Jump to content

ఆంధ్రభాషార్ణవము/ద్వితీయ కాండము

వికీసోర్స్ నుండి

ద్వితీయకాండము

క.

శ్రీరఘునాథాఖ్యాకమ, హీరమణమనోబ్జభృంగ హీరనిభాంగా
వారణదైత్యవిభంగా, భూరిగుణనివేశ మాతృభూతమహేశా!

1


క.

ధరణి పుర శైల వన మృగ, నర వర్ణచతుష్క వర్గ నద్ధత
విరచిత మగు నీకాండము, స్ఫురితగుణనివేశ మాతృభూతమహేశా!

2

భూవర్గము

ఆ.

పుడమి నేల యనిన భూవాచకం బగుఁ, బొల మనంగ నూరిపొత్తు నేల
కృష్ణభూమి వెలయు రేగడ రేవడ, యనఁగ విమలకీర్తి సాంబమూర్తి.

3


ఆ.

గురువు గరుసు నాఁగ ఖరభూమి విలసిల్లు, దువర తుస్సి నాఁగఁ దువరభూమి
విఱిగినాఁగ స్ఫోటపృథివికి సంజ్ఞయౌ, జదరు నా సమోర్వి సాంబమూర్తి.

4


సీ.

మృత్తికాహ్వయములౌ మిత్తిక యం చన మట్టియం చనఁగను మ న్ననంగ
శుద్ధమృత్తిక యొప్పు సుద్దయం చన మీఱు బంకమన్ననఁగఁ గుంభకరమృత్తు
చౌడు కారపుమన్ను చవు డన నూషరమృత్సంజ్ఞ దోఁచుఁ దత్పృథివిపేరు
లు ప్పనఁ జౌ డన నూసర యన నొప్పు జేడెనా నమరుఁ బిచ్ఛిలధరిత్రి
ధరణి విస్తారనిమ్న యై తనరెనేని బాడువ బడువ యనఁగను బరఁగుచుండు
మెట్ట మెరక యనంగను మెఱయుచుండు స్థలికి సంజ్ఞలు మాతృభూతాభిధాన.

5


తే.

పరఁగు నెద్దడినే లన మరుధరిత్రి, కొఱ కనంగను బీడునాఁ గొఱ ననంగఁ
గంచె యన నప్రహతభూమి కాఖ్య లెసఁగుఁ, బడగ మడి యనఁగా నదీప్రాంత మభవ.

6


సీ.

పాండవబీడు నాఁ బరఁగుఁ జిరాప్రహతము పాడు నాఁగను దనరు నప్ర
హతవిశేషము జగం బన లోక మొప్పారు నాణెమం చనఁగ దేశాహ్వయంబు
నాడునా జనపద నామధేయం బగు సీమన దుర్గాఢ్యభూమి వెలయు
వంటెమం చనఁగను వణితమం చనఁగను సీమైకదేశ మై చెలఁగుచుండు
మన్నె మన మండె మనఁగను మాడె మనఁగ దుర్గమస్థలనామ మై తోఁచుచుండు
నీరుముం పనఁ గ్రీనీరునేల యనఁగ ఖ్యాతి గాంచు ననూపంబు మాతృభూత.

7


సీ.

మొరపనేల యనంగ మొరసునేల యనంగ శర్కరిలావనీసంజ్ఞ వెలయు
గోష్ఠంబు దొడ్డినాఁ గొమరారుఁ బెంట నాఁ బరఁగు గౌష్ఠీనంబు పఱగడ యనఁ

బరిసరంబుగఁ దోఁచు వరసంది చేరువ కట్ట కత్తువ కర గనిమ యనఁగ
సేతువిశేషంబు చెలఁగును మడువనాఁ బుట్టన వల్మీక మొప్పుచుండుఁ
గోమ యనఁ దదగ్రభూమి యౌ మార్గంబు తెరువు త్రోవ చారి తేన్ను సరవి
చనుప సడవ చొప్పు జాడ డొంక యనంగఁ బొలుచుచుండు మాతృభూతలింగ.

8


సీ.

బాట యనంగను బండిబా టనఁ దగు ఘంటాపథము దోఁచుఁ గాలిత్రోవ
యన నేకపది గిర్య యన మొప్పు నరవ నా నుపనిష్కురం బొప్పు నుక్కళ మనఁ
బరఁగు మెట్టనఁ గూఁతపట్టునేల యనంగఁ గూడనేల యనంగఁ గ్రోశ మదియె
పరుపునేల యటంచుఁ బలుకుదు దీకపు లిరుపర్వునేల ముప్పరువునేల
యనినఁ గ్రోశద్వయత్ర యాఖ్యలు చెలంగు నామడ యనంగ యోజనం బగును గనుమ
యనినఁ గాంతార మగు లవణాకరంబు వెలయం నుప్పల మనఁగను వేదవేద్య.

9


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగ భూమివర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్ప్రయీమాతృభూత.

10

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

పురవర్గము

ఆ.

ప్రోలు వీడు నాఁగఁ బురసంజ్ఞ లై యొప్పుఁ, గంచినాఁగ నోరుఁగల్లు నాఁగఁ
దిరిచనాపలి యనఁ బురవిశేషము లగు, వాడ యనఁగ వాటి వఱలు నభవ.

11


సీ.

అంగడి మలిగనా నాపణసంజ్ఞ లౌఁ బేట యం చనఁగను విపణి యొప్పు
రచ్చనా రథ్యయౌఁ బ్రాకార మగుఁ గోట యన నుపసాలాఖ్య యగు నరాబు
వా నలంగంబన నలవరి నా పప్ర మగును సాలావయవాఖ్య కొత్త
ళ మ్మన వరణశృంగ మ్మగుఁ గొమ్మనాఁ బ్రాచీనసంజ్ఞలు పరఁగుచుండు
వెలుగు కల్లి యనంగను వలవ యనిన వల్లికాస్యూతవృతి భిత్తి పరఁగు గోడ
యనినఁ దృణముఖ్యకృతిభిత్తికాఖ్య చెల్లు దడి తడిక తడు కనఁగను దక్షశిక్ష.

12


సీ.

పొరకటి యిడుపు నాఁ బొసఁగు ద్వారప్రాంతకుడ్యము మదురు మగలనఁ గుడ్య
పాలికయై యొప్పు భాసిల్లు గృహసంజ్ఞ దీము దీమం బిల్లు గీ మనంగఁ
దావన ఠావనఁ దానకం బనఁగను దావలం బనఁగను దలముపేరు
లిరవు ప ట్టిమ్ము చో టిక్కువ నెల విక్క నెప్పు కంగవ టెంకి నిట్ట యనఁగ
స్థాన మగు నగ రనఁగ రాజగృహనామధేయ మా రాణివాస మంతిపుర మనఁగ
నలరు శుద్ధాంత మట్టడి యనఁగ నట్ట మలరుఁ దగు శాల కొట్టమం చనఁగ నభవ.

13


సీ.

హాజారము హజార మనునివి రెండును మోసాల మొగసాల మోస లనెడి
నివిమూఁడు నంతైదు నెసఁగును ముఖశాల కలరుఁ ద్రిశాలాఖ్య యగును జేట

కొల్లా రనఁగఁ జుట్టుకొల్లారు నలుసాల యనఁ జతుశ్శాలయౌ నల్పగృహము
కొంప లొం పనఁ దగు గుడిసె నా గుడుసు నా నీ రెండు వెలయుఁ గుటీరమునకు
నలకుటీరంబె యానేయ మైన నిలువర మన నిలువార మనఁగాను రహికి నెక్కు
జవికె యనఁ జవిర యనఁగఁ జనుఁ జతుష్కమాకుటి ల్లనఁ బర్ణగేహము దగు భవ.

14


సీ.

బొమ్మరి ల్లనఁగను బుత్రికాగృహ మొప్పుఁ గుంజంబు పొదరి ల్లనం జెలంగు
సజ్జార మనఁగను సామజాగార మౌ లాయ మం చన మందురాఖ్య వెలయుఁ
బండరుపం చన బండారమం చన బొక్కసమం చనఁ బొసఁగుచుండు
నల్లభాండాగార మలశిల్పశాలాఖ్య దనరును డంకనా లనఁ గొటారు
కొట్ట మని పల్కఁగాఁ దగు గోష్ఠగృహము ప్రపకు నభిధానమగుఁ జలిపందిరి యన
బంది లనఁ బంది రనఁగను బరఁగుఁ గాయ మానసంజ్ఞంబులు విఖ్యాతమాతృభూత.

15


సీ.

చప్పరం బనఁగను జనుఁ గాయమానవిశేషంబు కురుజునా స్థిరరథ మగు
దోరపా కనఁగను నోరపా కనఁగను బాదలి యం చన బరఁగుచుండు
భిత్త్యధఃకృతగృహాభిధ దేవళంబునా దేవాలయాఖ్య యై తేజరిల్లు
గుడి కోవెల యనంగ నడరు వర్తులదీర్ఘదేవాలయము లల్పదేవవసతి
చనును దద్దళ మనఁగ వాసగృహసంజ్ఞ నఱ యనఁగ నోవర యనఁగ నలరు సూతి
కాగృహాభిధ పురిటిల్లు నాఁగఁ దనరు మండపం బన మంటపాహ్వయ మగుభవ.

16


సీ.

హర్మ్యాఖ్య మిద్దెనా నలరు నట్టిక యన మచ్చునా నల్పహర్మ్యంబు వెలయు
మే డన సజ్జన మేలుమ చ్చనఁగను నుప్పరిగన సౌధ మొప్పుచుండుఁ
గంకర బెందడి గార సోద యనంగ లేపవిశేషమై తోఁపఁదగును
మాడుగు మాడువు మాలెయం చనఁగను బ్రాసాదభేదమై పరఁగుచుండు
నేలమాలె నా భూమ్యంతరాలయము దనరు సోరణగండి నాఁగను గవాక్ష
మగును లంకనఁగాఁ బ్రకోష్ఠాఖ్య మీఱు, గడపయన దేహళీసంజ్ఞ యడరు నభవ.

17


తే.

సిగర మనఁగను విలసిల్లు శిఖరసంజ్ఞ పొలుచు శిఖరపుఁగొనపేరు మోరునాఁగ
మూలకొత్తళములు చెల్లు బురుజు లనఁగ, భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

18


క.

పెర డనఁ బెడ లనఁ బె ళ్లనఁ, బరఁగున్ గృహపృష్ఠసీమ పంచ యన న్మం
దిరనికట మొప్పు నంగణ, మెఱుఁగం దగు ముంగిలి యన నిందువతంసా.

19


సీ.

దూలమం చన గృహస్థూలతిర్యగ్దారుసంజ్ఞ యై విలసిల్లు స్తంభసంజ్ఞ
మనుచుండు రాడు కంబమన మొగరాడు మొగరంబు నాఁగను దగు నికేత
నాగ్రిమస్తంభాఖ్య యాలయాధారదీర్ఘస్తంభసంజ్ఞ నిట్రాడు నిట్ట
రా డనఁదగు ఛదిరాధార మగు నాస మనఁగాను బెండెయం చనఁగ గేహ

తిర్యగాబద్ధదండంబు తేజరిల్లుఁ, జిలుకకొయ్యన పడెనాఁగ జెలఁగుచుండు
నాగదంతక మెలిసెనా నలరు భిత్తి, కాచ్ఛదిస్పందిసంజ్ఞయై యచ్ఛదేహ.

20


సీ.

దోఁపుచూ రనఁగను దోఁచు నంతచ్ఛది కొణిగచూ రనఁగ నగు న్వలీక
మలరుఁ దోవ యనంగ వలభి టంకనఁగను దనరు విటంకంబు దారబంద
మన ద్వారబంధ మెప్పును దోరణ మనంగ నవు బహిర్ద్వారంబు గవని గవిని
గవఁకు గవను నాఁగ దివురు గోపురసంజ్ఞ లరఁ గరుఁ గన వేది యై తలిర్చు
దిన్నె దిబ్బ యనంగ హస్తి నఖ మొప్పుఁ దలు పనఁ గవాట మౌ బోరుతలుపు నాఁగ
గళయుగకవాటసంజ్ఞయై తనరు గంద పట్టెనా స్కంధపట్టిక వఱలు నభవ.

21


సీ.

రోలుమ్రా నుదుకనాఁ బోలుఁ గవాటమూ లాలవాలాభిధ యర్గళాఖ్య
గడియనాఁ దగును బీగము తాళ మనఁగ నయోమయార్గళవిశేషోక్తి యొప్పుఁ
దదవయవాఖ్యయై తనరు గొళ్లె మనంగఁ దాఁప మెట్టిక తంతె తాఁపరంబు
మెటిక మె ట్టనఁగను మెఱయు సౌపానంబు నిశ్రేణి శాఖ్యయౌ నిచ్చెన యనఁ
బొరక చీఁపురుకట్ట చీఁపు రనిపల్కఁ దగును సమ్మార్జనికిని జెత్తనఁ జెదార
మనిన నవకర మొప్పును నలు కనంగ నమరు నుపలేపకద్రవ్య మమరవంద్య.

22


సీ.

కలువడంబు కలాపి కలయంపి చానపి యన గోముఖాఖ్యలై యలరుచుండు
రంగవల్లాఖ్య యై రాజిల్లు మ్రుగ్గన మొగవాళ మనఁగను దగును నిస్స
రణము మెల్లన నికర్షణ మొప్పు లోగిలి యన వాస్తుసంజ్ఞయై తనరుచుండు
నూరు కుప్పము గ్రామ మొప్పు శూన్యగ్రామవాచకంబై యుండుఁ బా డనంగఁ
బల్లె యనఁ బల్లి యగును వ్రేపల్లె యనిన గొల్లపల్లె యనంగను ఘోష మగును
గూడె మని గోడె మని యనుకొందు రార్యు లెల్లఁ బక్కణమునకు బాలేందుమాళి.

23


క.

పొలిమే రన గడి యనఁగాఁ, బొలిమెర యన నెల్ల యనఁగఁ బోలును సీమా
స్థలనామధేయములు ని, శ్చలతరసుఖకృతి త్రిశీర్షశైలాధిపతీ.

24


తే.

అగడిత యగడ్త యనఁగ ఖేయంబు దనరు, మందుపట్టడపేరు చెన్నొందు బాణ
శాల యనఁగను దజ్జీవిజనము వెలయు, నిమితగాం డ్లనఁగా సుగంధికబరీశ.

25


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగఁ బురవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

26

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

శైలవర్గము

క.

మె ట్టనఁ గొం డన మల యన, గ ట్టన గుబ్బలి యనంగఁ గరువ యనంగా
గుట్ట యనఁ దిప్ప యనఁ గ, న్పట్టును శైలాఖ్య లార్యభావితచర్యా.

27

సీ.

చుట్టుకొం డన మేరగ ట్టనఁ జక్రవాళాచలసంజ్ఞలై యలరుఁ బొడుపు
కొం డనఁ దూరుపుకొండ నా నుదయాద్రి యమరు నస్తాద్రి పడమటికొండ
క్రుంకుకొండ యన నగు న్మంచుకొండనా వలిమల యనఁగ గుబ్బలిదొర యనఁ
బ్రాలేయశైలంబు పరఁగుఁ గవ్వపుఁగొండ తరిగట్టు నాఁగ మందరము వెలయు
ద్రోణపర్వత మొప్పు మందుల యనఁగఁ దనరు మడికాసుగట్టునాఁగను శివాద్రి
వింధ్యశైలాభిధాన మౌ వింజ మనఁగ మాతృభూతేశ దుష్కృతమత్స్యదాశ.

28


సీ.

రాయి కల్లనఁగ శిలాఖ్య యాఁ జట్టన క్ష్మామగ్నశిల యొప్పుఁ జాఁపఱాయి
చలుప యం చనఁగను జనుఁ బక్షహీనశిలాఖ్య బం డన విశాలశిల యొప్పు
వర్తులశిలపేరు వఱలు గుం డనఁగను మొరప మనఁగను శర్కర దనర్చుఁ
బలుగురా యనఁగను బాండుశిలాఖ్య యౌ బలపమం చనఁగను జెలఁగు ఖటిక
యిటుక యిట్టుక యిట్టిక యిటిక యనఁగ నిష్టకం బొప్పు మిడుగుఱాయి యన సూది
రాయి యనఁగను గఠినశిలాఖ్య యెసఁగు మూర్ధధృతగంగ శ్రీమాతృభూతలింగ.

29


సీ.

శిఖరాఖ్య యొప్పును సిగరము గుబ్బ పే టనఁ జఱి జఱియ పడకు పణ కన
నెగడుఁ బ్రపాతంబు నెత్తమం చన బ్రస్థ మలరును నెల యన నడరు నంబు
జన్మదేశాఖ్య యుత్సాఖ్యయౌ నూ టన బుగ్గయం చనఁగను మొగ్గ యనఁగఁ
నుత్సవిశేషమై యొనరును దొన యన ద్రోణవాచకముగాఁ దోఁచుచుండుఁ
బాఱు డనఁగఁ బ్రవాహమౌ వాఁక యనఁగ వాఁ గనఁగ సెలయేఱునా వ్రంత యనఁగ
నచలనది యొప్పుఁ గోనయం చనఁగ శైలదీర్ఘకోణంబు విలసిల్లు దివ్యతేజ.

30


తే.

గొంది యనఁగను గిర్యల్పకోణ మొప్పు, లోయ యన లొద్ది యనఁగఁ బొల్పొందుచుండు
నచలమధ్యధరాఖ్య వాయ యని పల్క, శైలవిశ్లిష్టభూమి యౌఁ జంద్రమౌళి.

31


తే.

గని యనఁగ నాకరం బగు గైరికంబు, జేగుఱం చన విలసిల్లుఁ జెలఁగును గుహ
గవి యనఁగ జాజు జాదు నాఁగను జనర్చు, ధాతునామంబు మాతృభూతాభిధాన.

32


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగ శైలవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

33

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

వనౌషధివర్గము

సీ.

అడవి కాన యనంగ నటవి యై తగును బేరడవి నాఁగను నరణ్యాని చెలఁగు
దోఁటయం దనఁగను దోఁచు గృహారామ ముపవనసంజ్ఞ యై యుండుఁ దోఁపు
నాఁగను బ్రమదవనాభిధయౌను సింగారఁపుఁదోఁ టన బారు బంతి
పదుపు చాల్ చాలుపు పౌఁజు సొరిది చాలు నాఁగను బంక్తికి నామ మగును


"

రేఁక యనఁగను రేఖయై రీతిగాంచు గర యనఁగఁ దద్విశేష మై పరగుచుండు
దొర యన దొంతి యనఁగను దొంతర యనఁ దనరు నుత్పంక్తి మాతృభూతాఖ్యలింగ.

34


సీ.

మొలక మొలవ మొక్క మోక మో సీరిక మొటిక నా నంకురం బొప్పుచుండు
మీ ఱటం చనఁగను మీఱు వాప్యాంకురావలి కోడ యనఁగను బోలుచుఁ చద్వి
శేషనామంబు తసి యన సడ యనఁగఁ దన్నిరంతరపంక్తి దనరుచుండు
మ్రాఁకు మ్రా ననఁగ ననోకహసంజ్ఞయౌఁ జెట్టన నోషధి చెప్పఁబడును
వాడినది యన ఫలిత మౌ వంధ్య సంజ్ఞ యగును గొడ్డనఁ బుష్పితం బగును బూచి
న దనఁ గోరకితం బొప్పు ననిచిన దనఁ జెలఁగుఁ బల్లవితము చిగిర్చిన దన భవ.

35


సీ.

మోడు మో టనఁగ నొప్పును స్థాణునామంబు గున్న యం చనఁగను క్షుపసమాఖ్య
పాద రీరము పొదనాఁ బొలుచు గుల్మాభిధ తీఁగ తీవ యన లతిక దనర్చు
లతికావిశేషం బలనునాఁగఁ జెన్నొందు నలరు లతాప్రతానినియు జొంప
మనఁగఁ బొడవు పొడ గనఁ గనుచ్ఛ్రాయమౌఁ బోల్ప్రకాండము మొద ల్మొద్దనఁగను
బుగ్గ యనఁ బుంగ యనఁగను బరఁగుచుండు స్కంధశాఖాఖ్య మనఁగాను శాఖ
మరయు మండ యనంగను వితతశాఖ పరఁగును సుగంధి కుంతలాంబాసమేత.

36


సీ.

రెమ్మ రెబ్బ రివట రివ్వ సెలగ చివ్వ చివక మల్లె జబర చివర సురిగ
పలుగు గోల బరగు సెల యన నుపశాఖ చెలఁగు నూడ యనంగ శిఫ దనర్చుఁ
కొస కొన మొన యన నలరు వగ్రాభిధ వేరన దుం పన వెలయు మూల
మొనరుఁ జే గనఁ జేవ యనఁగ సారము పేరు తొడు పట్ట తోలుక తోలు చెక్క
తొంట చెక్కు తడప యంట త్వగ్యాఖ్యయౌ త్వగవయవము దనరు బరడు నాఁXఁ
బరఁగు నార యనిన వల్కలసంజ్ఞయై మాతృభూత లోకమాతృభూత.

37


సీ.

ములు వసి యనఁగను జెలఁగుఁ గంటక సంజ్ఞ తొడుగఱ్ఱ యీడిక సుడుము కంప
యనఁ దనర్చును గంటికాదిభారము కట్టె కట్టియ నాఁగను గాష్ఠ మొప్పుఁ
దనరుఁ గొయ్య యనంగ దారుసమాఖ్యయై దుంగ యనంగను స్థూలదారు
కాండంబు వెలయఁఁ జెక్కనఁగఁ దద్దరు భేదంబు పే డన సూక్ష్మదారుభేద
మగును జిదుగన సమిధాఖ్యయలరుఁ దొట్టి తొట్రు తొఱ్ఱ తొఱట యనఁ దోఁచుఁ గోట
గొమ్ము గొల యనఁగాను వల్లరి యెసంగుఁ బత్తి రా కనఁ బర్ణమౌఁ బార్వతీశ.

38


సీ.

పాదరజస్సంజ్ఞయౌ సద యనఁ జిగు రిగురు తలి రనంగ మీఱును గిసలయ
నామధేయము పై రనంగను బయిరు నా ససి యనఁగాను సస్యము చెలంగుఁ
దొడిమె నా వృంతంబు దోఁచుఁ బండనఁగ ఫలం బొప్పుచుండు శలాటు వగును
కా యనఁ బిందనఁగాను బాలశలాటువు చను బూఁబిందెనాఁ బూప యనఁగఁ

బ్రబలు నత్యంతబాలశలాటుసంజ్ఞ మనును శుష్కశలాటునామంబు వట్టు
వరు గనంగను బీజాఖ్య పరఁగు విత్తు విత్తనము గింజ గిజ రన వెలయు నీశ.

39


సీ.

పేసె మనంగను బేసాఖ్య విలసిల్లుఁ బసురు పస రనంగ స్వరస మొప్పుఁ
బసరుమొగ్గ యనంగఁ బసిమొగ్గ యనఁగను క్షారకనామ మై మీఱును నన
యనఁగను గోరకం బమరుఁ గుచ్చన గుత్తి యన గువి యనఁగ గుచ్ఛాఖ్య దనరు
మొగ్గన మొగడన ముకుళంబు దగు నొప్పుఁ బూ పూవు పువ్వు పువు విరి యలరు
నా సుమం బగు బూఁదేనె నాఁగఁ బుష్పరసము పుప్పొడి యనఁగఁ బరాగ మొప్పు
ననితనిజదాస త్రిశిరఃపురాధివాస మూర్ధధృతగంగ శ్రీమాతృభూతలింగ.

40


సీ.

మొల్లలు మల్లెలు మొదలైనశబ్దము ల్బహుతను దముదుపుష్పముల దెలుపు
జొన్నలు రాగులు మున్నగు శబ్దము ల్బహుతను దమతమఫలము లగును
గంద పసుపు మొదల్గాఁగలయవి యేకవచన మై నిజమూలవాచ్యము లగు
గంజాయి మొదలుగాఁ గలిగినయవియెల్లఁ బత్త్రసమాఖ్యలై పరఁగుచుండు
నంగు లగువృక్షముల పేరు లంగములుగఁ బత్త్రఫలపుష్పములయందుఁ బరఁగుచుండు
నవలఁ జెప్పెద వృక్షభేదాఖ్య లెల్ల భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

41


సీ.

రావియం చనఁ గుంజరాశన మగు గంగరావియం చనఁగను బ్రహ్మదారు
వెలఁగయం చనఁగఁ గపిత్థంబు చెలువగు నత్తి మేడి యనంగ నవు నుదుంబ
రంబు కాకోదుంబరంబు మీఱును గాకి మేడియం చన బొమ్మమేడి యనఁగఁ
గపురపుటనఁటి నాఁగాను నేడాకుల యనంటినా సప్తపర్ణాఖ్య దనరు
రేల యం చనఁ బరఁగునారేవతంబు నిమ్మయం చనఁగా జంభలమ్మ దోఁచు
నదియె గొప్పైన గజనిమ్మ యనఁగఁ దగును భూషికభుజంగ శ్రీమాతృభూతలింగ.

42


సీ.

వరుణనామము లులిమిరి యన మొగలింగ నాఁగ నిసుకమ్రాను నాఁగఁ దనరుఁ
బొన్నయం చనఁగను బున్నాగమౌ సుర పున్నాగ మౌ సురపొన్న యనఁగ
వారిజమం చన బారిజమం చనఁ బారిభద్రాఖ్యయై మీఱు నెమ్మి
యన నేమిసంజ్ఞయౌ నంబాళ మనఁగను నామ్రాతకాఖ్యయై యలరు నిప్ప
యన మధూకంబు నీరిప్ప యన మధూలక మగుఁ దగు గోను గోఁ గనఁగను సుపీలు
కందరాళము కొండగోఁ గనఁగఁ గొండ గో ననఁగఁ బరఁగుఁ ద్రిశిరఃకుధరనిలయ.

43


సీ.

ఊడుగు నాగను నొప్పు నంకోలంబు నెగడుఁ గింశుకము మోదుగ యనంగఁ
బ్రబ్బ ప్రబ్బలి యనఁ బరఁగు వేతనసంజ్ఞ శిగ్రువు మునగ నాఁ జెలఁగుచుండు
మధుశిగ్రునామమై మను నెఱ్ఱముగ తినయ్యమునగ యనఁగ గారుమునగ యన
వనశిగ్రు నామమై తనరుఁ గుంకు డనంగ ఫేనిలసంజ్ఞ యౌ బిల్వ సంజ్ఞ

పరఁగు మారే డనంగను బ్లక్షసంజ్ఞ నివ్వటిలు జువ్వి యనఁ గలుజువ్వి యనఁగఁ
గూటపర్కటి యగును న్యగ్రోధ మగును మఱ్ఱి యనఁగ జగన్నేత మాతృభూత.

44


సీ.

లొద్దుగనాఁగను లోధ్ర మౌ
మామిడి మావి యనంగ నామ్ర మగుఁ దియ్య.
మామిడి యన నెలమావి యన్నను సహకారనామంబుగా మీఱుచుండు
గుగ్గిల మం చన గుగ్గులువు దనర్చు విరిగి యం చనఁగను వెలయు శేలు
క్షుద్రశేల్వాఖ్య యగును నక్కవిరిగినా శ్రీపర్ణికాఖ్యయై చెలఁగు రేఁగ
నంగఁ గర్కంధువు దనర్చు గంగరేఁ గనంగ లకుచాఖ్య కమ్మరే ననఁగ నక్క
రే ననఁగ వెలయును చురిమ్రాను వెలకు నాగ భవ మొప్పుచుండును నాగభూష.

45


సీ.

ములువెలమ యనంగఁ జెలఁగును స్వాదుకంటకనామధేయ మీడ యనఁ బరఁగు
నైరావతాభిధ నారద బ్బనఁగ నా రంగాభిధాన మై ప్రబలుచుండు
నేరే డనంగను నేరె డనంగను బంబూసమాఖ్యలై చనును గాకి
నేరే డనఁగ నక్కనేరే డనఁగ నేలనేరే డనఁగ జన్ననా రహిగను
భూజంబునామంబు పొల్చుఁ దిందుకసంజ్ఞఁ దుమికి యనంగను డుమ్మిక యనఁ
బ్రక్కి ప్రక్కె యనం బిచులంబు దనరు గుమ్మ డనఁగను గుముదిక సమ్మతివడుఁ
గడిమి కడప యటం చనిఁబడుఁ గదంబ మడరు భల్లాతకియు జీడియన మహేశ.

46


సీ.

చింత యనంగను జించయౌఁ దత్ఫలైకాంశంబు గుడిసెయం చనఁగ వెలయుఁ
బిచ్చె యనంగఁ దద్బీజంబు విలసిల్లు వేగి వేగినఁ యన వెలయుఁ బీత
సాలాఖ్యగా సాలసంజ్ఞ గాఁ దగు నిమ మద్దియ నా నల్గమద్ది యనఁగఁ
బాలయం చనఁగను బరఁగును క్షీరికాహ్వయము గార యనంగ నలరు నింగు
దియు నిరాజిలుఁ బూరణీ తేజరిల్లు బూరుగం చనఁగను గొండబూరుగ యనఁ
గాను జనుఁ గూటశాల్మలి కాను గనఁగ దనరును గరంజసంజ్ఞ యంధకవిరోధి.

47


సీ.

నెమలియడుగుమ్రాను నెమిలియం చనఁగను బతికరంజంబు పొల్చుఁ జండ్ర
యన ఖదిరం బొప్పు నరిమేద మలరును దుమ్మయం చనఁ దెల్లతుమ్మ యనఁగ
విట్ఖదిరాఖ్యయై వెలయను గదరమౌ నుండ్రస యనఁగను నుండ్ర యనఁగ
నేరండనామమై మీఱు నాముద మన జమ్మియం చనఁగను శమి దనర్చు
మంగ యనఁగను మదననామంబు చెలఁగు దేవదారి యనంజను దేవదారు
పాటలి పొనంగుఁ గలిగొట్టు పొదిరి యన భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

48


సీ.

కచ్చగ చ్చనఁ జెల్వుఁ గాంచుఁ గాచస్థాలి ప్రేంకడ మనఁగను బ్రేంకణ మనఁ
దోఁచుఁ బ్రియంగువు దుందిల మనఁగను దుండిక మనఁగను దుందుక మనఁ
బెద్దమా ననఁగను బెనుమా నన న్మహానింబనామములుగా నెగడుచుండు

శింశుపానామ మై చెలఁగు నిరుగు డన దిరిసెము గిరిసెము దిరిసెన మనఁ
జనును శిరీషాఖ్య సంపంగి సంపెఁగ యనఁ జంపకాహ్వయ మౌను బొగడ
యనఁగ వకుళంబు దనరును నమృత మీఱు నుసిరిక యటం చన న్నేలయుసిరిక యన
నలరు భూధాత్రి తాడియనన్ విభీతకంబు విలసిల్లుచుండును సాంబమూర్తి.

49


సీ.

కరకయం చనఁగను బరఁగు హరీతకి యళదయం చనఁగను హళది యనఁగ
సరళంబు చనుఁ బనస యనంగఁ బనస మౌ వే మన నింబ మై వెలయుచుండు
గరివేము నాఁగ నమరుఁ గృష్ణనింబము నేలవే మనఁగ భూనింబ మొప్పు
దాడింబ యనఁగను దాడిమం బలరును దర్కారి యొప్పును దక్కిలి యనఁ
దక్కె డనఁ దక్కెల యనంగఁ దక్కె యనఁగ నెల్లి యన నగ్నిమంథము నెగడుఁ గొడస
కొడిసె యనఁ గుటజం బగుఁ గొడిసెపాలు నాఁగ నింద్రయవము తోఁచు నాగభూష.

50


సీ.

పాలకొడిసె యనఁబడు శ్వేతకుటజంబు కలిపినాఁ గృష్ణపాకఫల మమరుఁ
జీఁకటిమ్రా ననఁ జెలఁగుఁ దమాలంబు వావిలి యన సిందువార మలరు
బందెడ యనఁ దెల్లవావిలి యన శ్వేత సురసాభిధాన మై పరఁగుచుండు
దావరడంగి నా దేవతాడన నేర వకడయం చనఁగను వఱలు దేవ
తాళనామంబు మల్లెనాఁ దనరు మల్లి యడవిమల్లె నా నాస్ఫోట యగును బొండు
మల్లె యనఁగ మహామల్లి మనును నిత్తె మల్లెనా నిత్యమల్లియౌ మాతృభూత.

51


సీ.

నాగమల్లె యనంగ నాగమల్లిక మీఱు శ్రీహస్తీనీసంజ్ఞ చెలఁగు గురువు
నాగ మొల్ల యనఁ గుందము చెలంగును యూధిక యవరు నడవిమొల్ల యన గురిజ
గురిగింజ నాఁగను గుంజాఖ్య విలసిల్లుఁ దగును మాధవియు బండిగురువిం ద
నంగఁ గుజ్జంబు గొజ్జంగి గొజ్జెంగ నాఁ జను జాజి యనఁగను జాతి వెలయు
మనును విరవాది యన నవమల్లికాఖ్య వలుఁ జేమంతి యనఁగ సేమంతి మంకె
న యన బంధూక మగు దాసనం బటన్న జపకుఁ బేరై తనర్చును జంద్రమాళి.

52


సీ.

మైద గోరంటనా మనుఁ గురంటకసంజ్ఞ కొరవినాఁ గ్రోవినాఁ గ్రొమ్మినాఁగఁ
గురువకనామమౌఁ గరవీర మలరును గన్నే రనంగను గన్నే రనఁగ
వెణుతురు నాఁగను వెలయంఁ గరీరంబు మాదిఫలం బన మాతులుంగ
మొప్పు నుమ్మెత్తన నున్మత్త మలరును బైఁడి యుమ్మెత్తనాఁ బరఁగుఁ గాంచ
నాహ్వయము మర్లుమాతంగి నాఁగను మరు లుమ్మెత యనంగ మదనాఖ్య యొనరు గగ్గె
ర యనఁ జెన్నారును గఠింజరాభిధాన మర్క మలరును జిల్లే డటన్న నభవ.

53


సీ.

బదనిక పదనిక బవనిక యన వంద చనుఁ దిప్పదీఁగెనాఁగను గుళూచి
చెలఁగును మోర్వాఖ్య యలరును జాఁగన విసబొద్ది యనఁగను వెలయుఁ బాధ

దూలగొండి యనంగ దురదగొండి యనఁగఁ దీఁటకోవెలయనఁ దేజరిల్లుఁ
గండూర కచ్చురాఖ్యగ విరాజిలుఁ దీఁటకసివింద యన నెలుకచెవి యనఁగ
నెలుకజీడి యనంగను నెనఁగు జిత్ర యొప్పుచుండు నపామార్గ ముత్తరే న
నంగ బారంగి గంటుబారంగియుఁ జిఱు తేఁ కనఁగ బార్ఙ్గి వెలయును ద్రిపురవైరి.

54


సీ.

కోలపొన్న యనంగఁ గొమరారుఁ బృశ్నిపర్ణియుఁ గ్రోష్టుపుచ్ఛియౌ నేలపొన్న
నా నక్కతోఁక పొన్ననఁ బోర్లుగాడినా రోఁకఁటిబండ నారూఢి కెక్కుఁ
కారుగ చ్చనఁగను గ్రాలు వాకూచియుఁ బల్లేరనశ్వదంష్ట్ర పరఁగుచుండుఁ
జిఱుపాల యనఁగను క్షీరావి చిన్నొందుఁ బిల్ల పీఁచర యనఁ బీఁచర యనఁ
బ్రబలును శతావరి పసుపు పసు పసంగ వఱలును హరిద్ర వస యన వజ యనంగ
వచకుఁ బేరు చెలఁగు నతివస యనంగ నతివిషాభిధ విలసిల్లు నంగజారి.

55


సీ.

అడ్డసర మనంగ నటరూషనామమౌ గింటెన యనఁగను దింటెన యన
గిరికర్ణి చెలువొందు క్షురము విరాజిల్లు గొబ్బి యనంగను గొలిమిడి యనఁ
గోకిలాక్షము ములుగొలిమిడినా మీఱు నలరు సదాసయం చన మధురిక
చెము డన జెము డనఁ జెలఁగు సింహుండము ముత్తవయం చనఁ బోలును బల
నూనెముంత యనంగను నొప్పు గుచ్ఛ బలయం జీబిలి కన నాగబల చెలంగుఁ
దడ యనఁగ ధన్వ మగు గూబతడ నులితడ యన మహాబల దనరు వృషాధిరూఢ.

56


సీ.

గిలిగిలచెట్టునా గిలిగింతచెట్టునా గిలిగిచ్చచె ట్టన గిలకచెట్ట
టన్న ఘంటారవయౌను దాకన ద్రాక్ష యగుఁ ద్రిపుట వెలయుఁ దెగడ యనిన
నెగడు విదార్యాఖ్య నేలగుమ్మడి యన నోమమం చన దీప్య మొప్పుచుండు
నీరుసిప్పలియం చనిన బొక్కెన యనంగఁ దోయపిప్పలిసంజ్ఞ దోఁచుచుండుఁ
జనుఁ గురాసానియోమమం చన యవానికాభిధ సుగంధిపాలయం చనిన దూడ
పాలయన గోపికాఖ్యయై పరఁగు మామెనయన నుత్ఫుల్లశారిబాహ్వయ మగు భవ.

57


సీ.

అరఁటి యరం టంటి యనఁటి యనంటినాఁ గదళికాహ్వయములై పొదలుచుండుఁ
దత్ఫలగుచ్ఛంబు దనరు నత్త మనంగఁ జనును జీపనఁ దదంశాఖ్యగాను
బొందెయం చనఁగను బొల్చును గదళీత్వ గంతర్గతశ్వేతకాండసంజ్ఞ
తత్కేసరాగ్రవృత్తాంశంబు గోరనఁ దత్కేసరాంతర్గతాచ్ఛసూచి
కానిభాంశంబు మ్రుచ్చనఁగాఁ జెలంగుఁ బిల్లిపెస రనఁగాఁ గాకిపెస రనఁ దగుఁ
గాకముద్దాఖ్య తప్పెట కారుకొల్లి మాడి యనఁగ వనకుళుత్థ మగు మహేశ.

58


సీ.

వంగ యనంగను వార్తాకమై యొప్పు నీరెత్తువంగ నా నీరు వంగ
యనఁగను వృంతాక మలరుఁ గత్తెరవంగ యనఁగఁ గర్తారిక దనరుచుండుఁ

దచ్ఛలాటువుఁ బల్కఁదగును వంకాయనఁ గంటకి చను ములుక యన నేరు
వంగనా బృహతియౌ వాఁకుడు నాఁ బిన్నములకనాఁగను నేలములక యనఁగ
రాములకనాఁగ సర్పాక్షి ప్రబలు నల్లతెగడనాఁగఁ ద్రివర్ణాఖ్య తెలియఁబడుచు
నుండు ముయ్యాకుపొ న్నన నొప్పుఁ బ్రత్తి యనఁగఁ గార్వాసి రజతగిర్యగ్రవాసి.

59


సీ.

బీరన బీఱనా వెలయుఁ గోశాతకి నేతిబీఱ యనంగ నెగడుచుండుఁ
దద్భేదనామంబు ధామార్గవం బొప్పు నడవిబీఱ యనంగ నావడయనఁ
జేఁతిబీఱ యనంగఁ జెలఁగు బటోలము పొట్లయం చనఁగను బొళ్ల యనఁగ
జేఁతిపొట్ల యన భాసిలును దిక్తపటోల మలరును దొండయం చనఁగ దుండి
కాకిదొండ యనంజను గాకబింబ తుర్యతుండి చెలఁగుఁ బిండిదొండ యనఁగ
నారుదొండ యనంబడు నార్తగళము భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

60


సీ.

చెప్పుత ట్టనఁగను జెలఁగు గోదావరి నేలతాడియనంగ నెసఁగు ముసలి
దుట్టుపు దుట్టువు జుట్టు పనంగను ద్వంద్వఫలాఖ్య యై తనరుచుండు
నెద్దునాలిక యయి యిరువొందు గోజిహ్వ తాంబూలవల్లిక తమలపాకు
తీఁగెనాఁ జెన్నొందుఁ దెలియంగఁదగును నూదోస రేణుకలు కూఁతురుబుడ మన
వాలుక మ్మగు హ్రీబేరవాచకముగఁ బొసఁగుఁ గురువే రనంగ రావూ వనంగ
నశ్మపుష్పంబు వెలయును నందు గనఁగ మురు మనఁగ హ్రాదినీసంజ్ఞ పరఁగు నభవ.

61


సీ.

ఆరెపు వ్వనఁగను నారె లనంగను ధాతకీకునుమంబు దనరుచుండు
నేలకి యం చన నేలాభిధానము రాక్షసి చను బలురక్కసి యనఁ
బులిగోరు చెట్టన వెలయం వ్యాఘ్రనఖంబు బెత్తమం చనఁగను వేత్ర మలరుఁ
బేమ టం చనఁగఁ దద్భేదంబు విలసిల్లుఁ జెలఁగు శంఖిని కట్లచె ట్టనంగఁ
దొపరిమ్రా ననఁ దువరిక దోఁపబడును గ్రంథిపర్ణంబు పొల్పగు గండివనము
నాఁగ నాగిని నావురు నాగు రనఁగఁ గేరుఁ దలపోటముగను దంగే డన భవ.

62


సీ.

పెన్నే రనంగను బెన్నెర నంగను దొమ్మడో లనఁగను దోఁచు నశ్వ
గంధ బలుసు కార కసివెంద యన నొప్పుఁ గాసమర్దం బిందుగ యనఁ జిల్ల
యనఁ గతకం బగు నారుకాభిధ మీఱు నారు నాఁ దగు నుప్పి యనఁగ లవణి
సురిగి యం చనఁగ శిఖరిణికిఁ బేరౌను జైలఁగు నక్షోళము చిలిమిడి యన
నుచ్ఛిఁత యనంగ నుండిక యొప్పు ముల్లు ముస్తె ముల్లుచిఁత యనంగఁ బో లలర్క
మలరు గొట్లె యనఁగ ఘంటాభిధాన మురువృజినభంగ శ్రీమాతృభూతలింగ.

63


సీ.

వాలు డనంగను వాతారి విలసిల్లు గురుగటం చన్నను గురి యటన్న
ములుగటం చన్న నర్బుదఫలి మనుచుండు నగిసె యటం చన్న నలనతసిరు

సీ.

యెసగంగ క్షమ యొప్పు నెఱ్ఱగిసె యనంగ బర్బుర మలరు బొబ్బలి యనంగఁ
బొనికయం చనఁదగు ముంజము కుమ్మర పొనికనాఁగను గృష్ణముంజ మొప్పు
జీలు గనఁగను దీర్ఘయష్టిక దనర్చు వనతువరి దోచుఁ గారుకం దనఁగ బెండ
యనఁగ గోజిహ్వ దగు ముండి యలరు బోడతర మనంగను గైలాసపురనివాస.

64


సీ.

గవ్వగుత్తిక యన గవ్వగుత్తి యనంగ జనుఁ గపోతాంఘ్రి దూసర యనంగ
దూయుతీఁగె యనంగ దుస్సర యనఁగ సుదర్శనలతపేరు దనరుచుండు
శరపుంఖినామమై పరఁగు వెంపలి యనఁ దులసీసమాఖ్యయౌఁ దొలసి యనఁX
గొండపిండి యనంగఁ బిండికొండ యనంగ నగ భేదసంజ్ఞగా నలరుచుండుఁ
బొదలుఁ బిండీతకమ్ము గాడిదగడపర చాగరాడి వెలికి యటం చనఁ గుమారి
పరఁగుఁ గలుబంద యనఁగఁ బర్పాటకంబు మనును బిచ్చుకకాలునా మాతృభూత.

65


సీ.

పులుగు డనంగను బులిసరి యనఁగను బాలకినీసంజ్ఞ పరఁగుచుండు
శీధ్రకనామంబు చెలఁగుఁ జిల్లనఁగను దీండ్రయం చనఁగ నుద్వేజన మగు
వెలమసంది చివికివెల మనఁగాఁ గాక జంఘాభిధానంబు చనును జిలుక
ముక్కునా శుకనాస పొలుపుఁగాంచును గుక్కపాలన పటపత్త్ర పరఁగుచుండుఁ
దేలుమొనచె ట్టనంగను దేలుకొండి నాఁగ మను వృశ్చికాళ్యాఖ్య నాగిని యగు
గొల్లజి డ్డనఁ గుందేటికొ మ్మనంగఁ బరఁగు శశశృంగనామంబు గరళకంఠ.

66


సీ.

ఆకు పువ్వును గాయ యాదిగా నివి యెల్ల గూరయం చనఁగను మీఱుచుండుఁ
బుట్టకొ క్కనఁగను భూస్ఫోటసంజ్ఞయౌఁ దనరుఁ జిఱ్ఱి యనంగఁ దండులీయ
మగు నీరుచిఱ్ఱినా నప్తండులీయంబు చెలిమిడియనఁ దద్విశేష మొప్పు
శంఖపుష్పకి పేరు చను మిత్తయం చన వాయంట యనఁగ బర్బర చెలంగుఁ
గుక్కవాయంట నాఁగఁ జెంపెక్కు శ్వానబర్బరాభిధ మత్స్యాక్షి పరఁగుచుండుఁ
జొన్నగంటి యనంగను బొద్ది యనఁగ వృద్ధధారక మలరును వృద్ధవంద్య.

67


సీ.

తనరు విశల్యయై తరిగొఱ్ఱ చెన్నచెఱుకు పొత్తి నాఁగఁ గారుమిను మనఁగఁ
జను మాషపర్ణి చెంచలి యనఁగను విషఘ్న మలరును సునిషణ్ణకాఖ్య దగును
బులిచింత యనఁగను బులిచెంచలి యనంగ నామవేతససంజ్ఞ యలరుఁ జుక్క
పుల్లప్రబ్బి యనంగ ముణుఁగుఁదామర నా మొగడుఁదామ రన నమస్కారి చెలఁగు
సంబరే ననఁ జరకసంజ్ఞ యొప్పు బరఁగుఁ బెనుపాల యనఁ బిన్నపాలయం చ
టన్న జీవంతికయు దంతె యసఁగ దంతి మనును దాసీకృతవిధాత మాతృభూత.

68


సీ.

స్థలపద్మ మగు మెట్టతామర యనఁ బైఁడితామర యనఁ బచ్చతామర యన
నేలతామర యన నెగడు దద్రుహ్నుంబు తరిగిసె యనఁగను దనరు నెఱ్ఱ

యుల్లియం చనఁగ నీరుల్లినాఁగఁ బలాండు వొప్పు లశునము వెల్లుల్లి యనఁగ
గలిజె రనంగను గలిజే రనంగఁ బునర్ణవసంజ్ఞగా నమరియుండు
సోమగంధాఖ్య వెలయును సోమేద యన గుంటగలిజేరు కలగర గుంటకలగ
ర యనఁ జెన్నొందు నౌభృంగరాజసంజ్ఞ భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

69


సీ.

జ్యోతిష్మతీసంజ్ఞ యొప్పు నెక్కుడుఁదీఁగె యనఁగ వారాహి పాఁ చనఁగఁ బరఁగు
వజ్రవల్ల్యాఖ్యయై వరలు నల్లే రనఁ గాచి యనందగు గాకమాచి
సీకాయచెట్టన సీగయన సిక యగు సీకాయ యనఁదగు సికఫలంబు
సారణి గొంతెమగోరు లంజెసవర మన నగుఁ గోరింద యన జతూక
వెలయుఁ గాకర యనఁ గారవేల్ల మెసఁగు నడరు నాఁగాఁకర యనంగ నడవికాక
ర యనఁ గర్కోటకియుఁ గాసర యనఁ గాఁచర యనఁ గాశాదనీసమాహ్వయ మగు భవ.

70


సీ.

గుమ్మడి యనఁగను గూశ్మాండ మగుఁ బెద్దదోసనాఁ ద్రపుసము దోఁచు నక్క
దోస యనంగ క్షుద్రోర్వారుకము మీఱు ములుదోస నాఁగను వెలయుఁ గంట
కోర్వారుకమ్ము తిక్తోర్వారుకాభిధ చేఁతిదోస యనంగఁ జెలఁగుచుండు
బుడమనాఁ దద్భేద మొప్పు నానుగ మన సొరనా నలాబువు పరఁగు వరద
చేఁతిసొరనఁ దిక్తాలాబు ఖ్యాతిఁ గాంచు వారుణి దనర్చుఁ బిన్నపాఁప రన నింద్ర
వారుణి చెలంగుఁ బెద్దపాఁపర యనంగ గంద యన సూరణాఖ్య యౌ గరళకంఠ.

71


సీ.

చిరుగడం బనఁగను జెలఁగును మధురకందంబు గండీలంబు దనరుఁ బెండ
ల మ్మన శింబియౌఁ జమ్మ తంబ యనంగ వల్మీకశింబియై వఱలుఁ బుట్ట
చంబ యటం చనఁ జనుఁ జిక్కు డన క్షుద్రశింబి పుచ్చ యన భాసిలుఁ గళింగ
మల్లుబచ్చలి యటం చనఁ దీఁగెబచ్చలి యనఁగఁ గలంబాఖ్య యలరు దుంప
బచ్చలి యనఁగ సుపోదకి పరగుచుండుఁ బొలుచు నామ్లకలంబాఖ్య పుల్లబచ్చ
లి యన ముల్లంగినాఁగను రీతిఁ గాంచు మూలకాభిధ శ్రీమాతృభూతలింగ.

72


సీ.

గంజాయియం చన గాంధారి చెన్నొందు గాఁజరయం చనఁగాఁ గళంజ
మగుఁ జిల్కయం చన నౌ హిల మోచిక బాష్పశాఖాఖ్యయై పరఁగుఁ గోయ
దోఁటకూ రనియెడిమాట పెరుకుతోఁట కూర పెరుగుతోఁటగూర యనఁగఁ
జనును మహాభాష్పసంజ్ఞ దొగ్గలి యన రక్తబాష్పాఖ్యయై ప్రబలుచుండుఁ
దుమ్మియం చనఁ దనరును ద్రోణసంజ్ఞ గురు గనంగను జెలఁగును గురుకటాఖ్య
మొహళ మనఁగను సవరగు మోహళంబు పన్నె వెదు రన మను వృత్తపత్త్ర మభవ.

73


సీ.

కుచ్చలియం చనఁ గుచ్చెలి యనఁగను గోళి యటన్నను గోలి యొప్పుఁ
బావిలియం చనఁ బరఁగు దద్భేదంబు గరిమిడి గఱికినాఁగ జను దూర్వ

తుంగ యనంగఁ జెలంగు ముస్తాభిధ వేణునామం బగు వెదు రనంగఁ
గీచకసంజ్ఞ యై తోఁచు బొం గనఁ గన్ను కనుపు గంటు గనుపం చనఁగఁ బర్వ
మమరుఁ గంతి కణింది బోటు ముడి గుబ్బ బుడిపి ముడుత యనంగను బొసఁగు గ్రంథి
యించు చెఱకనఁ దనరును నిక్షుసంజ్ఞ చనును రసదాడి యనఁగ రసాల మభవ.

74


సీ.

ఇక్ష్వాదికాండాఖ్య యెసఁగును గడ యన వాడెదవ యన నిక్ష్వగ్ర మొప్పు
గనె గండ్ర గండ్రిక గనియ యటంచన నిక్ష్వాదిఖండము లెన్నఁ దగును
గాకిచెఱు కనంగఁ గను మన శర మగుఁ గాశము ఱెల్లునాఁగను దనర్చుఁ
గిక్కస యనఁగఁ బెం పెక్కును నలసంజ్ఞ బొదయన బల్బజం బొనరుచుండు
వీరణాభిధ యౌరు నా వెలయు వట్టివేరు నాఁగ నశీరంబు మీఱుచుండుఁ
గస వనంగను దనరుఁ గిక్కస మొదలుగఁ గుస్సె దబ్బన దర్భ లగు న్మహేశ.

75


సీ.

క్షారతృణం బగుఁ గారెనాఁ గామంచి కావంచి యనఁదగుఁ గత్తృణంబు
నెండ్రయం చన ఛత్ర నెగడును జిప్పల చిప్పనా భూస్తృణ మొప్పు రక్త
తృణము చెంగలి యన గణుతి కెక్కును గడ్డి గాదము గవతము కసపు కవసు
పుల్లు పూరి యనంగఁ జెల్లును దృణసంజ్ఞ నలి యన నలు సన నలరు శుష్క
తృణము దుబ్బనఁ గామూల మెసఁగు బుల్ల పుడక యనఁగను దృణకాండము చను జొప్ప
యనఁగఁ దనరును యావనాళాదిసదనదండనామంబు మేరుకోదండహస్త.

76


సీ.

యావనాళాదిదండాఖ్య దం టన మీఱుఁ బచ్చిక యనఁ జను బాలతృణము
వామియటం చన వఱలును దృణతతి తొంట యనంగఁ దన్ముఖము దనరు
వంద వదియ వదె వందెయం చనఁ దృణతతివిశేషం బొప్పుఁ దా డనంగ
దాళాఖ్య యగు బాలతాళాఖ్య బొందనాఁ బరఁగుఁ గమ్మనఁ దాళపర్ణ మెసఁగుఁ
దత్పుటం బౌను బొటయనఁ దాళపుటనఁ బత్త్రవృంతంబు మట్టనా వఱలు మోపు
నాఁగఁ దాళాగ్రతరుణవర్ణంబు తెలఁగుఁ దాళపేశంబు గుంజనఁబోలు నభవ.

77


సీ.

తాళాదికశలాటు తనరు బొండ్ల మనంగఁ గెంగటం చనఁగఁ జెలంగుఁ దాళ
బీజాభిధానంబు రాజిలు నారికెడంబు టెంకాయచె ట్టనఁగ నాళి
కేరనామం బెళనీ రటం చనఁ జనుఁ దచ్ఛలాటుజలము తత్ఫలంబు
టెంకాయ యనఁగఁ రూఢిగను గొబ్బె రనఁ గొవ్వెర యటంచనఁగఁ దత్సేక మెసఁగుఁ
బోఁక యనఁ బోఁక్రమాననఁ బూగ మొనరుఁ బోఁక యనఁగను వెలయును బూగఫలము
ఖండితము లైనయవియ వక్కలనఁ దగును నలరు హింతాళ మీఁదా డనంగ నభవ.

78


ఉ.

కేరును గేతకి నొగలి గేదఁగియం చనఁ బేరులొప్పుఖ
ర్జూరము గజ్జురం బనఁగ శోభిలు నీఁ దన నీఁత నాఁగ ఖ

ర్జూరిక తాడి మున్నగుతరు ల్పులు మ్రాకు లనంగఁ బోలు నీ
హారగిరీంద్రజాహృదయహర్మ్యగతీ త్రిశిరఃపురీపతీ.

79


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగును వనౌషధీనామవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

80

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

సింహాదివర్గము

క.

మెకములఱేఁ డనఁ దెరవా, మెకమన సింగమన బొబ్బమెకమనఁ జనుఁ జు
మ్ము కరిరిపునామధేయము, లకలంకదయారసార్ద్రితాంతఃకరణా.

81


సీ.

బెబ్బులి యం చన వెలయు మహావ్యాఘ్ర మల్పశార్దూలాఖ్య యలరుచుండుఁ
జిఱుత చిఱుత పులి చిఱు పులి యం చన వాలము వేఁగినా వ్యాళ మెసఁగుఁ
జివ్వంగి నాఁగను జెలఁగుఁ దరక్షువు చాఱయం చనఁగను జాఱిక యన
వ్యాఘ్రవర్ణం బొప్పు నగు గోఁదిరిం పన వ్యాఘ్రగర్జాధ్వని వాలుమెకము
పంది సలు గేకలమ్మనఁ బరఁగు ఘృష్టి దనరు గామిడికాఁ డనఁ దద్గణేశుఁ
డలరుఁ దద్ఘోణ ముట్టెయం చనఁగఁ బుడ్డగింపనఁగఁ దద్ధరాఘాతి గేరు నభవ.

82


సీ.

హనుమఁడం చనఁగను హనుమదాఖ్యయుఁ గ్రోఁతి తిమ్మడం చన వానరమ్ము దనరు
గొండము చ్చనఁగను గొండంగి యనఁగ గోలాంగూల మెసఁగును నింగిలీక
మన మర్కటవిశేష మగు నెలుఁగం చన భల్లూకనామమై ప్రబలుచుండుఁ
గారెనుపో తనఁ గారుదున్న యనంగ వనమహిషం బొప్పు వఱడు నక్క
నాఁగ జంబుకమౌఁ గొంకనక్క యనఁగ క్షుద్రజంబుక మంచు నెంచుకొనఁదగును
వృకము తోఁడే లనం జను వెలయు శల్య మేదు సెలపంది యనఁగను వేదవేద్య.

83


సీ.

పిల్లియం చనఁగ జెల్లు బిడాలాఖ్య బావురుపిల్లినా బావు రనఁగఁ
జను మహామార్జాలసంజ్ఞ జాంగలబిడాలము జంగపిల్లినా నమరు బూత
పిల్లినాఁగను గమ్మపిల్లినాఁగను బున్గుపిల్లియటం చనఁజెల్లు గంధ
మార్జాలనామంబు మనును జవ్వాదిపిల్లియన సంకువు గోధికయగు నుడుము
నాఁగ మృగ మొప్పు నిఱ్ఱి యనంగ మృగియుఁ జెలఁగుచుండును లేడినా జింక యనఁగ
న్యంకునామంబు దగు పెంటిజింక యనఁగఁ బరఁగుఁ దత్స్రీసమాఖ్య సప్తర్షివంద్య.

84


సీ.

కొండగొఱియనాఁ దగును రోహిషాభిధ గోకర్ణనామం బగును గడంజు
కడఁజునాఁ బృషదాఖ్య యడరు దుప్పి యనంగ మనుబోతు మనుబిళ్ళు మన్ననంగ
ఋశ్యముదగుఁ గేసరి యన ఖేచర మగు సవరపుమెక మన జిల్లిమెక మ
నఁ జమరి వెలయు గంధర్వమౌను గడంతి కటకరమం చనఁగాను దుప్పి

యనఁగ రామంబు చను గవయమ్ము గోవ నాఁగ గొఱపోతునాఁగ దనర్చుఁ జెవుల
పోతు కుందే లనంగను ఖ్యాతిగాంచు శశసమాఖ్యలు బాలశశాంకమాళి.

85


సీ.

ఇప్పుడు చెప్పినయివియును సింగంబు మొదలుగా నావులు మొదలుగాను
పను లనఁదగు వేఱె పలికెద నాలుకనా మూషకసామాన్యముగఁ జెలంగుఁ
గల్లెల్క యనఁగను వెల్లెలుక యనంగఁ జిట్టెల్క యనఁగను జెలఁగు నిట్లు
కొన్ని తద్భేదము ల్కొక్కన గరిమిడి కొక్కనంగను బందికొ క్కనంగ
మూషికాభిధలగు గంధమూషికాఖ్య చుంచనంగను జుం డన నెంచఁదగును
గేరు నకులము ముంగిముంగిస యనంగ వెంట్రు వనఁగను బభ్రువు వెలయు నభవ.

86


సీ.

ఉఱుతనా నుడుతనాఁ దరుమూషికం బగుఁదోఁచు నూసరవెల్లి తొండ యనఁగ
సరటంబు నల్లికం చన నలికిరి యన మిండయం చనఁగను మీఱు రక్త
పుచ్ఛి బల్లి యన నొప్పును గృహగోధిక జాలకాఁడు చెలిఁదిసన్నపిల్లి
పాదొ ట్టనఁగ లూత పరఁగు దద్భేదంబు దోఁచు నీఁగపులి విందుపురు వనఁగఁ
బు ర్వనంగను బురు వనఁ బురు గనంగఁ గ్రిమి దనర్సును దగు వత్సకీటసంజ్ఞ
చీడపురు వన నత్తనాఁ జెలఁగు క్షుద్ర శంఖకీటంబు శ్రీబాలచంద్రచూడ.

87


సీ.

కాళ్లజెఱ్ఱి యనంగఁ గర్ణజలూకాఖ్య వెలయుఁ దే లనఁగను వృశ్చికంబు
ఎనుపతే లనఁ గృష్ణవృశ్చికం బగు మండ్రగబ్బనాఁ బృథువృశ్చిశాఖ్య యొప్పుఁ
దత్పుచ్ఛనామ మై తనరు గొండె యనంగఁ జెలఁగుఁ బిపీలిక చీమ యనఁగఁ
జెద లటం చన్నను శిథిలియౌ నల్లి నాఁ గాను మత్కుణ మొప్పుఁ బే ననంగ
నలరు యూకాఖ్య యీరునా వెలయులిక్ష యీసి యనఁగను లిక్షాన మెసఁగుచుండుఁ
బిడుఁ జనంగను బిణుఁజు నాఁ బిడుఁదు నాఁగ వఱలు గోమారి కైలాసపురవిహారి.

88


సీ.

పారావతం బగుఁ బావురాయి యనంగఁ బారువ మనఁగను బావుర మనఁ
దద్భేదములుగాను దనరుచుండును నేలపల్లటి యంతరపల్లటి సుర
టి లకోరి బట్టి యొడ్డీ కూకి బకదారి దూరబారు లనంగ శారికాఖ్య
గోరింక గోర్వంక గోరువంక గోరంక గోరువంక యనంగ మీఱుచుండుఁ
జనును శుకసంజ్ఞ బట్టికాఁ డనఁగ రామ తమ్మ యనఁ జిలుక యనఁగ దగును గోకి
లాభిధానము కోయిల యనఁగఁ బరఁగు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

89


సీ.

సాళ్వము జాలె వేసడము డేగలగుడు బైరి కణసరంబు నోరణంబు
జలకట్టె గిద్దుచెంచడ మన శ్యేనభేదము లివిగాకయు దళుకు బెళుకు
కంచు మిం చనఁగను గల వందు రన్నిట స్త్రీజాతి డేగనాఁ జెలఁగుచుండు
నది శ్యేనసామాన్య మని కొంద ఱందురు తోనికాఁ డనఁగఁ బుంశ్యేన మొప్పు

కత్తె మన్నను దన్నఖాహతికిఁ గేలఁ దొడిగియుండినచర్మంబు దోఁచియుండు
వానికనుమర్వు దనరుఁ దోపార మనఁగ దోరె మనఁగను దగు నానిదార మభవ.

90


సీ.

గూబ కోటఁ డనంగ ఘూకంబు విలసిల్లుఁ బరఁగు నేట్రింతనాఁ బసులపోలి
గాఁ డనినను వ్యాఘ్రఘాటాఖ్య యగుచుఁ గాటుకపిట్ట రువ్వపులుఁ గనఁ దనరు
ఖంజరీటాభిధ కంకణం బనఁగను రాబులుఁ గనఁగను బ్రబలు లోహ
పృష్టాఖ్య ధూమ్రాట మెసఁగును గూఁకటి మువ్వనాఁ గూఁకటీమూఁగ యనఁగ
బాలయం చనఁగఁ గికీదవంబు పరఁగు వెలయుఁ గనకక్షి సకినాలపులుఁగు గుబిలి
పైఁడికంటినాఁ జాతకం బలరు వానకోయిల యనంగఁ గైలాసకుధరనిలయ.

91


సీ.

కోడి యనంగను గుక్కుటస్త్రీ పుంస సామాన్యసంజ్ఞయై చనును గుక్కు
టంబు పుం జనఁగ నడరు నది పెంటిపో లికనున్నఁ బెట్టమారి యనఁ బరఁగుఁ
కుక్కుటినామ మగును బెట్టయనఁగను నారెబొట్టె యనఁ దదంఘ్రి జన్య
కంటకాతినిశితాంగం బొప్పుఁ గారుకో డనఁ జను వనకుక్కుటాహ్వయంబు
సలిలకుక్కుటనామంబు వెలయు నీరుకోడియనఁ బుల్లగొర కన గుండఁగి యనఁ
గర్కరేటువు దనరును గక్కెర యరం బిచ్చుక యనంగఁ జటకంబు వెలయు శర్వ.

92


సీ.

మ్రానిపోటుపులుఁగునా నొప్పుచుండు దార్వాఘాటనామంబు వాయసంబు
కాకినాఁ దగు మాలకాకి నాఁగను ద్రోణకాకంబు విలసిల్లుఁ గాకభేద
మగును జెమరుకాకి యన నీరుకాకి నా జలకాక నామమై చెలఁగుచుండు
వాత్యూహసంజ్ఞయై తనరుఁ గూకురుగుండె నాఁగ గృధ్రము గ్రద్ద నాఁ దనర్చుఁ
గాంచ కొంగ యనంగను గ్రౌంచ మెసఁగు బకము విలసిల్లు నారణపక్కి పక్కు
సగ్గటం చన నాడెలు బా తనంగ నగుశరారి పదాంబుజనతకిరీటి.

93


సీ.

గాఁ జనఁ గై జనఁగాఁ గపింజల మొప్పు బెగ్గు రుయ్యలచేఱుపిట్ట యుయ్య
లపులుఁగు నాఁగ సారస మగు జక్కవ యనఁ గోక మలరును హంస మంచ
మనఁ దగు రాయంచ యనఁ రాజహంసంబు పరగు బలాక కొక్కెర యనంగఁ
గొక్కరాయి యనఁ బెం పెక్కును విలసిల్లుఁ గోయష్టికము గుడ్డికొక్కెర యనఁ
బ్రబలును జతూక చీకురువాయి యనఁగఁ జీకురాయి యనంగను జీవుక యన
గబ్బిడాయి యనంగను గబ్బిల మనం దైలపాయిక చెన్నొందు దక్షశిక్ష.

94


సీ.

మక్షిక యీఁగ నా మను మధుమక్షిక తేనిఁగ జుంటీఁగ నా నెసంగుఁ
బెరయీఁగ నాఁగను బరఁగుఁ బతంగిక జోరీఁగ నాఁగను మీఱును బశు
పక్షిక వల్మీకమక్షిక యూసిళ్లు నాఁగను బహుతచే నలని యుండుఁ
గందురీగ లనంగఁ గణుదురు లనఁగాను గండోళి దగు మశకంబు దోమ

యనఁగ వెలయును జిమ్మట యనఁగ ఝిల్లి దనరు మిడుతన శలభంబు చను మిణుఁగుఱు
పుర్వనంగను ఖద్యోత మొనరుఁ దేటి తుమ్మెద యనంగ భృంగంబు దోఁచు నభవ.

95


సీ.

అళివిశేషంబుగా నడరును దూనీఁగ నెమిలి నట్టువపిట్ట నెమ్మి యనఁగఁ
గేకియై తగుఁ గేక కేఁక యనంగను దనరుఁ జంద్రకము క న్ననఁగఁ బరఁగుఁ
బురి యనఁ బింఛంబు మెఱయు జుట్టు సిక చుంచు సిగ కూఁక టన నుల్లసిలును శిఖి
పిట్ట పక్కి పులుఁగు పిట్ల గువ్వ యనంగఁ బక్షిసామాన్య మై పరఁగుచుండుఁ
గృత్రిమవిహంగ మొప్పు సకినె యనంగఁ బచ్చపిట్ట యనంగను బసిరికయన
హరితకం బొప్పుఁ గారండవాఖ్య కన్నెలేడి యనఁ జనుఁ జూడ బాలేందుచూడ.

96


సీ.

తీతువ యనఁగను దిత్తిరి యగుఁ గుక్కుభంబు గబ్బులుఁగు గుంపపులుఁ గనఁగ
వఱలు లావుకన లావక మొప్పును జకోర మగును వెన్నెలపిట్ట యనఁగఁ డిట్టి
భము లకుముకియనఁ బరఁగుఁ దద్భేదంబు నీరుచికాఁ డన నెగడుచుండు
వెలిచె యనంగను వెలయు వర్తకసంజ్ఞ మీలవల్లిక యన మీల ముచ్చు
నాఁగ వర్తిక చెలఁగు గోనర్ద మలరు వలికి యనఁగను భృంగాహ్వ వెలయు లింగ
రా జనఁగ వద రనఁగ నిద్రాహ్వ యెసఁగు మాతృభూత నగేంద్రజా మాతృభూత.

97


సీ.

గిజిగాఁడు పూరేడు కేర్జంబు పొన్నంగి వెన్నడాయి పరిక బెళవ రివ్వ
వంగపండు పిగిలి వామనపాతుకాఁడు నులంకి కాటికాఁడు పగడంపు
జిట్ట గొబడి డాబ జీనువ వడ్రంగి గున్నంగి పోపిట్ట గూడబాతు
కూఁకటికువ్వె కుటాక కళ్కు కరడు నల్లచ్చికాఁడును జల్లపిట్ట
యనఁగ నిట్లని పక్షిభేదాఖ్య లలరు మొదట నర్థంబు చెప్పిన యదియుఁ గాక
గూఁటిగువ్వన నణుజనఁ గురు జనంగ నీఁకరాల్చినపక్షియౌ నిందుమాళి.

98


సీ.

గఱి యీఁక చట్టుకు యెఱకడా కన నొప్పుఁ బక్షంబు లెక్కనాఁ బక్షతి యగు
లాపు లవిటినా నలరుఁ బక్షిపుచ్ఛాఖ్య యెగుపునాగను విహంగగతి దనరు
నండంబు గ్రుడ్డునా నమురును జెన యన నండద్రవం బొప్పుచుండు గూఁడు
నాఁ దగు నీడంబు బోదులా యనఁగను బోదెయం చనఁగను బోదనాఁగ
నిసు వనంగను బిల్లనా సిసుఁగనంగఁ గూన యనఁ గందు నాఁగను గొదమ యనఁగఁ
దిర్యగర్భకములుగాను దెలియవలయు నౌపచారికమాన్యాఖ్య లౌట శర్వ.

99


సీ.

గండనఁ బోతనఁగాను దిర్యక్పురుమాఖ్యయౌఁ దత్స్త్రీసమాఖ్య పెట్ట
యన మీఱుఁ దన్మిథునాభిధ పెంటిపోఁతు లనంగ విలసిల్లు దోయి జోడు
జంట జమళి కవ దంట యముడ యన ద్వంద్వ మై వరఁగు నత్తమ్ము దిమ్ము
గుబురు గుమురు గుంపు గుమి గమి పిండు మొత్తము తెట్టె పైకము దాఁటె లొద్ద

తుటుము మొల్లము మొల్లమి తుట్టె వర్గు వనఁగ వర్గము తగు మూఁక యనఁగ సంఘ
మౌను సమజము కదుపన నలరుచుండుఁ బుంగవతురంగ శ్రీమాతృభూతలింగ.

100


తే.

ప్రోక యనఁ బ్రో వనంగను బ్రోఁగునాఁగఁ, గుప్ప యన రాసి యనఁగను గువ్వ యనఁగ
రాశియగు మండె యనఁగను రాశిభేద, మలరుచుండు జగత్త్రయీమాతృభూత.

101


తే.

శ్రీలు వెలయంగ నీ పేరు జేయుకతనఁ, బరఁగుచుండును సింహాదివర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

102

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

మనుష్యవర్గము

సీ.

మానిసి మనిసినా మనుజసామాన్యంబు మందియం చన నగు మనుజవితతి
యారె మరాటివాఁ డన మహారాష్ట్రుఁడౌ గుజ్జరివాఁ డన ఘూర్జరుఁ డగుఁ
గన్నడీఁ డనఁగను గర్ణాటకుం డొప్పు నఱవయం చన ద్రావిడాఖ్య వెలయు
నాంధ్రుఁడౌఁ దెనుఁగువాఁ డనఁ దెల్గువాఁడన మగవాఁ డనంగను మగఁ డనంగ
బురుషుఁ డనఁ దోఁచుఁ బౌరుషంబు మగతనము మగఁటిమి యనంగఁ దిర్యక్సుమర్థమందు
నౌపచారిక మైన గం డనెడిపల్కు భావకర్మంబులను గూడఁ బరఁగు నభవ.

103


సీ.

బోటి చేడియ చేడె ప్రోయాలు పైదలి పొలఁతుక పొల్తుక పొలఁతి పొల్తి
యతివ తొయ్యలి కొమ యన్ను సకి తెఱవ నెలఁతుక పడఁతుక నెలఁత పడఁతి
యెలనాగ కోమలి యింతి చెలువ చెలి వెలఁదుక మెలఁతుక వెలఁది మెలఁత
నవలా మగువ నాతి నాతుక యాఁడుది లేమ గోల యువిద చామ చాన
గోతి బిత్తరి యుగ్మలి కొమ్మ కల్కి మడతి జోటిక ముద్దుగుమ్మ యన స్త్రీస
మాఖ్యలం చనఁగాను జెన్నలరుచుండు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

104


సీ.

చిగురుబోఁడి మిటారి చిలుకలకొల్కి వాల్గంటి మెఱుఁగుబోఁడి కలువకంటి
యన నిట్లు స్త్రీవిశేషాఖ్యలు చెన్నొందు, ముద్దరా ల్ముద్దియ ముగుద యనఁగ
ముగ్ధ యొప్పును బ్రౌఢ ప్రోడయం చన మీఱు గొంతియం చనఁగను గుంతితోఁచు
ద్రౌపది ద్రోవది ద్రోపది యనఁజనుఁ గైకేయి వెలయును గైక యనఁగ
మహిషి దేవేరి యనఁగను మనును గేస్తురాలన గరిత యనఁగ నిల్లా లనంగ
గృహిణి చెలఁగును భార్య పే రెసఁగుచుండు నాలు పెండ్లాము నాఁగ దేహధృతనాగ.

105


సీ.

కన్యాభిధానంబు కన్నె కన్నియ కన్య యన మూఁడుపేళ్లచే నమరియుండుఁ
గన్నెఱికం బనఁ గన్యాత్వ మొప్పును గొమిరెనాఁగఁ గుమారి యమరియుండు
జవరాలు గుబ్బెత జవ్వని యనఁగను యువతిసమాఖ్య లై యొప్పుఁ దగుఁ జి
రంటికిఁ బేరు పేరంటా లనంగఁ జిరంటిత్వ మెసఁగు బేరంట మనఁగ

ఱంకులాడి నాఁ జెడిపెనా ఱంకుటాలు నాఁ గులట యౌ ననాద యనదనఁ దగును
బేదరా లనఁగ దరిద్రి వెలయు వంధ్య యొనరు గొడ్రా లనంగ విధూత్తమాంగ.

106


సీ.

సకి సకియ యనంగ సఖి యొప్పు బోటినా బోటి కత్తియ యనఁ బోలు దూతి
పతిపత్ని యని పల్కఁబడు మగనాలునా నైదువరా లన నైదువ యన
నది వృద్ధయైన ముత్తైదువ యనుకొండ్రు తెలివికత్తె యనంగఁ జేరుఁ బ్రాజ్ఞి
దొరసాని రాణినాఁ దోఁచుచుండును రాజ్ఞి ప్రెగ్గడసాని నా వెలయు మంత్రి
భార్య దనరు నుపాధ్యాయభార్య యొజ్జసాని యన సోమిదము సోమిసాని యజ్వ
పత్నికిని నామధేయమై పరఁగుచుండు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

107


సీ.

నాగప్పసాని నా నాపసాని యనంగ నాకబలిచిరంటి నామ మెసఁగు
బాఁపతయం చన బ్రాహ్మణి చెన్నొందు క్షత్రియాణి చను రాచది యనంగ
గొల్లత వ్రేఁతనా గోపికాభిధ యొప్పుఁ జాకిత యనఁగ రజకి చెలంగు
చండాలకాభిధ చను మాలెక యనంగ బోయెక యనఁగను బొల్చు శబరి
పల్లెత యనఁగ మాతంగి పరఁగుచుండు నెఱుకత యనఁ గిరాతిగా నెసఁగుచుండుఁ
జెంచెత యనంగ మముఁ దద్విశేషసంజ్ఞ పుంగవతురంగ శ్రీమాతృభూతలింగ.

108


సీ.

మాచకమ్మ యనంగ మనుఁ బోట ముట్టుది యనఁగ నుదక్యయై తనరుఁ గుసుమ
ము ట్టన నార్తవం బొప్పుచుండును బ్రథ మార్తవం బెసఁగు సమర్త యనఁగఁ
జూలా లనంగఁ దోఁచును గర్భిణీసంజ్ఞ గర్భంబు వ్రేఁకటి కడుపు చూలు
నా మీఱు వేవిళ్ళునాఁగ బయ్యంక లం చనఁగను దౌహృదాఖ్యలు చెలంగుఁ
జిట్టుము లనంగఁ దదరుచి చెలఁగుఁ గాన్పు
నాఁగను బ్రసూతిపేరు దనరుఁ బ్రసూత
నెగడు బాలెంత యనఁ బ్రొద్దు నెల యనంగ
వైజనన మెసఁగు జిరాయు వలరు మాని
నాఁగ దేహవిభూషితనాదినాఁగ.

109


సీ.

ప్రసవమంత్రజ్ఞదాఁ బరఁగు మంతరసాని నాఁదగు దైవజ్ఞ సోదెకత్తె
యనఁగ వేలుపుసాని యనఁ గుట్టనీనామధేయంబు తాసికత్తియ యన నెడ
కత్తియ యనఁ బొంతకత్తియ యనఁగఁ గుంటెనకత్తియ యనంగఁ దనరు లంజెఁ
లంజియ లంజ వెల్లాటకత్తె పడుపుది వెలయా ల్బోగముది యన వేశ్య
బసివి యనఁగను దనరును బశుసి పేరు మనును దిధిషువుగా మాఱుమనువుది యనఁ
జనురు దగులాటకత్తెనా సంగినీసమాహ్వయము వైశ్యకన్యకామాతృభూత.

110

సీ.

పట్టి బిడ్డనఁగ నపత్యంబు దగఁ గన్నకొడుకు కొమారుఁడు కొమరుఁ డనఁగఁ
బుత్త్రాభిధానంబు పుత్త్రికాహ్వయ మొప్పుఁ గూఁతు కొమారిత కూఁతు రనఁగఁ
స్నుష కోడలనఁగను శోభిల్లు గోడంట్ర మనఁగఁ గోడఱికమం చన స్నుషాత్వ
మలరును జామాత యల్లుఁడం చనఁగను నిల్లంట్ర మనఁగను నిల్లట మన
శ్వశురగేహాధివాసంబు చనును వెలయు నల్లె మనఁగను జామాతృతాఖ్య మనుమఁ
డనఁగ నప్త చెలంగును మనుమరాలు నాఁగఁ దనరారు నస్త్రి చంద్రార్ధచూడ.

111


సీ.

అయ్యబ్బ తండ్రి యం చన జనకుం డొప్పు నమ్మవ్వ తల్లియం చనఁగ మాత
దనరును దాదినా ధాత్రియై చెన్నొందుఁ దాతనా వెలయుఁ బితామహుండు
పరఁగు ముత్తాతనఁ బ్రపితామహాభిధ యలరుఁ బితామహి యవ్వ యనఁగ
వఱలు ముత్తవ్వనాఁ బ్రపితామహీసంజ్ఞ తర మనఁగఁ బురుషాంతరము చెలఁగుఁ
జుట్ట లన విందు లనఁగను జుట్టము లన బందుగు లనంగఁ జెలఁగును బాంధవాఖ్య
దాయ యనఁగ సగోత్రాభిధాన మొప్పు పాలవీక్ష పురాంతక చోళశిక్ష.

112


సీ.

తోఁబుట్టు తోడు సైఁదోడు నా సహజుఁడౌ నన్నయం చనఁ దగు నగ్రజుండు
తమ్ముఁడం చనఁగను దనరును ననుజుండు తోడఁబుట్టిన దనఁ దోఁచు భగిని
యక్క యప్ప యనంగ నలరును నగ్రజ చెల్లె చెలియ లనఁ జెలఁగు ననుజ
చనును బరంపరాసంబంధి యంతల పొంతలవాఁ డందిపొందినట్టి
వాఁ డగంగను యాతయై పరఁగుఁ దోడికోడ లేరా లనఁగ మేనకోడ లనఁగ
భాగినేయి దనర్చును భాగినేయుఁ డలరు మేనల్లుఁ డనఁగఁ జంద్రార్ధచూడ.

113


సీ.

అత్తయం చనఁగను నలరు నన్యోన్యంబు జాయాపతులకును జనను లైన
మాకునాఁ దత్పితృనామమై విలసిల్లు నడరు బావయనఁ దదగ్రజాఖ్య
తదనుజాహ్వయము లై పొదలు మఱంది నా వదినె నాఁ దజ్జ్యేష్ఠలు దగియుండ్రు
మఱఁదలం చనఁగను మండ్రు తదనుజలు వియ్యంకుఁ దనఁగను వియ్య మనఁగఁ
దత్పితృమిథోభిధానమై తనరుచుండు నమరు వియ్యంపురాలు వియ్యంపుసాని
నాఁగను బరస్పరము తజ్జననుల పేళ్లు నియ్య మనభావమగు నొక్కవేళ శర్వ.

114


సీ.

సవతియం చనఁగను జనును సపత్న్యాఖ్య మాతులుం డగు మేనమామ యనఁగ
మీఱ బితృష్వస మేనత్త యనఁగను మేనమఱఁద లన మేనవదినె
మేనమఱఁది యన మేనబావ యనంగఁ జనును మాతులవితృవ్ష్వసృకనిష్ఠ
పూర్వజపుత్త్రు లొప్పుదురు శరీరసంబంధబాంధవ్యాఖ్య మనుచునుండు
మేనఱికమం చనఁగ ధవుఁడౌను మగఁడు పెనిమిటి చెలువుఁ డన జారు పేరు మేలు
వాఁ డనఁగ మిండఁ డన మిండగీఁ డనఁ దగు ఱంకన న్వ్యభిచారమౌ రవివతంస.

115

సీ.

విటనామధేయమౌ విటకాఁడు వేడుకకాఁడు బొజుఁగు నన్సుకాఁడు లంజె
కాఁ డనఁగ నివియుఁగాక గోవాళ్ళనఁ గా నొక్క శబ్దంబు గలదు బహుత
లంజెయం చనఁగను లంజియ యనఁగను గులటాఖ్య యని వాడుకొనఁగవలయు
వావియం చనఁగను భావంబు తగు సాధ్వి తనరుచునుండుఁ గ్రొత్తడి యనంగ
నేతుల యనంగఁ దగుపాటియింతి వెలయు నాబిడ యనంగ నాపెనా నాకె యనఁగ
నల్లసతియనుమాటయై యలరుచుండు నట్టిఁ డనఁగను నట్టివాఁ డగును శర్వ.

116


సీ.

ఏలుకోటి యనంగ నెసఁగుఁ బ్రజాకోటి సదురం చనఁగ మనుజదశక మగు
గుడిసెవేటిది యన నడరుఁ గువేశ్యాఖ్య తగు బజాఱి యనంగ దండులంజె
గట్టివా జంత ఱాఁగ గయాళి యనఁగను ధూర్తయోషాభిధ దోఁచుచుండుఁ
బంద యనంగ దూబ యనంగఁ బేడినా షండనామంబుగాఁ జనును బాయ
మీ డనంగను బ్రాయమై యెసఁగు వెలయుఁ బాల్యమగు జిన్నఱిక మనఁ బడుచుఁదనము
నాఁగ బిన్నఱికం బన నలరు నీడు పాయ మన జవ్వన మన యౌవనము శర్వ.

117


సీ.

నిండుజవ్వన మగు నెలజవ్వనం బన ముదిమి ము ప్పనఁదగు ముసలితనము
నర వన నర యనఁ బరఁగును బలితము స్తనపాయి పరఁగును జంటివాఁడు
పసిబిడ్డ చంటిపాపఁడు పాలపాపఁ డనంగ బాలకసంజ్ఞ నలువు మీఱు
పాప పాపఁడు దుడ్డె పడుచన దుడుకఁడు బుడుత కుఱ్ఱ కొడుకు బొడిగ లేఁత
చిన్న పిన్న చిఱుత యనఁ జెలఁగుచుండుఁ గోడెకాఁడు కొమరుఁ డనఁ గొండి కనఁగఁ
దగుఁ గుమారుఁడు తరుణుఁడు దనరు వయసువాఁ డనుచుఁ బలుకంగఁ జవ్వందిలింగ.

118


సీ.

ముదినాఁడు ముదుసలి ముసలి పెద్దముదుకుఁడొక్క టొక్కు ముదురు పక్కు పన్న
లరగడం బనఁగను నలరు వృద్ధాభిధ బడుఁ గన బడు వస బక్క యనఁగ
వెలయు నమాంసుండు బలిమికాఁడు వలుద బలీయుఁడు బలిసినవాఁడు పలము
బల్లిదుండు బలుపు బలితము లావరి యన బలవంతుఁడు దనరుచుండుఁ
బెన్నెరులవాఁ డనంగను వెలయుఁ గేశి బోడి యని బోడఁ డనఁగను బోడ యనఁగ
బోడునా బోడివాడునా ముండుఁ డొప్పు నవితనిజదాసఝాట పశ్యల్లలాట.

119


సీ.

బొజ్జవాఁ డనఁగను బొఱ్ఱవాఁ డనఁగను బొట్టవాఁ డనఁగను బొసక యనఁగ
దొందన దొందునా దొద్దునా లందనాఁ దుందిలనామమై తోఁచుచుండు
బంబోతునా నెద్దువలెను మిక్కిలియొడ ల్బలిసియుండెడివాఁడు పరఁగుచుండు
గర్భిణీహస్తసంగతుఁడై న బాలుఁడు చంటివాఁ డనఁగను జనును లవిటి
చెవిటి యనఁగను బధిరుండు చెలఁగు గ్రుడ్డి యవిటి చీఁ కన నంధకుఁ డలరు మెల్ల
కంటివాఁ డనఁ గేకరాఖ్యయగు లొట్టకంటివాఁ డనఁ గ్లిన్నదృఙ్నామ మభవ.

120

సీ.

మిడిగ్రుడ్లవాఁ డన మీఱు నున్నేత్రుండు నడ్డిముక్కుఁగలాఁ డన నతనానుఁ
డగు బుఱ్ఱముక్కు వాఁ డన గ్రద్దముక్కువాఁ డనఁగను గ్రమముగా నలరుచుండ్రు
ఖురణస ఖరణసు ల్పరఁగ ముక్కిఁడి యన విగ్రుండు మూఁగనా వెలయు మూకుఁ
డలరును బతికదంతాభిధ తొట్టివాఁ డన గొగ్గిపండ్లవాఁ డనఁగ బర్బ
రద్విజుండు వెలయు దంతురాఖ్య మిట్టపండ్లవాఁ డనఁ దగు గూనివాఁ డనంగఁ
బరఁగుఁ గుబ్జుండు కుకరుండు పరఁగుఁ దొంటచేతివాఁ డన శ్రీమాతృభూతలింగ.

121


సీ.

ఖంజుఁడు కుంటి నాగఁ గునిస్టి నాఁగను దోఁచును బ్రజ్ఞుండు డొడ్డికాళ్ళ
వాఁ డన మండికాళ్ళవాఁ డన సంజ్ఞుండు మీఱుచునుండును బూరకాలి
వాఁ డనఁగఁ బ్రవృద్ధపాదుఁడు దనరారు వల్మీకపాదుఁడు వఱలుఁ బుట్ట
కాలివాఁ డనఁగను గనుపట్టు వికలాంగుఁ డవిటినా మొండినా నపదుఁ డెసఁగు
వాఁపి యన నులిపి యన నుల్ప డన శోభి శోభిలును మూర్ఛితాభిధ సొమ్మసిలిన
వాఁ డనఁగ నొప్పుచుండును బొమనుండు దూలపో తన విలసిల్లు దురితదూర.

122


సీ.

పొట్టి మొటిమె గిటర పొదిటి పొదడుగున్న పొనుఁగు బుడుత గుజ్జు బురుక బుడిగి
కుఱుచ కుఱ్ఱ కురుజు కొటిక కుసులి కుట్ట మట్టసి మట్టము మట్టపమ్ము
గొనమ గొనప గొనిసె గునిసె గిఱక టింగణా యనఁగను వామనాఖ్య దనరు
మరుగుజ్జునాఁగ నమరుఁ గుజ్జనామంబు వాసినాఁ బొడవునా వఱలు నున్న
తుండు ధర్మంబు గానిది దోఁచు నొకటి వెజ్జనంగను వైద్యుండు వెలయుచుండు
నరవెనక నన్నియుఁ ద్రిలింగనామము లగు శ్రీకరదయారసాంక కంఠేకళంక.

123


సీ.

బాధిర్యసంజ్ఞ యై పరఁగును జెవు డన నంధభావంబు గు డ్డనఁగ వెలయు
గొగ్గియం చనఁగఁ దగును బర్బరత్వంబు గూను నాఁ గుజ్జత్వ మౌను మొండి
మొఱ్ఱన భిన్నత్వ మొనరును మచ్చనాఁ గాలకనామంబుగాఁ జెలంగుఁ
గాయయం చనఁగను గనుపట్టును గిణంబు గాయమం చనఁగను క్షతి దనర్చు
మం దనఁగ నౌషధాఖ్యయై మనును దెవులు కింక నా రోగసంజ్ఞయై కెరలుచుండు
నావి యనఁ జీడ యనఁగను నలరు సస్యరోగ మాశ్రితజనభవరోగవైద్య.

124


సీ.

పశుపాదరోగంబు పరఁగు నడుప యన నలరును మలిమిడి యనఁగను బశు
పార్ష్ణిరోగము పశువ్యాధిభేదాభిధ యొప్పుచునుండును నుంగిడి యనఁ
జిరుకనా గుఱుకనా సాంక్రామికామయాఖ్య చెలఁగుచుండు ముడిచె యనంగ
ద్వంద్వరోగంబు నివ్వటిలు దొంద మనంగ సన్నిపాతం బగు జన్ని యనఁగ
వాయి నాఁగను వాయువు వఱలుఁ గోరవాయి యనఁ గోష్ఠశీర్షస్థవాయు వొప్పు
మండవాయి యన న్గుల్ఫవాయు వగును భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

125

సీ.

గృధ్రసి పే రగుఁ గిరుదెస యనఁగను దిమిరంబు వెలయును దిమిరి యనఁగఁ
బరఁగుఁ బ్రతిశ్యాయ పడిసెమం చనఁగను దుమ్మనంగ క్షుతంబు దోఁచుచుండుఁ
జీద్రుడం చనఁగను జెలఁగు నాసామల పరిహృతియును దద్భవారవంబు
సోఁ పన సో బన వాఁపన శోఫయౌ నౌదరశోఫ యై యలరు దోము
నాఁగఁ గాసంబుపేరు దనర్చుచుండు నుబ్బస మనంగ దగ్గన నుక్కిస మనఁ
గాసభేదము కుముటునాఁగను దనర్చు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

126


సీ.

రొండు రోజు వగర్పు రొప్పన శ్వాసమౌ వెక్కనా వేక్రి నా వెచ్చ యనఁగ
జ్వర మొప్పు క్షయము నవఁతనాఁగ విలసిల్లు సొలపు సొరగు సొమ్మ సొమ్మసిలుట
యన మూర్ఛ పేరుగా నలరుఁ బాలుడునాఁగఁ బాండువు విలసిల్లుఁ బసిరిక యనఁ
గామాల యనఁగను గామలాభిధ మీఱు నక్షిరోగవిశేష మైర యనఁగ
నలరుఁ గ్రక్కనఁ జరిదియం చనఁగఁ దనరుచుండుఁ బ్రచ్ఛర్దిగ్రహణియై యొనరుఁ బారు
డనఁగఁ బాచన మనఁగను నడరు నీరుకట్టనఁగ మూత్రకృచ్ఛ్రంబు గరళకంఠ.

127


సీ.

కడుపుబ్బునాఁగను నడరు నానాహాఖ్య యఱుకు వఱక మఱ్ఱె మన నజీర్తి
యగుఁ గ్రోవ యనఁగ దర్పామయంబు చెలంగు నర్శంబు మొలకయం చనఁగ వెలయు
గుట్టుసూల యనఁ గన్పట్టు శూల తలే రనఁగ శిరస్తోదము దగ్గును గుష్ఠ
ములు మనఁ గుష్టనఁ బులుమన విలసిల్లు దామరయనఁ బొడదామరయన
మండలక మొప్పు నాయల్పమండలకము చిరుగు డనఁగను దనరును జెలిది యనఁగఁ
ద్వగ్గతవ్యాధిభేదమై వఱలుచుండు మిహిరచంద్రాగ్నినేత్ర వామేకళత్ర!

128


సీ.

సిబ్బెము సోబె నా సిధ్మము విలసిల్లు మంగు డనంగను మం గనంగ
ముగు సిధ్మ నామ మొప్పును నింద్రలుప్తకం బగు నూలిగరసం చనఁగను గజ్జి
చిడుము నా ఖర్జువు చెలఁగును మొటిమెనా వదనఖర్జువుసంజ్ఞ వఱలుచుండు
శిశుఖర్జు వలరును జెవ్వయం చనఁగను దీంట్రమ్ము కసి తీఁట తీవరమ్ము
దూల జిల నవ నస గాడు దురద యనఁగఁ బరఁగుఁ గండూతి పుండునా వ్రణము దనరు
వఱలుఁ గురు పనఁగాను నల్పవ్రణంబు అతికృపాభాసి మధ్యేనగాధివాసి.

129


సీ.

ముండిలూటి యనంగ మర్మవ్రణం బొప్పుఁ జంతిక పుండునాఁ జను ననేక
రంధ్రవ్రణాభిధ రాచపుం డనఁగను రాజవ్రణము పేరు దేజరిల్లుఁ
బోటకమం చనఁ బొటక మంచన స్ఫోటక నామమై పొలుపుఁ గాంచు
బొబ్బ పొక్కనఁగ విస్ఫోటము విలసిల్లుఁ బగులుడు బీఁటిక వంగు డనఁగ
స్ఫోటము దనర్చుఁ బుంగుడు పులిపిలి యన నల్బమైనట్టి గ్రంథిగా నలరుచుండు
గాద మనఁగను గొప్పినాఁ గదుమునాఁగఁ దగును ఘాతభవగ్రంథి తరణిమౌళి.

130

సీ.

ఆనెయం చనఁగను నాణెయం చనఁగను దద్దురం చనఁగను ద ద్దనంగ
దద్రువు వెలయుఁ బిత్తంబు చెలంగును బిచ్చనఁ బస రన వీర్య మొప్పు
విత్తనశ్లేష్మంబు వెలయుఁ గళ్లె యనంగ నట్టన తిత్తినాఁ జట్ట యనఁగఁ
దోలనఁగాఁ ద్వక్కు దోఁచును నంజుడు పొల యెఱచి కవుచు పొలుసు కండ
చియ్యయం చనమాంసంబు చెలఁగుఁదస్స యనిన దుర్మాంసనామమై యలరు నుప్పు
కండ యనఁగను మీరు శుష్కపలలాఖ్య యార్యజనగేయ మాతృభూతాభిధేయ.

131


సీ.

రక్తాభిధాన మెఱ్ఱ యనంగ నెత్తు రనంగను నెగడుచుండు
రక్తవిశేషంబు రాజిల్లు నల్లనాఁ గృత్రిమరక్తంబు గేరు జొత్తు
నాఁ జెలఁగును దొబ్బనా ఘనీభూతరక్తంబు చీ మనఁగను దనరుఁ బూయ
మెసఁగును గుండెనా నెద యనఁ గందన గాయ యన హృదయాఖ్య వన చెలఁగుఁ
క్రొవ్వునా నర మన నాడి నివ్వటిల్లు మన్ని యనఁగను విలసిల్లు మన్య బీఱ
నరము నాఁగను దగుఁ బీతనాడి నీరుతిత్తి యనఁగను గ్లోమమౌ దేవపూజ్య.

132


సీ.

మస్తిష్కనామంబు మను మెద డంచనఁ గండచుక్క యనంగఁ గాలఖండ
మలరును బ్రేగన నాంత్రంబు చెలఁగును మూలుగునా మజ్జ పొలుచు బొమిక
నెర కె మ్మెముక యన నెగడు సస్థ్యభిధాన మగు ముడు సన గ్రంథిలాసిసంజ
యడరియుండుఁ గశేరుకాహ్వయంబుగనుగ్రో వెముక యంచనఁ బూసయెముక యనఁగఁ
దనరును గరోటి కప్పెర పునుక పుఱ్ఱె పుచ్చె యన బోలె బొచ్చెనా బోఁకి బొంకి
పెంచు పెంకు పెంచుక పెరకం చనంగఁ దద్విశేషాఖ్య పార్వతీదత్తసౌఖ్య.

133


సీ.

మలవాచకం బగు మసటు నింపిరి మస్టు ముఱికి యనంగను మూర్ధమలము
వెలయుచుండును గర్ణమలనాడు మొప్పును గులిబినా గుబిలినా గులిమి యనఁగఁ
బుసి యటం చనిన నొప్పును నేత్రమలసంజ్ఞ యేరు గనఁగ విష్ఠ యెసఁగుచుండుఁ
బేఁడ నాఁగ గవాదివిష్ఠ మీఱును నేడకాదులనిష్ఠ రొచ్చనఁగఁ దనరు
రెట్ట యనఁగను బక్షులవిట్ట మమరు మేను నెమ్మేను మై మయి మే మెయి యొడ
లన శరీరంబు దనరు బొం దనఁగ డొక్క యనఁ గళేబర మలరుఁ బశ్యల్లలాట.

134


సీ.

ఆయంబు కీలునా నలరు మర్మంబు పాదాగ్రము ముంగా లటం చనఁ దగు
మీఁగా లటన్నను మీఱుఁ బాదోపరిభాగంబు దనరును బాదతల మ
డు గఱకా లంజనా నగు గుది చీలమం డనఁగ వెలయును గుల్ఫాహ్వయంబు
మడమయం చనఁగను మనుఁ బార్ష్ణి కొంకినాఁ దదుపరిదేశమై తనరుచుండుఁ
జిఱుతొడ యనంగఁ బిక్కనాఁ జెలఁగు జంఘ ముడుము మోఁకాలునాఁగఁ జెన్నడరు జాను
కురువు తొడ యన నూరువు వరఁగుచుండుఁ బొసఁగుఁ బెందొడ యన నూరుపూర్వ మభవ.

135

సీ.

గజ్జనాఁ దనరు పంక్షణ మండె యనఁగను నూరుమూలాభిధ యొప్పుఁ బొత్తి
కడుపు కీఁగడుపునాఁగను వస్తి చెన్నొందు బొడ్డు మిక్కిలి యనఁ బొసఁగు నాభి
మొల యనఁ గటి పేరు విలసిల్లుఁ బిఱుఁదు నాఁగ నితంబ మగు నరకటన ముచ్చ
యనఁగ నితంబ పార్శ్వాభిధ దగు ముల్లు ముక్కు నాఁ జను నితంబైకదేశ
మొనరు రొండి యనం గట్టిప్రోధసంజ్ఞ ముడ్డి మూడి యనంగను బొలుచు గుదము
వృషణములు బీజములు వెలయుఁ గచ్చ యన నుపస్థాఖ్య చెలఁగుఁ ద్రికాభిధాన
మలరుఁ దిక మన ముచ్చునా నళికనయన. (పంచపాదిగీతము)

136


సీ.

బొఱ్ఱనా బొజ్జనాఁ బొట్టనా డొక్కనాఁ గడుపనఁ గుక్షికాఖ్యలు చెలంగుఁ
దఱులు నెత్తఱులునాఁ దగును వళీసంజ్ఞ పాలిండ్లు చాచి గుబ్బ చను చన్ను
చనులనఁ గుచములు చనుఁ జూచుకమ్మలు చనుమొన ల్చనుముక్కు లనఁగ వెలయు
నెడ్డ య క్కురవుఱొ మ్మెద బోర యెడఁదనా వెలయు వక్షము వీఁపు వెన్న నంగఁ
బృష్ఠ మగుఁ బెడక యనఁ దబ్భేద మెసఁగుఁ గొప్పరము మూపటంచన నొప్పు నంస
మలరుఁ జంకలి చంకయం చనఁగఁ గక్ష మచలకన్యాసమేత శ్రీమాతృభూత.

137


సీ.

పక్షంబు వెలయును బక్క పక్కియ నొక్క బరి రెట్ట నాఁగను భార్య సంజ్ఞ
కెల ననఁ గెలవనఁ గెడ యన బగి యన బగు లనఁగాను గన్పట్టు వెలయు
మధ్యభాగము నడు మన లీగునాఁగను గౌనునా భుజసమాఖ్య యగు జబ్బ
చట్ట బుజం బనఁ జనుఁ గూర్పరంబు మోచెయినాఁ బ్రగండంబు చెలఁగు సంది
సందిలి యనంగఁ దగు బ్రకోష్ఠంబు ముంజేయి యన మణిబంధనామమై యెసఁగును మని
కట్టునాఁ గేలు చే చెయి కైకయి యనఁ జెట్ట యనఁగఁ గరంబౌను జిత్ప్రకాశ.

138


సీ.

మీఁజెయి నాఁగను మీరుఁ గరోపరిభాగంబు కరపృష్ఠభాగ మొప్పుఁ
బెడచెయి నాఁగను నడరును గరతలం బఱచెయ్యి లోచెయ్యి యనఁగ వ్రేలు
నా నంగుళం బగు నంగుట మనఁగ నంగుష్ఠవిశేషమై కొమరు మిగులుఁ
బొసఁగు నంగుష్ఠంబు బొటనవ్రే ల్బొట్టనవ్రేల్బొటవ్రేల్బొట్టవ్రేలు పెద్ద
వ్రేలునాఁగను జుట్టనవ్రేలు జుట్ట వ్రేలు జుత్తనవ్రే లనఁ బోలుఁ దర్జ
ని నడివ్రేలన మధ్యను నెగడు దబ్బవ్రే లన ననామిక దనర్చు శూలపాణి.

139


సీ.

చిటికెనవ్రే లనఁ జిటివ్రే లనంగను మీఱుఁ గనిష్ఠాఖ్య గోరు నాఁగఁ
దనరును నఖము బెత్తయు బెత్తిలి యనంగఁ జతురంగుళీసంజ్ఞ సాగుచుండు
లోడితయం చనఁగను లొడితిలియం చన జుట్టిలి యనఁగను జుత్తి లనఁగఁ
బ్రాదేశనామమై పరఁగు జేన యనంగ వఱలు వితస్తి చప్పట యనఁగఁ జ

పేట మొప్పును జీరనా వెలయుఁ బ్రసృతి పొలుపగు నికుంజహస్తంబు పుడిసిలి యన
భాసిలు నికుంజచతురంగుళీసమాఖ్య కొడిద కొడిదిలి యనఁగ రక్షోవిదార.

140


సీ.

పిడికిలి పిడియన నడరును ముష్ట్యాఖ్య పాణివిశేషంబు పరఁగును గమి
కిలి కుప్పలప్ప పట్టిలి యన దోసిలి దోయిలి నాఁగను దోఁచుచుండు
నంజలి మూరనా హస్త మొప్పును బిడి తక్కువమూరనాఁ దగు నరత్ని
బారయం చనఁగను మీఱును వ్యామంబు నిలువునాఁ బౌరుషం బలరుచుండుఁ
గౌఁగిలి యనంగ బాహుయుగవలయ మగు గొంతు గొంతుక కుత్తుక కొలికి బొండు
ననఁగ గంఠంబు చెలఁగును నఱ్ఱు మెడన గ్రీవ దనరారు మేచకగ్రీవ దేవ.

141


సీ.

మెడవంపునాఁగను మీఱు గ్రీవాగ్రభాగము పెడతలనాఁ గృకాటిక దగు
మొగము మో మనఁగను ముఖమొప్పు మోరనా ముట్టెనా వెలయును ముఖవిశేష
ము లగు వా వాయి నో ర్మూతీనా వక్త్రంబు మనుఁ దదంతస్థాన మంగిలి యన
ముక్కన సాసిక పొల్చు ముంజెర మనఁ జెర మన నాసాపుటము చెలంగుఁ
బరఁగుఁ బల్కప్పు మోవి వాతెఱ పెదవియు నాఁగ నోష్ఠంబు తదధరభాగ మలరు
నౌడు నాఁగను జుబుకాఖ్య యలరు గడ్డఁ మనఁగ గద్దువనాగ దేహధృతనాగ.

142


సీ.

చెక్కు చెక్కిలి చెంక చెంప గౌద యనంగ గండస్థలాఖ్యయై యుండు హనువు
కటమరయం చనఁగా నొప్పుఁ బల్లనఁ దంతమౌఁ గోఱనా దంష్ట్ర వెలయుఁ
దాలుపు దాలువ దవడ దౌడ యనంగ నలరును దన్మూలనామ మంకు
నక్కిలి యన మీఱుఁ బుక్క పుక్కిలి బుగ్గ నాఁగ గండూషమౌ నాల్క యనిన
జిహ్వ వెలయును సెలవినా సృక్విణి తగు నొసలు నుదురన ఫాలాఖ్య యొసఁగు భ్రూవు
బొమ యనంబడుఁ దారకం బొనరుఁ బాప యాబ యన గోళకమగు గ్రుడ్డనఁగ నభవ.

143


సీ.

పర పొర యనఁగను బటలంబు విలసిల్లుఁ గన్ను నా లోచనాఖ్య దనరారుఁ
జూపు చూడ్కి యనంగ దోఁపఁబడును దృష్టి వాలుచూ పనఁ బొల్చు వక్రదృష్టి
యశ్రువు కన్నీ రటంచన రాజిలుఁ బక్ష్మంబు వెలయు ఱెప్పం చనంగ
ఘనపక్ష్మసంజ్ఞ దొంగలిఱెప్ప లన మీఱుఁ గడక న్ననంగఁ గ్రేఁగ న్ననంగ
నగు నపాంగంబు చెవి వీ ననంగ శ్రవణ మొప్పు గూ బనఁగాఁ గర్ణమూల మెసఁగు
సిరసు తలనెత్తి యనఁదగు శిరము జనుఁ గడంత యనఁగ శిరఃపార్శ మంతకారి.

144


సీ.

ఔదల ముందల యన శిరోగ్రము మీఱుఁ జనుఁ బెడతలనఁ బశ్చాచ్ఛిరంబు
బ్రహ్మరంధ్రాభిద పరఁగు నుచ్చెన వెండ్రుక నెఱి నెఱక నాఁగఁ దనరుఁ గేశ
మలకలు కురు లన నలరును బహుతచే వఱలు ముంగురు లన భ్రమరకములు
కూఁకటి యనఁ జిప్పకూఁకటి యనఁ గాకపక్షంబు చెలఁగుఁ గబరికిఁ దురుము

కొప్పు క్రొవ్వెద మూలనా నొప్పుఁ బేళ్ళుఁ గేశబంధవిశేషాఖ్య గేరుఁ గ్రొమ్ము
డి యన వెడయన నూనె ముడియనఁ గొండె యనఁగఁ గీల్గం టనఁగ జొళ్లె మనఁగ నభవ.

145


సీ.

పావట యనఁగను బరఁగు సీమంతంబు జుంజురు సిక జుట్టు చుం చనంగ
శిఖ యొప్పు జడయనఁ జెలఁగును జటపేరు వేనలి యనఁగను వేణి దనరు
రోమము బొ చ్చన త్రుప్పుడునా మీఱు నారు నూగారునా నలరు రోమ
రాజి శ్మశ్రుసమాఖ్య రాజిలు మీస మీసము నాఁగను జుబుక శ్మశ్రు పడరు
గడ్డ మన వేష మగు వాలకము నాఁగ వేసమన బారిసమునాఁగ వెలయును బస
దనము కైసేఁత యన బ్రసాధనము భక్తపోషకాపాంగ శ్రీమాతృభూతలింగ.

146


సీ.

అడరు భూషణసంజ్ఞ, తొడగు తొడవు మిన్న సొ మ్మనంగను గిరీటమ్ము వెలయుఁ
దలకట్టు నాఁగను దనరును ఫాలపాశ్యావిశేషములు సూసక తురాయి
ముత్యాలకుచ్చు కొప్పువల పాపటబొట్టు జిలిబిలి జల్లియుఁ జేరుచుక్క
యనఁగ లలాటిక యగు బాసికంబనఁ గర్ణిక దు ద్దనఁగాఁ జెలంగు
విచ్చుటాకు చెవ్వాకునా వెలయుఁ గర్ణపత్త్రనామంబు తాటంకవాచక మగుఁ
గమ్మయనఁగాను బంజులకమ్మ యనఁగ రత్నతాటంక మెసఁగుఁ జంద్రార్ధచూడ.

147


సీ.

చెవులపువ్వు బొగడ బవిరె రారేక కుంపెన రావిరేక ముర్వనఁగఁ గర్ణ
భూషావిశేషము ల్పొల్చుఁ బ్రోఁ గనఁ గర్ణవేష్టనసంజ్ఞయై వెలయుఁ దద్వి
శేషాభిధానమై చెలఁగు గంటీ లొంట్లు పోఁగులు చౌకట్లునాఁగ నాసి
కావిభూషణము ముక్కఱ ముంగర యనంగఁ జనుచుండుఁ గంఠభూషావిశేష
మౌను గుతికంటు మెడనూలు నాను తీఁగె కంటసరి కంటెయం చనఁగాను బుస్తె
యనఁగ మాంగళ్యసూత్రాఖ్య యలరుచుండు బొట్టనఁ దదంతరసువర్ణభూష యీశ.

148


సీ.

పదకము తాళి నేవళము లంబెస సరిపెన సరపణిగొలుసన లలంతి
కావిశేషం బగు దావడం బన దండ యనఁ గ్రోవ యన సరి యనఁగఁ బే ర
నంగఁ జే రనఁగఁ జెలంగు సరము త్రిసరంబు ముప్పేటపే రనఁగ వెలయు
సరవిశేషంబు లుత్తరిగె ముత్తండంబు బన్నసరంబునాఁ బరఁగుచుండుఁ
గడెము కడియము బోద్దొత్తు గాజు సూడిగంబు చేకట్లు గోటు ముంగామురువన
హస్తభూషావిశేషంబు లలరుచుండు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

149


సీ.

జేయూరనామంబు తాయె తనంగను సందిదండ యనంగ సందికడియ
మన బాహుపురి యన నలరు నొడ్డాణంబు కమరి యొడ్డణమనఁ గాంచి వెలయం
మొలనూ లనంగ నొప్పును గటిసూత్రాఖ్య యంగుళీయం బగు నుంగర మన
ముద్దుటుంగర మన ముద్రాంగుళీయ మౌ నంగుళీయవిశేష మలరు బటువు

నాఁగఁ బాదాంగదం బొప్పు నందె యనఁగఁ బెండె మనఁ బెండియంబనఁ బెండెర మన
గాను బెండేర మనఁగఁ దద్గతవిశేష మెసఁగుఁ బాడిగ మనఁగ బాలేందుమౌళి.

150


సీ.

గంటయం చనఁగను ఘంటయౌను బురుజు చిఱుగంట మువ్వ గజ్జె యన క్షుద్ర
ఘంటావిశేషంబు గన్పట్టుచుండును మను వీరమద్దెనా మట్టె యనఁగ
బిబ్బలికాయనాఁ బిల్లాణియనఁ జిటిబొద్దు నాఁగను గ్రమంబుఁగఁ బదాంగు
ళీవిభూషలు మట్టె లీవలరానీని తాకు పేర్మించనఁ దనరుచుండు
సేలయనఁ బుట్ట మనఁగను జీర యనఁగఁ గప్పడ మనంగఁ గోకనాఁ గట్టన మన
వస్త్రనామంబు చెలఁగును వలువ వలువు వలిప మన సూక్ష్మవస్త్రంబు వఱలు నీశ.

151


సీ.

విరళవస్త్రము పేరు వెలయం నుడుగరనా నడరు గడితము సుగ్గడిత మనఁగ
సాంద్రవస్త్రాభిధ చనుఁ బట్టుచీరనాఁ బట్టాంశుకము సూర్యపటము దనరు
సూరెపుటంబునా మీఱు సెల్లా సేలు సాలువ నంగను శాటికాఖ్య
వస్త్ర భారము పేరు వఱలు లుంగ యనంగ నిడుపు చా పనఁగను నెగడు దైర్ఘ్య
మడరుఁబరిణాహము తనర్సు వెడలుపనఁగ నంశుశాంతంబు చెఱఁగుకొం గనఁగ వెలయు
నంచలంబు విరాజిల్లు నం చనంగ భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

152


సీ.

బద్దెయం చనఁగను వత్తి యనంగను జేకమం చనఁగను జెలఁగు దశలు
కమ్మియం చన నంశుకాశ్రావయవవిశేష మొప్పుఁ దద్విశేషమ్ము చిట్టె
యనమీఱుఁ గచ్ఛభేదాభిధాన మెసంగుఁ గాసె కుచ్చెల కుచ్చె కచ్చె పింజ
చుంగు రింగు నెఱక చింగు నెఱి యనంగ నీవి పోకముడినా నెసఁగుచుండు
వస్త్రపుటి దగు నొడియనఁ బటము దనరుఁ బడమనఁగ ధౌతవస్త్రంబు పరఁగు మడుగు
మడుత మడి చలువ యగును మనును నింత వన్నె గలకోకపే ర్హేరవలియన భవ.

153


సీ.

కావియం చనఁగను కాషాయమై యొప్పుఁ జందురుకావినాఁ జనును రక్త
వస్త్రము చెంద్రిక వన్నె నాఁ జెంగావి యనఁగఁ గౌసుంభమై యలరుచుండు
నరుణవస్త్రంబు తోఁపనఁ దోఁచుచుండును నీలవస్త్రం బగు నీలి యనఁగ
సిక్థపువస్త్రంబు చెలఁగు నత్తనఁగను మాంజిష్ఠ మెసఁగును మంజిడి యన
పప్పళి బవంతి కరయంచు పట్టెమార్పు మాదళంబులు దళ్ళు బొ మ్మంచు లుడుత
చాఱ లేనుఁగడుగు లనమీఱు నిట్లు చిత్రవర్ణవిశేషము ల్చిత్స్వరూప.

154


సీ.

జరబాజు నేరాజు బురుసా తగటియనఁ గల ధౌతవస్త్రము ల్చెలఁగుచుండు
నవి నల్లచాయచే నలరుచున్నను గసీసం బనఁగాఁ దగు సరి యనంగ
నీవస్త్రముల వేయి నెసఁగుదారం బగుఁ గంచెల ఱవిక రైక యన నడరుఁ
గంచుళీనామంబు కాంతోత్తరీయంబు పయ్యెద పయ్యంట పైఁట పయిఁట

పైయెద పయంట నాఁగను బరఁగుచుండుఁ బ్రబలువస్త్రముకుటము కుల్లా కుళాయి
యనఁగఁ దద్భేదము తపార మనఁగ డెక్కి యనఁగ జాతనఁ డోపినా నలరు నభవ.

155


సీ.

పాగయం చనఁగను బరఁగు నుష్ణీషంబు తద్భేదసంజ్ఞయై తగు రుమాల
యనఁగ గూర్పాసాఖ్య యలరును దుత్తాయి యరబట్టి కుప్పసం బంగి కుబుస
మనఁగఁ గంచుకభేద మలరారుఁ జోలా చొకాయి చొక్కాయి చొక్కా చొకా చొ
గా నాఁగ దుప్పటి యౌను హసావళి దువ్వల్వ వీణము దుప్పట మన
నవియె కూర్చనిచో రేకు లనఁగ వెలయు జంటపోఁగులవలువయౌ గింటె మనఁగఁ
బ్రచ్ఛదపటంబు వెలయును బచ్చడ మనఁ బోరువ యనంగఁ దద్భేదము దగు నభవ.

156


సీ.

దోవతియం చనఁ దోఁచుఁ గటీపట మొల్లె పంచె యనంగ నొప్పు నర్థ
వస్త్రంబు గుడ్డనా బట్టనాఁ జెలువొందు వస్త్రఖండము వస్తి పరఁగుఁ బొత్తి
యనఁగను బొల్చు బాలాచ్ఛాదనాభిధ తడుపంచెనాఁగ నార్ద్రపట మొప్పు
చింపి చీరిక యన జీర్ణవస్త్రము మీఱుఁ బ్రేలికయం చనఁ బేలికయన
జీర్ణవస్త్రైకదేశంబు చెలఁగుచుండు గోఁచి యనఁగ గచ్చడం బన గోణ మనఁగ
బొట్టమం చనఁ గౌపీనము దనరారు మాతృభూతేశ సంతతస్వప్రకాశ.

157


సీ.

చల్లాడ మనఁగను జల్లడ మనఁగఁ జె న్నలరుఁ బుమంతరీయంబు లుంగి
యన నంగదట్టమం చనఁ బావడ యనంగ యోషాంతరీయమై యొప్పుచుండు
గొప్పగాఁ గొసలుంచి కూర్చిన పావడ కంగోరుపావ డనంగ వెలయు
నస్తరు నతుకునా నలరు సంధానవసనఖండనామంబు చనును గంబ
లంబు గొంగడి యనఁగను గంబళియన గోరుపడ మనఁగాఁ గంధ మీఱు బొంత
గంతన వితాన మగు మేలుకట్టు లుల్లబమ్ము లుల్లడ లనఁ జందువ లన నభవ.

158


సీ.

కొఱలు గుడారము గూడారము గుడారు గూడా రనఁగను నాల్గు పటగేహ
నామధేయంబులు నవగోజ యనఁగను గొప్పగుడారమై యొప్పుచుండుఁ
బనిబడిగూడారు వరఁగు గొల్లెసయన వాహనాద్యాచ్ఛాద్యవస్త్రసంజ్ఞ
తనరుఁ గువాళమం చనఁగఁ బ్రావరణమౌఁ బరదా యనంగను బాడునాఁగఁ
జనుఁ దిరస్కరిణి తెరనా జవనిక యన రంజిలుఁ గనాతి గోడసరాతి యనఁగ
వసననిర్మితకుడ్యనామంబుగాను భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

159


సీ.

తలయం టనంగను దలగడు గనినను నభ్యంగనామ మై యతిశయిల్లుఁ
దోముడు ప్రాముఁడు తుడుపు రుద్దుడు పులుము డన మార్జనసంజ్ఞ పొలుచుచుండు
నలుగన నుద్వర్తనంబు రాజీలంఁ జిక్కసంబు సున్ని యనఁ జూర్ణంబు దనరు
స్నానంబు వెలయును దానంబు మునుక బుడక మజ్జన మనఁ దిలక మెసంగు

బొ ట్టనఁగఁ జు క్కనఁగఁ జుక్కబొ ట్టనంగఁ బొలుచుఁ జాఱిక పత్తిరిబొ ట్టనంగఁ
దద్విశేషాఖ్య ఘుసృణంబు దనరుచుండుఁ గుంకుమ యనంగ బాలశశాంకచూడ.

160


సీ.

చెందిర మనఁగను సిందూరము చెలంగు లక్కయం చనఁగను లాక్ష వెలయు
లారస మెసంగు లత్తుకయం చనఁ గుంకుమపూ వనఁ గుంకుమ మగుఁ
గుసుమపూ వనఁగఁ దగును గురుంభాభిధ జాజికాయన మీఱు జాతిఫలము
జాపత్రి యనఁగను జాతిపత్ర మొప్పు గసగస లన మస్తు గానిపించు
విత్తు లెసఁగును జాఁదన వెలయుఁ జాష మలరు సాంబ్రాణి సామ్రాణి యనఁగఁ బూతి
పునుఁగు తట్టుపునుంగనఁ దనరుఁ బిల్లి గడ్డచట్ట మన బిడాలక మగు శర్వ.

161


సీ.

చను జవాది జవాజి జవ్వాది జవ్వాజి యనఁగ సంకుమదాఖ్య దనరుచుండు
గోరోజన మనంగ గోరోచనాభిధ కపురము కప్రము కప్పురమ్ము
సిరము గంబూర గంబుర గంబురా గంబురమ్మ గంబూర మ్మన మ్మను ఘన
సారము సజ్జరస మ్మన సర్జరసమ్ము చెలంగు గంద మ్మనంగ
గంధ మొప్పు మలాకనాఁగను దనర్చుచుండు శ్రీఖండ మగురునా నొనరు నగరు
గంధచూర్ణంబు చెలఁగు బుక్కా మనంగ గందవొడి యనఁగాను బుక్కాయన భవ.

162


సీ.

యక్షకర్దమసంజ్ఞ యలరుఁ గదంబమ్ము కలపము నాఁగను వెలయు సేస
యనఁగఁ బుష్పాంజలి తనరుఁ దోమాలెనా మాలిక పువుటెత్తు పూలపొట్ల
మనఁగ మాల్యగ్రంధి యగు నెరతన మన నాభోగసంజ్ఞ యై యడరును దల
గడ తలాడ తలాపి తలయంపి యొరుగునా నుపధానసంజ్ఞ యై యొప్పుచుండుఁ
దద్విశేషాభిధానంబు తగును బటువు బిల్లదిం డన శయ్యాఖ్య చెల్లు సెజ్జ
పరపు తలిపము దడిబను పాన్పు మెత్త యనఁ దదాచ్ఛాది యెసఁగు లేపనఁగ శర్వ.

163


సీ.

ఖట్వాఖ్య రాజిల్లుఁ గంకటి యం చనఁ బట్టెమంచం బనఁ బరఁగు మృదుల
ఖట్వ రాజులు నలఖట్వ కుక్కి యనంగ నలరు గోడనఁగ ఖట్వాంగ మెనఁగుఁ
బట్టెయం చనఁదగుఁ దట్టిక కుసి కూచ మనఁ బట్టికాగ్రమై యలరుచుండుఁ
జిత్రాల్పపట్టిక చెలఁగు నవారనఁ గటసంజ్ఞ చా పనఁగాఁ జెలంగుఁ
గందుకము చెండు బంతినాఁగను దనర్చు దివ్వె దిన్వియ దివె దీవె దివియ దీవి
యనఁగ దీపాహ్వయంబుగా నలరుచుండు మాతృభూత జగత్త్రయీమాతృభూత.

164


సీ.

దీవటీ దివ్వటి దివటి పంజనఁగను గరదీపికాఖ్యయై పరఁగుచుండు
జుంజురు దుందురు సురుడు దివ్వెనకోల యనఁ గాష్ఠదీపికాహ్వయము చెలఁగు
నీరాజనాభిద నెగడు నివాళి యారతినాఁగ వత్తినాఁ బ్రబలు వర్తి
ద్విముఖదీపిక గడిదేరు నీలాలినాఁ ద్రిముఖదీపిక పేరు తేజరిల్లుఁ

దక్కటి యనంగఁ బీఠంబు దనరుచుండు
గద్దె గద్దియ పీఁట నాఁగను గటాస
నమ్ము చదిరిక యనఁ జర్మళమ్ము దనరు
నాసనార్థంబు సరసనా నలరుచుండు
మాతృభూత! నిజాశ్రితమాతృభూత!

165


సీ.

పలక యనంగను ఫలకయౌ శయ్యార్థఫలక మొప్పును విసిపలక యనఁగ
ముక్కాలిపీఁటనఁ బోలుఁ ద్రిపాత్పీఠి భరణి మీఱును దార్పు బరణి డబ్బి
శీర్ణకరండబులఁగుఁ గరాటంబు కరవటం బనఁగను బరఁగుచుండుఁ
దాంబూలపాత్రంబు తబుకం చనంగను గంపెయం చనఁగను గుంపె యనఁగ
జాలవల్లిక యనఁగను సంపుటంబు పొలుచు సంబెల యనఁగఁ దాంబూలధాని
యడప మనమీఱుఁ దమలపాకులను బదిలపఱుచునది పదర మనఁగ బరఁగు నభవ.

166


సీ.

పూగభాగమ్ములు పొలుచు బాగాలన నెలవతి యనఁగను వెలయు ఖాది
రమ్ము కాచన ఖాదిరవట మొప్పును గైరవడి యనఁ బర్ణస్తబకము చెలఁగు
నాకుఁజుట్ట యనంగ నడరును వృత్తపర్ణం బాకుమడుగున రహి వహించు
సున్నపుఃగాయనాఁ జూర్ణకరం మౌ బోఁకొత్తు నాఁగను బూగదళిని
దనరుఁ దాంబూలనామంబు తమ్ములమన వీడె మన వీడియమ్మన వీడ్య మనఁగ
విడియ మన విద్య మనఁగను విడె మనంగ భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

167


సీ.

చర్వితతాంబూలసంజ్ఞ యౌఁ దమననాఁ బరఁగుఁ గళాచిక పడిగ మనఁగఁ
గాళాంజి యనఁ బకద్గ్రాహిణి దగు గూఁడు చౌట పంజర మనఁ జను వ్యజనము
విసనకఱ్ఱ సురటి వీవనయం చన నవి యెండమఱుగిడ నాలవట్ట
మన విరాజిలును దువ్వెన యనఁ గేశప్రసాధిని వెలయును జమను గంక
తికయుఁ జిక్కంటి యంచనఁ దెలియఁదగును వెలయు లీక్షావికర్షి యీర్పెన యనంగ
వద్ద మన ముకురాఖ్యగా నతిశయిల్లు వసుమతికృతశతాంగ చెవ్వందిలింగ.

168


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగ నరవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

169

ᛟᛟᛟᛟᛟᛟ

బ్రహ్మవర్గము

సీ.

సంతు కొలము వంగసము పదు గన వంశసంజ్ఞ యై యలరుచుండుఁ
బరఁగుఁ జతుర్వర్ణి బాఁపన రాచ కోమటి రెడ్డి నాఁగను మనుచునుండు
వన్నెయం చనఁగను వర్ణాభిధాన మౌ మంచివాఁడు ససువు మంచి పాదు
వన సజ్జనుం డొప్పు నమరును విప్రుండు పాఱుఁడు బాఁపఁడు బాఁపనుండు

పుడమివే ల్పన బ్రాహ్మణ్యము దనరారు బాఁపఱిక మనఁ దనరును బండితాభి
ధాన మగుఁ దెల్వికాఁడు పెద్ద చదువరి యెఱుకగలుగువాఁడునాఁగ మేచకశిరోధి.

170


సీ.

ఒప్పు నుపాధ్యాయుఁ డొజ్జ యనంగను జన్న మనంగ యజ్ఞంబు చెలఁగుఁ
జదువునా బ్రహ్మయజ్ఞము దగు వేలిమి యన దేవయజ్ఞంబు దనరు విందు
నాఁగ మనుష్యయజ్ఞము పొల్చుఁ దనుపు నాఁగను బితృయజ్ఞాఖ్య యొనరు బడిమి
యన భూతయజ్ఞమౌ నైదుయజ్ఞము లివి యాస్థానసంజ్ఞ యై యలరు నోల
గమ్ము కొలు వన నది మించి కానుపింపఁ బోలుఁ బేరోలగమ్ము నొడ్డోలగ మనఁ
బరుస యనఁ దైర్థికసభాఖ్య పరఁగుచుండుఁ బుంగవతురంగ శ్రీమాతృభూతలింగ.

171


సీ.

అగ్నిసాధనవిశేషాభిధ చెకుముకి యనఁ దనరును హవిష్యంబు చెలఁగు
నిగిరికయం చన నిగిరికెయం చన నామిషసంజ్ఞయై యలరుఁ గూకు
పాలవిఱుఁగు నాఁగఁ బరఁగును బొంగలి యనఁగను బాయసం బలరుఁ బులగ
మనఁ గృసరాన్నాఖ్య యొనరును దాన మౌఁ జాగము పె ట్టొనఁ గీగి యీవి
పుడుకురింత పుడిగ తేగము పుడు కనఁగ యాచ్నచెలువొందు వేఁడుట యడుగుట యన
విం దన నతిథినామమై వెలయుచుండు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

172


సీ.

వెదుకుడు తడవుడు వెనుకుడు రోయుడు నెమకు డనంగ నన్వేషణ మగు
నుజ్జన మనఁగను నుజ్జగిం పనఁగను విడి యన విడు పన విడుదల యన
విడుట మానుట యన వీడుకో లనఁగను నెదు డనఁ దక్కన వదలుట యన
నఱుట యనంగను దొఱఁగు టనంగను నలరు విసర్జనాహ్వయము లెదురు
కొనుట యెదురేఁగుట యెదిరికో లనంగ నభిగమన మొప్పు గౌరవ మ్మలరుచుండు
గారవిం పన గారము గారవ మన నెస యనంగను శుశ్రూష చెలఁగు నభవ.

173


సీ.

త్రిమ్మట త్రిప్పట తిరుగుడు తిరుగునాఁ బర్యటనాఖ్య యై పరఁగుచుండు
నాచమనీయాఖ్య యలరు వార్పనఁగను మౌనంబు పలుకమినా నెసంగు
వరుస యనంగను బరువడి యనఁగను గ్రమనామ మొప్పును రాజిలుఁ దడ
పాటు వీడ్పాటు నా వ్యత్యయ మగు నెడఁబా టనంగను నతిపాత మొప్పు
నియమ మలరారు నేమంబు నేమకంబు కట్టడ యనంగ దేవతాకార్యనియమ
సంజ్ఞగాఁ బల్కఁబడు జన్నె జన్నియ యన బత మనఁగ వ్రతము వెలయుఁ బార్వతీశ.

174


సీ.

వస్తిల్లి నుంకు నిప్పస్తు ని ట్రనఁగను నుపవాససంజ్ఞయై యొప్పుచుండు
బ్రహ్మబిందువు మీఱఁ ద్రస్స యనంగను మ్రొక్కు దండము కేలుమో డ్పెఱఁగుడు
నాఁగఁ జెన్నొందును నతి తద్విశేషమ్ము ల్చేవిప్పు వెన్నెల చిన్నిపువ్వు
జోహారును జొహారు జోడాలు చెంగనాల్ డింగిళ్ళు గొబ్బిళ్ళు డెంకణాలు

నల్లొనేరేళ్ళు జోదిళ్ళు ననఁగఁ దనరు వేఁడికోలనఁ బ్రార్థన వెలయుచుండు
భిక్ష తిరిపము బికిరము బిచ్చ మాయవారమును జోగునాఁగను పఱలు నభవ.

175


సీ.

అవిరక్తభిక్షకుఁ డలరును బికిరాలమారి బికాసి బికారి తిఱ్ఱి
గొట్టు తిఱ్ఱి తిరిపగొట్టునా వటుఁ డొప్పు వడుగు బొమ్మాచారి తడుపుదాల్చు
నా గృహస్థాభిధానం బిలుదొర గేస్తు నా వనసంవాసినామ మెసఁగు
నడవినెలవరినా జడదారి యనఁగను గనుపట్టు సన్యాసి కావిగోఁచి
దారి బోడ కబిసినాఁగఁ దనరు యోగి జోగి నాఁదగు జడదారినాఁగఁ దపసి
నాఁగ ఋషిసంజ్ఞ జన్నిదం బనఁగ యజ్ఞసూత్రమౌ నంబరకచ.

176


సీ.

పొసఁగుఁ గమండలు బుడిగ యనంగను బుడ్డిగ యనఁగను బుడ్డి యనఁగ
బోలెనాఁగను గకపాలనాగను గక్షపాలాహ్వయంబుగాఁ బరఁగు ధార్య
చర్మనామము కళాసము కళవస మన యోగివేత్రాభిధ యొప్పు లాత
మనఁగ ముండన సంజ్ఞ యలరుచునుండును గోఁగుట బోడింపు గొఱుగుట యన
నుపనయనమగు వడుగునా నొప్పగును వివాహనామంబు పెండ్లి చేపట్టు కాలు
ద్రొక్కు పెండిలి యనఁగఁ బెంపెక్కు నేఁగు పెండ్లనఁ దదంతవీథికావిహృతియ భవ.

177


సీ.

వడుగు పెండ్లిండ్లలోపలఁ దృతీయదినంబు పాకెన్న యనఁగను బరఁగుచుండు
నారింటికిని వేఱె యగుచు నంత్యదినంబు లవును గంబవలి నాగవలి యనఁగఁ
బెండ్లికూఁతు రనంగఁ బెండ్లికొడు కనంగఁ గ్రమముగాను వధూవరాఖ్యలు దగుఁ
జిమ్మనగ్రోవినా శృంగమౌఁ దద్భేద మండె బుఱ్ఱటకొమ్ము ననఁగ వెలయుఁ
గొఱలుఁ గవయుఁట కూడిక కూటమి కలయిక యన ప్రతి యహిరతి యెసఁగు మసక
మనఁగ బశుమృగరతము చెన్నలరుఁ ద్రొక్కు డనఁగఁ బొర్లుట యనఁగ దేవాధిదేవ.

178


సీ.

పొత్తనఁగ సజగ్ధి పొలుచు బువ్వ మనంగ స్వజనవివాహసజగ్థి దనరు
హరిబువ్వ మన వివాహచతుర్థదినరాత్రి బందుజనసజగ్ధి పరఁగుచుండు
బాలిక జాదారపాలిక నాఁగరు నంకురార్పణశరావాఖ్య దనరుఁ
బ్రథమవధూపరభవనప్రవేశాఖ్య యిలునింపడ మనంగ నెసఁగుచుండు
నుంకు వన నోలి యనఁగను సంకనంగఁ బైఁడి యనఁ గన్యకాశుల్కవాచక మగ
నరణ మనఁ బితృదత్తకన్యాధనంబు పొలుచును వినంగ శ్రీమాతృభూతలింగ.

179


సీ.

ఉపరిసురతసంజ్ఞ యొప్పును మగపోల్కి కూటమి యనఁగఁ బైకూటమి యన
మణితవాచకములై మనుఁ బావురాపల్కు లనఁగఁ గూఁకీపల్కు లనఁగ నవియె
లోగుక్క వెలిగ్రుక్క నాఁగఁ జెలంగును దంతక్షతాభిధ తనరుచుండుఁ
బలుగంటు పలునొక్కు పలుగెంపు లనఁగను గరరుహక్షతములు మెఱయుచుండు

గోరువంకలు చందురుకూన లనఁగ ముద్దు నాఁగను జుంబనం బొప్పుచుండుఁ
బొల్చుచుండును దొంతరము ద్దనంగఁ దద్విశేషంబు మాతృభూతాభిధాన.

180


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁజేయుకతనఁ, బరఁగు శాశ్వతముగ బ్రహ్మవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

181

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

క్షత్త్రియవర్గము

సీ.

రాచవాఁ డనఁగను రాజన క్షత్త్రియుఁ డొప్పు నేలిక సామి యొడయఁడు దొర
రాయఁడు రా ఱేఁడు రా జెకిమీఁ డన నరపాలసంజ్ఞ లై పరఁగుచుండు
రాచఱిక మన రాయఱిక మన రాజరాడ్భావకర్మములు వెలయు
లక్కుముఁ డనఁ దగు లక్ష్మణుఁ డనిలజుఁ డలరును వడముడి వలిమొల కన
బార్డుఁ డెసఁగును గఱ్ఱి కవ్వడి యనంగ నకులసహదేవు లలరుదురు కవ లనఁగఁ
జెలఁగు దుశ్శాసనుఁడు దుస్ససేనుఁ డనఁగఁ బ్రబలు దుర్యోధనుండు రారాజన భవ.

182


సీ.

విరటుఁ డనంగను వెలయు విరాటుండు మండలేశ్వరుఁ డొప్పు మన్నెవాఁడు
మన్నీఁ డనంగన మండలేశత్వంబు మన్నెఱికం బన మనుచునుండు
గుత్తకాఁ డనఁగను గుప్తికారుఁ డెసంగు మంతునాఁగను ద్యూతమంత్రి యెసఁగు
బ్రెగడ ప్రెగ్గడ యనఁ దగుఁ బ్రధానుఁడు దగవరి తీర్పరి యన ధర్మజ్ఞుఁ డలరు
మీఱు నారక్షకాభిధ యారెకుఁడు తలారి తలవరి యనఁగ శుల్కాధికారి
చనును సుంకరి యనఁగను షండుఁ డొప్పు
నెగ్గడి యనంగఁ గంచుకి యెసఁగుచుండు బొందడీఁ డన శ్రీమాతృభూతలింగ.

183


సీ.

కటికవాండ్రనఁగను గట్టిక లనఁగను ఫణిహారు లనఁగను బరఁగుచుండు
వేత్రహస్తాభిధ వెలయుఁ జారసమాఖ్య వేగులవా రన వేగరు లన
బహువచనమ్మునఁ బడవా ళ్లనంగను దళపతి నామము ల్దగుఁ బడాలు
దళవాయి పడవాలు దణి యనంగను నల్ప సైన్యాధిపతి యొప్పు జంగిలి గమి
కాఁ డనంగను సేవకాఖ్య లగు జీతగాఁడు కొల్వుడుగాఁ డనఁగాను భటుఁడు
పరఁగు జోదన లెంకన బంటనంగ భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

184


సీ.

చుఱుకరి యనఁగఁ దెంపరియన శూరాభిధానంబుగాఁగను దనరుచుండు
నొంటరి యొక్కటీఁ డొంటరీఁ డొంట్రింపు నా నేకభటునకు నామ మగును
గాల్వురు నాఁగను గాల్బంటునాఁగఁ బదాతినామంబుగాఁ దనరుచుండు
శపథాయుధనిషేవి చనును గైజీతమం చనఁగను మాసియం చనఁగ వైరి

మనును నొంటనివాఁ డన మార్తుఁ డనఁగఁ బగతుఁ డనఁ బగ ఱనఁ బగవాఁ డనంగఁ
గంట నఁగ గొంగ యన సూఁడుకాఁ డనంగ భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

185


సీ.

చుట్టము పక్కము చుట్ట నెచ్చెలి చెలికాఁడు నెయ్యుఁడు సంగడూఁడు పొందు
కాఁ డంటు చెలి నేస్తకాఁడు సంగడికాఁడు నాఁగను మిత్త్రుని నామము లగుఁ
బగ సూడు కంటునాఁ బరఁగు విద్వేషంబు చెలిమి చుట్టరికంబు చెల్మి నెమ్మి
నెయ్యము నేస్తము నెయ్యమి సంగడి యొద్దిక యొమ్మిక యొండొరిమిక
పొం దొరిమె పొత్తుగారము పొందిక యనఁ బరఁగుచుండును మిత్త్రభావంబు బట్లు
క్రిక్కలనఁ బాఠకాఖ్యలు గేరుచుండు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

186


సీ.

నమ్మినవాఁ డన నచ్చినవాఁ డనఁ జనవరి యనఁగను దనరు నాప్తుఁ
డలరును గరణమం చన లెక్కవాఁ డన గణకాభిధానంబు కరణిక మన
గణకునిభావంబు కర్మంబు వెలయును లిపికారకుం డొప్పు లేకరి యన
వ్రాఁతకాఁ డనఁగను వ్రాలునా వ్రాతనా లిపియొప్పు నక్షరాల్ వెలయుచుండుఁ
నక్కరము లచ్చరమ్ములం చనఁగఁ గ్రార గిలక యన రేఫ మెసఁగును గియ్య యనఁగ
నడరును యకారనామంబు సుడియనంగ వట్రువయన ఋకారమై వఱలు నభవ.

187


సీ.

బొట్టన సున్ననఁ బొలుపొందు బిందువు నిడుదన దీర్ఘంబు నెగడుచుండు
జిడ్డయం చనఁగను సంయుక్త మొప్పును గణితంబు లెక్క నాఁగను దనర్చుఁ
గమ్మ యనంగ లేఖ యగు రాయస మన రాజలేఖ దగుఁ గిల్లాకు చీటి
యన ఖండపత్త్రిక యలరును గౌలన నభయపత్త్రాభిధ యలరుచుండు
ఘట్టితపటంబు వెలయును గడిత మనగ వెలయుఁ గాకిత మనఁగఁ దచ్భేదసంజ్ఞ
యాడె యనఁగఁ దదేకదేశాహ్వయ మగుఁ బుస్తకము పొత్తమన మీఱు భుజగభూష.

188


సీ

గంట మనంగను గనుపట్టు లేఖిని కలమము కలము నాఁగను దనర్చు
రాయబారి యనంగ రాజదూత యగుఁ దద్భావంబు తగు రాయబార మనఁగఁ
బథికుఁడు దగుఁ దెరువరి యన మార్గజ్ఞ సంజ్ఞ యౌఁ జొప్పరి జాడకాఁడు
నాఁ బలుపట్టడ నాఁగఁ బౌరశ్రేణి పొలుచును రాజ్యాంగములు దనర్చు
సామి ప్రెగ్గడ చెలి బొక్కసము తిరస్తు కోట సౌఁ జనఁగాను షడ్గుణము లగుచు
బేరుకొనఁగాను దగు సంది పోరు పోక యునికి రంటన నొండన నుగ్రమూర్తి.

189


సీ.

వాఁడిమి జతనము మంతనం బనునట్టి యివిమూఁడు శక్తులై యెసఁగుచుండుఁ
దగుఁ ద్రివర్గాభిధ తగ్గు నిల్కడ పెరుగుడు నను నివిమూఁడు గొఱలు నవలఁ
జతురుపాయంబులసంజ్ఞయై మం చీగి వేఱు కొట్టన నాల్గు వేఱు వేఱ
వేఁడిమి యనఁగను వాఁడిమి యనఁగఁ బ్రతాపాభిధానంబు తనరుచుండు

దండు వన దండు గనఁగను దండమునకుఁ బ్రతినిధిగఁ దీయుద్రవ్యంబు పరఁగు విజన
మొంటిపా టేకతం బన నొప్పుచుండు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

190


నమ్మికనాఁగను నచ్చికనాఁగను విశ్వాససంజ్ఞ యై వెలయుచుండు
నిమ్మళం బనఁగను నిష్కలంకత యొప్పు నిశ్చింత దనరును నెమ్మది యనఁ
దగ వనఁ బాడినాఁ దగు న్యాయనామంబు మనును జాలిక నా సమర్థనాఖ్య
యానతి యనఁగను నాన యనంగను సెలవురా ముదలనాఁ జెలఁగు నాజ్ఞ
గడు వనఁగ మేర యనఁగ నుగ్గడి యనంగ నడరు మర్యాద తప్పిదం బాగడంబు
దుడుకు నేరము నేరమి దుండగంబు తప్పనఁగ నపరాధము తనరు నభవ.

191


సీ.

ఆరి బడి యప్పన ముప్పున పంగము పంజి పన్నాడి కో ల్పగిది బెడిగ
కోరనఁగాఁ జెలఁగును భాగధేయంబు గృహభాగధేయ మౌ నిల్లరి యనఁ
బుల్లరినాఁగ నొప్పును దృణభాగధేయంబు కాలరినాఁగ ననుపునాఁగ
నభిగంతృభాగధేయము చెలంగును నెల పన ధాన్యపరిమాతృభాగధేయ
మలరుచుండును పట్టమం చనఁగ వెలయు హేయదీనారముఖభాగధేయసంజ్ఞ
సుంక మన దాణ మనఁగను శుల్క మెనఁగు లంచ మనఁగను నుపదయై మించు నభవ.

192


సీ.

కానుక కానిక కప్పము సూడిద యులుపా యుపారంబు నులుప యనఁగఁ
జను నుపాయనసంజ్ఞ చామరం బొప్పు వింజామర యనఁగను సౌర మనఁగఁ
దద్భేదసంజ్ఞయై తనరారు గొడు గన గొడు వన ఛత్రాఖ్య యడరుచుండు
జగజం పనంగను జల్లినా జంపన ఝల్లరీనామమై యుల్లసిల్లు
నర్షవారణనామమై వఱలు జిగ్గు గొడు గనఁగఁ జర్మఫలకంబు కొఱలు నరిగె
యనఁగ భృంగారు గిండినాఁ జను బిరుదము బిరుదనఁ బవాడ మనఁగను బరఁగు నభవ.

193


సీ.

వేలము పాళెము వీడుపట్టు బిడారు విడిది యంచనఁగ నివేశ మొప్పుఁ
జదలమం చనఁగను స్కంధవారము మీఱు నేనుంగు హత్తి గౌరేనుఁ గేన్గు
నాఁగ దంతావళనామమౌ మొక్కడీఁ డన నల్పదంతగజాఖ్య దనరుఁ
గలభంబు గున్ననాఁగను జెలువొందును బెంటియేనుఁ గనంగ వెలయుఁ గరిణి
తొండ మనఁగను దుండాఖ్య తోఁచు జాల పొగరుపొడ యనఁ బద్మము ల్దగును గీక
యనఁగ ఘీంకారనామధేయంబు చెలఁగు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

194


సీ.

మదము రాజిలు మస్తు మత్తు మత్తాయన నాలానసంజ్ఞ యై యలరుఁ గట్టు
కంబ మనంగఁ దోత్రంబు బరి యనఁగ నారెగోల యనంగ నలరుచుండు
శృంఖలనామంబు చెలఁగు సంకెల యన సంకుశనామమౌ నంకుసమ్ము

నొప్పుఁ జౌడో లనంగ దంత్యుపరిడోల వారి పంగెన యనఁగను బంగిడి యన
నోద మన మూఁడుపేళ్ళచే నుల్లసిల్లు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

195


సీ.

పరఁగు నశ్వంబు బాబా వాపురము వారువము జక్కి తత్తడి మావు గుఱ్ఱ
మన దేశభేదహయాభిధలు హరబ్బి తురికి కచ్చి యనంగఁ దోఁచుచుండుఁ
బాగా యనఁగ నశ్వపంక్తి విరాజిల్లుఁ బూజ్యాశ్వసంజ్ఞ యొప్పుఁ బడివాగె
తేజినా వర్మితవాజియౌఁ గత్తలాని యనంగఁ గత్తలాన యనఁగాను
ఘోటకవిశేష మెసఁగును గూబు నాఁగ మూఢకహయంబు వెలయును మోటునాఁగఁ
దట్టు వన నీచతురగంబు దనరుచుండు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

196


సీ.

తేజినా నున్నతవాజియై విలసిల్లు బడబ గోడిగ నాఁగఁ బరఁగుచుండు
బడబాఋతు సమాఖ్య యడరు నత్తడియన సొబను నాఁగ బడబచూలు వెలయు
సకిలిం పనంగను సకిరింత యనఁగను హేషాభిధానమై యెసఁగు చుంచుఁ
గంద మనంగను స్కంధంబు దగుఁ దోఁక లవిటి నాఁగలు బుచ్ఛము విలసిల్లుఁ
గొన యనఁగఁ గేసరం బొప్పు గొరిజ డెక్క గిట్ట యన ఖురనామంబు గేరుచుండు
నడ పనంగను నడ యన నడరును గతి భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

197


సీ.

జంగనడపునాఁగ జంఘాలగతి యొప్పుఁ జనును లుక్కనఁగ నీచగతిపేరు
రవగా ల్రవాలునా రాజిల్లు నాస్కందికము జోడన యనంగ ధౌరితకము
వెలయును బేరెము వేడెము జాలెము బవిరినా రేచితంబు విలసిల్లుఁ
జౌకళిం పనఁగను దూకు డనంగను వల్గిత మ్మగును దువాళ మన దు
వాళి యనఁగను బ్లుతముగా వఱలుచుండుఁ బొలుచు నాస్కందితవిశేషము మొనగాల
నంగఁ బ్లుతగతిభేదంబు జంగ గంతు దాఁటు పల్లటీ దుముకునాఁ దనరు నభవ.

198


సీ.

అశ్వతనుత్రాణ మడరుఁ బక్కెర యనఁ బల్యాణ మొప్పును బల్ల మనఁగ
జీనంబు మెత్తన జేననఁ దనరును గ్రాలు ఖలీనంబు కళ్లె మనఁగ
వాగె యంచనఁగను వల్కాఖ్య మెఱయును మొగము ట్టనఁగ నశ్వముఖవిభూష
దనరు దలాటమం చనఁగ నశ్వశిరోధిభూషణసంజ్ఞ యై పొసఁగుచుండుఁ
దం గనఁగ నశ్వమధ్యబంధంబు మీఱుఁ జౌ కనఁగఁ దఱ టవఁగఁగశాఖ్య వెలయుఁ
గొఱప మనఁగ క్షురప్రము పరఁగుఁ గవణ మన హయాహారభేదంబు లగు మహేశ.

199


సీ.

అంకవన్నె యనంగ నశ్వపార్శ్వాలంబి రజ్జుసమాఖ్య యై ప్రబలుచుండుఁ
బంచకం బన నశ్వపశ్చాత్ప్రదేశమౌ నశ్వఖాదనసాధకాస్యలంబి
భస్త్రి బొక్కెన యనఁ బరఁగుఁ గైజామోర యన హయశీర్షకంపనము వెలయుఁ
బాలాసత్రాళ్లన బంధరజ్జువు లొప్పు వేసడం బనఁగను వేసర మన

వ్యాసటీక విలసిల్లును నరద మనఁగఁ దేరు నాఁగను రథసంజ్ఞ మీఱు బండి
యనఁగ శకటసమాఖ్యయై యలరుచుండు ద్యూతశకటంబు సగ టనఁ దోఁచు నభవ.

200


సీ.

కంబళవాహ్యకాఖ్యలగుఁ గొల్లార్ బండి పాటబండి హొయలుబండి యనఁగ
నలరుఁ దృణాద్యానయనసాధనవిశేషసంజ్ఞ యీడిక యన సరవడి యనఁ
గట్లయం చనఁగను గట్లమంచ మనంగ యాప్యయానాభిధ యలరుచుండు
నుయ్యాల యనఁగను నుయ్యెల యనఁ దొట్ల యన లాలి యన డోల దనరుచుండుఁ
బరఁగు బల్యంకికకుఁ బేరు పల్లకి యనఁ జెందు నాందోళికకు సంజ్ఞ యందల మనఁ
గొఱలుఁ దదుభయదండంబు కొ మ్మనంగ భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

201


సీ.

అను సనఁ దొడు పనఁ నాందోళికాదిదండాగ్రసంధేయాఖ్య యలరుచుండుఁ
బన్నాగ మనఁగను భాసిలుచుండును నాందోళికాద్యవయవసమాఖ్య
బండిక ల్లనఁగను బరఁగును జక్రంబు బండిక న్ననఁగను బరఁగు నాభి
బండికన్నులయందుఁ బట్టించు చమురు కందెన యనఁగను గడిదేరుచుండు
నేమి దనరారుచుండును నెమ్ము నెమ్మి కమ్మి యనఁగను దగుఁ గూబరమ్ము పరము
నాఁగ నక్షాభిధ యిరుసునాఁగ వెలయు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

202


సీ.

చీల జంజడ యాణి చిలుకయం చనఁగను దైనితకాభిధగాను దనరు
నొగ యనఁగా నెంచఁదగు యుగంధరసంజ్ఞ యంగసంజ్ఞ కాఁడినా నొప్పుచుండు
యొకరింత యనఁగను నెక్కు డనంగను వాహనసంజ్ఞ యై వఱలుచుండు
మాపటీఁ డనఁగను మావంతుఁ డనఁగను నాధోరణునిసంజ్ఞ యలరుచుండు
రవుతు రౌతు రావు తనంగ రాహుతుఁ డగు బరిగిరౌ తనఁ బల్యాణబంధరహిత
హయసమారోహకాఖ్యయై యలరుచుండు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

203


సీ.

గుల్లా మన గుఱాలగోచనఁగా గులప యనంగఁ దగు నశ్వపాలకుండు
పారివాఁ డనఁగను బరిచరుం డొప్పును బేరణ మనఁగను బేరని యన
మైమఱు పనఁగను మేమఱుఁ గనఁ గత్తళ మ్మనఁగా బొందళం బనంగ
జో డనఁ గవచంబు శోభిలుఁ జిలుకత్తు జీరా యనఁగఁ దద్విశేషము లగుఁ
జను శిరస్త్రంబు గొగ్గి సీసకము బొమిడి కం బనంగను బేటినాఁగను దనర్చు
సారసనసంజ్ఞ సాచి భుజానలంబి కృత్తి పడుదల డాబస గేరు నభవ.

204


సీ.

సన్నాహనామంబు సమకట్టినది యాయితము సజ్జ కట్టాయిత మన వెలయు
విలుకాఁ డనంగను వింటివాఁ డనఁగను ధన్విసమాఖ్య లై తనరుచుండు
నారీతి నాయుధాహ్వయములఁ బరికించి తజ్జీవిసంజ్ఞలఁ దలఁపవలయు
మావటీఁ డనఁగను మాస్టీఁ డనంగను సాదకాఁ డనఁగను శస్త్రదక్షుఁ

డలరుఁ దద్విద్య సాదన యనఁగ నెగడు నఱుకు పరుపడి గాయమానంబు విసరు
మొన లనంగను దద్భేదములు చెలంగు నొక టొకటి పెక్కువితములై యొప్పు నభవ.

205


సీ.

సాధనాయుధములు సానకత్తి యనంగ బొందకోల యనంగఁ బొలుపుఁగాంచు
మాసటిపోట్లాటమట్టుకుఁ దగుకత్తి చేకత్తి యనఁగను జెలఁగుచుండు
జింకకొమ్ములు రెండు చేర్చి యల్గు లమర్చి డాఁకేలఁ బూన నొ డ్డనఁగఁ బొడువ
సంగతిగలయది సింగోట యనఁగను దివిదారికొమ్మనాఁ దేజరిల్లు
నొంటిపోట్లాటఁ గోరుచునున్న యట్టి మాసటీలకుఁ గైదువు ల్మట్టుఁ జూచి
యేరుపఱచుట వెలయుఁ గొలారిక మనఁ దద్రణావని పడవనాఁ దగును నభవ.

206


సీ.

మనును జెట్టి యనంగ మల్లాభిధానంబు తద్విద్య సా మనఁ దనరుచుండుఁ
గన్నాతలు పుటము లస్తాలు మండీలు దాళాలు డింకీలు దండెములును
లాగు లనంగను రాజిల్లుఁ దద్భేదనామధేయంబు లెన్నంగఁ గొన్ని
తత్సాధనంబులై తగు గంబము కొణత కటి కన లోడుసంగడము బాల
సంగడము నీలగోతా మనంగఁ గొన్ని దట్టియనఁ గచ్ఛమగును జేతా ళ్లనంగ
మల్లయుద్ధాయుధాఖ్య లై యుల్లసిల్లు ముళ్లనఁ దదగ్రనామము ల్పొల్చు నభవ.

207


సీ.

బిరుదువేసిన జెట్టిపరివార మగునట్టి వా రొప్పుదురు హొంతకారు లనఁగ
గుద్దులాటకు జెట్లఁ గూర్చువానికిఁ చేరు దసువంది యనఁగను దనరుచుండు
నణుకువాఁ డనఁదగు నన్యజాతీయుండు కవణకాఁ డన మీఱు గమనబోధి
మల్లచఱు పనంగ మల్లచఱుపు డన భుజసమాస్ఫాలనం బొప్పుచుండు
దండ యనఁగను ముష్టియుద్ధాదిమగతి మించు నందున మద్దెళసంచు మొదలు
కొన్ని భేదంబులు చెలంగు నన్ని దెలుప గ్రంథవిస్తరభయముచేఁ గాలకంఠ.

208


సీ.

కల్లంబు రాటంబు కత్తి కొక్కిస తొట్టు రూణింపు బరిపోటు రొండివ్రేటు
వింటాళము పణమ్ము పెట్లాగు పాఱమ్ము డొక్కర ముత్తర డొక్కరమ్ము
కన్నాత బాంగణ కందణంబు తిణింగి గొంతుమాఱును జేబ కుమ్మరింపు
కానె నీల్కడ గళకత్తెర జోడింపు నరసింగ ముసిరి బిత్తరము కిల్లి
చాగు సమసీసము తడకాల్ సందుసీస మంజ మెడపట్టు నాఁగఁ జెన్నలరుచుండు
ముప్పదియురెండువిన్నాణములకుఁ బేళ్ళు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

209


సీ.

 వెంబడి బాసట వెంట తో డనుగల మనుఁ గనఁగను సహాయాఖ్య దనరుఁ
దోడ్పా టనంగను దోఁచు సాహాయ్యంబు దందు దడ మనంగఁ దనరు సేన
యుభయసేనాభిధ యొ ప్పిరువా గనఁ బొల్చు సేనాముఖము మొన యనఁగ
వ్యూహంబు వెలయుచునుండు మొగ్గర మన నొడ్డణమం చన నొ డ్డనంగ

వెలయు సంపద సిరి లచ్చి కలిమి యనఁగఁ బరఁగుఁ బేదఱికంబు నిప్పచ్చరము
నెవ్వ యెద్దడి లేమినా నివ్వటిల్లు రిక్తతకు నామధేయము ల్భక్తవరద.

210


సీ.

చేటు చెడిది చెట్ట సేగి సిలు గనంగ నాపదభిఖ్య లై యలరుచుండుఁ
జేడ్పా టనంగను జైలఁగు నాపత్య్రాప్తి కైదువ యనఁగను గత్తి యనఁగ
నాయుధ మొప్పు విల్లన ధను వెసఁగును సింగాణి యనఁ దగు శృంగధనువు
అటని చెల్వగును గొప్పనఁ బిడికిటికట్టు నాఁ గను లస్తకనామ మొప్పు
నల్లె యరి నారి గొనయమం చనఁగ వెలయు మౌర్వి దనరారుచుండుఁ దన్మధ్యతంతు
బంధ మరిపోసి యనఁగఁ గూర్పరి యనంగఁ బుంగవతురంగ శ్రీమాతృభూతలింగ.

211


సీ.

అమరు గుణారోహణాభిధానం బెక్కుపెట్టుట యనఁగ మోపెట్టుట యనఁ
దెగ యనఁగా గడిచేరును జ్యాకృష్టి చాపకర్షణబలసాధనంబు
ద్రోణ మనంగను దోఁచు బల్వగువిల్లు దనరియుండును గపోదాయనంగఁ
బరఁగు లెప్ప యనంగ గుఱి యనఁగఁ బతన లక్ష్యాభిధానంబు లక్ష్యవీధి
కొఱలు సూటన నమ్ము లకోరి తూపు కోల యనఁగను శరము తగును దనర్చు
సరుడునాఁగను గరిలేనిశరము పేరు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

212


సీ.

పారవాత మ్మనఁ బరఁగుచునుండు విశాలముఖం బైనసాయకంబు
దుష్కంటకశరంబు దోఁటమ్ము నాఁగను జిల్లకోల యనంగఁ జెలఁగుచుండు
దోనమ్ములం చన నౌ నల్పశరములు నారాచ మొప్పును నారస మనఁ
జాపానపేక్షమౌ శర మొప్పుచుండుఁ జేయమ్మం చనంగ జోడ మ్మనంగ
నంపర యనంగ శరసమూహంబు దనరుఁ జిలు కనఁగ ముల్కి యనఁగను ఫలము దనరుఁ
బింజ రొదయనఁ బుంఖంబు వెలయుచుండు భూషికభుజంగ శ్రీమాతృభూతలింగ.

213


సీ.

తరకసమ్ము పొది బత్తళిక పాణివడమ్ము దొన యనఁ దూణీర మొనరియుండు
వాలు ఖండా కరవాలు మేల్కత్తి తరవళి నరాశి పిరంగి యడిద
మన ఖడ్గనామమై యలరుచునుండును దార నా వాయినా ధారవెలయుఁ
జాయ లంచన నసిచ్ఛాయలై తగుఁ గృపాణీరేఖ లొప్పును దోరము లనఁ
బెణికనాఁగను గరవాలపృష్ఠ మొప్పు మీఱును గృపాణికాగ్రంబు చూరి యనఁగ
సురె కటారి పిడెం బన శోభిలును గరాసినామంబు లై నిటలాగ్నినేత్ర.

214


సీ.

పట్టసనామము ల్పట్టెమన మొహదా యన నడ్డ కత్తినా నలరుచుండు
నొఱ యనఁ గోశాఖ్య యొప్పుఁ జిల్కడ యనఁ దద్బంధగుణసంజ్ఞ దనరుచుండుఁ
గోశాంతకోశాదిగుప్తి భూషలు కుప్పె యన సరడా యన నగుఁ గ్రమముగఁ
గోశసమాచ్ఛాది కొఱలు గలీ బన ఖడ్గాదిముష్టిసంగ్రాహ్యతలము

పరుఁ జనఁ బరుం జనంగను బరఁగు నదియె చనును నెమ్మిలిపరుఁజునా జాపరుఁ జనం
బిడి యనంగ నుత్సర్వాఖ్య వెలయుచుండు భూషికభుజంగ శ్రీమాతృభూతలింగ.

215


సీ.

పరుఁజులోపలఁ జీలపట్టించునలుగువా యమరుపయోగ్యమైనట్టితావు
మొసలికా టనఁగను మొసలివా యనఁగను జిమట యనంగను జెలఁగుచుండుఁ
బలకయం చనఁగను ఫలకసమాఖ్యయౌ ఖేటక మెసఁగును గేడె మనఁగఁ
దద్భేదనామమై తనరును జిల్లోటి కేవడ మం చనఁ గేరుచుండు
గుదె గుదియ దుడ్డు గునుపము గుడుప యనఁగ ముద్గరము భిండివాలమ్మ పొలుచుఁ జిల్ల
కో లనఁ దగుం గుఠారము గొడ్డలి యన భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

216


సీ.

ఖండపరశు వొప్పు గండ్రగొడ్డలి యన బరిస బడిత యనఁ బరిఘ మొప్పు
సెలకట్టె యనఁగను వెలయు శల్యము సురె సురియ చూరి యనంగ ఛురిక దనరు
జముదాడి యనఁగను యమధాటి చను నేజి బరిచి యీటె యనంగఁ బరఁగుఁ గుంత
మలరును గొఱ కన నల్పకుంతాభిధ బల్లె మనంగను భల్ల మమరు
బాగుదా రన నల్పాసి పరఁగు బాఁకు వంకి చిల్లాణ మనఁగను వక్రశస్త్ర
మలరుచుండును డొంకెన యనఁగ వెలయు నాయుధవిశేష నామమై యజ్ఞమౌళి.

217


సీ.

వాయిదా రనఁబడు వంకలు గలకత్తి దోదుమ్మి సై బనఁ దోఁచుచుండు
నాలక్షణము గల్గి యాగతి వంపైనఁ బరఁగుచునుండును గిరు సనంగ
నొడిసె యనంగను నడరు నావిద్ధము గ్రాలుఁ ద్రికాష్ఠి తిక్కటి యనంగఁ
దగు శిలాయంత్రంబు దంచన మనఁగను వసి గసి మే కన నెసఁగు శంకు
భేదనామంబు లగును శోభిల్లును సుర కోవి పీరంగి బాణము గుంటకోవి
జబురుజంగి తుపాకి జజా యనంగ వెలయు నగ్నిప్రసారణాఖ్యలు మహేశ.

218


సీ.

బాదరు నాఁగను బరఁగుఁ దుపాకిలోపలను జానకిత్రాఁడు నిలుపుతావు
చుఱుకైనమందుపే ర్పరఁగు రంజక మనఁ లగ్గనఁ బ్రాకారలంఘనంబు
అది రెండువిధములఁ బొదలుచుచుండును లగ్గనా సురతాణిలగ్గ యనఁగఁ
బాషాణదార్వగ్ని భాండాదికాభిధ లగ్గదిం పనఁగఁ జెలంగుఁ బోక
తరలుడు తరలిక యరుగు డరుగడమ్ము కదలుడు కదలిక కదలు కదలడమ్ము
చనుట యేఁగుట మేగుడం చనఁగ యాత్ర తగును దైవతయాత్ర జాతర యన భవ.

219


సీ.

వెలువడుట యనంగ వెడలుట యనఁగను నిర్గమనాఖ్యగా నెసఁగుచుండు
నెఱచుట యనఁగను బరఁగుఁ బ్రసరణాఖ్య యభియానము దనర్చు నఱముటయన
విద్రావణాభిఖ్య వెలయుంచునుండుఁ దోలుట యనంగను బఱచుట యనంగ
నెసఁగు నపక్రము మీడేరె ననఁగను దాడి యనంగను ధాటి యగును

దుమ్ము దువ్వ దుమారము త్రుమ్ము తుమురు దన సదటు బుగ్గినాగఁను దనరుధూళి
నురుము నుగ్గు పొడుము పొడి సురుము సున్ని చూరనంగను విలసిల్లుఁ జూర్ణ మభవ.

220


సీ.

డాలు టెక్కెంబు సిడమ్ము పడగ యనఁ గేతునామంబులు గేరుచుండు
నహమహమిక పేరు రహి కెక్కు నోహరిసాహరి యనఁగను సమరయాత్ర
సారినాఁ దగు లావు సత్తి సత్తువ బల్మి పీఁచ మోపిక యన వెలయు శక్తి
సలిగయం చనఁగ నాశ్రయబలంబు చెలంగుఁ గడిమి యుక్కు కఱుకు గట్టి కడిఁది
నాఁగ శౌర్యాభిధానంబు గాఁగఁ జెలఁగు బీర మనఁగను బిగువన బింక మనఁగఁ
బరఁగు గర్వంబు వెలయును బంద కోఁచ పిఱికి దొంబులిగొట్టన భీతుఁ డభవ.

221


సీ.

పోరాట పోట్లాట పోరు కయ్యము చివ్వ కంగారు కంగిస కలను దురము
గొడవ బవరము జగడ మాల మని యన యుద్ధవాచముకలై యొప్పుచుండుఁ
దనరును బెనఁకువ పెనఁగులాట యనంగఁ బెనయన గుద్దులా టనిన యుద్ధ
మలరు దందడి దొమ్మి యన సంకులరణాఖ్య దంటపో రనఁదగు ద్వంద్వయుద్ధ
మలరుచుండును గన్నెకయ్యం బనంగఁ బ్రథమయుద్ధాఖ్య యెక్కటిబవరమనఁగ
నొంటిపోట్లాటపేరుగా నొప్పుచుండు భూషికభుజంగ శ్రీమాతృభూతలింగ.

222


సీ.

ఆర్పు బొబ్బ యనంగ నగు సింహనాదంబు క్రం దనఁగాఁ దగుఁ గ్రందనంబు
సొరుగు సొలపు సొమ్ము సొలిమిడి సోలు సుమాళము బవిళి మైమఱపు బ్రమరి
యనఁగ మూర్భాహ్వయం బలరారుచుండును రాయిడి రారాపు రం పనంగ
ననుమర్దనం బొప్పు హావడి యావడి యన నుపద్రవసంజ్ఞ దనరుచుండు
దామరంబగుఁ జూఱ కొల్ల పరి యనఁగ వలసయనఁ బ్రవాసాఖ్యగా వఱలు జయము
గెల్ను గెలివిడి గెలుపము గెలుపనఁదగు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

223


సీ.

పగయీఁగు టనఁదగు వైరశుద్ధి పరుగు పరువు పాణు టన భావనము చెలఁగు
గునుకు డనంగను గును కనఁగా నల్ప ధావనసంజ్ఞయై తనరుచుండుఁ
దొలఁగు డనంగను దలఁగు డనంగను నపసరణాఖ్యలై యలరుచుండు
నపజయసంజ్ఞ లై యలరు బన్నము విఱు గోటమి యోడుట యోల చెంగ
నాలువిఱుగుడు విఱుగునాఁ గ్రాలుచుండుఁ ద్రుంచుట చిదుముట తెగటార్పు పరిమార్పు
పొరిగొనుట పిల్కుమార్పు చంపుట తునుముట యనఁగఁదగు హింస భక్తహృద్వనజహంస.

224


సీ.

సమయుట యీల్గుట చాపు చక్కడఁగుట క్రుంగుట త్రుంగుట కూలుట దుది
ద్రెళ్లుట మడియుట తెగుట డీల్పదుట నీల్గుట మొదల్చెడు టడంగుట పొలియుట
మిత్తి పెన్నిదురనా మీఱును మరణము సొర సొద యనఁగను బరఁగును జిత
మొండె మనంగను బొల్చుఁ గబంధంబు పబము పీనుం గన శవము దనరు

నడరు శవయానముగఁ బాడె బడయ యనఁగఁ గాడు మసనంబు పలికినాఁగను శ్మశాన
మడరుఁ జెఱ యనఁగాఁ బ్రగ్రహంబు దనరు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

225


తే.

అడరుఁ గారాగృహంబు గుయ్యారము చెఱ, సాల బందిగ మనఁగను జప్ప యనఁగ
ముద్ర తగుఁ దోఁచు జీవనమ్ముగను మనుట, మనికి బ్రతుకు బ్రదిమి యన మాతృభూత.

226


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు నిద్ధర క్షత్రియవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

227

ᛟᛟᛟᛟᛟᛟᛟ

వైశ్యవర్గము

సీ.

వైశ్యనామంబులు వఱలుఁ గోమట్లన బేహారు లనఁగను బేరు లనఁగ
నడక యనంగను నడత యనంగను నడవడి యనఁగను నడరు వృత్తి
కొలువని వ్రాయుట కొలుపు త్రోయుటయు లాపణము సీళితము నా వఱలుఁ గ్రమతఁ
గొలువటం చనఁగను వెలయం సేవావృత్తి వేడు టనంగను వెలయు యాచ్ఞ
యప్పనఁగ రవడి యనఁగ నలరుఋణము వడ్డి తేమాస మనఁగను వఱలు వృద్ధి
పరచి యన యాచితక మొప్పుఁ బొరిచి యనఁగఁ దద్విశేషంబు దనరును ధాతృవంద్య.

228


సీ.

అప్పులవాఁ డన నగు నుత్తమర్ణాఖ్య యధమర్ణుఁడు చెలంగు నరువరి యనఁ
దాకట్టు కుదువ యుద్దర వారకం బీడనంగను వృద్ధి చెలంగుచుండు
నాపమిత్యకసంజ్ఞ యలరు వీ డనఁగను గాఁ పనఁ గమ్మతకాఁ డనంగఁ
గమతగాఁ డనఁగను గమ్మటీఁ డనఁగను దుక్కిము చ్చనఁగను దోఁచుచుండు
హాళికాభిధ నువ్వుచే ననఁగఁ దిల్య మలరు నీరీతి ధాన్యభేదాఖ్య
వానిచే నని పలుకంగ వచ్చుఁ జమ్ము భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

229


సీ.

చే ననఁ జెలిక నా క్షేత్రంబు విలసిల్లుఁ గుచ్చెల యన రాశి కొఱలుచుండు
ద్వ్యాఢకికాభిధ పఱిగయం చనఁగను నల్పసస్యక్షేత్ర మలరుచుండు
మడి యనఁ గయ్యనా నడరుఁ గేదారంబు వెలయు లోష్టము పెల్ల పిట్ట పెట్ట
గడ్డ బెడ్డ యనంగఁ దనుపట్టుఁ బాఱనాఁగను నవదారణంబునకుఁ బేరు
పరఁగుఁ దవుగోల దోఁకుడుపాఱ నాఁగఁ దద్విశేషాభిధానంబు దగు సబళము
గడ్డపాఱనఁ జెలఁగును గొడ్డలి యనఁగాను గుద్దాలనామంబు కాలకంఠ.

230


సీ.

ములుకోల యనఁగను బొల్చును దోత్రంబు కొఱలు లవిత్రంబు కొడవలి యన
నల్పలవిత్రాఖ్య యలరు లిక్కి యనంగఁ గూలునాఁగ లవిత్రమూల మొప్పుఁ
గలప యనంగను హల మొప్పు నైర గ ట్టేరు గలపనాఁగ మీఱుఁ దదుప
కరణ మాబంధమ్ము బరఁగు మ్రో కనఁగను దలుగునాఁ బలుపునాఁ దనరుఁ గంఠ
రజ్జు పగ్గ మనంగను బ్రగ్రహ మగు రాజిలును వారె యనఁగను రజ్జుభేద
మడరుఁ దృణరజ్జు వెంటినా నఘవిభంగ భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

231

సీ.

లాంగలాదికము చెలంగు నే రనఁగను బరఁగుఁ దర్థాభిఖ్య యరక యనఁగఁ
గోటే రనంగను గొఱలు విపర్యయబద్ధలాంగలసంజ్ఞ పంట యనఁగ
నగుఁ గృషిసన్నాహ మలరు నాఁగేలు నాఁగలి యనఁగాను లాంగలసమాఖ్య
పరఁగుఁ దత్పృష్ఠంబు పడత యనంగను జీర్ణలాంగలసంజ్ఞ చెలఁగు గొనమ
యనఁగ నేఁడికోలనఁగను నెసఁగు నీష ముష్టిసంగ్రాహ్యదారువు పొలుచు మేడి
యనఁగ యంతిక నామధేయంబు జడ్డి గ మన విలసిల్లుచుండును గాలకంఠ.

232


సీ.

గుంటుగ నాఁగను గొఱ్ఱునా దంతినాఁ బాపడ మనఁగను బరఁగును గృషి
సాధనభేదము ల్చనుఁ బలు గనఁగను ఫాలాభిధానంబు పరఁగుచుండు
దిండడ నాఁగను దిర్యగారోపితదారువు గుజ్జునాఁ దనరుఁ గుబ్జ
దారువు కృషిసంజ్ఞ మీఱుఁ గిసుక దుక్కి యనఁ జాలునాఁగ సీతాఖ్య దనరు
మున్నరక యనఁ దొలిదుక్కి పొదలుచుండుఁ బ్రబలు సీతానివృత్తి కొండ్ర యన గుంట
యనఁగఁ గల్ల మనంగ ఖలాఖ్య వెలయు ఖలముఖము వాగళం బన నలరు నభవ.

233


సీ.

గుంజనాఁగను గట్టుకొయ్యనాఁగను మేధి పయి రన సస్యంబు పరఁగుచుండుఁ
జిరుతరి పచ్చగన్నేరు తీఁగెమల్లియ బుడమ రాజనమునాఁ బొలుపుఁ గాంచు
వ్రీహిభేదమ్ములు వ్రీహిసామాన్యంబు వరి వడ్లు నాఁగను వఱగుచుండు
గోదుమ యనఁగను గోధుము ల్విలసిల్లు లంక యనంగఁ గలాయి మొప్పు
నారుగ యనంగఁ గోద్రవాఖ్య తనరారుఁ గొఱలుచుండఁ: బ్రియంగువు కొఱ్ఱ యనఁగఁ
బొలుచుఁ జూర్ణంబుజొన్న నా బుసుకుజొన్న యనఁగఁ జూర్ణవిశేషమౌ నహివిభూష.

234


సీ.

సజ్జయం చనఁగను సర్జము విలసిల్లు శ్యామాక మొప్పును జామ యనఁగ
వరియం చనగను వరకము దనరారు రాగియం చనఁగను రాగి వెలయు
ముద్గంబు పెసరునాఁ బొల్చును గారుపెసరునాఁగ వనముద్గ చెలఁగుఁ
గాకిపెసరునాఁగఁ గనుపట్టు క్షుద్రముద్గము మిను మనఁగ మాషము దనర్చు
నను మనంగను నిష్పావ మలరుచుండుఁ బరఁగు బొబ్బర యనఁగను బర్బరము
తువరి కంది యనంగను దోఁచు రాజమాష మలసంద యనఁదగు మాతృభూత.

235


సీ.

ఒప్పుఁ గుళుత్థాఖ్య యులవయం చనఁగను దిలసంజ్ఞ నూవనఁ దేజరిల్లు
సెనిగెనా సెనగనాఁగను జణకము మీఱు నాసురి దనరారు నావ యనఁగ
మెంతి యనంగను మేంథినామము తగు శణము భాసిల్లును జను మనంగ
దవసంబు కొలుచునా ధాన్యంబు రాజిల్లు ముల్లునా శూకంబు పొలుపు గాంచు
నె న్ననఁగఁ గణిశ మలరు నీఁచ యనఁగఁ గణిశవృత్తంబు చెలఁగును గంకి యనఁగ
ధాన్యకణిశంబు వెలయును దైత్యవైరి భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

236

సీ.

కణిశైకదేశంబు కనుపట్టు రెల్లనాఁ గణిశభారమ్ము ముంగ యనఁ దనరు
సన్యకుసుమసంజ్ఞ చను సుం కనంగను గుసుమనాఁగను సస్యగుచ్ఛ మొప్పు
గంటకఱ్ఱ యనంగఁ గనుపట్టు నాళంబు కోవి యనంగను గ్రోలనంగ
జా డనంగను క్షీణసస్యంబు దగును బొం దనఁగాను శుష్కసస్యము చెలంగు
ఛిన్నయవముఖనాళంబు చెలఁగుఁ జొప్ప యనఁగ నోదె యనఁగఁ దీర్ణయావనాళ
కాదులు చెలంగుఁ బన యన నలరుచుండుఁ దాదృశవ్రీహిసస్యాఖ్య ధనదమిత్త్ర.

237


సీ.

దంటనఁగా సస్యదండము విలసిల్లుఁ బరఁగు నీన యనంగఁ బత్త్రనాడి
సొరుగాకు కారాకు చొక్కుటాకు వగడు నాఁగను వెలయుఁ జూర్ణాదిశుష్క
పత్త్రాభిధానంబు పరఁగును బుససంజ్ఞ బుసి యనఁగా బసబూగర యనఁ
దుచ్ఛధాన్యాభిభ దోఁచు దాలు తరక పొల్లకట్టు తబకపొల్లు తప్ప
తంక రనఁ దూరునాఁగను దనరుఁ దుషసమేతధాన్యాభిధలు మూఁగబొం తనంగ
మూస యనఁగాను దుషయుక్తములగు స్వల్పధాన్యములు చింక యినుకనఁదగు మహేశ.

238


సీ.

ధాన్యశకలములు దనరు నూక లనంగ నూక పొ ట్టుముకనా నొప్పుఁ దుషము
పినరు పిప్పి యన నిష్పష్టతుషంబగు నుఱుపుడు నాఁగను బరఁగుచుండుఁ
గణిశచూర్ణంబు సద్గ్రహణంబు తూర్పునా వెలయును దృణధాన్యమును చెలంగు
గునుకులు దూసరూల్ గొలివె లనంగను జెలఁగు రోలన నులూఖలము పేరు
కుంది కుందెస యనఁగను గొఱలు వ్రీహ్యులూఖలము ముసల మెసఁగు రోకలి యన
పఱలుఁ బొ న్ననఁగాను శంబకసమాఖ్య భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

239


సీ.

చేటనా శూర్పంబు చెలఁగు మొంటె మొరిఁటె యనఁ బ్రహ్వశూర్పాఖ్య యలరుచుండు
జల్లిజల్లెడ యన జాలని విలసిల్లుఁ గండోల మెసఁగును గంప యనఁగ
సిబ్బి పల్లికనాఁ బ్రసేనవిశేషమౌఁ బుట్ట పుట్టిక పుట్టి పుటిక యనఁగఁ
దనరును బిటకంబు దగ్గుఁ గుసూలాభిధ గాదె యనంగను గరిసె యనఁగఁ
దద్విశేషసమాఖ్యలు దనరుచుండు కొట్టు కూటు పొడక తుమి బొట్ట యనఁగఁ
బరఁగు ఖాతవిశేషము ల్పాఁతర యనఁ నూబ యనఁగను జెంద్రమశ్శాబకధర.

240


సీ.

వంటయి ల్లనఁగను వంటి ల్లనంగ విలసిలుచుండును మహానససమాఖ్య
సూపకారంబు హెచ్చును సువార మనంగ నడరును సూపకారుఁ డడబాల
వంటలవాఁడు సువారంపువాఁడనఁ బొయి ప్రొయ్యి నా నథిశ్రయణి వెలయుఁ
దచ్చిలానామంబు దనరుఁ బొక్కిలి యనఁ బిటకయంత్రాభిధ వెలయు దాలి
యనఁగఁ దంపి యనంగఁ గుండాఖ్య వెలయుచుండు గుండ మనంగను గొండ మనఁగఁ
జరఁగు నంగారధాని కుంపటి యనఁదగు బంగల యనంగ బండికుంపటి యగు భవ.

241

సీ.

ని ప్పింగలము మల్లె నిప్పుక వైరాలు లైరవు లనఁగ నంగార మొప్పుఁ
గార్చి చ్చెరగలి నాఁగనుపట్టు దావాగ్ని మంటనా జ్వాలనామంబు వెలయు
నదరులు మిణుఁగుఱు లవనౌ స్ఫులింగము ల్పొగ పొవ యన ధూమము తగు నిగుఱు
నీఱు బూడిద యన నెగడును భస్మాఖ్య వరఁగు నుల్కాభిధ కొఱవి యనఁగఁ
గచ్చిక యనంగ వెలయు దగ్ధపిటకంబు కుమ్ము నాఁగఁ దుషాగ్నియై కొఱలు బొగ్గు
నల్ల లనఁగను గాళికానామము లగు మూర్ధధృతరంగ శ్రీమాతృభూతలింగ.

242


సీ.

భస్మవిశేషంబు పరఁగును గరు కన మసి యన మషి యొప్పు మంగల మన
భ్రాష్ట్రాభిధానంబు పరఁగుచునుండును స్వేదని వెలయును బెన మనంగఁ
గందువు బాణలి కంచుకం టనఁదగు సిద్ధియు చనఁగను జెలఁగుఁ గుతువు
బొడియయం చనఃగను బొల్చును గుతుపంబు చనును గుతూద్వయసంగతంబు
సంగడమనంగుతూముఖాచ్ఛాదనంబు దట్ట యనఁదగుఁ జిరిపినా దనరుఁ దైల
మార్జకము గంటె గరిటెనా మనుమ గంబి మిల్లి యన నల్పకంబియౌ మిహిరభూష.

243


సీ.

చనును జిత్తెడ నాన శష్కులికాప్రముఖసముద్ధరణసాధకాహ్వయంబు
తండువు తెడ్డునాఁ దనరు మహాతండు వబకనా నగపనా నలరుచుండుఁ
జట్టువ పొన్నట్టు చట్టువం బనఁగను దారుహస్తాభిధ దనరుచుండుఁ
దెలె హరివాణంబు తలిగ కంచము తట్ట చాకీ లనంగఁ గంసంబు దనరుఁ
బళ్లెరము పళ్లె మనఁగను బాత్ర మొప్పు గిన్నెయన డబ్బురనఁ గోర యన్నఁ జషక
ము తగుఁ జనుఁ బత్ర పాత్రంబు పుల్లె యనఁగఁ బత్త్రచషకంబు దొన్నె దొప్పన మను భవ.

244


సీ.

తామ్రాదికలశాభిధానము ల్చెలువొందుఁ దంబిగ యనఁగను జెం బనంగ
దార్వాదికలశము ల్డనరు ముంత యనంగఁ గుండనాఁగ మృదాదిభాండ మెనఁగు
దామ్రాదిభాండము ల్దనరు బిందె యనంగ విస్తృతతత్సంజ్ఞ వెలయుచుండుఁ
జెరవ యనంగను జెరప మనంగను గ్రాలుఁ గటాహంబు క్రాఁ గనంగ
గాజు కొప్పెర యనఁగను గర్పర మగు నెగడు నీరా డనంగను నీళ్ళచివది
యన నలంజరనామధేయము సానిక లన వెళుపాటితట్టలు వెలయు నభవ.

245


సీ.

కడవ యనంగను ఘటనుగు ఛుల్లిని కటఘటమౌఁ బొంతకడవ యనఁగఁ
బశ్వాదిభాండంబు పరఁగు దొట్టి యనంగఁ దశముఖభాండాఖ్య తనరు బాన
పవ్వ కంగాళము బందడ మనికినా నుత్సం క్తివిన్యాసయోగ్యభాండ
మలరును సేవునా నతిజవగ్రాహ్య జలానయనార్హభాండంబు పంటి
పనఁటి యనఁదగు వర్తులభాండ మెసఁగుఁ గుండ యన వెస లన నల్పభాండ మెనఁగు
నల్పముఖభాండనామధేయంబు చెలఁగు బుడ్డి బొంగ బుడిగి నాఁగ భుజగభూష.

246

సీ.

నిమ్నభాండాభిధ నెగడు లోవి యనంగ నతభాండసంజ్ఞ గూనయనఁ బరఁగు
దుత్త యనంగను దుగ్ధభాండం బొప్పుఁ దగు గళంతిక కలంత గరిగ యనఁగఁ
బ్రతలాల్పభాండంబు పరఁగుఁ జట్టి యటిక యన ముష్టిమానభాండాఖ్య పిడుత
యనఁ దనరారు నత్యల్పభాండం బొప్పు గురిగయం చనఁగను గురి యనంగ
లడ్డిగ యనంగ వేణుపాత్రంబు చెలఁగు గొట్ట మనఁ దద్విశేషంబు కొఱలుచుండు
దీపపాత్రంబు బ్రమిదనాఁ దేజరిల్లు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

247


సీ.

సిబ్బిమూఁకు డనంగఁ జెలఁగు శరావంబు పరఁగు దడ్డెము సావ బట్లె మల్ల
యననగుఁ దద్విశేషాభిధ శాకంబు కూర యనంగను మీఱుచుండుఁ
జూర్ణ శాకాభిధ శోభిల్లు దుగ్గునాఁ బప్పుబేడ యన సూపంబు దనరు
నుపదంశసంజ్ఞ యై యొప్పుఁ బచ్చడి యన శాకనాళము పేరు జరును గమ్మ
కాను కాఁ డనఁ దింత్రిణీకంబు చింత పం డనంగ వెలయును సంబా రనంగ
వేశవారంబు దనరును వెలయు మిరియ మన మరీచాఖ్య పార్వతీప్రాణనాథ.

248


సీ.

ఇంగు వనంగను హింగువు పసుపు బందారు నాఁగను హరిద్ర చను సోపు
నల్లజీలకఱనాఁ జెల్లును సుషవిక మెంతి యనంగను మేంధి యొప్పు
వార్ద్రకంబు చెలంగు సల్ల మనంగను గుస్తుంభరి దనర్చుఁ గొతిమిరి యన
సొంటి యనంగను శుంఠియౌ లవణాఖ్య యుప్పునా వెలయు నిందు ప్పనంగ
నడరు సైంధవలవణము నౌ బిడాల లవణ మంటుప్పు చౌటు ప్పన విలసిల్లు
నొగి సురక్షార మగును బెట్లుప్పనన్సు రుప్పనంగఁ గళాభాసితోత్తమాంగ.

249


సీ.

తండులక్షాళనోదకము రాజిల్లును గుడితి యనంగను గడు గనంగఁ
గూరాడు కలినాఁగ మీఱు ధాన్యామ్లము వఱలు నన్నరసంబు వార్పు గంజి
యనఁగాను గౌబేర మలరు నంబలి యనఁ విలసిల్లును విలేపి వెలవ యనఁగ
నిస్స్రావసంజ్ఞ యై నెగడు జావ యనంగ నుష్ణిక కాఁడినా నొప్పుచుండు
నటకలి యనంగ జెలఁగు నభ్యంగతైలహారకద్రవ్యసంజ్ఞ మెట్టనఁగ మెడుద
నంగఁ బులిమెట్టనంగఁ జెలంగుచుండు నభిషుతాఖ్య నగాత్మజాప్రాప్తసఖ్య.

250


సీ.

మీఱు యూషము కట్టు చారు పణిద మనఁ బాగనఁగా గుడపాక మెసఁగుఁ
గండచక్కెరయనఁ గనుపట్టు మత్స్యంది గుడము బెల్లము బెరకడ మనఁదగు
శర్కరాహ్వయములు చక్కెర యనఁగను బంచదార యనంగఁ బరఁగుచుండు
శర్కరాభేదసంజ్ఞలు నవాతు జుమోజు పులకండ మనఁగను బొలుపుగాంచు
సిగర యనఁగను శిఖరిణి చెలఁగు నూరుబిండన లవణభావితపిష్ట మొప్పుఁ
బులుప యులు పన విరళామ్లకలితపిష్ట మొనరుఁ దిమ్మన మనఁగ దేమన మగు భవ.

251

సీ.

లవణభానితశలాటువు మీఱు నూరుఁగా యన మాంసరస మొప్పు నాణ మనఁగఁ
గఱకు ట్లనంగను గరుపట్టు శూల్యంబు తాలింపు తిరుగుఁబోఁత పొగు పనంగ
సంస్కారము చెలంగుఁ బనును దాలింపు వైచినది పొరఁటినది పొనటినదన
వఱలును సంస్కృతవాచకంబులు గాను వడకట్టు గాలింపు కడుగు డేరు
పఱుపనఁగ శోథనాభిధ పరఁగుచుండుఁ జిక్కన మిసిమి మిహి జిడ్డు జిగురు జిగట
నునుపు నున్నన నిద్దము నున్నని దన స్నిగ్ధనామంబు చెలఁగును జిత్స్వరూప.

252


సీ.

బోరు లనంగను బొరుగు లనంగను ధానాసమాఖ్య లై తనరుచుండుఁ
బొరుగులు మొదలుగాఁ బోచిళ్ళు వరకులు బహువచనాలుగాఁ బరఁగుచుండు
గుగ్గి ళ్ళనంగను గుల్మాషములు మీఱు లాజలు దనరుఁ బేలా లనంగ
నటుకు లడుకులు నా నగుఁ బృథుకంబులు ప్రాలునా నక్షతల్ వఱలుఁ బ్రార్థ
నాక్షతల పేరు పోచిళ్ళునాఁగ బియ్య మనఁగ జాత్యేకవచనమై యలరుఁ దండు
లము దనరు నార్ద్రతండుల మ్మమరు నానబాలునాఁగను బటదాశ పార్వతీశ.

253


సీ.

ఆక్షుణ్ణతండులాహ్వయము చేరుళ్ళునా దంగుళ్ళు నాఁగను దనరుచుండు
నాహతతండులాహ్వయము లెసటిపోత లన సడింపు లనంగ నలరుచుండుఁ
బక్వచర వ్రీహిభవతండులసమాఖ్య యుప్పి ళ్ళనంగను నొప్పుచుండుఁ
దండులధూళియౌఁ దవుడనఁ బిష్టంబు పిండినా సత్తునా వెలయుచుండుఁ
జనును జలివిడి చలిమిడి యన విఘృష్టి త మ్మపూపాభిధానమ్ము దనరుఁ గజ్జ
మప్ప మప్పచ్చి కజ్జాయ మనఁగ మండిగ లనఁ దగు మండికమ్ములు గరళకంఠ.

254


సీ.

సేవె లనంగను జేవికల్ విలసిల్లు నుత్కారిక వెలయు నుక్కెఱ యన
గారి యనంగను ఘారి దనర్చును నతిరసంబు చెలంగు నరిసె యనఁగఁ
బొల్చు మాషాపూపము వడ యనంగను వడియ మనంగను వటక మెసఁగు
గరిపడ యనఁగను ఖరవటకం బొప్పు బూరె యనంగను బూరిక తగు
బుబ్బుద మనంగఁ దనరును బుద్బుదంబు లడ్డువ యనంగ లట్వ చెలంగుచుండు
సారెసత్తు లనంగను జంతికలన యంత్రికలు మీఱుచుండు శేషాహిభూష.

255


సీ.

చక్కిల మనఁగను శష్కులి విలసిల్లు సుకుని యనంగను సుఖిని చెలఁగుఁ
బిష్టము చెలఁగును బిట్టనఁ దద్విశేషము మీఱుఁ దోఁపనా సంకటి యన
నప్పడ మనఁగను నడరు నపూపలి కుడు మన మోదకం బడరు మణుఁగుఁ
బూవునాఁగను నేర మూలము దనరును తిలగోళ మెసఁగుఁ జిమ్మిలి యనంగఁ
దోఁచు మధుపూరితము తేనెతొన యనంగ రొట్టె నీరొట్టు నిప్పటి యట్టు దోసె
యిడైన యనంగ నిటుకొన్ని యెసఁగుచుండు భక్ష్యభేదాహ్వయంబులు పార్వతీశ.

256

సీ.

భక్ష్యసామాన్యంబు పరఁగును బిండివంట లనంగ నన్నంబు వెలయుచుండు
బువ్వ యోమటి కూడు బోనము వంటకం బోరె మోగిరమునా నొప్పుచుండుఁ
గలవంటకం బనఁగాను మిశ్రాన్నంబు చలిదినా శీతాన్నసంజ్ఞ దనరు
బాంచాళి కాకేళిపక్వాన్న నామంబు గుజ్జనగూడన గొఱలుచుండుఁ
జిమిడిక యనంగ లగడునాఁ జెలఁగుచుండు నధికపక్వాన్న మలరు మాఁడనఁగఁ దగ్ధి
కాహ్వయము మెదుకన సిద్ధకమ్ము మీఱు నెండుమెదుకులు పక్కునా నెసఁగు నభవ.

257


సీ.

తైలాభిధానంబు దనరు నూనె యనంగ నేరండతైలంబు మీఱు నాము
దం బనఁ బేఁడనా దనరు గోమయసంజ్ఞ పిడక నాఁ దనరుఁ దత్పిష్టకంబు
వెలయుఁ గరీష మేర్పిడక పరంటనాఁ దచ్చూర్ణ మెరువుగాఁ దనరుచుండుఁ
బాడియం చనఁగను బరఁగుఁ బయస్యంబు పోసనాల్ పాలునాఁ బొల్చు బహుత
క్షీర మగు గుమ్మ యనఁగఁ దద్ధార వెలయు నానవా లనఁ జిఱువాలునా నెసంగుఁ
గర్దమీకృతదుగ్ధంబు క్రాలు ముఱ్ఱు నాఁగఁ బీయూషనామంబు నాగభూష.

258


సీ.

మీఁగడ యంచన మీఱు మండాభిధ నవనీతసంజ్ఞ వెన్న యన వెలయు
నెయ్యి యంచనఁగను నివ్వటిల్లు ఘృతంబు చమురు మెఱుఁగన స్నేహము దనర్చుఁ
దనరును బక్వఘృతంబు తెలి యనంగ గసినా ఘృతాదికల్కంబు దనరు
నాతంచనాఖ్య యై యలరుఁ జేమిరి యనఁ బెరుఁ గన దధి పేరు పరఁగుచుండుఁ
గుంపెరుఁగు నాఁగ ద్రప్సమగుం గల పనఁ మిశ్రదధి యొప్పుఁ గానన మీఱు మథిత
మడరు దండాహతము చల్ల యనఁగ మజ్జిగ యనఁ దోడనఁ దగు దధీకరణ మభవ.

259


సీ.

ఆఁకలి యన గొద యనఁగ నాకొంట నాఁ గను క్షుత్తుపేర గాఁ దనరుచుండు
నన్నాదివిన్యాస మలరు వడ్డన యనఁ గమి యనఁగా నొప్పుఁ గబళసంబు
కబళంబు కడి యనఁగాఁ జను గవణమం చన గజాదిగ్రాస మమరుచుండుఁ
బిడచ ముద్ద యనంగఁ బిండంబు వెలయును డప్పి నీర్వట్టు దప్పి దూప
యన జనుఁ బిపాస మెసపుట యారగింత యారగింపు కుడుపు నాఁగ నలరు భుక్తి
దనరు నాభుక్తి యాబూతి యనఁగఁ దనుపు తనివి యాపోవుటనఁ దృప్తి దగు మహేశ.

260


సీ.

ఎంగిలినాఁగఁ జెలంగు నుచ్ఛిష్టంబు గోపాలకుం డొప్ప గొల్లవాఁడు
గొల్లఁడు కీలారి గొల్లకిలారి పసులగాపరి యనంగఁ జెలఁగుచుండు
గోమహిష్యాదుల నామము ల్పసి తొఱ్ఱు తొడుకు పసరమునా నడరు గోకు
లమ్ము మంద యనఁ గిలారమ్మునా గాశితము పట్టు పెంటనాఁ దనరుచుండు
నె దందనంగను వృషభాఖ్య యెసఁగుచుండు వెలయు గంగెద్దునా దేవవృషభసంజ్ఞ
బసవఁ డాబోతనంగ గోపతి దనర్చు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

261

సీ.

మూఁపురమంచనఁ నూఁపురమంచనఁ గకుదభిధానమై క్రాలుచుండు
గంగడో లనఁగను గనుపట్టు సాస్నాఖ్యశృంగంబు కొమ్మనఁ జెలఁగుచుండు
దూడనాఁ గ్రేపునాఁ దోఁచును వత్సంబు దనరు లేఁగ యనంగఁ దర్ణకంబు
గిత్తనా గిబ్బనాఁ గెరలు నార్షభ్యము వెలయుఁ గోడె యనంగఁ బెయ్య యనఁగ
గోప్రభృతిపుంస్త్ర్యపత్యము ల్గోవు కుఱ్ఱి యావునాఁగను జిత్రగవాఖ్యలందుఁ
జెమటియా వనునట్టుల నమరియుండు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

262


సీ.

గొడ్డన వంజనా గొంజనా వంధ్యయౌఁ బొదలును సంధిని వెద మొద వన
నీచుకొనినదినా నెసఁగును నపతోక గేరు వామనగని గిడ్డి యనఁగఁ
జనుఁ జతుర్హాయనసంజ్ఞ పడ్డ యనంగఁ దఱుపు నాఁగను వత్సతరి దనర్చుఁ
బ్రథమగర్భిణిపేరు పరఁగును మొదవన గర్భిణి చెలువందుఁ గట్టిన దన
నమరు బష్కయణి తఱపియా వనంగఁ జెలఁగు మజ్జిరి యనఁగ నైచికిసమాఖ్య
పొదుగునాగను నూధస్సు పొలుచుచుండు నెమరునాఁగను రోమంధ మమరు నభవ.

263


సీ.

చనును గర్భస్రావసంజ్ఞ కట్టుకయనఁ బొల్చు బీజావాపము వెద యనఁగ
నీనికయంచన నీఁతయనంగను బశ్వాదికప్రసవంబు చెలఁగు
నెను పసరం బన నెనుమన నెనుపెంటి యన బఱ్ఱెనాఁగను దనరు మహిషి
వామనమహిషియై వఱలు గేదె యనంగ మహిషవాచకముగా మనుచునుండు
దున్న యన నెనుపోతన దుంత యనఁగఁ గీలకము పేరు లంకెనాఁ గేరుచుండు
దామెన యనంగ దామని దనరుఁ గవ్వ మనఃగ మంథాననామమౌ నజ్జమౌళి.

264


సీ.

తరికంబ మనఁగను దనరును గుటరమ్ము తరుచుట చిలుకుట త్రచ్చుట యన
మథనాభిధానంబు మను నొంటె యనఁగను లొట్టియు యనఁగను లొట్టెనాఁగ
లొటిపిట యనఁగను లొటిపిట్ట యనఁగను లొట్టిపిట్ట యనఁ గన్పట్టు నుష్ట్ర
మలరును లొట్టేనుఁగన మహోష్ట్రాభిధ మేఁక చుచ్చును జింబు మీఱు ఛాగి
భాగనామంబు జింబోతునాఁగఁ దనరు గొఱ్ఱె గొఱ్ఱియ యనఁగను గొఱలు మేషి
తగరు పొట్టే లనంగను దనరు మేష మాశ్రితవృషార్వ మాతృభూతాఖ్యశర్వ.

265


సీ.

గాడిద యంచన గర్దభనామమౌ గోనెయం చనఁగను గోణి పరఁగుఁ
దద్విశేషాభిధ తగును బరకమనఁ జను నలగోణాఖ్య సలక యనఁగ
నత్యల్పగోణియై యలరు విత్తయనంగ నసిమి గోతము సంచి యనఁగ నల్ప
గోణివిశేషముల్ గొఱలు వంచె యనంగ నట్టెడ యంచన నాఢకమిత
గోణి తగు ధాన్యపూరితగోణికాఖ్య యగుచు బెరికనఁ బెడక నా మలఁగ యనిన
ధాన్యనిరహితగోణిగాఁ దనరుచుండు నంకెమండె మనఁజను గోణ్యర్థ మభవ.

266

సీ.

తనరు గోణ్యుద్ధారిదండాఖ్య యెత్తనగో లన బట్టనగోల యనఁగఁ
గంథాస్తరణ మొప్పుఁ గందరికం బన నలరు విక్రయ మమ్ము డమ్మక మన
మారక మనఁగను మారుగడ యనంగ వినిమయనాభిధ వెలయుచుండు
విలువనా జట్టినా వెల యన రోయన వెలయుచు నుండును విక్రయంబు
కొనుట దర దారణ యనంగ మనును గ్రయము మొదలు బండాల మనఁదగు మూలధనము
మిగితి మిగు లన లాభంబు మీఱుచుండుఁ గుదువ యనఁగను నుపనిధి పొదలు శర్వ.

267


సీ.

ఒకటి యొక్కటి యొకం డొండొక్కఁ డనఁగను నేకసంఖ్యాఖ్యయై యెసఁగుచుండుఁ
బది యన దశసంఖ్య పవరఁగు నిర్వది యన వింశతిసంజ్ఞయై వెలయుచుండుఁ
బొలుచుఁ ద్రింశత్సంఖ్య ముప్పది యనఁగఁ జత్వారింశదాఖ్య నల్వది యనంగఁ
బంచాశదాఖ్య యేఁబది యన రాజిలు నఱువది యనఁగను నలరు షష్టి
దనరు డెబ్బది సప్తతి యన నశీతి యెనుబది యనంగ భాసిలు నెసఁగు నవతి
తొంబది యనంగ నూఱనం దోఁచు శతము వేయి యన సహస్రాఖ్యయై వెలయు నభవ.

268


సీ.

కరిసె యనంగను గాలుపలం బొప్పు నరపలం బనఁగఁ గర్షాఖ్య యొప్పుఁ
గర్షద్వయాభిధ గనుపట్టుఁ బల మన నిర్పల మనఁగను నెసఁగు ద్విపలి
ముప్పలమం చన నొప్పుచుండుఁ ద్రిపలి నలుపలం బనఁ జతుఃపలము దనరుఁ
బంచపలాభిఖ్య పరఁగు నేఁబల మన వెలయు షట్పలి యాఱుపల మనం గ
నుల్లసిలు సప్తపలినామ మెల్ల మనఁగ వఱలుఁ బన్నిర్ల మనఁగను ద్వాదశపలి
వీసె యనఁగను గనుపట్టు వింశతిపలి దడియ మన నల్వది పలముల్ దగును శర్వ.

269


సీ.

తనరారు సోల యంచనఁగ నికుంచాఖ్య యద్దయం చనఁగఁ దదర్థ మొప్పుఁ
దత్తురీయాంశంబు దగును జిట్టి యనంగఁ గుడుపాభిధానమై యడరు నవల
మాననా ముంతనా మానిక యనఁగను ద్రవ్వనాఁ బడినాఁ దదర్థ మెసఁగుఁ
బ్రస్థనామంబుగాఁ బరఁగుఁ గుంచ మనంగ గుడుపషట్కంబు ముయ్యెడ యనఁదగుఁ
బ్రస్థయుగ్మాఖ్య యిరుసనాఁ బలుకఁబడును జనును ముక్కుసనాగఁ బ్రస్థత్రయంబు
తూమునా నాఢకాభిధ దోఁచుచుండు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

270


సీ.

ప్రస్థపంచకసంజ్ఞ పరఁగు నేఁగుస యన షట్ప్రస్థపే రాఱు ననఁగ వెలయు
నిద్దుమం చనఁగను నేసఁగును ద్వ్యాఢకి త్ర్యాఢకి ముత్తుమం చనఁగఁ జెల్లు
జతురాఢకీసంజ్ఞ చనును నల్తు మనంగఁ బంచాఢకియు నేఁదు మంచుఁ దోఁచుఁ
షష్ఠాఢకీసంజ్ఞ చను నార్దుమం చన సప్తాఢకీసంజ్ఞ జరుగుచుండు
నేడ్డుమం చనఁగను నెలమితోఁ గనుపట్టు నష్టాఢకీసంజ్ఞ యలరుచుండు
నెనమందు మనఁగను దనరుఁ దొమ్మందుమనంగ నవాఢకీనామ మొప్పుఁ

బందుమంచు దశాఢకి పలుకఁబడును బొదలు నేకాదశాఢకి పదునొకల్తు
మనఁగఁ బన్నిద్దు నున ద్వాదశాఢకి తగుఁ బుట్టి యన భార మగు మాతృభూతలింగ.

271


సీ.

కాణి యనంగను గాకణి విలసిల్లు వెలయుఁ దద్వయ మరవీస మనఁగఁ
ముక్కాణి యనఁగను బొల్చుఁ దత్త్రయసంజ్ఞ పణషోడశాంశంబు పరఁగు వీస
మనఁగఁ దద్ద్వితయంబు దనరు బరక యన మువ్వీసమం చనఁ బొల్బుఁ దత్త్ర
యాఖ్యయై పణచతుర్థాంశంబు పాతిక యన విరాజిలును బణార్థసంజ్ఞ
యొప్పు నడ్డుగ యనఁగఁ బాదోనపణము వఱలు ముప్పాతిక యనంగఁ బణము రూక
యనఁగఁ జెన్నొందుఁ బణదశకాఖ్య చెల్లు మాడ యన నిట్లు చెప్పెద మాతృభూత.

272


సీ.

దీనారమందు ద్వాత్రింశదంశం బైన బేడయం చనఁగను వెలయుచుండు
దుగలమం చనఁగఁ దద్యుగళంబు విలసిల్లుఁ దనరు ముచ్చవ కనఁ దత్త్రికంబు
తచ్చతుష్టయసంజ్ఞ దగుఁ జ్గౌలమం చనఁ బాదదీనారంబు పా వనఁ దగు
నర్ధదీనారాఖ్య యలరు మాడ యన న్వరా యన దీనారమై యెసంగు
నాణె మనఁగను శుద్ధదీనార మొప్పు హీనదీనారసంపూర్తి కిచ్చునట్టి
ధనము పట్ట మనంగను దనరియుండుఁ భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

273


సీ.

ఎడబె ట్టనంగను నెరుసనా బారిముద్ర యన దీనారభేదములు చెలఁగు
కా సనఁగాను గాకణిపేరు విలసిల్లు బైకమం చనఁగఁ దద్ద్వయము వెలయు
దమ్మ మనంగను దార మనంగను దచ్చతుష్టయసంజ్ఞ దనరుచుండుఁ
దద్ద్వాదశం బైనఁ దగు నేబునాఁగను జను టంక మనఁగ నిష్కాహ్వయంబు
దద్విశేషాభిధలుగాను దగును డబ్బు లనఁగ దుగ్గాను లనఁగ దుడ్లనఁగ జగతి
శూలధారి పరాతంకచోళవైరిపుంగవతరంగ శ్రీమాతృభూతలింగ.

274


సీ.

 పంపు పాల్ వంతునా భాగంబు విలసిల్లు నాస్తినా సర్వస్వ మలరుచుంచు
సరకు సంకట మనఁ జనును బణ్యద్రవ్య మమరు రొక్క మనఁ బైక మన ధనము
గుళిక పూటె యనంగ ఘటికాహ్వయం బొప్పు రాపొడి నా ఘృష్టరజము చెలఁగుఁ
దగటనఁ దగడనఁ దనరు లోహదళమ్ము మనుఁ దప్తలోహాఖ్య మం డనంగఁ
గడ్డి యనఁగ శలాకనాఁగను శలాక యమరు గుండన నుండనా నమరు గోళ
కాఖ్య రస యనఁగాను లోహశకల మగు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

275


సీ.

పచ్చ యనంగను బరఁగు మరకతంబు గారుత్మతం బొప్పు గరుడపచ్చ
యనఁ దద్విశేషాఖ్య యగును బేరోదనం బన నది కృత్రిమం బయిన వెలయు
మాందాళియం చన మౌక్తికం బొప్పును ముత్తెము ముత్యము ముత్తియ మనఁ
దద్విశేషాభిధ దనరు దార మనంగ నాణియం చనఁగ సుపాణి యనఁగ

నదియె నెరడైన గొగ్గియం చనఁగ వెలయుఁ జిప్పముత్తెం బటండ్ర దే చేయఁబడిన
వీనితూనిక చవి యన వెలయుచుండు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

276


సీ.

పద్మరాగాభిధ పరఁగు గెంపన నది వన్నె తగ్గిన గరపక్క యండ్రు
కృత్రిమం బగునది గేరు రవాయినాఁ దత్కాంతి విడి యనఁ దనరుచుండు
నాకాంతి మెం డైన నలరు మొక్కళి యన నాకెంపుపని కుచ్చె యనఁగ వెలయు
నతికాంతియౌ కెంపు నలరు జొక్క మనంగఁ బ్రభపేరు వెలయును బాట మనఁగఁ
బరఁగును బ్రవాళనామంబు పగడ మనఁగఁ బవడ మనఁగ సిరాజినా వానియెత్తు
కణు జనంగను విలసిల్లుఁ బ్రణుతభక్త భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

277


సీ.

పొలుచును వజ్రంబు మూలరా లన మగరా లనంగ గురుజరా లనంగ
దత్ప్రతినిధి పేరు తఱుపునా విలసిల్లు మందాడినాఁ దత్ప్రమాణ మొప్పుఁ
గప్పురా లనఁగను గనుపట్టు నీలము ల్గొతుపునాఁ దద్భేద మతిశయిల్లుఁ
బటికమం చనఁగను స్ఫటికంబు విలసిల్లు బరఁగుఁ దద్భేదంబు పలుఁ గనంగ
మానికము రతన మనంగ మణి చెలంగు నదియు సచ్ఛిద్ర మైనఁ బూసనఁ దనర్చుఁ
గాకిబంగా రనంగ బేగడ యనంగ నభ్రకము దోఁచుఁ ద్రిశిరఃపురాధినాథ.

278


సీ.

కాంచనాభిధలు బంగారు బంగరు హొన్ను పసిడి పసిండి పొన్ పైఁడి పయిఁడి
పుత్తడియం చనఁ బొలుపారు నతిశుద్ధచామీకరాఖ్యలు చనుఁ గడాని
మేలిమి యపరంజి జాళువా కుందనం బుదిరి నా రజతాఖ్య యొప్పు వెండి
మడికా సనంగను మను వారకూటంబు పిత్తడియం చన నిత్తడి యనఁ
గాంస్యనామంబు విలసిల్లుఁ గం చనంగ రాగియం చన వెలయుఁ దామ్రాభిధాన
మయము విలసిల్లు నిను మన నలరుఁ దద్విశేష ముక్కని చెప్పఁగ శేషభూష.

279


సీ.

లోహమలాభిధ ల్పొలుపారుచుండును ద్రుప్పనఁ జిలు మనఁ ద్రుక్కనంగఁ
జట్టమం చనఁగను సింహాణమై దోఁచుఁ గాచము విలసిల్లు గాజనంగఁ
బింగాని కుప్పి కుప్పియ కుప్పె యనఁగను దక్కృతచషకాఖ్య తనరుచుంచు
నింగిలీకం బన హింగుళి విలసిల్లు హరితాళ మొప్పును నరిదల మనఁ
జెలఁగు సిందూరనామంబు చెందిర మనఁ దూది యనఁ దూల మొప్పును దుట్టె యనఁగఁ
బెర యనఁగ క్షౌద్రపటలంబు పేరు చెల్లుఁ
దేనె యన క్షౌద్ర మొప్పును మైన మనఁగఁ బొలుచు సిక్థంబు శ్రీమాతృభూతలింగ.

280


తే.

శ్రీలు వెలయంగఁ నీ పేరఁ జేయుకతనఁ బరఁగు శాశ్వతముగ వైశ్యవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

281

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

శూద్రవర్గము

సీ.

శూద్రనామంబులు శోభిలు నాలవకొలమువారలని గాఁపు లని పల్కఁ
దద్విశేషమ్ములై తనరుఁ గమ్మని వెల్మ యని రెడ్డి యని రడ్డి యని వచింపఁ
బనివానిపేరుగా భాసిలు నౌ జనఁ గుమ్మరవాఁ డొప్పుఁ గుమ్మరి యన
మాలకరి యనంగఁ బూలమ్మువాఁ డగు మీఱు సూసరి యన గౌరకాఁడు
చిప్పె యనఁగను విలసిల్లుఁ జప్పెవాఁడు చెలఁగు నంచులవాఁ డనఁ జిత్రకారి
చికిలికాఁ డన శస్త్రమార్జకుఁడు దోఁచు భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

282


సీ.

తంతువాయాభిధ దనరు మగ్గరి యన నేతకాఁ డనఁగను నేతరి యన
దోఁచుఁ దద్భేదము ల్తొగటవాఁ డనఁగను సాలీఁ డనంగను సాలె యనఁగ
సాలెవాఁ డనఁ బుట్టుసాలెవాఁ డనఁగను దేండ్ర యనంగను జేండ్ర యనఁగఁ
గైకలవాఁ డనఁగను జర్మకారాఖ్య పరఁగు గోదరి ముచ్చెవాఁ డనంగ
మంగి యనఁగను మంగలవాఁ డెసంగు వఱలు జాఁకినాఁ జాకలివానిపేరు
ఈడిగ యనంగ నీడిగవాఁడు వెలయు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

283


సీ.

కమ్మరి కనుమరి కరుమలి యనఁగాను మీఱుచుండును నయస్కారసంజ్ఞ
కమ్మర మన నయస్కారకర్మం బొప్పుఁ గంచరవాఁ డొప్పుఁ గంచరి యన
స్వర్ణకారాభిధ పరఁగుఁ బారసి యగసాలి సొన్నారి కంసాలి యనఁగ
గ్రాపకారుఁడు కాసె కాసెవాఁ డనఁ దగు వడ్లంగి యన వడ్రవాఁ డనంగ
వర్ధకి విరాజిలుచునుండు వడ్ర మనఁగఁ బరఁగు వర్ధకికర్మంబు గురుప యనఁగఁ
దగును మేఁకలవానిపే ర్మమ్మలి యనఁ దంబళి యనంగ నంబినాఁ దనరుచుండు
దేవలుని పేరు త్రిశిరఃపురీవిభాసి.

284


సీ.

పాదకుం డొప్పు సువారంపువాఁ డనఁగను బూటకూళ్ళవాఁ డనఁగ వంట
పూటవాఁ డనఁగను బొలుపొందు శ్రీహరి దాసుఁడు దాహరి దాసరి యన
శివదాసనామంబు చెలఁగు జంగ మనంగఁ దిలఘాతుకుం డొప్పుఁ దెలికవాఁడు
[1]గానుగవాఁ డన వేణుకారకుఁ డొప్పు మేదరివాఁ డన మేదరి యన
నెసఁగుఁ బింజారి నాగఁ దూదేకువాఁడు పరఁగుఁ గుడ్యాదికారి యుప్పరి యనంగ
జలగడుగువాఁడు వెలయును జాలరి యన భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

285


సీ.

పదవిజ్ఞుఁ డెసఁగుఁ జొప్పరి జాడకాఁ డన సంకులవాఁ డన శాంఖికుఁ డగు
సానలవాఁడు పూసలవాఁ డనంగను మణికారసంజ్ఞ యై మనుచు నుండు

మటుమాయకాఁ డన మాయదారి యనంగ మాయకాఁ డనఁగను మతకరి యన
టకటం కనంగను ఠవళికాఁ డనఁగఁ గైలాటకాఁ డనఁగను డక్కరి యన
టం కనంగను మాయావి పొంక మగును గటికవాఁ డన మాంసికాఖ్యలు సెలంగు
వాగురిక సంజ్ఞయౌ వలవాఁ డనంగ భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

286


సీ.

నటుఁ డొప్పు నట్టన నట్టువుం డనఁగను దారినాఁ దగు సూత్రధారకుండు
తాళధారి చెలంగుఁ దాళగిరి యనంగఁ జను దిమ్మరీఁ డనఁ జారణుండు
గాణయం చనఁగను గాయకాభిధ చెల్లు వీణెకాఁ డనఁ దగు వైణికుండు
బయకాఁ డనంగను భయకారి విలసిల్లు సుతికాఁ డనం జను శ్రుతివిధాయి
వెలయు దొమ్మరి యన లఘువిద్యవాఁడు ఐంద్రజాలికసంజ్ఞ యై యలరుచుండు
గారడీఁ డన క్షుద్రసంఘప్రశంసి పరఁగు బవినీఁ డనంగఁ జెవ్వందిలింగ.

287


సీ.

వైతనికుండు సంబళకాఁ డనఁగ జీతకాఁ డనంగను కూలివాఁ డనఁదగు
భారవాహకుపేరు పరఁగుచుండును బెస్త మోపరి బోయఁడు బోయినాఁగ
బానసీఁడన బంటు పరవుఁడు గుండఁడు నాఁగ దాసాఖ్యలు గాఁగఁ దనరు
నుడిగము చారికి యూడిగం బనఁగను దాసదాస్యముగాఁగఁ దనరుచుండు
వరవడంబనఁ బసుపన బానిస మన దాస్యనామంబులై యుండు దాసి యొప్పు
బానిస యనంగఁ దొ త్తనఁ బారికయగు బోనకత్తె యనఁగ మాతృభూతలింగ.

288


సీ.

పరఁగుఁ జండాలుండు సురియాళు వనఁగను మాల డనంగను మాల యనఁగఁ
దోటి యనంగను దోఁచనా నాసాదిఁ గోసంగి మాదిగ గూబరి యన
మాతంగుఁ డగు వాని చేతనుండెడికత్తి కొంగవా లనఁగఁ జెలంగుచుండు
మాతంగసదృశుఁడౌ మనుజుండు తగు బోయ నీఁ డనంగను గొమ్ముకాఁ డనంగ
బోయనాఁగఁ గిరాతుఁడౌఁ గోయ చెంచు పరికి యేనాది యాకరి పట్ర యెఱుకు
వేఁకరి యెసకరి యనఁ దద్భేదములుగఁ బొల్చును వినంగ శ్రీమాతృభూతలింగ.

289


సీ.

తురక యనంగను దోఁచుఁ దురుష్కుండు మెంచ యనంగను మ్లేచ్ఛుఁ డొప్పు
వేఁటకాఁ డనఁగను విలసిల్లు మృగయుఁడు శునకము వేఁపి కుక్కనఁగఁ దనరు
దద్భేదనామము తగు జోణఁగి యనంగ వనశునకంబు రే చనఁగ నొప్పు
జాగిలం బనఁగను జను విశ్వకద్రువ యుడుపవేఁ పపు బురకడ మనంగఁ
దగును సడికియ యనఁగను శ్వగళరజ్జు శ్వగళకాష్ఠంబు వెలయుఁ గాపంత మనఁగ
వేట యనఁగను మృగయాఖ్య వెలయుచుండు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

290


సీ.

దొంగ తెక్కలికాఁడు దోఁపరి ముచ్చుజాబరకాఁ డనంగఁ దస్కరుఁడు వెలయు
మార్గచోరకసంజ్ఞ మను బొలపరి యన దెరవాటుకాఁ డనఁ దేజరిల్లు

ముళ్ళు విప్పెడువాఁడు ముడియవిడు పనంగ గండిదొం గనఁ గన్నకాఁ డనంగఁ
దగు సురంగాకారితస్కరనామంబు బందెకాఁ డనఁ దగు బందికారి
వేసములు వేసి నమ్మించి వెనుక నాచుకొనిన దొరకోలుసన్నాసి యనఁగ వెలయుఁ
దడికద్రోపరి యనఁగను దనరు నౌ కవాట నోదకుఁ డనఁగఁ జెవ్వందిలింగ.

291


సీ.

పరఁగుఁ దెక్కలి యన బందిపో టనఁగను గిలు వనఁ గాసులంకింపునాఁగ
దావర మనఁగను దావా యనంగను మ్రుచ్చిమి యనఁగను మ్రుచ్చిలి యన
దోఁగురు నాఁగను దోఁపడ మనఁగను దోఁపుడు నాగను దోఁపు నాఁగ
దొంగఱిక మనంగ దొంగతన మనంగఁ జౌర్యంబు చెల్లు వంచన మెసంగు
జుడుగు క్రుక్కుకికురు పిక్కుజుణుఁగు మొరఁగు డనఁగ గూఢనివసతి పొంచడ మనంగ
నలరుఁ గికురింపు కికురింత యనఁగఁ జెల్లు వంచనకరణ మగుచుఁ జెవ్వందిలింగ.

292


సీ.

బొండ యనంగను బోననఁ గూటయంత్రాభిధానంబుగాఁ దనరుచుండు
బందిక ల్లనఁగను బదనశిలాఖ్య యౌ నుచ్చునా నురి యన నొప్పుచుండుఁ
బక్షిబంధనసంజ్ఞ వాగురాభేదంబు చిక్కమం చనఁగను జెలఁగుచుండు
మీటనా బిస యన మీఱుత్పతనకీల మలరును జవ యన యంత్రభేద
మేత మనఁగ ఘటీయంత్ర మెసఁగుచుండు మోటనంగను దద్భేద మొనరుఁ జేఁద
బొక్కెన యనంగఁ దబ్భేద మొప్పుచుండు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

293


సీ.

తంతుసంతతిసముత్పాదనయంత్రంబు రాట్న మంచనఁగను రహికి నెక్కుఁ
దద్బద్ధసూత్రంబు తగు వడియం చన గిరుకునా భ్రమకంబు పరఁగుచుండుఁ
దగుఁ గదు రనఁగఁ దంత్వాధారసూచిక తూలంబు విలసిల్లు దూది యనఁగఁ
దూలమృదూకృతి దోఁచు నేకు డనంగ నగుఁ దూలకణిక యేకని వచింప
వడుకు డనఁగను దంతుసంభవనహేతుకక్రియ చెలంగుఁ దంతువుగాఁ జెలంగుఁ
బోఁగు పోఁ చనఁగా నదె పుత్తడి యన మను సరిగ యనఁ గండెనా మాతృభూత.

294


సీ.

ఆసునాఁ జెలఁగుఁ దంత్వావర్చనాభిధ దనరు సూత్రము నూలు దార మనఁగఁ
బురిపిరి యనఁగఁ దత్కరణవేష్టన మొప్పు జెలఁగుఁ ద్వక్సూత్రంబు నులక యనఁగఁ
బొలుపొందును ద్రిసూత్రి మున్నూ లనంగను ముప్పేట యనఁగను ముప్పిరి యనఁ
దంతుచతుష్కంబు దనరు నెన్నిక యన షష్టితంతువులు పుంజ మన వెలయుఁ
దాంతవప్రతికృతిపేరు దనరియుండు సన్య యనఁ దంతువేష్టనసాధనంబు
పరఁగును బరంటె యనఁగను బంటె యనఁగఁ బంట్రకోల యనంగఁ జెవ్వందిలింగ.

296


సీ.

అలరు లాక యనంగ నర్చాభిధానంబు తగుఁ బడు గనఁగ నాతానసంజ్ఞ
వెలయు వితానంబు పేకయం చనఁగను వాయదండము నేఁతపల కనఁ దగు

తొట్టినాళ యనంగఁ దురి పేరు విలసిల్లుఁ గుంచిక తనరును గుంచె యనఁగఁ
బుస్తము చెరి యనఁ బొలుపొందు నేఁతయంత్రము మగ్గ మనఁగను దనరుచుండుఁ
దంతునిస్సరణంబుగఁ దనరుచుండు వెలుపుడనఁ దోఁడు డనఁగను వెలయుచుండు
ఫ్యూతి చను నల్లిక యనంగ నేత యనఁగ భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

296


సీ.

సూదియం చనఁగను సూచియౌ నది గొప్ప యైన దబ్బన మన నలరుచుండుఁ
గత్తెర యనఁగను గర్తరి గనుపట్టుఁ జిత్రము దనరారుఁ జిత్తరు వన
రంజన మగు రాణ రహి రంగు రక మన బొమ్మయం చనఁగను బుత్త్రిక తగుల
బెట్టె పెట్టియ యనఁ బేటిక విలసిల్లు మంజూష దనరారు మందస మన
నదియె చందుగునాఁ దగు నల్ప మైనఁ బరఁగు స్కంధాటికాఖ్య కావడి యనంగ
నుట్టి యన శిక్య మొప్పగు నుగ్గ మనఁగ భాండగళబంధరజ్జు వౌ బార్వతీశ.

297


సీ.

పాదరక్షాభిధ పరఁగును జెప్పన మలకడ మ్మనఁగ సమ్మాళి యనఁగఁ
దద్వి శషములు తగుఁ బాయపోను పాపో సూడు పుద్దము ముచ్చె మెట్టు
కవును మోచా యనఁగా నదె జీర్ణమై నపుడు పల్కంబడు నదక యనఁగఁ
బావాలు పావలు పావుకో ళ్లనఁగను బాదుకనామము ల్పరఁగుచుండుఁ
బొలుచు దోస్తాన మనఁ దోలుకోరలతిత్తి మీఱు సందంశకముపేరు కా రనంగ
శంబళి చెలంగు సంబెల సమ్మెట యన నల్పమై యున్న నదె సుత్తి యనఁదగు హర.

298


సీ.

తనరును లోహసంతాడనాధారంబు డాకల్లు పట్టడ డాగలి యనఁ
బెడసాన యనఁగను వేదనిక వెలయు నొరగ ల్లనఁగ నికషోపల మగు
సన్నెక ల్లనఁగను సన్నక ల్లనఁగను బేషణశిలపేరు వెలయుచుండుఁ
బొత్తర మన దృషత్పుత్రంబు విలసిల్లుఁ బత్త్రపరశుసంజ్ఞ పరఁగుచుండు
నాకురాయి యనంగ లోహాతితాపకుండ మొప్పుచునుండును గొలిమి యనఁగః
గొలిమితిత్తి యనంగను జెలఁగు భస్త్రి భూషికభుజంగ శ్రీమాతృభూతలింగ.

299


సీ.

త్రాసు తరాసునాఁ దనరును నారాచి తూనికకోలనాఁ దూనుకోల
యనఁ దులాదండాఖ్య యలరును గట్లెనా నగుఁ దులామానగుంజాదికములు
కమ్మి యటంచనఁగా లోహలత యొప్పు గమ్మచ్చునాఁగఁ దత్కరణయంత్ర
మొప్పు దాయి యనంగ నుత్పతనాఖ్యయౌ నొనరు దారుచ్ఛేది యులి యనంగ
నల్పమైన నదే సేణ మనఁగ సిరసమనఁగ విలసిల్లుఁ డంక మొప్పగును గాసె
యులి యనఁగ వర్ధినికి పేరు వెలయుచుండు బాడిస యటం చనంగఁ జెవ్వందిలింగ.

300


సీ.

ఱంప మనంగను గ్రకచంబు తరగంపె యనఁ గరపత్త్రభేదాఖ్య మీఱు
దారునిర్మథనసాధనవిశేషము త్రోపుడనఁ దఱిమెన యన నలరుచుండు

మంగలకత్తి యనంగ క్షురము తగుఁ గకపాల యనఁగను గక్షసాల
తనరుఁ గేశోత్పాటి తండస మనఁగను జిమ్మట యనఁగను జెలఁగుచుండుఁ
దనరియుండును వస్త్రధావనపదార్థసంజ్ఞ చౌకార మనఁగను సబ్బు నాఁగఁ
గమ్మనీరన నుపజలాఖ్యగఁ జైలంగు భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

301


సీ.

తిలయంత్రసంజ్ఞయై యలరు గానిగ యనఁ దిలకల్క మలరును దెలకపిండి
యనఁ బ్రతిబింబాఖ్య యచ్చనఁగను నీడ యనఁ జాయయం చన నలరుచుండుఁ
గైవడి కైవళి కయివడి కౌడుపు మాదిరి పోలిక మాడ్కి పురుఁడు
పోలికి యనఁగఁ బోల్పొందు నుపమపేరు ప్రతి నూఱు బదు లనఁ బ్రతినిధి యగు
సాటి సాటువ తరబడి సవతు తరము దీటు సరి పాటి పోటి యుద్ది యనఁ బాడి
యీడనఁగ సదృశాఖ్యలై యెసఁగుచుండు భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

302


సీ.

తెఱఁగు చందము పగిది విత మనంగను మీఱుచునుండుఁ బ్రకారసంజ్ఞ
బాడి కూలి సంబళము జీత మనంగ వేతనసంజ్ఞయై ఖ్యాతిఁజెందు
రోయనఁ బైఁడన రొక్క మనంగను వేశ్యాభృతికి సంజ్ఞ వెలయుచుండుఁ
గ ల్లనంగ సురాఖ్య చెల్లును కైపుసారాయి సారా నాఁగ రహి దనర్చుఁ
దద్విశేషంబు తద్భస్త్రి దనరుచుండుఁ దత్తెర యనంగఁ జెలఁగు మేదకము పేరు
పెళ్లె మనఁగను మదసంజ్ఞ యుల్లసిల్లు మబ్బు లాహిరి యనఁగను మాతృభూత.

303


సీ.

లాహిరీవస్తువు ల్కలయఁజేర్చిన మందు మబ్బురాయుం టన మనుచునుండు
బంగు గంజాయినాఁ బరఁగుఁ గళంజాఖ్య యభినియం చనఁగ నిర్యాస మొప్పు
ద్యూతకారాభిధ దోఁచుచుండును జూదకాఁడు జూదరి పందెకాఁ డనంగ
సాక్షి యొప్పును సాకె సాకిరి కరి యనఁ బూటకాఁ డనఁగను బూఱ యనఁగఁ
దనరు లగ్నకుసంజ్ఞ జూదం బనంగ నెత్త మనఁగను ద్యూతము నివ్వటిల్లుఁ
బందె మనఁ బన్నిదం బనఁ ఋణము వెలయు జట్టికాఁడన ద్యూతియై చను మహేశ.

304


సీ.

అష్టాపదాభిభ లగుఁ జదరంగపుఁబలకనా నెత్తపుఁబలక నాఁగఁ
అదరంగ మనఁగను జతురంగ మొప్పగు నష్టజనద్యూత మలరుచుండుఁ
బగడసాల యనంగ భాసిల్లుచుండును బాళెయం చన శారిఫలము పేరు
సారెయం చన నడ్డసారెయం చనఁగను సొగటమం చనఁగను దగును శారి
పాచిక యనంగ గవరనాఁ బాశక తగుఁ బరఁగు నేకవచనమునఁ బగడ యనఁగ
దుగ యనఁగ రేచ యనఁగను దోఁచు ద్వికము భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

305


సీ.

తిగ ముచ్చ యనఁగను ద్రికము పేరగుఁ దిగ పంచ చౌకమ్ము తీవంచ యడ్డ
యనఁగఁ జతుష్కాఖ్య యగును జౌపంచనాఁ బంచకాభిధగాను బరఁగుచుండు

నిత్తిగ చక్కన నెసఁగును షట్కబు సత యన విలసిల్లు సప్తసంఖ్య
దచ్చియం చనఁగను దనరు నష్టకసంజ్ఞ బార యనం దగు ద్వాదశకము
అరయ నీరీతి ద్యూతసంఖ్యలు చెలంగు కోడిపోరన మఱియును కొన్ని గలవు
అదియ పో ప్రాణవద్ద్యూతమా దయైకపూరితాపాంగ శ్రీమాతృభూతలింగ.

306


సీ.

బొంగర మనఁగను బొమ్మర మ్మనఁగను భ్రమరాభిధానమ్ము పరఁగుచుండు
నక్షోకుల మ్మగు నచ్చనగల్లన చిఱుతనగోటినాఁ జిలఁగు దీర్ఘ
ఖర్వకాష్ఠక్రీడ గంజనకాలన ఖంజపాదక్రీడగాఁ జెలంగు
నక్షిమీలనకేళి యలరు దాఁగిలి మూఁత యనఁ గనుమూసి గంతన యనంగఁ
బరఁగు క్షేపణి పోటనబంతి యనఁగఁ గేరుచుండును గీరనగింజనాఁగ
రేకికాబీజకేళి గౌరీముఖాబ్జముదితదృగ్భృంగ శ్రీమాతృభూతలింగ.

307


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగ శూద్రవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని మాతృభూత జగత్త్రయీమాతృభూత.

308


ఉ.

రంగ మహీనిషంగమ ధరాధరశృంగమసహ్యరామరు
త్సంగమ హృష్యదంగను భుజంగమరాజసుతామనోబ్జినీ
భృంగమ పాదపద్మనుతగృధ్రవిహంగమ చంద్రమఃకళా
లింగమ మాతృభూతశివలింగమ దైత్యవిభంగచంగమా.

309


పృథ్వీ.

పటీకృతహరిత్తటీ స్ఫటిక నిర్మలస్వాకృతీ
స్ఫుటీకృతగుణవ్రజా పుషితసర్వలోకవ్రజా
ఘటీకృతఝరీపయఃకణనిరంతరార్ద్రీభవ
త్తటీభవనఖేలనా ధరణిభృత్సతీమేళనా.

310


గద్య.

ఇది శ్రీమత్పరమేశ్వరకరుణాకటాక్షసంప్రాప్త సర్వజ్ఞత్వాధికతిపయగుణస్వ
సామ్యతదితరసకలగుణనిరౌపమ్యాసేతుహిమాచలఖ్యాతమహోద్దండకవిబిరుదప్రశస్త
సీతారామార్యవర్యతనూజాత శౌర్యధైర్యస్థైర్యాదిసకలగుణచిరత్నరత్నరత్నాకర
శ్రితజనశ్రీకర కోటిసమాఖ్యవంశసుధాపయోధి రాశాశశాంక ఘంటికాతురగ నీలా
తపత్త్ర హనుమద్ధ్వజ మకరకేతన దివాదీప నవవిధభేరికాదినిఖిలబిరుదాంక బృహ
దంబికాకటాక్షసంజాతసామ్రాజ్యధురంధర విమలయశోబంధుర కర్ణాటచోళ
పాండ్యమహీపాలాదిసంస్తూయమాన శ్రీ రాయరఘునాథమహీనాథ సభాంకణ బిరు
దాయమా నార్యనుతచర్య వేంకనార్యప్రణీతం బైనయాంధ్రభాషార్ణవంబునందు
ద్వితీయకాండము.

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

  1. గాండ్లవాఁ