Jump to content

ఆంధ్రనాటక పద్యపఠనం/పద్యం-రాగం

వికీసోర్స్ నుండి

6. పద్యం - రాగం

పద్యరాగాల వ్యక్తి త్వాలు పోల్చినప్పుడు వ్యత్యాసాలే ఎక్కు వగా కనిపిస్తాయి. పద్యరాగాలు రెండూ నాదజనకాలే. రెండూ చెవికి సంబంధించిన కళలే. పద్యానికి పదాలున్నట్టు, రాగానికి స్వరా లుంటాయి. పద్యపదాల అర్ధం తెలిసి, పద్యభావం తెలిసి రసోత్పత్తి కావాలి ; రాగస్వరాల అర్ధం తెలియకపోయినా రాగభావం ఏదో అయినా, రసోత్పత్తి అవుతుంది. 'ఏకమ్' (సంగీతం) ఆపాతమధురమ్ అన్యద్ (సాహిత్యమ్) ఆలోచనామృతమ్' అనే భావం అందువల్ల నే పుట్టిఉంటుంది. పదాలూ పదమిశ్రణాలూ అమితం అయినట్టే స్వరాలూ స్వరమిశ్రణాలూ కుడా అమితమే. పద్యంలో వర్ణనాదం యొక్క హ్రస్వత్వ దీర్ఘత్ర్యాలుమాత్రమే గణింపబడతాయి రాగంలో నాదంయొక్క పొట్టి పొడుగులేకాక హెచ్చు తగ్గులు కుడా గమనిం చాలి. పద్య పదాలలో 'యమకం' ఉన్నట్టే రాగస్వరాల్లో 'గమకం' ఉండవచ్చు. కొన్ని కొన్ని వర్ణాల సాహచర్యం వల్ల పద్యంలో నాదసౌఖ్యం కలిగినట్టే, కొన్ని కొన్ని స్వరాల సాహచర్యంవల్ల రాగంలోనూ తానంలోనూ నాద సౌఖ్యం జనిస్తుంది. స్వరగమనంలో ఆరోహణ అవరోహణలనే ముందు వెనక నడక లుండబట్టి నాదం విహరించి విహరించి అళంగుకి వచ్చేస్తుంది. పద్యగమనం ఒకే దిశలోముందుకి పోతుందిగాని వెనకనడక నడవదు. (పింగళి సూరన వెనక్కికూడా సార్థకంగా నడిపించిన పద్యం


తా వినువారికి సరవిగ
భావనతోనాను నతివిభా వి సుతేజా
దేవర గౌరవ మహిమన
మా వలసిన కవిత మరిగి మాకు నధీశా

తప్ప, ఆంధ్రసారస్వతంలో మరొకటి ఎదీ నేను చూడలేదు).

పద్యపదాలకి అర్ధా లుంటాయిగనక అవగాహనకి అభినయం దోహ దకరం, కాని రాగస్వరాలకి అర్ధాలంటూ ఉండవుగనక అవగాహనే ఉండదు గనక అభినయం అనర్ధకం. పద్యభావం గ్రహించడానికి కొంచెమైనా బుర్ర ప్రయోగించవలిసి ఉంటుంది, అధమం శ్రద్ధేనా పెట్టవలిసి ఉంటుంది. రాగభావం అవ్యక్తంగనక అవగాహనకి కొంచెం మేధాకుడా ఖర్చు పెట్టక్కర్లేదు, శ్రద్ధయొక్క పనికుడా లేదు, హృదయం చాలు. పద్యంలోని శబ్దాలకి అక్షరరూపంలో స్థిరత్వం చేకూర్చడం సంభవనీయం గనకనున్నూ శబ్దాలు అర్ధవంతం గనకనున్నూ ఒక పద్యకర్తయొక్క పద్యం ఒకడు తీసిగెళ్ళి మరొక డితో ముచ్చటించడానికి వీలుంది. కాని, రాగస్వరాలు అర్ధానికి అతీ తంగనకనున్నూ, స్వరజీవితం కేవలవ్య క్తిసహజమైన గాత్రధర్మాన్ని అనుసరించేది అవడంచేతనున్నూ క్షిణికమాత్రవ్యాపారం అవడం చేత నున్నూ వాటిని లిఖించడానికి ఎంత యత్నించినా, ఒక గాయకుడి యొక్క రాగం ఒకడు తీసిగెళ్ళి మరొకడితో వ్యవహరించడం అసం భవం - మహాఅయితే ఆ రాగంపేరు ఆ మరొకడితో చెప్పవచ్చు. గాత్ర ధర్మంయొక్క బదలాయింపు జరగదుగనక, ఎవరి రాగం వారే అనాలిగాని, మరొకడు అనలేడు. పైగా, రాగానికి జననంలోనే యౌవనం జననంలోనే మరణంకూడా ఉంటాయిగనక, మరొకడిమాట అల్లాఉంచి, అసలువాడైనాసరే అనేసింది మళ్ళీ అనలేడు. సంభాషణ ప్రకృతిసిద్ధంగనక, పద్యోచ్చారణ సంభాషణ సంప్రదాయానికి విరు ద్ధంగా ఉండకూడదు గనక, విరుపులూ ఆపులూ విరామాలూ నొక్కులూ వేగాలూ మొదలైనవి అందులో ఉంటాయి. రాగం స్వరప్రవాహంగనక అవిచ్ఛిన్నం. పద్యం శబ్ద ప్రమేయమున్నూ నోటి వ్యాపారమున్నూగనక దాని పఠనం స్పష్టత ఉద్దేశించాలి. రాగం స్వరప్రమేయమున్నూ గాత్రవ్యాపారమున్నూ గనక, అది జరిగేటప్పుడు మాటస్పష్టత ఉంటూండదని బాధపడడం అనవసరం.