ఆబ్రహాము లింకను చరిత్ర/ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గొంత సంభాషణ జరిగినమీద నాబ్రహాము "మన మితరుల యారోపముల గైకొని యాగ్రహింపకున్న వా రూర కుందుర" ని బుద్ధి చెప్పెను. ఈ లోపల నా బాలులు ప్రశాంతులైరి. దుడుకుతనమున గల్లరి యనిన వా డాపదప్రయోగమునకు జింతించుట సూచింప నాబ్రహాము వానిని గొని యాడి మరల వారి నెప్పటివలె స్నేహితుల జేసెను.

ఏడవ ప్రకరణము

కృషి, సంపాదనలు.

ఆబ్రహాము లింకనున కిరుగుపొరుగున నుండు జనులెల్ల మిక్కిలి మూడులు. మన దేశమున గొందఱబలె మంత్ర తంత్రములయు దత్యాదరము గలవారు. మంత్రకారులు మంత్రకత్తెలు మనల దమ వశము చేసికొందు రనియు, నందులకు బ్రతిక్రియ వారి ప్రతిమల జేసి యవ్వాని వెండిగుండునం గాల్చుటయే యగుననియు నమ్ముచుందురు. ఎవడైన వేట వెడలునప్పుడు దారిని గుక్క యడ్డుపడిన మిక్కిలి కష్టసూచక మనియు, నద్దాని నివారణార్థము నడిమి వ్రేళ్ల బెనవేసి యా కుక్క కనుమఱగువఱకు లాగుకొనుచుందురు. కొందఱు మాంత్రికులు మంత్రపూరితదండముల గొని భూమిలోని ప్రజల ద్రవ్య సముదాయముల జూపెదమని జనుల భ్రమింప జేయుచుందురు. గూఢతంత్రములచేతను గుప్తోచ్చారణల చేతను వ్యాధుల మాన్ప నుద్యమించు వైద్యు లనేకు లుందురు. ఏదో యొక పక్షి గవాక్షములోనికి దిగిన నాయింట మృత్యువు ప్రవేశించు నని జడియుచుందురు. బిడ్డకు గుఱ్ఱపు శ్వాసము దాకిన గుక్క దగ్గు ప్రారంభ మగునని తలంచుచుందురు. శుక్రవారముననే ముఖ్యకార్యమును జేయగూడదట. ఇక నిట్టి నమ్మికలు లెక్కకుమీరి యిప్పుడు మనల నెట్లో వారి నప్పు డటు బాధించుచుండెను.

పుట్టినదిమొదలు పెద్దవా డగువఱ కాబ్రహా మీలాటి జనుల మధ్య బెరుగుచు వచ్చెను. వారి యాచార్యవ్యవహారములును వారి యభ్యాసాభిప్రాయములు నెల్ల నతనికి జక్కగ మనసునకు వచ్చెను. అయిన నతడు వారి బాలుర గూడి మెలగుచుండుటను వారివద్ద పనులు సల్పుచు గాలము గడపుటవలనను వారితోడన సంభాషింపుచు, వారికష్టనష్టములన పరిగణించుటచేతను మఱి యేరివిషయములనైన నెఱింగి వానితో దనజనులయాచారాదుల సరిపోల్చుకొన జాలకుండెను. అయిన నతని మనస్థితికి దగు నున్నతాచారభిప్రాయము లెచ్చటను గానరాకుండెను.

టెయిలరు అనువాడు ఓహియో నదిమీదను ఆండర్‌సను అనువాడు క్రీకుమీదను నొకచిన్నపడవతో వ్యాపా రము సేయుచుండిరి.తన పడవనడుప మనుష్యు డొక్కని నియమించుకొన నభిలషించి థామసువద్ద కేతెంచి యాబ్రహాము నంపెదవా యని యడిగెను. ఇద్దఱును గొంతతడవు బేరము లాడుకొనినతరువాత టెయిల రాబ్రహామునకు భోజనమువెట్టి నెలకు రెండున్నఱరూపాయిలు జీత మియ్య నొప్పు కొనెను. థామసును అందులకు సమ్మతించి తన కొడుకును మఱుసటిదినము పనికి బంపెను.

యజమాను నాజ్ఞగొని యతడు నావికుడాయెను. సమయము పడిన చేనుకాపఱిగను, గుఱ్ఱపు మానిసిగను, ఇంట సేవకుడుగను కార్యములు నెరవేర్చవలె ననువిషయము గూడ నతని కెఱుకపఱపబడెను. ఓడ నడపుటాతనికి నవీనమగుట నెక్కుడు సంతసోత్సాహము లొసగెను. పదునేడు సంవత్సరముల బాలు డైనను ఆఱడుగుల నాలుగంగుళముల యెత్తై తదనుగుణముగ దళమై యాప్రాంతముల బలమున నెల్లర నతడు మించియుండెను.

టెయిలరుగారి యింటియం దతడు సర్వకార్యములను నెరవేర్చుచు వచ్చెను. తెల్లవాఱ నందఱికంటె ముందు నిదురలేచి ప్రొయి రాజ జేసి నీళ్లు సిద్ధపఱచి పచనకార్యమునకు వలయునదెల్ల నాయత్తము సేయుచుండును. చేసినపనియెల్ల మిక్కిలి జాగరూకతతో లోపముల కెడమీక ముగించుచుం డును. కావున టేలరుభార్య యాబ్రహా మంతటియద్భుత బాలు నెన్నడు జూడ నైతి నని యతని గారవించుచుంట విపరీతముగాదు.

టెయిలరుగారి గృహమున నాబికి యునైటెడు రాష్ట్రపు జరిత్రయు మఱి రెండుపుస్తుకములును జే జిక్కెను. వాని జదువుటయం దతనికి మిక్కిలి యభిలాష యొడమెను. దినమంతయు గష్టపడి యొడలువంచి పనిసేసి రాత్రి నవ్వాని పఠించుచుండును. టెయిలరు గుమారుడు గ్రీను నిద్రాపరవశుడు. దీపము వెలుగున కోర్వక యాబీని నదలించుచుండును. మనసున గోపము నిండియుండియు బై బడి కొట్టునంత బలమున నొప్పియు శాంతస్వభావము గలవాడు గావున నాబ్రహాము గ్రీను నేమనక తనంతకు దా జదువుచుండెను.

అచ్చట నాబి సూకరవధ నేర్చుకొనియెను. టెయిలరీ పని కతని నియమించి నెల కిరువదిరూపాయిలవంతున సంపాదించుచుండెను.

ఓడనడపువాడుగ, వ్యవసాయదారుడుగ, గుఱ్ఱపువాడుగ, సేవకుడుగ, గడపట గటికవాడుగ నిట్లే పనిచేసినను సంపూర్ణముగ దనశక్తినెల్ల నుపయోగించి జయప్రదముగ దుదముట్టించుచుంట నాబ్రహాము యజమానుని నపరిమితానందమున ముంచెను. నిర్ణితమాసములు దొమ్మిది చనగానే యాబ్రహా మిల్లుచేరెను. అతని సోదరి పాణిగ్రహణ మహోత్సవ మప్పుడ యాలింకనుల కుటీరమున యధావిధిగ జరిగెను. తదర్థ మాబి కొన్నిపద్యములువ్రాసి యతిథులకెల్ల హర్షము గలుగజేసెను. నాప్రాంతముల నత డుచక్క మఱి యెవ్వరు నిట్టిసమయముల గ్రంథస్థితవిషయముల కథనముచేసియు, నూతనముగ గల్పించియు వాక్చాతుర్యమున గవననైపుణిని గనుబఱచి విను వారల బ్రక్కలెగయ నవ్వ జెనకు సమర్థులు లేనందున నతడిట్టి సంతససమయముల ముఖ్యుడుగ గణింపబడుచుండెను.


ఈ వివాహానంతర మొకసంవత్సరమునకు సారా పరలోక ప్రాప్తి నొందెను. సోదరిని మిక్కిలి ప్రేమించుచుండె గాన నిది యాబ్రహాము హృదయమున గొంతకాలము చింతాక్రాంతమున జేసెను.

కొద్దికాలమునకు దరువాత నాబ్రహాము మఱియొక వ్యాపారి జోన్సుదగ్గఱ బనికి గుదిరెను. ఆయజమాను డితని యద్భుతశక్తి కలరువాడు గాన నితని దన విశ్వాసార్హునిగ జేకొనియెను. అతనికొట్టు లింకనుల కుటీరముల కొకటిన్నర మైళ్లుదూరమున నుండెను. అం దాబ్రహామునకు ఫ్రాన్‌క్లిన్ జీవితము మొదలగు గొన్ని పుస్తుకములు దొరకెను. వార్తా పత్రిక గూడ నా యజమాను డొకదానిం దెప్పించుచుం డును. వీనినన్నిటి నాబ్రహాము జక్కగ జదువ దొడగెను. రాజకీయ వ్యవహారముల జ్ఞానము సంపాదించుకొనుట కిదె యాబికి బ్రథమప్రయత్నము.

జోన్సు యాజమాన్యము దప్పిపోయినపిదపగూడ నాబ్రహాము స్నేహితులతో నాతని కొట్టునకు విచ్చేసి రాజకీయ వ్యవహారముల గుఱించి చర్చించుచుండుట సాధారణముగ నుండెను.

ఈ చర్చల నొకరాత్రి ముగించి స్నేహితులు దానును నిండ్ల కేగుచుండిరి. మంచు విశేషముగ గుఱియుచుండెను. చలికి నిలువలేక జంతుసంతానమెల్ల నెక్కడి వక్కడ ముడిగికొని పోయియుండెను. చీకటు లల్లనల్లన దట్ట మగుచుండెను. అట్టి సమయము నాదారియం దొక శరీరము గదలమెదల లేక పడియుండెను. పరిశీలింప నాప్రాంతమున నుండు నొక త్రాగుబోతు దప్పద్రాగి మై మఱచి నేల గూలుయుండుట గాంచిరి. తన మిత్రు లెల్లరు నట్టివాని కిట్టి శిక్షయె దగునని నుడువుచు దమతమ నెలవులకు జనిరి. అబిమాత్రము వానిపై జాలిగొని బలశాలి గావున జేతులపై వాని నెత్తుకొని పోయి సమీపము నుండు నొకమిత్రుని కుటీరమున జేర్చెను. వాడును మొదట నుపేక్ష సేయబూని యాబ్రహా ముపన్యసింప జ్ఞానము దెచ్చికొని యతనికి సాయ మొనర్చు చుండెను. మంటవేసి రాత్రియంతయు నాయదృష్టహీనునకు బరిచర్య లొనర్చుచు నాబియు నాతని స్నేహితుడును గడపిరి.

మఱునా డుదయమున మేల్కాంచి యా త్రాగుబోతెంత సంతసించి యుండునో మన మెఱుంగజాలము.

ఎనిమిదవ ప్రకరణము

ప్రవృద్ధి, ప్రకాశములు.

ఆబ్రహా మెప్పుడును దల్లి కెదురు సెప్పి యెఱుగడు. ఆ యమ చెప్పిన పనియంతయు జేయుచుండెను. తల్లికూడ నతని మాటయనిన మిక్కిలి యాదరించుచుండు. అతడు పరలోకప్రాప్తి జెందినతరువాత నంత గుణవంతు బుత్రు దా నెన్నడు జూడలేదని నుడువుచు నాపె పలుమాఱు విలపించుచుండును. దేశాధ్యక్షత కాత డియ్యకొనునపుడు దనమన మెట్లో భయ మందెననియు, నతని కా పదవి రాకున్న మేలగునని దా దలచుచుండుననియు జెప్పి పుత్రరత్నము గోలుపోయి బ్రతుకుటకంటె దన ధవునకు బూర్వమె దానేల భూలోకము విడువకుంటి నని దు:ఖించుచుండును.

తండ్రిమాత్ర మాబ్రహాము పై గొంచె మాగ్రహము గనుబఱచుచుండును. విద్య గడించుటకు గాలము దొఱకు