ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/అవతారిక

వికీసోర్స్ నుండి

ఆంధ్ర కవుల చరిత్రము

____________________________________________________________________________


అవతారిక


దేశాభ్యున్నతికిని, భాషావాఙ్మముల తత్త్వపరిశీలనమునకును చరిత్రము మిక్కిలి యావశ్యకము. చరిత్రలేని దేశముగాని, భాష గాని, వాఙ్మయము గాని నాగరకతా ముద్రను పొందఁజాలపు. భారతదేశము నందేగాక దేశాంతరములందును పేరుప్రతిష్టలు సంపాదించిన ఆంధ్రభాషావాఙ్మయముల చరిత్ర మందరికికిని ఉపాధేయము. ఈ గ్రంధమునందుఁ బ్రత్యేకముగ ఆంధ్ర వాజ్మయాభివృద్ధికి దోహద మొనర్చి, పోషించిన కవుల గూర్చిన విషయ ములు విపులముగ నీయఁబడినవి.


ప్రాచీన కాలమునుండియు నాంధ్రులు సుప్రసిద్దులయి, తమ విశిష్టతను నిలుపుకొనుచున్నారు. వేదకాలమునందును ఆంధ్రులు ప్రసిద్దులు. ఆంధ్రు లొకప్పడు భారతదేశమునందలి విశాల భాగమునకుఁ బ్రభువులై యవిచ్ఛిన్నముగ రాజ్యపాలన మొనర్పుటమేగాక, పెక్కు ఘనకార్యముల నొనర్చి నట్లును, భాషా వాఙ్మయములను పోషించినట్లును తెలియుచున్నది.

ప్రాచీనాంధ్ర ప్రభువులగు శాతవాహనులు సుప్రసిద్దులు, శక కర్తలు. హాలుఁడు ప్రాకృతమున గొప్ప విద్వాంసుఁడై గాథా సప్తశతిని గూర్చిన యంశము విద్వద్విదితము. ఇట్లే ప్రాచీనాంధ్రులగు ప్రభువర్యులు సంస్కృతమును, ప్రాకృతమును బోషించి, ఆ వాఙ్మయములందు పెక్కు- ఉద్గ్రంథములు వెలువడుటకుఁ గారణభూతులయిరి, అది ప్రాచీనకాలము నుండియు ఆంధ్రుల ప్రశంస శ్రుతి పేయమగుచున్నను క్రీస్తు శకము 10 శతాబ్దులు గడచిన వఱకును, - అనగా నన్నయభట్టు మహాభారత రచనకుఁ బ్రారంభించు వఱకును చెప్పకొనఁదగిన వాఙ్మయమాంధ్రమున వెలయకుండుట కడుంగడం విచార హేతు పగుచున్నది. అంతకుఁ బూర్వము వెలువడిన వాఙ్మయము లభ్యము కానంతమాత్రమున నన్నయకుఁ బూర్వ మాంధ్ర వాఙ్మయము లేనేలేదని చెప్ప వలనుపడదు. నన్నయ రచనయే ఆంధ్ర వాఙ్మయమున కారంభమైనచో, ఆట్టి యుత్కృష్ణ కవిత వెలుపడుట అసంభావ్యమని విమర్శకుల యాశయము.


నన్నయకుఁ బూర్వమున గ్రంథ రూపమున తెలుఁగు వాఙ్మయము వెలువడ కున్నను శాసనములందుఁ గొన్ని పద్యములును, గద్యలును కానవచ్చుచునే యున్నవి. వానిని పరిశీలించినచో, శాసన రచయితలు విద్వత్కవులని తెలియక మానదు. వారు సంస్కృతమునందును నిష్ణాతలని యా శాసనములే చాటుచున్నవి.

శాసన రచయితలను కొందరికిని కొందరు చరిత్రకారులు కవులుగాఁ బరిగణించిరి. 1[1]శాసనమునఁ గొలఁది పద్యములను గూర్చినంతమాత్రమున -- అట్టి రచయితలను రచయితలనుగాఁ బరిగణింపనక్కఱలేదని కొందఱు విమర్శకుల యాశయము. అట్టి వారు కవుల పట్టిక కెక్కినను - ఎక్కకున్నను - నన్నయకుఁ బూర్వమున నుండిన తెలుఁగు వాఙ్మయము స్వరూపమును దెలిసికొనుటకు - అట్టి శాసన కర్తలను గూర్చి కొంతవఱకుఁ దెలిసికొనుట యప్రస్తుతము కాcజాలదు.

(1) ఉపలబ్ధములగు శాసనములలో క్రీ. శ. 848 ప్రాంతమునాఁటి "అద్దంకి" శాసనము మొదటిది. ఇది చాళుక్య వంశీయుఁడగు గుణగవిజయాదిత్యుని ప్రథమ రాజ్య సంవత్సరమునాఁటిదcట • పండరంగఁడను సేనాధిపతి తన ప్రభువు గుణగవిజయాదిత్యుని పేరిట ఆదిత్యభట్టారకునికి కొంత నేల దానము చేసినట్ట్లిందుఁగలదు. దీని కర్త యెవ్వరో తెలియరాలేదు పండరంగఁడే శాసనకవియయి యుండునని శ్రీ నిడుదవోలు వేంకటరావుగా రూహించుచున్నారు.[2]. ఇందు తరువోజయును. కొంత గద్యభాగమును గలవు.

(2) దీని తర్వాతిది కందుకూరిలో లభించిన పద్యమయ శాసనము ఇది పూర్తిగా లేదు. ఇందలి లిపి తూర్పు చాళుక్యులనాఁటిదఁట ! ఇందలి పద్యము సీసపద్యమని కీ.శే. శ్రీ కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరాపుగారు గుర్తించిరి. ఇయ్యదియు గుణగవిజయాదిత్యునకు సcబంధించినదని శ్రీ నిడుదవోలు - వేంకటరావుగారు తెల్పుచున్నారు 3

(3) గుణగవిజయాదిత్యుని నాఁటిదే యని చెప్పఁబడుచున్న ధర్మవరము శాసన మొకటి పద్యమయము కలదు.4ఈ శాసనము ప్రారంభమున 'స్వస్తి సర్వలోకాశ్రయ .. (క్య) భీమమహారా(జులవి) జయరాజ్యస (౦) వత్సరంబు - (యే) నగునే (ణ్ణి) ఉత్త (రా) యనస (౦క్రాన్తి) స్థితి ' ఆవి యుండుటం బట్టి యిది చాళుక్యభీమమహారాజు శాసనమని ప్రసిద్ధము. ఇది యత్కర్తృకమో తెలియదు

(4) ఏడువాడలపాలెపు శాసనము నొకదానిని కీ.శే. పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు పరిచయము చేసిరి. 5 శాసనములోని 'స్వస్తి - సకాబ్ద౦బు ల్దోంభ నూటానల్వదియగు నేణ్ది - " అను దానినిబట్టి యిది క్రీ. శ. 1018 నాఁటిదని తెలియుచున్నది.


(5) నన్నయ కంటెఁ బ్రాచీనములగు శాసనములలో ముఖ్యమైనది "యుద్ద మల్లుని బెజవాడ శిలాశాసనము". ఇది యుద్ధమల్లుఁడను చాళుక్యరాజు బెజవాడలోఁ గుమారస్వామికి గుడియు, దానిఁ జేర్చి యొక మరమును కట్టించి. ఆ మరములో తై వేతరులు నివసింపరాదని యేర్పాటుచేసి చెక్కించిన శాసనము బాగుగఁ బరిశీలించినచో నిది యొక్క శాసనము కాదనియు,



(3) చూ. "తెనుఁగు కవుల చరిత్ర పుట 88 (4) డా.నేలటూరి వేంకటరమణయ్యగారి గుణగవిజయాదిత్యుని వర్తమానములు. భారతి 23, 24 సం. (5) చూ. రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచిక(2) రెండు శాసనములనియు, ఇందలి చివఱి భాగమును బట్టి యుద్దమల్లుడు, తన తాత మల్లపరాజు కట్టించిన గుడికి గోపురమును గట్టించెనని స్పష్టమగు చున్నదనియు శ్రీ వేంకటరావుగారు వ్రాయుచున్నారు. 6ఈ శాసనము గుణగవిజయాదిత్యుని శాసనమున కించుమించుగా ఏఁబదియేండ్లకుఁ దర్వాత పట్టినదని కీ.శే. శ్రీ జయంతి - రామయ్యపంతులుగారు వ్రాసిరి. 7ఇయ్యది యసమగ్రము.


శాసనమును బట్టి దీని కర్త యెవ్వరైనదియుఁ దెలియదు. వీరశైవ పండిత త్రయములోఁ దొలివాఁడగు శ్రీపతి పండితుఁడే యీ శాసనమును గూర్చెనని శ్రీ వేంకటరావుగారు చెప్పుచున్నారు. శ్రీపతి పండితుఁడు బెజవాడ వాస్తవ్యుడగుటయు, కవి యగుటయు, మల్లేశ్వరాలయమున నిప్పులు మూటగట్టి శివభక్తి మహిమను బ్రదర్శించుటయుఁ దమ యూహకుఁ గారణముగా వివరించినారు8 -ఈ యూహ కింకను ప్రబలములగు హేతుపు లావశ్యకములు. (6) కీ.శే శ్రీ వేటూరి-ప్రభాకరశాస్త్రిగారు సంతరించిన "ప్రబcధరత్నావళి" లో పద్మకవి రచనగా నొక సీసపద్య మీయఁబడినది. అది 'జినేంద్రపురాణము' లోనిది. 'జినేంద్రపురాణము' ను రచించిన పద్మకవియే కన్నడవాఙ్మయమున ఆదికవి యని చెప్పఁబడు పంప మహాకవి యని శ్రీ వేంకటరావుగారి యభిప్రాయము. 9ఉపలబ్ధమగు పద్యము ప్రాచీనతర రచనగా దోcచలేదని శ్రీ ప్రభాకర శాస్త్రిగారు తెల్పియున్నారు. 10 పద్మకవియే పంపకవి యని నిశ్చయమైనచో, అతఁడు నన్నయ కంటెఁ బ్రాచీనుఁడు కావచ్చును.


(7) మడికి సింగన సమకూర్చిన 'సకల నీతిసమ్మత' మను గ్రంధమున నీయcబడిన కృతి, కృతి కర్త్రృ నామములో 'గజాంకుశ" ప్రశస్తి కలదు.


(6) చూ. తెనుఁగు కవుల చరిత్ర, పుట 55, (7) చూ. శాసనపద్యనుంజరి - పీఠిక (8) చూ. తెనుఁగు కవుల చరిత్ర పటలం 88, 69. (9) చూ—. "తెనుఁగు కవుల చరిత్ర. పుటలం 88, 84. (10) ప్రబంధ రత్నావళి, పీఠిక. పుట 27. కన్నడ కవి సుప్రసిద్దుఁడు. " గజాంకుశుఁడు " కలఁడనికన్నడ కవి చరిత్ర కారులు తెల్పుచున్నారు. ఈ కన్నడ కవి క్రీ శ. 1000 ప్రాంతపువాఁడు, ఆంధ్ర కవియు, నీ కన్నడ కవియు నభిన్నులని శ్రీ వేంకటరావుగారియాశయము.[3]

మఱియు నీతనిం గూర్చి తెనుఁగు కవుల చరిత్రలో నిట్లు వ్రాయcబడినది - గజాంకుశుఁడనునది బిరుదమే కావి స్వతస్సిద్ధమగు పేరు కాదు. ఈతని పేరు నారాయణుఁడు. ఈతఁడు రాష్ట్రకూటరాజగు మూడవ కృష్ణచక్రవర్తి కాలమున ప్రధానియై ప్రసిద్ధికెక్కెను. మూఁడవ కృష్ణచక్రవర్తి క్రీ.శ. 939 నుండి 968 వఱకును 29 యేండ్లు పరిపాలించినాఁడు.

రామపార్యసుత శ్శ్రీమాన్ వదాన్యోయం౽యం ప్రతాపవాన్
నారాయణాభిధానేన నారాయణ ఇవాపరః,
విఖ్యాతో భువి విద్యావాన్ యో గజాంకుశ సంజ్ఞయా
ప్రధాన8 కృష్ణరాజస్య మంత్రీసన్ సంధి విగ్రహా

  • * * * * * *

పారగోరాజవిద్యానాం కవిముఖా8 ప్రియంవదాః(?)
యస్తు ధర్మరతో భాతి ధర్మోవిగ్రహవానివ.

గజాంకుశుఁడు కవి యని తెలియనగునను భావమున శ్రీ వేంకటరావుగారు "క్షవిముఖాః" అను దాని నధోరేఖాంకితము చేసినారు, కాని వా రొసఁగిన యా భాగము అనన్వితమగుటచే, అది సరియైన పారముగాఁ దోఁచుటలేదు. ఇంతకును గజాంకుశుని రచన యాంధ్రమున లభ్యము కాలేదు. కావున ఆంధ్ర, కన్నడ గజాంకుశుల యభిన్నతను గాని, ఆంధ్ర గజాంకుశుని - లేదా - నారాయణుని కాలమును గాని నిర్ణయింపఁదగిన కారణము లపేక్షణీయములు.

(8) " ప్రబంధ రత్నావళి " యందలి యుదాహృతులను బట్టి సర్వ దేవుఁడను నొక కవి యుండెననియు, ఆతడు ' ఆదిపురాణ ' మను జైన గ్రంధమును, భారతమునందలి విరాటపర్వమును రచించినట్లు తెలియుచున్నది. రాయల కాలము నాఁటివాఁడగు 'ఎడపాటి - ఎఱ్ఱన' తన ' మల్హణ చరిత్ర' లో సర్వదేవుని స్తుతించి యున్నాఁడు. కన్నడమున సుప్రసిద్దుఁడగు పొన్నకవి సర్వదేవుఁడని ప్రసిద్ధుఁడనియు, రాష్ట్రకూట రాజగు మూఁడవ కృష్ణచక్రవర్తి కాలమున నుండినవాఁడనియు, పంపకవి 'ఆదిపురాణము' ను కన్నడమున రచింపఁగా పొన్నకవి దానిని తెలుఁగున రచించి యుండుననియు శ్రీ వేంకట రావుగా రభిప్రాయపడుచున్నారు12. లభించిన పద్యములను జూడఁగా నవి ప్రాచీనతర రచనముగాఁ దోపఁకున్నదని శ్రీ ప్రభాకరశాస్త్రిగారు తెల్పఁగా ' మనకు దొరకిన రెండు మూఁడు పద్యములతోడనే కావ్యకవితా ప్రాచీనతా నవీనతలను నిర్ణయింపరా' దని డాక్టరు నేలటూరి - వేంకటరమణయ్య గారును, శ్రీ వేంకటరావుగారును తెల్పుచున్నారు13


(9) విజయాదిత్యుఁడను నామాంతరము గల బాదపమహారాజు పదియవ శతాబ్ది చివఱి భాగమున నుండినట్టు అయ్యనభట్టు రచించిన "ఆరుంబాక" శాసనము వలనఁ దెలియుచున్నది. శాసనమంతయు సంస్కృతమయము. అయినను కందపద్య లక్షణముతోఁ గూడిన యొక పద్య మందుండుటఁ బట్టి అయ్యనభట్టాంధ్ర కవి యగునని శ్రీ వేంకటరావుగా రనుచున్నారు14. కాని, శాసనరచయిత యాంధ్రుఁడనుటలో నిది హేతువు కావచ్చును. ఆతc డాంధ్రకవి యనుట కింకను ప్రబలమగు హేతువు కావలసి యున్నది.


(10) క్రీ. శ. 1000 ప్రాంతమునందలిదగు విరియాల కామసాని గూడూరు శాసనము తెలుగు పద్యములగు చంపకోత్పలమాలికలతోఁ గూడియున్నది. శాసనమునందుఁ బ్రస్తుతింపఁబడిన మొదటి బేతరాజు శా. శ. 950 నాఁటి వాఁడు. కావున అతని కాలము క్రీ. శ. 1028 అని చెప్పవచ్చును. ఆందు వలన నీ శాసనము క్రీ. శ. 1000 ప్రాంతములోనిదని చెప్పవచ్చును. శాసన కద యెవ్వరై నదియుఁ దెలియుటలేదు.

    (12) చూ. తెనుఁగు కవుల చరిత్ర. పుట 94. 
    (13) చూ. ఉదయని, మే నెల సంచిక 1936. తెనుంగుకవుల చరిత్ర పుట 98. 
    (14) "తెనుఁగుకవుల చరిత్ర, పుట 98.(12) (11) రాజరాజనరేంద్రుని రాజ్యకాలముసఁ దొలి దినములలో బేతనభట్టను శాసనరచయిత యుండెను. ఇతని కాలము క్రీ. శ. 1022 ప్రాంతమనుట సుస్పష్టము. ఇతఁడు కోరుమిల్లి శాసనమునకుఁ గర్త. ఈ శాసనము, రాజనరేంద్రుఁడు చంద్రగ్రహణకాలమున వీదమార్యుఁడను సద్బ్రాహ్మణునికి కోరుమిల్లి గ్రామ మగ్రహారముగా నొనరించి దానము చేసిన విషయమును తెల్పుచున్నది. ఇది సంస్కృతమయము. కావి యిది దేశీయచ్ఛందస్సగు రగడ యొక్క లక్షణములను గలిగియుండుటవలన - బేతనభట్టు తెనుఁగు కవి యగుట స్పష్టమని శ్రీ వేంకటరావుగారు తెలుపుచున్నారు15.  కాని దీనిం బట్టి బేతనభట్టు తెనుఁగులక్షణ సంప్రదాయముల నెఱిఁగినవాఁడని మాత్రము నిశ్చయింపవచ్చును. 


ఈ రీతిని పద్యమయశాసనములేకాక గద్య శాసనములును పెక్కు కానవచ్చుచున్నవి. అయ్యవి క్రీ. శ. 575 ప్రాంతము నుండియు వెలసినవి లభ్యములగుచున్నవి. కాని యవి యన్నియు వాఙ్మయఖండములని గాని, శాసన కర్తలు రచయితలని గాని చెప్పట కవకాశము తక్కువ. ఇట్లే నన్నయకుఁ బూర్వమున నుండిన పద్యశాసనములను బట్టియు గవులను నిర్ణయించుట కింకను పరిశోధనలు జరుగవలసి యున్నవి.

పయి యంశములను బట్టి నన్నయకుఁ బూర్వము కూడ తెలుఁగుకవిత వెలసి యుండెననియు, అయ్యయ్యది గ్రంధరూపముగ నుండినచో అనుపలబ్దమనియు మాత్రము చెప్పవచ్చును

(15) చూ. తెనుఁగు కవుల చరిత్ర. పుట 112.

  1. (1) చూడుఁడు - శ్రీ నిడుదవోలు వేంకటరావుగారి 'తెనుఁగు కవుల చరిత్ర'
  2. చూ. తెనుఁగు కవుల చరిత్ర - పుట 23.
  3. చూ, తెనుఁగు కవుల చరిత్ర. పుటలు 88, 89.