Jump to content

కవికోకిల గ్రంథావళి-3: నాటకములు

వికీసోర్స్ నుండి



3 : నాటకములు.




కృతజ్ఞత

                     బాల్యంబుననె కావ్యవనవీథి విహరించి
                                   కవికోకిలాలాప గతులు మెచ్చె;
                     సౌందర్యభావనాశబలిత చిత్తుఁడై
                                   స్వర్గతుల్య మొనర్చె స్వభవనమును;
                     కలిమికి సహజమౌ గర్వంబువిడి మిత్ర
                                   బృందహృత్పీఠిక నెక్కఁ గలిగె;
                     అర్థికి గౌరవహాని దోఁపింపని
                                   దానశిల్పములోని తత్త్వమెఱిఁగె;

                      మాటలకుఁ జేఁతలకు మాఱుపాటులేమి
                      వఱలె నీయందు రేబాలవంశచంద్ర
                      యనుచు నెల్లరుఁ బొగడంగ నలరినావు
                      రమ్యగుణమూర్తి శ్రీసుబ్బరామిరెడ్డి!

                      కత్తికిఁ గావ్యకళా సం
                      శుత్తికి మొగదారులైన మనతొంటి నృపుల్
                      ఇత్తఱి నరుదేయైనను
                      బొత్తిగ విడిపోవు మనలఁ బూర్వాభిరుచుల్.

                      కొండవీటి రాజ్యేందిర క్రుంకిపోయె
                      నకట ! దురదృష్టవశమున, నైననేమి?
                      నేఁడు సిరిగల ప్రతి రెడ్డివీడు కూడ
                      పండితులపాలిటికి "పిల్లకొండవీడు".

                      "జనకుని స్మృత్యర్థము నే
                      ననుకొంటిని నీదుకృతుల నచ్చొత్తింపన్
                      అనుమానమేల? నీవౌ
                      నా వోయీ" యన్నతీరు "లౌ" ననిపించెన్.

                      నీ రసికత, నీమైత్రియు,
                      నీరమ్యకళానుభూతి నిరతము శిల్ప
                      ప్రేరకమై నవకవితో
                      ద్దారకమై పెంపు చెందుతున్ బ్రియమిత్రా !

                      నేను నీవును సకలంబు నిశ్చయముగఁ
                      గాలవాహిని నొకనాఁడు గలయఁగలము;
                      కాని, రమ్యమైన యపూర్వ కావ్యసృష్టి
                      అమరతం గూర్చుఁ గర్తకు నాశ్రితునకు !

                      సిరికిందగిన వదాన్యత,
                      పరువము, లలితాభిరుచుల బలిసిన భావ
                      స్ఫురణము, భోగప్రీతియు
                      విరిసెను నీబ్రతుకుఁ దీవ విరులటు మిత్రా.

                     ధనముండుట పరిపాటియె;
                     ధనమే సర్వంబుగాదు; ధనముండియు స
                     ద్వినియోగబుద్ధి గలిగిన
                     మనుజునిభాగ్యంబె లోకమాన్యత గాంచున్.

                     రమయు వాణియుఁ బక్షపాతమువహించి
                     కూర్చి రర్థంబు విద్యయుఁ గొదవలేక;
                     అట్టియొద్దిక యందఱ కబ్బదోయి,
                     జీవితార్థంబు నిరుకేలఁ జిక్కఁబట్టు !

విన్నపము

ఇంతవఱకు నేను రచించిన నాటకములు రచనాకాల క్రమానుసారముగ ఈ సంపుటమున సమకూర్పఁబడినవి. చిత్రగుప్త సంవత్సరాది సంచికలో ప్రకటింపబడిన "కాంగ్రెస్ వాలా" అను ఏకాంక నాటకముగూడ ఇందు పునర్ముద్రణము గావింపఁ బడినది.

మోపూరు నివాసులును కళోపాసకులును కవితా రసజ్ఞులును నాకు మిత్రులును అగు

శ్రీయుత రేబాల సుబ్బరామిరెడ్డిగారు

ఒకనాఁడు ప్రస్తావ వశమున నిట్లనిరి:

"నీగ్రంథములు చెల్లా చెదరుగ నున్నవి. మాసపత్రికలలో ప్రకటింపబడిన కొన్ని కావ్యములు గ్రంథరూపమున వెలువడనే లేదు. తుదకు నీపుస్తకములు ఎచ్చట దొరకునోయను సంగతికూడ చాలమందికి తెలియదు. నీకృతులన్నియు ఒకే పుస్తకముగ నచ్చొత్తించిన బాగుగనుండును. నీ విష్టపడుదువేని అందులకు వలసిన యేర్ఫాటు కావించెదను."


శ్రీయుతులు రేబాల సుబ్బరామిరెడ్డిగారు.


కీ. శే. రేబాల సుబ్బారెడ్డిగారు.

సుబ్బరామిరెడ్డిగారి కవితా ప్రియత్వము, ఔదార్యము నన్ను ముగ్ధుని గావించినవి. అర్థింపఁబడియు కవులకు సహాయము చేయు కవితాపోషకులు అరుదైన ఈకాలమున సుబ్బరామిరెడ్డిగారి ఈయయాచిత సాహాయ్యము ప్రశంసా పాత్రమని వేఱుగ చెప్పనక్కఱలేదు. నేను వారికెంతయు కృతజ్ఞుఁడను.


సుబ్బరామిరెడ్డిగారి జనకులు

కీ. శే. రేబాల సుబ్బారెడ్డిగారిస్మృత్యర్థము

ఈ కవికోకిల గ్రంథావళి యచ్చొత్తింపఁబడినది.

నేను నెల్లూరిలోనుండి అచ్చుప్రూపులు స్వయముగ దిద్దికొన వీలులేకయున్నందున నామిత్రులును, మృదుమధుర కవితారచయితలునగు గోనుగుంట పున్నయ్యగారును, చిరకాలమిత్రులును "హాలిక" లాంఛన విశ్రుతులును ప్రభాత ముద్రణాలయాధికారులును అగు మరుపూరు కోదండరామరెడ్డిగారును ప్రూపులుదిద్ది శ్రద్ధతో మిత్రకార్యము నెరవేర్చిరి. వారిసాహాయ్యమునకు నేనెంతయు కృతజ్ఞుడను.

నెల్లూరు,
30-5-1936

దువ్వూరి రామిరెడ్డి.

____

శుద్ధిపత్రము.

_______

సీతావనవాసము

పుట. పంక్తి. తప్పు. ఒప్పు.
3 3 క్త్యావేశమ్మునఁఛత్ర క్త్యావేశమ్మునఛత్ర
5 5 రాక్షసులకు రాక్షసకుల
10 9 కింశుకముబూత కింశుకముపూత
10 12 పిశాళి పిసాళి
21 1 నిషురమైన నిష్ఠురమైన
25 12 జారన్ జాఱన్
27 6 మహాప్రభో మహాప్రభూ,
35 4 మించటకు మించిటకు
58 2 సహోదరునిగ సహోదరినిగ
58 4 వీరనాయకులాలా, వీరనాయకులారా,
63 2 సంపర్గ సంసర్గ
89 6 కొచుండినట్లు కొనుచుండినట్లు
89 23 వీక్షిం వీక్షించి
92 3 నీముదు నీముద్దు
92 18 ముద్దుకూ ముద్దుకూన
94 16 నాముదు నాముద్దు
101 22 వినరై వినరైరి.
103 21 యశ్యమేధ యశ్వమేధ
104 5 యగుట యగునఁట!

కుంభరాణా

129 3 ర్వారాంగ ర్వాంగార
132 16 వెంక: అర్చ
136 15 బిర్చకత్తెను బిచ్చకత్తెను
142 12 ప్రాణవల్లభుఁడను: స్రాణవల్లభుఁడను
142 14 భూయిష్టమయి భూయిష్ఠమయి
147 10 గారవంబు గావరంబు
156 11 ఇచట; ఇచట
179 15 అపాయకములే! అపాయకరములే
187 8 కబరారని కబర్దారని
196 19 మామంత్ర మీమంత్ర
199 6 మాకుగల మాకుల
200 2 మమ్ము మిమ్ము
200 22 యాధీనము యధీనము
201 24 చిహ్నమునకు చిహ్నమును
210 10 నెడసినట్టు నెడసినట్టి

మాధవవిజయము

224 8 పిన్నయొవఁడు పిన్నయెవఁడు
227 4 గుఱ్ఱవు గుఱ్ఱపు
227 15 క్షణమై క్షణమైన
228 3 యిల్లటము ఇల్లటము
230 21 ఎగుతాళి ఎగతాళి స
233 2 కూజాపైని మేజాపైని
233 18 శ్రమించునట్లు శమించునట్లు
247 12 తెలియును తెలియవలయును.
263 21 యీయింట మీయింట
271 4 నీతాపనీరము నీవాపనీరము
273 21 కెన్నగఁడు కెన్నఁడు
273 22 నాశేల నాకేల
282 10 ఆత్మనాశనమైన ఆత్మనాశకమైన

కాంగ్రెస్‌వాలా

312 13 బంగళాలాగే బంగళాల్లాగే
312 21 కూసుకోండిమి కూర్చోండి
331 14 నదాని నవాని
333 1 మఱి జట్కామండిని పిలువుమఱి.
333 1 జట్కావాళ్ళను నర: జట్కావాళ్ళను


విషయసూచిక

[మార్చు]

This work is in the public domain in countries where the copyright term is the author's life plus 70 years or less.


It is not necessarily in the public domain in the United States if published from 1923 to 1977. For a US-applicable version, check {{PD-1996}} and {{PD-URAA-same-year}} for relevant use.