ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/మల్లియ రేచన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

భీమకవి కృతిగాc బ్రసిద్ధిచెందిన "కవిజనాశ్రయ"మను ఛందోగ్రంథమును రచించినవాఁడు మల్లియ రేచన. కవిజనాశ్రయము ప్రథమలక్షణగ్రంధమని పండితలోకమునఁ బ్రసిద్దము. ఇయ్యది వేములవాడ భీమకవి కృతి కాదని "వేములవాడ-భీమకవి" చరిత్రమున వివరింపఁబడును.

భీమకవి కాలము నిర్వివాదముగ క్రీ. శ. 1160-1180 ప్రాంతముగ స్పష్టపడి యున్నది. కవిజనాశ్రయము క్రీ. శ. 1100 ప్రాంతమందలిది.

కవిజనాశ్రయమునందలి భాగములగు 'ఆధికారము"ల గద్యలయందు *ఇది శ్రీవాదీంద్రచూడామణి చరణ సరసీరుహ మధుకరాయమాన . ." అని యున్నది. ఈ 'వాదీంద్రచూడామణి" అను జైన సమయాచార్యుని, నన్నెచోడమహాకవి రచించిన కుమారసంభవమునకుఁ గృతిపతియైన జంగమ మల్లి కార్డునయోగి వాదమునందోడించినట్టు "పరవాదీంద్రఘనాఘనా నిలు" అను పద్యపాదము [కుమార-అ-8-197 ] ధ్వనించుచున్నదనియు, కుమారసంభవమునఁ గవిజనాశ్రయపుటనుసరణములు కానవచ్చుచున్న వనియు "తెనుఁగు కవుల చరిత్ర" (పుట 171) లోఁ గలదు.

  • నన్నెచోడుఁడు 11౩0-40 ప్రాంతమువాఁ డగునప్పడు కవిజనాశ్రయము 1100 ప్రాంతము ననే వెలసినదని చెప్పటకు వీలు కలుగుచున్న దని ఆ పుటయందే శ్రీ వేంకటరావు గారు తెల్పియున్నారు.

ఈ క్రిందియంశము "తెనుఁగు కవుల చరిత్ర" ననుసరించియే తెలుపcబడుచున్నది.

  • అఱవభాషలో 12 వ శతాబ్దికిఁ బూర్వమే "యాప్పిరుంగలమ్ కారికై "అను లక్షణగ్రంధము ప్రసిద్ధమైయున్నది. ఇందు అఱవమునందలి ఛందోగ్రంథ

__________________________________________________________________________ *కుమారసంభవమున నవమాశ్వాసాంతమున నున్నట్లు'తెనుఁగు కవుల చరిత్ర' లోఁ గలదు. కాని యిది ఆందలి 8-వ ఆశ్వాసమున 197 వ పద్యముగాఁగలదు. ములే కాక కర్ణాటాంధ్రచ్ఛందోగ్రంధములను పేర్కొనఁబడినవి. అందు * రేచియార్ శెయ్ ద వడుగచ్ఛందము" కలదు. ఇది కవిజనాశ్రయమే : ఈయంశమును కీ శే.శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారే తొట్టతొలుత ఆంధ్ర లోకమున కెఱుకపఱచిరి.

క్రీ. శ. 990 ప్రాంతములో నుండిన కన్నడ కవి నాగవర్మ రచించిన 'ఛందోంబుధి" కిని, కవిజనాశ్రయమునకును పెక్కు పోలికలు కలవు కావున 'ఛందోంబుధి' ననుసరించి కవిజనాశ్రయము రచింపఁబడిన దనవచ్చును. ఇందలి పద్య మొకటి మడికి సింగన కూర్చిన 'సకల నీతి సమ్మతము' లో నుదాహరింపఁబడినది. సింగన క్రీ. శ. 1400 ప్రాంతపువాఁ డగుటచే నియ్యది తత్పూర్వమనుటలో సందేహమే లేదు. 'యాప్పిరుంగ లమ్ కారికై' లో నిది పేర్కొనఁబడుటcబట్టి కవిజనాశ్రయము క్రీ. శ. 1100 ప్రాంతమందలిదని నిర్ణయింపవచ్చును.

కవిజనాశ్రయుఁడు మలియ రేచన, విమల యశోభాసుర చరితుఁడు. భీష నాగ్రసుతుఁడు సహాయుఁడుగా నీ కవిజనాశ్రయమును రచించినట్లు స్పష్టముగఁ గలదు.