ఇంద్రాణీ సప్తశతీ/జాగతం శతకమ్
ఓం
సప్తమం
జాగతం శతకమ్
1. ద్రుతవిలంబితస్తబకము
1. సురమహీరమణస్య విలాసినీ
జలచరధ్వజ జీవితదాయినీ |
హరతు బోధదృగావరణం తమో
హృదయగం హసితేన సితేన మే ||
2. నమదమర్త్యకిరీటకృతైః కిణైః
కమఠపృష్ఠనిభే ప్రపదేంకితా |
పరిధునోతు శచీ భరతక్షితే
ర్వృజినజాల మజాలమకంపనం ||
3. అతితరాం నతపాలన లోలయా
విబుధనాథ మనోహరలీలయా |
కిరిముఖీ ముఖ శక్త్యుపజీవ్యయా౽
విదితయా౽దితయా గతిమానహం ||
4. ఘనహిరణ్య మదాపహ రోచిషా
వనరుహాననయా౽వన దక్షయా |
గతిమదింద్ర మనోరధ నాథయా
భువనమేవ న మే కులమత్రకౌ ||
5. తనుషు వామనమూర్తిధరే విభౌ
తమనుయాచ విరాజతి వామనీ |
శరణవా ననయాంబికయా లస
త్కరుణయా౽రుణయా పదయోరహం ||
1. మీనధ్వజుడైన మన్మధునకు జీవితమిచ్చిన జననియై, సురపతి యైన యింద్రున కర్ధాంగియైన యింద్రాణీదేవి తన స్వచ్చమైన హాసముచే నా బుద్ధి నావరించి, నా హృదయమం దలముకొనిన తమస్సును హరించుగాక. (ఇది మీనావతారస్మృతి)
2. నమస్కరించు దేవతాకిరీటముల తాకుడువలన కాయలుకాచి తాబేలు పృష్ఠముతో సమమగు పాదములుగలిగిన శచీదేవి యధికమై తొలగింప నసాధ్యమగుచున్న భారతభూమియొక్క పాపములను నశింపజేయుగాక. (కూర్మావతారస్మృతి.)
3. నమ్రులను బాలించుటయం దత్యంతాసక్తికలది, విభుని చిత్తమును హరించు విలాసముకలది. వరాహముఖ మొదలగు శక్తి మాతృకల స్వరూప జీవనాధారమగునట్టి యవ్యక్తమహిమ గలదియైన ఆదిమస్త్రీచే నేను గతిగలవాడనగుదునుగాక. (వరాహావతారస్మృతి.)
4. హిరణ్య సంబంధమగు మదమును హరించు ఘనమైన తేజస్సు గలది, పద్మముఖియు, రక్షించుటయందు దక్షురాలునగు ఇంద్రాణివలన నీ భూమియందు నా కుల మొక్కటియేగాక భువనమంతయు గతి బొందుచున్నది. (నారసింహావతారస్మృతి)
5. విభుడైన యింద్రుడు వామనమూర్తివేషమును ధరించగా నతని ననుసరించి వామనియై విరాజిల్లినది (మూర్తిసంక్షి ప్తమైనప్పుడు మూర్తియందు శక్తియు సంక్షి ప్తమగును). ప్రకాశించు దయ కలది, యెఱ్ఱని పాదములుకలదియైన యింద్రాణిని నేను శరణు
6. సకరుణా కుశలం మమరేణుకా
తనురజా తనుతా దుదితో యతః |
యుధి ముని ర్వదధౌ పరశుం దధ
జ్జనపతీ నపతీవ్ర భుజామదాన్ ||
7. సుజన శత్రురమాధి ఘనధ్వనిః
శచి స రాత్రిచర స్తవతేజసా |
జనని రామసహోదర సాయకం
ప్రవిశతావిశతా దధికౌజసః ||
8. తవ మహః కళయాబలమా ప్తయా
జనని శుంభనిశుంభ మదచ్చిదా |
జగదరక్ష్యత గోపకు లేశితు
స్తనుజయానుజయార్జునసార ధేః ||
9. న వినిరూపయితుం ప్రభభూవ
యాం కలిజనో వివిధం కధయన్నపి |
మునిహృదంబుజ సౌధతతేందిరా
జయతి సా యతిసాధుజనావనీ ||
బొందుదును. (వామనావతారస్మృతి - చిద్గుహలోని పరమాకాశ స్వరూపమంతటను నిండియున్న స్వరూపమున కవిభక్తమైనను ప్రతివ్యక్తియందు చిద్గుహనధిష్టించుట కంగుష్టప్రమాణ మగుట వామనవైభవము.)
6. ఏ రేణుకకుదయించిన (శక్తిగల) పరశువును (పరశువన గొడ్డలి గాక అస్త్రవిద్య గావలయును లేదా వేదభాషయందు కపాల భేదన మొనర్చు వైభవముగల సుషుమ్న కర్థమై యుండును) ధరించిన ముని యుద్ధమందు రాజుల తీవ్ర భుజగర్వమును హరించెనో, దయామయియైన ఆ రేణుక నాకు కుశలము జేయుగాక. (పరశురామావతారస్మృతి)
7. ఓ తల్లీ, శచీ ! శ్రీరాముని తమ్ముడగు లక్ష్మణుని బాణమందు బ్రవేశించి, సూర్యశతముకంటెను నధిక తేజస్సు గలిగిన నీ జ్యోతి సజ్జనులకు శత్రువైన రాక్షసుడగు ఇంద్రజిత్తును (మేఘనాధుని?) చంపెను. (రఘురామావతారస్మృతి)
8. ఓ తల్లీ ! బలమును బొందినది, శుంభనిశుంభులనెడి రక్కసుల మదమును హరించినది. గోపకుల ప్రభువైన నందునకు జన్మించినది, కృష్ణుని సోదరియై మాయాదేవిగా పుట్టినదియైన నీ తేజః కళవలన జగత్తు రక్షింపబడెను. (కృష్ణావతారస్మృతి)
9. కలికాల జనులే దేవిని గుఱించి యెన్ని విధములుగా జెప్పినను నిరూపించు కొనజాలకుండిరో, ముని హృదయ పద్మసౌధములపై (అసంగబుద్ధిరూపమున) విహరించుచు యతులైన సాధు జనులను రక్షించుచున్న ఆ దేవి ప్రకాశించుచున్నది. (ఇదియే శుద్ధబుద్ధి లక్షణము గనుక బుద్ధావతారస్మృతి)
10. ఇమమయి త్రిదివేశ్వరి కల్కినం
రుషమపోహ్య సవిత్రి విలోకితైః |
సురపతే ర్ద్విషతో౽ఘనతో లస
స్మదనకైరవ కైరవలోచనే ||
11. స్మరదమర్త్య నృపాల విలాసినీం
ప్రబలపాతకభీతి వినాశినీం |
ప్రవణయాంత రనన్య ధియా లస
ద్వినయయా నయ యామవతీర్మనః ||
12. భగవతీ గగనస్థలచారిణీ
జయతి సంగరరంగ విహారిణీ |
సుకృత శత్రు మతిభ్రమకారిణీ
హరిహయారి హయాది విధారిణీ ||
13. శరణవానహ మర్జునసహాసయా
భువనభూపతిహారి విలాసయా |
దివి పులోమజయా ధవళాచలే
గిరిజయా౽రిజయా వితదేవయా ||
14. చరణయోర్ధృతయా విజయామహే
నయమ శేష జగన్నృప జాయయా |
దివిపులోమజయా ధవళాచలే
నగజయా గజయానవిలాసయా ||
15. అరివధాయ విధాయ బుధాధిపం
పటుభుజాబల భీషణమాజిషు |
న భవతీ శచి గచ్ఛతి దుర్గతః
క్వచన కాచన కాతర ధీరివ ||
10. ఓ త్రిలోకేశ్వరీ ! నీవు కోపమును విడిచి, యింద్రుని మోహ పరవశుని జేయుదృష్టితో పాపాత్ముడైన యీ జనుని (నన్ను) పాపియగు శత్రువునుండి రక్షింపుము. (కల్కి = కల్కము కలవాడు గనుక కల్క్యావతారస్మృతి.)
11. ఓ మనస్సా ! ప్రబలపాపభీతిని దొలగించు నింద్రాణిని నీయంత రంగమున నిశ్చలమైనట్టి, వినయముతో గూడినట్టి, యనన్యమై ప్రకాశించునట్టి బుద్ధితో స్మరించుచు రాత్రులు వెళ్ల బుచ్చుము.
12. గగనమందు సంచరించునది, యుద్ధమందు విహరించునది, పుణ్యమునుండి శత్రువుల మతిని భ్రమింపజేయునది, యింద్రుని శత్రువులైన హయుడు మొదలుగాగల రక్కసులను భేదించునది యగు భగవతి ప్రకాశించుగాక.
13. తెల్లని నవ్వుగలది, ఇంద్రునాకర్షించు విలాసముగలది, స్వర్గమం దింద్రాణీ రూపిణిగా నున్నది, ధవళాచలమందు గిరిజాంబగా నున్నది, శత్రువులను జయించి దేవతలను రక్షించినది యైన అంబికను నేను శరణుబొందుచున్నాను.
14. చరణములందు మాచే ధరింపబడినది, ఇంద్రునకు భార్యగా నున్నది, స్వర్గమం దింద్రాణియై యున్నది, ధవళాచలమందు పార్వతిగా నున్నది, యేనుగు గమనమువంటి గమనవిలాసము గలది యగు దేవివలన మేము ప్రకాశించుచుంటిమి.
15. ఓ శచీ ! యుద్ధమందు దేవేంద్రుని శత్రువధకొఱకు సమర్ధ భుజబలయుక్తునిగా జేసి, నీ వొకానొక పిఱికిదానివలె దుర్గము (కోట) నుండి యెచ్చటికిని వెడలవు.
16. సపది మానసధైర్యహృతో జగ
జ్జనని వజ్రతనోర్జ్వలితార్చిషః |
అరిజనే ప్రథమం తవవీక్షయా
సురపతే రపతేజసి విక్రమః ||
17. న మననోచితమస్తి పరం నృణాం
విబుధరాజవధూపదపద్మతః |
జగతి దర్శనయోగ్యమిహా౽పరం
న రమణీ రమణీయముఖాబ్జతః ||
18. శరణవానహమస్మి పురాతన
ప్రమదయా మునిగేయ చరిత్రయా |
స్వబలచాలిత నాకజగన్నభో
వసుధయా సుధయా సురరాడ్దృశాం ||
19. అయమహం గతిమా నతిశాంతయా
త్రిదివభూమిపతి ప్రియకాంతయా |
మనసి మే నిజనై రతిభక్తితః
నిహితయా హితయా సుకృతాత్మనాం ||
20. వినయతః స్మృతయా గమయామ్యహం
జనిమతాం జనయిత్రి నిశాస్త్వయా |
ప్రసృతయా కులకుండ ధనంజయా
దృతతనూ తత నూతన వేగయా ||
21. సకృదమోఘ సరస్వతి సాధుధీ
హృదయవేద్య పదాంబుజసౌష్ఠవే |
మను శివం సుమనః పృధివీపతే
స్సువదనే వదనేత్రలసద్దయే ||
16. ఓ జననీ ! వజ్రతనువు, ప్రజ్వలించు తేజస్సుగల నీ వొక వీక్షణముచే శత్రువును తొలుత విగత తేజస్సుగలవానిగా జేసి, వాని ధైర్యమును నశింపఁ జేయగా, బిదప వానిపై సురపతి పరాక్రమమును చూపును.
17. ఇంద్రాణీ పాదపద్మములకంటె జగత్తులో మానవుల మననమున కుచితమైన దింకొకటి లేదు. రమణీయమైన ఆమె ముఖపద్మము కంటె దర్శనయోగ్యమైనది నరుల కింకొకటి లేదు.
18. మునులచే గానము చేయబడు చరిత్రగలది, స్వర్గ మధ్య పాతాళములను (స్వర్గమనెడి దివ్య తేజోలోకమును, ఆకాశమనెడి మధ్య మలోకమును, భూమిని) నిజబలముచే చలింప జేయునది, యింద్రుని దృక్కుల కమృతప్రాయమైనది యగు నింద్రాణి నాకు శరణము.
19. అతిశాంతరూపిణి, పుణ్యాత్ములకు హిత మొనర్చునది, తనయందు గల సంతత భక్తిచే మనస్సునందుండునది యైన ఇంద్రాణి నన్ను గతిగలవానిగా జేయుగాక.
20. ఓ జననీ ! నమ్రతతో గూడిన వినయముతో స్మరింపదగినది, కుల కుండాగ్ని నుండి ప్రసరించునది, ఋతశరీరములందు నూత్న వేగముతో వ్యాపించునదియైన నీ కళచే నేను రాత్రులను వెళ్ల బుచ్చెదను.
21. ఓ దేవీ ! (నీ వొక్క సారియైన) నాకు మంగళవాక్యము వేగముగా జెప్పుము.
22. దురవగాహపథే పతితం చిరా
జ్జనని గమ్యవిలోకన లాలసం
స్వయ మమర్త్యనృపాలమనోరమే
సునయనే నయ నేయమిమంజనం ||
23. అవతు నః స్వయమేవ పటూన్ విప
ద్వివధనాయ విధాయ బుధేశ్వరీ |
సకలమర్మసు వీతదయైః పరై
ర్వినిహతానిహ తాపవతః శచీ ||
24. సురధరాపతి జీవితనాధయా
స్వజననక్షితి రక్షణకర్మణి |
పటుతమో జన ఏష విధీయతా
మిహ తయా హతయాతు సమూహయా ||
25. గణపతేః శ్రుణుయాదిమముజ్జ్వలం
ద్రుతవిలంబితవృత్తగణం శచీ |
సలిలరాజసుతాభవనీభవ
ద్భువనపావన పాదసరోరుహా ||
________
2. జలోద్ధతాస్తబకము
1. హరిత్సు పరితః ప్రసాదమధికం
దధానమమల త్విషాం ప్రసరణైః |
మహేంద్రమహిళా విలాసహసితం
మదంతర తమో ధునోతు వితతం ||
22. ఓ జననీ ! దురవగాహమైన మార్గములో చిరకాలమునుండి పడిపోయి, గమ్యస్థానము బొందు నాసక్తి గల యీ జనుని నీవా స్థానమును స్వయముగా పొందింపుము.
23. విబుధేశ్వరియగు దయలేని శత్రువులచే సకల మర్మస్థలము లందును కొట్టబడి సంతాపము జెందియున్న మమ్ములను వివన్నాశనముకొఱకు సమర్ధులుగా జేయుచు స్వయముగా రక్షించుగాక.
24. రాక్షస సమూహమును హతముగావించిన ఆ యింద్రాణివలన భారతభూరక్షణకొఱకీ జనుడు సమర్ధుడు గావింపబడుగాక.
25. లక్ష్మి కాలయమైనట్టి, లోకములను పావన మొనర్చునట్టి పాద పద్మములుగల శచీదేవి గణపతికవియొక్క యుజ్జ్వలమైన యీ 'ద్రుతవిలంబిత' వృత్తములను వినుగాక.
- __________
1. నిర్మల కిరణములను ప్రసరింపజేయుచు, నన్ని దిక్కులందును నైర్మల్య మొనర్చు తేజఃప్రసాదము నధికముగా ధరించుచున్న యింద్రాణీహసితము విస్తరించియున్న నా యాంతర్య తిమిరమును హరించుగాక.
2. ప్రసూ స్త్రిజగతః ప్రియామఘవతః
కృపాకలితయా కటాక్షకళయా |
నితాంతమగతే ర్వికుంఠితమతే
ర్ధునోతు భరతక్షి తే రకుశలం ||
3. పురా శచి మతిస్త్వమీశితు రధో
నభస్తను మితా పృథఙ్మతిమతీ |
అనంతర మభూః సరోజ నయనా
తనుః సురపతేర్విలోచన సుధా ||
2. ముల్లోకములను కనిన యింద్రప్రేయసి యత్యంత గతిహీనురాలైనట్టి, నష్టబుద్ధియైనట్టి యీ భారతదేశముయొక్క దుస్థితిని తన కృపతోగూడిన కటాక్షకళచే నివారించుగాక. (కన్నబిడ్డ ననుగ్రహించు తల్లివలె)
3. ఆదియందు (అనగా విశ్వసృష్టికి పూర్వము) సచ్చిదానంద తత్త్వస్వరూపుడైన యీశ్వరుని చిత్తువైయున్న నీవు విశ్వసృష్టి కొఱకు పృథఙ్మతివైతివి.
(ఇక్కడ 4 రూపములు చెప్పబడెను. (1) కర్తయైన యీశ్వరుని యందభిన్నయై, తత్త్వస్వరూపముతోనున్న చిత్తు తానే కర్తయై ప్రభుత్వరూపిణియై మూలమందున్నది. (2) తరువాత సృష్టికొఱ కీశ్వరస్వరూపము తన మహిమచే వ్యాపించగా, మహీమా లక్షణమం దీశ్వరునే కర్తవలె ప్రచురించుట కహమ్మహమ్మను స్ఫూర్తులనిచ్చునొకానొక భాసమానలక్షణ యయ్యెను. ఇదియే సగుణ బ్రహ్మలక్షణము. 'అయితిని'అను నర్థమిచ్చు హృత్ + అయం = హృదయమను నామముచే ప్రసిద్ధమైన రూపమిదియే. (3) తరువాత (మహిమయొక్క వ్యాపారముచే చిమ్మబడుచున్న యీశ్వరసంపదనుధరించుటకు) ఆకాశశరీరిణి వైతివి. (4) అటు తరువాత (యీశ్వరునినుండి విభాజ్యమై చిమ్మబడు వీర్య వస్తు సంపద మహిమయుతమైయున్నను, ఈశ్వరచైతన్యము నీయనిదై జడత్వస్థితినిబొంది యాకాశగర్భమందుండగా, 'అహరి'చైతన్యమును బ్రవేశపెట్టిన అనుగ్రహ వ్యాపారమనెడి మాతృలక్షణముచే) సురపతికి నేత్రామృతమగు పద్మనేత్రయైన స్త్రీరూపిణి వైతివి. (ఇదియే యనుగ్రహ దేవతా స్వరూపము)
4. పరత్ర విగుణా సతో౽సి ధిషణా
సభ స్తనురిహ ప్రపంచ మవసి |
అసి స్వరబలా ప్రియా సురపతే
రియత్తవ శచి స్వరూప కథనం ||
5. ప్రజాపతిపదే పురాణపురు షే
స్మృతా త్వ మదితిః సురాసురనుతే |
జనార్దన పదే రమాసి పరమే
సదాశివపదే శివా త్వమజరే ||
6. ఉషా ఇనపదే స్వధానలపదే
పురందరపదే త్వమీశ్వరిశచ |
యథా రుచి విదుః పదాని కవయ
శ్చితిశ్చ చితిమా న్యువామృజుగిరా ||
7. అమేయ మమలం పురాణపురుషం
తదీయ విభవాభిదాయిభిరిమే |
వదంతి కవయః పదైర్బహువిధై
స్తథైవ భవతీం తతో మతభిదాః ||
8. నభశ్చపవనః స్వరశ్చపరమ
స్తటిచ్చ వితతా పతిశ్చ మహసాం |
సుధాంశురనలో జలంచ పృథివీ
సవిత్రి యువయో ర్విభూతిపటలీ ||
4. పరాకాశరూపమందు గుణముతో గూడనిదానవై నీవు మూలమైన సద్రూపునకు బుద్ధి లక్షణవైయుంటివి (కర్తప్రచురణబుద్ధి), యిచ్చటనున్న ఆకాశతనువుతో నీవు ప్రపంచమును పోషించుచు రక్షించుచుంటివి. స్వర్గమనెడి గుణమునకు బలమునిచ్చు ప్రాణేశ్వరివైనీవు స్వర్గమం దింద్రుని ప్రియురాలివైతివి. ఓ శచీ ! నీ స్వరూప కథ యిది.
5. ఓ సురాసురస్తూయమానులాలా ! పురాణపురుషుడైన ప్రజాపతి స్థానమందు నీవు 'అదితి' వై స్మరింపబడుచుంటివి. ఉత్కృష్ట జనార్దనపదమందు 'లక్ష్మి' వై నీ వుంటివి. నాశనరహితమైన సదాశివపదమందు నీవు 'శివ' వై యుంటివి.
6. సూర్యుని స్థానమున 'ఉష' వై, అగ్ని పదవియందు 'స్వధ' వై, యింద్రపదమందు 'శచి' వై కవులచే నా యా స్థానముల కుచితపదములతో పిలువబడితివి. వేదవాక్కులో మీ రుభయులు జ్ఞాతృ, జ్ఞానము లగుదురు.
7. అమేయుడు, నచింత్యుడు నగు పురాణపురుషునినీ కవులతని సంబంధమగు వైభవములను దెలుపు పదములతో పిలుచు చున్నారు. దేవీ ! నిన్ను గూడ వా రట్లే పిలచిరి. మతభేద మందులకే (అనగా వైభవ నామములందున్న భేదముచే) గలిగెను.
8. ఓ సవిత్రీ ! ఆకాశము, వాయువు, పరావాక్కు, వ్యాపించిన తటిత్తు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, జలము, పృధ్వి - యీ సర్వము మీ యిద్దరియొక్క యైశ్వర్య స్వరూపమే.
9. అపారబహుళ ప్రమోదలహరీ
సతః కిలచితిః పరత్ర వితతా |
పునర్వియదిదం పరీత్య నిఖిలం
జగంతి దధతీ పరా విజయతే ||
10. నయద్యపి పరాత్పరే నభసితే
సరోజనయనా వపుః పృథగజే |
తధాపి నమతాంమతీ రనుసుర
న్త్యేమేయ విభవే దధాసిచ తనూః ||
11. సహత్రిభువన ప్రపాలన కృతా
సమస్తమరుతాం గణస్య విభునా |
సదా శశి ముఖీ శరీర భృదజా
జగత్యదురితే శచీ విజయతే ||
12. కులం బహు భిదం బలం నభుజయోః
కధంను విపద స్తరీమ భరతాః |
సమర్థ మధునా విపద్విధుతయే
తవాంబ చరణం వ్రజామి శరణం ||
13. సమస్తమపిచ స్వదేశ విదుషాం
విధానపటలం బభూవ విఫలం |
అభాగ్య దమన క్షమం తదధునా
తవాంబచరణం వ్రజామిశరణం ||
14. నిజో మమజనో నితాంతమగతి
ర్న కుక్షి భరణే ప్యయం ప్రభవతి |
మహేశ్వరికృపా మరంద మధునా
తవాంబచరణం వ్రజామిశరణం ||
9. అతి విపులమైన ఆనంద లహరియై పరలోకమందు సద్వస్తువు నుండి వ్యాపించిన చిత్తు తిరుగ నిఖిలమయిన యాకాశమున వ్యాపించి, జగత్తును ధరించుచున్నది. అట్టి పరాశక్తి ప్రకాశించుగాక. (4 వ శ్లోకములో చెప్పబడినట్లిక్కడను గ్రహించవలెను.)
10. ఓ పరాత్పరా ! ఆ హేతువువలన ఆకాశముకంటె పద్మనేత్ర శరీరము (స్త్రీరూపిణి) నీకు వేఱుగాలేదు. అట్లైనను, నమస్కరించువారి బుద్ధి ననుసరించి నీవు శరీరములను దాల్చు చుంటివి.
11. ముల్లోకములను పాలించుచు, సకలమరుద్గణమునకు బ్రభువైన దేవేంద్రునితోసహ చంద్రముఖముగల్గి పుట్టుక లేనిదై, శరీరమును ధరించిన శచీదేవి పాపరహితజగత్తునందు (స్వర్గమందు) సదా ప్రకాశించుచున్నది.
12. (ఆర్య) కులము బహుభేదములను బొందియున్నది. భుజబలమా లేదు. భారతీయులు విపత్తుల నెట్లు దాటగలరు ? ఓ తల్లీ ! ఇప్పుడీ విపన్నాశనముకొఱకు సమర్థమైన నీ చరణమును నేను శరణు బొందుచుంటిని.
13. స్వదేశ పండితులయొక్క విధానపటలము గూడ సమస్తము విఫలమైనది. కనుక (ఆధునికోపాయముకొఱకు) ఓ తల్లీ ! దౌర్భాగ్యమును ఖండింపగల నీ చరణమును నేను శరణు పొందుచుంటిని.
14. ఓ మహేశ్వరీ ! నా జనులు నితాంతదుర్గతిని బొంది, వారి కుక్షిని బోషించుకొనుటకు గూడ నసమర్ధు లగుచున్నారు. ఓ తల్లీ ! ఇప్పుడు దయ యను మకరందముకొఱకు నీ పాదమును శరణు పొందుచుంటిని.
15. అదృష్ట కనకం కులం మమ చిరా
న్ని రాయుధమిదం నిరాశమభితః |
స్వభావత ఇవ ప్రబుద్ధమభవ
త్తవాంబచరణం వజ్రామిశరణం ||
16. అవీరచరితం విపాలక కథం
నిరార్షవిభవం చిరాన్మమకులం
ఇదం మమమనో నికృంతతి ముహు
స్తవాంబచరణం వజ్రామిశరణం ||
17. చిరాత్స్మృతిపథాదపి చ్యుత మజే
తపోబలభవం తమార్ష విభవం |
స్వదేశమధునా పునర్గమయితుం
తవాంబచరణం వ్రజామిశరణం ||
18. హతంచ విహతం ధుతంచ విధుతం
రుదంత మభితో విశిష్టకరుణే |
ఇమం స్వవిషయం శివం గమయితుం
తవాంబచరణం వ్రజామిశరణం ||
19. క్షయాయ సుకృత ద్విషాం విహరతాం
శివాయచ సతాం ప్రపంచ సుహృదాం |
నిజస్యమనసో బలాయచ పరే
తవాంబచరణం వ్రజామిశరణం ||
20. జయత్సు సుకృతం ద్విషత్సు పరితః
సతామపి కులే బలేన రహితే |
ఖలప్రియయుగే కలౌ పరిణతే
తవాంబచరణం వ్రజామిశరణం ||
15. బంగారమదృశ్యమైన నాయీకులము చాలకాలమునుండి నిరాయుధమై, సర్వత్ర నిరాశజెందెను. ఓ తల్లీ ! స్వభావముచేతనే మేల్కొన్నట్లున్న బుద్ధిచే వికాశముకొఱకు నీ చరణమును శరణు బొందుచుంటిని.
16. ఓ అంబా ! వీరుల చరిత్రనశించి, పరిపాలకుల కథపోయి, ఋషి వైభవము శూన్యమైయున్న నాయీకులము చిరకాలమునుండి నా మనస్సును మాటిమాటికి వేధించుచున్నది. నీ చరణమునే శరణు బొందుచుంటిని.
17. ఓ తల్లీ ! చిరకాలమునుండి (నిజ) స్మృతి మార్గమునుండియు జారిపోయి, తపోబలమువలన గాని బుట్టనిదియునగు ఋషి వైభవము నిప్పుడు తిరుగ నా స్వదేశము పొందుటకు నీ చరణమును శరణు బొందుచుంటిని.
18. ఓ కరుణామయీ ! కొట్టబడి, యణచబడి, కదల్పబడి, కల్లోల పెట్టబడి యంతటను రోదనముచేయు నా యీ స్వదేశము మంగళయుతమగుటకు నీచరణము నేను శరణుబొందుచున్నాను.
19. ఓ పరాదేవీ ! విహరించు పాపాత్ముల నాశనముకొఱకు, ప్రపంచమునకు మిత్రులయిన సత్పురుషుల మంగళముకొఱకు, స్వకీయమైన (మా), మనోబలము (మేము పొందుట) కొఱకు నీ చరణము నేను శరణు బొందుచుంటిని.
20. పాపాత్ములంతటను విజయము బొందుచుండగా, పుణ్యాత్ములు బలహీనులై యుండగా, దుర్మార్గులకు ప్రియమైన యీ కలియుగము పక్వమై యుండగా, తల్లీ ! నీ చరణమును నేను శరణు బొందుచుంటిని (కాలము మార్పకొఱకు)
21. అభాతి సుకృతే నిగూఢ విభవే
విభాతి దురితే ఫలాని దిశతి |
విధాన వికలే మనస్యభయదే
తవాంబచరణం వ్రజామిశరణం ||
22. పటౌ ప్రతిభటే గదే ప్రతిభయే
నతావన విధావతీవ నిపుణం |
సుపర్వ భువన క్షితీశదయితే
తవాంబ చరణం వ్రజామి శరణం ||
23. అమర్త్యపటలీ కిరీట మణిభా
భుజంగ కిరణం నితాంతమరుణం |
విపత్తి దమనం తమః ప్రశమనం
తవాంబ చరణం ప్రజామి శరణం ||
24. వినష్టవిభవా మిమాం పునరపి
శ్రియావిలసితాం విధాతుమజ రే |
స్వజన్మపృథివీం స్వరీశదయితే
ది శేర్గణపతేః కరాయపటుతాం ||
25. సుపర్వ వసుధాధి నాథసుదృశో
జలోద్ధతగతి స్తవోయమనఘః |
కృతిర్గణపతేః కరోతు విధుతిం
భయస్య భరతక్ష మాతల జుషాం ||
________
21. నిగూఢవైభవముగల పుణ్యములు ప్రకాశింపకుండగా, ఫలములనిచ్చు పాపములు ప్రకాశించుచుండగా. మనస్సు వికలత్వము బొందియుండగా, తల్లీ. నీ చరణమే శరణు బొందు చుంటిని.
22. ఓ యంబా ! శత్రువు సమర్థుడై యుండగా, రోగము భయంకరమై యుండగా, నమ్రులను రక్షించుటకు నిపుణురాలవైన నీ చరణమును నేను శరణు బొందుచుంటిని.
23. ఓ తల్లీ ! దేవతాసమూహముల కిరీట మణికాంతులనెడి కుండలినీ కిరణములను బొందినట్టి, మిగుల యెఱుపుగా నున్నట్టి, విపత్తులను తొలగించి యజ్ఞానమును నశింపజేయునట్టి నీ చరణము నాకు శరణము.
24. ఓ యీశ్వరీ ! వైభవము గోల్పోయిన నా యీ జన్మభూమిని తిరుగ లక్ష్మీప్రధము గావించుకొనుటకు గణపతి హస్తమునకు పటుత్వమునిమ్ము.
25. ఇంద్రాణీదేవిపై గణపతిచే రచింపబడిన నిర్దుష్టమగు 'జలోద్ధత' గతి గల యీ స్తవము భారతదేశ జనుల భయమును బోగొట్టి వారిని రక్షించుగాక.
- ___________
3. ప్రమితాక్షర స్తబకము
- ___________
1. ఉదితం మహేంద్రమహిళా వదనే
ప్రసృతం కరైర్దిశిదిశి ప్రగుణైః |
అహితం తమః ప్రశమయ ద్వమినాం
హసితం కరోతు మమభూరిశివం ||
2. భరతక్షి తే స్తిమిర మాశుహర
త్వరిచాతురీకృత విమోహమతేః |
రవిలక్షతో ప్యధికమంశుమతీ
పవిపాణి చిత్తదయితా వనితా ||
3. శశిలక్షశీతలకటాక్ష సుధా
తరుణార్కకోటి రుచిపాదయుగా |
హృది మే విభాతు మునిగేయగుణా
విబుధేంద్ర చిత్తరమణీ తరుణీ ||
4. కమనీయదీప్త సుకుమార తను
ర్మననీయ పావనపదాంబురుహా |
విదధాతు మే శివ మసద్విముఖీ
విబుధేంద్ర జీవితసఖీ సుముఖీ ||
5. అనుమాన మూఢ పితృవాఖ్యవశా
త్తనయేన దేవి వినికృత్తశిరాః |
తవ రేణుకా విలసితాకళయా
గణనీయశక్తి రభవద్దశసు ||
1. ఇంద్రాణియొక్క ముఖమం దుదయించి, ప్రతిదిక్కున విశేష గుణముగల కాంతులతో ప్రసరించుచు, మిగుల నప్రియమగు తమస్సును ఖండించు హసితము నా కధిక మంగళముల నిచ్చుగాక.
2. లక్షసూర్యులకంటె నధిక కాంతులుగల ఇంద్రాణి శత్రువుల చాతుర్యమునకు మోహవశమయిన భారతభూమియొక్క (మోహ) తిమిరమును తత్క్షణమే పరిహరించుగాక.
3. లక్షచంద్రులిచ్చు శీతలసుధాకటాక్షము గలది, కోటిసూర్య ప్రభాకలితమైన పాదయుగళము గలది, మునులచే నుతింపబడునది, ఇంద్రుని చిత్తమును రంజింప జేయునది యదు స్త్రీ (శచి) నా హృదయమందు బ్రకాశించుగాక.
4. కమనీయ కాంతితో నొప్పు సుకుమార శరీరముగలది, మననము చేయదగిన పాదములుగలది, ఇంద్రునిప్రాణసఖి, సుముఖురాలు, అసత్యపరులకు విముఖురాలు అగునట్టి దేవి నాకు మంగళములు చేయుగాక.
5. ఓ దేవీ ! అనుమానించిన పితరునియొక్క మూఢవాక్యమువలన కుమారునిచే ఛేదింపబడిన శిరస్సుగల రేణుక నీ యొక్క కళచే ప్రకాశించిన దశలో గణనీయమగు శక్తి (రూపిణి) యయ్యెను. (ఇంద్రాణీ యవతారస్వరూపిణి యయ్యెను.)
6. సకలామయప్రశమనం దురిత
క్షయకారి కాంక్షితకరంచ భవేత్ |
సురసుందరీ జనసమర్చితయో
ర్హృది రేణుకా చరణయోః కరణం ||
7. వినిహంతి పాపపటలం స్మరణా
ద్విధునోతి రోగనివహం భజనాత్ |
విధధాతి వాంఛితఫలం స్తవనా
న్మనుజస్య రామజననీ చరణం ||
8. శరణం వ్రజామి నవరవ్యరుణం
చరణం తవాంబ నృపజాతిరిపోః |
భరతక్షితే రవనతః ప్రథమం
మరణ మమేహ నభవత్వధమం ||
9. స్మరణం చిరాదవిరతం విదధ
చ్చరణస్య తే తరుణభానురుచః |
అయమస్తు రామజనయిత్రి పటుః
సురకార్య మార్యవినుతే చరితుం ||
6. దేవతలచే పూజింపబడు రేణుకా చరణసేవ (లేదా ధ్యానము) సకల రోగములను శమింపజేయును, పాపములను నశింప జేయును, హృదయ కామ్యములను నెర వేర్చును.
(ఈ స్తవమునకుగల పారాయణఫలము గూడ నిట్టిదే యని తెలియునది.)
7. పరశురామ జననియైన రేణుకయొక్క పాదములను స్మరించుట వలన మనుజుల పాపపటలము నశించుచున్నది, భజించుటవలన వాంఛిత ఫలము సిద్ధించుచున్నది.
8. ప్రథమమున భారతభూమికొఱకు నమ్రుడనైన నేను (అనగా ప్రథమమున భూమియొక్క శ్రేయస్సును గోరి, దేవిని సేవించు నేను), ఓ రేణుకా, బాలసూర్యునిబోలు నీ చరణమును శరణు బొందుచుంటిని. ఇచ్చట నాకు నీచమృత్యువు గలుగకుండుగాక (దేశవిముక్తి పోరాటములో)
9. ఆర్యులకు స్తుతిపాత్రవైన రామజననీ ! (బాల) మార్తాండునివలె బ్రకాశించు నీ చరణమును చిరకాలమునుండి యవిరళముగా స్మరించుచున్న యీ జనుడు దేవకార్యమును వహించి చేయుటకు సమర్ధుడగుగాక.
(దేశవిముక్తి నీశ్వరకార్యముగా కవి తలచెను. దానికొఱకు నిర్మాణమైన గాంధీయోద్యమము నట్లే భావించి కొంతచేయూత నిచ్చిన స్వవిషయమును గుఱించి కవి యీ శ్లోకమందును పూర్వశ్లోకమందును స్మరించెను.)
10. అవ భారతక్షితి మమోఘ దయే
కరణం భవత్విహ తవైషజనః |
నిజయోః సవిత్రి చరణాంబుజయో
ర్న విహాతుమర్హసి చిరాద్భజకం ||
11. అవిశ స్త్వమింద్రదయితే కిలతా
మపి యజ్ఞ సేన తనయాం కళయా |
అనఘవ్రతా సుకవయః ప్రథమాం
ప్రవదంతి యాం బహుళవంద్యగుణాం ||
12. భువి భారతంపఠతి యః సుకృతీ
కలుషం ధునోతి సకలం కిల సః |
ఇయమంబ శక్తికులరాజ్ఞి తవ
ద్రుపదస్యనందిని కథా మహిమా ||
13. అభిమన్యుమాతర మనల్పగుణా
మతిలంష్యు చైక్షత హరి ర్భవతీం |
అతిసౌహృ దేన యదిహార్యనుతే
తవ హేతు రీడ్యతమ శక్తికళా ||
14. గృహకార్యతంత్ర చతురాగృహిణీ
సకలేంద్రియామృతఝరీ రమణీ |
వరనీతిమార్గకథనే సచివో
వ్యభవస్త్వమంబ కురువంశభృతాం ||
10. ఓ యమోఘదయావతీ ! ఈ భారతభూమిని నీవు రక్షింపుము. అందుల కీ జనుడు సాధనమగుగాక (గాంధీవలెనే వేఱొక రంగమున). నీ నిజ (పాద)పద్మమును చిర కాలమునుండి భజించు వీనిని విడచివేయకుము. (కవి తన కార్యశక్తిని నిరూపించెను.)
11. ఓ యింద్రాణీ ! పూజనీయమగు బహుగుణములుగల యెవరిని కవులు పతివ్రతలలో ప్రథమురాలని, శ్రేష్ఠురాలని చెప్పు చున్నారో. ఆ యజ్ఞ సేనియగు ద్రౌపదిని గూడ నీవు నీ కళచే బ్రవేశించితివికదా.
(రేణుకయందు శిర శ్ఛేదమైనప్పు డింద్రాణి యావేశించినట్లే ద్రౌపదియందు కేశములచే నీడ్వబడినప్పుడు శక్తియావేశించి దేవకార్య కారణము వహించెను.)
12. పుణ్యాత్ముడైన యెవడీ లోకములో భారతమును పఠించునో, వాడు సకల పాపములను నశింపజేసికొనిన వాడగును కదా ! ఓ యంబయైన ద్రౌపదీ ! ఇది నీ కథయొక్క మహిమమే కదా!
13. ఆర్యులకు పూజ్యురాలవైన దౌపదీ ! కృష్ణు డధిక గుణములు గల సుభద్రను మించి నిన్నధిక ప్రేమభావముతో జూచిన విషయమునకు నీయొక్క కొనియాడదగిన శక్తి కళయే కారణమై యుండును.
14. ఓ యంబా ! నీవు పాండవులకు భార్యవై గృహకార్య తంత్రము లందు చతురు రాలవై, సకలేంద్రియముల కమృతఝరీవంటి రమణివై నీతిమార్గకథనమందు సచివురాలవుగూడ నైతివి.
15. న యుధిష్ఠిరస్య వరఘోరతపో
న ధనంజయస్య పటుబాహుబలం |
అరిసంక్షయం కృతవతీ బహుళం
తనవేణికా౽పచరితా ఫణినీ ||
16. అసితాపి కాంతి వసతి ర్మహతీ
వనితాజనస్యచ విమోహకరీ |
కుశలం మమాభ్రపతిశక్తికళా
ద్రుపదక్షి తీంద్ర దుహితా దిశతు ||
17. శిరసా సమస్తజనపాపభరం
వహతా౽భయాయ భువియా మవృణోత్ |
అమరాధిపః పతితపావని తాం
భువి కన్యకాం తవ వివేశ కళా ||
18. కళయా తవాతిబలయా కలితా
పురుషస్య యోగమఖిలాంబ వినా |
అఖిలేశ్వర ప్రహితతేజ ఇయం
సుతజన్మనే కిల దధావనఘా ||
15. శత్రునాశనము గావించినది ధర్మరాజుయొక్క ఘోరతపస్సు కాదు, అర్జునుని పటుతరబాహుబలము కాదు. అపచార మొనర్పబడిన నీ వేణీపన్నగమే బహుళశత్రునాశము గావించెను.
16. కృష్ణవర్ణమైనను కాంతిమంతమై, మహిమగలిగి, వనితా జనమును మోహింపజేసిన ఇంద్రశక్తికళా భరితయగు ద్రౌపది నాకు కుశల మొనర్చుగాక.
17. ఓ పతిత పావనీ ! సమస్త జన పాపభారమును (నుపలక్షితముగా) వహించి శిరస్సంబంధమగు నే వేణియందు (కృష్ణునిడైన) ఇంద్రునిచే నభయమీయబడుటకు భూమిపై నీ వవతరించితివో, ఆ (వేణిగల) కన్యకను భూమియందు నీ కళయే ప్రవేశించెను.
(ధర యనగా భూమికి, మెదడుకు గూడ నర్థమున్నందున ద్రౌపదియొక్క శిరస్సు సమస్త జన పాపభారమును వహించు భూమి కుపలక్షణము. అభయ మొసగబడిన వేణి భూమియందు పాపముచే పీడింపబడిన జనకోటిని నిరూపించును. అట్లు నిరూపించు లక్షణములను శిరస్సున వేణియందు బొంది పుట్టిన ద్రౌపది కభయమొసగిన సమయమున నామె నింద్రాణీ కళ యా వేశించి నట్లెంచవలెను. ఆ యావేశావతరణమున కుపాధి యగుటకై పుట్టిన పవిత్ర వ్యక్తి ద్రౌపది యని భావము.)
18. ఓ యఖిలాంబ ! అతి బలమైన నీ కళతో గూడిన అనఘ చరిత్రు రాలగు రేణుక పురుషావతరణము వేఱుగా లేకుండగనే పురుషుడైన అఖిలేశ్వరుని తేజస్సును గూడ కలిగియున్న ట్లాతేజమును తన కుమారునియందు బొందగల్గెనుగదా !
19. సురరక్షకస్య మదయిత్రి దృశాం
నరరక్షకస్య జనయిత్రి పరే |
కులరక్షణాయకృతబుద్ధిమిమం
కురు దక్ష మద్భుతపవిత్రకథే ||
20. ముముచుః కులే మమ సుపర్వపతే
స్తవచాభిధేయ మిహ మందధియః |
అపరాధమేత మతిఘోరతరం
జనని క్షమస్వ మమవీక్ష్యముఖం ||
21. ఇహ శారదేతి యతిభిర్వినుతా
ప్రథితాసు రేశ్వర మనోదయితా |
భువిభాతి కీర్తివపుషా శచి యా
సుకథాపి సా తవ సవిత్రికళా ||
22. అరుణాచలేశ్యరదరీ వసతే
స్తవతో మునేర్గణపతేః కుశలం |
వివిధావతార విలసచ్చరితా
వితనోతు సా విబుధరాడ్వనితా ||
23. అరుణాచలస్య వరకందరయా
ప్రతిఘోషితం కలుషహారి యశః |
విభుధాధినాథరమణీ శృణుయా
ద్గణనాథగీతమతిచారు నిజం ||
19. నరులనురక్షించు నో తల్లీ, యింద్రాణీ ! కులరక్షణమందు బుద్ధి గలిగియున్న వీనిని (కవిని) సమర్థునిగా జేయుము.
20. ఓ జననీ ! ఈ నా కులమందున్న మందబుద్ధు లింద్రనామమును, నీ నామమును గూడ విడిచిపెట్టిరి. నా ముఖముజూచి యతిఘోరమైన యీ యపరాధమును నీవు క్షమింపుము.
21. ఓ శచీ ! 'శారద' యని యీ లోకములో యతులచే నే దేవి పొగడబడుచున్నదో, ఇంద్రుని భార్యగా ప్రసిద్ధిజెందిన యే కాంత భూమియందు బ్రకాశించుచున్నదో, శుభ చరిత్రగల నామెయు నీ కళగానే యున్నది.
(అనగా శంకరాచార్య ప్రతిష్ఠితమైన 'శారద' యను విద్యా రూపిణి భూమియందు బ్రకాశించు నింద్రాణీకళయని భావము)
22. వివిధావతారములందు బ్రకాశించు చరిత్రగల ఆ యింద్రాణి యరుణాచలేశ్వర గుహను వసతిగా జేసికొని తపమొనర్చు గణపతిమునికి కుశలము చేయుగాక.
23. ఓ రమణీ! అరుణాచలగుహచే ప్రతిధ్వనింపబడుచు, గణపతిచే కలుషహరణముకొఱకు రచింపబడిన యీ కథాస్తవము చారు తరమై, నిజమై, నీ యశస్సంబంధమై, నీచే శ్రవణము చేయబడు గాక.
24. భరతక్షి తేః శుభవిధాయిషు సా
విబుధక్షి తీశదయితా దయయా |
ధనశక్తిబంధుబలహీనమపి
ప్రథమంకరోతు గణనాథమునిం ||
25. ముదితామిమా విదధతు ప్రమదాం
త్రిదివాధిపస్య నిపుణశ్రవణాం |
అమితప్రకాశగుణశక్తిమజాం
ప్రమితాక్షరాః సుకవిభూమిపతేః ||
________
4. సులలితతామరసస్తబకము
1. దిశతు శివం మమ చంద్రవలక్ష
స్తిమిరసమూహ నివారణ దక్షః |
కృతగతి రోధక పాతక నాశః
సురధరణీశవధూ స్మితలేశః ||
2. అవిదిత మార్గతయాతి విషణ్ణాం
గతిమపహాయ చిరాయ నిషణ్ణాం |
భరతధరా మనిమేష ధరిత్రీ
పతి గృహిణీ పరిపాతు సవిత్రీ ||
3. భువన మిదం భవతః కిల పూర్వం
యదమలరూపమనాకృతి సర్వం |
ప్రకృతిరియం కురుతాద దరిద్రా
మతిమతి శాతతరాం మమ భద్రా ||
24. ఆ యింద్రాణి ధనశక్తి బంధుబలము లన్నింట హీనుడై యున్న గణపతిమునిని కృపతో జూచి, భారతదేశ శుభము నొడగూర్చు వారిలో బ్రథమునిగా జేయుగాక.
25. సుకవిరాట్టైన గణపతియొక్క యీ 'ప్రమితాక్షర' వృత్తము లధిక కాంతి గుణశక్తులు గలిగిన ఇంద్రాణీదేవిని సంతోషము తోడను, నేర్పుతోడను వినునట్లు చేయుగాక.
- __________
1. చంద్రునివలె ధవళమైనది, చీకటి సమూహములను నివారింప సమర్ధమైనది, యెన్ని జన్మముల పాపములనైనను నశింపజేయునట్టిదియైన యింద్రాణీ మందస్మితలేశము నాకు శుభము గూర్చుగాక.
2. దేవేంద్రుని రాణియైన సవిత్రి - మార్గము తెలియక విషణ్ణురాలై చిరకాలమునుండి గతికోల్పోయి స్తంభించియున్న భారత భూమిని రక్షించుగాక.
3. ఈ భువనసృష్టికి పూర్వము నిరాకార నిర్మలమై యేది యంతటను నుండెనో, మంగళప్రదమైన ఆప్రకృతి నా బుద్ధిని తీక్ష్ణ మొనర్చుగాక. (అట్టి ప్రకృతినే పరదేవతయందురు)
4. సృజతి జగంతి విభౌ పరమే యా
సు బహుళ శక్తిరరాజత మాయా |
ప్రదిశతు సా మమ కంచన యోగం
ఝటితి నిరాకృత మానసరోగం ||
5. ప్రతి విషయం వికృతీ తవ సత్తా
విలసతి యా మతి మద్భిరుపాత్తా |
ఇయమనఘా పరిపాలిత జాతిం
వితరతు మే వివిధాంచ విభూతిం ||
6. ప్రతి విషయగ్రహణం పరిపూతా
మతిరఖిలస్య జనస్యచ మాతా |
మమ విదధాతు శుభం శుభనామా
త్రిదివ నివాసి నరేశ్వరరామా ||
4. జగత్తును (అనగా కదలిక లేదా చలనముగలిగి యచలస్వరూపముకంటె వేఱైనదానిని) సృజించుచు విభునియం దధికశక్తిగల యే మాయ (దీనినే కొందఱు చాలక మహిమను ధరించు ప్రాణశక్తి యందురు) రాజిల్లుచున్నదో, ఆమాయ నా మనస్సులోని రోగములను దొలగించి, నా కనిర్వాచ్య యోగము నిచ్చుగాక.
5. ప్రతివిషయమందు బుద్ధిమంతులచే స్వీకరింపబడు వికృతిభిన్న సత్తేదికలదో, ఆ పుణ్యప్రదమైన సత్తు సర్వజాతులను పాలించుటకు సమర్ధమైన నానావిధవైభవమును నా కిచ్చు గాక.
(అనగా వికృతులైన విషయరూపములనుండి నిర్విషయమైన బుద్ధి వికృతజాతుల సర్వమును వశమొనర్చుకొను వైభవము గలదియగును. కవి యట్టి బుద్ధియోగమును సాధించి కపాల భేదనముతో గూడిన యోగసిద్ధి బొందెను.)
6. ప్రతివిషయమును గ్రహించు సామర్ధ్యమునిచ్చుటకై జనులందరికి (దేవమానవ పితృగణము లందరికి) తల్లివలె వారియందు బుద్ధి రూపిణియైయున్నది. శుభనామముగలది యగు నింద్రాణి నాకు శుభము గూర్చుగాక,
(శక్తి స్త్రీరూపిణిగను, ఆకాశరూపిణిగను, విశ్వమందున్నట్లు పూర్వము చెప్పబడెను. వానిలో స్త్రీరూపము నిక్కడ ప్రస్తుతించి, తరువాత శ్లోకములో ఆకాశరూపమును కవి స్తుతించు చుండెను.)
7. గగనతనుర్జగతో విపులప్య
ప్రభుపదమగ్య్రమితా సకలస్య |
ప్రతిజనదేహమజా ప్రవహంతీ
మమహృది నందతు సా విహరంతీ ||
8. పటుకులకుండ ధనంజయకీలా
సముదిత హార్ద విభాకర లీలా |
ద్రుత శిర ఇందు కళామృత ధారా
జన మవతా న్నిజభక్త ముదారా ||
9. విషయ సమాకృతి రత్ర పురస్తా
ద్విమలతమా కిల తత్ర పరస్తాత్ |
భవన మయీ ధువనాచ్చ విభక్తా
మతిరవఘా౽వతు మామతిశక్తా ||
7. ఆకాశశరీరిణియై ఆమె విపులముగ వ్యాపించిన సకల జగత్తుల కంటె శ్రేష్ఠమైన (జగత్తులకుమించి వ్యాపించుటచే నాకాశము శ్రేష్ఠము, జ్యేష్ఠము కూడ అగును) ప్రభుపదమును బొంది యున్నది. ప్రతిమానవదేహమందు ప్రవహించుచు విహరించు చున్నను పుట్టుక లేక యున్న ఆ యాకాశరూపిణి నా హృదయ మందు క్రీడించుగాక.
(అనిత్యమైన వికృతచలనరూపములకంటె నిత్యచలనాత్మకమైన ఆకాశము శ్రేష్ఠము. ఇదియే సర్వప్రవాహములకు మాతృక వంటిది.)
8. సమర్థమైన కులకుండాగ్ని జ్వాలలుగలది, లెస్సగా నుదయించిన భానునివంటి హృదయప్రభావమే లీలగాగలది, శిరస్సునందు ద్రవించు చంద్రకళామృతధారలు గలదియైన ఉదారమగుదేవి తన భక్తజనమును రక్షించుగాక.
(ప్రతిమానవునియందు నాకాశరూపిణియై వ్యాపించియున్న దేవి తదాకాశముద్వారా చైతన్యమునిచ్చి యనుగ్రహించునప్పుడు మాతృలక్షణము త్రివిధములై మూలాధార, హృదయ మస్తక స్థలములం దెట్లుండునో వచింపబడెను.)
9. ఇక్కడ ముందున (సృష్టియందు, లేదా శరీరక్రియలందు) విషయాకృతిగాను అక్కడ వెనుకను (ఆకాశమున నుండు నిర్గుణ పరాస్థితియందు) మిగుల నిర్మలముగాను నుండి (ఇది దివ్య స్త్రీరూపచైతన్యము), విశ్వమును గృహముగా బొందినను భువనములకంటె వేఱుగా నిర్దోషమై యతి శక్తివంతమైయుండు (బుద్ధిసంబంధమగు) రూపము నన్ను రక్షించుగాక.
10. విషయ పరిగ్రహణేష్వతి సక్తా
విషయ విధూతిషు కాపి వివిక్తా |
అఖిలపతేర్మయి దీవ్యతు శక్తి
ర్విమలతమా విధుతేతర సక్తిః ||
11. దృశిదృశి భాతి యదీయమపాపం
దిశిదిశి గంతృచ వేత్తృచ రూపం |
భవతు శివాయ మమేయ మనింద్యా
భువనపతేర్గృహిణీ మునివంద్యా ||
12. జడకులకుండదరీషు శయనా
బుధకులవహ్నిషు భూరి విభానా |
హరిహయశక్తి రమేయ చరిత్రా
మమ కుశలం విదధాతు పవిత్రా ||
13. దహరగతాఖిల మాకలయంతీ
ద్విదళగతా సకలం వినయంతీ |
దశశతపత్రగతా మదయంతీ
భవతు మయీంద్రవధూ ర్విలసంతీ ||
10. విషయపరిగ్రహణమందు మిగుల ఆసక్తికలది, విషయములను వీడుటలో ననిర్వాచ్యమైన పవిత్రతకలది, మిక్కిలి నిర్మలమైనది, యితరాపేక్షలు లేనిదియగు నఖిలలో కాధిపశక్తి నాయందు బ్రకాశించుగాక.
11. ప్రతి దృక్కునందెవతె నిర్దోషరూపముచే (దృశ్యమును విడచిన దృష్టిరూపము) ప్రకాశించుచున్నదో, ప్రతిదిక్కున నెవతె (బుద్ధి) రూపముగా వ్యాపించి తెలిసికొనుచున్నదో, అట్టి యనింద్య యైనది, మునివంద్యయైనది యగు నింద్రభార్య నాకు మంగళము జేయుగాక.
12. జడుల కులకుండమందు శయనించునది (అనగా తిరోధానమైనది), పండితజనులందు - నిర్మలబుద్ధితో గూడి - కులకుండాగ్ని యందు విశేషముగా బ్రకాశించునది (చిదగ్ని రూపము నుద్గార మొనర్చు బుద్ధి జ్యోతియగునది), పవిత్రచరిత్ర గలదియైన యింద్రాణి నాకు కుశలమిచ్చు గాక.
(అజ్ఞానులలో నిద్రించునదియు, విజ్ఞానులలో మేల్కొనునదియు నని భావము.)
13. దహరగుహయం దుండి సకలమును బోషించుచున్నది. ఆజ్ఞా చక్రగతమై సకలమును శిక్షించుచున్నది (అనగా శాసించునది) సహస్రారగతమై యమృత మదముగలిగించునది (అనగా నిర్విషయ నిరతిశయానందము నిచ్చునది) యైన యింద్రాణి నా యందు విలసించుగాక.
(అనగా మూడు ప్రకారములగు విలాసములను జూపుగాక).
14. గృహయుగళీ శ్రియ ఆశ్రితగమ్యా
పదకమల ద్వితయీ బహురమ్యా |
సుమహృది భా త్వవికుంఠితయానా
హరి సుదృశస్తరుణారుణ భానా ||
15. ఉపరి తతా కులకుండ నిశాంతా
జ్వలిత ధనంజయ దీధితి కాంతా |
హరిహయ శక్తిరియం మమ పుష్టా
ద్రవయతు మస్తకచంద్ర మదుష్టా ||
16. నభసి విరాజతి యా పరశక్తి
ర్మమ హృది రాజతి యా వరశక్తిః |
ఉభయ మిదం మిళితం బహువీర్యం
భవతు సుఖం మమసాధితకార్యం ||
17. త్రిభువనభూమిపతేః ప్రియయోషా
త్రిమలహరీ సురవిష్టప భూషా |
మమ వితనోతు మనోరథపోషం
దురిత విపత్తి తతేరపి శోషం ||
18. పవన జగత్ప్రభు మోహనమూర్తి
ర్జలధర చాలన విశ్రుతకీర్తిః |
మమ కుశలాయ భవ త్వరిభీమా
జననవతాం జననీ బహుధామా ||
14. లక్ష్మి నివసించుటకు రెండు గృహములవలెనుండి, యాశ్రిత భక్తజనులు చేరదగినవై, బహురమ్యమై, యడ్డులేని గమనము గలిగి, బాలసూర్యప్రకాశమానమై యొప్పు ఇంద్రాణీ పదకమల ద్వయము నా హృదయమందు బ్రకాశించుగాక.
15. శరీరముయొక్క మీది (స్థూల) భాగమందు వ్యాపించి, కుండలినీ గృహముగాగలది, జ్వలించు నగ్ని కాంతులచే మనోహరమై యున్నది, పుష్టిగలది, పవిత్రమైనది యగు నీ యింద్రాణి నా శిరఃకమల చంద్రుని ప్రకాశింపజేయుగాక.
16. ఏ పరాశక్తి గగనమందు రాజిల్లుచున్నదో, ఏది నా హృదయ మందు ప్రకాశించుచున్నదో, బహు వీర్యవంతమైన ఆ రెండు శక్తులు నా హృదయమున మిళితమై (బాహ్యాంతర భేదములేక దేవతలందువలె) నా కార్యసాధన జేయుచు నాకు సుఖము నిచ్చుగాక.
(అహంకార మమకారములను దొలగించవలెనని భావము.)
17. మనోవాక్కాయ కర్మలు మూడింటిని హరించు నింద్రాణి (అన్న మయ, మనోమయకోశములను బాలించునది యను భావముకూడ కలదు), నా మనోరధమును బోషించి నెర వేర్చు గాక, నా పాపఫలమును నశింపజేయుగాక.
18. మేఘములను చలింపజేయుటవలన ప్రసిద్ధ కీర్తినొందినది, విస్తార తేజస్సుగలది, జన్మగలవారికి జనని యగునది, యింద్రుని మోహింపజేయునట్టిదియైన మూర్తి నాకు కుశలము జేయుగాక.
19. మమ సుర రాజవధూ కళయోగ్రా
ఖలజన ధూనన శక్తి నఖాగ్రా |
దమయతు కృత్తశిరాః కలుషాణి
ప్రకటబలా హృదయస్య విషాణి ||
20. కులిశివధూకళయా పరిపుష్టా
బుధనుత సద్గుణజాల విశిష్టా |
మమ పరితో విలసద్విభవాని
ద్రుపదసుతా విదధాత శివాని ||
21. సురజనరాడ్దయి తాంశ విదీప్తే
పదకమలాశ్రిత సాధుజనాప్తే |
దురితవశాదభితో గతభాసం
మనుజకుమారజనన్యవ దాసం ||
22. అమరనరేశ్వర మందిర నేత్రీ
సుమశరజీవన సుందరగాత్రీ |
భవతు శచీ వితత స్వయశస్సు
ప్రతిఫలితా గణనాథ వచస్సు ||
23. వికసతు మే హృదయం జలజాతం
విలసతు తత్ర శచీస్తుతిగీతం |
స్ఫురతు సమస్తమిహేప్సిత వస్తు
ప్రథితతమం మమ పాటవమస్తు ||
19. ఇంద్రాణియొక్క కళను బొంది (ఉగ్రకళ, శాంతకళ యని శక్తి రెండు విధములుగా నుండును. ఈ శ్లోకమం దుగ్ర కళను స్తుతించి, తరువాత శాంత కళను కవి పేర్కొనును.) యుగ్రమైనది, దుష్ట జనులను నాశన మొనర్చు పటుత్వము గల గోళ్లకొనలు గలది, అతి బలమైనది, కృత్తశిరస్సు గలదియైన ప్రచండచండి నా హృదయమందుగల విషతుల్య పాపములను సంహరించుగాక.
20. ఇంద్రాణికళతో గూడినది, పండితులచే పొగడబడు సద్గుణములు గలది యగు ద్రౌపది నా కంతటను వైభవముతో గూడిన మంగళములను సమకూర్చుగాక.
21. ఓ మనుజకుమార జనిని ! పాపవశమువలన నంతటను నిస్తేజుడనై దాసుడనగు నన్ను రక్షింపుము.
22. ఇంద్రుని మందిరమునకు నాయకురాలై, మన్మధుని బోషించు సుందర శరీరముగల శచీదేవి యొక్క కీర్తి గానముచే వ్యాపించిన గణపతి వాక్కునందామె ప్రతిఫలించుగావుత.
23. నా హృదయమను పద్మము వికసించుగాక (ఈ స్తుతిగీతము వలన), అందు శచీదేవి సంబంధమైన యీ గీతమామెకు విలాసము నిచ్చుగాక, సర్వేష్టార్ధములు నిహమందు (తత్ఫలముగా) వ్యక్తమగుటకు స్ఫురించుగాక, (ఆ యిష్టార్ధప్రాప్తిచే) నా సామర్ధ్య మధికమగుగాక.
24. కురు కరుణారససిక్త నిరీక్షే
వచనపథాతిగ సద్గుణలక్షే |
శచి నరసింహజ మాహితగీతం
భరతధరా మవితుం పటుమేతం ||
25. సులలిత తామరసైః ప్రసమాప్తం
వరనుతిబంధమిమం శ్రవణాప్తమ్ |
జనని నిశమ్య సుబద్ధ మశేషం
హరిలలనే మమ కుర్వభిలాషమ్ ||
________
సప్తమం జాగతం శతకమ్ సంపూర్ణమ్
24. ఓ కరుణామయీ ! వర్ణనాతీతములైన లక్షలకొలఁది గుణములు కలదానా ! భారతదేశ రక్షణార్ధ మీగీతములను రచించిన నరసింహసుతుడైన గణపతిని సమర్ధుని గావింపుము.
25. ఓ తల్లీ ! 'సులలితతామరస' వృత్తములచే సమాప్తము గావింప బడి, చెవులకింపగునట్లు నిబద్ధమైన యీ వరనుతిబంధమును నీవు పూర్తిగావిని నా యభిలాషను నెర వేర్పుము.
ఇట్లు,
శ్రీ భగవన్మహర్షి రమణాంతేవాసియు,
నరసింహ పుత్రుడును, కావ్యకంఠ బిరు
దాంకితుడును, వాసిష్ఠగోత్రనామకుడును
అగు గణపతిమునిచే విరచితమైన
ఇంద్రాణీ సప్తశతి సమాప్తము.
ఓం ఇంద్రాణ్యర్పణమస్తు.
________