కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రాజశేఖరచరిత్రము-పదునేనవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పదునేనవ ప్రకరణము

రాజశేఖరుఁడుగారు స్వగ్రామమునకుఁ బోపుట ---- సుబ్రహ్మణ్మము వివహము ---- సిత వివాహము ---- రాజశేఖరుఁడుగారు తానుబడిన కష్టములవలన కృ త్యమును నేర్చుకొని సుఖముగా జీవనము చేయు చుండుట.

మఱునాఁడు రాజుగారి యుత్తరువుప్రకారము రాజశేఖరుఁడు గారు సభకు వచ్చినప్పుడు, కృష్ణజగపతిమహారాజుగారు తన సభికు లలో నొకరిని బిలిచి రూపాయలసంచులను రెంటిని తెప్పించి ముందుబెట్టి 'మీరీధనమును బట్టుకొని రాజశేఖరుఁడుగారితో ధవళేశ్వ రమునకుఁ బోయి గృహమును మాన్యములను విడిపించియిచ్చిరం' డని యాజ్ఞాపించి, అవిగాక మఱి నాలుగువందలరూపాయలను రాజ శేఖరుఁడుగారికిచ్చి 'విరిసొమ్ముతోనే సీతయొక్కయు సుబ్రహ్మణ్మము యొక్కయు వివాహమూలనుజేసి వచ్చుబడికి మించినవ్యయ మెన్నఁడునుజేయక సుఖజీవనము చేయుచుండుఁ' దని హితబోధచేసి వారికి సెలవిచ్చి పంపిరి. రాజుగారివద్ద సెలవువుంచ్చుకొని రాజశేఖరుఁడుగారు భీమవరమునకు వెళ్ళుప్పటికి, జగ్గంపేటనుండివచ్చి యింటికడ నెవ్వరోబంధువులు కాచియున్నారని సమాచారము తెలుసెను. ఆమాటవినివేగిరపడి యిల్లుచేరఁగా వీధియరుగుమీఁద నొక ముసలిబ్రాహ్మణుఁడుకూరుచుండి యుండెను. రాజశేఖరఁడుగారాయనున జూచి మూరెవరని ప్రశ్నవేయఁగా, తమ యింటిపేరు భావరాజుగా రనియు తనపేరు సూర్యనారాయణ యనియుఁ జెప్పి 'రాజశేఖరుఁడుగారు మీరేకారా' యని ప్రశ్నవేసెను.

                                             రాజశేఖర చరిత్రము

రాజ ---- అవును, మూ రేపనిమీఁద వచ్చినారు ; సూర్య ---- మీయింటి కినడుమ సుబ్బరాయఁడను చిన్నవాఁడు వచ్చినాడు. అతఁడెక్కడనున్నాడు ?

రాజ ---- ఆపేరుగలచిన్నవాఁ డెవ్వఁడును మాయింటికి రాలేదు.

సూర్య ---- మీ కొమారైను దొంగ లెత్తుకొనిపొయినప్పుడు మాగ్రామమునుండి తీసుకొని వచ్చినాఁడు. ఆతఁడు వేంకటేశ్వరుల మ్రొక్కును బట్టి తల పెంచుకొన్నాఁడు. మిక్కిలి చక్కనివాఁడు ; ఒక రాజుతోడఁగూడ బయాలుదేఱి మీయింటికివచ్చెద నని మాతోఁ జెప్పినాఁడు ; చున్నతనములో మీవద్ద విద్య నేర్చుకొన్నాఁడట !

రాజ ---- అతనితో మీకేమి పనియున్నది ?

సూర్య ---- మా యింటియొద్దఁ గొన్నిదినములున్నాఁడు; అతని రూపగుణసంపదను జూచి యతనికి నాకొమారైనిచ్చి వివాహముచేసి, నాకు పుత్రసంతానము లేదుగనుక అతని నిల్లఱిక ముంచుకోవలెనని నిశ్చయించుకొనినాడు. అని తరువాత రాజశేఖరుఁడ్దుగారు రుక్మిణి సుబ్బరాయఁడను పేరున పురుషవేషము వేసుకొని యుండుట లోనుగాఁగల వృత్తాంతము నంతను వినిపించి, వచిన్నదానిని తనకుమారుఁడైన సుబ్ర హ్మణ్య మునకుఁ జేసికొనియెదనని వాగ్ధానముచేసిరి. అంతట సూర్యనారా యణగారు పెన్నిధి దొరకిన పేదవానివలె పరమానంద భరితుఁడై, రాజశేఖరుఁడుగారి యొద్ద సెలవువచ్చునని వెంటబెట్టుకొని మఱునాఁడు మధ్యాహ్నమునకు మరల వచ్చును. అదినముననే రజశేఖరుఁడు

                        పదునేనవప్రకరణము

గారు చల్లపాటువేళ బండ్లు చేసికొని నకుటుంబముగా బయలుదేరి రెండుమూడు దునములలో సూర్యనారాయణగారితోఁ గూడ రాజ మహేంద్రవరము చేరి, అక్కడ రామమూర్తిగారి లోపల రెండు దినములుండి, వారికడ దాచిన పాత్రసామగ్రిని దీసికొని వారినిగూడ వివాహమునకై వెంటఁ బెట్టుకొని సుఖముగాఁ బోయి ధవళేశ్వరము ప్రవేశించిరి.

పెద్దాపురమునుండి వచ్చిన కృష్ణజగపతి మహరాజుగారి సభికుఁడు రాజశేఖరుఁడుగారికి మాన్యములును గృహమును విదిపించియిచ్చి, మరలఁ దన ప్రభువారియొద్దకు పోఁగోరఁగా రాజశేఖరుఁడు గారాయనను బహువిధముల బతిమాలుకొని కొమారునియొక్కయు కొమారైయొక్కయు వివహములు జరుగువరకు నిలుచునట్లోడఁబఱిచిరి. రాజశేఖరుఁడుగారు మరల గ్రామమునకు వచ్చి మాన్యములువదవించుకొని ధనికులయి యున్నావన్నవార్త విన్నతోడనే బీదతనము వచ్చినప్పుడు మొగము చాటువేసిన పూర్వస్నేహితు లందఱును పెల్లగిరి రాసాగిరి. మున్ను పిలిచినను పలుకని యాశ్రిత కోతిలోనివారందఱును దినమున కారు పర్యాయము లింటిచుట్టును దిరుగనారంభించిరి;తొల్లి చూడమనసయినను గనఁబడని భృత్యవర్గము జీతబతైములులేకయే సదా గుమ్మమువద్ద నిలువఁజెచ్చెను. రామశాస్త్రియు సిద్ధాంతియు వచ్చి ముఖస్తుతులయందుఁ గమకుఁగల పాండిత్యప్రకర్షమును మునుపటికంటె ద్విగుణముగా బ్రకటించుచు వచ్చిరిగాని, తమవిద్యా పారస్యమును గ్రహించి యక్షరలక్షలిచ్చెడి మునుపటి యౌదార్యమును రసికత్వమును రాజశేఖరుఁడుగారియం దప్పుడున్నట్లు వారికిఁకనబడలేదు.
స్ రాజశేర చరిత్రము

వారిలో సిద్ధాంతి తనమీఁద రాజశేఖరుఁడుగారికి కోపమువచ్చిన దేమో యనుకొని తదనుగ్రహమును మరలఁబడయగోరి, నారాయణ మూర్తి తనయొద్ద దాచిపెట్టిన దామోదరయ్యయొక్క నగలపెట్టె నొకకూలివానిచెత మోపించుకొనివచ్చి రాజశేఖరుఁడుగారి కొప్ప గించెను; మఱియు రాజశేఖరుఁడుగారికిఁ దెలియవలయునని బంధువులముందరను మిత్రులముందరను ఆయనను కొనియాడఁ జొచ్చెను; సుబ్రహ్మణ్యము జాతకమంత జబ్బుది లేదన్న నోటనే యిప్పుడుమరలమారకవళ తొలఁగిపోయినది. కాఁబట్టి దానియంతటి దివ్యజాతకములోకములో మఱియొకటిలేదని పొగడదొడఁగెను. అసంగతి తెలిసికొని బీదతనము పచ్చినప్పుడు పెల్లనియ్యమన్నవారే యిప్పుడేలాగునైన, దమకన్యలను సుబ్రహ్మణ్యమునకుఁ జేసికొండనియు నాలుగువందల రూపాయలు వరదక్షిణయిచ్చెదమనియు రాజశేఖరుఁడుగారి చుట్టును దిరిగి యనుసరొంప మొదలుపెట్టిరి. వారు భాగ్యవంతులును అల్లునకుకానుకలను కట్నములను లెట్టువారును, అయినను వారిపిల్లల నెవ్వరినిజేసికోక రాజశేఖరుఁడుగారు కొమారునకు సూర్యనారాయణగారికొమారై మహాలక్ష్మినిఁ జేసికొనుటకే నిశ్చయించిరి.

తరువాత నొక సుభముహూర్తమును ముందుగా రాజశ్వఖ రుఁడుగారు కుమారుని వివాహముచెసిరి ; బోగముమేళము లేకపొయినయెడల నివహము శోభగాంచదని యెందఱుచెప్పినను, వారిమాటలనాదరింపక పాతిప్రత్యమును భోధింపఁదగిన యుత్తమదినములలో లంజలతోడిపొత్తు కూడదని భోగస్త్రీలపాటలకై విశేషధనమును వయయపెట్టక, యల్పధసముతో గాయకశిఖామణులచేత కర్ణరసాయముగా హరికీర్తనలు పాడించిరి. సదస్యమునాడు సంభావనసమయ పదునేనవ ప్రకరణము

మూన నపాత్రనమున కొప్పుకొనక యోగ్యులును పండితులునగు కొందఱిని యధాశక్తిని స్తత్కరింపనెంచి, వచ్చిన బ్రాహ్మణులకంద ిఱికిని సంభావన యియ్యకపోయిన సభవారిలోఁ దలవంవుగా నుండుననిచెప్పివచ్చిన బంధువులతో వివాహదినములలోఁ దలయెత్తుకొని తిరిగియప్పులపాలై తరువాత నెల్లకాలమును దలవంచుకొని తిరుగుటకంటె నీయైదుదినములును తలవంచుకొని యావలఁ దలయెత్తుకొని తిరుగుటయే మంచిదనిచెప్పి తమయిష్టప్రకారమే జరిగించిరి; వీధులుగట్టి సత్రములువేయుట వృధావ్యయమని బంధువులును మిత్రులు నైనవారినిమాత్రమే భోజనమునకుఁ బిలిచి యాదరించిరి; ఈప్రకారముగాఁ జేయుటచేత మొదటనుద్దేశించుకొన్ని దానికంటెను వెచ్చుముతక్కువ పడినందున, మిగిలిన యాధనముపెట్టి కోడలికాభరణములు చేయించి పెట్టిరి.

కొమారుని వివాహమైన మూఁడవదినముననే సీతను మేంనల్లు డైన శంకరయ్యకిచ్చి రాజశేఖరుఁడుగారు పెండ్లిచెసిరి. ఈవివాహమును సమ స్తవిషయములయందును ముందుగా జరిగిన వివాహమునే పోలి యున్నది. ఈరెండు వివాహములయందును బూజముబంతులు మొదలగు దురాచారములును మోటుతనముగా నుండు వేడుకలును నాకబలియైన తరువాత బుక్కాయును వసంతమును చల్లుకొనుచు స్త్రిలుఁబురుఘలు నను భేదమును పాటింపక విచ్చిలవిడిగా నల్లరిచేయు చెడువాడుకయును మానపబడినవి; కుంటితనము గ్రుడ్డితనములోనుగాగల యంగవై కల్యముచేతఁ బాటువడ సనమర్ధు లయినవారును స్వదోషమువలనఁగాక దైవకృతమువలననే హినదశకు వచ్చిన దరిద్రులును సత్ప్రుర్తనముకలిగి సకలవిద్యావిశారదు లయియున్న పండితులును భగనద్భక్తులును మాత్రము ధనసత్కారమును బొందిరి. ఈరెండు వివాహ

                         29 

రాజశేఖర చరిత్రము

ములును విధ్యుక్తముగా జరిగిన పిన్నుట నొకదినమున పెద్దాపురమునుండివచ్చిన సభికుడు రాజశేఖరుఁడుగారి కడకువచ్చి తాను శీఘ్రముగావెళ్లవలాసి యున్నది గనుక సెలవిచ్చి పంపవలయునని యడిగెను.

రాజ ---- నాముద్దు చెల్లించి యీపదిదినములును మీరున్నంచు నకు మనుగుడువు లయినదాఁకకూడ నుండి నాకనస్సును సంతోషపెట్టిమఱి వెళ్లవలయును.

సభి ---- ఇఁక నన్ను మన్నించి విడిచిపెట్టవలయును. మనము బయలుదేఱి యిచ్చటికి వచ్చుటకుముందు మాయూరికి విచ్చేసియున్నయాచార్య స్వాములవారు శ్వీముఖమును బంసినప్పడు వెంటనేరూపాయలనియ్యక తిరస్కరించినవాఁడని మా మేనల్లునకేమో యాంక్షపత్రిక వ్రాసినారనియు, మూడు దినములనుండి మావాసి యిల్లెవ్వరునుత్రొక్కి చూడకున్నారనియు, మంగలవాఁడు క్షారముచేయుటకుఁ గానిచాకలవాఁడు బట్ట లుదుకుటకుఁగాని రాకున్నారనియు, ఇప్పుడు యుత్తరము వచ్చినది. స్వాములవారు వెలివేసినప్పుడు పొరుగువారు నిప్పయినను బెట్టరు; నూతిలో నీళ్ళయినను తోడుకోనియ్యరు.

రాజ ---- సన్యసు లెప్పుడును కామక్రోధాదులను వర్జించి పరమ శాంతులై యుండవలసినవారే; ఇంత యల్పదోషమున కంత కౄర శిక్షను విధింతురా?

సభి ---- సన్యాసులన్న పేరేకాని వారికున్న్ంతకోపము ప్రపంచ ములో నెవ్వరికి నుండదు. ఇదియేమి చూచినారు ? ఈస్వాములవారే క్రిందటి సంవత్యరము శ్రీకాకుళములో భిక్షకువెళ్ళిన యింటి యజమా నుని భార్యతో నేమో సరసమాఁడగా మగఁడు విని సన్యాసి నేమోన పదునేనవ ప్రకరణము

నన్న నపరాధమని యూరకుండి భిక్షానంతరము దక్షిణయియ్యక పోఁగా ఆతనిని మూఁడు మాసములు వెలివేసి యేఁబది రూపాయలు వుచ్చుకొని ప్రాయశ్చత్తము చేయించి తరువాత మతములో కలువుకొన్నాడు.నేను వేంటనే వెళ్ళి మానానిచేత సపరాధక్షమారణము కోరించినంగాని కార్యము సుఝ్టపడదు. కాబట్టి నన్నుబలవంతపెట్టక యీపూటనేపంపివేయవలయును.

రాజ ---- మీరింతగా సెలవిచ్చుచున్నప్పు మిమ్మిఁక నిర్బంధపెట్టం గూడదు.

అని రాజశేఖరుఁడుగా రాయలను క్రొత్తబట్టలు కట్టబెట్టి సమస్త విధముల గౌరవించి, కృతజ్ఞతాసూచకముగా ప్రభువువారితో మనవిచేయవలసిన సంగతులను దెలిసి యాయనను బంపివేసిరి. తరువాత వివాహము నిమిత్తము వచ్చిన బంధువు లెవరియూళ్ళకు వారుపోయిరి. ఆసభికుఁడును పెద్దాపురము చేరినతోడనే తన విషయమై రాజశేఖరుఁడుగారు చేసిన యాదరణమును ఆయనయొక్క యువకార స్మృతియును సాధువర్తనమును కృష్ణజగపతి మహారాజుగారితో మనవిచేసి, తన్నాయన ప్రభువు వారితో చెప్పవేఁడుకొనిన మాటలను విన్నవించెను.

రాజశేఖరుఁడుగారు భాగ్యవంతులై మరల గ్రామమునకు వచ్చియున్నారని విన్న కొన్నిదినములకు నారాయణమూర్తి యొక్క నాఁడువచ్చిఁ రహస్యముగా రాజశేఖరుఁడుగారితో తానను దామో దరయ్యయుఁ బ్రాణ్మిత్రులుగా నుండుటయు దామోదరయ్యయొక్క మరణానంతరమున తానాతిని చెలికాఁడను ద్వేషము చేత జనులు తనయింటఁగల సొత్తంతయు దోపించుటయు అందువలనఁ దానిప్పుడు రాజశేఖర చరిత్రము

అన్నవస్త్రములకే యిబ్బందిపడుచుండుటయుఁ జెప్పి సాహయ్యము చేయఁ వేఁడుకొనెను.

రాజ ---- కృతఘ్నుఁడును మిత్రద్రోహియునగు నీవంటివాని కుపకార మెన్నఁడును జేయరాదు. నేను నీకెంతో మేలు చేసినవాఁడనైనను నాకాపద సంభవించినప్పుడు, శక్తిగలవాఁడవై యుండియు నేను వేఁడుకొన్నను లేశమైనను సాయము చేయకపోతిని. దామోదరయ్య ప్రాణమిత్రుఁడుగా నున్నను నీయొద్ద నాఁతడు దాఁచుకొన్న పెట్టెను. మిత్రుని పుత్రునికియక యపహరింపఁ దలచితివి.

నారా ---- ఆసొమ్ము పెట్టెను తనయొద్ద దాచవలసినదనియు దానిని సులభముగా నపహరించవచ్చుననియు సిద్ధాంతియే మొదట నాకాలోచన చెప్పినాఁడు. నేను సొమ్ముపెట్టె నాతనియొద్దఁ బెట్టిన తరువాతఁ తనకందులో సగముభాగము రావలెనని పోరాడి, స్నేహితుని సొమ్ము పరులపాలగుట కిష్టములేక నేనొప్పుకొననందున మీమెప్పునకై పెట్టెను మీకుఁ దెచ్చియిచ్చినాఁడు.

రాజ ---- సిద్ధాంతియే నిన్నుఁ బ్రోత్యాహపఱిచినను సివుసహి తము దోషీనేకాని నిర్దోషివికానేరవు. స్వయంకృతాపరాధమువల ననే నికిప్పుడీదుర్దశ ప్రాప్తించినది కాఁబట్టి యెఱుఁగక చేసికొన్నదాని ఫలము నీవవశ్యముగా ననుభవింపవలెను.

అని చెప్పి రాజశేఖరుఁడుగా రాతని కేమియుపాయుము చెయక సాగనంపిరి. అదిమొదలుకొని రాజశేఖరుఁడుగారు వెనుక సిద్ధాంతి మొదలైనవారి చర్యలవలనఁ దెలివితెచ్చుకొని ముఖస్తుతుల కుబ్బి యెప్పడును ధనము పాడుచేసికొనకయు, నమీపమునకు వచ్చి మంచి

పదు నేనవ ప్రకరణము

<poem>మాటలు చెప్పువారి నందఱినిమిత్రులని నమ్మకయు మెలఁగఁ జొచ్చిరి. యోగి వెనుకచేసిన కుతంత్రమువలన నాతనికి యోగులను వారియం డెల్లను కేవల జఠరపూరకులను నబిప్రాయమును మంత్రముల యందును సువరకరణాది విధ్యలయందును దృఢమైన యవి శాసమును గలిగెను. రుక్మిణికివెనుక పట్టినదయ్యములు భూతవైధ్యము శకునములు మొదలగు వానివల నెల్లవారికిని వానియందులి నమ్మకము చెడుటంజేసి మఱియెప్పుడునువారి యింట నెవ్వరికిని గ్రహబాధా కానిప్రయోగ లకణము కాని దేవత లావహించుటగాని కలుగ లేదు. కుటుంబములోని వారి జాతకములును పెట్టిన ముహూర్తములును పలుమాఱు విరుద్ధఫలములు నిచ్చుచు వచ్చినందున, రాజశేఖరుఁడు గారికిని తత్సంతతివారికిని జ్యోతిషమందున నహిత మప నమ్మకము కలిగెను .

<poem>రుక్మిణి వివాహకాలమున చేసిన ధర్మములకెై ఋణముల వలని నషముల ననుభవించి యుండుటం జేసి రాజశేఖరుఁడుగారిఁక నెప్పుడును పరులకు ఋణపడకూడ దని నిశ్చయము చేసికొనిరి.

<poem> ఆంతటినుండియు రాజశేఖరుఁడుగారు మితవ్వయమునే చేయుచు వ్యర్ధదంభమునకై ధనము పాడుచేసి కోక, తమ కీశరుఁడు దయచేసినదానితోడనే తృప్తినొందుచు, కలకొలఁదిని బీద సాదలకు దానధర్మము చేయుచు,కలలోసహితము సత్యమును భూత దయయును తప్పక, "ధర్మోజయతీ" యను నీతివాక్యమును సదా హృదయమునందుంచుకొని సమస్తకార్యములయందును నీతిపధమును నీఁగకాంతయు దాటక ఋజువుగాఁబ్రసర్తించుచు మంచివాఁడని లోకమునఁ బ్రసిద్ధికెక్కి, పెక్కండు మనుమలను మనుమరాండ్రనెత్తి సిరియు సంపదయుఁగలిగి చిరకాలము నుభింపుచుండిరి ఆయన

రాజ శేఖర చరిత్రము

<poem>జీవితకాలములోనే సుబ్రహ్మణ్యము పీఠ పురసంస్థానములొ యుద్యోగములు చేసి కడపట మంత్రియిై రాజకార్యముల యందును సంన్మార్గ ప్రవర్తనము నందును నసఁమానుఁడని పేరుపొందెను; అల్లు ళ్ళిద్దఱును పెద్దాపురపు రాజుగారి యెాలగములలోఁ గొలువు కుదిరి క్రమక్రమమముగా గొప్పదశను బొంది విశేషఖ్యాతిని సంపాదించిరి.

<poem>రాజశేఖరుఁడుగారి కుటుంబము లోనివారే కాక యాయనబంధ వర్గములో చేరిన వారుకూడ అధర్మవృత్తి కొంతకాల మిహలోకసుఖమును గలిగించినను సద్ధర్మవృత్తియిే శాశ్వితసౌఖ్యమునకు నిదానమని రాజశేఖరుఁడుగారి వర్తనము వలన నఱిఁగి నిరంతరము ధర్మమార్గప్రవిషులెై యుండుచు వచ్చిరి. చిన్నప్పు డేప్పుడో చచ్చిపోయిన మగఁడు పట్టుకొని వేదించుచునాృఁ డన్న సిద్ధాంతికుమార్తె పెద్దదె బ్రతికియున్న మఱియిెకమఁడు మిక్కిలిమక్కువతోతననాృశ్రయించి మెహింపఁజేయగా నాతనివెంట నింట దొరకీనసొత్తు నెత్తుకొని లేచిపోయి చెడి కడపట దాసి యయి తమ కన్నుల ముందఱనే గ్రామములోఁ దిరుగు చుండుటయు, బాల్యదసలోనే భర్తలను బోగోట్టుకొన్న భాగ్యహీనురాండెెైన మద్దియలు, పడు కష్టములును, అట్టివారు దురతిక్రమణీయమైన కామబాధకు తాళఁ జాలక యింద్రియచాపల్యముల వలలోఁబడి పొడగు చుండుటయు, కొంద ప్రతిదినము కన్నులారఁజూచి మనసు కరగి యట్టి బాలవితంతువుల దుర్దశను తొలగించుట కేమైన జేయవలయునని పలు ప్రయత్నములు చేసియు మూధ శిరోమణులయిన జనుల యొక్కయు పదునేనవ ప్రకరణము

నాచారపిశాచావేష సన్యస్తవివేకులై యున్న పండితులయొక్కయు మనస్సులను మళ్లింప శక్తులుగాక విఫలప్రయత్నులై రాజశేఖరుఁడుగారు కొంతకాలమునకు లోకాఁతరగతు లయిరి రాజశేఖరుఁడుగారు కాలము చేసి యిప్పటికి రెండువందల సంవత్సరము లైనను ఆయన వలన మేలు పొందినవారి సంతతివా రిప్పటికిని ఆయనను బ్రశంసించు చుందురు. రాజశేఖరుఁడుగారి సంతతి వారుకూడ దేశమంతటను వ్యాపించి యిప్పుడు పెక్కుచోట్ల గొప్పస్థితి కలవారయి యున్నారు.


               సంపూర్ణము.