరణము, ఛందస్సు, అలంకారశాస్త్రము మొదలగువానిలో నీతనికి శక్తి యెంతతక్కువో భక్తియు నంతతక్కువ. అట్లుడినను మహాకవులలోఁ జేరినవాఁ డని చెప్పటకై సామాన్యముగ శుష్క పండితులుదప్ప నింకెవరును సంధియాంపడరు. కుటిల మతాచారములు, మూఢభక్తి, వేషధారి తనము మొదలగువానిని దూలనాడుటయం దీతం డద్వితీయుఁడు. గొప్ప రహస్యముల బోధించినవాడైనను తనకుం గల నైజమగు బుద్ధినేకాని, పలుదెఱంగుల విపరీతవ్యాబ్యానములకుం బాలగు శాస్త్రముల నాశ్రయింపలేదు. అనేకులు సిద్ధాంతముల కాదార ములు ప్రాచీనసూత్రములని నమ్మి వానిని వల్లించుటకై జ్ఞాపక శక్తిని వృద్ధిచేయుచు మనశ్శక్తిని గోలు పోయెదరు. ఇంక వెమన యన్ననో కారణ విమర్శనశక్తికిఁ బట్టాభిషేకముం జేసిన మహా త్ముఁడు. ఇతని పద్యములన్నియు లోకోక్తులు. అనగాఁ బలికిన వాఁడు అతఁడయ్యుఁ బలుకcబడిన మాటలు లోకము వారి హృదయ ములలోఁ బూర్వమే యుండినట్టివియో, లేక అతనిచే నచలముగ నాటఁబడినట్టివియో యైనవనుట. ఇతని పద్యములలోఁ బరిహాస రసము దట్టము. మఱుగు మర్యాదలు లేని మోటు విధముగాc దిట్టఁడు. నొప్పిచెందువారు సైతము ఇతరులతోఁ గలసి నవ్వనట్లు సేయు సమర్థుఁడు. గాయము కానుపింపకయు, రక్తము కాఱకయు. ప్రథమ భాగము 21 నుండునట్లు శరీరమును ఛేదింపఁజాలినంత మిగుల వాఁడిగల కత్తి నొకదానిని పూర్వము విశ్వకర్మసన్నిభుఁడగు శిల్పి యొకండు నిర్మించెనని గాథయొకండు గలదు. ఆ కత్తితో నుత్ ప్రేక్ష్యములు నుపమేయములునైన యవి యాంధ్రదేశమున నిమ్మహనీయుని పద్యములే కాని వేఱెవ్వియు లేవు. "అరిది విలుకాని యుజ్వలశరము నకును" అట్టిగుఱి పదును పాతమును రావు. నిదర్శనములం జూపుటలో నితఁ డద్వితీయుడు. మఱియవి యోవ్వియు గూఢములు కావు. స్పష్టములు. శ్లేషచే స్థాపింపఁబడిన సామ్యము లట్లు దిక్కు నర్ధమును లేనివిగావు. వైశద్యము అనుగుణ మితనియందు ప్రబలము. మనము ప్రతిదినమందును జూచుచు నింతేకదాయని యాదరము నవధా సము నుంచక పోవు విషయములనే యీతఁడు గ్రహించి భావనాశక్తిచే గాంతి, రూపము, ప్రాణము నావహింపఁ జేసి యెదుట నిలుపఁగా, నపుడు గుర్తు దెలియక పూర్వము మనచే గర్షింపఁబడిన వయ్యును, నివియేవో యమానుష విగ్రహములని విస్మయముజెంది గారవింతుము. ఈ గారడీవిద్యలోఁ దెనుగున నితఁడ ప్రథముఁడు. సామాన్యవస్తువుల కేదే నొక కామరూపము నిచ్చి వెలయించుట యీతని మాహాత్మ్యములలో మొుదలింటిది. ప్రకృతిస్వరూపములను ఎంతచక్కఁగాఁ దన సృష్టి భావములతోఁ జూచి, యొకటి రెండు మాటలతోనే యచ్చటచ్చట వానిని సాక్షాత్కరింపఁజేసి యున్నాఁడనుట వేఱ నేనొత్తిచెప్పవలయునా ? ప్రకృతియనఁగా మనవారిలో ననేకులకు నిఘంటువులలోనుండం ప్రకృతియేగాని మూలింటికి బయటనున్న ప్రకృతి యెట్టిదో, తమ స్వంతకన్నులతోఁ జూచిన పాపమునఁబోరు ! అట్టివారికి వేమవ యనుసరణీయమగు త్రోవఁ జూపించినాఁడనుటలో నించుకయు గుణాధిక్యస్తతిలేదు. పల్నాటి వీర చరిత్రాదులు ఈకతో సర్వవిధముల సమానుడైనవాఁడో మించినవాఁడో యసంబేర్కొనఁ దగిన యాతఁడు పల్నాటి వీరచరిత్రమును వ్రాసిన వీరకవి " ఈ వీరచరితము కొన్ని ముబ్యాంశములలో రామాయణ
- వీరభద్రారెడ్డి గూస్థానకవియైన శ్రీనాథుఁడు దీనిని వ్రాసిన వాఁడు కాఁడనుట నాకుంజూడ నిక్కువము. శ్రీనాథునిలో • పాండిత్యమునకు సమమైన కవితాశక్తిలేదు. పల్నాటి వీరచరితములోఁ గవితాశక్తికి సమానమైన పాండిత్యము లేదు. r. 22 కవిత్వతత్త్వ విచారము
భారతాదులకు నీడైనదని నా యభిప్రాయము. పాండిత్యప్రభావము మిక్కిలియుఁ దక్కువ. హృదయముల నల్లలనాడించు భావనా శక్తియో యెక్కువ .
ఈ తరగతికిం జేరినవి 'బాలనాగమ్మ కథ' 'బొబ్బిలిరాజు కథ' రాజాదేసింగు చరిత్రము' మొదలగు ప్రజాసమ్మతములైన కృతులు. వీని రామణీయకమునకు వేఅు తార్కాణములేల ! సమస్త స్త్రీ పురుషులయు మనసులలో స్థిరనివాసమేర్పఱుచుకొని యుంటయు చాలదా ? వీని నొకమా అువిన్న మఱల మఱువనగునా ? కావున నే పారంపర్యముగ జనులు. వీనిని బాడుచుండుటయు, తన్మూలమున నవి శిథిలములు గాకుండుటయు . కేవల కల్పితములైన వానింగూడ సాక్షాత్కారముందాల్చిన చేతనములం జేయంజూచునది కావున భావనాశక్తి నాటక కౌశ లంబుతో ననుసంధించియుండును. అనఁగా నాటక రచనాశక్తి యున్నంగాని కావ్యములు సైతము యథార్థములుగఁ గన్పింపవు. విరాటోద్యోగ పర్వంబులం జదివిచూచిన వారికి తిక్కన యెడ నీకళాకౌశలంబెంత పరిపూర్ణముగ నుండెననుట నావంటివాఁడు చెప్పవలసిన పనియేమి ? సంజయుఁడు, ధృతరాష్ట్రడు, ధర్మ రాజు, ద్రౌపది, కృష్ణుడు , దుర్యోధనుఁడు, కర్ణుఁడు మొదలగు వారు మన యెదుటనే మాటాడు మాడ్కి నుండుట పండితపామర విదితము. పాత్రల నడవడిని, వారిచేష్టలకును మాటలకు ను గల సమ్మేళన యెంత దృఢము! భారతములోని యేపద్యమైనం జదివిన యెడ, శైలింబట్టియే యది యెవరిదైనదియు C జెప్పవచ్చునని యొకానొకరి యభిప్రాయము. ఈ భావనాశక్తి యింత గొప్పగఁ గొందబ్ర లో వృద్ధిగాంచుట కేమి కారణము ? ఈ ప్రశ్న కుత్తరము సెప్పట బహు కష్టము. ఏలన తొలుతనే యిది స్వభావదత్తములైన సిద్ధులలో నొకటియని విన్న వించితి. ఆదిమములైన తత్త్వము లంగూర్చి వ్యాఖ్యానమునకుం బూనుట పిచ్చితలంపు. అట్లయినను ఒక లక్షణమాత్రము నిరూ పింపవచ్చునని తోఁచెడిని. ఎద్దియన ; * భావనాశక్తి నుద్దీపింప జేయు ప్రకృతి భావతైక్ష్ణ్యము
మనుష్యుల మనంబులతో నిరంతర సంయోగముం దాల్చిన ప్రకృతులు మూఁడు గలవు. (1) ఆలోచనములు. (కార్యకారణ ములంగూర్చి విచారణ చేయుట, వస్తుస్వరూపము నిర్ణయించుట 4, &9 యిత్యాదులు) (2) భావములు. అనగా మనోవికారములు. ఉదా : కామక్రోధాదులు, పేమ, ప్రశ్చాత్తాపము, దయ, దాక్షిణ్యము మొదలగు చిత్తసంచారములు. (3) సంకల్పములు. అనగా నేదైన నొకదానిం గోరి, దానిని సాధింపవలయునని ప్రతిజ్ఞఁబూనుట. ఈ మూడు శక్తులలో భావనాశక్తి నధికంబుగ విజృంభింపఁ జేయు నవి భావములు, కొయ్యలరీతినో, మహర్డుల చందంబుననో, నిర్వి కారస్థితి నుండు వారు పద్దెములు వ్రాయ నేర్తురుగాని, కవులగుట యసంభవము. ఏవృత్తాంతమునైనఁ జూచునట్లు వర్ణింపవలయు నన్న దానియొక్క స్థితిగతులను, నందలి పాత్రముల సుఖ దుఃఖములను, రోమరోమమునకును దానే మనఃపూర్వకముగ ననుభవించినందప్ప, తద్రూపముగ నభినయింప నెవరికిని దరము గాదు. చిత్త చాంచల్యము గూడదను వారు ఇట్టి యునుభవములకు మనిసిచ్చి సమ్మతింపరుగావున వారియందు శాస్త్రజ్ఞానమొక వేళ బ్రకాశమునకు వచ్చిన రావచ్చును గాని, శిల్పకళ లేమాత్రమును మొలకెత్తనేరవు. ఈ విషయము పామరులు సైతము గొంతకుఁగొంత యొ కిఁగినదే. కావున నే కాళిదాసు, తిక్కన్న మొదలగు మహాకవు లెల్లరు రసికులనియు స్త్రీలోలురనియు వారు గాథలు కట్టి యుండుట ! ఇంతే కాదు. భావములు కోరికలు రసములును మనసులో వెల్లివిరి సెనేని, జనులు మూగలట్లు పందల మాడ్కి మూలఁబడి, నిశ్చేష్టితులై యచల తత్త్వముం బూనియుండుట యరిది. అట్టివారు అనేకవిధములైన యుద్యమములకుంబూని కార్య నిపుణులగుదురు. కావున భావనాశక్తి, సంఘటనోత్సాహము ఇవి పరస్పర మిత్రములనుట విమర్శన శాస్త్రమునందలి యూది మ తత్వము. అట్లగుట నింకను వివరముగఁ దెల్పుట విధి. భావనాశక్తికి కార్యోత్సాహమునకు నుండు సామ్యము “ఘనములైన రాజకార్యములం దాసక్తికొని ప్రవేశించినవారు గద్యపద్యాది నిర్మాణశిల్పమునకుం దొడంగు వారైనచో వారు సులభముగను త్వరితముగను దత్కళా ప్రవీణులౌట నైసర్గికము కార్య గంభీరుల రచనయందు సారము, వీర్యము, ఉద్వేగము, చుఱుకుcదనము ఇత్యాది నానాపదంబులచేఁ బేర్కొనఁబడు నుగుణ మొకండు అఖండముగనుండును. కావున నట్టివారి కృతులు కేవలపండితుల గ్రంథములవలె రుచిలేనివిగను, చప్పిడి గను, మొద్దు పాఱినవిగను ఉండవు" అని విద్యాధురంధరులైన 24 కవిత్వతత్త్వ విచారము
"మార్లీ" ప్రభువుగారు సుమారు 25 సంవత్సరముల క్రిందనే వ్రాసిరి. దీనికి రాజకార్యవిచక్షణుఁడైన మన తిక్కన్నయే నిర్వి కల్పుండైన సాక్షి. కాళిదాసుఁడును గార్యోత్సాహపరులలో మిన్న యైనవాఁడని యతనింగూర్చిన కథల చే నూహింపవచ్చును. మఱియు దేశచరిత్రములఁ బట్టి చూచినచో యుద్ధాది వీరకృత్యంబు లకుం జనులు గడంగు కాలంబులలో మాత్రము కవిత్వమును విజృంభించుచుండెననుట నిర్వివాదముగ నెఱుఁగనగు ఇందులకు హేతువును విశదమ. అట్టికాలములో నెట్టి జడులును బయి పులును గొంతకుఁ గొంతయైన దేశభక్తియు శత్రుసంహనన సంరంభంబును దాల్పక మానరు. ఇఁక సామాన్యమైనవారన్ననో హృదయములు పగులునట్లు వీర్యాదిభావములం దాల్చుట ప్రకృతి విరోధంబు గాదు. భార్యను బిడ్డలను విడిచి యుద్ధమునకుఁ బో వువాని యాత్మలో నెన్ని భావములు తాండవ మాడుచుండవు ! కుటుంబ మును విడిచి పోవలయుఁ గదా యను దుఃఖము, మరల నా వారిని గన్నులారఁ జూతునో చూడనో యను దిగులు, ఇఁక యుద్ధమునకుఁ బోకున్నఁ బరులు వచ్చి తనవారి ప్రాణములకు మాత్రమా, మానము నకును భంగపాటు దెత్తురో యను రోషము, తన వారికిని తన రాష్ట్రమునకు నై వినియోగింపక యీ నా ప్రాణమును మూటగటు కొనిపోయి యేగంగలో బడ వేయు వాఁడనను దార్ధ్యము ! ఇత్యాదిగ లెక్కకు మీరిన మనోవికారములను దలచుకొన్ననే మనకు నే మో యగునట్టు లుండునుగదా ! ఇఁక వారికిని వారి కాలము వారికిని గలుగు ను ద్రేకమును వర్ణింపనవునా ? ఉద్రేక మేకదా కవితాశక్తికి ప్రాణాధారమైన కారణము ? ఈ దృష్టాంతములో “మనోవికార ములు" అను పదమును విధిలేక వాడితిని . ఈ వికారములన్న పదము నాది గాదు. మఱి
తిండిపోత నీకు భండనం బేటికిఁ
గడవఁ జేరి మనసు గాంక్షదీర
నోపు కొలఁది మింగియూరక నీవింటి
కడనయుండు ”
మని మగవారిచే గర్తింపఁబడు పేడి వారి తెగకుఁ జేరిన మన వెదాం. తులు మొదలైన వారిచే సృష్టింపబడిన పదము ! గొప్ప గొప్ప భావములు వికారములఁట ! దుర్గంధ ప్రళయముగా మూలఁ గూలంబడి ముక్కును బట్టి కూర్చున్ననేమి సుందరాకారమో ! ప్రథమ భాగము 25
ෂ ධී యట్లుండె.* భాషా చరిత్రమును దేశ చరిత్రమును నిత్యసంయోగములు ఆంధ్రదేశము వీర్యశౌర్యాదిగుణంబులచే విరాజిల్లు కాలం బున నన్నె చోడు c డు , నన్నయ , తిక్కన మొదలగు కవి గ్రామణులు ప్రాబల్యమునకు వచ్చిరి . కావునన వారి వ్రాఁతలలో రసము ల మేయముగ మెఱయు చుండుటయే గాదు . ఉత్సాహమును గుణంబును వెల్లివిరియు చుండుటయు, మహమ్మదీయులచే నో డింపబడి యుక్కుతక్కువయె కుక్షింభరుల మైయున్న కాలంబులోఁ బుట్టి పెరిగిన ప్రబంధకవులలో పాండిత్యబలము విశేషముగ నున్నను . పందతన మొక్కటి యెక్కువగ నున్నదే కాని, ధైర్యముతో c . యెత్తికొని మునుష్యులలో మనుష్యుఁడుగ దిరుగుటకుఁ దగిన యుత్సాహ మంతగాఁ గాన్పింపదు . శ్రీకృష్ణ దేవరాయల కాలములో పౌరుష మొుకింత యుద్దీపించె , కాని యయ్యుది మె అుcగుదీఁగవలె నొక్క నిమిషమాత్ర మాంధ్ర ప్రపంచమును ధగద్ధగితముఁ జేసి యంతర్ధానమైనందున యథా రీతిని మఱల గాఢమగు చీఁకటి యాక్రమించినది. బ్రిటిష్ గవర్నమెంటు వారు మనకు మనసార నిచ్చిన విద్యా ప్రభావముచేత నిప్పడు పరచింత నంతగా నుంచుకొనక యై హి కముల సాధించు నుద్యోగములను బునరాచరణమునకుఁ దెచ్చి కొనుచున్నాము . కాన భాషాసంబంధములైన రచనలును బ్రకృతము తేజోవంతములై వ్యాప్తికి వచ్చుచున్నవి . హిందూ దేశమును మహెూన్నతదశకుం దేవలయునని దృఢప్రతిజ్ఞగలుగు జనులుండు ప్రాంతములందెల్ల దేశభాషలకుఁ బ్రకృతమున గౌరవమును విస్తీర్ణతయు మెండు . మనకుఁ బట్టిన వేదాంత పిశాచిని అట్లట్లు పాఆcదోలినందులకు నింగ్లీషు వారు స్వభాషాభిమానులమగు మన కెల్లఁ బూజనీయుల .4
పాండిత్యబలము రేయింబవలును వ్యాకరణములను నిఘంటువులను ప్రాచీన
- వికారమునకు నిజమైన ఆర్థము మార్పు , ఆకారము మాఱుటయ వికారము . ఆ వికారము నహ్యమో అనహ్యమో దానిగతిం బట్టియుండును.
- ముఖ్యముగా జాతీయోద్యమము మన చిత్రకళలను పునస్సృష్టికిఁ దెచ్చు టలో పథమ హేతువు.
(4) 26 కవిత్వతత్త్వ విచారము
కావ్యములను వల్లించు చుండుటచేత నూనెకు నష్టియే కాని కవితకుఁ బుష్టి లేదు. తనమనసున నెన్నియో భావములు ప్రభవిల్ల కున్న నితరుల మనసులలో భావము లుప్పతిల్లC జేయుటయెట్లు ? కట్టెవారిన కోవిదులకన్ న లోక వాసనల ననుభవించి యానందించు వారు మేలు.
అలంకారము లనావశ్యకములు
మన కావ్యములలో నుపమాద్యర్థాలంకారములును నను ప్రాసాదిశబ్దాలంకారములును దఱుచుగ నుపయోగింపCబడి యుం డుట, యెల్లరకుఁ దెలిసిన సంగతియ. అందు శబ్దాలంకారము లంతగా ముఖ్యములు గావనుట యందరు నొప్ప కొందురు. గా నవానిమాట ప్రస్తుత మటుండనిత్తము. అలంకారములలో ప్రధాన మైనవి యుపమోత్పే ఔదులు. వీనికి మూలభూతమైన ధర్మ మేదనగా ప్రకృత వస్తువునకు మతేదో యొక వస్తువునకును నామ రూప స్వభావాదులంబట్టి సామ్యము గల్పించెడుశక్తి. పోలికలను స్థాపించుట సొగసైన కార్యమేయైనను గవితకు ఖండితముగా నుండవలసిన లక్షణము కాదు. మనవారు అఅంకారముల యెడ నమితాతురతc గొన్నవారు కాఁబట్టి యొుకటి రెండు కారణముల ఁ జూపుట యావశ్యకము. శిల్పములకు వర్ణన మప్రధానము. కాదను వారెవరును లేరు. ప్రతిమలను జిత్రించువారును విగ్రహములఁ దీర్చువారును బరిస్ఫుటముగ నాకృతులనెదుర నిల్ప నేర్తురుగదా ! అయిన నట్టిచో వీరు పోలికలందెచ్చి చూపి పరిష్కరించుట కవకాశ మెక్కడిది ? గద్య పద్యములును శిల్పమునకుం జేరినవే. కాననిందును సాదృశ్యప్రతిపాదనము విడువరానిది గాదనుటయ సరి. మఱియు భావములు తీవ్రముగఁ జెలరేగునపుడు వానియుద్భ వోద్రేకములకు హేతువులగు వస్తువులం దప్ప నితరములయెడ దృష్టిపారుట యసంభవము . మనసు చెలరేగినప్పడు ఆలోచనకుం బూనుట యాచిత్య భంగమునకు ముఖ్య కారణము. కావున నే మనవారు కోపము వచ్చినపుడు ౧, 9, 3 ఎంచుమని చెప్పదురు. చూడుఁడు. భీమసేనుఁడు దుర్యోధనుని జూచినాఁడు పో ! అపుడు. సింహము మదేభము పైఁ జెలఁగినట్లు, డేఁగ పావురము మీఁద వ్రాలిన మాడ్కి, ఇంద్రుడు వృత్రాసురుని మార్కొనువిధమున, బల్లి చీకటీఁగపై గవిసిన కరణిని ఇత్యాద్యుపములు భీమసేనునికిఁ దట్టునా ? " క్రోధం బప్రతికారమై హృదయముం గుందించు" ప్రథమ భాగము 27 నవసరమున నిట్టిదూరపు టాలోచనలకుఁ దా వెక్కడిది ? ఒక వేళ అరమైలు దూరమునఁ జెట్టుచాటునఁ బొంచిచూచెడు కవులకైనఁ దోఁచునా ? తోఁపవని నానమ్మిక. ఏలన, భీమసేనునిజూచి వణఁకు చుందురుగాన ! కావున కథాంశము సాక్షాత్తుగ సమీపమున నడచి నట్లు భావనాశక్తి బలంబుచే స్ఫురించెనేని దూరపు సంబంధముగల బలాత్కృతాలంకారములకుఁ దా వుండదు. సాదృశ్యములలోఁ గొన్ని సహజములును అనివార్యములును. అవి తమంతటన యే ప్రయాసమును లేక వచ్చినయెడఁ గథా సందర్భముతోఁ గల సి మెలసి యుండును. ఈ విషయమునందు బ్రథమోదాహరణము కాళిదాసుని సాదృశ్యకల్పనము. చూడుఁడు. తే. “అట్టి సంతతిలేని న నెట్లుగనుచు వంతఁ జెందవ మది మౌనివర్య! చెప్పమ ! ప్రీతిమైదాన నిర్వోసి పెంపఁదుదకు గొడ్డువాటిన యాశ్రమ కుజముటోలె* మణికొన్ని సర్వవిధముల సరిపోలఁజాలు నో గోవిందా ! యను చున్నను దీర్ధాలోచనములుచేసి కష్టపడి శ్లేషాది కుయుక్తిపాశ ములచే నీడ్చి తెచ్చి తొందర మెయిఁ జొన్పించినట్టులుండును. ఇట్టివి సంపూర్ణముగ విసర్జించిన నెంతయో బాగు. అలంకారములం గూర్చిన ముఖ్యపద్ధతు లెవ్వియన, అయ్యవి ప్రయత్నములేకయ వచ్చినంత సహజముగ నుండుట. కథలోని స్త్రీ పురుషులు మాటాడునపుడు పాత్రోచితములైన కొన్నింటిమాత్ర ముపయోగిం చుట కవియే వర్ణించునపు డొకింత యెక్కువగ నలంకారములు వాడినను దోషములేదు. కాని భావములు మహెూజ్జ్వలములుగ రేగునపుడు ప్రకృతమునందే యవధానము నింపట మంచిది. అట్టి తరుణముల నలంకారములు సాధారణముగ నసంబద్ధ ప్రలాపముల. సాదృశ్యతత్త్వము సామ్యము వర్ణనకు నుపకరణము. ప్రధానంబు గాదు. సామ్యము లుండిననేమి యుండకున్ననేమి ? సొగసైన వస్తువును జూచిన వెంటనే తనంతట సంతోష ముదయించును. ఈరీతినే సమస్తవస్తువుల యనుభవములయందును స్వతస్సిద్ధములైన సుఖ
- ఈ పద్యము శ్రీ అనంత కృష్ణశర్మ విరచితము. రఘువంశము (స. గా, 80) £8 కవిత్వతత్త్వ విచారము
క్లేశాది భావములున్నవి. వస్తువులు, వృత్తములు, చర్యలు ఇత్యాది ప్రకృతులకును మానవ మనః ప్రకృతికిని స్వచ్ఛందముగనుండు భావవిషయమైన రీతులను వర్ణించుట కవితయైుక్క ప్రథమ గణ్యో ధేశము. ఈ కార్యమునకు, సాదృశ్యనిరూపణాద్యలంకారములు సులభముగఁ దోడ్పడిన వలదన రాదు గాని, ಯುಟ್ಲಿ యలం కారములు లేకున్న వర్ణనము తుదముట్టనేరదని భ్రమించి, వానిని కుయుక్తి యను త్రాటిచే బంధించి ప్రబంధమను చెఱలోను C చుట యెంతయు c బశ్చాత్తాపకరమైన నేరము. కమలముతోఁ బోల్చకున్న సీతాదేవి ముఖము చూచువారికి సుఖమియ్యదా ? చిన్నతనముఁ బూ ను నా ? అట్లగుట నాదేవి ముఖము నే నేరుగ వర్ణించినం జాలదా ? మ బ్రియు c గమలముతోఁ బోల్చుటం జేసి సీతాదేవి ముఖ మానందదాయి యాయొనని భ్రమించు వెజ్జు లెవరైననున్న వారికొక ప్రశ్న. ఏమన, ఇఁక దేనితోఁ బోల్పఁబడినందున కమలము హర్షము నొసంగునది యాయెను? ప్రతి పదార్ధమునకు నొక యుపమాన ముండి తీర వలయునన్న కట్టకడపటి యుపమానమున కాధార మేమి? కావున నెట్లును ఏదో యొక వస్తువు తనంత, ఇతర మధ్యస్థ్యములేక, తన కనుగుణమైన భావమును బుట్టఁజేయునుగదా? అట్లగుట మొదటి వస్తువునకే యూ గౌరవము నేల ప్రతిష్టింపరాదు? వస్తుస్వరూపములు చావములు పరస్పర నిర్ణీతములు వస్తువులంబట్టి భావము లేర్పడిన భావములంబట్టి వస్తువు లేర్పడుటయు నిజము. ఎట్లన, సంతోషకాలమున సర్వము ప్రకాశ మానముగాc దోఁచును. దుఃఖము గ్రమ్మినచో లోకమంతయుఁ జీకటిగ్రమ్మిన యట్లుండునుగదా! అభిమన్యుని మరణము విని శోకతప్తయైన సుభద్రాదేవి ప్రలాపించిన యీ పద్యమ వినుండు. సీ. “ఈ లోకమెల్లఁ బాడిల్లును బోలెనై యున్నది నీవు లేకునికిఁ జేసి ! నీవు వేగమ కడు నెఱసి బంధులఁ ಬಿಡೀ - బొందజేయుట కలవోలె నయ్యో, జిష్ణుని కొడుకవ కృష్ణు నల్లుండ వీ వరులచేఁబడుట చోద్యంబుగాదె ! చెలువంపమేనును జెన్ను మొగంబునై యొవ్నడు పొడనూపెదింక గుఱ్ఱ! ప్రథమ భాగము 29
తే. అకట! యుత్తర యొప్పెడునది, మనంబు
దీనికెంతయు మెత్తన, యేనునిన్ను
వేఁడి కొనియెద ! వచ్చి యివ్వెలఁది వంత
దీప్తి తళుకొత్తు పలు కులఁదేర్పవన్న !”
ఈ మాట యెంత సత్యము ! జయమగునేని ప్రపంచమం తయు పెండ్లిల్లే ; పరాజయమేని పాడిల్లే ! కావున నేకదా వేమన తనచావు జలప్రళయము తనదుఃఖమె సర్వలోక దారిద్ర్యంబున్" అని నుడు వుట ! విపరీతాలంకార రచనకు బ్రేరేపకము భావశూన్యత ఇంగ్లీషుక వులకంటె నాంధ్రకవులలో నలంకారము లధిక ములు. అందును బ్రబంధకవులలో నత్యంత విపరీతములు. దీనికిఁ గారణమేమన, అలంకార రచన యూలోచనాశక్తికిఁ జేరి నంత భావనాశక్తికిఁ జేరినది గాదు. మనకవులు తరుచు పండితులు. ఇంటిలోనే కూర్చుండి నిఘంటవులఁ గంఠపాఠము సేయువారు. వీరికి కార్యోత్సాహము భావప్రాబల్యము రెండును క్షీణములు. కావున నే భావనాశక్తి మట్టు. ఒకవిధమైన యాలోచనాశక్తి యెక్టువ కాన రేపగలును ఆలోచించి యాలోచించి దిక్కు గతి మోక్షములేని యూహలం గల్పించుచు నదియే కవిత్వమని విజ్ఞవీఁగసాఁగిరి. యుక్తులు కుయుక్తులుఁ గవితాశక్తి యగునా ! కానేరవు. కవి త్రయము వారిలో నిట్టి విఱుపులు లేవని చెప్పఁగాదు గాని ప్రబంధ కవులయందు బలెపిచ్చి ముదిరియుండలేదనుట సర్వజనవిదితము. ఒక వేళ మన దేశ భాషలలో నలంకారములకు స్వచ్ఛందమైన ప్రవృత్తి యాంగ్లేయ భాష లకన్న నెక్కువయో మో! భాషా శాస్త్ర వేత్తలు గొందఱు మనలో గుణవాచకములు వలసినంత లేకుండుటచే విషయవైశద్యప్రాప్తికై యలంకారములతో నిండిన శైలి నా రాధింప వలసినవార మై తిమని సిద్ధాంతము きさ。 యున్నారు. ఇదియు సహేతుకమైన వివరణ వేయని తోఁచెడని. భారతకవల ప్రతిభ ఈ విస్తార వ్యాఖ్యానమునకు ప్రకృతి సాంగత్య మెట్టిదనంగా భారతకవులకు భావనాశక్తి యెంతయు గంభీరము. సమయోచిత 30 కవిత్వతత్త్వ విచారము వర్ణనా ప్రావీణ్యమునఁ దిక్కనతో సమాను లెవరును లేరు. అరపా లైనవారును లేరన్న సత్యమునకుఁ దల వంపు రాదు. పనికి మాలిన యలంకారములు వారి కవిత్వమున నపరిమితములు గావు. తుదకు వర్ణనములకుం బూనునపుడు సైతము కథ యొక్క వేగమునకు భంగము గలిగింపనంత మితముగఁ జేయుదురేకాని కథ మఱపు నకు వచ్చునంత దీర్ఘముగా నెప్పడును సాగఁబెట్టరు. అనఁగా నిక్కమైన కవిత వీరియందు నెలకొన్నదని నా విన్నపము. అందు ( దిక్కనను గూర్చి నా వంటి వాడు ప్రశంసింప జూ చుట యధిక ప్రసంగము. అతఁడు కవిబ్రహ్మ. అవతారపురుషుఁడుగాని కేవల మర్త్యుడా యని యాశ్చర్యపడవలసినంత ఘనుఁడు !
విషయము శైలి రెండును ముఖ్యములు\
" భారతమునందు మనకంత రుచియుండుటకుఁ గారణము. విషయము, అనఁ గా కథ గాని, యూ విషయము ప్రదర్శింపబడిన మార్గములు, అనగా శైలి ఇత్యాదులు, గావని" కొందఱ యభిప్రా యము. కాని యిది శుద్ధముగా బుద్ధిపొరఁబాటు మాట. దృష్టాం: తము : భాస్కరుని రంగనాథుని* రామాయణములం జదివినవారు రామ వియో గముచే శోకించు కౌశల్యాదశరథాదులయెడ నెంతో ప్రీతియు జాలియు వహించినవా రగుదురుగదా ! అయ్యలరాజు రామభద్రుఁడను కవి తన రామాభ్యుదయములో రామ వనవాస ఘట్టమున దశరథుఁడు "నానార్థరత్నమాలను ఎదుట నుంచి కొని, పుటలఁ ద్రిప్పచు నేర్చినాఁడో యనునట్టు దరిద్రముపట్టిన శ్లేషా లంకారములు పెట్టి
సీ. శ కానక కన్న సంతానంబు గావునఁ గానక కన్న సంతానమయ్యె నరయ గోత్ర నిధానమై తోఁచుఁ గావున నరయ గోత్రనిధానమయ్యె నేఁడు ద్విజకులాదర వర్ధిష్ణుండు గావున ద్విజకులాదరణ వర్దిష్టుఁడయ్యె వివధాగమాంత సంవేద్యుండు గావున వివిధాగమాంత నంవేద్యుఁడయ్యెఁ
- రంగనాథ రామాయణమును రచించినవాఁడు కోన బుద్దారెడ్డి. రంగనాథుఁ డనెడువాఁడు కట్టుకథలకుఁ జేరిన కవియకాని వా స్తవ్యుఁడు గాఁడు.
'ప్రథమ భాగము' 31
తే.గటకటా ! దానర సముత్కట కరీంద్ర
కటకలిత దాన ధారాస్త్ర కటకమార్గ
గామి, యెట్లు చరించు నుత్కట కరీంద్ర
కటక లిత్ర డాన ధారాష్ట్రకటక తటుల ?"
ఇత్యాదిరీతులఁ బ్రలాపించినట్లు వ్రాసియున్నాడు. మఱియు శంకరకవికృత హరిశ్చంద్రోపా ఖ్యానమున లోహితాస్యుని మరణము గూర్చి యేడ్చుచుఁ జంద్రమతి, రాజర్షి పత్ని గావున నేమో, కుమారునికింబలె తనకును నూపి రాడకుండఁ బ్రాణాయామముఁ జేయుచు నీ దీర్ఘ సమాసమును గూర్చి పద్యము చెప్పినది చూడుఁడు.మ.
“అకటా ! చేరెఁడు నేలకుం దగఁడె సప్తాంభోది వేష్టిభవ
త్స కలద్వీపకలాప భూపమకుటాంచ త్పద్మరాగోజ్జ్వల
ప్రకటానర్గళ నిర్గళత్కిరణ శుంభత్పాదుఁడైనట్టి రా
జుకుమారుండు'
ఈ తీరు ననే యెల్ల రామాయణములును వ్రాయబడియున్నచో నా గ్రంథముల యొద్దకు మనుష్యులన నేల, తుదకు జెదలుసయి తము పోదను ట స్పష్టము . కాబట్టి విషయముచే రసము తప్పక కలుగున నుట తప్ప. కథ బాగుగ నుండి న జాలు నా ? తగిన రీతిని వ్రాయంబడియున్నంగాని కాదు. ఈ దేశములో నొక్యాంధ్రులకుఁ దప్పఁ దక్కిన యుందఱకును రామాయణమందు cగల యభిరుచి భారతమున లేదు. మనకన్ననో భారతము ప్రాణము. ఈ వ్యత్యాసమునకుఁ గారణమేమి ' ఆంధ్రంబున భారత రామాయణాదులకుఁ గల శైలి తారతమ్యమే. శ్లోకరసము వర్ణించునపుడును, రామభద్రునకు శ్లేషలు సాంస్కృతిక దీర్ఘసమాసములును వీడరాని చీడలాయోcగా ! యుద్ధము ముగిసి జయము సిద్ధించిన పిదపCదాఁజేసిన యకృత్యములC దల cచి కొని ధర్మరాజు పశ్చాత్తాపపడు ఘట్టమునఁ దిక్కన్న వ్రాసినవిధముంజూచిన భారతము నకు మన యంతరాత్మలయందుగల నిత్యనివాస మునకుఁ గారణ మేర్పడకపోదు. చూడు Cడు.ఆ.
అల్పకాల భోగ్యమైన రాజ్యమునకుఁ
గా, ననల్పకీర్తి ఘనుని, జరఠ
సింహకల్పు, వంశ శేఖరజన్ము, ద్రుం
చితి, మనంబు పగలఁ జివుక కున్నె?
జననంపూజ్య పదారవిందుఁడగు నాచార్యుండు శోకించి, నం
దనుచొప్పారయవేఁడి, పెద్దయు ననుం దానమ్మి యర్ధింపఁ, జా
వనివానిన్, గరిచావు బుద్ధినిడి, “యశ్వత్థామ సచ్చెన్ నిజం”
బని యే బొంకితి ! మేదినీ భరణ మర్హంబే గురుదోహికిన్
రాజ్యలాభలో భరతుఁడనై కడు బాప
మైన బొంకుమాటలాడి, గురుని
గూల్ప నేర్చినట్టి క్రూరాత్ముఁడేగతిఁ
బోవువాఁడు ? సెపమ బుధవరేణ్య !
భ్రాత మహాత్ముఁడు కర్దుం,
డౌతనిఁ జంపించి యేలు నవనీ రాజ్యం
బాతురత నొనఁగుఁగాక, సు
ఖాతిశయము మతికి నొనఁగునయ్య మునీంద్రా
కడిఁది మగండు కుంభజుఁడు గావఁగ నొడ్డిన మంటవోలెనుం
డెడి మొనఁజూచి చూచి, యెది డెప్పర మన్వగలేక పంచితిన్
గొడుకుఁ జొరంగ, నత్తెఱగు క్రూరతసైఁప సుభద్రయట్లు, క
వ్వడి క్రియ, నోర్తురే యొరులు ? వల్లభుఁడేలగు నట్టిఁడుర్వికిన్?
ఖడలడిఁ బొందగాఁదగని యట్టిది ద్రోవది, మేరుకల్పులం
గొడుకుల నేవురన్ జముఁడుగొన్న నలందురఁ జూడనేర్తునే?
పుడమి గిరీంద్ర పంచకము విల్చినఁ బాడటీ నట్టులున్న య
ప్పడతుక యెట్టులోర్చుగృహభారము నెమ్మది నిర్వహింపఁగన్.
ప్రాయోపవేశమున ગ *
క్కాయంబుఁ దొఱంగఁ దలపు గదిరెడు, సంతా
పాయత్తచిత్తు, నకట క
టా ! యని పోనిండు నను దృఢవ్రతయుక్తిన్.
పాత్రరచనాతత్త్వములు
మఱియు పాత్రముల చరిత్రములను విస్తరించుటలో వర్ణనీయమైన పద్ధతి యేదనఁగా స్త్రీ పురుషులు గుణానుగుణమైన నడవడి గలవారయ్యును, ప్రపoచాచారములయందుబల కావ్యములందును గాలదేశవర్తమానముల వలన నొక్కక్కయెడ విరుద్ధమైన వర్తనముగలవారు గా నున్నట్లను ప్రదర్శించుట సర్వకాలములయందును సర్వావస్థలయందును ఏకరీతిగా వర్తించు వారుండుట ప్రథమ భాగము 33
యరుదు. మొత్తముమీఁదజూడ ఎంత క్రమముగానున్నట్లు దోcచినను సూక్ష్మముగఁ పరీక్షించి చూచిన యెడల వంకర లేమాత్రమునులేకుండవు. సయిజు మార్గం అట్లుండఁగా, నిక్కమై ముపజ్ఞలేమిచేబరులోపెద్దలో చెప్పినట్లు, వ్రాయఁజూచు నలఁతికవులు, అలంకార శాస్త్రములలో నాయికా నాయకులకు జాతుల నేర్పఇచి గుణమ్ముల నిర్ణయించియుండుట బాగుగఁ బఠించియున్నవారు గాన నదియ యొుక వేదమనుకొని ప్రమాణమును పిచ్చివట్టి, యందు C బేర్కొనఁబడిన ధీరోదాత్త ప్రభృతులలోఁ దమకు వలయు వారిని స్వీకరించుకొని యెల్లదెఅంగులం బ్రాచీనోపదిష్టమార్గంబుననే వర్ణించియెదుట నిలుపుటయు కృతకృత్యతగ భావించిరి. బింబములకుఁ బ్రతి బింబముల నుత్పాదించుట కవి చేయవలసిన పనిగాదు. మరిపోటోగ్రాఫరుది. తన మనస్సునకుఁ దగినట్టు తన కన్నులకుగోచరించునట్లును వ్రాయవలయు నేకాని యింకెవరికో తోచినట్టుదా వ్రాయఁజూచుట మూఢమతము. అట్లుచేసినఁ బద్యములుసిద్ధించినను కవిత పక్వస్థితికి రా (జాలదు . ఇందు నకు C 7గారణములు . మనసులు వేఱు. సంపూర్ణముగ సరిపోలునవి దుర్ఘటములు కావున నే విషయముం గూర్చి చర్చించిననుసరే యొకనికిఁదో Cచు భావము లితరుల భావములతోఁ గొంతవరకు సదృశ్యములైయున్నను గొంతవరకు భిన్నములుగను నుండుననుట ప్రకృతి లక్షణము. ప్రకృతి శాస్త్రములయందు సామాన్యగుణంబులకు గౌరవ మెక్కువ. ఏలయన వస్తు జ్ఞానమే యందు ముఖ్యము.అట్లు గాక మనోరంజక మే ప్రధానముగాఁగల కవితాదిశిల్పములందు భిన్నగుణములకు గౌరవ మెక్కువ, చూడుఁడు. ఒక స్త్రీని జూచి మోహించినవాఁడు ఆమెకు స్త్రీజాతి యంతటితోడను గల సామాన్య మైన గుణములచే నాకర్షింపఁబడియా మెూహించును ? అట్టయిననీ యమ్మయే కావలయునని పట్టుబట్చట యేుల ? ఎవతె చిక్కినను సంతోషమని యుండరాదా ? నెూహమునకుం గారణము సామాన్య గుణంబులతోఁ గబసి యు మీ 3 మెఱయు ననన్యసాధారణములైనలావణ్యము, వచో మాధుర్యము, నడకల సౌగసు ఇత్యాదులగుసౌందర్యములు. జాతి యనునది యస్త్రి భారము వంటిదను కను Cడు. కనులను మనసులను మఅల్చునది యది గాదు. దానిమీCద జక్కఁగఁ దీర్పంబడియుండు స్వరూపమను భవనము. ఈ సంగతి నెఱుంగనివారె "పాడిందేపాడరా పాచిపండ్ల దాసరీ" యన్నట్లు ఏదో యొక కొన్నితరగతుల పాత్రములను వర్ణనములను
(5) 34 కవిత్వతత్త్వ విచారము
బిజికిపట్టుతోఁబట్టి వానిసంఖ్యలకు గుణకారము సేకూర్చిన నలం కారము సేకూరునని ఆంథ్ర కవిత్వమును భావములేని పదా టోపము ప్రకటించి పాడు సేసిరి."
ఏమీ! ప్రతివాని మనసునకు వచ్చినట్లు వ్రాసినదియుఁ విత్వమగునా? యను నా క్షేపణ ముండునేమో! నేనన్నదది కాదు. కవియైనవాఁడు తన భావము ప్రకారము వ్రాయవలయు నంటిని గాని, భావము ప్రకారము వ్రాసిన వారందఱు గవ లౌదురని నా మాటగాదు. అనఁగా నుత్కృష్టమైన భావములేని నీరసమానసులు కవిత్వముం జేయంబూనుట వారియొక్కయే కాదు మన యొక్కయు దురదృష్టము.
పాత్రములు అనితరతుల్యములుగ నుండవలయు
సుప్రసిద్ధములైన పాత్రములన్నియు ననితరతుల్యములు. మఱియు ననితరతుల్యములే సుప్రసిద్ధములు. ఉదా. : ద్రౌపది సీత, సావిత్రి, శకుంతల, మండోదరి, శూర్పణఖ మొదలగువార ఎల్లర చిత్తములలోను జక్కఁగాఁ దమ తమ గుణములచే బ్రకాశ మానలుగ నున్నారు. వీరిలో మంచివారు సైతము భిన్నమూర్తులే కాని, ప్రత్యేక పఱుచుటకు సాధ్యముగాని యొకే యచ్చునఁ గొట్టినట్టి బొమ్మలు గారు. ఇఁకఁ బ్రబంధ స్త్రీలన్ననో యట్లుగాదు. అందఱకు నొక కేుమూర్తి. వెవ్వేఱ గుర్తింపనలవిగానట్టిది. ఆ కారములు, గుణ ములు, చీరలు, నగలు అన్నియును నలంకార శాస్త్రమను నొకే యంగడిలో నెరవుతేఁబడిన వస్తువులు. పేర్లు మాత్రము వేరు. చర్య లేమో యొక్కటే. అవియు నంత శ్రేష్టములు గావు. వ్యక్తిత్వము సున్న. ఆదికవులను మధ్యకవులనుగూర్చి చెప్పిన యీ కవి మాటలు దిక్ ప్రదర్శనముగఁ జెప్పబడిన వేకాని ప్రతియొక్క కవికి నా రో పింపఁదగినవి కావని యెఱుంగవలయు. చూడుఁడు. స్త్రీపాత్రములందు మనుచరిత్రములోని వరూధిని యెంత మనో హారిణియగుముద్దరాలు !
జీవకళ యొక్క లక్షణము
పాత్రములు ప్రత్యేకాకృతులుగ నుండవలయు ననుటయ:య్యవి బిఱుసువాఱినట్లుండక సమయోచితము లగు మార్పులంజెందునవిగ నుండవలయు ననుటయు C బరస్పర మిత్రములైన ప్రథమ భాగము 35
న్యాయములు. ఎట్లన, ఈ రెంటికిని హేతుభూతమును దావఖమును అయినది జీవము. జీవకోటులం బరీక్షించి చూడు (డు. మూఁడు
గుణములు తెల్లముగఁ గాననగు, (i) అవి జాతులుగ నేర్పడును.
(ii) కాని ప్రతి ప్రాణియు ఇతర ప్రాణులనుండి వేఱుగ గుర్తింపఁ దగినంత వ్యక్తిని దాల్చియుండును. (iii) వికారము. అనఁగా మార్పులం జెందుట. ఇది యన్ని జీవ రాసుల యు స్వభావము . నిర్వికారముగా నుండవలయునన్న జాయి గావలసినదే! అదియు
నుంగాదు గా Cబోలు! ఏలన, ఆధునిక ప్రకృతి శౌస్త్రజ్ఞలు లోహ ములు మొదలగు జడంబులు సైతము జీవులట్ల స్వాభావికముగ వికారము నొందునని నిరూపించియున్నారు. కావున C బరమ నిర్వికారస్థితిఁ దాల్పవలయునన్న రంభలు లేని లోకముc గని పెట్టి
యందు బయిషీశ్వరులగుట దప్ప వేతొం డపాయములేని యుపా యము వెదకినను దొరకదు. (iv) ఈ వికారములును వ్యక్తిభేద ముల మాడ్కి. అనగా వస్తువుల యొక్క ప్రకృతికి మీఱిపోవు. మఱియెట్లు వ్యక్తిజాతిచే పరిమిత మో యక్షేు వికృతులును ప్రకృతు
లచేఁ బరిమితములు. హృదయ ప్రమోద మే యుద్దేశ్యముగాఁగల
శిల్పకళలయందు వికృతులు ప్రధాన తమములు.
వికృతులు లేని పాత్రములు జడ సమానములు
ఇది తెలియనివారు ఎవరినైన నొకని ప్రారంభమున ధీరో దాత్తుఁడుగా నుండునట్లు వర్ణించిరయేని, మఱి వాఁడు చచ్చువఱకు
నా ధీరోదాత్తత్వమునందే వానిని పడవైచి పెట్టి పుణ్యము గట్టి
గొందురు. వీరియొక్క పాత్రములు గ్రుక్కుమిక్కనక యిటు
నటుఁ జూడక ముక్కునకు సూటిగా నేగుచుండును. అనగా యినుప యంత్రములకు జేరినవిగాని మనస్సును కలిగి, యది కారణముగ చాంచల్యముగల చేతనములుగావు. పాత్రముల సహజ వికృతుల నుద్ధరించుటయందు భారతమును మించిన గ్రంథ
మీ ప్రపంచమునం దెక్కడను లేదు ! మానవస్వభావ మీ గ్రంథ
రాజమున నెంతచక్కఁగ నెంత గంభీరముగ నెత్తి చూపఁబడినదో
యది తలంపునకు రావచ్చునేమో గాని నాల్కకు వచ్చుట దుర్ల భము. చిత్రవిచిత్రభంగులు గలిగి, భావార్దములై, స్వాభావి కములై, మె ఆ9ు Q గు వెట్టఁబడిన భారతపాత్రము లం గూర్చి వ్యాఖ్యా నము c జేయవలయునన్నచో నిటనుండి పింగళి సూరన్నను వెడలఁ
గొట్టవలసినదే. ఈ యుపన్యాసమునకు నాయకుఁడు గాన నది 36 కవిత్వతత్త్వ విచారము
-మర్యాద కాదు. ఈ గుణములంబట్టి చూచిన రామాయణాదులు భారతమునకంటె నెంతో తక్కువయునుట నిస్సంశయము. ఇఁక సామాన్య ప్రబంధములన్ననో పొనియందలి స్త్రీ పురుషు లెండిన కట్టెలవలె నున్నారు. వంగలేర్చ, పెరుగలేరు. కాఁబట్టి ప్రాపులు రెండు : విఅువఁబడుట! ప్రాయి నిడఁబడుట. శాస్త్రాడేళ రచనలు విరసములు ప్రాచీనులు వ్రాసినట్లును అలంకారశాస్త్రము లాదేశించినట్లును విరచింపఁ బ్రయత్నించుట తెలివితక్కువ పని ఏలన ఒక కవి వ్రాసినవిధమున నింకొకఁడు వ్రాయcజాలమి ప్రకృతిసిద్ధమైన యర్గళము, ఇందునకు గారణములు, (i) మనసులు వేఅగుటం జేసి భావాదులును వేఱు. వివిధ భంగుల స్ఫురణము గల వారు ఒకేతీరును నభినయింపఁజూచుట పరిహాసమునకు హేతువు. (ii) భావము భాష యివి పరస్పర సాంగత్యమం దాల్చి యున్నవి. ఇంచుక నిదానించి చూడుఁడు. ఏవిధమైన పదములచేరికయు లేని యాలోచనలజేయుట సాధ్యమౌనా? ఏదీ ? భాషాసాహాయ్య మేమాత్రముఁ గైకొనక కొంతసేపు దేనినిగూర్చిమైన యోజింపుఁడు? ఈ గారిడీవిద్య మనుష్యులకు మించినది. తలపండిన భాషయు నుండవలయుననుట నిజము. అయినను భాష యుండినఁ దలం పండితీరవలయు నా యను నొక ప్రశ్నయు విచార్యము. భావము ల ఖండముగ లేక యుండినను పదాడంబరము c బ్రబలముగాc జూపవచ్చుననుటకు మన ప్రబంధకవులే సాక్షులు కాని, యట్టి పదములు నిరర్థకములుగాన హృదయాకర్షకములు గావు. రుచి నీయవు. భావపుష్టి లేని పదపుష్టి కి 'బడాయి శైలి' యని పేరు. పసిపిల్లలేగాని ధీరులెవరును దీనినొకయెత్తుగఁ బాటింపరు. కావునఁ దిక్కనరీతిని వ్రాయవలయునన్నఁ దానే తిక్కనావ తారమెత్తి యాతని మనోభావాదులఁ దాల్చిన యానుగాని విరాట పర్వము గ్రుడ్డి పాఠముఁ జేసిన గోరిక తుదముట్టదు. ఒకరు సృజించిన శైలి, విషయము, రీతి. ఇత్యాది బింబములకు ప్రతి బింబముతe రచింపఁజూచుట మంచిదిగాదు. అదృష్టవశమున సాధ్యమునుగాదు. కష్టించి బహిరాకారముఁ దీర్పఁజాలితి మేనియు నంతరంగ ప్రతిపాదనముం జేయుట యెట్లు? ప్రాణము అను గుణములేనిపాత్రములు రిత్తలు. ద్రోణపర్వములో నభిమన్యు మరణవిమయమై జాలిఁ జెందుచు వరమఁడు ప్రథమ భాగము 37
ఉ. హాయును ధర్మరాజ తనయా యను నన్నెడఁబాయ నీకుఁ జ
న్నేయను దల్లినేఁపఁ జనునే యనుఁ గృష్ణుఁడు వీఁడె వచ్చె రా
వే యను నొంటిపోక దగవేయను నేగతిఁ బోవువాడ నే
నో యభిమన్యుఁడాయనుఁ బ్రియోక్తుల నుత్తర దేర్పవేయనున్”
(భా. ద్రో. ద్వి. 242)
అని విలాపించిన సామాన్య పద్యముం జూచి తరువాతి కవు లందఱు నా క్రోశావసరంబులలో
ఉ. "రాయనుఁగాయనుం దొగలరాయనిఁగేరు నిగారపుంగొటా
రాయను మేటినాడెపు దారాయనుఁ గిన్క యొనర్చెదేమిమే
రాయను నింతనీకుఁ గనరాయను దయ్యము పాడిదప్పెనా
రాయనుఁ గన్నవారు నగరాయను నిప్పని మానురాయనున్”
- {అచ్చ తెన్లు రామాయణము అయో. 89 ప.)
ఉ. కాయను మేటితప్పు కొడుకాయను నిద్ధపుబూతమావిమో
కాయనుఁ బంజరంపుఁ జిలు కాయను నబ్రపుసోయగంపు బ్రో
కాయనుఁబల్కవేమి యలు కాయనుఁ బంతముదీఱెనోటుకై
కాయను నేరయిట్లు దుడుకాయనుఁ బాయఁగఁ గోరికాయనున్
ఉ. హాయను గాధినందన మఖారినిశాటమదాపహారిబా
హాయను గ్రావజీవదపదాంబురుహాయను రాజలోక సిం
హాయనుఁ బోషితార్యనివహాయనుఁ గానల కేగితే నిరీ
హాయను నిర్వహింపఁగలనా నినుఁబాసి రఘూద్వహాయనున్.
ఉ. జాయనుజూపవేమి యనుజాయను నవ్విధియెంత చేసెనౌ
రాయను నాదుగుండె బలురాయను నాత్మపరాక్రమోన్నతుల్
రోయును గాననాంతరము రోయును దుష్టకురంగచేష్ట ను
మ్మాయను జానకీ దనుజమాయను గ్రుంగితె పల్కుమాయనున్
ఇత్యాది వర్ణక్రమము ననుసరించి ప్రాసములతో వ్రాసిన రసికుల మనసులకు తూయనిపింపక మానునా ?
మిశ్ర చరిత్రములుగాని పాత్రములు ప్రకృతి విరుద్ధములు పాత్రములం గూర్చి యీవఱకు స్థాపింపఁబడిన పద్ధతులు 38 కవిత్వతత్త్వ విచారము
రెండు, (i) అవి నిర్జీవములట్ల బిఱ్ఱబిగిసి యుండఁగూడదు. (ii) మట్టి తీcగెలవలె నల్లునవిగానున్న నింపును సత్యమును వహించినవగును అనుట. ఇట విన్యసింపఁ దగిన విశేష మింకొండుగలదు. ఏదన, పాత్రముల చరిత్రములు శుద్ధముగ మంచివిగానో శుద్ధముగఁ జెడ్డవిగానో యుండునట్లు దీర్చుట శిల్పదోషములలో నొకటి. ఏలోపమునులోని స్త్రీ పురుషులుండరు. మఱి కేవలము దుష్టులైన మానవులును గంటికిఁ గానరారు. మనుష్యప్రవృత్తి మిశ్రమైనది. కూనీచేసినవాఁడు సైతము పగసాధించుటయను వీరకర్మమున కుద్యోగించు వాడేకదా ! దొంగలు పరుల సొత్తును గ్రహించినను తమ భార్యలయు బిడ్డలయుఁ బోషణార్ధమేకదా ! ఇంతేకాదు. వెలుతురు చాయయు నెట్లు నెడతెగని సంయోగముం దాల్చి యున్నవో, యట్లే మంచి గుణములకును, దమ నీడలోయను మాడ్కి నవియే యాధారముగఁ బ్రభవించెడు చెడుగుణములు సదా సహచరములైయుండును. ధైర్యము మంచిద. అయిన నభిమన్యునివలె నత్యంత సాహసోదగ్రులైనయెడ వ్యర్థమైన ప్రాణ నీష్టికి మూలమగును. ఇఁక నెదిరిని దమ్మును నెఱింగి సమయము పొంచి మీఁదఁబడుదమనువాఁడు జయము గొన్నవాఁడైనను అంత కడింది మగఁడుగఁ దోcపఁడు. నీతియనునది శకునికైతపము యొక్క యపరావతారము. నీతిరహితమైన విజృంభణము ఆశ్చర్య కరమైనను, ఆనందకరమవునో కాదో, మఱియు సుగుణములే కొన్ని యెడలఁ బరస్పర విరుద్ధములగుటయు సంభవించెడు. అపుడేదేనొక న్యాయమును నిరాకరించుట విధిలేని యకృత్యము. దృష్టాంతము కర్ణపర్వమునఁ గృష్ణుఁడు చెప్పిన "కౌశికోపాఖ్యా నము" సత్యము ధర్మమే అయినను దొంగలువచ్చి నీసొత్తెక్కడనని యడిగిన నిజము చెప్పవలయునా ? శత్రువులువచ్చి నీయింటఁ జొచ్చినవాఁ డెక్కడ నున్నాడు చూపుమా వాని గొంతుగోయ వలయును. అని మర్యాదగాc బ్రార్ధించిరేని నిజముచెప్పిన భూతదయ నశించును. కనికరము నుద్ధరించిన ననృత దోషము ఘటిల్లును. అట్లగుటఁ గేవలము నిరంజనుఁడుగా నుండవలయు నన్న నసాధ్యము. నిరంజనత, నిర్వికారత, నిష్కళంకత ఇత్యాద్య భావములు మానవ ప్రకృతికిం జేరినవికావు. మన నడతలు మిశ్రములు. ఈ న్యాయమునకు ననుకూలమైనరీతిని పాత్రముల చరిత్రములం జేర్చి విస్తరించుటలో భారతమునకు నీడుజోడైన గ్రంథము లెవ్వియునులేవు. సామాన్య కవుల పాత్రములు ప్రథమ భాగము 39
నిర్వికారములుగ నుండుటయే కాదు. సంశ్లిష్టములును గావు. అవి యేకరస ప్రధానములుగాని నానా భావాభ్యుదయములకు నాకరములుగావు.
వర్తనములకన్న అంగాంగ సాంగత్యము కావ్యముల శ్రేష్టము
ఒకానొక విద్వాంసుడు విమర్శన ప్రాయమైన పీఠిక సించుటకై యిందు C బదునెనిమిది విధము నున్నవియని దృష్టాంతములతోఁ జూపి యునా c డు. గాదు గాని పొరపాటునకు వీలిచెడు పద్ద్తతి . ఎక్లీన వర్ణనములఁ జేయుటలో సామర్ధ్యమం జూ పెనేని కవి యొక్క ఘనతకుఁ జాలునని భ్రమింతురా ? చూడఁబోయిన బదునెనిమిది వర్ణనలుండిన నెవరికిcబ్రీతి ; లెకున్న నెవరికి నష్టము ! వర్ణనమలకన్న ముఖ్యమైన విషమేద నఁగాకావ్యము నందలి యCగాంగములకుం గల కలయిక . పొత్తపాసఁగని వర్ణనలు రసమునకుం బ్రతికూలములు . సంగీత మెపుడును హృద్యము, పాట పాడు వా (డు, మృదంగమువాఁడు, పిడేలు వాఁడు గలసినట్లు వర్తించిననా దాని సొంపు, అట్లుగాక ప్రతివాఁడును ఇష్టము వచినట్లే దన యావచ్ఛక్తి నక్కడనే వినియోగింప యత్నించిననా తనంతట ప్రత్యేకముగ వాయింపఁబడు నప్పడెంతయో మనోహర ముగ నుండు మద్దెల మెట్టు సందర్భశుద్ధిని మీఱి వెలయింపఁ బడిన చోc జెడ్డ రోఁతగ నుండుననుట కేమి సందేహము ! అట్లె పురపుష్పలావికల వర్ణనములు వ్యష్టిని జూచిన నెంత బాగుగ నున్న నేమి ! సమష్టితో సంబంధములేని కూఁతగానున్న నవి దుష్టములే. స్త్రీపురుషుల యాకార సౌందర్యములు నిట్టులే. అంగము లన్నియు వేఇు వేఇుగా శస్త్ర వైద్యశాలలో బలె విభజింపఁబడి యుండినచో వానిని గన్నెత్తిచూడ సుకుమార మా నసులకు నౌ నా ? మఱి చెలువంపు దనమునకు జీవనమైన లక్షణము అంగముల సాంగత్యము. లోకములో నుండు వర్ణనీయాంశముల నన్నింటిని నొకచోటఁ బ్రోగుచేసియుంచిన నది సర్వవికారముల కాస్పదమైన కుప్పయగును ! సీతమ్మకు ముక్కు సొగసు , రుక్మిణమ్మకు కన్నులు సొగసు , కావున నీ యమ్మ ముక్కును ఆ యమ్మ కన్నులను దీసి బ్రహ్మదేవుఁడు వేణోక పెద్దమ్మను సృజించెను కావున నీ మూఁడవ యమ్మ సీతారుక్మిణులకన్న రెండింతలు 40 -- కవిత్వతత్త్వ విచారము
సొగసుకత్తెయని వ్రాయువారికి శిల్పముయొక్క తెఱంగను వాసన యేమాత్రమైనఁ దె లియునని వచింపనౌనా ? సీతమ్మ ముక్కు సొగసన్న నర్థమేమి ? సీతమ్మయొక్క ముఖము మొదలగు నవయవములతోఁ జేరిక కల్గియుండుటచే, ననఁ గా "నా స్త్రీయొక్క యాకారముం బట్టి, యది చక్కనిదనుటగాని, యా ముక్కును గోసికొనిపోయి యింకొకచో నుంచినను నదేరీతి సొగసుగానుండునని యర్థము కాదు.
“తమ తమ నెలవులఁ దప్పినఁ
దమ సాగనులె రోఁతలగుట తత్ద్యము సుమతీ !
కావున నంగీకారములేని వర్ణనలు ప్రత్యేకముగ నెంత యద్భుతములుగా నున్నను నింద్యములే. కథయను నిండుటా కృతిని దీర్పఁజాలని కవి యంగములవంటి వర్ణనములఁ దీర్ప నేర్చుననుట పిచ్చికూఁత. కావున విమర్శనముఁ జేయుటలో కథ, పాత్రములు, ప్రకృతి విశేషములు, వర్ణనములు ఇవన్నియుఁ బర స్పరమైత్రికలిగి విఱుపులులేని యే కాకృతిగా నున్నవాయను విచా రణ ప్రధానతమమని నా మనవి. కథయొక్క గమనమునకు విరోధ మైన దీర్ఘ వర్ణనముంజేయుట రసవిహీనభావమున కొక గుఱుతు. భారత రామాయణ హరివంశాదులలో నీలో పము లేశమాత్రము గానము. ఇప్ప డిట వివరింపఁబడిన న్యాయము గోప్యముగాదు. చదువరులెల్ల నెఱి గినదే. స్వబావవర్లన యనుటకు నిర్వచనము పకృతిసమ్మతమైన వర్ణనము అనుమాటకు నిర్వచనము ఉన్నది యున్నట్టు చెప్పుటగాదు. ఏలన గవర్నమెంటువారి గెజట్టులో జరిగినవి జరిగినట్టు వృత్తాంతములు ప్రకటింపంబడును. అది కారణముగ నా వ్రాఁతలు స్వభావో క్త్యలంకారమునకు దృష్టాంత ములని యెవ్వఁడుఁ బేర్కొనఁడు. వస్తువుల నిజస్థితి నిర్దేశించుట శాస్త్రముల యీప్సితము. కళ యొక్క కాంక్ష యది గాదు. ఎట్లన, కళలలో ప్రధానమైన పురుషార్థము రసము. రసము భావమునకు సంబంధించినది. భావము ఆ పరమైన దృష్టితోగణించి వర్ణించు టయే కళ యందు శ్లాఘనీయమైన పద్ధతి. భావముతోఁ జూచుటకును భావము లేక చూచుటకును నెంతో భేదము. ఉదాహరణము : సుందరియగు నారీమణినిజూచి యువ్విళ్ళూరు వానికి నా మె సాగసు ప్రథమ భాగము 41 నిమిష నిమిషమునను వృద్ధిబొందునట్లు దోఁచుచుండును. వీనికిని ఆవేషము వృద్ధిబొందుట తప్పదు. "రాజు మెచ్చినదే రంభ" అనగా ననురాగముండు నేని ఎవరిమీఁద నాయను రాగము వ్యాపిం చునో వారు, తదితరుల కెంత కురూపులుఁగ గానవచ్చినను, వానికి మనోహరమూర్తులుగఁ గానుపింతురు. అట్లగుట యెంతయు మేలు. ప్రతివాఁడును మోహముకొలఁది సర్వోత్కృఘ్టరాలని భ్రమించి యెవతెనో యొక స్త్రీని వశ్యముచేసికొనఁ జూచుట యీ న్యాయము యొక్క మాహాత్మ్యమే. ఈ ధర్మము, మనుష్య ప్రకృతిని బాలించు చుండదేని, నిర్భావముగానే పక్షపాతము లేక యెల్లరు నే స్త్రీని నుత్తమురాలని నిర్ణయింతురో దానినే యందఱు వలచి సుందోప సుందులట్లధోగతిం జెంది యుందురేమో ! భావముల యొక్క దృష్టికిని ఆలోచనా శక్తి యొక్క దృష్టికిని ముఖ్యమైన భేద మేమనగా ; యోజనా శక్తిం బట్టి నిరూపించితిమేని సత్యమొక్క టియే. అనగా సిద్ధాంతీకరింపఁడిన తత్త్వము సర్వజనులచే సరియని యొవ్పకొనఁబడియే తీరవలయును. దృష్టాంతము గణితశాస్త్రము. ఏడును పదితో గుణించిన డెబ్బది యగుననుట నిర్వివాదము. ఎవండైనను నాకీమాట రుచింపదని యనినచో వానిని బిచ్చివాఁడందుము. కాని గోచరములయెడ భిన్నభావము లున్న నది పకృతి విరుద్ధమని యెవరుఁ జెప్పరు. కావుననే "లోకోభిన్నరుచి" యనుసామెత. "ఎట్టి సౌందర్యవతియైన నేమి? లోకములోని వారెల్ల నా మెయందే బద్ధ మోహులు గావలెను . ಅట్లు చేయనివారిని బిచ్చి యాసుపత్రికిఁ బంపక తప్పదు " అని సిద్ధాం తముఁ జేయc బిచ్చివాఁడు దక్క నింకెవఁడైనఁ గడంగునా? కావున శాస్త్రములలో నేక కంఠముగా నెల్లరును ఇది సత్యము తక్కినవి మిథ్యలు, అని స్థిరీకరించునట్లు కళలలో c జేయఁజూచిన రసా భాసము నిత్యము. ఒకేవస్తువు మానవుల ప్రకృతులంబట్టి యనేకు లకు ననేక భావముల కాస్పదముగావచ్చును. మఱియు భావము లంబట్టి కొంతవఱకును రూపమేర్పడును, గాన ననేక రూపములం దాల్చినదియు నగును. నానారూపమునం జెందియుండుట యొక్క భగవంతునికే చెల్లిన భాగ్యముగాదు. అతని సంతతివారముగాన మనకును నందు భాగముగలదు. భారతములోని దుర్యోధనునిఁ గూర్చి విచారింపుఁడు. ధృతరాష్ట్రుడు, అనుజులు, సచివులైన కర్ణాదులు, ప్రజలు, పాండవులు మొదలగు వివిధపక్షములవారిలో నొక్కక్కరి కొక్కొక్క యువతారముగ నాతఁడు దోcచలేదా. (6) 42 కవిత్ర్వతత్త్వ విచారము
ఒకరికిఁదోఁచినట్లు వేరొకరిక్రిఁ దోcచెనా ? ఒకరి కనులతో నింకొకరు చూచు టెట్లు ? చూడంబోయిన వస్తువొక కేుయైనను మూర్తులనేకము లనుట కతఁడును సాక్షిభూతుఁడే. ఇంతే కాదు. తాను గొప్పగా నున్నపు డశ్వత్థామకు దుర్యోధను పైని గౌరవముండెనేమి ? గోగ్రహణ సమయమున నతనిని ధిక్కరించినట్టి సాహసుఁడు. అట్లుండియు నా రాజరాజునకు కష్టములు ప్రాప్తించినది మొదలు ఆతని యెడ సేవాధర్మము నిర్వర్తింపవలయునను శ్రద్ధయే కాదు, నిజమైన భక్తియుc బ్రీతియు బుష్కలముగఁ దాల్చినవాఁడాయెను. తుదకు నమ్మహనీయుఁడు తొడలు విఱిగి పడియున్నపుడు, అతని పాటునకు నెరియు మనమ్ముతో నాగురుపుత్రుఁడు విలాపించిన విధము వినుండు. ఉ. పాండవులట్లు మజ్జనకుఁ బాపవిధిండెగఁ జూచునప్పడున్ జండతరప్రకోపము నసహ్యపుశోకము నిటు చిత్తమొం డొండఁగలంపవే నిపుడయొక్కఁడు దక్కకయుండ వారి ను ద్దండమదస్త్రవహ్నిఁ బరిదగ్ధులఁ జేయక యెట్టులుండుదున్ ! (శల్య. ద్వి, 411 ప.) చ. దురమునఁబెంప చేవయును దుర్దమలీల వెలుంగుచుండ సు స్థిరత శమంతపంచక విశిష్టతలంబునఁ బోరి సద్గతిం బొరసెడు, నీకునై వగవు పట్టదు, బంధులు రాజు దేవులున్ దిరియుదు రింక, వారిదగుదీనతకోర్వమి కుమ్మలించెదన్ (సౌప్తి, ప్రథ. 217 ప) ఉ. సీరియనారతంబుఁ దన శిష్యులలోపల నెల్లనిన్ను దు ర్వారపరాక్రమాఢ్యుఁడని వర్ణనసేయుట గేలిసేసి ; యా మారుతికిం జయంబొనఁగె మూల విధాతృడు ! వాని గెల్పుకో లేరికి సమ్మతంబగునె యిట్టిది ! దీనను బెంపు గల్గునే? 218 చ. కురువర ! నీమగంటిమియు ? గోల్లలయున్ బలముంజలంబు దు స్తరగతిఁబేర్చి భీమునకుఁ జావక పోవఁగరానియట్టిదై, నరుబెదరించి కేశవుమనంబు గలంచి, యధర్మవృత్తికిం జొరుఁడనిపంచె, దీనిదివిజుల్ గని రింకిట వేయునేటికిన్! 219
ఉ. ధర్మముమాని యూరులు గదంబొడిసేసినయంతఁబోక దు
ష్కర్ముఁడు వాయుజుండెడమకాల శిరంబటు దన్నెఁ! జూచి యా
ధర్మనుతుండు శాస్తిఁదగ దానికిఁజేయఁడ ! యాతఁడెఫ్టనం
తర్మదదుష్టుఁ డీగెలుపు దైన్యము సేయదె కీర్తిమాయదే? 220 ప్రథమ భాగము 43
చ. కుడువఁగఁగట్ట బంధులకుఁ గోటివిధంబుల బెట్టజన్నము
ల్నడుప ననేకధర్మ విధులం బొగడొందఁగఁ జాలునట్టి యె
క్కుడుసిరియిచ్చి పేర్మినొక కొండగమన్చిన నీవు సావఁగా,
నొడలిటులో మితిం గురుకులోత్తమ ? యేనొక సేవకుండనే ? 222
కావున వస్తువుల నేకుల కనేక రీతులఁ దోcచుననుమాయ యొకటి మాత్రమే కాదు, ఒక్కనికే కాలదేశ వర్తమానంబులం బట్టి యు నేక విధములఁ దోcచుటయును స్వభావ ప్రభావమే . ఇక్ష డ ఒక్కC డంటిమి. వాఁడుమాత్రము వికార రహితుcడా ? కాcడు మఱి మాఱుచుండు వాఁడే కావున భావంబులు ప్రసిద్ధి గనుండు నీ లో క్రము లో నానావ తార సిద్ధియు విశ్వరూప ప్రదర్శన శక్తియు సర్వ వస్తువులకు సామాన్యములు సహజములునైన లక్షణములు.
ఆలోచన శక్తిచే నుత్పాదితములైన శాస్త్రముల యొక్కయు భావ బంధురములైన శిల్పముల యొక్కయు దృప్పలు వేఱు. గోచరించు పదార్ధముల తిరులును వేఱు . కావున నే శిల్పములు రచించుటలో స్వప్రతిభ ప్రకారము పో వలయు నే గాని యలంకార శాస్త్రజ్ఞులు , ప్రాచీనకవులు వీరిని ననుకరించుచు ప్రతికల్పనలం జేయఁజూచుట పాసఁగరాని మతమని మున్నే చెప్పబడియుంట ఏలకో మనకవు లీనాఁటికిని రుక్మిణీ పరిణయములు సుభద్రాపరి ణయములు వ్రాయుచుండుట . పాపము పెండ్లాడి పెండ్లాడి వార లలసి సొలసి విసుగెత్తియున్నారు . వారికి (పించన్ ) విశ్రాంతి ప్రతిపాదింపకున్న నెంతయు ఫెూరము. శాస్త్రములలో నొకఁడు వ్రాసిన సిద్ధాంతముల నితరులును గ్రహించి ప్రచురింప వచ్చును. అది పునరుక్తి దోషంబు గాదు . కళలలో నుపజ్ఞలేనిది స్వారస్య ముండదు . భావముల ననుసరించి యాకృతులు వివిధభంగు లC దోcచుననుట స్ఫుటముగదా ! అనఁగా శిల్పులచే నారాధింపఁబడు సిద్ధియేదన నున్నది యున్నట్టు ప్రదర్శించుట గాదు. మఱి కన్నది కన్నట్టు ప్రదర్శించుట . ఉన్నది యున్నట్టు , అనఁ గా వస్తుస్వభావ మేర్పడియున్న భంగియనుట . ఇcక కన్నది కన్నట్టన్ననో , మన భావముచే దాని స్వభావము చెందిన వికారముల ప్రకారము అనుట . అనc గా నిరవధికస్థితిగాదు . మఱి భావమును అవధిచే నిర్ధారితమైన స్థితి.”
- తత్వజ్ఞలనేకులు భావాతీతమైనస్థితియుండియు లేనట్లే గాన మిథ్యయని
వక్కాణించెదరు. నిజస్థితియనునది వస్తువుయొక్కయు మనుజులయొక్కయు ప్రకృతులు రెంటిచేతను నిర్ధారితము. o 44 కవిత్వతత్త్వ విచారము
ఈ రెండు స్థితులకుఁగల భేదము వస్తువు దనంతట నెన్ని గుణములc దాల్చినదో యెవరు నెఱుఁగరు. లెక్కకు వచ్చునవి గోచరములు మాత్రమే. అగోచరము లుండినను నుండవచ్చును. మఱియు గోచరము లన్నియు వస్తువును జూచినపుడెల్ల మనకు స్ఫురించుటలేదు. ఏలయని యడిగితిరేని, ఏ భావము మనస్సున నుచ్చస్థానము నధిష్ఠించి యుండునో యా భావమునకు సమ్మత ములు, రుచికరములు, చింత్యములునైన గుణములు మాత్రము మిక్కిలి ప్రకాశమానములుగ నగపడును. తక్కినవి ముసురు గ్రమ్మినట్లు వెనుకcబడినవో యను గతి దూరస్థములైనవా యును మాడ్కిని స్ఫుటములుగా నుండవు. మఱి మా cగువాఱిన యవిగానో, ఆ సమయమున నేమాత్ర మెఱుకకు రానివిగానో యుండును. కారణమేమన, అప్పుడు వానిపై దృష్టినిలుపుట యగత్యముఁగాదు. సహజమును గాదు. దృష్టివేనిపైఁ బాఱునో యవి ముందువచ్చి సమీపమున నిలిచినట్లు విశదములుగ నుండును. పరిసరముల నుండినవి యస్పష్టములు. దూరముగ నుండునవి యప్పటికి నగోచరములు. ఆ భావము పోయి వేఱొక భావము మనస్సు నాక్రమించెనేని మునుపు తేజోవంతములుగా నుండిన భాగము లంతర్ధానమై, యప్పుడు గ్రహణము సోఁకినట్లు మఱుఁగుపడి యుండిన భాగములు ప్రజ్వలితమైన యుదయమం దాల్చినవి యగును. ఇందులకు వేఱు దృష్టాంతములేల ? చూడుcడు. కోపముగా నున్నప్పు డెదుటివాని దుర్గుణముల మీఁదనే యవధా నము స్థిరముగా వ్రాలును. శాంతముగ నున్న వేళ * వాని సుగుణ దుర్గుణముల రెంటిని గమనించి యూలోచనతో మంచివాఁడా చెడ్డవాఁడా యని నిర్ణయింతుము. మహానంద కాలములో నేర మొనర్చినవానిం జూచినను " ఏమో పాపము : కడుపాత్రమై దొంగి లించినాఁడు. ఇదియు నొక ప్రమాదమా ?" యని పరుషములకు సరళము లాదేశమగునట్లు చేయుదుము. భావమును బ్రేరేపింపఁ జేసినవారిమీఁదనే కాదు, తదితరులమీఁద సైత మారాగసహితమగు చూపు పోకమానదు. భార్యతోఁ గలహించిన వాఁడా మెమీcద మాత్రమే గుఱ్ఱని యుండునా ? మఱి చూచినవారినెల్లఁ గఱప
- ఆలోచనాశక్తికి శాంతము మొత్తముమీఁద సహాయకారి. భావములు గొంతవఱకు విరుద్ధములు. శమదమాదిస త్త్వగుణములు పట్టువడినయెడల కైవల్య ప్రాప్తి యెట్లోగాని కవితాప్రాప్తి నిండుసున్న, రాజనతామసగుణములు కవితయను మందాకినీమనోహరప్రవాహమునకు జన్మస్థానములైన మహెూనృతభావములు. ప్రథమ భాగము 45
బోవుట పరమరహస్యమా ? కావుననే కదా విద్యార్థు లెల్లరుఁ బరీక్షకులకును వారి పెండ్లాలకును మనసులు గల పి చల్లగ నుండ వలెనని విఘ్నేశ్వరునకు టెంకాయలు గొట్టుట !
సర్వలక్షణస మేతములుగా వస్తువుల నిర్దేశించుట తప్పు
ఈ మనశ్శాస్త్ర తత్త్వము యొక్క యూదేశ మేమనఁగా , ఎట్టి సమ యములందును వస్తువుల సర్వసులక్షణములను వర్ణించుట గొప్ప యువ లక్షణము . మఱి భావముల ప్రసిద్ధి ననుసరించి విక్షేపముం దాల్చిన గుణముల నధికముగను , సంక్షేపము బూనినవానిని కొలఁది గను వర్ణించి, నిక్షిప్తములైనవానిం బేర్కొనక విడుచుటయు క్రళ ద్రు శ్లోభ . నిర్భావముగ వ్రాయుశాస్త్రకారుం డే విషయమును విడువక సమగ్రముగ వస్తుస్వరూపము నిర్దేశించెనేని వానికది చెల్లినవిధమే. ఎందుకన , వానియుద్ధేశము వేఱు . నిజస్థితిని నిరూపించుట వాని కర్మము . కవిపని యదిగాదు. మఱి భావము లను వికాసమునకుం దెచ్చుట . దృష్టాంతము : వైద్యశాస్త్రము నభ్యసించువాఁడు మనుష్యుల దేహములోని ప్రతి సూక్ష్మవిషయ మును గ్రహింపఁగోరి సాంగోపాంగముగ లోపలివానిని పైవానిని సర్వమును బరీక్షించును . ఈ రీతినే మోహముచే నంధుఁడో , అర్ధాక్షియో , యే కాక్షియోరైన నాయకుఁడు తన నాయికను జూచె నేని యీ సూక్ష్మములపై నతనికి మనసు పోవునా ? పోవచ్చునా ? అవి కంటఁడు నా ? పడవచ్చునా ? యోజింపుఁడు ! యో జింపుఁ డనుట నా తప్ప ! దీర్ధాలోచనలేక యీ సంగతి నెఱుంగ నేరరను అనుమానమున్న మీరు మనుష్యులా కారా యను ననుమాన ముండక తీఱదుగదా ! యోచన యేల ? ఇది స్వతస్సిద్ధమైన భావము . రసికుల కెల్లరకు సామాన్యము . ఆది లేనివాఁడు శుద్ధ మృగమో జడుఁడో ! కొన్ని శృంగార కావ్యములలో నాయకులు నాయికలను బాగుగ విమర్శించి సాంగోపాంగముగ సంస్మరణ చేయుట గలదు . ಅಲ್ಲು చేయుట యూ నాయికలను డాక్టర్ల దృష్టితో జూచినట్లు అనఁగా శవ సమానముగ జూచినట్లనుట ! కావున గద్యమైననుసరే పద్యమైననుసరే , కావ్యముల వర్ణింపఁదగినవి భావోదయము చేఁ బ్రకాశమునకు వచ్చు వస్తువుల కొన్ని కొన్ని రేఖలు , కళలు , పక్షములు మాత్రమే సర్వాంగ వర్ణనము భావభావనాశక్తులు సంపూర్ణముగ నింకిపోయిన పండిత మాత్రులు ప్రకృతిశాస్త్రజ్ఞుల యట్టు ఆలోచనాబలేముచే సాధించెడు 46 కవిత్వతత్త్వ విచారము
నసహ్యము ? భావములన్నియు నేక కాలమున నుజ్జ్వలములుగావు . కావున నన్ని లక్షణములును ఏక్షణముననైన భావపరమైన చింతతోఁ జూచువారికిఁ గానబడవు . కళలయందు సర్వపదార్థము లకును పార్శ్వగ్రహణము నిత్యము ! అట్లగుటఁ బ్రత్యకమైన రేఖలమాత్రము వివరించుట భావస్వభావములకు విరుద్ధములు . రసమునకు నా భాసకరములు.
భావనాశక్తియొక్క లీలలు
కవితయోుక్క రూపు నెఱుంగఁ గోరిన మనసు యొక్క రూపము నెఱుంగవలయుగదా ! ఆత్మజ్ఞానము సంపూర్ణముగ నెవరికి నలవడఁ గలదు ! అందును నావంటి పామరున కేమి తెలియును ? ఏదో యొండు రెండు ముక్కలు విన్నవింప సాహసించితిని , కాని యీ సాహసము నెఱవేఱినదని నా కేమాత్రము నమ్మిక లేదు . ఇఁక భావనాశక్తి యొక్క తెఅంగన్ననో మనః ప్రకృతుల కన్ని టికన్నను గోప్యమైనది . దాని చర్యలను గణింపనే కాదన్న నిఁక నిరూపించు టెట్లు ? అయినను గొన్నింటి నాజ్ఞయైన మనవి సేసెద. భావములతో సాంగత్యమం దాల్చినది గదా భావనాశక్తి . ఇఁక భావముల సంఖ్యములు . కావటం జేసి వానిని రంజింపఁజేయు భంగులును అసంఖ్యములే . కొన్నియెడల సూర్యోదయాది చిత్రములఁ దద్రూప ముగ వర్ణించిన సొగసు . స్త్రీపురుషుల మేయమైన దుఃఖమో సుఖమో దాల్చిన కాలములోఁ దగుమూత్ర ముత్ ప్రేక్షించినం జాలును . కథ వేగముగ నడువవలసిన చోట నలంకారముల గుప్తములఁజేసిన నింపు . కవియే ముందునకువచ్చి చెప్పెడు చోట్ల మితముగఁ గొన్నియున్న దోషములేదు . మఱియు గొన్ని యెడల బ్రకృతికి మీఱిన వర్ణనములం జొనిపి నను వికారము దో (ప కుండుటయేకాదు , అస్వాభావికమనియు సామాన్యముగ నెవరికిఁ దట్టవు . ఉదాహరణము. హితోపదేశము . ఈ గ్రంథమున ఎలుకలు పిల్లులు కాకులు నక్కలు మొదలైన తిర్యగ్డంతువులు మనుష్య భాషణము వలె వర్ణముల మాటలాడుటయు కాక , నీతివిధానము విప్పిచూపుటలో విదురుని యన్నలు గానున్నవి . ఇది ప్రకృతికి విరోధమని కొందఱు భ్రమించుట సహజమే . ఈ విచారముతో నిపుడేమి పనిగాని , ಯುಲ್ಲು విపరీతవృత్తులతో నిండియుండినను ఆ గ్రంథము ఒక దేశము ఒక కాలము నను మితము అడ్డును లేక యన్ని దేశములవారికి నన్ని వయసులవారికిని నిత్యహర్షముగా ప్రథమ భాగము 47
నున్నదనుట యందఱకుఁ దెలిసిన సంగతియ. ఈ గ్రంథములోని కథలు హిందూ దేశము నుండి పారసీకమున కాక్రమించి, యక్కడ నుండి ఇటాలియా మొదలైన యూరోపు ఖండములోని దేశములం దంతటను నాలుగువందల యేండ్ల క్రిందటనే వ్యాపించినందున నవి పారంపర్యముగ నాయా జాతులవారిలోఁ బ్రచారముననుండు గాథ లంబోలె సర్వసాధారణములైనవి. చరిత్రజ్ఞానములేని పాము రులు పరభాషనుండి దిగుమతియైన సారమనియైన నెన్నక తమ స్వభాషయందే యావిర్భవించినదనియు నెంచుటం దలపోసితిరేనిఁ మనవలె జాతి మత వర్ణాదుల వ్యత్యాసముక తన పూజ్యుఁడైన మనువు యొక్క సంతతివారో కారోయను సంశయమునకుఁ బాత్రు లైన విదేశీయులచేతను, నీ గ్రంథ మెంత గాఢముగ స్వీకరింపబడిన దనుట విశదమవును. ఇట్లు లోకులెల్లరచేఁ బ్రీతితోను శ్లాఘముగాను జూడఁబడిన కావ్యము భావనాశక్తి విరహితమని కాని, తప్ప ద్రోవల బోయినదని కాని చెప్పవలనుపడునా? మఱియు నీ గ్రంథము నిరుపమానము గాదు . ఇట్టివి యింకను ననేకములు సమస్తదేశ ముల భాష లందు ను గలవు. మనదేశములోనే యీ హితోపదేశము నకు నెన్నియో మడుంగులు మిన్న యనందగు బృహత్కథ* యుండలేదా? భారత, భాగవత, రామాయణాtదులలోను మృగ పక్షి వితానములు దేవ మనుష్య భావములం దాల్చినవి గావా ? మఱియు, అస్త్రములు, కామరూపధారణము, భూత భేతాళ వశీ కరణము, ఇత్యాది మహేంద్రజాలములు పుంఖాను పుంఖములుగ గ్రంథములనే కాదు తరతరములుగ తల్లి బిడ్డలు చెప్పకొనెడు ఊcకుడు కథలందు ను గానబcడియో డి. శుద్ధముగఁ బ్రకృతి విరుద్ధములై యున్నయెడల వీనికిట్టి వ్యాప్తి సేకూరియుండదు . నిర్లేతుక జాయమానసిదులు ప్రపంచ వ్యవహారములలో న హి ! అట్లగుటc గారణము విచార్యము. చూడుడు. చిన్న చిన్న బిడ్డలు, చీమలు, కుక్కలు, చిలుకలు, పిల్లులు మొదలగు హీనజాతి జంతువులకు సైతము నరత్వ మూరోపించి మూటలాడఁగోరుట, కోపించుట, స్నేహించుట మొుద చేష్టల నొకరు చెప్పక చూపకయు తమంత నవలoబించుట
- బ్ర. శ్రీ వేదము వేంకటరాయశాస్త్రిగారు దీనిని మిగులఁ జక్కని వచన శైలి నాంద్రీకరించియున్నారు.
రామాయణములో నిది మితిమీఱినదని కొందఱ తీర్మానము. 48 కవిత్వతత్త్వ విచారము
సహజ మేగదా ! ఇం దస్వాభావిక మేమైన నున్నదా ? మఱియు, బాల్యదశయందు లోకానుభవము వస్తు పరిచయమును దక్షువగాన, నీ కాలమున సామాన్యములని మన మశ్రద్ధతోఁ జూచున విగూడ, ි ෆෂි యద్భుతము ಲಲ್ಲಿು గాను పించు నను టయు నెల్లరకు విదితమే . అగ్గిపుల్లను గీచిన నది మండు ననుట మనకొక వింతయూ ? బిడ్డలకన్ననో యదియొక విస్మయము పుట్టించెడు మాయ: యక్షిణి! కాబట్టి పుల్లల పెు దొరికినంజాలును. మఱుఁగు నఁ గొనిపోయి గీయుట, వెలుతురు పుట్టఁగ నే నవ్వట, చేతులు దట్టఁబోయి క్రిందికి జాఱవిడుచుట! ಇಲ್ಲು నానారీతుల నాశ్చర్యమునం దాసక్తి గనుచున్నారుగదా ! ప్రకృతిం గూర్చిన జ్ఞానము లేని వారికి నిది సామాన్యము, ఇది యపురూపము, ఇది దైనందినవృత్తము, ఇది యద్భుతము అని నిర్ణయించు వివేకము సున్న. అట్టివారికి స్వాభావికము అస్వాభావికము అను తారతమ్య మేర్పడదు గాన, సామాన్యముల నద్భుతములుగను, అద్భుతముల సామాన్యములు గను బరిగణించుట సహజము. ఈ బాల్యచాపల్యము వయసు బుద్ధియు వచ్చిన మనలో నడఁగి మాయమై యున్నను బొత్తగ నశించినదిగాదు. ఒక్కొక్కప్ప డా భావము మనల నా వేశించును. అట్టి తరుణములఁ దదుచితమైన చేష్టలకు మనమును బ్రారంభించి పిల్లలరీతి నాడుకొందు ము. కట్టుఁగతల వినఁ గోరు దుము. లేనిపోని యద్భుతముల నెవఁడైన ' నేను గాశిలో C జూచితిని. ఉత్తరకురు దేశములోని మహాత్ములయెడఁ గనుఁగొంటిని" అని చెప్పిన నెంతో నమ్మికతోను ఆనందముతోను ఊపిరి విడువక విందుము. కావున మనసు నకు నాయూ భావముల యూదేశముచొప్పన సత్యమను భ్రమను గలిగించినఁ జాలు. భావనాశక్తి కృతకృత్యమే. నీతి చంద్రికను (అందును జిన్నయసూరిగారిది) చదువునప్పడు అదేదో యోక లోకమైనట్టును, అందు పావురము లు కాకులును గాట్లాడుట మాని మాట్లాడుట సామాన్యమయిన విషయమైనట్లును మనకు c దోఁచుననుటకు ప్రత్యక్షానుభవమే తార్కాణ. ఇళ్లే పది తలల రావణుఁడు, మూఁడు తలల త్రిశిరుఁడు, ఖరు (డు, మహిషుఁడు, జాంబవంతు cడు, హనుమాను డు, వేయి కన్నుల యింద్రుడు మొదలగు పురాణ పురుషులును, విపరీతములు సైతము సత్యము లను భ్రమఁ గల్పించు నాధారము లెవ్వి యనంగా : (i) ఇప్పటి కాల దేశములకు సంబంధము లేనంత దవ్వులైన యుగములలోనో లోక్షములలో నో అట్టి కథలు నడిచినట్లు ವೆ ಏy೬ು. ಅట్లు చేసిన ప్రథమ భాగము 49
మనకు బ్రసిద్ధములగు హేతువులంబట్టి సత్యా సత్య నిర్ణయము కేయఁబూనము. (ii) ఇట్టి ప్రకృత్యతీతముల వర్ణించుచో నున్న ుండి యూధునికములు సామాన్యములు నైన సంగతులను వేయు గూడదు. వేసిన జాలమునకు భంగము. ఆ మాయను స్థిరముగఁ దోషించునట్టి వర్తమానములఁ బొందించుచు నేక ధోరణి నే యేగుట యుత్తమము . కళా రచనలో గమనింపవలసిన విషయ మేమన, రసా బాస మే మాత్రము గలుగనంత పొందిక యున్నదా లేదా యును ట. విషయము ప్రకృత్యతీతమైన నేమి, ప్రకృత్యధీనమైన నేమి ? విషయము కన్న రీతి శిల్పములం బ్రధానము. కావున లోకుల కెల్లరకు రుచ్యములు గానుండు భారతాది వీర కావ్యములయందును, కథాసరిత్సాగరము మొదలైన వినోద కథల యందును గల ప్రకృతిని మీరిన వర్ణనలకు నాధారభూతమైన భావనాశక్తి గణనీయము గాదనుట తప్ప. మఱి యయ్యది యు మనుష్యుల యందు అనశ్వరముగ నుండు నే వో కొన్ని భావములకు సహజముగ ననుకూలములైన ప్రకారముల వర్తించునదియ యనుట యొుప్ప. అట్లుగా దేని నా కథల యందు. మన కెడతెగని మక్కువ యుండు టేల ? ఈ కాలమున బిడ్డలెట్లో పూర్వకాలమునఁ బెద్దలునట్లే. అనగా ప్రకృతిజ్ఞానమంతగా లేనివారనుట. ఇది యొగదా ప్రాచీన గ్రంథ గాథా పురాణము ల లో మన నమ్మికకు నందని యద్భుతములు విస్తార ముగఁ జెప్పఁబడి యుండుటకు మూలము! ఆ పురాణ కవులకు నవి యస్వాభావికములుగఁ దోcచియుండవు గాఁ బోలు! వారు ఘనమైన నమ్మకము విశ్వాసమునుంచి వ్రాసిరి. కావున నే మనకును నవిశ్వా సము అంతగాఁ బుట్టకుండుట. ఇప్పటివా రారీతి వ్రాయcజూచిరేని యసాధ్యమని చెప్పఁగాదు గాని యెంతో శిల్ప నైపుణ్యము లేనిది యవి కృత్రిమములుగా దోcచుఁ గాని నిక్కములట్లు భ్రమగొల్పఁ జాలవు. కావున నాటకములలోను గావ్యములలోను నాగాస్త్రము గారుడా స్త్రమును బ్రయోగింపఁకుండుటయు మొత్తము మీద సుగు ణము. అట్లుగాదని వాని నా వాహనము జేయువారు వానితో నాగ్నే యూ స్త్రమును రప్పించి గ్రంథమంతయు నా హుతి గా నిచ్చినయెడ లోకము నకెంతే ను పకారము చేసినవారగుదురు !
- స్వభావా తిక్రాంతవిషయములఁ గూర్చి సత్యతాభ్రమ సిద్ధించినట్టు వ్రాయం జాలు పాశ్చాత్యకవు లిపుడుఁ గొందఱున్నారు. ఆంధ్రమున నీ ప్రతిభగలవారున్నా రేమో గాని నే నెఱుంగను, వీరేశలింగంగారు దప్ప.
(7) 50 కవిత్వతత్త్వ విచారము
ఎఱ్రాప్రెగ్గడ రచించిన
ఉ. “అంబ నవాంబుజోజ్జ్వల కరాంబుజ శారదచంద్రద్రచంద్రికా
డంబరచారుమూర్తి ప్రకటస్పుటభూషణ రత్నరోచిరా
చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్ష వివిక్త నిజప్రభావ “భా
వాంబర వీధివిశ్రుతవిహార" ననుం దయఁజూడు భారతీ !”
యును సరస్వతీస్తవమున కవితాధిదేవతం గూర్చిన " భావాంబర వీధివి శ్రుతవిహార" యను సంబోధన మెంతసత్యము ! మఱియు గంభీరము
భావనాశక్తి యనేక మాయలం బన్ను లీలా వినోదిని. ఈ మాయల కన్నిఁటికి సామాన్యలక్షణ మొక్కటియే. ఏ రసము నుత్పాదింపఁ జూచునో దానిని కవియే మనఃపూర్ణముగ దాల్చినఁ గాని చదువరులయందు అభిమతమగు చిత్తవిభ్రమము గలుగ నేరదు. భావము లనంతములు న గాధములుగా C బ్ర భవిల్లినఁ గవియు నమోఘుc డగును.కవిత యొక్క గుణదోష నిర్ణయమం గూర్చిన యాధార తత్త్వముల( గొన్నింటిని నివేదింప సాహసించితి. మన్నింతురు గాక ! గ్రంథ వైపుల్యమునకుం జడిసినవాడనై దృష్టాంతములఁ దఱుచుగా బొందింప నైతి. క్షమింపుడు! ఈ వాఖ్యానమునం దేలిన యంశములు:
(i) అంతా కవులము గామా
యంతంతగఁ గందపద్య మల్లఁగలేమా ?”
యని భాష మొదలగు వానిని మాత్రము కృషి చేయుటచేఁ గవు లగుదుమనుట బొంకు. (ii) శైలి భావ ప్రకాశకము. శైలి, భావము ఇవి వియోగములేని ద్వంద్వంబులు. (iii) అట్లగుట ప్రాచీనకవులు ఆలం కారికులు మొదలగువారు చూపిన జాడల ఉచితముగ నుపయోగించిన మేలు చేయునవియే యైనను, అవియే సంపూర్ణ శరణ్యములని యెంచి యా మార్గములను మీఱి యొక యడుగైనఁ బెట్టగూడదనుట కవితాశక్తికి భయంకరమైన యూహ. (iv) ఆది కవులు భాషాంతరీకరణముఁ జేసినవారు గావున నపూర్వ రచనా సామర్థ్యము వీరి కున్నదో లేదో తెలియదు. అనగా వీరి కుపజ్ఞ యే మాత్ర మున్నదనుట వివాదాంశమే మో ! అయినను మీఁద వివ రింపబడిన గుణములఁబట్టిచూడ కవుల లక్షణములు పెక్కులు వీరియందున్నవనుట స్పష్టము. అందును దిక్కన మహాకవి యొక్క ప్రభావము అజేయంబు. అద్వితీయంబు !