Jump to content

ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/నారాయణభట్టు

వికీసోర్స్ నుండి

నారాయణభట్టు


నారాయణభట్టు భారత రచనమున నన్నయభట్టునకు సాయపడినని 'పాయక పాకశాసనికి" అను పద్యము వలనఁ దెలియుచున్నది. ఆ పద్యము కొన్ని ప్రతులలోఁ గానరాదని చెప్పిన వారుకూడా నన్నయ రచించిన నందమపూcడి. శాసనమును బట్టి నారాయణభట్టు నన్నయ సమకాలీనుఁ డనుట నంగీకరింతురు. నారాయణభట్టు కుమార్తె కుపమ దాక్షారామ భీమేశ్వరున కఖండదీపమునకై_ లోహపు దివియ నొసంగి క్రీ. శ. 1050 లో నౌక శాసనము వేయించెను. దానింబట్టి నారాయణభట్ట క్రీ. శ. 1044 మొదలు 1058 వఱకును కల్యాణ కటకము నేలినవాఁడును, తైలోక్యమల్లాది బిరుదాంకితుఁడును అగు ప్రధమసోమేశ్వరునివద్ద ప్రధానిగా నుండినట్లు తెలియుచున్నది. ఈ యంశమును శ్రీ కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావుగారు మున్నగువారు తెల్పియున్నారు.

నారాయణభట్టు త్రైలోక్య మల్ల సోమేశ్వరుని ప్రధానియేయైనచో, ఆ ప్రభువుని సామంతుండగు రాజరాజువలన దానమును పరిగ్రహింపనేల? యనియు, కావున ప్రధాని నారాయణభట్టును, నన్నయ సహాధ్యాయుఁడును విభిన్న వ్యక్తులనియు-"ఆంధ్రకవితరంగిణి" కారులు విపులముగఁ దెల్పియున్నారు. [పుట 138)

కర్ణాటభాషలో "రెట్టమతము" ను రచించిన రెట్టఁడను కవి తన గ్రంధమునకు నారాయణభట్టు రచించిన గ్రంధ మాధారమని చెప్పెనఁట ! ఈయంశము-అయ్యల భాస్కరకవి రచించిన 'రెట్టమతశాస్త్రము' నందలి 'ఉదిత కీర్త్యాఖ్యచే నొనరు నారాయణ భట్టమతంబును" అనుదానివలనఁ దెలియుచున్నదఁట ! [చూ. ఆంధ్రకవితరంగిణి-పుట 139]