కవికోకిల గ్రంథావళి-4: వ్యాసములు
కవికోకిల గ్రంథావళి - 4
వ్యాసములు
Centre for Regional Studies
(TELUGU)
కవికోకిల
దువ్వూరి రామిరెడ్డి.
సర్వస్వామ్యములు :
దువ్వూరి వేణుగోపాలరెడ్డివి
ప్రథమ ముద్రణము : 1935
రెండవ ముద్రణము : 1945
మూడవ ముద్రణము : 1946
నాల్గవ ముద్రణము : 1955
ఐదవ ముద్రణము : 1959
ఆరవ ముద్రణము : 1967
ప్రచురణ:
కవికోకిల గ్రంథమాల
నెల్లూరు.
ప్రతులకు:
సోల్ డ్రిస్ట్రిబ్యూటర్స్
ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్,
రాష్ట్రపతి రోడ్డు,
సికింద్రాబాదు. (A.P.)
మూల్యము :
ఎనిమిది రూపాయలు
విషయసూచిక.
1 |
3 |
10 |
4. కావ్యజీవితము
5. కవిత్యశిల్పము_ అనుకరణము
6. రసరామణీయకములు
7. శిల్పమలు
8. కవిత్వప్రయోజనము
9. కావ్యము: నీతి
10. మర్మక విత్వము
11. నాటక కళాసంస్కరణము
12. అల్లసాని పెద్దన: సమకాలీన భావ ప్రతినిధి
13. నాటకము: చరిత్రము
14. అలంకార తత్త్యము
157 |
2. అభినవాంధ్ర సాహిత్యము
3. చిత్ర లక్షణము
4. సాహిత్యములో రమ్యత
5. నేటికవిత - ప్రకృతి పూజ
6. సాహిత్యంలో వైచిత్రి
7. నా కవితానుభవములు
8. తిక్కన
9. విషాదాంత నాటకము - మీరాబాయి
కవిత్వతత్త్వ నిరూపణము
1. కవి
ఓ కవీశ్వరుఁడా, నీవు సృష్టికర్తవు. నీ సృష్టి లోకోత్తరము; అనన్య పరతంత్రము; ఆనందదాయకము. నీమహిమ వర్ణనాతీతము. నీ నిర్మాణము దైవసృష్టిని సైత మధ:కరించు చున్నది. నీ కల్పన యాదర్శప్రాయము.
నీ సృష్టియందు లతికలు జంగమలు; శంపాలతలు నిశ్చలములు. కలువకంటులు, కలకంఠకంఠులు, చంద్రముఖులు, విద్యుల్ల తాంగులు నీ పట్టములలోఁ జరియించు . సామాన్య స్త్రీలు! నీకు పరిచితలైన యువతులెల్లరు సౌందర్య వతులు; హృదయ సమ్మోహన మంత్రాధిదేవతలు! అందరు సీతలు, సావిత్రులు, దమయంతులు, చంద్రమతులు, ద్రౌపదులు, శకుంతలలు.
ఓయి కవితాశిల్పి, నీచే సమ్మానింపఁబడిన పురుషులందఱు వీరులు, లోకోత్తరకార్య దురంధరులు! భూమిని చాపకట్టుగాఁ జుట్టగలిగిన హిరణ్యాక్షులు; విశ్వమును మూఁడడుగులతోఁ గొలువఁగలిగిన వామన మూర్తులు; రాజలోకమును గండ్రగొడ్డంట నఱికి రక్తప్రవాహముచేఁ బితృతర్పణము గావించిన పరశురాములు; ఱాల్గరగంగ వేణుగానము గావించిన శ్రీ కృష్ణమూర్తులు, సముద్రమును మధింపఁగల దేవదానవులు, స్వర్గమందుఁ బ్రవహించు గంగానదిని భూమికి నవతరింపఁ జేయఁగల భగీరధులు, సృష్టికిఁ బ్రతిసృష్టిగావింపఁ గలిగిన విశ్వామిత్రులు!
నీ పట్టణములోని చంద్రశిలా సౌధములు సూర్యచంద్రుల రాకపోకల నడ్డగింపఁగల యంతటి యున్నతములు, నీతోఁటలోనివృక్షములెల్ల ఫలవంతములు, లతలెల్లఁ గుసుమభరితములు, షడృతుధర్మము లేక కాలమున నీ యుద్యానమును సేవించుచుండును, ప్రకృతియంతయు నీ దృష్టికి సచేతనము, మేఘములు, హంసలు, కాముకీ కాముకుల ప్రణయ సందేశములఁ గొనిపోవుచుండును!
ఓయీ, నీసృష్టి కాలబద్దముగాదు. అనుక్షణ యౌవన విజృంభణమువలన, కంచెల బిగియుచుండ "ప్రియంవద నిర్దయముగ నా కంచెలవల్కలమును బిగించి ముడివేసినది. నీవు కొంచెము సడలింపుము” అని యనసూయతో ముగ్ధముగఁ బలుకుచుఁ బూఁదీవలకు జలసేచనము సేయుచుండిన శకుంతల దుష్యంతుని కన్నులకు నిర్వాణసామ్రాజ్యమై కనుపట్టిన శకుంశతల, నేఁటికిని అదేవిధముగ మా కన్నులకు బొడకట్టు చున్నది! కాని, ప్రకృతి సృజించిన శకుంతల యేమైనది? యౌవనమును, సౌందర్యమును గాలక్రమముగఁ గోలుపోయినది. జరాభార మామెను సైతము పీడించినది. తుట్టతుదకు ఆ మోహనదేవత, ఆ శకుంతల యనంతకాల సాగరమున బుద్బుదమువలె మఱఁగిపోయినది!
ఓ యైంద్రజాలికుఁడా, నీవు కుంచె నొక్కసారి విసరి నంతనె మాయాత్మలు తేలికయై పూలఱేకులు ఱెక్కలుకట్టు కొని నిర్వృతి పదంబునకుఁ జల్లగ నెగిరిపోవును. మొగము మొత్తినట్లు, కన్నులు మిటారించుకొని మమ్ములను గనుఁ గొనుచున్న ప్రాపంచిక యధార్ద్యము, మెల్ల మెల్లగ సమసిపోయి యనిర్వచనీయమగు నానంద స్వప్నము అవతరించును! ఓయి, నీ కలము సోఁకిన ప్రతివిషయము, ప్రతిపదము, ప్రతిభావము, ప్రతిరూపము శాశ్వతమై యమృతమై యొప్పారును! ఒక్క నిమిష మనంత కాల స్వరూపముగఁ గన్పట్టును. భూమి స్వర్గముగఁ బరిణమించును. ఓ కవీ, మానవ జీవితమును ఆనందమఖముగ నొనరింపుము.
- __________
2. కవిత్వావతరణము
"ఋషే, ప్రబుద్దో౽సి వాగాత్మని
తత్ బ్రూహిరామచరితం
అవ్యాహతజ్యోతిరార్షం
తే చక్షుః, ప్రతిభాతి; అద్యఃకవి రసి”
“నీవు మొదటికవివి” అని బ్రహ్మ వాల్మీకి మహర్షితో జెప్పినటుల రామాయణమునఁ గూర్పఁబడియున్నది. అందువలన వాల్మీకి యాదికవియనియు రామాయణ మాది కావ్యమనియుఁ గాలక్రమముగఁ బ్రజలు విశ్వసించుచువచ్చిరి. నేఁటికిని విశ్వసించుచున్నారు. బోయచేఁ గూల్పఁబడిన క్రౌంచమును గాంచినప్పుడు వాల్మీకికిఁ గలిగిన శోకావేశమే ప్రథమ కవిత్వావతరణమని లోకప్రసిద్ది. కానీ, నేను వేఱుగఁ దలంచెదను. క్రౌంచ మిధునగాధ వాల్మీకి కవియైన విషయమును మాత్రము తెలుపుచున్నది. రసార్ద్రమైన వాల్మీకిహృదయము క్రౌంచపక్షి శోకమునకు మఱింత యుద్రిక్తమై శ్లోకరూపమున బయలు వెడలెను. కవితాశక్తి అతని భావమునఁ బిక్క టిల్లుచు వెలికుఱుకుటకు సమయము వేచియుండెను. అట్టి సమయము క్రౌంచపక్షి యాక్రోశవేదనవలన సిద్ధించినది. అప్పుడు వాల్మీకి నోటినుండి యొక లయాన్వితమైన వాక్యము ఆకాంక్షితముగను, అప్రయత్నపూర్వకముగను బయలు వెడలెను. అది యపూర్వము. కావున వాల్మీకి యాశ్చర్యపరవశుఁడై దానినే తలపోయుచుండెను. అంతట బ్రహ్మ ప్రత్యక్షమై ఆయనుష్టుబ్ చ్ల్ఛోకములతో రామకథను రచింపుమని యాదేశించెను.
వేదములు ఛందోబద్దములు, ఛందస్సు వేదాంగములలో నొకటిగఁ బరిగణింపఁ బడుచున్నది. రామాయణము కన్నను వేదములును వేదాంగములును బూర్వము లనక తప్పదు. ఇట్లగుట వైదిక కవులేల ఆదికవులు కాకపోయిరి? దీనినిగుఱించి నేనిట్లూహించుచున్నాను. వేదమును విరాట్స్య రూపుని నిశ్వాసములనియుఁ గావుననే యవి యపౌరుషేయము లనియు ఆర్యులు విశ్వసించియుండినందున ఆ ఛందములు మానవు లనుకరింప సాధ్యములు గావని తలంచియుందురు. కొంతకాలమునకు వాల్మీకి యుద్భవించి, అంతకుమున్నె కథల మూలమునఁ బ్రజలయందు వ్యాపించియున్న రామాయణ గాధను కావ్యముగ రచియించెను. ఇట్లనుటవలన వేదముల కనంతరమును రామాయణమునకుఁబూర్వమును కవిత్వర చన లేదని చెప్పుటగాదు. నన్నయ భారతమునకుఁ బూర్వము తెలుఁగు దేశమున వ్యాపించియున్న గ్రామ్య సారస్వతము, తరువాత, అభినవమార్గ మవలంభించిన ఆ యుద్గ్రంథముతో పోటీకి నిలువ లేక యెట్లునశించెనో, అట్లే రామాయణమునకుఁ బూర్వమున్న చిన్న చిన్న కావ్యములు, గేయములు ఈ బృహత్ప్రబంధముధాటికి నిలువ లేక యత్మహత్య గావించుకొని యుండును. రామాయణమునందు వర్ణింపఁబడిన నాగరకతను గమనించినయెడ ఆకాలమున కవిత్యశిల్పము కొదువపడి యుండెనని చెప్పుట కెవ్వరును సాహసింపరు. సత్యము. భూతకాలగర్భమున దాఁగియున్నది. వాల్మీకి ఆదికవియైనను కాక పోయినను, రామాయణ మాదికావ్వమైనను కాకపోయినను సీతారాములు చారిత్రక నాయికానాయకులైనను లేక , వాల్మీకి మహాకవి యగాధ భావసాగారము మధింపగా బైకుబికిన యమృత నవనీత రాసులైనను మనకొక్కటియె ! ఇందలి సత్యా సత్యములు చరిత్రకారులకు వదలిపెట్టెదము. వారికి సాధ్యము గాని రసాస్వాదనమునకు మనము పూనుకొందము. రామాయణము శాశ్వతకల్పనయైనది ! దాని యధికార మనంతము! సర్వకాలీనము !
కవిత్వము ప్రత్యేకముగ నొక దేశమునకును, ఒక జూతికిని, ఒక నాగరకతకును సంబంధించియుండునదిగాదు. అది విశ్వజనీనమైనది. మొట్టమొదట మానవ హృదయమెప్పుడు రసార్ద్రమాయెనో, అప్పుడే కవితాబీజ మంకురించెను. అప్పుడే మానవుని కల్పనాశక్తియు ప్రతిభయు బయలయ్యెను. అప్పటి నుండియు కవితామహాలత శాఖోపశాఖలుగఁ జీలి మానవ సంఘమునం దల్లుకొనుచున్నది. మానవజాతి యజ్ఞాన నిమగ్నమై బాల్యదశయందున్నప్పుడు, రామాయణము. మహా భారతము మున్నగు పెద్దకల్పనలకుసు, శాకుంతలాది మనోహర నాటక రచనలకును కావలసినంత లోకానుభవమును, సృజనశక్తియు, శిల్పనైపుణియు నలవడి యుండదనుట స్పష్టము. హైందవసమాజము చాల ఉన్నతదశకు వచ్చిన యనంతరము అట్టికావ్యములు, నాటకములు పుట్టియుండునని నిర్ణయించుటకు వానియందు వర్ణింపఁబడిన సాంఘికాచార వ్యవహారములే తగిన సాక్ష్యములుగ నున్నవి.
మానవునికి భావప్రకటనము గావింపవలసినయక్కఱ జ్ఞాన మంకురించినప్పటినుండియుఁ గలదు. ఉద్దేశములు వెలిపుచ్చుటకుఁ దగినభాష యుత్పన్నముగాని ప్రధమదశయందు గూడఁ, జేసైగలు, కనుసైగలు మున్నగువానిచేత మనుజులు తను వ్యవహారములను సాఁగించుకొనుచుండిరి ఆ కాలమున వారిబుద్ధి యంతగా వికసింపకుండినందువలన వివిధ భావోత్పత్తి కంతయవకాశ ముండియుండదు. కాని, బహిః ప్రకృతిసంబంధమువలన వారిహృదయములందుఁ గ్రమక్రమముగ భావవికసనమును, ఆ భావమును బ్రకటించుటకుఁ గావించు ప్రయత్నము వలన భాషయు నభివృద్ధి చెందుచు వచ్చెను. ఉరుములు, మెఱుములు, మేఘములు, వర్షములు, వడగండ్లు, ఉల్కా పాతములు, నక్షత్రములు, సూర్యోద యా స్తమానములు, నదులు, కొండలు మున్నగు నైసర్గిక చిత్రములను దర్శించినప్పుడు ఆయా కారణములఁ దెలియమి, ఆదిమమానవులు సంతోషాశ్చర్య భయవిషాదముల వెలిపుచ్చుచుండిరి, నాట్యములు సలుపుచుండిరి, పాటలు పాడుచుండిరి. ప్రార్థనలు సలుపుచుండిరి. కాని, వారి యాటపాటలకు నియమములు
This work is in the public domain in countries where the copyright term is the author's life plus 70 years or less.
It is not necessarily in the public domain in the United States if published from 1923 to 1977. For a US-applicable version, check {{PD-1996}} and {{PD-URAA-same-year}} for relevant use.