ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/తాళ్ళపాక చిన్నన్న

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

6. తాళ్ళపాక చిన్నన్న

అష్టమహిషీకళ్యాణ మనుద్విపదకావ్యమును రచియించిన యీ కవి కృష్ణదేవరాయల కాలమునందున్నవాడు.


గీ. చిన్నన్న ద్విపద కెరగును

బన్నుగ బెదతిరుమలయ్య పదమున కెరగున్

మిన్నంది మొరసె నరసిం

గన్నకవిత్వంబు పద్యగద్యశ్రేణిన్.


అని యప్పకవి తెనాలిరామకృష్ణమ్మ చెప్పినట్లుగా నుదాహరించిన పద్యమువలన నితడు ద్విపదను నిర్దుష్టముగాను మనోహరముగాను రచించినట్లు కనుపట్టుచున్నది. లక్షణగ్రంథములయం దుదాహరింపబడిన చిన్నముక్కలుదక్క నీతనిపుస్తకము నాకు లభింపలేదు. ఈక్రింది రెండు పంక్తులు నప్పకవీయమునం దుదాహరింపబడియున్నవి.


ఇంతుల మేల్బంతి యిడిన సేవంతి

బంతి చేదోయి నుపాయన మిచ్చి [అష్టమహిషీకళ్యాణము]

రంగరాట్ఛందమునం దీక్రిందిపంక్తు లుదాహరింపబడినవి-

ఉన్నాడు తడవుగా నున్నా డతండు

మన్నాడు మమ్ము చెమ్మన్నా డటన్న- [అష్టమహిషీకళ్యాణము]

                           __________