With the kind permission of the copy - right holder
Sri D. S. VISHWAMITRA, B. A,. LLB.
SIRSI, (North Kanara Dt.)
ప్రతులు వలయువా రీదిగువ అడ్రసుకు వ్రాయవలెను : -
1. గుంటూరు లక్ష్మీకాంతము, యలమంచిలి (విశాఖాజిల్లా) లేదా
2. J. G. K. MURTHY,
22, Burkit Road, T. Nagar, Madras - 17.
మనవి మాట
'ఇంద్రాణీ సప్తశతీ' యను నీ గ్రంథము మహత్తరమైన స్తోత్ర కావ్యము. దీనిని రచించిన కావ్యకంఠ శ్రీవాసిష్ఠ గణపతిముని యాంధ్రుడు. బొబ్బిలికి సమీపమందున్న కలువఱాయియను గ్రామము నివాసముగా గల్గిన తల్లిదండ్రు లీయన జన్మించుటకు పూర్వము పొందిన కొన్ని దివ్వ దర్శనములచే నీయన తమ యిష్టదైవమగు గణపతియొక్క యంశసంభూతుడని విశ్వసించి యీయనకు గణపతి యను పేరిడిరి. వారి విశ్వాసమునకు తగిన ట్లీయనయం దసాధారణ ధీవిక్రమము, వాక్సిద్ధి, యాశుకవితాప్రజ్ఞ మొదలగు దివ్యవిలాసములు బాల్యమందే ప్రస్పుటమగుట జూచి తమ విశ్వాసమును ద్రువపరచుకొనిరి. కాని, బాలగణపతి వారి నమ్మకమును కాదనకున్నను తన కా దైవాంశానుభవ మాంతర్యమున గల్గకుండుట గుర్తించుకొని, తత్ప్రాప్తికొఱ కీశ్వరానుగ్రహమును సాధించుటకు పదునాఱవయేటనుండి తపస్సును బూనెను.
అత్యంత భక్తిశ్రద్ధలతోడను, శాస్త్రములనుండియు పెద్దలవల్లను గ్రహించిన విధివిధానములతోడను నాచరింపబడిన యీ తపస్సునం దచిరకాలములోనే భువనేశ్వరీ యనుగ్రహమున దివ్యావాగ్రస ప్రవాహమును, ఈశ్వరానుగ్రహమున నిర్విషయధ్యాస యోగమును బడసినను దృప్తిజెందక తన తపస్సునకు ఫలముగా నిజతపస్స్వరూపాపానుభవమునే కాంక్షించుచు సుమారు పండ్రెండు సంవత్సరములు పాటు పడెను. కాని లక్ష్యము సిద్ధించ లేదు. అప్పుడు వేదశాస్త్రభాష్యము లందును, పురాణేతిహాసములందును పేర్కొనబడిన తపఃపదనిర్వచనములనే శంకించుకొని, దాని యదార్థమును తర్కించుకొనుచుండగా నొక ప్రేరణము బొంది యరుణాచలక్షేత్రమున 1907 సం||లో కృత్తికోత్సవముల సమయమునకు ధ్యానదీక్షబూనెను. ఈశ్వరకృప స్రవించుట కప్పటికి నిర్ణయమయ్యెను కాబోలు ! అది కావ్యకంఠుని పై నేకాక ఆ క్షేత్రమున పండ్రెండు సంవత్సరములనుండి నిరంతర తపోమగ్నుడైయున్న నొక బ్రాహ్మణస్వామిపై కూడ స్రవించెను. ఆ కృప చొప్పున బ్రాహ్మణస్వామి నాశ్రయించి శంక దీర్చుకొనుటకు కావ్యకంఠు డొకవంక ప్రేరేపితుడై, యింకొకవంక చిరకాల మంతర్దృష్టి యందున్న కారణమున వాగ్రస ప్రవాహములేక శుష్కించిన కంఠ నాళములచే బద్ధకంఠుడైన బ్రాహ్మణస్వామి ముక్తకంఠుడై తన కనుభవ సిద్ధమైన నూత్న మార్గముచే తపస్స్వరూపము నుపదేశించుటకు ప్రేరేపితుడయ్యెను.
ఉపనిషత్తుల్యమైన యీ నవ్యోపదేశముచే కావ్యకంఠుడు కృతార్థుడై, తనకు ప్రాప్తించిన సిద్ధగురుని పూర్వాశ్రమ నామమును సంస్కరించి యతనికి భగవాన్ రమణమహర్షి యను పేరుంచి యంగీకరింప వేడెను. 'సరే నాయనా' యని పల్కి గురువంగీకరించుట బట్టి 'నాయన' యను క్లుప్తనామము గణపతిమునికి ప్రసిద్ధమయ్యెను. అటు పిదప నీ యుపదేశ సందర్భములను సమకూర్చిన యుపనిషద్దేవతయగు 'ఉమ' నుద్దేశించి, 'ఉమా సహస్ర' మను స్తోత్రకావ్యమును పంచదశాక్షరీ మంత్రబద్ధముగా రచించి, దానియం దీ నవ్యోపదేశముచే కర్మ - భక్తి - యోగ - జ్ఞాన మార్గములు సంస్కరింపబడిన తీరును జూపెను. ఆ స్తోత్రఫలముగా తన దివ్యదృష్టిచే శ్రీ రమణునియందు గాంచబడిన కార్తికేయాంశను ప్రస్ఫుటము గావించి, దానిచే లోక మందిప్పుడు వక్రమైయున్న బుద్ధిని సంస్కరింప వేడెను. ఈ ఫలము వెంటనే సిద్ధించి, ఆఱు నక్షత్రరూపములుగా నొకా నొక దివ్య తేజస్సాకాసమునుండి వ్యక్తమై శ్రీరమణుని బొందుట కావ్యకంఠునితో పాటక్కడివారు పెక్కుమంది తిలకించి ధన్యులయిరి. అటుపిమ్మట గణపతిమునియందు రేణుక యను నామాంతరముగల ఇంద్రాణి ప్రత్యేక కృప జూపజొచ్చెను. వైదిక దేవతయైన యీమె కృపవలన వేదహృదయ భేదజ్ఞానము, శ్రీరమణుని యుపదేశమునకు కవచమగు నొక వేదమంత్ర దర్శనము, తపఃపరిపాకమందు క్రమముగా కపాలభేదనమను సిద్ధిచే నమృత ప్రాప్తిని గణపతిముని పొంది, ఋగ్వేదఋషివలెబ్రగాశింప జొచ్చెను. అట్టి యపూర్వ కటాక్షమును బరపిన ఇంద్రాణి నుద్దేశించి 1923 సం||లో కపాలభేదనమైన పిదప రచింపబడిన స్తోత్రకావ్యమే యీ 'ఇంద్రాణీ సప్తశతీ'. దీనికి ఫలముగా మనదేశమందప్పుడు పాలించుచున్న పరదేశ ప్రభుత్వమునుండి విముక్తిని, దేశస్థులందు వేదమతదృష్టి నిచ్చి వారియందు వీర్య తేజోభి వృద్ధిని యర్ధించెను. ఉమా సహస్ర పారాయణమువలన తపఃప్రబోధమగుటకు సంకల్పించినట్లే కవి దీని పారాయణమువలన నంతర్బాహ్య శత్రువర్గ నాశనమును సంకల్పించెను.
ఉమాసహస్రములో వలెనే దీనియందును 25 శ్లోకముల నొక్కొక్క స్తబకముగా కూర్చి, యొక్కొక్క స్తబకము నొక్కొక్క ఛందస్సుతో రచించెను. మఱియు, నొక్కొక్క శతకమున కొక్కొక్క వైదిక ఛందోనామమిడి, కవి వైదిక దేవతను సార్థకము చేసెను. అది గ్రీష్మఋతువైనను ప్రతి దినము రచనాంతమందా దేవత మెఱుపుల నాకసమందు గల్పించి తన సంతోషమును జూపెను.
అట్టి యీ పవిత్ర గ్రంథమును ప్రచురించు భాగ్యము నాకు చేకూరినందుల కింద్రాణిదేవతకు, నామెకు పుత్రులైన శ్రీ రమణ గణపతులకు నే నెంతయు కృతజ్ఞుడను. నాచే ప్రచురితమైన శ్రీ గణపతిముని గ్రంథములందిది పదియవ పుష్పము. దీనికి పూర్వము ప్రచురితమైన స్తోత్రచతుష్కముతో బాటు దీనిని గూడ నీ సంవత్సరము వచ్చిన శ్రీ గణపతిముని నిర్వాణదినమున కర్పించుకొనునట్లు శ్రీ జయంతి ప్రెస్సు, కాకినాడ వారచ్చొత్తి యిచ్చినందులకు వారికి నేనెంతయు కృతజ్ఞుడను.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.