ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/రామరాజు రంగప్పరాజు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

భవ్యలక్ష్మీవిలాసవిభ్రమము లలరు

చక్రధరమూర్తి పురుకుత్సచక్రవర్తి. [ఆ.6]


చ. ఘనములదర్పణంబు లిభకర్ణతలాగ్రము లెండమావు ల

వ్వనధితరంగము ల్సిరులు, వాయువుముందఱ నిడ్డదీపముల్

వనములబుద్బుదంబులు జలంబులపై లిఖియించువర్ణముల్


తనువులు, రాకుమార పరితాపము వల్వదు నీమనంబునన్. [ఆ.7]

చ. సరసుల దేలి పుష్పవనసంతతిపై గడువ్రాలి సుప్తబం

భరముల దోలి చారుశుకపంక్తుల నేలి ప్రసూనగంధ మా

దరమున గ్రోలి పుష్పితలతాతరు లెక్కుచు పోలి మెల్లగా


జరగగజొచ్చె దక్షిణపు జల్లనిగాలి వయాళిపెంపునన్. [ఆ.8]

            __________

24. రామరాజు రంగప్పరాజు.

ఈక్షత్రియకవి సాంబోపాఖ్యాన మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచించి శ్రీరంగనాయకున కంకితము చేసెను. ఈకవి కృష్ణదేవరాయనియల్లు డైన రామరాజునకు బెదతండ్రికొడుకు కోనేటి తిమ్మరాజున కాశ్రితుడై యుండినవాడు. కాబట్టి కవి 1550 వ సంవత్సరప్రాంతములం దుండినవా డని నిశ్చయముగా జెప్పవచ్చును. కోనేటితిమ్మరాజునకును రామరాజునకును తాత యగు నార్వీటిరామరాజును, కృష్ణదేవరాయనియల్లు డగురామరాజును, కవి తనసాంబోపాఖ్యానమునం దిట్లు వర్ణించియున్నాడుఉ. పోరుల నారువీటిపురబుక్కయరామనృపాలు డాగ్రహో

దారత వాలు పూనిన సదాగతికంపితజీర్ణ వర్ణ లీ

లారభటిన్ విరోధిమహిళాంగవిభూషణరాజీరాలు దై

వారు బ్రతాపవల్లవశుభప్రభ వర్ధిలు గీర్తిపుష్పముల్


మ. దివిజేంద్రాభుడు కృష్ణరాయధరణీదేవేంద్రుజామాత శ్రీ

ధవపాదాంబుజబంభరం బమరు మేధా వేధ రామప్ప శా

త్రవకంఠాంతరరక్తశీకరసమిద్ధారోర్మినిర్ధౌతఖ

డ్గవనీకీర్తిలతాంతగంధిలహరిత్కాంతాకచాభోగు డై


క్షత్రియవంశజు డైన యీకవి యాపస్తంబసూత్రుడు; ఆత్రేయ గోత్రుడు; తిరుమల శ్రీనివాసాచార్యశిష్యుడు. ఈతనిది సలక్షణమై నిరర్గళధార గల మంచికవిత్వము. కవనరీతి తెలియుట కయి సాంబోపాఖ్యానములోనిపద్యముల గొన్నిటి నిం దుదాహరించుచున్నాను-


చ. పరమజ్ఞానిహృదంతరాళమణిదీపంబుల్ నమస్నాగకి

న్నరనక్తంచరనాక నాయకశిరోనాళీకరాగప్రభాం

కురనీరాజితముల్ నిజాంఘ్రితలముల్ గోపాలబాలుండు ని

ల్పె రటద్గోఖుర ధూలీ ధోరణుల నాబృందావనక్వ్ క్షీనులన్


ల్పె రటద్గోఖురధూళిధోరణుల నాబృందావనక్షోణులన్. [ఆ.1]

ఉ. వల్లవవల్లభుండు చెలువల్జలమాడగ దత్కటీతటీ

పల్లవముల్ హరించి తను బ్రార్థనచేసిన నీక నవ్వు నా

పల్ల తికాలవిత్రమయి పాండవపత్నికి నెట్టు లిచ్చెనో


చుల్లర వెట్టుప్రల్ల దపుజూదరి సిగ్గుపడం బటావళిన్. [ఆ.1]

శా. అనియమంబు నాయమము నాదమ మాశమ మానిరంతర

ధ్యానవిధాన మాబహువిధానబంధవిదగ్ధభావ మా

మానస మెందునున్ జననిమట్టును గుట్టును మౌను లౌననం


గా నత డొప్పు భక్తికలికాకిలికించితబోధమాధురిన్. [ఆ.2] ఉ. సడి గాకుండగ నుగ్రసేననృపు భిక్షావృత్తి బట్టంబునం

దిడి కంసార్జితరత్నకోటులు మహాహేమంబు లాందోళికల్

పడుతు ల్పర్వతసన్నిభేభములు ఝంపాసంపతద్వాహముల్

నడపించెం దనయింటి కీ వెఱుగవే నారాయణుం డుద్ధవా. [ఆ.2]


చ. కళలు భజింప వచ్చు శశికాంతివిధంబున నేగు దెంచె నా

యెలు గుల ఱేనియాజ్ఞ గమలేక్షణుసన్నిధికిన్ సఖీజనా

వళి భజియింప జాంబవతి వజ్రమయాభరణౌఘశింజితం

బులు పదవమ్మ నీ వనుచు బుజ్జవ మారంగ బల్కునట్లుగన్. [ఆ.7]


ఉ. భోజనపాత్ర మొక్కటి యపూర్వము పర్వతధారి కిచ్చెనం

భోజభవప్రసూతి యది భోజనవేళ దలంచుభోజ్యముల్

యోజనసేయజాలు నది యోజనమాత్రవిసారి కాంతివి

భ్రాజితగారుడాశ్మవిసరస్థగితంబు విషాపహారియున్. [ఆ.3]


మ. అమృతస్యందము కందళింప దరహాసాంకూరముల్ లోచనా

గ్రములం దాండవ మాడ జంద్రధరు డాకంజాక్షు నీక్షించి యో

కమలాక్షా పరురీతి నీవు వ్రతదీక్షన్ రూక్షచర్యాసము

ద్వమముం జూపుదు వయ్య యెయ్యడ సుహృద్భావంబె యీ చందముల్. [ఆ.4]


చ. కమలసహస్రము న్నయనకాంతి యొనర్పగ ఫాలబింబముల్

గుముదహితా యుతంబు నొడగూర్పు బెనంగు మృగాక్షిమోముతో

గమలము జంద్రు బోల్చుకవిగాథల కెయ్యదిమేర యుత్తమో

త్తము నధము న్సమాన మన దారదె బుద్ధి యవజ్ఞం చేరదే. [ఆ.4]


చ. అనుచుం బెగ్గిలి కుందునంగనల నయ్యబ్జాక్షి వీక్షించి యో

యనుగున్నె చ్చెలులార మీరలు సరోజాలి న్మనోజాతు గ్రొ

న్ననలం జిల్కల గోకిలప్రతతి నింద ల్సేయగా నేల నా

తనువే నిత్యము ప్రాణ మేమి ధ్రువమే తర్కింపుడీ యీదెసన్. [ఆ.5]