కవిత్వతత్త్వ విచారము/పీఠిక

వికీసోర్స్ నుండి


పీఠిక

ఈ కవిత్వతత్త్వవిచార మాంధ్రలోకమునకుఁ జిరపరిచితము గాని క్రొత్తది కాదు. ఆంగ్లవాజ్మయకోవిదులును సుప్రసిద్ధులునగు శ్రీయుత కట్టమంచి రామలింగారెడ్డిగారి యాంధ్రసాహిత్యసారజ్ఞతకు ఫలముగా, క్రీ.శ. } 899 లో, వ్యాసరూపమున నవతరించి సభల మెప్పవడసి 1914లో, వికసించి ప్రకాసించిన యీ కళాపూర్ణోదయ ప్రభావతీ ప్రద్యుమ్న విమర్శనమందలి విషయ మింతకుమున్నే భాషాభిమానులు చక్కగా నెఱిఁగియున్నసు, శ్రీ రెడ్డిగా రుపా ధ్యక్షులుగా నున్నతటి దీని నాంధ్రవిశ్వకళాపరిషత్తునకు సమర్పించి యుండుటచేc బరిషద్వశమున నీ చిన్నపీఠిక వ్రాయవలసివచ్చినది కాని, నిజముగా నిది సిద్ధకథన మే,

పట్టుపట్టి చదువుకొని పండితుఁడైనఁ గావచ్చునుగాని కవి యగుట కష్టము. ఎట్లో శ్రమపడి భాషాంతరీకరించియో యనుక రించియో కవియైనఁ గావచ్చునుగాని విమర్శకుఁడగుట యంత కంటెఁ గష్టము . లోకజ్ఞుఁడై మృదుమధుర భాషలో నొక చక్కని భావమిముడ్చునట్టి కవిదృష్టి యేకాగ్రమైనచో నతని కవిత్వము సరసమై పండిత పామర రంజకమగును గాని లోకజ్ఞుఁడును బహు కవిభావజ్ఞుఁడునై యా కవిత్వమందలి మంచినో చెడ్డనో తెలుప6 బూను విమర్శకుని దృష్టి సర్వతోముఖమైనఁ గాని యతని విమర్శ నము సహృదయరంజకము కానేరదు. కావుననే కవిత్వముకంటె విమర్శనము కష్టతరమనుట. ఇప్లే శాస్త్ర రచనముకంటె శాస్త్ర విమర్శనమును గష్టతరమగును.

సంస్కృతమందు శబరస్వామి శంకరాచార్యాది భాష్యకర్తలు స్వమతస్థాపనమునకై వివిధ శాస్త్రమతము లాకర్షించి కావించిన వివిధ విమర్శనములును, ఔచిత్యవిచారచర్చా కావ్యప్రకాశరస గంగాధ రాది లక్షణ గ్రంథములందు క్షేమేంద్రమమ్మటభట్ట జగన్నాథ పండితరాజాదులు బహుగతులఁ గావించిన కథా రస పాత్రాది విమర్శనములును, విద్వజ్జనరంజకములై వెలయుచున్నను, వారి వారి మతాభిమాన పాండిత్యవిశేషాదులను బట్టి వాని త్రోవలు వేఱు గాఁ గనఁబడుటచే విమర్శనమున కొక నిర్దిష్టమైన పద్ధతి లేదనియు, అట్లుండుట సాధ్యము కూడఁ గాదనియు C దెలియు వచ్చును. కావున విమర్శనము విమర్శకుని చిత్తవృత్తి ననుసరించి యుండుననుట స్పష్టము. అయినను, గుణము గుణము గాను దోషము దోషముగాను వర్ణించుట యుత్తమపద్ధతియనియు, గుణము మాత్రము ప్రకటించి దోషము గప్పిపుచ్చుట మధ్యమ పద్ధతి యునియు, దోషము మాత్రము విశదీకరించి గుణము మఱుఁగు పఱుచుట యుధమ పద్ధతి యునియు, గుణమును దోషము ఁగానో షము ను గుణముఁ గానో వెల్లడించుట యధమాధమ పద్ధతి యునియు లోకజ్ఞులు చెప్పదురు. కొంతకాలమునుండి, తెలుగులో విమర్శనము లేదను లోపము తీర్చుటకోయన పోఁకకు పుఁ డన్నట్లు వెడలుచున్న విమర్శనములలోఁ గొన్ని కడపటి మూఁడు పద్ధతుల కుదాహరణముగా నున్నవని ప్రాజ్ఞలోకము తలంచు చున్నది. విమర్శకుఁడు సహృదయుఁడు గానిచో భాష కిట్టి యనర్ధము లుప్పతిల్లునుగదా ! ఇందుకు c గొన్ని పత్రికలుగూడ సహకారు లగుచున్నవని చెప్పవలసి వచ్చుట విచారకరమగు చున్నది.

విస్పష్టముగా నిర్ణయింపవలసి యుండును గాని, అది సర్వథా సమ్మతమని స పమూ ఇము గా నిరూపించి యే కారణము న నో యాసము) తమని మర d విమర్శించినచో నట్టి విమర్శనము లెం 9 అప్డే యొుక భాషా విషయమును విమర్పించునపు డిది సంపదాయ విహితమని యొక మాఱును, ఇది సంప్రదాయ విరుద్ధమని యింకొకసారియుఁ జెప్పినచో నట్టి యభి ప్రాయముల కెండయిన విలువయుండునా ? విమర్శకుఁడు కొంత కాలమునకుఁ బూర్వాభిప్రాయము మార్చుకొనవచ్చునుగాని, &8 మార్పు సప్రమాణ మైనపుడే యుచితమగును గాని యస్థిరచిత్తతతో నసూయతోఁ గావించినదైనచో విద్వల్లోకము సమ్మతిగాంచcజాలదు. కావున నే దేని యొక విషయము విమర్శించుటకు ముందుగా నర్హత సంపాదింపవలెను. అది లేక విమర్శింపఁబూనుట యందని మ్రానిపండ్ల కఱచాచుటయే. కాని—

మొదటి యుత్తమపద్ధతి నవలం బించిన సద్విమర్శనములు గూడఁ గొన్ని యాంధ్రమున లేకపోలేదు. అందు శ్రీ రామలింగారెడ్డి గారి కళాపూర్ణోదయ ప్రభావతీ ప్రద్యుమ్న విమర్శన మొకటి. భారతము, ఉత్తరహరివంశము, మనుచరిత్ర, ఆముక్తమాల్యద మొదలగు గ్రంథములను, నన్నయ తిక్కన శ్రీ నా థాది కవులను గొందఱు గొన్నివిధముల విమర్శించిరి. కాని, వారి పద్ధతులకును రెడ్డిగారి పద్ధతికిని సూక్ష్మదృష్టితోఁ బరిశీలించినవారికి భేదము గోచరింపక పోదు. ఇది యాంగ్లపద్ధతి ననుసరించినదయినను, ఆంధ్రమున నవీనము స్వతంత్రము. ఎంతటి విమర్శనమైనను బునర్విమర్శనార్హ మగుచున్నదనుట యనుభవ సిద్ధ మగుటచే లో క్రో భిన్నరుచి యన్నట్లు కొందఱి విమర్శనములోని కొన్ని విషయము లందు భిన్నాభిప్రాయములు చూపుచున్నారని చెప్పవలసివచ్చినను, ఇంతమాత్రమున విమర్శనపద్ధతి కా క్షేపము రాఁజాలదు.

ఆంధ్రభారత నిరంతర పఠనాయత్తచిత్తులును విమర్శన విజ్ఞాన సంపన్నులు నగు శ్రీ రెడ్డిగారు పింగళి సూరనార్యుని కవిత్వ మందలి యూద రాతిశయమునఁ గళాపూర్ణోదయ ప్రభావతీ ప్రద్యు మ్నములు పెక్కుసార్లు చదివి యతని కథా కల్పనా కవిత్వ చాతుర్యములకు మెచ్చి యందలి విశేషము లాంధ్రలోకమున కె బ్రీ Qగింపఁబూని ముcదుగా నుపోద్ఘాతముగా నాంధ్రకవితాస్వరూ పమును మొదటి ప్రకరణమున వర్ణించియున్నారు. స్వతంత్రకవుల పద్ధతులవలెనే స్వతంత్రవిమర్శకుల పోకడలును, అపూర్వములుగా నుండుననుట కుదాహరణముగా ఛిందు విశదీకరింపఁబడిన భావనొ శక్తి భావము పాత్రములు జీవకళ మొదలగు విశేష విషయములతో భారత కవుల ప్రతిభను, అందును విశేషించి తిక్కనార్యుని మహత్త్వమును గన్నులకుఁ గట్టినట్టు ప్రత్యక్షము గావించిన శ్రీ రెడ్డి তৃেত ও యాంధ్రాంగ్ల సాహిత్య విమర్శన విజ్ఞానమున కీ ప్రకరణ మూ కడము గా నున్నది. రెండవ ప్రకరణ మంతయు బ్రబంధలక్ష gడా ది విమర్శనముతో నిండినది. ఈ ఔండు ప్రకరణములలోని భావనాశక్తి వర్ణనాలంకార ప్రబంధకథాది విషయ విమర్శనము లందలి కొన్ని భావములును, కొన్ని వాక్యములును , ప్రాచ్య పాశ్చాత్యసాహిత్య వాసనా భేదములనుబట్టి వారివారికి వేఱు వేఱుగాఁ గనఁబడుటయు, ఆ విషయములను మఱి కొందఱు వేఱు గా విమర్శించి సమర్ధింపఁగలుగుటయు, సత్యమే కాని, శ్రీ రెడ్డిగా ణాశ్రయించిన ప్రధానోద్దేశము తోడి విమర్శనపద్ధతి కవి యిందు సరిపడుచునే యున్నవి.

ఈ గ్రంథమునకు జీవనప్రాయములై పరిమాణమందును గుణ మందును నుత్కృష్ణములైనవి తరువాతి రెండు ప్రకరణములు. ప్రభావతీ ప్రద్యుమ్న కథాసంవిధానమందును, మూఁడుమార్డు చదివినఁగాని యర్ధముగాక మిక్కిలి గజిబిజిగానున్న కళాపూర్ణోదయ కథానిర్మాణమందును గల యెల్ల మర్మములను సూరనార్యుని నిజ జీవితముతో నివి కరతలామలకము గావించుచున్నవి. అందుచే రెడ్డిగారి విమర్శన స్వరూపమంతయు నీ ప్రకరణ ద్వయ దర్పణ మునఁ జక్కఁగాఁ బ్రతిఫలించుచున్నదని చెప్పవచ్చును.

రసములలో నెల్ల శృంగారము మిన్నయై సంస్కృతలక్షణ గ్రంథములం దెక్కువ భాగమాక్రమించి యున్నది. అట్టి ప్రధాన రసమును సూరనార్యుఁ డైదువిధములుగా వర్ణించుటను జూపి, యందు నాలుగు విధముల శృంగార . మతిమనోహరముగాఁ గళా పూర్ణోదయమున నెట్లు కనవచ్చుచున్నదో యీ విమర్శనము దెల్పు చున్నది. స్త్రీ పాత్ర పోష బౌచిత్యమునకు లక్ష్యముగా నిడి కల భాషిణీ పాత్రమును బహుభంగుల వివరించు చున్నది. సుగాత్రి శాలీనుల కథయందలి చమత్కృతి నిది యరఁటిపండొలిచి చేత బెట్టినట్లు చూపుచున్నది. పెక్కేల నూరనార్యుని రెండు ప్రబంధ දී ාප ට ෆ්ෆ ముఖ్యాంశముల నెల్ల నిది యుక్తియుక్తముగా ననుభవ సిద్ధముగా విమర్శించి నిష్పక్షపాత విమర్శనమునకు దారిచూపు చున్నదనుటకం కేు దీనిని గూర్చి యిందధికముగా వ్రాయుట యనా వశ్యకము.

కడపటి ప్రకరణమం దసహ్యశృంగారము, కళాపూర్ణోదయము కడపటి కథ, అందలి యనౌచిత్యము మొదలగు విషయములు పరిశీలింపఁబడినవి. సుగాత్రీ కలభాషిణీ పాత్రపోషణమునకును మధురలాలసా పాత్రపోషణమునకును గల భేదమును జూపి యందలి యాచిత ని, యందలి యనౌచిత్యమును విశదీక రించుటయె విమర్శకులు సూరనార్యు నెంత గౌరవబుద్ధితోఁ జూచి నను, ఆతని రచన యందలి గుణదోషములను నిష్పక్షపాతముగాఁ జూపిరను టకుఁ దార్కాణమగుచున్నది. మఱియు-

అసహ్యతుచ్ఛ శృంగారముల స్వరూప మిట్టిదియని చూపుచు ఉత్తమ శృంగారమునకు, గవిత్రయము వారి పద్యముల ను దాహ రించిన రెడ్డిగారు, ప్రబంధకవులు కొందఱు గతానుగతికముగా శృంగారరస మర్యాద నతిక్రమించిపోవుటను నూచించుటయేగాక, ఉత్తమకవుల వర్ణనలను బట్టియు లోకానుభవమును బట్టియు శృంగారవర్ణన మిట్టున్న హృదయంగమముగా నుండునన్న కవితా ధర్మమునుగూడ నుపదేశించిన వారైరి.

రెడ్డిగారు విమర్శనతత్త్వవిజ్ఞాన -మందారితేణినవారగుటచే నీవిమర్శనము నతిసమర్థతతో నిర్వహించిరని నాయాశయము. ఆంధ్రదేశమునఁ జక్కఁగ వ్యాపించియున్న యట్టి యీ గ్రంథ మందలి విషయమును విద్వల్లోకమును విద్యార్థి బృందమును AAAA SAS SSAS SSAS SSAS SSAS SSAS می آیخی ۹شی SAAAAAA SAAA AAAA SAAAAA AAAA SAAAAA AAAA AAAA AAAA E S SAAAS AAAAAA ب، سی۔ باپ سبہ ہبہ محسن بےحیمیہ بین ۶ تا C యిందలి యొక్కొక్క యంశమును వర్ణించుచుఁ బిర్రె క్ర గా నాలుగు మాటలతో c జెప్పవలసినది గా దు. ఆంధ్రవిశ్వకళాపరిషత్ర్పథమోపాధ్యకులగు శ్రీ రామలింగా రెడ్డిగారు పరిషదుపాయనముగా సమర్పించిన యీ విమర్శన గ్రంథ మాంధ్రవిశ్వకళాపరిషత్ర్పకటితమై చిరకాల మాంధ్రలోకమును రంజింపఁ జేయు ఁ గాక . - పరిషత్కళాశాల - Sలాది సూర 22 - 6 - # 932 మ బ్రాכי: నా రా యు వ్రాశా సి أنتييه . 은 9C ధ్రవిశ్వకళా )

  • - e ! චූ }