అశోకుడు/పండ్రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పండ్రెండవ ప్రకరణము


గృహ సమాచారము

అశోకుఁ డజ్జయినీ నగరమునం దుండి యవంతీ మండలమున సుఖ శాంతివిధానము లాచరించుచుఁ బరమానందమునఁ గాల క్షేపము చేయుచుండెను. అతని కచ్చటనున్న ప్పుడే తా నభ్యసించిన రాజనీతి కౌశల్యమును గార్యరూపమున నుపయోగించుకొనుట కవకాశము దొరకెను.

ఆతఁ డచ్చటనున్న కాలమునం దిచ్చటఁ బాటలీవుత్రమునందు స్థితిగతు లంత బాగుగ లేవు. ఆ రాజాస్థానమునఁ జిరకాలమునుండియు న్యాయసభ యొకటి యుండుటయు దానిమూలమున నే మహారాజు రాజ్య కార్యములం దీర్చుచుండుటయు జరుగుచుండెను. సార్వభౌముఁడగు బిందుసారు(డుకూడ నీనియమము నతిక్రమించి యుండ లేదు. ఆ సభాలోచనలను బట్టియే మగధ రాజ్యము వివిధ భాగములుగ విడఁదీయఁబడుటవలన నున్నతోద్యోగుల సంఖ్య యధిక

మయ్యెను. ఆ యుద్యోగు లందఱునుగూడ నాపరి పాలనా సభకు సభ్యులుగ నే యుండిరి. చంద్రగుప్తుని ప్రభుత్వ సమయమునం దిట్టినభ్యు లైదువందలమంది యున్నట్లు చున్నది. బిందుసారుఁడుకూడ వారి యాలోచనల ననుస

42

అశో కుఁడు

రించియే రాజ్యమును బరిపాలించుచుండెను. ఆ రాజసభామధ్యమున రాధాగుప్తుడు మంత్రియై యుండెను. ఖల్లాతకుఁడు ప్రధానమంత్రి కాకపోయినను నాతని ప్రభావ మెల్ల

విషయములయందును నిరాఘాటముగఁ గొనసాగుచుండెను, రాజోద్యోగులందజు నాతని మిగుల గౌరవించుచుండిరి. అశోకుఁడు తక్షశిలకు ఁ బోయిన కాలమున యువరాజగు సుషీముఁడు ప్రవీణుఁడగు నా ఖిల్లాతకుని జాల నగౌరవముగఁ జూచెను, రాజ్యమునకు భవిష్యత్ప్రభుఁడు కాఁదగిన యా యువరాజు నడవడి యందఱకు నసంతుష్టిని గల్పించెను, అందఱును క్షుణహృదయులై భయపడుచుండిరి. యువరాజగు సుషీముని ధూర్తత్వమును జూచి మంత్రియగు రాధాగుప్తుఁడు మిగుల విరక్తుఁ డయ్యెను. అప్పటినుండియుఁ గ్రమక్రమముగ నారాజస భాసభ్యు లందఱును యువ రాజు నెడల నసంతుష్టు లై పోయిరి. పిమ్మట నశోకుఁడు తక్షశిల యందు శాంతిని నెలకొల్పి మరలివచ్చెను. అప్పు డాతఁడు తన జనకుని యొద్దఁ గల యున్నతోద్యోగుల నందఱను సన్మానించెను. అప్పుడు రాధాగుప్తుఁడును ఖిల్లాతకుఁడును గూడ నెల్ల విధముల యువ రాజుకంటె నశోకుఁడే యోగ్యతముఁడని నిశ్చయించుకొనిరి. రాజసభలోని చాల మంది సభ్యుల సమాదరవిశ్వాసములు క్రమక్రమముగ నశోకుని వంక కే ప్రసరింపసాగెను; సుషీమునియందలి విర క్తియు నశోకునియందలి యనురాగమును దినదినాభివృద్ధి నందు

పండ్రెండవ ప్రకరణము

43

చుండెను. సుషీముఁడు యువ రాజును జనకునకుఁ బ్రియపుత్రుఁడునుగూడ నై యుండెను. అయినను నశోకునిపక్షము ననే యున్నతోద్యోగుల యనురాగము ప్రబలతమమై యుండెను.

రాజధానియందలి యున్నతోద్యోగుల భావము లీవిధముగఁ బరిణమించు కాలమునందే యువరాజగు సుషీముఁడును నశోకుఁడునుగూడ నచ్చట లేకయుండిరి. అప్పుడు సుషీముఁడు తక్షశిలయందును నశోకుఁ డుజ్జయినియందు నుండిరి. ఈ సమయము నందే యాకస్మికముగ మహారాజగు బిందుసారుఁడు వ్యాధిపీడితుఁ డయ్యెను. ఆ వ్యాధి క్రమక్రమముగ వర్దిల్లు చుండెను. అప్పుడు మహారాజు యువ రాజగు సుషీముని బిల్పింపవలయు నని యాజ్ఞాపించెను. మహారాజు స్వస్థుఁడైయున్నను నస్వస్థుఁడై యున్నను నాతఁ డెప్పుడును గార్యాచరణవిషయంబునఁ బర ముఖా పేక్ష కలవాఁడే యై యుండెను. ప్రభుఁడగు బిందుసారుని యాజ్ఞ యధావిధిగఁ బరిపాలింపఁ బడినమాట సత్యమే— కాని, యాతని యభిప్రాయము మాత్రము సిద్ధించినది కాదు. రాధాగుప్తు ఁ డింతకుముందుగ నే బయలు దేరి రావలయు నని యశోకునకు వార్త నంపియుండెను. ఇప్పుడుకూడ నుద్యోగ పద్ధతి ననుసరించి సుషీమునకును మరల నశోకునకునుగూడ సమాచారము నంపించెను—— అప్పటికే మహారాజు వ్యాధి ముదిరిపోయినది. ఆరోగ్యము కలుగుననునాశ యతిస్వల్పము——