ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/శరభాంకకవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శరభాంకకవి


శతకకర్తయు, లింగధారియు నగు నీ కవి రెండవ ప్రతాపరుద్రచక్రవర్తి కాలమున 14వ శతాబ్దమున నుండెనని తెలియుచున్నది. కాని శతకమును బట్టి చూచినచో నిది అంతకంటె నవీనముగాఁ దోఁచుచున్నదcట! ఇందు భాషాదోషములు, లోపములను చాల కలవు.

ఇందలి పద్యములను లింగమగుంట తిమ్మకవి తన 'సులక్షణసారము ' న నుదాహరించెను. ఎడపాటి యెఱ్ఱన, రాజలింగకవి యితనిని స్తుతించి యున్నారు.



కమలనాభామాత్యుఁడు


శ్రీనాధకవి సార్వభౌముడు తన తాత యగు కమలనాభామాత్యుఁడు గొప్ప విద్వత్కవి యని తెల్పియున్నాఁడు. ఇతఁడు క్రాల్పట్టణాధీశ్వరుఁడఁట. పద్మపురాణకర్త. ఆ గ్రంధమిపుడు లభించలేదు. ఇతడు ద్వితీయ ప్రతాప రుద్రుని కాలమున నుండినవాఁడు కావున క్రీ. శ. 1295 - 1326 నడుమ నుండవచ్చును. ఇతని మనుమఁడగు శ్రీనాథుఁడు క్రీ.శ. 1380 ప్రాంతమున జన్మించి యుండవచ్చునని ' ఆంధ్రకవి తరంగిణి ' కారుల యాశయము.