Jump to content

ఇంద్రాణీ సప్తశతీ/పాంక్తం

వికీసోర్స్ నుండి






ఓం

పంచమం

పాంక్తం శతకమ్

1. మయూరసారిణీస్తబకము

1. ప్రేమవాస భూమిరచ్ఛభావ
   స్థానమాన మజ్జనాఘహా మే |
   ఇంద్రసుందరీ ముఖాబ్జభాసీ
   మందహాస ఆపదం ధునోతు ||

2. వీక్షితైః కృపాన్వితై ర్హరంతీ
   పాతకాని మంగళం భణంతీ|
   జంభభేది జీవితేశ్వరీ మే
   జన్మ దేశముజ్జ్వలం కరోతు ||

3. అంబరంచ దేవతానతభ్రూ
   రంబతే తనుద్వయం యదుక్తం
   ఆదిమా తయోర్వృషాకపిం తం
   దేవ్యజీజన త్పరం జయంతం ||

4. ఏతమేవ దేవి లోకబంధుం
   సూరయో వృషాకపిం భణంతి |
   వర్ష హేతు దీథితి ర్వృషాయం
   కం పిబన్కరైః కపిర్నిరుక్తః ||

5. కేచిదింద్రనారి చంద్రరేఖా
   శేఖరం వృషాకపిం గదంతి |
   పండితాః పరేతు శేషశయ్యా
   శాయినం వృషాకపిం తమాహుః ||

6. బ్రహ్మణస్పతింతు వైద్యుతాగ్నే
   రంశజం మరుద్గణేషుముఖ్యం |
   విశ్వరాజ్ఞి విఘ్న రాజమేకే
   విశ్రుతం వృషాకపిం వదంతి ||


1. ప్రేమకు వాసస్థలమై, నైర్మల్యమునకు నిలయమై, నిత్యము నమ్రజనులు పాపముల నంతముజేయు ఇంద్రాణీ మందహాసము నా యాపదలను తొలగించుగాక.


2. దయతోగూడిన చూపులచే పాతకములను హరించి, మంగళములనిచ్చి, యింద్రాణి నాజన్మదేశము నుజ్జ్వల మొనర్చుగాక.


3. ఓ యంబా ! ఆకాశమనియు, నమ్రమైన భ్రూలతలుగల దేవత యనియు నీ రూపములు రెండుగా చెప్పబడుచున్నది. మొదటిది వృషాకపిని (సూర్యుని) కనెను, రెండవది జయంతుని కనెను.


4. ఓ దేవీ ! పండితులీ వృషాకపిని లోకబాంధవుడనుచున్నారు. వర్షములకు హేతువగు కిరణములు గలవాడు గనుక 'వృషా' యనియు, కిరణములచే నుదకములను ద్రాగును గనుక 'కపి' యనియు నిరుక్తము.


5. ఓ యింద్రాణీ ! కొందఱు పండితులు వృషాకపి యనగా చంద్ర రేఖ శిరోభూషణముగా గలవాడని (శివుడని) చెప్పుదురు. మఱికొందఱు వృషాకపిని శేషశయ్యా శాయి (విష్ణువని) యను చున్నారు.


6. ఓ దేవీ ! మఱికొందఱు వృషాకపిని వైద్యు తాంశకు బుట్టి, మరుద్గణములకు ముఖ్యుడై, వేదమంత్రముల కధిపతియైన బ్రహ్మణస్పతియనియు, విశ్రుతిగాంచిన విఘ్నేశ్వరుడనియు చెప్పుదురు.

7. భాస్కరశ్చ శంకరశ్చ మాత
   ర్మాధవశ్చ మంత్రనాయకశ్చ |
   ఆత్మజేషు తేన సంతి నాంత
   ర్వ్యాప కాంతరిక్ష విగ్రహాయాః ||

8. వాసవో౽పి దేవిదేవతాత్మా
   వల్లభ స్తవ చ్ఛలాంగనాయాః |
   ఆత్మజాతఏవ కీర్తనీయో
   దేవతాపథేన దేహవత్యాః ||

9. సా శవ స్యుదీరి తాసి ధీరై
   ర్దేహినీ విహాయసేంద్రసూ స్త్వం |
   లింగ భేదతో౽నురూపత స్త
   త్కీర్తనం శవోహి శక్తివాచీ ||

10. నాదితి ర్విభిద్య తే శవస్యా
    స్సర్వదేవమాతరం విదుర్యాం |
    యా మరుత్ప్రసూ రభాణి పృశ్ని
    స్సాపి భిద్యతే తతోన దేవ్యాః ||

11. శక్తిరేవ సా న్యగాది పృశ్ని
    శ్శక్తిరేవ సా౽దితి ర్న్య భాణి |
    శక్తిరేవ సా౽భ్యధాయి భద్రా
    శక్తిరేవ సా శవ స్యవాది ||

12. విజ్జనః ప్రకృష్ట శక్తిభాగం
    శబ్దమేవ పృశ్నిమాహ ధేనుం |
    యా పరైర్బుధై రభాణి గౌరీ
    మానవేష్ట భాషయైవ నారీ ||


7. ఓ తల్లీ ! భాస్కర, శంకర, మాధవ విఘ్నేశ్వరులు (వృషా కపి నామధేయులు) అంతర్వ్యాప్తమైన అంతరిక్ష మే శరీరముగా గలిగిన నీకు పుత్రులు కారను మాటలేదు.


8. ఓ దేవీ ! దేవతాస్వరూపుడైన దేవేంద్రుడు కపట స్త్రీరూపమును దాల్చిన నీకు వల్లభుడు. ఆ యింద్రుడును ఆకాశశరీరవగు నీకు సుతుఁడనియే చెప్పఁదగును.


9. ఆ నీవు పండితులచే 'శవసి' యనబడుచుంటివి. ఆకాశ శరీరిణివైన నీవు 'ఇంద్రసూః' (ఇంద్రునికనినది) యనియు పిలువబడు చుంటివి (ఇంద్రునకు మాత్రము వృషాకపినామము చెప్పబడ లేదు). లింగభేదమువలన, సాదృశ్యమువలన శవసి యని కీర్తింపబడితివి. 'శవ' శబ్దము శక్తివాచకము.


10. అదితి యనినను, శవసి యనినను నొక్కటే. ఎవ తెను సర్వ దేవతలకు తల్లిగా తెలియుచుండిరో, యెవతె మరుత్తులకు తల్లియై 'పృశ్ని' యని పిలువబడుచున్నదో, ఆమె యీ శవసి కంటె వేఱుకాదు.


11. శక్తియే పృశ్ని గాను, అదితిగాను, భద్రగాను, శవసిగాను చెప్పబడుచున్నది.


12. పండితులచే గొప్పదిగా నెంచబడిన శక్తి భాగము 'పృశ్ని'. 'ధేను' అను శబ్దములతో పిలువబడెను. ఆ శక్తిభాగమునే యితర పండితులు మనుజుల కిష్టమైన భాషతో 'గౌరీ' యనియు, స్త్రీ యనియు చెప్పిరి.

13. వ్యాపకత్వ కల్పితం విశాలం
    దేశమేవ శక్తిభాగ మాహుః |
    బుద్ధిశాలి నో౽దితం సవిత్రీం
    యాపరైర్విచక్షణై స్మృతా ద్యౌః ||

14. నిత్యమోద రూపశక్తిభాగం
    పండితాః ప్రకీర్తయంతి భద్రాం |
    ఉక్తిభేద చాతురీ ప్రలుబ్ధాః
    సూరయః పరే శివాం జగుర్యాం ||

15. వీర్యరూపభాగ ఏవ గణ్యః
    పండితై శవస్యభాణిశక్తేః |
    ఓజసో న సో౽తిరిచ్య తేంశో
    భిద్యతే తతోన వజ్ర ముగ్రం ||

16. వజ్రమేవ భాషయా ప రేషా
    ముచ్య తే ప్రచండ చండి కేతి |
    యద్విభూతిలేశ చుంబితాత్మా
    జీయతేన కేనచి త్పృథివ్యాం ||

17. సర్వతోగతి శ్శచీతి శక్తిః
    కీర్త్యతే బుద్ధై రుదారకీర్తిః |
    సర్వభాగ వాచకం పదం తే
    పావనం పురాతనం ప్రియం నః ||

18. యశ్శచీతి నామకీర్తయే న్నా
    పుష్క రేణ తే శరీరవత్యాః
    దివ్యసుందరీ తనో రుతాహో
    తం పరాభవేన్న దేవి పాపం ||


13. బుద్ధిశాలులు వ్యాపకత్వముతో గూడిన విశాల దేశమును శక్తి భాగముగా చెప్పుచున్నారు. విచక్షుణులైన మఱికొందఱేది యా కాశమని చెప్పబడుచున్నదో, దానిని 'సవిత్ర' యనియు, 'అదితి' యనియు పిలచిరి.


14. నిత్యమోదరూపమైన శక్తి భాగమును పండితులు 'భద్ర' యను చున్నారు. చతురోక్తిమంతు లామెనే 'శివ' మ్మనుచున్నారు.


15. పండితులచే గణింపబడు శక్తియొక్క వీర్యరూప భాగమే 'శవసి' యని చెప్పబడుచున్నది. ఆ వీర్యాంశ ఓజస్సుకంటె మించి వేఱుగాలేదు. ఈ యుగ్రమగు వజ్రాయుధము కూడ దానికంటె వేఱుగాలేదు.


16. గూఢభాషలో వజ్రమే ప్రచండచండికయని చెప్పబడుచున్నది. ఏ చండికయొక్క విభూతి లేశముచే చుంబితుడైన పురుషుడు పృథ్విలో నెవరిచేతను జయింపబడజాలడో

(అట్టి చండికయని ముందు వాక్యముతో నన్వయము)


17. ఉదారకీర్తిగలిగి సర్వవ్యాపినియైన శక్తి పండితులచే శచీదేవిగా చెప్పబడెను. సర్వము నిరూపించు నామముగలది, పావనమైనది, పురాతనమైనదియైన యీ పేరు మాకు ప్రియమైనది. (శచీనామము)


18. ఓ దేవీ ! ఏ మనుజు డాకాశశరీరము దాల్చినట్టి, దివ్యస్త్రీ తనువును బొందినట్టి నీ శచీనామమును కీర్తించునో, వానిని పాపము పొందదు.

19. అంబరం వరం తావాంబ కాయం
    యస్సదా విలోకయన్నుపాస్తే |
    లోకజాల చక్రవర్తి జాయే
    తం పరాభవేన్న దేవి పాపం ||

20. పూర్ణిమా సుధాంశు బింబవక్త్రం
    పుల్ల వారిజాతపత్రనేత్రం |
    శుభ్రతా నిధాన మందహాసం
    కాలమేఘకల్ప కేశపాశం ||

21. రత్నదర్పణాభ మంజుగండం
    చంపకప్రసూనచారు నాసం |
    కుందకుట్మలాభకాంత దంతం
    కల్పపల్లవాభ దంతచేలం ||

22. సద్వరా౽భయ ప్రదాయి హస్తం
    సర్వ దేవవంద్య పాదకంజం |
    దివ్యరత్న భూషణై రనర్ఘై
    ర్భూషితం కనత్సువర్ణవర్ణం ||

23. దివ్య శుక్లవస్త్రయుగ్మ ధారి
    స్వర్గసార్వభౌమ నేత్రహారి |
    యస్మరే ద్వరాంగనావపు స్తే
    తంపరాభవేన్న దేవి పాపం ||


19. ఓ తల్లీ ! ఎవడు శ్రేష్ఠమైన నీ యాకాశరూపమును జూచుచు, సదా యుపాసన జేయుచుండునో, వానిని పాపము తాకదు.


20. పున్నమచంద్రుని బోలు ముఖము, వికసించిన పద్మదళములు వంటి నేత్రములు, నైర్మల్యమునకు నిధియైన మందహాసము, వర్షకాల మేఘమువంటి కొప్పు,


21. రత్న ఖచితమైన అద్దమువంటి చెక్కిళ్లు, చంపకమువంటి సొంపైన నాసిక, మల్లిమొగ్గలవంటి యందమైన పలువరుస, కల్ప వృక్షముయొక్క చిగురువంటి రంగుగల యధరోష్ఠము,


22. ఇష్టమైన వరములను, అభయమునిచ్చు హస్తములు, సర్వ దేవతలచే నమస్కరింపబడు పాదములు, విలువలేని దివ్యరత్న భూషణములచే నలంకృతమై బంగారుఛాయవంటి వర్ణముగలిగి,


23. దివ్యమైన తెల్లనివస్త్రములు (రెండు - లోవస్త్రము, పైవస్త్రము) ధరించునది. యింద్రుని నేత్రముల కింపయినదియగు వరాంగన యొక్క శరీరము నెవడు స్మరించునో, వానిని పాపములు తాకవు.

24. భారతక్షి తే రిదం జనన్యా
    శ్శోకజన్య బాష్పవారిహర్తుం |
    దేహి శక్తి మాశ్రితాయ మహ్యం
    పాహి ధర్మ మింద్రచిత్తనాథే ||

25. సద్వసిష్ఠ సంతతే రిమాభి
    స్సత్కవే ర్మయూరసారిణీభిః |
    సమ్మదం ప్రయాతు శక్రచేత
    స్సంప్రమోహినీ సరోజనేత్రా ||

            _______

2. మనోరమాస్తబకము

1. హసిత మాతతాయి పాతక
   ప్రమథన ప్రసిద్ధ విక్రమం |
   అమరభూమి పాల యోషితో
   మమ కరోతు భూరిమంగళం ||

2. కరుణయా ప్రచోదితా క్రియా
   ర్భరతభూమి మక్షయశ్రియం |
   చరణ కంజరాజ దిందిరా
   సురనరేశ్వరస్య సుందరీ ||

3. న భవనం నవా జగత్పృథ
   జ్నివసనాయితే సురార్చి తే |
   యదఖిలాని విష్టపాని తే
   వపుషి సర్వమందిరాణిచ ||


24. ఓ దేవీ ! భారతభూ మాత యొక్క కన్నీటి నాపుట కాశ్రితుడ నైన నాకు శక్తినిమ్ము, ధర్మమును రక్షింపుము.


25. వాసిష్ఠగోత్రమందు బుట్టిన సత్కవియొక్క యీ మయూర సారిణీ వృత్తములచే నింద్రాణి సంతోషము బొందుగాక.

__________


1. దుర్మార్గుల పాపములను శిక్షించుటకు ప్రసిద్ధ పరాక్రమముగల యింద్రాణీ మందహాసము నా కధిక మంగళముల నిచ్చు గాక.


2. చరణకంజములందు లక్ష్మీ ప్రకాశించుచున్న ఇంద్రాణీదేవి యొక్క దయచే ప్రేరేపింపబడి భారతభూమి యక్షయ సంపదలను బొందుగాక.


3. ఓ దేవీ ! నివసించుటకు నీ కిల్లులేదు. జగత్తే నీకు గృహమనినచో, ఆ సమస్తము నీకు శరీరమైపోవుచు, నందున్న సర్వ భువనములు సర్వమందిరము లగుచున్నవి.

(ఆమెయొక్క యాకాశశరీరమందున్న భువనము లామెకు తిరుగ

4. మతి దవిష్ఠసీమ భాసురం
   తవశరీర మేవ పుష్కరం |
   పరమ పూరుషస్య వల్లభే
   భువనమేక ముచ్యతే బుధైః ||

5. తరణ యస్సుధాంశవ స్తథా
   సహభువా గ్రహా స్సహస్రశః |
   అయి జగంతి విస్తృతాని తే
   వవుషి పుష్క రే జగత్యజే ||

6. బహుభి రుష్ణ భానుభి ర్హృతాత్
   బహుభిరిందుభి ర్వశీ కృతాత్ |
   వియతి లోకజాలధాత్రి తే
   శతగుణం బలం ప్రశిష్యతే ||

7. న విభు రేకకస్య భాస్వతో
   విభవమేవ నా ప్రభాషితుం |
   కిముత తే దధాసి యో౽దరే
   ద్యుతిమతాం శతాని తాదృశాం ||

8. ఇహ విహాయసా శరీరిణీ
   మతి సమీపవాసినీ మపి |
   న ఖలు కోపిలోకితుం ప్రభు
   ర్భగవతీం పరామయుక్త ధీః ||


గృహములగుట చమత్కారము. ఆమె శరీరము భువనముల కంటె సూక్ష్మము గనుక వాని యంతరమున నాకాశము నివసించి యుండును. ఆవిధముగా నామె కవి గృహము లగు చున్నవి,)


4. ఓ దేవీ ! బుద్ధికి దూరమై ప్రకాశించు ఆకాశమును (ఆకాశము నాల్గు విధములని శ. 1, స్త. 3, శ్లో. 19 లో చెప్పబడెను. వానిలో ఆమెకు శరీరమగు పరమాకాశము నిచ్చట గ్రహించ వలెను) పండితులొక లోకముగా చెప్పుచున్నారు.


5. ఓ దేవీ ! ఆ యాకాశమనెడి నీ శరీరమున సూర్యులు, చంద్రులు భూమితో సహ వేలకొలది గ్రహములు, మఱియు ననేక జగత్తులు నివసించుచున్నవి.


6. ఓ తల్లీ ! అనేక సూర్యులచే దహించబడు నుష్ణశక్తికంటె, ననేక చంద్రుల వశీకరణశక్తికంటె నాకాశమందున్న నీబలము నూరు రెట్లధికము.


7. ఓ దేవీ ! ఒక్క సూర్యుని వైభవము చెప్పుటకే పురుషు డసమర్ధుడైనప్పుడు, నూర్లకొలది యట్టి సూర్యులు నీ యుదరమందున్న నీ వైభవము నెట్లు పురుషునకు చెప్పశక్యమగును.


8. ఈ యాకాశమును శరీరముగా గొని యెల్లరకు సమీపముగా నున్న పరాదేవి చపలబుద్ధిగలవారిచే చూడబడ లేదుగదా.

9. తదిద ముచ్యతే జనోజగ
   ద్వపురమేయ మాదిదేవి తే |
   జనయతే యతో౽ఖిలందృశో
   ర్విషయభూతమేత దాతతం ||

10. బహుళతారకా గణైర్యుతం
    కిమపి ఖం తవేహ వర్ష్మణి |
    శచి విభజ్య భాషయైకయా
    సుకవయో మహూజగద్విదుః ||

11. ఇద మినేందు భూమిలక్షణై
    ర్దినకరై స్సుధాకరై ర్గ్రహైః |
    బహుజగద్భిరన్వితం మహో
    జగ దశేషధాత్రి నైకకం ||


9. ఓ దేవీ ! అట్టి యచింత్యమైన నీ శరీరము జనోలోకమనబడు చున్నది. అఖిలవ్యాప్తమైన యీ విశ్వభూత మేవిధముగా (మన) దృష్టికి జనించుచున్నట్లున్నదో,

(ఆవిదముగా జనోలోకమనబడుచున్న దని భావము. జననములను గలిగించు జనయితృత్వ ధర్మముచే లోకవాదినులా యాకాశశరీరమును జనో లోకమనిరి. ఇక్కడ ఆకాశనామావళి, లోక నామావళి - యీ రెండింటికి గల సంబంధము చెప్పబడెను. ఆకాశములు నాల్గని పూర్వము చెప్పబడెను. (1) ధూళిరూపమైనది. (2) ధూళిరహితమైనది (3) దానికంటె వేరైనది (4) పరాకాశము. నిజమున కాకాశమంతయు నొక్కటియైన సూక్ష్మరజోభూతమైనను, వ్యాపకత్య పరిణామమునందా రజస్సు సాంద్రతవ్యత్యాసములను బొంది తేజో౽బన్నము లనబడు త్రివిధములైన అణువులు గలది యయ్యెను. ఈ త్రివిధాకాశములను లోకవాదినులు భూర్భువస్సువర్లోకములనిరి. దీనిని వ్యాప్తమొనర్చిన మహిమను మహర్లోకమనిరి. ఆ మహిమను బొందిన సచ్చిదానంద స్వరూపమఖండమైనను దాని సత్తత్వమును సత్యలోకమనియు, చిత్తత్త్వము తపస్తత్త్వము గనుక తపోలోకమనియు, విశ్వముల నెన్నింటినైన పుట్టించుటకు వస్తుసమృద్ధిచే నానందమనబడు తత్త్వమును జనోలోకమనియు పిలచిరి. ఈవిధముగా లోకనామావళి యున్నను సచ్చిదానంద స్వరూపమంతయు నలోక మనియు, ఆకాశము మాత్రము లోకసంబంధమనియు, మహర్లోకమనబడిన మహిమ లోకాలోకమనియు నెఱుగవలెను. ఈ మహిమ జనోలోకమునుండి వికసించినందున దీనిచే వికసించిన జనయితృత్వ ధర్మము మహద్యుక్త జనోలోకమై మహాఞ్జనోలోకమని యీ కవిచేతనే ఉమాసహస్రమను గ్రంథమందు పేర్కొనబడెను. కేవలమహిమనుగాక అట్టి మహాఞ్జనోలోకమును జనోలోకమునుండి వేఱుచేసి మహర్లోకమనినట్లు తరువాత శ్లోకమునుండి తెలియగలదు. కాని యాకాశ నామావళియందు మహిమను వేఱుచేయక పరాకాశముగా వికసించిన జనోలోకమును గైకొని నట్లవగతమగును. సృష్టికొఱకు వికసించిన జనయితృత్వ ధర్మమువల్లనే చిత్సత్తులు జననీ జనకులయిరి.)


10. ఓ శచీ ! బహు తారాగణములతో గూడిన యొకానొక ఆకాశమును నీ యా కాశశరీరమునుండి విభజించి సుకవులు కొందఱు మహర్లోకమని వచించిరి.


11. ఓ దేవీ ! సూర్య, చంద్ర, భూలక్షణములతో గూడిన (అనగా తైజిస, అప్, అన్న మాణు భూతతత్వములుగల) సూర్యులు, చంద్రులు, గ్రహములుగల బహుళ జగత్తులతో నిండిన యీ మహర్లోకమంతయు నొక్కటికాదు.

(సువర్లోక, భువర్లోక, భూలోకసహితమని భావము.)

12. అజరమవ్యయం సనాతనం
    మునిజనైక వేద్య వైభవం |
    న భవతీం వినా తపో జగ
    త్పృథ గశేషనాథ నాయికే ||

13. సకల దృశ్యమూలకారణం
    తవచ సంశ్రయో నిరాశ్రయః |
    జనని సత్యలోకసంజ్ఞయా
    పరమ పూరుషో౽భిధీయతే ||

14. అయిపురాతనర్షి భాషయా
    గగనమేతదాప ఈరితాః |
    అధ యదాసు వీర్యముజ్ఘి తం
    భగవత స్త్వమేవ తత్ప రే ||

15. శచివిరాడ్భవత్యభాషత
    శ్రుతి రపీదమేవ నామ తే |
    వితత విశ్వ విగ్రహాత్మని
    ప్రథిత మేతదాహ్వయం వరం ||

16. ఉపనిషద్గిరా విరాడ్వధూః
    పురుష ఏషభాషయాన్యయా |
    ఉభయథాపి సాధు తత్పదం
    భవతి తేన సంశయాస్పదం ||

17. న వనితా నవా పుమాన్భ వే
    జ్జగతి యోంతరశ్శరీరిణాం |
    తనుషు లింగ భేద దర్శనా
    తనుమతశ్చ లింగముచ్యతే ||


12. ఓ దేవీ ! ముసలితనము, నాశనములేక సనాతనమై, ముని జనులచే తెలియబడు వైభవముగల తపోలోకము నీ కంటె వేఱుగా నుండదు.


13. ఓ తల్లీ ! సకలదృశ్య (ప్రపంచ) మునకు మూలకారణమగునది, నీ కాధారమగునది, యితరము నాశ్రయించనిది యగు పరమ పురుషవస్తువే సత్యలోక సంజ్ఞచే తెలియబడుచుండెను.


14. ఓ దేవీ ! పురాతన ఋషులభాషయం దీ గగనముదకమని (కం = ఆకాశము, ఉదకము) చెప్పబడుచున్నది. పిమ్మట భగవంతుని వీర్య మా యుదకములో ప్రవేశపెట్టబడెననియు, ఆవీర్యము భరించినది నీ వేయనియు పల్కుదురు.


15. ఓ శచీ ! ఈ నీ పేరును (వీర్యయుక్తజనోలోకము లేదా జన యితృత్వాకాశమును) 'విరాట్‌' యనియు శ్రుతి చెప్పుచున్నది. విస్తారమైన విశ్వము స్వరూపముగాగల శరీరమునకు (గర్భ మందు విశ్వముగల నీ శరీరమునకు) 'విరాట్‌' పదము ప్రసిద్ధము.


16. ఉపనిషద్భాషలో చెప్పబడిన 'విరాట్‌' వధూస్వరూపము నితర భాషలలో (శ్రుతిభాష గాక పౌరాణిక కావ్యాది భాషలలో) పురుషుడని చెప్పబడెను (విరాట్పురుషుడని). స్త్రీ పుంలింగములలో రెండు విధముల 'విరాట్‌' పదము సాధువగుటచే సంశయాస్పదముగా నున్నది.


17. (ఎట్లనగా) లోకములో శరీరమున కాంతర్యముననున్న వీర్య వస్తువు స్త్రీయుగాదు, పురుషుడుకాదు. స్థూలశరీరమునకు గల లింగభేద దర్శనమువలన శరీరమతముననుసరించి అంత రాత్మకు లింగము చెప్పబడెను. (విరాట్టునకు)

18. అఖిలనాథ వీర్యధారణా
    ద్గగనభూమిరంగనామతా |
    సకలలోక బీజ భృత్త్వతో
    గగనదేశ ఏష పూరుషః ||

19. స్ఫుట విభక్తగాత్రలక్ష్మణాం
    నియతవాదినా మదర్శనాత్ |
    న పురుషో వియద్యథా వయం
    న వనితా వియద్యథైవ నః ||

20. అభివిమానతో౽థవా శచీ
    విబుథరాజయో ర్విలక్షణాత్ |
    వరవిలాసినీ వియత్తను
    స్సదవికార ముత్తమః పుమాన్ ||

21. హృదయమల్పమ ప్యదో జస
    న్యనవమం విశాల పుష్కరాత్ |
    విమలదేహ దుర్గమధ్యగం
    సకలరాజ్ఞి సౌధమస్తు తే ||

22. వికసితం నిజాంశు వీచిభి
    ర్హృదయ మాలయం విశాంబ మే |
    వికచ ముష్ణభానుభానుభి
    ర్దశశత చ్ఛదం యథా రమా ||


18. సర్వేశ్వరుని వీర్యము ధరించుటచే ఆకాశము స్త్రీ యనబడెను. సర్వలోకకారణబీజమును ధరించియుండుటచే నా కాశము పురుషుడని వచింపబడెను.


19. నియత వాదినులు (అనగా కంటికి గోచరమగునదియే నమ్మువారు) స్ఫుట శరీరలక్షణము లాకాశమందు గోచరించనందున, దానిని మనవలె పురుషుడుగాగాని, స్త్రీగాగాని లేదనిరి.


20. ఆలాగున కాకున్నను, సర్వవ్యాప్తమైన అవికార సద్వస్తువు శచీంద్రుల యభేదముచే శ్రేష్ఠ స్త్రీలక్షణమును, ఆకాశశరీరమును బొందినట్టి యుత్తమ పురుషునివలె గణింపబడవచ్చును.


21. ఓ తల్లీ ! నిర్మలమైన దేహమను దుర్గమునకు మధ్యముననుండి విశాలాకాశముకంటె స్వల్పమైనను శ్రేష్ఠత్వ మందు తీసిపోని యీ హృదయము నీకు సౌధమగుగాక.

(ఆకాశమం దుంచబడిన సద్రూపలక్షణమగు వీర్యమే హృదయమైనట్లు ధ్వనించును. సత్తే ఆకాశమునకు వీర్యలక్షణమైనదని భావము. 'అయితిని' అను నర్ధముగల హృదయము (హృత్ + అయం) ఆకాశమునుబొందిన సచ్చిత్ లక్షణము.)


22. ఓ యంబా ! స్వకీయకిరణములచే వికసించిన నా హృదయ మనెడి యాలయమును, వేడి కిరణములుగల సూర్యునిచే వికసింపబడిన సహస్రదళపద్మమును లక్ష్మీదేవివలె ప్రవేశింపుము. (హృదయవస్తువు సూర్యునకు సామ్యము. ఈ యాలయమున

23. హృదయ సాధు సౌధశాయినీం
    నయన రమ్యహర్మ్య చారిణీం |
    భువనరాజచిత్తమోహినీం
    నమత తాం పరాం విలాసినీం ||

24. తవ పరే మరీచివీచయ
    స్తనుగుహాం ప్రవిశ్య విశ్రుతే |
    భరతభూమి రక్షణోద్యతం
    గణపతిం క్రియాసు రుజ్జ్వలం ||

25. గణపతే ర్మనోరమా ఇమా
    స్సుగుణవేదినాం మనోరమాః |
    అవహితా శృణోతు సాదరం
    సురమహీపతే ర్మనోరమా ||

            _______

3. మణిరాగస్తబకము


1. జ్యోతిషాం నృపతిస్సకలానాం
   శాంతిమేవ సదాభిదధాన: |
   నిర్మలో హరతా త్సురరాజ్ఞీ
   మందహాసలవో మమపాపం ||


కావరణము లక్ష్మీవాసమునకు పద్మమువలె సహస్రార కమలము కనుక లక్ష్మి యాహ్వానింపబడెను.)


23. హృదయమనెడి యోగ్యభవనమందు శయనించునది, నేత్రములనెడి మేడభాగములందు సంచరించునది, ఇంద్రచిత్తమును మోహింప జేయునదియైన ఆ పరాదేవికి నమస్కరింపుడు.

(హృదయమందున్న ప్రజ్ఞయే నేత్రములందు దృశ్యమగునని భావము.)


24. ఓ దేవీ ! నీ కాంతిరంగములు శరీరగుహను జొచ్చి (హృదయమును) భరతభూమిని రక్షించుట కుద్యుక్తుడైన గణపతిని బ్రజ్వలింప జేయుగాక.


25. సుగుణములను దెలియు పండితులను సంతోషపరచు గణపతి యొక్క యీ 'మనోరమా' వృత్తముల నింద్రాణి జాగ్రత్ప్రేమలతో వినుగాక.


__________


1. సకల కాంతులకు ప్రభువై, సదా శాంతిని సమకూర్చుచు, నిర్మలమైయుండు ఇంద్రాణీ మందహాసలేశము నా పాపములను హరించుగాక.

2. దుష్టలోక దవిష్ఠపదాబ్జా
   శిష్టశోక నివారణదక్షా |
   నాకలోక మహీపతిరామా
   భారతస్య ధునోత్వసుఖాని ||

3. దేవమౌళిమణీ కిరణేభ్యో
   విక్రమం స్వయమేవ దదనా |
   దేవరాజ వధూపద పద్మ
   శ్రీస్తనోతు సదా మమ భద్రం ||

4. దేవి తే వదనం బాహు కాంతం
   సాక్షి తత్ర పురందర చేతః |
   అంబ తే చరణావతికాంతా
   వత్రసాక్షి మనస్స్శరతాం నమః ||

5. భాసురం సురసంహతి వంద్యం
   సుందరం హరి లోచన హారి |
   పావనం నతపాప విధారి
   స్వర్గరాజ్ఞి పదం తవసేవే ||

6. జంఘికే జయతస్తవమాతః
   సంఘ ఏవరుచాం యదధీనః |
   వాసవస్య దృశాంచ సహస్రం
   యద్విలోకన లోభవినమ్రం ||

7. సక్థినీ తవ వాసవకాంతే
   రామణీయక సార నిశాంతే |
   వందతే వినయే సమయేయే
   వందితస్తవ పావని వాణీ ||


2. దుష్టసమూహమున కందరానిది, శిష్టులశోకమును నివారించు సామర్ధ్యముగలది, స్వర్గమునకు రాణియునగు ఇంద్రాణి భారత దేశ కష్టములను దొలగించుగాక.


3. దేవతల కిరీటములందుండు మణుల కాంతులకు స్వయముగా మఱింత కాంతినొసగు ఇంద్రాణి పాదపద్మశోభ సదా నాకు క్షేమమిచ్చుగాక.


4. ఓ దేవీ ! నీ ముఖము బహు కాంతిమంతము. అందుల కింద్రుని మనస్సే సాక్షి. ఓ తల్లీ ! నీ చరణము లతి కాంతిమంతములు. వానిని స్మరించు మా మనస్సే యందులకు సాక్షి.


5. ఓ తల్లీ ! దేవతలచే నమస్కరింపబడును గనుక ప్రకాశవంతమైనవి, యింద్రుని నేత్రముల నాకర్షించును గనుక సుందరమైనవి, నమ్రుల పాపములను ఖండించును గనుక పావనమైనవి యగు నీ పాదములను నేను సేవించుచుంటిని.


6. ఓ తల్లీ ! కాంతుల సమూహమంతయు నే పిక్కలయందు ఘనీభవించెనో, ఇంద్రుని వేయి కన్నులు నే పిక్కలను జూచుటకు లోభించుచున్నవో, అట్టి నీ పిక్కలు ప్రకాశించుచున్నవి.


7. ఓ తల్లీ ! వినయసమయమందే నీ తొడలను వాణీదేవి కూడ వందిజనమువలె నమస్కరించుచుండెనో, అట్టి నీ తొడలు సౌందర్య సారమునకు నిలయములు.

 8. ఇంద్రనారి కటిస్తవ పృథ్వీ
    మండల స్యతులా మహనీయే |
    మధ్యమం నభసః ప్రతిమానం
    భోగినాం భువనస్యచ నాభిః ||

 9. ధీరతాం కురుతే విగతాసుం
    యా సుపర్వ పతేర్ని శితాగ్రా |
    సా తవాంబ మనోభవశస్త్రీ
    రోమరాజిరఘం మమహంతు ||

10. రోమరాజి భుజంగశిశుస్తే
    దేవి దేవపతేర్హృదయస్య |
    దంశనేన కరోత్యయి మోహం
    జీవితాయ చిరాయ విచిత్రం ||

11. పూర్ణ హేమ ఘటా వివశక్రా
    వాహితాం దధతావయి శక్తిం |
    విశ్వపోషణ కర్మణి దక్షా
    వంబదుగ్ధ ధరౌ జయతస్తే ||

12. లోకమాత రురోరుహ పూర్ణ
    స్వర్ణకుంభగతా తవ శక్తిః |
    లోకపాలన కర్మణి వీర్యం
    దేవి వజ్రధరస్య బిభర్తి ||

13. అక్షయామృత పూర్ణఘటౌ తౌ
    శక్రపత్ని కుచౌ తవపీత్వా |
    లోక బాధక భీకర రక్షో
    ధూననే ప్రభభూవ జయంతః ||


8. ఓ దేవీ ! నీ కటి పృథ్వీమండలమువలె నున్నది, నడు మాకాశమువలె నున్నది, నాభి పాతాళమువలె నున్నది.


9. ఓ తల్లీ ! ఏ నీ రోమరాజి దేవేంద్రుని ధైర్యమును గూడ హరించుచున్నదో, మన్మధునిశస్త్రమైన ఆ రోమరాజి నా పాపములను హరించుగాక.


10. ఓ దేవీ ! నీ రోమరాజి యనెడి పాముపిల్ల యింద్రహృదయమును కరచి, యతనితో చిరాయుర్జీవితముకొఱకు వాని హృదయమునకు మోహమును గలిగించుచున్నది. విచిత్రము !


11. ఓ జననీ ! జలపూర్ణములైన స్వర్ణఘటములవలెనుండి దేవేంద్రునిచే నుంచబడిన శక్తిని ధరించు నీ కుచములు విశ్వపోషణ కర్మయందు సమర్ధములై ప్రకాశించుచున్నవి.


12. ఓ తల్లీ ! స్వర్ణకుంభములనెడి స్తనములందు నీశక్తిపూర్ణమై యింద్రునితోగూడి లోకపానమందు (అతనికొఱకు) వీర్యమును భరించుచున్నవి.

(అనగా నామె కుచము లింద్రునకు పాలకశక్తినిచ్చుచు నితరులకు పోషణశక్తి నిచ్చు చున్నవని)


13. ఓ దేవీ ! అక్షయమగు నమృతపూర్ణఘటములనెడి కుచములను పానముజేసి జయంతుడు లోకములను బాధించిన భీకరరాక్షసులను సంహరించుటకు సమర్థుడయ్యెను.

14. హస్తయోస్తవ మార్దవ మింద్రో
    భాషతాం సుషమామపి దేవః |
    దాతృతా మనయో ర్ముని వర్గో
    వర్ణయత్యజరే పటుతాంచ ||

15. పుష్పమాల్య మృదోరపి బాహో
    శ్శక్తి రుగ్రతమా శరనాశే |
    దృశ్య తే జగతా మధిపే తే
    భాషతాం తవకస్తను తత్వం ||

16. కంబుకంఠి తవేశ్వరి కంఠ
    స్తారహార వితాన విరాజీ |
    దేవరాడ్భుజ లోచన పథ్యో
    దేవి మే భణతా ద్బహుభద్రం ||

17. ఆననస్య గభస్తి నిధేస్తే
    రామణీయక మద్భుత మీష్టే |
    అప్యమర్త్య సుతాఖిల సిద్ధే
    ర్వాసవస్య వశీకరణాయ ||

18. నప్రసన్న మలం రవిబింబం
    చంద్రబింబ మతీవ నభాతి |
    సుప్రసన్న మహోజ్జ్వల మాస్యం
    కేన పావని తే తులయామః ||


14. ఓ తల్లీ ! నీ హస్తముల మార్దవమును గుఱించి కాంతినిగూర్చి యింద్రుడే పల్కుగాక. మును లా హస్తదాతృత్వ పటుత్వములను మాత్రము వర్ణింపగల్గిరి.


15. ఓ తల్లీ ! పుష్పమాలికలవంటి నీ మృదుబాహువులశక్తి రాక్షస సంహారమందుగ్రమై గన్పట్టెను. నీ శరీరతత్త్వ మెవడు చెప్ప గలడు ?


16. ఓ దేవీ ! ముత్యాలహారముతో బ్రకాశించుచు, దేవేంద్రుని లోచనముల కింపై యున్న నీ కంఠము నాకుబహు భద్రములను బల్కుగాక.


17. ఓ దేవీ ! కాంతులకు నిధియైన నీ ముఖముయొక్క అద్భుత రామణీయకమునకు దేవతలచే నుతింపబడు సర్వసిద్ధులు గల యింద్రుని వశమొనర్చుకొను (వశీకరణ) సిద్ధి కలదు.


18. ఓ దేవీ ! రవిబింబములో నెక్కువ ప్రసన్నతలేదు. చంద్ర బింబములో నెక్కువ యజ్జ్వలత్వము లేదు. సుప్రసన్న ముగల మహోజ్జ్వలమైన నీ ముఖమును దేనితో మేము సరిపోల్చుట ?

(సూర్యునిలో నుజ్జ్వలత్వమే కలదు, చంద్రునిలోఁ బ్రసన్నతయే కలదు. రెండు గుణములు నీ ముఖమునఁ గలవు కనుక నిరుపమానము.)

19. లోచనే తవలోక సవిత్రి
    జ్యోతిషశ్చ శవసశ్చ నిధానే |
    వక్తు మబ్జసమే నను లజ్జే
    ధోరణీ మనుసృత్య కవీనాం ||

20. ఆయతోజ్జ్వల పక్ష్మలనేత్రా
    చంపక ప్రసవోపమ నాసా |
    రత్న దర్పణ రమ్య కపోలా
    శ్రీలిపి ద్యుతి సుందరకర్ణా ||

21. అష్టమీ శశి భాసుర ఫాలా
    విష్టపత్రయ చాలక లీలా |
    స్మేర చారుముఖీ సురభర్తుః
    ప్రేయసీ విదధాతు శివంమే ||

22. మందహాసలవేషు నలక్షా
    మేచకా చికుర ప్రకరేషు |
    శోణతా మధరే దధతీ సా
    రక్షతు ప్రకృతి స్త్రిగుణా నః ||

23. సర్వలోక వధూజనమధ్యే
    యాం శ్రుతి స్సుభగామభిధత్తే |
    యాదివో జగతో రుచిసార
    స్తాం నమామి పురందరరామామ్ ||

24. స్వర్గభూపతి లోచనభాగ్య
    శ్రీశ్శరీరవతీ జలజాక్షీ |
    భారతస్య కరోతు సమర్థం
    రక్షణే నరసింహ తనూజమ్ ||


19. ఓ తల్లీ ! నీ లోచనములు కాంతికి, సర్వతోగతికి నిధులు. కవుల ధోరణి ననుసరించి వానిని పద్మములతో బోల్చుటకు నేను లజ్జించుచుంటిని.


20. విశాలములై ప్రకాశించు నేత్రములు, సంపెంగపువ్వుతో సరియగు నాసిక, రత్న ఖచితమైన అద్దములవంటి చెక్కిళ్లు, శ్రీకారమును బోలు సుందర కర్ణములు,


21. అష్టమీ చంద్రుని బోలు ఫాలము, ముల్లోకములను చలింప జేయు విలాసము, నవ్వుచే సుందరమగుచున్న ముఖముగల యింద్రాణి నాకు మంగళము లొనర్చుగాక.


22. చిఱునవ్వునందు తెలుపురంగు, తల వెంట్రుకలయందు నలుపు రంగు, అధరోష్ఠమందెరుపురంగు - యీ మూడు గుణములు గల ప్రకృతి మమ్ము రక్షించుగాక. (సత్త్వరజస్తమన్సులు)


23. సకలలోక నారీమణులలో శుభప్రదయైనది అని యే దేవిని వేదము చెప్పుచున్నదో, జగదాకాశముల రెండింటియందే దేవి కాంతిసారమో, అట్టి యింద్రాణికి నేను నమస్కరింతును.


24. శరీరమును ధరించిన యింద్రుని లోచన భాగ్యలక్ష్మియగు పద్మ నేత్రములుగల దేవి భారతరక్షణకై నరసింహ పుత్రునకు సామార్ధ్యము నిచ్చుగాక.

('సర్వభూపతి'కి బదులు 'స్వర్గ భూపతి' యని పాఠాంతరము)

25. లోకమాతురిమే రమణీయాః
    పాకశాసన చిత్తరమణ్యాః |
    అర్పితాః పదయోర్విజయం తాం
    సత్కవేః కృతయో మణిరాగాః ||

            ________

4. మేఘవితానస్తబకము

1. అమరక్షితి పాలక చేతో
   మదనం సదనం శుచితాయాః |
   స్మిత మాదివధూ వదనోత్థం
   హరతాదఖిలం కలుషం మే ||

2. సుతరామధనామతిఖిన్నా
   మధునా బహుళం విలపంతీం |
   పరిపాతు జగత్త్రయనేత్రీ
   భరతక్షితి మింద్ర పురంధ్రీ ||

3. స్థలమే తదమర్త్య నృపాల
   ప్రమదే తవ "మేఘ వితానం" |
   అయి యత్రపరిస్ఫురసీశే
   తటిదుజ్జ్వల వేషధరా త్వం ||

4. తటితా తవ భౌతిక తన్వా
   జితమంబుధరే విలసంత్యా |
   ఉపమా భువి యాలలితానాం
   యువచిత్త హృతాం వనితానాం ||


25. గణపతియొక్క రమణీయమైన యీ 'మణిరాగ' వృత్తము లింద్రాణీ పాదములందర్పింపబడినవై ప్రకాశించుగాక.


__________


1. ఇంద్రుని మనస్సును మదింపజేయునది, శుభ్రతకు స్థానమైనది యగు ఆదిస్త్రీయొక్క ముఖమునుండి వెడలు మందహాసము నా యఖిల కలుషములను హరించుగాక.


2. బొత్తిగా ధనములేనిదై, యతిఖిన్ను రాలై, యిప్పుడు బహుళ రోదనము గావించుచున్న భరతక్షి తిని త్రిలోకపాలకురాలైన యింద్రాణి రక్షించుగాక.


3. ఓ తల్లీ ! మెరుపనెడి యుజ్జ్వలవేషముతో నీ వెచ్చట ప్రకాశింతువో, అట్టి మేఘసమూహము నీకు స్థలమైయున్నది.

(ఈస్తబకములోనివి మేఘవితానవృత్తములగుట చమత్కారము)


4. భూలోకమందు లలితమై, యువకచిత్తములను హరించు వనితలను బోలి మేఘమందు విలసించు తటిద్రూపముతోనున్న నీ భౌతికదేహము జయప్రదముగా ప్రకాశించుచున్నది.

5. స్ఫురితం తవలోచన హారి
   స్తనితం తవధీర గభీరం |
   రమణీయతయా మిళితా తే
   శచిభీకరతా చపలాయాః ||

6. చపలే శచి విస్ఫురసీంద్రం
   ఘనజాలపతిం మదయంతీ |
   దితిజాత 'మవగ్రహ' సంజ్ఞం
   జనదుఃఖకరం దమయంతీ ||

7. ప్రభు మభ్రపతిం రమయంతీ
   దురితం సమతాం శమయంతీ |
   హరితాం తిమిరాణి హరంతీ
   పవమాన పథే విలసంతీ ||

8. అలఘుస్తనితం విదధానా
   బలముగ్రతమంచ దధానా |
   హృదయావరకం మమమాయా
   పటలం తటిదాశు ధునోతు ||

9. సురపార్ధివ జీవిత నాథే
   నిఖిలే గగనే ప్రవహంత్యాః |
   తటితస్తవ వీచిషు కాచి
   చ్చపలా లసతీహ పయోదే ||

10. విబుధ ప్రణుతే ధనికానాం
    భువనేషు భవంత్యయి దీపాః |
    పటుయంత్రబలా దుదితానాం
    తవ దేవి లవాః కిరణానాం ||


5. ఓ శచీ ! నీ తటిత్స్ఫురణ దృష్టిని హరించుచు, నీ గర్జన ధైర్యముతో గంభీరమైయున్నది. మెరుపురూపమున నున్న నీ భయం కరత్వము రామణీయముతో మిళితమైయున్నది.


6. ఓ దేవీ ! మేఘాధిపతియైన యింద్రుని మదింపజేయుదానవై, జనులకు దుఃఖమును గలిగించిన 'అవగ్రహ' మను పేరుగల రక్కసుని ఖండించి నీవు ప్రకాశించుచుంటివి.


7. మేఘాధిపతియగు నింద్రుని రమింపజేయుదానవు, నమస్కరించు వారి పాపములను హరించుదానవు, దిక్కుల తిమిరములను హరించుదానవు. అయి నీ వాకాశమందు విలసిల్లుచుంటివి.


8. అధిక గర్జనయు, ఉగ్రబలమును ధరించు తటిత్తు నా హృదయము నాక్రమించిన మాయ యనెడి తమః పటలమును శీఘ్రముగా నశింపజేయుగాక.


9. ఓ తల్లీ ! సమస్తాకాశమందు బ్రవహించు తటిద్రూప తరంగములలో నొకటియైన మెఱుపీ మేఘమందు బ్రకాశించుచున్నది.

(అవ్యక్తముగా నంతటను అలలుగా వ్యాపించియున్న విద్యుచ్ఛక్తియొక్క ఒకయలయే మనకుఘోరమైన మెఱుపగుచున్నది)


10. ఓ తల్లీ ! ధనికుల గృహములందు పటుయంత్ర బలమువలన బుట్టిన కిరణములుగల దీపములు (విద్యుద్దీపములు) నీ యొక్క లేశకాంతి యగుచున్నవి.

11. వ్యజినానిచ చాలయసి త్వం
    బత సర్వ జగన్‌నృప జాయే |
    విబుధో౽భి దధాత్వధవా కో
    మహతాం చరితస్య రహస్యం ||

12. ఇహ చాలిత ఈడ్య మనీషై
    రయి యంత్ర విశేష విధిజ్ఞైః |
    బహుళాద్భుత కార్యకలాప
    స్తటితస్తవ మాతరధీనః ||

13. అచర స్తరుగుల్మలతాదిః
    సకలశ్చచరో భువి జంతుః |
    అనితి ప్రమదే సురభర్తు
    స్తటితస్తవ దేవి బలేన ||

14. మనుతే నిఖిలో౽పి భవత్యా
    మనుజో౽నితి వక్తి శ్రుణోతి |
    అవలోకయతేచ భణామః
    కిముతే జగదంబు విభూతిం ||

15. అతిసూక్ష్మపవిత్ర సుషుమ్నా
    పథత స్తనుషు ప్రయతానాం |
    కులకుండ కృశాను శిఖాత్వం
    జ్వలసి త్రిదశాలయ నాథే ||

16. ఇతరో న సురక్షితి పాలా
    త్కులకుండ గతో జ్వలనోయం |
    ఇత రేంద్ర విలాసిని నత్వ
    త్కులకుండ కృశాను శిఖేయం ||


11. ఓ తల్లీ ! నీవు పంకాలను (వ్యజనములను) తిరుగునట్లు చేయు చుంటివి. ఆశ్చర్యము ! ఏ పండితుడు గొప్పవారి చరిత్రమును జెప్పగలడు ?


12. ఓ మాతా ! కొనియాడబడు బుద్ధిచే యంత్ర విశేషముల నెఱిగినవారు చేయు నద్భుతకార్య విశేషములన్నియు తటిత్తు వగు నీ కధీనము లేకదా !


13. ఓ దేవీ ! సంచరించలేని చెట్లు, పొదలు మొదలైనవి, సంచరించు సకల జంతుజాతముకూడ భువిలో తటిద్రూపిణివైన నీ బలము వల్లనే జీవించుచున్నవి.


14. ఓ తల్లీ ! నీ సహాయమువల్లనే సర్వమానవులు చింతించుట, కదలుట, పలుకుట, వినుట, చూచుట చేయుచున్నారు. మేము నీ యైశ్వర్యము నేమి వర్ణించగలము.


15. ఓ దేవీ ! అతి సూక్ష్మమైన పవిత్రమగు సుషు మ్నా నాడీ మార్గములో కులకుండాగ్ని శిఖవై, పవిత్ర దేహములందు నీవు ప్రకాశించుచుంటివి (తటిద్రూపముతో)


16. ఓ దేవీ ! కులకుండమును బొందిన యీఅగ్ని యింద్రునికంటె వేఱుకాదు, ఆ కులకుండాగ్ని శిఖ నీకంటె వేఱుగాదు.

17. కులకుండ కృశాను శిఖాయాః
    కిరణైః శిరసి స్థిత ఏషః |
    ద్రవతీందు రనారత మేత
    ద్వపురాత్మమయం విదధానః ||

18. మదకృద్బహుళామృత ధారా
    పరిపూతమిదం మమకాయం |
    విదధావసి భజన్మనుజాప్తే
    కులకుండ ధనంజయ దీప్తే ||

19. శిరసీ హసతః సితభానో
    రమృ తేన వపుర్మద మేతి |
    హృది భాత ఇనస్యచభాసా
    మతిమేతు పరాం శచి చేతః ||

20. మమయోగమదేన నతృప్తి
    ర్నిజదేశదశా వ్యథితస్య |
    అవగంతు ముపాయ మమోఘం
    శచి భాసయ మే హృదిభానుం ||

21. విదితః ప్రమదస్య విధాతుః
    శశినో జనయిత్రి విలాసః |
    అహముత్సుక ఈశ్వరి భానో
    ర్విభవస్యచ వేత్తు మియత్తాం ||


17. కులకుండాగ్ని శిఖయొక్క కిరణములచే శిరస్సునందుండుచు, శరీరము నాత్మమయ మొనర్చు చంద్రు డనవరతము ద్రవించు చుండెను.

(ఆ కిరణములచే చంద్రుని ద్రవింపజేసి, తద్ద్రవముచే శరీరము నాత్మమయ మొనర్చునది కులకుండాగ్ని శిఖయే.)


18. ఓ దేవీ ! నా యీ శరీరమును మదింపజేయు బహుళామృత ధారలచే నీవు నాకు పవిత్రత నిచ్చుచుంటివి.

(ఆకులకుండధనము భజించు మనుజులందు విస్తరించును.)


19. ఈ శిరశ్చంద్రుని యమృతస్రావముచే శరీరము మదముబొందు చుండ, హృదయమందు బ్రకాశించు సూర్యకాంతివలన చిత్తము జ్ఞానముబొందుచున్నది.

(ఈ రెండింటికి, అనగా సూర్యచంద్రుల వ్యాపారమున కగ్ని శిఖ కారణము)


20. ఓ శచీ ! భారతదేశగతిని జూచి దుఃఖితుడనై యున్న నాకు యోగమదముచే తృప్తి గలుగదు. అమోఘమైన ఉపాయము నెఱుగుటకై నాహృదయమందు సూర్యుని ప్రకాశింపజేయుము.


21. ఓ తల్లీ ! ఆనందముగలిగించు చంద్రకళావిలాసము నాకు తెలిసినది. సూర్యుని వైభవముయొక్క పరిమితి నెఱుగుటకు నే నుత్సాహపడుచుంటిని.

22. వరుణస్య దిశి ప్రవహంతీ
    మదమంబ కరోషి మహాంతం |
    దిశి వజ్రభృతః ప్రవహంతీ
    కురుబుద్ధి మకుంఠిత సిద్ధిం ||

23. అమలామధిరుహ్య సుషుమ్నాం
    ప్రవహస్యధునాంబ మదాయ |
    అమృతా మధిరుహ్యచ కించి
    త్ప్రవహేశ్వరి బుద్ధిబలాయ ||

24. భరతక్షి తిరక్షణ కర్మ
    ణ్యభిధాయ మనోజ్ఞముపాయం |
    అథ దేవి విధాయచ శక్తం
    కురుమాం కృతినం శచి భక్తం ||

25. నరసింహసు తేన కవీనాం
    విభునా రచితైః కమనీయైః |
    పరితృవ్యతు మేఘవితానై
    ర్మరుతా మధిపస్య పురంధ్రీ ||
  
            _______


పంచమం పాంక్తం శతకమ్ సంపూర్ణమ్.


22. పశ్చిమదిక్కున బ్రవహించుచు (వెన్నెముకయందున్న సషుమ్న యందు) గొప్ప మదమును గలిగించుచుంటివి. నీవు తూర్పు దిశ (ముందువైపున్న హృదయమందు - సూర్యుడు ప్రకాశించు వైపు) బ్రవహించి బుద్ధికి శాశ్వతసిద్ధి నిమ్ము.

(పాశ్చాత్య దేశములు, ప్రాగ్దేశములు శ్లేషచే నుద్దేశింపబడెను)


23. ఓ తల్లీ ! నిర్మలమైన సుషుమ్న నధిష్ఠించి మదముకొఱకు ప్రవహించుచుంటివి. అమృతానాడి నధిష్ఠించి (శిరస్సునుండి ముందు వైపునకు హృదయమువరకు నుండు సూక్ష్మనాడి) కొంచెము బుద్ధిబలముకొరకు ప్రవహింపుమా.


24. ఓ దేవీ ! భారతభూమిని రక్షించుటకై నా మనస్సునం దుపాయములుచెప్పి, భక్తుడనైన నన్ను శక్తిమంతునిగా జేసి, కృతకృత్యుని గావింపుము.


25. నరసింహపుత్రుడైన కవిశ్రేష్ఠునిచే రచింపబడిన కమనీయ 'మేఘవితాన' వృత్తము లింద్రాణికి దృప్తినిచ్చుగాక.


_________