Jump to content

కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/శుద్ధాంధ్రోత్తర రామాయణము-ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శుద్ధాంధ్రోత్తర రామాయణము.


ప్రథమాశ్వాసము.

శుద్ధాంద్రోత్తర రామాయణము

 ఉ. అంతకుమున్న వారులటు లచలకుంచెను దెంచుచున్నలా
గంతయు వేగవేగరులె యాగక బోగున వినవించెన్
పంతసమంది ప్రెగడలుసందడినేయుదు నూరివారల ౌ
గంతునబిల్వనంపి సరగంజిని ప్రోల్గయి నేయి బ్రంచినన్.

పి, కమ్మకస్తురినీట గలయంపి చల్లించి
జిగితెటపన్నిట జగతులలికి
యాణిముత్యంబుల సవరించి ంరుగులు
పందిళు కురవేళ్ళుబొందుపరచి ట్లలరించి
పచ్చలదోరణాల్ బలియజేసి

పసిడికంబముల నబ్రంటంటులునిల్పి
కప్రంపుబొగ లెల్లకడలనించి
విడికై సెసి తామును వెలకొలది
విలువసొమ్ములుదలిచి చలువవలువ
లందరును గట్తియడు బ్రొలందు మెంది
కరముకనుల పండువు గాగ నుండు.

వ. అంత

మ పదియార్వన్నెకడనిమేడలయించి బాల్లిండ్లువొంగొర నె
మ్మదిలొ గొరికలుర గ్రొముడులుర పై పై జార లెజర్వ నుల్
కదియవ్వచ్చును నున్నరాకొమవంకం జూడలోదాల్మియుం
జెదరం బైరుగ మిద్రజల్లి రల్లరుల్చేవండమ గీలిగింపు.

గీ. వేల్పులాతండు తదయబింకమడవ
వెల్పుంరాకులు నేత్తవి విరులిగొసి
యలరిపయిజల్లననలరువాన
తెరు వలందరందు గురింప దెరువు దాటి.

ప్రధమాశ్వాసము

 సి. తమెల్ల నొచిననొములు పండే నే.
టికటంచు వీటినరికట మబ్బు
నెనివళ్లకునిన్ను నిటగంటీరా కన్న
తంద్రియని యనుంగుదలి యలర
నేలుమేల్లపుడు నీనేల నీవెనని
వెనదీవల నేల వేల్పు లొసగ
బుత్తిడి పళెరంబులు పూని ముత్తెదు
వలు పాటపాడి సివ్వళులియ్య.
నిల్లుచొత్తెంచి తల్లుల కెల్ల ంరెకి
తక్కుగల వారినందరు దగినట్ల
 గారవముచెసి యతడెల్లవారుమేల్లు
మేలని పొగడగ నేలయెలుచుండు.
వ.ఒక్కనడు.
మ. ఒక

శూద్ధాంద్రొత్తర రామాయణము


 గొలువనే తేంచు దోరలెల్ల గుములగుడి
యదనొదవుదాక నందంద యెుదిగియుండి
యడుగుదొయికి ంరెక్కుచునవలనిలువఁ
బసిఁడిగద్దియ గొలువుండె బలియుడతడు

ఉ. అప్పుడు కుప్పతిప్పలుగ నాతని ఁజూతమటంచు నేంచి వే
యెుప్పలకుప్పలౌతపసు లుక్కన నక్కడకేగుదెంచినం
దప్పకిచుచిలేచి తనదండను నజ్జడదారిపిండుకుం
జొప్పుడు పెద్దగద్దియలు చుట్టును బేటి గబంచి వేడుక్.

గీ. ఎదురుగానెగి తొడిచ్చె యెల్లవరి
దగినచొటుల గుర్చ్ండ దగవుసలిపి
రేండు చేతులు జోడించి నిండుమదిని ,
నేంతియు బొగ డ్తలొనరించియిట్టులనియె.

 క . సేమ మెమికున్ మికడ
గోమున గల చదువులేల్ల గొనువడుగులకున్
సేమమె మెకములాయిడి,
మిమి సెలవులను లెక మేలదవేడునె.

క. ఎవ్వరు జేయరుగా మి
కెవ్వెతలును మంచినిటి యెద్దడి యెవుడున్
రవ్వంతయు లేదుగద
పువ్వులు కలదగవే సతమున గోనలలోన్.

గీ. తెరువుగన లేక దొసగులు దేలుమకు
దారిచుపెడుతలవున దపనులర
తలవని తలుగా వచ్చి పొలుచుకతను
గంటిమిమ్మందరు గనులక ఱవుదీఱ.

ప్రధమా శ్వాసము


గీ.అనిన దేనెమాట లౌనని మెచ్చుచు,
నొండొరుల మొగంబు లొరచూచి
యొక్క మాటగాఁగ నన్ను వారందఱు,
ద్దిట్టతనముమిఱ నిట్టులనిరి.

గీ.అడుగవలసి యదిగి తంతియకాక నీ,
వెఱుఁగనిదియుఁ గల ధెయొందు నెపుడు
నై ననిప్పుడదీయె మానొటఁబలికింప,
వేడుకయ్యెనేని వినుము తెలియ.

కఁమికడకంటనె చూచినఁ,
గాకలుగున్ సేమమిజ్జగముల ననమముం
జెకొనిప్రొచుచు నింతగ,
మాకయ్యది యడుగ నేల మఱిమఱి చెపుమా.

క.జగముల కెల్లందొందర,
యగురావణుఁడీల్లేగాదె యనిలలొనీచె
నిఁగ నెవ్వరిచెఁదర,
లగుఁదగ మాబొంట్ల కెల్ట నప్పటికరణిక్.

సీ.ఎప్పుడుఁగంటిపై ఱెప్పవాల్చుట లెని
జేజేల కివుడుగా చేటుదప్పె
నయినవారినిబాసి యడవులఁ గూపెట్టు
తపనులు కివుడుగాతాల్మిగలిగె
బిచ్చకానిచెలిమి యచ్చుపడ్డట్టి
క్కులదొర కిపుడుగా కలిమిగలిగె
గాలిబ్రతుకుఁజెంది కలుగులఁబడి యండు
చిలువల కివుడుగా తెలివిగలిగె

శుద్దాంద్రొత్తర రామాయణము

లేచియొకచోట నిలకడలేకతిరుగు,
చలువ తెమ్మర కిపుడుగా బలిమిగలిగె
నీ పేరు చెప్పుకొంచెల్ల జగము,
లిట్లు మనఁగల్లె రక్కసుఁడీల్గుకతన,

ఉ.ఎందఱి వానిచుట్టముల నెందఱి సంగడికాండఁబొరిలొ

జిందఱవందఱల్వరసి చెడివతివించుక సేవులొన వా
రందఱ నొర్వఁగాఁదరమె యానలుమోముల వేల్పుకైననీ
వందఱమించితెవ్వరిఁక నాదురునీసరి ముజ్జగంబులుక్.

శా.అవ్వారందఱు నొక్కయొత్తు సరిగా నాయింద్రజిత్తొక్కఁడుం

జివ్వ నెవఱు నొకయొత్తు చూడ నతనిం జెండాడెనితమ్ముఁడిం
కెవ్వాఁడట్టుగ నోవుమ్మగతనం బెందైన మున్లంతిమే
నవ్వుల్ గావుసుమయ్య మాపలుకులన్న న్నెమ్మదిన్న మ్ముమా.
వ.అనిన రాకొమరుండిట్లనియె.

చ.ఎటువలె నింద్రజిత్తునకు నింతగ నెక్కుడుబల్మికల్గేఁదా

నెటువలె వేల్పుఱేని నని నెక్కటి నొరిచేఁదండ్రికంటె మి
క్కుతముగ బీర మొట్లొదవెఁ గూరిమిమిఱఁగ నానతీయవే
తటునకున వానిపవుటవునుఁదండ్రికొలంబు తెఱంగురంగుగన్.

గీ.మొదతినుండియరాణుపుట్టుక యును,

ముజ్జగంబులునాతండు ప్రొడయగుచు
గెల్చినతెఱంగుఁదొలి వేల్పుఁగొల్చివలయు,
మొప్పులొందినయొప్పును జెప్పవలయు.

గీ.అనినఁగొలువువారి యానతిఁగైకొని,

కడఁగి వారిలొ నగస్త్యుఁడంతఁ
జెలువుగులుకు కలికిపలుకులు చవులకుఁ,
జవులు పలుమఱువెదచల్లఁబలికె.
                                                                      ప్రథమాశ్వాసము  

సీ.వినవయ్య జడదారి వెలయుఁబులస్త్యుండు
మొదటివేలువునకు ముద్దుపట్టి
మచ్చరంబునుగెల్చి మరునకులోఁగాక
యీనను దిగవాడియలరువాఁడు
నిక్కంబుతప్పక యెక్కడుతెలివిని
నీరసంబెఱుఁగక యెసఁగువాఁడు
తొలివేల్పుముక్కంటి వలమురిదాల్పుల
నిచ్చలు మదిలోన నొల్పువాఁడు

వల్లమాలినపూంకితో నిల్లువెడలి,
చలువగొలిపెడు వలిమలకెలన నలరు
చెలువుగులికెడు తృణబిందు నెలవుచేరి,
తపసితన మూనియున్నంతఁదార సిల్లి.

చ.ఆలరులకొమ్మలో మరునియమ్ములొ బంగరు కీలుబొమ్మలో
వలపుదివులో తొవలబావులొ చక్కనిగుజ్జుమావులో
తొలకరిమించులో యనఁగఁ దూకొని యచ్చరలేమలచ్చట౯
బెళుకుఁగమంగవల్ తళుకుఁబెంద్దొడలుం దగ సందడింపుచున్.

సీ.ఒక చోటనునుఁబాట లొకతేటగాఁబాడు
దురు నల్లఱాలెల్ల ఁగరగిపాఱ
నొకయోర వగమీఱ మొకమోరగ నొనర్తు
రలమి దట్టంపువెన్నెలలుగాయ
నొకచాయఁగనుకాయలకు డాయవత్తు రొ
య్యారంపునడకల హవునునిండ
నొకదండవిరిమండ లొడినిండ ఁగూర్తురు
కమ్మనితావులు గ్రమ్ముకొనఁగఁ

శుద్ధాంధ్రోత్తర రామాయణము

బిలుతురొక చక్కి నెచ్చెలిపిండునిక్కి,
కలికిపలుకులఁ జిలుకలుకలఁగిచూడ
నడుతురొక క్రేవసొలపుగానడిమిత్రోవఁ,
గదియనరుదెంచియంచలుకాళ్ళఁబెనఁగ.

గీ.జొనుపుమరుతూవులన వాఁడిచూపులలర
మదికలంగఁగఁ గందువమాట లాడఁ
జూడ్కిమిఱుమిట్లుగొనఁజెంతఁజొరవమెలఁగఁ
గలయఁదిలకించి జడదారికళవళించి.

చ.అటునిటుంఁమోల వేల్పుజవరాండ్రు మెలంగుట లెంచిచూడఁగా
నెటులునుదాను గై కొనిన యిప్పటి పూంకికి నడ్డు వాటుగా
దటుకున నుల్లమం దెఱిగి హాళగలజాలక వారినందఱిన్
దిటమునఁజేరఁజీరి వెనుతియ్యనితియ్యని తేటమాటలన్.

శా ఏలావేయును గొమ్మలార వినుఁడీ యీమీఁదనీతోఁటలో
వాలారుంగనుదోయివిచ్చి మరియేవాల్గంటి నన్ జూచునో
యాలేజవ్వని యప్పుడేయిచటఁజూలాలౌనటం చాడినం
జాలుంజాలునటంచు నాటవలపుల్ పాలించి వారందఱు౯.

క.వచ్చినదారినె పదరే
యిచ్చటఁ తలలెత్తి చూడ కెచ్చటికైన౯
మెచ్చఁగవలదా త్రోవనె,
వచ్చినవనియయ్యె నందుఁబకబకవగుచున్.

క.ఇంతటితో సరిపెట్టెను
గొతతలలు తడవి చూచుకొంటిమి బళిరే
యెంతటినోములు నోఁచితి
మింతిరో మనతొంటిమేననే యని చనుచు౯.

ప్రధమాశ్వాసము

చ.వడివడి బారుతెంచి యెకపైదలి యూర్పులువుచ్చి నవ్వినన్
బడతుకయెర్తు చాలిపుణె నవ్వకు మంతయు రేపెగట్టిగా
గొడుకులతల్లి వౌదు వొకకొంచెము నాటికి దాచుకొమ్ము నా
నుడికె నెలంతయుం గడుపులుబ్బగ నవ్విరి కొమ్మలందరున్

క.ఒక్కతె చను మెనకస్తురి
నిక్కకనగవచ్చుచిలికి నిలుమని మ్రొక్కన్
విక్కుచు గొమరుని గసుమని
చక్కనదీవించె వీపుచరచుచు దానిన్

గీ.ఇట్లుమేలంబులాదుచునింతులెల్ల నెడగలుగబోయి రంతట నిచట బూలు
గోయ ద్ృణబిందుగారాపుగూతు రనుగు
జెలియతోగూడి పూదోట మెలగుచుండి

క. మునుపటు బెట్టిదముగ నా
యన వాక్రుచ్చుటలు విన్నయదిగదటుగా
పున వెరపన్నది యెరుగక
వెనుకము ముందుం దెలియక వచ్చలవిడిగన్

సీ.వేనలిసంపంగివిరుల నెత్తావికి
దెమ్మరల్ దరిచేర దేంట్లుపొర
జక్కనినెమ్మెముజాబిల్లి జిగికిని
నెల రాల్గరంగ గల్వలు చెలంగ

దనమేనిజవ్వాజితావికి బునుగుపి
ల్లుల డాయరాచిల్క లులికికూర
నలువైనక్రొవ్వెద నల్లమబ్బునకును
నిగసియంచలువీడ నెమ్ములాడ

శుద్దాంధ్రోత్తర రామాయణము

 విరులుద్రుంచుచు ఁదేవియల్ నెడకికొనుచుఁ
బండ్లు రాల్చుచుఁగెందమ్మితూండ్లుగొనుచుఁ
జానసింగారములతొఁటలొనఁదొడి
చెలియనెడఁబాసి యొకకొంతసేపుతిరిగె.

క. బొటింగానకి యావిరి,
దొఁటం దిరిగితిరిగి యెటుఁదొచక యొంటికొ
మాటికెలుఁగెత్తచీరుచు,
మేటితపసిఁగాంచె నొక్కమిట్టను నెదురక్

ఉ . చెక్కులు తెల్లవారెఁగడుచిన్నయొయారపుఁగౌనుమివారెఁ
న్ముక్కులనల్పుసేరె జిగిపపూపనిగారపుఁజన్నుడొయిపెఁ
పెక్కువతేరె దట్ట్టమయి యంతయు నారలరారెనూరువుల్
మిక్కిలి యూరెనత్తపసిమిన్నఁగనుంగొనినంత నింతికిక్.

గి . అక్కరణిఁదానుజూలింతరాలితనము,
పూనుటకుఁజాలమదిలొ నఁబొగిలిముగుద
దానికిఁగతేంబుపరికించికానలేక,
యచటిమందులనయ్యెఁగాకంచునెంచి.

గి. ఇంక నేమందు నట్టివానింటఁబుట్టి,
నేఁదు పేరు పెద్దవారెకంబు నిటఁగలిపి
వట్టిరట్టులుపడ నొడికట్టుకొంటిఁ,
గటకటా యిదినావంటిఁకన్నేకగునె.

క.మికక్కిలి కటికితనంబున
నక్కిటికము లేక నుదుట నాకట్టిఁడివే
ల్పిక్కరణి మూడుబంతుల,
నక్కట నావంటిదానికా వ్రాయట తాన్.

ప్రథమాశ్వాసము

క. ఇది విన్న యమ్మలక్కలు,
మెదలంగానిత్తురె యిఁకమిదఁటనన్నుక్
మదినేర మెంచుఁ దండ్రియుఁ,
బదుగురిలొ వట్టిరవ్వపా లై తిఁగదా.
క. చెలులుక్ బుగ్గలు వొడుతురు,
నలుగురిలొ నవ్వుఁబాట్టు నాకని మణియుం
దెలివొంది తండ్రికడకా
చెలువ తుదకు గుండెణాయి చేసికొని చనిన్.
క.అటువంచినెతల యెత్తక,
బొటబొటఁ గన్నీరు గార బొటవ్రేల్నేలు
జిటుకునవ్రాయుచుమేనొ
క్కటగడగడవడఁకఁదండ్రికడనిలుచున్నన్.
గీ. కొంతపడికిని దలయెత్తికుఁతు నెదుటఁ,
జిన్న వొయివమేముతొనున్నదాని
నట్టే తీలకీంచి యూల్లమిట్టట్టూలుగ,
డెందమున నింతసందియంబంది పలికె.
క. పువ్వుంబోడిరొయెవ్వని,
కవ్వల నే యెగ్గొనర్చి తందరలోనన్
రవ్వగ నోర్వంజూలక,
యెవ్వడూ ని న్నిట్టూ తి ట్టే నించుకలొనక్.
క. నాముందర నీ కీవెర
పేమి నన్ను గన్నతల్లి యిప్పు డిచట నీ
వేమియు గొరమంత వెట్టక
చామా యిక దెల్పవమ్మ జరిగినదెల్లన్.

<poem>శూద్దాంధ్రోత్తర రామాయణము

గీ. బ్రతికిసంతతడవు పరు వన్నదియె లేకి,

      దల్ల్లి దండ్రు  లెపుడుఁదలలువంపఁ
       బుట్టరానియాడ్రుపుట్టుగుఁబుట్టియుఁ
       గానిచేత్ర  కేల  కడఁగితమ్మ.

క. మునుపటితెలివెల్లను జ,

       వ్వసరొ   యిపుడెందుఁబొయె  వగ  చేడునిన్నె
       మన  నెన్నటికిం  దఱుఁగని,
       పెనురట్టడి  మకుఁదెఛ్ఛిపెట్టితి  వనినన్.

చ. వెలవెలవొయి యచ్చులువ వేనుఱు వెల్వడి జూలువాఱుక

     నలువలవేఁడినిటఁగనుకందినకాళ్ళకు  సేదదిర్చుచుం
     బలుకులవిన్నఁబాదవమై చెమరింప  నెలుంగు  రాల్పడం
     బలికెఁదమంతిరాచిఱుకబారులు చేరువఁబాఱుతేరఁగన్.

శా. తండ్రి కొండొకదొస మేనెఱుఁగఁజూ తప్పెన్న మియన పె,

    క్కండ్రిత్రొవను బూలు గిసిగొని యేగం జాచి డెందంబులొ
    వేండ్రంబతిమి  పెల్లిదు  బడఁపకేవే  పొయి   యితొఁటని
    ల్లాండ్రందెల్లను  వాసిగన్న చెలితొ  సందందనేఁగుమ్మరక్.

గీ. ఎకతంబున ఁజెరలాడ నేకతంబొ,

     కాని  యట  నకుఁజెలి  చెంతలేనితణిని
     నిట్టచూ  లేప్ప   యె@గాని  యింతకన్న,
     వేఱెఱుంగను  మియానవేయు నేల.

గీ. అనిస లొపలి చూపున నరసి నిజము,

   కనున్నుఁగవమల ఁగట్టి నకరణిఁదొఁపఁ
   జానయెడఁ  దప్పు లెమికి  సంతపించి,
 ళూఁతుఁ  గనిప ల్కె  గూరిమికొనలుసాఁగ, <poem>ప్రదమాశ్వాసము
క,  అమ్మా  యారక  సీపె
      నిమ్మాడ్కిన   లెనిపొయీనెరము  నెఁ
      జిమ్ముట  తప్పగఁ  బట్టక,
     యుమ్మలికము  మాని  యుండు   ముల్లములొక
క, తను  గనుదానికీఁ గడుపొ,
     ననుచుఁ  బులస్త్యుండు  పలికి  నది యింతకెఱుం
    గనికతమున  నీ  వాతనిఁ
    గను  కొటివి   గానఁ  జూలు   గలిగె  న్నీ  కా
క, ఇంతటిపని   గలుగఁ గ
    వంతలఁదలకంగ   నెలవలదు నీ  కా
    వంతయుఁ గొఱంత  లె ది కఁ,
   జెంతకు  రమ్మంచుఁ   గూఁతుఁ  జెరఁగఁబిలిచెను
 గీ,పిలిచి  తొడ మిఁద   గూర్చుండ  బెట్టుకొనియ,
    తండు  బుగలుముడ్దిండినిండుతమిని
    గొప్ప డువుచుఁ  బయిచకకొంగు   తీసి
    కనులని  రొ  త్తి  తడవుగ  గొగిలిచి,
చ చనవున  లెవ  నెత్తి   యెలజవ్వని  కె  లొకచెతఁ  బూని  గొ

బ్బువ దనవెంట బెట్తుకొని పొయి పులస్త్యునిఁ గాంచి మేక్కి యా

     యనకు   వెలండిఁ    జూసి  తెగ  నప్పటికట్టడి  నింటి  చూలుదా
   ల్చిన దగు  తెర్పడం  బలికి  చెతులు  రెండునుఁ  జెర్చి  యిట్లను.
గీ, తపసియై  యున్న ముకటి   కవుడు  కొలువు
      గట్టురాకన్ని  చెసినకరనివుడు
      తపసియై   యున్న  మిమ్మునీతలిరుఁ బొఁడి
      నమ్మికొలుచును  బెండిలికమ్ముదిని, <poem>శుద్దాంద్రొత్తర  రామాయణము
 క, ఎండల  బడలినయప్పుడు,
     మెం  డాకలి  గొనయవుడు  మీకొకప్రాపై
    యుండి   తనయండ  నిడుకొని,
    పండు  లొసంగులతకూనబడలికలడఁగన్.
గీ, అనుచుఁ  చెతిలొ  జెయివెటి  యప్పగించి,
   యఁతడు  గైకొన పిమ్మట నల్లు నొద్ద
   సెలవు  గైకొని  కూఁతునిలువఁబనిచి
   లెచితనుంయిట   కెగెనా  రాచతపసి,
 క, ఆది  మొదలుగ   నాకన్నియ,
     పదిలముగా  మగనికూర్చి  పడయంగఁ  దలం
    పెనలొ  బొదలగ   నాతని
    మదిలొపలమెలంగిచుఱపెఱఁగనిదె.

సీ, ఎవుడు బ్రొద్దున లెచి యేట మునిగి యింటి

                             కెంతచునంతలొ  నెదురువచ్చి
  యడుగుఁ  గెందములు   కడుగుకొనఁ   బసిండి
                            చెంబున  నీ   రంది   చెంతనునిచి
 పగునఁ  దననునుపై ట చెంగునె
                       నడుగులతడి  యెత్తి   యంతలొన
 నుతికినతెల్ల దొవతుల పింజెలు  వెట్ట
                    చని  చెతి  కందిచి సరస  నొక్క
 పీట  వెట్టి  కూర్చునచొఁ బెరట  నున్న
 పువ్వు  లొకపళ్ళెరంబునఁ  బొసి  యెపంగి
 వార్చి  యాతడు  లొనికి  వచ్చునంత
 పిండివంటలతొఁ గూడ  వండి పెట్టు.. <poem>ప్రదమాశ్వాసము

గీ ఆరంగిచెడుతఱి నొకర నిలిచి

  వినిరు   వివన  చెఁబూని  వెనుకఁబూల
  పొను  పొక్కటి  సవరించి  పవ్వళింప,
  దొడలపై  నిడుకొని  మెల్లనడుగులొతు
క. నడి రెయిమైనఁ  బలువురు,
    బడీబడీ నడత్తెంచి  రెని  వారికి  సరిగా
     గుడువగ ఁబెట్టు  నప్పడ,
  మడ్డికట్టుచు   వంటచెసి   మరియాదమెయిన్,
 గీ,అదును తప్ప  కుండుఁగ  నొరెమమురుచుటకు
      నింటి తిరుపునఁ దను  మఱపిచుటకును
     దవసియంతవాఁడునుజొక్కఁ దలిరుఁబొండ్ల
     యిచ్చకబులఁ  బడనివా  రెవ్వ  రింక
 వ, ఆట్లు,
గీ, కూర్మి  మగఁడు  కన్నులఁ  గపకొనగనుండి
     యంతకంతకు  మేనిళ్ళువింతమిఱఁ
    బాలఁ  గసిగాట్టులుగఁ    దిండిసలువఁబాదె,
   నెలలునిండె  నిళ్ళాటప్రొద్దులునుడాసె,
 క. ముగుద  యెక  మంచినాఁటను
  మగవానిం  గనియె  మగఁడు  మదినుప్పొంగ
  మగవానిఁ   గన్న తండ్రియు,
  మగువాం  గన్న ట్టితల్లి  మక్కువపడరె.
సీ, ఏతొందరయు లెక  యెలమితొఁ  జుట్టముల్
                                నిండు  మెడుకఁ జెంద  రెండుతలలు
  కుదురుగా  నెర్పడి  పడినాఁడులునుజన్న
                                    మ ఱునాఁడు  పురిటిసి  ళ్ళిరసిపొసి శుద్దాంద్రొత్తర   రామాయణము

<poem>యిరునదొక్కటవనాఁడెదఁ దలపొసి పెద్దలు పెట్టినమెకమూర్తంబునందు నరుదెంచి తపసియు విరిబొఁ డియును బార సాలకీఁటలమిఁద నంతసమునఁ,

గూరుచుందఁ దండ్రి కొమరున కప్పడు విశ్రపసు ఁ డనంగ ఁ బెరు వెట్టి నాఱననెల నొరె మమరంగ ముట్టింది వడుగు నెఁడులెడు గడపఁ జెసె.

చ. పితరునిమాడ్కి విశ్రవుడు పినటనుండియుమొండుదందియై జతనము హెచ్చ మచ్చరముఁ జంపి వడిం జడదారిదారిఁ దా సతివల మాని మాని తను నందఱ నందరుదందిచూడఁగా సతమును గానలొన రెయిసైతము నితమునిండ నుండ@ంగ,

క.పుడమి భరద్వాజొం డను బడదారి యొకండు తనను చక్క నికూఁతు పడి దెవవర్ణి యనిఉఎను పడ@ంతుకఁ దొడుకొని వచ్చివలి కెంబెరిమన్.

సీ, చెలువకన్నులడాలు చెంగల్వవిరిచాలు నినుమడింపఁగఁజులు నింపునింపుఁ గొమ్మపొక్కిలి పెంపుకమ్మతావులనింపు పిన్నక్రొన్ననసొపు పొలుపుఁదెలుపు మగువపన్నులతీరు మల్లెమొగ్గలపెరు లొనలగూర్పఁగను గొరునొరపునెవుఁ జూనచకబిముక్క సంపంగిపువుటెకు దాపునఁ జెయిచిక్కు నెవుఁజూపు <poem>ప్రథమాశ్వాసము

నువిదచేతులుపూదండలో సఁగుచుండు నింతినెమ్మోమువిరిదమ్మినెలమిగూర్చుఁ బూజసల్పెడుతఱియందుఁబూనిమీకు గట్టిగాననబోఁడిఁ జేపట్టవలయు .

మ . అన నెమ్మోమునఁ బిన్ననవ్వొలయ నొయ్యారంబుగాలేచి యా యన వెంటంగొని తల్లిదండ్రులను డాయంబోయి కాంపించి వ చ్చినకర్జంబు కరంబు వీనులలరం జెల్వంబుగా విన్నపం బొనరింపన్మది నుబ్బి మైకొనిరి వారొండాడఁగా లాఁతు లే .

ఉ . అంత నొకింత మంతనమునందుఁ గొమారు తలంపెరిం వా రెంతయు సంతసంబడర నింతిఁగొనం దమడెందమందు ని క్కింతయు నడ్దులేమి యెఱిఁగించిన మేలనివారు, దారును౯ వింతగ వియ్యమొందఁ గనువిందుగ నందఱు నందుఁ బొదుగన్ .

సీ . తమ్ములమ్ములనంది తరువాత నిరువురు బట్టలొండొరులకుఁ గట్టఁబెట్టి పెండ్లిపనులుచేసి పెద్దలరానించి తమవారితోఁగూడి తరలివెళ్ళి వియ్యపువా రిడ్డవిడిదిలోపల దిగి నాల్గు నాఁడులతంతు నడిపి మఱియు నలుకపానుపు మొదలై నవేడుకలెల్ల జరగవలసినట్లు జరగ నలరి నాగవల్లియైన నాఁటిరేయూరేగి యొప్పగింతలైన యప్పుడగవు తగవు లరణములును దగినయట్టులొసంగి పెండ్లికూఁతువారు బిడ్డనిచ్చి .<poem> <poem>శుద్ధాంధ్రోత్తర రామాయణము

గీ . అంపకముసేయఁబైనమైయపుడక దలి

       పండ్లికూఁతుతోఁగూడ  నాపెండ్లికొమరు
       నొక్కపాలికి  నెక్కించియుబ్బుమీఱ
       నింటికేతెంచెనుబులస్త్యుఁడింపుమెఱసి .

క . పిల్లదిపెద్దదియైనం

      దల్లియుఁదండ్రియును  వచ్చి  తమముచ్చట  పెం
      పెర్లను  దీఱఁగఁగొమరెకుఁ
      గొల్లిగ   సొమ్ములిడి  కోర్కికొనసాఁగంగన్ .

క . పెనిమిటిపెండ్లాముల మం

      తనమున   నొకటిగ  నొబర్చి  తల్లిదండ్రులు  వే
      డ్కను   దమయింటికిఁ  బోయిన
      వెనుకంజూ  లేరుపడియే  వెలఁదికినిచటన్ .

క . అన్ననబోఁడికడుపునం

      బున్నమచందురునివంటి  బుడతఁడు  వొడమెన్
      గ్రొన్నెల   దాలుపునాలికి
      మున్నలకొమరుండునెమ్మిఁబుట్టిన  పగిదిన్ .

ఉ . ముద్దులుమూటగట్టునలబొట్టియపుట్టుక యప్డు వేలుపుం

      బెద్దవులుంగతవ్ త్తడిని  మేడుకమీఱఁగ  నెక్కివచ్చి  వీఁ
      డద్దెసలేలు  నేలికలయం   దొకఁడై  మఱి  రొక్కపుందొరౌ
      నద్దిర   వీనిపున్నెమని   యానతి  యిచ్చి  చనెం   దనెంతటన్ .

చ . వడుగొనరించి యామొదలు ప్రాఁజదువున్ చదివించి తండ్రి నే

      ర్పడరఁ  దనంతవానిగను  నన్నిట   దిద్దిన   నాఱితేఱుటన్
      విడువనిపూనికిఁ  గాలిబొటవ్రేలొకయించుక   నేలమోపి  న
      ట్టడివిని   నొంటిమైఁ   దపసియై  యతఁడుండెను   దండ్రిపోలికన్ . <poem>ప్రథమాశ్వాసము

క . వేయేఁడులు నీరానియు

      వేయేఁడులు  గాలిఁగ్రోలి  విడువకయాపై
     వేయేండ్లోగిర   మొల్లక
     యాయడవిని   దమ్మిచూలి   నతఁడు  తలంపన్ .

ఉ . నిద్దపుఁబండువెన్నెలల నింపెడుసొంపగు ఱెక్కలన్

     ముద్దుమెఱుంగుఁదీవియలఁ  బోలినబంగరు   రంగుచాఱలం
     దద్దయుమించునంచపయిఁ  దామరచూలి   కరంబుడంగా
     నొద్దకువచ్చి   యచ్చెరువునంది  కనుంగొని   నింగి  నిట్లనున్ .

క . ఎమ్ములుదక్కఁగ నొక్కటి

    నెమ్మేనం   గానరాదు  నిలువల్ల  జెడల్
    గ్రమ్మెనుమెచ్చితిఁ  దాల్మికిఁ
    గొమ్మయిదె  కోర్కులిత్తుఁ  గూరిమికుర్రా .

క . అని తనకమండలమున

    నినిచినతెలీనీరు  మీఁద  నొకయించుక  చ
    ల్లిన  నెప్పటిమైజిగితోఁ
    గనుపట్టియచటు   వెలువడి  కడుర్మిలితోన్ .

మ. పెనులిబ్బిం గనుఁగొన్నవేదపదిం బెల్లుబ్బి కేల్దోయి మో

     డ్చినిరాబారి   కడానిబొజ్జగల  జేజేమిన్న  నగ్గించి  యి
     ట్లనియెం   గూరిమిమీర  నియ్యఁగదవయ్యా  వేఁడెదన్మిమ్ముఁ జి
     క్కనిబల్మిన్  దెసయేలుమేలుఁ   బెనురొక్కంబుండుబండాలమున్ .

చ. పనిగ సతమ్ము మిమ్మొక నెపమ్మున నెమ్మది నెమ్మి నమ్మినం

    గనికరమూని  వాని  ముడికానిని నై  నను  గాతురన్న  ము
    మ్మనుమని నన్ను  మిన్నకయి   మన్ననఁ  దిన్ననఁజేయ  టబ్రమే
యనవుడు నన్ని నీవడిగినట్టు లొసంగితినంచు వెండియున్ .

శుద్ధాంధ్రోత్తర రామాయణము

క . మెండుపరికించి నేర్పున
        దండిమగని వల్లెత్రాడు తాల్పరినిజమున్
        గొండలపిండులుఱెక్కలు
        చెండంగలవేల్పుఱేనిఁ జేవదలిర్పన్ .

క . పొడమించి వారివరుసగఁ
        బడమరదక్కినము తూర్పువైపులకు మ్మ
        న్నొడయలనుగాఁగఁజేసియుఁ
        గడమకడనిఁకెవ్వఁడేలఁడయుండన్ .

గీ . తగినవాఁడవు దొరకితి తలఁపనేఁడు
        నాదుమదినంత యంతయునడచెనిపుడు
        గట్టువిల్కానితోఁ జెల్మికదలకుండు
        పుష్పకంబునుతేరిది వుచ్చుకొమ్ము .

చ . చలువయు వట్టయున్ వలయువందముల ప్సమకూర్చు ముజ్జగం
బులు దిరుగంగ నింగిపయిఁ బోవఁగవచ్చును దీనినెక్కి య
క్కొలఁదులు తెల్పఁదెల్ప మఱిక్రొత్త లొసంగితి నీకు నింక జ
క్కులు కొలువంగ నీకొలివికూటములోఁ గడుఁబేర్మిఁగాంచుమా .

వ . అని యొసంగి మఱియును .

క . కనికరమునఁ గనికేఅమును
      మనుమని మనుమని యటు పలుమాఱును దీనిం
      చినలువ యిచ్చను జనియెం
      దనమనికికినౌర మంచితనమని పొడగన్ .

ఉ . అంచహుమాయిజోడు చనినంతటఁ దండ్రిని జేరఁబోయి లో
నుంచినకూర్మి ఁమొక్కులిడి యుబ్బుచు లిబ్బులఱేఁడు కాంచీ దీ
వించినతండ్రిఁజూచి తమరిచ్చిన యానతి నల్వఁ గొల్చి మీ
పంచినమెప్పులం బడసివచ్చియు నొక్కటి వేఁడ నోడితిన్ .

ప్రథమాశ్వాసము

<poem>క . పెఱవారెవ్వారలకుం

       దఱియంగాఁ  దరముకానితా   వొక్కటి  నే
        నెఱి  నుండుటకున్   వేఁడఁగఁ
        మఱచితిఁ   జోటొందుచూపి  మన్నింపఁగడే .

క . అన ననుఁగుఁబట్టిమొగమ

         ల్లనఁగని  కడుబుజ్జగించి   లలినాతఁడెదం
         గనికర  మిగురొత్తంగా
         వినిపించెద   నిలువ  నెలవు   వినుమని   పలికెన్ .

గీ . ఉప్పరం బంటుతరఁగలయొప్పుతోడ

        విలువరతనంపుగుంపుల   పెంపుతోడ
        జడుపెఱుంగని  గొప్ప   మొసళ్ళతోడ
        నుప్పునీటిసంద్రము   కరంబొప్పునందు .

ఉ . జాలులయందు నందములచాలగువేలువుటేటి దీటునం

       గ్రాలెడుతావిప్రోవులను   గమ్మనికస్తురి   తానికై వడిన్
       జేలలలోనఁ  జీనిపనిచీర  తెఱంగునఁ  బూల  జూపివూ
       పోలిక  లంక  పొంకమకుఁ  బొల్పగుడీవుల  మేలుబంతియై .

సీ . పలుకోటకొమ్ముల మలఁచినసింగముల్

                                       దెసయేనుఁగులనెల్ల   దిగులుపఱుప
      నగరియుప్పరిగలమగ  ఱాలజగడాలు
                                       విన్నేటినీటితో   వియ్యమంద
       వీటనీటుగఁగ్రాలువెలిడాలుగమిగాలి
                                      వేల్పు  జంటలకును  వేడ్కలొసఁగ
      విరిదోఁట   నెత్తావి   విన్నింటవేల్పు   ఁమాఁ
                                      కుల కెల్ల  గొల్లగా  వలపులియ్య . శుద్ధాంధ్రోత్తర రామాయణము


గలికిపడగంవుసోరణగండ్లు రేలు
తొవలవిందున కేగంగ ద్రోవమాప
వీడు తొలివేల్పుగములకై విశ్వకర్మ
లంకయను పేరజేసె నాలంకయందు.

క.వెన్నునికి వెఱచి పాఱిరి
మున్నట నున్నట్టివారు మొన్నను నివుడా
సన్న యఱింగితి గావున
నన్నా నీవేగియుండు మచ్చట నెమ్మి.

క.క్రిందిజగమ్ముననిలిచిరి
యందలి రేద్రిమ్మరీండ్లు నచ్చట నీ కే
తొందరయు గలుగనేరదు
వందడిచూపంగ లేరు జంకక పగరు.

చ.అని నెలవియ్య నప్పలుకు లవ్ దల దాల్చికుబేరు డప్పుడే
చనిచని లంక జేరి పలుచందములం దను దారవంబుతో
ననయము వేల్పుపిండు గొనియాడగ నేలుచునుండ పుష్పకం
బొనరగ నెక్కివచ్చి కనుచుండును నిచ్చలు దల్లిదండ్రులన్.

క.అని రారాజు తెఱంగిటు
వినిపింపగ రాముడలరి వింతగ మది దో
చననచ్చెరువంది యగ
స్త్యునిగని యిట్లనియె వేడ్క దుడుకొనరింప.

ఉ. ఓజడ దారిరాయ యివుడుల్లము పెల్లుడుకం దొడంగె రా
రాజుకు మున్నులంకను దిరంబుగ గైకొని సోకుమూక లెం
తేజిమీఱ నేలునటులీ రిటుపల్కుట విన్ననుండి, నే
నీజగ మందు రక్కసులనెల్ల ఋలస్త్యుకొలంబు వారిగన్.

ప్రధమా శ్వాసము

ఉ . విందునుముందు, వెండీ యొకవింతగ రావణుకన్న మున్ను లం
         కందగ బెక్కురక్కనులు గ్రాలిరంటిరి వారిపేళ్లు నా
        యందఱివంగడంబు మును పాకఱివేల్పున కోడీ డాగుటల్
       సందియమాఱ దెల్పగదె సొగిలి మొక్కెదనీకు నావుడున్
                                          పంచ చామరము
         అగస్త్యుడంత జెల్వుగుల్క నందమొల్కు పల్కులం
        బొగడ్తజేసి వాసి రాముమోము గోము మోఱగా
         జగానిగార పోరచూపు జాలువాఱ జూచి డం
        బుగా నెలుంగు కంగుమంచు మోగ వేగనిట్లనుక్

మ. తొలుత నెన్నునిబొడ్దుదమ్మి నెలమిం దొల్వేల్పు తాబుట్తియ
         వ్వల మున్నీరొనరించి దాని గొని కాపొడంగ మేదాల్పులం
        గలిగింపం దరువాత వారలతనిక్ సంతోస మారంగ మా
        వలనం గల్గినకర్జ మేమి వినిసింపంజెల్లు నా నాతడున్

 క. మిమ్మిందఱ గలిగించితి
         నిమ్ముల నిన్నీరుప్రోవ నిప్పడ చని మో
         నెమ్మదులమ్ము దలపుచు
        నెమ్మెయి గాచెదరొ చూతమిందఱిబలముల్

క. అనిపనిచిన వల్లేయని
          పనివిని మున్నీరు గాచువని పూని కడుం
          గనుకలిగియుండి యాకలి
          గొనిడప్పికి నిలువలేక క్రోలుద మనుచున్

క. తలపోసి యంతబొంతను
          నలుమోములవేల్పు గాంచి నక్కుచు దమలో
         వెలవెలబాఱుచు మిక్కిలి
        యలసియు నీరానగొంకి యడకునతోపన్

శుద్ధాంధ్రోత్తర రామాయణము

 క. సాకెదమని యొకకొందఱు
మైకొనిరిఁకమెక్కెదమని మఱికొందఱు పె
ల్లాఁకలి కోర్వకపలికిరి
యూకొని నెత్తమ్మిచూలి యుల్లంబలర౯.

క. మెక్కెదమ్నువారందఱు
జక్కులును బరాకులేక సాకెదమనువా
రక్కజముగ సోఁకుడులును
నిక్కముగా నౌదురంచు నెట్టనఁబలికె౯.

గీ. పెక్కురమ్మాడ్కి జక్కులురక్కనులును
బొడమిపుడమినిబొగడికనడసిరడరి
వారిలోపలనెంతయు వాసిగనిరి
హేతియుఁబ్రహేతియు న్నంగనిరువురందు.
 
క. నెమ్మదిఁబ్రహేతిముద్దల
గుమ్మలకూటములు రోసి కోర్కుల నెల్లం
గ్రమ్మి తెగగోసి మిక్కిలి
ముమ్మర మగునీసు వాసి పొలుపుగనుండెన్.

ఉ. రెండవనిబ్బరంపురెయిద్రిమ్మరి ఱేఁ డల హేతి దండియై
పెండలి యయ్యె నొయ్య భయపేరిటిముద్దులగుమ్మఁ గొమ్మరే
యెండను నవ్వు నవ్వు పసనింపగు దానిని సల్వ యానతి౯
వెండియు డెందమందు మగబిడ్డలకై గలకూర్మి పేరిమి౯.

క. అయిరువురకుం బుట్టెను
దీయనివిల్కానితోడ దీటై యని వెన్
దీయని విద్యుత్కేశుఁడు
సోయగమున కింతు లెల్ల, సొగయుచునుండ౯.

ప్రథమాశ్వాసము

గీ. తల్లిదండ్రులకన్నులు చల్లఁపడగ
        విద్దెములు చేనె కొన్నాళ్ళు వెనుక వెనుకఁ
        దప్పుటడగులు పెట్టుచుఁ దడవు నడచెఁ
       బిదప జిలిబిలి పలుకులఁ బిలువనేర్చె.

క. అట్లుముద్దులు గురియుచు నలరిఁజిన్ని
         తనముమెల్లనజాఱిజవ్వనము మొలిచెఁ
         జిన్నిపాయంపు మేనికి వన్నెయొసఁగి
          కుందనంబును నెత్తావిపొందినట్లు.

గీ. వెడఁదఱొమ్మున కొకవింతవీఁకయొదవె
          నగుమొగంబున నొకవింతజిగిదొలంకె
          మీపకట్టున కొకవింతమిసిమితోఁచె
          హేతిపట్టికి జవ్వనమింపుమెఱయ.

క. అప్పగిదిముద్దుకొమరుని
          యొప్పునకుం దగినయట్టియొయ్యారినిదాఁ
          దప్పక పెండిలి సేయగ
          నప్పుడుతలపోసి హేతియందఱు మెచ్చ౯.

సీ. కవజక్కవలఁబోలి తొవపెక్కువలనేలి
                                                చన్నులు కన్నులు చెన్నుమీఱ
               జిగిహొన్నువలెమించి తగమిన్నుఁదులకిం చి
                                        మేనును గౌనును జానుమీఱ
                నిరులసొంపునుమీఱి తరగగుంపును దూఱి
                                         కురులను దరులును గొమరుమీఱ
                   నరఁటాకుఁగని నవ్వి మరుబాకులను రువ్వి
                                               వీపునుజూపును వింతమీఱఁ

ప్ర

ప్రథమాశ్వాసము
శుద్ధాంధ్రోత్తర రామాయణము


ఉ.దానికిఁ దాళఁజాలక వెతందెఱగంటులు దద్దరిల్లి లో
నూనిననివ్వెఱంగదలి యూడనిబాడిరి తమ్మిచూలికిం
బానలు దీఱ రక్కసులప్రల్ల దనంబులు విన్నవింపఁగాఁ
బూని కడంకదోఁప నటమున్నె యతండును
నిండువేడుకన్. 148

ఉ.అంచహుమాయిఒ నెక్కి తెలియందవు ఱెక్కలడాలు నల్గడల్
ముంచు కొనంగఁ గెంపుడుజిగు మిక్కు మెఱుంగులు చౌకళించి మే
ల్గాంచిన జాళువాబొమిడి కంబులడంబగు మానికంపుఁగ్రొ
మ్మించులతో మాఱ్మలయ మింటనువచ్చెను వారిపజ్జకున్. 149

 క. విచ్చేసి వారిమేనులు
మచ్చికతోఁ గేలనిమిరి మదితాల్మికిలో
నచ్చెరువందుచు దీవన
లిచ్చి కనికరంబు దోఁపని ట్లని పలికెన్. 150

ఉ.రక్కసులార చేరువకు రండీదె వచ్చితి మిమ్ముఁ జేరఁగా
నిక్కరణి ంవెతల్ గుడువ నేటికి మికిఁక లెండు తాల్మికి
న్నిక్కముగాఁగ డెందమున నేఁగడుమెచ్చితి మీపయిం గరం
బక్కటికంబు విట్టెనిపు డారెసి కోరుఁడు కోర్కు లిచ్చెదన్. 151

క.అని పలుకులవెలఁదుక చ
      క్కని మేలిమియుం దెరవలిఁ గైకొననియెలిం
       గునఁ దిలివే ల్పానతి యి
       చ్చిన విని వడి లేచి వచ్చి చిడిముడితోడ౯. 152

చ. అలవలకేల నల్వ యొడ లంటిన వెంతనె యట్టె తొంటియా
        యలసట వాసివాసిగని యారెయిద్రిమ్మరు లొక్కయుమ్మడిం
         బలుకులఁ దేనియల్ దొలుకఁబాఱఁగఁ గేల్గవ దోయిలించి యి
         చ్చలఁదొలివేలుపుఁ బిగడఁజాఁగిరి కన్నులు విచ్చి యచ్చట౯. 153

ప్రథమాశ్వాసము


క. జగములఁ బుట్టింపనుముఱి
      నెగడింపను గినుకఁబూని నీల్గింపను మే
      లిగఁ దగునెఱప్రోడపు నీ
       వెగదా నెత్తమ్మిచూలి వేలుపుఁబెద్దా. 154

క. జతలేనిసిరులఁ దగి నీ
       మతకము తెలియంగ లేక మైదాల్పు లొడల్
        సతమని నమ్మ కరమ్మను
        వెతలం బడి పొరలు చుండ్రు వెఱ్ఱులపగిదిన్. 155

శా. ఎందు న్మీసరి పోల్పఁగాఁ దగినవే ల్పెన్నంగ నొండొక్కఁడీ
        యందంబై నజగంబులోపలఁ గలండా పేర్కొన్న న్నెమ్మి మి
        మ్ముం దోరంబుగ నమ్మి వేఁడుకొనుటల్ ముంగొగుబంగారుగా
        ముందు నిందుము నేడు మా కది నిజంబుం జేసి తీ వియ్యెడ౯ 156

క.మాపై ఁ గనికర మొలయఁగ
    మాపూంకికి మెచ్చి మమ్ము మన్నింపంగా
     నోపెదవేని నేఁడెద
     మాపయి మామేలును దమయక్కటికంబు౯. 157

క. కదదొరలను బవరంబుల
       నొడువం గలబల్మి మాకు నొందొరులపయిన్
       విడవని కూర్మియు సిరులను
      నెడపక వేలుపుల వేల్ప యిప్పింపగడే. 158
 
గీ. అనుచుఁగొనియాడితను వేఁడఁగనికరమునఁ
       గోరికలనిచ్చిలలిమెచ్చికూర్మిపేర్మిఁ



శుద్ధాంధ్రోత్తర రామాయణము


దడవు దీవించి మించినె త్తమ్మిచూలి
కదలివిదారిఁ దనవారిఁగలసిచనియె. 159
 
వ.అంత 160

ఉ. వేలుపుఁబెద్ద తానిడినవిప్పగు మెప్పులనొప్పుమీఱి తొ
       ల్వేలుపుఁబెద్ద లొక్కమొగి విక్కుచు నిక్కుచుఁ గండ్రక్రొవ్వునన్
        వేలుపు యొనర్చి గెలిచి వీరిని వారిని బోలె వారల౯
      గేలి యొనర్చి పేర్చి పెనుకిన మెయిం జెఱఁ బెట్టి రింతుల౯. 161

క. పొడిచిరి పెక్కుర జక్కుల,
       జడదారులఁ గాళ్ల రాచి చమరిరి నేలన్
       గడతేర్చిరి చిలువల నొక,
       కడకుం దెచ్చి పొగ రెచ్చి కలఁచిరి జగముల్. 162
 
గీ. వారు పెట్టెడిరట్టడిఁ బడఁగ లేక
      యిండ్లు వాంకిడ్లు విడనాడి యెదల నోడి
      కన్నకన్నవారల నెల్లఁగాళ్ళువట్టి
       వట్టియనదలై వెల్పులు కట్టువడిరి. 163

సీ. ఒక వాడమొకమోడకొకవేల్పుఁ గొట్టింతు
                                                  రొకవంకజములెకనొడిసిచఱతు
      రొక్కచక్కీపొకరెక్కియొడయండ్లఁబట్టింతు
                                                  రికచాయఁదొగదాయనొదుగనడఁతు
      రొకదారిజడదారి నొఱపులఁబెట్టింతు
                                                   రొకచెంతనెలనింతయుక్కడంతు
      రొకమేల వినుచూలి నూరక కట్టింతు
                                                    రొకదండ జము నుండనోలిఁ బంతు

 



ప్రథమాశ్వాసము



రొక్కయిక్కను జక్కుల యుడ్బంతు
రొక్కగీమునఁ బాముల నుక్కు మిగులఁ
బెక్కులాగుల సేగులఁ బెట్టుచుంద్రు
రక్కసుల మువ్వురును గ్రొవ్వు పిక్కటిలఁగ. 164

సీ.నీళ్ళుమోవఁగలోఁగె నెఱిమాలి నెల దాల్పు
    కనుమూయుటుడిగెవేగనులవేపల్పు
     బిచ్చకానిని జేరె వచ్చి జక్కులఱేఁడు
పిచ్చుకుంటై పోయె బెగడి జముండు
       రేలు ద్రిమ్మరుచుఁడెఁ దూలిరక్కసుఁ డెప్డు
వంటయిండ్ల నడంగెవచ్చిచిచ్చు
       వంకల కిరవయ్యె వలగొని నీటిఱేఁ
డొకమూలఁ బడియుండె నికఁడు గాలి
 
తక్కుగల వేల్ప్[ఉ లెల్లను దల్లడమున
బయలు వట్టి తురుగునట్టిబ్రతుకు గనుటె
కాక నోరి కోరె మొకింత లేక మనిరి
యకట చెప్పెడి దేమి యాయాగడంబు. 165

క. ఇక్కరణి న్మువ్వురు నా
రక్కసులుం గండకావరంబున నేరిన్
లెక యొనర్పక యొండిరి
యొక్కడఁ గనుఁగొన్నను దమరె యగుచుఁ గడిమి౯. 166

గీ. అంత నొకనాడు వేడుక లనఁగి పెనఁగఁ
బెద్దకొలువుండి మువ్వురుఁ బెం పెసంగ
వేల్పుటగసాలిఁ బిలిపించి వెరవుమీఱ
వలయు మరియాద లొనరించి వాని కనిరి. 167





శుద్ధాంధ్రోత్తర రామాయణము


క.ఓయీ వేల్పుల కందఱ,
కాయాకొలఁదుల నెదఱింగియందపునెలవుల్
సేయుటవలనను నూపే,
రేయెడలను నన్నె కెక్కి యెంతయు నలమె౯. 168

ఉ.కావున మాకునుం బసిఁడిగట్టున నై నను వెండికొండపై
నావల నైన మంచుమల నైనను గవ్వపుఁగొండ నైననున్
నీవెర వంతయు న్నెఱపి నిక్కపుఁజక్కనిమానికంబుల౯
ఠీవి తెలర్పఁగూర్చి యిపుడే యొడగూర్పుము పైఁడి మేడలన్. 169

క. అనిన్౯ జేతులు మోడిచి
యను వొప్పఁగ వారిమోములందునె చూడ్కుల్
పెనఁచి యడంకువతో నిటు
పనితెఱఁ గెఱిగించి నతఁడు వారలతోడ౯ 170

గీ.జమునికడయందుఁ బొలుపొందుసంద్రమందు
నెసఁగునొకదీవి పెనుఠీవియెల్ల మెఱసి
పుడమియందును నెందును బుట్టరాని
మానికమ్ముల నిమ్ముల మలఁచి తెచ్చి. 171

ఉ. వేలపుఱేనియానతిని వింతగఁ జేసితి వీఁడొకండు తొ
ల్వేలుపులార మున్ను గడువేడ్కఁ ద్రికూటముఁ నఁగఁ బేరున౯
గ్రాలెడు కొండకొమ్మునను నాతెలివెల్లను వెల్లడింపఁగా
నేలిన వారి కయ్యదియె యిమ్మగుని మ్మని నాకుఁ దోఁచెడు౯. 172

సీ.ఏవీటికిని నాల్గుక్రేవలందును జుట్టి
                                   సంద్ర మగ డ్తయై చదువులు నింపు
నేయూరిపెనుకోటఁ బాయక బురుజుల
                                 నేవున వేల్పులు కాపు గాతు





ప్రథమాశ్వాసమూ


రేప్రోల నరువాత నెల్లరనిద్దుర
      మిన్నేటియలుకుడు మేలుకొలుపు
నెందలిరతనాలు చింది పడఁ గడలి
    తావలంబయ్యె రతనములకును

నెచటియెలఁదోఁటగమి తాని యొసఁగి మింట
వేల్పుటాండ్రాకు మగలకు వేడ్క లొసఁగు
నెచటిపయ్యర లడతేరి యెల్లయపుడు
చెల్వలయుఁ జెల్వులయు సెజ్జ చెమటలార్చు

వ. అట్టిసింగారంబులకుం బుట్టినిల్లు గలుములకాఁటపట్టును బీదసాదల
కుంబసిడి కొటారును బెద్దలకుం బట్టుగొమ్మయు నయి లంక చె
న్నలరుచున్నది.

ఉ. లంకను జేరి మార్తుర నలంతులఁ బాఱఁగఁదోలి నెయ్యిరం
బొంకముగాఁగఁ గల్ము లిడి ప్రోచుచు మీసరిసాటివారితో
నంకిలి లేఁగొప్పతన మందఁగలారని వేల్పువడ్రవాఁ
డింకను గొన్ని పల్కు లెద కింపుగ మంతననుందుఁ

ఉ. సంతస మంది ముందఱను సామి హసాదని పెద్దయెల్గునన్.
వింతగఁ బల్కుచుం బసిఁడిబెత్తములెత్తి యదల్చి మూఁక నం
తంతఁ దొలంగఁదోలి పణిహారులు సూరెలు దారి చేయఁగాఁ
జెంతలఁ జేరి యొండొరులఁ జీరుచు దండులు వెంబడింపఁగన్.

గీ. కదలి పొలదిఁడ్ల యార్పు లాకసము ముట్ట
లంకఁ జేరిరి ముగ్గురుఁ గలంకఁ దేఱి
యంత వారలబీరంబు నలపు బలమి
యరసి నర్మదయ నెడునచ్చర నెలంత.

"""శుద్ధాంధ్రోత్తర రామయణము

క. పువ్విలుతుని వాలారుం
గ్రొవ్విరితూపులొ యనంగఁ గొమరారెడులే
జవ్వనులం దనకూఁతుల
మువ్వురఁ గొనివచ్చి యిచ్చె ముగ్గురికి నెలమిన్.

వ. అందు మాల్యవంతుడు సుందరి యనుతన వెలందియందు వజ్ర
ముష్టియు విరూపాక్షుండును దుర్ముఖుండునుసుప్తఘ్నండును యజ్ఞ
కోపుండును నున్మత్తుండును మత్తకుండును ననునేడుగురుకొడుకులను
నిల యనుకూఁతునుం గనియె సుమాలికిఁ గేతుమతి యనుప్రోయాలి
యందుఁ బ్రహస్తుడును నకంపనుండును వికటుందును శకటముఖం
డును ధూమ్రాక్షుండును దండుండును సుపార్శ్వుండును సంహ్ర
దియుఁ బ్రఘనుండును భాసకర్ణుండునునను పదగురుకొదుకులును
బకయుఁ బుష్పోత్కటయుఁ గైకసియుఁ గుంభినసయు నను నలువురు
కూఁతులునుం గలిగిరి మాలివసుధ యనుతన వాల్గంటి యందు నలుం
డును హరుండును సంపాతియునను నలుగురు కొమాళ్ళం గాంచె
వారె విభీషణునకుం బ్రెగ్గడలై వెగ్గలంపు టగ్గలికం జెన్ను మీఱిరి.

గీ. ఇల్లు తామరతంపరై యేపుఁ జెంది
జగములం దెందు నెవ్వారి సరకు గొనక
విఱ్ఱవీఁగుచుఁ గొడుకుల వెంటఁ గొనుచు
ముజ్జగంబులుఁ గలఁచి రాపొలనుదిండ్లు.

ఉ. వారలరాయిడి న్నొగిలి వాంచినవెల్ల లానిమోముఁదమ్ములం
గూరిన నెవ్వగం గదలి కోరిక లీరిక లెత్త వేల్పు లె
వ్వారలఁ జేరువార మిఁక వాసిగ నుండఁగ నెద్దితావిఁకె
వ్వారికి విన్నవింపుదుము వారలయాఱడి యంచు నెంచుచున్.

ప్రథమాశ్వాసము

క. ఆరసి కర్జముఁ గని యి
బ్బారిని నలమలవిలుగలవాఁడడఁపంగా
నేరుచు నని పొంగి వడిం
జేరి రొకట వెండికొండచెంగటి కెలమిన్.

వ. అటువలె వెండికొండఁ దఱియం జని మేలిమిగద్దెమీఁదన
చ్చొటఁ గొలువుండి వేడుకలఁ జొక్కెడు మిక్కిలికంటిదేవరం
బొటపాటఁ గన్నులం దొరఁగి ముమ్మరమైచను నీఆటిజాలుతో
నటమటమారఁ గామచి మది నళ్కుచు నెయ్యమునుం బునంగొనన్.

గీ. ఒదుఁగువాతున నిలుచుండి యొక్క పెట్టుఁ
జేతులు మొగిడ్చి జోహారుఁ జేసి నిలిచి
వేల్పు టెకిమీఁడు మున్నగా వేల్పులెల్ల
నెలుఁగు కుత్తుకఁ దగులంగ నిట్టు లనిరి.

గీ. ఏనుమోముల వేలుపాయిదె జోహారు
ఇవముగుబ్బిలియల్లుఁడ యిదె జొహారు
ఇంచువిలు కానిపగవాఁడ యిదె జొహారు
ఎక్కుడుకనుల దేవరాయిదె జొహారు.

చ. ఉడుగనికిప్కతోఁ గడలి యొక్కట నెక్కడగన్నఁ దామయై
కడఁక ను కేశుబిడ్డలు జగంబుల నేపఁగఁ దల్లడిల్లి యి
య్యెడలను ముజ్జగంబులను నేలెడు దేవర వీవటంచు నీ
యడుగులు పట్ట వచ్చితిమియారసి మామొఱలాలకింప వే.

క. కాల్చిరి జన్నపుసాలలు
కూల్చిరి దేవళము లెల్ల గోడలతోడన్
బీల్చిరి మానిసినెత్తురు
రాల్చిరి యేలికలతలలు రవణంబులతోడన్.

శుద్ధాంధ్రోత్తర రామాయణము

ఉ. ఏమని చెప్పువార మలయీర స మప్పొలదిండ్ల బారిచే
నేమును బోవఁగా వెఱతు మెప్పుడు జన్నపుఁబాళ్ళు గైకొనం
దామును గుట్టమీఱి జడదారులు మానిరిముక్కు పట్టఁగన్
బ్రెముడి బొట్టియల్ విడిచిపెట్టిరి యొజ్జలమోము చూడఁగన్.

క. మేమే జేజేదొరలము,
మేమే జగములను నెల్ల మిన్నల మనుచున్
బాము లిడం దొరఁకొని రా,
బాములు కడతేర్చి మమ్ముబ్రతికింపఁగదే.

క. అని ంరొక్కి తన్ను వేఁడిన
వినుసిగరాయండు వారి విన్నప మెల్లన్
విని కనికర మెదఁ బొదలఁగఁ
గనుఁగొనలం బిన్ననవ్వు గదురఁగఁ బలికెన్.

క. మీముందఱ నిజ మాడెద
మోమోటలు కటిపెటి మొఱకుల వారిన్
నేమడుఁపనోప వెన్నుని
సేమంబునఁ గానఁబొండుఁ జేకుఱుఁ గోర్కుల్.

క. వెన్నుఁడు దక్కఁగ నొండకఁ
డెన్నఁడు గెడపంగఁజాలఁ డీరక్కసులం
దిన్నఁగ మీ రిపు డాతం
డున్నెడ కరుగుండు నెమ్మి యుల్లము గదురన్.

క. ఆకై వడి మలవిలుతు2ండు
మూఁకగఁ దను వేఁడు వేలుపులతో ననఁగా
నేకడఁ గొలిచెవారలఁ
జేకొని కాపాడ మీకె చెల్లు నటంచున్.

ప్రథమాశ్వాసము

క. ముక్కంటి న్వీడ్కొని వా
రొక్కట నెలికొండ వెడలి యొండొరుఁ గనుచున్
మిక్కిలి పొంగి చెలంగెడి
యక్కడిపాల్కడలిఁ గాంచి యం దొకదీవిన్.

క. కడలికిఁ దొడవనఁగాఁ గడు
బెడఁగగునొకవీడు చూచి పెంపుగ దానిన్
దడ వబ్బురపడి చూచుచు
నెడనెడఁ గలవింత లెల్ల్ల నేర్పడఁ దమలోన్.
 
గీ. చెప్పి మెచ్చుచు నొక్కింతసేపు మసలి
యొక్క చక్కని జక్కని చెక్కడంపుఁ
బనులఁ జెలువొందు పొగడొదుపసిఁడి కోటఁ
గనులవిందుగఁ బొండగాంచి కనఁ దలంచి.

గీ. చొచ్చి యచ్చంపుఁ బచ్చల మెచ్చు హెచ్చు
కట్టడపుఁ ద్రోవక్రేవల బిట్ట నడచి
యవల మగరాలజిగి చాల నలమ నలరు
తళుకు లీనెడు వెన్ను ని నెలవుచేరి.

సీ. పొంగారు బంగారురంగుకంబంబులఁ
                         జలువచప్పరములు చెలువునింప
సరమించు సిరిగంచు సరిగంచుటందంపుఁ
                          జందువామిసమిసల్ చౌకళింప
వగఁగ్రాలుపగడాల మొరాల గుంపుల
                          కెంపులు క్రేవలఁ గ్రేళ్ళుదాఁట
మెఱఁగూని దొరలేని నెఱమానికపుఁబెద్ద
                          గద్దెలనిగ్గులు గండుమిగుల.

శుద్ధాంధ్రోత్తర రామాయణము

వెన్నుఁబొడగనుకడఁకను వేడు కార
నిలువఁ దీఱక యూఱ క నెట్టికొనుచు
వెంటఁ దనవరిఁ గొని పాఱువేల్పు ఱేఁడు
వేయికన్నులు చాలక పాఱఁగ చెందె.

జగిమగతాలనేలసయిఁ జెట్టులుఁ బట్టెలుఁ డీర్చి కూర్చి సొం
పుగ నమరించినట్ట్ నునుఁబు త్తడికంబపుగుంపుమీఁదిపెన్
బగడుఁదూలపుంగములపై దెలిముత్తెపుఁబలగచ్చుతో
నిగనిగలడఁ బోఁడిమిని నెత్తినఁగట్టిన మేడలోపలిన్
       
వెన్నుం డుండు విని చని
క్రన్నన జూడఁ దఱి

ప్రధమాశ్వాసము

సామి నిలుచున్నవా రని చనవుకతన
మనవిచేసిన రమ్మను మనుచుఁ బలికె.

క. అరుదెమ్మని సెల విచ్చిన
నరిగి సరగను బణిహారు లావేల్పులతో
దొరవా రిట మిముఁ దోడ్కొని
యరుదేరఁగ మమ్ముఁబుచ్చి రనుచుందెలుప౯.

గీ. వార లందఱుఁ జనుదెంచి వరుసతోడ
వెన్నునకుఁ బెక్కు తెఱఁగుల వేఱువేఱు
మొక్కు లిడి పొగడ్తలు దెసల్ మోయఁజేసి
విన్నవించిరి తమపడ్డవెతల నిట్లు.

చ. పొగరున రక్కసీండ్రు తగమూవురుఁ బ్రోవుగఁ గూడి దాడిమై
జగములు గాసిచేసెదరు చావకమానెడుమేను పూనుటన్
మిగులఁగ వ్రంతల న్నొగిలి మీకడకి ట్లరుదేరఁగల్గె మా
యెగు లడఁగించిప్రోవఁగదవే యిదె వేఁడెద మెల్లవారమున్.

సీ. నెఱమగంటిమి మాని నీళ్ళుంమోవఁగ లోఁగి
                                    వెలియైనమలవిల్తు బలిమియెంత
మాఱువేసము పూని మఱి నీరిదూఱిన
పచ్చదుప్పటి వాని బలిమియెంత
ముదిమదివోయి ప్రాజదువులు గోల్పడి
తలకొట్లబడు తాత బలిమి యెంత
గొడావలుపడి కోడికూతకూసిన యట్టి
యలవేల్పు రాయని బ్లిమి యెంత
నిదుర యన్నది యెన్నడు వదలి తిరుగు
లాతి తెరగంటి దంటలచేతిబలిమి

శుద్ధాంధ్రోత్తర రామాయణము

యెంచ నరియెంత మా కని యించుకైన
లెక్కసేయరు మాటలు పెక్కులేల .

గీ .పమిచెప్పుకొనుదుము మాసామి నీకు
వారు పఱచెడునొఱపుల వనరునొప్పు
డెంతొ దోసంబుచేయువా రిట్టివేల్పు
బ్రదుకుఁ జెందుదురనియెంతుమెదలలోన .

గీ . ఇచ్చ మానుషులను జూడ ముచ్చటగును ,
జావుగలిగినవారలచంద మరసి
యేలొకోతాను గలిగింపఁ జాలఁడయ్యెఁ
జావు మాకని నలువపై నేవవడము .

సీ .బెడిదంబుగాఁ గేల వడిదంబు పూనిన
                                మేటిరక్కసులకుఁ జేటు మూఁడు
బిగివింటి నొగివంటి తెగనిండఁ దీసింన
                               బిరుదుదందలు కేండ్లు వేయు నిండుఁ
బులుఁగుతత్తడి నెక్కి పొలికలనికి నేగ
                              నొప్పనివారలయుసుఱు లేగు
నెదలోనఁగన లూని యించుక చూచినఁ
                            గానివారలపిండు గం డడంగు

బటువుకై దువు తనరార దిటముమీఱ ,
బంటులను గాచుపని పూని వచ్చితేని
తలఁక కెవ్వాఁడు చివ్వకు నిలుచువాఁడు
జాలమేలను గై గొమ్ముసరగమమ్ము .

ప్రథమాశ్వాసము

క . అని విన్నఁదనము తోఁపఁ ,
మనవి యొనర్పంగ వారి మన్ననతోడం
గనుఁగొని వెన్నుం డిట్లని ,
కనికరమున నానతిచ్చెఁ గరఁ గినమదితోన్ .

చ .ఎఱుఁగుదు రక్కసు ల్నలువయిచ్చినమప్పుల నొప్పుమీరి పల్
తెఱఁగుల మిమ్ము నొంచుటయు ఁ దీఱనిదూఱడి కోర్వలేక యం
దఱు మలవిల్తుఁ గొల్చుటయు నంగర నాతఁడు మిమ్ముఁ బుచ్చు టే
నెఱఁగుదు వేల్పులార వనుఁ డిండ్లకు వారలరూపు మాపెదన్ .

క . అమ్ములవానలు గురియుచు,
నెమ్ములు విఱుగంగ మొ త్తియొవ రడ్డయినన్
నమ్ముఁడు జముకడ కనిచెద .
నిమ్ములనుండుండు మీర లెల్లరునింకన్ .

గీ . అట్టిరకమును గనికరముట్టిపడెను .
వెన్నుపలుకులు వీనులవిందుగొలుప
నెదలఁ బొదలెడునుదిలల వదలికదలి ,
యిమ్ములకు నేగి రిమ్ముల నెల్లవారు .

గీ . అట్లుజేజేలు తమయిండ్లకరిగినంత ,
నంతయును వేగరులుతెల్ప నాలకించి
మాల్యవంతుఁడుతమ్ములమంతనమునఁ ,
బిలువగానంపియొరులకుఁ దెలియకుండ .

గీ . తగవుదోఁపంగ నిట్లనెఁదమ్ములార ,
వినరుగా నేటిప్రొద్దొక వింతవింటి
వెరచి మొన్న నీనడుమను వేల్పులేమొ ,
గట్టువిల్కానియొద్దకు నట్టెయేగి .

శుద్ధాంధ్రోత్తర రామాయణము

క . కని వేనవేల తెఱఁగులఁ,
గనికం మెదఁబుట్ట నోటికసితీఱంగా
మనయాగడంబు లెల్లను,
మనవి యొనర్చుట నటుపయి మముమీబంట్లన్ .

<poem> క .నిలువంగనీయ రెందును,
బలియురురక్కసులు వారిబారికి మమ్ముం
దొలఁగించి యేలకుండినఁ,
గలరేయందైన మాకు గాదిలిచుట్టల్ .

చ . అనిమొఱవెట్టఁ జొచ్చిరట యాపయి నౌదలయూచి యాతఁడున్
గనికర ముప్పతిల్ల గడకంటనుగంగొని వారిఁగూల్పఁగా
వినుఁడిదె యున్నరూపు వినిపించెద నోపనునేనువెన్నునిం
గనుఁడతఁడయ్యేనేని మిముఁగావఁగ జాలినవాఁడు పోడిమిన్ .

గీ . అనుచునానతియిడెనఁట యాపలుకులు ,
చెవినివేసుకొని పసిండిచేలవానిఁ
గావఁగాబోయి ఁమొక్కులువేనవేలు ,
సలిపివిన్న వించిరఁటపై చందమునునే .

మత్తకోకిల . అంతటం గరివేల్పు వారలయందుఁ బ్రేముడిమీఱఁగా
నెఁతకై ననునేను గల్గఁగ నేల నొవ్వఁగ మీకికన్
ద్రుంతు రక్కసిఱేండ్ల మువ్వురదొడ్డతూవుల వ్రేల్మిడిన్
వంతలేటికిఁ బొడుగీములవంక నందఱునెమ్మితోన్ .

క . అనివీడుకొల్ప వెల్వడి,
కనుసైగలుచేసికొంచుఁ గై దండలతో ఁ
బెనుసందడి సేయుచు వే ,
చనిరఁట యావేల్పులెదల సంతసమారన్ .

ప్రథమాశ్వాసము

ఉ .వేల్పులపాలివాఁడు కఱి వేల్పతఁ డిచ్చినబాస తప్పునే
తెల్పెదనెట్టులైన ననిదీఱుచు వారలపూనికి యెల్లఁ దొ
ల్వేల్పులమంచు నివ్వరినివక్కుచు లెక్కయొనర్ప కక్కటా
సల్పితిమట్టివాని కెకసక్కెము క్రొవ్వినఁ జేటుమూఁడదే .

క .తనబలిమి యెదిరిబలిమియుఁ
గనుఁగొనఁగాలేక త్రుళ్ళికావరమున నొ
ప్పనివేరము పూనితిమిటు ,
మనపొగరలె యింతచేసె మఱియేమిటికిన్ .