కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రాజశేఖరచరిత్రము-పండ్రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పండ్రెండవ ప్రకరణము

రామరాజుసాయమున::సుబ్బరాయఁడు::సీతవెంటఁబెట్టుకొని
వచ్చుట.రామరాజు:చెఱసాలలో::రాజశేఖరుఁడుగారినిచూచుట.రాజ
శేఖరుడుగారికారాబ౦ధనిమొచనము-శోభనాద్రిరాజునుశిక్షిం
చుట.సుబ్బరాయఁడురుక్మిణీయయితనవృత్తాంతమునుచెప్పుట.
 

పెద్దాపురమునకు అయిదారు క్రోనులదూరములో జగ్గమపేటయను గ్రామమొకటికలదు. సీతనెత్తుకొని పోయిననాఁడు మధ్యాహ్నము రెండుజాముల వేళ గ్రామ కరణముయొక్క యింటివద్ద కెవ్వరోవచ్చి తలుపు తీయుమని కేకలువేసిరి. అప్పుడు పదునాలుగు నంవత్సరముల ప్రాయము గలిగిన మిక్కిలి యందగాడై యేహేతువుచేతనో తలపెంచుకొనియున్న చిన్నవాడొకడు లోపలినుండివచ్చి తలుపుతీసి యెందుకువచ్చి నారనియడిగెను. అక్కడ నిలుచుండి యున్నయిద్దఱుమనుష్యులలో నొకడుబ్రాహ్మణకన్యకు డబ్బుపుచ్చుకొని యన్నముపెట్టెదరా? యనియడిగెను. ఆచిన్నవాడు వెలుపలికివచ్చి చూచునప్పటికి, యెనిమిదేండ్లయీడుగల యొకచిన్నది యరుగుమీద గూరుచుండి క్రింద చూచుచు వెక్కివెక్కి యేడ్చుచుండెను. ఆమనుష్యులలో నొకడుచేరువ నిలుచుండి యూరకుండుమని యదలించుచుండెను. ఆచిన్నవాడట్లు వెలుపలికివచ్చి తమమొగము వంకదేఱిపాఱచూచుచుండుట గని ఆమనుష్యులిద్దఱును మీపేరేమనియడిగిరి. అతడు సుబ్బరాయుడనిచెప్పి, యాచిన్నదాని మొగమును నిదానించి కొంచెముసేపుచూచి యిట్లనెను.

సుబ్బ---ఈచిన్నదియెవరు? మీరెక్కడనుండి తీసికొని వచ్చినారు? ఎక్కడకుతీసికొని పోయెదరు?

పండ్రెండవ ప్రకరణము
మను-మాదికాకినాడ.ఈచిన్నది మాగ్రామ కరణము కూతురు. పేరుసీతమ్మ. అప్పగారియింటిలో పెద్దాపురముననుండగా, తండ్రియింటికిఁ దీసికొని పోవుచున్నాము. అక్కడకు చ్చుటకిష్టములేక రాగములుపెట్టుచున్నది
సీత-కాదుకాదు.నన్నువీండ్రెత్తుకొనిపోవుచున్నారు.

సుబ్బ-పెద్దాపురమునుండి కాకినాడకీయారు త్రోవకాదే. ఆచిన్నది చెప్పినమాటే నిజమని తోఁచుచున్నది.

ఈప్రకారముగాప్రశ్నోత్తరములుజరుగుచుండగా,వెనుకనుండియెవ్వరోయేమఱుపాటునవచ్చిసీతయొద్దనిలుచున్నవానినిజుట్టుపట్టుకొనివంగదీసివీఁపుమీదవీసెగుద్దులనుదబదబవర్షములాగునకురిపించెను.అదిచూచిరెండవవాఁడుసీతనుతనమిత్రునివిడిచిపెట్టిపరుగెత్తుటలోఁతనకుగలసామర్థ్యమునంతనుజూపెను.ఆక్రొత్తగావచ్చిననాతఁడును"పోనికుపోనికు"మనిచేతిలోనివానినివదిలివేసిపరుగెత్తుచున్నవానివెంటఁబడెను.అదేసమయమనిరెండవవాడుగూడరెండవవైపునకుఁబరుగెత్తిపరుగులోమొదటివానికంటెదిట్టమయినవాడఁనిపేరుపొందెను.ఆమనుష్యునికొంతదూరమువఱకుఁదఱిమి,క్రొత్తమనుష్యుడుమరలాసీతయున్నచోటిసివచ్చెను.
సీత-రామరాజుగారూ! నన్నాదొంగలనుండి విడిపించినారుగదా? ఇఁక

మాఅమ్మయొద్దకు తీసికొనిపోయి యొప్పగించరా?

రామ-అమ్మాయీ! ఏడ్వబోకు. నేనుసాయంకాలములోగానిన్నుఁదీసి కొనిపోయి మీయింటికడ నొప్పగించెదను.
సుబ్బ-రాజుగారూ! ఈచిన్నదానితల్లిదండ్రులెక్కడనున్నారు? వారు చిరకాలమునన్ను కన్నబిడ్డలవలేఁ జూచినారు.
రాజశేఖరచరిత్రము

రామ-అట్లయినమీరిచిన్నదానినెఱుగుదురా?
సుబ్బ-ఎఱుగుదును. ఈచిన్నది రాజశేఖరుఁడుగారి రెండవకొమార్తె. ఈచిన్నదియు నేనును నీమెయన్నగారును నన్యోన్యమును సోదరభావముననుండెడివారము; అందులో ముఖ్యముగా నీచిన్నదాని యప్పగారునునేనునుతానేనేననట్లు భేదములేకయుండెడివారము; ఈచిన్నదినన్నుమఱచిపోయినట్లున్నది.

రామ-ఈచిన్నదానితల్లిదండ్రులిప్పుడు భీమవరములో నున్నారు. వారివలన మీరంత యుపకారమును పొందియున్నయెడల, ఈచిన్నదానిని గొనిపోయి జననీజనకుల కడఁ జేర్చివత్తము దారి తోడుగావచ్చెదరా?

సుబ్బ-అవశ్యకముగా వచ్చెదను. నేనులోపలికిఁ బోయి యీసంగతిని మావాండ్రతోఁ జప్పి వచ్చువఱకును నిమిషమిక్కడ నిలువుండి.


అనిసుబ్బారాయుడు లోపలికిఁబోయి యింటివారితో సంగతి యంతయు జెప్పి యాచిన్నదానిని భీమవరములో దిగబెట్టి సాధ్యమయినంత శీఘ్రముగానే తిరిగివచ్చెదనని చెప్పెను. వారు వలదనియ నేకవిధములఁ జెప్పినను విననందున వారందఱును వీధి గుమ్మము వరకును వచ్చినాయన! వేగిరము రావలెనుజుమీ యని మఱిమఱి చెప్పిరి. రామరాజా చిన్నివాని సౌందర్యమున కాశ్చర్యపడుచు, ఇంతటి చక్కదనము స్త్రీలయందుండిన నెంతరాణిం చునని తనలోదాను తలపోయు చుండెను. అతడు వచ్చిన తోడనే రామరాజాచిన్నదానిని బుజముమీద నెత్తుకొని సుబ్బరాయనితో మాటాడుచు భీమవరము మార్గము పట్టి నడవ నారంభించెను.


రామ--మీరుబ్రాహ్మణులయ్యును, ఆప్రకారముగా తల పెంచుకున్నారేమి?
పండ్రెండవప్రకరణము

సుబ్బ-వెంకటేశ్వరులకు మొక్కుకున్నది. ఆమొక్కును బట్టియే తొడుగుకొన్న యంగీ మొదలగు వస్త్రములను భోజనము చేయునప్పుడు సహితము తీయకుందును; బట్టలు మాసినప్పుడు సహితము రెండవ వారెఱుగకుండ మహారహస్యముగా నొకగదిలో నుతికినబట్టలను కట్టుకొనుచుందును. ఈవ్రతము నేటివఱకు దైవాను గ్రహము వలనసాగివచ్చుచున్నది.

రామ-ఈవ్రతము మిక్కిలి చిత్రముగానున్నది. ఇటువంటి వ్రతము నేనీవఱకుకనియు నెఱుఁగను .ఈవిధముగా మాటలు చెప్పుకొనుచు వారుదీపములు పెట్టిననాలుగు గడియలకు భీమవరమునకు సమీపముననున్నయొకచిన్నపల్లెను జేరిరి: అక్కడనుండి త్రోవ మంచిది కాకపోవుట చేతను, రెండు దినముల క్రిందట వాయూరిబయటనే పెద్దపులి యొకమనుష్యుని నెత్తుకొని పోయినదని వినుటచేతను, చీకటిలోవారిని నడిపించుకొని పోవుటయుక్తము గాదని రామరాజువారి నాగ్రామములో నొక కాపువాని యింటఁ పరుండబెట్టెను. ఆపల్లెలో బ్రాహ్మణులులేరు. గనుక వారాత్రిభోజనము చేయక పోయినను, రామరాజు కోమటి యింటికివెళ్ళి యటుకులనుదెచ్చి పరున్న యింటివాండ్రకు పాడియాటచేత చెంబెడు చిక్కని మజ్జిగ యడిగి పుచ్చుకొని వారికిద్దఱికిని బెట్టెను. వానితోక్షుత్తుని వారణమైనందున వారును బసవాండ్రిచ్చిన తుంగచాపమీద పడుకొనిహాయిగానిద్రపోయిరి. రామరాజు జామురాత్రియుండగానే వారిని లేపితనతోఁగూడ దీసికొని యలుదేఱి రెండుగడియలలో భీమవరముచేర్చి, యూరి బయటకు రాఁగానే తానావరకు మఱచి పోయిన గొప్పసంగతి యేదో తనకప్పడ కస్మాత్తుగాజ్ఞప్తికివచ్చినట్టు నటించి తొందరపడి తనకఁవెంటనే వెళ్ళక

రాజశేకరచరిత్రము

తీరని పనియున్నదని చెప్పి వారికి త్రోవచుపి తాను ప్రక్కదారిన పోయెరు. వారిద్దఱును దారియడిగి తెలుసుకొనుచు కొంతదూరము కలిసివచ్చిరి. సీతతానెఱిగియున్న వీధికిరాంగానే సుబ్బరాయని వెనుకదిగవిడిచి పరిగెత్తుకొని పోయి యొకసందులో నుండిమరలి తిన్నంగానింటికి బోయిచేరెను. సుబ్బరాయుండు చీకటిలో సీతపోయిన సందును కనిపెట్టలేక తిన్నగా వీధి చివరదాక నడచియిల్లుకనుగొన లేక గ్రామములో తిరుగుచుండెను. సీతవేళ్ళి వీధిగుమ్మము వద్ధ పిలువంగనే మంచముమిద పరుండి నిద్రపట్టక విచారించుచున్నమాణిక్యాంబ త్రుళ్ళిపడి లేచి పరుగేత్తుకొని వచ్చి తలుపుతీసెను. తలుపుతీసిన తోడనేసీతతల్లినికౌగిలించుకొని పెద్దపెట్టున నేడ్చెను. మాణిక్యాంబయు దుఃఖముపట్టజాలకకొంతసేపుతాను కూడ నేడిచి తనపైటచెఱంగుతో కొమారైకన్నులనీళ్ళు తుడిచి నిన్నంటినుండియు నెక్కడకు బోయితివనియు నింతచీకటిలోనొక్కతెవునెట్లురాంగలిగితి వనియు సీతనడిగెను. ఆక్రిందటి దినము ప్రొద్దుననే తన్నిద్దఱు దొంగలెత్తుకొని పోవుటయు, రామరాజును మఱియొక చిన్నవాండును తన్నువిడిపించి తీసుకొని వచ్చుటయు, రామరాజే దోపనియున్నదని యూరివెలుపలి దాంకవచ్చి వేళ్ళిపోవుటయు, సీతచెప్పెను. అప్పుడారెండవ చిన్నవాండేమయినాండని తల్లి యత్యాదరముతో నడిగెను తనతో గూడ పయివీధివఱకును వచ్చినాండనియు, అతండు పూర్వము తమ్మందఱినెరగినవాడే యనియు, కొంచెం సేపటికెల్ల నచ్చటికివచ్చు ననియు కూంతురు బదులుచెప్పెను. ఈప్రకారముగా మాణిక్యాంబ సీతను తోడమిద గూరుచుండబెట్టు కొని మాటాడు చుండగానే మార్యోదయ మాయెను. అప్పుడు వీధిగుమ్మములో నెవ్వరొ "రాజశేఖరుండుగారి బస యెక్కడ?" నని యడిగిరి.ఆమాట వినియది

పండ్రెండవప్రకరణము

రుక్మిణి కంఠము వలెనున్నదని వడిలో నుండి సీతను దింపిమాణిక్యాంబ వీదిగుమ్మము లొని కొక్కయంజె వేసి యెవరువారని కేకవేసెను. అప్పుడు సుబ్బరాయుడు మాణిక్యాంబను జూచి "అమ్మా"! కౌగిలించుకొని జోరున నేడువమొదలుపెట్టెను. అంతట వారందఱను గలసి లోపలికి బోయిరి. చెఱసాలలొ పెట్టబడిన దినముననే రాజశేఖరుండు గారు వ్యసనంపడుచు నొకచోట గూరుచుండి యూండగ బదిసంవత్సరములు దాటిన కారబద్దుండొకడా మార్గమున కాళ్ళసంకేళ్ళతో పోవుచు రాజశేఖరుండు గారి మొగము వంక గొంతతడవు చూచి యాయన సమిపమునకు వచ్చి కూరుచుండెను.

రాజ---నీపేరెవరు?

కానా--నాపేరు పాపయ్య; మాయింటిపేరు మంచిరాజువారు. నన్నెక్కడైనా జాచినట్టు జ్ఞప్తియున్నదా?

రాజ--మిమొగమెక్కడనోచూచినట్టేయున్నదికానియెప్పుడుచూచినానొమాత్రము స్మరనకురాలేదు. మంచిరాజు పద్మరాజు మికేనుగును?

పాప--నన్నుమీరు నల్లచెఱువు వద్దజువ్విచెట్టు క్రింద జూచినారు నేనప్పుడు బైరాగివెషములో నున్నందున, నన్నానవాలు పట్టలేక పోయినారు. పద్మరాజునాకొమారుండు.

రాజ--మునపటి యవస్త పోయి మికింతటిలోనిప్పటికీ దశయెట్లువచ్చినది?

పాప--నేనీ శోధనాద్రిరాజుతో చేసిన దోషముచేత, నాకీతని మాటవిన వలసివచ్చినది. ఈరాజు దారులు కొట్టుటకై నలుగురుని తోండితెచ్చి నన్ను వారికినాధునిగా జేసి నల్లచెరువునకు

రాజశేఖరచరిత్ర

పంపెను. వెనుక కోయరామిరెడ్డియు వానిమనుష్యులును పట్టుకోబడి రాజుగారిచే చెట్లు కొమ్మలకు ఊరితీయబడిన తరువాత మేము ప్రబలులముగా నుండి రెండు మానములు త్రోవలు కొట్టుటతో బ్రసిద్దిగాంచితిమి. దోచుకొని తెచ్చిన సోమ్ములో సగము శోభనాద్రిరాజు పుచ్చుకొనుచుండెను. మిగిలిన సగములోన సగము నావంతునకు వచ్చుచుండెను మెట్టుసొమ్ములో నాలవపాలును తక్కినవారును నలువురును సమభాగములుగా బంచుకొనుచుండిరి. నేను యోగివలె నటింపుచుందును: నాతోడనున్న వారు దూరముగా నడవిలో బగలెల్లనుండి రాత్రులువచ్చి మాటాడి పోవుచుందురు: గుడెసె లోపగలు వారికేమయిన వర్తమానము చేయవలసివచ్చినప్పుడు, గుడెసెలో గాపురమున్న కోయవానిని బంపుచుందును; వానికి ప్రత్యేకముగా నేనేజీతమిచ్చెడి వాడను.

రాజ--ఆప్పుడు విల్లును ఆమ్ములును బుచ్చుకొని మాతో వచ్చిన వాండు వాడేకాడా?

పాప--నాబావ పొట్టవాడే. మినిమిత్తమై పంపినాటి రాత్రియే యానలుగురిలో నొకడుచంపబడి నాడు. రాజుగారికేలాగున దెలిసెనో కాని మఱునాడు తెల్లవారక మునుపే రాజభటులుకోయవానిని కోట్టినందున వాడుతక్కినవారుండు స్తలములనుజూపగా వారిని సహితము పట్టుకొని మమ్మందఱను రాజుగారియొద్దకుతీసుకొనివచ్చిరి. ఆయన మమ్మందఱను చెఱసాల యందుబెట్టించెను; మాకందఱకు శిక్షకలిగినను మేమిరాజుపేరుచెప్పిన వారము కాము కాబట్టి మమ్మితండు చెఱసాలలో స్వేచ్చగా తిరుగుట కంగీకరించి మిక్కిలి ప్రేమతో జూచుచున్నాడు.

రాజ-- అట్లయిన శోభనాద్రిరాజు మీకెంతో యుపకారమే చేయు చున్నాడు.

పండ్రెండవప్రకరణము

పాప--ఎమి యుపకారము? ఈదుర్మార్గుని మూలమున చెఱసాలలో బడిబాధపడుచున్నాను రాజుగారెప్పుడో యీతనిదుర్మార్గతను దెలిసికొని యీతనిని కూడ మాకు సహయునిగా నిందేయుంతురు, ఆటుపిమ్మట మఱియొక కారాగ్రహాధికారి వచ్చినప్పుడు మాపాట్లు దైవమునకు దెలియుగలవు.

రాజ--మికొమారునకు పిల్లనియ్య నందునకే సుమి నన్నితడిందు బెట్టించి నాడు.

పాప--ఆవును నేనెఱుగుదును. మిఱు రాజుదగ్గఱ నుండంగా పద్మరాజును పిలిపించి నప్పుడు వాడు నావద్దననే యున్నాడు. ఆదియంతయు నేనును మావాడు నావద్దనేయున్నాడు. ఆదియంతయు నేనునుమావాడును రాజును సిద్దాంతియు గలసిచేసిన యాలోచనయే అయినను మీదినములు బాగుండి మాయాలోచన కొనసాగినది కాదు. శోభనాద్రి రాజేక్కడికోగాని నాతో గూడనల్ల చెఱువు వద్దనుండిన. వాండ్ర నిద్దఱిని, సంకిళ్ళూడ దీయించి పంప దలంచు కొన్నాడు.

రాజా--ఎక్కడికో మికూతెలియలేదా?

పాప--తెలియలేదు. ప్రొద్దున నాతతోనేమో యాలోచించుటకు వచ్చినప్పుడు రాజుగారితమ్ముండిక్కడకువచ్చి నందున రాత్రి చెప్పెదనని వెళ్ళిబోయినాడు. నేను మీకుగొప్ప యుపకారము చేసితిని; దానికి మాఱుగా నిప్పుడుపకారము నొకదానిని జేసెదను. పెద్దాపుర రాజుగారు బహుయోగ్యులు; శోభనాద్రిరాజు మిమ్మిట్లు నిర్బంధపెట్టుచున్న మనవి వ్రాసికొన్న యెడల మిమ్ముతక్షణమే విడుదలచెయుదురు. కాగితము మొదలైనవి నేనుతెపించియిచ్చెదను.

రాజశేఖరచరిత్రము

<poem>అని పాపయ్య కాగితము కలమును తెప్పించి యిచ్చెను తోడనే రాజశేఖరుండు గారు విజాఞన పత్రిక నొకదానిని వ్రాసిమడచి జిగురంటించిపయిని చిరునామవ్రాసి యియ్యంగ పాపయ్య యొక మనుష్యునిచేత దానినిరాజుగారి కంపెను. కాని యాయన యొద్దనుండి యొకయుత్తరముగాని విమర్శచేసివ్యయము దయచేయు సూచనులు గాని రేండూముడుదినములు కడచినను రాలేదు. రాజబంధువు మిదజేసిన విన్నపము గనుక బదులురాదని రాజశేఖరుండు గారూరకుండిరి.

సీతనేత్తుకు పోయిన మఱునాండు ప్రొద్దుననే రాజుగారు చెఱసాలను జూచుటకు వత్తురని యచట నొక వదంతి కలిగెను, తరువాత గొంచేము సేపటికి రామరాజురాజశేఖరుండు గారున్న తావునకు వచ్చెను.

రాజ--రామరాజుగారు! నాతప్పునుక్ షమింపవలెను. మిరారాత్రి జాబును తెచ్చియిచ్చుటయే నాకు మహొపకార మయినది. నేనుసంగతిని తెలుసు కోలేక మిమ్ము నిష్కారముగా కానిమాట లాడినాడను.

రామ--మికు నేను జేసి యున్న యుపకారము నకు నన్నటువంటి మాటలన వలసినదే. ఇంకనెప్పుడును మేలుచేయకుండ మంచి బుద్ధి చెప్పినారు.

రాజ--నాయందు కరుణించి మిరాసంగతిని మఱచి పోవలెను. మంచి సంబంధము చెడిపొయెగదా యని యానమయములో నొడలుతెలియక యేమోయన్నాను. నన్నుమన్నింపుండు,

రామ--రాజుగారు చెఱసాలను చూడబయలుదెఱినారంట. నేను వేగిరము పోవలెను.

అని రామరాజు వెళ్ళిపోయెను. తరువాత రెండుగడియలకు వెండిబిళ్ళ బంటొకండువచ్చి రాజుగారు కొలువుతీర్చి కూరుచుండి,<poem>

పండ్రెండవప్రకరణము

రాజశేఖరుండుగారేమో విన్నపము వ్రాసినందునకయి పిలుచుకొని రమ్మనరని చెప్పి, ఆయనను వెంటబెట్టుకొని పోయెను, ఆయన వెళ్ళునప్పటికి సమస్తాభరణభూషితులయి రాజుగారు రత్నసింహాసనముమింద గూరుచుండి యుండగా, వేత్రహస్తులు పసిడిబెత్తములను చేతంబూని ముందు నిలుచుండిరి. చామరధరులిద్దఱు ప్రక్కల నిలుచుండి వింజామరలు వీచుచుండిరి; భటులాయుధపాణులై పార్శ్వములను నిలుచుండిరి; ఒకప్రక్కను శోభనాద్రిరాజు చేతులు జోడించు కొని నిలుచుండెను రెండవప్రక్కను మఱియిద్దఱు మనుష్యులు చేతులుకట్టుకొని నిలువబడి యిండిరి రాజశేఖరుడుగారు వచ్చిమొదట నిలువబడగానే క్రిష్ణజగపతిగారు మిరీశోభనాద్రిరాజుగారి మీద నేమైన మాపేర మనవి చేసూకోన్నార? అనియడిగీరి. రాశేఖరుండుగారు తనమిదికేమివచ్చునోయని భయపడుచు, శరీరమంతయు కంపము నొంద నోరుమెదల్పక యూరకుండిరి.

కృష్ణ--శోభనాద్రిరాజా; నీవీరాజశేఖరుండుగారి విషమయి చేసిన యక్రమవు పనులన్నియు మాకు దెలియవచ్చినవి. నీకు చనపరిగానున్నతుచ్చునకు తనకొమార్తె నియ్యనన్న మాత్రమున, నీవాయనను పట్టిచెఱసాలలో నున్నవాండ్ర నిద్దఱను విడిచిపుచ్చి యాచిన్నదానినెత్తుకొని పోవునట్లు ప్రేరేపించితివి.

శోభ--ఆచిన్నదాని నెవ్వరెత్తుకొని పోయినారో నాకేమియు దెలియుదు.

కృష్ణ--నీకు దెలియక పోయిన యెడల జెఱసాలలొ నున్న వీండ్రిద్దఱును నెట్లు వెలుపలికి వెళ్ళగలిగిరి?

శోభ--వీండ్రిద్దరు నిన్నటి యుదయ కాలమున గోటదాటి పాఱి పోయినారు.

రాజశేఖరచరిత్రము

నేనప్పటినుండియువీండ్రనుబట్టుకొనుటకుభ్బటులనుబంపివెదకించున్నను.

కృష్ణ---ఏమిరా?గుఱవమిమ్మియనయెక్కడికయినపంపినాండా?లేకమిరేగోడదూకిపాఱిపోయినారా?

గుర--మహాప్రభూ!నిన్నప్రొద్దున్నమమిద్దఱనుపిలిచియీరాజుగారుచిన్నధానినిరవణక్కపేటకెత్తుకొనిపోయి,యక్కడపద్మరాజునకొప్పగించవలసినడనియాజ్నాపించినారు.చిన్నదిరాంగానేదొంగతనముగాపెండ్లియాడుటకైపధ్మరాజుముందుగానేపోయియక్కడనున్నాండు.

శోభ--కాదుకాదు.ఈదొంగలంజకొడుకులుపాఱిపోయి,తప్పించుకొనుటకయియీలాగునబొంకుచున్నారు.

గుర--ఈరాజుదొంగలగురువు.మునుపుమాచేతబారులుకొట్టొచితిన్నగామాసొమ్ముమాకియ్యకసకలమయినచిక్కులుపెట్టినాండు
ఈబ్రాహ్మణుని దోచుకొనుటకు వచ్చి యాయనమూలముగా పడ్డ పాట్లు తలచుకొన్న నిప్పటికి మాకు దుఃఖమువచ్చు చున్నది.

క్రష్ణ--వెనుక నీ ప్రకారుముగా దారులు దోపించినావా?

శోభ--లేదులేదు.విధవ కొడుకులబద్ధమాడుచున్నారు.

గుర--మామాటలబద్ధమేమో పాపయ్యగారిని పిలిపించి విచారించవచ్చును. ఇప్పుడాయన యీచరసాలలొనే యున్నాడు.

క్రష్ణ--ఓరి! పాపయ్యను పిలుచుకొనిరా.
కొంతసేపటికి పాపయ్యవచ్చి రాజుగారు నిజము చెప్పిన యెడల శిక్షతగ్గించెదమని వాగ్దానము చేసినందున మొదటినుండియు నాతని చర్యయంతయు నేకరవుపెట్టెను. ఆందుమీద శోభనాద్రిరాజు మఱుపలులుక నోరురాశ క్రిందచూచు మిన్నకుండెను. రాజుగారి.

పండ్రెండవప్రకరణము


మొగము పోలికయు కంఠస్వరమును రామరాజు వానివలె నన్నుందున, రాజశేఖరుండు గారు దేహమంతయు జెమర్ప దిగ్భమము నొంది యూరక తెల్లపొయి చుచుండెను. అప్పుడు రాజుగారాయన వెలవెలవాటు నుతత్తరమును గని పెట్టి సింహాసనము నుండి దిగివచ్చి చేయిపట్టుకొని, వెనుక రామరాజును వేరున బలుమారువచ్చి యోగక్షెమంబుల నారయుచువచ్చినది తామేయనియు, వెంటనె సహాయముచేయుటకు శక్తికలిగియుండియు బ్రవర్తమును బరిక్షించుటకయి యింతకాలముపేక్ష చేసితిమనియు, చెప్పి వెంటనే కారాబంధ విమోచనము చేయించిరి. రాజశేఖరుండుగారు కొంతసేవేమి పలుకుటకును తోచక కోంత భయము తీఱిన వెనుకమెల్లగ వెలుగుతెచ్చుకొని. హగ్దదస్వరముతో" దేవర పరిస్తితి తెలియక సామన్యమానవునిగా నెంచియ గౌరవముతో జూచినందనకును సీత వివాహకార్యమునకు భంగముకలిగెనన్న కోపమున దూషణవాక్యములు పలికినందునకును క్షమించిరక్షింప వలయునని బహుదీనత్వముతో వేండుకొనిరి. ఆవిషయమున దమకెప్పుడు మనసులో మఱియొక లాగున లేదనిచెప్పి, రేపు పెద్దాపురమునకు వచ్చి తమ్ముజూడవలసినదని సెలవిచ్చి రాజుగారాయన నింటికి బంపిరి..

ఆయన వెళ్ళిన తరువాత రాజుగారు శోభనాద్రిరాజును బిలిచి యాతండు చేసిన నేరమున కెంతగొప్పదండనము విధింపవలసియున్నను దయారసముపెంపున నెల దినములు మాత్రము చెఱసాలలో నుండ శిక్ష విధించి భటులవశముననొప్పగించిరి. అంతేకాక సీతనెత్తుకు పొయినవారిని తాను పట్టి తెప్పించినప్పుడు నిజముచెప్పిన యెడల శిక్షలో గొంతభాగము తగ్గింపబడునని వాగ్దానముచేసి యుండుటంబట్టి వాండ్ర శిక్షలో సగముతగ్గించుటయే కాక మంచి రాజుపాపయ్యకు

రాజశేఖరచరిత్రము

సహీతము సగము శిక్ష తక్కువ చేసిరి, ఈకావ్యములన్నింటిని జక్కబెట్టుకొని శ్రీకృష్ణజగపతి మహారజుల వారు భద్రబాహుదలయ వందిమాగధులు బిరుదుపద్యములు చదివికొనియాడ, భేరిమృనంగాది వాద్యములు బోరుకలుగ, చతురంగ బలసమేతలయి తమరాజధానికి విజయంచేసిరి.

రాజశేఖరుండు గారింటికి వెళ్ళునప్పటికి మాణిక్యాంబ పడవంటింటి గోడకు జేరగిలంబడి గూరుచుండి తలవంచుకొని మర్పరాయుని తొనేమోచెప్పు చుండెను. రాజశేఖరుండు గారు గుమ్మము వద్దకు వెళ్ళి, ఆ చిన్నవాని ముఖలక్షనములును పలుకబడియు రుక్మిణిని పోలియున్నందున నాశ్చర్యపడి చూచి పురుషుడయివున్నందున ఎమని నిశ్చయించుటకును తోచక విబ్రాంతితో నాతని మొగము వంక నేఱెప్ప వేయక చూచుచు లోపలిరాక యచ్చటనే నిలుచుండిరి. ఇంతలో సీత గుమ్మము లోనుండి తొంగిచూచి, "అమ్మా!నాన్నగారు వచ్చినా" రని కేకవేసి వెళ్ళి తండ్రిని కౌగిలించుకొనెను.

అంతట మాణిక్యాంబ పరమానంద భరితురాలయి వేంటనే లేచి వెళ్లి కాళ్ళు కడుగుకొన నీళ్ళు తెచ్చియిచ్చిపాదముల తడి తన పయిట చెఱంగుతో నొత్తి కూరుచుండుటకయి గోడదరిని పీటవేసెను. రాజశేఖరుండుగారు పీటమిద గూరుచుండి సీతనుముద్దాడి తొడ మీద కూర్చుండబెట్టుకొనెను. అప్పుడు మాణిక్యాంబ సీతను దొంగలెత్తుకొని పోవుటయు, రామరాజు మఱియొకరను వదిలించి తెచ్చుటయు జెప్పెను. రాజశేఖరుండు గారు రామరాజు పెద్దాపురాధివాధులయిన కృష్ణజగపతిమహారాజులనియు, ఆయన ప్రజలక్షేమము కనుగొనుటక యియట్టిమాఱు వేషములతో సంచరించు చుందురనియు, రామరాజను పేరునవచ్చి మనకు బహూపకారములను జేసి తుదకు కారాబంధవిమో

పండ్రెండవప్రకరణము

చనము జేయించిరనియు జెప్పి, తన్ను విడిపించి నక్రమమును వివరించి కొంతసేపు సృపుని సద్గుణ నిర్ణయమును జేసెను. మాణిక్యాంబ రామరాజు దేశాధీశుండని విని అశ్చర్యపడి. ఆయన యొక్క గర్వరాహిత్యమును పరోపకార శీలతను బహు భంగులు మెచ్చుకొనెను.

ఇట్లు మాటాడు చుండంగానేసుబ్బరాయుండు వచ్చి రాజశేఖరుండుగారి కాళ్ళమిదపడినేను "రుక్మిణి" ననిచెప్పెను. ఆయన సంతోషముచేత కొంతసేపు మాటాదలేక, తుదుకు హృదయము పదిలపఱచుకొని లేచిపెద్దకుమమార్తె నాలింగముచేసుకొనెను. అప్పుడు చచ్చిపోయినదను కొనుచున్న కూతురు లేచివచ్చుట చేతనాదంపతు లకిరుపురుకును గలిగినసంతోషమింతంతయని చెప్పశక్యముకాదు; ఆసమయమున సీతకుగలిగిన సంతోషమును పట్టశక్యముకాకపోయెవను. అయూద్రేకము కొంత నిమ్మలపడినమీదట, ఆవధూవరులు తమ్మెడబాదినదిమొదలు కొనినేంత వఱకును జరిగిన వృత్తాంతమును సనిస్తరముగాజెప్పుమని రుక్మిణినడిగిరి. రుక్మిణినడిగిరి రుక్మిణి మూప్రకారముగా వినిపింప నారంభించెను.

మనలను దొంగలు కొట్టిన వాడు రాత్రిపిండి డియారంబోసినట్లు తెల్లగవెన్నెల కాయుచుండగా నాకుమెలకు వవచ్చిచూతును గదా కటిక నేలను మహరణ్యమధ్యమునబడి యుంటిని నలుదిక్కుల నెంతవఱకు జూచిన నెందునెవ్వరును గనంబడలేదు . ఎక్కడను మనుష్య సంచారమును కనబడులేధు గాని మృగముల సంచారముల యొక్కకూతలు మాత్రము చెవిలొ వినపడసాగేను. ఇంతలొ నొక వ్యాగ్రమము నాధగ్గరనుండియే పోయినధెకాని నన్నుచూడక చేరువు నున్నయొక మనిష్యుని మొండెము ఇడ్చుకు పొయి తొలగి పొయెను. దానిని చుచిన తోడనే నాదెహము నాకు స్వాధినము కాలేధు. కొంత తెలివి వచ్చిన
.
రాజశేఖర చరిత్రము

తరువాత మీరెవ్వరును లేకపోవుట చూచి బ్రతికి యున్న యెడల మీరు నన్నొంటిగ దిగ విడిచిపో నను నమ్మక పోయిన మీ అందరును దొంగల చేత మరణము నొంది యందు రనియు ఘాతుక మృగము లేవియే మీ దెహముల నిడ్చుకొనిపోయి యుండవచ్ఛ్హు ననియు దలపొసి చూడజుట్టమును దైవమును గానక చావ నిశ్చయించుకొని ,మరల నింతలొ ఆత్మహత్య దోష మనబుద్ది యొకటి పుట్టుట;చేత కొంత జంకి మిలో నెవరయిన బ్రతికి వుందవచ్ఛు ననియు నొకవేళ మిమ్మాందరను మరల జూచు భాగ్యము కలిగినను కలుగవచు ననియు నూహచేసి మరణ ప్రయత్నమును మానుకొని , లేచి నాలుగడుగులు నడచితిని .అక్కడ నెత్తుట దోగియున్న శిరస్సొకటియు దాబి ప్రక్కను బట్టలమూటయు గనబడగా, అంతటి ఆపదసహితము దుర్వార మయిన క్సుద్బధకు సహింపలేక తినుట కందులో నేమయిన దొరకవచ్ఛునని ఆ ముటను విప్పి చూచితిరి.అందు పురుఘులు మ్మత్రమెయ్ తగిలించు కొవలసిన వస్త్రలు మాత్రమె వున్నవి. వానిని చుచిన తోడనే చక్కని స్త్రిలు నిజ వేషములతొ నొంటరిగ దిరుగుత క్షెమకరము కాదుకబట్టి పురుఘ వేషము వేసుకొని యేదొనొక గ్రామము చేరవలె ననునలోచన తొచి ఆ వస్త్రమును గట్టుకొని యంగిని తొడుగుకొని పురుఘ వేషమును దరించి ,నా పూర్వ బట్టలను మిగిలిన్ బట్టలతొ జేర్చి మూటగట్టి నా శరీరమును నన్ను నగలను తీసి చెంగున ముడి వేసుకొని బయలు దేరి ,యొక కాలి మార్గమున నడచి తెల్లవరెటప్పటకి ఒక గ్రామం జేరితిరి. ఆ గ్రామములొ ఆపూట కుండి నగలనమ్మి వేసి రొక్కలను జేర్చుకొని తలమిద దెబ్బచేత భాదపడుచునే చెరువ గ్రామమునకు బొయి ఇక్కడ కొన్ని దినము ==== పండ్రెండవ ప్రకారనము

లుండి వైద్యము చేయుంచుకొని నిమ్మళించిన తరువాత బయలు దేరి చుట్టుపక్కల గ్రామములొ తిరుగుచు పూటకూటీ ఇడ్లలొ భోజనం చెయుచు పదిహెను దినముల క్రిందట జగ్గంపెట చెరితిరి.ఆ గ్రామము కరనము ముసలి వాడును పుత్ర సంతానము లేనివడను గనుక నన్నుజూచి ముచ్ఛటపడి తన పనికి నెను సాయంగ వుందునని యెంచు నన్ను దయొద్దనె యాదరించుచు నా ప్రవర్తనకు మిక్కిలి సంతొషించి తనకున్న ఒక్క కుమర్తెను నాకిచి వివాహము చేసి ఇల్లరికము వుంచుకొవలెనను నుద్దేసముతొ నా కుల ఘొత్రము నడీగి తెలుసుకొనెను.నేనక్కడ సుబ్బరయుడు అనే పెరున మిక్కిలి నమ్మకముగావుండి ,మీరు విద్య చెప్పించిన మహిమ చెత లెక్కలు మొదలైనవి వ్రాయుటలొ తోడపడుచుండి ,నాకు వెంకటెస్వరులు మొక్కు చేత మా వారు తల పెంచు కొనునట్టు చెసినరనియు ,ఈ వ్రత సమాప్తి అగువరకు తలయాంటు కొగూడదనియు, చెప్పి ఆ వ్రతమునకు భంగము కలగకుండ కాపాడెద మని వారి చేత అనిపించుకొని పురుష వేషము బయల పడకుండ గడుపు కొనుచు వచ్ఛ్హితిని . అట్లుండగ ఒకనాడు మధ్యనము సీతను ఎత్తుకొఛ్ఛి యెవ్వరొ ఇద్దరు మనుఘ్యులు భొజనము పెట్టించుటకై నే నున్న ఇంటికి తీసుకువొచ్చిరి. అప్పుడు మనము దాహము తీర్చి బ్రతికించిన రాజు వచ్ఛి వాన్ని కొట్టి సాగనంపెను. అంతట ఆఇంటి వారివద్ద సెలవు పుచ్ఛుకొని నెనునూ రాజుగారిని దీసుకొని వచ్చితిమి. మీ అంతట మీరందరును నన్నానవాలు పట్టి కనుగొనువరకు నేను రుక్మిణి అని మితో ఎవ్వరితొ చెప్పకుండ వుండ వలెనని మార్గము పొడుగుననూ తలచికొని వచితిగనీ, అమ్మను జూచిన తోడ మనసు పట్టలేక లోపలినుండి దు ఖము పొంగివచ్ఛి కౌగిలించుకొని నా సంగతి చెప్పివేసితిని.

అని రుక్మిణి చెప్పినతరువాత రాజశేఖరుడుగారు కొమార్తె యొక్కబుద్ధికిని సాహస కార్యమునకును సంతోషించి యామెను కౌగలించుకొని మిక్కిలి గారవించెను. రుక్మిణియొక్క యీ చరిత్రమును విన్నవా రెవ్వరైనను, ఉన్నయూరిలో సహితము గడపదాటి పొరుగువీధికైన నెప్పుడును పదచలనముచేసి యెఱుగనంత సుకుమారిగా బెరిగిన పదునాలుగేండ్ల ప్రాయముగల ఒక్క ముగ్ధబాలిక అంతటిధైర్యమును పూని సమయోచిబుద్ధితో మంచియుపాయము నూహించి. పరుల కెవ్వరికిని భేద్యముకాని మాఱువేషమును ధరించి లోకానభవమువలన నాఱితేఱిన ప్రౌడాంగనలకు సయితము కష్టసాధ్య మయినరీతిని ప్రచ్ఛన్నముగా నుండగలిగిన దన్నవాతన్ నమ్మశక్యముకాకున్న దనవచ్చును. ఎవరునమ్మినను ఎవరునమ్మక పోయినను వాస్తవమును మఱుగపఱచక చెప్పుట చరిత్రకారునికి విధాయకకృత్యము గనుక, జరిగినసంగతినేమో జరిగినట్టుచెప్పుచున్నాను. పురాణగాధలయందువలె మనుష్యులు లేడిరూపమును ధరించినారని కాని పురుషులు కేవలస్త్రీలుగానే మాఱినారని కాని అసాధ్యమయిన సంగతి యిందేదియు దెలుపబడలేదు. ఆమె కిట్టియద్భుతవిధమున బ్రవర్తింపనేర్చినది యామెనాశ్రయించియున్న సరస్వతియే కాని స్వశక్తి కాదు. విద్యాప్రభావము నెఱిగినవా రెవ్వ రిట్టిదొక ఘనకార్యమని యాశ్చర్యపడుదురు?
కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf