కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/సత్యరాజా పూర్వదేశ యాత్రలు-ద్వితీయభాగము-ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సత్యరాజా పూర్వదేశయాత్రలు

 

హిడిం ---- ఇక్కడకు నాలుగుయోజనముల దూరములోనున్న తోఁటలోనున్నది. దారిచూపెదను రండి.

అని వారిని తిఅసికొని హిదించి ప్రక్కపండునకు తిరిగి యదృశ్యయైనది "మీరనుకొన్ని నాలఖిల్యుఁడను నేనే ! నాపేరు సత్యలను పేరులు పెట్టిపిలిచి కొంతుపగులునట్టుగా నఱచితినిగాని నామాట వారు వినిపించుకొన్న వారుకారు. పొదనుండివెడలి వారివంట పరుగెత్తుటకు తాటక కఱ్ఱగొనివచ్చి యెడ్కడచావమోఁదునో యన్నభీతిచేతి నాకు సాహసము లేకపోయినది.

                                  ----

ఎనిమిదవ ప్రకరణము.                                                                    ----
హిడింబి నన్ను పొదలోఁ గూరుచుండఁ బెట్టి పోయినతరువాత మనస్సులో పరిపరిలాగున నాలోచనలు కలుగఁజొచ్చినవి. తాటక కఱ్ఱగొనివచ్చి చావఁగొట్టునేమోయన్న భయము మొట్టమొదట పుట్టినది. గాని యారక్షసిపెట్టెలోనున్నది యెలుక యనుకొని యెలుకను చాపమోఁదునిమిత్తము కఱ్ఱకొఱకు వళ్ళినదన్నమాట స్మరణ్కకు వచ్చినతరువాత భయనివారణమయినది. ఇంతలో హిడిఁబివచ్చి నన్నుపట్టుకొని యేమిచేయునో యన్నభయము మఱియొకటివచ్చి నామనస్సును మఱింత బాధింపఁజొచ్చినది. హిడింబి చేతిలోమరలఁ జిక్కకొన్నపక్షమున నాకు మరణవేదకన్నను క్రూర తరమయిన బాధ సంభవించును, అది నన్నొడిలోఁ బెట్టుకొనిపోయి తనచెలియైన త్రిజటకు మరల సమర్పించినపక్షమున,త్రిజటనన్నేమి బాములఁబెట్టునో!

లంకాద్వీపము


మరల నేపెట్టెలోనో పఱపుక్ర్రిందనో పెట్టి త్రిజట నన్ను దాచినపక్ష మున నేనీసారి యూ పిరివెదలక యజ్ఞా పశువువలె చావ వలసి చ్చును .అని యాలోచించుకొని హిడింబిచ్చులోపలనే పొదవిదిచి పాఱిపో వలెనని నిశ్చయించుకొని నేను మెల్లగ పయికి వెడలివచ్చి యొక చెట్టు చాటునకు నడిచితిని. ఇట్లొక చెట్టుముదలుచేరి నలుదిక్కులకును చూడ్కి నిగిడించునప్పటి తాటక చేతకఱ్రధరించి మ్యత్యుదేవతవలె నావంకకే వచ్చుచుండెను. మరియొక దిక్కునుండి శ్మశానములుదాటి పెద్దవనరమొకటి నావంకకే వచ్చుచుండెను. ఇంకొక దిక్కు నుండి యాపురుషులను విడిచి హిడింబి యొక్క తెయునావంకకే పరుగెత్తుకొని వచ్చుచుండెను. త్రేతాగ్నులవలె మూడు రూపములును నాకంట బడగానే నాకప్పడు ముగ్గురు మృత్యుదేవత లాసన్న మయినంత భయమునేసినది. చెట్టున కెగబ్రాకుదమన్న దాని ప్రకాండము నాకొగిటి కొదుగదు తొఱ్రలో దూరుదమన్న నెందు వెదకినను తొఱ్ర గానరాలేదు. ఏమిచేయుటకును దోచక నేనుదిగ్భృమ నొంది దిక్కులు చూచుచుండగా ముండగా హిడింబి వచ్చి పొదచేరి నన్నే కాబోలును వెదక నారంభించెను. ఇందులో తా టకవచ్చి పెట్టెచేరి మూత తెఱచి యాశ్చర్యపడ నారభించెను. అప్పుడు తాటక హిడింబిని జూచి నీవాపొదలో నేమి వెదకుచున్నావని యడిగెను. నీవు కర్రకొరకు పోయిన తరువాత నెలుక యెంత యున్నదో చూడవలెనన్న చపలత్వముచేత పెట్టెమూత యిట్టెతీయఁగా నొక్క యెగురెగిరి యీవలబడి యెలుక యీపొదలో దూరినందున దానిని వెదకు చున్నానని హిడింబి యుత్తరము చెప్పెను. నేనామాట లాలకించుచు నేమఱియున్న సమయమునందు మెల్లగా వానరము నావద్దకు వచ్చి నన్ను చంకఁబెట్తుకొని చెట్టుమీదికెగఁబ్రాకెను.నాదుస్స్పప్న ఫలమిపిడు నాకు పూర్ణముగా ననుభవమునకు వచ్చినది.నాకు కలలోఁ

53

సత్యరాజాపూర్వదేశియాత్రలు

గనఁబడిన కోతియేయిప్పుడు ప్రత్యక్షమయినన్ను వృక్షాగ్రమునఁబెట్టినది. అక్కడనుండిక్రిందకి జాఱిపడితినా చట్రాతిమీఁదఁబడిన గాజుకాయ వలెనాతల వేయివ్రక్కలుకాకమానదు. ఏకొమ్మనైనను గట్టిగాకౌఁగిటఁ బట్టుకోవలెనన్నుపట్టు కోనీయకయీపాడు కోతియెడమచేతితో భల్లూకపుపట్టుపట్టినన్నొడిలోఁబెట్టుకొనికదలనియ్యకున్నది. చెట్టుపయిని నేనిట్టియవస్థలోనుండగా క్రిందహిడింబి యుతాటకయునన్ను వెదకుచునేనున్న చెట్టుమొదటికివచ్చిరి.

తాట-అయ్యో!చేతఁజిక్కినయెలుకనునిష్కారణముగాఁబోగొట్టితివిగదా!
హిడిం-నీవుకఱనిమిత్తమయిపోయియెంతసేపటికినిరాకపోఁగానెం తపెద్దయెలుకోచూడవలెననిమూతకొంచెముతీయఁగానేయెలుకపైకుఱికిపాఱిపోయినది.

తాట-మహాకాయునియింటనున్నవాలఖిల్యమహర్షినెవ్వరోయెత్తుకొనిపోయినారనిచెప్పుచుండగావినుచునులుచుండుటచేతకఱతెచ్చుటకుకొంచెమాలస్యమయినది.ఎలుకపైకి రాఁగానే తఱుముకొని పోయిపట్టు కోలేక పోయినావా?

హిడిం:ఇంతలో మహాకాయుని భృత్యులిద్దఱిక్కడకు వచ్చియుండని యెడలదానినినేనుపోనిత్తునా? వాలఖిల్యమహషి౯రాత్రి యంతర్థాన మయినమాటచెప్పుచువారునన్నుకొంతదూరముతమవెంటఁగొనిపోయినారు.

తాట-ఇక్కడకలుగులులేవు.ఎలుక యీచెట్టుపైకిప్రాఁకలేదు గదా?
హిడిం-ఎలుకలుచెట్లెక్కునా?
తాట-చూచితివాచెట్టు మీఁదనెంత పెద్దవానరమున్నదో?
హిడిం-ఏది? అదా? అవునవును. దానియొడిలో నేమో యున్నట్టున్నది.

         లంకాద్వీపము
     తాట—అదృశ్యుఁడయిన వాలఖిల్యునినలే కనబడుచున్నాఁడు. అవునవును. అతడే. మారొడిపిల్ల పొయినప్పుడు ప్రశ్నయడుగఁ బోయిన వాలఖిల్యుఁడితఁడే.

హిడిం—ఈవాలఖిల్యుడు మకుదొరికిన బాగుఁడును. మనత్రిజట వాలఖిల్యుని జూడవాలెనని యెన్నొసారులు నాతొఁ జేప్పినది. మనమితని దీసికొని పొయి యామెచేతికిచ్చి రెండుముఁడు మినములు మనయింట నుంచుకొందము,

తాట—నీవన్నయాలొచన బాగున్నది. ఈలొఁతిని జెదరించి మన మావాలఖిల్యునిపట్టుకొంటిమా వేయి సువణములు సంపాడించి మనము దనికురాండ్రము కావచ్చును. మహకాయుండేంత సొమ్మిచ్చి యైన నీతనిని వదల్చుకొని పోకమానఁడు,

హిండి—అట్లుయిన మన మివాలఖిల్యుని పట్టుకొందము. నీవు చేట్టెక్కఁగలవా

తాట—ఎలుకను బట్టుకొనుకయి దుమికెడుపిల్లివలె నేని చేట్టుమిదికొక్క గంతువేసి వాలఖిల్యుని బట్టుకొనెదను, నివికరచేతఁబట్టుకొని క్రొఁతి క్రిందకురీకి పారిపొకుండ జాగదూకతతో కాచి చూచుచుండుము.

ఆమాటలు వినునప్పుడు నాబ్రతుకు ముదరికివచ్చిన గొయియు వెనుకకుఁబొయిన నూయియు వలెనుండెను.ఈముగ్గురిలో నెవ్వరిచేతిలోఁబడినను నాకు ప్రానసంశయస్దితియే సంబవించును, ఆముగ్గురును త్రేతాగ్నులనుగా నేనీవరకె పొల్చియున్నానుగదా నన్నుఁగొనిపొయి దక్షీణస్వీకరించి విడువఁదలఁచినందున తాటాకను దక్షిణాగ్నియనవచ్చును. నన్నుఁగొనిపొయి తనచెలికతెై కర్పించి నను గ్నహపతినిగాఁ జేయఁదలఁచి నందున హిడింబిని గార్హపత్యాగ్ని యనవచ్చును. నానొటిలొనేదొ క్రుక్కియె తోఁక నామెడకుఁ జుట్టఁ


సత్యరాజా పూర్వదేశయాత్రలు

బెట్టియోహోమము నిమిత్తమై బ్రాహ్మణులు పశువును బట్టీట్టుగా నూపిరివడలనియ్యకనాప్రాణములు గొనఁదలఁచినందున మక్కటమునాహవనీమాగ్నియని చెప్పవచ్చును.ఈమూఁడగ్నులలో నాకప్పుడుదక్షిణాగ్ని మేలుగతోఁచి నందున నాయజమానుఁడైన మహాకాయుని వద్దఁజేరి సుఖింపవచ్చునన్నయాశచేతనేను తా కచేతిలోఁజిక్కిఁదలఁచు కొని వానరముయొక్క యొడిలోనుండిదుమికి యారాక్షసినికౌఁగిలించుకొనుటకయి చేతులుచాఁచుకొని సంసిద్ధుఁడనయి కూరుచుండియుంటిని. తానొకటి తలఁచిన దైవమొకటి తలఁచునుగదా! తాటక వృక్షమారోహించుట చూచి యాదుష్టవానరము నన్ను విడిచి పాఱిపోకి తనతోఁకను నేను మొదట ననుకొన్నట్టుగా నామెడకుఁగాక నాపొట్టకు చుట్టఁబెట్టి నన్ను తనవీపుమీఁద నదిమిపెట్టి యా చెట్టుమీఁది నుండి మఱియొక చెట్టుమీఁదికి దుమికెను.అంతట తాటక చెట్టు దిగివచ్చి హిడింబితో నేమో యాలోచించి వానరమును రాళ్ళతో విసరనారఁభించెను.దానికి సహాయురాలయి హిడింబియు మామీఁద శిలలు రువ్వసాగెను.ఆ శిలాయుద్ధమునకు తాళఁజూలన వానరరాజు చెట్టుమీఁదినుండి యుఱికి నన్ను వీపుమీఁద వేసికొని పాఱిపోవఁ జొచ్చెను. వెనుకనుండి యఱచుచు నారాక్షసాంగన లిరువురును మమ్ము తఱుముకొని వచ్చిరి.ఇట్లు కొంత దూరము పరుగెత్తు నప్పటికి వెనుకఁ జెప్పిన మహాకాయుని భృత్యులిద్దఱును ప్రక్కదారినివచ్చి వారిని గలిసికొని యేలపరుగెత్తుచున్నారని యడిగిరి. ఆ చెడుకోఁతి వాలఖల్యుని నెత్తుకొని పాఱిపోవుచుండగా విడిపించుటకయి పరుగెత్తుచున్నానమని వారుత్తరము చెప్పిరి. ఇట్లు నలుగురును నొక్కచోటఁ జేరునప్పటికి పూర్వము నన్ను మందోదరి యప్పుడప్పుడు తీసికొని వచ్చెడి యుద్యానవనముకడకు మేము వచ్చితిమి.ఆంట నలుగురును గలిసి తన వెంటఁబడ మర్కటరా జణుమాత్ర

లంకా ద్వీపము

మును భయపడక నన్నువిడువక యక్కడ నుండి యెక్క యంగ వేసి యెగిరి సువేలాద్రిమీదిఁకి దుమికెను. ఆవానరుఁడు గంతువేసిన స్ధలమునకు నువేలాద్రి నాలుగు యోజనముల దూరములో నున్నదని నేనంతకుముందే మందోదరివలన నెఱఁగియున్నామ. మర్కటము నన్ను వెన్నునఁ బెట్టుకొని కుప్పించి యుఱకఁబోవునప్పుడు దైవమాత చేత నాకొక్క యాపులింతవచ్చినది. పూర్వాచారపరాయణుఁడు నగుట చేత పెద్దల యాచారమును మీఱరాదని నేనప్పుడు కొఁడంత యాపదలో నున్నను నాయాపులింత పోవువఱకును చిటికలు వేయుచుంటిని ఆకోఁతితో నేను సువేలాద్రిశిఖరమున వాలునప్పటికి లెక్కవేయఁగా నాచిటికలు సరిగా పడియైనవి. ఆలెక్కను బట్టి పది చిటికలు కాలములో వానరము నాలుగు యోజనములు దూరము దుముకునని నేను తెలుసుకొంటిని. అప్పుడు నేను ముందువంకఁ జూచునప్పటికి నాయెదట లవణసముద్రము మేఘమండలములనంటు తరంగములతోను మేఘనాదములతో వియ్యమందు సంతతధ్వనితోను భయంకరముగాఁ గానఁబడెను. వానర మింక ముందు వంకకు పాఱిపోవుట కనకాశము లేనందున నలుగురువచ్చి చుట్టువేసి నన్ను దక్కించుకొని మహాకాయమున కియ్యవచ్చునని నాలోనేను సంతోషపడుచుంటిని. ఇట్లు నేను మనోథర సామరాజ్యానందము నొందుచుండగానే వానరము కుప్పించి ముందువంక కుఱుకుట కుద్యుక్తమయి యున్నట్లు కనఁబడెను. అంసుచేత నేనీసారి యెంత దూరము దుముకునో చూడవలె నన్నుయుత్సాహముచేత ముందు సముద్రమన్న మాట మఱచి పోయి చిటికలు వేయుటకు మొదలుపెట్టితిని. ఇన్నూటయేఁబది చిటికలు లెక్కపెట్టునప్పటికి వానరము నన్నుగొని సముద్రమున కావలి యొడ్డుననున్న యొక విశాలమైన యిసుకతిప్పిలో వ్రాలినది. అప్పుడు నేను గణిత శాస్త్ర ప్రకారము లెక్కవేసి యిన్నూటయేఁబదింటిని పదింటిచేత

సత్యరాజాపూర్వదేశయాత్రలు

చాగింపఁగా వచ్చిన లబ్ధి మిరువదియైదుకాఁగా, పదిచిటికల కాలములో దుముకఁగల దూరము నాలుగుయోజనములు చేత నిరువదియైదును నాలుకు చేత నిరువదియైదును నాలుగు చేత గుణించి సముద్రము యొక్క వెడవులు సరిగా నూఱుయోజనములని తెలిసికొని నేనత్యాశ్చర్య పడితిని. ఆహా! మన పూర్వుల సామథక్యాము నేమని శ్లాఘీంతుము! వారు నిజముగా సర్వజ్ఞలేనిండీ. అణుమాత్రమయినను హెచ్చుతగ్గులు లేక నూఱు యోజనములని రామాయణములోఁ జెప్పినదానికిని నేను కన్నురాలా కొలిచి లెక్కవేసినదానికిని సరిగా సరిపోయినది. లంకకును మనదేశమునకును నడుమనున్న సముద్రమిదియేకదా? నేను సముద్రమును దాఁటునప్పుడు శ్రీరాములవారు కట్టిన వారధిని స్పష్టముగా జూచినాను. మనుష్యులు లంకకుఁ బోవకుఁడుటకయి మరలివచ్చునప్పుడు శ్రీరాములు వారు కట్టను నడుమనడుమ తెగఁగొట్టీన సందులను నాకంటికి కరతలామలకముగాఁ గనఁబడినవి. మన పూర్వులను గురించి యాలోచించుచు నేను కొంచె మేమఱియుండగా వానరమన్నను వన్నుమీది నుండి తోఁకతో పైకెత్తి మఱియొక్కదుముకు దుమికినది. ఈసారి నేను వీపు మీదనానుకొని ద్రడముగా నుండక వాలమున వ్రేలుచు భయభ్రాంతుఁడయిన యుండుటచేత చిటికలు వేసి దూరమును కనుఁగొన లేకపోయినాను. నేనిట్లు దిగ్భ్రమ నొందియుండఁగానే యావానరము నన్ను నట్టడవిలో విడిచి యద్రుశ్యమయినది. అప్పటికి సూర్యగతిని బట్టి నాలుగయిదు గడియలు ప్రొద్దెక్కినట్టు తోఁచినది. కన్నులువిచ్చి చూడఁగా నక్కడి చెట్లు మొదలైనవి లంకలోని వానివలె నత్యున్నతములు గాక మనదేశములోని సామాన్య వస్తుజాలము వలెనే యున్నవి. ఆవాసరము యొక్క వీపునానుకొని సముద్రను దాటునప్పుడు నాకు తోఁచలేదు. గాని నన్నిక్కడకుఁగొనివచ్చి విడిచిన యా మహానుభావుఁడెవ్వఁడా యన్న్నయాలోచన నా మనస్సునకిప్పుడు కలిగినది. అతఁడు వాయు

లంకాద్వీపము


పుత్రుఁడైన హనుమంతుఁడయినందుకు సందేహము లేదు. ఆతఁడు హనుమ@ంతుఁడే కాకపోయినచో శతయోజనాయామమయిన సముద్రము నొక్కయంగును దాఁటుటకు మఱియొక్కనికి సాధ్యమగునా? కాదు మన పెద్దలు చెప్పినట్లుగా నతఁడు రావణాసురుని కాష్ఠమారి పోకుండునట్లుగా ప్రతిదినము తాను డంతధావనము చేసికొన్న పుడకల సందు వేయుటకు పోవుచుండును గాన నేఁటి యుదయమున నన్ను జూచి జాలిదలచి పాపలేపము లేని నేను రాక్షసుల దేశమనుండి రాలేనని యిక్కడ తెచ్చి విడిచినాడు. నేనీ యడవిలో ఘాతుకమృగములు వాఁతబడక బ్రతికి యిచ్చటివారి యండఁజేరఁ గలిగినపక్షమున, రెండు మూఁడు మాసములలో వారిభాష నేర్చుకొని తరువాత నా కధను మీకు మహాత్ములచేతఁ బంపెదను...సంపూర్ణము..