కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధము-ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ

శుద్ధాంధ్రనిర్థోష్య నిర్వచన నైషధము.


ప్రథమాశ్వాసము.

శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము

సీ.నేర్చుకొలద్రిని నేజ్రేయదొరక్రొన్న
యీనలుకత తెఱం గెట్టిదనినఁ
దొల్లికానలలోన నెల్లెడద్రిరుగుచు
నొగిగొంతితొలికొడు కొక్కనాడ్రు
సై దోడ్రులనుగూడి చక్కగ్రాగ్రూర్చుండి
జడదారియొక్కండు సరసకరుగు
దెంచిన గనిలేచి యించుకయొదురేగి
కొనితెచ్చిజోహారులొనరజ్రేసి
యొకకడానిగద్దియగ్రూరుచుండననిచి
తనకుగ్రూళలౌ దాయలు కినుకతోడ
నెఱిగ్రిచేసిన కడగండ్ల నెల్లనోలి
నెఱుగ్రజ్రేయుచు నాతని కిట్టులనియె.

ఉ. ఓజడదారిరాయ యొరుడ్రొక్కడ్రు నాసరిగాగ్రగ్రానలో
దేజుతొఱంగి యంగదలద్రేలుచు లచ్చిని నేలజ్రుట్టలం
దాజతకూడు నెయ్యునిని దద్దయుగ్రూడుట లేకనిచ్చలీ
యోజనుదూలిహెచ్చుడిగియుండగ్ర జూచితె తొల్లియెచ్చట౯.

గీ.అనుచుగ్రన్నులనీరొల్కనాడియూర
కున్న జడదారియూరార్చి చెన్నుదఱిగి
సరసగ్రూర్చుండియున్న యాదొరనుగూర్చి
యెట్ట కేలకు నల్లననిట్టులనియె.

గీ.నేలజేజేలగ్రూడి జేజేలకుద్ది
యైనసైదోడులును దేరులలరగ్రాన
నుండనరుగుదెంచితిగా దెయూరకిచట
కెక్కుడై నయట్టియెఱుక యెడద్రద్రవర

ప్రధమాశ్వాసము

గీ.తొల్లి జూదాననలుడోడ్రితూలియకట
తనకుగ్రలసిరులన్ని యుదాయగొనగ్ర
నొక్కరుడ్రెచేటులొందడ్రే యుక్కుదక్కి
కానలోనజ్రక్కనితనచాసద్రొఱగ్రి.
గీ.అనినగ్రఱ్ఱియున్న యాకతయెఱుగ్రంగ
గోరుటయునుగోర్కికొనలుసాగ్ర
జదురుగులుకనిట్లు జడదారిరాయండు
తెలియజ్రేయద్రొడగ్రె దేటగాగ్ర.
గీ.ఎసగ్రునలుడ్రనుఱేడ్రొక్క డ్రెన్నరాని
దండులెచ్కటగ్రనుగ్రొన్ననిండియుండ
నేలునతడ్రునిషధయనునేలద్రనదు
చేత్రలొరులెల్లనగ్గించి చెలగ్రుచుండ.
క.ఇంతయుగ్రొదలేకుండగ్ర
నెంతయుద్రాజన్నిగట్లకిచ్చునునిచ్చిల్
కొంతయుజాలిగొనక తన
చెంతద్రిఱుగునతనినైన జెడుగుంద్రుంచున్.
క.ఓలిన్నలుగ్రొనియాడగ్ర
దేలిక దాతయును గాలితిండుల ఱేడ్రుం
జూలుదురే యొకరొకరికి
నాలుగుజంటయిదునూఱ్లునౌదలలున్నన్.
గీ.అట్టిచక్కనయ్యకునుద్దియైనరాచ
యేనుగ్రులగొంగయొక్కనాడ్రేగుదెంచి
తోట్రలోనికొలక్రుచెంతదోడులేక
యొక్కరు డెయిట్టటుతిరుగుచున్న తఱిని.

శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము

క.అంచలరాయండొక్కడు
కొంచక తనయనుగు జెలులుకొందఱతోనే
తెంచియెదుటనేలకుడిగి
యించుకనడయాడజూచి యిచ్చనలరుచున్.

క.ఒడయండంతటనంచల
నడల తెఱంగెల్లగాంచి నగుచుగడంక౯
గడుకొనియొకరాయంచను
దడయక చిక్కించుకొనియెదనకెగేలన్.

ఉ.దానిదొఱంగియేగుటకు దాళకయంచలు కొంతచెంగటన్
జూనుగనుండికన్గొనుచు జయ్యననేగుచు జాలిదూలు చుం
గానగనేగుదెంచుచును గ్రక్కుననాతని నిక్కిచూచుచున్
దానినిజీరుచుం దుదళుదద్దయు డస్సితొలం గెనచ్చటు౯

గీ.అట్లుచిక్కియంచ యారాచరేఱేడు
తనకుగీడుసేయుననితలంచి
యేలికకుడిచేత నాలుకతడియాఱ
నిలిచికన్ను గొనల నీరుతొరంగ.

గీ.అళుకుగదిరియొడలు దడదడలాడంగ
నోరురాకకొంతయూరకుండి
యెట్టకేలకింత యెదగట్టిచేసికొం
చెలుగుపన్నగిలగ నిట్టులనియె.

క.ఏటికినరుదెంచితినీ
తోటకునిందేలచెలుల తోడదిగితి న
న్నేటికి నేలికలోగొనె
నేటికిని నేగితలగ నెయ్యదితెరఱగో.

ప్రధమాశ్వాసము

క.అనితనలో ననుకొనికడు
నెనరుగలుగు నట్టుగాగ నెట్టననలునిం
గనుగొనుచునీరెలుంగున
ననియెం దనతెల్ల ఱెక్కలార్చుచుగణక౯.

సీ.ఎల్లచోనారాక కెదురుచు చూచునుండు
నెలంతుకయెదనెంతి తలకెనొక్కొ
యేరేయినన్నొంటి నిలుదాటనీకుండు
కన్నతల్లియదెంత కలగెనొక్కొ
తోడునీడలలాగు తొలగనిచెలికాండ్రు
సోలినన్ గనకెంతతూలిరొక్కొ
నేజేరుటయెఱింగి నెనరునజనుదెంచు
కొడుకులు తారెంతో కుందిరొక్కొ
కూడియెల్లరిది తెలిసికొన్నయంత
గటకటా తాతనీచేత గడకునేడు
చిక్కగాజేసె నేనెద్దిసేయుదింక
హాళినన్నేలు ఱేడనేననదనైతి.

మ.అనినందద్దయు జాలినొందుచునతండాయంచ జుట్టాలతో
జనగా నావతియిచ్చె దాననళుకుం జాలించిరాయంచయుం
దనకాఱేడొనరించు లగ్గునకుగా దానొండుసేయంగలో
ననయెత్తంగడునంతసిల్లి దొరచెంతంజేరి తానిట్లను.

గీ.ఆయనీయట్టిచాగికి నగునటంచు
నేనుజేసెడు లగ్గించుకైనగలదె
యైననానేర్చు నట్లుగనేనునొక్క
లగ్గుసేయంగ నెడదడలంచినాడ.

శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము

క.ఆయదిచేకొనడగునని
యీయెడ నేలికకు దోచెనేనియునింకన్
నాయెడనెనరొలయగసి
కూయాలించెదరుగాక గొనకొయనుచు

గీ.కఱ్ఱినెచ్చెలి తొలియాలిగన్న తండ్రి
యేలియుటను సిరులచేనెపగినట్టి
యూరుచెన్నారు సరిపాటియొకటిలేక
తఱచుకోటల నెఱయగడ్తలజెలంగి

గీ.అట్టియూరేలునెంతయుదిట్టయైన
యట్టిక్రథకైశికుండనునట్టిజెట్టి
కడగియాతండుకుఱ్ఱలగనుటలేక
కొన్నినాళులు రాయిడిగుందికుంది.

గీ.దాకుగుడితట్టున గుఱుచయాకదిసిన
యయిదయిదుల నాల్గగు తెనుగక్కరాన
దనరుదనుడను నొకజడదారిఱేని
నాలుదానును నిచ్చలుజూలగొలిచి.

గీ.ఒనరుగా నేడునాల్గులయొక్కటగుచు
దనరుతెనుగచ్చరాననుదయలసందు
కూడినద యంతియనజెల్లు కూతునోర్తు
దనరుకొడుకుల నిద్దఱగనియె నతడు

గీ.వేలగలయూళ్ళునేళ్ళునునెఱివిదిరిగి| యెందుగోర్కియీడేరకకుందికకుందికడకు
దమమడనియెడు నొకజడదారిఱేవి|
నాలుదానుమవిచ్చలు జాలగొలిచి.

గీ.అతనినెవరింతగడియించియలరుకతన|
గోరిదమయంతయన జెల్లు కూతువోర్తు
దమమడుదమదాంతు డువవదవరునట్టి|
యమగుగొడుకుల నిద్దఱగనియెఱేడు.

ప్రధమాశ్వాసము

గీ.అందుఁగన్నియ తనరారుఁజందురల్లు
నలరుచిలుకన జక్కుల చెలులునచ్చ
రలునుగాలికూడుదొరలకలునుడ
లంచిచూడదాని కెనయెయించు కై న.

సీ.కలికి నెన్నడకోడి కలయంగనంచలు
కొలఁకులకక్షనుండె గోర్కిదక్కీ
చెలియడుగులకోడి చెందొగల్ దలలోతు
నీటిలోదిగజాఱె నీటుదక్కి
నెలతకొనునకోడి నెఱహ త్తి సూడులు
కాననుండఁగఁజొచ్చెఁగడఁకదక్కి
కన్నె యొడలికోడిక్రొన్ననలెల్లెడ
నలిగి యెండఁగఁజొచ్చెనాపదక్కి
యౌరయాచాన సొగ సెల్ల నాలకించఁ
గలిగిననుగానఁదిరుగుచు గాలినీరు
నాకులునుగుడిచెడుజోగులై నఁదాళ
లేకతొగలఱే నల్లునికాఁకగొనరె.

క.కన్నులుజిగితొగఱేకులు
సన్ననినూగారు తేటి చాల్తొడలరఁటుల్
నెన్నఁడలేనుఁగునడకలు
నెన్నుదురరచందురుండు నెఱులెన్ననిరుల్.

సీ.చిగురులఁగఱకుగాఁ జేసినయాఱడి
తేఁటులఁజెట్లఁజెందించురట్టు
జిగితొగలేఱులఁజేరఁజేసినసేగి
యంచలఁ గొలకుఁలనుంచునగడు

శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము
క్రొన్ననగుత్తులగూలజేయుకొఱంత

యనటులజొదతోడనొనరుచుపడి

యేనుగుగొంగలగాననుంచినయెగ్గు

తరగల గ్రుంగంగ దార్చుకీ ప్రథమాశాసము

గీ . అట్లుచేరియంచ యాయోలనాగకై
యించుకంతచూచి యిట్టులనియే
నోనెలంతనలుని యొద్దనుండియరుగు
దెంచితినిట కేనుదేలియనరయ .

క .రిక్కలరాయనిఁగందుని
జక్కులుదొరయనుఁగుఁగొడుకుఁ జక్కఁదనానం
జిక్కఁగఁజేసెడునేలిక
నొక్కింతయు నెన్నఁగలఁడె యొకఁ డీనేలన్ .

క .ఒడలెఱుఁగని సిరికొడుకుం
గడునలచు నుండునట్టి కడలియుసరియే
యొడయనికిన్ సొగసుననె
క్కుడులోఁతుననెంచి చూడఁగులుకులదొంతీ .

గీ .చందురనిసాటియౌ రాచచందుతోడ
నల్లరోహిణికిని నెనయైననీకుఁ
గోర్కులిగిరొ త్తఁగూడుటకూడదేని
నిదుసొగసెల్ల రి త్తయౌనెంచి చూడ .

మ .అనుడుందొయ్యలి దానికై తిరిగి యోయంచాతఱింజూచియా
యనదగ్గర నెట్లుగాఁదెలియనొయ్యంజాటి తాలాబ్గునే
చని యా యేలికయొద్దనన్నునుదగం జూటించనీనేర్చున
ట్లననుంగోరఁగఁ జేసియిద్దఱును జుల్కంగూర్చియేలంగదే

క .నాచదురు సొగసునుంజని
చూచినదెఱిఁగించినన్ను నూడిచడినన్
నీచేసివలగ్దెన్నఁడు
నాచకమొఁదలుచుకొందు నంచాయనుడున్ .

శుద్ధాంధ్రనిరోష్థ్యనిర్వచన నైషధము

 
ఉ . అంచయునచ్చటుంగదలి యంతయునొంటిగ జేనితోనెఱిం
గించితనంతటంజనియే నిచ్చట నంతనలుండునొంగియొ
క్కించుక చిల్కతేజిదొర హెచ్చుహళాహళికిన్నిలంగలే
కంచెయెఱుంగఁజేసిన యుయారినిలోపఁదలంచి యిట్లను౯ .

ఉ .ఎన్నఁడుచూడఁగల్గునొకొ యింతిని జెన్నెసలారఁజూచినే
నెన్నఁడు నిండుకౌఁగిటను హెచ్చుగఁజేరుతినొక్కొ చేర్చియిం
కెన్నఁడుదాని సెజ్జనిడియించుక కూడదు నొక్కొకూడియా
కన్నియక్కోర్కితోనగుట కన్నులనెన్నఁడు చూడఁగందునో

క. చెలినటుతలఁచుచునలరుం
జిలుకుల సెగలంగలంగుఁజిలుకలకులుకుం
జలిగాలికలయుఁగోయిల
కొలకొలరొదలకు నెదఁదలఁకును గడునకుళుకున్ .

ఉ. నాయనుఁగున్నెలెంత తగునాయను నన్నెదనుంచి యేలు చా
నాయను నింకఁదాళఁగలనాయనుఁజక్కని క్రొత్తహ త్తిగు
న్నయను జాలియేదగునాయను రంగులుగుల్కు నంచయా
నాయను నకొగలంచనదనాయన నేఁచఁగదాయ నాయనున్ .

క. అచ్చటఁజందురునల్లుని
చిచ్చునఁగ్రాఁగుచునుదూలి చెలులుతలంచన్
నిచ్చలు నలుఁదలఁచుచుఁజెలి
హెచ్చుగనిద్దుర యుఁగూడు నెఱుఁగకయుండున్ .
 
చ. చిలుకలఁగొట్టు నెచ్చెలులఁజీటికిదిట్టుఁ గలంచుఁ దేఁటులం
దలఁకఁగఁ జేయుఁగోయిలలఁ దద్దయుఁ జందురునల్లుదూఱుఁ జు
క్కలదొర కాయనెండంగుకాఁకకుఁ దాళఁగలేక చొక్కుము
చలసలంచుం దలంకు నెదఁ జల్లనిగాలికిఁ జూచునల్ చెపల్ .

<poem>ప్రథమాశ్వాసము

చ.చిలుకలు దాయలయ్యె నగుచిన్నెలు చూడహుళిక్కి యయ్యె నె చ్చెలులసణుఁగుటయ్యెఁ గడుఁజీఁదఱ కంంగ్గొ ననయ్యె నెల్లచో నలజడిచూడనయ్యె నలయంచలఁ దిట్టఁగనయ్యెఁ గ్రొన్ననల్ తలనుగడంగి తాలుచుటలాయరుదయ్యె నెలంతకయ్యెడన౯.

క.ఒడలెల్లఁదెల్లనయ్యెను సడలెనునిద్దురయుఁ దిండిచాయ యడంగెన్ దొడరెంగాలికినడలఁగఁ గడురోఁతగఁదోచెనగలు కదలనికాఁక౯.

గీ.తఱచునాటుచు దరిగట్టుదారికొడుకు చెలియయిఱుకుజన్నులసందుచిరుగురుగోల లొక్కటగురిచేసిచికాకునొందజేయఁ దాళలేకసెజ్జనొఱగి సోలుటయును.

గీ.చెలులుచాలఁదలకి చిగురులులోనుగాఁ గలుగుకొన్ని తెచ్చికడఁగిసేద తేర్చితండ్రికి నది తెలియఁజేయ దలంచి యేగియతనిఁగాంచి యిటులనిరి.

క.ఎచ్చటినుండియే లోగడ నిచ్చటికొక యించసరగ నేతెంచినలుం జెచ్చెరనగ్గించిచనియె నిచ్చందనచోటుఁజేర నెంతయుఁగోర్కి౯.

గీ.వాఁటనుండియు నలుఁగోరినాతినీరు త్రాగదునిదురయునుగూడు తలచదయ్య యెట్టులాతనిఁదోడ్కొని యేగుదేర ననిచెదో తగుజాణల నతనికడకు. శుద్ధాంధ్రనిరోష్య్టనిర్వచన నైషధము

<poem>గీ.అనుచునెచ్చెలు లెల్లమనరుగుదెంచి కలిగియునికీట్లు తద్దయునళుకుతోడఁ గనినదంతయుఁదవతోడఁగనులనీరు గాఱనెఱిఁగించి చనఁగ్రధకై శికుండు.

శా.హాతల్లీయని లోఁగలంగి తుపకాయాయూళ్ళ యందెల్లరుం జేతుల్ జోడుగఁజేర్చి యెన్నఁగఁగడుం జెన్నారురాహత్తులం గూతుంగై కొనునట్టి యాసలెడలం గొండంతగాఁజేసి తా నేతేరంగనొనర్చె ఱేనిఁజెలితానే కోరునన్ సాకునన్.

క.ఎచ్చటఁజూచిననేనుఁగు లెచ్చటఁగనుగొన్న దేరులెచ్చటఁగన్నం జిచ్చునకోడనికాలరు లిచ్చటకేగినను దేజులెల్లడనూరన్

క.నేలయదరంగరిక్కలు రాలఁగనలుఁడేగుదెంచెగ్రక్కుననటకున్ నాలుగుతెఱఁగులదండులు గ్రాలఁగనెదలోననాతిఁగైకొనునిచ్చన్.

క.ఆరయుఁగనేలయుంతయుఁ గోరికాతోఁదిరిగితిరిగిగొనకొనియచ్చో నారదుఁడునునింకొకజడ దారియుజేజేలయూరుదఱియఁగఁజనుడున్.

క. కనుఁకొనియంతయునెదురుగఁ జనికాళులకెఱఁగిగద్దెఁజయ్యననిడినే లనుగలకతలెల్లనడిగి యనియెంజేజేలఱేఁడునాజోగులతోన్. ప్రధమాశ్వాసము

మ.అనిలోఁద్రెళ్ళినరాచహత్తులిటకయ్యాచాలనాళుల్చనెం
జనుదేరంగననాఁటనుండియుననింజాకుండిరేఱేండ్లు చ
య్యననాకంతయునానతిండనుడునొయ్యంగట్లదాయందగం
గనిరాకన్నియనుద్దియెల్లనెఱుఁగంగాఁజేసియాయ్యలున్.

గీ.తిరిగి ఇట్టులనిరి తెఱగంటిదొరతోడఁ
    దనదుకూతుఁగొనఁగఁదగినఱేండ్లఁ
   గదలిరాగననిచెఁగ్రద్ధకైశికుడుఁనిన్నఁ
    గోరుకొనునెలఁతయుకొరునినెల్ల.

శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము

  క . చదలునఁదేరులునిచితిగ
గదలిదొరలలోనఁ దేజుకడునలరంగా
గుదురుగఁగూర్చుండినదొర
యెదుటకునరుదెంచి యెల్లరిట్లనిరొకట౯.

ఉ . ఓదొరకల్లలన్నఁ గననొల్లట నిన్నెదలందుగట్టిగా
గాదిలినెయ్యుఁగాదలఁచి కంగొనఁగాఁ జనుదెంచిరిట్లుజే
జేదొకలెల్లఁగోరికలు చేఱఁదీరిచెదంచుఁ దీర్చిదే
నాదటనీకత ల్నలుగుకౌనన నెన్నికగాంచు నెల్లెడ౯.

గీ . అనినఁగన్నుల నగుచునుననియెనలుఁడు
నట్లచేసెద నీరునన్నడుగుదాని
నీతెఱంగెద్ది యితఁడెందు పిలుచు నతని
కెద్దిచోటుతక్కిన యాతఁడేఁడు తెలియఁ
జేయఁదగునున్నఁ దెఱగంటిరాయఁడనియె .

క . నేజేజేయొడయండను
దేజెపఁగునితఁడితఁడితఁడుదెనయేలికాలే
యోజనుదీర్చెదొయందఱ
జేజేలకడిందికోర్కి చెదరనికడఁకన్ .

గీ . అనుటకెదలోనఁగడునలుఁడలరియనియె
నింతకంటెనొండున్న దేయొందుజూడ
దెలియఁజేయుఁడుకోర్కులుతేటగాను
నునుగులైనను నిచ్చెదనోడకింక .

క . అడిగెడునాతఁడుజేజే
యొడయండఁట చేకుఱంగనొనరుచు నాతం
డడుగకయెయొపఁగునలుఁడఁట
తడయక కడతేర్చు నెంతదానినినైన౯

ప్రథమాశ్వాసము

క . నీయానతికలుగుటచేఁ
జేయుదునెజ్దానినైనఁ జెచ్చెర జేజే
రాయఁడనేనింకసరకు
నేయుదునే నింగియొఱగి సిగఁగూలినయేన్ .

గీ . అనిననట్టిదిట్టమౌడెఱిఁగియకాదె
యొరునినొకనినడుగ నొల్లకీటకు
నిట్లునిన్నుగోర నిందఱు జేజేలు
నరుగుదెంచియుంట యరసిచూడ .

గీ . సరగనీయూరిరాకన్నె సరసకరిగి
యచటనీనలుగురఁ గొనియాడి నేర్చి
నట్లునోరోడకన్నియు ననఁగఁదగిన
యట్లయాడియొక్కనిఁగోరునట్లుసేయు .

మ . అనిజేజేదొరయన్న నన్నలుఁడు నాహాయింతజేజేలకుం
జనునే కాదన కేనెకోరికొను చానంగూర్చియేతేరఁ జ
క్కననన్నేచన నానతిచ్చుట యెదంగ్రాల్గంటినేఁగోరియుం
టనునేనెట్లు చనంగనేర్తునిఁకఁ గట్టా జల్ల కెట్లోర్చెదన్ .

క . అనిజేజేరాయనిగనుఁ
గొనియెదయురి యాడుచుండఁ గుందుచునయ్యా
ననుసేఁగోరిన చెలికడ
కనుచుటనీయట్టిదిట్ట కగునేయనిన౯ .

గీ . తొలుతఁజేసెదననియాడి తుదకుఁజేయ
నంచుఁగల్లలాడఁగ నౌనెయకటనీకు
లెస్సగాదెజేజేలకు లెస్సచేయు
టాడిదాఁటిన నేరికినౌనెలగ్గు .

శుద్ధాంధ్రనిరోష్ఠనిర్వచన నైషధము

గీ . కత్తులనుదూసి దండులుకలికివగరు
కాచికొనియుండఁ జొరనెట్లుకలుగుననకు
కదియఁజననౌను నాయానకతననీకు
నడ్డుకొనలేరు నిన్నేరునచటఱేఁడ .

ప్రధమాశ్వాసము

<poem> అట్లునాతిఁగన్న యంతట నాతండు ఱిచ్చఁజెందికోర్కె హెచ్చుఁ జెంద నొడలు తెలియక యొక్కింతత ఱిసోలి యలరు గోలలకును గలుగుచుండ.

ఉ. అద్దిర యీతడీడఁ దనయాఱని తేజున నెల్ల చోటులం దద్దయుఁగ్రాల జేసెను నితం డలచందుడొ యాతనల్లుఁడో సిద్దులికేల యెల్లరును జూడుఁడు కన్నులనంచునానతో గద్దియలొక్కటండిగిరి గ్రక్కున నంప నెలంత నెచ్చెలుల్.

ఉ. కనియనెలంతయు న్నలునిఁ గంచుని గేగఁగఁజాలునట్టి చ క్కనినెఱనీటిగాని నటికాంచి యెదంగల నానయంతయుం జన నొనరించి కోర్కులెదసందడి నేయఁగ నాస హెచ్చఁగాఁ దనదు చెఱంగుదిద్దుచును దద్దుయుఁ దేనియలొల్కనిట్లను ౯.

ఉ. ఎచ్చటనుండి రాకయొకొ యెట్టులుదండులఁ దాఁటఁగల్గెనో యెచ్చటనున్కియో యిటకు నీకరణింజనుదేర నేలయో హెచ్చిన కోర్కినీదు తెఱఁగెల్లను దాఁచకయున్న యట్లుగా నిచ్చట నానతీయఁదగు నించుకనాకయి సైఁచి క్రన్ననన్.

క. నిన్నుఁగనినంతనుండియు నన్నెంతయు నేఁచఁదొడఁగె నల నెల్ల యల్లుం డెన్నఁడు నినుఁగనియెఱు ఁగను జెన్నగునీ తెఱఁగెఱుఁగఁజేయంగఁదే.

చ. అనుటయు వీటియేలికయు నగ్గియు ఁ దెల్లనిహత్తి నెక్కురౌ తును నెఱదున్నయెక్కుడును దొయ్యలిరో యిటకేగుదెంచి యొ య్యిన నినుఁగై కొనందలంచి యయ్యది నీకెఱుఁగంగఁజేయ న న్ననిచిరికానఁ గోరుకొను నాతిరొ నల్గురిలోన నొక్కనిన్. శుద్దాంధ్రనిరోష్ట్యనిర్వచన నైషధము

క. దండులనెల్ల నుగడచితి
నిండుగ జేజేలయాన నేనిచ్చటికి ౯
దండిగ నే తెంచుటతా
నొండొకఁడింతయు నెఱుంగకుండఁగఁలికీ.
  
గీ. అనిన జాననీ తెఱగేది యనుచునడుగ
నిచట నెద్దియొయెఱిఁగించితిం తదనుక
నింకనైనను నీ జాడయింత నా కుఁ
దెలియ జేయంగఁదగునన్న ఁగలికికతఁడు.

గీ. నెలఁత నేను నలుండను నేల ఱేడ
నెట్టులనైనను జేజేలు గట్టిగాను
నెడఁదఁగోరునట్లేను నిన్నడగుకొనఁగ
నేగుదెంచినాఁడనునాతియట్లుచేయు.

క. నెనరున జేజేలఁ గొనుట
ననునేలుట గానఁగల్కి నా యెడలం గ
ల్గినగాది లితో నొక్కనిఁ
గనుఁగొన్న నుజాలు గట్టిగానలుగురిలో ౯

గీ. చేడెనాచేఁతలనురి త్త సేయనె
యనిన సిగ్గునఁ దలకుంచి యంచచేత
నతని నెఱిఁగియున్నది కాన నలరి యిచ్చ
నెట్టకేలకు నల్లన నిట్టులనియె.

సీ. జేజేలకును జోత సేయంగఁదగుఁగాక
కోరంగఁజనునయ్య కొంకులేక
కోరనేర్చునెలేడి కొండంత యేనుఁగుఁ
జెల్లునే నాకు జేజేలఁగోరఁ

ప్రథమాశ్వాసము.

డగునయ్యయి త్తడి నగఁగోరదొరలకు
జేజేలుననుగోరఁ జెల్లునయ్య
నీకైగదాయెల్ల నేలక్షేడ్లనిటకుఁ
జనుదేర నాత్రండ్రి చాటననిచె

సంచనీచేతఁలెఱిఁగొంచి నంతనుండి
చేరినాయెదనీయండ చిక్కుకొనియె
నిదిగొ చేతులుజోడింతునెల్లినేఁట
నేలికొనునన్ను రాచ జేజేలఱేఁడ.

గీ.ఇందునాయానయొండాడ నింకఁదగదు
నీకునన్నుఁగై కొన నిచ్చలేకయున్న
నురినినీటఁజేఁదున నగ్గినుఱికియైనఁ
దొడరియెట్లును నుసురులుతొఱఁగుదాన.

క.అనినంజిలుకలకొలికికిఁ
దనయెడలంగలిగినట్టి తగునెనరునకుం
దనలోనలరియుఁగలికిం
గనికోరికలేని యట్టుగానిట్లనియె౯.

ఉ.అయ్యయొయేల యిట్లెఱుక యంతయుఁ ధూలి కలంకఁజెంద నా
యయ్యలకాలిగోరుఁ గయినంటను జూలనినన్నుఁగోరఁగాఁ
దొయ్యలిచన్నెనీకు నెదఁదూలకయొక్కని నందుఁగోరు లే
నయ్యకు లచ్చికల్గినను నాతలకించుగ సాఁగనిచ్చునే.

గీ.చెలియజేజేలకుగీడు సేయఁజనదు
చేసిననుగోర్కులెల్లను జెడునుగాన
నెవరుతోనందొకనిఁగోరుకొనుటలెస్స
సిరులనందెదు నానుడిచేసితేని.

శుద్ధాంధ్రని కోష్ట్యనిర్వచన నైషధముసీ.అనిననాతనిఁజూచి నెనరునఁగ్రాల్గంటి
కన్నుఁగొనలనీరు గడలుకొనఁగఁ
దద్దయునెదలోన నెద్దియుఁదోఁచక
యొకకొంత తఱియట్టె యూరకుండి
యోఱేఁడకంటి నేనొక్కటిచేయంగఁ
దగినట్టి తెఱఁగది తల

ప్రధమాశ్వాసము

క. ఆలరులుజేజేల్ కురిసిరి
చెలఁగిరియెదజన్ని గట్లు చెచ్చెరనచ్చో
నొలసెను జల్ల నిగాలియు
నలరారిరి తల్లి దండ్రులందలిచుట్టల్.

క. ఆరఁగజేజేలదఱుఁ
గోరికలొకకొన్ని దొరకుఁగూర్చిచదలున౯
దేరుల నెక్కిచనుచునడు
దారింగనుఁగొనిరి కలిని దద్దయుఁగలఁకన్.

చ. కనుఁగొని గట్లనూడతని గ్రక్కున నెచ్చటికింతతొందరం
జనియెదునెఁడనంగఁగలి చయ్యననాతనిఁ జూచియెందు నీ
డనఁ జనరాని చెన్నుగల యాక్రధకశికు కన్నకూఁతుఁగ్యె
కొనఁజనుచుంటినిన్ను ఁగనుఁగొంటిని జేకురెనెల్ల కోరికల్.

క. అనతియొనఁగందగునీ
లోననయానాతుక నొరులు గొనక యుండుం
గానేగంజను ననుడు౯
లోనగిజేజేలరేఁడు లో ఁగకయనియొ౯.

క. నలుఁడనియెడు నొడయని నా
యెలనాగయెకొరునియె నెల్లరుఁజూడం
దొలఁగితిరిగిచనఁదగునీ
యిలునేరఁగ సరగసనుడు నిట్లనెఁగినుక౯.

ఉ. చేరినలు న్నెలంత నెడచేసెదఁ గూల్చెదలచ్చియంతయున్
గోరినకోర్కులెల్ల ఁ జెడఁగొట్టెదఁ గానలఁ గుందఁజేసెద౯
ఫారెకునేను గోరికొచానను జేశొనఁజెల్లునే యొకం
డారయనంచుఁ గట్టులుక నచ్చటికేగెఁ గడిందియీనున౯.

శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషదము

 గీ. ఆంతలోన నలుండునునింతిఁగొనుచుఁ
దగినచుట్టలఁదోడ్కొని తనదునగరు
కొన్నినాళులకెల్లరఁగూడిచొచ్చి
యొన్నరానితేజున నేలయేలుచుండు.

సీ. కలియునుజనుదెంచి కడఁకతోనలునకుఁ
గీడుసేయనదను గూడుకొరకు
దద్దయురో యుచు నెద్దియుఁగానక
యెదలలొనఁగుందుచు నెడరుసేయఁ
దరిగాకనిచ్చలుఁ దరిఁజేరియాతండు
చేసెడునీగిని జేరకుండి
యొకనాఁడెరుంగక యొడయండు నీరుతాఁ
కఁగఁగవ కేగి తాఁగాళ్ళుకడుగ
నెరుఁగకుండినతరిఁజొచ్చి యిచ్చనలరి
యొక్కదాయచక్కటికేగి యుక్కు గలిగి
నలునిసిరియెల్లజూదాన నళుకుడక్కి
యొడుచుకొననీకుఁ దోడౌదుఁ దడయకనుచు.
    
ఉ. తానొకజన్నిగట్టగుచు దారినిదోడయి యేగుదెంచి న
న్నూనినగోర్కినేలుదొరయుక్కున నేఁడరుడెంచె నిన్నుఁజూ
దానఁగడంగిగెల్చి సిరితద్దయుఁగెగొన నంచునాడినన్
లోనరుదందియంతట నలుండుకలింగని యల్లనిట్లను౯.

క. జూదఱికెగ్లగునై నం
గాదనఁదగునయ్యనాకుఁ గడుశొనియాడం
గాఁదలఁచిననన్నుఁగన్గొన
నీదొర యిట కేగుదెంచి నిన్న నిచిసచో౯.

ప్రధమాశ్వాసము

 చ. ఆనుచుఁగడింగి యాడిసిరియంతయు నొడ్లచునోడియోడి యు
క్కునఁదన నేలనుందొరలఁ గొంకకయోడుచునుండె నెంతయున్
జనదనిచుట్టలుం దొరలుసంగడికాండ్రును గుయ్యిడంగఁ గై
కొనకతఁడక్కలింజెనకఁ గూడకయూరక కీన్న హెచ్చఁగ౯.

గీ.ఇట్లుకొన్నినెలలు హెచ్చుగనాడుచు
నున్నతరినినేగి జన్ని గట్లు
చేరియతనినుడుగఁ జేయలేకచనిరి
కలికడంగిరేచుఁకతననంత.

 ఉ. ఇంతియుదీనఁదద్దయును నెగ్గగునంచుఁదలంచిరేని నొ
క్కింతయునాఁచుదారి గనకెంతయు లోనెగులొందుచుండి తా
నంతటఁదొల్లి నేలదొరయానతిఁ గై కొనయున్నినంచెలోఁ
గొంతచెలంగి కూఁతుఁగొడుకుం దగుజేరునఁ దండ్రియూరికిన్

గీ. ఇట్లుక్రాల్గంటితేరుననింద్రసేనుం
డనుకొడుకు నింద్రనేననాఁజనెడుకూఁతు
నేయ్యురును జుట్టులును నానతియ్యసరగం
దండ్రికడకంచి లోలోనఁదలఁకుంచుండె.

కీ. సారెలుదొర్ల ఁగనేయుచు
సారెకునలుఁడాడి నేలచౌకగనోడె౯.
దీరునుగై కొనకుండఁగ
నేరికినిందాతగీఁత యిందునునందున్.

గీ. అనిననంతయునాలించి యరుదుగాంచి
చెంతబడదారిఁదిలకించిగొంతికొడుకు
నతఁడుజూదాన నోడినయంతనెద్ది
జరగెనెరిఁగించు నెనరుంచి సరగననుడు

శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచననైషధము

క. కౌనుననల్లనితోలుం
   జానగుజింకగలకేలుఁజక్కనియాలుం
   గాననితలజూలున్ జిగు
   లీనెడుతలకాయచాలునెసఁగెడుదంటా.

మాలిని. తిగకొటికలదాయాలెల్లయేఱున్నరాయా
     సెగకనుగలదంటా చఁదుఁగొన్నట్టిజంటా
     సొగసులతలకట్టాసూడులంగొట్టుదిట్టా
     జిగియరచెలిఱెఁడాచిల్కారారౌతుసూడా.

గద్య.

ఇది శ్రీమదాపస్తంబసూత్ర లోహితసగోత్ర కందుకూరివంశపయః

    పారావార రాకాకైరవమిత్ర సుబ్రహ్మణ్యామాత్యపుత్ర
     సుజనవిధేయ వీరేశలింగనామధేయప్రణీతంబైన
       శుద్ధాంధ్ర నిరోష్ఠ్యనిర్వచన నైషధంబు
          నందుఁబ్రధమాశ్వాసము.