Jump to content

అశోకుడు/పదునొకండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునొకండవ ప్రకరణము

37

యుండిరి. తరువాత నాతనిదయార్ద్రహృదయమున, దదను కూలవ్యవహారములను గాంచి తమకు క్షేమలాభములం గల్పిం చెద నని చెప్పిన సమాదర శీతలంబు లగు సాంత్వన వచనంబుల నాలకించి ప్రజాగణమంతయు శాంత భావమును వహించి యుండెను. అశోకునియాత్ర సఫలమైనది. పిత్రాజ్ఞాపరి పాలన మైనది.


పదునొకండవ ప్రకరణము


గుణాదరము

అశోకుఁడు తక్ష శిలయందు శాంతి స్థాపనము చేసి రాజధానికి మరలివచ్చెను. పదియాఱేడుల బాలకుఁ డగునా రాజు! కుమారుఁ డొక్కఁడును బోయి ప్రౌడులగువారికిఁగూడ నతి దుష్కరంబగు మహత్కార్యమును సర్వశ్రేయస్సంపన్నముగ నేఱ వేర్చుకొని వచ్చెను. మహారాజగు బిందుసారుఁ డింత, కాలము వఱకును గురూపి యనియు, వికారాకారుఁ డనియుఁ దలంచి యశోకుని జూచుటకుఁ గూడ నసహ్యపడుచుండెను, తక్ష శిలయందు శాంతిని నెలకొల్పుటకై పోయినయశోకున కచ్చట నేవిషమసంకటమున నైనఁబడి మరణించుటయే తటసించిన యెడల నది మహారాజునకు దుఃఖదాయక మే యగునో

38

అ శో కుఁ డు

ముఱి యేమగునో మే మెంతమాత్రము నూహలవలన నిర్దేశింపఁ కాలము, అప్పు డేమగునో చెప్పఁ జాలము కాని, పిత్రాజ్ఞా పరిపాలన తత్పరత సాహసము, నీతికుశలత మొదలగు రాజ కులోచిత సద్గుణగణంబులన్నియు నశోకునియందు మూర్తీభవించియున్నట్లు పొడకట్టుట చే నిప్పుడు మహారా జాతని యెడలఁ బరమాదర భావము నే సూచింపఁదొడంగెను.

ఆ సమయమునకు సరిగ నుజ్జయనీ మండలమును బ్రజానుకూలముగఁ బరిపాలించుటకుఁ దగినసమర్థు డగు రాజప్రతినిధి నొకని నియమించుట యావశ్యక మయ్యెను. ఎంతటి సమర్థు లైనను దనయుద్యోగి జనులయందింతటి మహోన్నత కార్యభారమును బెట్టుటకు మహా రాజున కిష్టము లేక పోయెను. ప్రకృతమునం దశోకుడు సకల సద్గుణగరిష్టుండనియు, నసామాన్య ప్రతిభాశాలియనియు ననుభవమునం దోఁచుటచే సార్వభౌముఁ డగుబిందుసారుఁడు బాగుగ నాలోచించి యవంతీమం డలరాజప్రతినిధి పదంబున కశోక కుమారుఁడే యర్హుఁడని నిశ్చయించి యావిధముగ నియోగించి యాతని నచ్చటికిఁ బంపిం చెను.

ఇందూరునకు సమీపమున నవంతీనగర నామ మెల్ల వారికిని బరిచిత మైనదియే. స్థలమాహాత్మ్యము చే నిప్పటికినా పవిత్రనామము సుప్రసిద్ధముగ నే యున్నది——

"అయోధ్యా, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతికా
పురీ ద్వారావతీ చైవ, సప్తెతా మోక్ష దాయి కాః !! "

పదునొకండవ ప్రకరణము

39

అనువిషయము సకల భారత జనసమీచీనమైయున్నది. అవంతీ స్థానమున కాధునిక నామము మాళవ్యము. అవంతీ మండలమునకు రాజధాని యుజ్జయినీ నగరము. మహాకవియుగు కాళిదాసు డాయుజ్జయినీ నగర నామమున కమరత్వమును బ్రసాదించి యున్నాఁడు. విక్రమాదిత్యుని యుజ్జయినీ నగరమునందలి సుధాధవళంబు లగుసుందర సౌధమాలికలును, నలోక 'సామాన్యరూపలావణ్య విలాసవతు లగుపుర పురంద్రీమణుల విలాసవిభ్రమలీలారంగంబు లగురమ్య ప్రమోదా రామంబులును నిప్పు డేమైపోయినవి? అవి యన్నియును గాలవాహినీగర్భమునం గలసిపోయినవి. కాని మహాకవిశిరోమణి యగు కాళిదాసుఁడు తన కావ్యము నందు మాత్రము వానికన్నిటికిని శాశ్వత జీవనమును గల్పించి యున్నాఁడు. ఆమహాకవిసార్వభౌముఁడు తన మేఘసందేశ మహా కావ్యమునందు శాపగ్రస్తుఁడగు యక్షుని చే నవనీరదముంగూర్చి “నీకించుకచుట్టు త్రోవయైనను నొకసారి యుజ్జయినీనగరమునకుఁ బోయి యాపుర విలాసమును గన్నుల కఱవుదీరఁగాంచి నీకన్నులకును జీవితమునకును సార్థక్యముం గూర్చుకొని మఱిపొమ్ము” అని చెప్పించియున్నాఁడు. సాహిత్య సంస్మరణమున కిప్పుడ ప్రస్తుతమే యైనను యథా సమయమున మానవీన పాఠకులకు మహాకవి శేఖరుం డగుకాళి

దాసుని మేఘసం దేశ మహా కావ్య నొక సారిపఠింపవలయు నని బోధించుట యసంగత కార్యము కాదని తలంచుచున్నారము.

40

అ శో కుఁ డు

అశోకుఁడు జనకునియానతిచే నాతనికిఁ బ్రతినిధియై యుజ్జయినీ పట్టణమునం దుండెను. ఆతఁ డారమణీయనగరము నందుండి మిగుల సమర్థతతో నవంతీమండల ప్రజావర్గము ననుకూల శాసనములతో బరిపాలించుచుండెను. అతని ధర్మశాసన సమయమునఁ బ్రజలలో నెట్టివిద్రోహములు గాని, "దేశమునం దెట్టి దుర్భిక్షములు గాని లేదు. ప్రజలు నిరంతర సంతుష్టులై యుండిరి. అతఁడును సుఖసంపూర్ణుఁ డయ్యెను. అశోకుని యౌవనమునందలి ప్రథమ భాగ మీ యుజ్జయినీ నగరమున నే గడచినది. ఆతఁ డా మండలమునందున్నప్పుడే విదిశానగరమునందలి యొక సుప్రసిద్ధవ ర్తకుని తనయను బరమరూపలావణ్యవతి యగుకన్యకను బెండ్లి యాడెను. నవయౌవనము, అప్రతిహతంబగు ప్రతాపమున రమణీయంబగు రాజధాని నగరము, విలాస విభ్రమలీలారం గంబులగు ప్రమోడో ద్యానములు, సకలసంపత్సమృద్ధంబగు రాజ్యము, సుఖసంతుష్టులగు ప్రజలు, రూపయౌవన సంపన్నయు, ననురక్తయునగు ధర్మపత్ని - అశోకున కన్నియును లభియించినవి. ఇవియన్నియును, లభించుటంబట్టియే: యశోకుఁ డుజ్జయినియం దున్నప్పుడు నిరంతరముఁ బరమానందముతో ఁ గాలమును సార్థకముగఁ జేసికొని యేనని చెప్పవచ్చును. గుణములయందలి యాదరము చేతనే తనతండ్రి రాజప్రతినిధిగఁ జేసి తన్నుజ్జయినీ నగరమునకుం బంపియుండెనని యశోకుఁడు భావించుకొనియెను.