ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/అమృతనాథుఁడు

వికీసోర్స్ నుండి

అమృతనాథుఁడు


ఇతని గ్రంధము లేవియును లభించలేదు. కాని మైలమ భీమనను గూర్చి చెప్పిన పద్యమొకటి 'కాచనబసవన' యొక్క 'కవిసర్పగారపడము' నందుదాహరింపఁబడినది. ఈ మైలమ భీముననే వేములవాడ భీమకవి కొని యాడియున్నాడు. మైలము భీమనయే చిక్కభీముఁడు. ఇతని శాసనము క్రీ. శ. 1168 నాఁటిది ద్రాక్షారామమునఁ గలదు. భీముని తల్లియగు మైలవు దేవియొక్క శాసనము క్రీ. శ. 1099 నాటిది కలదు. కావున భీముని కాలమునుబట్టి యమృతనాధుఁడును క్రీ.శ. 1150-60 ప్రాంతమునందలివాఁ డగునని చెప్పవచ్చునని "తెనుఁగు కవుల చరిత్ర" యందుఁ గలదు [పుట 287]