Jump to content

ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/చరిత్రముతెలియని యితరకవుల గ్రంథములు

వికీసోర్స్ నుండి

చరిత్రముతెలియని యితరకవుల గ్రంథములు

అప్పకవీయాది లక్షణగ్రంథములలో నుదాహరింపబడిన గ్రంథము లిప్పుడనేకములు గానరాకున్నవి; కొన్ని గ్రంథముల పేరులు తెలిసినను గ్రంథకర్తలపేరులు సహితము తెలియరాకున్నవి. అమరేశ్వరుని గొప్పకవినిగా పూర్వకవులనేకులు స్తుతించియున్నారు. ఈతడు చేసిన గ్రంథము లేవియో తెలియరావుగాని కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణసార సంగ్రహమునందు జిమ్మపూడి యమరేశ్వరుని విక్రమసేనములోనిదని యీక్రిందిపద్యము నుదాహరించియున్నాడు-


గీ. నీర నగ్గియునికి యారయ విస్మయం
   బనుచు బాడబాగ్నికడలి యప్పు
   రంబుజొచ్చెనొక్కొరత్నాకరముమణు
   లనగ జెలువ మమరునాపణములు.

ఈప్రకారముగానే హూణశకము 1650 వ సంవత్సరమునకు బూర్వమునందున్నట్టు నిశ్చయముగా తెలిసిన కొందఱకవుల గ్రంథనామములు తెలిసినను, నా కాగ్రంథము లిప్పుడు లభింపనందున గ్రంథకర్తల చరిత్రమును గూర్చికాని వా రుండినకాలమును గూర్చికాని నేనిప్పుడేమియు వ్రాయుటకు శక్తుడను గాకున్నాను. గ్రంథకర్తల నామములు సహిత మనేకములు తెలియరాలేదు. తెలిసినవారు నా కావిషయమును తెలుపుదురన్న యపేక్షతోను ఇతరు లట్టి గ్రంథసంపాదనమునకయి కృషిచేయుదురన్న విశ్వాసముతోను, ఆ గ్రంథముల పేరులనుమాత్రమిందు జెప్పి వానిలోనుండి దొరకిన పద్యముల నుదాహరించుచున్నాను.


1. కవులషష్ఠము-ఇది యెవ్వరు చేసినదో తెలియలేదు. పుస్తకముయొక్క పేరునుబట్టి యిది యనేక కవులుచేరి చేసినట్లూహింపదగియున్నది. "తృతీయవర్గసరళమునకు రాచమల్లువారి షష్ఠస్కంధ ములో బ్రయోగ"మని యప్పకవి వ్రాసియుండుటచే నిది రాచమల్లు వారను నింటిపేరుగల కవులచే రచియింపబడినట్టు స్పష్టమగుచున్నది. ఆకవు లన్నదమ్ములయి యుండవచ్చును.


శా. శ్రీరామామణి సీత నాధునియురస్సీమ న్నిజచ్ఛాయ గ
   న్నారం గన్గొని యాత్మ నన్యవనితేర్ష్యం బూన దత్కంధరన్
   హారం బున్చుచు నింక జూడుమన దా నౌటం ద్రపంజెంద జే
   ల్వారున్ రాముడు ప్రోచు గాత మిక దమ్మాధీశుతిమ్మాధిపున్.


శా. చండాంశుప్రభ చిక్కతిమ్మయతనూజా తిమ్మ విధ్వస్తపా
   షండం బైనత్రిలింగభాగవతషష్ఠస్కంధ కావ్యంబు నీ
   కుం డక్కెం జతురానసత్వగుణయుక్తు ల్మీఱ వాణీమనో
   భాండారోద్ధత చూరకారబిరుదప్రఖ్యాత సార్థంబుగన్.

అని కవిసంశయవిచ్ఛేదములోను, సర్వలక్షణసారసంగ్రహములోను గవులషష్ఠమునుండి యుదాహరింపబడిన పద్యములనుబట్టి యీగ్రంథము తిమ్మయపుత్రుడయిన తిమ్మయ కంకితము చేయబడినట్టు తెలియుచున్నది. ఈతిమ్మయ యచ్యుతదేవరాయని మంత్రులలో నొక డయిన ట్లొకానొకరు వ్రాసియున్నారు. అదియే నిజమైన పక్షమున బమ్మెరపోతరాజకృతభాగవతము శిథిలము కాగా పోయినభాగములలో నొకటియైన యీషష్ఠస్కంధమును 1530-42 సంవత్సరముల మధ్యను రాచమల్లువారు చేసియుందురు. దీనియందు శృంగారరస మధికముగా వర్ణింపబడినందున దీనికే శృంగారషష్ఠమని నామాంతరము కలిగియున్నట్టు కనబడుచున్నది. అప్పకవ్యాదులుదాహరించిన శృంగారషష్ఠములోని కొన్నిపద్యముల నిందు బొందుపఱుచుచున్నాను-


గీ. తల్లి యును దండ్రి దైవంబు తలప గురుడ
   కాడె ? యిత డేమిచేసిన గనల దగునె ?

   నాస్తికాధమ యోరి యన్యాయవృత్తి
   నాస్తికత్వం గురో: పరమ్మనగ వినవె. [అప్పకవి]


మ. పదము ల్తొట్రిల గౌనుదీగ చలియింపం గేశము ల్తూల బ
    య్యెద వక్షోరుహపాళి జేర గనుదోయిన్ బాస్గ్పము ల్గ్రమ్మ గ
    ద్గదకంఠమ్మున వాక్యము ల్తడబడన్ తద్గేహముం జొచ్చి యా
    సుదతీరత్నము కాంచె బాలుని మనశ్శోకానలజ్వాలునిన్. [తిమ్మన్న]


చ. వయసున బిడ్నవాడ నభివంద్యుడ నౌదునె మీకునంచు సం
   శయ మొనరించె దేని మునిసత్తమ కార్యములందునాగమా
   ధ్యయనములందు మంత్రములయందు గనిష్ఠుడ యేని పెద్ద ని
   శ్చయ మిది వానియం దఖిలసన్నుత మైనసువిద్య గల్గినన్. [అ.సూరన్న]

2. శ్రీరంగమహాత్మ్యము-ఇది భైరవకవిప్రణీతము. కవిగజాంకుశమును రచియించిన భైరవకవి యితడేయయి యుండవచ్చును.


చ. పరిచరుగాగ నేలె నిరపాయచరిత్రుని బాపకానన
   స్ఫురదురవీతిహోత్రుని సముజ్జ్వలమేరు సమానగాత్రునిన్
   బరమపవిత్రునిన్ మునిసుపర్వవరస్తితిపాత్రునిన్ మనో
   హరఫల శేముషీకబళితాంబుజమిత్రుని వాయుపుత్రునిన్. [అప్పకవి]


ఉ. గందపు గొండనెత్తములకందున నేలకితీవయిండ్లలో
   గెందలిరాకుపాన్పున సుఖించి నితాంతరతిశ్రమంబునం
   జెందినచెంచుగుబ్బెతల చెక్కుల జిమ్ము జవాదివాసనల్
   విందులుచేయుచు న్మెలగు వేకువ గోమలగంధవాహముల్. [లిం.తిమ్మన్న]


ఉ. ఆకులవృత్తి రాఘవుశరాగ్రమునందు దృణాగ్రలగ్ననీ
   రాకృతి వార్ధి నిల్చుట దశానను డీల్గుట మిధ్యగాదె వా

   ల్మీకులు చెప్పకున్న గృతిలేనినరేశ్వరవర్తనంబు ర
   త్నాకరవేష్టితావని వినంబడ దాతడు మేరు వెత్తినన్. [కూ.తిమ్మన్న]

3. త్రైశంక్యోపాఖ్యానము- దీనిని సింగరన్న రచియించినట్లప్పకవి చెప్పుచున్నాడు. ఇందు హరిశ్చంద్రునికథ చెప్పబడి యుండవలెను-


క. ఝష కేతుద్విషునకు గి
   ల్బిషపర్వతనృషున కమృతనిషనిధిజామా
   త్రిషునకు ఋషిపూజితునకు
   నిషమాక్షున కింద్రముఖదివిజపక్షునకున్.


క. డుంఠీర భైరవుని సితి
   కంఠు విశాలాక్షి దండకరు జాహ్నవి వై
   కుంఠపతి గుహుని లోలా
   ర్కుం ఠేనలుమీఱ భూవరుడు పొడగనియెన్.

4. శమంతకమణి చరిత్రము- ఇది వణుకూరి గుర్వరాజుచే జేయబడినదని యప్పకవి వ్రాయుచున్నాడు.


ఉ. కాయవచోమనస్ఖ్సలనకల్పితదోషము లెల్ల బాయగా
   నాయెదలోన నిత్యము సనాతనధర్మము బూని యర్మిలిం
   బాయకకొల్తు రామనరపాలనిరంతరసౌఖ్యదాయి సీ
   తాయి సమస్తశోభననిధాయి మహాఫలసిద్ధిదాయి గన్.
/<poem>

5. శశిబిందు చరిత్రము-
<poem>

క. నాకౌకసు లై నను నీ
   డాకకు నిల్చెదరె కటకటా మముబోంట్లన్
   జేకొని సంరక్షింపక
   నీకిటు లుచితంబె యురవణింప నరేంద్రా.

క. నూవుంబూవును సంపెగ
   పూవుగెలిచె బిరుదుముత్తెపుంజల్లి దగం
   దా వై చె ననగ ముంగర
   తో వసరుహ నేత్రనాస తుల లే కొప్పున్.

6. చారుధేష్ణచరిత్రము-


గీ. అచ్చరలు నందనంబున దెచ్చుకొనుసు
   రాగసుమములు హర్మ్యనాతాయనముల
   చెంత గా లూది తత్పురస్త్రీల కొసగి
   వేడికొనిపోవుదురు కప్రనీడియములు.

క. ఈలలన వేలుపుంజన| రాలో యచ్చరయొ కిన్నరవధూమణియో
   వ్యాళాంగనయో కా కీ| భూలోకస్త్రీల కిట్టిపొంకము కలదే ?

7. భేతాళపంచవింశతి-


ఉ. చోరగ్రాహగజాంకుశంబు నలినీశుంభన్మదేభంబు ది
   జ్నారీమూర్తికదర్పణంబు రజనీకాంతామనోహరి వి
   స్ఫారాంభోధితరంగ కారి గిరిజాప్రాణేశభాస్వజ్జటా
   శ్రీరమ్యాభరణంబు చంద్రు డుదయించెన్ సుప్రభాభాసియై.


ఉ. ఆవిధవాశిరోమణి రయంబున బోయి రహస్యవేళ బ
   ద్మావతి గాంచి రాజసుతు డాడినమాటలు విన్నవింప ల
   జ్జాపతి దాని జూచి ఘనసారకరంబుల గండపాళికల్
   వావిరె వ్రేసినన్ జరఠవారిజలోచన వచ్చె ఖిన్నతన్.

8. చమత్కారరామాయణము-


క. ఓశశిముఖి లోపాము
   ద్రేశుడు కలశ భవు డుండు నిట నతడు తపో
   రాశి మహాత్ముడు మును పా
   పోశనముగ గొనియె సాగరాంబువు లెల్లన్,

క. నిన్ను జెఱగొన్న హైహయు
   కన్నన్ దోర్వీర్యమెక్కుడగుభార్గవు లీ
   ల న్నిర్జించినరామున
   కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?

9. శేషధర్మములు-


క. పెట్టడు నారకమార్గం
   బెట్టి మహాక్రూరకర్ము డేనియు దుద ని
   ట్టట్టనక నెమ్మనంబున
   నెట్టన హరి దలప గలిగెనేని మహాత్మా.

10. విజయసేనము-


ఉ. వల్లభు డేగు దుర్లభుడు వానిదెసందగు లూది యిమ్మెయిన్
   దల్లడ మందెదేల యుచితస్థితికి న్నను బాప జూచినన్
   దల్లియు బంధులోకమును దండ్రియు నేమనువా రెఱింగరే
   మల్లమ యిట్లునీకు దగునో తగదో పరికించిచూడుమా.

11. దేవీవిజయము-


గీ. వాక్త్రిణేత్రాంగనాశచీశక్తు లధిక
   సంభ్రమంబున గుంభనికుంభదైత్య
   హంత్రి బూజింపుదురు త్రయీమంత్రములను
   స్తోత్రములుచేసి మంగళారాత్రికలిడి.

12. మధుసేనము-


క. పో నుద్యోగము చేసిన | ప్రాణంబా యింకనీకు బాథేయం బీ
   మానినిమందస్మితమధు | రాననచంద్రికలు గ్రోల నరుగుము పిదపన్.

13. అనిరుద్ధచరిత్రము- కనపర్తి యబ్బయామాత్యప్రణీత మయిన యీపేరుగల యాధునిక ప్రబంధమొకటి కలదుగాని యీక్రింది పద్యము పూర్వగ్రంథములోనిది

చ. నెలవుల నుప్పతిల్లి సరినిక్కి మొన ల్తల లెత్తి క్రొవ్వి లో
   బలిసి సమంబులై బిగిసి వట్రువలై మెఱు గెక్కి చక్కనై
   కెలకుల బిక్కటిల్లి చెలికిం గడునొప్పె గుచంబు లొప్పుకు
   ప్పలుగను మన్మథుండు సరి వా లగ ద్రాసున దూచెనోయనన్.


14. శూద్రకరాజచరిత్రము-


మ. సమడేభారి మసంగిపై నుఱికినన్ శంకించి భూపాలు డో
    లము గన్నం గని దాని శూద్రకుడు లీలంద్రుంచె నె నప్పు డ
    త్యమలో ద్యత్ప్రసవార్థిత కుసుమగంధఘ్రాణలుబ్ధభ్రమ
    త్భ్రమరభ్రాజితపాటలీనిటపమధ్యస్ఖుండ నై చూచితిన్.


15. ఆదినారాయణచరిత్రము-


ఉ. శ్రీయుతలోచనోజ్జ్వలమరీదులు భానుమరీచినిస్ఫుర
   త్తోయజకాంతితోడ దులదూగెడుపచ్చనిపట్టు గట్టి య
   త్యాయతశంఖచక్రరుచిరానిగదాధరు డేచదెంచె నా
   --యణు డా రరక్షణపరాయణు డాకరిరాజుపాలికిన్.

16. పంచగాణవిలాసము-



క. నిత్తంబుల రంజిల్లుచు
   ము-దుప లపుడు గదిసి పూనిలునకున్
   బిత్తరికి బలు---గుల
   నిత్తిరి హారతులు పౌరులెల్ల --లంగన్.


17. ప్రద్యుమ్నోపాఖ్యానము- <poem>

క. పంచశరుం డపు డని చా

  లించి మహాప్రధనభూమి నీక్షించి మనో
  వంచితుడై శంఖము పూ
  రించెం గులగిరులు దిక్కరివ్రజ మదరన్. 

5.సతీమణి విజయము
6. సుమిత్ర చరిత్రము
7. రఘుదేవ రాజకీయము
8.కురంగేశ్వర వర్తక చరిత్రము.

...

2. అతిబాల్య వివాహము

3.విగ్రహారాధనము

...

2.శంకరాచార్యులు

పుస్తకములు వలయువారు :---
కార్యదర్శి, హితకారిణి సమాజము, రాజమహేంద్రవరము
అని వ్రాసిన బడయగలరు