ఆరోగ్య భాస్కరము/1-10 పేజీలు

వికీసోర్స్ నుండి
శ్రీ సూర్యనారాయణపరబ్రహ్మణేనమః.

ఆరోగ్య భాస్కరము

ఉ|| శ్రీపతి నీదు మండలము చేరి వసింపఁ ద్రయీతనుండవై

రేపులుమాపులు౯ ద్విజులు ప్రీతి నొసంగు జలాంజలుల్ కరం

బొపికతోడఁ గొంచు మఱి యూరకయుండక వారి బాధల౯

పాపుచునుండు నీదు పదపద్మముల౯ శిరముంతు భాస్కరా! ౧

ఉ|| ఈక్షితి విష్ణువంచు మఱి యీశ్వరుఁడంచు నిఁకేమొయంచు సం

రక్షణగోరి పెక్కురును రాళులు రప్పలు గొల్చుచుంద్రు. ప్ర

త్యక్షముగా విభాసిలెడి దైవము వన్నను నీవకాక యీ

రూక్షశిలాదు లెట్లగు? గురుత్వ మిఁకెందుల కందు భాస్కరా! ౨

ఉ|| లక్షలయోజనంబుల జ్వలత్ప్రళయానలుఁబోలి వెల్గు చే

కాక్షరథంబుమీఁద నినలాశువునం జను నుష్ణరశ్మి ని ౯

చక్షువులెత్తి చూచుటక శక్యముకాదనికాని యెన్నఁ బ్ర

త్యక్షపుదైవమ౯ విషయమందున సంశయమున్నె భాస్కరా! ౩

ఉ|| ఈక్షణఁ జేయఁ ద్వన్మహిమ మింకను నెంతయు యుండియుండె. ప్ర

త్యక్షత యొండెకాదు. నియతంబుగ నీ యుదయంబ కానిచో

అక్షయకాలరాత్రమగు నంతయు ధ్వాంతము పర్వెడి౯. జగ

చ్చక్షు వహస్కరుండవు త్విషాంపతి వారయు నీవు భాస్కరా! ౪

ఉ|| ఏలబహూక్తు. లాత్శ యొకఁ డేయయియుండిన లోకమంతకు౯

చాలినమేలుచేయుటకుఁ జాలనటంచని ద్వాదశాత్మవై

క్రాలుచునుంటి. వందునన కాదె సురో త్తమ లోకబాంధవా

ఖ్యాలలితుండవై యశముగాంచితి. పెంచితి వింక భాస్కరా! ౫

చం|| జగమునకంతకు౯ జగము సర్వమునుం గనుపింపఁజేయఁగ౯

తగినప్రదీపమై సతముఁ దజ్జగతీప్రజ సల్పుకర్జముల్

గగనచరుండవై సరిగఁ గమ్గెనుచుండుటఁ గర్మసాక్షియం

చొగి నుతియింపఁగాఁ బడుచునుండవె యింకను నీవు భాస్కరా! ౬
2

 చం||అదితికిఁ గశ్యపర్షికిని నాత్మజుఁడై జనియించి ఛాయయ౯
మదవతిఁ బెండ్లియాడి యమున౯ యము నాబిడయందుఁ గాంచియా
నది భుచి శుద్ధిఁజేయఁగను నందను బాపుల శిక్షఁజేయఁగ౯
సదయతఁ బంపియున్న నిను సంస్తుతిసేయఁ దరంబె భాస్కరా! ౭

చం|| జనులఁ బునీతులం జలుపఁజాలు సరిత్తున కన్న లొకపా
వను నినుఁ ఝుచుకొంచు ననివార్యతమై నపవిత్రపుం బనుల్
పొనరుచుచుండఁ గావలసె. పుర్వికు లిందుక యట్టిచోఁ ద్వదా
ద్యనఘపవిత్రదర్శన మనాచరణీయ మటండ్రు భాస్కరా! ౮

ఉ|| యత్నములేక కట్టెదుట నగ్నిభవజ్జలముఖ్య పావన
ప్రత్నపదార్థము ల్పడు. అపావన మూత్రవిసర్జనాదుల౯
యత్నపురస్సరంబుగన యాదెసఁ గన్గొనకుండ నుండనౌ.
నూత్ను లెటుండిన౯ బుధజను ల్పొనరించెద రట్ల భాస్కరా!

ఉ|| ఎవ్వ రెటు ల్పొనర్చినను నెరికిఁగావలె నాప్రసక్తి? నా
నెవ్వగ నాకుఁజాలు నిను నేను బ్రమత్తత నప్పుడప్ణు దౌ
దవ్వులఁ జూతు నప్పనుల. తాదృగఘక్రియ లింకఁజేతు. నీ
వవ్వి మది౯ స్మరింపక క్షమింపవలెం గృపతోడ భాస్కరా! ౧౦

ఉ|| తాదృ గమేధ్యపుం గ్రియలఁ ద్వన్ముఖ మేధ్యులఁ జాదకుండనే
ఏదొవిధం బొనర్చినను నింక సమేధ్యతమేంద్రియాళికి౯
త్వాదృ గయాభిముఖ్య మది తప్పనెతప్ప. దవార్యమౌటఁ ద
త్తాదృశకార్య మెన్నడును దప్పనఁబోలదుకాదె భాస్కరా! ౧౧

చం|| ఎవరెదియాచరించినను నీవు కనుంగొనకుండ నుండమి౯
భువిని జనించుటాదిగను బుద్ధిహీనత నేను జేసియు
న్న వృజినము ల్తలంచుకొనిన౯ భయమయ్యెడి. నీకు నాస్థితి౯
వివరముగా నిఁ కెవ్విధము విన్నపముం బొనరింతు భాస్కరా!

చం|| శతమొ సహస్రమో మఱి యసంఖ్యము లేనొ యొనర్చియుందు దు
స్కృతములు నేను. బుద్ధి యటు లీడ్చుటఁజేసి కృతంబు లవ్వి. లే
ద్గతమును గూర్చి చింతిలినఁ గార్యము లేదు. త్వదంఘ్రియుగ్మమే
గతి యిఁక. అస్మదుద్ధరణకార్యభరంబది నీద భాస్కరా!

౧౩
3

 
ఉ|| గ్రాసముఁ గూర్చి నీ కభిముఖంబుగ నిల్చి మహాగ్రహంబుమై
బాసయొనర్చితి౯. సతులపట్లను నట్ల పొనర్చియుంటి. ఈ
చేసినబాస తప్పితిని. చిత్తము నాఁగఁగలేకపోయితి౯.
దాసరితప్పు లన్నియును దండముతో సరిపెట్టు భాస్కరా! ౧౪

ఉ|| ఇట్టివి పెక్కులున్నయవి. నేనును నీవును దప్ప నన్యు లీ
గుట్టునెఱుఁగ. రేటికిఁగ గూఢపుఁ జెయ్వుల బైటఁబెట్టుకొం.
టెట్టిరిగూడఁ జెప్పికొన రీ నవగోప్యము. లిట్టికట్టుల౯
దట్టులు చేసియుండరె ఘనంబుగఁ బూర్వమునందు భాస్కరా!

ఉ|| త్వత్తనుజాతయౌ యమున తాఁజని గంగను గూడుచోటనే
బత్తి మునింగివచ్చితిని. పాపముఁబాపరె యాపె యాపె? ఈ
సత్తలులేవె వారికి? ప్రసన్నముఖాబ్జలు కాకయున్నచో
ఇత్తఱినేని నీవు వచియించి యటు ల్పొనరింపు భాస్కరా! ౧౬

చం|| యమునము గంగ రెండు నొకడౌనెడ స్నాతుల పాతకంబు పూ
ర్వమువలె నున్నఁ బ్రాఁబలకు వమ్మయిపోయెడి.అవ్వె యాత్శదే
హమయిన నీవు వానిని యథార్థముఁజేయుభరంబు పూనకే
క్రమముననో వసించు టది కార్యముగామి స్శరింపు భాస్కరా!

ఉ|| ధాత్రిసమస్తబుద్ధులకుఁ దప్పక ప్రేరకుఁ డీవయంచు గా
యత్రి వచించుచున్నయది. అందున మామకబుద్ధి యి ట్లిహా
ముత్రవిగర్హ్యపుం బనులు పూనఁగఁ బ్రేరణసేయుచుంట నీ
మిత్రతయంద లోపమును మిక్కిలి బాఱెడుఁగాదె భాస్కరా!

ఉ|| సంధ్యల సర్ఘ్యము ల్విడిచి సంస్తుతిఁజేయుచునుంటి నిన్ను. మో
హాంధ్యముమై నొనర్చుకొల యెప్పటి దప్పుడ యీఁగకుండిన౯
వంధ్యతవాటిలు౯ శ్రుతికి. వాస్తవ. మింకనునేను దుర్గతి౯
బంధ్యుఁడనౌచు నుండెదనొ పాత్రుఁడనౌదునొ చెప్పు భాస్కరా!

ఉ|| మత్కృతకల్శషంబు లతిమాత్రములై మఱి దేనఁగూడ నీ
షత్కృశభావముం బొరయఁజాలమి దుర్గతి తప్పకుండిన౯
త్వత్కృప తప్పఁజేయునది. త్వత్సుతుఁడేకద నారకంబున౯
మత్కుణమట్లు పాపులను మూడ్చుచునుండెడివాఁడు భాస్కరా!

4
ఉ|| ఆరయ ధర్మరాజు భవదాత్మజుఁ. డస్మదుదంతమంత వే

ర్వేఱుగ నచ్చఁజెప్పి సరవి౯ క్షమియింపఁగఁజేయుమయ్య. ఈ

నారకభీతి న న్విడిచిన ౯ మఱియొక్కటి విన్నవించుకో

పేరెములెత్తుచున్నయది పేశల మామకవాక్కు భాస్కరా! ౨౧

ఉ|| ఏఁదితొమ్మిదబ్దముల యీ డిపు డెన్న2ంగ నా.కిఁకెన్ని యేం

డ్లే బ్రదుకంగఁ గల్గినది యింతయెఱుంగ. చిరాయువీయఁగ౯

తాఁ బబు వంబుజాసనుఁడు. తద్విధి మన్చినయంతకాల మో

హో! బలహీనత౯ నవయకుండుటె కావలె నాకు భాస్కరా!

ఉ|| భాగ్యము భోగ్యము౯ మిగుల భాసిలవంచను చింతలేదు. న౯

యోగ్యుఁడటంచుఁ గొంద ఱనుచుండిరి. అంతియచాలుఁ గానిహా!

మృగ్యముసు మ్మనామయము. మేను రుజాభరితమ్ము. కాన నా

రోగ్యమొసంగుదాతవని రూఢిగ ని౯ భజియింతు భాస్కరా!

ఉ|| ఒక్కభవత్కళేబరమ యుద్ధరరోగయుతంబు గా. దిల౯

పెక్కురునున్నవారు పెదపెద్దతెగుళ్ళక యగ్గమై యటం

చక్కట! త్రోసిపుచ్చకయ. అత్యధికంబగుభక్తిఁజేయు నా

మ్రొక్కులనన్నిటిం గరుణ ముందు గ్రహింపఁగదయ్య భాస్కరా!

ఉ|| మ్రొక్కులకేమి? పెక్కురును ము౯ గృతపాతకులయ్యు నిట్టులే

మ్రొక్కుచునుంద్రు. నే నెవరిమ్రొక్కులటంచు గ్రహింతు?ఏరి యే

అక్కఱలంచుఁదీర్తునని యందువొ యేమొ. సురోత్తముండటం

చెక్కుడుభక్తి నిన్నె యజియ్ంచుచునుండు జనంబు భాస్కరా!

ఉ|| రుగ్యుతుఁ డెంచునౌ నిను. మరుత్సఖునిం ద్రవిణార్థి. ఇద్ది వై

రాగ్యసమేతులైన ఋషిరాజుల నిర్ణయ. మట్లగాన నీ

యోగ్యత నీక యున్నదని యొయ్యనఁ బెక్కురు ంరొక్కుచుండి రా

రోగ్యముఁగూర్చి. నేను నటు ంరొక్కుచునుంటిని భక్తి భాస్కరా!

చం||ఎనిమిదొ తొమ్మిదో సమల యీడుననుండఁగ మూత్రకృఛ్రమ౯

పెనుగద మొక్క డేరుపడి పెద్దయుఁబ్రొద్దును బాధపెట్టి పో

యినయది ముప్పదెన్మిదవయేట. తదర్థముగానె నేనిను౯

ప్రణుతియొనర్పుకుండినను ద్వత్కృపయే కత మందు భాస్కరా!
5
చం|| పదిపదునాలుగబ్దముల ప్రాయమున౯ ముకునుండి నిత్యము౯

బెదరున రక్తధారలు స్రవింపఁగఁజొచ్చె భయంకరంబుగా.

ఇదియును క్షోభపెట్టి కర మిప్పటి కిర్వదియేండ్లనుండి యె

య్యదియెదొ పీల్వఁ దగ్గినది. అద్దియు నీదయచేన భాస్కరా! ౨౮

ఉ|| ఆమము వృద్ధిఁబొందె నొగి న య్యెలప్రాయమునంద. అంత న

య్యామము గొంతునుండి పయి కాగతమై నసదగ్గుతోడఁదా

యీమహి నమ్మివేయఁబకు చించుక బాధకు హేతువయ్యును౯

నామది కెక్కదయ్యె బలునాళులదాఁక నదేమొ బాస్కరా! ౨౯

ఉ|| ముమ్మరమైన మోహమును మొత్త సమర్థుఁడఁగామి వచ్చి పం

దొమ్మిదవబ్దమందునన దూరుజ లెంతయు నావరించుడు౯

వమ్మయిపోయె మేల్తనువు. వానిని వాని భుజింప నీదయ౯

క్రమ్మఱ స్వాస్థ్యమేర్పడియె. కాని పురాస్థితిరాదు భాస్కరా! ౩౦

ఉ|| మూత్రముతోడఁ దేజమును బోవఁదొడంగెను నాఁటినుండి యే

మూత్రమొ దాననుండి యణుమాత్రము మార్పునుజెందఁజొచ్చెఁదా

గాత్రము. పాటనంబునకుఁ గల్గెను లోపమొకింత. ఐనను౯

ధాత్రి భవ ద్ఘృణాబలమునం దనుయాత్ర కృతంబు భాస్కరా!

ఉ|| ఇంకనుగొన్ని యామయము లింతవొ యంతవొ యాగతంబులై

సంకటపెట్టి కొంతపడి చన్నవి తిన్న ఘనౌషధంబుల౯.

కింకరణీయతాజ్ఞుఁడను ఖన్నుఁడనై మనఁగొన్ని నాళ్ళకు౯

జంకి తమంతఁదామ యవి చన్నవి యందొకకొన్ని భాస్కరా!

ఉ|| ఉక్తులిఁకేల పెక్కు? లెవియో రుజ లప్డపు డంకురించుచు౯

వ్యక్తములైయొ కాకయొ వినాశము నొందుచువచ్చె వెండియు౯.

రస్తసమృద్ధమౌచు మెయి రాజిలుచుండిన యన్నినాళు లీ

ఉక్తవిధంబునం గృతమహో! తనుయాత్ర మదీయ భాస్కరా!

ఉ|| నాశముఁజెందుచున్నతవొ నాదు శరీరమునందు గుప్తమై

యే శయనించియున్నయవొ యెవ్వఁడెఱుంగును గాని మామకీ

నాశయముల్ ప్రజాసముదయంబునకుం దెలియంగఁజేయుచు౯

దేశముఁ జుట్టివచ్చుటకు దేహబలం బది యుండె భాస్కరా. ౩౪
6
ఉ|| నల్వదివత్సరంబులక నాదుశరీరమునందు ర క్తపు౯

కాల్వలవేగ మాఁగుటయుఁ గన్గవ నిద్దపు టద్దపుంగవ౯

చెల్వునుగాంచె. కాని నడునెత్తి వికేశము. తక్కునౌదల౯

మొల్వదు నల్లవెండ్రుకయు. మోము వివర్ణ. మిఁకేమి భాస్కరా!

ఉ|| దంతము లొక్కడొక్కటి పదంపడి యూడఁగఁజొచ్చె. కాళ్ళతీఁ

పెంతయు నేర్పడె౯. బలవిహీనుఁడనైతిని. దానఁజేసి ర

వ్వంతపనిం బొనర్చుటక యంగము లోపకపోయె. ఇట్లు బల్

వింతగ సప్డ నేను శతవృద్ధుగఁ దోఁచితిఁగాదె భాస్కరా! ౩౬

ఉ|| దంశనపాతముఖ్యమగు తత్థ్సవిరత్వపుఁ జిన్నెలన్నియు౯

వింశతిహాయనప్రభృతి వేమఱు మూత్రములోనఁబోవు ధా

త్వంశమునుండి యేర్పడియె నంచు వచించె నొకం. డతండు తా

భ్రంశ మొకింతలేని మతిపాటవమున్న భిషక్కు భాస్కరా! ౩౭

ఉ|| బందరువాస మాయనది. పండితుఁడుం గవితామతల్లుకి౯

విందును నైన చెళ్ళపిళ వేంకటశాస్త్రులుగారి శిష్యుఁ డా

నంది. కనిప్రియుండు. కరుణం గని యార్తుల దుర్నివార్యపు౯

క్రందులె పాపు. శేషగిరిరావని పిల్చు జనంబు భాస్కరా! ౩౮

ఉ|| శ్రీలఁదలిర్చు బందరుపురిం గయిసేయుదుఁ బేర్మిమైని హై

స్కూలునఁ బండితుండుగను శోభిలు వేంకటశాస్త్రిగారిని౯

బాళి భజించిరా నరునుపట్టల నాగిరిరావుతోడుత౯

చాలినయంత సౌహృదము నాకు ఘటిల్లెఁగదయ్య భాస్కరా!

చం|| బలమఱి ప్రాప్తవార్ధకుని భంగిఁ గనంబడుచున్నయట్టినా

నలువదియొక్కవత్సరమున౯ మఱి బందరుఁ బోఁ దటస్థమై

తెలిపితి నాదు దుస్థ్సితిని దెల్లముగా గిరిరావుతోడుత౯.

సలిపెను దచ్చికిత్సకుఁడు చయ్యన మూత్రపరీక్ష భాస్కరా!

ఉ|| ఇర్వదియేండ్లనుండియును నేగెడి సారము దాననుండి న౯

పర్వఁగనున్న నంజురుజ బాగుగఁ దోఁచెను రుక్ప్తతిక్రియా

ధూర్వహుఁడైన యాయనకుఁ. దోడన స్నేహితుఁడౌటఁదద్రుజా

గర్వమడంచు మందు నిడె. కైకొని తింటినినేను భాస్కరా! ౪౧
7
ఉ|| సంహననంబు కొంత బలసంయుతమయ్యెను దాన. తద్రుజా

సంహృతి యౌటకాఁదలఁచి స్వాస్థ్యమునొందితి. షట్శరత్తు లే

యంహతికి౯ వశుండ నయి యాత్మనుగుందక భక్తినౌదల౯

సంహతలంబుఁజేర్చి సురసంస్తుతిఁ బుచ్చితి నెట్లొ భాస్కరా! ౪౨

ఉ|| అప్పటి కామవాతమను నామయ మొక్కటి యంకురించుడు౯

దెప్పర మిద్దినా కటులె ధీరత మూడునెలల్ సయించితి౯.

ముప్పుకు మూలమయ్యె నది. మూలన త్రోయను సిద్ధమయ్యె.హా!

చెప్పెదఁ దత్స్వరూపమును దిన్నగనీ కవధారు భాస్కరా! ౪౩

ఉ|| జానువునందు ము౯ మొలిచి చల్లగ నొప్పి యదేక్రమంబుగ౯

మ్రానయి తుంటిలోని కతిమాత్రముగం బొడువం దొడంగె. ఆ

పైనను రెండుపిక్కలును బల్శిని రోట నలంగఁబొడ్చిన

ట్లై నను క్షోభపెట్టె. ఇఁక నక్కట! ఏమివచింతు భాస్కరా!

ఉ|| దేహమునందు వ్యాప్తమగు తీఱని తీఁపుల తోడఁ గూడి నే౯

గేహమును డి కా ల్కదపనేరక గర్తపురి౯ వసింప శి

ష్ట్లా హనుమన్శనిషీ కని సన్మతి బుల్సు ప్రసాదరావుతో

స్నేహము గూర్చె నిర్వురుని జేరిచి యొక్కట వేగ భాస్కరా!

శా|| ఆయుర్వేదకలావిశారదుఁడకా కాంగ్లేయుభాషావిదుం

డాయార్యుం. డమలాపురోరుభవనుండైకూడఁ దత్కాలమం

దాయూర౯ ఘనవైద్యుఁడీతఁడనుపే రార్జించియున్నాఁడు. మే

ధాయుక్తుం. డవధాని. సత్కవియు విద్వన్శిత్రము౯ భాస్కరా!

మ|| హనుమచ్ఛాస్త్రులు ముందు మందువెల యెంతౌనో వచింపంగదే

అని ప్రశ్నింపఁ బ్రసాదరావు మదిఁ దా నంగీకరింపండు. కై

కొని భక్షింపుఁడు వెంకఁజూతమనువాక్కుం బల్కియట్లిచ్చుడు౯

తిని సారోగ్యుఁడనైతి నొక్కనెలకే తేజంబురా భాస్కరా! ౪౭

చం|| ప్రకటభిషక్క శేషగిరిరా. వతఁడిచ్చినయౌషధంబు వే

ఱొకస్థితి పట్టకుండ నపు డోమెనె కాని యణంపదయ్యె మా

మకమగు మూత్రదోషమును మందు తదంతికమంద యుండి పూ

నికమెయిఁ జాలినంత తిన నే నద కారణ మిందు భాస్కరా! ౪౫
8
శా|| తత్తేజఃక్షతినుండి నాదు బలుమై దౌర్బల్యభూయిష్ఠమౌ

టత్తేజస్వి ప్రసాదరావు కని తా నం దింకఁగొన్నాళు లా

యత్తి౯ నిల్పి ప్రదత్తభేషజముచే నారొగ్యమ్ం గూర్చి న౯

పుత్తెంచం బదియేండ్లు మంటి బలసంపూర్ణుండనై భాస్కరా! ౪౯

ఉ|| ఉల్లమునందు ని౯ నిలిపియో మఱి నిల్పకొ మర్ఘ్యపు౯ మిష౯

నీళ్ళను విడ్చుచుంటి. మఱి నిత్య ముపస్థితిఁ జెప్పుచుంటి. నీ

పేళ్లు పఠింప కెన్నడును బెట్టియెఱుంగను ముద్ద నోటిలో.

చెల్లనె త్వత్స్రసాదమును స్వీకృతిసేయుట కింక భాస్కరా!

చం|| నిలిచెద నిదుకట్టెదుట నే నపుడప్ణు త్వదేకదృష్టితో.

కొలిచెద మానసంబునను గూరుచుచు౯ సకలోపచారముల్.

పిలిచెదఁ బావనంబులగు పేరుల. దీనికిఁ ద్వద్వితీర్ణమౌ

ఫలమ ప్రసాదరావు. పలుభాషలతోడ నిఁకేల భాస్కరా! ౫౦

ఉ|| నాల్నెల లట్టె యుంచుకొని నా బలహీనతఁ గీళ్ళనొప్పుల౯

కాల్నడ సాగనంపుటయ కా కల బుల్సు ప్రసాదరా విఁ కే

వేల్నలిగల్గిన౯ మఱొక వెజ్జు స్మరింపకుఁ డేన యెప్ణు మీ

మే ల్నడిపించుచుందునని మిత్రజనుస్త్వము చాఁటె భాస్కరా!

చం|| నలువదియేడవబ్దమది నాకు. తదాది పదేండ్లదాఁక నే

నలియునులేక పత్రికను నడ్పితి దేశములం జరించితి౯.

తొలుతటిభార్య వోవ మఱి తోడవ పెండిలిఁజేసికొంటి. ఆ

కులసతియందుఁ గాంచితిని గొడ్కులఁ గూఁతును బ్రీతి భాస్కరా!

ఉ|| వ్రాసితి వ్యాసరాజముల వంచిన నెన్నడు మెత్తకుండఁగ౯.

చేసితిఁ బద్యపున్ రచన నేఁ బదివేలకు లోటులేనటుల్.

శాసితిఁ గాల్నదన్ రయమ దవ్వులనుండినయూళ్ళ. ఇంతయు౯.

గాసిలఁ ద్వత్ప్రసాదపరికల్పితదార్ధ్యముకల్మి భాస్కరా!

ఉ|| ఏఁబది యేడవబ్దమది యించుక వచ్చెనొ లేదొ వచ్చినా

పైఁ బడె శీతపు౯ జ్వరము. పక్షమొ మాసమొ యేడిపించె ఏ

దేబెలొ వైద్యులౌట నట దివ్యతరౌషధమే లభింప కే

ఏఁబదినాళ్ళకో చివర కే జ్వరముక్తుఁడ నైతి భాస్కరా! ౫౫ (2)
9


చం|| వడివడి నేగ నింక నొకవత్సర మెప్పటియట్టు. లింతలో

నడుమున నొప్పి యేరుపడి న౯ బడఁ ద్రోసెను బూ ర్తిగాను. కా

ల్గడుగను వంగలేక సుసుఖంబుగ నేలను గూరుచుండలే

కొడలు వశంబుగాక యయయో యనికుందఁగ నయ్యె భాస్కరా!

చం|| కుదురుగఁ గూరుచుండి యొకకొంచెము వ్రాయుఁగలేకపోయితిన్

పదుగురు బాగనణ్గ నొకపద్యము వ్రాయఁగలేకపొయితి౯.

పదము కదల్చివైచి పదిబారలు నడ్వఁగ లెకపోయితి౯.

హృది ముదమేదియేది పొనరింపనుజాలకపోతి బాస్కరా! ౫౭

చం|| నడుము ప్రధాన మంతకుఁగన౯. మొద లానదిమింటిచట్ట మే

ర్పడిన సమర్చుకోఁదగెడిఁ బై సమలంకృతి. తద్రథాకృతి౯

తొడిగినఁ గండ్లు నడ్చునిఁక, తొల్తటిచట్తమె లెకయున్నయ

ప్డడుగును మీఁదునుండియును నంతయు వ్యర్థముగాదె బాస్కరా!

చం|| అడుగును మీఁదును౯ నడుము నన్నియు నున్న నె యేది యెనియు౯

నదుచును. మత్తనురథమున౯ నడిచట్టము కీడ్పదం బదం

పడి యెటు దేహయాత్ర జరుప౯ వలెనో తెలియంగరాక చే

డ్పడుడుఁ బ్రసాదరావె రహి భావమునంబడె వచ్చి భాస్కరా!

మ|| పదినా ళ్లి ట్లనుభూయమానకటిరుగ్బాధుండనై యంత ని

ర్వదియో ముప్పదొ యొజనంబులపయి౯ వర్తిల్లుసత్సంపదా

స్పదమౌ నయ్యమలాపురంబునకుఁ బ్రస్థానంబుగావించితి౯

సదయస్వాంతప్రసాదరాయవిహితస్వాస్థ్యుండఁగా బాస్కరా! ౬౦

మ|| మెయి స్వాధీనమునందులేనికతన౯ మిత్రౌకముంగుర్చియే

అయిన౯ నేను గుటుంబయు క్తముగనే యానంబు గావించుచు౯

దయమానం బగు మేటిపుష్పగిరిసంస్థానంబు దర్శించి మ

ద్వ్యయవిత్తాత్మకసత్ప్రసాద మత నొందంగోరితి౯ భాస్కరా!

మ దివసద్వంద్వము రెంటపాళ్ల రహిఁ దత్పీఠంపుసాన్నిధ్యమమ్

దు విలంబంబొనరింప నందులకు నాతోఁబుట్టుబిడ్డండు వ

చ్చి విచార్యం బనివార్యము౯ మఱియు నాచేఁగార్యముంబూర్యమౌ

వ్యవహారంబునకై మరల్చె నను దుష్పాకంబున౯ భాస్కరా!
10
ఉ|| స్వవ్యధ సైపత్తన మదిసమ్మతిఁజేసి మదీయభ్రాతృపు

త్రవ్యవహారనిర్వహనతత్పరచిత్తత నిల్లు చేరుడు౯

నవ్యముగా బయల్వెడలె నాదుపిఱుందున2ం బిక్కనొప్పి పూ

ర్వవ్యధ యాఁగె. దీనఁగలవాస్తవికార్థ మదేమొ భాస్కరా!

చ|| వడవడిఁ గూరుచుండఁగను వంగను లేవను జేతఁగాక పె

ల్లుడికెడినాకు నాదునొడ లోలి నధీనముకా2ందొడంగిన౯

నడిచిన శ్రోణిజంఘఁ గలనాడులు లాగుటఁజేసి తుంగఁబో

విడుచుచు మొద్దు నెత్తుకొనువీఁక ఘటించె నిఁకేమి భాస్కరా!

ఉ|| రాకకుఁబోకకుం బిడుగురాళ్ళ సమీపము జానపాటి. కే

వీఁకనొ స్త్రీలు బాలకులు వృద్ధులునుం జరియించుచుందు రా

ఏకపది౯ సదా. అచటి కేగను రా నసమర్థమౌటయే

కాక మదంగ మన్నిటికిఁ గానిదియయ్యెఁ గదయ్య భాస్కరా!

ఉ|| గ్రామబహిస్థ్సలంబునకె గ్రక్కున నేగ నశక్యమౌట నె

న్నో మజిలీలు వేయుచు నెటోచని రావలసె౯. బజారులో

ఏమియొనర్స నేగినను నెన్నియు తిన్నెల విశ్రమించుచు౯

ధామముఁ జేరఁగావలసె. తాల్మిచెడ౯ వలసెంగ భాస్కరా!

చ|| కదలి పదైదుహజ్జలను గట్టిగఁ బెట్టుటతోనె లాగఁగ ౯

మొదలిడుఁ బిక్కలోనినరముల్. మఱికొంచెముదూర మేగ నా

ఒదవిననొప్పి పెద్దయగు. ఓరుచుకొంచు నటే చనంజన౯

తుద కడు గెత్తరాక భువిఁదొట్రిలుచుం బడుచుండు భాస్కరా!

చం|| విసికి ధరిత్రిఁ గూలఁబడి వేమఱుఁ గేల్గవఁబట్టి జంఘ వే

పిసికి యొకించుకంతశ్రమ పెద్దయుఁ బ్రొద్దునకు౯ శమించుడు౯

మసలక లేచి వెండియుఁ గ్రమంబుగఁ గొంతగమించి వెండియు౯

పిసుకుచు లేచి నడ్చుచును బిట్టుశ్రమం పడుచుంటి భాస్కరా!

ఉ|| పిక్కకునుం బిఱుందునకుఁ బేరిమినుండినసూత్ర మేమొ యం

దొక్కటి నొవ్వ రెండవదియుం గడునొచ్చెడి నప్డె. ఒక్కచో

ఎక్కువయైన వేఱొకట నెక్కువయౌ. ఇటు రెంటిసందున౯

చిక్కితి. చిక్కుచుంటి,బలుచిక్కిది. ఏగతిఁదీర్తొ భాస్కరా! ౬౯