ఆంధ్ర శ్రీవిష్ణుపురాణము/ద్వితీయాశ్వాసము
శ్రీరస్తు
శ్రీవిష్ణుపురాణము
ద్వితీయాశ్వాసము
| 1 |
వ. | సకలపురాణవిద్యాధురంధరుం డైనపరాశరుండు మైత్రేయున కిట్లనియె. | 2 |
తే. | ఆదిమనువైనయట్టిస్వాయంభువునకుఁ, దనయులైరి ప్రియవ్రతోత్తానపాదు | 3 |
వ. | మైత్రేయుుఁ డతని నవలోకించి మహాత్మా ధ్రువుండు పరమభాగవతుండని పెద్ద | 4 |
ధ్రువునిచరిత్రము
మ. | ఘనుఁ డుత్తానపదుండు భూవలయ మేకచ్ఛత్రమై యొప్పఁగా | 5 |
క. | సురుచియు సునీతియును నన, నిరువురుభార్యల వరించి యెంతయు నొప్పెన్ | 6 |
వ. | అందు సురుచికి నుత్తముఁడును సునీతికి ధ్రువుండునుం బుట్టి సమానరూపరే | 7 |
క. | ఉత్తానపదుఁడు గొలువున, నుత్తమునిం దొడలమీఁద నునిచి ముదముతో | 8 |
ఆ. | జనకుతొడలమీఁద సంతోషముననున్న, సవతితల్లికొడుకు సంభ్రమంబు | 9 |
తే. | రాజసింహాసనం బెక్కి రాఁ గడంగి, నిక్కి చేఁ జాఁప సురుచి సునీతితోడి | 10 |
క. | ఈసకలరాజ్యభోగ, శ్రీసంపదచేత నుల్లసిల్లి ఘనుండై | 11 |
ఉ. | ఎల్లవిధంబుల వినుతికెక్కినయీనృపుకూర్మిపత్ని నై | 12 |
తే. | నాథుమన్నన వడసిన నాకుఁ దన్ను, నాదుఁ జెల్లినఁ జెల్లెఁగా కంతరాంత | 13 |
క. | ఉత్తానపాదుఁ డెక్కిన, యుత్తమసింహాసనమున నుండఁదగినవాఁ | 14 |
క. | అని బెట్టిదంబు లాడుచు, జనపతి జూడంగ సురుచి సవతికొడుకుఁ జ | 15 |
చ. | కనుఁగవ నశ్రుపూరములు గ్రమ్మఁగ వీడినకాకపక్షమున్ | 16 |
తే. | కొడుకుకన్నులబాష్పముల్ దుడిచి తల్లి, శిరసు మూర్కొని కౌఁగిటఁ జేర్చి యేడు | 17 |
ఆ. | అన్న సురుచి చెప్పినన్నియు నిక్కంబు, లవనివిభుఁడు దానియందుఁ బ్రియము | |
| గలఁడు తత్తనూజు గారవింపక యేల, మాను నంతచనువు మాకుఁ గలదె.[10] | 18 |
తే. | సురుచి సౌభాగ్యవతి గాన సుతుఁడుఁ దాను, మునుజనాథునివలన మన్ననలు గనిరి | 19 |
చ. | పుడమి సమస్తమున్ సురుచిపుత్రకుఁ డేలుచు రాజుమన్ననల్ | 20 |
వ. | అని యెలుంగెత్తి యేడ్చిన తల్లి నూరార్చి ధ్రువుం డిట్లనియె. | 21 |
ఉ. | ఏమిటి కింతదుఃఖమున నేడ్చెద వుత్తమలీల నుత్తముం | 22 |
ఉ. | తండ్రి ప్రియవ్రతానుజునిదత్తము లైనసమస్తధారుణీ | 23 |
ఆ. | ఏను దపము సేయ నేగేద నెమ్మది, నుండు మనుచుఁ దల్లి నూఱడించి | 24 |
వ. | ఇట్లు పురంబు నిర్గమించునప్పుడు తదీయసమీపోద్యానవనమధ్యంబునఁ గృష్ణా | 25 |
ఆ. | ఎందునుండి వచ్చి తెవ్వరివాఁడవు, తెలియఁ జెప్పు నామధేయ మేమి | 26 |
తే. | ఏను ధ్రువుఁ డనువాఁడ నుత్తానపాదు, నాత్మజుండఁ దపంబు సేయంగఁ గోరి | 27 |
క. | మునులందఱు నాశ్చర్యం, బున నాతనిఁ జూచి రాజ్యభోగ్యములుం గై | 28 |
తే. | నాలుగైదువత్సరముల బాలకుఁడవు, మోహనం బైనసుకుమారమూర్తి వీవు | 29 |
క. | నీ వెక్కడఁ దప మెక్కడ, భావిశుభ శ్రీదమైనఫల మెక్కడ నీ | 30 |
చ. | అనిన ధ్రువుండు వారలకు నంజలి చేసి వివేకబుద్ధితో | 31 |
క. | ఏనింక నట్టిచోటికిఁ, బోనొల్లను మీప్రసాదమునఁ బుణ్యతప | 32 |
తే. | అతనిదృఢనిశ్చయంబును నతనిసద్వి, వేకబుద్ధియు నతనియస్తోకమహిమ | 33 |
చ. | అనిమొన ముట్టి శాత్రవచయంబులు దారుణదివ్యబాణముల్ | 34 |
వ. | అని పలికి యతని నవలోకించి. | 35 |
ఉ. | నీమది నిట్టిపాటిదృఢనిశ్చయ మొందెనెయేని భక్తితోఁ | 36 |
వ. | తొల్లి మీవంశకర్త లైనస్వాయంభువుండును బ్రియవ్రతోత్తానపాదులును | |
| నవ్వాసుదేవునకుం దపంబుఁ జేసి కాదె కృతార్థులై మహనీయమహిమం బడసిరి. | 37 |
సీ. | ఆదికాలంబున యమునాతటంబున మధుఁ డనుదానవుం డధికతపముఁ | |
తే. | ననఁగ లోకప్రసిద్ధిగా నలవరించె, సార్వకాలంబు పద్మలోచనుఁడు సకల | 38 |
ఆ. | ఆకుమారచంద్రుఁ డచ్చోటు దనకుఁ ద, పంబు సేయఁదగినపట్టు గాఁగ | 39 |
క. | ఔత్తానపాది మునినా, థోత్తము లెఱిఁగించినట్టియుపదేశవిధిన్ | 40 |
తే. | షోడశాబ్దవయోమూర్తి సుందరాంగు, శంఖచక్రగదాఖడ్గశార్ఙ్గహస్తుఁ | 41 |
క. | బాలకుఁడు బ్రహ్మవిద్యా, శీలుండై చిత్సుధాభిషేచనమతితో | 42 |
చ. | ముదమున సర్వలోకములు మోచి వెలింగెడి వాసుదేవునిన్ | |
| హృదయములోన నిల్పి తప మిమ్ములఁ జేయుచు నున్నరాసుతున్ | 43 |
తే. | ఒక్కపాదంబు ధర మోపి యూర్ధ్వబాహుఁ, డగుచు నుగ్రతపంబు సేయంగ నతని | 44 |
ఇంద్రుఁడు ధ్రువునితపము విఘ్నము చేయఁబూనుట
వ. | ఇట్లు సకలలోకక్షోభంబుగా నుగ్రతపంబు సేయునతనితపోవహ్ని సకలచరా | 45 |
క. | దేవపతి యాము లనియెడు, దేవతలును దాను వాసుదేవధ్యాన | 46 |
శా. | భూతప్రేతపిశాచరూపములతోఁ బొల్పారు కూశ్మాండక | 47 |
సీ. | చటులదంష్ట్రావిషజ్వాలాకరాళభీకరభుజంగంబులై కఱవవచ్చుఁ | |
తే. | వదనముల మంట లొలుకంగ ముదిసినట్టి, జంబుకంబులు కొఱవిదయ్యంబులట్లు | 48 |
వ. | ఇ ట్లనేకవిధంబులం దపోవిఘ్నంబు సేయునెడ నొక్కనాఁ డొక్కమాయావి | 49 |
ఉ. | అన్న కుమారచంద్ర తగునయ్య నిరంతరదుఃఖవార్ధిలో | 50 |
ఉ. | అందనిపంటి కేమిటికి నఱ్ఱు నిగిడ్చెదు విష్ణుఁ డున్నయా | 51 |
శా. | ఆరం బండినపైరు వోవిడిచి దుర్వ్యాపారచిత్తంబుతో | 52 |
శా. | బాలక్రీడలఁ దల్లిదండ్రుల నదభ్రప్రీతి నొందించి యి | 53 |
ఉ. | దట్టపులజ్జతో సవతితల్లి దురుక్తులు నెమ్మనంబునం | 54 |
శా. | నోముల్ పెక్కులు నోచి యుజ్జ్వలతపోనుష్ఠానకర్మంబు లు | 55 |
మ. | అనుచుం దెంపుతలంపునన్ బలుక మాయామాతదుర్వాక్యముల్ | 56 |
వ. | అట్టిసమయంబున ననేకశస్త్రాస్త్రపాణులును భయంకరసింహనాదులును వికృతవే | 57 |
ఉత్సాహ. | యామగణసమేతుఁడై మహాభయంబుతోడ సు | 58 |
క. | అతనితపోమహత్త్వము, శ్రీతరుణీశ్వరునితోడఁ జెప్పి యుడుపలే | 59 |
మ. | చని వైకుంఠమునందు మందరధరుం జంద్రార్కనేత్రున్ సురా | 60 |
శా. | ఓలోకేశ్వర చిత్తగింపుము ధ్రువుం డుత్తానపాదక్షమా | 61 |
తే. | చెక్కు మీటిన వస గాఱు శిశువుభక్తి, నుగ్రతప మాచరించుచు నున్నయతని | 62 |
చ. | అతులతపంబు పెంపున రమాధిప నీవలనన్ ధ్రువుండు దా | 63 |
వ. | అనిన నందకపాణి వజ్రపాణి కిట్లనియె.[49] | 64 |
ఉ. | ఇంద్రపదంబుఁ గోరఁడు దిగీశులరాజ్యము లాసనేయఁ డా | 65 |
ఉ. | ఆతనికోర్కు లెల్లఁ బ్రియమారఁగ నిచ్చి తపంబు మాన్పెదన్ | 66 |
సీ. | వారివాహముఁ బోలు వక్షస్స్థలంబున నిందిరాశంప పెంపొందుచుండ | |
తే. | నభముతోఁ బ్రతియైన నెన్నడుమునందుఁ, గనకకౌశేయసాంధ్యరాగంబు మెఱయ | 67 |
వ. | ఇట్లు ప్రత్యక్షంబై. | |
స్వాగతావృత్తము. | ఆనరేంద్రతనయాగ్రణియోగ, ధ్యానధారణవిధాననిధానం | 68 |
వ. | అతని నవలోకించి కుమారా నీతపోమహత్వంబునకు మెచ్చితి నీయిచ్చకు వచ్చిన | 69 |
ఆ. | యోగదృష్టిచేత నోరంతప్రొద్దును, భావవీథిఁ గానఁబడినమూర్తి | 70 |
వ. | భయభక్తితాత్పర్యంబులు చిత్తంబునం బెనంగొన సాష్టాంగదండప్రణామంబు | 71 |
తే. | కమలలోచనురూపంబుఁ గన్నులారఁ, జూచి యానందరసకేళిఁ జొక్కి యతఁడు | 72 |
క. | వరమిచ్చెద నని లక్ష్మీ, వర వచ్చితి నాకు నిన్ను వర్ణింప మనో | 73 |
చ. | అనుటయుఁ బద్మనాభుఁడు దయామృతపూరితదివ్యచిత్తుఁ డై | 74 |
ఉ. | అప్పుడు రాజపుత్రుఁడు మహాప్రతిభావిభవాభిరాముఁడై | |
| నప్పరమేశ్వరేశుఁ గొనియాడఁ దొడంగె వికాసభాసియై.[60] | 75 |
ఉ. | శ్రీవనితాకళత్ర సరసీరుహసన్నిభనేత్ర భాగధే | 76 |
ఉ. | కాష్ఠగతాగ్నివోలెఁ ద్రిజగంబులభూతములన్ గుణంబులం | 77 |
చ. | అగణితలీల నొప్పు సచరాచరభూతసమగ్రమైనయీ | 78 |
ఉ. | ఆవులచేతఁ బాలు గొని యందుఁ గ్రమంబున నెయ్యి వుచ్చి య | 79 |
వ. | అని యనేకప్రకారంబుల గొనియాడుచున్న యన్నరేంద్రనందను నవలోకించి | 80 |
క. | సర్వప్రాణులయందును, సర్వాంతర్యామి వైనసర్వేశుఁడవున్ | 81 |
శా. | ఐనం జెప్పెదఁ జిత్తగింపుము మహాత్మా తండ్రి సింహాసనా | 82 |
శా. | ఏ నవ్వాక్యము లాత్మలో నిలిపి లోకేశుండ వైనట్టినీ | 83 |
వ. | అనిన నద్దేవుండు నరదేవనందనునకుఁ గరుణారసకందళితహృదయుండై యి | 84 |
ధ్రువునిపూర్వజన్మవృత్తాంతము
సీ. | భూమీశనందన పూర్వజన్మంబున నీవు బ్రాహ్మణుఁడవై నిఖిలవేద | |
తే. | యఖలసౌభాగ్యనిరతుఁడు నధికరూప, వంతుఁడును నవయౌవనవైభవుండు | 85 |
తే. | ప్రాభవమునఁ గులస్థానపౌరుషములు, నాధిపత్యంబు గలిగినయట్టిరాజ | 86 |
తే. | అదినిమిత్తంబు నీవు జన్మాంతరమున, వచ్చి కులశీలగుణవైభవములు గలిగి | 87 |
ధ్రువుండు విష్ణుదేవునివలన ధ్రువస్థానంబుఁ బడయుట
మత్తకోకిల. | ఓకుమారక శైశవంబున నుల్లసిల్లుచు నుండియున్ | 88 |
క. | త్రిదశగ్రహతారాముని, పదముల కన్నిటికి నుపరిభాగంబునఁ బెం | |
| పొదవుధ్రువస్థానం బు, న్నది యచ్చో టిత్తు నీకు నరవరపుత్రా.[71] | 89 |
క. | అమ్మహనీయపదంబున, సమ్మదమున నీవు మాతృసహితుఁడవై మో | 90 |
క. | అంతంబున మోక్షము న, త్యంతగరిమతోడ నిత్తు ననుచు ధరిత్రీ | 91 |
క. | నరనాథసుతుఁడు దనుజా, మరకిన్నరసిద్ధసాధ్యమహితస్తుతులం | 92 |
వ. | ఇవ్విధంబున సూర్యమండలంబునకుం జని సూర్యునిచేతఁ బూజితుండై చంద్ర | 93 |
క. | చని ధ్రువలోకంబున న, త్యనుపమసౌభాగ్యయుక్తుఁడై లోకంబుల్ | 94 |
క. | మానుగ నీధ్రువచరితము, మానవు లెవ్వారు వినిన మహనీయయశ | 95 |
వ. | అట్టిద్రువుండు శంభు వనుభార్యయందు శిష్టియు భవ్యుండు ననుపుత్రద్వ | |
| ర్వురు పుట్టిరి. అందు నంగునకు మృత్యుపుత్రి యగు సునీథయందు వేనుండు | 96 |
చ. | జననుత వేనుదక్షిణభుజంబు మునుల్ మధియింపఁగాఁ బృథుం | 97 |
చ. | అనవుడు శిష్యుఁ డగ్గురున కంజలి చేసి మహాత్మ యమ్మహా | 98 |
వ. | అనినం బరాశరుం డిట్లనియె. | 99 |
వేనునిచరిత్రము
ఉ. | అంగుఁడు మృత్యుపుత్రి యగునట్టిసునీథను బెండ్లి యాడి య | 100 |
క. | మాతామహదోషంబున, నాతఁడు రాజ్యంబు సేయునప్పుడు పుణ్యో | 101 |
సీ. | ఆదికాలమునాఁటియగ్రహారంబులు బందెలు గల్పించి పాడు సేయు | |
తే. | జారచోరదురాచారసమితిఁ బ్రోచు, ననృతమును నాస్తికతయును బెనుచుచుండు | 102 |
చ. | శ్రుతులు పరిత్యజించి విధిచోదితకర్మము లుజ్జగించి సు | |
| క్షితిపతి చాటఁగాఁ బనిచె సింధుపరీతమహీతలంబునన్.[79] | 103 |
సీ. | తనదుర్గుణంబులఁ గొనియాడ నొల్లనిసాధులోకంబుల సంహరించుఁ | |
తే. | దనకు ననుకూలవృత్తి నుద్దండలీల, నుండుపాపాత్ములకు నెల్ల నూ ళ్లొసంగుఁ | 104 |
క. | ఇల నెవ్వఁడు తనయాజ్ఞకు, వెలియై వర్తించు వేదవిప్రునినైనన్ | 105 |
శా. | వేనుం డీగతిఁ బాపకర్మములు గావింపంగ నాకీడున | 106 |
చ. | మునివరు లెల్ల నానృపతిమూఢవివేకముఁ బాపకర్మవ | 107 |
చ. | అని తలపోసి యాతపసు లంగతనూజునిపాలి కేగి యా | 108 |
తే. | తొంటి నీవంశకర్తల దొరతనములఁ, బ్రబలుసచ్చరితంబులు భావికాల | 109 |
చ. | తపసుల నేల చంపెదవు ధర్మము లేటికి సాగనీవు పా | |
| త్కృపచెడి దుష్టకర్మములఁ గిల్కొనె దేటికి వేద మొల్ల వే | 110 |
తే. | ఆప్రసాదంబు ననృతంబు నాదియైన, రాజదోషంబు లేల తిరస్కరింప | 111 |
చ. | క్రతువులు చేసినన్ సురనికాయము సంతసమందుచుండు దే | 112 |
వ. | అదియునుంగాక యజ్ఞంబులు చేయురాజ్యంబుల యజ్ఞమూర్తి యైననారాయ | 113 |
క. | నాకంటే నధికుఁ డెవ్వఁడు, లోకంబునఁ గలఁడు విష్ణులోకోత్తరుఁ గాఁ | 114 |
తే | బ్రహ్మవిష్ణుమహేశ్వరప్రముఖులైన, దేవతలయంశములచేత దేజరిల్లి | 115 |
తే. | భర్తృశుశ్రూష కాంతకుఁ బరమధర్మ, మయినవిధమున నాయాజ్ఞ నఖిలజనులుఁ | 116 |
మునులు వేనుని శపించుట
తే. | అనిన మునినాథులందఱు నంగసుతునిఁ | 117 |
క. | అప్పుడు మునివరు లందఱు, నప్పాపాత్మకునివలన నవమానితులై | |
| కప్పిన కోపాగ్నిశిఖల్, ముప్పిరిగొనఁ గలుషవాక్యములు దమలోనన్. | 118 |
మ. | మునిలోకస్తుతిపాత్రుఁ డైనకరుణామూర్తిన్ హరిన్ బద్మలో | 119 |
క. | అని నిశ్చయించి దర్భలు, గొని మారణమంత్రములను ఘోరతరముగాఁ | 120 |
క. | దేవబ్రాహ్మణనిందలు, గావించినయతఁడు పాపకర్మపరుండై | 121 |
వ. | ఇట్లు విగతజీవుం డైనవేనునికళేబరంబు తైలపాకంబు చేయించి యవనీరా | 122 |
సీ. | బలిమితో దుర్గాధిపతు లొండొరులతోడఁ బోరాడి తమలోనఁ బొలిసి చనిరి | |
తే. | దండు తఱచున ధారుణీమండలమున, వివిధధనధాన్యసస్యము ల్వీటివోయెఁ | 123 |
వ. | ఇవ్విధంబున నరాజకం బైనకతన రాజవిడ్వరంబున రాజ్యంబునఁ బ్రజానాశం | 124 |
తే. | రాజు లేని రాష్ట్రంబునఁ బ్రజల కెట్లు, నిర్వహింపంగ నగునని నిర్జరులకు | 125 |
తే. | రేణుపటలసంఛన్నగీర్వాణపదవి, లోకనాలోలమానసులును మహాద్భు | |
| తప్రకంపితవర్తనోద్యములు నగుచు, క్షోణిదేవత లాదిక్కు చూచునపుడు.[97] | 126 |
క. | పొరిఁబొరిఁ బోరులవలనన్, ధరణీసురవరులు సంపదలు సకలంబున్ | 127 |
క. | పరిదేవన మొనరించుచు, నరుదేరఁగఁ జూచి మిగుల నాశ్చర్యరసం | 128 |
ఉ. | ఈధరణీతలంబునకు నేలిక యెవ్వఁడు లేఁడు గావునన్ | 129 |
ఉ. | బందులఁ బట్టి చోరకులు బాధ యొనర్పఁగ ధారుణీసురుల్ | 130 |
చ. | అదె ధరణీపరాగము భయంకరమై వినువీథిఁ బర్వుచు | 131 |
ఉ. | ఆవసుధామరుల్ పటురయంబున నచ్చటి కేగి దోఁపులన్ | 132 |
వ. | ఇవ్విధంబున నరాజకం బైనరాజ్యంబు నిర్వహింపం దగినరాజు నభిషిక్తుఁ జేయ | |
| మంత్రంబు లనుష్ఠించుచు వేనునియూరుదేశంబు మథియింపఁ దొడంగి రప్పుడు.[103] | 133 |
ఉ. | కాలినమోటువంటికొఱగానిశరీరము పల్లవెండ్రుకల్ | 134 |
క. | మునులెల్ల వెఱఁగుపడి తనుఁ, గనుఁగొనుచుండంగ వాఁడు గలఁగుచు నే నే | 135 |
వ. | అది నిమిత్తంబుగా వాఁడు నిషాదుం డనునామంబునం బరఁగె నట్టినిషాదుని | 136 |
పృథుచక్రవర్తిచరిత్రము
శా. | అక్షీణప్రకటప్రతాపనిధి బాహాగర్వదుర్వారశ | 137 |
ఆ. | పుష్పవృష్టి గురిసె బోరన దేవదుం, దుభులు మ్రోసె జగము లభినుతించె | 138 |
వ. | ఇవ్విధంబున నుదయించి సంప్రా పయావనుండై వైన్యుండు మహనీయమ | 139 |
తే. | అతులకరవాలమును విల్లు నక్షయోగ్ర, బాణతూణీరయుగము నక్షీణవజ్ర | |
| కవచమును వచ్చె దేవలోకముననుండి, యవి మహాసాధనము లయ్యె నవ్విభునకు.[108] | 140 |
క. | అపరిమితపాపకర్మము, లపగతమై యంగసూనుఁ డగువేనుఁడు ధ | 141 |
క. | ఉదధుల గంగాదిమహా, నదులందును మునులు మణికనకపాత్రములం | 142 |
క. | అట్టియెడ సకలసురలును, నెట్టనఁ గొలువంగ వచ్చి నీరజభవుఁ డా | 143 |
క. | హరిచక్ర మతనిదక్షిణ, కరమున విలపిల్లె నపుడు కమలజుఁడు చరా | 144 |
వ. | ఇవ్విధంబునఁ బృథుచక్రవర్తి యత్యంతధర్మమూర్తియు మహదైశ్వర్యసమేతుం | 145 |
క. | జున్నులు గలయడవుల మహి, దున్నక విత్తక ఫలించుఁ దోరపు మొదవుల్ | 146 |
క. | పృథుచక్రవర్తి యప్పుడు, పృథివీవలయమున సకలపీడలు వొలియన్ | 147 |
క. | క్రతుహోమసూత్రసూత్యా, హుతులవలన శిశువు లిరువు రుదయించిరి య | 148 |
ఉ. | వారలసౌకుమార్యములు వారలసోంపులు వారిపెంపులున్ | 149 |
క. | అని సూతమాగధులకును, ఘనతరవాగ్విభవమహిమ గలిగింపగ న | 150 |
ఉ. | ఆతతధర్మశీలుఁడు దయాపరతంత్రుఁడు సర్వలోకవి | 151 |
వ. | ఇట్లు సూతమాగధస్తోత్రంబులకు మెచ్చి పృథుచక్రవర్తి స్తోత్రంబులకు నర్హంబు | 152 |
తే. | ధరణిపులు నాటనుండియుఁ దమకుఁ గలిగి, నట్టికీర్తిప్రతాపాదు లహరహమును | 153 |
తే. | ఇట్లు పృథుచక్రవర్తి యనేకక్రతువు, లొనరఁ గావించి మించి యథోక్తభూరి | 154 |
శా. | క్షోణీమండలిలోపలం గలప్రజల్ క్షుత్తృట్ప్రపీడార్హులై | 155 |
వ. | ఇ ట్లరిగి పృథుచక్రవర్తిం బొడఁగాంచి యిట్లనిరి. | 156 |
చ. | నరవర యెల్లధర్మములు నష్టములయ్యెను దానఁ జేసి లే | 157 |
తే. | అది నిమిత్తంబు సకలధాన్యములు లేక, పెద్దకాలంబు కఱవయ్యె పృథివియందుఁ | 158 |
క. | అన్నంబు ధాన్యమూలం, బన్నంబు సమస్తజనుల కాధారం బా | 159 |
శా. | అన్నోపాయము మాకుఁ జేయుమని త న్నర్థింప నుగ్రక్షుధా | 160 |
తే. | సస్యనాశంబు గావించి జనుల కెల్లఁ, గర్వు చేసినయామహీకాంతఁ బట్టి | 161 |
క. | ఆరాజన్యునిచలమును, వీరత్వముఁ జూచి వెఱచి విశ్వంభర దా | 162 |
మత్తకోకిల. | ఎక్కుపెట్టినవింట సాయక మేర్చుచున్ వసుధావరుం | 163 |
ఉ. | నావుడు భూమి పల్కు నరనాథునితో భయకంపితాంగియై | 164 |
వ. | అనినం బృథుండు పృథివి కిట్లనియె. | 165 |
క. | విను నిన్ను దుష్టచారిణిఁ, దునిమిన మానవులు గరిమతో నుండుదు రీ | 166 |
తే. | నీవు లేకున్న నేమి నే దైవయోగ, బలముపెంపున భరియింతుఁ బ్రజలనెల్ల | |
| ననుచు గర్వించి పల్కిన యవనికాంత, వెఱచి యతనికి నెంతయు వినతి చేసి. | 167 |
వ. | నీవు నిష్కారణంబుగ నన్ను వధియింప వలవదు ప్రజాసంరక్షణ కుపాయంబు | 168 |
తే. | తఱుచుగా నున్న కుత్కీలతతులవలన, మిఱ్ఱుపల్లంబు లైనట్టిమేదినీత | 169 |
ఉ. | చండతరప్రతాపగుణశాలి పృథుం డురుబాహుదండకో | 170 |
ఉ. | ఆమనుజేశ్వరుండు మహియందు సమస్థలు లైనఠావులన్ | 171 |
క. | సుకర మగువ్రీహిధాన్య, ప్రకరాఖిలకాలఫలితభవ్యనదీమా | 172 |
వ. | మఱియు మనుష్యులకుం దగినజీవనోపకరణంబులు సర్వసంపన్నంబులుగా సమ | 173 |
క. | పాయక భూధేనువునకు, స్వాయంభువుఁ గ్రేపు గాఁగ సమకట్టి మహీ | 174 |
శా. | ఆదుగ్ధంబులచేత భూమివలయం బాప్లావమై సస్యముల్ | 175 |
క. | తోరముగ వత్సదోగ్ధృ, క్షీరంబులు దేవదైత్యకిన్నరగంధ | 176 |
వ. | ఇవ్విధంబున దేవతిర్యఙ్మనుష్యాదినానాలోకంబులకును వృక్షలతాపర్వతనికరం | 177 |
ఉ. | ఈపృథుచక్రవర్ధికథ యెవ్వరు విన్నను వారి కెన్నఁడుం | 178 |
వ. | అట్టిపృథుచక్రవర్తికి నంతర్థియు వార్ధియు నన నిరువురు పుట్టి రందు నంతర్థికి | 179 |
ప్రచేతసులు తపస్సు చేసి శ్రీహరివలన వరంబులు పడయుట
తే. | ఆప్రచేతసు లబ్ధిలో నధికతపము, దశసహస్రవర్షంబులు దమకుఁ జేయఁ | 180 |
క. | ప్రాచీనబర్హి పటుధ, ర్మాచరణసమగ్రవైభవాతిశయములన్ | 181 |
క. | సతతంబును దనయాజ్ఞకు, మితిదాఁటక భక్తియుక్తి మెలఁగుచు వినయా | 182 |
తే. | వేఱులేనిధర్మంబుల విస్తరిల్లు, మీకుఁ బడయంగరాని దేమియును లేదు | |
తే. | భావికాలంబునకుఁ బ్రజాపతివిలాస, ములు వహించి చరాచరభూతసృష్టి | 184 |
క. | జనకునినియోగమున వా, రొనరఁ బ్ర జార్థంబు సాగరోదకమధ్యం | 185 |
వ. | ఇవ్విధంబున ఘోరతపంబు సేయుచున్న వారలకుఁ బ్రసన్నుఁడై వెన్నుండు.[144] | 186 |
శా. | ఆదిత్యప్రతివీరవాహనముతో నత్యుజ్జ్వలప్రావృడం | 187 |
తే. | ఇట్లు ప్రత్యక్షమై జగదీశ్వరుండు, వారిఁ గనుఁగొని మీరెల్లఁ గోరినట్టి | 188 |
ఉ. | ఓకమలామనోరమణ యోజగదేశపవిత్ర యోశుభా | 189 |
వ. | అనిన నద్దేవుండు వారు కోరినట్ల భవదీయపుత్రుండు దక్షనామంబునం బ్రజాపతి | 190 |
క. | వారాశిజలములోపల, నారీతిం దపము దశసహస్రాబ్దంబుల్ | 191 |
క. | ఋక్షకిరిహరిణగజహ, ర్యక్షలులాయాదిమృగభయంకర మగుచున్ | 192 |
వ. | నిజతపోమహత్వంబులం జేసి ఝంఝానిలంబు గల్పించి మహీరుహంబు లున్మూ | 193 |
క. | మానుగఁ గించిచ్ఛేషము, లైనమహీరుహములందు నతులితకరుణా | 194 |
క. | చటులక్రోధపరీత, స్ఫుటమానసులై వెలుంగుభూపతిసుతులం | 195 |
సీ. | ముఖ మనుశశిబింబమునకుఁ గస్తూరికాతిలకకళంకంబు చెలువు మెఱయ | |
తే. | ఘనకుచము లనుకిన్నెరకాయలకును, బట్టుపయ్యెద గవుసెన బాగు సూప | 196 |
క. | మానవపతినందనులకుఁ, గానుకగా నిచ్చి వారిఘనకోపంబుల్ | 197 |
ఆ. | మీరు లేనినాఁడు మేదినీజనులకు, బాధ చేసినట్టి పాదపముల | 198 |
తే. | కానఁ దరువులు మీరు సఖ్యంబు సేయ, వలయు నీకన్య బహుపుణ్యవతి మహీరు | 199 |
క. | ఈకన్యను మీరందఱుఁ, జేకొని పాణిగ్రహణము సేయుం డీనా | 200 |
వ. | వాఁడు యుష్మదస్మత్తేజోభాగంబులఁ గైకొని దక్షనామంబునం బ్రజాపతి యగు | 201 |
ఆ. | ఈలతాంగిజన్మ మెవ్విధం బవనీరు, హంబులందు నెట్టు లవతరించె | 202 |
మారిషవృత్తాంతము చంద్రుండు ప్రచేతసులకుఁ జెప్పుట
వ. | అనినం జంద్రుం డిట్లనుఁ దొల్లి కంధుం డనుమునీంద్రుండు గోమతీతీరంబున ఘోర | 203 |
ఆ. | కాంత నీవు వోయి కంధమునీంద్రుని, మదనరాగతంత్రమగ్నుఁ జేసి | 204 |
వ. | అని నియమించి పంచిన. | 205 |
సీ. | పడఁతిబింకపుగుబ్బపాలిండ్లు కంతునిగిరిదుర్గములతోడఁ గ్రీడ సేయఁ | |
తే. | సరసిజాయతలోచనజఘనయుగము, మరునిరథచక్రములతోడ మాఱుమలయ | 206 |
క. | వనజాక్షి కాంచె నపు డ, త్యనుపమతేజఃప్రభాసితాంబుజబంధున్ | 207 |
మ. | అతులధ్యానపరాయణత్త్వమున బ్రహ్మానందుఁడై యున్నయా | 208 |
క. | ఆకాంత చెలులతో బి, బ్బోకవినోదములవలనఁ బుష్పాపచయా | 209 |
వ. | అప్పుడు. | 210 |
మ. | మలయక్ష్మాధరకూటదంతురశిలామార్గంబులన్ డస్సి త | 211 |
వ. | ఇట్లు మనోహరం బైనసమయంబున. | 212 |
సీ. | తనశరీరము కమ్మతావి మూర్కొనునట్లుగా వినోదమునఁ బైగాలిఁ బొలయుఁ | |
| దనకంఠరవములు వినవచ్చునట్లుగాఁ బరివాదినులు ముట్టి పాడుచుండుఁ | |
తే. | దనకరాలింగనమునకుఁ దగులునట్లు, గా శరీరంబు మోవంగఁ గదిసి మ్రొక్కు | 213 |
వ. | ఇవ్విధంబున మదనాతురుండై యమ్మునివరుండు. | 214 |
తే. | పొలఁతి కెమ్మోవి చవిచూచి పొదలు గుబ్బ, గబ్బిపాలిండ్లు గదియంగఁ గౌఁగిలించి | 215 |
వ. | అని యయ్యింతికిఁ దనయభిప్రాయం బెఱింగించి యిట్లనియె. | 216 |
తే. | తరుణి నీచేత మదనతంత్రంబు లెఱుఁగఁ, గోరి యున్నాఁడ నాయాస కొంచెపడక | 217 |
వ. | అనుటయు నయ్యింతి యమ్మునికాంతు నంతరంగంబునఁ గంతుకుంతంబులు నాటు | 218 |
తే. | మీకు నామీఁద మిక్కిలి మేలు గలిగె, నేని దేవర యూడిగం బిచ్చవచ్చి | 219 |
క. | అని యొడఁబడుటయు నమ్ముని, యనురాగము చెంగలింప నంబురుహనిభా | 220 |
వ. | ఇవ్విధంబున నయ్యిందువదనతోడి కందర్పరతిక్రీడానందంబులం జెంది మందర | 221 |
క. | చొక్కపుమరుమంత్రంబులఁ, జొక్కించి వినోదకేళిఁ జూపుచుఁ గళలిం | |
| పెక్కఁగ నధరం బిచ్చుచు, నక్కమలదళాక్షి పలికె నమ్మునితోడన్.[174] | 222 |
క. | మునినాథ యేను నిరతము, ననిమిషపతికొలువులంజియను సురపురికిన్ | 223 |
ఆ. | ఇపుడు నీవు వచ్చి యించుకదడవు లే, దిట్టిసురతసుఖము లెల్ల విడిచి | 224 |
ఆ. | అనిన నమ్మృగాక్షి యతనికామాతుర, భావ మెఱిఁగి యొండు పలుక వెఱచి | 225 |
క. | ఒకనాఁ డమ్ముని తనతో, మకరధ్వజుకేళి దేలి మమకారమునన్ | 226 |
ఆ. | ఎంతకాలమైన నీరీతి మీతోడఁ, గలసి మదనకేళి సలుప నాకుఁ | 227 |
క. | అనుటయు నమ్ముని యిట్లను, వనజాయతనేత్ర నీవు వచ్చి ముహూర్తం | 228 |
ఉ. | ఇప్పుడు నామనోరథములెల్ల వితాకులవిత్తు చేసి యీ | 229 |
తే. | అనిన కొండాడ వెఱచి యయ్యలరుబోఁడి, వలపు లేపార నిన్నూఱువత్సరములు | 230 |
ఆ. | కమలనయన మౌనిఁ గనుఁగొని యప్సరః, కాంత నగుట నమరకాంతుపురికి | 231 |
క. | మగువఁ బ్రియోక్తులు పలుకుచు, బిగియంగాఁ గౌగిలించి బింబాధర మిం | 232 |
ఉ. | మొల్లసుగంధి నామనసుమోహము నాఱడివెట్టి నీవు న | 233 |
వ. | అని యివ్విధంబున నమ్మునివరుండు. | 234 |
చ. | అది యొడఁబాటు లేక తను నాడుచునున్నఁ గడుం గలంగి య | 235 |
వ. | అంత నొక్కనాఁ డపరసంధ్యాసమయంబున నమ్మునీంద్రుండు పర్ణశాల వెడలి | 236 |
శా. | సాయంకాలము వచ్చె నిప్పు డిదిగో సంధ్యాద్యనుష్ఠానముల్ | 237 |
ఉ. | ఏ నిట నేటి రేపకడ నీనదిలోనఁ బ్రభాతకాలసం | 238 |
ఉ. | అచ్చపలాక్షి యిట్లనియె నాతనితోడఁ బ్రభాతకాలమే | 239 |
మ. | అనిన న్నివ్వెఱఁగంది మౌని యిది మిథ్యావాదమో నిక్కమో | 240 |
క. | మౌనీంద్ర నీవు బ్రహ్మ, జ్ఞానివి నీతోడ నా కసత్యము పలుకన్ | |
| గానేల చెప్పినన్నియు, సూనృతములు యోగదృష్టిఁ జూడుము తెలియన్.[187] | 241 |
వ. | అనిన నమ్మునీంద్రుం డట్లకా వగచి మదనభూతావేశంబు మాని మానిని | 242 |
క. | చపలాక్షి నీనిమిత్తము, తపమెల్లను నేగిఁ బోయెఁ దథ్యంబుగ నీ | 243 |
తే. | ఇంతకాలంబు నాతోడ నెరవులేక, కూడియుండితి వటుగాన కోపమెల్ల | 244 |
క. | అని మొగము జేవుఱింపఁగఁ, గనుఁగవఁ గోపాగ్ను లొలుకఁగాఁ బల్కిన న | 245 |
వ. | ఇట్లు భయాకులితమానసయై గగనంబున కెగసి చనుచోఁ దనలేఁతచూలుగల | 246 |
క. | తరుపల్లవముల నమ్ముని, వరువీర్యము నిలిచి వాయువశమున నమృతో | 247 |
క. | మును కంధునకును బ్రమ్లో, చనకు సమీరునకు నాకు సాలంబులకున్ | 248 |
మారిష యనుస్త్రీ పూర్వజన్మవృత్తాంతము
వ. | కావున వృక్షరక్షణార్థంబుగా నీమృగాక్షిం బాణిగ్రహణంబు సేయించెద | 249 |
క. | తొల్లి యిది యొక్కధరణీ, వల్లభునిల్లాలు బాల్యవైధవ్యమునం | 250 |
క. | ఆపడతికిఁ బ్రత్యక్షం, బై పురుషోత్తముఁడు నిలిచి యంబుజముఖి నీ | 251 |
వ. | అనిన నక్కాంత లక్ష్మీకాంతునకు సాష్టాంగనమస్కారంబు చేసి దేవా నాకు | 252 |
ఆ. | మదనపరవశత్వ మొదవంగఁ బతిఁ గృప, సేయు మనుచు నమ్మృగాయతాక్షి | 253 |
వ. | దేవా యివ్విధంబున వరంబు గృపచేసి పదుగురుపతుల నొసంగెదేని నే నయో | 254 |
క. | ఆరాజన్యతనూభవు, లారమణిఁ బరిగ్రహించి రాసతివలనన్ | 255 |
వ. | ఆదక్షప్రజాపతివలన దేవదానవగరుడగంధర్వసిద్ధవిద్యాధరాదినానాభూతంబు | 256 |
తే. | అజునిదక్షిణాంగుష్ఠంబునందు దక్షుఁ, డవతరించి నవబ్రహ్మలందు నొక్కఁ | 257 |
వ. | అనినం బరాశరుం డిట్లనియె బ్రహ్మమానసపుత్రుం డైనదక్షప్రజాపతి మహాత | 258 |
ప్రచేతసపుత్రుం డగుదక్షునిచరిత్రము
ఉ. | అక్షయపుణ్యమూర్తియు సమంచితకీర్తియు నైనయట్టియా | 259 |
ఉ. | కిన్నరసిద్ధసాధ్యమునిఖేచరరభూచరదేవదైత్యులం | 260 |
వ. | మిథునకర్మంబుచేతఁగాని ప్రజావృద్ధి లేదనుచుఁ దలంచి వరుణప్రజాపతిపుత్రి | 261 |
క. | జలజభవాండము సర్వముఁ, గలయంగాఁ జూచి దేశకాలక్రమముల్ | 262 |
వ. | అని చెప్పి నారదుండు వోయె వారలందఱు నన్నిదిక్కులకుం బోయి సముద్రంబు | 263 |
ఆ. | అప్పు డతనిమాట లగుఁగాక యని వార, లగ్రజను లరిగినట్ల యరిగి | 264 |
వ. | అది కారణంబుగా నాటనుండియు. | 265 |
క. | పరదేశము చరియింపఁగ, నరిగినయగ్రజుల వెదక ననుజన్ములు వో | 266 |
వ. | ఇవ్విధంబున దక్షుండు నష్టసంతానుండై నారదునిం గోపించి వెండియుఁ | 267 |
తే. | ధర్మపత్నులు పదుగురు ధర్మమతులు, వారు హరిఁ గూర్చి తపము పెంపారఁ జేసి | 268 |
వ. | అది యెట్లనిన ధర్మునిపత్నులు పదుండ్రయందు విశ్వయనుదానికి విశ్వేదేవతలు | 269 |
వసంతతిలకావృత్తము. | ఆవిశ్వకర్మ సముదంచితశిల్పవిద్యా | 270 |
వ. | అట్టివిశ్వకర్మ ప్రజాపతికిఁ ద్వష్ట పుట్టె. వానికి మహాతపోధనుం డైనవిశ్వరూ | 271 |
ఆ. | ఆమరీచిపుత్రుఁ డగుకశ్యపప్రజా, పతి వరించినట్టి భామినీత్ర | 272 |
వ. | అది యెట్లనినఁ గశ్యపుభార్య లైనయదితియు దితియు ధనువును నరిష్టయు సుర | 273 |
క. | మును చాక్షుసమన్వంతర, మున దేవగణంబునందు ముఖ్యులు తుషితుల్ | 274 |
వ. | వారు వైవస్వతమన్వంతరంబున నర్యముండును ధాతయుఁ ద్వష్టయుఁ బూషుం | 275 |
క. | ఈయమరావళియంతయు, వేయిమహాయుగము లైనవిధిదివసమునం | 276 |
ప్రహ్లాదచరిత్రము
వ. | మఱియుఁ గశ్యపప్రజాపతికి రెండవభార్య యైనదితియందు హిరణ్యకశిపుహిర | 277 |
క. | దితిజుఁడు హిరణ్యకశిపుఁడు, పితామహునిఁ గూర్చి తపము పెద్దయుఁ గాలం | 278 |
వ. | సర్వలోకకంటకంబుగా రాజ్యంబు చేయుచు నశేషంబులుగా యజ్ఞభాగంబులు | 279 |
ఉ. | ఏమిసుభాషితంబు పఠియించితి పుత్రక రాజనీతు లే | 280 |
వ. | అనినఁ దండ్రికిఁ గొడు కిట్లనియె. | 281 |
ఆ. | ఏను సారభూత మైనసుభాషితం, బెఱిఁగినాడ దానవేంద్ర వినుము | 282 |
చ. | అనవుడు దైత్యలోకవిభుఁ డవ్వచనంబు నిశాతశూలమై | 283 |
చ. | కటకట బ్రహ్మబంధుఁడవు గాని గురుండవు గావు చిన్నకూఁ | |
| కటిపసిబిడ్డనిన్ దనుజకంటకుఁ డైనపయోరుహాక్షు నే | 284 |
చ. | అనవుడు నాగురుండు దివిజాంతక నాయెడఁ దప్పులేదు నీ | 285 |
ఉ. | నావుడు దానవేశ్వరుఁడు నందనుఁ జూచి గురుండు చెప్పిన | 286 |
ఆ. | పొమ్ము పుత్ర నీవు బుద్ధిమంతుండవై, చదువు మనుచు బుద్ధి చాలఁ జెప్పి | 287 |
మ. | విను మీతండ్రి సమస్తలోకములకు న్వీరుండు పంకేరుహా | 288 |
వ. | అనిన దైత్యనందనుం డతని కిట్లనియె. | 289 |
క. | విను నాతండ్రికిఁ బుట్టిన, పెనువేదుఱు నీకుఁ బుట్టి పీతాంబరునిన్ | 290 |
ఉ. | కేవలపాపకర్మములఁ గీల్కొని యున్ననిశాటకోటి నీ | 291 |
చ. | అనిమిషలోకరక్షణపరాయణు దానవదైత్యభీకరున్ | |
| మనమునఁ గొల్వలేక యభిమానమునం జెడిపోవ నున్ననా | 292 |
క. | అని యిట్లు పెక్కువిధముల, దనుజేశ్వరనందనుండు తద్దయుఁ గోపం | 293 |
వ. | అంత నొక్కనాఁడు హిరణ్యకశిపుండు శతయోజనప్రమాణోన్నతంబై కనక | 294 |
ఉ. | శ్రీతరుణీకళత్రు సరసీరుహనేత్రుని సర్వలోకవి | 295 |
చ. | అనవుడు రాక్షసేంద్రుఁడు భయంకరకోపవిఘూర్ణమానలో | 296 |
ఉ. | ఎల్లజగంబులన్ బలిమి నేలెడునామహనీయవైభవం | 297 |
వ. | అని యతండు గోవిందపదారవిందస్మరణాహ్లాదుం డగు ప్రహ్లాదునిసర్వాంగం | 298 |
ఉ. | విస్మయ మొప్పఁగా దనుజవీరుల మాయలచేత బ్రుంగుఁడై | 299 |
చ. | ఒకమరి విష్ణుభక్తిగలయుత్తములన్ గొనియాడు మెచ్చు వే | |
| ప్రకటగుణాభిరాముఁ డగుభాగవతోత్తముఁ డాత్మఁ జొక్కుచున్.[237] | 300 |
వ. | ఇట్లు వినోదించుచుండి యొక్కనాఁడు హిరణ్యకశిపుకడకుం జని నమస్కరించి | 301 |
హిరణ్యకశిపుఁడు తనకు జ్ఞానోపదేశము చేయవచ్చినకొడుకును శిక్షించుట
మ. | దనుజాధీశ్వర నీకు నేమిటికి మిథ్యావైర మానీరజా | 302 |
క. | ని న్నింతవానిఁ జేసిన, యన్నలినజుతండ్రి విష్ణుఁ డట్టివిభునిచే | 303 |
క. | నీవంటిఘనుఁడు సాత్వికుఁ, డై విష్ణునిఁ గొలువ కేల యతితామసమో | 304 |
మ. | అనినం దానవచక్రవర్తి పటుకోపావేశదుర్వారుఁడై | 305 |
వ. | అంత దేవాంతకుం డంతకాకారుండై పౌలోమకాలకేయవిప్రచిత్తిరాహుప్ర | 306 |
ఉ. | క్రన్నన నాగపాశములఁ గట్టి మహాంబుధిలోన వైచి మీఁ | |
| త్యున్నతభంగిగా నసురు లుధ్ధతివైచిన భక్తిభావసం | 307 |
క. | వారిధి సంక్షోభించి మ, హారభసముతోడఁ దరఁగలను హస్తములన్ | 308 |
వ. | ఇట్లు హిరణ్యకశిపుప్రయత్నంబులనైన యుషద్రవంబులవలన ముక్తుం డైనభగవ | 309 |
భక్త్యతిశయముచే వినుతించు ప్రహ్లాదునకు శ్రీహరి ప్రత్యక్షంబగుట
తే. | తనకు నట్టిమహామహత్వంబు కరుణ, నొసఁగి మన్నించినట్టిపయోజనాభు | 310 |
సీ. | నారాయణాయ పంకేరుహనేత్రాయ వాసుదేవాయ శ్రీవల్లభాయ | |
ఆ. | త్రిగుణవిరహితాయ శ్రీహృషీకేశాయ, కీర్తితాఖిలాయ కేశవాయ | 311 |
చ. | అని వినుతించుచున్నసమయంబున శ్రీతరుణీకుచోపగూ | |
| దనరఁగ శౌరి వచ్చె వినతాసుతు నొక్కి రమాసమేతుఁడై.[248] | 312 |
వ. | ఇట్లు ప్రత్యక్షం బైనపుండరీకాక్షునకు దండవన్నమస్కారంబులు చేసి కరం | 313 |
క. | నీతండ్రి నీకుఁ జేసిన, పాతకములఁ జెడక పరమపరిశోభితపు | 314 |
వ. | కావున నీకోరినవరం బిచ్చెద వేఁడు మనిన. | 315 |
క. | ఏయేజన్మంబులయం, దేయేజంతువులయందు నెచ్చో నెచ్చో | 316 |
క. | అవివేకికి సంసార, వ్యవహారమునందుఁ గల్గువాంఛ నిరతమున్ | 317 |
వ. | అనినం బరమేశ్వరుం డిట్లనియె. | 318 |
ఉ. | నీవు మహానుభావుఁడవు నీహృదయంబు మదీయభక్తితోఁ | 319 |
వ. | అది యట్లుండె నింక నొక్కవరం బడుగు మనిన నతం డిట్లనియె. | 320 |
మ. | అమరారాతి దితిప్రసూతి మదగర్వాంధుండు నీభక్తి వై | |
| కుమతిన్ దప్పులు పట్టఁగాఁ జనదు తద్ఘోరాఘము ల్వాపి పు | 321 |
మ. | హిమవత్పర్వతకూటసానువులనుం దేలించు హైమాంబుపూ | 322 |
ఆ. | అనిన దేవదేవుఁ డాతనిగురుభక్తి, యుక్తి మెచ్చి నీకు నుచితమేని | 323 |
క. | ఇంకొక్కవరము వేఁడుము, శంకాతంకములఁ బొందఁ జనదనినఁ గృపా | 324 |
క. | ధర్మార్థకామమోక్షద, కర్మంబుల శైశవాదికాలంబులు నీ | 325 |
వ. | అనిన నద్దేవుం డతనికిఁ గైవల్యపదంబు మొదలుగాఁ గోరినవరంబు లొసంగి | 326 |
క. | హరివరమువలన నప్పుడు, హిరణ్యకశిపుఁడును దొంటియీరసమెల్లన్ | 327 |
వ. | ఇట్లు గౌఁగిలించి మూర్ధఘ్రాణంబు చేసి యానందబాష్పపూరితలోచనుండై | |
| కొడుకుతోడి వినోదంబులం దగిలి యనేకదివ్యసహస్రవర్షంబులు రాజ్యంబుఁ | 328 |
శా. | అంభోజాక్షుఁడు దుర్నిరీక్ష్య మగు ఘోరాకారమూర్తిన్ సభా | 329 |
వ. | ఇవ్విధంబున. | 330 |
ఉ. | మోదముతోడ దైత్యవిభు మోక్షపదంబున నుండఁజేసి ప్ర | 331 |
మ. | భగవద్భక్తిపరాయణుం డయినయా ప్రహ్లాదుఁ డత్యున్నతిన్ | 332 |
తే. | అనఘ యష్టమి ద్వాదశి నమవసలను, | 333 |
వ. | అట్టిప్రహ్లాదునకు విరోచనుండును ఆయుష్మంతుండును శిబియును భాష్కలుం | |
| భూతసంతాపనుండును మహానాగుండును మహాభాగుండును కాలనాభుండును | 334 |
తే. | దానవజ్యేష్ఠుఁ డైనవైశ్వానరునకు, ననఘ కాలకపౌలోమ లనఁగఁ గన్య | 335 |
వ. | కాలకేయపౌలోము లన నఱువదివేవురు పుట్టరి. విక్రచిత్తి యనువానికి సింహిక | 336 |
క. | వినత కనూరుఁడు గరుడుఁడు, జనియించిరి వారిలోన సర్పాశనుఁడై | 337 |
క. | సురసకుఁ గశ్యపునకు ఖే, చరులు భయంకరులు సర్వసత్తము లుదయిం | 338 |
తే. | కద్రువకు శేషవాసుకికాలనాభ, శంఖపద్మమహాభోగశంబతక్ష | 339 |
వ. | మఱియుఁ గ్రోధవశ యనుదానికిఁ గ్రోధమూర్తులై దంష్ట్రాసమేతంబు లయిన | 340 |
తే. | ఇట్లు కశ్యపవంశ మనేకశతస, హస్రసంఖ్యలఁ బుత్రపౌత్రాంతరముగ | 341 |
క. | శాంతినిధి యైనలక్ష్మీ, కాంతుని రాజసగుణప్రకల్పిత మిది తా | 342 |
చ. | అదితితనూజుఁ డైనయమరాధిపుదారుణవజ్రధారచే | 343 |
క. | అంతట వైవస్వతమ, న్వంతరమునఁ గశ్యపుడు నయంబునః బ్రీత | 344 |
క. | అనవుడు దితి దా నిట్లను, మునివర దేవేంద్రుఁ జంపి ముదమున శచితో | 345 |
ఆ. | ఏను నీకు గర్భ మిచ్చెద నూఱేఁడు, లంగశుద్ధి యైనయట్టివ్రతము | 346 |
క. | అని చెప్పి పుత్రదానం, బొనరించి మునీంద్రుఁ డరిగె నుత్పలదళలో | 347 |
క. | దేవేంద్రుం డంతయు విని, తా వేడుకపుట్ట సవతితల్లికిఁ గడుమి | 348 |
వ. | ఇవ్విధంబునఁ దొంబదితొమ్మిదివత్సరంబులు చనిన నొక్కనాఁడు భోజనంబు చేసి | 349 |
క. | మును వైన్యుఁ డైనపృథునిన్, మునులందఱు గూడి రాజ్యమున కధిపతిఁగా | 350 |
చంద్రాదులయాధిపత్యవివరణము
.వ. | అది యెట్లనిన నక్షత్రగ్రహవిప్రవృక్షలతాగుల్మతపోయజ్ఞంబులకుఁ జంద్రుండును, | 351 |
ఉ. | ఇప్పుడు చెప్పఁగాఁబడినయిందఱు విష్ణునియంశజాతులై | 352 |
సీ. | ఆయనర్తుపక్షమాసాబ్దకళాక్షణకాష్ఠానిమేషాదికాలములును | |
తే. | మహితభూతవ్రజంబు తన్మాత్ర లింద్రి, యాదిగా నాదిగుణమయభేదములు న | 353 |
వ. | మఱియు ఋగ్యజుస్సామాధర్వణవేదంబులును వేదాంతరహస్యంబులును నీతి | 354 |
ఉ. | ఇముల వైష్ణవవ్రతము లెంతయు భక్తి నొనర్చి ద్వాదశా | 355 |
వ. | అనిన సంతోషపరిపూర్ణహృదయుండై మైత్రేయుం డిట్లనియె. | 356 |
ఉ. | భూనుతకీర్తియాదిమనుపుత్రకులందుఁ బ్రసిద్దు లైనయు | |
| ఖ్యానము దత్తనూభవులయన్వయసంభవు లైనరాజులం | 357 |
శా. | శుంభద్విక్రమవిక్రమార్క సుజనస్తోత్రైకసంపర్క సం | 358 |
క. | సుకవిప్రణీతవాచా, సకలపురాణేతిహాససంశ్రవణ సురేం | 359 |
స్వాగతము. | గర్వితారిలతికాలిలవిత్రా, పూర్వరాజనిభపూర్వచరిత్రా | 360 |
గద్య. | ఇది శ్రీమదమరనామాత్యపుత్ర హరితసుగోత్ర సుకవిజనవిధేయ వెన్నెలగంటి | |
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.
- ↑ అగణ్యహృద్య... వీక్షణ = ఎన్నరానిమనోజ్ఞురాలైన భాగ్యలక్ష్మిచేత గౌరవించబడిన కడగంటిచూపులు గలవాఁడా.
- ↑ ఏకచ్ఛత్రము = ఒక్కగొడుగుగలది ఇతని రాజ్యమునందు ఇతరు లెవరును బిరుదుగొడుగును ధరియింప శక్తులుకాక యుండిరని తాత్పర్యము. మఘము = యజ్ఞము, కైకొనక = లక్ష్యపెట్టక, శాసీభూత...నికాయుఁడు = శిక్షితులగుచున్న శత్రురాజులయొక్క సమూహములు గలవాఁడు - ఎల్లశత్రువులను అణఁచినవాఁడు.
- ↑ అంకపీఠము = పీఁట వంటి ఒడిని.
- ↑ కఱకు = కఠినమైన.
- ↑ కూర్మి = ప్రియమైన, మొల్లములు = అధికములు, మోచి = వహించి, సపత్నిని = నీసవతిని, ప్రల్లదములు = గర్వపుమాటలు.
- ↑ ఆడన్ = నిందింప, అంతరాంతరములు = తారతమ్యములు.
- ↑ బెట్టిదంబులు = నిష్ఠురములు, వీఁపు వ్రేసెన్ = వీఁపున చఱచెను.
- ↑ కాకపక్షము = పిల్లజుట్టు, నికేతనంబునకున్ = ఇంటికి, చయ్యనన్ = శీఘ్రముగా, చేఁత = పని, ఉపేక్ష = అనాదరము.
- ↑ బాష్పములు = కన్నీళ్లు, మూర్కొని = మూచూచి, ఉడిపి = పోఁగొట్టి, ఒలుకుచుండన్ =కాఱుచుండఁగా, గద్దదస్వర = డగ్గుత్తికగలది.
- ↑ అన్న = నాయనా - ఇది ప్రేమసంబోధనము, నిక్కంబులు = నిశ్చయములు, ప్రియముగలఁడు = ప్రియముకలవాఁడు, చనువు = స్వాతంత్ర్యము.
- ↑ సౌభాగ్యవతి = మంచియదృష్టముగలది, మన్ననలు = సన్మానములు, కనిరి = పొందిరి, మందభాగ్యులము = భాగ్యహీనులము.
- ↑ మహోన్నతాసనము = మిక్కిలి యెత్తైనపీఠము, కృవణవృత్తికిన్ = నికృష్టవ్యాపారమునకు.
- ↑ మహనీయము = గొప్పది, సిరి = సంపద, ఈపరిపాటి = ఈమాత్రము.
- ↑ నెమ్మదిన్ = కొఱఁతలేని మనస్సుతో, ఊఱడించి పలికి = దుఃఖము చల్లారునట్టి మాటలు చెప్పి, పరమనిర్వేదనపరుఁడు = మిక్కిలి విచారము చేతనైన త్రొక్కుట కలవాఁడు.
- ↑ విష్టరంబులు = ఆసనములు.
- ↑ కైకొననొల్లక = గ్రహింప నపేక్షింపక, నిర్వేదించిన కారణము = నిర్వేదమునొందిన నిమిత్తము.
- ↑ మోహనము = మోహింపఁజేయునది.
- ↑ భావిశుభశ్రీదము = ఇకమీఁద శుభమును సంవదను ఇచ్చునది, ఈ వెఱ్ఱిపడుచుబుద్ధులు = ఈపిచ్చితనపుపసివానిబుద్ధులు.
- ↑ అంజలి = చేమోడ్పు, దురాగ్రహవృత్తితోడన్ = చెడ్డకోపవ్యాపారముతో, కొఱగానిమాటలం = పనికిమాలిన మాటలు - నీచపు మాటలు, నికృష్టత = (తన)నీచత్వము.
- ↑ పదంబునన్ = స్థానమునందు.
- ↑ అస్తోకమహిమ = గొప్పమహత్వము.
- ↑ శాత్రవచయంబులు = శత్రుసమూహములు, దారుణదివ్యబాణములు = భయంకరములును అమోఘములు నైనబాణములు, ఘనముగ = దట్టముగా, కాఁడినన్ = నాటినను, దురుక్తులు = చెడ్డమాటలు, ఓర్వఁడు = సహింపఁడు.
- ↑ ఇట్టిపాటన్ = ఈ విధముగా, వినతాసుతవాహనున్ = గరుడవాహనుని, భుక్తిముక్తిఫలదాయకున్ = భుక్తి ముక్తి ఫలములను ఇచ్చువానిని (భుక్తి = ఈలోకమునందలి అనుభవము, ముక్తి = మోక్షము),
సర్వసుపర్వనాయకున్ = ఎల్లదేవతలకు అధిపతియైనవానిని, శ్రీమహిళాకళత్రుని = లక్ష్మీదేవి భార్యగాఁ గలవానిని, భజింపు = సేవింపుము. - ↑ అవ్వాసుదేవునకున్ = ప్రసిద్ధుఁడైన శ్రీహరినిగూర్చి, అస్మదాదులు = మేము మొదలైనవారు, ఉపాసించి = సేవించి, భక్తరక్షణపరాయణుండు = భక్తులను రక్షించుటయందు ఆసక్తుఁడు, ఆరాధింపుము = అర్పింపుము, విధివంతంబుగాన్ = శాస్త్రమునందు చెప్పినక్రమముతో కూడుకొనునట్టుగా, తపశ్చరణప్రకారంబు = తపస్సు చేయువిధము, ఔత్తానపాది = ఉత్తానపాదునికొడుకు - ధ్రువుఁడు, ప్రమోదభరితహృదయుఁడు = సంతోషముతో నిండుకొన్న మనస్సు కలవాఁడు.
- ↑ అర్థితోన్ = ప్రియముతో, అలవరించెన్ = చేసెను, సార్వకాలంబు = ఎల్లకాలము, ఆస్పదము = స్థానము.
- ↑ పట్టు = స్థానము, కాళిందియందున్ = యమునానదియందు, తీర్ధమాడి = స్నానము చేసి.
- ↑ చెంగలింపన్ = అతిశయింపఁగా.
- ↑ షోడశాబ్దవయోమూర్తిన్ = పదియాఱేండ్లవయస్సుగల ఆకృతిగలవానిని, పీఠకౌశేయున్ = పచ్చపట్టువస్త్రము ధరించినవానిని.
- ↑ చిత్సుధాభిషేచనమతితోన్ = జ్ఞానామృతమున మునుఁగుతలఁపుతో, లోలోనిచవులన్ = తనయందలి జ్ఞానామృతరుచులయందు - జ్ఞానానుభవమునందు, లోలుండు = ఆసక్తుఁడు, బాహ్యరుచులు = బయటిచవులు - భక్ష్యభోజ్యాదుబవలని చవు లనుట, లోఁగొనక = గ్రహింపక.
- ↑ ఇమ్ములన్ = సుఖముగా, రాసుతున్ = రాజకుమారుని, సదమలవృత్తిన్ = నిర్మలమైన వ్యాపారము గలవానిని, పూనన్ = వహింపను, ధృతి = ధైర్యము - ఓర్పు, విదిత... వనాళి = ప్రసిద్ధమయిననదులు నదములు సముద్రములు పర్వతములు భయంకరములైన అడవుల పఙ్క్తులును.
- ↑ ఊర్ధ్వబాహుఁడు = మీఁది కెత్తఁబడినచేతులు గలవాఁడు, పదముదిక్కు = కాలితట్టు, ఒరగున్ = మ్రొగ్గును, వారధి = సముద్రము, పేరోడ = పెద్దఓడ.
- ↑ క్షోభము = కలఁతపాటు, వహ్ని = అగ్ని, అసహమానము = సహించరానిది.
- ↑ పొల్పారు = ఒప్పునట్టి, కూశ్మాండకవ్రాతము = ఒకవిధమైన రాక్షసులయొక్క సమూహము, భయదవ్యాపారులు = భయంకరమైన వ్యాపారము గలవారు, నిర్ఘాత..రవములు = పిడుగును బోలినవియు హింసకములను కఠినములును భయంకరములునైన ధ్వనులను, భీతున్ = భయబడినవానిఁగా, ప్రేరేచినన్ = ప్రేరేపింపఁగా.
- ↑ చటుల...భుజంగంబులై = వాఁడియైన కోఱలవలని విషపుమంటలచేత విశాలముఖము గలిగిన భయంకరములైన పాములై, కేసరి...రూపంబులై = సింహము పులి పంది గండభేరుండము వీనియొక్క రూపములు గలవై, పొడచూపుచుండున్ = కనఁబడుచుండును, దైత్య...తోడన్ = రాక్షసులు పిశాచములు భూతములు ప్రేతములు డాకినులు వీనియొక్క కూఁతలతో, సందడించున్ = సందడిని కలుగఁజేయును, చిటచిటార్భట...కీలలన్ = చిటచిటయను ధ్వనితో చక్కగా వెలుఁగుతున్న కార్చిచ్చుమంటలచేత, క్రొమ్మంటులు = క్రొత్తమంటలు, ఓలిన్ = వరుసగా, పోదువున్ = క్రముకొనును, వదనములన్ = ముఖములందు, బెట్టు = భయంకరముగా, అవిరళధ్యానపరుఁడు = ఎడతెగని ధ్యానసమాధియందు ఆసక్తుఁడు.
- ↑ బాష్పపూరితలోచన = కన్నీళ్లచే నిండిన కన్నులు గలది, గద్గద = డగ్గుత్తిక గల.
- ↑ నడతెంచితి = నడచితివి - వచ్చితివి, ఒసవెన్ = ఒసఁగెను - ఇచ్చెను.
- ↑ పంటికిన్ = పండునకు, అఱ్ఱు = మెడ, నిగిడ్చెదు. = చాఁచెదవు, కందువ = స్థానము, చందమామగుటకలు = పొందరానిదనుట, కట్టిపెట్టి = మానుకొని, ఉమ్మలిక = దుఃఖము, డిందుపడన్ = అడఁగ.
- ↑ ఆరన్ = పూర్ణముగా - చక్కగా, మోడు = మోటు, భావికాలఫలములు = రాఁగలకాలఁపు ప్రయోజనములు.
- ↑ అదభ్రము = సార్థకము, చాలన్ = తృప్తిగా, వార్ధకంబునన్ = ముదిమియందు, గైకొంట = కైకొనుట - గ్రహించుట.
- ↑ దట్టపు = అధికమైన, దురుక్తులు = చెడ్డమాటలు, భీషణవృత్తిన్ = భయంకరవ్యాపారముతో, చరింపన్ = మెలఁగ.
- ↑ తెంపుతలంపునన్ = తెగువ గలతలపుతో, లయమై = ఐక్యమై, బాహ్యవివేకశూన్యుఁడు = బయటితెలివి లేనివాఁడు - ప్రపంచజ్ఞానము లేనివాఁ డనుట.
- ↑ శస్త్రాస్త్రపాణులు = శస్త్రములును అస్త్రములును చేతులయందు గలవారు (శస్త్రము = కత్తి మొదలైనది, అస్త్రము = మంత్రపూతమైన బ్రహ్మాస్త్రము మొదలగునది), పొదివి = చుట్టుకొని, ఔత్తానపాది = ఉత్తానపాదుని కొడుకు, దురాత్మునకు = దుష్టస్వభావము కలవానికి.
- ↑ సుత్రాముఁడు = ఇంద్రుఁడు, ఉపమ = ఉపాయము, ఒండు = అన్యము, అగ్గలంబు = అధికము, కంటకంబునన్ = సంకటముతో.
- ↑ శ్రీతరుణీశ్వరుఁడు = లక్ష్మీపతి - విష్ణువు, ఉడుపలేక = మాన్పలేక.
- ↑ సురావనకేళిరతున్ = దేవతలను రక్షించుట యనెడు క్రీడయందు ఆసక్తుఁడైనవానిని, అంబురాశి...శోభితున్ = లక్ష్మీదేవియొక్క కుచకలశములను ఆలింగనము చేసికొనెడు చేతులచే ప్రకాశించువాఁడు, తదీయ...మస్తకుఁడు = అతనిదైన పూజ్యమైన పాదకమలములయందు (సోఁకునట్లు) వంపఁబడిన తల కలవాఁడు, దేవస్వామి = దేవేంద్రుఁడు.
- ↑ చిత్తగింపుము = వినుము, ఏలో = ఏమిటికో.
- ↑ చెక్కు = చెక్కిలి, మీటినన్ = కొట్టినను, బెళుకు = చలనము.
- ↑ అమరపదము = దేవస్థానము, అంబుజమిత్రునిన్ = సూర్యుని, హిమకర = చంద్రునియొక్క, చెలంగున్ = విజృంభించునో, ప్రమదముతోడన్ = సంతోషముతో - ఉత్సాహముతో.
- ↑ నందకపాణి = విష్ణువు, వజ్రపాణి = ఇంద్రుఁడు.
- ↑ చాఁపఁడు= వ్యాపింపఁజేయఁడు, ఇచ్చన్= మనసునందు.
- ↑ తొణంగి = విడిచి, పంచి = పంపి, భక్త...కరుఁడు = భక్తులసమూహమునకు మిక్కుటమైనసంతోషమును కలుగఁజేయువాఁడు, చిన్మయోపేతమనోరథుఁడు = జ్ఞానస్వరూపముతోఁ గూడుకొన్న కోరికగలవాఁడు.
- ↑ వారివాహము = మేఘము, శంప = మెఱపు, భూమిపద్మము = మెట్టతామర, చంచరీకము = తుమ్మెద, అరిశంఖఫలయుగంబు = చక్రము శంఖము ననెడు పండ్లయొక్క జత, ప్రతివచ్చు = సమానమగు, మోము = ముఖము, దరహాస... ధారలు = చిఱునవ్వనెడు క్రొత్తయమృతపుధారలు, నభముతోన్ = ఆకాశముతో, కనకకౌశేయసాంధ్యరాగము = పీతాంబరముయొక్క కాంతియనెడు సంధ్యారాగము.
- ↑ నిధానము = విధి, తార్కొను = చేరు - పొందు.
- ↑ వేఁడుము = కోరుము, ఉన్మీలితలోచనుఁడు = తెఱవఁబడిన కన్నులుగలవాఁడు.
- ↑ ఓరంతప్రొద్దును = ఎల్లప్పుడును, భావవీథిన్ = మనస్సునందు.
- ↑ తాత్పర్యము = తత్పరత్వము, మొగిచి = ముకుళించి.
- ↑ చొక్కి = పరవశుఁడై, తలంపుతోన్ = ఎన్నికతో - ధ్యానముతో.
- ↑ వాక్ప్రతిభన్ = మాటలకలిమిని, అందింపఁగదే = పొందింపుమా - కలిగింపు మనుట.
- ↑ పూరితము = నిండింపఁబడినది, జనపతిసూతిమస్తకమునన్ = రాజకుమారుఁడైన ధ్రువునిశిరస్సునందు, చారుతర...సంఘము = మిక్కిలిమనోజ్ఞములైన ఉపనిషత్తులలోని రహస్యములను పుట్టించెడు (తెలిపెడు) తిన్ననిమాటలయొక్క కూటమి గలది.
- ↑ మహా...రాముఁడు = అధికమగు ప్రతిభాసంపత్తిచేత ఒప్పినవాఁడు (ప్రతిభ = సమయోచితస్ఫూర్తిగలబుద్ధి), పరమేష్టి = బ్రహ్మ, అగమ్యములు = తెలియరానివి, ఆగమోక్తఘనసూక్తులన్ = వేదమునందు చెప్పఁబడిన గురుత్వము గల మేలైన మాటలచేత, వికాసభాసి = తేటదనములేక ప్రకాశించువాఁడు.
- ↑ శ్రీవనితాకళత్ర = లక్ష్మీదేవి భార్యగాఁ గలవాఁడా, సరసీ... నేత్ర = కమలములను బోలినకన్నులుగలవాఁడా, భాగధేయావహ = భాగ్యమును పొందించువాఁడా, దివ్యరూప = దేవతామూర్తివైనవాఁడా, నిగమా...కలాప = వేదాంతరహస్యము లైనవిద్యలే అలంకారముగాఁ గలవాఁడా, నానా...భృంగ = పెక్కండ్రు ఉత్తమయోగులయొక్క నిర్మలమైన హృదయకమలములకు తుమ్మెదలైనవాఁడా, చిత్సుధా...సంగ = జ్ఞానామృతమున ముంచఁబడిన భక్తులయొక్క కూడికగలవాఁడా, నిరపాయగుణోన్నత = చెఱుపు లేనిగుణములచేత గొప్పవాఁడా.
- ↑ కాష్టగతాగ్ని = కట్టేయందలినిప్పు, కాష్ఠలన్ = దిక్కులయందు, యామినీ = రాత్రి, ఘటికా... కాష్ఠలు = గడియలు సంవత్సరములు కాష్ఠలు అనుకాలవిశేషములును.
- ↑ అగణితలీలన్ = ఎన్నరానివిలాసముతో, సమగ్రము = పూర్ణము, నెగడిన = అతిశయించిన, వేష్టితములు = చేష్టలు, దురాత్ములు = చెడ్డమనస్సుగలవారు.
- ↑ నటనలు = నడవళ్లు, చిత్రములు = వింతలు.
- ↑ సర్వాంతర్యామి = అంతట నిండి వర్తించువాఁడు, ఉర్వీధర = భూమిని ధరించినవాఁడా.
- ↑ చిత్తగింపుము = వినుము, ఆసించితిన్ = ఆశపడితిని, కినుకన్ = కోపముతో, ధట్టించి = ఉద్ధతిని
పొంది. - ↑ ధ్యానా...సద్మా = నిశ్చలధ్యానయుక్తులైన మునిశ్రేష్ఠులహృదయకమలములు ఉనికిపట్టుగాఁ గలవాడా.
- ↑ ఉపాపించుచు = సేవించుదు, లగ్నమై = అంటినదై.
- ↑ ప్రాభవమునన్ = ప్రభుత్వముతో - ఘనతతో, పౌరుషము = మగతనము - శూరత్వము, ఆధిపత్యము = అధికారము, ఆరాధనము చేసినాఁడవు = ఆరాధించితివి.
- ↑ శైశవంబునన్ = శిశుత్వమున - కడుబాల్యమున ననుట, ఆస్తోక = అధికమైన, నెమ్మితోన్ = ప్రేమతో.
- ↑ త్రిదశ...పదములకున్ = దేవతలు గ్రహములు నక్షత్రములు ససమహర్షులు (వీరియొక్క) స్థానములకు, ఉపరిభాగంబునన్ = మీఁదిభాగమునందు, పెంపు = మేలిమి.
- ↑ మోదమ్మును = సంతోషమును, ఉడురూపమ్మునన్ = నక్షత్రాకృతితో, కల్పపర్యంతంబు = ప్రళయమువఱకు.
- ↑ గరిమ = గౌరవము, ధరిత్రీకాంతసుతున్ = రాజకుమారునితో.
- ↑ ప్రీణితుండై = సత్కరింపఁబడినవాఁడై.
- ↑ పదుండ్రు = పదిమంది.
- ↑ మథియించఁగా = తరువఁగా, దుగ్ధదోహనము = పాలు పిదుకుటను, తన్పెన్ = తనియించెను - తృప్తి నొందించెను.
- ↑ అంజలి = చేమోడ్పు, రసాపతి = భూదేవి, గెనయఁగన్ = తనియఁగా.
- ↑ బందెలు = పన్నులు, పాషండధర్మములు = వేదవిరుద్ధాచారములు, జారచోర...సమితిన్ = విటులయొక్కయు దొంగలయొక్కయు చెడునడవడికలవారియొక్కయు గుంపును, నాస్తికత = దేవుఁడు లేఁడనుతలఁపు.
- ↑ ఉజ్జగించి = విడిచి, వీటిఁబుచ్చి = వ్యర్థపఱిచి, సింధుపరీత = సముద్రముచే చుట్టఁబడిన.
- ↑ చూఱలాడున్ = కొల్లపెట్టును, ఉద్దండలీలన్ = ఉద్ధతి గలరీతితో.
- ↑ వేదవిప్రుఁడు = వేదముచదివిన బ్రాహ్మణుఁడు, త్రెవ్వనేసి = తెగఁగొట్టి, తొలఁగక = తప్పక.
- ↑ కీడునన్ = దోషముచేత, అరణములు = పైరులు, మొక్కల్ దాకన్ = కొఱఁతలు తోఁచఁగా.
- ↑ మూఢవివేకమున్ = తెలివిమాలినతనమును, వర్తనమున్ = ప్రవర్తించుటను, పనుపడన్ = అలవాటుపడ.
- ↑ విధానములు = విధులు, తన్పి = తనియఁజేసి - తేర్చి యనుట, మునుకొని = పూని, అక్కుమతి = కుత్సితబుద్ధిగలవానియొక్క, పిక్కటిల్లఁగన్ = అతిశయించఁగా.
- ↑ తొంటి = తొల్లిటి, భావికాలమేదినీనాథులకు = ఇఁకమీఁదటి రాజులకు, మేలుబంతి = శ్రేష్ఠము - సరియైనదని గ్రహింపఁదగినది, దుష్కర్మివి = చెడ్డనడకకలవాఁడవు.
- ↑ సాగనీవు = జరగనియ్యవు, పాపపతులన్ = పాపకృత్యములు చేయునట్టిరాజులను, కీల్కొనెదు = అంటెదవు - అవలంబించెదవు.
- ↑ అప్రసాదంబు = మొగము ముడుచుకొనియుండుట, రాజదోషంబులు = రాజులవలని లోపములు, క్రతువులు = యజ్ఞములు.
- ↑ నికాయము = సమూహము, సువృష్టి = మంచివాన, చెన్నగున్ = అందమగును - ఒప్పును, ఉన్నతిన్ = గొప్పను, సుస్దితిన్ = మంచియునికిని.
- ↑ యజ్ఞమూర్తి = యజ్ఞస్వరూపుఁడు, గోతురంగమాతంగాదిమహిమలు = ఆవులు గుఱ్ఱములు ఏనుఁగులు మొదలగువానికలుములు, కల్యాణకారణంబులు = మేలు గలుగుమూలములు.
- ↑ ఎంత పెద్ద = ఎంతగొప్ప- హెచ్చు కాదనుట.
- ↑ భర్తృశుశ్రూష = పెనిమిటియొక్క సేవ, కాంతకున్ = ఆఁడుదానికి - భార్యకు ననుట.
- ↑ మారణ = చంపునట్టి, ఘోరతరముగాన్ = మిక్కిలి భయంకరముగా, చొనిపినన్ = (వానియందు) చొప్పింపఁగా- ప్రయోగింపఁగా.
- ↑ కళేబరము= దేహము, తైలపాకంబు చేయించి = నూనెలో ప్రేల్పించి, ప్రధానులన్ = మంత్రులను, విచారించుచున్ = ఆలోచించుచు.
- ↑ దుర్గాధిపతులు = పాళెపట్టు
దొరలు, హావళి = ఉపద్రవము, కుట్రమన్నీలు = కుత్సితులైన సామంతరాజులు, మన్నిగొనిరి = చంపిరి, బందెలు = బందిపోట్లు, ఆకతాయలు = ధూర్తులు, మూఁకలై = గుంపులు కూడి, పుణ్యస్త్రీలన్ = ఇల్లాండ్రను, దండుకఱుచునన్ = సేనాబాహుళ్యముచేత, వీటిఁ బోయెన్ = నశించెను, అరాజకము = రాజు లేనిది - ఇక్కడ రాజులేమి యని యర్థము. - ↑ రాజవిడ్వరంబునన్ = రాజులవలని యుపద్రవముచేత.
- ↑ రాష్ట్రంబున = రాజ్యమునందు, నిర్జరులకు = దేవతలకు, నిబిడతరము = మిక్కిలిదట్టము, పెంధూళి = మిక్కుటమగుదుమ్ము.
- ↑ రేణుపటల...మానసులు = రేణుజాలముచేత కప్పఁబడిన ఆకాశమును చూచుటయందు ఆసక్తమైన మనస్సు కలవారు, మహాద్భుత...ఉద్యములు = మిక్కిలియాశ్చర్యముచేత తడఁబడిన వ్యాపారప్రయత్నములు గలవారు, క్షోణిదేవతలు = బ్రాహ్మణులు.
- ↑ పొరిఁబొరిన్ = క్రమక్రమముగా, పఱివోయి = కొల్లపోయి, తొరఁగెడు = కాఱుచున్న, తూలుచు = వివశు లగుచు.
- ↑ పరిదేవనము = విలాపము, అరుదేరఁగన్ = రాఁగా, పరిభవము = అవమానము - భంగము.
- ↑ బందులన్ = బందిపోటులతో, కుంది = ఖిన్నులై, చోరకులు = చోరులు - దొంగలు, కోల్పడి = పోఁగొట్టుకొని, కొందలము = దుఃఖము, ఆలకింపుఁడా = వినుఁడు.
- ↑ పరాగము =దుమ్ము, వినువీథి = ఆకాశమార్గము, పర్వుచున్ = వ్యాపించుచు, దీననాదములు = పేదలయొక్క (మొఱ) చప్పుడులు, పొదలి = అతిశయించి
- ↑ వసుధామరులు = బ్రాహ్మణులు, దోఁపులన్ = దోఁపిడుల చేత, పొగిలి = పరితపించి, సంభావన =మన్నన, బాసటచేతన్ = సహాయముచేత, హావళిన్ = ఉపద్రవముచేత, ఆరయుచుండిరి = విచారించుచుండిరి.
- ↑ ఊరుదేశంబు = తొడచోటు, మథియింపన్ = తరువ.
- ↑ బూచి = వికృతమైన, ఖల్వటకంబును = తలబట్టయు, ఈరెలుంగు...వాక్యములు = హీనస్వరముతో దైన్యమును దెలుపునట్టి తెలివిమాలిన మాటలు, బీఱ = పెద్దవైన, కుక్షి = కడుపు, తూలెడు = మీఁది కెగసిన - మిట్టలైన
- ↑ నృశంసాకారంబు = ప్రాణిహింస చేయువాని యాకృతివంటి యాకృతి, ఉవలక్షించి = చూచి.
- ↑ అక్షీణ...నిధి = తఱుఁగని ప్రసిద్ధమైన పరాక్రమమునకు గనియైనవాఁడు, బాహా...భయంకరుండు = భుజగర్వముచేత అణంపరానిశత్రు రాజులకు భయమును కలుగఁ జేయువాఁడు, సుజనస్తోత్రుఁడు = మంచివారిచేత పొగడఁబడువాఁడు, సర్వంసహారక్షాదక్షుఁడు = భూమిని రక్షించుటకు చాలినవాఁడు, ఉగ్రస్ఫారతేజంబుతోన్ = భయంకరమై యతిశయించిన తేజస్సుతో, భుజస్తంభారణిన్ = స్తంభమువంటి చేయియనెడు ఆరణియందు. (ఆరణి = అగ్నికొఱకు తరువఁబడుమాను).
- ↑ వైన్యుఁడు = వేనునివలన జనించినవాఁడు, మహనీయ = పూజ్యమైన.
- ↑ కరవాలము = కత్తి, అక్షయ...యుగము = అక్షయములై భయంకరములైన బాణములు గల అమ్ములపొదుల జంట, వజ్రకవచమురవలు చెక్కిన లోహపుచొక్కాయ.
- ↑ అపగతమై = తొలంగి, సుగతికిన్ = సద్గతికి.
- ↑ నెట్టనన్ = పూనికతో, జెట్టిని = శూరుని, సార్వభౌముని = చక్రవర్తిని.
- ↑ అనవరత...భూతుండును = ఎడతెగక కొలువవచ్చునట్టి చరములును అచరములు నైన భూతములు కలవాఁడు. (చర = తిరుగునవి, అచరములు = ఉన్నచోటనుండి కదలనివి).
- ↑ జున్నులు = తేనెతెట్టెలు, చ న్నవిసి = చన్నులనుండి తనంత నుబికి.
- ↑ పొలియన్ = నశింప, పృథుపైతామహయజ్ఞమున్ = పృథుపైతామహము అను యజ్ఞమును (పృథు = గొప్పది, పైతావహము = పితామహుఁ డనఁబడిన బ్రహ్మసంబంధ మైనది), ప్రథితంబుఁగన్ = ప్రసిద్ధముగా.
- ↑ సూత్యాహుతులవలన = బిడ్డలు కలుగునట్టి మంత్రములు చెప్పి వేల్చునట్టి ఆహుతులవల్లనుండి, (ఆహుతి = ఒకసారి అగ్నిలో వేల్వఁబడు ద్రవ్యము), అప్రతిమానవాక్సమంచితమతులన్ = సరిపోల్పరాని మాటలతోను ఒప్పిదమైనబుద్ధితోను.
- ↑ సౌకుమార్యములు = సుకుమారత్వములు, సొంపులు = చక్కఁదనములు, పెంవులు = గొప్పతనములు, వాగ్విలాసములు = మాటలచమత్కృతులు, కోమలకంఠనాదవిస్తారము = మృదువైసకంఠధ్వనియొక్క అతిశయము, పృథుమతిన్ = గొప్పబుద్ధితో, నేటనుండియున్ = ఈదినము మొదలుకొని.
- ↑ ఘనతరవాగ్విభవమహిమ = మిక్కిలి గౌరవమును (సూచించునట్టి) మాటలయొక్క వైభవాతిశయమును, గరిమన్ = గురుత్వముతో.
- ↑ ఆతతధర్మశీలుఁడు = అధికధర్మము చేయుటయే స్వభావముగాఁ గలవాఁడు, సర్వలోకవిఖ్యాతయశుఁడు = ఎల్లలోకములయందు ప్రసిద్ధమైన కీర్తి గలవాఁడు, సాధుహితకారి = యోగ్యులకు మేలు చేయువాఁడు, మహీసురరక్షణక్రియాకౌతుకుఁడు = బ్రాహ్మణులను రక్షించెడుపనియందు కుతూహలము గలవాఁడు, ఉన్నతోన్నతవికాసితభాసితుఁడు = గొప్పవారియందు గొప్పవాఁడై వెలయుటచేత ప్రకాశించువాఁడు.
- ↑ ధరణిపులు = రాజులు, అహరహము = ప్రతిదినము, ఉచితగతులన్ = తగినరీతులతో.
- ↑ క్షోణీమండలి = భూమండలము, క్షుత్తృట్ప్రపీడార్తులు = ఆఁకలిదప్పులచేత మిక్కిలి పీడించఁబడినవారు, తూలగాన్ = బలహీనములు కాఁగా, త్రాణలు = సత్తువలు, త్వగస్థిమాత్రులు = తోలుఎముకలు మాత్రము కలవారు, ప్రక్షీణప్రాభవులు = క్షీణించిన ప్రభుత్వములు గలవారు, దుఃఖీభూతచేతస్కులు = దుఃఖము నొందినమనస్సు కలవారు.
- ↑ లేబరములు = దారిద్ర్యములు, పాటిలెన్ = కలిగెను, బహుసస్యము = అనేకవిధము లైనపైరు, ఓషధులు = ఫలించుటతోడనే నశించునట్టి అరఁటి మొదలైనవి, జీర్ణములు = సారహీనములు.
- ↑ పెద్దకాలంబు = చిరకాలము, కందమూలఫలాశులు = దుంపలు పండ్లు తినువారు, కానలందున్ = అడవులయందు, కుందుచున్ = దుఃఖించుచు, కువలయేశ = పుడమిఱేఁడా.
- ↑ ఉగ్రక్షుధాపన్నానేకజనావనుండు = భయంకరమైన (ఓర్వరాని) ఆఁకలిచేత ఆపద నొందినవారైన పెక్కండ్రు జనులను రక్షించువాఁడు, కారుణ్యసంపన్నంబు = దయ కలిమి కలది, ఊఁది = అవలంబించి, పటుకోపోద్యుక్తుఁడు = దృఢమైన కోపపుపూనిక కలవాఁడు.
- ↑ మహీకాంతన్ = భూదేవిని, తివురుటయున్ = ఉద్యుక్తుఁడు కాగానే.
- ↑ విశ్వంభర = భూమి, సారసభవలోకమునకున్ = బ్రహ్మలోకమునకు, సంభ్రమము = తొట్రుపాటు, ఏర్చుచున్ = జ్వలింపఁజేయుచు.
- ↑ మార్వి = అల్లెత్రాడు, పిక్కటిల్లన్ = నిండఁగా, వెన్కొని = వెంబడించి.
- ↑ భయకంపితాంగి = భయముచేత వడఁకుచున్నదేహముగలది.
- ↑ దుష్టచారిణిన్ = చెడ్డనడవడి గలదానిని, ఈగఁగలేదే = పోఁగొట్టఁజాలదా.
- ↑ జీర్ణంబులు = అడఁగినవి, వత్సంబు = దూడ, దుగ్ధదోహనంబు = పాలుపిదుకుట, ప్లావనంబునం జేసి - = తడియుట చేత, ఒడంబడి = ఒప్పుకొని.
- ↑ కుత్కీలతతులవలన = పర్వతసమూహములవలన, ఊహచేసి = ఊహించి.
- ↑ చండతర... శాలి = మిక్కిలి తీక్ష్ణమైన ప్రతాపగుణముచేత ఒప్పినవాఁడు, మహీధ్రములు = కొండలు, ధన్వములన్ = మరుభూములయందు - నీళ్లు లేనిభూములయందు, మీటి = ఎగఁజిమ్మి, దంతురావళులు . = మిట్టలసముదాయములను, సమస్థలిగాన్ = చదరపునేలగా, ఆఖండలుఁడు = ఇంద్రుఁడు, నికాయము = గుంపు, నివ్వెఱఁ గంది = అత్యాశ్చర్యమును పొంది.
- ↑ ఠావులన్ = ప్రదేశములయందు, ఖర్వటకంబులన్ = బోయపల్లెలను, రాజధానులన్ = రాజు నివసించు పట్టణములను, సీమలు = ఎల్లలు, విభజించి = విభాగించి, ఫలాశనులు = పండ్లు ఆహారముగా చేసికొనువారు, పరితుష్టులన్ = మిక్కిలితృప్తి పొందినవారినిగా, పెంపుతోన్ = గౌరవముతో.
- ↑ వ్రీహి...ఆదులు = పరిధాన్యపుతెగలయొక్క యెల్లకారులపంటలచేత మేలైన యేటినీళ్లపాఱుదల కలవియు నైనపొలములు మొదలగునవి.
- ↑ జీవనోపకరణములం = బ్రదుకుఁదెరుపు కొఱముట్లు, సర్వసంపన్నంబులుగాన్ = కొఱఁత లేకుండునట్టుగా.
- ↑ క్రేవు = దూడ, సమకట్టి = జతపఱిచి, దుగ్ధప్రాయంబు = కొంచ మెచ్చుతక్కువగా పాలవంటిది.
- ↑ అప్లావము = అంతట తడపఁబడినది, ప్రాదుర్భూతము నొందెన్ = పుట్టెను, పాటిల్లెన్ = కలిగెను, సమగ్రంబుగాన్ = పూర్తిగా, మువ్వేళలన్ = మూఁడువేళలయందును.
- ↑ వత్సదోగ్ధృక్షీరములు = దూడయు పిదుకువాఁడును పాలును.
- ↑ నిర్వక్రపరాక్రమంబునన్ = మొక్కపోని పరాక్రమముతో, ప్రజానురంజనంబుగాన్ = ప్రజలకు ఉల్లాసము కలుగునట్టివిధముగా.
- ↑ భవ్యసుఖంబును = మేలైనసౌఖ్యమును, చేకుఱున్ = సిద్ధించును.
- ↑ ఆగ్నేయి = ఆగ్నివలనఁ బుట్టినది, పృథగ్భేదంబులు = వేఱువేఱుమాఱుతలలు, ధర్మంబులన్ = నడవళ్లతో.
- ↑ ప్రాచీనబర్హికైవడిన్ = ఇంద్రునివలె, నేచి = అతిశయించి.
- ↑ మితి దాఁటక = మేర మీఱక, వినయోన్వితులు = అడఁకువతోఁ గూడుకొన్నవారు.
- ↑ భావికాలంబునకున్ = భవిష్యత్కాలమునకు - రాగల కాలమునకు.
- ↑ నియోగమునన్ = నియమనముచేత.
- ↑ వెన్నుండు = విష్ణువు.
- ↑ ఆదిత్యప్రతివీరవాహనముతోన్ = గరుత్మంతునితో (గరుత్మంతుఁడు అమృతముకొఱకు దేవతలతో ఎదిరించినవాఁడుఁ కాఁబట్టి ఆదిత్యపతివీరుఁడని ప్రయోగింపబడెను), అత్యుజ్జ్వల...వైభవముతోన్ = మిక్కిలి వెలుఁగుచున్న వానకాలమునందలి మేఘమువంటి దేహకాంతిసంపత్తితో, భూరి... చక్రములతోన్ = మిక్కుటమైన శాంతిసముదాయమును కలిగించుటచేత ఒప్పిదమైన శంఖచక్రములతో, ప్రస్ఫీతపీతాంబరుండు = ఆధిక్యమును దెలుపునట్టి పచ్చపట్టుతాపితాను ధరించినవాఁడు.
- ↑ అభివాదనము చేసి = కులగోత్రనామములను చెప్పి నమస్కరించి.
- ↑ కమలామనోరమణ= లక్ష్మీదేవికి ప్రియుఁడా, శుభాలోకన= మేలుకలిగించెడు చూపుగలవాఁడా, పయోజదళలోచన = తామరాకులవంటి కన్నులుగలవాఁడా, మహనీయ = మహాత్ముఁడా, కౌస్తుభస్వీకృతవక్ష = కౌస్తుభమను మణిని తాల్చిన ఱొమ్ముగలవాఁడా, కరుణాపయోనిధీ = దయాసముద్రుఁడా.
- ↑ వారాశి = సముద్రము, దశసహస్రాబ్దంబులు = పదివేలసంవత్సరములు.
- ↑ ఋక్ష...భయంకరము = ఎలుఁగుగొడ్లు అడవిపందులు జింకలు ఏనుఁగులు సింహములు కారుదున్నపోతులు మొదలుగా గలమృగములచేత భీతిని కలుఁగఁజేయునది.
- ↑ ఝంఝానిలంబు = వానగాలిని, ఉన్మూలంబులు = పెల్లగిల్లినవి, ఆత్మీయ = తమదైన.
- ↑ మానుగన్ = చక్కగా, కించిచ్చేషములు = కొంచెము మిగిలినవి, అతులిత... తోడన్ = సరిపోల్పరానిదయచేత తక్కువగాని బుద్ధితో - మిక్కిలిదయగలవాఁడై, సితభానుఁడు = చంద్రుడు.
- ↑ చటుల...మానసులు = అధికశోకముచేత ఆక్రమింపఁబడుటచే ప్రకటిల్లుతున్న మనస్సులు కలవారు, ఒండువెరవులు = ఇతరమైన యుపాయములు.
- ↑ శశిబింబమునకు = చంచంద్రబింబమునకు, కళంకము = చిహ్నము, ధమ్మిల్లము = కీలుగంటు, గాఢతమసంబుతోన్ = దట్టపుఁజీఁకటిలో, పుష్పచయతారకావళి = పూసరమనెడు నక్షత్రపఙ్క్తి, సౌరు = అందము, మచ్చు = చొక్కుమందు, సందడింపన్ = అతిశయించఁగా, సుధాసింధుమధ్యంబునన్ = సముద్రమునడుము, వళితరంగశ్రేణి = కడుపుమీఁద ముడుత లనెడుఅలలవరుస.
- ↑ నలినవిరోధి = చంద్రుఁడు.
- ↑ లేనినాఁడు = లేకుందునట్టికాలమున, పాదపములన్ = వృక్షములను, ఆజ్ఞ వెట్టుట = శిక్షించుట, ఎంతయు నర్హమె = మిక్కిలియుక్తమే.
- ↑ సుధామయూఖములన్ = అమృతకిరణములచేత, ప్రవర్ధనము = వృద్ధిని.
- ↑ పాణిగ్రహణము సేయుఁడు = పెండ్లియాడుఁడు, నాళీకనిభాయతనేత్రకున్ = తామర(ఱేకుల)వలె విశాలములైన కన్నులుగలదానికిని, అమేయబలుఁడు = మేరమీఱిన బలముగలవాఁడు.
- ↑ యుష్మదస్మత్తేజోభాగంబులన్ = మీయొక్కయు నాయొక్కయు తేజస్సునందలి యంశములను.
- ↑ లతాంగి = తీఁగవంటిదేహము గలది - ఆఁడుది.
- ↑ సంక్షోభించి = కలఁతనొంది.
- ↑ మదనరాగతంత్రమగ్ను = కామాసక్తమైన క్రియయందు మునిఁగినవానిఁగా - మిక్కిలికామాసక్తి నొందినవానిఁగా ననుట.
- ↑ బింకపుగుబ్బపాలిండ్లు = బిగువైన గుబ్బలవంటి స్తనములు, కంతునిగిరిదుర్గములతోడన్ = మన్మథునియొక్క పర్వతదుర్గములతో, (దుర్గము = ఇతరులకు చొర నశక్యమైనకోట), నిడువాలు = మిక్కిలిదీర్ఘములైన - మిక్కిలి విశాలమైన అనుట, క్రొవ్వాఁడి= క్రొత్తగా చేయఁబడిన వాఁడిమిగల, సౌరు = అందము, శంబరవైరి =మన్మథునియొక్క, నిడువాలువాలుతోన్ = మిక్కిిలినిడుపైన కత్తితో, నెయ్యమాడన్ = చెలిమి సేయఁగా, భ్రూయుగము = కనుబొమలజంట, అంగజాతుని = మన్మథునియొక్క, సింగిణివింటికిన్ = శృంగధనుస్సునకు, ఒఱపు = నాగరికతను, జఘనయుగము = పిఱుఁదులజంట (ఇచ్చట రథచక్రములతో పోల్చియుండుటచేత జఘనశబ్దమునకుఁ గలమడికట్టు అని అర్థమును మాని పిఱుఁదులు అని వ్రాయనయ్యెను.), మాఱుమలయన్ = ప్రతిఘటింపఁగా.
- ↑ అనుపమ...అంబుజబంధున్ = ఈడు లేని తేజస్సుచేత వెలుఁగుచున్న సూర్యుఁడైనవానిని, అనవరత...సుధాంధున్ = ఎడతెగక తక్కువకాని జ్ఞానామృతమును పానము చేయువానిని.
- ↑ అతులధ్యానపరాయణత్వమునన్ = సరిపోల్చరానిధ్యానమునందు ఆసక్తికలవానికరముచేత, బ్రహ్మానందుఁ డై = బ్రహ్మానందము కలవాఁడై, క్షితిదేవోత్తమున్ = బ్రాహ్మణశ్రేష్ఠుని, శీతాంశుబింబాస్య = చంద్రబింబమువంటి ముఖము గలది, ఉన్నత...నమ్ర = నిక్కినవియు బలిసినవియు నైన స్తనములవలని బరువు చేత వంగినది, వర్తించెన్ = ఉండెను, ఆళీజనాన్విత = చెలికత్తెలతో కూడుకొన్నది, తద్వనవాటికానిచయముల = ఆవనపఙ్క్తులసమూహములందు.
- ↑ బిబ్బోకము = స్త్రీవిలాసచేష్టావిశేషము, పుష్పా...వృత్తిన్ = పువ్వులు కోయుచు పెక్కువృక్షములు గలవనములో విహరించుటయందలి వేడుక గలిగిన వ్యాపారము.
- ↑ మలయమార్గంబులన్ = మలయపర్వతపుశిఖరములయందలి మిట్టపల్లములైన ఱాళ్లదారులయందు, తద్విలస...దీర్ఘకలలోన్ = ఆగందపుకొండయందలి యొప్పిదములైన సెలయేటినీళ్లచే నిండిననడబావులలో, విశ్రాంతిఁ గావించి = బడలిక దీర్చుకొని, పుష్ప...పుంజములన్ = పూఁదీఁగెలచేత మనోజ్ఞములైన పొదరిండ్లగుబురులందు, ఇచ్ఛావృత్తిన్ = ఇచ్చ వచ్చినవ్యాపారముతో, వర్తించుచున్ = మెలఁగుచు, పొలసెన్ = ప్రసరించెను, దక్షిణవాతపోతములు = దక్షిణదిశనుండి వచ్చునట్టి పిల్లవాయువులు - చల్లగాలి యనుట.
- ↑ కమ్మతావి = ఇంపైనసువాసన, పొలయున్ = వ్యాపించును - మెలఁగు ననుట, మోహనాకృతి = మోహమును కలిగించునట్టిరూపమును, బిబ్బోకముగన్ = బిబ్బోక మనువిలాసచేష్టతో, నటించున్ = మెలఁగును, పరివాదినులు = ఏడుతంతులవీణెలు, రుచికిన్ = చవికి, మోవంగన్ = తాఁకునట్లు, కలఁచి = కలఁత నొందించి.
- ↑ కెమ్మోవి = ఎఱ్ఱనిఅధరము, పొదలు = వర్ధిల్లు, తనివోవన్ = తృప్తికలుగునట్లుగా, చొక్కక = పరవశత్వము నొందక, పుష్పాస్త్రుచేన్ = మన్మథునిచేత.
- ↑ ఓలార్చి = ఈఁదునట్లుగాఁ జేసి, సొంపారన్ = సంతోష మతిశయించునట్లుగా.
- ↑ అంతరంగంబునన్ = మనసునందు, కంతుకుంతంబులు = మన్మధునియీఁటెలు.
- ↑ మేలు = మంచి - అపేక్ష యనుట, దేవరయూడిగంబు = దేవరవారియొక్క సేవ, కుమతినయ్య = కొంచెపుబుద్ధి గలదాననా - బుద్ధిహీనురాలనా.
- ↑ చెంగలింపన్ = అతిశయింపఁగా, ననువై = అనురాగము గలిగి, నటనంబులు చేసెన్ = నటించెను.
- ↑ కందర్పరతిక్రీడానందంబులన్ = కామాసక్తితోడి కేళివలని సంతోషములను, కందరంబునన్ = గుహయందు.
- ↑ చొక్కపు = నిర్దుష్టములైన, చొక్కించి = పరవశత నొందించి.
- ↑ నిరతము = ఎల్లప్పుడు, అనిమిషపతికొలువులంజియను = ఇంద్రునిసభయం దుండు బోగమదానను.
- ↑ మకరధ్వజుకేళిన్ = మన్మథక్రీడయందు, తేలి = విహరించి, మమకారమునన్ = మమత్వముచేత.
- ↑ తమకించినన్ = తమకపడినను.
- ↑ మనోరథములు = కోరికలు, వితాకులవిత్తు = నిశ్చేష్టతలకు బీజము - వ్యర్థము, తక్కన్ = మోసపుచ్చుటకు, క్రొవ్విరులసెజ్జ = క్రొత్తపూలపాన్పు, మంటమారి = మండిపడునట్టి స్వభావముగలవాఁడు.
- ↑ అమరకాంతుపురికిన్ = ఇంద్రునిపట్టణమునకు, మదనభూతము = మన్మథుఁ డనుదయ్యము, ఆవహించి = సోఁకి.
- ↑ తగులునన్ = ఆసక్తిచేత.
- ↑ మొల్లసుగంధి = మొల్లపూవులపరిమళమువంటిపరిమళముగలదానా (ఇది అనింద్యగ్రామ్యము), ఆఱడివెట్టి = వ్యర్థము చేసి, తగవా = న్యాయమా, వుల్లసిలంగన్ =ఉవ్విళ్ళూరఁగా, పొరపొచ్చెములు = భేదవాక్యములను, చెల్లఁబో = ఔరా.
- ↑ ఒడఁబాటు = సమ్మతి.
- ↑ అధిక్షేపించి = విడిచి, వర్తించుట = మెలఁగుట, ఉద్యోగము = ప్రయత్నము.
- ↑ రేపకడన్ = ప్రాతఃకాలమునందు, మాపటిసంధ్య = సాయంసంధ్య, తెల్లము = విశదముగా.
- ↑ ప్రభాతకాలము = ప్రాతఃకాలమునందు, పితృప్రసువు = సాయంసంధ్య, పొచ్చెము నొందదు = న్యూనతను పొందదు - అబద్ధము కా దనుట, అచ్చుగన్ = సరిగా.
- ↑ నివ్వెఱఁగంది = నిశ్చేష్టత్వమును పొంది, మిథ్యావాదమో = అసత్యపువాదో - నన్ను వంచించుటకై యిట్లు చెప్పెదవా యేమి యనుట, వారాశిలో = సముద్రమునందు.
- ↑ సూనృతములు = సత్యములు.
- ↑ అట్ల కావ గని = అట్లె యగుట విచారించి, నిరర్థక ప్రయోజనంబునన్ = వ్యర్థమైన వ్యాపారముచేత, కోలుపోయితిని = పోఁగొట్టుకొంటిని.
- ↑ నేఁగిబోయెన్ = చెడిపోయెను, తథ్యంబుగన్ = నిజముగా, ఉపమ = ఉపాయము, తప్పుగలది = తప్పుగలదానవు.
- ↑ ఎరవు = భేదము, ఉపశమించితి = అణఁచితిని.
- ↑ జేవుఱింపఁగన్ = ఎఱ్ఱవాఱఁగా, కనుఁగవన్ = కన్నులజంటయందు, ఒలుకఁగాన్ = రాలఁగా, పెంజెమటలు = అధిక మైనచెమటలు, ఒదవన్ = కలుగఁగా.
- ↑ భయాకలితమానస = భయముచేత కలఁతనొందిన మనసుగలది, గగనంబునకున్ = ఆకాశమునకు, స్రవించి = (నీరై) కాఱి, శరీరంబునవయవంబులయందున్ = దేహముయొక్క అవయనములయందు, వీర్యంబు = రేతస్సు, స్వేదరూపంబునన్ = చెమటయాకృతితో, ఉద్గమించినన్ = పైకుబుకఁగా, బాలతరుపల్లవంబులన్ = లేఁతయైన చెట్లయందలి చిగురాకులచేత, బ్రహ్మపాఠస్తోత్రంబులు = వేదపాఠస్తోత్రములను, అనుష్ఠించుచు = చేయుచు, ఇట = ఇక్కడ.
- ↑ తరుపల్లవముల = చెట్లచిగుళ్లయందు, అమృతోత్కరము = అమృతరాశి, పరివృతమై = లెస్సగా ఆవరించఁబడినదై, ప్రభవించె = పుట్టెను, ఒగిన్ = క్రమముగా.
- ↑ సాలంబులకు = వృక్షములకును.
- ↑ భావికాలకార్యగౌరవంబునకు = రాఁగలకాలమాన (జరగవలసిన) పనుల యొక్క గురుత్వమునకు.
- ↑ ధరణీవల్లభునిల్లాలు = రాజుభార్య, బాల్యవైధవ్యమునన్ = పసితనమునందే ముండమోయుటచేత.
- ↑ ఆరోహించిన = ఎక్కిన - కలిగిన యనుట.
- ↑ పరవశత్వము = పరాధీనత్వము, కదిసి = చేరి.
- ↑ పరిగ్రహంబు సేయునది = భార్యగాఁ జేసికోవలసినది, మహాభాగుఁడు = గొప్పమహిమ గలవాఁడు.
- ↑ రాజన్యతనూభవులు = రాచకొమారులు, నీరజభవనిభుని = బ్రహ్మను పోలినవానిని, ఉదారునిన్ = తిన్ననిమనసు గలవానిని.
- ↑ ద్విపద...జాతంబును = రెండుకాళ్లు గలమనుష్యులు నాలుగుకాళ్లు గలమృగములు మొదలుగాఁ గలిగిన అనేకములైన ప్రాణిసమూహమును.
- ↑ అజునిదక్షిణాంగుష్ఠంబునందు = బ్రహ్మయొక్క కుడిబొటనవ్రేలియందు, అవతరించి = జనించి, తనర్చెన్ = ప్రసిద్ధినొందెను.
- ↑ కల్పములు = ప్రళయములు - నశించుటలు, సృష్ట్యర్థంబుగా = సృష్టికొఱకు, ఆకర్ణింపుము = వినుము.
- ↑ అక్షయపుణ్యమూర్తి = తఱుగనిపుణ్యమే స్వరూపముగాఁ గలవాఁడు, సమంచితకీర్తి = ఒప్పిదమయిన కీర్తి గలవాఁడు, పెద్దకాలము = చిరకాలము, దక్షుఁడు గాన్ = చాలినవాఁడు అగునట్టు, తామరచూలి = బ్రహ్మ.
- ↑ ఖేచర = ఆకాశమునందు తిరుగునట్టివారును, భూచర = భూమియందు తిరుగునట్టివారును, పన్నగమానవాలి = పాములయొక్కయు మనుష్యులయొక్కయు సమూహము, మానససృష్టియందున్ = తలంపుననే సృజియించుటయందు, వన్నియగాన్ = ప్రశస్తముగా, ప్రవృద్ధి = అభివృద్ధి, వేసఱి = ఉత్సాహము చెడి, పయోరుహగర్భునిచేన్ = బ్రహ్మచేత, నియుక్తుఁడై = నియోగించఁబడినవాఁడై - నియమింపఁబడినవాఁడై.
- ↑ మిథునకర్మంబుచేత = దంపతులకూటమిచేత, పాణిగ్రహణంబు చేసి = పెండ్లియాడి.
- ↑ జలజభవాండము = బ్రహ్మాండము, కలయంగాన్ = కడవెళ్ళ.
- ↑ వేవురు = వేయిమంది. తొంటి = మునుపటి.
- ↑ అగ్రజన్ములు = ముందు జనించినవారు - అన్నలు, ఎందుఁ బోయి మడిసిరో = ఎక్కడ పోయి వచ్చిరో, దివిజులను = దేవతలకును.
- ↑ అనుజన్ములు = వెనుక పుట్టినవారు - తమ్ములు, మరలక = తిరిగిరాక.
- ↑ నష్టసంతానుఁడు = చెడినసంతతి గలవాఁడు, అఱువండ్రు = అఱువదిమంది, పదుండ్రను = పదిమందిని.
- ↑ సముదంచిత...ప్రావీణ్యతన్ = మిక్కిలి యొప్పిదమైన శిల్పవిద్యలయందలి నేర్పుచేత, త్రిదశపట్టణతక్షకుఁడు = దేవలోకమునకు వడ్లవాఁడు, ఏమి యైనన్ = ఏశిల్పమునైనను, కౌశలము = నేర్పు.
- ↑ శక్రుండును = ఇంద్రుఁడును, చక్రధరుండును = విష్ణువును - వామనుఁ డనుట.
- ↑ ప్రహరణంబులు = ఆయుధములు.
- ↑ అమరావళి = దేవతాపఙ్క్తి - దేవసమూహము, విధిదివసమునన్ = బ్రహ్మదినమునందు.
- ↑ అవాఙ్మాసగోచరంబు = నోటికిని మనసునకును కానరానిది - చెప్పను తలఁచను శక్యము కానిదనుట.
- ↑ పితామహునిన్ = బ్రహ్మను, త్రిభువనవతి = స్వర్గమర్త్యపాతాళము లనెడు మూఁడులోకములకు ప్రభువు, పడసి = పొంది, కడంకన్ = ఉత్సాహముతో.
- ↑ సర్వలోకకంటకంబుగాన్ = ఎల్లలోకములకు ముల్లుగా - సమస్తలోకములకు బాధకుఁడుగా ననుట, అశేషంబులుగాన్ = మిగత లేకుండునట్లుగా, పృథివియందున్ = భూమియందు, వర్తించుచుండన్ = మెలఁగుచుండఁగా, ఐశ్వర్యదర్పితుఁడు = సంపదచేత గర్వించినవాఁడు, ఉపాసింపన్ = సేవించగా, పొంపిరివోవుచు = విఱ్ఱవీఁగుచు, మద్యపానమత్తుండై = మద్యము త్రాగుటచేత దేహము దెలియనివాఁడై, మణి...తలంబునన్ = రత్నములు చెక్కిన బంగారుమేడమీఁద, బాలపాఠ్యంబులు = బాలకులకు చదువదగినవి.
- ↑ సుభాషితంబు = మంచిమాట - నీతి యనుట.
- ↑ సారభూతము = సత్తైనది.
- ↑ నిశాత = వాడియైన, కోపరక్తలోచనములతోడన్ = కోపముచేత ఎఱ్ఱనైన కమ్నలతో, సన్నిధి = సమీపప్రదేశము, ఉచితాసనంబునన్ = తగినపీఠమునందు, తనరుచున్ = ఒప్పుచు, తద్గురునిన్ = ఆకొడుకును చదివించునట్టి యయ్యవారిని, తప్పక = చూపుతప్పక.
- ↑ కటకట = అయ్యయో, బ్రహ్మబంధుఁడవు = జాతిమాత్రమున బ్రాహ్మణుఁడవు - నీచబ్రాహ్మణుఁడవు అనుట, చిన్నికూఁకటిపసిబిడ్డనిన్ = మిక్కిలిపసివాఁడైవ పిన్నవానిని, దనుజకంటకుఁడు = రాక్షసబాధకుఁడు, పయోరుహాక్షున్ = కమలములవంటి కన్నులుగలవానిని - విష్ణువును, కుటిలచరిత్రములు = వంకరనడకలు.
- ↑ దివిజాంతక = దేవతలకు యముఁడవైనవాఁడా, చేతలు = చేష్టలు, దారకకోటి = బాలురసమూహము, నాపనుపునన్ = నాయాజ్ఞ చొప్పున, విరాళి = ఆసక్తి.
- ↑ కావలము = మూఢత్వము.
- ↑ కుస్తరించి = బుజ్జగించి.
- ↑ సంధిల్లుచున్నాఁడు = కూడుకొనుచున్నాఁడు, పద్ధతులు = మార్గములను.
- ↑ వేదుఱు = పిచ్చి, పీతాంబరునిన్ = విష్ణుని, అకట = అయ్యో.
- ↑ కీల్కొని = అంటి, నిశాటకోటి = రాక్షససమూహము, కైవసము = స్వాధీనము, గొల్పదు = ఉత్సహింపదు.
- ↑ అనిమిష...పరాయణున్ = దేవతాసమూహమును కాపాడుటయందు ఆసక్తుఁడైనవానిని, దైత్యభీకరున్ = రాక్షసులకు భయమును కలుగఁజేసెడువానిని, వనరుహలోచనున్ = కమలములవంటి
కన్నులు గలవానిని, సుజనవత్సలునిన్ = సజ్జనులయందు వాత్సల్యముగలవానిని, కరుణాపయోనిధిన్ = దయాసముద్రుని, అభిమానమునన్ = ఆహంకారముచేత. - ↑ ధిక్కరించి = తిరస్కరించి, ఒండు = వేఱొకమాటను, వివశతన్ = పరవశత్వమును.
- ↑ శతయోజనప్రమాణోన్నతంబు = నూఱామడకొలఁది పొడువుగలది, కనకశైలంబు = బంగారుకొండ, అనుకరించు = సరిపోలు, ప్రాసాదతలంబునన్ = మేడమీఁద, శీధుపాన = మద్యపానమునందలి, తగిలి = ఆసక్తుఁడై, ఆంగనాజన = స్త్రీసమూహముతోడ.
- ↑ శ్రీతరుణీకళత్రున్ = లక్ష్మీదేవి భార్యగాఁ గలవానిని, సరసీరుహనేత్రుని = కమలములవంటి కన్నులు గలవానిని, సర్వ...చరిత్రున్ = ఎల్లలోకములయందు ప్రసిద్ధినొందిన నడవడికలవానిని, ధైత్య... విదారణున్ = రాక్షసులయొక్క మదమును అహంకారమును భేదించునట్టివానిని, భజించి = సేవించి, వలపించితిన్ = ప్రీతి నొందించితిని.
- ↑ భయంకర...లోచనములతోన్ = వెఱపును కలుగఁజేయునట్టి కోపముచేత తిరుగుచున్న కన్నులతో, దురాత్మ = చెడ్డబుద్ధిగలవాఁడా, కులోచితమున్ = కులఘనతకుఁ దగిన నడవడిని, నిశాచరవైరి = రాక్షసులకు పగవాఁడు, సారెకున్ = మాటిమాటికి, సమ్ముఖమ్మునన్ = ఎదుట.
- ↑ కల్ల = తప్పును, బల్లిదుఁడు = బలవంతుఁడు, ప్రభావము = మహిమము.
- ↑ గోవింద...హ్లాదుండు = శ్రీహరియొక్క పాదపద్మములను స్మరించుటచేత సంతోషమునొందినవాఁడు, కాలపాశంబులంబోని = యమపాశముల వంటి, ఘోరపాశంబులతోన్ = భయంకరము లైనత్రాళ్లతో, విశ్వంభర...మానసుండు = ఎల్లలోకములను భరించునట్టివాఁడైన శ్రీహరియొక్క ధ్యానముచేత కొఱఁతలేనిమనసుకలవాఁడు, అప్రమాదంబులు = ఏమఱుపాటు లేనివి, తద్వారణవిషాణంబులు = ఆయేనుఁగులకొమ్ములు, సూపకారులు = వంటవారు, కృత్తికా = కృత్రిమభూతమును, ఆపనేయుఁడు = పోఁగొట్టఁదగినవాఁడు, సుదర్శన...పరుఁడు = చక్రధరుఁ డైనశ్రీవిష్ణునిమంత్రమును అనుష్ఠించుటయందు ఆసక్తుఁడు, భుజంగ...హృదయుండు = శేషశాయితో కూడుకొన్న హృదయము గలవాఁడు - శ్రీవిష్ణువును మననున నిలిపి ధ్యానము చేయువాఁడు ఆనుట, నికషంబులు = ఒరగండ్లు, జాంబూనదంబు = బంగారు.
- ↑ విస్మయము = ఆశ్చర్యము, బ్రుంగుడు = పూడినది - కప్పఁబడినదనుట, పావకమూర్తి = అగ్నియొక్క ఆకృతి, వర్ధితుఁడు = పెంపఁబడినవాఁడు, మందస్మితసుందరాననమునన్ = చిఱునవ్వుచేత అందమైన మొగముతో.
- ↑ ఒకమరి = ఒకసారి, కొనియాడున్ = పొగడును, నవ్వున్ = పరిహసించును, ఉబ్బినన్ = పొంగినను, నిబ్బరము = కదలక మెదలకయుండుటను, ప్రకటగుణాభిరాముఁడు = ప్రసిద్ధమైన గుణములచేత ఒప్పినవాఁడు, చొక్కుచున్ = పరవశత్వము నొందుచు.
- ↑ మిథ్యావైరము = అబద్ధపువిరోధము - వ్యర్థపుపగ యనుట, ఆనీరజాసనసంకల్పితలు = ప్రసిద్ధుఁ డైనబ్రహ్మచేత కలుగఁజేయఁబడినవి, తేజరిల్లిన = వెలిగిన, జాలిన్ = దుఃఖమును.
- ↑ నలినజు = బ్రహ్మయొక్క, మన్ననలన్ = ఆదరణలను, కన్నవారలకున్ = పొందినవారికి.
- ↑ సాత్వికుఁడు = సత్వగుణమువలనఁ గలిగిన సాధుభావముగలవాఁడవు, తామసమోహావేశబుద్ధిన్ = తమోగుణమువలనఁ గలిగిన అజ్ఞానమును పొందిన బుద్ధితో, మోక్షకరములు = ముక్తిని కలుగఁజేయునవి.
- ↑ దుర్వారుఁడు = అడ్డగింపఁగూడనివాఁడు, వెసన్ = వేగముగా, వక్షంబు = ఱొమ్మును, ఉద్ధతిన్ = మిడిసిపాటుతో, నెక్కొన్న = నెలకొనిన - చలింపక నిలిచిన, సౌహ్లాదుఁడు = ఆహ్లాదముతో కూడుకొన్నవాఁడు.
- ↑ అంతకాకారుఁడు = యమునివంటి ఆకృతిగలవాఁడు, ప్రముఖులు = మొదలగువారు, చదియునట్లుగాన్ = నలఁగి అణఁగిపోవునట్టుగా.
- ↑ క్రన్ననన్ = శీఘ్రముగా, నాగపాశములన్ = పాములనెడు త్రాళ్లచేత, నిబిడంబులు = దట్టములైనవి, వసుధాధరములు = కొండలు, ఉద్ధతిన్ = నిక్కుతో, వెన్నునిన్ = విష్ణుదేవుని.
- ↑ వారిధి = సముద్రము, సంక్షోభించి = కలఁగి, మహారభసముతోన్ = అధికమైనత్వరతో, తరఁగలు అలలు, విష్ణుసమారాధనసంప్రమోదున్ = విష్ణుని లెస్సగా నారాధించుటచేత సంతోషమునొందినవానిని.
- ↑ ముక్తుఁడు = విడువఁబడివవాఁడు, మహానుభావంబులు = ప్రభావములు, అపరావతారమూర్తి = రెండవయవతారము నొందినమూర్తిగలవాఁడు.
- ↑ మహామహత్వంబు = మహిమకలిగినవానితనమును, డెందమున్ = మనసునందు, సంతతానందహృదయుఁడు = ఎడతెగనియానందముతోడి మనసుగలవాఁడు.
- ↑ పంకేరుహనేత్రాయ = తామరలవంటి కన్నులు గల, నిత్యాయ = శాశ్వతుఁ డయిన, నిర్వికారాయ = వికారరహితుఁ డయిన, జగద్ధితాయ = మేలు చేయునట్టి, గురుధర్మమూర్తయే = పూజ్యమైన ధర్మమే స్వరూపముగాఁగల, బ్రహ్మణ్యదేవాయ = బ్రహ్మజ్ఞానులకు దేవుఁడైన, సదైకరూపాయ = సత్తై ఒక్కటియైన రూపముగల, త్రిగుణవిరహితాయ = సత్వరజస్తమస్సు లనెడు మూఁడుగుణములు లేని, హృషీకేశాయ = ఇంద్రియాధిదేవత యైన, కీర్తితాఖిలాయ = స్తోత్రముచేయఁబడిన సర్వలోకములు గల - ఎల్లవారిచేతను పొగడఁబడిన, దురితనిరసనాయ = పాపములను పోఁగొట్టునట్టివాఁడైన, తుభ్యమ్ = నీకొఱకు, నమోనమో = మాటిమాటికి నమస్కారము (చేసెదను), అభినుతించెన్ = స్తోత్రము చేసెను.
- ↑ శ్రీతరుణీ...శోభితంబులు = లక్ష్మీదేవియొక్క స్తనములను కౌఁగిలించుకొనుటచేత మిక్కిలి శోభిల్లునవి, హస్తప్రయోజవిరాజితంబులు =కమలములవంటి హస్తములయందు ప్రకాశించునవి, ఉదంచిత...కాంతులన్ = ఒప్పిదములైన చంద్రసూర్యులకాంతులవంటి కాంతులతో, తనరఁగన్ = ఒప్పుచుండగా, వినతాసుతున్ = గతుత్మంతుని, రమాసమేతుఁడై = లక్ష్మీదేవితో కూడుకొన్నవాఁడై.
- ↑ దండవన్నమస్కారంబులు = సాగిలఁబడి చేయఁబడిన నమస్కృతులు, ఆనంద..విందుండు = సంతోషబాష్పములధారలు జాఱుచున్న కన్ను లనెడుకమలములు కలవాఁడు - కన్నులయందు ఆనందబాష్పములను విడుచుచున్నవాఁడు, హర్ష ... అంగుండు = సంతోషముచేత కలిగిన గగుర్పాటుచేత ఎగుడుదిగుడయిన అవయవములు గలవాఁడు, పరమ...స్వరుఁడు = అధికసంతోషముచేత వెడలుచున్న డగ్గుత్తికతోడి కంఠస్వరముగలవాఁడు, నాభి...ప్రశస్తంబులు = బొడ్డుదామరయందు జనించిన బ్రహ్మయొక్క చెక్కిళ్లను అంటి బుజ్జగించుటయందలి నేర్పుచేత ప్రశంసింపఁబడినవి, గారవించి = మన్నించి.
- ↑ పాతకములన్ = పాపకృత్యములచేత, పిన్నబిడ్డఁడవు = పసిబాలుఁడవు.
- ↑ చేవ = బలమును - దార్ఢ్యమును, భావిభవంబు = పునర్జన్మము, అఘదూరుఁడవు = పాపముల కెడమైనవాఁడవు - పాపములఁ పొందనివాఁడవు.
- ↑ అమరారాతి = దేవతలకు పగవాఁడయిన, దితిప్రసూతి = హిరణ్యకశిపువు, మదగర్వాంధుండు = క్రొవ్వుచేతను అహంకారముచేతను కన్ను గాననివాఁడు, నీభక్తి వైరమునన్ = నీయందలి భక్తివలనఁ గలిగిన విరోధముచేత, దోషములు = తప్పులు, దుర్వారస్థితిన్ = అడ్డము లేని విధమున, కుమతిన్ = బుద్ధిహీనుని, తద్ఘోరాఘములు = అతనియొక్క భయంకరములైన పాపములను, పాపి = పోఁగొట్టి, పుణ్యమతిన్ = ధర్మబుద్ధిగలవానిగా, భక్త...పారాయణా = భక్తులను రక్షించునట్టి విద్యయనెడు వ్యాపారమునందు ఆసక్తుఁడయినవాఁడా.
- ↑ హిమ...సానువులనుండి = మంచుకొండయొక్క శిఖరమునందలి చఱులనుండి, హైమాంబుపూరమున్ = మంచునీళ్లవెల్లువయు, చండాల...ప్రవాహమున్ = మాలవానియింటిముందటివాననీళ్లచేతనైన గొప్పవెల్లువయు, భాగీరథిలోనన్ = గంగానదిలో.
- ↑ గురుభక్తియుక్తి = తండ్రియందలి భక్తితోడి కూడికను - తండ్రియందు భక్తి కలిగియుండుటను, ఉచితమేని = తగుననితోచిన పక్షమున.
- ↑ శంకాతంకములన్ = సంకోచభయములను.
- ↑ శైశవాది = శిశుత్వము మొదలైన, పేర్మిన్ = ప్రేమతో.
- ↑ కైవల్యపదము = ముక్తిస్థానము, దితిజబాలకుండు = రాక్షసకుమారుఁడు - ప్రహ్లాదుఁడు, నిజపురంబునకు = తనయింటికి.
- ↑ ఈరసము=ఈర్ష్య - విడువనిపగ, పరిహృతమై = పోయి, సత్వస్ఫురణమెయిన్ = సత్వగుణముయొక్క ప్రకాశించుటచేత.
- ↑ మూర్ధాఘ్రాణంబు = నడితల మూర్కొనుట, ఆనందబాష్పపూరితలోచనుండు = ఆనందబాష్పములచేత నిండిన కన్నులు గలవాఁడు, దురవస్థలన్ = దుర్దశలను - బాధలను, ఇందిరామందిరుఁడు = లక్ష్మికి ఉనికిపట్టయినవాఁడు, పెంపున= అభివృద్ధితో, ఆశ్వాసించి =ఊఱడించి, తగిలి = ఆసక్తుఁడై, జన్మత్రయావసానంబు = మూఁడుపుట్టుకలముగియికయందుఁ గాక, బద్ధవైరుండు = కట్టబడిన విరోధముగలవాఁడు - స్థిరమైనవిరోధముకలవాఁడు.
- ↑ అంభోజాక్షుఁడు = తామరలవంటి కన్నులు గలవాఁడు - విష్ణువు, దుర్నిరీక్ష్యము = చూడశక్యము గానిది, ఘోరాకారమూర్తిన్ = భయంకరమైన ఆకృతి గలదేహముతో, చరాచరభయత్రస్తంబుగా = చరములును అచరములును అగు ప్రాణులు భయముచేత చలించినవి కాఁగా, భీమసంరంభంబు = భయంకరమైన ఆటోపము, శుంభద్గర్వుని = అతిశయించినగర్వముగల హిరణ్యకశిపునియొక్క, అస్తోక = అల్పము కాని.
- ↑ మోక్షపదంబునన్ = ముక్తిస్థానమునందు, గుణోన్నతులు = గుణాధిక్యతలు, చెప్పవచ్చునే = చెప్ప శక్య మగునా.
- ↑ భగవద్భక్తిపరాయణుండు = భగవంతునిభక్తియం దాసక్తుఁడు, అత్యున్నతిన్ = మిక్కిలి ఘనతతో, నిరస్తక్రోధవాక్యంబులన్ = తొలఁగఁద్రోయఁబడిన కోపముతోడి మాటలతో - ఈర్ష్యలేని మాటలతో, సర్వంకషము = అంతట వ్యాపించినది.
- ↑ అమవస = అమావాస్య, పౌర్ణమాసి = పున్నమ, భవ్య = మేలైన, అర్థిన్ = శ్రద్ధతో.
- ↑ శ్యేనకపోతంబులు = డేగలు పావురములు.
- ↑ సర్పాశనుఁడు = పాములను భక్షించువాఁడు, తార్క్ష్యుఁడు = గరుత్మంతుఁడు, వనరుహనాభునకున్ = విష్ణువునకు.
- ↑ విషోల్బణయుతులై = విషముయొక్క పొంగుటతో కూడుకొన్నవారై.
- ↑ వేవురు =వేగురు - వేయిమంది, సుపర్ణునికిన్ = గరుత్మంతునికి, దృక్కర్ణపతులు = సర్పరాజులు.
- ↑ శాంతినిధి = ఓర్పునకు స్థాన మైనవాఁడు, ప్రకల్పితము = కల్పించఁబడినది, ఇంతయు = ఈసమస్తమును, సర్గంబు = సృష్టి.
- ↑ దారుణవజ్రధారచే = భయంకరమైన వజ్రాయుధముయొక్క వాదరిచేత, మదమఱి = క్రొవ్వు చెడి, సమాజము = సమూహము, నష్టపుత్ర = నశించినకొడుకులు గలది, విహ్వలించన్ = దుఃఖపరవశము కాఁగా, ఇమ్ములన్ = బాగుగా, సపత్నులు = సవతులు.
- ↑ నయంబునన్ = తిన్ననినడవడిచేత, ప్రీతస్వాంతుండు = ప్రీతినొందిన మనసుగలవాఁడు.
- ↑ అంగశుద్ధి = అవయవముల పరిశుద్ధత గలది, అంతరించున్ = నశించును.
- ↑ ఉత్పలదళలోచన = నల్లగలువఱేకలవంటికన్నులు గలది - దితి.
- ↑ వేడుక = కుతూహలము - ప్రియము, మిథ్యావినయంబులు = అబద్ధపువినయములను, కపటశీలము = వంచనతోగూడిన మంచినడవడి.
- ↑ వికీర్ణశిరోజ = విరియఁబోసికొన్నవెండ్రుకలు గలది, మారోదీ ర్మారోదీః = ఏడువ కేడువకుము, సప్తఖండంబులు = ఏడుతునియలు, ఏకోనపంచాశత్ఖండంబులు = నలువదితొమ్మిదితునియలు.
- ↑ వైన్యుఁడు = వేనునికొడుకు, వనజాసనుఁడు = బ్రహ్మ.
- ↑ వైశ్రవణుండు = కుబేరుఁడు, వాసవుండు = ఇంద్రుఁడు, వనస్పతులకున్ = వృక్షములకు.
- ↑ పంకజాతభవాండము = బ్రహ్మాండము, సరిత్సాగరపర్వతములు = ఏళ్లు సముద్రములు కొండలు.
- ↑ గ్రథితములు = కూర్పఁబడినవి - రచితములు.
- ↑ శుంభద్విక్రమవిక్రమార్క = అప్రతిహతమైన పరాక్రమముచేత విక్రమార్కుఁడా, సుజనస్తోత్రైకసంపర్క = సజ్జనులయొక్క పొగడ్తయొక్కటిచేతనే కూడుకొన్నవాఁడా, సంస్తంభీభూతరిపుప్రతాప = నిలువఁబడిపోయిన వైనశత్రువులప్రతాపము గలవాఁడా, మృదువాచాచారసల్లాప = మెత్తని మాటలతోడి సంభాషణము గలవాఁడా, దుగ్ధాంభోరాశిమహాగభీర = పాలసముద్రమువంటి అధికగాంభీర్యగుణము గలచాఁడా, విజయవ్యాపారదోస్పార = గెలుచుటయే వ్యాపారముగాఁ గలభుజబలము గలవాఁడా, నిర్దంభానేకశుభప్ర యోజన = దంభము లేని పెక్కుశుభప్రయోజనములు గలవాఁడా, జగద్రమ్యార్థసంయోజనా = లోకమునకు ఇంపైనప్రయోజనములను కూర్చువాఁడా.
- ↑ సుకవి...సంశ్రవణ = సత్కవులచేత కూర్పఁబడిన వాక్కులచేనైన యెల్లపురాణములయొక్కయు వినికి గలవాఁడా, సురేంద్ర...పరాక్రమ = ఇంద్రపుత్రుఁడైన యర్జునునితోడను కుమారస్వామితోడను సరిపోల్పఁదగిన ప్రసిద్ధమైన పరాక్రమముకలవాఁడా, వివేకభాషాచతురా = వివేకయుక్తములైన మాటలయందు నిపుణుఁడైనవాఁడా.
- ↑ గర్వి... లవిత్రా = గర్వించిన శత్రువులనెడు తీఁగలపఙ్క్తులకు కొడవలియైనవాఁడా, పూర్వ...చరిత్రా = తొల్లిటిరాజులను పోలిన పురాతనప్రవర్తనము కలవాఁడా, నిర్వి...సుగాత్రా = వికారరహితమై మనోజ్ఞమైన మంచిశరీరము గలవాఁడా, గిర్వి...కళత్రా = సరస్వతియొక్క విలాసమువలె ధావళ్యము కలిగి వెలుఁగునట్టి కీర్తియను భార్యను గలవాఁడా.