కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/పీఠిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఈ సంపుటంలో ఉన్న పదెనిమిది పద్యమూర్తుల్లోనూ, నాలుగు పెద్దకావ్యాలు, ఒకటి ప్రబంధానుకరణం, మూడు ఆంగ్లకావ్యానువాదాలు, అయిదు హేళనలు, రెండు మతప్రమేయాలు, రెండు మహావ్యక్తి ప్రశంశలు, ఒకటి నీతి బోధ. పెద్ద కావ్యాలు నాలుగింటిలో మొదటిది "శుద్ధాంధ్ర నిరోష్ఠ్యనిర్వచననైషధము". ఇది మూడు ఆశ్వాసాలు. పెదవీ పెదవీ తగలకుండా (అనగా_ప,ఫ,బ,భ,మ అనే అక్షరాలు వాడకుండా), ఎక్కడా గద్యం రానియ్యకుండా, సంస్కృతపదం దొర్లనియ్యకుండా అందరూ ఎరుగున్న నలచరిత్ర లలితంగా సుగమంగా ధారాళంగా ఇందులో చెప్పబదింది. దమయంతి అనే మాటలో 'మ' ఉంది గనక, ఋతుపర్ణుడులో 'ప' ఉంది గనక ఆశబ్దాలు లేకుండా నలకథ నడిచిపోవడం చూడతగ్గదే కదా! రెండోకావ్యం 'రసికజనమనోరంజనము' ఇది నాలుగాశ్వాసములు. ఇది మూడుమూర్తులా ప్రబంధము_'ప్రబంధరత్నము' ఆదికాలం నించీ ఆంధ్రంలో ఉండే మహాప్రబంధాల మేలుజాడల మేళగింపు ఇందులో స్ఫురిస్తుంది. దీనికుండే మరో విశిష్టత ఏమంటే, ఇది కేవలం అచ్చతెలుగేగాని, సంస్కృతభాషా పటాటోపం కాదు. సంపర్కంగాని స్పర్శగాని ఇందులో చూడం. మూడోది 'శుద్దాంద్ర భారత సంగ్రహము ' అచ్చతెలుగులో మంచినీళ్లప్రాయంగా పద్యరూపంలో ప్రసంగం నదిచి మహాభారతకధ పూర్తిగా మూడాశ్వాసాలతో ముగియడమేకాదు. ఆంధ్రమహాభారతంలొలాగే అపరూపచందస్సులూ చివరికి మద్యాక్కదా కూడా ఇందులో పనిచేశాయి. నాలుగోది 'శుద్దాంద్రోత్తరరామాయణము ' ఇది ఒకే అశ్వాసము, అదేనా అసంపూర్ణం.

మొత్తంమీద నూట పదిహేను గద్యపద్యాలు గల ఏకాశ్వాప్రబంధము. 'అభాగోపాఖ్యానము ' ఇది సంస్కృతసమానభూయిష్టమై, పదప్రయోగంలోనూ వృత్తగమనంలోనూ పూర్వప్రబంధస్మారకమై, ఆంధ్రప్రబంధసామాన్యోపమీనాలకి కేవలం విజ్ఞోడుగాఉండే ఉపమానాలతో కూడినది తద్వారా హాస్యప్రధానమై ఒప్పే పద్యరచన.

'అధివిలాపము ' గోల్డ్ స్మిత్ అనే ఆంగ్లకవియొక్క ట్రావిలర్ అనే కావ్యానికి అనువాదం. యూరప్ లోని వేర్వేరు ప్రాంతాల స్థితిగగులు అందులో వర్ణించబడ్డాయి. అనువాదం ఎంతో ప్రౌడంగా ఉన్నది. 'జాన్ గిల్పిన్ ' రొవర్ అనే ఆంగ్లకవి కావ్యానికి పరివర్తనం. ఇది హాస్యప్రధానం. దీనిలోరిధి సుగమం 'కామెడీ ఆఫ్ ఎర్రర్సు ' అనేది షేక్ స్పియర్ నాటకానికి ద్విపదకూపంలొ అను


సరణం. ఇది రెండో అంక ప్రారంభం ఆగిపోయింది. ఆంగ్ల వచనానికి మిక్కిలి చేరువైనా బ్లాంక్ వర్సులో ఆ నాటకం పుట్టి ఉండడం వల్ల, తెలుగు వచనానికి మిక్కిలి చేరువగా ఉండే ద్విపదలోకి దాన్ని దింపడం కర్తవ్యం అని కర్త ఊహించి ఉండవచ్చును. ఈ నాటకమూ, మర్చెంట్ ఆఫ్ వెనీస్ అనే నాటకమూ, విక్టోరియా రాణి చరిత్రా - ఇవి కర్తకు చాలా ఇష్టం. ఈ విషయాల్ని ఆయన రెండు మూడు విధాలా రూపించడమే అందుకు నిదర్శనం.

తక్కిన పద్యరచనలలో అయిదు హేళనలు. 'సరస్వతీ నారద విలాసము'లో కవులంతా తనకి అలంకారాలు చేయించాం అంటూ మొదలెట్టి తనని సకల హింసా పెడుతున్నారని సరస్వతి అడివిలోకి వెళ్లి అరణ్యరోదనం చేస్తూంటే, నారదుడు గానం అంతా వేశ్యల పాలైందని విచారిస్తూ అక్కడికే వెళ్లి దైవాద్వా ఆవిణ్ణి కలుసుగుని తానెంత దుఃఖంలో ఉన్నా ఆవిడ తన తల్లి గనక ఆవిణ్ణి ఎత్తుగుని అడివి దాటిస్తానంటాడు. 'స్త్రీ పునర్వివాహ సభా నాటకము' లో వీరభద్రుడు గారు పెద్దల్ని సభకి రప్పించే నిమిత్తం స్నేహితుడితో ప్రసంగిస్తాడు. 'వీర' పదం పేరులో ఉన్న ఆ పాత్ర, కర్తే! చివరకు ఇద్దరూ కలిసి ఒక కీర్తనలో ఈశ్వర ప్రార్ధన చేస్తారు. 'స్త్రీ విద్య' అనే పద్య సంపుటి ఏమిటంటే, స్త్రీ విద్య కూడదనే వారు పద్యరూపంలో వాదన చేయగా, గర్భసీసాలలోనూ, బంధకందాలలోనూ వ్యవహరిస్తూ ప్రమాణం కూడా చూపించి స్త్రీ విద్య శాస్త్రసమ్మతం అని 'గద్య తిక్కన' తక్షణం పంపిన సమాధానం! వితంతు వివాహాలు జరిగిపోయి, సంఘంలో వితంతువులు దొరక్కుండా పోతే తమరికి చాలా విషయాల్లో తంతు నడవక బాధ కలుగుతుంది కదా అని వాపోయే వాళ్ల బేసబబులు 'కులాచార పూర్వ నాగరిక పంచరత్నములు' అనే పద్యసంపుటీలో ఉన్నాయి. 'హితబోధ' అనేది పద్యత్రయం. విమర్శకి ఆగలేక, కాఱులు ప్రయోగిస్తూ, చాలామంది చేత పొగిడించుకుంటే మాత్రం ఎవడేనా కవి కాగలడా? లక్ష మంది పొగిడినా శునకం సింహం కాగలదా! అని దానిలో బోధ. వీరేశలింగం రచనల్లో ఒకే ఒక విమర్శ ఉండడం నించి ఇది ఎవర్ని ఉద్దేశించి పుట్టిందో తెలుస్తూనే ఉంది.

'చెన్నపురి బ్రహ్మోపాసన మందిర ప్రతిష్ఠాపనము' అనేది బ్రహ్మసమాజ మత స్థాపక పోషక సంస్కర్తల ప్రశంస. తమరి పత్రికని వర్ధిల్లజెయ్యడానికి సర్వరక్షకుణ్ణి వేడుకుంటూ రచించుచున్న పద్యావళి 'దైవప్రార్థన' కర్తకి మిక్కిలి ఇష్టవిషయమైన 'విక్టోరియా రాణి' గురించిన మెప్పు - 'శ్రీ విక్టోరియా జూబిలీ నవ--AvinashVellampally (చర్చ) 15:51, 2 డిసెంబరు 2014 (UTC) రత్నములు. అప్పట్లో హిందూదేశ బంధువైన రిపన్ ప్రభువు గురించిన పొగడ్త - 'శ్రీ రిపన్ ప్రభు స్వాగతము'. అందులో కర్త రిపన్ నీ, ఆయన్ని పంపినవారినీ కూడా కీర్తన చేశారు. దేవుడు-తనవారు-మంచి బాలుడు-విద్య-అడకువ-గర్వము-తృప్తి-ధైర్యము-సత్యము-జీవహింస-సర్వజన సమాదరము-పాటుపడుట-శరీరారోగ్యము-స్వతంత్ర జీవనము-ధనము-ముఖస్తుతి-పనిబనుచుట-చౌర్యము-పరోపకారము-వివిధ ధర్మములు - అనే ఉపశీర్షికల క్రింద నూఱు గీతాలలో ప్రకాశిస్తూ బాలకంఠాల్లో మెరసిపోవాలని వీక్షిస్తూండే రచన 'నీతి దీపిక'.


రాజమండ్రి. 25-6-1950. భమిడిపాటి కామేశ్వరరావు.