ఆంధ్ర శ్రీవిష్ణుపురాణము/షష్ఠాశ్వాసము
శ్రీరస్తు
శ్రీవిష్ణుపురాణము
షష్ఠాశ్వాసము
| 1 |
వ. | సకలపురాణవిద్యాధురంధరుం డైనపరాశరుండు మైత్రేయున కిట్లనియె. | 2 |
చంద్రవంశపురాజులచరిత్రము
.ఆ. | అఖిలమునకు స్రష్టయైననారాయణు, నాభిసరసిజమున నలినభవుఁడు | 3 |
క. | అత్రిమునీంద్రుని దక్షిణ, నేత్రంబున నుదయమయ్యె నిర్మలతేజో | 4 |
క. | బాల్యమున నతఁడు మతిచాం, చల్యం బొకయింతలేక సమధికనిష్ఠా | 5 |
క. | వృక్షలతౌషధితతులకు, నక్షత్రంబులకు ద్విజగణంబుల కమృత | 6 |
వ. | మఱియు రాజసూయాదిమహాయజ్ఞంబులు సేసి సర్వోత్కృష్టం బైనగృహి | 7 |
తారాశశాంకకథ
క. | ముదమున నాశీతాంశుఁడు, త్రిదశగురుం డగుబృహస్పతికి శిష్యుండై | 8 |
క. | వెరవున నీగతి గురునకు, గురుపత్నికి నధికభక్తి కొనసాగంగాఁ | 9 |
వ. | అంత నొక్కనాఁడు. | 10 |
ఆ. | దేవవిభునిక్రతువు గావింప దేవలో, కమున కేగుచుండి యమరగురుఁడు | 11 |
చ. | వనజవిరోధియున్ వినయవర్తనుఁడై గురుపత్నికిన్ ముదం | 12 |
వ. | అప్పుడు.[8] | 13 |
సీ. | బంగారుచెఱఁగులపట్టుపుట్టముఁ గట్టి కమ్మకస్తురితిలకంబుఁ దీర్చి | |
తే. | పొసఁగ వజ్రంపుఁబాపటబొట్టు పెట్టి, రవళిమెట్టెలమ్రోఁతలు రాయడింపఁ | 14 |
వ. | ఇట్టి విలాసంబుల నుల్లసిల్లుచున్నంత. | 15 |
క. | తారన్ సురగురుదారన్, దారాధిపవదనఁ దరళతారానయనన్ | 16 |
క. | చూచి మదనాతురుండై, యాచంద్రుఁడు దేవగురునియంగన సౌభా | 17 |
సీ. | తిలకించు నయ్యింతిచెలువంబుఁ బలుమాఱుఁ గిలికించితాదుల గెల్లుచూచుఁ | |
| గరిమతో నాలేమ సరససల్లాపంబు లాలించి యేకాంతమాడఁగోరుఁ | |
ఆ. | నింతి యవయవముల నెసఁగు సౌందర్యంబుఁ, గన్నులారఁ జూచు కాంక్షతోడ | 18 |
సీ. | ఎలనాఁగ దా వచ్చి యప్పటప్పటికి సమేలంపుమాటల మేలమాడుఁ | |
తే. | గబ్బిగుబ్బచన్నుఁగవమీఁదిపయ్యెద, జాఱద్రోచు తీఁగె సాగనవ్వు | 19 |
వ. | ఇవ్విధంబున నన్యోన్యసరససల్లాపంబులవలనం బరస్పరస్నేహకుతూహలంబు లంత | 20 |
ఉ. | మేలము లాడుచుం దనసమీపమునన్ విహరించుచున్న య | 21 |
క. | తరళాక్షి నీతిశాస్త్రము, లిరవుగ గురువలనఁ బెక్కు లెఱిఁగితి నింకన్ | 22 |
చ. | అనవుడు లేఁతనవ్వు వదనాంబురుహంబునఁ జెంగలింప న | 23 |
క. | చిత్తజుచేఁ దలిరాకుల, విత్తై తనధైర్యమెల్ల వెడల నడిచి యా | |
| మత్తేభగమన మిగులం, దత్తరపడి సమ్మదమునఁ దమకించుటయున్.[17] | 24 |
క. | పరకాంత బ్రాహ్మణస్త్రీ, గురునాథునిభార్య దీనిఁ గూడిన మిగులన్ | 25 |
వ. | ఇవ్విధంబున నయ్యిరువురు నన్యోన్యసరససంభోగంబులవలనం జొక్కి వర్తించు | 26 |
ఉ. | చిక్కులుపడ్డవెండ్రుకలు చిక్కినలంగినకమ్మపూవులుం | 27 |
వ. | అంత నొక్కనాఁడు రోహిణీకాంతుండు గురుకాంత కిట్లనియె. | 28 |
క. | మగువా మనచేఁతలు నీ, మగనికి వినఁబడినఁ గడుబ్రమాదము వచ్చున్ | 29 |
వ. | అనిన నతని నవలోకించి. | 30 |
క. | ఎక్కడిమగఁ డెక్కడిబ్రతు, కెక్కడిసంసారచింత లేటికి నాకుం | 31 |
క. | నీవెంటఁ దోడునీడై, నే వచ్చెదఁ దొడుకపొమ్మ నీకును నాకున్ | 32 |
వ. | అని యిట్లు మరులేచి పలికిన నాకమలవైరియుఁ గమలలోచనం దోడ్కొని | 33 |
చ. | అమరగురుండు దేవపతియాగము సాంగముగా నొనర్చి సం | 34 |
చ. | సురగురుఁ డాలిఁ గోలుపడి సోముఁడు సేసిన ధౌర్త్యమంతయున్ | |
| ధరుఁ డగుచున్ మహాత్ములగు తాపసులన్ బిలిపించి యాసుధా | 35 |
క. | మీరు సుధాకరుపాలికి, గౌరవమునఁ బోయి బుద్ధిగాఁ జెప్పి పర | 36 |
తే. | అని నియోగించి పంచిన యమ్మునీంద్రు, లమృతకిరణునిపాలికి నరుగుదెంచి | 37 |
మ. | నవశృంగారవిలాసముల్ కువలయానందప్రభావంబులు | 38 |
ఉ. | భూసురకాంత నెత్తుకొనిపోవుట దోషము యామినీశ నీ | 39 |
చ. | అనుటయు రోహిణీరమణుఁ డమ్మునినాథులఁ జూచి దేవమం | 40 |
ఉ. | కాయజుచేత గాసిఁబడి గౌతముభార్యకుఁ బోయి కొక్కొరో | 41 |
తే. | అనుచు నింద్రునిమర్మంబు లైనయుల్ల, సములు పెక్కాడి యాబృహస్పతివధూటి | |
| విడువఁ బొండన్నఁ గడుసిగ్గుపడి మునీంద్రు, లమరవల్లభుపాలికి నరుగుదెంచి.[30] | 42 |
చ. | హిమకరుచందమంతయును నేర్పడఁ జెప్పిన నప్పురందరుం | 43 |
తే. | పెద్దల మునులఁ గొందఱఁ బిలిచి మీరు, వోయి యాశీతకరునకు బుద్ధిగలుగ | 44 |
క. | అని పనిచిన వారు రయం, బున నాహిమకరునికడకుఁ బోయి పయోజా | 45 |
ఉ. | ఇంచుక నవ్వి శీతకరుఁ డిట్లనుఁ బద్మభవుండు చెప్పిపు | 46 |
తే. | అనిన వార లుదాసీనులై పయోజ, భవునిపాలికి నరుదెంచి పద్మవైరి | 47 |
ఉ. | అంగిరసాదు లైనమును లగ్గురుతోఁ బురుహూతుఁ గూడి య | 48 |
మ. | దివిజానీకసమేతుఁడై చటులవృత్తిం జంద్రలోకంబుపై | 49 |
వ. | ఇవ్విధంబునఁ జంద్రశేఖరచంద్రులకు మహాఘోరయుద్ధం బయ్యె నప్పుడు. | 50 |
చ. | సురగురుతోడివైరమున శుక్రుఁడు కుంభనికుంభముఖ్యశం | |
| శ్వరచతురంగసైన్యములఁ జంద్రునకుం బటుసంగరక్రియా | 51 |
మ. | జయకాంతాపరిరంభకౌతుకములన్ శర్వామృతాంశుల్ జగ | 52 |
క. | హిమకరుని దోడుకొని చని, క్రమమొప్పఁగ బుద్ధి చెప్పి కామాతురభా | 53 |
వ. | అప్పుడు వాచస్పతి యాసన్నప్రసవగర్భవతి యైన తనభార్యం జూచి మదీయక్షే | 54 |
తే. | దివ్యతేజోవిలాససందీప్తుఁ డగుచు, మోహనాకారమున నున్నముద్దుకొడుకుఁ | 55 |
తే. | వీఁడు నాసుతుండు వీఁడు నా ముద్దుల, కొడుకుఁ గుఱ్ఱ యనుచుగురుఁడు విధుఁడుఁ | 56 |
క. | దేవతలు మునులు తారా, దేవిన్ వీక్షించి వీఁడు దేవగురుసుతుం | 57 |
క. | నలువురు నాలుగుదిక్కులఁ, దల లెత్తుక చూడ మగఁడు దలవంపఁగ నీ | 58 |
వ. | అప్పు డప్పితామహుం డప్పువ్వుఁబోణిం బుజ్జగించి యిట్లనియె. | 59 |
క. | సి గ్గేల నీకు నీపని, యెగ్గని పాటించి యాడ రెవ్వరు నీకున్ | 60 |
ఉ. | సోమునిఁ జూచియున్ గురుని జూచియుఁ బక్షపుమాట మాను తే | |
| సోమునిపుత్రుఁడో గురునిసూనుఁడో నా కెఱిఁగింపుమన్న నీ | 61 |
వ. | ఇవ్విధంబునం బలికినయప్పలుకులు విని బృహస్పతి కుమారునియందు మోహం | 62 |
తే. | రోహిణీదేవి యక్కుమారునకుఁ గన్న, తల్లికంటెను మిగులఁ దాత్పర్యవృత్తి | 63 |
ఆ. | బుధుఁడు తపము చేసి యధికతేజోనిధి, యగుచు గ్రహపథంబునందు నిలిచి | 64 |
పురూరవుండు ఊర్వశీరక్తుండై విహరించుట
సీ. | భూభరణక్రియాస్ఫురణఁ గుంభీనసక్రోడేభములనైనఁ గొంచెపఱచు | |
తే. | దీవు లేడింటఁ దనయాజ్ఞ దేజరిల్ల, నిజచరిత్రంబు భావిభూభుజుల కెల్ల | 65 |
వ. | అట్టి పురూరవుండు నిజరాజధాని యైనప్రతిష్టానపురంబున రాజ్యంబు సేయు | 66 |
సీ. | మందారచందనమాకందశాకోటజంబీరనీపకదంబతరులు | |
తే. | మందమలయానిలోద్ధూతమానసుమప, రాగధూసరితాకాశభాగతలము | 67 |
వ. | ఇట్టివినోదంబులం దగిలి వినోదించుచున్న సమయంబున. | 68 |
సీ. | తనకొప్పులోని కమ్మనిపూవుతావులసొబగు దిక్కులనెల్ల పోడుముట్టఁ | |
| దనమేనిమెఱుఁగుల ధాళధళ్యంబుల మించుచూడ్కులు మిఱుమిట్లు గొనఁగఁ | |
తే. | దనవిలాసయానంబును దర్పకాంధ, కార మొక్కటఁ జిమ్మచీఁకట్లుఁ గ్రమ్మఁ | 69 |
వ. | ఇవ్విధంబునవచ్చి వినయావరత యగుచు బాలరసాలంబుమ్రోలం గ్రాలుచున్న | 70 |
ఉ. | ఎవ్వరిదాన వీవు జలజేక్షణ నీదగు వాలుచూపులున్ | 71 |
చ. | అనుటయు నింతి యానృపకులాగ్రణిరూపవిలాసరేఖలున్ | 72 |
క. | ఉర్వీశతిలక నాపే, రూర్వశి నొకపనికిఁగా దివౌకసమహిమల్ | 73 |
క. | నిను జూడఁగోరి వచ్చితి, ననుటయు నారాజచంద్రుఁ డయ్యిందునిభా | 74 |
క. | అలఘుప్రగల్భవచనం, బుల నూర్వశిఁ జూచి యబల పుష్పాయుధుచే | 75 |
వ. | అనిన నక్కాంత మహీకాంతు నవలోకించి నాయందు నీకుఁ బ్రియంబుగల | 76 |
మ. | లలితానేకవినోదముల్ సలిపెఁ గైలాసోపకంఠంబునం | 77 |
తే. | వనజనేత్రయుఁ బ్రతిదినవర్ధమాన, మగుతదుపభోగసుఖములఁ దగిలి పాయ | 78 |
క. | ఊర్వశి సురపురి నుండక, యుర్విఁ బురూరవునిఁ గూడియున్నకతన గం | 79 |
వ. | అంత విశ్వావసుం డనుగంధర్వుం డూర్వశీపురూరవులసమయం బెఱింగి వారి | 80 |
ఉ. | ఆయజపోతకంబు దివియందు నిరంతరవిహ్వలధ్వనిం | 81 |
తే. | ఏకవస్త్రంబు ధరియించి యిందువదనఁ, గలసి యేశాంతసుఖకేలి నలరువిభుఁడు | 82 |
క. | వెండియు గంధర్వవరుల్, రెండవయురణకము నపహరించి దివికి ను | 83 |
క. | నాపుత్రకు లభియాతుల, చేపడి యఱవఁగ నుపేక్ష సేసితి నీ కీ | 84 |
వ. | అని బహుప్రకారంబుల నార్తకారిణియై యురణకనిమిత్తంబుగా బెట్టిదంబులు | 85 |
తే. | నగ్నవేషంబుతోఁ జను నరవరేణ్యుఁ, గన్ను లారంగఁ జూచి యాకమలవదన | 86 |
వ. | అంత. | 87 |
క. | గంధర్వు లురణకముల వ, సుంధరపైఁ బాఱవైచి సురపురమునకున్ | 88 |
తే. | మగిడి శయ్యకు నరుదెంచి మగువ నచట, వెదకి కానక యత్యంతవిరహతాప | 89 |
వ. | దిగంబరవేషంబునఁ బరిభ్రమించుచుండె.[57] | 90 |
సీ. | పువ్వుదీఁగెలఁ జూచి పొలఁతుక నూఁగారుతనువల్లియని డాయఁదలఁపు సేయు | |
తే. | గోకిలాలాపములు విని కొమ్మ దన్నుఁ, బిలిచెనో యని యాలించుఁ ప్రేమతోడ | 91 |
వ. | ఇవ్విధంబున నారాజమన్మథుం డున్మత్తవేషంబున బరిభ్రమించుచు నొక్కనాఁడు | 92 |
చ. | వదనము చెంగలింప నిడువాలికకన్నుల వాడుదేర స | 93 |
ఆ. | పువ్వుఁబోణి వినుము పువ్వును దావియుఁ బోలె గుసుమబాణకేళిఁ దేలు | 94 |
క. | ఉన్మత్తవేషమున నే, నున్మాదముఁ బొంది తిరుగుచున్నాఁడను నీ | 95 |
క. | అని పలుకుచున్న బుధనం, దనునిపయిం గరుణ పుట్టి ధవళాయతలో | 96 |
క. | ఈజగమంతయు నేలెడు, రాజువు నీ కేల దైన్యరస మీవిరహ | |
| వ్యాజమున నిను నలంపుచు, నీజాడలఁ బెట్టె దైవ మే మనవచ్చున్.[63] | 97 |
క. | అని పలికి గారవించుచు, ననురాగము చెంగలింప నారాత్రి నరేం | 98 |
వ. | ఇవ్విధంబున సురతసుఖంబు లనుభవించిన మఱునాఁడు ప్రభాతసమయంబున | 99 |
మ. | ధనదప్రాభవ నీప్రసాదమున నంతర్వత్నినై యున్నదా | 100 |
క. | ఊర్వశి దనచెలులకు న, య్యుర్వీశుఁడు దానుఁ గలిసియుండుటయును గం | 101 |
ఉ. | ఆచెలు లవ్విధంబు దెలియన్ విని నివ్వెఱఁగంది యూర్వశిం | |
ఆ. | ఇతనితోడఁగూడి యింకను గొంతకా, లము కుసుమబాణలలితసుఖము | 103 |
వ. | అంతఁ బురూరవుండు సంవత్సరకాలంబునకు వచ్చిన నూర్వశి యాయు వను | 104 |
క. | విరసంబునఁ దము నిరువుర, విరిదట్టుగఁ జేసినట్టి విశ్వావసుఁ డా | 105 |
వ. | ఇట్లు వచ్చి గంధర్వు లానరేంద్రు నవలోకించి నీవు మాకపటకృత్యంబులవలన ననేక | |
| కోశాదినానామహిమలు నూర్వశీసాలోక్యంబుం గలుగునట్లుగా వేఁడిన నను | 106 |
మ. | మనుజాధీశ్వర యిమ్మహానలము నామ్నాయానుసారక్రమం | 107 |
వ. | అని చెప్పి గంధర్వులు వోయిన బుధనందనుండు నగ్నిస్థాలిఁ గైకొనివచ్చి బహు | 108 |
మ. | నను గంధర్వవరుల్ వరం బడుగుమన్న దుర్వివేకంబుతో | 109 |
ఉ. | ఎక్కడియజ్ఞకర్మ మిఁక నెక్కడియూర్వశి యేడ జీవనం | 110 |
మ. | కృప గంధర్వులు నాకు నిచ్చిన మహాగ్నిస్థాలి య ట్లేటి కా | 111 |
సీ. | అని యిట్లు దలపోసి యాప్రొద్దె కదలి యయ్యడవిలోనికి వచ్చియగ్ని నచటఁ | |
తే. | రమణఁ జేసి తన్మంత్రాక్షరముల సంఖ్య, నమరునంగుళములనిడుపైన యరణి | 112 |
వ. | ఇట్లు కృతకృత్యుండై యప్పుణ్యకర్మంబువలన నూర్వశీసాలోక్యంబు మొదలుగా | 113 |
తే. | ఆదిమనుకాలమం దేకమైన క్రతుమ, హాగ్ని వైవస్వతాగ్నిమన్వంతరమున | |
| గరిమతోడ నాహవనీయగార్హపత్య, దక్షిణాగ్నులు నాఁ ద్రివిధంబు లయ్యె. | 114 |
పురూరవవంశానుక్రమము
వ. | అట్లు పురూరవుం డూర్వశియందు నాయువును ధీమంతుండును నమావసుండును | 115 |
సీ. | అమ్మహీతలభర్త యజ్ఞంబుఁ గావించువేళ గంగానది వెల్లివిరిసి | |
తే. | వివిధభంగుల నుతియించి వేఁడుకొన్నఁ, గరుణ మదిఁ బుట్టి పూర్వప్రకారమున నొ | 116 |
వ. | అది కారణంబుగా గంగానది జాహ్నవి యనం బరఁగె నట్టిజహ్నునకు సుమం | 117 |
మ. | శతమన్యుప్రతిమానుఁ డైనసుతు నిచ్ఛం గోరి భక్తిం దపం | 118 |
చ. | సురపతితుల్యుఁ డానృపతిసూనుఁడు ధర్మము దప్పకుండ నీ | 119 |
క. | ఆతరుణిఁ బెండ్లియాడెడు, ప్రీతిన్ రుచికుం డనంగ భృగువంశవిభుం | 120 |
ఉ. | ఆరుచికుండు వెండియుఁ గుళాంబతనూజునిఁ బెద్ద చేసి యీ | |
| కోరిక దీరునట్లు సమకూర్చెదఁ బెండిలి సేయుమన్న నా | 121 |
ఉ. | ఇమ్మదిరాక్షి నీకుఁ బ్రియమేని మునీశ్వర యేకనీలక | 122 |
ఆ. | అనిన నట్ల కాకయని వరుణాలయం, బునకుఁ బోయి నిజతపోమహత్త్వ | 123 |
జమదగ్నివిశ్వామిత్రులజన్మప్రకారము
ఆ. | తెచ్చి కౌశికునకు నిచ్చి యమ్మునిపతి, సత్యవతి వరించి సమ్మదమున | 124 |
క. | ఆమ్మునినాథుఁ డపత్యా, ర్థమ్ము విమలమంత్రసంయుతమ్ముగ ఋతుకా | 125 |
ఆ. | పతికి మ్రొక్కి సత్యవతి పల్కె మాతల్లి, పుత్రహీన తోడఁ బుట్టు నాకుఁ | 126 |
వ. | అనిన నట్ల కాక యని ఋతుస్నాతయైయున్న తన్మాత రావించి యిరువురకు యథా | 127 |
ఉ. | లోకములోన సర్వజనులుం దనపుత్రులు మంచివారుగాఁ | 128 |
తే. | ఆఁడుబిడ్డ సహోదరుఁ డఖలగుణస, మగ్రుఁడుగఁ గోరుఁ గావున మదిఁ దలంచి | 129 |
తే. | బ్రాహ్మణుని బలవీర్యసంపద నిరర్థ, కంబు భూలోకమంతయు ఘనపరాక్ర | 130 |
వ. | అని బేలు పెట్టి కూతురుం దానును జరుద్వయంబు వీడుపడ నుపయోగించి నిజ | 131 |
చ. | వనముననుండి వచ్చి భృగువంశశిఖామణి భార్యఁ జూచి నీ | 132 |
మ. | భయదక్షత్రియకర్మఠుండును మహాభాగుండు శస్త్రాస్త్రపా | 133 |
చ. | అనవుడు వేఁడినిప్పువలె నవ్వచనంబు మృగాక్షి నెమ్మనం | 134 |
క. | మీపలికినట్టివన్నియు, నాపుత్రునియందు వలదు నరవరధర్మ | 135 |
వ. | అట్ల కాక యని యనుగ్రహంబు సేసిన కొండొకకాలంబునకు నాసత్యవతి జమదగ్ని | 136 |
మ. | సకలక్షత్రకులప్రభంజనకళాసంపన్నబాహాబల | |
| నకళాకర్మఠవైష్ణవాంశజననవ్యాపారశౌర్యుండు శం | 137 |
వ. | మఱియు విశ్వామిత్రునకు భార్గవుం డైనశునశ్శేఫుండు దేవతలవలన దత్తపుత్రుం | 138 |
నహుషక్షత్రవృద్ధరజిప్రముఖులజననము
తే. | విను పురూరవునకు నగ్రతనయుఁడైన, నాయు వనురాజు రాహువు నాత్మపుత్రిఁ | 139 |
వ. | వారినామధేయంబులు వినుము నహుషక్షత్రవృద్ధరంభరజ్యనేనస్సులనం బ్రసి | 140 |
తే. | వారిలోన నేనుం డనువానికిని సు, హోత్రుఁ డుదయించె నతనికిఁ బుత్రు లైరి | 141 |
ఆ. | అందుఁ గృత్సమదునియందుఁ జాతుర్వర్ణ్య, సంప్రవర్తకుండు శౌనకుండు | 142 |
వ. | ఆదీర్ఘతపునకు ధన్వంతరి జనియించె నట్టిధన్వంతరికిఁ గేతుమంతుండు పుట్టె వానికి | 143 |
ఆ. | కువలయంబు నాఁగగుఱ్ఱంబు నెక్కి యీ, కువలయమున దినముఁ గ్రుమ్మరంగ | 144 |
ఆ. | వత్స వత్స యనుచు వాత్సల్యమునఁ దండ్రి, తన్నుఁ బిలుచుచున్న తన్నిమి త్త | 145 |
ఉ. | శాత్రవమండలేశ్వరుల సంగరరంగములన్ జయించఁగా | 146 |
వ. | అట్టి కువలయాశ్వుండు పరమపతివ్రతయైన మదాలసయందు నలర్కుండను రాజుం | 147 |
తే. | అవనియెల్లను నఱువదియాఱువేలు, వత్సరంబులు నూత్నయౌవనము దనకు | 148 |
రజియనువాని కింద్రపదము వచ్చుట
వ. | అయ్యలర్కునిపుత్రపౌత్రాంతరంబు లనేకతరంబులు గలిగె వారియందుఁ జాతు | 149 |
క. | అనఘాత్మ విను పురూరవు, మనుమం డగురజి ప్రతాపమహితుల సుతులం | 150 |
శా. | ఆకాలంబున దేవదానవులు ఘోరాకారసంగ్రామకే | 151 |
క. | నిజము పురూరవుమనుమఁడు, రజి యెవ్వరివంక నిలిచి రణరంగములో | 152 |
క. | అనిమిషులకంటె ముందఱ, దనుజులు సనుదెంచి రాజతనయునిఁ బ్రార్థిం | 153 |
క. | అనిలోన మీకుఁ దోడై, యనిమిషులను గెలిచి విజయ మనురాగముతో | 154 |
క. | మాకెల్లఁ గర్త పుణ్య, శ్లోకుఁడు ప్రహ్లాదుఁ డతనిశుభముకొఱకె పో | 155 |
ఆ. | ఇయ్యకొనక దనుజు లేగిరి పదపడి, యమరవరులు వచ్చి యసురవీరు | 156 |
వ. | నిలింపులు దమలో విచారించి కార్యదాహంబునం జేసి దేవేంద్రత్వం బతని కిచ్చు | 157 |
చ. | కడుభయ మైనవేళఁ గృపఁ గాచిన యాతఁడుఁ గన్నతండ్రియున్ | 158 |
ఆ. | ఇంతకంటె నీకు నింద్రత్వ మేటికి, నేమి ఘనము మానవేంద్రచంద్ర | 159 |
మ. | పగవాఁడైనను వచ్చి క్రిందుపడి తాఁ ప్రార్థించినన్ వానికిం | |
| దగుసంభావన లిచ్చిపుచ్చుటయె పోధర్మంబు లోకేశ్వరుం | 160 |
క. | అనిమిషపతి కింద్రత్వం, బనురాగముతోడ నిచ్చి యమరావతికిం | 161 |
క. | నారదుకుటిలవిచార, ప్రేరితులై వానిసుతులు పితృధనమగు నా | 162 |
ఆ. | పాకశాసనుండు నాకంబు విడిచి యెం, దేని మానిపోయె మానవేంద్రు | 163 |
తే. | తామ గైకొని పెక్కేండ్లు ధర్మవృత్తి, నున్న సమయంబునం దింద్రుఁ డొక్కనాఁడు | 164 |
క. | మునినాథ పురోడాశం, బునకుం గడువాఁచి నోరు పుతపుత మనఁగా | 165 |
క. | అనిన బృహస్పతి మిక్కిలి, దనమనమున వగచి దేవతాపతికి శుభం | 166 |
ఉ. | అందుల కీడు దాఁకి మనుజాధిపుపుత్రులు దుర్వివేకముల్ | 167 |
వ. | ఇ ట్లుపాయంబున రిపులవలన జయంబుగొని యింద్రుండు నిజపురోహితువలన | 168 |
తే. | క్షత్రవృద్ధునిసంతతి జగతియందు, బహుపరంపరలై కడుఁ బ్రబలమయ్యె | |
| రంభుఁ డనురాజు దనకుఁ బుత్రకులులేక, తపము సేయుచునుండె నుదగ్రవృత్తి. | 169 |
యయాతిచరిత్రము
వ. | మఱియు నహుషునకు యతియయాతిసంయాత్యాయాతినియతికృతు లను | 170 |
క. | యదుదుర్వసు లనుపుత్రకు, లుదయించిరి దేవయాన కున్నతమతులై | 171 |
క. | జననాథుఁడు శర్మిష్ఠకు, ననురాగము చేసి దేవయానకు నహితం | 172 |
వ. | ఇట్లు జరాభారపీడితుండై యయాతి శుక్రునియనుగ్రహంబుఁ బడసి తనకుమా | 173 |
ఆ. | వినుఁడు తనయులార విషయోపభోగంబు, లందు నేను తనివిఁ బొందకున్న | 174 |
క. | కావున మీలో నొకరుఁడు, నావార్ధక మర్థిఁ బూని నవయౌవనమున్ | 175 |
తే. | అనినఁ బూరుఁడు దక్కఁ దక్కినతనూజు, లందఱును దండ్రిపలుకుల కపహసించి | 176 |
వ. | భవదీయప్రసూతు లైనవారు రాజ్యార్హులు గారని శాపం బిచ్చి తనవచనంబు | 177 |
తే. | అనుభవించితి నిన్నినా ళ్లఖిలవిషయ, భోగములు కోర్కు లేమియుఁ బొలిసిపోవు | |
| విపులతర మైనవహ్ని హవిస్సువలన, హానిఁ బొందక వర్ధిల్లు నట్ల తలఁప.[110] | 178 |
క. | జీర్ణించు వెండ్రుకలు గడు, జీర్ణించును లోచనములు చెవులును ముక్కు | 179 |
క. | అవివేకులు దృష్ణలచేఁ, దగిలి ప్రవర్తింతు రధికతరదుఃఖములన్ | 180 |
ఉ. | ఏను సహస్రవర్షములు నీగతి నీవిషయోపభోగసౌ | 181 |
క. | పూరునకు యౌవనముఁ గడు, గారవమున నిచ్చి వార్ధకముఁ బూని ధరి | 182 |
వ. | కట్టి యయాతి వనంబునకుఁ దపంబు సేయం జనియెఁ బూరుండు పూర్వాదిదిశా | 183 |
యదువంశమహిమానువర్ణనము
క. | వెలయఁ జరాచరభూతం, బులకును ధర్మార్థకామమోక్షము లొసఁగం | 184 |
క. | పరమపవిత్రుం డగునా, హరి కృష్ణుఁ డనంగ మానవాకృతితో నీ | 185 |
వ. | అని యనేకవిధంబులఁ గృపావర్ధిష్ణుం డైనశ్రీకృష్ణుని ప్రశంస చేసి పరాశరుండు | 186 |
ఆ. | విను సహస్రజిత్తుఁ డనఁగఁ గ్రోష్టుఁ డనన, లుండు నహుషుఁ డనఁగ లోకనుతులు | 187 |
వ. | అందు సహస్రజిత్తునకు శతజిత్తుండును వానికి హేహయతాలజంఘవేణుహ | |
| సభాజిత్తుండును వానికి మహిష్మంతుండునుం బుట్టిరి. వానిపేర మాహిష్మతీ | 188 |
క. | అత్రికి ననసూయకు స, త్పుత్రకుఁడై విష్ణునంశమునఁ బుట్టిన ద | 189 |
ఉ. | ఆహవభూమియందు నభియాతులచే నపరాజితత్వమున్ | 190 |
క. | సప్తాశ్వసదృశతేజో, దీప్తుండై రిపుల గెలిచి దీనావనుఁడై | 191 |
క. | భవ్యగతి కార్తవీర్యుం, డవ్యాహతవిభవయుక్తుఁ డగుచు ననష్ట | 192 |
ఉ. | ఊర్జితధర్మవృత్తి గ్రతువుల్ పదివే లొనరించి మించి యా | 193 |
ఆ. | అట్టికార్తవీర్యుఁ డంగనాజనసహ, స్రముతోడఁ గూడి నెమ్మి నేగు | 194 |
క. | ఆవేళ యక్షకిన్నర, దేవాసురులను జయించి దిగ్విజయముతో | 195 |
వ. | ఇట్లు విడిసి. | 196 |
క. | రేవానదిలోపల సం, ధ్యావిధు లొనరించుచున్న నది యెఱిఁగి ధరి | |
| త్రీవిభుఁడు వేయిచేతుల, నావాహిని నీరు దొట్టునట్లుగఁ జేసెన్.[121] | 197 |
క. | పదపడి చేతులు దిగిచిన, నదిజలములతోడఁ గూడ నానావిధసం | 198 |
క. | చతురంగబలముతో ను, ద్ధతుఁడై కృతవీర్యపుత్రుఁ దాఁకిన నతఁ డా | 199 |
తే. | పశువుఁ బట్టినకైవడిఁ బట్టి తెచ్చి, బందిగములోన శృంఖలాబద్దుఁ జేసి | 200 |
క. | ఈ తెఱఁగున బహుబలసం, స్ఫీతుండై యెదురు లేని పెంపునఁ బంచా | 201 |
తే. | అతఁడు కాలావసానంబునందు నరిగి, యాదినారాయణాంశజుం డైనపరశు | 202 |
వ. | అట్టికార్తవీర్యార్జునునకు నూర్వురు కుమారులు జన్మించి రందు శూరసేన వృష | 203 |
ఆ. | వంశకారుఁ డైన ధ్వజినీశుఁ డనుకళా, వంతుఁ డుదయమయ్యె వానియందు | 204 |
క. | పంకజహితనిభుఁ డైనఋ, శంకునకును జిత్రరథుఁడు జన్మించె నిరా | 205 |
వ. | అతఁడు చతుర్దశలోకచక్రవర్తి యై. | 206 |
చ. | ఒలసినవేడ్క నానానృపతి యొక్కముహూర్తమునందు లక్షభా | 207 |
ఉ. | నీతివివేకధుర్యగుణనిర్మలులై పదికోట్లపుత్రులున్ | 208 |
ఉ. | ఆపదికోట్లపుత్రులకు నగ్రజుఁ డైనపృథుశ్రవుండు ధా | 209 |
మణిగణనికరవృత్తము. | ఉశనునిగతిమతియుతుఁ డనఁదగు న | 210 |
వ. | వానికి మధుండు పుత్రుండయ్యె వానికిఁ బరాజితుండును రుతుండును పృథు | 211 |
తనపుత్రుం డగువిదర్భునకు వయోధికస్త్రీని పెండ్లి సేసిన జ్యామఘునివంశానుక్రమము.
క. | జ్యామఘుఁడు శైబ్య యనుకాం, తామణి వరియించి తాను దానికి వశుఁడై | 212 |
క. | భామినులకు వశులై యీ, భూమండలిలోనఁ దిరుగుపురుషులలోనన్ | 213 |
క. | ఆలు దనరాజ్యమంతయుఁ, బాలించఁగ దానిఁ గొల్చి బంటై యుండెన్ | 214 |
వ. | ఇట్లు భార్యావశుండై జ్యామఘుండు సంతానార్థంబుగాఁ దపంబు సేయం | 215 |
ఉ. | వైరిపతుల్ మహోగ్రరథవారణఘోటకకపఙ్క్తియుక్తులై | 216 |
మ. | చని సంగ్రామమునందు దారుణరిపుక్ష్మాపాలలోకంబులన్ | 217 |
వ. | ఇవ్విధంబున నరాతిచక్రంబు పరాక్రమింపనోపక నిజపుత్రమిత్రకళత్రబంధుబల | 218 |
మ. | కనియెన్ దైన్యరసప్రపూరితముఖిన్ గండస్థలవ్యస్తహ | 219 |
చ. | కనుఁగొని జేరవచ్చి భయకంపితగద్గదకంఠనాద యై | 220 |
ఉ. | ఈయెలనాఁగఁ దోడుకొని యిప్పుడ యేను పురంబులోనికిం | |
| ప్రాయ మెలర్పఁజెప్పి యనురాగముతోడ వివాహమయ్యె | 221 |
వ. | అని నిశ్చయించి యక్కన్యారత్నంబుఁ దోడుకొని యతిప్రయత్నంబున రథం | 222 |
ఉ. | ఈహరిణాక్షి యెవ్వరిది యేటికిఁ దెచ్చితి నీకు దీనిపై | 223 |
తే. | కోడ లిది మనయింట నీకోమలాంగి, యుండఁదగు నని తెచ్చితినో మృగాక్షి | 224 |
చ. | అనవుడు నేను వంధ్యను నరాధిప వేఱొకభార్య లేదు నీ | 225 |
తే. | నీవు గొడ్రాలవై యుండెదే కుమారుఁ, డుదయమందకపోవునో యువిద సుతుఁడు | 226 |
తోటకవృత్తము. | దరహాసముతో వనితామణి యా, ధరణీవరుఁ బ్రమదంబున మం | 227 |
క. | గర్భంబుఁ దాల్చి యాసతి, యర్భకునిం గాంచెఁ బటుతరాహితరాజ్య | 228 |
క. | తామును గొనివచ్చిన కన్యామణిఁ బరిణయము చేసి యాతనయుని ధా | 229 |
వ. | అట్టి విదర్భుపేర నారాజ్యంబు విదర్భదేశం బయ్యె నట్టివిదర్భునకుఁ గ్రథకైశిక | 230 |
సీ. | రోమపాదునకు విభ్రుఁడు పుట్టె వానికి ధృతి పుత్రుఁడయ్యె నాధృతికిఁ గౌశి | |
| చైద్యులై ధరణిఁ బ్రశస్తి కెక్కిరి వారిచేత నాదేశంబు చేదిదేశ | |
తే. | మారుఁడును గల్గి రాయిందుమతిఁ గకుత్స్థ, వంశజుం డైనయజుఁడు వివాహమయ్యె | 231 |
వ. | ఆకుంతికి వృష్ణియు నతనికి ధృతియును ధృతికి దాశార్హుండును నతనికి వ్యోముం | 232 |
క. | జ్యామఘువంశానుక్రమ, భూమీశులకథలు భక్తిపూర్వకముగ ని | 233 |
వ. | మఱియు సాత్వతునకు భజమానదివ్యాంధదేవావృధమహాభోజవృష్ణు లనంగ | 234 |
క. | దేవావృధునకు బభ్ర్యుడు, దేవవిభుం డుద్భవించె దీప్తయశుండై | 235 |
వ. | మఱియు మహాధర్ముం డైనమహాభోజునకు భోజమూర్తులు పుట్టిరి. వృష్ణికి | 236 |
సత్రాజిత్తునకు సూర్యునివలన శ్యమంతకమణి లభించుట
మ. | వనజాతప్రభవాండపూరితమహాధ్వాంతప్రణాశప్రభా | 237 |
తే. | అతనిసద్భక్తియుక్తికి నాత్మ మెచ్చి, నీరజాప్తుండు ముందర నిలుచుటయును | 238 |
శా. | ఓనారాయణమూర్తి నీమహిమ నే డుగ్రాగ్నిపిండోపమం | |
| బై నాదృష్టికిఁ దోఁచుచున్నయది దివ్యంబైనయాకారముం | 239 |
క. | తనగ్రైవేయకములలో, ఘనతేజము గల శమంతకంబనురత్నం | 240 |
క. | మిత్రుని నీషత్పింగళ, నేత్రుని నత్యంతవామనీకృతసమ్య | |
ఆ. | చూచి పెక్కు గతులఁ జొక్కుచు ముందర, నున్ననతనితోడ నొక్కవరము | 242 |
వ. | సత్రాజిత్తుండును లోకబాంధవదత్తం బైనశమంతకరత్నంబు నాయకరత్నంబుగాఁ | 243 |
మ. | భవసంహారుని నాదిదేవుని మహీభారావతారక్రియా | 244 |
క. | కని దండనమస్కారము, లొనరించి కరములు మొగిచి యోదేవ దివం | 245 |
వ. | అనినం ద్రికాలవేది యగు దామోదరుండు దరహసితవదనుం డగుచు వారలతో | 246 |
క. | రాజీవాప్తుఁడుగాఁడు ప, యోజహితుం బ్రీతుఁ జేసి యొకరత్నము స | 247 |
వ. | అని యాశ్వాసించి పుచ్చె నంత సత్రాజిత్తుండును నిజనివాసంబునకు వచ్చి సుఖం | 248 |
క. | ఎనిమిదిబారువు లర్థము, దినదినమును గురియుచుండ దీనార్థిజనా | 249 |
మ. | ఉపసర్గాధికహీనవృష్టి పటువాయువ్యాజనానాసరీ | 250 |
వ. | అంత నొక్కనాఁడు మురాంతకుం డత్యంతగుణవంతం బైనశమంతకంబు మహీ | 251 |
క. | ఇమ్మణిరత్నము గృష్ణుం, డిమ్మనినఁ బ్రియంబుతోడ నీవలయును నీఁ | 252 |
తే. | అని తలంచి సహోదరుఁ డగు ప్రసేను, నపుడ రప్పించి యిచ్చిన నతఁడు దాని | 253 |
చ. | నరవరసూనుఁ డొక్కఁ డొకనాఁడు తురంగము నొక్కి వేఁటమై | 254 |
తే. | చటులగతి ఋక్షపతి యైన జాంబవంతుఁ, డామృగేంద్రముఁ బరిమార్చి యాశమంత | 255 |
సీ. | అంత యాదవవీరు లాప్రసేనునిచావు విని యెంతయును దుఃఖవివశు లగుచు | |
| దానికి సామవాదముల సత్రాజిత్తుఁ డీనేరఁడని కదా యిప్పు డతని | |
తే. | బరులవలనఁ గీడు వొరసినఁ జెడకుండఁ, నాదరమునఁ బ్రోచు నవ్విభుండు | 256 |
వ. | అని యిట్లు పలుకుచున్న లోకాపవాదంబునకు వెఱచి నారాయణుండు. | 257 |
శ్యమంతకమణిమూలంబున శ్రీకృష్ణునకు జాంబవతీసత్యభామలు భార్య లగుట
సీ. | సేనలుఁ దాను బ్రసేనుండు మును గానకరిగినచొప్పున నరిగి యొక్క | |
తే. | నిఖిలబలమును నచ్చోట నిలిపి బిలము, దఱియఁ జొచ్చి కొండొకనేల యరిగి యచట | 258 |
క. | అక్కడ నొక్కకుమారుని, నక్కున నిడి యొక్కదాది యనురాగముతో | 259 |
(శ్లో. | సింహః ప్రసేనమవత్సింహో జాంబవదా హతః, | |
ఆ. | హరి ప్రసేనుఁ జంపె నమ్మృగేంద్రంబును, జాంబవంతుచేతఁ జచ్చె నిపుడు | 260 |
వ. | అని యిట్లు పలుకుచున్న దాది పలుకు లాకర్ణించి ముందట. | 261 |
తే. | జలజనాభుఁడు పొడఁ గాంచె జాంబవత్కు, మారుకంఠప్రదేశమం దంచితప్ర | 262 |
క. | చేరంగవచ్చి శౌరి కుమారునికంఠమున నున్నమణిరత్నము దు | 263 |
ఆ. | అంత జాంబవంతుఁ డత్యంతదారుణ, కోపదీప్తుఁ డగుచు నాపురాణ | 264 |
చ. | వనరుహనాభురాక గరువంబునఁ గోరుచు సేనలెల్ల నే | |
| డెనిమిదినాళ్లు సూచి యతఁ డీల్గెనొ కాకని ద్వారకాపురం | 265 |
ఆ. | అందువలనఁ గృష్ణఁ డాప్యాయితశరీరుఁ, డగుచు నతులశక్తి నని యొనర్పె | 266 |
ఉ. | బల్లిదు లైనఋక్షయదుభర్త లుదగ్రపరాక్రమంబులన్ | 267 |
మ. | మును లంకాపురిలోన రావణుబలంబుల్ రాముసైన్యంబుతో | 268 |
ఉ. | నిన్ను మనుష్యమాత్రుఁడని నిక్కముఁ జెప్పఁగరాదు సత్వసం | 269 |
చ. | తను నెఱిఁగించి చిత్తమునఁ దార్కొని యున్నకృపాంబురాశిలో | 270 |
ఉ. | కానుక యిచ్చి పెండ్లి యొడికంబుగఁ జేసి శమంతకంబుతో | 271 |
ఉ. | వచ్చినకృష్ణుని సుజనవత్సలుఁ గన్గొని ద్వారకాజనుల్ | 272 |
శా. | సత్రాజిత్తున కాశమంతకము వాత్సల్యంబుతో నిచ్చి లో | 273 |
మ. | తనచిత్తంబు భయంబుఁ బాయుటకు సత్రాజిత్తుఁ డాత్మీయనం | 274 |
క. | కృతవర్మయు నక్రూరుఁడు, శతధన్వునికడకుఁ బోయి సమధికకోపా | 275 |
ఆ. | మునుపు సత్యభామ మనలోన నొకరున, కిత్తు ననుచు నిశ్చయించి పలికి | 276 |
తే. | ఇంత సేసిన దుష్టాత్ము నెట్టులైన, సంహరించి శమంతకచారురత్న | 277 |
సత్రాజిత్తుని జంపి శ్యమంతకము నపహరించిన శతధన్వుని శ్రీకృష్ణుండు సంహరించి అక్రూరునియొద్దనున్న ఆశ్యమంతకమణిని గ్రహించుట
వ. | అంత నొక్కనాడు దేవకీనందనుండు పాండునందనులు వారణావతంబున దుర్యో | 278 |
క. | రాత్రి సుఖనిద్రఁ జెందిన, సత్రాజిత్తును వధించి శతధన్వుఁడు త | 279 |
క. | కృతవర్మాక్రూరుల యను, మతమునఁ దమతండ్రిఁ జంపి మణిరత్నం బా | 280 |
ఆ. | అరద మెక్కి యతిరయంబునఁ దగువారుఁ, దాను వారణావతమున కరిగి | 281 |
చ. | ఉడుగనిబాష్పపూరముల నుగ్మలి యవ్విభుపాదపద్మముల్ | 282 |
క. | వెఱఁగంది శౌరి యిట్లనుఁ, దెఱవా మీతండ్రి నిట్లు దెగ చంపిన యా | 283 |
క. | అని సత్యభామ నూరా, ర్చి నళినదళలోచనుండు చెచ్చెరఁ గుంతీ | 284 |
తే. | వచ్చి యేకాంతమునఁ దమవారలైన, యుగ్రసేనాదిబలభద్రయోధవరుల | 285 |
మ. | రవిదత్తం బగునాశమంతకమహారత్నార్థమై దారుణా | 286 |
క. | అని పలికి శౌరి సీరిం, గనుఁగొని యిట్లను శమంతకము ముల్లోకం | 287 |
తే. | ఇంత సేసినదుష్టాత్ము నిపుడె పట్టి, గెడపకుండిన మన కపకీర్తి వచ్చు | 288 |
తే. | శౌరికంటెను గోపరసప్రపూర్ణ, హృదయుఁడై యుండె నావిధం బెల్ల నెఱిఁగి | 289 |
క. | కృతవర్మకడకుఁ జని య, చ్యుతుఁడు తనుం జంప నున్నయుద్యోగముఁ జె | 290 |
క. | అవ్వచనములకు మదిలో, నవ్వుచుఁ గృతవర్మ పలికె ననుఁ బిలిచెదు నీ | 291 |
ఉ. | ఏనును నీవు నేల జగ మింతయు నొక్కటఁ గూడి వచ్చినన్ | |
| దానవవైరి ముందరఁ బ్రతాపముఁ జూపగ రాదు కావునన్ | 292 |
మ. | అతఁ డక్రూరునిపాలి కేగి తనకార్యంబంతయుం జెప్పి య | 293 |
వ. | అదియునుంగాక యమ్మహాత్ముండు నిశాచరాధిపశుద్ధాంతకాంతావైధవ్యకారణా | 294 |
ఉ. | ఏ నెటకేనియుం దొలఁగి యేగెద నీమహనీయరత్నమున్ | 295 |
చ. | అని తన చేతిరత్నముఁ బ్రయత్నము మీఱఁగ నిచ్చె నిచ్చినన్ | 296 |
ఆ. | సంతసిల్లి యాశమంతకం బతిరహ, స్యంబు గాఁగ దాఁచె నంతలోనఁ | 297 |
క. | అతితీవ్రవాయువేగియు, శతయోజనవాహినియును సమధికసత్వో | 298 |
వ. | అంత బలదేవుండు దోడురా వాసుదేవుండు సైన్యసుగ్రీవమేఘపుష్పవరాహ | |
| కంబులను తురంగంబులం బూన్చినరథంబు సూతుం డైనదారుకుండు తెచ్చు | 299 |
చ. | గురుతరవాయువేగమున గోడిగయున్ శతయోజనంబు లు | 300 |
తే. | పాదచారియై రయమునఁ బాఱిపోవఁ, జొచ్చుటయు దవ్వుదవ్వులఁ జూచి శౌరి | 301 |
మ. | తులువం జంపి శమంతకంబుఁ గొనివత్తున్ మీరు మెచ్చంగ నే | 302 |
ఉ. | వారిజలోచనుండు బలవద్రిపుమండలఖండనక్రియా | 303 |
వ. | ఇట్లు కానక మగిడివచ్చి యావృత్తాంతంబంతయు బలభద్రునకుం జెప్పుటయు | 304 |
క. | తమ్ముఁడవని ని న్నేగతి, నమ్మంగావచ్చు నెట్లు నాకొసఁగక ర | 305 |
చ. | అనుటయుఁ బద్మనాభుఁడు హలాయుధుఁ గన్గొని యేను నీకు వం | 306 |
మ. | అని యిట్లెన్నివిధంబులం బలికినన్ హాలామదోద్వేగలో | 307 |
వ. | అని పలికి మహారోషంబున బలభద్రుండు కృష్ణుండు దన్ను నెంత పెనంగి ప్రార్థిం | 308 |
ఆ. | ద్వారవతికి మగిడివచ్చి దామోదరుం, డిట్టినింద దనకు నేలవచ్చె | 309 |
ఆ. | జలజనయనువలన సంశయం బేమియు, నొందకుండు టెఱిఁగి యుగ్రసేన | 310 |
క. | ఆరీతిని రత్నం బ, క్రూరుఁడు గొనిపోయి దాఁచి గోప్యము సేసెన్ | 311 |
వ. | కుబేరుండునుంబోలె మహాధనవంతుండై యుండి తనయర్థంబు నిరర్థకం బగువ్య | 312 |
ఆ. | భోజముఖ్యులయిన రాజు లక్రూరుని, బంధువరులు రాచపాడి దప్పి | 313 |
తే. | తన్నిమిత్త మక్రూరుఁడు దనకు నెంత, యొప్పములు వచ్చునో యని యుండ వెఱచి | 314 |
సీ. | జగతిపైఁ గాలవర్షంబులు లేవయ్యె సస్యంబు లెల్ల నాశంబుఁ బొందె | |
| వ్యాధులు దఱుచయి బాధించెఁ బ్రజలను జావు లగ్గలమయ్యె జనులయందుఁ | |
తే. | దుష్టభుజగంబు లందందఁ దోలికఱచెఁ, గ్రూరమృగచయమెల్లఁ ద్రెక్కోలుగొనియె | 315 |
క. | ఇట్టి మహోత్పాతంబులు, పుట్టినఁ గృష్ణుండు వృష్ణిభోజాంధకులన్ | 316 |
తే. | చెప్పి దీనికిఁ బ్రతికార మిప్పు డేమి, చేయుదము బుద్ధిమంతులు సెప్పుఁడనిన | 317 |
క. | విను మాధవ యక్రూరుని, జనకుండు శ్వఫల్గుఁ డమరసన్నిభుఁ డతఁడుం | 318 |
వ. | తొల్లి కాశీరాజు తనదేశంబున ననావృష్టిదుర్భిక్షమారికాదిదోషంబులు పుట్టిన | 319 |
తే. | ఇంక మూఁడేండ్లకునుగాని యే జనింప, నన్నిదినములు దిన మొక్కయావు లెక్క | 320 |
ఆ. | అనిన నట్లకాక యని నిత్యకృత్యంబు, నతఁడు గురున కొక్కయావు లెక్క | 321 |
వ. | అది నిమిత్తంబుగా నక్కన్నియకు గాందినీనామధేయంబు చేసి శ్వఫల్గున కిచ్చె | 322 |
క. | బాణాంతకుఁ డక్రూరుని, ప్రాణార్థంబులకుఁ దప్పనని శపథం బ | 323 |
తే. | గాందినేయుఁడు శౌరివాక్యములు నమ్మి, ద్వారకకు వచ్చి పూర్వప్రకారమునను | 324 |
మ. | కురిసెన్ వానలు సస్యవృద్ధి గలిగెన్ గొల్చెక్కుడై యమ్మె నె | 325 |
వ. | ఇట్లు సకలదురితనివారణం బగుటకు వెఱఁగుబడి పుండరీకాక్షుండు తనమనం | 326 |
సీ. | కడునల్పపుణ్యులు గాందినియును శ్వఫల్గుండును వారలకొడుకుఁగుఱ్ఱఁ | |
తే. | నింత యర్థంబు వీనికి నెట్లు గలిగె, నింతతేజోవిశేషంబు నిట్టిపాటి | 327 |
క. | ఒకనాఁడు సకలయాదవ, నికరంబులతోడ గాందినీసుతుఁ బిలిపిం | 328 |
వ. | ఇవ్విధంబున నక్రూరునిచిత్తం బక్రూరంబుగాఁ బ్రతులు సేసి యిట్లనియె. | 329 |
సీ. | అనఘ నీచేఁ గమలాప్తదత్తం బైనయాశమంతక మవశ్యంబు నుండు | |
తే. | వీర లిందఱు నామీఁద విశ్వసింప, కున్న వా రపకీర్తి నా కొదవకుండఁ | 330 |
వ. | అనిన గాందినీనందనుండు దేవకీనందనుపలుకుల కులికిపడి మొగంబు వెల్లనై | 331 |
క. | మానికము దాఁచి లేదని, పోనాడి మొఱంగి తొలఁగిపోయిన నెందుం | 332 |
క. | మును శతధన్వుఁడు దనకి, చ్చినచందముఁ దెలియఁజెప్పి చెచ్చెరఁ దనక | 333 |
పంచచామరము. | సముజ్జ్వలారుణప్రభావిశాలభాసురోదయా | 334 |
వ. | ఇట్లు జాజ్వల్యమానంబై వెలుంగుచున్న రత్నంబు సకలజనంబులు పట్టిపట్టిచూచి | 335 |
క. | లోకేశ యిమ్మణీంద్రము, నీకృప నామీఁదఁ జాలనిలిచినకతనం | 336 |
ఉ. | ఇమ్మహనీయరత్నమున కెంతయు నాసలఁ జిక్కి చచ్చినా | 337 |
క. | లోకోపకారముగ నిది, నాకడ దాఁచితిని దీని నారాయణ యీయీ | 338 |
చ. | అడుగక కాని దాఁచినపదార్థము లిచ్చుట నీతిగాదు నీ | 339 |
తే. | అనిన గాందినినందను నమ్మురారి, గౌరవించుచు నుచితవాక్యములు పలుకు | 340 |
శ్రీకృష్ణుం డక్రూరునకు శ్యమంతకమణి నొసంగుట
ఆ. | తనకు మీఁదు గట్టి తగనియ్యఁ బాఱినాఁ, డనుచు సీరపాణి యాససేసెఁ | 341 |
క. | వారిరువురు దమలోపలఁ, బేరాసల నుండు టెఱిఁగి పీతాంబరుఁ డ | 342 |
క. | సతతంబు బ్రహ్మచర్య, వ్రతస్థులకుఁ గాని యున్నవారలకును సం | 343 |
సీ. | షోడశసాహస్రసుందరీజనమోహితుఁడఁగాన నే నోప నెడభరింప | |
తే. | గాన నాకును జూడ నిష్కల్మషుండు, బ్రహ్మచర్యవ్రతస్థుఁడై పరఁగు భాగ | 344 |
మ. | అని యారత్నము కాందినేయునకు నెయ్యంబారఁగా నిచ్చి పొ | 345 |
తే. | శౌరి తన కైనమిథ్యాభిశస్తిదోష, మంతయును బాపుకొని సముదగ్రవైభ | 346 |
తే. | మునివరోత్తమ యీకథ వినిన సాధు, జనులు మిథ్యాభిశక్తిదోషములు లేక | 347 |
అనమిత్రప్రభృతులవంశానుక్రమము
వ. | అని చెప్పి పరాశరుండు వెండియు సోమవంశంబు కొఱంత సెప్పువాఁడై | 348 |
క. | అనమిత్రునకును శినియున్, శినికిన్ సత్యకుఁడు నాతనికి సాత్యకియున్ | 349 |
క. | అనమిత్రుని యన్వయమున, జనియించె శ్వఫల్గుఁ డతనిచరితం బెల్లన్ | 350 |
ఆ. | అంధకునితనూజులై రుచికంబళ, కుకురబర్హు లనఁగఁ బ్రకటయశులు | 351 |
క. | అనునకు నానకదుందుభి, జనియించెఁ బునర్వసుండు తత్సుతుఁడై యా | 352 |
వ. | దేవకోగ్రసేను లనుపుత్రద్వయంబును వృకదేవయు నుపదేవయు దేవరక్షితయు | |
| లును బుట్టి రయ్యిందువదనల నందఱు వసుదేవుండు వివాహంబయ్యె నుగ్రసేను | 353 |
క. | భజమానునకు విదూరథుఁ, డు జనించె నతనికి శూరుఁడు గలిగె నాభూ | 354 |
క. | వానికి భోజుఁడు భోజ, క్ష్మానాథునకును హృదీకజననాథుఁడు నా | 355 |
క. | శూరుఁడు మారిష యనువని, తారత్నమునందుఁ బుత్రదశకముఁ బడసెన్ | 356 |
ఉ. | ఆవసుదేవుజన్మసమయంబున వేల్పులు గూడి ధాత్రిలోఁ | 357 |
వ. | మఱియు నవ్వసుదేవునికి భగినులై పృథయును శ్రుతదేవయు శ్రుతకీర్తియు | 358 |
క. | కుంతి యనుధరణినాథుఁడు, సంతానములేక శూరుసమ్మతమున నా | 359 |
ఉ. | ఆనళినాక్షి పౌరవకులాగ్రణి పాండునిఁ బెండ్లియాడి ధ | 360 |
క. | ఆవనిత సవతి మాద్రీ, దేవి వడసెను నకులసహదేవు లనంగా | 361 |
వ. | మఱియు శ్రుతదేవను వృద్ధధర్ముం డనుకరూశపతి వివాహంబై దానియందు నేవురు | 362 |
సీ. | పూర్వకాలంబునఁ బురుషోత్తమునితోడివైరంబువలన నుదారవిక్ర | |
తే. | పిదప శిశుపాలుఁడై పుట్టి పిన్ననాటఁ, గోలెఁ బూర్వవిరోధంబు కొనలుసాగ | 363 |
వ. | అనిన మైత్రేయుం డిట్లనియె. | 364 |
ఉ. | అందముగా నతండు దివిజాదులు గాననివైభవంబులం | 365 |
వ. | అనినం బరాశరుం డిట్లనియె. | 366 |
సీ. | ఆదైత్యనాథువధార్థమై హరి నారసింహరూపంబును జెందినపుడు | |
తే. | జానకీసక్తచిత్తుఁడై శాశ్వతాప, వర్గ ఫలదాయి యగు రామవసుమతీశు | 367 |
తే. | పూర్వపుణ్యఫలంబునఁ బొలిచినట్టి, యంచితైశ్వర్యసంపద లనుభవింప | 368 |
తే. | అఖిలభూమండలశ్లాఘ్యమైన సకల, భాగ్యమహిమ లవ్యాహతప్రౌఢి ననుభ | 369 |
ఆ. | పిన్ననాటఁగోలె వెన్నునిఁ జంపుదు, ననుతలంపుఁ దన్ను నతఁడు వెదకి | 370 |
ఉ. | పిమ్మట వారిముందర నుపేంద్రునిఁ గైకొన కచ్యుతాదినా | 371 |
వ. | ఇట్లు మనోవాక్కాయకర్మంబులందును. | 372 |
సీ. | ఇంద్రనీలచ్ఛాయ నేపారుమేనును బంగారుచాయలపచ్చడంబు | |
తే. | కటకకంకణమణిముద్రికాకిరీట, హారకేయూరమణికుండలాభిరామ | 373 |
వ. | ఇవ్విధంబున నవ్వాసుదేవుని వైరాను భావంబునఁ బర్యటనభోజనస్నానాసన | 374 |
సీ. | ఉదయించి వచ్చుఖద్యోతబింబము శౌరిచక్రమో యని భీతి సంచలించు | |
తే. | నపరసంధ్యారుణం బైనయాకసంపుఁ, గనకవస్త్రంబు విష్ణుదిగాఁ దలంచు | 375 |
వ. | ఇవ్విధంబునం బరమార్థతత్వభావుం డయినయవ్వాసుదేవునియందు లయం | 376 |
క. | రిపులకు నీగతి మోక్షము, కృపసేయ సమర్థుఁ డైనకేశవునకు న | 377 |
వ. | అని పలికి వెండియు తరువాతికథావిధానం బెఱింగించువాడై యిట్లనియె. | 378 |
తే. | రమణరోహిణీదేవకీప్రముఖసతుల, బ్రీతితో వసుదేవుండు పెండ్లియాడ | 379 |
వ. | ఆబలభద్రవంశపరంపర లనేకంబు లయ్యె. | 380 |
తే. | దేవకీదేవి కావసుదేవునకుఁవగు, మారషట్కంబు జనియించి వారలెల్లఁ | 381 |
వ. | వచ్చి దేవకీదేవిగర్భంబున నున్నయర్భకుం గొనిపోయి రోహిణీజఠరంబున నునిచె | 382 |
ఆ. | యోగనిద్ర హరినియోగంబునను నందు, కాంత యగుయశోదగర్భమునను | 383 |
వ. | కృష్ణుండు పదాఱువేలు న్నూటయెనమండ్రుభార్యల వివాహంబై వారియందు | 384 |
క. | పదివేలును పదివేలును, మొదలన్ గుణియించి నియుతమున నది నిహతం | 385 |
ఉ. | సంగరభూమియందు మును చచ్చినదానవదైత్యదేవతా | 386 |
వ. | మఱియు యయాతి రెండవపుత్రుం డైనదుర్వసువంశంబు తండ్రిశాపంబునఁ | |
| బొందిరి, అనువంశసంభవు లయ్యంగవంగకళింగాదిరాజపరంపరలై విస్తరిల్లిరి. | 387 |
క. | ధీరుఁడు యయాతి ధరణీ, భారధురంధరునిఁ గాఁగఁ బట్టము గట్టెన్ | 388 |
పౌరవవంశానుక్రమము
వ. | అట్టిపూరునకు జనమేజయుండును జనమేజయునకుఁ బ్రచిన్వంతుండు నాతనికి | 389 |
ఆ. | కాశిరాజకన్యకల నంబికాంబాలి, కల వివాహమై వికాసవీలఁ | 390 |
వ. | అంత సత్యవతీనియుక్తుండై కృష్ణద్వైపాయనుండు దేవరన్యాయంబున నంబిక | |
| నునకు నులూచియందు నిలావంతుండును చిత్రాంగదయందు బభ్రువాహనుండు | 391 |
ఆ. | భూతవర్ధమానభూపాలకులనెల్ల, వింటి తేటపడ భవిష్యదవనీ | 392 |
క. | జనమేజయుండు త్రిజగ, జ్ఞానవినుతుం డైనయాశతానీకుని బు | 393 |
ఆ. | యాజ్ఞవల్కివలన నధ్యయనముఁ గృపా, చార్యువలన నస్త్రశస్త్రములును | 394 |
కలియుగదోషాదివివరణము
వ. | అట్టి సూర్యసోమవంశంబుల రాజపరంపరలు కలియుగంబునఁ గొంతకాలంబు | 395 |
క. | అల్పప్రసాదములుఁ గడు, నల్పవివేకములు నాయు వల్పము ముఱి య | 396 |
ఉ. | కోపము దుర్వివేకమును క్రూరతయున్ జపలత్వమున్ మన | 397 |
వ. | మెలఁకువ లధమాధమములు, పలుకు లసత్యములు లేవు పౌరుషములు నే | 398 |
క. | ఆవులఁ బడిఁ బొడుచుటయును, స్త్రీవధ లొనరించుటయును శిశువుల హత్యల్ | 399 |
సీ. | పరధనపరదారహరులు నల్పాల్పసారులున్ మృతప్రాయమూర్తులు నసత్య | |
తే. | బలిమిగలవాఁడె రాజు సంపదలు గలుగు, నతఁడె మాన్యుఁడు సభల మాట్లాడనేర్చు | 400 |
వ. | మఱియు ధనంబ కులాభిజాత్యహేతువు బలంబ ధర్మహేతువు మనోహరంబ | 401 |
ఉ. | భూమిని ధర్మముల్ నిలుపఁ బూని ముకుందుఁడు సర్వలోక | 402 |
మ. | నిజధర్మంబున వేదముల్ ధరణిపై నిండన్ బ్రతిష్ఠించి సా | 403 |
తే. | కలియుగము దీఱి కృతయుగకాలమైన, ధర్మమార్గంబు నాల్గుపాదముల నడచు | 404 |
క. | కలియుగదోషములకుఁ గడు, నులికి తపము లాచరించుచున్ననరేంద్రుల్ | 405 |
వ. | అని యిట్లు సూర్యసోమవంశానుచరితంబులపరిపాటి నెఱింగించి పరాశరుండు | 406 |
మ. | విను మైత్రేయ జనార్ధనాంశభవులై విశ్వంభ రామండలం | 407 |
సీ. | ఇక్ష్వాకుమాంధాతృఋతుపర్ణయువనాశ్వసగరశంతనుహరిశ్చంద్రనహుష | |
ఆ. | భీష్మధర్మపుత్రభీమభీబత్సపాం, చాలకేకయవైరాటసత్యసేన | 408 |
వ. | ఇట్లు సూర్యసోమవంశాధిపతులం జెప్పి మఱియును. | 409 |
ఉ. | చాటుతరప్రబంధకవిసన్నుత సంగరపార్థ ధీరతా | 410 |
క. | రాజీవనయనపదయుగ, రాజీవభ్రమరశత్రురాజన్యరమా | 411 |
శాంతి. | బాహువిక్రమప్రతాపబాహులేయసంగరో | 412 |
| గద్య. ఇది శ్రీమదమరనామాత్యపుత్ర హరితగోత్రపవిత్ర సుకవిజనవిధేయ వెన్నెల | |
————
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.
- ↑ శ్రీజనకజనకనిభవిభాజికగాంభీర్యసామరభ్యవివేక = లక్ష్మీదేవికి తండ్రియైన సముద్రుని బోలి ప్రకాశించునట్టి గంభీరభావంబును జనకచక్రవర్తిని బోలి ప్రకాశించునట్టి సామరస్యముతోడి వివేకంబును గలవాఁడా, జగనబ్బగండ = ఇది బిరుదుమాట, విరాజితకరుణాకలాప = ప్రకాశించునట్టి దయయే ఆభరణముగాఁ గలవాఁడా.
- ↑ స్రష్ట = సృష్టికర్త.
- ↑ శతపత్రభవాంశంబునన్ = బ్రహ్మయొక్క అంశమును, బంధుర = అధికమైన.
- ↑ సమధికనిష్ఠాకల్యాత్ముఁడు = మిక్కుటమైననిష్ఠతో శుభస్వరూప(నిర్మల)మైన మనసు గలవాఁడు, పద్మయోనికిన్ = బ్రహ్మను గూర్చి.
- ↑ అమృతప్రేక్షణకిరణములకున్ = అమృతమును చిలుకుచున్నకిరణములకును.
- ↑ గృహిత్యము = గృహస్థునితనము, దాక్షాయణులన్ = దక్షునికూఁతులను.
- ↑ బెరయుచున్ = అతిశయించుచు.
- ↑ వనజవిరోధియున్ = చంద్రుఁడును, చెలువంబు = సౌందర్యమును, వలవంతలు = మోహములు, పెంపుతోన్ = గౌరవముతో.
- ↑ పుట్టము =- వస్త్రము, కమ్మ = మధురమైన, కలికి = విలాసయుక్తములైన, కజ్జలంబు = కాటుకను, తుఱిమి = లోపల చొప్పించి - ముడిచి, పాలిండ్లన్ = స్తనములయందు, రవళి = ధ్వనించుచున్న. రాయడింపన్ = ఒరయఁగా - హెచ్చఁగా ననుట, ఇందుబింబాస్య = చంద్రబింబమును బోలిన మొగముగలది.
- ↑ తరళతారానయనన్ = తిరుగుచున్న నల్లగ్రుడ్లతోఁ గూడినకన్ను గలదానిని.
- ↑ మదనాతురుండు = మన్మథునిచే పీడింపఁబడినవాఁడు.
- ↑ తిలకించున్ = చూచును, కిలికించితాదులన్ = కిలికించితము మొదలుగాఁగల శృంగారచేష్టలను [కిలికించితము = సంతోషరోషాశ్రుభయాదుల కలయిక], గెల్లుచూచున్ = నిక్కి చూచును, నిగ్గులుదేఱు = నిగనిగలాడు, ఏకాంతము = రహస్యము, ఆనన్ = త్రాగ, తివురున్ = యత్నించును, భిన్న = భేదింపఁబడిన, తగులు = పొందునట్టి.
- ↑ సమేలంపు = కలగలుపుగల, మేలమాడున్ = సరసములాడును, కలికినేఁతలకున్ = విలాసచేష్టలకు, వలకారితనమునన్ = మోహముగల స్వభావముతో, వన్నెబెట్టున్ = అలంకరించుకొనును. అన్యాపదేశంబులు = వేఱొకదాని జూపి తనయభిప్రాయమును దెలుపునట్టిమాటలు, నర్మోక్తులు = శృంగారహాస్యాస్పదములైన ప్రియవాక్యములు, తీఁగసాగన్ = దీర్ఘధ్వని కలుగునట్టుగా.
- ↑ మేలములు = పరిహాసపుమాటలు, చేలము = వస్త్రము, విరాళితనంబులన్ = ఆసక్తతలతో.
- ↑ ఇరవుగన్ = విశదముగా.
- ↑ చెంగలింపన్ = వ్యాపింపఁగా, వాలిక = వాలుగల, పిఱువీఁకులు = పీఁకుపీఁకుళ్లు, ముత్పులకదంతురపఙ్క్తులు = సంతోషమువలనఁ గలిగినగగుర్పాటుయొక్క యెక్కుడైన చాళ్లు, నివ్వటిల్లఁగన్ = అతిశయింపఁగా.
- ↑ తలిరాకులవిత్తై = చిగురుటాకులపరంపర గలదై - చిగుళ్లను కత్తులచేతిబాధచే చలించినదై యనుట, తమకించుటయున్ = వేగిరపడఁగా.
- ↑ పరికింపక = విచారింపక, విధుఁడు = చంద్రుడు, పైకొని = పైఁబడి.
- ↑ కమ్మ = పరిమళముగల, చక్కెరమోవులు = చక్కెరవలె మాధుర్యము గలయధరములును, ముద్రలు = చిహ్నములు, పక్కులతోడి = పెల్లలతోఁ గూడిన.
- ↑ చేఁతలు = చేష్టలు, ప్రకాశంబు = ప్రసిద్ధము.
- ↑ తొడుకపొమ్ము = తోడుకొనిపొమ్ము, జైవాతృక = చంద్రుఁడా.
- ↑ మరులేచి = మోహ మతిశయించి, నిరుపాధికంబులు = చింతలేనివి, నిరాతంకంబులు = భయము లేనివి, సాంగముగాన్ = తుదముట్ట.
- ↑ కోలుపడి = పోఁగొట్టుకొని, ధౌర్త్యము = ధూర్తత్వము, వృషుండు = ఇంద్రుడు, భీషణకోపవేష్టితాధరుఁడు = దారుణమైన కోపముచేత చుట్టఁబడిన (అదరుచున్న) పెదవులు గలవాఁడు, కొఱగామి = చెఱుపు - దుష్కార్యము.
- ↑ పరద్వారంబు = అన్యమార్గమును - అక్రమమును, వీఱిఁడిన్ = దుష్టుని, ఒగిన్ = క్రమముగా.
- ↑ సంభావనలు = మర్యాదలను.
- ↑ కువలయానందప్రభావంబులు= భూమండలమునకు సంతోషము పుట్టించునట్టి మహిమలు - కలువలకు వికాసము గలుగఁజేయునట్టి మహిమలు అని యర్థాంతరము, దివిజాభీష్టఫలప్రదానగుణములు = దేవతలు కోరినఫలములను ఇచ్చునట్టి గుణములు - దేవతలకోరికదీర అమృతమును వర్షించునట్టి గుణములను, సత్పథవ్యవహారస్థితి = మంచిమార్గమును అనుసరించినవాఁడు అను వాడుకయొక్క రీతిని - నక్షత్రవీథియందు మెలఁగుటను అని యర్థాంతరము.
- ↑ యామినీశ = చంద్రుఁడా, దుర్వివేకములు = వివేకముమాలినపనులు, ఒప్పములు = చెడ్డవి.
- ↑ తప్పు చేసి = తప్పుగా నేర్పఱిచి, అంపెనఁటే = పంపెనా, తనచేతలు = ఆయింద్రుని చేష్టలు.
- ↑ కాయజుచేత = మన్మథునిచేత, శప్తుఁడై = శపింపఁబడినవాఁడై.
- ↑ ఉల్లసములు = మర్మభేదములైన పరిహాసపుమాటలు.
- ↑ నిలింపగురుని = బృహస్పతియొక్క.
- ↑ సురేజ్యుదారన్ = బృహస్పతిభార్యను.
- ↑ పుత్తెంచిన = పంపిన, తెల్లముగాన్ = విశదముగా.
- ↑ ఉదాసీనులు = అనాదరము చేయఁబడినవారు, ఉపమ = ఉపాయము.
- ↑ అంగజవైరి = శివునియొక్క, వెంగలి = మూర్ఖుఁడు, గీష్పతి = బృహస్పతి, ఉగ్రుఁడు = శివుఁడు - భయంకరుఁడు.
- ↑ దివిజానీక = దేవతాసేనతో, చటులవృత్తిన్ = పరుషవ్యాపారముతో, ఉద్యత్కోప...రాకృతి = అతిశయించిన కోపముచేత చక్కఁగా తృప్తినొందింపఁబడి యాదరింపఁబడుచున్న మిక్కిలి భయంకరమైన యాకారము - అధికకోపముచే నైనభయంకరమైన యాకృతి, తలిర్పన్ = వికాసమును వహింపఁగా.
- ↑ పటుసంగరక్రియాపరిణతిన్ = సమర్థమైన యుద్ధవ్యాపారముయొక్క పరిపూర్తిచేత.
- ↑ పరిరంభ = ఆలింగనమువలని, శర్వామృతాంశులు = శివుఁడును చంద్రుఁడును, సంగరకళా = యుద్ధ మనెడి విద్యయందలి, ఏపారన్ = అతిశయింప.
- ↑ ఆసన్న = సమీపించిన, అలంఘనీయము = దాఁటఁదగనిది, ఈషికాస్తంబమధ్యంబునన్ = కసపుగంటనడుమ.
- ↑ అగ్గలంబుగన్ = అధికముగా.
- ↑ ఎగ్గు = కీడు - దోషము, లగ్గు = మేలు - శుభము, నెగ్గింపడు = రోఁతపడఁడు.
- ↑ కుంభీనసక్రోడేభములన్ = ఆదిశేషుని ఆదివరాహమును అష్టదిగ్గజములను, సురేశరతనూభవసోమపంచబాణులన్ = జయంతుని చంద్రుని మన్మథుని.
- ↑ శాకోట = వెల్లతేఁకుచెట్టు, నీప = కడపచెట్టు.
- ↑ సొబగు = బాగు, సోడు = బ్రహ్మరంధ్రము, చిమ్మచీఁకట్లు = అధికమైన చీఁకట్లు, బెరయన్ = పొందఁగా.
- ↑ బాలరసాలంబు మ్రోలన్ = లేఁతతియ్యమామిడిచెట్టునొద్ద, క్రాలు = వర్తించు.
- ↑ తొలంకు = చిందు, కల్కి = మనోజ్ఞమైన, వలి = వలుదలైన, మవ్వము = ఒప్పిదము - విధము.
- ↑ దివౌకస = దేవతానంబంధియైన.
- ↑ ప్రగల్భ= ప్రౌఢమైన, అలజడి = సంకటము.
- ↑ ఉరణకద్వయ = గొఱ్ఱెపిల్లలజంటయొక్క, అపనేయంబులు = పోఁగొట్టఁదగినవి, నగ్నరూపంబునన్ = దిగంబరత్వముతో.
- ↑ ఉపకంఠంబునందు = సమీపమునందు, ఏకషష్టసమలు = అఱువదియొక్కయేండ్లు.
- ↑ నిస్పృహ = ఆపేక్షలేమి.
- ↑ సమయంబు = ఏర్పాటు, వియోగంబు = ఎడఁబాటు.
- ↑ అజపోతకంబు = గొఱ్ఱెపిల్ల, విహ్వలధ్వనిన్ = పరాధీనతచేత నైన ఆర్తధ్వనితో, వేల్పుకొమ్మ = దేవతాస్త్రీయైన యూర్వశి.
- ↑ అభియాతుల = పగవారియొక్క, కాపురుషత్వంబు = కుత్సితపురుషునితనము.
- ↑ విద్యుద్భ్రమంబున్ = మెఱపుయొక్క చలనమును.
- ↑ నృపసింధురుఁడు = రాజశ్రేష్ఠుఁడు, శాబకములన్ = పిల్లలను.
- ↑ పరిభ్రమించుచున్ = తిరుగుచు.
- ↑ పెక్కువ = ఆధిక్యమును, కుట్మలలములు = మొగ్గలు, గండు = బలిసిన, పిండు = సమూహము,
తన్వంగి = కృశాంగముగల యూర్వశియొక్క, నెఱి = వక్రత, అభిచరించున్ = అంతట తిరుగును. - ↑ ఉన్మత్తవేషంబునన్ = పిచ్చివానివేషముతో, అంభోజసరోవరతీరంబునన్ = తామరలకొలనిదరిని.
- ↑ చెంగలింపన్ = వికసింపఁగా, వాలిక = దీర్ఘములైన, సమ్మదమును = సంతోషమును, ఉబ్బును = పొంగును, ముత్పులకలు = సంతోషముచే నైన రోమాంచములు, కదిమిన = ఆక్రమించిన.
- ↑ తావి = పరిమళము, ఊరక = నిమిత్తములేక.
- ↑ ఉన్మాదముఁ బొంది = పిచ్చిపట్టి, సన్మానము = మన్నన.
- ↑ వ్యాజమునన్ = నెపముచేత, అలంపుచున్ = శ్రమపెట్టుచు.
- ↑ చెంగలింపన్ = అతిశయింపఁగా.
- ↑ ధనదప్రాభవ = కుబేరుని ప్రభుత్వసంపదవంటి ప్రభుత్వసంపద గలవాఁడా, అంతర్వత్నిని = గర్భిణిని.
- ↑ నివ్వెఱఁగంది = మిక్కిలి యాశ్చర్యమును పొంది, గరువంబునన్ = గౌరవముతో.
- ↑ విరిదట్టుగన్ = ఎడఁబాయునట్టుగా, గరిమ = గౌరవముతో.
- ↑ నమ్రమస్తకుండు = మిక్కిలి వంపఁబడినమొగము గలవాఁడు, సాలోక్యంబు = సమానలోకత్వము.
- ↑ ఆమ్నాయ = వేదములను, త్రిత్వము = మూడుగా నగుట, జగత్పూరంబుగాన్ = లోకపావనముగా.
- ↑ యథాయోగ్యంబులుగా = తగినట్టు, అనుష్ఠించుచున్ = నడపుచు.
- ↑ వెల్లివిరిసి = ప్రవహించి, ఆత్మారోపణము చేసి = తనయం దావహింపఁజేసికొని, ధుని = నది, నిశ్శేషముగన్ = మిగులు లేకుండ.
- ↑ ఇచ్ఛన్ = మనసునందు, ఉద్యత్కృపాయతచిత్తంబునన్ = పుట్టుచున్న దయచేత విశాలమయిన మనసుతో.
- ↑ లేఖులన్ = దేవతలను, పెంపుతోన్ = గౌరవముతో.
- ↑ కొంకెన్ = సంకోచించెను.
- ↑ ఉంకువ = ఓలి - కన్యాశుల్కము.
- ↑ నవ్వెడు = పరిహసించునట్టి.
- ↑ వరుణాలయంబునకు = సముద్రమునకు, హరులన్ = గుఱ్ఱములను.
- ↑ ఐహికము = ఇహలోకకర్మము.
- ↑ అపత్యార్థమ్ము = సంతానమునిమిత్తము, చరువు = అగ్నియందు వేల్చుటకుఁ దగినపక్వాన్నము, పాకంబు చేసి = వండి, ఈనున్నయెడన్ = ఇయ్య యత్నించియున్నసమయమునందు.
- ↑ పాత్రములు = తగినవి, సౌమ్యక్షాత్రమంత్రంబులన్ = శాంతతను క్షత్రియులకు ముఖ్యమైన శౌర్యమును కలిగించునట్టి మంత్రములచేత, చరుద్వయంబు = రెండు చరువులు.
- ↑ లాఁతి =అన్యురాలను, కబళంబు = చరు వనుట.
- ↑ అఖిలగుణసమగ్రుఁడు = ఎల్ల మంచిగుణములచేతను పూర్ణుఁడు.
- ↑ ఏపారన్ = అతిశయింప.
- ↑ బేలు పెట్టి = వంచించి, వీడు పడన్ = మాఱుపడ.
- ↑ భయదక్షత్రియకర్మఠుండు = భయంకరమైన క్షత్రియకర్మలను నడపువాఁడు, మహాభాగుఁడు = గొప్పతనమును వహించినవాఁడు, వేదాంతవేది = ఉపనిషదర్థముల నెఱింగినవాఁడు, అవనీదేవాన్వయాచారవర్తి = బ్రాహ్మణవంశస్థులనడవళ్లు గలిగి వర్తించువాఁడు, తెల్లంబు = స్పష్టము.
- ↑ అసహ్యము = సహింపరానిది, వ్రాలి = పడి, భవత్ప్రసాదజనితాత్మజుఁడే = నీయనుగ్రహముఁవలనఁ బట్టిన కొడుకా, అప్రబుద్ధన్ = అజ్ఞానురాలను.
- ↑ ఆపాదింపుదురు = కలుగఁజేయుదురు.
- ↑ కొండొక = కొంత
- ↑ సకల...లోకుఁడు = ఎల్లరాజవంశములను భంగపెట్టుట యనువిద్యతోఁ గూడిన భుజబలముచేత ప్రసిద్ధినొందిన సకలలోకములు గలవాడు, మహీ...శౌర్యుండు = భూభారమును అణఁచునట్టి మహిమ యనెడు కళ ననుసరించిన పనులను నడపునట్టి విష్ణ్వంశమైనపుట్టుకయు వ్యాపారమును శూరత్వమును గలవాఁడు, శంభుకుమారప్రతిమానుఁడు = శివుని కుమారస్వామిని పోలినవాడు.
- ↑ చాతుర్వర్ణ్యసంప్రవర్తకుండు = బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రు లనెడు నాలుగువర్ణములవారి నడవళ్లను ప్రవర్తింపఁజేయువాఁడు.
- ↑ శాత్రవమండలేశ్వరులన్ = శత్రురాజులను, త్రిదశేంద్రున్ = ఇంద్రుని.
- ↑ గెంటి = తొలఁగి, భూపకోటి = రాజసమూహము.
- ↑ సంగ్రామకేళీ = యుద్ధక్రీడయందు, నాళీకాసనున్ = బ్రహ్మను, సమ్యగ్బుద్ధితో = మంచిబుద్ధితో.
- ↑ వంక = తట్టు.
- ↑ దైత్యుల బలికినట్ల = రాక్షసులతో చెప్పినట్టె.
- ↑ నిలింపులు = దేవతలు, కార్యదాహంబునం జేసి = (పొసఁగిన) కార్యమువలని సంతాపముచేత.
- ↑ జడియక = తప్పక యనుట.
- ↑ క్రిందుపడి = అణఁగి, సంభావన = మన్నన, దైన్యవ్యక్తులు = దీనత్వముతోడిమాటలు, పచరింపన్ = ప్రకటింప, కాదు =తగదు, కృపాసందీప్తచేతస్కుఁడు = దయను ప్రకాశపఱుచునట్టి చిత్తవృత్తి గలవాఁడు.
- ↑ కుటిలవిచార = కపటమైన యాలోచనచేత, పితృధనము = తండ్రి సొత్తు, స్వారాజ్యపదము = స్వర్గరాజ్యస్థానమును - స్వర్గలోకపుదొరతనమును, వీటిపైన్ = పట్టణముమీఁదికి.
- ↑ ఎందేనిన్ = ఎక్కడనో, మానిపోయేన్ = అణఁగిపోయెను.
- ↑ మంతనమునన్ = ఏకాంతమునందు.
- ↑ పురోడాశంబునకున్ = హవ్యమునకు.
- ↑ వగచి = విచారపడి, అభిచారహోమమున్ = పరహింసాకరమైన హోమమును.
- ↑ చెల్లుటకు = జరగుటకు, నెక్కొని = పూని, తమ్ముఁదామె = తమకుఁదామె.
- ↑ రిపులవలనన్ = శత్రువులవలన, ఆప్యాయితయజ్ఞభాగుండు = యజ్ఞభాగములచేత తనువునొందింపఁబడినవాడు - యజ్ఞభాగములచేఁ దనిసినవాఁడనుట.
- ↑ జరుఁడు = ముసలివాఁడు.
- ↑ జరాభార = ముదిమియొక్క యతిశయముచేత.
- ↑ కోఁజాలము = తీసికోలేము, కినిసి = కోపించి.
- ↑ యథాకాలోపన్నంబులు = తగినకాలములయందు పొందఁబడినవి, సమ్యుత్ప్రకారంబున = క్రమమైనరీతితో.
- ↑ పొలిసిపోవు = నశింపవు, విపులతరము = మిక్కిలి యధికము.
- ↑ తృష్ణలచేన్ = ఆశలచే, తగిలి = ఆసక్తులై.
- ↑ ప్రమద మారఁగ = సంతోష మతిశయించంగా, అనుమానము = ఊహ - అది గావలె ఇది గావలె నని యూహించుట యనుట.
- ↑ నారాయణుఁడఁట యదుకులసంభవుఁ డయ్యె = నారాయణుండు యదుకులసంభవుఁ డయ్యెనఁట యని యన్వయము.
- ↑ వర్ణిష్టుండు = వర్ధిల్లుస్వభావము గలవాఁడు.
- ↑ అభియాతులచేన్ = శత్రువులచేత, అపరాజితత్వమున్ = ఓటమిలేని తనమును, ఎలర్పన్ = చిగుర్ప - పెరుగ.
- ↑ సప్తాశ్వసదృశతేజోదీప్తుండు = సూర్యునితేజస్సును బోలిన తేజస్సుచేత ప్రకాశించువాఁడు, దీనావనుఁడు = దరిద్రులను రక్షించువాఁడు, జగతీతలమున్ = భూప్రదేశమును.
- ↑ భవ్యగతిన్ = (లోకమునకు) మేలు గలుగునట్టిరీతితో, అవ్యాహతవిభవయుక్తుఁడు = కొట్టుపడనియైశ్వర్యముతో కూడుకొన్నవాఁడు, అనష్టద్రవ్యులఁగాన్ = చెడనిధనము గలవారినిఁగా - ధనసమృద్ధి గలవారు అగునట్టుగా.
- ↑ ఊర్జిత = నానాట పెరిగి స్థిరపడిన, తన్పి = తృప్తి నొందించి, ఎలర్చెన్ = వికాసమును వహించెను.
- ↑ నెమ్మిన్ = నెమ్మదితో.
- ↑ అఖిలామరవిద్రావణుఁడు = ఎల్లదేవతలను తఱుముఁగొట్టినవాఁడు.
- ↑ తొట్టు = ఉబుకు.
- ↑ వఱద = ప్రవాహము, త్రిదశాంతకుఁడు = దేవతలపాలిటి యముఁడైన రావణుఁడు.
- ↑ ఉద్ధతుఁడు = నిక్కు గలవాఁడు, శతమఖవిరోధిన్ = ఇంద్రునికి పగవాఁడైన రావణుని, భీషణవృత్తిన్ = భయంకరమైనవ్యాపారముతో.
- ↑ బందిగములోనన్ = చెఱసాలయందు, శృంఖల = సంకెల.
- ↑ సంస్ఫీతుండు = విజృంభించినవాఁడు.
- ↑ శాతకుఠారధారావిభిన్నబాహుమస్తకుఁడు = కఱకైనగండ్రగొడ్డటిపాదరచేత నఱకఁబడిన భుజములును తలయుఁ గలవాఁడు, కాంచె = పొందెను.
- ↑ పంకజహితవిభుఁడు = సూర్యునిం బోలినవాఁడు, నిరాతంకయశుఁడు = కళంకములేని కీర్తి గలవాఁడు, లోకవశంకరుఁడు = లోకమునంత వశవఱుచుకొన్నవాఁడు.
- ↑ ఒలసిన = పొందిన.
- ↑ ఆతత = అధికతరమైన, సాధుజనైకవిందుఁడు = సాధువులైన జనులచేతనే తెలియఁబడువాఁడు.
- ↑ భూపకులావతంసునకు = రాజవంశశ్రేష్ఠునకు.
- ↑ స్వామి = ఒడయఁడు.
- ↑ మేలంబునన్ = సరసత్వముతో.
- ↑ వైరిపతులు = శత్రురాజులు, చూఱలాడఁగాన్ = కొల్లపెట్టఁగా.
- ↑ దారుణ = క్రూరులైన, శాతనిశిఖాఘాతంబులన్ = తీక్ష్ణములైన బాణముల వ్రేటులచేత, సంక్షోభించి = కలఁతపడి, నానాదిశాంతనితాంతక్షితిభృద్గుహావళులలోనన్ = నలుదిక్కుల కడలయందలి విశాలములైన కొండగుహలపఙ్క్తులయందు, అత్యుద్గతిన్ = అతివేగముగలగమనముతో.
- ↑ అరాతిచక్రంబు = పగవారిగుంపు, కోశాది = బొక్కసము మొదలగు, పలాయితులైనన్ = పాఱిపోఁగా.
- ↑ ప్రపూరిత = మిక్కిలి నిండింపఁబడిన, గండస్థలన్యస్తహస్తను = చెక్కిళ్లయం దుంచఁబడినచేతులు గలదానిని, బాష్పాంబునిమజ్జమాన = కన్నీళ్లచేత తడియుచున్న, అంచత్ప్రాయన్ = మనోజ్ఞమైన యావనము గలదానిని, అత్తోపకంఠన్ = పొందఁబడిన సమీపము గలదానిని, (లేక) అంచత్ప్రాయనాత్తోపకంఠన్ = మనోఙ్ఞయౌవనముచేత పొందింపఁబడిన సమీపము గలదానిని, సంత్రాసవిలోలలోచననిరూఢన్ = భయముచేత చలించుచున్నచూపులను వహించినదానిని, ప్రస్తధమ్మిల్లబంధన్ = వీడినకొప్పు గలదానిని, అత్యంతభయాపనేయజనశూన్యన్ = మిక్కుటమైనభయమును పోఁగొట్టునట్టి జనులు లేనిదానిని.
- ↑ పేరుకొని = పేరు గ్రుచ్చి - తలఁచుకొని యనుట, పరిదేవనంబు = విలాసంబును.
- ↑ కలుషతామ్రలోచన = కోపముచేత ఎఱ్ఱవాఱినకన్నులు గలది.
- ↑ వంధ్యను = గొడ్డురాలను, తెరలంబడి = తేఱుకొని.
- ↑ నేరమిమొఱఁగులు = నేర్పుచాలని వంచనమాటలు.
- ↑ ధరహానముతోన్ = చిఱునవ్వుతో.
- ↑ స్వర్భానుఁడు = రాహువు.
- ↑ నిరంతుఁడు = అంతము లేనివాఁడు.
- ↑ వార్ధిపరీత = సముద్రముచే ఆవరింపఁబడిన.
- ↑ వనజాతప్రభవాండపూరితమహాధ్వాంతప్రణాళప్రభాఘనసాహస్రగున్ = బ్రహ్మాండమునందు నిండిన దట్టమైనదీఁకటిని చెఱుచునట్టి వెలుఁగుచేత ఘనమైన వేయికిరణములు గలవానిని, పరమున్ = సర్వోత్కృష్షు డైనవానిని, పరాపరకళాలక్షీకృతున్ = పరావరవిద్యలచేత సాక్షాత్కరింపఁబడినవానిని, చిత్రభానునిన్ = సూర్యుని.
- ↑ నీరజాప్తుండు = సూర్యుఁడు, దుర్నిరీక్ష్యప్రభలచేతన్ = చూడశక్యముగాని కాంతులచేత.
- ↑ ఉగ్రాగ్నిపిండోపమంబు = తీక్ష్ణమైన నిప్పుముద్దవంటిది.
- ↑ గ్రైవేయకము = కంఠభూషణము, కంఠలగ్నము = మెడను పొందినది యగునట్టుగా.
- ↑ ఈసత్పింగళనేత్రునిన్ = కొంచెము పసుపువన్నె గల కన్నులుగలవానిని, అత్యంతవామనీకృతసమ్యగ్గాత్రునిక్ = మిక్కిలి పొట్టిగా చేయఁబడిన మంచిదేహము గలవానిని.
- ↑ అశేషదిశాసముద్భాసమానుండు = ఎల్లదిక్కులయందు చక్కగా ప్రకాశింపుచున్నవాఁడు.
- ↑ భవసంహారునిన్ = పుట్టుకలను మాన్చువానిని, మహీభారావతారక్రియాప్రవణవ్యాజనునుష్యరూపునిన్ = భూభారమును దించుటయనెడుపనియందలి యాసక్తతయనెడు నెపముచేత నైన మనుష్యరూపము గలవానిని, అదభ్రప్రాభవోద్ధామవైభవతేజోవిభవప్రతాపున్ = అల్పము కానిమహిమయు, అధికమైన యైశ్వర్యమును, తేజోవైభవమును, పరాక్రమమును గలవానిని.
- ↑ దివంబునన్ = ఆకాశమునందు.
- ↑ త్రికాలవేది = భూతభవిద్యద్వర్తమానము లనెడు మూడుకాలముల నెఱిఁగినవాఁడు.
- ↑ ఆశ్వాసించి = సమాధానపరిచి.
- ↑ దీనార్థిజనావనుఁడు = దరిద్రులను యాచకులను రక్షించువాఁడు.
- ↑ ఉపవర్గ...దోషంబులన్ = మారీఉపద్రవము మొదలగు ఉత్పాతములు మితిమీఱిన వానలు వానలేమి పెనుగాలి వీచుట బహువిధములైన సర్పములవలనిభయము కఱవు నీళ్లు నిప్పు దుర్జనులు శత్రువులు వీరివలని కలఁతపాటు మొదలుగాఁగలలోపములు, అపనీతంబు = తొలఁగింపఁబడినది.
- ↑ నిశాంతంబునన్ =ఇంట, బలవంతంబు = నిర్బంధముఁ, కొంకి = సంకోచించి.
- ↑ త్రోచినన్ = విడనాడినను.
- ↑ తలంకి = వెఱచి.
- ↑ ఒక్కఁడు = ఒక్కఁడే, వేఁటమైన్ =వేటాఁడుటకొఱకై.
- ↑ ఋక్షపతి = ఎలుఁగులరాజు.
- ↑ సామవాదములన్ = మంచిమాటలతో, ఒరసినన్ = కలిగినను.
- ↑ కెడసిన = చచ్చిన, భల్లూకనిహతపంచాస్యకళేబరము = ఎలుగుగొడ్డుచేత చంపఁబడిన సింహముయొక్క దేహమును, గహ్వరమున్ = గుహను, తోరము = అధికము.
- ↑ అక్కునన్ = ఱొమ్మునందు, ఉపలాలింపఁగన్ = బుజ్జగింపఁగా.
- ↑ అంచితప్రభావిభాసితము = ఒప్పిదమైన కాంతిచేత ప్రశాశించునది. నూత్నభానురుచిన్ = బాలసూర్యునివెలుఁగునకు, మాఱుమలయుచున్ = ప్రతిఘటించుచు.
- ↑ దుర్వారగతిన్ = అడ్డములేనివిధమున, మహారభసముతోడన్ = మిక్కిలితత్తఱపాటుతో, ఆక్రోశించెన్ = ప్రలాపించెను.
- ↑ గరువంబునన్ = గౌరవముతో, ఈల్గెనొకాకని = చచ్చెనేమో యని, కొనకొని = సాంతముగా.
- ↑ ఆప్యాయితశరీరుఁడు = బడలిక తీఱిన దేహము కలవాఁడు, అని యొనర్చె= యద్ధము చేసెను.
- ↑ మల్లు పెనంగునంతన్ = మల్లయుద్ధము చేయునపుడు, ముష్టిహతాంగుఁడు = పిడికిటిపోటులచేత కొట్టువడిన యెల్లయవయవములు గలవాఁడు, తల్లడపాటు = విచారము, బీరమున్ = శూరత్వమును, కట్టిపెట్టి = మాని, భల్లవిభుండు = భల్లూకరాజు, ప్రణమిల్లి = నమస్కరించి.
- ↑ ఉద్ఘాటించి = చంపి, బెండగున్ = నిస్సారములగును.
- ↑ నివ్వటిల్లఁగన్ = అంకురింపగా.
- ↑ అనయము = మిక్కిలి, ఓలలార్చి = తేల్చి, చటులాహవఖేదములు = ఘోరయుద్ధమువలని బడలికలు, పుచ్చివైచినన్ = పోఁగొట్టఁగా.
- ↑ ఒడికంబుగన్ = ఒప్పిదముగా, ఉపదానము = అరణము, దానవసూదనుండు = రాక్షసులను చంపువాఁ డైన శ్రీకృష్ణుఁడు, లోకవిదితంబుగన్ = ఎల్లజనులకుఁ దెలియునట్లు.
- ↑ లోకత్రాసంబు = లోకమునకు భయంకరము.
- ↑ గోపికా...వక్షునకున్ = గొల్లపడుచులయొక్క స్తనములనెడు బంగారుకలశములయందు పూయఁబడినకస్తూరిగందముచేత మనోజ్ఞమై విశాలమైనఱొమ్ముగలవానిని.
- ↑ ధౌర్త్యంబు = ధూర్తత్వము - ఆకతాయతనము.
- ↑ సిగ్గుపఱచి = అవమానపఱిచి.
- ↑ వేచి = కనిపెట్టి.
- ↑ క్షాత్రంబునన్ = చలముతో.
- ↑ మతము = అభిప్రాయము - వృత్తాంతమనుట.
- ↑ తెగి = సాహసించి, మొఱకు = మూర్ఖుఁడైన.
- ↑ గెంటంజేసెన్ = పోఁగొట్టెను.
- ↑ సీరిన్ = బలరాముని.
- ↑ కెడపకుండినన్ = చంపకున్న.
- ↑ విహ్వలించి = చిత్తస్వాస్థ్యము తప్పి.
- ↑ ఉద్యోగము - ప్రయత్నము, ఆహవమునకున్ = యుద్ధమునకు.
- ↑ వెడఁగుందనము = పిచ్చితనము.
- ↑ దుర్విచారము = చెడ్డయాలోచన.
- ↑ బిట్టు = మిక్కిలి.
- ↑ నిశాచరా...చక్రపాణి = రాక్షసరాజులయొక్క యంతఃపురస్త్రీల విధవత్వమునకు కారణమైన ఋజువైనపరాక్రమమును జూపుటకు చక్రమును చేతఁబట్టినవాఁడు, పాపప్రహారప్రకంపితజగత్ప్ర యప్రాణి = పాపమును (తొలఁగ) కొట్టుటచేత వణఁకఁజేయఁబడిన మూడులోకములలోని ప్రాణులును గలవాఁడు, ఫాలపట్టికాసంఘటిత = పట్టెలవంటి నొసళ్లయందుఁ జేర్పఁబడిన, విందుఁడు = తెలిసికొనువారుగాఁ గలవాఁడు.
- ↑ దాఁపుము = దాఁచిపెట్టుము.
- ↑ బాస = ప్రమాణము.
- ↑ గోడిగన్ = ఆడుగుఱ్ఱమును.
- ↑ ఉద్ధురగతిన్ = మిక్కిలివడిగలనడకతో, దగతోన్ = దప్పితో, ఉపకంఠ = సమీపమునందలి.
- ↑ రంహన్స్ఫూర్తిన్ = వేగముయొక్క స్ఫురణతో, క్రోశము = ఒకకోసెఁడుదూరము.
- ↑ బలవద్రిపుమండల = బలవంతులైన శత్రుసమూహములయొక్క, దారుణశాతచక్రమునన్ = భయంకరమై కఱకైన చక్రముచేత, మస్తకముచీర = తలగుడ్డ, పటంబులు = పైబట్టలు, పొడగానఁడ = చూచినవాడు కానేకాకపోయెను - కనఁబడకపోయె ననుట.
- ↑ మొఱంగి = వంచించి, ఈజాలండో = ఇయ్యఁడో యేమో.
- ↑ అటమటించుకొంటివి = అపహరించుకొంటివి, పొత్తు = స్నేహము, పొరపొచ్చెము = మిక్కిలి తక్కువైనది.
- ↑ శంక = సందేహము.
- ↑ హాలామదోద్వేగలోచనఘూర్ణీకృతుండై = మద్యపానమువలని మత్తుచేత నైన కన్నులయొక్క త్రిప్పుట గలవాఁడై.
- ↑ మావంతునిచేతన్ = మావటివానిచేత, భద్రదంతావళంబు = భద్రజాతియేనుఁగు.
- ↑ రేయిపగలు = రాత్రియుఁ బగలును.
- ↑ వారక = తప్పక.
- ↑ సవనదీక్షాకవచంబువలన = యజ్ఞదీక్షయనెడు కవచమువల్ల, మారికోపవర్గాధిదోషంబు = మారీ ఉపద్రవము మొదలైనకీడులు.
- ↑ రాచపాడి = రాజనీతి, ఆగడముగన్ = దుష్టప్రవర్తనముచేత.
- ↑ ఒప్పములు = ఆపదలు.
- ↑ దుర్భిక్షము = కఱవు, ధారణ = క్రయనిర్ణయము, గోడుకొనియెన్ = దుఃఖపెట్టెను, త్రెక్కోలు గొనియెన్ = హింసింప నారంభించెను, సంక్రమించెన్ = ఆక్రమించెను.
- ↑ ప్రతికారము = ప్రతిక్రియ.
- ↑ కల్మషంబులు = కీడులను, ఆపన్నప్రసవ = కనప్రొద్దు లైనది.
- ↑ చుట్టలన్ = చుట్టములను.
- ↑ కొల్చు = ధాన్యము, విరిసెన్ = తొలఁగెను.
- ↑ త్రవ్వితండములు = అపరిమితములు.
- ↑ పోనాడి = పరిహరించి.
- ↑ సముజ్జ్వలా...మానము = మిక్కిలి వెలుగునట్టియెఱ్ఱనికాంతులయొక్క యతిశయముచేత ప్రకాశమానమైన యుదయకాలమునందలి సూర్యబింబముతో పోల్పఁదగినది, దుర్నిరీక్ష్యము = చూడనలవి గానిది, సభా...యోగ్యము = సభయందలి జనులవలన ప్రశంసింపఁబడునట్టి మేలు మేలు అను వాక్కులకుఁ
దగినది. - ↑ జాజ్వల్యమానము = దేదీప్యమానము.
- ↑ నెఱసిరి = పూర్ణ మైనసంపద.
- ↑ గొడవలు = అపరాధములు.
- ↑ తొలంకు = పొంగు.
- ↑ సంగతి = యుక్తము.
- ↑ నెయ్యం బొరఁగాన్ = స్నేహ మతిశయింపఁగా, గ్రైవేయకంబునకున్ = కంఠహారమునకు.
- ↑ మిథ్యాభిశప్తి = అసత్యాపవాదరూపమైన.
- ↑ ఆనకదుందుభిప్రవాద్యావళిన్ =తప్పెట భేరీ మొదలుగాఁగల వాద్యసమూహమును.
- ↑ భగినులు = తోడఁబుట్టిన ఆఁడువారు.
- ↑ పౌరవకులాగ్రణి = పూరువంశశ్రేష్ఠుఁడు, ధర్మానిలవాసవాంశభవులు = యముఁడు వాయువు దేవేంద్రుఁడు వీరియంశములయందు జనించినవారు, ఆనతనైరి = వంపఁబడినశత్రువులుగలవానిని - ఎల్లశత్రువులను లోఁబఱచుకొన్నవానిని.
- ↑ పిన్ననాటఁగోలెన్ = బాల్యమునుండియు, కొనలు సాగన్ = వర్ధిల్లఁగా.
- ↑ ముముక్షు = మోక్షాపేక్షగల.
- ↑ రాజసోద్వృత్తుఁడు = రజోగుణనంబంధమైన నిక్కు గలవాడు, సర్వకంటకము = ఎల్లవారికి బాధకము, రాజసప్రకృతి = రజోగుణయుక్తమైన స్వభావము, సక్తచిత్తుఁడు = ఆసక్తితోడి మనసుగలవాఁడు, శాశ్వత...దాయి = శాశ్వతమైన మోక్షఫలము నిద్చునట్టివాఁడు.
- ↑ అవ్యాహతప్రౌఢిన్ = కొట్టుపడనిసామర్థ్యముతో, వైరానుబంధంబు = విరోధముయొక్క సంబంధము, సంధిలంగన్ = అనుసరింపగా.
- ↑ కటకకంకణమణిముద్రికా = అందెలు కడియములు రత్నములు చెక్కినయుంగరములు, అభిరామము = ఒప్పిదమైనది.
- ↑ పర్యటన =తిరుగుట, తదాసక్త = ఆకృష్ణునియందంటిన.
- ↑ ఖద్యోతబింబము = సూర్యబింబము, శక్రచాపము = ఇంద్రధనుస్సు, జలధరము = మేఘము, గుణనాదము = అల్లెత్రాటిమ్రోఁత, పొలుచు = కంటికి తోఁచునట్టి, నీరదవిధంబులు = మేఘములయొక్క రీతులు, అపరసంధ్యారుణంబు = సాయంసంధ్యయందు ఎఱ్ఱగాఁ దోచునట్టి, ఆకసంపుఁగనకవస్త్రంబు = ఆకాశమనెడు బంగారుపచ్చడమును, విష్ణుదిగాన్ = విష్ణునిదిగా, సంతతంబును = ఎల్లప్పుడు.
- ↑ లయంబు = అభేదమై కలసినది, సంగరోద్వృత్తుండు = యుద్ధోత్సాహము గలవాఁడు, భగవద్ధస్తనిర్ముక్తచక్రధారావిదారికమస్తకుండు = భగవంతుఁడైన శ్రీకృష్ణునిచేతినుండి విడువఁబడినచక్రధారలచేత భేదింపఁబడినతల గలవాఁడు, కలుషంబులన్ = పాపములను, సాయుజ్యమున్ = మోక్షమును.
- ↑ అచ్చపుభక్తితోన్ = స్వచ్ఛమైన భక్తితో, ప్రపన్నులకున్ = శరణాగతులకు, అరిదిపని = దుర్లభమైనపని.
- ↑ రమణన్ = ఒప్పిదముగా, సంకర్షణుండు = ఎల్లలోకములను లయకాలమునందు చక్కఁగ నాకర్షించువాఁడు.
- ↑ సంకర్షణభావము = లెస్సగా ఆకర్షించునట్టి భావమును, సకలజగన్మహాతరుమూలభూతుఁడు = ఎల్లలోకము లనెడు గొప్పవృక్షమునకు వేరైనవాఁడు - లోకములకెల్ల ముఖ్యకారణమైనవాఁ డనుట, అతీతానాగతవర్తమానకాలసమేతుండు = కడచినదియు రాఁగలదియు జరుగునదియు నైనకాలములతోఁ గూడుకొన్నవాఁడు - కాలత్రయమునందు నుండువాఁడనుట, మనుష్యకర్మసమాచరణుండు = మనుష్యులు చేయుపనులను నడపువాఁడు.
- ↑ నియోగంబునన్ = ఆజ్ఞచేత.
- ↑ సంగరభూమి = యుద్ధభూమి.
- ↑ దేవరన్యాయంబునన్ = (దేవరేణసుతోత్పత్తి) అనెడు న్యాయముచేత - మఱఁదివరుసచేత,
సాంప్రతంబునన్ = ఆకాలమందు. - ↑ వివేకము = యక్తాయుక్తపరిజ్ఞానము, పరిజ్ఞానము = ఎల్లవిషయములందును సామాన్యమైన తెలివి.
- ↑ ధౌర్త్యము = ధూర్తత్వము, చౌర్యము = దొంగతనము, హీనభావము = హీనత్వము, పాడి = న్యాయము.
- ↑ మెలఁకువలు = జాగరూకతలు, రిత్త = వట్టిది - శూన్యము, బ్రతుకులు = బ్రతుకుఁదెరువులు, తఱచు = బహువిధము.
- ↑ పడఁబొడుచుట= పడఁగొట్టుట - చంపుట, హత్యలు = చంపుటలు, నైజములై = స్వభావసిద్ధములై.
- ↑ ఆల్పాల్పసారులు = మిక్కిలి యల్పమైనబలముగలవారు, మృతప్రాయమూర్తులు = కొంచెము తక్కువగా చచ్చిన యాకృతిగలవారు, పాషండవర్తనులు = వేదవిరుద్ధములైన నడవళ్లు గలవారు, ధీవరాదులన్ = చేఁపలఁ బట్టి జీవించునట్టి బెస్తలు మొదలగువారిని, అనదవృత్తిన్ = అనాథవర్తనతో.
- ↑ భీషణ = దారుణములైన, విప్లవంబులు = చెడినవి.
- ↑ ప్రతిష్టించి = స్థాపించి.
- ↑ తీఱి = కడచి.
- ↑ నలినాప్తసోమవంశజులు = సూర్యచంద్రవంశములయందు జనించినవారు.
- ↑ వంశానుచరితంబులు = వంశములను అనుసరించిన చరిత్రములను,
పరిపాటిన్ = క్రమముగా. - ↑ విశ్వంభరామండలంబునన్ = భూమండలమునందు.
- ↑ ధీరతాహాటకశైల = ధైర్యముచేత మేరుపర్వతమైన వాఁడా, నిత్యవినయప్రతిభావిభవాఢ్య= స్థిరమైనవినయముతోడి ప్రతిభ కలిమి గలవాఁడా (ప్రతిభ = సమయోచితస్ఫురణగల బుద్ధి), భూమిభృత్కూటగుహావహిత్థనృపకుంజర = కొండకొమ్ములయందును గుహలయందును దాఁగిన రాజశ్రేష్ఠులు గలవాఁడా.
- ↑ శత్రురాజన్యరమారాజీవకుముదబాంధవ = పగవారైన రాజులయొక్క సంపదలనెడు కమలములకు చంద్రుఁడైనవాఁడా, రాజీవహితప్రతాప = సూర్యునిప్రతాపమువంటి ప్రతాపము గలవాఁడా.
- ↑ బాహులేయసంగరోత్సాహ = కుమారస్వామిదయిన యుద్ధోత్సాహమువంటి యుద్ధోత్సాహము గలవాఁడా, సాహసాభినేయసాహసాంక = సాహనముచేత అభినయింపఁదగిన విక్రమార్కుఁడుగలవాఁడా - సాహసాంకుఁ డనుబిరుదు వహించి విక్రమార్కునికంటె సాహసముగలవాఁడా యనుట, నవ్యకీర్తిచంద్రికారోహిణీహృదీశ = అపూర్వమైనకీర్తి యనెడు వెన్నెల చేత చంద్రుఁడైనవాఁడా, దానరోహణావనీధరా = దానమునందు రత్నపర్వతమైనవాఁడా.