ఉదయనోదయము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఉదయనోదయము


ద్వితీయాశ్వాసము


క. శ్రీమహిమాస్పద తిమ్మయ
రామామాత్య ప్రకృష్ట[1]రాజ్యాంగభరా
క్రామితనిజభుజవిభవో
ద్దామ శ్రీకేశ[2] బాచదండాధీశా. 1
 
వ. అవధరింపుము— 2

ఉ. అప్పుడు తద్వధూజనము లందఱు నద్భుతముల్ మనంబులం
జిప్పిల నొండొరుం గడవఁ జేరి రణన్మణి[3]కంకణారవం
బొప్పఁగ మౌళి నంజలులు యోజనసేయుచుఁ జేసి రర్చనల్
ముప్పిరిగొన్న భక్తి మదలోలవిలోచనపంకజంబులన్. 3
 
మ. మునినాథుం డరుదెంచెనన్న వచనంబుల్ తేనెలై వీనులం
జినుకన్ సంభ్రమ మొప్ప లేచి మహిభృత్సింహుండు లీలాగతిం
జని తత్పాదనసరోజముల్ ప్రమదబాష్పక్షీరపూరంబుచే
నొనరం డాఁచుచుఁ జాగిఁ మ్రొక్కె నిటలం బుర్వీస్థలిన్ మోపఁగన్. 4

ఉ. అమ్మునివల్లభుండు కరుణామృతవాఃపరిషేచనంబుచే
నమ్మనుజేంద్రు మేని మదనానలతాపము నుజ్జగింపుచుం
బమ్మిన భక్తి హేమమయపాత్రికచే నతఁ డిచ్చు నర్ఘ్యపా
ద్యమ్ములు నెమ్మిఁ గైకొని ముదమ్ముగఁ దత్కరదండ మూఁతగాన్. 5

వ. నారదుండు వీణె[4] నిజకరారవిందంబున నవలంబించి యల్లనల్లనఁ బాదపల్లవంబుల సోఁకున వసుంధరావధూటి కానందం బొనర్చుచు నేతెంచి యన్నరనాథుం డుండు నున్నతమణిమయాసనంబునం గూర్చుండెఁ దదనుమతి నారాజకంఠీరవుండు నుపకంఠంబున నాసీనుండయ్యె నప్పుడు— 6

మ. వరభూషావళి మ్రోయకుండ నలఁతుల్గాఁ జామర ల్వీచు చొం
డొరులన్ సన్నల శైత్యకృత్యములకున్ యోజింపుచున్ లోచనాం
బురుహంబుల్ సదరస్మితంబులుగ సమ్మోహాబ్ధు లుప్పొంగి లో
గరుసుల్ మీఱఁగ నుండి రూరక కడంకల్ దక్కి లీలావతుల్. 7

క. స్మేరము లగు నిజనేత్రచ
కోరములు మునీంద్రవదన కుముదాప్తరుచిం
బారణలు సేయఁగాఁ బృథి
వీరమణుం డుండె వినయవినతాననుడై. 8

ఉ. ఆ సమయమ్మున న్మునిజనాగ్రణి కోమలదంతకాంతిరే
ఖాసుకుమారకేసరముఖస్ఫురదంబురుహంబు చూడ్కి కు
ల్లాసము చేయ నన్న కుశలంబె కుమారక యన్నఁ గౌతుక
శ్రీసముపేతుఁడై నృపతిసింహుఁడు చేతులు మోడ్చి యి ట్లనున్. 9

చ. త్రిభువనవంద్య మద్భవనదేహళి నీపదపంకజద్వయం
బభిమతలీలఁ దోకొనిన యప్పుడ ధన్యుఁడ నైతి సర్వమున్
శుభములె గాక యన్యములు చొప్పడునే భవదీయసత్కృపా
విభవవిశేషలబ్ధి పదివేల కనం[5] గుశలంబె నా కిఁకన్. 10
 
క. మునినాథ మీపదాబ్జముఁ
గనుఁగొనుట న్నన్ను ధన్యుఁగాఁ జేయుట ద
క్క ననఘ మఱి మీవచ్చిన
పని యన్యం బెద్ది పంచి పనిగొనవలయున్. 11

చ. అనవుడు లేఁతనవ్వు వదనాబ్జమున న్మొలతేర నాతఁ డి
ట్లను జననాథ లేవు మఱి యన్యము లెవ్వియు నాదురాకకుం
బనులు యథేచ్ఛమై భవనపంక్తులలో విహరించు నే నిలన్
వినినవిశేష మిప్పు డవనీధవ నీ కెఱిఁగింప వచ్చితిన్. 12మ. ధరణీనాథ ప్రసిద్ధ మిమ్మహి నయోధ్యాపట్టణం బప్పురిం
బరిపాలించుచు నున్నవాఁ డిపుడు శుంభత్ప్రౌఢబాహాబల
స్ఫురణం దాఁ గృతవర్మనా నృపతి యబ్భూపాలు గారాపుఁబ
ట్టి రమానందను రాజ్యలక్ష్మియనఁ బాటిల్లున్ మనోజ్ఞాకృతిన్. 13

గీ. దానిపేరు మృగావతి మానవేంద్ర
లాలితానన్యరేఖావిలాసలబ్ధి
నది మనోజాతు నాఱవయమ్ము వోలెఁ
జూడ్కులకు వేడ్క నొదవించుఁ జూపఱకును. 14

ఉ. ఆయెలఁదీఁగఁ బోఁడి వినయంబుఁ బ్రియంబు నిజాప్తకోటికిం
జేయుచుఁ దల్లిదండ్రుల కశేషమనోభిమతైకసిద్ధి నా
నాయతనంబులోనఁ దనరారుచు శైశవచాపలస్థితిం
ద్రోయఁగ నాఁడునాఁటికిని దూఁకొనె జవ్వన మంగవల్లికన్. 15

ఉ. భోగవిహారవాటి పరిపూర్ణకళామణిపేటి గర్వరే
ఖాగుణజన్మభూమి మదగౌరవమల్లఖళూరి బంధుహృ
ద్రాగరసాబ్ధి వేలరతిరాజమనోహరసిద్ధి యౌవన
శ్రీ గనుపట్టె మానిని కశేషవిలాసవిశేషలబ్ధితోన్. 16

సీ. నీలనీలంబులై నిటలభాగంబు కై
సేసిన కుంతలశ్రేణితోడ
భారభారంబులై బాహుమధ్యంబున
గిరిగొన్న గురుకుచగిరులతోడ
శోణశోణంబులై సుకుమారతాప్రౌఢిఁ
దనరెడు పాణిపాదములతోడ
నవ్యనవ్యంబులై నాసికాహ్లాదంబుఁ
బాటించు తనుసౌరభములతోడ
ఆ. నాతి యొప్పె యౌవనస్ఫూర్తిరోలంబ
వల్లరీలసత్ప్రవాళకుసుమ
సురభిగంధములను జూపట్టుచును[6] వైభ
వమున మీఱు పుష్పవల్లివోలె. 17ఉ. ఆయలినీలవేణికి మదాలసగామిని కివ్విధంబునం
బ్రాయము వృద్ధిగైకొనఁగఁ బల్మరుఁ గన్గొని దండ్రియాత్మలోఁ
జేయు విచార మీసమదసిందురయానకు నెవ్వఁడొక్కొ భూ
నాయకకోటియం దనుగుణంబగు వల్లభుఁ డంచు నెంతయున్. 18

క. అంతట నొకనాఁ డా సీ
మంతవతీమణి విహారమణిమయసౌధా
భ్యంతరమున మృదుశయ్య ని
రంతరసుఖలీల నిద్ర నందుచు నుండన్. 19

మ. కలలో నాకలకంఠి నంబుజముఖిం గన్యాలలామం బ్రియం
బలరం డగ్గరి యొక్కదివ్యపురుషుం డావేళ చేనున్న యు
జ్జ్వలపుంజిత్రపటంబుఁ జూపి సతి యీక్ష్మాపాలు వీక్షింపు మో
పొలఁతీ యీతఁడు నీకు భర్త యనుచుం బోయెం దిరోధానమై. 20

ఉ. పోవుడు నంతలోపలనె భూవరనందన మేలుకాంచి య
బ్భావభవోపమానుఁడగు పార్థివనందను చిత్రరూపమున్
భావములోనఁ దార్కొలుప భావభవుం డది సందుగాఁ దనుం
గేవలనిర్దయుం డగుచుఁ గెందలిరమ్ముల పాలు సేయఁగన్. 21

క. కలవలపడుచు మృగావతి
కల మును గనుఁగొన్న రాజకందర్పుని యు
జ్జ్వలమూర్తి నెమ్మనంబునఁ
బలుమఱుఁ గనుఁగొనుచు రాగపరవశ యగుచున్. 22

ఉ. ఎక్కడి వేధ వచ్చెఁ బరమేశ్వరుఁ డేమి ఘటించె మాయనే
నెక్కడ యక్కుమారవరుఁ డెక్కడ లే దిది యన్న నిక్కువం
బిక్కల మర్లు గొల్పి విధి యీక్రియ వాఱడి వంతలం దనుం
జిక్కులఁ బెట్టి పూవిలుతు చేత[7] నలంప దలంపు సేసెనో. 23మ. అని బిట్టూర్పుచుఁ[8] బోటికత్తియలతో నామాట జెప్పంగ సి
గ్గున వంచించుచు నన్వహంబు మదిఁ గొర్కు ల్మూరిఁబోవంగ ని
ల్చినచో నిల్వఁగరాన వేదనలచేఁ జీకాకునం బొందుచున్
వనజాతాయతనేత్ర యుండె మదనోన్మాదంబు రెట్టింపఁగన్. 24
 
వ. ఆ సమయంబున— 25

వసంతర్తువర్ణనము


మ. విరహగ్లానికరంబు భూజనసుఖావేశంబు నానావనీ
తరువల్లీతనుసిద్ధి షట్పదసముత్సాహంబు నిర్జీవిత
స్మరసంజీవనసిద్ధవిద్య పికవాఙ్మానవ్రతోద్యాపనం
బరుదెంచె న్మధుమాస మంచితలతాంతామోదితాశాంతమై. 26

సీ. కోకిలకాకలీకోలాహలంబుతోఁ
బొలుపొందె మాకందభూరుహములు
మధుమత్తరోలంబమధురస్వనంబుతో
భాసిల్లె పున్నాగపాదపములు
కుసుమసౌరభభరాలససమీరములతోఁ
గనుపట్టె వాసంతికాగృహములు
వాచాలమదకీరవాచారవంబుతో
దీపించె బరువులై తియ్యమావు
గీ. లలరుఁ దేనియజ ల్లేరులై గమించె
రాలి పుప్పొడి సైకతరాసు లయ్యె
నిఖిలవనికాభినవరామణీయ మగుచు
వసుధఁ జెన్నొందు మధుమాసవైభవమ్ము[9]. 27
 
మ. పునరుజ్జీవనమంత్రముల్ మృతమనోభూభూమిభృన్మౌళికిన్[10]
స్తనితంబుల్ మధుదుర్దినంబులకు భాస్వత్సామిధేనుల్ వియో
గినికాయస్మరవహ్నికిన్ మధమహీక్షిత్సేనకుం గాహళుల్
వినవచ్చెం గలకంఠకూజితము లుద్వేలంబులై తోఁటలన్. 28సీ. జొంపంబులై కెంపుసొంపు సంపాదించు
చిగురాకు లెఱనింగిసిరి ఘటింప
శ్రేణులై యుద్యానసీమల కేఁగు కీ
రము లైంద్రచాపవిభ్రమ మొనర్ప
మూఁకలై యెలమావి మోఁకలపై వచ్చు
కొదమతేఁటులు[11] మొగుల్ గుములఁజేయ
సోనలై వెలువక జోరునఁ గురియు గ్రొ
వ్విరులతేనియ లతివృష్టి గాఁగఁ
ఆ. గొనలు మీఱి మీఁదికినిఁ బ్రాఁకు నవలతా
వలులు వానకాలవైభవంబు[12]
నంతరింప నవ్వసంతాగమం బంబు
దాగమం బనంగ నతిశయిల్లె. 29
 
మ. అలి ఝంకారరవం బుపాంగనినదంబై యింపుఁ బాటింపఁ గో
కిలబాలాకమనీయకోమలకుహూగేయంబులం గూడ మం
జులమందానిలనర్తకుండు మదనక్షోణీశు మ్రోలం గళల్
విలసిల్లె మధువేళఁ జూపె వనవల్లీలాసికాలాస్యముల్. 30

శా. ధమ్మిల్లంబుల బొండుమల్లియవిరుల్ దైవాఱఁ బాలిండ్లపైఁ
గమ్మందావుల పొన్నమొగ్గలసరుల్ గంపింప లీలారసం
బిమ్మై మీఱఁగఁ గర్ణపర్వములుగా హిందోళరాగంబులన్
సమ్మోదంబునఁ బాడిరందు వదనల్ చంచల్లతాడోలలన్. 31

గీ. విరియు బొండుమల్లెవిరులలో నెలదేంట్లు
వ్రాలి చూడ్కి కుత్సవం బొనర్చె
విషమశరుని రాజ్యవిభవంబు వనలక్ష్మి
కన్నువిచ్చి చూచుచున్న మాడ్కి. 32మ. కలకంఠస్ఫుటకంఠకాహళులతో గర్వించు రాచిల్కతే
జులతో గేకిమదేభబృందములతో శుంభద్ద్విరేఫావళీ
బలసంఘమ్ములతోడ వచ్చి విడిసెం బర్యంతకాంతారవీ
థులఁ జైత్రాగమయామ్యదిక్పవనముల్ తోరా మరుం డుద్ధతిన్. 33

క. ఈగతి మధువిభవైకస
మాగమ మొ ప్పగుచు నుండ నత్యంతమనో
వైగుణ్యంబున నయ్యెల[13]
నాగదశల్ మేన నాఁడునాఁటికిఁ బొదలన్. 34
 
చ. చెవి కవతంసపల్లవవిశేషము చేయఁగ గండపాళికం
జివురును బోని మించుటఱచేయి ఘటించి మొగంబు వంచి గా
రవమున దాది పిల్చినఁ[14] బరాకునఁ బల్కనెఱుంగ కమ్మహీ
ధవసుత[15] యుండుఁ గొంతవడి ధాత్రిఁ బదాంగుళి నల్ల వ్రాయుచున్. 35
 
చ. నెలవులఁ బాఱు లేనగవు చెక్కులపైఁ దళుకొత్తఁ గుండలా
మలమణిదీప్తులం బెనఁగి మాటికిఁ జిత్రితగంధసారకో
మలనవపత్రవల్లికల మానితవిభ్రమ మావహింప[16] నౌఁ
దలఁ గదలించుచున్ వికచతామరసేక్షణ యూర్చు నెవ్వడిన్. 36
 
ఉ. బాలిక ప్రొద్దుపోకకయి పాటకుఁ[17] జొచ్చి పసిండివీణియం
గేలఁ దెమల్చి తంత్రులు బిగించి నఖంబుల మీటి యింపుమై
నాలతి సేసి పాడుఁ బ్రమదాశ్రుకణంబు లురోజపాళిపై
రాలఁగఁ జాలఁ గోకిలవిరావవిరోధితకాకలీశ్రుతిన్. 37ఉ. ఏమని చెప్పవచ్చు ధరణీశ్వర తత్తమతాపగౌరవం
బామదిరాక్షి మేన నిగురారెడు[18] తాపభరంబునన్ గృహా
రామ(సమీరముల్ సెగలుగ్రక్క వనీస్థలి కేఁగె నెచ్చెలుల్
నేమఱుఁబోకు పోకు మని) పెక్కుతెఱంగుల బుద్ధి చెప్పి(నన్).[19] 38
 
ఉ. జీవము వచ్చి చైత్రరససిద్ధిఁ దగ న్నడయాడు కమ్మఁ బూఁ
దీవలప్రోవులో యన రతిప్రియమూర్తి మదస్త్రవిద్యలో
వావని కాదిదేవతలొ నాఁ దను గూడి విలాసవిభ్రమ
శ్రీ వెలయించి రింపెసఁగఁ జేడియ లవ్వనమెల్లఁ దారయై. 39

సీ. మొకరితుమ్మెద మూతి ముట్టని నవకంపుఁ
గ్రొవ్విరుల్ మేలేర్చి కోసికొనుచు
గండుఁగోయిల నోరఁ గమిచి త్రుంపని మంచి
చెలువంపులేఁబొరల్[20] చిదిమికొనుచు
బికకీరములు నాలిఁ బెనఁగి మూచూడని[21]
తనిగమ్మపండులు దరిగికొనుచు
నొలసి తెమ్మెరలు తావులు గమ్మరింపని
వఱు పూఁదేనియల్ వడిచికొనుచు
తే. భానుకిరణంబుచే నంటుపడని పుష్ప
కేసరంబులుఁ బుప్పొడికిసలయంపుఁ
బుట్టికలఁ బెట్టికొనుచు నింపులు దలిర్ప
సమదగజగామినులు కేలి సలిపి రపుడు. 40సీ. తిలకంబుఁ గృగంటఁ దేరిఁజూచుచుఁ గేల
నలవోక యెలమావి నంటికొనుచుఁ
బొలుచుప్రేంకణముల పొంతఁ బాడుచు సారె
చిఱునవ్వు పొన్నపైఁ జిలికికొనుచుఁ
బొకడపై మద్యంబు పుక్కిలింపుచుఁ బాద
తలమెత్తి కంకేళి దాచికొనుచు
సిందువారమ్ముల చెంతల నూర్చుచుఁ
గొండగోగులనీడ గొణఁగికొనుచు
తే. నెమ్మిఁ గౌఁగిటఁ గ్రోవి మన్నించికొనుచు
హేమపుష్పంబుమ్రోల మో మెత్తికొనుచు
నల్ల విహరించె విరులాస నతివయోర్తు
విటుల ధనమాన భ్రమియించు వేశ్యవోలె.41

చ. తనియఁగఁ బూచె నొక్క సతి దన్న నశోకము నవ్వఁ బొన్నయుం
గనఁ దిలకంబు ముట్ట సహకారము పల్కుల గోఁగు పాటఁ బ్రేం
కణ మదలింపఁ జంపకము కల్లుమియ న్వకుళంబు కౌఁగిటం
బెనుపఁ గురంటకం బలత పెంపున[22] నూర్చఁగ సిందువారమున్. 42
 
మ. మెడహారమ్ములు దూలఁ గుండలరుచుల్ మీటింపఁ జెక్కిళ్ళపై
బడుగున్గౌను వడంక నొండొకటితోఁ బాలిండ్లు రాపాడఁ గ్రొ
మ్ముడి వీడంగఁ బదాంగదంబు లులియ న్మున్నాడి పూఁబోఁడులం
గడవంబాఱి యొకర్తు గోసె మదివేడ్కల్ మూరిఁబోఁగ్రొవ్విరుల్. 43

చ. కురు లలిపంక్తి చేతులు చిగుళ్ళు దరస్మితముల్ ప్రసూనముల్
గురకుచకుంభము ల్గుసుమగుచ్ఛము లంగము పూవుఁదీఁగె మైఁ
దొరఁగు శ్రమాంబుపూరము మధూళిక యన్ విచికిత్సఁ జేయఁ జూ
పర కొకలేమ గోసెఁ గనుపట్టు వనాంతలతాలతాంతముల్[23]. 44
 
వ. మఱియును— 45సీ. కట్టిన పూవన్నెపుట్టంబు కెంజాయ
కమనీయసాంధ్యరాగంబుఁ గాఁగ
ముడివీడి వ్రేలు క్రొమ్ముడి సోగవెండ్రుకల్
కడలొత్తు చిమ్మఁజీకటులు గాఁగ
నురవడి నూఁగుచో నుప్పరం బెగయు ము
క్తాహారములు తారకములు గాఁగ
నిగుడుకాంతులతోడ నెమ్మోము నెత్తమ్మి
పరిపూర్ణచంద్రబింబంబు గాఁగ
గీ. వికచలోచనరుచులు చంద్రికలుఁ గాఁగ
యామవతియను విచికిత్స నావహింప
నతివ యొక్కర్తు తీఁగయుయ్యాల నూఁగె[24]
నింపు లిగురొత్త నొకపొదరింటిలోన. 46
 
ఉ. అందపుఱెప్పలం జెమట నంటిన పుప్పొడియున్ మొగంబునం
జిందిన పూవుఁదేనియల చిత్తడియున్ వెడజాఱు వేనలిం
జెందిన పుష్పకేసరవిశేషములున్ సిరిఁ జేయఁ గోసె రా
కేందునిభాస్య యోర్తు పొదరిండులు సొచ్చి ప్రసూనగుచ్ఛముల్. 47

చ. బలువిడి పయ్యెదం దొడిసిపట్టుచు నేర్పునఁ బాయఁద్రోయ వే
నలిఁ గబళించుచున్ మెలపునం గడకొత్తినఁ గొంగువట్టుచుం
జలమునఁ గంటకంబు దిగుచందమునం దను నాఁగఁగా లతా
నిలయము సొచ్చి కొసె నొకనీరజలోచన కమ్మక్రొవ్విరుల్. 48

సీ. పదపాణితలముల పగదలంచియుఁ బోలెఁ
దలిరుటాకుల బాదుఁ దలలువట్టి[25]
మేనిమార్దవముల మెఱపు తప్పును బోలె
విరు లూఁచముట్టుగా వెదకి త్రుంచికెమ్మోవి కెన యను కినుకఁజేసియుఁ బోలెఁ
దనిగమ్మఁబండులు దరిచివైచి
పలుకుసారస్యంబు పచరించు నని పోలెఁ
బూవుఁదేనియ మూరిఁబోవ విడిచి
ఆ. యొప్పు మేనుఁదీఁగె కుపమాన మని పోలె[26]
వఱలు లతల యార్జవంబుఁ జెఱచి
వనముఁగలయ నన్నివంకలఁ దానయై
కేళి సలిపె నొక్క కిసలయోష్ఠి.
 
సీ. చెలులఁ గేలికిఁ జేరఁ జీరుచోఁ బలుకాంతి
భ్రమరసంచారవిభ్రమముఁ జేయ
నలఁతమై యూర్చుచో నడరునిట్టూర్పుల
తావి తావికి వింతతనముఁ జేయ
...................................
..........................
.................................
........................[27]
ఆ. కోయఁబూని నట్టి కుసుమంబుఁ గోయక
మగుడఁ దిగుచు నెగుచు[28] మాటిమాటి
కించుకైన నాత్మ నిదియను నిశ్చయం
బూననేర కొక్కయుత్పలాక్షి. 50
 
వ. మఱియుం బెక్కువిధంబుల నవ్విలాసిను లివ్విధంబున విలాసంబులు నెఱపుచుఁ గుసుమంబులు గోసి యంతఁ గేళి చాలించి వచ్చి కమలకల్హారకుముదకవలయామోదమేదురదశదిశాభాగంబును నిష్యందమరందధారాబిందుతుందిలమదవదిందిందరసందోహక్రియాసంకులంబును దనువాతూలచాలనాచరితవీచీడోలాకేళీవినోద(వి)హా(రా)లోలమరాళమిథునంబును గోకకోయిష్టికక్రౌంచకారండవప్రముఖనిఖిలజలపక్షిపక్షవిక్షేపణాక్షీణవిరాగవిరాజితసైకతస్థలంబును నిరంతరవలమానమీనవాలమూలాక్షే(ప)[29]ణక్షిప్తవారిశీకరాసారసంవర్ధితప్రతీరతరులతావితానంబును నగు నొక్కసరోవరంబు సమీపస్థలంబునఁ గుసుమఫలకిసలయకేసరమయపాదికంబులగు తమకొనివచ్చిన శిశిరద్రవ్యంబులు మారుగట్టుమణుంగులునుం బెట్టి స్వేదాపనోదనార్థంబు జలావగాహంబులకుం గడంగి పద్మాకరంబు ప్రవేశించి— 51

జలకేళివర్ణనము


సీ. పదతలంబుల కోటుపడియుఁబోలె విలోల
జలచరంబుల సరోజములు వడఁకఁ
గలికికన్నుల సోయగమున కుల్కియుఁ బోలె
జలచరంబులు వెఱచఱవి పఱవ
నొప్పుఁగుంతలముల కోహటించియుఁ బోలె
నెలఁదుమ్మెదలు మీఁది కెగసి మ్రోయ
గతివిభ్రమములకు గళవళించియుఁ బోలె
బెదరి రాయంచలు రొదలు సేయ
తే. బిగువుఁ జన్నుల కలిమికి బెగడివోలెఁ
దలఁకి జక్కవ లిసుకతిప్పలకుఁ జేరఁ[30]
గొలను గలయంతయును గలగుండు వెట్టి
యెలమిఁ గ్రీడించి రపుడు రాకేందుముఖులు. 52
 
సీ. తోరంపు వలిచన్నుదోయి సోయగమునఁ
దమ్మిమొగ్గలమీఁద దాడివెట్టి
కలికిబిత్తరికన్నుఁగవ విభ్రమంబుల
నిందీవరముల పెంపెల్లఁ జెఱచి

పొలుపొందు నగుమొగంబుల చక్కఁదనమున
నవజాతముల గౌరవం బెడల్చి
తేలుక్రొమ్మించు వాతెఱల చెల్వంబున
బంధుమీనముల బారిసమరి
తే. మొలకనవ్వుల బిబ్బోకములఁ గరంబు
విచ్చుకెందమ్మివిరులపైఁ బెచ్చు లుడిపి
లీలవర్తించునట్లు నాలీకముఖులు
సంభ్రమమున జలక్రీడ సల్పి రపుడు. 53

వ. అనంతరంబ— 54

సీ. ప్రథమంబునను జోపువడిన రాయంచల
గను బాహూబనములఁ గ్రమ్మఱింప
మును మీఁది కెగసిన మొకరితుమ్మెదలను
మొగముఁ దమ్ముల తావి మగుడఁ బిలువఁ
గడముట్టఁ జిదిమిన కలువక్రొవ్విరులను
దెలిచూడ్కిగమి పునఃస్థితికిఁ దేరఁ
బొంకులు వెడలిన పులినవేదికలను
పృథునితంబంబంబులు పెద్దసేయఁ
తే. గేళి చాలించి పరిపరిలీల లడర
జన్మకాలంబునను దుగ్ధజలధి వెడలి
వచ్చు నయ్యప్సరోంగనావలియుఁ బోలెఁ
గమలలోచన లంబుజాకరము వెడలి. 55

మ. దరులం బెట్టిన మాఱుఁ గట్టుమణుఁగుల్ తన్వంగు లుల్లాసముల్
మెరయం బింజలువోసి కట్టి వెస ధమ్మిల్లంబు లింపొందఁ గ్రొ
వ్విరులం గూడఁగఁ దీర్చి మేలితొడవుల్ వేవేగఁ గైచేసి చి
త్తరువుల్ వోలఁ దనూవిలాసరససౌందర్యంబు లుప్పొంగఁగన్. 56

వ. శంబరారాతి నారాధింప సమకట్టి. 57

మదనారాధనము


సీ. ఎండ క న్నెఱుఁగని యెలమావిమోఁకల
నడుమఁ జెన్నొందు పున్నాగవిటపి
క్రిందఁ జల్లనినీడఁ గెందలిరాకులఁ
జేసిన చారుసింహాసనమున
రతిదేవితో వలరాజు నామంత్రించి
యొప్పు నంభోజకుంభోదకముల
నభిషేక మొనరించి యందంద కడివోని
పూవుటెత్తులఁ జాలఁ బూజసేసి
తే. మొకరితుమ్మెదచే మూఁతి ముట్టఁబడని
విరులఁ గమ్మనితేనె నైవేద్య మిచ్చి
ముదిత లెల్లరు సాగిలిఁ మ్రొక్కి లేచి
మోడ్పుఁజేతులు ఫాలముల్ మోపి నిలిచి. 58

చ. మనసిజ పంచబాణ యసమానపరాక్రమ నీదు విక్రమం
బనుపమ మంతకాంతకుని యంతటివాఁడును బారుపంతమై
నిను ననిఁ దెంపుమైఁ గదియనేరక నేఁడును నీళ్ళుమోవఁగా
జను లొక లక్ష్యమా కుసుమసాయక నీపటుబాణశక్తికిన్. 59

సీ. వనజాతభవు నంతవాఁడును నీయాజ్ఞ
కేమని చెప్ప నోరెత్తవెఱచుఁ
గనువిచ్చి నిను నాజిఁ గనుఁగొను నంతనే
మృత్యుంజయుని తలమీఁద వచ్చె
మదికి వ్రేఁగై యుండు మధుకైటభారికి
వర్ణింప భవదీయవర్తనంబు
వేయేల పొగడ నీవిభవ మింద్రునియంత
వానిఁ జేసితి డాఁగువానిఁ గాఁగ
తే. మఱియుఁ బెక్కులు గలవు నీమహిమ లెన్న
నిట్టి నీపెంపుఁ గొనియాడ నెవ్వఁ డోపు
నాత్మ మాచేయు నర్చన నాదరించి
వఱలుకృపఁ జూడుమా చంద్రవదన మదన. 60

సీ. మదన మా రాకేందువదన కుంతలములు
భ్రమరంబులకు బ్రోచు[31] బలగ మౌట
గుసుమాస్త్ర మా నీలకుంతల కంఠంబు
కలకంఠముల కేడుగడయు నగుటఁ
గందర్ప మా గంధగజయాన పలుకులు
శుకరాజికినిఁ గూర్మిచుట్ట లగుట
వలరాజ మా మానవతి మందగతు లంచ
బోద నెత్తురుఁబొత్తు లగుటఁ
తే. బుష్పకోదండ మా పూవుఁబోఁడి బొమ్మ
లయ్య నీతియ్యసింగిణి కనుఁగు లగుటఁ
దలఁచి దయతోడఁ జూడు మా తలిరుఁబోఁడి
నింతి నీమన్ననకుఁ బాత్ర మెన్నియెడల. 61
 
సీ. బలభేది గౌతముభార్యకై నడురేయిఁ
గోడిఁ గావించిన ప్రోడతనము
కుముదబాంధవునకు గురుకళత్రంబుపైఁ
గనుమరుల్ గొలిపిన కలికితనము
మధువైరి నాభీరమానినీమణులకై
జారుఁ జేసిన యట్టి జాణతనము
కమలగర్భునకును గారాపుఁగూఁతుపై
వలపునించిన ప్రౌఢవర్తనంబు
తే. శక్తి నెయ్యంపుసుతుఁ బరాశరుని దాశ
నందనకు జాలిగొలిపిన నైపుణియును
నీక కా కెవ్వరికిఁ గల్గు లోకములను
వినుత గంధర్వ గీర్వాణ విషమబాణ. 62

ఉ. ధారుణి తేరు మేరుగిరి ధర్మమహీంద్రుఁడు నారి బాణ మం
భోరుహనాభుఁ డయ్యుఁ బురముల్ గుఱి మూఁడఁట రాజమౌళికిం
దేరు శుకంబు వి ల్చెఱకు తేఁటి గుణం బల రంపకోల నీ
కారయ ముజ్జగంబు గుఱి హా హరుఁ డె ట్లెన నీకు మన్మథా. 63మృగావతి చెలికత్తెలు చైత్రాదులఁ బ్రార్థించుట


వ. ....మనోభవుఁ గొనియాడి యనంతరంబ— 64

సీ. ఎలమావిమోఁక నా ప్రాణముల రాచిల్క
బోద తేనెల కేపు పూఁవు కొలిపి
చిగురాకు మెత్తలచే[32] గోకిఁలలకు
.......పల్కులు వీడుకోలు చేసి
నళినాకరోన్నాక ...నాళములచే
నాఁకలి దీర్చి రాయంచగమికి
గురియుతేనియలచేఁ గొదమతేంట్లను వేన
వేలు ......... మదవృద్ధి నెఱప
ఆ. వంతుపనుల కేడుగడయును వీతయై
యునికిఁ జేసి కాదె మనసిజుండు
సబలుఁ డగుచు భూరిజయరమాసిద్ధులు
గాంచి యిట్లు నునికిఁ గనుట చైత్ర. 65
 
సీ. మధుశీదురసముల మధుపయోగినులకు
భుక్తి గావించిన పుణ్యమునకుఁ
వేదద్విజశ్రేణికిం దియ్యనౌ పండ్లఁ[33]
దృప్తి నొందించు సత్కృత్యము
మాకందతరు(ల)తో మాధవీలతికల
నొనగూర్ప నేర్పిన యున్నతికిని
బరభృతంబులకు వాగ్బంధనంబులు మాన్ప[34]
పలుకనేర్పిన సుహృద్భావమునకుతే. నిన్నిటికిఁ (సతతంబు)[35] మా యిందువదన
ప్రాణములు గాచి రక్షింపు భావభవుని
నెఱుఁగ నే మెంతనాడు బాయుచువీరులు
సావడిని బేరుగలవాఁడ వనిన చైత్ర. 66
 
ఉ. ప్రాణుల యంతరంగ..... ప్రాణంబవై యుం.....చుంటన్ జగ
త్స్రాణుం........బేల నినుం బల్కుదు రం.....జనంభవాది గీ
ర్వాణులు నీకు నిట్టి గుణవంతునకుం దగునయ్య మాచెలిం
బ్రాణము లెత్తుకోలుగొను పాతకమున్ మదిఁ బట్టి కూర్పఁగన్[36]. 67
 
సీ. జననంబు చందనాచలమ నీ కబలపై
నకట వేఁడిమిచూప నర్హమగునె
ప్రాణంబవై యుండి ప్రాణికోటికి బాల
ప్రాణంబుపైయల్క[37] పాడియగునె
నియమ శాంతులలోన నిహితమైయుండుదు[38]
నలివేణియెడఁ గ్రోధి వగుట తగునె
యూరక యొకమూల నొదిగియుండెడి నీకు
నువిద నారడి బెట్టు టుచిత మగునె
తే. యెన్నివిధముల నీ విధం బెన్నిచూడ
లోకహితమయ్యు మా లోలలోచనకు న
హితము సేయుట సతిభాగ్య మేమి సెప్ప
జనహితాణాం దక్షిణాశాసమీర. 68

మ. కలశాంబోనిధి కూర్మిపట్టిని రమాకాంతాలలామంబు గా
దిలి సోదర్యుఁడ నద్రిజాపతి శిరోదీవ్యన్మరుద్రత్నకం
దళి వీ వంగము కేవలామృతసోదారంబు నీ కర్హమే
దళదిందీవరనేత్ర ని ట్లలఁపఁ జంద్రా యామినీవల్లభా. 69మ. జగదానందనకారణంబ వగు నీ చంద్రాఖ్యఁ బాటింతు నీ
కగునా మా యబలన్ శశాంకముఖి నాయాసంబు నొందింపఁగాఁ
దగునా యోషధిభర్త వయ్యును లతాతన్వంగి నిట్లేఁప లో
కగరిష్ఠుండవు[39] చందమామవలె నాక్రౌర్యంబు మా బాలపైన్. 70
 
గీ. కువలయానందకరుఁడవు భువనవంద
నీయుఁడవు నీవు నేరము నిన్నుఁ బొగడ
నబలలము మేము మమ్ముల నాదరించి
చెలువఁ జలిగాలఁదన్ని[40] రక్షింపు చంద్ర.
 
మ. చది ధాత్వర్థము నీకు సార్థ మగుటం జంద్రాఖ్యఁ బాటింతు నీ
యుదయం బభ్యుదయైక హేతువయి సేయున్ వార్ధికానంద సం
పద నీ కాయము కేవలామృతరసప్రాయంబు నీ రాకలం
బొదలున్ లోకము చంద్ర ని న్బొగడ మాబోం ట్లెంతవారల్ మహిన్. 72

సీ. కలహంసలార మా కలహంసగమనకు
గతిమీరి యీబారి గడపరయ్య
కీరంబులార మా కీరసంభాషణ
పలుకులు ముద్దుగాఁ బట్టరయ్య
మధుపంబులార మా మధుపనీలాలక
కొప్పు దప్పిడక మేలొందుఁడయ్య
కలకంఠులార మా కలకంఠిఁ గన్నెఱ్ఱ[41]
వారిచూడక యాఁచి పలుకరయ్య
ఆ. ధన్యులార పుష్పధన్వు సావడిఁ బేరు
పడిన యట్టి వీరభటవరేణ్యు
లార మా యొనర్చు భూరిసంప్రార్థన
లాదరించి కావరయ్య చెలిని. 73
 
వ. అని మఱియును— 74శిశిరోపచారములు


సీ. కోకిలంబుల కేటికో ళ్ళిత్తు మిభరాజ
గామిని కీబారి గడచెనేని
యెలమావులకుఁ జేతు మెలమి జాతర లిందు
ముఖి నేలఁ బాదంబు మోపెనేని
బొండుమల్లెల బోనములు వోతు మళులకు
బదఁలి యీసారెకు బ్రతికెనేని
కీరసంతతికిఁ జక్కెరకాన్క లొసఁగుదు
మలివేణి ప్రజలలోఁ గలిసెనేని
తే. యనుచు గోకిలమాతపోతాళికీర
విసరమున కిట్లు వేవేలు విధుల మ్రొక్కి
సంభ్రమంబున నా సరోజాతముఖులు
చెలువశిశిరోపవిధు లిట్లు సేయఁగడఁగి. 75

సీ. తనుగాడ్పు దూరని దట్టంపు లేమావి
మ్రాఁకుల నడిమి యీరమునఁ జంద్ర
కాంతంపుమణులచేఁ గట్టిన కుట్టిమ
స్థలి బాలకర్పూరతరులు దెచ్చి
కంబముల్ పరుపులు గావించి పై నంద
ముగ లేఁతమరువంపుమొలక ద్రిప్పి[42]
తిరిగిరా నెలదమ్మి విరుల రేకులతోడ
దవనంపుఁబొరకల దళ్ళు గట్టి
తే తమ్మిపూఁదేనెఁ దడిపి చందనము మెత్తి
కలయ నంతట సిరిపచ్చకప్పురంబు
నెఱపి వివిధాంతరములుగా నేర్పు లలర
సఖులు గల్పించి రపుడు పూఁజప్పరంబు.సీ. మేలి గొజ్జంగిపూ మేలుకట్టునఁ గూడ
సతియోర్తు మత్యాలచవికెఁ గట్టె
సన్న సున్నము సేసె సతి యోర్తు చందన
కర్దమంబునఁ గరకావితర్ది
కాంత యొక్కతె గాజకంబాన ఘటియించె
నొప్పుకప్పురముల నొరఁగుటరఁగు
తరుణి యొక్కతె చేర్చెఁ దలిరాకు పాన్పుపై
విరిక్రొత్తచెంగల్వ విరితలాడ
తే. కదలికాగర్భదళభస్త్రికాహిమాంబు
నికరముఖమున నాడించు వ్రేలఁ ద్రుంచి
పట్టునట్టుగ నొకలేమ పట్టెనెదుటఁ
జారుశశికాంతమణిశిలాసాలభంజి. 77

ఉ. కాంతయొకర్తు సన్నె[43] బిసకాండములం గుసుమాంబుదీర్ఘికా
ప్రాంతమునందుఁ బ్రోదికలహంసలఁ బూనెడి వారియంత్రముల్
వింతగ గాజగంధమున వెల్వడి చందనసౌధవిథికా
భ్యంతరచంద్రపుష్కరిణియందుఁ బడన్ పడి వారిపూరముల్. 78
 
ఉ. చందనగంధియోర్తు ఘనసారముఁ గెఱ దీర్చి లోనలిం
జెందొగఱేకులన్ రసులు చేర్తి బిసప్రసవంపు మొగ్గలం
బొందుగఁ దూములిడ్డహిమపూరతటాకము క్రింద లీల నా
టె దగ దమ్ముసేసిన పటీరములో మరువంపుమొగ్గలన్. 79

చ. వికసితమాధవీభవనవీథిని నిర్మలచంద్రకాంత వే
దికపటిఁ గొత్త(లేఁ) బొరలఁ దీర్చిన పానుపుమీఁద ఫుల్లహ
ల్లకదళరాజి విచ్చి మదలాలసగామిని యోర్తు చల్లెఁ గొం
చక హిమవాలుకామిళిత చందనశీతలవారిపూరముల్. 80చ. పలుమఱు సన్నగాని నలినం...........ని
ర్మలహిమపూరముం జిలికి మర్దనలంగొని ముత్తెం....జి
ప్పల నిడి పచ్చకప్పురపుఁ పల్కులతో .............
జలువకుఁ బెట్టె నొక్కజలజాతవిలోచన గంధసారమున్. 81

సీ. లేమ యొక్కతె చేసె లేఁతకెంజిగురు
జొక్కంపు...........................
నీలకుంతలయోర్తు నీలోత్పలంబులం
గలిగించె నీలా.......................
సురపొన్నమొగ్గలు సుదతియొక్కతె....
గ................................
వెలఁతయోర్తు సృజించె ..........
దీపించు వజ్రాల...................
తే. చామయొక్కతె బిసలయ.......
సన్న వలిపంపుదువ్వల్వ సంతరించె
బాలయొక్కర్తు హ్రీబేరమూలలో
సవరగాఁ జేసె సవరంబు సరసరీతి. 82

వ. ఇవ్విధంబున నవ్వధూబనులు సేయ ..... శిశిరంబులు సర్వంబును సమీచీనంబు గావించి నెచ్చెలి నచ్చటికిఁ గొనివచ్చు నెచ్చెలికలతోఁ జెచ్చెర నమ్మచ్చెకంటి యున్న పొదరింటిలో............ 83

ఉ. వాడినమోముతోఁ జివురు......తో.................నీవితో
వీడినకొప్పుతో వెడలు వెచ్చనియూర్పులతో నిదాఘముం
గూడినమేనితో నయనకోణ ముహర్గళదశ్రుధారతో
వేడుకలేది పూవిలుతువేదనలం బొరరాదు చేడియన్. 84

వ. కనుంగొని చేరంజని. 85

ఉ. అక్కట పాలపాపవు గదమ్మ మొదల్ తుది[44] లేని చింత నీ
    కెక్కఁడ గల్గెనమ్మ మరుఁ డెంతయు ద్రోహి గదమ్మ వేదనం
    బొక్కుట కోర్వవమ్మ[45] మును పోకలఁబోయి యెఱుంగవమ్మ మే
    మెక్కడఁ జొత్తుమమ్మ యిఁక నే క్రియఁ బారము చేరెదే చెలీ. 86
 
ఉ. ఇచ్చట నిన్ను నొంటి నిడి యేఁగినఁ బాపము మాకు దద్దయున్
    వచ్చుట నిక్క మమ్మ రతివల్లభుఁ డీశ్వరులోచనాగ్నిచే
    వెచ్చి యనంగభూతమయి వేమరు నీయెలఁదోఁటలోఁ గరం
    బిచ్చఁ జరించునన్న తలఁ పెవ్వరి కప్పుడు దోఁపదే చెలీ. 87

వ. అని పలుకుచు— 88

ఉ. అల్లన లేమఁ బట్టి మెయి నంటిన పుప్పొడిఁ బాయఁదట్టి ధ
    మ్మిల్లము చక్కదోపి వలిమించు చనుంగవఁ దారహారముల్
    మెల్లనఁ జిక్కు లోలి నెడలించి నితంబుమునందు నేర్పు సం
    ధిల్లఁగ జీరఁగట్టి సుదతీజను లెంతయు సంభ్రమంబుతోన్. 89

క. చిగురుంబోఁడికి రక్షగఁ
   జిగురు సురాళించి వైచి శీతాంశుకళం
   దెగడు చెలినొసలఁ దిలకం
   బుగు వడిఁ బుప్పొడి ఘటించి ముదము దలిర్పన్. 90

వ. పల్లవకోమల నల్లనల్లన నిజపాణిపల్లవంబులు కైదండ లిడుచు నడిపించుకొని వచ్చి మును చెప్పినచొప్పునఁ బూఁజప్పరంబులో నప్పటప్పటికిఁ గప్పురగంధులు పన్నీరు గుప్పళించి కిసలయతాళవృంతంబుల విసర నంతకంతకుం జలువ యెక్కి చల్లనై వడగల్లువలె నివతాళించు చంద్రకాంతశిలావేదిపైఁ బఱచిన చిగురాకుం బఱపుమీఁదఁ బువ్వుఁబోఁడిం బవ్వళింపఁజేసి శిశిరోపదకంబులు సేయందొడంగి— 91సీ. తలిరుఁగైదువుజోదుఁ దలఁచి పుప్పొడి పూవుఁ
బోఁడినెన్నుదుటిపై బొట్టువెట్టి
కొదమతుమ్మెదఁ బేరు గ్రుచ్చి క్రొవ్విరి బాల
కబరికాభరముపైఁ గదియఁజేర్చి
ప్రోడకోయిలలఁ దూపొడిచి లేఁజిగురాకు
లీలావతికి సురాలించి వైచి
యుదుటి కీరములపే రుగ్గళించి యనంట్ల
మేలి తీయనిపండ్లు మీఁదులెత్తి
తే. యించునెలదమ్మితూండ్లు రాయంచలకును
బక్ష్మలాక్షికిఁ జుట్టిరా బడిసి వైచి
యామినీభర్తకును జూపి హల్లకంపు
టలఁతి పూదండ పూఁబోఁడి యఱుతఁగట్టె. 92

సీ. మేన నంతట నొక్కమృగలోచన యలందె
కమనీయచందనకర్దమంబు
పడఁతి యొక్కతె సారె పన్నీరు చిలుకుచు
విసరెఁ బల్లవతాళవృంతములను
వేనలిజడయంటు విచ్చి పాపటమీఁదఁ
బూఁబోఁడి యోర్తు కప్పురముఁ జల్లె
విరితేనెఁ దడిపి క్రొవ్విరుల పరాగంబు
సకియోర్తు హత్తించెఁ జరణములను
తే. జెలువయొక్కర్తు తడిపె ముంజేతఁ గ్రొత్త
కమ్మనెత్తావి గొజ్జంగి కంకణంబు
తమ్మిలేఁదూండ్ల పుంజాలదండ యఱుతఁ
బెట్టె నొక లేమ యా చంద్రబింబముఖికి. 93

సీ. చేరుచోఁ దనువల్లి సెగలకు భయపడి
చిగురాకు లెడమాటు చేసికొనుచు
మేనంటుచో వేఁడిమికిఁ గాఁక సారెకు
మునివ్రేళ్ళు పన్నీట మోపికొనుచుఁ

దెరలుచెమ్మట సోఁకి కరము చుఱ్ఱనినచో[46]
................వ్రేళ్ళు ..ద్రించికొనుచుఁ
దుడుచుచో వెన్నెల తొలచి పొక్కినపట్లఁ
....................నుకొనుచుఁ
ఆ. గ్రాఁగి ................ముత్యాల
...........................
నప్రమత్త....................దాని
చెలులు ..................... 94

ఆ. ప్రాణసఖులు సారె పన్నీరు పైఁజల్లు
నపుడు బాడ నొప్పె నాలతాంగి
కాంచి ...................సెకలతోఁ
బొలుచు కుందనంపుబొమ్మ వోలె. 95

ఉ. వీనులు మేనగాఁ గడల వెల్పడు బాష్పపయస్సమృద్ధితోఁ
గానఁగనయ్యె బుధగజగామినికిం గనుదోయి కర్ణ పా
థోనిధులందునుండి తరితోడుత వెల్వడి బాష్పనిమ్నగా
హీనతరంగరాశి కెడ ........ వారిచరంబులో యనన్. 96

క. పానుపుపైఁ బొరలాడఁగ
మేనన్ నిరులంటి చమరిమృగలోచనకుం
గానఁబడెఁ గట్ట నేసిన
మానసభవు ప్రసవశరసమాజము వోలెన్. 97

ఆ. పద్మవదన మేనఁ బన్నీరు చల్లుచో
నసమబాణతాప మగ్గలించి
హవ్యవహునిమీఁద నాజ్యంబు సల్లినఁ
జల్లనగునె తేజరిల్లుఁగాక. 98ఉ. పూసిన పుష్పపాంసు ననభూతి విలేపములో సురఃస్థలో
    ద్భాసి బిసోరగారరణ పంక్తులలో జడగొన్నవేణితి
    నాసరసీరుహాక్షి వసుధాధిప యెంతయి నొప్పెఁ బుష్పబా
    ణాసనుమీఁది .....యన మహానటమూర్తి వహించెనో యనన్. 99

ఉ. ఇంకెడి పంకమధ్యమున నెండఁ దలంకెడు మీనువోలె నే
    ణాంకనిబాస్య యుండెఁ దలిరాకులఁ జేసిన పాన్పుపై సఖుల్
    శంకిల కప్పటప్పటి కలందిన చందనకర్దమంబులోఁ
    గ్రుంకి మనోజతాపమునఁ గుందుచు నుల్లము తల్లడిల్లగన్. 100

వ. అప్పుడు సఖీజనంబులు తమ సేయు హిమోపచారంబు లనలంబునం బోసిన యాజ్యాబిధారలుంబోలె నై యగ్గజగామిని మేని యగ్గి యగ్గలం బగుటకు బెగ్గిలి కళవళుం సమయంబున నొక బోటికత్తియ యక్కిసలయానన మేని యవస్థాంతరం బుపలక్షించి వారితో నిట్లనియె. 101

ఉ. చందన గంధసార ఘనసారములన్న భయంబు నొందెడిం
    గుందెడు పువ్వులన్న మదిఁ గొంకెడిఁ బుప్పొడియన్న లోఁగెడిం
    గెందలిరాకులన్న సరసీరుహలోచన నేఁటి చందముల్
    కుందసుగంధులార! కనుగొంటిరె యేటికి శైత్యకృత్యముల్. 102

ఉ. కంజదలాక్షి నిన్నఁ గరకంజమునం జిగురూఁది వేడ్కఁ జూ
    డ్కిం జనుదోయిమీఁదఁ దులకించిన భావము నిట్లకాదె యీ
    కుంజరరాజయాన కుచకుంభములం జిగురాకు తూలికన్
    మంజువిలాసవిభ్రమసమంచితునిన్ మరు వ్రాసెఁ జూడరే. 103

ఉ. పోయెద నంచు లేచి తలపోసి మదిం దుదిలేను నెవ్వగం
    దోయలి గప్పెఁ గన్నుఁగవ తొంగలిఱెప్పల వేఁడియూర్పుతో
    నీయలివేణి రూపయుతునెవ్వనినో కలఁగాంచి వానికై
    కాయజవేదనం బడెడుఁ గావలయుం బరికించి చూడఁగన్. 104

వ. ఇబ్బోటి భావంబు నీటిలో ముల్లె యున్నయది[47] మదిరాక్షిలోని తలం పెవ్విధబుననైన నప్పువ్వుఁబోఁడినే యడిగి తెలియక యిట్లు మిన్నక మన యుల్లంబులం దల్లడిల్లనేల యని యల్లనల్లన నప్పల్లవాధర పల్లవశయ్యం జేరంజని నిజపాణిపల్లవంబునం దను వంటి యిమ్మచ్చెకంటి నుపలాలించుచు. 105
 
ఉ. తల్లి భవన్మనోరధము ధర్మమె దాఁచుట మాకు నిట్లు నీ
యుల్లము చందముం దెలియనోపమికై దురపిల్లుచున్న వా
రెల్ల సఖీజనంబులు మృగేక్షణ నీమదికోర్కిఁ జెప్పి మా
తల్లడ మెల్ల మాన్పి విదితంబుగఁ బుణ్యము త్రోవఁ బోవవే. 106

ఉ. కన్నులు విచ్చి మమ్ముఁ జెలికత్తెలఁ జూడఁగదమ్మ యమ్మ నీ
యున్నవిధంబుఁ గన్గొనిన నుల్లము పొక్కెడినమ్మ యిందులోఁ
గిన్నెరకంటి నీకుఁ బరికింప నమిత్రల మెవ్వరమ్మ నే
మెన్నఁటికమ్మ[48] మాయెడ మృగేక్షణ సిగ్గువడంగ నేటికే. 107

ఉ. మచ్చికచేసి యేపనికి మాటిడకుండుటసూవె నెచ్చెలుల్
వచ్చి బహుప్రకారముల వద్దఁ జరించుచు నున్నవారు వీ
రొచ్చల[49] నీవు విరి నొకయోవని వారలఁజేసి యీక్రియం
బొచ్చెపు వర నన్ మరలుబుద్ధులఁ బోయినఁ జేరవత్తు రే. 108

ఆ. నీ మనోరధంబు నెలఁత నా కెఱిఁగింపు
మెంత కార్య మైన నే ఘటింతు
నీకు నే ననుంగు నెచ్చెలి నుండ నీ
ప్రసవశరుని బారిఁ బడఁగఁ దగునె. 109

చ. అని బహురీతులం బ్రియవయస్య తనుం బలుకంగ లోలలో
చన కనుదోయి విచ్చి యలసంబుగ నెచ్చెలి యాననాబ్జముం
గనుఁగొని కంఠకాకలికగద్గదికం దగులంగ నొయ్య ని
ట్లను నయనాంబుపూరము లపాంగములన్ నిగుడంగ నూర్చుచున్. 110

మృగావతి తాను కలగన్నవిధంబు చెలుల కెఱింగించుట


ఉ. పైదలి నీవు చెప్పు మని పల్మఱుఁ బల్కఁగఁ జెప్పకుండుటల్
కా దని చెప్పఁబూనుటలు గాని లతాంగి మదీయవాంఛకున్
లే దిది యిన్నమెఱి మది లేశమునుం దయమాలి దైవ మీ
నిందఁబెట్టి ప్రాణముల నెల్వడఁ జేయు దలంపులే చెలీ. 111

ఉ. ముద్దియ యెవ్వఁడో యెఱుఁగ మొన్నఁ బగల్ మణిసౌధవాటి నే
నిద్దురవోవ వచ్చి కల నిర్జరుఁ డొక్కఁడు చిత్రశాటి నా
యొద్దన వచ్చి రూపయుతు నొక్కనిఁ జూపి యితెడు నీకు నో
ముద్దియ వల్లభుం డవి సముద్ధతి నేఁగె వియత్పథంబునన్. 112

చ. నల నలకూబర త్రిదశనాథతనూజ మనోజు లాదిగాఁ
గల మహనీయరూపయుతగాత్రులఁ జెప్పఁగ విన్నదానఁ దో
యిలి యిట్టివారి చిత్రములు వందలు వ్రాయఁగఁ జూతురు గాని నా
కల గనుంగొన్న మూర్తివలెఁ గన్నుల కిం పొదవింపరే చెలీ. 113
 
క. కలరూ పడిగిన నీకుం
గల రూ పెఱిఁగింప కునికి గాదని మదిలోఁ
గల రూ పంతయుఁ జెప్పితిఁ
గలరూ పేర్పఱిచి పుణ్యగతి బొమ్ము చెలీ. 114

చ. తుది యిదియన్న నిశ్చయముతోఁ జని మాయపుఁ జిత్రరూపుపై
మదిఁ దగులంగఁ జేసి వెడమాయల దైవము నన్ను నీక్రియన్
మదనునిబారిఁ ద్రోచె మఱి మానముఁ బ్రాణముఁ బాపు చొప్పుగా
కిది ఫలసిద్ధి గాంచువలపే తలఁపంగఁ జకోరలోచనా. 115

క. కలఁగాంచిన చిత్రములకు
వలవంతలఁ జింతనొందు వా రెందైనం
గలరమ్మ తల్లి ధాత్రీ
స్థలిలో నే నొక్క పాపజాతిం దక్కన్. 116

చ. కలఁ గనుఁగొన్న చిత్రములఁగన్నిడి యు ట్లసమాస్త్రు చెయ్దులన్
నిరుపఱి తూలిన న్నగరె నీరజలోచన యెల్లవారు నా
త్మలఁ గడుఁ గుందరే సఖులుఁ దల్లియుఁ దండ్రియుణ బంధుకోటియున్
గులమున కివ్విధంబు సమకూర్పదె[50] యెన్నఁడు లేని నిందలన్. 117

ఉ. నిందకుఁ బాత్రమై బ్రదుకు నీచపు జీవన మిచ్చగింప నొ
ల్లం దను వుజ్జగించెద విలాసిని లే దనుమాన మిందు కే
నిందుకరాంకురంబు లుదయించు తఱిం దరియంగఁజొచ్చి యా
కందువ మావిమోఁకలకుఁగాఁ జని నీడల నిల్చి యోచెలీ. 118

చ. చిలుకకుఁ జెప్పుఁడమ్మ కొదసేయక[51] మాటలు రాజహంసికిం
బలుమఱు నేర్పుఁడమ్మ మురిపంపుగతుల్ నవచూతశాఖికిం
జలములు పోయుఁడమ్మ పనిసందడి దీఱ మఱాక[52] నన్నె కాఁ
దలఁపుచు నుండుఁడమ్మ సతతంబును సన్మణిసాలభంజికన్. 119

క. అని పలికి వెచ్చనూర్చుచు
వనరుహముఖి యూరకుండె వ్రాల్గన్నులఁ జ
ల్లన జాఱునీరు చెక్కులఁ
జినుకఁగ జోటియును కరుణ చిప్పిలు మదితోన్. 120
 
ఉ. బాలిక యేటిమాటలుగఁ బల్కెద వేఁ గలుగంగ నీకు నిం
తేల విచార మె ట్లయిన నెల్లిట నేఁటనొ రాజహంసి దాఁ
బాలును నీరు నేర్పఱుచుభాతిఁ జతుర్జలరాశిమధ్య భూ
పాలకకోటిలో మధురభాషిణి నీపతి నేర్పరించెదన్. 121

ఆ. అనుచు నూరడించి యల్లనఁ గెంగేలఁ
గన్నునీరు దుడిచి కౌఁగిలించి
నెలఁ త యోర్చియుండు నీమనోరథసిద్ధి
నే ఘటింతు నెల్లినేఁటిలోన. 122

వ. అని యనంతరంబ సఖీజనంబు నవలోకించి విరహిజనమారణకారణులైన కందర్పాదుల నిందించు తలంపున. 123

మదనదూషణాదికము


సీ. మరుని నీలుగఁ జోసి మగుడఁ జేయమి నాఁడు
మృడుని కెక్కడ తలమీఁదు వచ్చెఁ
గోయిలఁ గడముట్టఁ గూయుట మాన్పఁగా
మెద గట్టిరే రామమేదినీశు
విధు మ్రింగి క్రమ్మఱ వెడలింపకున్న నె
క్కడ రాహుమెడమీఁదఁ గత్తి వచ్చెఁ
జలిగాలు యెదతేరఁ జవిగొన్న[53] చిలువరా
కొమల కెక్కడ గ్రుడ్లకొలఁది యయ్యె
తే. ఛాందసముగాఁగ విధి పుష్పజాల మెల్ల
సంపఁగులుసేయ కళికేల జయమొనర్చె
నాఁడె నీ రెల్ల కొదమాన[54] నడచిరేని
వీనిచే నట్లు వడునమ్మ విరహిజనము. 124
 
సీ. తుహినాంశుఁ డెప్పుడు దోషాకరుం డౌట
తెలియరే[55] సతిఁ గాచి తిరుగుఁడమ్మ
మదనుఁ డెంతయు మంటలారౌ టెఱుఁగుదు
రువిదపైఁ గనుగల్గి యుండరమ్మ
చీరపేతమ్ము మిక్కిలి వావదూకని
మదినూఁది బాల నేమఱకుఁడమ్మ
పికము దాఁ బలుగాకిపిల్లౌట విన్నారె
యప్రమత్తతఁ బ్రోవుఁడమ్మ వమ్మ

తే. బుట్టుబడి పెట్ట లే[56]మావిపొలఁతుకకును
జెట్లఁబడి పోకుమని బుద్ధి సెప్పుఁడమ్మ
తేఁటి మధుపాని యౌటెల్లఁ దేట మనరుఁ
దరుణిఁ గాపాడి నడువుఁడీ తల్లులార. 125

సీ. కాపుండు నెలమావి గండుకోయిలపిండు
పోనీకుఁ డచటి కంభోజమునిని
గురివెంద[57]పొదరింటఁ గొదమతుమ్మెద యుండు[58]
విందానఁ జననీకుఁ డందు సఖిని
బసుఁబొన్న రతిమనోభవుఁడు గాపురమున్న
నెల వేఁదనీకుఁడీ నెలఁత నచటి
కంచ లుండెడికందు వంబుజాకర మందు
విహరింప బాలఁ బోవిడువ కుండుఁ
ఆ. డిందువదన మీకు నిల్లడ సుండమ్మ
యనుచు నప్పగించి యవ్వయస్య
గొంద ఱిందుముఖులఁ గొరలి చేఁదోడుగాఁ
గొని రహస్యసౌధమునకు నరిగి.

ఉ. ఆ దళదబ్జలోచన ప్రయత్నమునం గమనీయనీలపీ
తాదిగుణంబులం గడు సమగ్రముగా సమకూర్చి కౌశల
శ్రీ దిలకింపఁ జారుతరచిత్రపటంబున వ్రాస దేవధా
త్రీదయితాహివర్యుల సుదీర్ణవయోగుణరూపధుర్యులన్.

మృగావతికిఁ బ్రియసఖి వివిధ పురుషవరేణ్యుల చిత్రపటంబులు చూపుట


ఆ. వ్రాసి క్షణంబ వనజాక్షి కుతుకాబ్ధి
పూర మంతరంగమునఁ దొలంక
నెమ్మి నృపతనూజ నిల్చిన పూఁ జప్ప
రంబుకడకు సత్వరముగ వచ్చి. 128

వ. నిఖిలభువనైకగణ్యులగు పురుషవరేణ్యుల నెల్లఁ జిత్రలేఖనాపాటవం బేర్పడ లిఖియించిన చిత్రపటంబు చెలికత్తియలచేత నమ్మత్తకాశిని మ్రోల నిలువం బెట్టించి మందస్మితవిరాజమానంబగు ముఖారవిందంబుతో నృపనందనమొగంబున నిజావలోకనంబు నిగుడ్చి వారిం బేరుపేరున కులనామధేయగుణవర్తనంబుల నేర్పరించి చెప్పం దొడంగి యిట్లనియె. 129

మ. మొద లేకంబగుమూర్తియందుఁ దనువుల్ మూఁడై విరాజిల్లు నొ
ప్పిదపున్ మూర్తుల విశ్వమంతయును గల్పింపం(గ రక్షింపఁ)[59]గా
నుదయంబైన మహాత్ములం గమలగర్భోపేంద్రభూతేశులన్
మదవత్కుంజరయాన వీరిఁ గనుఁగొమ్మా నీకటాక్షంబులన్. 130

సీ. పొక్కిట నెత్తమ్మిపూవు పేరురమునఁ
గౌస్తుభాభరణంబు గలుగువాఁడు
శ్రీవల్లభుఁడు మౌళిఁ జిన్నిక్రొన్నెలఱేకు
మణిబంధమున భోగిమందనంబు
గలవాఁడు గిరిరాజకన్యామనోవిభుం
డాననంబులు నాల్గు నఱుత విమల
తరదీర్ఘయజ్ఞసూత్రంబు గలవాఁడు
వాగ్వధూనాథుండు వనజభవుఁడు
తే. వీర లేతన్మహామహీభారభరణ
హరణ నిర్మాణచాతురీహారిమతులు
వీరి మువ్వుర వీక్షింపు విధునిభాస్య
యొప్పిదము లైన తొంగలిరెప్ప లెత్తి. 131

మ. కలశాంభోనిధిలోనఁ బుట్టుక వియత్కల్లోలినీతీరక
ల్పలతామంజునికుంజపుంజములు లీలావాటముల్ కాంచనా
చలకూటంబులు కాపురంబు నెలవుల్ చర్చింప నీనిర్జరా
వళి కెల్లప్పుడు వీరిఁ దేరకొన నోవామాక్షి వీక్షింపుమా. 132

సీ. తనివోవ నినుఁ జూచుతటి వాని కిభయాన
యనిమిషత్వము నైజ మందకున్నె
జలజాక్షి నీమోనిచవు లానుచో వాని
కరువిఁ జేయకయున్నె యమృతరసము
నిదురఁబాయుట వేడ్కనిగుందె వానికి
లేరు నిన్ గేళిఁ దేలించునపుడు
రతుల నిష్టార్థముల్ రమణి వీ వొసఁగుచోఁ
గాంక్షించునే వాఁడు కల్పలతిక
తే. ఇందుబింబాస్య వీరిలో నెవ్వఁడైన
నీదు కలఁగన్నధన్యుఁ డుండిన లతాంగి
వీరి వీక్షింపు ముఖ్యబృందారకులను
లలితలావణ్యరేఖావిలాసయుతుల. 133

శా. నాళీకానన నీఁదు దెంతతికిన్ నాదు....వోశ్శక్తిచేఁ
బాలించుం ద్రిదివంబుఁ బోర గెలిచెం బాకాదిదైత్యాది ది
క్పాలశ్రేణికి ముఖ్యుఁ డింద్రుండు నినుం బాటించుఁ గెంగేల నీ
వాలుంగన్నులఁ గాంక్షదీర నితనిన్ వామాక్షి వీక్షించవే. 134

సీ. మేనక నెమ్మోవిమీఁదఁ జేర్చినముద్ర
ముదిత నీకసిగాట్ల మాయనొత్తి
హరిణి సందిటనిడ్డ హరిణాంకశకలంబు
బాల నీకొనగోరఁ బాయనొత్తి
నిండుఁగౌఁగిట రంభ నెలకొల్పు మరులొల్తు
లతివ నీచనుదోయి నదిమిపుచ్చి
రతులఁ గైకొల్పు నూర్వశిమేని మైపూఁత
తరుణి నీచెమటచిత్తడి దొలంచి
తే. కేళి నోలార్పుమీ యింద్రుఁ గీరవాణి
వీఁడె నీకలలోఁ జూచు భ్రమాభి
రామ రమణీయరేఖావిరాజమాన
హావభావాతిశయమూరి యయ్యెనేని. 135

సీ. తేజంబులకు గని దివిజావళి మొగంబు
వైశ్వానరుం డబ్జవదన వీఁడు
తరిణికూరిమిపట్టి దర్మైకనిరతుండు
వనజాక్షి వీఁడు వైవస్వతుండు
రాత్రించరులకెల్ల రా జేలుఁ గోణంబు
వీఁడు నైరృతి పూర్ణవిధునిభాస్య
పతి పయోనిధులకుఁ బాలించుఁ బడమరఁ
బల్లవాధర వీఁడు పాశధరుఁడు[60]
తే. గంధగజయాన యీతండు గంధవాహుఁ
డీతఁ డలిలనీలవేణి యక్షేశ్వరుండు
చెలువ యీతండు విధుకళాశేఖరుండు
బాల వీక్షింపు వీరె దిక్పాలవరులు. 136

తే. నీలకుంతల కలలోన నీవు గన్న
యతఁడు దిక్పాలురం దొక్కఁ డయ్యెనేని
విబుధకుత్కీలవాస్తవ్యవితతిలోన
రమణి సాఫల్య మగు వాని రాజ్యలక్ష్మి. 137

శా. నీలక్షోణిధరోపమానతను లున్నిద్రప్రతాపాఢ్యు లా
భీలోదగ్రకృపాణపాణులు సమద్భీతామరశ్రేణు లా
శాలావణ్యవిశాలకీర్తులు తపస్సంప్రాపితైశ్వర్యు లో
బాలా చూడుము వీరె దైత్యులు భవద్భాస్వతకటాక్షంబులన్. 138

క. నీకలఁ గాంచినిపురుషుం
డో కోమలి దైత్యులందు నొక్కఁడ యేనిం
గైకొనుఁ వాఁడు మనమున
నాకపురస్త్రీల మోహనశ్రీమహిమన్. 139

గీ. వీరు సిద్ధులు సాధ్యులు వీర లతివ
వీరు యక్షులు రాక్షసుల్ వీర లబల
వీరు గరుడులు గుహ్యకుల్ వీరు వీరు
రమణి గంధర్వవిద్యాధరప్రవరులు. 140

పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/193

మ. రమణీ హైహయవంశసంభవుఁ డుదారప్రౌఢ బాహాబలా
క్రమితారాతిధరాధినాథసకలక్ష్మామండలుం డొక్కం డ--
ర్యమతేజస్కుండు కార్తవీర్యుఁడన నారా జొక్కనాఁ డాఁగె దు
ర్గమదోర్దర్పమునం బటూర్మిపాటలోద్యన్నర్మదాపూరమున్. 147

క. గ్రీష్మార్కతేజుఁడు మహి మా
హిష్మతియను పురవరంబు నేలు నితం డ
ర్చిష్మంతుఁడు తోడుగ నని
భీష్మాకృతి వైరివీరబృందము నోర్చున్. 150

మ. కదనక్షోణుల నమ్మహీభుజాంభుజాభర్గంప్రభాభాను భా
నది యుప్పొంగి చెలంగఁగా వికసనానందస్థితిం జెందు నో
నదసత్సంశయమధ్య నిర్మలయశశ్ఛాయాసితాబ్జంబు లే
తదుదగ్రప్రథితప్రతాపమహితోదాత్తోదయస్ఫూర్తిచేన్. 151

క. తరుణీ నీకలం గాంచిన
నెరవరి యితఁడేఁ బ్రదోషవేళన్ వైశ్వా
నరుఁ డొనరించుం బురి వెలి
నిరుపమరుచి నీ కయత్ననీరాజనమున్. 152

గీ. ఇంతి వీక్షింపు వీఁడె యవంతివిభుఁడు
త్రిదశనాయకుఁ డమరావతీపురంబు
వోలె నత్యంతవైభవశ్రీలు మెఱయ
నెలఁత యితఁ డేలు నుజ్జయినీపురంబు. 153

క. ధరణిం గలుగుట యెఱుఁగరు
నరపర్ణిని యిప్పురంబువారు తమంబుల్
పురబహిరుపవనమధ్య
స్థిరహరజూటీ శశాంకదీప్తులచేతన్. 154

మ. తరుణీ ధర్మగుణానుయుక్తమగు నే తత్సాయకం బుగ్రతం
బరభూపాలకపాలపాటనవిధిం బాటించుటన్ చిత్రమౌ
నరనాథాత్మజ వీనిదొరసి కృపాణఖ్యాతి బ్రాపించియుం
గరిమం ద్రుంచుఁ బరావరోధమహిళాకళ్యాణసూత్రావళుల్. 155

ఉ. లోలతరాక్షి వీఁడు కలలోపల నీకనుఁగొన్న పుణ్యసం
శీలుఁడ యేని నీరతుల చెమ్మటలారఁగ నల్ల వీఁచు శీ
ప్రాలలితాంతికోపవనపాదుపకుంజకుటీరవీరుఁ డు
న్మీలితపుష్పసౌరభసమేతవినూతనవాతపోతముల్. 156

మ. శతపత్రోపమనేత్ర నీఁడు మగధక్ష్మామండలాఖండలుం
డితనిం జూడుము ఱెప్పలెత్తి ప్రమదం బింపొంద డెందంబులో
శతశోవ్యక్షితినాథు లున్న నిల రాజద్రాజబింబాస్య యీ
రతిరాజాకృతిచేత నందుఁ నెపుడున్ రాజన్వతీనామమున్. 157

క. సుగుణాశ్రయుఁ డితఁ డేలఁగ
మగదక్ష్మామండలంబు మానిని భూలో
కగతంబగు నాకంబనఁ
బొగ డొందుఁ బ్రసిద్ధభూరిభోగాస్పదమై. 158

మ. హరిణీశాబవిశాలలోచిన యితం డంభోధివేలామహీ
సరిఘాతీరము మేరగా ధరణి దోఃప్రౌఢిం బ్రశాసించు ది
క్కరు లుత్సాహమునన్ మదాతిశయముం గైకొల్పఁ జెక్కిళ్లపై
నెరవెట్టన్ సుఖనిద్రఁ జెందు ఫణిరా జిచ్ఛానురూపంబుగన్. 159

క. వనజాక్షి వీఁడు నీకలఁ
గనిన ఘనుండేఁ బ్రదోష[61]కాలముల విలో
కనవరులను పుష్పపురాం
గనలకుఁ గావించు నేత్రకౌతూహలమున్. 160

పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/196 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/197 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/198 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/199 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/200 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/201 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/202 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/203 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/204 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/205 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/206 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/207 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/208 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/209 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/210 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/211 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/212 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/213 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/214 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/215 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/216 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/217 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/218 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/219 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/220 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/221 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/222 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/223 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/224 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/225 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/226 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/227 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/228 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/229 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/230 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/231 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/232 పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/233
 1. ప్రతిష్ఠ; ప్రతిష్ఠ
 2. ద్దామా లోకేశ
 3. రవన్మణి
 4. వణే
 5. పదివేలకునుం
 6. జూపట్టిమను
 7. సేత
 8. బిట్టూర్పుచు
 9. వైభవముల
 10. భృన్మేళికల్
 11. తేటుల
 12. వాకకాళ్ళవైభవంబు
 13. నయ్యల
 14. దాడి విల్చిన
 15. మహిధమినుత
 16. ఆవగింప
 17. పాటగు
 18. నిగురాడెడు
 19. 31వ ఆకు నిలువులో సగం చిరిగింది. ఆముక్క కానబడదు. 1921వ సంవత్సరంలో లైబ్రరీలో వ్రాయించిన ప్రతిలో ఆభాగములు లుప్తములే. అంతకుముందే కవిగారు కాపీ వ్రాయించారో తెలియదు. కుండలీకరణములు పూరణములు.
 20. చెలువంబు లేఁబొరల్
 21. బికకీరములు గాటువెట్టి మూచూడని
 22. బనుపగురంటకంబు లత పెంపున
 23. గనుపట్టున తాంతలతాలతాంతముల్
 24. తీగయుయ్యల నూగె; తీఁగె యుయ్యలల నూఁగె
 25. పదపాణి తలములు పగ దలంచియుఁ బోలె తలిరుటాకులఁ బాడుఁ దలలువట్టి
 26. కవమాన మనివోలె
 27. ఈ రెండు చరణములు మూలమునందే వ్రాయఁబడలేదు.
 28. మగుడ డిగుచు నెగులు; మగుడి డిగుచు నెలుఁగు
 29. మూలక్ష(...)రోక్షప్త
 30. తిప్పలకు జార
 31. మోచు
 32. మొత్తలచే
 33. కీరద్విజశ్రేణికోనిఁ దియ్యంపండ్ల
 34. మాని
 35. నిన్నిటికినిఁ (గడతరము)
 36. లెత్తుకో కొనుపాతకమున్మదిఁ బట్టుకొల్పఁగన్; లెత్తికొ కొనుపాతకమున్ మదిఁబట్టి కొల్పఁగన్
 37. ప్రాణంబుపె..ల్క
 38. నియత శాంతులలోన ని(లి)తమైయుండుదు
 39. లోక గరిష్టుండగు
 40. చెలువ చలి గాలిదన్ని
 41. కలకంఠి కన్నీట
 42. మొలకటిప్పి
 43. చన్నె
 44. మదాతుది
 45. కోర్వరమ్మ
 46. కవును చుట్టనినచో
 47. ఇజ్జోటి భావంబు నీటిలోని ముల్లై యున్నయది
 48. మెన్నటి కమ్మ
 49. నున్నవార లీషోచ్చల
 50. సమకూర్చెదె
 51. రొదసేయక
 52. దఱాక
 53. జలిగాలిఁ గొదతేరఁ జవిగొన్న
 54. కొడమాన
 55. తెలుతురే
 56. సెట్టులే
 57. గురువింద
 58. యుండ్ద
 59. గల్పింప గా
 60. పాశపాణి
 61. సా.ప.-ప్రవేశ-తా.వ్రా.ప