కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/శుద్ధాంధ్రభారతసంగ్రహము-ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శుద్ధాంధ్ర భారతసంగ్రహము.

   (అచ్చతెనుగు భారతము)

ప్రథమాశ్వాసము

చ.సిరులను గూర్మితో నొనగి నేగి యెకించుకయైనజేరి నీ

    కరయుచు మంచివారి ననయంబును బ్రోచు జెడ్డవాతలన్ 
    సెరగులపాలు సేయుచును సేమము మిర జగమ్ము  లేలుచుం
    దిరముగ నుండినట్టి యలదేవర గొల్చెద నెల్ల యప్పుడున్

వ.ఇట్లు జగమ్ములనెల్లం డల్లియు దండ్రియు నేలిక యునయి యెల్ల యెడల నిండియుండు నాదండివేలువు నుల్లంబున వెల్లి విరియు నింతం తనరాని సంతపంబున మంతమనంబున నెంతయుం గొనయుం వేడికొని యీమేటిదేవరకు నాపయుంగల వెలలేని కూరిమి పేరిమిని నేనొన రింపబూనిన యీక్రొర్రపొ త్తబుంనకు మెదలెట్టిదనిన.

తే.మున్ను నైములశ మనుకన నున్న యట్టి తపన లొకనాడు నూతుని తరిని జేర భరతుకొలమున గల రాచవారి కతల జెప్పమని వేడినతడట్లు చెప్ప దొడడె

సీ.సొగసుగోటలమిది మగరాలసింగముల్ చౌదంతి నిచ్చలు జంకువరుప మేటియగడ్తలు వీటిబోటులకు జిలువచెల్వలతోడి చెలిమి నొసగ బసిడిమేడలమిద నెసగుక్రాల్గంటుల చెలువ మచ్చరబోంట్ల జిన్నపుచ్చ బూవుదోటలలోని తావుల తేనియల్ చరుగాలువల వెంట జేలదడవ </poem>శుద్ధాంధ్రభారతసంగ్రహము

సీ.తానువడుగుందున మూనంగ వటనెల్ల
వారును విరుచుండం బ్రతినవట్టి
జొలరిదొరతోడ జాల నమ్మికపుట్ట
బలుదెరంగులజెప్పి పదిలపరిచి
సత్యవతినిదెచ్చి సరగువ దండ్రికి
బెండిలిగావించి పెంపుమెరసి
తనచేతిబలిమిని ననిలోనరేడుల
నందరనోడించి యదిమి వారి
వలన గప్పముల్గొని తండ్రినలర జేయ,
సత్యవతితోడికూటమిశంతనుండు
చెలగి చిత్రాందుగండు విచిత్రవీర్యు
డనగనలరారుకొ మరులగయెనంత

ఆ.వారుజవ్వనమును బడయకముందర
     శంతనుండు మేను జారవిడిచె
     దండ్రిచావ బెద్దమ్ముని భీష్శుండు
     పుడమి కొడయడుగను బూనిచేసె

మగంధి.పొంది యేరి బూరికైన బోల్పకుక్క మిర జి
త్రాంగదుండు పోరి కెల్ల దండి వారి జీర జి
త్రాంగదుండు వేల్పుదిట్ట తాకి కయ్యమిచ్మి యా
పొంగడంచి మించి త్రుంచిపోయె నేయు నేటికిన్

తే.అన్న పోయినపొమ్మట నతనితమ్ము
నవిచిత్రవీర్యుని భీష్ముడవుడటచ్చి
దొరదనంబిచ్చి వెలయించిపతున మెదవి
వెలయునతనికి బెండ్లి గావింపనెంచి.

ప్రధమాశ్శాసము

ఆ.కాశిరేడు తనతు కన్ని యలకుబెండ్లి,

    సేయనెంచి యుంటచెప్పవరికి
    ముకురుకన్ని యలను ముంగలనరదంబు
    పయిని బెట్టుకొంచుబయికిబోవ

క.ఎకిమీలెల్లను దాకుడు

   నొకడు న్మగటిమి నెదిర్చి యుక్కరివారల్
   గకవిక గాగనమ్ముల
  సెక లన్మలమలములను మాడ్చి చెదరగజేసెన్ 

వ.మరియును

ఆ.చుట్టుముట్టినట్టి దిట్టలనందర

     నిలిచిపాదోలి గలుపుగాంచి
     త్రోవలోన సాళ్వు దూలించి మరలించి
    వెలదుకలననుగొంచు భీష్ముడరిగ 

తే.అతిగి యంబ యంబాలిక యంబకమును

    ననెడుమూవురలో బెద్దదైనయంబ
   తనదు డెందంబుపాళ్వునిదవలియుంట
   దెలుపనాయింతినటకంపి తిరివువట్టి

క.తక్కిన యిరువుర దమ్మున

   కొక్కట బెండిలియెసర్ప నిప్పుగ నతడా
   చక్కెరబొమ్మల తోడనె 
   మక్కువతో నెవుడు నుండి మండిదెంగన్

సీ.సంతు లేకుండంగ జచ్చిన కొడుకును

                                   గని సత్యవతి భీష్ముగదియబిలిచి
  యిల్లాలిగైకొని యిల్లునిల్వగబెట్టి
                                  నేలయేలుమటంచు జాలువరకు శుద్ధాంధ్రభారతసంగ్రహము


బరిమాలి చెప్పిన నతడించుకయు నొప్ప
లప్పడవ్యానుని నొప్పుగులుక
నెదలోన దలచిన నేతెంచి యాతదు
తల్లికి మ్రొక్కిడిదండనిలిచి

యామెపంపున నంబిక యందుబుట్టు
గ్రుడ్డిధృతరాష్టృ రెండవకొమ్మయందు
బొల్లివానిని బాండుని బోనకతై
యందు విదురుని గలిగించె

వ.అందు.

తే.పెద్దవాడైన ధృతరాష్టృ బెంపుమెరయ
బుడమి బూంనిచ్ న పరిరేండ నడగదొక్కి
విదురుమదిబల్మి భీష్ముని వంటిబలిమి తనకు సాయంబుగా దొరతనము చేసె

తే.అంత గాంధారముననేల నమరనేలు
సుబులుడనురేనికూతునుసేగమున
నచ్చరలమించు గాంధారి యనెడుదాని
భీష్ముడాయెకిమీనికి బెండ్లిచేసె

మ.మరియు న్వేలువుటేటిపట్టి కరమున్మన్నించి పూబోండ్లబ
ల్మరుదేరన్ ధృతరాష్టృుడాడ్రుగను గేల్వ ట్టెందగన్నూ ర్వురన్
జురుకుంజందముమీర బాండుడును మిన్కుల్సాములున్నే ర్చి యం
దరళో బేరిమిగాంచి మించుటయు నంతంబెండ్లి గావింపగన్

క.తలపోసియు వను దేవుని
చెలియలి శూరుడనువాని చెలువపుగూతున్
వెలయగ బెండ్లిచేసెను
వెలదు గుంతి యనుదాని భీష్ముడు వేడ్కన్

ప్రధమాశ్వాసము

  సీ.అదిమున దనతండ్రి యానతి దుర్వాసు
                                   డనుతపసికి నోరె మమరబెట్టి
   మెప్పించి యతనిచే నెప్పుడు తలదిన
                                  నప్పుడవేలువు లరుగుదెంచి
   బిడ్డలనచ్చెడు పెనుమెప్పుగైకొని
                                  యెకనాడు సంద్రంపు టోడ్డునందు
   దమ్ములివిందును దలచియాతనివల్ల
                                    బుట్టుజోడును జెవిసోగిలున్న

   కొడుకుగని వాని బెట్టెతో గడలినిడియె
   గొట్టుకొనిపోయి యాబొట్టె గట్టుజేర
   గాపొకడు వాని గొనిపోయి కర్ణుడంచు
  రహిని బేరుంచి తనచావ రాధకిచ్చె

తే.మాద్రియనుదానినావెన్కమరియుబాండు
     డాలుగాగొనియిద్దరవలరజేసి
     దెసల నెల్లను దనవాడి యెన గగెల్చి
    యన్న చేనెన్నొ చేయించెజన్నములను

సీ.అటులుండి యొక్కనాడాండ్రామదనతోడ
                                    గొనివేటమిమీరగొంతదవ్వు
   కానిలోపలనేగి కానగ మెకముల
                                    గూడిపొందెడునట్టి లేడి నిర్రి
   నొలకోల నేల పై నొరగింప మగజింక
                                  జడదారిరూపును సరగ దాల్చి
   యీవు నీయాలితో నెప్పుడుకల సెదో
                                 యప్పుడ మావలె నయ్యెదంచు

దిట్టి చచ్చిన దిగులొంది దిటముపూని,
యింటివంకకు మరలక యెఱుక మెఱసి
తవసితనమూని కొన్నాళ్ళు తాళియుడి,
సంతు లేమికినెంతయు వంతనొంది.

ఆ. కుంతి జేరబిలిచి గొబ్బునదనకోర్కి,

తేటపఱిచి వేడ బోటియెట్ట
కేల కొప్పుకొనియు గెలనీ యుధిష్టిరు,
డనిడి కొడుకుబడసె నజ్జమునికి.

శా. ఆచోటన్ ధృతరాష్టుృతొయ్యలియు నొయ్యంవేకటీందాల్చి ము

న్నే చూలాలయి కుంతిపట్టిగని తానెంతో మదిం బొంగుటల్
చూచాయంవిని యోర్వలేక వగతో జొక్కొంది లోగుంది ఱొ
మ్మాచెన్నారు నెలంత గ్రుద్దుకొని బాడై చూలొగిన్ జూఱగన్.

వ. అట్లాకొమ్మ ఱొమ్ము కరమ్ము వమ్మగునట్లుగా గోరమ్ముగా గ్రుమ్ముకొన్న నెత్తుచెడి క్రొత్తనెత్తురులం జొత్తిల్లి తుత్తునియలయిపడ్డ కందమొత్తమ్ములనెత్తి క్రొత్తకడవలలోనం బెట్టించి వ్యాసుండు నూఱువురగొడుకులనునొర్క కొతును బుట్టించె నందు బెద్ద వాడు దుర్వోధనుండును రెండవవాడు దుశ్శాసనుండును వారి చెల్లెలుదుస్సలయు ననంబరగి పెరుగుచుండిరంతనిచ్చట.

క. ఆట దుర్వోఅధను డొదవిన

దిటమగునానాడె గాలిదేవరవలనన్
దటుకున భీమునిగనియెను
నిటగుంతియు మగడు పనుపనెంతయునెలమిన్.
క. అపిమ్మట వేలుపుదొర
నాపోవక మగడు వేడ నానతియీగా
ప్రధమాశ్వాసము
నావగిది నర్జునుండను
పాపనిగని మించెగొంతి బలియని మిగులన్.

క. పెనిమిటి సెలవొసగంగా

దననవతియు నేర్పిననుప దమద్రియునుం
గనె వేలుపు వెజ్జుల కొ
య్యననకులుండు సహదేవుడనియెడి కవలన్.

ఆ. ఇట్లు నెతలందు నేవురు కుడుకుల

బడసి సంతసమున బ్రబలియుండి
యేకతంబ మాద్రియెక్కుడు సోయగం
బొక్కనాడు చూచి యోర్వరాక.

క. వెలుపణ దాయల నెందఱ

గెలిచియు దనలోని దాయ గెలువగలేకా
బలియుడు పాండుడు మడిసెను
వలపున నిల్లాలితోడ పడి గలయుటచేన్.

తే. అంతమాద్రియు మగనితో నగ్గిసొచ్చె

గొంతిపాఱులు వెంటరాగొండివిడిచి
సొడుకులను వెంటగొని బావకడకువచ్చె
నెల్లవారికి దముజూచి యుల్లమవియ.

ఉ. కుంతియు బిడ్డలం గొనుచు గూరిమి పెన్మిటి బాసివచ్చుచో

వింతగ జూడవచ్చి రలవీటను గల్గినవారలెల్లదా
మెంతయు వంతతో బనివి యేడ్చుచు నాధృతరాష్టుడాలునుం
గుంతిని వెంటబెట్టుకొని కుఱ్ఱలదోడ్కొని పోయి రింటికిన్.

ప. అంత ధృతరాష్ట్రుండు.

క. తనబిడ్డలను గుఱి తనత

మ్మునిబిడ్దలు నంచు వే`రుపూనిక మదిలో
శుద్ధాంధ్ర భారతసంగ్రహము
నను బూనక కొడుకులక
న్నను బ్రేముడి మీఱబెంచి నలి నేవురనున్.

సీ. దుర్వోధనుండును దోడివారును దమ్ముఁ

గుఱ్ఱలు బాండుని కొడుకు గమియు
నల్లారుముద్దుగా నాటపాటల బ్రొద్దు
పుచ్చెడు తఱిగాడ్పు ముద్దుపట్టి
బలిమి నందఱమించి వలుదెఱంగుల నొంచి
పలువుర నొక్కట బట్టికొట్టు
జెట్లనెక్కినవారి జెట్లూచి వడవైచు
నిలిచి పోల్చినవారినీటముంచు
నిట్లునడుముడి కడగండ్ల నెవుడుగుడువ
నీరసంబెత్తి తాళగా నేరకపుడు
తనదు మామను శకునిని దగవునడిగి
తొడరిదుర్వోధనుడు చేసెదుండగములు.

సీ. నిడు తీవయల గట్టి నిదురించు తఱినేటఁ

బడద్రోయ మేల్కని వెడలివచ్చె
విసముతోడనుజేర్చి వెసగూడు వెట్టింప
నారగింపదడవ యరిగిపోయెఁ
బండుకొన్నప్పుడు పాముల గఱపింప ఁ
గీడొకింతయు లేక కెడపెవాని
దుర్వోధనుడు సేయు దొసగులు మఱియును
వడముడి జెందకవంమ్ములయ్యె
నంత మనుమల జదివింప నద నటంచు
నెఱిగి భీష్ముడు కృపునొద్ద నెల్లచదువు
ప్రధమాశ్వాసము
లమరజెప్పిచె మొదలనాకొమరులకును
బిదపద్రోణుడునాజనుచదువులయ్య.

తే. నేలవేలపు కృవుబావ చాలవతి,

తనకొమారు నశ్వత్ధామగొనుచువచ్చి
వీడునేరిన నా నేలవేల్పు నొద్ద,
వెనుక విలువద్దె గఱపించి మనుమలకును.

సీ. కవ్వడి తనకోర్కి గడువడి దీఱ్చెడ

నని బాసయిచ్చిన నలరి ద్రోణు
డతని కెక్కువ చెప్పియామీదనొకనాడు
రాకొమారుల నేర్పురమణ గనగ
మిన్నేటికొమరుండు మున్నగు వారికి
విన్నవించిన వారు వేడ్కతోడఁ
గొలువుండి చూడంగ వెలయించి రెల్లరుఁ
దమతమ నేర్పు చందమ్మునెల్ల
నందు దుర్యోధనుడు భీముడడరితాఁకి
గుదెలబోరవానికి ద్రోణుకొమరుడుడిసె
నర్జునుండును విన్నాణ మమరఁ జూపి
మారు లేకుండ నొక్కడు మలయుచుండె.

క. అక్కడ కప్పుడు కర్ణు,

డుక్కున జనుదెంచె క్రీడి నొక్కట దాకన్
బెక్కు దెఱంగుల బోరిరి,
యొక్కొకరికి వట్రపడక యోరిమి పేర్మిన్.

క. పోరెడియప్పుడు కర్ణుని,

బీరంబున కెదను మెచ్చి నే యంగము నాఁ
శుద్ధాంధ్ర భారత సంగ్రహము
బేరైన నేల నతనికిఁ,
దోరం బగుకూర్మి నిచ్చి దుర్యోధనుడున్.

వ. అతనితోడి చెలిమి కలిమి లోనం దన పినతండ్రి కొడుకుల నాతండు గెలువగలం డను గట్టి నమ్మకమ్మున నాతనిం దనయొద్దఁ బెట్టుకొని సంతసించుచుండెనంత.

క. తనవలన జదువుగఱచిన,

యనినేసెడు రాచవారి నందఱ ద్రోణుం
డును జేర బిలిచి ద్రుపదునిఁ,
దనకడకును బట్టి తెండు తడయక యనుడున్.

సీ. అందఱు నరదంబు లాయితంబుగ జేసి

వెలువడి ద్రుపదుని వీడు చేరి
కోటలు పడద్రొబ్చి క్రొత్తడంబులుగ్రొచ్చి
యూరెల్ల దల్లడమొంద జేయ
ద్రుపదుడు విని వచ్చి దుర్యోధనుడు లోను
గాగల మగలను గదసి తాకి
వాలంప గుంపుల వానలు గురియించి
చిందఱ వందఱ జేసి దండు

క. తన నేర్పు మెఱయ దూపులఁ

గనలున బరగించి ద్రుపదుగరువంబడ గన్
జని పట్టి కట్టి తెచ్చును,
గనువారలు డెందములను గళవళ పడగన్.

      ప్రధమాశ్వాసము

 ఆ.అట్లువట్టి తేచ్చి యాతని నొజ్జల,
          కాళ్ళమిఁధ వేయఁ గనికరమున
           నుల్లసంబు లాడి యొడయనిఁ బొమ్మని,
            క్రిడి ద్రొణుఁడు గొనియాడి మెచ్చె.

 చ. ద్రుపదుఁడు దొంటికంటునను ద్రోణుఁడు తన్నటు చిన్నిపుచ్చఁగా
        దపసితనంబు పూని కడుదాలిమి వేల్పులఁగొల్చి ద్రోణున
        చ్చవుబవరంబునం గెడపఁ జూలు కోమారుని దిట్టయెన వే
        లుపుదొరపటియాలయి వెలుంగుకొమారితఁ గాంచెఁ జిచ్చునన్.

క. కని యిట్టు దృష్టద్యుమ్నుం
        డనుచు ఁ గొమారునికిఁ గృష్ణయని కూఁతునకుం
        దనరఁగఁ బేళ్ల్లిడి ప్రోలికిఁ
        జని ద్రుపదుఁడు వింతసంతసంబున నుండె౯.

వ. అంతనిచ్చట.

 తే.విద్దెచేతను గొనముచేఁ బెద్దయైన
      జముని కొమరుని రాచణికమునఁదనకు
      సాయముగఁ జేసికొనితానుసంతసంబు
      నొందుచుండేనుధృతరాష్ట్రఁడుద్ది లేక .

ఉ.అప్పుడు తమ్ములెల్లకడలందును బోరుల గెల్పుఁ గాంచుచుం
      జెప్పెడి దేమి పేరుగల చిక్కనిరేఁడుల నోర్చి వారిచేఁ
      గప్పము లెంతయుంబలిమిఁ గైకొని యన్నకుఁ దెచ్చియిచ్చుచున్
      గొప్పతనంబు వాసియిను గూర్పఁగ నోరువలేక యీసున.

సీ.మంతనంబున మేనమామను శకునిని
                            దుస్సనేనునిఁగరుఁదోడితెచ్చి
    దుర్యొధనుఁడు వానితోడను దలపోసి
                      యాకరపులఁబట్టి యయ్యకడకుఁ

   శుద్దాంద్రబారతసంగ్రహము

జని కన్నులనునీరు జూరఁగ దురపిల్లి
                   యెట్టకేలకు రేనియెరుక చెరీచి
పొండునికొడుకుల వారణావత మనునూర
                      నుంచెడునట్టు లొప్పుకొనఁగఁ

జేసి వచ్చినవారలఁ జేరఁబిలిచి,
తల్లితొఁగూడి యేవురుఁ దరలునట్లు
 నేర్చుతోఁజెప్పి ధృతరాష్ట్రుఁ డేర్పడంగఁ,
బుచ్చెమేలెంచకప్పుడాప్రొలికరుగ.

సీ.దుర్యొధనుం డంతఁ దొదరి పురోచనుఁ
                            డనువాని రావించి యతనితోడ
మంతనంబునఁ గొంత మాటాడి మునుచని
                లక్కయి ల్లొక్కటి చక్కఁగాను
వారణావతమున వడిఁగట్టి గొంతియుఁ
                   గొడుకులు నందుండి కూర్కి యుండు
 తరినిప్పుముట్టించి తడయకరమ్మని
                         చెప్పి పుచ్చినవాడుం జెలఁగి యరిగి
లక్కయిల్లుకటి చక్కఁగఁ గై నేసి
 యునుపం గుంతబిడ్డ లుండిరందు
నంత విధురుఁ డిచట నంతయుఁ బరికించి
కీ.లెరింగి సరగఁ గీడుతొలఁగ.

ఉ.ఉప్పరవాని నొక్కరుని నొంటి యుధిష్టిరు సాలికంప నా
చొప్పెరిఁగించి వాడు కడుసూటిగ నేలసొరంగ మెండు నే
ర్పొప్పంగం ద్రవ్విచూపువుటయు నొ యునభిముండు తల్లినన్న నుం
ధప్పక తమ్ముల నెలికిఁదార్చి సొరంగముదారి దవ్వుగ

     ప్రధమాశ్వాసము

క.పనిచి పురొచనుడును జెం,
     తను గొడుకు లయిదుగు రెరుకతయు నిదిరింపం
     గనిలక్కయింటి కగ్గిని,
      గనలునఁ దగిలించిపొయెఁ గడునడు రేయిన్.

క.ఆరాతిరి యాయిల్లుటు,
      గోరముగాఁ గాలిపొవఁ గూరిని వగతో
      నూరన గలవారెల్లను,
      జేరువఁ జనుదెంచి కాంచి చిడి చిడిముడిపడుచున్.

క.గొంతియుఁ గొడుకులుఁదెగిరని,
     యెంతయు వగఁబొది యేగిరిండ్లు కునచ్చో
     నంతయు దృతరాష్టుఁ విని ,
     యింతం తనరాని కస్తి నెదలోఁ బొందెన్.

ఆ.గాడ్పుపట్టి యచటఁ గన్నతల్లిని దోడఁ,
       బుట్టువులన మీఁదఁ బెట్టుకొంచు
       ముండులనక పెద్ద గండులనక యేగెఁ,
       గారుకానలందుఁ గరము దవ్వు.

ఆ.రేయి వారు వడెడి రాయిడిఁ బాపంగ,
      నెంచియడు వెలుఁగుఁబంచెదయ్య
     మనఁగఁ బ్రొద్దుపొడిచె నావల నార్వురు,
    నెండ యెక్క దాఁక నేగి యేగి.

క.కడుబడలి యెండతాఁకున,
     వడగొట్టిన బిట్టుసొలి వారలుపడఁగా
      వదముడి నీళులకొరకుం
      గడుదువ్వుగఁ బోయి మరలి కదిసెడులోనన్.

        శుద్ధాంధ్రబారతసంగ్రహము

తే.ప్రొదువాలినఁ గెంజాయ పొదలిపిదపం
     గారుచీఁకట్లు మింటను గ్రమ్ముకొనియె
     రేవెలందుక దాల్చిన కావికోక
    విడిచి నల్లని చీరను దొడిగె ననఁగ.

క.ఆచీఁకటిలో నిళుల
    మోచుకొనుచు వచ్చి చెట్టూ మొదటనుగూర్కం
    జూచియు వారల లేపక
    కాచుకొని యంతడు నిలిచెఁ గడుఁ గడిమియెయి.

సీ.అప్పు డక్కానలొ నెప్పుడనుండు హి
డింబుఁడన్ రక్కసుఁ డిమ్మునుండి
వారలఁ గని పొంగి వడివడిఁ జెలియలిఁ
బనిచె హిడింబను వారిఁ బట్టి
వంటకుఁ దేనాపె వడముడిఁ దిలకించి
వలపున మోమోటపడుచు నిలువ
నేజామునకుఁ జెల్లెలేతేరమికి నల్లి
పయనమై మఱి తానె వచ్చినిగుడ
     భీముఁ డాతని దవ్వుగాఁబిఱిఁది కీడ్చి,
     దొమ్మికయ్యమ్ములోవానిఁగ్రుమ్మిచంపి
     యన్నపనుపఁగఁ దల్లియు నవుననంగఁ,
     బెండ్లియాడి హిడింబను బేర్మితోడ.
తే. దానితో ఁగూడి కొన్నాళ్ళు కానలందుఁ
       బగలు నలరాచపనులను మిగులఁ బెనఁగఁ
        బుట్టెఁదగ ఘటోత్కచుఁ డనుపట్టియొకఁడు
        వాఁడితనమును జిత్తులు బలిమిగలిగి.

ప్రధమాశ్వాసము

చ. తలఁచినయప్పుడెల్ల మిముదాకొన వచ్చెదనంచుఁ జెప్పి యా
      బలియుఁడు తల్లి ఁడోడుకొని వారల వీడ్కొని యేనివ్వ్హమై
     వెలువడి యేక చక్రమును పేరిట యూరికిఁ బోయి రన్నయన్
     నలువురుతమ్ములు న్వెరపునం దమతల్లిని గొంచుఁగాల్నడన్.

వ. అట్లుపోయి.

తే. నేలవేల్పుల వేసంబు లోలిఁదాల్చి,
     యొక్క బాఁపనియింటనునుండియూరఁ
      దిరిప మొత్తచుఁ బ్రామిన్కు లరసికఱచు,
      చుండిరేవురు సై దోడులొజ్జలొద్ద.

సీ. ఆకుప్పమున బకుఁడనురక్కసుఁడొకండు
                                  కాఁపురఁబుండి యక్కడనునున్న
      వారి నేప్రొద్దు నిల్వరుసను నొక్కని
                                 బండెఁడు కూటినిఁబసుల రెంటిఁ
     దడవుల నుండి సాపడుచుండు నట్లుండ
                                 నొకనాఁడు పొలదిండికోరెముగను
     బోవలసిన వంతు పొందుగా వారున్న
                                పుడమి వేలుపుపాలఁబడిన నతఁడు

     మిన్నువిఱిగి పడిన చెన్నున నేమియుఁ
     దోఁపకాలుఁదానుఁదోడివారుఁ
     గూడి యొక్క పెట్టె గొంతెత్తి యేడ్వంగఁ
     జొచ్చె గొప్పముప్పు వచ్చెననుచు.

క. అయేడుపు విని గొంతయు
     డాయంగాఁ బోయి యడిగి డగ్గు త్తికతో
     నాయి<టి పాఱుఁ డెఱుఁగం
     జేయుడు పడి భీముఁజీరి చెప్పిన నతఁడున్

శుద్ధాంధ్రభారతసంగ్రహము

<poem> క. బడ లుప్పొంగఁగ రక్కసుఁ

    గడ  తేర్చెద  నంచుఁ   బలుఁక గా  నాపాఱుల్
   కుడువంగఁ  బెట్టిరోరెము
   వడముడికిన్మంచి  పిండివంటలతోడన్.

చ. అటువలె నారగించి కఱవాఱఁగ సత్త్త్తూవపట్టి లేచి మి

     క్కుటముగఁ  దొంటి వంటక  మెకూర్చినబండిని  నెక్కిరక్కనుం
   డటుకున ఁ  జేరి   మాఱుకొని  తన్నియుఁగ్రుమ్మియునెట్ట  కేలకుం
  బెట పెట   నెమ్ముకల్విఱిచి  పీఁచమడంచెను నొక్క  వేల్మిడి౯.

సీ. అమ్మాడ్కి బకుఁ జంపి యందఱ నలరించి

                                     నెమ్మది నుండంగ  నెమ్మి  మిఱ
      బసచేసి   యున్నట్టి  పాఱునియింటికి
                                      జన్నిగ  ట్టొక్కఁడు  సరగవచ్చి
       ద్రుపదుండు  తనకూఁతు  ద్రోవదిఁ   గొనఁగోరు      
                                    రాచకొమాళ్ళెల్ల  రావలెనని
        చాటింప  నాలించి  జగములోఁ  గలరాచ
                                     వారెల్ల  నచటికీ  వరుసగాను   
          బోవుచున్నారు  నేనును  బోదునటకు,
           నీవి  మిక్కిలి బౌఁవల  కిత్తురంచు
           విన్ని  వాఁడను  గావున  వేడ్క తోడ,
           ననుచుఁ  జెప్పిన  నలరారి  యవుడకదలి.

చ. బసదిగియున్న పాఱుతను బౌఱుని వీడ్కొని గొంతి బిడ్డలున్ వెస్సఁ జని యొక్కట౯ ద్రువదువీతటికిఁ బోయెడుదారి వ్యాసుతోఁ బొసఁగఁగఁ మాటలాడి వడిఁ బోవుచు వేలువుటేటి చెంతనా నిసితఱిఁ గ్రీడి చేకొఱవి నెయ్యమునం గొనిత్రోవ చూవఁగన్.</ poem>

ప్రధమాశ్వాసము

ఆ. ఏగుచున్న యప్పు డింతితో నంగార,
పర్ణుఁ డ నెడు వేల్పుపాటకాఁడు
తిరుగులాడు చుండి దిటముగ నర్జునుఁ,
దాఁకీ తూపు లొడలు దవులనేసె.

క. ఏసినఁ గవ్వడి వడివడి,
       నీసు మీయిం జిచ్చఱమ్ము నే డ్తెఱ వై వ౯
       గాసిలి యరదముఁ గోల్పడి,
       యోసరి యంగారపర్ణుఁ డుడిగిన కడిమి౯

తే. కదలివచ్చి యుధిష్ఠిరుకాళ్ళ వ్రాలి
        ధౌమ్యుఁ డనునొజ్జ నొడఁగూర్చి తగవునెఱపి
        చిచ్చిఱమ్మును గ వ్వడిచేతఁ బడసి
        యింతిఁ దోడ్కొని తనయిచ్చ నేగెనంత.

సీ. పాండుని కొమరులు నిండు వేడుకతోడ
ద్రువదువీటనుజేరి యుపము మెయిన్న .
గుమ్మరవానింట నిమ్ముగా దిగియుండి
యెకిమీండ్లు గుమిగొన మీనునీడ
క్రింది నీళులఁజూచి ముందఱ మో పెట్టి
యున్న వింటిని జేత నొనరఁ దాల్చి
నింగి మచ్చెంబు నేయంగ నేర్పు మెఱసి
యె త్త లేరై రి యొక కొంద ఱై త్తియేయఁ
జాలకుండిరి కొందఱు చాలువఱకు
నేసికొట్ట నోపక విడి రాస లెదల.

శుద్ధాంద్రబారతసంగ్రహము

క. అఫ్పుడు కవ్వ దె

ప్రధమాశ్వాసము

సీ. పెండిలి నడచిన వెనుకకు గొన్న

శుద్ధాంధ్రభారతసంగ్రహము

సీ. ఏగిన నౌనని యేవురు నొక్కొక్క
యేఁటన గూడుట కియ్యకొనుచు
నొకరితోనుండ వేఱొకరు చూచిన నేల
నొకయేఁడు వలగొన నొక
చేకొనియుండంగ కొనివేల్పొక్కఁడు వడిగ
తనుయావు నొకదొంగ కొనిపోవుచున్నాఁడు
విడిపింప రమ్మని విన్నవింప
విల్లునమ్ములుఁ

ప్రధమాశ్వాసము

సీ. అచ్చోటఁ గొన్నాళ్ళు విచ్చలవిడినుండి
మామను నీడ్కొని నేగుమునను
ద్వారకకు బోయి దగ్గఱ రైవత
కంబనుకొండను గదిసి యచట
నండంగఁ గృష్ణుఁడు నిండువేడుకతోడ
నచ్చటి కరిగి వివ్వచ్చుతోడ
మాటాడి యేగి యామఱనాఁడు తనవీటి
వారిని బండగు వేరుపెట్టి

తోడుకొనివచ్చి యటమున్నె దొంగకావి,
తాల్పు వేసంబు నచ్చోటఁదాల్చియున్న
క్రీడి కందఱ ర్మొక్కించి వేడుకలర
నతని నంటికిఁ గొనిపోయి యవల నునిచి.

క. తనచెలియ లగు సుభద్రను
బనిచెను సన్నాసియెుద్దఁ బనినేయఁగా
నెనరున నర్జునుమది యా,
ననఁబోఁడిం దగులు టెఱిఁగి నగరున నొకచోన్.

తే. కోరికలుజాఱిపొలఁతుల కూర్మితీఱి,
జగములోబోడలగు టెందుసాజమరయఁ
గోరికలుమీఱిపోలఁతులకూర్మిఁగోరి,
యక్కజంబుగఁదాబోడయయ్యెఁగ్రీడి.

సీ. ఉవిదపై దవిలిన యుల్లంబుతోఁగ్రీడి
కనువిందుగాఁ బనుల్ గొనుచునుండ
మంతనంబునఁగృష్ణుఁడంతయు ఁదలిదండ్రు
లకుజెప్పియెుప్పించియెుకటఁబెండ్లి

శుద్ధాంధ్రభారతసంగ్రహాము

<poem>పనులెల్లసాగించి పండువు వేర్వెట్టి బలరాము నొకదీవి పజ్జలంపి పెండిగావించి వెలఁదిని మఱఁదిని నడురేయితన తేరువడిగనిచ్చి. యంపవారును దేరెక్కి యరుగుచుండ, నూరి కావలివారెల్ల నొకటఁదాఁకి యార్చి పేర్చినఁగవ్వడి యెర్చి వారిఁ, దెరలఁగా ఁజేసెనుసుభద్రతేరుగడప.

చ. అటువలెఁ గ్రీడి మాఱుకొని యాపఱిఁరూపరఁజేసి చేడియం దటుకున వెంటఁబెట్టుకొని దారిని సాగి యనంబు పర్వఁగా దిటిమున నూరుచేరి తన దిట్టతనంబును నెల్లవారు మి క్కుటముగఁ జెప్పుకోఁగఁ బెనుకూరిమి ఁ దొయ్యలి తోడ నుండఁగన్.

క. కొడుకభిమన్యుండనఁగను, బొడమె సుభద్రకును దండ్రిఁ బోలెడురూపుఁ గడిమియు బ్రోడతనంబును, వడియును బీరంబుగలిగి బలువిలుకాడై.

వ. మఱియు నప్పాండుని కొమ్మళ్ళకేవురకు స్వరుసగా ఁ గొడుకులేవురు. క. ప్రతివింద్యుఁడుశ్రుతసోముఁడు, శ్రుతకీర్తియు ననఁగ మెుదలసొరిదినియందున్ జతక శతానీకుండును, శ్రుతసేనుఁడు బుట్టిరపుడు ద్రోనదియందున్

సీ. కవ్వడియెుకనాఁడు దవ్వలయడవికి వెన్నునితోగూఁడి వేఁటకరిగి నేలవేలుపురూపుఁ దాలిచియచ్చోట వెసమెలంగెడి వేఁడివేల్పు ఁజూచి

<poem>
ప్రధమాశ్వాసము

 
మున్నొకయెకీమిఁడు జన్నంబుగావించి
మిగుల నెతిని వెల్వఁ దెగులువొడమి
తన్నుఁగాఱించుట విన్నవించినవిని
తగుమందు ఖాండవమగుట తెలిసి
యగ్గివేల్పురాయనితోఁట వడిగఁజొచ్చి
కాల్పనాతనిఁ బురికొల్పఁగడఁగిచిచ్చు
తోటఁలోఁ జొచ్చి మంటలు తోరముగను.

క. కాలువఁ దొడరినఁ గనలున
     వేలువుదొర యడ్డుసొచ్చి వెనమబ్బులచేఁ
     జాలఁగ వానలు గురిసినఁ
     దూలక యవ్వానిఁ గ్రీడి దొలఁగఁగఁజేసెన్.

క. దానికిఁగాజేజేదొర
     పూనికొని దురంబొనర్ప ములుకులు పెక్కుల్
     మేనన్నాటించి కలఁచి
     జానుచెడంజేసి క్రీడిసరగం బఱపెన్.

చ. మయుఁడనువాని నయ్యెడను మంటలుబిట్టుగఁజుట్టుముట్టునన్
      మెయివడఁకంగ వచ్చినగమీఱఁగఁ గ్రీడి మఱుంగుసొచ్చినన్
      గుయివినిజాలిపుట్టి యెదఁగూరిమి మీఱఁగఁ గాచెనాతనిన్
      మయుఁడును దానికుల్లమును మల్లడినొందెడు సంతసంబునన్.

క. సెలవుంగిని చనియెను న
     వ్వలఁదగ నావేడివేల్పు వడిఁదనియంగా
     నలరుందోఁటను గాలిచి
     యెలమిని దెవుల్లెల ఁబాసి యిచ్చంజనియెన్.
వ. అంత నొక్కనాఁడు
       

శుద్ధాంధ్రభారతసంగ్రహము

క. పాండుని పెద్దకొమారుని
యండును గఱివేల్పుతోడ నచ్చోటను గూ
ర్చుండినకవ్వడి కిట్లనె
దండముగావించి మయుఁడు తద్దయు నెమ్మిన్.

క. నెనరున నునుఱులు నిలిపిన
కనికరవుంగనికి నొకటి కైకొనిచేయం
గనునేర్తునె యైనను నే
నొనరఁగ నాచేతనై నదొక్కటి నీకున్.

తే. చేయనిచ్చగించినవాఁడఁజెలఁగినన్నుఁ
బనుపుఁడెద్దియైనను నొక్కవనియెునర్ప
నేను రేద్రిమ్మరులలోన నెక్కడైన
నేర్పగలవాఁడనిండ్లపొందికగఁగట్ట.

వ. అనవుడు నంతడు.

క. అపురూపమైనయేలగ
మిపు డొనరింపంగవలయు నీవని వేడ్కం
గవురంపువీడియం బిడి
యపుడంపిన సంతసించి యాతేఁడు వేగన్.

చ. బలుపగడంపు ఁ గంబములు బంగరుదూలములములందమైన చ
ల్వల దొరఱాయరంగులును బచ్చల యచ్చపుఁ దోరనంబులున్
వలుద సుపాణీ సుత్తియపు వెన్నెల సోరణగండ్లు మంచి కెం
వుల నెలకట్టులుం గలిగి పొల్పగునట్టుగఁజేసెఁ గొల్వొగిన్.

క. మఱియుం గేళాకూళులుఁ
దఱుచగు క్రొవ్విరులఁ బండ్లఁదగు పూఁదోఁటల్
వఱచగు డిగ్గియలుం బలు
దెఱఁగులుగల యాటపట్లు తేటగనొప్పన్.

ప్రధమాశ్వాసము

ఆ. అట్లు కొలువుగట్టి యాజముపట్టికి
నొనఁగనేల వేల్పు లొక్క మెుడిని
దీవెనలనొసంగ దేవేరితోఁగూడి
కొలువుసొచ్చి జమునికొమరుఁడుండ.
ఉ. హత్తులఁగ త్తలానులను నందపురోవిరిఁబోడ్ల జారువా
మెుత్తముదెచ్చియిచ్చి సతమున్మదిమెచ్చుచు ఁ గొల్చుచుండుదుర్
క్రొత్తగ నాల్గుసంద్రములకున్ నడుమంగల రాచదాలుపున్.
వ. అట్లుండ నొక్కనాఁడు.
శా. ఏలా వేఁడివెలుంగు నేలకును నిట్లేతెంచుచున్నాఁడు నేఁ
డోలేఁబాయపు బిడ్డలారకనుఁడం చిక్కక్క చో మానుషుసుల్
గేలుందోయి తమల్చిగుంపులయి యేలింజూడరా నింగియుం
గ్రాలన్నారదు ఁడేగుదెంచె ఁ గడునేడ్కం గవ్వడింజూడఁగన్.
తే. వచ్చి రాచపొడినిగూర్చి పలుకులాడి,
చనఁగ సమకట్టియున్నచో జమునిపట్టి
కొలువునకు ఁ దోడుకొనిపోయి కూర్మిఁ జూవ!
నారివేరంపు ఁ దపసియుననియె నిట్లు:
క. వినుమిట్టిది మున్నెన్నఁడుఁ
; గనుగొనలెదెందు నిజగమ్మున నెపుడున్
వినియు నెఱుఁగ మానుసులం
; దును నుది యపూరూపమనుచుఁ దోఁచెడునాకున్.
అ. అనుచుఁజాల దానియందంబు గినియాడి,
పుడమిఱేండ్ల నెల్లఁ బోరగెల్చి
కూర్చుసోమ్ముననే యొనర్చెడు జన్నంబు,
వడిగనీవు చేయవలయునంచు.

శుద్ధాంభారతసంగ్రహము

క.పాండుఁడు నీతోఁజెప్పఁగ,
     నొడుమది న్నన్నుఁ బుచ్చె నీకడకనుచు౯
     దండిగఁజెప్పి యొడఁబఱిచి,
     యొండుకడకుఁబోయెఁ దపసియొయ్యననింగిన్.

క. అంతయుధిష్ఠిరుఁడప్పుడె,
     మంతనమున, గృఝ్ణతోడ మాటాడివెసం
     జెంతకు నర్జును భీముని,
     నంతసమునఁ బిల్చి యిపుడచని వెన్నునితోన్.

క. ఆలమున జరాసంధునిఁ,
     గూలిచి రండనుచుఁ బనుపగొబ్బునఁ జని యా
     ప్రోలికి వానిన్మార్కొనిఁ,
     యోలింబరిమార్చె భీముఁడొక్కఁడుఁ గడిమిన్.

తే. అట్లుకన జరాసంధునమరఁద్రుంచి,
     యతనికొడుకైన సహ దేవునందు
     నమ్ముఁబూనిచి ముగ్గురు నమ్మివచ్చి,
     గొంతితొలిపట్టికి జెప్పిరంతవట్టు.

క. నలువురుతమ్ములు వడిఁజనీ,
     నలుగడలుంగెల్చి మేలనగలును గుఱ్ఱం
     బులు నేనుంగులు రొక్కము,
     వలువలునుందెచ్చి యొసఁగ వలనుగఱేఁడున్.

ఉ. జన్న మొనర్చి వెన్నునకుఁ జక్కఁగఁ దమ్ముల మిమయ్యఁ బోవఁగాఁ
     గన్నుల నిప్పులొల్కఁ గని కాఱులు ప్రేలుచు నెల్లవారలుం
     బన్నమునొందఁ గృఝ్ణ శిసుపాలుఁడు తిట్టిననల్గియప్పుడే
     వెన్నుఁడు చుట్టుకైదువున వ్రేల్మిడి ద్రుంచెనుఁ వానికుత్తుకన్.
          

<centerప్రధమాశ్వాసము

క. అంతయుఁ గని దుర్యోధనుఁ,
     డెంతయు మది వనటనొంది యీనునవారిన్
     వంతలఁదగిలిచి సిరిఁగొన,
     మంతనమున మామతోడ మఱిమఱిచెప్పె౯.

క. అతఁడునునల్లునిఁ గొనిచని,
     ధృతరాఝ్ణృన కెఱుకపఱిచితిన్నఁ గదొరయా
     నతిఁగొని జూదంబునకు౯,
     గొతుకకపిలిపించె నటకు గొంతికొమాళ్ళ౯.

తే. పిలుచుకకొనివచ్చినట్టియావిదురువలన,
     నంతయునెఱింగియునుభీమునన్నకడఁగి
     శకునితో నాడిపుడమినిసరకుగములఁ,
     దమ్ములనుదన్నువరుసగాఁదవిలియొడ్డి.

తే.ఓడిపిమ్మట ద్రోవదినొడ్డియోటి,
     వడెయుధిష్ఠిరుఁ డప్పుడు వగపుతోడఁ
     బ్రాతిగామిని ధృతరాఝ్టృపట్టిపంచి,
     కొలువునకుఁగృష్ణ రప్పించెఁగూళగాన.

సీ. అవుడు దుశ్శాసనుఁడాయితిఁ గొల్వులో
                                  దలవట్టియీడిచి తులునయగుచు
     నన్నపంపునఁ గట్టుకొన్నబట్టయు విప్పఁ
                                  గని భీముఁడెంతయుఁగనలువొడమి
     చివ్వనాతనిపొట్టఁ జీలిచినెత్తురు
                                  త్రావెదనంచును బ్రతినవట్టి
     తొడమీఁదఁ గూర్చుండఁ దొయ్యలిఁ జసన్నఁ
                                   బిలిచిన గాంధారిపెద్దకొడుకుఁ

శుద్దాంధ్రభారతసంగ్రహము

     బెనఁకువను రోఁకటను దొడల్ విఱుగఁగొట్టి
     యెడమకాలను దలఁదన్ని యెలమిఁ గాంతు
     ననుచుఁ బెనబాసచేసిన నంతయు విని
     ద్రోవదినిబిల్చి ధృతరాఝ్టృఁడీవి నెఱపి.

క. దొరతనమెల్లము మరలం,
     గరమక్కటికముననిచ్చి కలుపుకొని యుధి
     ష్ఠిరు నంచినఁ దనవీటికి,
    నరగెందమ్ములను నాలి నాతఁడు గొన్నుచు౯.

క. అదిగని దుర్యోధనుఁడవు,
     డెదలోనంగుది మామ నేకతమునకుం
     గదియించి కొన్నినాళ్ళకు,
     నదనారసిచెప్పి తండ్రి యానతిగొనుచు౯.

ఆ. ప్రాతిగామినంచి పాండుకొమాళ్ళను,
     నటకు మరలవచ్చునట్లుచేసి
     కఱ్ఱిపెద్దయన్నఁ గడుపడిఁ బురికొల్పి,
     నెత్తమాడునట్లు మెత్తపఱిచి.

సీ. జూదాన నోడినచో దొరతనమెల్ల
                               విడిచి పండ్రెండేఁడు లడవినుండి
     యామీఁద నొక్కయేఁడమరంగ నెవరికిఁ
                                గానరాకుండంగఁ గడపవలయు
     నీలోన నెవ్వరి కేనియుఁ గనిపింప
                                మరల నెప్పటియట్ల జరపవలయు
     ననిచెప్పించి యాడినశకుని యు
                                ధిష్ఠిరునోడించె దిట్టయగుచు

ప్రధమాశ్వాసము

     నంతనాతఁడు తమ్ముల నతివఁగొనుచు,
     నూరివారందఱునుజేరి యొకటఁగుండఁ
     జిన్నవోయిన మోముల నన్నెదఱిఁగి,
     కట్టబట్టిలతోడనే కానకేగె.

క. కొడుకులగమియు సుభద్రయు
     వెడలిరి ద్వారకకు నిచట వీరలతివతో
     నడవులఁ గాయలుఁ గసురులుఁ
     గుడుచుచుఁ గ్రుమ్మురుచునుండఁ గొంకకయొకదో౯.

ఆ. తెరువు నడ్డగించి తెగువనుబోనీక,
     బకుని తమ్ముఁడైన బల్లిదుండు
     కినుక మీఱవచ్చి కిమ్మీరుఁడనువాఁడు,
     నిక్క వానిభీముఁడుక్కడంచె.

వ. అంత నా పాండునికొమాళ్ళు.

సీ. కడుఁ దపనులు చెప్పుకతలనాలించుచుఁ
                                   గామ్యకంబనియెడి కాననుండఁ
     గృఝ్ణఁడేతెంచి యేగినవెస్క వ్యాసుని
                                   పంపునఁగవ్వడి పట్టుతోడ
     నొంద్రకీలంబన నెసఁగెడి మలనుండి
                                   యెఱుకురూపునఁ బందినేసినట్టి
     ముక్కంటితోఁ బోరి మిక్కిలి మెప్పించి
                                   పాశువతంబనఁ బరఁగునమ్ము

     గట్టివిల్తునిచేఁ బొంది క్రాలుచుండ
     వేల్పుదొరవచ్చి వివ్వచ్చు వెంటఁ గొనుచుఁ
     దనదు వీటికిఁ జనియందుఁ దనివిదీఱఁ
     గొడుకుతోఁ గొన్నియేఁడులు కూడియుండి.

శుద్ధాంధ్రభారతసంగ్రహము

క.పౌలోమకాల కేయులఁ
     బోలనివాతకవచులను బొలదిండ్లననిన్
     వాలమ్ములఁ జంపించెను,
     వేలకొలఁది దుండగీల వివ్వచ్చునిచేన్.

వ. ఆలోన నొక్కనాఁడు.

తే. ఊర్వసి యనంగ నచ్చరయోర్తుక్రీడి,
     చక్కఁదనమును గనొనిచాలవలచి
     కూడ వేఁడుడు వతఁడొప్పుకొనక కసరఁ,
     బేడిగానుండఁ దిట్టెనాక్రీడినాపె.

వ. అంతనిచ్చట.

ఉత్యాహ. కడమ పాండుకొమరు లచటుఁ గదలి దైతమనెడికా
                   ఱడవిఁజేరి కొన్నినాళు లందునుండి సిమ్మట౯
                   వెడలిగంధమాదనంబు పేరఁ బరఁగుకొండకు౯
                   నడచియందు నెమ్మినుండి నాతి కృష్ణపంవునన్.

వ. భీముండచని.

క. జక్కులరక్కసులందల,
     లొక్కుమ్ముడి డొల్ల్ల నేసియుగ్మలి మదికి
     న్మక్కువ గలిగిన పూవుల,
     నక్కఱతోఁ దెచ్చియిచ్చె నక్కజమొదవన్.

తరువోజ. పాఱునివేసంబు బాగుగాఁదాల్చి పాండునికొమరులపజ్జనునుండి
వీఱిఁడితనమున వెలయుజటుఁడను పేరిటిపొలదిండి భీముండువేడ్క
మీఱఁగ వేఁటతమినిఁబోయియుండ మెల్లనవందఱ మీఁదవిడుకొని
పాఱినవడముడి పఱతెంచివానిఁ బరిమార్చియందఱి బన్నమువాపె.

సీ. అంతటదివినుండి యర్జునుండరుదెంచి
యన్నకునంతయు విన్నవించి

ప్రధమాశ్వాసము

నుకముగానుండంగ నొకనాఁడు ద్రోవది
పూలుగావలెనంచుఁ జాలవేఁడ
మరల భీముఁడుపోయి మణిమంతుఁ గడ తేర్చి
యలరులఁ గొనివచ్చియతివకిచ్చె
నామీఁద నొక్కనాఁడడవిని దిరిగిచు
వడముడి యొక్కచోఁబాముగాఁగ
దారిఁబడియున్న నహుషునినోరఁజిక్కి,
వెడలలేకున్నఁబాండునిపెద్దకొడుకు
పాముకడకేగి యడిగినవానికెల్ల,
బదులుచెప్పుడునది బీమువదలిపెట్టె.

సీ. అట్లుండఁ జూపోపకచట దుర్యోధనుఁ
డేకతంబునఁ గర్ణుఁడెచ్చరింప
మామ యౌనని పలుమాఱును బలుకంగఁ
బనులఁ గాపాడు నెపంబువెట్టి
మొనలడంబముతోడఁ జనుదెంచి పాండుని
కొడుకులుదిగియున్న నెళవునకును
బజ్జగుడారంబు పన్నించి వారిని
వెక్కిరింపఁగ విఱవీఁగుచుండఁ
జిత్రనేనుఁడనెడి జేజేలదిట్టఁడు,
వచ్చితాఁకి కర్ణుఁబాఱఁద్రోలి
దొరనుబట్టి త్రాళ్ళతోఁగట్టికొనిపోవఁ,
జెదరి వెఱచిపఱచి సిగ్గుదోఁప.

వ. అతనిమూఁకలు.

ఉ. సోలియుధిష్ఠిరు న్మఱువుసొచ్చినఁ దమ్ములఁ బంపవారునుం
జాలముసేయకేగి నిముసంబునఁ గూడఁగ ముట్టి తూపుల

శుద్ధాంధ్రభారతసంగ్రహము

గూలఁగనేయ మూఁకలనుగోయని యాఱిచినిల్వలేక యా
వేలుపుఁబ్రోడ నింగికిని వేచనఁ జూచుచుఁ గ్రీడిప్రొడయై.

క. అమ్ములగూఁ డొనరించుయు,
నెమ్ములపడఁ జిత్రనేను నేసిన వెఱచే
నిమ్ముల దుర్యోధనువై,
ళమ్మునఁ గవ్వడికినిచ్చి లలిఁబనివినియెన్.

ఆ. కట్లతోడనవుడు గాంధారిపట్టిని,
గాడ్పుపట్టి యన్నకడకుఁ దేఁగఁ
గనికరమునమేని కట్లెల్లవిప్పించి,
వడిగహితవుచెప్పి విడిచిపుచ్చె.

ఆ. ధౌమ్యునియింట నునిచి తగనన్నదమ్ములు,
పండ్లుదేరనడవి పట్లకరుగఁ
గ్రొత్తపెండ్లిచేసికొనుచు నాదారిని
సైంధవుండు చనుచు సరగమోల.

చ. నిలుకడఁగన్న క్రొమ్మెఱుఁగు నీటున మేనునుదాల్చి యిచ్చమై
మెలఁగెడు గుజ్జుమావివలె మేలిమిచేఁతలుపూని మెత్తనై
చెలఁగు పసిండి బొమ్మవలెఁ జేరువగ్రుమ్మరుచున్న ద్రోవదిం
గలయఁగఁజూచి పూవిలితు కమ్మనిముల్కులనొచ్చి క్రచ్చఱన్.

క. కదియంజని మిక్కిలి ద్రో,
వది బతిమాలియును దెన్నువడయక బలిమిం
దుద కాయింతిని దేరను
బదిలముగాఁ బెట్టుకొంచుఁ బఱచెంగానన్.

తే. ధ్యౌమ్యుఁడఱచుచు వెంటను దవిలివానిఁ
దిట్టుచును బోవనంతలోదిట్టయగుచు

ప్రధమాశ్వాసము

     భీము@ండరుదెంచి సైంధవు వేగముట్టి
     గడియలోఁబట్టి తలపట్టి గాడ్పుపట్టి.

క. అన్నకడకీడ్చి తెచ్చినఁ,
     జెన్నఱితల రేవులుగను జెడగొఱుగంగా
     విన్ననయి యున్న సైంధవుఁ
     గ్రన్నన విడిపించిపుచిపుచ్చెఁగాంచి యతండున్.

తే. అవల నొకనాఁడు తమ్ములుఁగవలునేగి
     విసపునీటినివదన్నవినక త్రావి
     పడిననల్వురగుదెదారిపలుకులకును
     నొప్పమార్వల్కిబ్రతికించి మెప్పులొందె.

వ. అట్లెండలం బడలియు వానలం దడిసియు వెడిదంబులగు నిడుమలు
తొడరియు జడియక యడవిలోనుండఁ బండ్రెండేండ్లు నండిన నాదండి
మగలు తమతోడఁ గూడనున్నవారి నందఱ నాయాయెడలకుంబంచి
మించిన వేడుక నించుకయుఁ దమజాడలెవ్వరు నెఱుంగకుండ దండి
తనంబునఁ గాఱడవులంబడి నడచి కడకొక్కయెడ నేకతంబు
నందగిన వేసంబులు వేసికొని బయకలుదేఱి విరటునూరుచేరి
యాచేరువం దమకత్తుల మొత్తమ్ములను బీనుంగుతో లొకటిఁజుట్టఁబెట్టియప్పట్టుననున్న జమ్మిచెట్టుపయింబెట్టి.

సీ. కంకుఁడు నాఁగను గతలు సెప్పంగ యు
ధిష్ఠిరుఁడాఱేని దెననునిలిచె
వలలుండనంగను వంటలవాఁడయి
వడముడియుచ్చోటఁ బనికినమరె
నచట బృహన్నలయనుపేరఁ గవ్వడి
నెలఁతల కాటలు నేర్వఁజేరె

<poem>
                                                     శుద్దాంధ్రభారతసంగ్రహము 
నందెదామగ్రంధి యనఁగను నకులుండు

గుఱ్ఱాల బరికింప గొలువుకుదిరె

నాలగాన దంత్రీపాలుడ నెడుపేర
నక్కడనె సహదేవుడు నమరియుండె
మాలిని యనంగ ద్రోవదిపూలుముడువ
నొడయని వెలందుక సుధేష్న యొద్దనుండె.

అ.జెట్టిపట్టి సింగంబుతో నైనఁ

బులులతోడనైనఁబోరిగెలిచి
దొరకు నతనియనుఁగుఁ దొయ్యలులకు వేడ్క
సలువుచుండు నొకఁడు వలలుఁడెపిడు.

సీ.అట్లు కొన్నాళ్లేగ నప్పసుధేష్ణను

          గన సింహబలుఁడట కొనరవచ్చి
మాలినిఁదిలికించి మదినామె సొగసెంచి
        మాటికెదఁదలంచి మరులుమించి
యక్కకునెఱిఁగించి యిక్కకుఁజనుదెంచి
         పాంపున మేనుంచి వనరుచుండ
మాలిచేఁదమ్మునునికికిఁగల్లును
         రాణిగారంపిన రమణఁగొనుచుఁ

గృష్ణయేగిననాతఁడు కెరలిపడుచుఁ

దన్నుఁ బట్టంగ వచ్చినఁ దలిరుఁబోఁడి
కొలువుకూటంబు దెసఁబాఱఁగూడవచ్చి
సింహబలుఁ డింతికొప్పను జేతఁబట్టి.

క.ఈడిచి యొకరక్కసుచే

నీడిగిలం ద్రోయఁబడుచు నింటికిఁ జనియెం
<poem>

ప్రధమాశ్వసము

జేడీయచె నంతయ రెయి
వాడిమగడు భిమడేఱగిపాయకినుకన్.

మ.మాత్తికొకల .అడుకావునువాల్చ ద్రొవదియట్లు చికటీగన్నియల్
గూడియటలు నెర్చ గిమిన గొరి యార యచుండగా
నాడు సంహబలుండు వచ్చ తనంతగేని జుప మా
టాడ కుక్కన వానినిం దునుమాడిచానెను ముద్దగాన్.

సి.అల్లుముద్దగజ్యెసి యట వ్త చియిన
దమ్ములు నూవ్వ్రుం దరలివచ్చి
చచ్చెనయైకైచాలన్నెడిచి
పినుంగుపై గృష్ణ్ బెట్టికట్ట
కొనిపొవుచుండగ గాయిడెమాలిని
బానసంబున గాడుపట్టి వినగ
వారును గాటిక్ వచ్చెడునంతకు
వడముడి యటకీగి బడలిడగ
నందఱనుదుంచిద్రోపదినల్లుబంచి
మాఱతొవరవంటిల్లు మరలజొచ్చ
విటీకెతెంచుమాలినవెలయజుచి
ప్రొలివారెల్ల వెఱచిరి బుతమనుచు.

ఉ.అంతయనాలకించి యట నాదృతరాషినిపట్టి యిచ్చలుం
గొంతికొమాళ్ళ్ళ నిల్తరనిరకొంతతలచి నుశాతర్మనంచి యా
వంతయ లాగునెయ కట నావులబట్టగబంచి తానునుక్
మంతురులాలమందెదిరి మార్కొనగల్లినవారితొ నడిన్.

క.మఱనాడు వెడాలివిటుని,
పఱగడ ముదపులను బట్టివడచక్కీగ్ర

శుద్దాంద్రభారతసంగ్రహము

<poem>

చ్చఱ బఱతెంచెనుగొల్లలు
వెఱ పెల్లునఁబఱచివిరటువిడు సొరంగన్

క.అంతకుంమున్న సుశర్రు(డు

పంతము లాడడుచునువచ్చి వకలకడఁబనులన్
వింతగ బట్టిన విరటుడు
చెంతలనున్నట్టి తినదు చెరువవతొడ్

క.చనితాకి యాడిపపొఈన

నెనరేది సుశర్మయపుడు నెఱమగఁటీమిమా
తనిఁదనత్ేరికిఁగట్టిన
వనత నివడిపిచెరేఈ వడముడీ యతనిన్
సీ.విరతుండు నెయ్యరువిటనులెనప్పు
డిచట దురొయ్యధనుఁడేగుధెంచి

పనుల బట్టేనటంచు బసులవారలుచెప్పు

విని పిన్నగావువా విరటుకొమరుఁ
డు త్తరుండీంటను నువిదలముందఱ
బిరముల్ వల్కుచు వెడలికృష
వంవునఁభెడీ వార్వముల దొలగొనుచు
పడీవచ్చె ముంగల బగఱజ్జచి
వెఱచి దిగులొందియరదంబు వెనుకవంక
త్రప్పుమన్ననుగవ్వడీత్తిప్పకున్న
బెగ్గలంబు నఁదెంని డీగ్గనుఱకి
పాఱజొచ్చగ్రడీయ బఱౌగువాఱ
తే .అతని గొనివచ్చ యరదంబు నందు బెట్టీ

తాను గ్రడీయాటేఱగించి తాల్మిగొలిసి

<poem> ప్రథమాశ్వాసము

<poem>యతని నరదంబు నడపంగ నానతిచ్చి

యమ్ములను విండ్లు పెట్టిన జమ్మికడకు

క.చని వలసినవామిగై,

కొని తక్కటివాని నందె గుట్టుగనిడి చ
య్యనఁజని గాండీవంబున;
గొనయము నెక్కించి మించి గోరముగాఁగన్.

క.ములుకులు వఱపిన మూఁకలు,

నలుదెపలం బాయవిచ్చి నాననుబఱవన్
బలుమానును లొగిఁ దాఁకిరి,
చిలుకుల వానలు గురియుఁ జేవయెలర్చ౯.

క.తఱిఁదాలుకుండఁగవ్వడి,

యెఱిఁగించుకొనియెను దన్ను నిచ్చట ననికొం
దఱు పలికినఁ దఱికడచుట,
యెఱిగించెను భీఘ్మఁడప్పు డెల్లరువినఁగన్.

వ.అంత నర్జునుండు.

తే.పసుల మరలించి కావలిపరినిద్రుంచి,

వెనుకఁ జనుచున్న ఱేనిని వెంబడించి
కదిసి యోడించి పెఱవారిఁ గండడంచి,
పొలికలన నెత్రుటేఱులువెలువరించి.

సీ.తమ్మునితలద్రుంచి తత్తడులనునొంచి

          బలియునిఁగర్ణునిఁ బరవఁజేసె

ద్రోణుని నొప్పిచి ద్రోణుకొమారునిఁ

          జేయాడకుండంగఁ జిక్కువఱిచెఁ

గృవుని నమ్ములనుంచి కినుకమైభీమ్మని

          యరదంబుపై సోలి యొఱగఁజేసె                          

శుద్ధాంధ్రభారతసంగ్రహము

<poem>దొరను గేరడమాడి దురమున దడములఁ బీనుఁగు పెంటలుగానొనర్చె మఱియునందఱ సోలించి మఱిచిపోక, తెచ్చెను త్తరబొమ్మపొత్తికలకొఱకుఁ బేరుగలవారి తలచీర లారఁగోసి, తనివిదీఱంగ ననిచెసి వెనుకమరలె.

గీ.అంతఁదెలిసి యుస్సురనుచు దుర్యోధనుఁ,

డపుడెభీఘ్మపలుకులాలకించి
సిగ్గుఁబాటుతొడఁజేరునతోఁగూడి,
యింటికడకు నడచె నిఱుకగలిగి.

క.అప్పుడు కవ్వడి జమ్మిని,

నెప్పటివలె విల్లునమ్ము లిడి యుత్తరునిన్
మెప్పగఁ దేరను నిడి తా,
నొప్పగ నొగలెక్కి చనియె నూరికి నెలమి౯.

క.ఈలోన నట యుష్టిరిఁ,

డాలములో గెలుపుగొన్న యల నిరటునితోఁ
బోలఁగ జూదం బాడుచు,
నాలములోఁబేడిగెలిచె నని వ్రేటుపడెన్.

క.అమ్మఱునాఁ డందఱు నొక,

యిమ్మునఁ దగఁగూడి తొంటి యేపుననుండెన్
నెమ్మిని విరటున కుత్తురుఁ,
డిమ్ముల నెఱిఁగించె వారి నెల్లను వరుస౯.

క.ఎఱిఁగింప యుధిష్టిరునకు,

నెఱఁగి విరాటుండు లేచి యెల్లరఁదప్పల్

ప్రధమాశ్వాసము

<poem>మఱవంగ వేడుకొనియె, దెఱఁగుపడం బలికి కూర్మి తెల్లము గాఁగ౯

తే. చుట్టములనెల్ల రావించి జోటిమిన్న, నుత్తరయనెడి తనకూఁతునొసగి పెండ్లి చేసె నభిమన్యునకు వేడ్క చెన్ను మిఱ, నెంతయును జూచువారలు సంతసిల్ల.

వ. అనిన విని తరువాతి కత నెఱిగింపు మనుటయు

క. కలువల విందును బ్రొద్దును, మలల ంసద్రముల నేళ్ళ మఱి యీపుడమిన్ వెలుగును జీకటి జుక్కల, నెలమినిఁ గలిగించి ప్రోచి యేలెడి సామీ.

మాలిని. జగముల యెకిమీడా సాదులం ప్రోచురేడా పగ యెఱుగని వాఁడా పల్వలం ద్రుంచు ప్రొడా వగ లొదవని వాడా వంతసంద్రపుటోడా నెగు లడ చెడివాడా నేలకు ంసంగడీఁడా.

గద్య. ఇది శ్రీమదావస్తంబసూత్ర లోహితపగోత్ర శుద్దాంద్రనిరోష్ట్య నిర్వచననై షధ కావ్య రచనా చాతురీధురంధర సద్యశోబందుర కందుకూరివంశ పయఃపారావారరాకాకై రపమిత్ర సుబ్రహ్మణ్యా మాత్య పుత్రసకలను జన విదేయ వీరేశలింగ నామదేయ ప్రనీతం బైన యచ్చ తెనుగు భారతమునందు బ్రధమాశ్వాసము. <poem>