ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం)/తొలిపేజీలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రకాశకులు:

కా. నాగేశ్వరరావు,

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ కార్యాలయము


ముద్రితము:

ఆంధ్రపత్త్రికా ముద్రాలయము,

నెం. ౭రు, తంబుసెట్టివీధి, చెన్నపురి.౧౯౩౪
[సర్వస్వామ్యసంకలితము]

ద్వితీయ సంపుటమునకు విలేఖకులు

శ్రీ ఆచంట లక్ష్మీపతిగారు, బి.ఏ., ఎమ్.బి.అండ్సి.ఎమ్., భిషగ్రత్న. ••• ••• అపస్మారము
శ్రీ కనుపర్తి మార్కండేయశర్మగారు ••• ••• అశ్వమేధము
శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు ••• ••• అనాహతము
అనుభవసారము
అపరోక్షానుభూతి
అల్లమప్రభువు
శ్రీ కొంపెల్ల జనార్దనరావుగారు ••• ••• అప్పారావు, గురజాడ
అప్పారావు, బసవరాజు
శ్రీ రాజా కొచ్చెర్లకోట రామచంద్ర వేంకట కృష్ణరావుగారు, బి.ఏ. ••• ••• అమరకము
శ్రీ కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావుగారు, ఎమ్.ఏ. ••• ••• అనంతామాత్యుడు
అనపోతారెడ్డి
అనవేమారెడ్డి
ఆనాగరిక సంఘము
అనుమానము
ఆనేకవర్ణ సమీకరణము
అన్నయ్య, తెనాలి
అప్పకవి
అబ్బయామాత్యుడు
అభావము
అభిజ్ఞానశాకుంతలము
అభినయము
అర్థశాస్త్రములు
అలంకారములు
అల్లోపనిషత్తు
అవతారములు
అవధానము
అశోకవర్ధనుఁడు
శ్రీ గం. దూర్వాసశాస్త్రిగారు ••• ••• అన్నభేది
అపస్మారము
అభ్రకము
ఆమ్లపిత్తము
అయస్కాంతము
శ్రీ గొబ్బూరి వేంకటానంద రాఘవరావుగారు, బి.ఏ. ••• ••• అనూరాధ
అపభరణి
అర్జునీ నక్షత్రములు

శ్రీ గోటేటి జోగిరాజుగారు, ••• ••• అనాస
అసిస్టేంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్. అనుము
అరఁటి
అరఁటికుటుంబము
శ్రీ చివుకుల వేంకటరమణశాస్త్రిగారు ••• ••• అయనము
శ్రీ టి.ఆర్.చింతామణిగారు, ••• ••• అప్పయదీక్షితులు
ఎమ్.ఏ., పిహెచ్.డి.,
సంస్కృతభాషా ప్రధానోపన్యాసకులు,
మద్రాసు విశ్వవిద్యాలయము.
శ్రీ టి.య?.రామచంద్ర?గారు, ••• ••• అమరావతీ స్తూపము
ఎమ్.ఏ., అయ్యనార్
ఆర్కెయలాజికల్ అసిస్టెంట్,
గవర్నమెంటు మ్యూజియము, మద్రాసు.
శ్రీ బులుసు వేంకటరమణయ్యగారు ••• ••• అభిధేయము
అభిషేక నాటకము
శ్రీ భావరాజు వేంకటకృష్ణరావుగారు, ••• ••• అమ్మరాజవిజయాదిత్యుఁడు
బి.ఏ., బి.ఎల్. అమ్మరాజవిష్ణువర్ధనుఁడు
శ్రీ మానవల్లిరామకృష్ణకవిగారు, ••• ••• అభినయము
శ్రీ మామిడిపూడి వేంకటరంగయ్యగారు, ••• ••• అరాజకత
ఎమ్.ఏ., అర్థశాస్త్రము
రీడర్, డిపార్ట్‌మంట్ ఆఫ్ హిస్టరీ,
పొలిటిక్స్ అండ్ ఎకనామిక్స్.
మహోపాధ్యాయ, ఆంధ్ర కళాప్రపూర్ణ,
శ్రీ వేదము వేంకటరాయశాస్త్రిగారు,
••• ••• అనిరుద్దచరిత్రము
శ్రీ కల్యాణానందభారతీస్వామివారు, ••• ••• అనుభూతిప్రకాశిక

విన్నపము


 

విజ్ఞాన మానందము. విజ్ఞానము పురుషార్థము. విజ్ఞానము పరమార్థము. విజ్ఞానము పరబ్రహ్మము. విజ్ఞాన తరంగములు విశ్వవిలాసములు. శాస్త్రజ్ఞులు, కవులు, శిల్పులు, మంత్రులు, యోధులు, మతాధిపతులు, త్యాగులు, కార్మికులు మొదలగు విజ్ఞానోపాసకులు దేశకాలపాత్రావరణాతీతమైన విజ్ఞానారాధనమును మానవధర్మాభ్యుదయమునకుఁ జేయుచున్న విధమును విజ్ఞానోదంత మనంతముఖములను విశదము చేయుచున్నది.

ఆంధ్రవిజ్ఞానసర్వస్వమును నీ మహాకార్యమును యధాశక్తిని నిర్వహించుట కుపక్రమించిన విధము మొదటిసంపుటము నందలి ప్రస్తావనయందు విశదీకరింపఁబడినది. రెండవసంపుటము నందీ చర్వితచర్వణ మనవసరము. రెండవసంపుటమును ప్రకటించుటయందుఁ గలిగిన కాలవిలంబనము వర్తమాన దేశ పరిస్థితులం దనివార్యము. బహుజన సాహాయ్యమునను, విశేష సాధనసంపద వలనను సాధ్యమైన ప్రచురణనందు కాలవిలంబనము సహజము. రెండవ సంపుటమునకు వ్యాసములను వ్రాసి ప్రచురణమును సాధ్యము చేసిన వ్యాస లేఖకులకు వందనములు. మాకుఁగావలసిన ఛాయాచిత్రములనొసంగి ద్వితీయ సంపుటమునందు ముద్రించుట కనుమతించిన మద్రాసు గవర్నమెంటు మ్యూజియము, సూపరింటెండెంటు గారికిని,కోటగిరి ఆర్కెయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సదర? సర్కిల్ సూపరింటెండెంటుగారికిని, కలకత్తా ఇండియా మ్యూజియము సూపరింటెండెంటు (ఆర్కెయోలాజికల్ సెక్షను) గారికిని హైదరాబాదు హెచ్.ఇ.హెచ్. ది నిజామ్స్ ఆర్కెయోలాజికల్ డిపార్టుమెంట్ డైరెక్టరుగారికిని సంపాదకులు కృతజ్ఞులు. పునర్ముద్రణము నందు నూతనాంశములు చేర్చఁబడి ద్వితీయ సంపుటము అన్-అశ్విని వఱకును పర్యాప్తమగుచున్నది. భగవంతుడును, ఆంధ్ర మహాజనులును నీప్రయత్నము సార్థకమగుట కనుగ్రహింతురుగాత!


భావ సం. మాఘశుద్ధ
౧౪, శనివారము
}         కా.నాగేశ్వరరావు.
We have great pleasure in expressing our grateful thanks to the following, who so kindly acceeded to our request and granted us permission to reproduce some of their photos in this volume:
  1. The superintendent, Government Museum, Madras;
  2. The director of the Archaeological department of H.E.H. the Nizam's dominions, Hyderabad;
  3. The Superintendent, Archaeological survey of indial Southern Circle, Kotagiri;
  4. The Superintendent, Indian Museum (Archaeologica, section), Calcutta.