ఆరోగ్య భాస్కరము/విజ్ఞాపనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

x
మ|| కననయ్యెంగద మీ మనోద్రడిమయు౯ . కన్పట్టె వాక్సిద్ధియు౯.

కనఁగానయ్యె భవత్ప్రభావబలము౯ సౌఖ్యప్రదుండైన సూ

ర్యుని నిండారుమనంబునం గొలువ నారోగ్యంబు చేకూరె. కా

వున మీమార్గముఁ బట్టువారి కిలలోఁ బొల్పారు సౌఖ్యోన్నతుల్.

రామసుబ్బారాయుఁడు.
ఇవి ముఖ్యమైనమిత్రలేఖలు. వీనితోడనే పీఠిక సమాప్తి.----------విజ్ఞాపనము.


ఈయారోగ్యభాస్కరమున నశ్లీల (అర్థవిషయకగ్రామ్య)దోషమున్నదని నే నెఱుంగుదును. కాని యనేకౌషధములు సేవించియు నారోగ్యము పడయఁజాలక తుదకు మొదలిడిన స్తుతియగుట నుద్రేకముతో నున్న బాధయంతయు విన్నవించుకొనఁబడినది. ఒరులు విన్న నపహిసింతురని యున్నవిధముఁజెప్పుకొనక యూరకున్న వైద్యునకుఁ దెలియుటెట్లు? వలయు చికిత్సఁజేయుటెట్లు? ఏ వైద్యులును గుదుర్సలేని పదబాధను బదపడి భాస్కరుఁడే ప్రశమింపఁజేసెఁ గావున నాపాలిటి కాయనయే వైద్యరాజు. అట్తిగాని కఖిలమును దాఁచక మొఱపెట్టుకొంటిని. తథ్య మెఱిఁగించుపట్ల ధర్మశాస్త్రములును నిఘంటువులుంబోతె నేను నీపథముఁద్రొక్కితి. సత్కవులు క్షమింతురుగాక.

విధేయుఁడు, జానపాటి పట్టాభిరామశాస్త్రి.


గ్రంథకర్త,
జానపాటి పట్టాభిరామశాస్త్రి,
అష్టావధాని,
జానపాడు, పల్నాడు తాలూకా.