ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/అప్పనమంత్రి

వికీసోర్స్ నుండి

భోజ మహారాజు సంస్కృతమున రచించిన “చారుచర్య" ఆను వైద్యగ్రంధము నీతఁడు తెనిఁగించెను. దీనిని ముక్త్యాల సంస్థానాధీశుల ప్రకటించిరి. దీనికి శ్రీవేటూరి ప్రభాకర శాస్త్రిగారు పీఠికను వ్రాసిరి. ఈ అప్పనమంతి తన్నుగూర్చి గ్రంధమునఁ దెలుపుకొని యున్నాఁడు. దానినిబట్టి యీతని వృత్తాంతము తెలియవచ్చుచున్నది. ఇతడు వియోగి బాహ్మణుఁడు; ఆపస్తంభ సూత్రుఁడు. భారద్వాజ గోత్రుఁడు; గోవిందార్యునకును, నాగమాంబకును పుత్రుడు; సింగనామాత్యునికి మేనల్లుఁడు.

ఇతని 'చారుచర్య' లోని పద్యమును మడికి సింగన తన "సకల నీతి సమ్మతము" లో నుదాహరించి యున్నందున నీతఁడు పదునాల్గవ శతాబ్దిలో నుండెనని చెప్పవచ్చును చారుచర్యలో 75 పద్యములు కలవు. శైలిని బట్టి యీకవి తిక్కన, బద్దెనలకు సమకాలికుఁడై యుండునని శ్రీ ప్రభాకర శాస్త్రులుగా రభిప్రాయపడిరి.