Jump to content

ఆంధ్ర వీరులు/కృష్ణదేవరాయలు

వికీసోర్స్ నుండి

కృష్ణదేవరాయలు.

మహా శూరశిఖామణియు ఆంధ్రభాషాప్రియుడు నగు శ్రీకృష్ణదేవరాయల దివ్యనామము నెఱుంగని యాంధ్రుడుండడు. ఈ రాజతిలకుని జీవితచరిత్రము చెప్పుటకు ముందు విద్యానగర సామ్రాజ్య చరిత్ర మించుక చెప్పవలసియున్నది.

ప్రతాపరుద్రదేవుడు బంధీకృతుడైనంతన సేనానాయకు లెవరిత్రోవను వారేగి చిన్నచిన్న రాజ్యములను స్థాపించిరి. ఆంధ్రనగరమున సుగంధ భాండాగారాధ్యక్షులుగా నున్న హరిహరరాయలు, బుక్కరాయలు, మాధవ మంత్రితో గలిసి యానెగొంది ప్రాంతములకు జనుదెంచిరి. శైలములమధ్య సురక్షితముగానున్న యొక ప్రదేశమునందు శా.శ. 1648 ధాతసంవత్సర వైశాఖశుద్ధ పంచమి (క్రీ.శ.1136) నాడు మాధవమంత్రి విద్యానగరమను పట్టణరాజమును నిర్మించి హరిహరరాయల బ్రభువుగను బుక్కరాయల యువరాజుగ నొనరించెను. నగరముచుట్టును ఏడు ప్రాకారములు నెలకొల్పబడెను. మాధవమంత్రి సన్యసించి మాధవ విద్యారణ్యు లను నామముతో శృంగేరి పీఠమున కధ్యక్షుడయ్యెను. క్రమక్రమముగా విద్యానగరరాజ్యము మిగులవృద్ధిలోనికి వచ్చి సుప్రసిద్ధమై యరిజనాభేధ్యమై యొప్పెను.
హరిహరరాయల, బుక్కరాయల యనంతరమున విద్యానగరరాజ్యమును రెండవహరిహరరాయలు, దేవరాయలు(రెండవ) దేవరాయలు, మల్లికార్జునరాయలు, విరూపాక్ష రాయలు, (రెండవ) విరూపాక్షరాయలు పరిపాలించుచు వచ్చిరి. రెండవ విరూపాక్షరాయలు పరిపాలనమునం దనసమర్థుడును భోగలాలసుడు నగుటచే బ్రజ లీతని ద్వేషించిరి. ఏతద్రాజ్య దండనాథు:డగు సాళ్వనరసింహరాయ లీపరిస్థితులు గమనించి రాజును వెడలనడచి తానె విద్యానగరసంస్థాన ప్రభువై చిరకాలము పాలించెను. అతని యనంతరమున నిరువురు కుమారు లొకరివెంట నొకరు రాజ్యమునకువచ్చి యకాల మరణమొందిరి. తరువాత విద్యానగర సామ్రాజ్యమునకు తుళువనరసరాజు పరిపాలకుడయ్యెను.

నరసరాజు తరువాత నతనికుమారుడు వీరనరసింహరాయలు కొంతకాలము విద్యానగరసంస్థానము పాలించి మరణించెను. అనంతరము శ్రీకృష్ణదేవరాయలవారు (క్రీ.శ. 1509 ఫిబ్రవరి 4 వ తేది) విద్యానగర సామ్రాజ్యమునకు పట్టాభిషిక్తుడయ్యెను. రాయలవద్ద తండ్రియగు నరసరాజుకాలమునుండి సుప్రసిద్ధుడై యున్న సాళువతిమ్మరసు మంత్రిగ నుండెను. తిమ్మరసు వయసున బెద్దవాడును దనకు విద్యాగురువును రాజకీయ రహస్యవేత్తయు నగుటచే కృష్ణదేవరాయ లాయనయెడల మిగుల గౌరవబుద్ధిగలవాడై అప్పాజి యని పిలుచువాడు. రాయలు రాజ్యమునకు వచ్చినపిదప విద్యానగర సామ్రాజ్యమును కృష్ణదేవరాయలు తన యసాధారణ ప్రజ్ఞాతిశయముచే మిగుల విస్తర మొనరించెను. వీర నరసింహరాయలు విద్యానగరసామ్రాజ్యమును బాలించుకాలముననె కృష్ణదేవరాయలు పన్నులొసంగక తిరుగబడిన సామంతుల లో గొనుటకు దండయాత్రకు బయలు దేరి కర్ణాటకదేశమందలి ఉమ్మత్తూరు దుర్గమును మూడు మాసములు ముట్టడించి జయించెను. తరువాత కావేరితీరమున నున్న సుప్రసిద్ధమగు శివసముద్ర దుర్గమును ముట్టడించి జయించెను. శ్రీరంగపట్టణమును జయించి తన ప్రతినిధి నచట నిలిపి కృష్ణదేవరాయ లనతికాలములో విద్యానగరమునకు జేరెను. రాయల పరాక్రమజీవితము సుప్రసిద్ధ మగుటచే బూర్వసామంతులలో జాలమంది యెప్పటివలె గప్పము లొసంగుచుండిరి. కొందఱు బాలుడగు కృష్ణదేవరాయలను బాటింపక సుంకమునీయ మానికొనిరి. అందులకై యపరిమిత సైన్యముతో విజయయాత్రలకేగి దేశమునంతయు స్వాధీనపఱచికొన వలయునని సంకల్పించెను. ఈ సంకల్పమునకు దిమ్మరుసు మంత్రి పెక్కుభంగుల బ్రోత్సాహము గావించి నిజబలమును గోశాగారమును నభివృద్ధిపరచెను.

రాయలభార్యలలో జిన్నాదేవియు దిరుమలదేవియు సుప్రసిద్ధురాండ్రు. చిన్నమదేవి యేరాజపుత్రియో స్పష్టము గా దెలియదు. రాయల కీమెయెడల ననురాగము మెండు. ఈమెపేరనాగాలాపురమను నొక పేట గట్టించి మనోహరమగునొక రాజవీధినందు నెలకొల్పెను. వివిధములగు సందు లా వీధిలో బెట్టించెను. ఆవీథులందలి యంగడుల సుంకము సంవత్సరమునకు నలువదిరెండువేల వరహాలను మించియున్నదని చరిత్రకారులు చెప్పుచున్నారు. శ్రీరంగపట్టణాధీశుడగు వీరశ్యామరాయల పుత్రికారత్నమగు తిరుమలదేవి రాయల రెండవ భార్య. ఈయమ రాయల కనుకూలవతియు బ్రేమాస్పదయు నై యుండెను.

కృష్ణదేవరాయలు సామ్రాజ్యమునకు వచ్చినది మొదలు అభివృద్ధిమార్గముల నన్వేషించుచు జుట్టుప్రక్కల బలవంతులై యున్న యవనులను బరాభూతుల జేయ యత్నించుచుండెను. సామంతప్రభువులు ప్రతిసంవత్సరము సుంకమునొసంగుటె గాక యవసరమైనపుడు కొంతసైన్యము నొసంగునటుల గట్టడిగావించెను. తనస్వాధీనములోనికి గ్రొత్తగావచ్చిన దుర్గములకు నధికారుల నియోగించి వారిచే సైనికబలమును అభివృద్ధి చేయించుటయేగాక తానుగూడ ధనము విరివిగా వెచ్చబెట్టి ఆశ్వికబలమును గజబలమును పదాతిసైన్యమును మిక్కిలి యభివృద్ధిలోనికి దెచ్చి బొక్కసము ధనముతో నింపివేసెను. ఆకాలమున రాయల సైన్యము అసంఖ్యాకము అపరిమితముగ నుంటచే సాటి రాజులందఱును అరజేతిలో బ్రాణములుంచుకొని సింహము వలె విజయనగరప్రభువు తమపై నెపుడుపడునో యనిభయపడుచుండిరి. అన్నిచోటుల గలిసి విద్యానగరసామ్రాజ్య సైన్యము పదిలక్షలకు మించియుండెను. ఈసైన్యములో గొంతయు, ముప్పది యాఱువేలమంది యాశ్వికులు, ఏడెనిమిది వందల మంది గఝసైన్యపాలరులు విద్యానగరమును నిరంతరము గాచుచుండిరి. ప్రతిరాజ్యమునందలి రహస్యముల గుర్తుంఛి వచ్చుటకు నేర్పరులగు చారులు నియోగింపబడిరి.

కృష్ణదేవరాయలు రాజ్యమునకు వచ్చిన క్రొత్తలో గొంతకాలము విద్యావినోదములతో గడుపుచుండెను. ఆయన స్వయముగ గర్ణాటాంధ్ర సంస్కృతాది భాషలలో బండితుడును గవియు నగుటచే నాయాభాషలలో సుప్రసిద్ధులగు పండితుల గౌరవించి వారిచే గ్రంథముల రచింపజేసి సారస్వత మాధుర్యము చవి జూచుచుండెను. రాయల కభిమానభాష ఆంధ్రము. ఆంధ్రభాషలో గవితచెప్పు సుప్రసిద్ధకవుల నందఱను బిలువనంపి సత్కరించుటయే గాక తన యాస్థానము నందు అల్లసానిపెద్దన్న, ముక్కుతిమ్మన్న, మాదయగారి మల్లన, తెనాలి రామలింగకవి, ధూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, భట్టుమూర్తి, పింగళిసూరన యను కవులను అష్టదిగ్గజము లను పేరుతో నుంచుకొని వారిచే జిత్రవిచిత్ర కావ్యములు రచింప జేసి సంతోషముగ గాలము గడపుచుండెను. ఇంతలో--------మత్యుడుగాక సామ్రాజ్య క్షేమము నకు బాటుపడుచు దిమ్మరుసుమంత్రి యనుజ్ఞచొప్పున సైనికబలమును వృద్ధిచేసి తిరుగబడిన రాజుల వృత్తాంతములు చారులముఖమున గుర్తెఱింగి దండయాత్రలకు బలము సిద్ధ పఱచుచుండెను. ద్రవిడదేశము నంతటికి మువ్వురు ప్రతినిధులు నియమింపబడిరి. వారు సామంతులనుండి మూడుకోట్ల ద్రవ్యము సంవత్సరమునకు బ్రోగుచేసి పంపుచుండిరి.

ఇట్లు కృష్ణదేవరాయలు రెండు సంవత్సరములు రాజధానియం దుండి సైనికబలమును మిగుల నభివృద్ధిపఱచి దేశ పరిస్థితులు విశాలదృష్టితో నొక్కమాఱు పరికించెను. మహమ్మదీయ రాజ్యములు చీలికలుగ జీలి వానిలో వానికైకమత్యము లేకుండెను. వీనివలన మనకింతలో నపాయము కలుగదని నిశ్చయించెను. గజపతులు ఓడ్రదేశమునుండి బయలువెడలి కృష్ణా గోదావరుల దాటి బలవంతములగు దుర్గముల నాక్రమించికొనిరి. కొండవీటిదుర్గము, ఉదయగిరిదుర్గము, కనకగిరిదుర్గము గజపతుల స్వాధీనమునం దుండెను. అటు ద్రవిడ దేశమును ఉదయగిరియందుండియు, నిటుకర్ణాట దేశమును గొండవీటి నుండియు రెంటిక్షి నుమోడియు పకయున్న పశ్చిమాంధ్రదేశమును (నిజామురాష్ట్రమును) గొండవీటి దుర్గమునందుండియు జయించుటకు గజపతులు యత్నించుచుండిరి. కటకముమొదలు గోదావరి వఱకు గల దేశమంతయు గజపతులు ముందె యాక్రమించుకొనిరి. గజపతుల నిర్మింపకున్న నెప్పటికేని విద్యానగరసామ్రా జ్యమున కపాయము వాటిల్లునని రాయ లూహించి తొలుత కొండవీటిని ముట్టడింప సంకల్పించెను. తిమ్మరుసుమంత్రి దూరము యోజించి గజపతులబలమంతయు ఉదయగిరియందున్నదిగాన నాదుర్గమునె తొలుత లోగొనవలయునని చెప్పెను. కృష్ణరాయ లియ్యకొని సంగర సన్నధము చేయ నజ్ఞాపించెను. గోవిందామాత్యునికి లక్షసైన్యమును స్వాధీనముచేసి విద్యానగరమును జాకరూకతో గాచియుండ గట్టడి జేసి, యొక శుభముహూర్తమున నాస్థానవిద్వాంసులతో నంత:పురజనముతో ససంఖ్యాకసైనిక సమూహముతో పూర్వదిగ్జైత యాత్రకు కృష్ణదేవరాయలు బయలుదేరెను.

క్షత్రియవంశభూషణులగు శ్రీరంగరాజు, నారపరాజ ఇమ్మరాజును, బ్రాహ్మణవీరుడగు రాయసము కొండమరుసున, కమ్మనాయకుడగు పెమ్మసాని లింగన్నను, వెలమవీరుడగు వెలుగోటి కుమారతిమ్మనాయకుని, పంట రెడ్డియగు గంగాధర రెడ్డిని సేనానాయకుల గావించి ఒక్కొక్కరి యధీనమున ముప్పదివేల కాల్బలము, నాలుగు గుఱ్ఱపుదళములు, ఇన్నూరు మదపుటేనుగులు నుంచి, తిమ్మరుసుమంత్రి యుచితవిధు లందఱకు నివేదించెను. సైనికబలము నలుగెలంకుల నడచుచుండ రాయలు మహోన్నత గజరాజమునెక్కి బ్రాహ్మణులస్వస్తి వాచకముల, కవుల రణగీతముల నాలించుచు బ్రాగ్దిశాభిముఖుడై బయలుదేరి యచిరకాలమున కుదయగిరి జేరెను. కృష్ణదేవరాయలు తనదుర్గముమీదికి వచ్చెనని యుదయగిరి పాలకుడగు తిరుమలకాంతరాయడు విని వెఱగంది చేయునదిలేక యావర్తమానము ప్రతాపరుద్రగజపతికి దెలియ జేయ జారులనంపి పదివేల సైనికులను నాలుగువందలమంది యాశ్వికులను దుర్గమున జేర్చుకొని జాగరూకతతో సంరక్షించుచుండెను. తిమ్మరుసు రాయలును సైన్యమును బురికొల్పి యుదయగిరి దుర్గమును ముట్టడించిరి. కోటలోనున్నవీరులు గుహలోనున్న సింగములవలె బట్టుదల వదలక రాయల సైన్యముతో నిలుకడగ బోరాడుచుండిరి. దుర్గములోని కాహార పదార్థములు పోకుండ నరిగట్టినచో విరోధులు సులభముగా లోబడుదురని రాయలసైనికులు దుర్గద్వారములన్నియు దెఱువవీలుగానివిధమున గండశిలలతోమూసిరి. ఉదయగిరి దుర్గదుస్థ్సితి విన్నంతనే ప్రతాపరుద్రగజపతి లక్షసైనికులను కటకమునుండి తిరుమలకాంత రాయలకు దోడ్పడి ఉదయగిరి కాపాడుటకు బంపెను. ఈవార్త చారులవలన తిమ్మరుసుమంత్రి విని నాయసము కొండమరుసయ్యను కొంతసైన్యమును ఉదయగిరి జయించుటకు గృష్ణదేవరాయల యధీనమునందుంచి తాను వచ్చుచున్న సైన్యమునకు నెదురుగా సైన్యసహితుడై యేగెను. ఉభయదళములకు భయంకర సంగరము మార్గమధ్యమునందె జరిగెను. తిమ్మరుసు మంత్రి యీసంగరమున మగ్నుడై యుంట గమనించి కృష్ణదేవరాయలు విద్యానగరమునుండి కొంతసైన్యము వచ్చుట కాజ్ఞా పించి పదునెనిమిదిమాసము లేకధాటిగ నుదయగిరిని ముట్టడించెను. ఆహారాదులు తగ్గుటచేతను బలము నశించుటచేతను ఉదయగిరి దుర్గము రాయలకు సాధ్యమయ్యెను. వెంటనే సేనాధీశ్వరులు దుర్గమును బగులగొట్టిరి. కృష్ణదేవరాయలు పరిజనముతో దుర్గమున కేగి సేనాదికమును వశపఱచుకొని దుర్గపాలకుడగు తిరుమలకాంతరాయల జెఱగొని రాయసము కొండమరుసయ్యను ఉదయగిరి రాజ్యమునకు బ్రతినిధిగా నియోగించి హతశేషమగు బలముతో తిమ్మరుసుమంత్రికి సహాయము బోయెను. ఇంతలో విద్యానగరమునుండి క్రొత్తసైన్యమువచ్చి రాయల సైన్యముతో గలిసెను. కృష్ణదేవరాయలు తిమ్మరుసు మంత్రియు రెండుసంవత్సరములు గజపతి సైన్యముతో బోరాడి విజయము గడించి యంతతో దృప్తినొందక గజపతుల బలమున కాయువుపట్టుగానున్న కొండవీటిదుర్గమును బట్టుకొనుటకు బయలుదేరిరి.

ప్రతాపరుద్రగజపతి కుమారుడగు వీరభద్రగజపతి కొండవీటి దుర్గమును బాలించుచుండెను. అద్దంకి, వినుకొండ, బెల్లముకొండ, నాగార్జునకొండ, తంగెడ, కేతవరము దుర్గము లీకొండవీటి దుర్గముక్రిందవె. ఉదయగిరిదుర్గము కృష్ణదేవరాయలు జయించిన వార్తవిని వీరభద్రగజపతి తన బలము నంతయు సమకూర్చి రాయలసైన్యము నెదిరింప దలపడెను. రెండు పక్షముల వారికి భయంకర సమరము జరిగెను. గజ పతుల సైన్యము చాలవఱకు నష్టపడెను. బయటనున్న బ్రాణములు దక్కవని వీరభద్ర గజపతి, వీరభద్రపాత్రుడు, రాచూరి మల్లాఖానుడు, ఉద్దండఖానుడు, రాచిరాజు శ్రీనాథరాజు, లక్ష్మీపతిరాజు, జన్యామలక సవాపాత్రుడు, బాలచంద్రమహాపాత్రుడు మున్నగు వీరులందఱు కొండవీటి దుర్గమునజేరి తలదాచుకొనిరి. బహిరంగస్థలమున నున్న గజపతిసైన్యమును దరుముకొనుచు శ్రీకృష్ణదేవరాయలు అద్దంకి, వినుకొండ, బెల్లముకొండ, నాగార్జునకొండ, తంగెడ, కేతవరము లోనగు దుర్గములన్నిటిని స్వాధీనపఱచికొనెను.

క్రీ.శ. 1515 సంవత్సరము మార్చినెలలో తిమ్మరుసు మంత్రి కొండవీటిదుర్గమును ముట్టడించెను. ఈవార్త ప్రతాపరుద్రగజపతి విని కొండవీటిదుర్గమును రక్షింపనెంచి మూడు వందల యేనుగులతోడను ఇరువదివేల యాశ్వికబలముతోను ఐదులక్షల కాల్బలము తోడను బయలుదేరెను. ఈ వార్త కృష్ణదేవరాయలు విని తిమ్మరుసుమంత్రిని గొండవీటిని ముట్టడించుటకు గొంతబలముతో విడిచిపెట్టి తాను సైన్యసహితుడై గజపతి సైన్యము నెదిరించుటకు గృష్ణదాటి మేడూరు వద్ద కేగెను. ప్రతాపరుద్ర గజపతి సైన్యమునకు శ్రీకృష్ణదేవరాయల సైన్యమునకు భయంకరసమరము కొంతకాల మెడతెగక జరిగెను. దురదృష్టశాలియగు గజపతియొక్క సైన్యము నశించెను. విఫలమనోరథుడై కొండవీటిపై నాశవిడిచి ప్రాణము
గాని తనవిజయము సర్వంకషము గాదని తలంచి కృష్ణాతరంగిణి గోదావరిదాటి పరిజనముతో దండయాత్రకు బయలువెడలెను. కృష్ణదాటినదిమొదలు గజపతిసైన్యము ప్రతిగ్రామమునందును దనబలము నెదిరించుచునే వచ్చెను. ఇంతలో విద్యానగరమునుండి వచ్చిన నూతనబలము గలిసికొనెను. తనబల మంతయు నష్టమగుటచే గజపతి ప్రతిఘటించి లాభములేదని కుటుంబముతో గొండగుహలలో దలదాచుకొన బాఱిపోయెను. గౌతమిదాటి రాజమహేంద్రవర దుర్గమును జయించి యచట తనప్రతినిధి నుంచి మన్నెపు సంస్థానములను రాజమహేంద్రవరము నాక్రమించుకొని రహితాపురము లోనగు మన్నెసంస్థానములను రాయలు జయించెను. తరువాత బాహుబలేంద్రుని వంశజులకు ----ధానియగు పొట్నూరు జయించి యచట మిగుల నున్నతమగు జయస్తంభము నాటించెను. మాడుగుల వడ్డాదిని గూడ జయించి రాయలు పరిజనముతో గొంతకాలము సింహాచలమున విశ్రమించి నృసింహస్వామికిబెక్కుదానములు గావించి శాసనముల స్థాపించెను. అనేకామూల్యాభరణములు సమర్పించి నిత్యనైవేద్య భోగాదికములకు గొన్ని వృత్తులొసంగి దృష్టి ముందునకు బఱపెను. కటకము ప్రాంతములందు సాత్రవంశజులు బలవంతులై యుండిరని రాయలు గ్రహించి సైన్యమలసియున్నను, రణయత్నము ఇప్పటికి మానుదమని తిమ్మరుసు మంత్రి వారించుచున్నను, లెక్కసేయక లతో బయటబడిన నంతియచాలునని గజపతి హతశేషమగు సైన్యముతో వెనుక కేగెను. కృష్ణదేవరాయలు వెనుకకు మఱలి కొండవీటికి జేరెను. అంతకుమున్నె తిమ్మరుసుమంత్రి రెండుమాసములపైగా గొంటవీటి దుర్గమును ముట్టడించి క్రీ.శ.1515 సంవత్సరము జూను 23 వ తేదీని కొండవీటి దుర్గమును స్వాధీనముగావించుకొని యసమాన విజయమునొంది వీరభద్రగజపతిని జీవగ్రాహిగ జేకొనెను. పలువురు వీరులుకూడ బట్టువడిరి. కృష్ణరాయలు తిమ్మరుసు కొండవీటిని జయించినటు లొకశాసనమును స్థాపించి కొండపల్లిని జయించుటకు బయనమయ్యెను. ఆకాలమున బ్రహరేశ్వర పాత్రాదులు కొండపల్లిదుర్గమును బాలించుచుండిరి. కొండపల్లిని రాయలు మూడుమాసములు భయంకర సన్నాహముతో ముట్టడించి ప్రతాపరుద్రగజపతి భార్యలలో నొక్కతెను బెక్కుమంది సేనానాయకులను జీవగ్రాహలుగ జేకొని కొండపల్లి దుర్గమును స్వాధీనపఱచికొనెను. తరువాత అనంతగిరి, కంబముమెట్టు, ఊరుగొండ మున్నగు దుర్గములను జయించి తనప్రతినిధుల నందందుంచి కొండవీటికి జేరెను. కొండవీటిలో గొంతకాలము విశ్రమించి తిమ్మరుసుమంత్రి --------- నాదెండ్ల అప్పామాత్యుని ప్రతినిధిగనుంచి తాను బందిగొన్న వీరుల నందఱను విద్యానగరమునకు బంపెను.

విద్యానగరము నుండి కొంతసైన్యము వచ్చునటులనేర్పాటుచేసి కృష్ణదేవరాయలు గజపతుల రాజ్యమును హరించిన గాని తనవిజయము సర్వంకషము గాదని తలంచి కృష్ణాతరంగిణి గోదావరిదాటి పరిజనముతో దండయాత్రకు బయలువెడలెను. కృష్ణదాటినదిమొదలు గజపతిసైన్యము ప్రతిగ్రామమునందును దనబలము నెదిరించుచునే వచ్చెను. ఇంతలో విద్యానగరమునుండి వచ్చిన నూతనబలము గలిసికొనెను. తనబల మంతయు నష్టమగుటచే గజపతి ప్రతిఘటించి లాభములేదని కుటుంబముతో గొండగుహలలో దలదాచుకొన బాఱిపోయెను. గౌతమిదాటి రాజమహేంద్రవర దుర్గమును జయించి యచట తనప్రతినిధి నుంచి మన్నెపు సంస్థానములను రాజమహేంద్రవరము నాక్రమించుకొని రహితాపురము లోనగు మన్నెసంస్థానములను రాయలు జయించెను. తరువాత బాహుబలేంద్రుని వంశజులకు ----ధానియగు పొట్నూరు జయించి యచట మిగుల నున్నతమగు జయస్తంభము నాటించెను. మాడుగుల వడ్డాదిని గూడ జయించి రాయలు పరిజనముతో గొంతకాలము సింహాచలమున విశ్రమించి నృసింహస్వామికిబెక్కుదానములు గావించి శాసనముల స్థాపించెను. అనేకామూల్యాభరణములు సమర్పించి నిత్యనైవేద్య భోగాదికములకు గొన్ని వృత్తులొసంగి దృష్టి ముందునకు బఱపెను. కటకము ప్రాంతములందు సాత్రవంశజులు బలవంతులై యుండిరని రాయలు గ్రహించి సైన్యమలసియున్నను, రణయత్నము ఇప్పటికి మానుదమని తిమ్మరుసుమంత్రి వారించుచున్నను, లెక్కసేయక అఃహోరాత్రము లరణ్యములలో గొండలలో సైన్యమును నడిపించి కటకమునకు బ్రయాణమయ్యెను. త్రోవలో గలిగిన కష్టనష్టములను బాటిసేయక నిరుత్సాహపడక కృష్ణదేవరాయలు కొన్నిదినములకు కటక సమీపమునకు జేరి తనరాక తెలియునటుల విజయభేరిని మ్రోగింపజేసెను. కృష్ణదేవరాయలు కటకమునకు జేరకమున్నె ప్రతాపరుద్రగజపతి కటకము జేరెను.

కటకపరిసర భాగములను ప్రతాపరుద్రగజపతియాజ్ఞావర్తులు పాత్రసామంతరాజులు అపరిమిత బలవంతులై పదియాఱుమంది పరిపాలించుచుండిరి. రాయలు తమదుర్గము పైకి దండయాత్రకు వచ్చినవార్త విని పాత్రసామంతు లెదిరింప నుత్సాహపడి ప్రతాపరుద్రగజపతి సంగరానుజ్ఞ వేడిరి. దూరదృష్టిలేని గజపతి చేయునది లేక వేల తన సైన్యమునకు సంగరానుజ్ఞ నొసంగెను. పాత్రసామంతులందఱు తమతమ స్వాధీనమునందున్న బలము నంతయు సమకూర్చుకొని రాయల సైన్యము మీదికి సంగరమునకు దలపడిరి. మన్నెములలో నెడతెగక ప్రయాణములు గావించుట చేతను ననారోగ్య ప్రదేశ నివాసవశమునను రాయల సైన్యము చాల నీరసస్థితిలో నుండెను. పలువురు సైనికులు పాత్రసామంతుల సైనికులచేత వధింపబడిరి. కృష్ణదేవరాయల సైన్యమే దండయాత్రయందును యింతవఱకు జెందని వినాసము నాడు చెందెను. రాయ లీ పరిస్థితులు గమనించి, కర్తవ్యము తోచక విజయము నొందుటకు జతురుపాయములలో నేదేని యవలంబించుట యుక్తమని కర్తవ్య నిర్ణయమునకుం దనకాప్తుడగు తిమ్మరుసు మంత్రిని గోరెను. పరిస్థితులన్నియు నెఱిగిన మహాయోధుడగు తిమ్మరుసుమంత్రికి గటకసామంతులను జయించుటకు సరియగు నుపాయ మేదియు గోచరింప దయ్యెను. భేదోపాయము దప్ప విరోధులను సాధించుటకు వేఱొక యుపాయము లేదని తిమ్మరుసుమంత్రి నిశ్చయించి వెరవూహించెను.

కటకరాజగు ప్రతాపరుద్రగజపతిరాజ్యమునకు బ్రతి నిధులుగనుండి బలభద్రపాత్రుడు, దుర్గాపాత్రుడు, భీమపాత్రుడు, ముకుందపాత్రుడు, భీకరపాత్రుడు, బేరుపాత్రుడు, రణరంగపాత్రుడు, ఖడ్గపాత్రుడు, అఖండలపాత్రుడు, మురారిపాత్రుడు, వజ్రముష్టిపాత్రుడు, తురంగ రేవంత పాత్రుదు, గజాంకుశపాత్రుడు, అసహాయపాత్రుడు, మృగేంద్రనోద్యుడు, విజయపాత్రుడు అనువారు ఓడ్రదేశమును పరిపాలించుచుండిరి. వీరందఱు ప్రతాప రుద్రగజపతి -------- సంగరమునకు దలపడిరి. కృష్ణరాయల సైన్యముకంటె బాత్రుల యధీనమందున్న సైన్యమె యెక్కుడుగ నుండెను. పైగ దన సైన్యము నిరాధారమగు బహిరంగ ప్రదేశమున నిలిచి పోరాడుటయు నపాయకరము. వెనుకకు మరలిన బరాక్రమమునకు లోపము. ఈ స్థితిగతులలో దిమ్మరుసుమంత్రి రాయలయనుజ్ఞ గొని పదియాఱు బంగారుపెట్టెల జేయించి యందు దివ్యాభరణములు ఒక్కొక్కలేఖయుంచి తనభటుల కొసంగి యొక్కొక్కటి పాత్ర సామంతులకు వేఱువేఱ బంపించెను. కృష్ణరాయలకు బాత్ర సామంతులకు వేగు నడువకుండగాచియుండు గూడాచారు లాభటులను బంధించి ప్రతాపరుద్రగజపతి కప్పగించిరి. రాజాభటుల యొద్దనున్న పెట్టెల బరిశీలింప నం దన్నిటిలో నమూల్యాభరణములు ఒక్కొక్కరహస్యలేఖయు గనవచ్చెను. ప్రతి లేఖయందును.

"మిత్రమా! మీరు గావించిన నిబంధనలు మా కంగీకారములు. గజపతిని బట్టియిచ్చిన మీకందఱకు మనకట్టడిప్రకారము నగరములు ధనము నొసంగుటకు నొడంబడితిని. నాయంగీకారము తెలుపుచు బంపిన యాసత్కారమును బరిగ్రహింపుడు" అనివ్రాయబడి క్రింద కృష్ణదేవరాయలసంతకముండేను. గజపతిలేఖలజూచి పాత్ర సామంతులందఱు కృష్ణరాయలకులోబడిరనియు దాను ప్రతిఘటించి లాభములేదనియు దలంచి రహస్య ప్రదేశమునడాగి భవిష్యత్కర్తవ్యమునుగూర్చి యోచించుచుండెను. పాత్రసామంతులందఱు "పరిమితసైన్యముతో రణరంగమునకు జేరినను గజపతి మూలబలముతో సహాయము రాడయ్యెను. రాయల సైన్యము సంగరమునకు సర్వసిద్ధముగానుండెను. "గజపతి సంధి కంగీకరించెనో, వెఱచి సంగరమె మానెనో "యని తమలో దామనుకొని యుద్ధయత్నములుమాని యెవరిత్రోవను వారేగిరి. గజపతి యీమోసమును గ్రహింపజాలక యెటులేని సంధి గావించుకొనినచో కృష్ణరాయలముందు నిలుచుట కష్టమని తిమ్మరుసు చెంతకు రాయలయొద్దకు రాయబారినంపి సంధికియ్యకొన బ్రార్థించెను. రాయలు మిక్కిలి సంతోషించి యియ్యకొనెను. తిమ్మరుసుమంత్రి గజపతియొద్దకు బరిజనముతో డేగి గజపతి విద్యానగరసామ్రాజ్యమునకు సామంతుడై యుండునట్లును, ఆతనిపుత్రియగు తుక్కాంబను (ఈమెను అన్నపూర్ణాదేవి యందురు) రాయలకొసంగునట్లును, గట్టుదిట్టములు గావించెను. కృష్ణరాయలు తుక్కాంబను పెండ్లాడి ఓడ్రరాజ్యమును యథావిధముగ బ్రతాపరుద్రగజపతి కధీనము గావించి క్రీ.శ.1516 లో బూర్వదిగ్విజయ యాత్రను ముగించి గృహాభిముఖుడయ్యెను. కృష్ణరాయ లొనరించినది న్యాయబుద్ధితో జూచిన మోసమైనను రాజనీతిప్రకారము యోచించిన దోషముగాదు. చతురుపాయములతో నిది భేదోపాయము. ఏపాప మెఱుగని పాత్రసామంతులను మన్నించి బలవంతుడగు గజపతి కెప్పటియట్ల పూర్వరాజ్యమునొసంగి బంధితుల విడిపించి రాయలు జయము తన దనిపించుకొనెను. చిరకాలము పరస్పర ద్వేషములు లేకుండ నుభయరాజ్యము లభివృద్ధి నొందుటకుగాను దుక్కాంబికను బరిగ్రహించెను. కాన రాయలు గావించిన భేదోపాయము రాజ్యధర్మము. సామ్రాజ్య శుభదాయకము. ఉభయపక్షములకు క్షేమకరమనక తప్పదు. విజయలక్ష్మి ద్వితీయుడై కృష్ణదేవరాయలు సింహాచలము, రాజమహేంద్రవరము, శ్రీకాకుళము, విజయవాడ, మంగళగిరి, మున్నగు క్షేత్రముల సందర్శించుచు బౌరులవలన సత్కృతులను బడయుచు, సుఖముగా గొంతకాలమునకు విద్యానగరసామ్రాజ్యమునకు జేరెను.

కృష్ణదేవరాయలు దాదాపుగనైదు సంవత్సరములు కవితారచనము విద్యాగోష్టులతో గాలముగడపెను. వినాశనమైన సైన్యము నభివృద్ధిపరచెను. దుర్గమును బాగుచేయించెను. పోర్చుగీసువారిసహాయముచే మరఫిరంగులు చేయించి దుర్గములందు నెలకొలిపించెను. కృష్ణదేవరాయలు గావించిన భాషాసేవయందు జాలభాగ మీకాలమున జరిగినటుల విశ్వసింపవచ్చును. క్ర్ష్ణదేవరాయలు బాలుడైయుండ రాయచూరు దుర్గమును మహమ్మదీయులు గైకొనిరి. రాయచూరు కృష్ణా తుంగభద్రానదుల మధ్యనున్న దృడతరమగు దుర్గరాజము. దాని నాదిల్‌షాహ పరిపాలించుచుండెను.

ఎటులేని రాయచూరుదుర్గము లోగొనినగాని తన పూర్వుల యాత్మకుశాంతి చేకూరదనియు విద్యానగర సామ్రాజ్యము సురక్షితముగాదని కృష్ణరాయలు తలంచి యాదిల్‌షాహ తనకు స్నేహితుడుగాన యుద్ధకారణముకొఱకు నిరీక్షించుచుండెను. సయ్యద్‌మర్కారు అనునొక తురష్కుడు గుఱ్ఱములను గొనితెచ్చెదనని రాయలయొద్ద గొంతధనము గొనిపోయి హరించి యాదిల్‌షాహ రాజ్యములో డాగి యాతని శరణుగోరెను. రాయలువానిని బట్టియిమ్మని వర్తమాన మంపగ ఆదిల్‌షాహ కులాభిమానము పురస్కరించుకొని వానిని దాచి తన రాజ్యమునకె రాలేదని వర్తమాన మంపెను. రాయ లీసందు జూచుకొని సంగరమునకు బయలువెడలెను.

బలవంతుడగు నాదిల్‌షాహను జయించుట సామాన్యకార్యము కాదని కృష్ణదేవరాయలు ఏడులక్షల మూడువేలమంది కాల్బంబులను, ముప్పదిరెండువేల ఆఱువందల మంది గుఱ్ఱపురౌతులను, ఐదువందల యేబదియొక్క యేనుగులను నింక గొందఱు పరిజనులను వెంట గొని జైత్రయాత్రకు బయలు దేరెను. వీరాధివీరులగు కామానాయకుడు, త్ర----రావు, తిమ్మప్పనాయకుడు, ఆదెప్పనాయకుడు, కొండమరెడ్డి, సాళువ గోవిందరాజు, మధురనాయకుడు, కుమారవీర శ్యామలరాయలు తమతమవెంట గొంతబలము నుంచుకొని కృష్ణరాయలను సైన్యసహితముగ మధ్యనుంచుకొని రాయిచూరు సమీపించిరి. యవన సంస్థానాధీశు లితరు లీ సమయమున ముట్టడింపకుండుటకై తిమ్మరుసుమంత్రి పరిమితబలముతో విద్యానగర దుర్గమును జాగరూకతో గాచియుండెను. విద్యానగరము నెవ్వరును దేరి చూడజాలరైరి. ఆదిల్‌షాహ గొప్పసైన్యముతో గృష్ణదాటి యీవలకు వచ్చి యంతకుమున్నె యటనున్న కృష్ణరాయల సైన్యము నెదిరించెను. ఉభయసైన్యములకు భయంకరసంగ్రామము జరిగెను. ఈసంగరము కౌరవపాండవ సంగరమును బోలియుండెను. తురుష్కుల ధాటికాగలేక రాయలసైన్యము పాఱిపోవుటజూచి రాయలు సేనానాయకులచే బాఱిపోవువారల నఱికించెను. చచ్చిన సంగరముననే చావవలయునని రాయల సైన్యము మొక్కవోని బీరముతో దురుష్క సైన్యము నెదిరించి చిత్రవధ గావించెను. రాయల సైనికులు తురుష్క సైన్యమును రూపుమాపి పాఱిపోవువారల దరిమితరిమి చెండాడిరి. ఆదిల్‌షాహ యేనుగునెక్కి కృష్ణదాటి పాఱిపోయెను. సర్వసేనానయకుడు బంధింపబడెను. పలువురు తురుష్కులు కృష్ణలోబడి మరణించిరి. దీనులగు కాందిశీకుల జంపవలదని రాయలు తనసైన్యమున కుదారభావముతో నాజ్ఞాపించెను. ఈవిజయము క్రీ.శ. 1520 మేనెల 16 శనివారమునాడు చేకూరెనని చరిత్రకారులు చెప్పుచున్నారు.

రాయలింతతో సంతృప్తినొందక సైన్యముతో రాయచూరు దుర్గమును ముట్టడించెను. కోటలోనున్న సైన్యము ఇరువదిదినము లేకధాటిగ గృష్ణరాయల సైన్యముతో బోరాడి యపజయము నిశ్చయమని తెలిసికొని దుర్గద్వారములు తెఱచి శరణుగోరెను. రాయలు పురమునందు బ్రవేశించి తన సైనికులవలన దుర్గవాస్తవ్యుల కెట్టి యిక్కట్టులు రాకుండ గాపాడి దుర్గమును స్వాధీన పఱచికొని యచట గొంత సైన్యమును దన ప్రతినిధినుంచి విద్యానగరముచేరి యీసంగరమున బాటుపడిన వీరులకందఱ కుచితభంగి సత్కారములు చేసొ గౌరవించెను.

రాయచూరు గోలుపోయిన పిమ్మట ఆదిల్‌షాహ చేయునదిలేక తన దూతను గృష్ణరాయలు యొద్దకు బంపి తన దుస్థ్సితియు బరాజయమ నంతయు నివేదించుమనెను. గతమునకు క్షమించి రాయచూరు దుర్గము మాకొసంగుమని గూడ వర్తమానమంపెను. ఉదారశీలుడగు శ్రీకృష్ణదేవరాయలు ఆదిల్‌షాహ వచ్చి తప్పునొప్పుకొని నాకాళ్లు పట్టుకొనెనేని తప్పక రాయచూరుదుర్గము నిచ్చెదనని వర్తమానమంపెను. రాజ్యాశచే ఆదిల్‌షాహ యందులకు నంగీకరించెను. ఇరువురు ముదిగల్లునొద్ద గలిసికొనునటుల గట్టడిచేసికొనిరి. రాయలు నియమిత కాలమునకు ముదిగల్లుచేరెను. ఆదిల్‌షాహ రాయలునొద్దకేగిన బంధించునేమొ యను భయముచేతనో దురభిమానముననో నియతస్థలమునకు రాడాయెను. రాయలు కోపించి వెంటనున్నసైన్యముతో విజాపురము ముట్టడించి దుర్గమును రూపుమాపి విజయమునొంది యారాజ్యములోని కలుబరిగి దుర్గమును లోబఱచికొని ఆదిల్‌షాహచే బంధీకృతులై చెఱసాలలోనున్న బహమనిరాజుల మువ్వుర విడిపించి యందుబెద వానికి గలుబరగ రాజ్యమునొసంగి కడమ యిరువురను దనరాజధానికి గొనిపోయి వారికున్నతోద్యోగము లొసంగెను. అంతరించిన కలుబరిగిలోని బహమనిరాజ్యమును బునరుద్ధరించుటచే శ్రీకృష్ణరాయలకు "యవన రాజ్యస్థాపనాచార్య" బిరుదమును బ్రజలొసంగిరి. ఈబిరుదము కృష్ణరాయల శాసనములలో బెక్కింటియందుగలదు. సర్వమత సమదర్శియగు శ్రీకృష్ణదేవరాయలను మత ద్వేషముగలవాడనుట సత్యమునకు జరిత్రమునకు ద్రోహముచేయుటె.

కృష్ణదేవరాయలు తన జీతమునం దెన్నడును పరాజయము నెఱుంగడు. గౌతమిపుత్రశాతకర్ణి, కులోత్తుంగచోడుడు, ప్రతాపరుద్ర చక్రవర్తివలె నీతడును ఆంధ్రవీరులలో సుప్రసిద్ధుడు. ఈరాజచంద్రుడు స్వయముగా నాముక్తమాల్యదయను గ్రంథరాజమును రచించెను. మఱికొన్ని గ్రంథరాజములు రచించెగాని యవి యలభ్యములై యున్నవి. ఇతడంకితమొందిన గ్రంథములలో మనుచరిత్రము, పారిజాతాపహరణము సుప్రసిద్ధములు. ఈకాలమున నాంధ్ర వాజ్మయమునకు సర్వతోముఖమగు సేవ లభించెను. రాయల యవలంబనమున ఆంధ్రభాషలో సర్వాంగసుందరములగు కావ్యరత్నములు పెక్కులు రచింపబడెను. రాజకీయ రంగమునందెగాక వాజ్మయమునందుగూడ గృష్ణదేవరాయల దివ్యనామము చిరస్మరణేయముగ నున్నది. కృష్ణదేవరాయలు పెక్కుతటాకముల నెలకొల్ప జీవనదులకు గాలువల దీయించి భూదేవిని సస్యసంభరితగ నొనరించెను. విదేశవర్తకమును దేశీయవర్తకమును మిగుల నభివృద్ధిలోనికి దెచ్చెను. మనోహర శిల్పవిన్యాసముతో నలరారు జక్కని దేవాలయములు సభామందిరములు పెక్కుగట్టించెను. స్వయముగ నీనృపాలుడు వైష్ణవుడైనను శివకేశవులయెడ భేదబుద్ధి లేక సమముగ బెక్కు శివాలయములను వృత్తి స్వాస్థ్యము లొసంగెను.

రాయల కిరువురు కుమార్తెలు ఒకకుమారుడు గలరు. పెద్దకుమార్తెయగు తిరుమలాంబికను రామరాజు పెండ్లాడెను.రెండవకుమార్తెయగు వెంగళాంబను తిరుమల దేవరాయలు వివాహమాడెను. కుమారు డాఱుసంవత్సరములు మాత్రమె జీవించెను. ఈబాలునకు రాయ లాఱవయేటనే పట్టాభిషేకము గావించెననియు నితడు కాలవశమున గతింప తిమ్మరుసు విసముబెట్టి చంపించెనని తలచి రాయలు తిమ్మరుసు గ్రుడ్డు తీయించి కారాగృహముననుంచెననియు విదేశీయుల చరిత్రయందుగలదు. దేశీయ చరిత్రములందుగాని ప్రవాదములందుగాని తిమ్మరుసింతటి ద్రోహియను కధాంశము తెలియబడదుగాన నిది విశ్వసనీయముగాదు. రాయలపుత్రుడు గతించుటకు గారకుడు తిమ్మరుసని కృష్ణరాయలు భావించెననుట విశ్వసనీయముగాదు. ఇంతలో ఆదిల్‌షాహ రాయచూరుదుర్గమును హరింప నొక మాఱు వచ్చెను. రాయలు పరిజనముతో నెదిరింప వచ్చుచుండుట విని ఆదిల్‌షాహ పాఱిపోయెను. ఎటులేని బెల్గాము దుర్గమును స్వాధీనపఱచికొని ఆదిల్‌షాహను బంధింపకున్న యెడల రాయచూరుదుర్గమును హరింపకమానడని కృష్ణదేవరాయలు సంగ్రామ ప్రయత్నములు చేయుచుండెను. ఆ సంకల్పము నెరవేరకమున్నె క్రీ.శ.1530 లో శ్రీకృష్ణదేవరాయల మార్తాండుడు అస్తంగతుడయ్యెను.

అద్వితీయ పరాక్రమశాలి యగు కృష్ణరాయనితోబాటు ఆంధ్రవీరుల స్వాతంత్ర్యదీక్షయు నంతరించినది. ఆంధ్ర సామ్రాజ్య నిర్మాతలలో బ్రధమగణ్యుడగు శ్రీకృష్ణదేవరాయలు అద్వితీయ పరాక్రమముతో జిర కాలము రాజ్యమేలి యంత్యదశలో దన యేకపుత్రుని కనులముందు దాటిపోవని కాలపురుషుని దురంతకర్మఫలము. ఈమహావీరుని పవిత్రజీవితము వాజ్మయమందును, సామ్రాజ్యచిహ్నములు హంపి ప్రాంతమునను దర్శనీయములై యలరారుచున్నవి. ఆంధ్రజాతికి గృష్ణదేవరాయలు మఱచిపోరాని వేలుపు. ఇతనితో ఆంధ్ర స్వాతంత్ర్యరంగము ముగిసినది.