ఆంధ్రనాటక పద్యపఠనం/పద్యాల చాకిరీ
4. పద్యాల చాకిరీ
పద్యరూపంలోని భావానికి మాత్రమే కాదు, భావాన్ని ప్రక
టించడానికి తోడ్పడే శబ్దానికిమాత్రమేకాదు, శబ్దంయొక్క ప్రతి వర్ణా
నికీకుడా ప్రాముఖ్యం ఉంది అనే సంగతి ఎరిగుండడమేకాక పాటించ
గల సామర్ధ్యం ఉన్న వాళ్ళుమాత్రమే పద్యరూపం అవలంబించడం
జరిగితే, మరి కావలసిందేమిటి ? కాని, అట్లా జరుగుతూండదు. అట్లా
జరక్కుండా ఉండడానికి అవకాశాలున్నాయి. గొప్ప భావం ఎదేనా
పద్యరూపంలో ఉంటే, జ్ఞాపకం పెట్టుగోడానికి ఎక్కువ వీలు అనేది
అంతా ఒప్పుగునే విషయమే. ఈ విషయాన్నే తిరగేసి, జ్ఞాపకం పెట్టు
గోవలసిన అవసరంఉండే ఇతరసందర్భాలగురించి పద్యరూపం వాడకం
ప్రారంభించారు. శబ్దాలూ వాటి అర్ధాలూ జ్ఞాపకం ఉండవలసినవి
గనక వాటికి పద్యరూపం, అనగా నిఘంటువుకి, వ్యాకరణం జ్ఞాపకం
ఉండవలసినదిగనక దానికి పద్యరూపం, ' పద్యాంధ్ర వ్యాకరణం'.
అక్కణ్ణించి జ్ఞాపకంపెట్టుగోవలసిన అవసరం లేకపోయినా, ఏదేనా విష
యానికి సంబంధించిన పేర్లు పెద్ద జాబితాగా ఉంటే, అనగా రాగాల
పేర్లు పక్షులపేర్లు మందులపేర్లు జంతువులపేర్లు మనుష్యులపేర్లు మొద
లైనవి, వాటికికుడా పద్యరూపమే కొందరు స్వీకరిస్తోచ్చారు-తమరు
సేకరించగలిగిన పేర్లు గద్యలో ఉంటే చెల్లాచెదరైనట్టు కాకుండా,
పద్యంలో బందోబస్తుగా ఉంటాయిగదా అని, అటువంటివి 'కవి
త్వం'లో జమకట్టుగోకూడదని కవిత్వ విమర్శకుల దెబ్బలాట. దాన్తో
అల్లాంటి పద్యకర్తకి కోపం. అవి పాడినప్పుడు ఇంచక్కా ఉంటూంటే,
అవి కవిత్వం కాకపోవడం ఏమిటీ, సే బాసు-అంటూ దయాంతరంగు
లైన ఆంధ్రమహాజనంయొక్క ఏక “గ్రీవ" తీర్మానం. అనగా, 'ఆలోచ నామృతం' అని చెప్పబడ్డ కవిత్వానికి పద్యరూపం ఉంటే చాలును
మరేమీ అక్కర్లేదు-అనేటట్టు అయింది. దానికితోడు, తెలుగు
పద్యం అని పేరుమాత్రమేకాని, సంస్కృత సమాన వ్యవసాయం!
ఆపైని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగురించీ వాళ్ళ యిల్లాళ్లగురించీ
తోచిన ముచ్చట్లు! ఈ విశేషాలు పూర్తిగా రంగరించిన ఆశీర్వచన
పద్యాలు ! అటువంటి పద్యాలు కవిత్వం కాదంటే ఏం ఒఘాయి
త్యమోకుడాను, అనే పరిస్థితి.
ఇటువంటి పద్యరత్నాలు సందర్భాన్నీ రచయితనీబట్టి ఒకటి, మూడు, అయిదు, ఎనిమిది, తొమ్మిది, ఇరవైయేడు - ఇల్లాగ్గా ఉంటాయి, ఉత్సవసందర్భంయొక్క గొప్పనిబట్టి ఈ రకం పద్యకర్తల సంఖ్యకుడా హెచ్చుతూ ఉంటుంది. మన్నింపబడేది ఒక కవే అయినప్పుడు, ఈ బాపతు పద్యకర్తలు పదులమీద ఉంటారు. శబ్దాలూ సమా సాలూ చెలరేగడంతప్ప ఆ పద్యాలలో యోచనసంగతి పీడాపోయిరి, పదార్ధంగుడా అంతగా దొరకకపోయినా, పైకి వద్దంటూనే వినేసెయ్యా లనే కుతూహలం సమ్మానితుడికీ ఉంటుంది, ఒక రాగేశ్వరుడు వాటిని ప్రసాదించేటప్పుడు వాటిని ఆరగించి మెప్పు కటాక్షించాలని సభ్యులకీ ఉంటుంది. విపులంగా రచనచేసినందుకు ఒక కవికి మన్నన చెయ్య దల్చుగున్న వారికికుడా, ఆ కవి రచనగురించి వినాలనిఉండదు. చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారిషష్టిపూర్తిఉత్సవం మూడురోజులపాటు ఉదయమూ సాయంత్రమూ బందరులో జరిగింది. మొదటిరోజు ఉదయం వారివిూద పద్యాలు పన్నెండుగురుచదివారు. వారి రచనలగురించి మాట్లాడడానికి ఒక గంటవ్యవధి ఇప్పించవలసిందని ఆయన్ని నేను కోరాను. నేను వారికి ఇష్టుణ్ణిఅవడంవల్ల, ఆయన తత్ప్రకారం కార్యనిర్వాహకుల్ని కోరారు. సాయంత్రం పద్యాలు చదవడానికి పదిమంది కర్తలు పేర్లిచ్చిఉండడం వల్ల, నా మాటలకి వ్యవధి దొరకదని వారన్నారు. మర్నాడు ఉదయం ఎనమండుగురు పద్యాలు చదివారు. ఆ సాయంత్రం నేను కవిగారికి సభలోంచే నమస్కరించి, ఇంటికి వచ్చేశాను. చదివిన ముప్ఫైమందిలోనూ నలుగురైదుగురి గొంతిగలు శ్రావ్యంగా ఉండ డంవల్ల వాళ్ళది అఖండకవిత్వం అని స్థాపించడానికి సభ్యులు కర తాళాలు వేశారు, తక్కినవాళ్ళని కూసేసి నోరుమూసేశారు. కాని, ఆ ముప్ఫైమందిలోనూ ప్రతిఒక్కడూ ప్రకటించదల్బుగున్నది భావ రూపంలో పెడితే ఇల్లా ఉంటుంది :
కవి యంటే యితడే కవి
కవులా మరి తక్కినట్టి గణగణ గంటల్
భువి నిలుచు నితని కవనము
రవిచంద్రులతోటిపాటె రభసం బెసగన్ ॥
ఈయన బోలెడు వ్రాసెను
వ్రాయగనున్నాడు చాల వడిగా నికపై
ఓ యజహరిహరులారా
ఆయువు నారోగ్య మొసగి అరయుం డితనిన్ II
వేలాది పుటల్లో అచ్చుపడిఉన్న కవిరచనయొక్క మొహం
చూడకుండానే, ఎవరికేనాసరే కట్టబెట్టడానికి అనుకూలించే పైరకం
ఉమ్మడి భావాలవంటివి ఏ సీసాల్లోనో బిగించి తెచ్చినవాళ్ళందరికీ,
వాళ్ళు అవే అయిదారు భిన్నసందర్భాల్లో ప్రయోగిస్తూన్నట్టు తెలి
సినాకుడా, అట్టే పెట్టుబడి లేకుండా కవిబిరుదు సుసాధ్యం చెయ్యడానికి
నడుంకట్టే ఆంధ్రమహాశయులు తక్కువగా ఉండరుగనక, పద్యరూపం
వల్ల నేటి ప్రయోజనాలలో ఇది ముఖ్యం అనవచ్చు. స్వభావసిద్ధమైన
వచనం రచించడం కొందరికి రాదుట, అందువల్ల పద్యం రాయడానికి
వాళ్ళు అర్హులుట! ఆ మాట వాళ్ళు తెగేసి నిర్మొహమాటంగా పైకి చెబుతున్నాసరే, వాళ్ళని వినిపించుగోక, 'ఊరుకుందురూ, మీ మొహ
మాటమూ మీరూనూ ! మీ కవిత్వం బహు చక్కగా నిర్దుష్టంగా
ఉంది ! ధార బాగుంది!' అంటూ, మాహాత్మ్యం దర్శనం ఇస్తూంటే
కళ్ళు మూసుగోడం పాపకారణం అవుతుందేమో అని భయపడు
తూన్నట్టు కొందరు తక్షణం తమ కవితానిర్ణయసామర్ధ్యానికి దాఖలా
కనపరిచేస్తారు. గ్రంధరూపంలో కాక ఇతరత్రా జనబాహుళ్యానికి
పద్యం కంటపడేసందర్భం ఇది ఒకటే కాదు. ఇంకా చాలా ఉన్నాయి.
ఆయా సందర్భాలలో భాషాడంబరమూ ఇతరపటాటోపమూ పక్కకి
నెట్టి భావరూపం చూస్తే ఎట్లా ఉండగలదో నేనే ఆయా రచయిత
ననుకుని నమోనాలు ఇస్తున్నాను.
స్వాగతపత్రంలో :
మీ సాటి మనిషి లే డిల,
మా సుస్వాగతము మీకు, ప్రతిభాశాలీ!
శ్రీశుడు మిము రక్షించును,
దాసులమగు మాకు కాస్త దాన మొసగరా !
వీడ్కోలు పత్రంలో :
మానుండి మీరు దూరము
పోనున్నా, రనుచు మాకు బోలెడు దుఃఖం
బును, జీతము హెచ్చును మీ
కని బోలెడు సంతసమును గలిగెనుజుండీ.
పత్రిక ప్రత్యేకస్థలంలో :
ఏదో మిధునం బుండెను,
ఏదో యొక బాధ వారి యెదలో, కాదా
ఏదో ఆకలి, లేదా
ఏదో యొక అగ్ని, యుండె ఇది యిదమిత్థం !
మా పిల్లకి పెళ్ళి, ముహూ
ర్తపు వేళ ఫలాన, గనక తప్పక మీరం
తా పిల్లామేకా వ
చ్చి, పెళ్లి కార్యము చెయించి శీఘ్రము చనుడీ
దంపతుల్ని ఆశీర్వదించడంలో :
ఈ దంపతు లిద్దర్నీ
ఆ దేవుడు కనికరించి ఆయువు సిరి సం
పద ఆరోగ్యము సంతతి
మొదలైనవి కలగజేసి పోషించవలెన్.
మందుల ఘోషణలో :
ఈ మందు వాడిచూస్తే
ఏ మందును నచ్చదింక ఏమాత్రమునున్
ఈ మందే ఈమందురు
ఏమందుము దీని మహిమ యిహ పరములలో.
ఒక పత్రికని మెచ్చడంలో:
ఈ పత్రిక బహుగొప్పది
యే పత్రిక కింత వ్యాప్తి యింటా బయటా ?
తాపత్రయ మడగించును
చాపత్రయ మంతయున్న చాలా చౌకే.
నాకే మీ ఓ టది నా
కీకుండా పట్టిగెళ్ళి యెదిరికి వేస్తే
మీ కర్మంకాలగలదు
నాకే అది కట్టబెట్టి నరులై మనుడీ
పాఠ్యపుస్తకంలో :
గుఱ్ఱము బండిని లాగును
గుఱ్ఱము తిను పచ్చగడ్డి కుఱ్ఱలు వినుడీ
గుఱ్ఱము నడకలు నడచును
గుఱ్ఱము మడి దున్నగలదు కొండొక సీమన్
కొత్త ప్రచారంలో :
తిన తిండి, కట్ట బట్టయు,
మనగా నొక కొంప, పండ మంచము కరవై
జనులుండ, ధనికులకు, భో
జనవసనాగారతల్పసౌఖ్యములేలా ?
ప్రేమరచనలో :
నీమీద నాకు ప్రేమము,
నామీదను ప్రేమ నీకు నని తెలిసెగదా !
కోమలమగు మన ప్రేమను
ప్రేమింపరె యితరజనులు, ప్రేమరహితులా ?
గ్రంధేతరంగా తెలుగుపద్యాలు తెలుగుజనానికి కంటి సంపర్కం
కలిగించగల సందర్భాలు కొన్ని చూశాం. మరి, తెలుగుపద్యాలు
తెలుగుజనంయొక్క చెవినిబడే సందర్భాలు గమనించుదాం. పురాణ పఠనంలో వినిపిస్తాయి. పఠిత గద్యపద్యాలు సాధారణంగా ఒకే రాగం
విూద గబగబలాడించగా, వాటిని బీజప్రాయంగా గణించి పౌరాణి
కుడు చిలవలూ పలవలూతోసహా వ్యాఖ్యానవృక్షం లేవదీస్తాడు.
సభ్యులు పఠితరాగం వల్లా పౌరాణికుడి ధోరణివల్లా ఆనందం పొందు
తారు. హరిదాసు నోటంట పద్యాలు వినిపిస్తాయి. అవే కాదు,
వచనమే కాదు, పిట్టకథలుకుడా అతడు పాడేసి తరువాత వ్యాఖ్యానం
చేసి కావలిస్తే మరోసారి పాడతాడు. కవినోటంట పద్యాలు వినపడ
తాయి. అతడి నోటితోపాటు గాత్రంకుడా బాగుండి రాగం విసరడం
నేర్చాడా కోటలో పాగా వేశాడన్నమాటే. అతణ్ణి జనం అనుకరించే
స్తారు. ఒక్కొక్క కవి మంచి గాత్రం పెట్టిపుట్టకపోయినా, తన కొత్త
భావానికి ఏ ఆనకట్టుపూర్వపు రాగమో సంధించి, తంటాలు పడ
బోతాడు, శ్రోతలు ఏమీ అనలేక బాధతో కాలం వెళ్ళబుచ్చుగుం
టారు. మరొకక్క కవి యతిప్రాసలదగ్గిర నొక్కుతూ పాదాంతాల్ని
మకాంవేస్తూ పద్యాన్ని శల్యపరీక్షకి పెట్టినట్టు వ్యవహరిస్తాడు.
భట్రాజుకుడా పద్యోచ్చారణ చేస్తాడు. అతడు రాగం కలపకుండానే,
తరుముకూత పట్టినట్టు పద్యాల్లో చెడుగుడి ఆడేస్తాడు. భోజన
కాలంలో పద్యాలు అంటారు. సంస్కృతశ్లోకాలు ఫణితిప్రకారం
గానూ, తెలుగుపద్యాలు యథాశక్తి రాగవిజృంభణతోనూ కాని
స్తారు. అందునిమిత్తం తయారైన అనుభవజ్ఞు లుంటారు. వాళ్ళల్లో
ఒక్కొక్కప్పుడు పోటాపోటీ జరుగుతుంది, తిన్నది సర్దుకునేలాగ
భోజనసభ్యులు అరుస్తూంటారు. రైల్లో రెండుమూడు రకాలుగా
పద్యాలు వినిపిస్తూంటాయి. కొందరు ఒఠ్ఠిపుణ్యానికి, ఎవరేనా ఆకర్షింప
బడకపోతారా అనుకుని, ఈలతో మొదలెట్టి, ఏదో రాగంలోపడి
కొన్నిముక్కలుకుడా అనేస్తారు. కొందరు, ఏ అణాపద్యాల పున్త
కమో, పావలా ప్రబంధమో కొని, కాలాన్నిబట్టి మోజుగాఉన్న రాగంతో పద్యాల్ని నమిలిపారేస్తుంటారు. ఏ గ్రామొఫోనురికార్డు
పద్యాన్నో అనుకరిస్తూ రాగంతీసే యాచకుడు ఉండగలడు. స్నేహి
తులు చేరుకున్నప్పుడు మంచిగాత్రంవాడిచేత సరికొత్తపాటలతోపాటు,
సరికొత్త రికార్డుపద్యాలు పాడిస్తారు. క్లాసుల్లో తెలుగుపద్యాలు అప్ప
గించవలిసొచ్చినప్పుడు పాడితేతప్ప మంచిమార్కులు వెయ్యరుగనక,
అందరూ పద్యాలు పాడడం వినిపిస్తుంది. ఒక్కొక్క ఉపన్యాసకుడు
ఉపన్యాసమధ్యంలో ఏ పద్యభాగమో అనవలసిన గండం తెచ్చుగుని,
అక్ష పాడలేక మానాలేక నానాయిదీ అవుతాడు. అతడు ఎంత
ఉత్కృష్టపద్యం స్మరించదల్చుకున్నాసరే, సుబ్బరంగా పాడగలిగితే
తప్ప, సభ్యులు ఆ కవిత్వానికి ఓటూ ఇయ్యరు, ఉపన్యాసకుణ్ణి
క్షమించా క్షమించరు.