కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/సత్యరాజా పూర్వదేశ యాత్రలు-ద్వితీయభాగము-రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

                  రెండవ ప్రకరణము.

మొదటి ప్ర్రకరణములొ నేను జెప్పిన సత్యములను విన్నవారు నాసత్యసంధతను గూర్చి స్ంశయపడక పోయినను మనుష్యాశనుల దేశ మునకుఁబోయి వారిచేత భక్షింపఁబడక యిెక్క మనుష్యుఁడెట్లు మనకీ కథలను జెప్పుటకు జీవింపంవలినోయని యాశ్చర్యపడకపోరు. నేను రాక్షసులచే భక్షింపఁబడక పోవుటకుఁగారణము లవేకములు కలవు. అందు ప్రధానమయినది నే నాఁడుమతయాళములో నేర్చుకొన్న మంత్రమహిమ. రెండవది యిాకాలమునందు రాక్షసులు మనుష్య భక్షణమును మానుకొనుట."వ్యాఘ్రము లెప్పుడయిన మాంసాశనము మానివేయునా?స్వభావముచేత మర్త్యశనులయినదనుజులుమనుజ భోజనముత్యజించుట యిెతట్లుసంభవించును?ఈవార్త నమ్మదగియుండ లేదు". అని మనకర్మ జ్యేష్తులయిన శ్రోత్రియలొక వేళ నామాటలు పూర్యపక్షముచేయఁ జూడవచ్చును. అయినను సత్యమెప్పుడును. గాని నానోటినుండి మాత్ర మసత్య మెప్పుడును రాదు నేను సూర్యఁడు పశ్చిమమున నుదయించి దక్షిణమున నస్తమించునన్నను నామాట సత్యముకావలసినదే. నాయధార్ధమును పరీక్షించుటకయి మిాలో నెవ్వరయిన నీదేశమున కొక్కసారి నావెంట వచ్చినషమున మికు నా సత్యవాక్యధురీణత బట్ట బయలగును.దానవులుమానవాశనతను మానుటకును కారణములేక పోలేదు.దానికిని రెండు కారణములు న్నవి.అందొకటి మనుష్యులు క్రమక్రమముగా హ్రస్వశరీరులగుచు వచ్చుట చేత నెందఱిని భక్షించినను నొక్క ముద్దకయినన చాలక పోవుట.రెండవది విభీషణుఁడు లంకాధిపత్యము వహించి రాక్ష సరాజయిన

                  సత్యరాజా  పూర్యదేశయాత్రలు

తరువాత శ్రీరాములవారి మిాఁదఁగల భక్తిచేత నిఁకముందు రాక్షసు లెవ్వరును మనుష్యభక్షణము చేయఁగూడదని శాసనముచేయుట. ఇప్పటి కీని లంకారాజ్యమును విభీషణుఁడే యిేలుచుండుటచేత రాజశాస నమునుబట్టి రాక్షసులు మనుష్యాశనత్వమును విడిచిపెట్టి కామగూపు ల్యైనను మనుష్యసంచారముగల దేశములకు బోవుట బొతిగా మాను కొన్నారు.నామాటయిెుక్క సత్యమును సిద్ధాంతపఱుచుటకయి మన దేశమునకిప్పుడు రాక్షసులు రాకుండుటయిే ప్రత్యక్ష నిదర్శనముకదా? వ్

                  లంకాద్వీపము

దాటునని యంగదుఁ డడిగినట్టు చెప్పియున్నారు. శ్రీవాల్మీకులవారే యుద్ధ కాండమునందు.

<poem>శ్లో."దశయోజనవి స్తీర్ణం శతయొజనమాయతం దదృశుర్దేవగంధర్వానలనేతుం సుమష్కరం".

అనినలుఁడు నూఱు యెాజనముల పొడుగును పదియెాజనముల వెడల్పుగల నేతువును కిట్టునట్టు సెలవిచ్చియున్నారు. సింహళమేలంక యైనపక్షమున, రామేశ్వరమునకును లంకకును మధ్యనున్న సముద్రము నూఱూయెాజనముల వెడల్పు గలదయి యుండవలెనుగదా?నూఱుమైళ్ళయినను లేక రామేశ్వరమునకును సింహళ ద్వీపమునకును మధ్యనున్న సముధ్ర మింగ్లీషువారి లెక్కప్రకామే అఱువదిమైళ్ళున్నది. రామేశ్వరమున కఱువది మైళ్ళ దూరములో నుఁడి మిక్కిలి నిడుపైనచోట ౨౭౦ మైళ్ళూను, మిక్కిలి వెడల్పయిన చొట ౧౪౦ మైళ్ళూను గల చిన్న సింహళద్వీప మెన్నడయిన లంకాద్వీపము కానేర్చునా? సింహళమునకును రామేశ్వరమునకును నడుమనున్న యిసుకతిన్నెలే నేతువయిన పక్షమున, పూర్వమాంజనేయాది నావీరులు హిమవత్సర్వతాదులనుండి విఱిచితెచ్చి పడవేసిన పర్వత శిఖరములన్నియు నేమయిపోయినవి? సింహళమే లంకయిైన పక్షమున అందు మహాసత్వులయిన రాక్షస సత్తములుండక దుర్బలులైన యఱవవాండ్రును సింగాలి వాండ్రును కాపురమేల యుందురు? కాబట్టి యిట్టి హేతులను చక్కగా పరిశీలించి హూణులు వ్రాసిన గ్రంథములను విశ్వ సింపక, సింహళ ద్వీపము లంక కాదనియు నేనిప్పుడు పోయి చూచినదియే రావణ లంక యనియు మీరు దృఢముగా నమ్ముడు.

మనమిక భూగోళ శాస్త్ర ప్రసంగమును కొంచెము సేపు చాలించి ప్రస్తుత కార్యాంశమునకు వత్తము. నాక్రొత్త యజమానుని పేరు
సత్యరాజా పూర్వదేశయాత్రలు


మహాకాయుఁడు. ఆ నామధేయము చేతనే యతఁడు రాజ బంధువుఁడయినను మీరూహింపవచ్చును. అతఁడు నాయందు పుత్రవాత్సల్యము కలవాఁడయి నాయన్నపానాదులను గూర్చి ప్రతిదినమును తానే విచారించుదు, మూషిక మార్జాలాది జంతువులవలన నాకేవిధమయిన యపాయమును గలుగకుండ రక్షించు చుండుటకయి యెనిమిదేండ్ల! ప్రాయముగల తనపుత్రికకు నన్నొప్పగించెను. మూషికమార్జ్జ్జాలాదుల వలన మనుష్యునకు భయమేనని మీరనుకొనఁగూడదు. అక్కడి యెలుకలు మన దేశపు కుక్కలంతలేసి యుండును. ఇఁక పిల్లులన్ననో మన గోవులకంటె కొంచము పెద్దవి. కాఁబట్టి యిట్టి పెద్ద జంతువుల వలన నా వంటి యల్ప శరీరి కపాయము సంభవించుట యేమియాశ్చర్యము? నేనక్కడకు పోయిన మూఁడవ నాఁడే నాకొక్క గొప్ప గండము తప్పిపోయింనది. మీరాకథవిన్నచో నాసమయేచిత బుద్ధికిని నిరుపమాన ధైర్యసాహసములను మహాశ్చర్యనిమగ్న మానసుల కాకమానరు. నేనిప్పుడు పేర్కొన్న చిన్నదాని వేడుకకొఱకయి యింటివారు రెండు కంచిమేఁకలను పెంచినారు. అందొకటి వారము దినముల క్రిందట రెండు పిల్లలను పెట్టినది. వానినొకటితల్లిపాలు త్రాగి యాటలకయి చెంగుచెంగున గంతులువేయుచు నేను నిలుచున్న వైపునకు పరుగెత్తుకొని రామొదలు పెట్టెను. అటువంటి మహాజంతువు మృత్యుదేవతవలె నామీఁదికి పరుగెత్తు కొనివచ్చుచున్నప్పుడు బ్రాహ్మణుఁడూ నయ్యును నేనణు మాత్రమును జంకక వెనుకంజ వేయక, వ్యాఘ్రములు మొదలయిన క్రూరజంతువులు సహితము ప్రతి ఘిటించి నిలువఁబడినవారిమీఁదికి వచ్చుటకు భయపడునని వేఁటకాండ్ర వలన మనదేశము నందు విన్నమాటనుబట్టి వీరభటూనివలె ధైర్యముతో దానికెదురుగా నిలువఁబడితిని. అయినను మనదేశపుపులులకంటెను నధిక సాహసమును గలదయి యామేక పిల్ల్ల నాశూర గుణమును ప్రత్యక్షముగాఁ జూచియు వెఱచి వెనుకదీయక తలవంచుకొని నా

లంకాద్వీపము

మీఁది కొక్కదుముకు దుమికెను. నేనప్పుడు సమయోచిత బుద్దిగల

వాఁడనయి ప్రక్కకు తొలఁగి తప్పించుకొని యమపాశముల వంటి నా బాహుపాశములను దానిమెడకు తగిలించి యుండనిక్షమున, వజ్రాయుధములవంటి దాని ముందఱి కాళ్ళగిట్టలు రెండును నాఱొమ్ముమీదఁ బడిప్రాణాపాయము చేయలేక పోయినను బలమయిన గాయమునై నఁజేసియుండును. అది మెడపట్టు వదల్చు కొనవలెనని పెనఁగులాడఁగా, పట్టువదలిన పక్షమున నన్నది కాళ్ళక్రింద నలగద్రొక్కునని నేను భల్లూకపు పట్టుపట్టి వదలకపోఁగా, అంతటమా యిరువురకును భారతయోధులకువలె ఘోరమయిన ద్వంద్వయుద్ధ మారంమయినది. బాహాబాహీని దంతాదంతిని సఖానఖిని నేనుజేసిన యామహాయుద్ధములో నేనక్షతశరీరుఁడనయి నాశత్రువును రెండుమూఁడుచోట్ల గాయవఱచి విజయోన్ముఖుఁడనయి యుండఁగా, ఆమేఁకపిల్ల ప్రాణరక్షణాథమయి కడపటి ప్రయత్నముచేసి పర్వతగుహలు మాఱు మ్రోయునట్లు మావుమని యొక్క సింహ నాదముచేసి తనబలమంతను ! అంతచేసినను నాపట్టు నేను విడువలేదు. అది రాక్షసభూమి యగుటచేత దేవతలు రావెఱచిరిగాని అరఱరంగమే మనపుణ్యభూమియైనపక్షమున పాశౌర్యవీర్యధైర్యములకు నామీఁద తప్పక దివినుండి సురలు విరులవానకురిసి యుందురు. నాశౌర్యకీతులను విద్యాధరకాంతలు దిగంతములయందు తమ నూతనగీతములతో గానముచేసియున్న పక్షమున, బ్రాహ్మణులు రణభీరువులని లోకములో నీవఱ కక్రమముగా వ్యాపించియున్న యవవాద మొక్కనిమిషముల పటాపంచలయి పోయియుండును. అయినను నాకంటెముందు భారత యుద్ధమునందు ద్రోణ క్రుపాశ్వత్థామాది బ్రాహ్మణోత్తములు చూపిన శౌర్యము వలననే యీ యపనింద కొంతవఱకు తొలగిపోయినది. ఆ సంగతి యటుండ

  
సత్యరాజా పుర్వదేశయాత్రలు

నిండు ఇట్లు యెధా ను యెధుల మయి మేనిరిపురను బీరపాదు మొదలు చేరునపటికిమా కాలు నేల మీద నిలవగ జూర్రగ పట్టువడలి మే ముభయ వీరులము చుట్టు చుట్టుకొని క్రొత్తగ సేవకులు నీరుపొయిటచే మహాణ౯వమువలె నిండియున్న యాపోదలొ ఁబడితిమి . వైవికమూగ నింతలొ లోపల నుండి నాయజముననికూత్రు రేదో పనిమిద్ద మాయుద్ద భూమికి వచ్చిమమ్మిదఱను పయికి దీసి విడిపించేను . ఈశ్వరరాను గ్రహము వలన నాకిప్పుడు స్థలగండమొకటి జలగండము మొకటి రెండుగండములు తొలిగిపొయినవి . మనిషి కటుకు మందులెదు. అని మదేశమునందు పాముర లూరక పలుకుదురు గాని నేను దాయగున ప్రధానులగు బ్రహ్మణకొటిలొ జేరినవడ నగుతచేతనో మఱి యేహేతువు చేతనొ నాకాట్ల చాగశిశువును కేవిదమునైన యపయమున జేయలెదు . తుదకు దాని చర్మము నైనను చేదించ లెదు ;.చాగ శాబక బ్రాహ్మణుకుమరసరొపాఖ్యానము నీపుణ్యకధను విన్నవారునుభక్తితొఁ జదివినవరును స్ధలజలగండము నుండి విముక్తలయి సర్వ కర్యములందును విజము నొందుదురు .దినికి సందేహించినవా రదో గదులగదురు . ఈప్రధమ యుద్ద మయిఒన తరవాతనొక్కనాడు నాయిచతుష్పాద శత్రువు మరల నామిద్దికి రాజాచినది , నేను ముందుగనే జగారుపడి పూర్వానుభవముల ద్వంద్వయుద్దము మాని దురము నుండియు శిల యుద్దము చేసి దానిని తరిమి వేసి శత్రువు విజము పొందినను ఇటువంటి యపాయములు మరలమరలవచ్చి చుండునని భయపడి యాచిన్నది తన తండ్రిగరితొ జేప్పి తబొమ్మరింట నొక మూలను చిలుక పంజరము నొక దానిని బెట్టించి నాకు నిరపాయము యినగది సర్చటయేగాక ,ఒక గినేలొ నిరు పొసి నన్నందు బడవెసి మునిగిపొకుండ తచేతితొ బటుకొని దినమునకు రేండెసిమా

లంకద్విపము

రులుచొన నా కిర్తి నేర్పి దినములొ జలమునకు భయపడ వలిసిన యావశ్యకము లేకుండ జేసును . ఈట్లు సుబోపాయము చేసిన నా ప్రణము రక్షములొ చేసిన పుణ్యత్మరాలయిన యా భలిక పేరు మందోదరి .ఆ దేశంనందు నడుచిన వాయుద్బుతచర్య లిట్టి వసంతములు గలవు గని నేనే నాని నన్నింట్టిని బ్రసంప బునిచో వాత్మసుతి గానుడని యాపణం మిందు మానివేచునను దివ్యజ్నన చర్యలు వసిపని గ లొకొ పకారాధ ముగా మహావాయువులలో తమ యున లిపి ని జూచి ప్రచురింతురు గాక....


ముఓదోదరి నొక నాటి ప్రాతకాలమున నే నొంటిగా గూరు చుండి మన దేశ విశెషములను గుర్చి ముచ్చటించుండగా లొపల నుండియుక్క కొత్త పురుషుడు వచ్చి నన్ను "సత్యా "' అని పిలిచి పలికిరించెను . సత్యరాజాచర్యలను నాపేరెంతయు నుచ్చరించట కస్టముగ న్నుందున ఇంటివారు నన్ను అసంగ్రహము ముతో పిలిచుండరి నామొగమొన్ననడునూ జూడని ఈక్రొత్తవాడు నాపేరెట్లెరుగునని నాలో నాశ్చ్యర్య పడుచు మారు మాట చెప్పక తేల్లపొయి చూచుచుండగా ఆ పురుషుడంతలో తన రూపమును మార్చి నాయజమాను డయిన మహాకాయుడయి ఇప్పుడయినా నన్నెరుగుదువా...? యన మరల నడిగెను. ఇది ఏమో ఇంద్ర జాలమయి యుండునని నాయద్బుత మప్పుడు మరిఓత ఎక్కువ కాగా నానొటి నుండి బొత్తిగా మాట వచ్చినదికాదు. వినోదము కొరకు కామ రూపమును జూపిన నన్ను జూచి యిట్లేల యింత యాశ్చర్య పడుచున్నావని నాయజమాను డడుగగా నేనప్పుడు మన పురాణములలోని రాక్షస మాయలును కామరూపములను స్మరణకు దెచ్చుకొని, పూర్వము మారీచుడు మాయలేడి యగుట

సత్యరాజాపూర్వదేశయాత్రలు

వాతాపి మేక యుగటయు శూర్పణక మనుష్య స్త్రీ యుగుటయు తలంచుకొని మనస్సు సమాదపరుచుకొని , ఇపుడు తెలిసినదని గద్గదస్వరములో మత్తరము చెప్పితిని గాని నా మాట యతనికి యినబడినదికాదు.

లంకాద్వీపము

ఆదినము నా యజమానుఁడు మనస్సులో మిక్కిలి యుల్లాసముగా నున్నందున నానావిషయములను గూర్చి నాతో సల్లాపించుచు తన పెద్దల ప్రసంగము తెచ్చెను. అప్పుడు నేనందుకొని పూర్వచరిత్రమును తెలిసికొన వలెనన్న యభిలాషతో రామాయణము నందు వర్నింపబడిన రావణుని మంత్రి యైన మహాకాయుఁడు మీకేమి కావలెనని యడిగితిని. అతడు పయివంకజూచి వ్రేళ్ళుమడిచి లెక్కవేసి యాఁతడు తన వంశమునకు మూల పురుషుఁడగుటయు, చెప్పి వెచ్చమార్చెను. నేనును వ్రేళ్ళుమడిచి యుగ ప్రమాణమునుబట్టి రామరావణ యుద్ధము జరిగిన త్రేతాయుగము నుండి లెక్కవేసి, ద్వాపరయుగ ప్రమాణ సౌర సంవత్సరములు ౮౨౪౧౫ సంవత్సరములు రెండు మాసములని రాక్షసుల యాయుగప్రమాణమును నిణ౯యముచేసి, మీరు వెచ్చరూర్చిన కారణమేమని నాయజమాను నడిగితిని.

మహాకాయుఁడు- మాపెద్దల స్ధితిని దలఁచుకొని యిప్పటివారి యల్పాయుష్కతయు నల్పశక్తియు నల్పకాయత్వమును విచారింపఁగా దేశాభిమానము గలవారి మనస్సులో దుఃఖమెట్లు కలుగకుండును? సత్య-మీమాటాలు నాకు వింతగా నున్నవి. మహా- ఏమివింత? మాపూర్వుఁడొకఁడు భూమిని చాపగా చుట్టి చంకక్రింద పెట్టుకొని పరుగెత్తును కదా! ఆతని శక్తి ముందఱ నిప్పటివారి శక్తి యెంత? ఏదీ యిప్పడొక్కరిని భూమిని కాదుగదా, యీద్వీపమును చాపగాచుట్టుమను చూతము. పూర్వమొక మహాపురుషుఁడు సముద్రము మోకాలిబంటిగా తిరుగుచుండఁగా నాతని మేద సత్యరాజా పూర్వదేశయాత్రలు

స్సుతోఁగదా యీభూమి చేయఁబడినది! ఇప్పుడు భూమండలమంత కాదుగదా శిరస్సులో మాద్వీపమంత మెదడున్నవాని నొక్కని జూపుము. జనులంతకంత కల్పాకాయులగుచున్నందున కీయొక్క నిదర్శనము చాలదా? అల్పకాయులు నల్పశక్తులు నగుటచేతనే మావారంతకంత కల్పాయుష్కులు కూడ నగుచున్నారు.
సత్య ---- త్రేతాయుగమునుండి నేఁటివఱ కొక్క పురుషుఁడే మీ లంకను రాజ్యము చేయుచుండగా మీవా రల్పాయుష్కులనెదరేమి?
మహా---- చిరకాలజీవి గనుక విభీషణుఁ డొక్కఁడు మాత్రమింతకాలము రాజ్యము చేసినాఁడు. అప్పుడే రెండు యుగములలో నాతని రాజ్యకాలములోనే పండ్రేండు తరములు చెల్లిపోయినవి. అతని కిప్పుడు పండ్రేండువతరమువారు మంత్రులయినారు. తానొక్కఁడు బ్రతికియున్నను భార్యాపుత్రాదులు మృతులగుటచేతనే కదా విరక్తుఁడయి విభీషణుఁ డిప్పుడు రాజ్యము మంత్రుల కప్పగించి నువేలాద్రియందు తపస్సు చేయుచున్నాఁడు ! ఇట్టిదుష్కాలమును జూచి నేనెట్లు చింతిల్లకుందును?
సత్య---- ఓ మహాకాయా! మాదేశస్థితిని దలఁచుకొనఁగా మీకు కలుగుచున్న విచారమే నాకును కలుగుచున్నది. మావారంతకంత కల్పాయుష్కులగుచున్నారు. పూర్వము దశరధుఁ డఱువది వేల యేండ్లు రాజ్యముచేసినాఁడు.ఇప్పుడాఱు నూఱేండ్లు బ్రతికినవాడయి ననులేఁడు. అగస్త్యుడు సముద్రోదకమునంతను పానముచేసెను. ఇప్పుడొక్క చెఱువెడు నీళ్ళు త్రాగువాఁడయినను లేఁడు.
మహా---- పూర్వము మీవా రంతటి స్థూలకాయులుగా నుండినందుననే మా పెద్దలు మనుష్యాశనులయి కడుపునండ తృప్తిగా భోజనము చేయుచుండెడివారు. నిన్నుఁ బట్టి చూడఁగా మీమనుష్యులిప్పుడు

                                                   లంకాద్వీపము
                                            343

మాకొక్క ముద్దకయినను చాలనట్టు కనఁబడు చున్నారు. అయినను పూర్వాచారము విడిచిపెట్టరాదు. శిష్టాచారమును మిఱులుకంటె లోకములో పాపము మఱొక్కటిలేదు. కలిమహిమచేత చండశాననుఁడైన మావిభీషణమహారాజు మనుష్యభక్షణము నిషేధించి పాపము కట్టుకొన్నాఁడు గాని రాక్షసుల కులధర్మమయిన మనుష్యాశనతను మానిపించి శాష్టాచారము చెడఁగొట్టుట నీతికాదు. నేనీసంగతిశిష్టాచారము మిఱరాడని చెప్పుచున్నానుగాని యల్పాంగులయిన మనుష్య కీటకములను తినుటచేత మాకడుపులు నిండునని చెప్పుచుండలేదు.


ఓ భరతఖండ నివాసులారా, ఈతఁడు విభీషణుని పరిపాలనలో నున్నను మనస్సులో తన రాక్షసస్వభావము నెట్టువిడువకున్నాఁడో చూచినారా, నే నధికముగా మాటాడినచో నాపాపాత్ముఁడు నన్నెక్కడ నోరవేసుకొనునోయన్న భీతిచేత మఱేమియు మాటాడక, జీవహింసయు నందులో వరవధము నంతకంటెను ముఖ్యముగా బ్రహ్మహత్యయు పాపములని చెప్పువలెననినాలుక చివరకు వచ్చిననుబలవంతముగా నాపుకొని యూరకున్నాను.ఇప్పుడు లంకలోఁగూడరాజభక్తులనఁబడెడు విభీషణ పక్షమువారైన నవనాగరికులు కోందఱుబయలుదేరుచున్నన, మహాకాయుఁడు పూర్వాచార పరాయణులయిన శిష్టాగ్రగణ్యుల లోనివాఁడు ఈకధ సాగినకొలఁదిని లంకలోనున్నయిగు తెగలవారి చరిత్రములును గొంత కొంతవచ్చును గనుక ప్రస్తుతమా విషయుమును విడిచి పెట్టుచున్నాను.