Jump to content

కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధము-తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

తృతీయాశ్వాసము.

క. నేలయె తేరుగ దాతయె

తోలునతఁడు గాఁగ నెలయుఁ దొగదాయయుఁగం
డ్లై లలిసిరిదొరచిలికుగఁ
గ్రాలుచుఁదిగకొట్టికలను గాల్చినదిట్టా.

గీ. అల్లజడదారి యాక్రీడయన్న తోడ

నిట్టులనె నట్టు లెలనాగయిల్లుచేరి
తల్లిదండ్రుల యొద్దను దనరినంత
జరిగినదియెల్ల నెఱిఁగింతుజాలిగదుర.

చ. చిలుకలకొల్కి యక్కరణిఁజెన్నుగఁ జుట్టులయొద్దనుండియున్

నలునెదలో దలంచుచు ననల్ దలదాల్చక నేలసెజ్జగా
నలయరచీరతో నొడల నంటితొఱంగని దూళితో ఁగనుం
గొలుకులనీటితో నెసఁగెఁ గూరుకు చెందనికన్ను దోయితోన్.

క. అటులుండునాతియొక నాఁ

డట నిటుఁ గలయంగజూచి యంతటఁదల్లిం
దటుకునఁగనుగొనియిట్లనె
జిటుకున గన్నీరుజాఱి చక్కులుకడుగన్.

క. ననారసిచను దేరగ

సిలుగులెడలగొట్టు నేల జేజేలనిక
నెలతరొయనిచిననిచ్చట
నిలిచీదనది లేనినాడు నెట్టననుసుఱుల్.

ఆ. తొఱగుదానననుడుదొ య్యలియదియెల్ల

దండ్రికెఱుగజేయదగినయట్టి
జన్నిగట్లనలుని జయ్యనరోయంగ
గట్టడలొనరించి కడలకనిచె.

గీ. అట్లు నలురోయ జను జన్ని గట్లతోడ నల్లనల్లననిట్లనె నన్నెలంత

యెన్ని యోకీడులందుచునున్న కతన ! నలుడుతాదొంటితీరుననలరకుండు

గీ. కాన గోరికలిఆడేర్చగగడంగి

చనుచునున్నట్టి యీరలుసరగనేగి
కనుగలిగియల్ల చోటులు గలయనరసి
తగగనిట్టులనుడు రాచనగరులందు.

సీ. కల్లలెన్నడునాడ గడగనినీయట్టి దిట్టియుగానలో దిగిలు లేక

యాలుకట్టినచీర యరచించికట్టుక యింతి నొంటిగడించి యేగనగునె
యాలునుదనలోన నరయన్నకట్టడ యరిగెనే యొందైన నానలేక
యికనైననించుక యింకుయ్యాలించి నెనరడరంగ జేకొనగదగదె
యనినసిగ్గునలో గుంది యంతనిలక
తగిననుడులను దిరుగంగ దగులుయాడు
నతడెవలుడని కెఱిగించివచ్చికడర.

క. కై కొనిరండది చులకగ

జేకుఱ్క్వకున్నను నెఱింగి చెచ్చెరరండీ
నకడకని యనిచిననౌ
గాకనిచనియెల్ల యూళ్ళు గలయదిరుగుచున్.

ఉ. అందఱునింతిచే నెఱిగినన్నియు నెల్లెడనాడియాడి తా

రెందును ఱేనిగన్గొనగ నించుకయేనియు నేరకూరకే
యందులనిందులందిరిగి యానలురిత్తయి చన్ననిండ్లకున్
గ్రందుగనేగుదెంచి రెదనానల జేతులనూచుకొంచొగిన్ .

ఉ. అందొకజున్నిగట్టు చెలియంగని యిట్లనునేనయోధ్యకుం

గొందఱితోడనేగి యటగొంకక యేలికరచ్చసాలలో
తృతీయా శ్వాసము
సందడిగానున్నయెకఁ జానుగజొచ్చితలంక కన్నియు౯
సందయుయాడ నొక్కరుడు చక్కాగనక్కడనుండి దండియై.

గీ. చెంతకరుదెంచె చేసైఁగచేసినన్నుఁ

జెనసిచాటునకల్లనఁ జేరజేరి
కుఱుచచేతులతడుఱేనిఁగొలుచునతడు
నల్లనతఁడుతేరుఁదోలునాతడనియె.

గీ. త్రాడుకట్టినయాతని తఱినొకింత ! నేగియైనతఱినిగానిచేతలైనఁ

జూచిసైరించునింతియె చులకగాను ! నిదునందును సిరులందు నీడులేక.

క. అనియింకనెద్దియుననక ! చనియెందనదారినతడు చక్కంగ గూ

డొనరించు నంటనిచ్చలు ! గనుగొనియెదలోన ఱేడుగడుసంతసిల౯.

మ. అనినందద్దయులోన నారసినలుండౌ నాతడొండొక్కడై

నను నేలాతిరుగంగనిట్టికరణిం దానాడు నేడింకనుం
జనిజాడల్ తగదీసి తీసికొనిరాఁ జక్కంగ నాయూరికే
ననుతుందొల్లిటి జన్నిగట్టునె యటంచాయింతి యల్లంతట౯

క. చనితలిదండ్రులనిద్దఱ ! గనుగొనియెఱిగించి తొంటికరణినిదన్నుం

గనియిటకుందోడ్కొని తె ! చ్చినయన్నెఱజాణ నేల్ జేజేఱేని౯ .

క. క్రచ్చఱనలునారసిరా ! నచ్చుగొని త్తఱి వయోధ్యక నుచుట లెస్సౌఁ

జెచ్చెరనాతనిఁదోడ్కొనిఁ ! తెచ్చునదియటన్న నట్లతేనాసతిడె౯.

గీ. అంతనరగఁ గొందఱులెంక లరిగియతనిఁ

దోడుకొని తెచ్చియెలనాగతోడ నొయ్య
నెఱుకచేయనతని జేరియెట్టులనియెఁ
గేలుచోడించి కోర్కులు క్రేళ్లుదాట.

శా. నన్నెట్లచ్చటా కేగి తోడుకొని యన్నా తెచ్చి తట్లన్నలుం

జెన్నారంగ నయోధ్యకుంజని యటంజేకూఱగా రోసి యెం
దున్నన్నీ నెఱనీటుసూటిగన నియ్యూరింక దోడ్త్తేగదే
కన్నారంగనుగొందు గోరిక లెసంగ న్నేలజేజేదొరా.

సీ. నరగనయోధ్యకు జనిఱేనిగనుగొని యందఱు నాలించునట్లుగాగ

నచ్చట నోరోడకాయనచ్చలో నుదిరిగద్దియ గూరుచున్న తఱిని
గ్రధకై శికుడు జన్నిగట్ల నొక్కటనంచి నలురోసియెందు గానంగలేక
తనకూతునకునొక్క తగినయేలికగట్ట దిరుగజాటించిన దేరులెక్కి
నేలగలయట్టిదొరలెల్ల నెలతగొనగ
నేగుదెంచుచున్నారు నేటికింక
గనగనానాడు నెడలేదుగాననరగ
జనగజెల్లునని దొరతోననగదయ్య.

గీ. నలుడుదక్కంగ నొండొక్కడలసినిలక

యొక్కనాటి కెయిక్కడ కుక్కుతోడ
దేరుదోలుక యరుదేర నేరడగుట
నందెనలుడున్న దొరతోడ నరుగుదెంచు.

క. అనియానతిచ్చి యనిచినఁ

జనియటం గ్రధకై శికుండు చయ్యనదిరుగం
దనకూతునొసగు నొకనికి ఁ
గనుగొననెల్లి చనుదేర గాదగుననియెన్.

ఉ. అంతనయోధ్యఱేడు నలుడచ్చటనుండగ జూచియెల్లినే

గంతునజేర జెల్లు గ్రధకై శికునూరటుగాన నొక్కనా
డెంతయు దేరుదోలుకొని యేగగల్గుదెనావతండు నే
డింతటిలోనజేరునని యీకొని కన్నుల నీరునించుచున్.

గీ. నేలతెఱగంటి దంటయాయేలికకడ

నిట్టులంటకు నరుదండి యెదగలంగి
తృతీయా శ్వాసము
తిరుగగడిదేఱినలుగడల్ తెలియజూచి
యెట్టకేలకు దనలోననిట్టులనియె.

ఆ. కానదన్నుడించి కడచన్నకతనగా

కలికి యిట్లుచేయ గడగెనేడు
గోతియెంతయు నెదగూర్చునునాకంచు
నచ్చియుండనతడె హెచ్చుచెనటి.

ఆ. గోలనాకుగూర్చు గొడుకులుగలయది

యిట్టులేలచేయు నింతియైన
నెఱిగియరుగుదెంతు నీఱేనితో గూడి
యేగియచటికంచు నెదదలంచి.

గీ.తొల్లితనక త్తలానుల దోలునతడు

తెచ్చియిచ్చటనుంచిన తెల్లజిగిని
దనచుఱుకైన తనతేరి తత్తడులను
రెంటిగొని తెచ్చితద్దయుదంటయగుచు.

ఉ. తేరికిగట్టుచోనొఱగి తేజులుతూలుటగాంచి ఱేడులో

దారినిసోల కీయసదుతత్తడు లెట్టుగ నేగనేర్చు నీ
కోరికదీఱ నొండుజత గూరిచిగట్టుట లెస్సయన్న లో
నీరికలెత్తిహెచ్చరిక నిట్లనియె న్నలుడోర జూచుచున్.

క. ఈ తేజీలించుకలో ! నీతేరీడ్చుకొని యలుగు నింకెఱనరుగుం

జూతఱలి యయోధ్యకునే ! డేతొగదాయ కడలితఱి కేగెడుతఱికిన్.

గీ. అనినిటులైనఁ గడులెస్స యరిగిసరగ

సూరుచేరిన యంతటినొక్కసారి
కోరికలు దీర్తునని తేరుసేరియొక్కఁ
నలుడునింకొక్కడునుదోనుదోడనరుగు దేర.

క. చనునెడ దేరిదురునునడ

కనుగొమియాతండు నలుడుగాదగుగాకు
న్ననులాతియొక్కఁడీలా
గునదత్తడుల తెఱగులెఱుగునెయనియెంచ౯

క. కనుజెరచిజూచునంతకుఁ

జెనయుచునె త్తయినగట్ల చెట్లకొనలెడన్
గనుగొననైతఱిసితురుగఁ
గనుగొనగరాక యెదుటికడనడ గుగుడున్

సీ.ఈడుజాడలను సూడ నీతండునలుసాటుగాగనించుకయెంతకననయ్యె

నీలాటియెడలేల తలిచెనోలెస్సఁ దెలియనగునె కలతెఱగునాకు
నట్టియయ్యలు చాలనంగద లౌతఱి దాగియుందురుగాదె తగినచోట్ల
నితడెనలుండైన నెట్లుండునిచ్చట దొల్లియెకానల దూఱెగాదె.
యనుచుజనుచున్న తఱిజీరయించితాఁకి
జాఱినేల గూలిన వలుచక్కిజూచి
యితడు దిగిచీరగై కొనియేగుదెంచు
నంతకునుదేరుకడు దోలకనినవతడు

క. ఏలికయాచోటిచటికి ! నాలుగుకోసులయియుండు నడుచునెయితడా

నేలకు దేనేరండిదె ! తోలెదదేరంచునాడి తొల్లిటికంటెన్ .

క. తొందరగ జననిచ్చుచు

నందందుల యూళ్ళుదాటి యరుగుచునుండన్
నందుననయోధ్యయేలిక
చెందొక కాలకు కడదాడి చెట్టును గనియెన్.

చ కనివలు జూచి యిట్లనియె గనుగొని కాని యెఱుంగరెల్లరున్

దనరగనన్ని యెన్నిక యొనర్చు తెఱుంగదియే నెఱుంగుదుం
తృతీయా శ్వాసము
జనితెలియంగజూడు చెయిచాయను జెన్నగు నల్లతాడిక్రొ
న్ననలును గాయలాకులను నాకనినట్లెఱుగంగ జేసెదన్ .

సీ. నూఱునూఱ్లయొకండు నూల్కొనికొనలందు

నలరులుగాయలునలరుచుండు
నీరేనుకొఱతగా నేను నన్నూఱులు
కయలాకులుగ్రిండగ్రాలుచుండు
ననుచునాడిననుడు లాలించియటకేగి
యన్నింటి జక్కగానెన్ని కాని
యిన్నియనితెలియనెఱు గంగరాదని
యెదలోనగట్టిగా నెంచినలుడు
తత్తడులత్రాడు లొక్కట దనదుచేత
దిగిచినొలగ నొయ్యనగట్టి తేరుడిగ్గి
చీరయొక్కింత చక్కగా జేర్చికొనుచుఁ
జెట్టుకడకేగి నెట్టననట్టెయెక్కీ

క. ఎన్నిక యొనర్చియాతం

డన్నట్టులహెచ్చుతగ్గులన్న నులేకా
క్రొన్ననలుగాయలాకులు
నున్నగనుగొనియరుదెందియొయ్యనదిరుగన్

క. చనుదెంచునాకు దీనిని ! నెనరున నీఱేడొసంగ నీకొననేలా

గుననై నను నేసేదె ! ననితనయెదలోదలంచి యాదొరతోడన్.

క. నినునేనీనా డేతగ ! గొనిచేర్చెదనాతి యూరుకోరికదీఱం

గనునిది నాకిడికోరిక ! కొనసాగించినను నేలికొనగదె యిచట౯.

క.అనియడిగికొన్న దొరగై ! కొనునీకిచ్చెదనుదీని గోరికతీఱం

గననియొసంగిననింతం ! తనరాని నెనరునకునెర నలరుచునలుడున్. శుద్ధాంధ్రనిరోష్ట్య నిర్వచన నైషధము

క. నాకిచ్చితిదియుగానన్ ! నీకిచ్చెదనయ్య నేను నేర్చినదీనిం

గైకొనదగునొండడక ! చేకొనిత త్తడులదోల జేకుఱుచదురున్.


చ. అనియొనగంగరానతడు నల్లనలోనగుకొంచు జెచ్చెరం

గొనియెదనయ్యనాకెదను గోరియాతఱి నంతదాక యెం
దెనయనరానిదీని నెఱిగించుటకంటెను నీదుచెంతనే
యునుచుట లెస్సయౌననుడు నొయ్యననియ్యెకొనెన్నలుండటన్.

ఉ. అంతటదొంటినుండి యొడలందులనుండి నలుంగడంగితా

నెంతయునేచుచున్న కలియెచ్చుగ నోరనుజేదుగ్రక్కుచుం
గొంతకుఱంగటన్నిలిచి కూర్చినల్లని కేలుదోయితో
జెంతనిదిట్టగానలుక చేసెడునన్నలుజూచి యిట్లనున్

క. కర్కొటకుచెదోడలం

గార్కొనిదరికొంచు గ్రాచెగాన గినుకెదం
దార్కొనజేయకతిట్టక
కోర్కులుచేకూఱనేలు కొనగదెనన్నున్.

ఉ. ఇంతటినుండి యేయిచటికేగక యీనెఱతాడిజేరెదన్

జెంతలనైననింతయెదనిన్ను దలంచినయట్టి యయ్యలం
జెంతలజేరియంగదలు చేయకయే చక యుందుగాననే
డంతయునోర్చి నేనిడియంగదసైరణ సేయగ గాదగున్

క. అనగనత డంచెనలుడును

గనుగొనగాదాడిజేరెగలియినునలుడుం
దనతేరికి దిరుగనరిగి
చనుదెంచెస్సరగ నూరుచక్కికిదొరతోన్.

గీ. ఒడలుచక్కనై యుండుటయొక్కటితక్క

దళ్కుగలచేటులెల్లనుజక్కు చేసి
ద్వితీయా శ్వాసము
సంజయౌతఱికొట్టిక సరసకట్లు
తేరికచ్రొదనాలుగు దెసలునిండ.

గీ. అరిగిక్రధకై తికుండెదురరుగుదెంచె

తోడుకొనియేగు నేలికతోదానేగి
యొడయుడచ్చట గట్టించియునిచినట్టి
యిల్లోనగనందుదిగియుండెనల్ల నలుడు

సీ. ఆ తేరియలుకుడునాలించినలుడదెయరుదెంచగాజాలుననుచునెలత

యెంతటిదాననొ యిన్ని నళ్ళకుజేఱిని జూడంగగంటిని నేడికనుల
నిండనంచు నలరినేతనిని నిందు నొక్కటగనజాలకుంటి నేని
కనియొడయనినిండు కౌగిటజక్కగా నుండుటకించుకనోచనేని
యునుఱులందుఱుజూడంగనొక్కసారి
తొఱగుదాన ననితలంచి తొయ్యలియును
దేరినినయోధ్యఱేనిని దేఱిచూచి
కోరికలుడించి యెదలోనగుందుచుండె.

క. ఆదొరయనూరనెచ్చట

జోదులయినదొరలరాక జూడకయెదలో
నేదియుదోచక తొయ్యలి
యాదటనొక్కని గయికొనునన్నదియెందున్

సీ. ఆలించుటయేలేక యక్కటయేలిక యొకడైన నీనెలంతుకగొనంగ

నేతేరగాగోన నేనుదక్కంగను నరుదెయ్యెనెంతయు సరసిచూడ
నాకల్కియొరునేల గైకొనగాకోరు నలునిగాదని రి త్తయలిగినేడు
కొడుకులుగలయది యెడదనెల్ల తఱినినలుని నేడుగడగ దలచుచుండు
జెంతయేయంత యొరునిట్టెచేకొనంగ
ననుచునానొదిగియుండెనంతనలుడు <poem>శుద్ధాంద్రనిరొష్ఠ్యనిర్వచననైషదము
   తత్తడుల    సాలలో ఁ  గట్టియొ   త్తిగిల్లి
    తేరిదఱినొక్కచో  నేద   దేఱనొఱఁగే .
క . ఆయేలికతోనుండిన !  యీయయ్యలఁజూచి  తెల్లనై  యంతటితో
      నాయింతియునాసనుదెగఁ!  గొయంగాలేక యానగొనుచుందిరుగన్ .

క. తనచెలిక త్తియకేశిని! యనుదానింజేరఁజీరి యాయిద్దలోఁ

    గనుగొనియెఱిగితినొక్కని!ననుఁగురొనలుఁదేరుతోలునాతలిఁగాగన్.

క. తక్కినయాతని సుద్దియు! నక్కరొనీచదురునేఁడ యారసిచూతుం

   జక్కఁగ నెఱింగిరాఁగదె! యిక్కడనున్నట్టెయేగియించుకలోనన్ .

ఆ. ఇతనియందుఁజిక్కెనెద నాకుఁజూడంగ! నల్లనాఁడయోధ్యక<poem> <poem>తృతీయాశ్వాసము

గీ.  అనిఁగేశీయు నెడలొననళుకులెక
       యంతకంతకుఁ  గోరికలల్లుకొనఁగఁ
      దిరిగికూర్చున్న జతకాని దెపనుజూచి
     యితనితెఱఁ ద్దియన  నలుఁడ్డిట్టు  లఁయె,
క. కలికిరొ  తొల్లియితండా  !  నలుతెరును దోలునతఁడు  నాసంగదీ
      డలయిక య్యెడనాతోఁ  ! గలసి దోరకు  దారితోడుగానరు దెచెన్
క.  అనఁదొయ్యలియితఁడన్న లుఁ  ! డొనకంగా  నేఁగియెందున్నా ఁకోయెఱిం

గిననడుగండ గుననుడుం  ! గనుగొనలన గుదుజాడగా నిట్టనియె౯ .

క. నలునింగిలుని నెఱుంగఁడు  ! నలుకుర్ర<poem
శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము


చ.అనియెఱిఁగించున్నతఱి నంతకునంతకు జాలుకొంచుఁగ
నొనలను జాఱునీరడఁచికొంచుఁ డెఱంగెఱుఁగంగనీక క్ర
న్ననఁదలయింతకుంచి యెద నాఁటినజాలిన నేలచూచుచుం
గనుఁగొనకూరకున్నఁగని నాతుకచెంగటికేగి కేశియున్ ....69

క.ఆతండాడినతెఱఁగును ః జేతలఁదాఁగన్న తెఱఁగుఁజెచ్చెరనొంటి
న్నాతుకకెఱింగించిననెదః నాతని నలుఁగాఁదలంచి యనియెంజెలితోన్, 70

ఉ.ఇంకనునొక్కసారి యటకేచని యాతఁడయోధ్యఱేనికిం
డెంకినిగూడొనర్చునఁట టెక్కుగఁజూచి యసడ్డలేక లో
జంకకయంతయుందెలిసి చయ్యనరాఁదగునన్న గ్రక్కునం
గొంకకయేగికనొనియెఁ గోరికలీరిక లెత్తనంతయున్ 71

క.కనుఁగొనియరుదందుచుది| గ్గునఁజనుదెంచి యెలనాగగోరినకరణిం
దను కన్నదియెల్లనుని| ట్లనియెఱిఁగించె నెదలోని యడలక్షఁగంగన్.72

ఉ.ఆయన జాడలెలఁదగనారయ నేలకు డిగ్గినట్టిజే
జేయనఁదోఁచె నట్టి నెఱచేఁతులుతొల్లియునెన్నఁడైననే
నేయెడనాలకించియును నించుకకాంచియుఁ గ్రాలుగంటిరో
నీయడుగాన కాన నలునిం గనినట్టులయయ్యెనాయెదన్.

సీ.కట్టెయొక్కటిగొని నట్టింటరాచినఁ
జిచ్చుందుఁగలుగును జిటికలోన
గూడుడికెడునతకును గట్టెలిడకయె
యంటుక సురసురలాడుచుండు
నంజుళ్ళుకడుగుకొనఁగ నీరుకోరుడుఁ
గ్రాఁగులు నిండంగఁగలుగుచుండుఁ
గై తాఁకియలరులు కందియుఁదొల్లింటి
చెన్నొకించుకయును జెడక యుండుఁ

తృతీయా శ్వాసము
గూరగాయలనుడికించి కూర్చుతఱిని
గడలనెల్లను దియ్యనిగాలియొలసి
యొడలెఱుంగనియట్లయ్యెనొక్క యింత
యతనికఱుదులుతఱుచేలయరుదులయ్యె:: :74

గీ. సారెసాకుఁజెలినంచి చక్కఁగాను

జిన్నెలన్నియు నెఱిఁగియుఁజేరికేశి
తెచ్చియిచ్చిననంజుళ్లు తినియునతనిఁ
జేడెనలునిఁగా నెదగట్టి చేసికొనియె.: 75

గీ.అట్టులెఱిఁగియు నూరడకరసిచూడఁ

గొడుకుఁగూఁతను గేశితోఁగూడనిచ్చి
యతనిదగ్గఱకనిచిననల్ల ఁజూచి
చుట్టలందఱఁచూచినయట్టులైన.:: 76

గీ.చెక్కులొయ్యననంటుచుఁజేరఁదీసి

క్రొత్తనెనరుననిద్దఱనెత్తుకొంచు
డించిగ్రుచ్చికౌఁగిటఁజేర్చినించుచుండెఁ
దొడలనిడుకొనికన్నీరుతోడుతోడ:: :77

చ.ఒడయఁడు నంతనింతినిఁగని యోచెలిహెచ్చును దగ్గలేక నా

యెడఁదకు నేలయోయెఱుఁగ నిద్దఱు నీచిటికుఱ్ఱలల్ల నా
కొడుకునుగూఁతు నచ్చుననుగుద్దినయట్లుగనున్న నిట్లునే
నడలితిఁజాలఁజూచితిఁగదాయనియొండు తెఱుంగుగా ననెన్.:::78

క.నాతిరొతుఱుచుగనిచ్చటి| కేతెంచునరుగుచుంట యించుకకనినన్

లాఁతితెఱంగుననెదలం | జూతురు చనదిందురాఁగఁజులుకఁగనింకన్.::79

గీ.ఏనులాంతిచోటుననుండి యేగుదెంచి

నాఁడ నీకునిచ్చోట నాతోడిదెద్ది శుద్ధాంధ్రనిరోష్య్థనిర్వచన నైషధము
కలదుతలయె త్తిచూడకక్రన్నఁజను
నదియాటన్న నుజిన్ననై యదియునరిగి:::80

క.చనియదియంతయు నెఱిఁగిం | చిననెంతయు సంతసించి చేడియసరగన్ దనతల్లి యండకుంజని | కనికాళ్ళ కెఱఁగి నెననొలుకఁగనియిట్లనియెన్.

చ.తఱుచులిఁకేల యల్లదొరదగ్గఱఁగూడొనరించు నాతఁడం

దఱునెఱుఁగంగ నేరరిట దాఁచఁగనేలనలుండు గేశిచే
నెఱిఁగితి జాడగా నతని నిచ్చటి కాయనఁ దోడితెచ్చెదో
తఱి గని నన్నె యచ్చటికిఁ దల్లిరొ యేగఁగనానతిచ్చెదో.: 82

క.ఆనఁదండ్రియానతింగై | కొని యొంటరినొకని నేగికొనితేరంగా

ననిచిననాతఁడు తోడ్కొని | చినుదెంచెను నింతికొంత సంతసిలంగన్. :83

క.కొతుకుచునళుకొందుచునొ |క్క తెకంటండియెసంగఁగడునడలంగా

జతకత్తియ లేనియెడను | నతఁడచ్చటఁ గాంచెనోలి నాలిన్ జాలిన్ .84

గీ.కనులనొకసారి యుంటిగాఁగాంచెనేని

రేయికలలోన నేతెంచుచాయనున్న
ఱేనిఁజూచియు నొండుగా లోవనెంచ
కింతిజాణగాన నతనికిట్టులనియె. :85

సీ.ఏఁనాడు నేరును నేగుదెంచనికాని

సోలినిద్దురఁజెందు గోలనొంటి
నట్లుడించిచనంగ నెట్లుకాళ్ళాడెనో
నలునకుజాలి యన్నది యెలేక
తెఱగంటిదటల దెనఁజూడనొల్లక
తన్నెదొరఁగఁగోరుకున్న దానిఙ
గొడుకులతల్లినీఁగొఱగానిచోడంచఁ
జేడియయహ్హేది చేసెనొక్కొ
తృతీయాశ్వాసము

నిన్నుడించి నేనెట కేగుదన్నయట్టి
నుడుగులెల్లను నట్టేటఁగలసెనొక్కొ
యనుచునెదచిల్లు లగునట్టులాడుచున్న
యింతిఁజూచిడగ్గుత్తిక నిట్టులనియె 86

మ.కలినన్నంటి చెనంటియక్కరణిందాఁ గాసిల్లఁగాఁజేయుటం
దెలియంజాలక యట్లొనర్చితిని సంతే దాని నాలెస్సచె
య్డులచేగెల్చితి నింక నాకొడలికం దొక్కండుదుక్కంగఁదొ
య్యలిరో యొండుకలంకులేదనియు నొయ్యందీఱుఁగొన్నాళ్ళకున్.::::87

సీ.నీకొఱకునుగాదె నేనునిచ్చోటికిఁ
దిరిగితిరిగి యరుడెంచినాఁడ
నదియెల్లనట్లుండె నక్కటగరితకుఁ
గూడునెయొరునిట్లు గోరుకొనఁగ
నందులకైగాదె క్రిందగ దొరలెల్ల
యొక్కనాఁటనె తనయక్కుననేతెంచె
ననిననెంతయు నెదాళుకుఁజెంది

కలికిచేదోయిజోడించికలఁతనొంది
యెలుఁగుకుత్తుక దగులంగ నిట్టులనియెఁ
దొల్లిజన్ని గట్టులరిగి దొరలరచ్చ
సాలలందెల్ల నెంతయుజాణలకుచు. 88

క.నాచేఁగఱచినలాగున
నేచెచ్చెరడియాడి యీదొరచెంతన్
నీచేరికయెఱిఁగెనొకం
డాచక్కినినీదు నుడులయందలిజాడన్. 89

శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము

<poem>ఆ.ఆతఁడేగుదెంచి యంతయునెఱిఁగించి చనినయంతనతని సకియనెల్లి చేకొననరుదేరఁ జెల్లునంచాడంగఁ దడయకటకనిచిన దానఱేఁడ.

క.నలుఁక్కఁడుఁ దక్కగఁజె న్నొలయఁగ నన్నూఱుకోనులొక సాఁటనరాఁ గలఁడేయుెరుఁడనియెడలోఁ దలంచిదీని నొనరిచిన దాననుగమంటే.

క.కొంకకయీదొరయుెద్దకె యంకిలెడలి జన్నిగట్టునఁచితినిఁతే యింకొక్కటైననిక్కడ కింక్కొఁడె రాఁడెఱేఁడు లిందఱిలోనన్

ఉ. అందఱుంజూడ నీయడుగులెంటద నాయెడ నొక్కకీడునుం

      జెందదటంచునొండొకటి  జేసెదఁ  గుర్రల నెత్తికొట్టెదన్
      దందనలేక   యీతొగల   దాయము  నీ ఱెజింకరౌతు  నీ
     చందురుఁ  డీల్లఁజేయుదురు   జూనుచెడం  జెడుచేఁతలుండినన్
 క. ఇటులనఁదగునేరతిను
       గటగటతొగచూడునేనుఁ  గడలికొడుకు నొ
       క్కటనొక్కొక  యేఁడొగిఁగా
        చుటయుఱఁగకయుంకినంటి  చులకనినుడులన్.

క. అనుచున్న తఱినిజదలున

     గనుఁగొనఁరాకయుండి  గాలియనియె ది
      గ్గున  నందరునూకొనఁగా
       నెనలేనిగులుకు   టెలుఁగున   నేలికతోడన్.<poem> తృతీయా  శ్వాసము 

<poem> గీ. అన్నకై కొనునదియనియానయిడిన

            నంతగురిసె  జేజేచెట్లయలరుసొన  
            లలరిచల్లనిచిఱుగాలియొలసెదెసల
            నీడతెఱగ౦టీ  యునున౦త  నెదుటనిలిచి

సీ.ఎల్లరకునుదన్ను నెఱిగి౦చి యెల నాగ క్రొత్తడీనుద్దులుగొఱతలేక నలునియ౦దున్న గాదిలియు నెఱి౦గి౦చి కొనియాడ నాలి౦చి తనరినలుడు కర్కోటకుదల౦చి కోర్కులుచేకూఱ నాతడిచ్చినచేలజేతన౦ది తాల్చినయ౦తనె తనతొ౦టిసొగసూన జక్కనైనక డాని చాయగలిగి నూఱురాచిల్కరౌతుల నొ౦చుసొగను దఱుచునీరాఱు చీకటిదాయలనగు తేజుదులకి౦చునలుగా౦చి తెలిసికలిసి స౦తసిల్లెనునెయ్యురుస౦తసిలిరి.

ఆ . ఇట్ట్లుకూడూనలునకి౦తికినెలయల్లు

       కాకతొడనేగసటునొడల
       నగలతెగలతోడ   ననలెత్తఁగోర్కులు
       తొంటియునికితోడదొసంగులడఁగె.

ఉ. అంతయునాలకించి నెనరఁగ నాక్రధకై శికుండు తా

     నెణ్తయుఁ  జీఁకటింగడిచి   నిండగిచందురుఁ గూడియున్న  రే
     యింతితెఱంగున౦దనరు   ని౦తినిగన్నుల    ని౦డగా౦చిలో
     నె౦తయుస౦తసిల్లి     నగరెల్లెడల౦    గయిసేయజేసినన్ శుద్ద్హాంధ్రనిరోష్థ్యనిర్వచన  నైషదము 

<poem> త్రతీయాశ్వాసము

<poem>క. అత్తఱిరునునెఱ

    హత్తులుతగ   గనిరుదచ్చి యలయని సోగసా
    త  త్తడులీరేనైదులు
    కత్తులుగలయాఱునూఱు కాలరుకొకటన్. 

గీ.తనకుఁదోడయిచనుదేరఁదరలియతఁడు

  నిషధకేతెంచితనదాయనేరగయగ్రాంచి
  యంచి దొరరౌతుక్రాల్గంటియందెదొరల 
  నెనయగులకు   నట్టులనియె
క. నాయిల్లనిరోయిగ 
   నీయడజూదాన   నిడుదు  నేలెడునేలన్
   రోయిగ  నికుంచఁగఁదగు
  నీయేదకదిలెస్సయేని నేరిచిగురొత్త్.
  క. అరయంగానికయ్యది
    సరిగదనితొ  చెనెని  చక్కంగా  జె
    చ్చెర గలనం  గెలెచద  ని 
   న్నరుదకు  తేరికినిలిచి  యనికింజొరురా.
 క,   గండుగ  యతనిది కాదె  యెందునెల
      కలనేడు   నిన్నుగండడంచి
      నేలయెల్ల  నేనెయేలెద   నీకెది
     తెఱగొయిందుపరగ   దేలియజేయు
 చ  .కనినికడయ దెయనగ   పతడించు  యి
      నలుననిలొ గెలునని  నాకిక   లేదులేదు  నేడ
     దొలటియిలు   యియడల   దొయ్యలి  గెల్చన్ నాడపళసె 
     నశకికి  నేల  యందు  యయతొడ   నిట్లన్. శుద్దాంద్రనిరోష్ట్యనిర్వచన  నైషధము 

 క. నేనోడితినేనిండగ
నీ నేల యెయితునీకుదియట్టిద ఱే
డా నీకొడుటగల్గిన
యేనిన్నీ రాణినాకు నీజనుసెటులున్.

క. అనియుక యెుంటరిచే సా
ళును గయలు దేనొనర్చి లొడలొడ నేదలొ
దనచదురున నేలత్రదొరెకె
ననుకఓచున నాడియెడె నందరుజుడ.

గి. తిరుగు జుదాననంద రె దేలియ జుడ
గెలిచితననేల యంత యునలుడొగునియే
దనదు తేజెల్ల కడల నుదనిరినిండి
సాదులేదలేందు దద్దయుసంతపిల్ల.
   

________________

తృతీయాశ్వాసము 495 118 19 -- 120 1. తల్లిదండ్రులయానతి నల్లఁగాంచి యచటిచుట్టాలనుదట నలరఁజేసి లెక్క లేనట్టి తొత్తులు లెంకదుడు తోడనరు దేర జిగిచాయడొలఁకుచుండ. క. కొడుకును గూతుందోడ్కొని యుడుగరలెల్లాం జొసంగనొక చేగొంచుం గడుచక్కని తేరుననలు కడకే తెంచె నెలనాగ కలకల నగుచున్. ఉ. ఆకరణి న్నలుండు తనయాలును గుఱ్ఱలగూడి హాయిగా నేకడఁజూచె నేనిఁదన యే డైజయెల్లరు నూఱునోళ్ళతో గైకొనికోర్కి కేళ్ళు జుకఁగా గొనియాడఁగ నేండ్లు చాలఁ దా నీకొని నేలయేలె నొకఁడేనియుజేఁడెనగాకయుండగr. క. అనిసలుకత యీ తెలుగున నొనరంగొంతి తొలిచూలి కొయ్యన నెఱిఁగిం చినలునియట్టులెయతఁడును జెనసినకడగండ్లకోర్చిసిరులొందంగన్. గీ. ఆడి జడదారితనదారి నరిగినంత నిచట గుదెదారికొడుకును నెడదలోన నదియెతలఁచుచుఁదలయూచియారయనుచు సొరెగొని మూడితద్దయుసంతసించే 5. ఈనలు తయడుగునతఁడు దానాలించెడునతండుఁదగఁగనునతఁడున్ జానగు కొడుకులఁగూఁతుల తోను సిరులఁ గొల్లలాడుదురు లగైనయశ్ .

..

శుద్ధాంధ్రనిరోష్ట్యనిర్వచన నైషధము

<poem>క.నునుగుత్తుకఁ జేఁదిడుకొని తనరుచునున్న తెఱగంటి తలకట్టా లోఁ గనలెవయహ త్తిరక్కను పనిలోసంగూల్చిక్రచ్చులందినదిట్టా.!

మణిగణనికరము.నెలతల నలరుగ నెలకొనునతఁడా తొలికడదొరకలు దొరకుతుకదొరా కొలిచెడుసిరిదొరకొలలడఁచులీ కలననెదిరి యెదఁగలఁచు నొడయడా1

                             గద్య.

ఇది శ్రీమదాప స్తంబసూత్ర లోహితసగోత్ర కందుకూరివంశపయఃపారావార రాకాకై రపమిత్ర సుబ్రహ్మణ్యామాత్యపుత్ర సుజన విధేయ వీరేసలింగనామధేయ ప్రణీతంబైన శుద్ధాంధ్ర నిరోష్ట్య నిర్వచన నైషధంబునందు సర్వంబును దృతీయాశ్వాసము. సంపూర్ణము.