ఆంధ్రపదనిధానము/ప్రథమకాండము

వికీసోర్స్ నుండి

స్వర్గవర్గు

క.

విను ప్రోలన జేజేప
ట్టన విన్వల ననఁగ జేజేయండ యనంగన్
మినువీడన మినువలనన
వనజభవాశ్రితపదాబ్జ! స్వర్గాఖ్యలగున్.

1

వినుప్రోలు, జేజేపట్టు, విన్వలను, జేజేయండ, మినువీడు, మినువలను ఇవి స్వర్గమునకుఁ బేళ్లు.

సీ.

తెఱగంట్లు జేజేలు దేవుళ్లు చదలుకా
                      పులు బాసవాళ్లు వేల్పులును మింటి
తెఱవర్లు జన్నపుదిండ్లు జేజెల్ విను
                      తెరవరులును గంగిదిండులనఁగ
వినుద్రిమ్మరులనంగ వేలుపులనఁగను
                      దేవతాహ్వయములౌ దేవదేవ
దేవుఁడు దయ్యంబు దేవర ముప్పోక
                      లాడన భవదాహ్వయమ్ములౌను


గీ.

నెలయు నప్సరసలకు నభిఖ్యలయ్య
యచ్చరలనంగఁ దెఱగంటులనఁగ వేల్పు
గరితలనఁగను బుడమిలోఁ గలుషవార్ధి
తరణీచరణాంబుజాత విధాతృనేత.

2

తెఱగంట్లు, జేజేలు, దేవుళ్లు, చదలుకాపులు, బాసవాళ్లు, వేల్పులు, మింటితెరవర్లు, జన్నపుదిండ్లు, జేజెలు, విగుతెరవరులు, గంగిదిండ్లు, వినుద్రిమ్మరులు, వేలుపులు ఇవి దేవతలకుఁ బేర్లు. దేవుఁడు, దయ్యము, దేవత, ముప్పోకలాడు, ఇవి భగవంతుని పేర్లు. అచ్చరలు తెఱగంటులు వేల్పుగరితలు ఇవి యప్సరసలకుఁ బేర్లు.

సీ.

రక్కసి రాకాసి రక్కసీఁడును రక్క
                      సుండు రేద్రిమ్మరి సోకునల్ల
ద్రావుడు వేలుపుదాయ సోఁకుఁడు తొలు
                      వేలుపనంగ ప్రావేల్పు, పొలసుఁ
దిండియనంగ రేద్రిమ్మరీఁ డీరువుఁ
                      దిండినా మానిసిఁదిండి యెఱచి
మేఁపరియన పొలమేఁతరి యనఁగను
                      రాక్షసాఖ్యలు ఘోరరాక్షసారి


తే.

రక్కసియనంగ రాకాసి రక్కెసలనఁ
దిండివెలఁదియనఁగఁ బొలదిండినాఁగ
నవని రాక్షసకన్యక కాఖ్యలగుచు
వఱలె బాలపురాధీశ భవవినాశ.

8

రక్కసి, రాకాసి, రక్కసీఁడు, రక్కసుఁడు, రేద్రిమ్మరి, సోకునల్లఁద్రావుడు, వేలుపుదాయ, సోఁగఁడు, తొలువేల్పు, ప్రావేలుపు, పొలసుతిండి, రేఁద్రిమ్మరీఁడు, ఈరువుఁదిండి, మానిసిఁదిండి, ఎఱచిమేఁపరి, పొలమేఁతరి ఇవి రాక్షసుని పేర్లు. రక్కసి, రాకాసి, రక్కెస, తిండివెలఁది, పొలతిండి ఇవి రాక్షసస్త్రీకిఁ బేరులు.

సీ.

బొ మ్మంచరౌ తుడ్పుమోమువేలుపుతాత
             తొలువేల్పు దుగినుఁడు నలువ బమ్మ
చదువులముదుకఁడు చదువులవేలుపు
             పెద్దవేలుపు వేల్పుపెద్ద మొదటి
వేలుపు పొక్కిలిచూలి తామరచూలి
             తమ్మిపుట్టువు ముళ్లతబసితండ్రి
నిక్కపుజగమేలునేర్పరి యననివి
             ధాత్రభిఖ్యలు జెల్లు ధరణిఁ బల్కు


తే.

చెలియ పొత్తువు చదువులచేడియయును
మినుకుగుబ్బెత చదువులమిన్న యన్ను
నలువపడఁతి యనంగను జలరుహాయ
తాక్ష! వాణి కభిఖ్యలై యలరు భువిని.

4

బొమ్మ, అంచరౌతు, ఉడుపుమోమువేలుపు, తాత, తొలువేల్పు, దుగినుఁడు, నలువ, బమ్మ, చదువులముదుకఁడు, చదువులవేలుపు, పెద్దవేలుపు, వేల్పుపెద్ద, మొదటివేలుపు, పొక్కిలిచూలి, తామరచూలి, తమ్మిపుట్టువు, ముళ్లతబసితండ్రి, నిక్కపుజగమేలునేర్పరి, ఇవి బ్రహ్మదేవునిపేర్లు. పల్కుచెలియ, పొత్తువు, చదువులచేడియ, మినుకుగుబ్బెత, చదువులమిన్న అన్ను, నలువపడఁతి, ఇవి సరస్వతీదేవి పేర్లు.

క.

నారదున కాఖ్యలౌ నా
ర్వేరపురుసి ముళ్లతపసి వేల్పుతపసి నా
సారెలెపుడు మీటెడు జడ
దారి యనన్ బోరుతిండితపసి యన హరీ.

5

ఆర్వేరపురుసి, ముళ్లతపసి, వేల్పుతపసి, సారెలెపుడుమీటెడుజడదారి, పోరుతిండితపసి, ఇవి నారదునికి పేర్లు.

సీ.

నలమేనిదొర పచ్చవలువదాలుపు గట్టు
           తాలుపు కరివేల్పు తమ్మికంటి
గరుడిరౌ తాలకాపరి వలమురితాల్పు
           పక్కిడాల్వేలుపు పసిఁడివల్వ
దారి రక్కసిగొంగ తమ్మిపొక్కిలి లచ్చి
           మగఁడు వెన్నుఁడు మామమామ చుట్టు
వాలుజో దుడ్పనకేల్వేల్పు ముజ్జగం
           బులబొజ్జదేవర నలువతండ్రి


తే.

యనఁగ భవదీయనామంబు లౌను శౌరి
మరునిఁగన్నయ్య నలమేనిదొర యనంగ
వెన్నదొంగ కన్నయ్య నాఁ వెన్నుఁ డనఁగ
నవని భవదవతారకృష్ణాహ్వయములు.

6

నల్లమేనిదొర, పచ్చవలువదాలుపు, గట్టుతాలుపు, కఱివేల్పు, తమ్మికంటి, గరుడిరౌతు, ఆలకాపరి, వలమురితాలుపు, పక్కిడాల్వేలుపు, పసిఁడివల్వదారి, రక్కసిగొంగ, తమ్మిపొక్కిలి, లచ్చిమగఁడు, వెన్నుఁడు, మామమామ, చుట్టువాలుజోదు, ఉడ్పనకేల్వేల్పు, ముజ్జగంబులబొజ్జదేవర, నలువతండ్రి ఇవి విష్ణుదేవునిపేళ్ళు. మరునిగన్నయ్య, నల్లమేనిదొర, వెన్నదొంగ, కన్నయ్య, వెన్నుఁడు ఇవి కృష్ణునిపేళ్ళు.

క.

సింగఁ డనంగను మానిసి
సింగఁడు కంబముదొర నరసింగఁ డనంగన్

రంగద్విహంగతుంగతు
రంగ! నృసింహాఖ్య లగుచు రాజిలు నుర్విన్

7

సింగఁడు, మానిసిసింగఁడు, కంబముదొర, నరసింగఁడు, ఇవి నృసింహదేవునిపేళ్లు.

తే.

నేలకూఁతురు నాగటిచాలుపేరి
యతివ యన సీత; సీరాము డనఁగ రాముఁ
డొప్పు; తిమ్మప్పఁ డనఁగఁ దిమ్మప్ప యనఁగ
వెంకటేశాఖ్యలై యొప్పు వేదవేద్య.

8

నేలకూఁతురు, నాగటిచాలు పేరియతివ ఇవి సీతాదేవిపేళ్లు. సీరాముఁడు ఇది శ్రీరామునిపేరు. తిమ్మప్పఁడు, తిమ్మప్ప ఇవి వెంకటేశ్వరునిపేళ్లు.

ఆ.

నాగటిదొర యొంటిప్రోగును దెలిమేని
వాఁడు వెఱ్ఱినీళ్లప్రోడ దుక్కి
వాలుజోదు నల్లవలువతాలుపు
తాటిపడగదారి యనఁగ బలుఁడు దేవ.

9

నాగటిదొర, ఒంటిప్రోగు, తెలిమేనివాఁడు, వెఱ్ఱినీళ్లప్రోడ, దుక్కివాలుజోదు, నల్లవలువతాల్పు, తాటిపడగదారి, ఇవి బలరామునిపేర్లు.

చ.

కలిమినెలంత లచ్చిచెలి కిల్ములపొల్తుక తమ్మియింటిపై
దలి సిరి తల్లితల్లియును దామరనట్టువ పైఁడిచాన పూ
విలుతునితల్లి లచ్చి కరివేలుపుటాలు జగంబుతల్లి త
మ్ములకయిచానయుం గడలిబుట్టువు లక్కిమి నాఁగ లక్ష్మియౌ.

10

కలిమినెలంత, లచ్చిచెలి, కల్ములపొల్తుక, తమ్మియింటిపైదలి, సిరి, తల్లితల్లి, తామరనట్టువ, పైఁడిచాన, పూవిల్తునితల్లి, లచ్చి, కఱివేలుపుటాలు, జగముతల్లి, తమ్ములకైచాన, కడలిఁబుట్టువు, లక్కిమి యనునివి లక్ష్మిదేవికిఁ బేర్లు.

సీ.

అలరువిల్తుఁడు కమ్మవిలుకాఁడు చక్కెర
           విలుకాఁడు మరుఁడు పూవింటిజోదు
వలదొర సిరిచూలి వాలుగడా లించు
           విలతుండు వలవులవేఁటకాఁడు
తుంటవిల్తుఁడు వెడవింటినెయ్యపుఱేఁడు
           తామరతూపరి తలఁపుచూలి
వలపురాయఁడు తావివిలుకాఁడు బేసికై
           దువుజోదు ననవిలుతుండు తీఁగె


గీ.

విలుతుఁడు గురులవిలుకాఁడు చిలుకరౌతు
పచ్చవార్వపుజోదును లచ్చికొడుకు
పచ్చవిలుతాలుపు మొసలిపడగదారి
యనఁగ నివి మన్మథున కాఖ్య లంబుజాక్ష.

11

అలరువిల్తుఁడు, కమ్మవిలుకాఁడు, చక్కెరవిలుకాఁడు, మరుఁడు, పూవింటిజోదు, వలదొర, సిరిచూలి, వాలుగడాలు, ఇంచువిలుతుఁడు, వలపువేఁటకాఁడుఁ, తుంటవిల్తుఁడు, వెడవింటినెయ్యపుఱేఁడు, తామరతూపరి, తలఁపుచూలి, వలపురాయఁడు, తావివిల్కాడు, బేసికైదువుజోదు, ననవిలతుఁడు, తీఁగెవిలుతుఁడు, ఇగురులవిల్కాడు, చిలుకరౌతు, పచ్చవార్వపుజోదు, లచ్చికొడుకు, పచ్చవిల్దాలుపు, మొసలిపడగదారి అనునివి మన్మథునిపేర్లు.

గీ.

చుట్టుకైదువు గుడుసల్గు చుట్టువాలు
కంటివాలు సేయంచులకైదువు సుడి

వాలు బటువల్గు నాఁ బిల్లవా లనంగ
నఘనిశాభాస్కర! సుదర్శనాఖ్యలౌను.

12

చుట్టుకైదువు, గుడుసల్గు, చుట్టువాలు, కంటివాలు, వేయంచులకైదువు, నుడివాలు, బటువల్గు, బిల్లవాలు, అనునివి చక్రమునకుఁ బేర్లు.

ఆ.

బిల్లవాల్‌జో డనఁగఁ గఱివేల్పుబూర
గొమ్ము వలమురి పాంచజన్యంబుపేళ్లు;
నీటియిక్క యనంగను నీటిపుట్టు
వనఁగఁ గౌస్తుభమున కాఖ్య లచ్యుతాఖ్య.

13

బిల్లవాలుజోడు, కరివేల్పు, బూరఁగొమ్ము, వలమురి, యనపాంచజన్యము పేర్లు. నీటియిక్క, నీటిపుట్టువు, అననివి కౌస్తుభమణికిఁ బేర్లు.

పంచపాది. గీ.

పాఁపమేపరి గురుడినాఁబక్కిఱేఁడు
బొల్లిగ్రద్ద చిలువతిండి బొల్లఁడు గరు
టాలమంతుఁడు వెన్నునిడాలు పులుఁగు
మన్నియఁడు గరుటామంతుఁడన్న పులుఁగు
బొల్లఁడన గరుడాఖ్యలై చెల్లె శౌరి.

14

పాఁపమేపరి, గరుడి, పక్కిఱేఁడు, బొల్లిగ్రద్ద, చిలువతిండి, బొల్లఁడు, గరుటాలమంతుడు, వెన్నునిడాలు, పులుఁగుమన్నియఁడు, గరుటామంతుడు, పులుఁగుబొల్లఁడు, ఇవి గరుడునిపేర్లు.

సీసమాలిక.

అయిదుమోములవేలుఁ పాబోతురౌ తంగ
            మొలవేల్పు నెలతాల్పు చిలువతాల్పు
తిగకంటి ముక్కంటి దిసమొలవేలుపు
            మినుసిగదేవర మిత్తిగొంగ

కాట్రేఁడు మిక్కిలికంటిదేవర యగ్గి
          కంటి పునుకతాల్పు కాటిఱేఁడు
గట్టువిల్తుఁడు వేఁడికంటి తెల్లనిసామి
          విసపుమేతరి మిత్తివేఁటకాఁడు
జింకతాల్పరి నింగిసిగ కఱకంఠుఁడు
          కొండయల్లుఁడు వెండికొండవిడిది
వేలుపు మిన్వాఁకతాలుపు వలదొర
           సూడు జన్నపుగొంగ కోడెరౌతు
జడముడిజంగంబు కుడుములతిండిదే
          వరతండ్రి ముమ్మొనవాలుదారి
తోలుఁదాల్పరి వాఁకతాలుపు చిచ్చఱ
          కంటిదేవర బేసికంటిసామి


గీ.

వలమలల్లుఁడు గంగికైయలుగువాఁడు
నాఁగ బూచులయెకిమీడునాఁగ శివుని
కాఖ్య! లబ్ధినివేశ మహాప్రకాశ
బాలనగరేశ యళికేశ భవవినాశ.

15

అయిదుమోములవేల్పు, ఆబోతురౌతు, అంగమొలవేల్పు, నెలతాల్పు, చిలువతాల్పు, తిగకంటి, ముక్కంటి, దిసమొలవేల్పు, మినుసిగదేవర, మిత్తిగొంగ, కాట్రేఁడు, మిక్కిలికంటిదేవర, అగ్గికంటి, పునుకతాల్పు, కాటిఱేఁడు, గట్టువిల్తుఁడు, వేఁడికంటి, తెల్లనిసామి, విసపుమేఁతరి, మిత్తివేఁటకాఁడు, జింకతాల్పరి, నింగిసిగ, కఱకంఠుఁడు, కొండయల్లుఁడు, వెండికొండవిడిదివేలుపు, మిన్వాఁకతాలుపు, వలదొరసూడు, జన్నపుగొంగ, కోడెరౌతు, జడముడిజంగము, కుడుములతిండిదేవరతండ్రి, ముమ్మొనవాలుదారి, తోలుదాల్పరి, వాఁకతాల్పు, చిచ్చరకంటిదేవర, బేసికంటిసామి, వలదులల్లుఁడు, గంగికైయలుగువాడు, బూచులయెకిమీడు అననివి శివునకుఁ బేర్లు.

గీ.

దుగ్గి మలయమ్మ యమ్మికదుగ్గ జండి
సత్తి కఱకంఠునిల్లాలు సామితల్లి
గట్టుచూలి గట్రాచూలి గట్లఱేని
పట్టి సింగమెక్కుడుజంత పార్వతియగు.

16

దుగ్గి, మలయమ్మ, అమ్మిక, దుగ్గ, చండి, సత్తి, కఱకంఠునిల్లాలు, సామితల్లి, గట్టుచూలి, గట్రాచూలి, గట్లఱేనిపట్టి, సింగ మెక్కుడు, జంత, అననివి పార్వతీదేవిపేర్లు.

క.

దనుజారి నంది కగు బస
వన యనఁగా నాలఱేఁడు బసవఁ డనఁగఁ బే
ర్కొనె భువిని; ద్రిశూలము ము
మ్మొనవాలనఁ దెనుఁగునందు ముద మొప్పారన్.

17

బసవన, ఆలఱేఁడు, బసవఁడు, అననివి నందికిపేర్లు. ముమ్మొనవాలు ఇది త్రిశూలముపేరు.

సీ.

కందుండు వేలుపుగమికాఁడు పుంజుఁదా
         ల్పరిసామి యమ్మికపట్టి యగ్గి
చూలిముద్దయ ఱెల్లుచూలి కొమరసామి
         కొంచగుబ్బలివ్రక్కలించుమేటి
నెమ్మిరౌ తార్గురునెలఁతలబిడ్డఁడు
          నెమ్మితాల్పరియును నెమ్మిఱేఁడు

తిగజంటమోములదేవరయన శక్తి
           ధరునినామంబులౌ; చెఱుపుఱేఁడు


గీ.

గుజ్జువేలుపు పిళ్లారి కొక్కురౌతు
బొజ్జదేవర యేనుఁగుమోమువేల్పు
నొంటికొమ్మయ్య వెనకయ్య జంటతలుల
బిడ్డ కుడుములతిండినా విఘ్నరాజు.

18

కందుఁడు, వేలుపుగమికాఁడు, పుంజుదాల్పరి, సామి, అమ్మికపట్టి, అగ్గిచూలి, ముద్దయ, ఱెల్లుచూలి, కొమరసామి, క్రొంచగుబ్బలివ్రక్కలించుమేటి, నెమ్మిరౌతు, ఆర్గురినెలతలబిడ్డఁడు, నెమ్మితాల్సరి, నెమ్మిఱేఁడు, తిగజంటమోటులదేవర, అన నివి కుమారస్వామికిఁ బేళ్లు. చెఱుపుఱేఁడు, గుజ్జువేల్పు, పిళ్లారి, కొక్కురౌతు, బొజ్జదేవర, ఏనుఁగుమోమువేల్పు, ఒంటికొమ్మయ్య, వెనకయ్య, జంటతల్లులబిడ్డఁడు, కుడుములతిండి, అన నివి వినాయకునిపేళ్లు.

గీ.

మలపగతుఁడు వేఁగంటియు మబ్బురౌతు
నొడలిచూపొడయఁడు వేల్పుటొడయఁడు సుర
తాణియును తూర్పుఱేఁ డన దనుజశైల
వజ్రి వజ్రి కభిఖ్యలై వఱలె శౌరి.

19

మలపగతుఁడు, వేఁగంటి, మబ్బురౌతు, ఒడలిచూపొడయఁడు, వేల్పుటొడయఁడు, సురతాణి, తూర్పుఱేఁడు, అనగ నివి యింద్రునకుఁ బేళ్లు.

క.

మలపగతునిరాణి యనం
జెలఁగెను సురతాణి యనఁగఁ జెల్లె శచికి; వే
ల్పులబోనము సుధపేరై
విలసిల్లెను కలుషభంగ విహగతురంగా.

20
పుట:ఆంధ్రపదనిధానము.pdf/29 పుట:ఆంధ్రపదనిధానము.pdf/30 పుట:ఆంధ్రపదనిధానము.pdf/31 పుట:ఆంధ్రపదనిధానము.pdf/32 పుట:ఆంధ్రపదనిధానము.pdf/33 పుట:ఆంధ్రపదనిధానము.pdf/34 పుట:ఆంధ్రపదనిధానము.pdf/35 పుట:ఆంధ్రపదనిధానము.pdf/36 పుట:ఆంధ్రపదనిధానము.pdf/37 పుట:ఆంధ్రపదనిధానము.pdf/38

వ్యోమవర్గు

గీ.

బయలు చద లాకసము నింగి బైలు విన్ను
విను మొగులుదారి యుప్పరవీది వేల్పుఁ
దెరువు మిను మిన్ను చుక్కలతెరువు మబ్బు
దారి యుప్పర మన ననంతంబు పేళ్లు
వఱల ముగిసె ధరణి వ్యోమవర్గు శౌరి.

39

బయలు, చదలు, ఆకసము, నింగి, బైలు, విన్ను, విను, మొగులుదారి, ఉప్పరవీది, వేల్పుఁదెరువు, మిను, మిన్ను, చుక్కలతెరువు, మబ్బుదారి, ఉప్పరము అననివి ఆకాశమునకుఁ బేళ్లు,


వ్యో మ వ ర్గు ము గి సె ను


______________

పుట:ఆంధ్రపదనిధానము.pdf/40 పుట:ఆంధ్రపదనిధానము.pdf/41 పుట:ఆంధ్రపదనిధానము.pdf/42 పుట:ఆంధ్రపదనిధానము.pdf/43 పుట:ఆంధ్రపదనిధానము.pdf/44 పుట:ఆంధ్రపదనిధానము.pdf/45 పుట:ఆంధ్రపదనిధానము.pdf/46 పుట:ఆంధ్రపదనిధానము.pdf/47 పుట:ఆంధ్రపదనిధానము.pdf/48 పుట:ఆంధ్రపదనిధానము.pdf/49 పుట:ఆంధ్రపదనిధానము.pdf/50 పుట:ఆంధ్రపదనిధానము.pdf/51 పుట:ఆంధ్రపదనిధానము.pdf/52 పుట:ఆంధ్రపదనిధానము.pdf/53 పుట:ఆంధ్రపదనిధానము.pdf/54 పుట:ఆంధ్రపదనిధానము.pdf/55 పుట:ఆంధ్రపదనిధానము.pdf/56 పుట:ఆంధ్రపదనిధానము.pdf/57 పుట:ఆంధ్రపదనిధానము.pdf/58 పుట:ఆంధ్రపదనిధానము.pdf/59 పుట:ఆంధ్రపదనిధానము.pdf/60 పుట:ఆంధ్రపదనిధానము.pdf/61 పుట:ఆంధ్రపదనిధానము.pdf/62 పుట:ఆంధ్రపదనిధానము.pdf/63 పుట:ఆంధ్రపదనిధానము.pdf/64 పుట:ఆంధ్రపదనిధానము.pdf/65 పుట:ఆంధ్రపదనిధానము.pdf/66 పుట:ఆంధ్రపదనిధానము.pdf/67 పుట:ఆంధ్రపదనిధానము.pdf/68 పుట:ఆంధ్రపదనిధానము.pdf/69 పుట:ఆంధ్రపదనిధానము.pdf/70 పుట:ఆంధ్రపదనిధానము.pdf/71 పుట:ఆంధ్రపదనిధానము.pdf/72 పుట:ఆంధ్రపదనిధానము.pdf/73 పుట:ఆంధ్రపదనిధానము.pdf/74 పుట:ఆంధ్రపదనిధానము.pdf/75 పుట:ఆంధ్రపదనిధానము.pdf/76 పుట:ఆంధ్రపదనిధానము.pdf/77 పుట:ఆంధ్రపదనిధానము.pdf/78 పుట:ఆంధ్రపదనిధానము.pdf/79 పుట:ఆంధ్రపదనిధానము.pdf/80 పుట:ఆంధ్రపదనిధానము.pdf/81 పుట:ఆంధ్రపదనిధానము.pdf/82 పుట:ఆంధ్రపదనిధానము.pdf/83 పుట:ఆంధ్రపదనిధానము.pdf/84 పుట:ఆంధ్రపదనిధానము.pdf/85 పుట:ఆంధ్రపదనిధానము.pdf/86 పుట:ఆంధ్రపదనిధానము.pdf/87 పుట:ఆంధ్రపదనిధానము.pdf/88 పుట:ఆంధ్రపదనిధానము.pdf/89 పుట:ఆంధ్రపదనిధానము.pdf/90 పుట:ఆంధ్రపదనిధానము.pdf/91 పుట:ఆంధ్రపదనిధానము.pdf/92 పుట:ఆంధ్రపదనిధానము.pdf/93 పుట:ఆంధ్రపదనిధానము.pdf/94 పుట:ఆంధ్రపదనిధానము.pdf/95 పుట:ఆంధ్రపదనిధానము.pdf/96 పుట:ఆంధ్రపదనిధానము.pdf/97 పుట:ఆంధ్రపదనిధానము.pdf/98 పుట:ఆంధ్రపదనిధానము.pdf/99 పుట:ఆంధ్రపదనిధానము.pdf/100 పుట:ఆంధ్రపదనిధానము.pdf/101 పుట:ఆంధ్రపదనిధానము.pdf/102 పుట:ఆంధ్రపదనిధానము.pdf/103 పుట:ఆంధ్రపదనిధానము.pdf/104 పుట:ఆంధ్రపదనిధానము.pdf/105 పుట:ఆంధ్రపదనిధానము.pdf/106 పుట:ఆంధ్రపదనిధానము.pdf/107 పుట:ఆంధ్రపదనిధానము.pdf/108 పుట:ఆంధ్రపదనిధానము.pdf/109 పుట:ఆంధ్రపదనిధానము.pdf/110 పుట:ఆంధ్రపదనిధానము.pdf/111 పుట:ఆంధ్రపదనిధానము.pdf/112 పుట:ఆంధ్రపదనిధానము.pdf/113 పుట:ఆంధ్రపదనిధానము.pdf/114 పుట:ఆంధ్రపదనిధానము.pdf/115 పుట:ఆంధ్రపదనిధానము.pdf/116 పుట:ఆంధ్రపదనిధానము.pdf/117 పుట:ఆంధ్రపదనిధానము.pdf/118 పుట:ఆంధ్రపదనిధానము.pdf/119 పుట:ఆంధ్రపదనిధానము.pdf/120 పుట:ఆంధ్రపదనిధానము.pdf/121 పుట:ఆంధ్రపదనిధానము.pdf/122 పుట:ఆంధ్రపదనిధానము.pdf/123 పుట:ఆంధ్రపదనిధానము.pdf/124 పుట:ఆంధ్రపదనిధానము.pdf/125 తొలుదీవి అనఁగా జంబూద్వీపమునకు పేరు. జువ్విదీవి అన ప్లక్షద్వీపముపేరు. తమ్మిదీవి అన పుష్కరద్వీపముపేరు. బూరుగుదీవి అన శాల్మలద్వీపము పేరు. క్రొంచెదిన్నె అన క్రౌంచద్వీపముపేరు. ఱెల్లుదీవి అన కుశద్వీపముపేరు., సింగళము అన సింహళద్వీపము. టేఁకుదీవి అన శాకద్వీపముపేరు.

వారివర్గుముగిసెను.

కలహంసోత్సాహవృత్తము

సురవితానమకుటరత్న సురుచియుక్తపాదుకా
సురసపత్నగహన వర్గ శుచిశితాంకితాయుధా
సురమునీశహృదయపద్మ సుమరసౌఘబంభరా
సురనదీజనితపదాబ్జ సుగుణరాజిపేటికా

280

గద్య
ఇది శ్రీమదలర్మేల్మంగోత్తుంగశృంగారస్తనశృంగసంగత
ధారాధర వేంకటేశ్వరకృపాపాంగలబ్ధవాగ్వైభవ నిరం
తరభాగవతారాధనాధేయ తూముకులపవిత్ర సర్వే
శాభిధానపుత్ర రామదాసప్రణీతం బైనయాంధ్ర
పదనిధానంబను నిఘంటువునందు స్వర్గ
వ్యోమదిక్కాలధీవాక్ఛబ్దాదినాట్యపా
తాళభోగినరకవారివర్గకలి
తప్రథమకాండము
సంపూర్ణము.