ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/పాలవేకరి కదిరీపతి
పాలవేకరి కదిరీపతి
ఈకవి శుకసప్తతియను కావ్యమును రచియించెను. ఈతని కవిత్వము హృద్యముగానే యున్నదికాని పుస్తకమంతయు దొరకలేదు. దొరికిన రెండాశ్వాసములను బట్టి చూడగా నితడు ప్రౌఢకవి యగుటకు సందేహ మగపడదు. మాణిక్యనృపపౌత్రుఁ డయినట్టును కదిరి రాజపుత్రుఁ డయినట్టును దెలియవచ్చుచున్నది. కవి నెల్లూ3మండలములో నివాఁడు. ఇతఁడు తనగ్రంథమును శ్రీరామాంకితము చేసికుం ఈతనికాల మేదో తెలియరాలేదు గాని యితఁ డాధునికుఁ డగుటకు సందేహము లేదు. శుకసప్తతినుండి రెండుపద్యములు నిం దుదాహరించుచున్నాను.
చ. ఆలజయ కేతనండు రుచిగాం గతిరస్కృతమీన కేతనుం డెలమి మదిం దలిర్ప దయ నేలికయుం దలిదండ్రు లయ్యెడకొ దలఁచిన కార్యభాగ ముచితజ్ఞులచే విని నీతి కార్యవ ర్తులునియోగిపుంగవులతోడ రహస్య మొనర్చి యిట్లను క్. ఆ. ౧.
మ. అక్కట దోసతోఁట యినియైనఁ దదీ సుఫలంబు లమ్మి యీ డొక్కయు సాకఁ గోరితిఁ గడు న్నడు రేయిని వచ్చి యెవ్వరో మక్కువలేక నాకడుపుమంటయుఁ బుచ్చుకొనంగఁ బూని యీ చెక్కెగవంటిపండ్లు తినసాగిరటంచుఁ గృశించు నెంతయన్.
మాధవమంత్రి.
ఇతఁడు భగవద్గీతలను నాలుగాశ్వాసముల పద్యకావ్యమునుగా రచియించెను. ఇతఁడు గోదావరీ మండలములోని నియోగి బ్రాహ్మణుఁడు. గిరిమనమంత్రి పుత్రుఁడు; కిడాంబి వేంకటాచార్యుల శిష్యుఁడు. ఈతని గ్రంధమునఁదు లక్షణవిరుద్ధములైన ప్రయోగము లనేకములు గానఁబడుచున్నవి. అయిన నితడు తన గ్రంథము నందు దత్తోజీ పండితవిరచితమయిన భగవద్గీశలలోకంటే వృత్తముల నధికముగా వేసియున్నాఁడు. ఇతఁడు తనకృతిని భద్రాద్రిరాముని కంకితము చేసెను. ఈతని పుస్తకమునుండి రెండు మూడు పద్యము లిం దుదాహరింపఁబడుచున్న :——
ఆ. ౧. మ. ధరఁ బా లియ్యక లోభకాంక్ష యుతుఁడై ధాత్రీకుల నిత్రులక్షా గుగురా జీక్రితఁ జంపఁ గాఁ దలఁచి తాఁ గ్రూగాత్తుఁడై యున్న చోఁ బొరిగొన్నర్ దురితంబు చెందు వీను మీ పొ తొల్ల నాకేల య స్థిర ర మికాయము దీనికై కులజులం దెళ్ళింపఁగాఁ బాడియే
శా. విద్వసుఖ్యుఁడు కగ పుంజములు తా విధ్యుక్త మార్గంబు చే మద్వాక్యంబులరీతి సల్పుచును సత్యం గాంచి యవ్వేళలతో హృద్వాసంబున మోహ ముప్పతిలు వర్తించు నమత్వాది రా గద్వేషంబులు లేక యోగి సమరక్షా గంభీరుఁడై ఫల్గునా. ఆ.. పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/182 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/183 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/184 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/185