అశోకుడు/పదుమూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదుమూఁడవ ప్రకరణము


రాజ్యలాభము

మహా రాజగు బిందుసారుఁ డేబదివత్సరములు రాజ్యము చేసి క్రీ. పూ. 272 వ సంవత్సరమునందుఁ బరలోక గతుండయ్యెను. అప్పుడు మగధరాజ్య సింహాసనము శూన్యమై యుండెను. ఆతఁడు తన యనంతరమునందుఁ దన ప్రియ పుత్రుఁడగు సుషీముఁడే తనసింహాసనము నధిష్ఠింపఁగలఁ డనితలంచి యుండెను. ఇట్టియాశ చేత నే యాతఁడు తాను రోగశయ్య యందున్నప్పుడు తనకుమారుని దక్షశిలనుండి పిలిపింపవలయునని యాజ్ఞాపించి యున్నాడు. అప్పటియాతనియాజ్ఞ సరిగ నే పరిపాలింపఁబడినది; కాని యాతని యాశమాత్రము ఫలియించినది కాదు. ఎందులకు ఫలియింప లేదో యాసంగతి నిదివఱకే చెప్పియున్నారము, రాధాగుప్తు నిగూఢతంత్రము చే నశోకునకుఁ దన తండ్రి వ్యాధి గ్రస్తుడై యుండె ననుసంగతి ముందుగ నే తెలియవచ్చెను. ఆవార్త విన్న తోడ నే యశోకుఁడు తటి ద్వేగమున నుజ్జయినినుండి సాటలీపుత్రమునకు వచ్చియుండెను. కాని యాతని కప్పుడు జనక సందర్శన

భాగ్యము లభియింప లేదు, శూన్యమైయున్న పితృసింహాసనమునుమాత్ర మాతఁడు దర్శించెను.

పదుమూఁడవ ప్రకరణము

45

రాధాగు ప్తఖల్లాతక ప్రముఖు లగు రాజసభాసభ్యులందఱు నేక గ్రీవముగ నిదివఱకే నిశ్చయించుకొని యుండుటచే వారందఱును గలసి యప్పుడే మగధ రాజ్యమున కశోకుని రాజుగఁ జేసి వైచిరి. బిందుసారునియనంతరమున నాతని ప్రియతమసతీరత్నమగు సుభద్రాంగి కుమారుఁ డశోకుఁడే యావిశాల మగధ రాజ్యమునకు మహిమాన్వితుఁ డగుమహా రాజచంద్రుఁ డయ్యెను— ఈయుత్సాహవార్త రాజ్యమునందంతటను బ్రక టింపఁబడియెను.

ఇట సుషీముఁడును నిశ్చింతుఁ డై యుండ లేదు. జనకుని కష్ట వార్త విన్న తోడనే యాతఁడును సాధ్యమైనంతవఱకు శీఘ్ర ప్రయాణములు చేసి స్వదేశమునకు వచ్చియుండెను. తోడనే మంత్రు లందఱును గలసి మగధరాజ్యమున కశోకునే రాజుగ నెన్నుకొని రనుసంగతి యాతని చెవులఁ బడియెను. బాహుబలముచే రాజధాని నాక్రమించుకొని పితృసింహాసనము నధిష్టించుటకంటె నాతని కిఁక గత్యంతర మేమియు లేదు. ఆ కారణమున నాతఁ డధిక సంఖ్యాక సైన్యముం గూర్చుకొని ససైన్యముగఁ బాటలీపుత్రసమిపమునకు వచ్చి విడిసెను. చిర కాలము క్రిందటఁ బాటలీపుత్రము ప్రాకార పరిఖా ద్వారములచే సురక్షితమై యుండెను. అశోకుని సేనానాయకు లింతకుముందే ప్రాకారమునకుఁ జుట్టునున్న యగాధమగునగడ్తను జలశూన్యముగఁ జేసి తుపాకిమందు కసవు మొదలగువానితోఁ గప్పివై చి యుండిరి. జసశూన్యంబును దృణశోభితంబును నగునా పరిఖం

46

అ శో కుఁ డు

గాంచి సుషీముఁ దానందోత్ఫుల్ల హృదయుఁ డయ్యెను. పరిభా నిరోధము లేకుండుట చే నెటులయినఁ బ్రాకారమును బగుల గొట్టియో, లంఘించి యో ససైన్యముగ నగరమధ్యమునం దనాయాసముగఁ బ్రవేశింపవచ్చునుగదా యని యాతఁ డాశ పడియెను. ఇట్టియాశ చేత నే యాతఁ డతి వేగముగ సేనల నడిపించుకొని ప్రాకార సమీపమునకు వచ్చి నిలిచెను.

అశోకునిదండనాయకు లిది యంతయును గను పెట్టి చూచుచు నే యుండిరి, మహారణకుశలు రగువారియు పాయము ఫలించినది. సుషీముఁడు ససై న్యముగఁ బ్రాకారమునకు నగడ్తకును మధ్య భాగమునఁ బ్రవేశించి యుండెను. పంచాననము ప్రబలకిరాతునివలలోఁ దగులుకొన్నది. సుషీముఁడు ససైన్యముగ నట్లుండుటం గాంచి యశోకుని సైనికు లాపరిఖయందలి మందునకు నిప్పు ముట్టించిరి. మఱియుఁ బ్రాకారముల పై నుండి నిరంతర బాణవర్షమునుగురియింప సాగిరి. సుషీముఁడు తా నెన్నఁడుఁ గలలో నైన ననుకొనియుండనిపన్నాగమునం బడి ససై న్యముగ నిహతుఁడై పోయెను.

అశోకుని సౌభాగ్యమార్గమున కడ్డముగనున్న కంటక వృక్ష మీవిధముగఁ బెల్ల గింపఁబడిపోయెను.

నవీనుఁ డగు రాజు—ప్రవీణులగుమంత్రులు_రణనీతికుశలు రగుదండనాయకులు — వీరందఱును యుద్ధానంతరమున నొక్కచోఁ గలిసికొనిరి; ఒక్కటేమాటగ మెలంగు

పదునాలుగవ ప్రకరణము

47

చుండిరి! ఒక్క టేశరీరముగ భావించుకొనుచుండిరి. ఇఁకనట్టి రాజ్యమునకుఁ గొదవ యేమున్నది ? అశోకున కప్పటికిని భ్రాతృసంబంధశత్రుత్వము నిశ్శేషము కాలేదు. అశోకుఁడు కేవలము తదేక దృష్టితో విద్రోహులగుసోదరులను సపరివారముగ నశింపఁ జేయుటకై ప్రయత్నించుచు నే యుండెను. ఇట్టికల్లోలములచే నశోకునకుఁ బితృసింహాసనము లభించినను బట్టాభి షేకము జరుగుట కాలస్యము కావలసివచ్చెను——


పదునాలుగవ ప్రకరణము


రక్తప్రవాహము

అశోకునకు సర్వరాజ్యమును లభియించినది. ఆతని ముఖ్యశత్రువులు నిహతులై పోయిన సంగతియు సత్యమే. కాని యాతనికంతమాత్రమున నిశ్చింతుఁడై యుండుట కవకాశము కలుగ లేదు. పూర్వమునుండియు రాజ్యమునందలి ప్రజలును రాజోద్యోగులును రెండుపక్ష ములుగ నేర్పడియుండిరి. కొందఱశోకునిపకక్ష మువారుగను, మణికొందఱు సుషీమునిపక్షము వారుగనునుండిరి. అశోకునిపక్షమువారు ప్రజ లేయయ్యును గొలఁదిమందిమాత్ర మేయుండిరి. ప్రజాసామాన్యమునఁ జాలమంది. సుషీనునిపక్షము వారే యైయుండిరి. మానవలోక