అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు భాషా సాహిత్య సంపద

వికీసోర్స్ నుండి

ధారావాహిక

ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి 98481 23655


పడమటి గాలితో నివురు తొలగిన

తెలుగు భాషా సాహిత్య సంపద

భారతదేశం అనాదిగా సహజ జల సంపద, అటవీ సంపద, భూగర్భంలో దాగిన ఖనిజ సంపద మొదలయినవి పుష్కలంగా ఉన్న సంపన్న వనరులున్న నేల మనది. మన పూర్వికులు ఒక మాట అనేవారు. మనదేశంలో భూమిపైన ఎంత సంపద ఉందో దానికి వేలరెట్లు భూమిలో కోటానుకోట్ల సంవత్సరాల వరకూ నిక్షిప్తమైన తరగని సంపద ఉంది అనేవారు. అందుకేనేమో మన దేశం పైన ప్రపంచ దేశాలు దండెత్తి సహజ సంపదను యధోచితంగా దోచుకున్నారు. నిజానికి ఒకనాటి రోజుల్లో భారత దేశమంతా చిన్నిచిన్ని రాజ్యాలుగా సుభాలుగా, పరగణాలుగా, ప్రాంతాలుగా విభక్తమయి ఉండేది. బలవంతుడయిన రాజుకు చిన్నిచిన్ని రాజ్యాలు కప్పంకడుతూ జీవించేవాళ్ళు. క్రీస్తుపూర్వం రాజ్యం చేసిన చక్రవర్తులు, రాజులయిన అశోకుడు, చంద్రగుప్తమౌర్యుడు సముద్ర గుప్తుడు, బిందుసార, పుష్యమిత్ర శుంగుడు లాంటివాళ్ళు క్రీస్తుపూర్వం నాటి వాళ్ళు. క్రీస్తుశకంలో మహేంద్రవర్మ, స్కాందగుప్త, దంటిదుర్గ, శిముఖ, సింహ, విష్ణుగుప్త, చాళుక్య, శీకృష్ణదేవరాయ మొదలయిన రాజులెందరో పరిపాలించారన్నది చారిత్రక సత్యం.

ఈ నేపథ్యంలో భారతదేశంపై దండెత్తి మనపై రాజ్యం చేసిన తురుష్కులు, మహమ్మదీయులు, అరబ్బులు, మంగోలులు పాశ్చాత్య దేశాలయిన పోర్చుగీస్‌, డచ్‌, ఫ్రెంచ్ ఇంగ్లండ్‌ మొదలయిన ఈస్టిండియా కంపెనీలు భారతదేశాన్ని ఆక్రమించి వర్తక వాణిజ్య వ్యాపారాలు చేస్తూ మనగడ్డపై మనలను కూలీలుగా, బానిసలుగా, సేవకులుగా చేశారన్నది స్తవము కాని వాస్తవం. భారతదేశ సహజ సిద్దమైన సంస్కృతి సంప్రదాయాలతోపాటు ఇతర దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపుటలవాట్లు, పండుగలు, వినోదాలు, ఆటపాటలు, వస్త్రధారణ, భాషలో ఆదాన ప్రదానాలు వెుదలయినవన్నీ మనదేశీయ సంస్కృతిలో, సంప్రదాయాల్లో కలిసిపోయాయి. పాలకుల ప్రభావం పాలితులమీద ఉంటుందన్నమాట అక్షరాక్షరసత్యం. అన్ని రకాల ఆటుపోట్ల మధ్య మనకంటూ మిగిలిన సంస్కృతి, సంప్రదాయలు, చరిత్ర ఏదీ గ్రంథస్తం కాలేదు. దీనికిగాను కాళ్ళకు బలపాలు కట్టుకొని శ్రమించిన కల్నల్‌ కాలిన్‌ మెకంజీ (1754-1821) లాంటి వారికి చేదోడు వాదోడుగా నిలిచిన కావలి వెంకట బొర్రయ్య, కావలి వెంకట లక్ష్మయ్య, రామస్వామిల సహకారం మరువలేనిది. వీరిని కావలి సోదరులు అనేవారు. వీరిలో బొర్రయ్య జీవించింది 27 సంత్సరాలే అయినా (1776-1803) ఆంధ్రదేశం మాత్రమే కాకుండా భారత దేశమంతా బుణపడేటంత కృషి చేసి తరగని చారిత్రిక విషయ విజ్ఞాన సంపద మనకు అందించాడు.

కావలి వెంకట సుబ్బయ్య రెండో కుమారుడు కావలి వేంకట బొర్రయ్య పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసి 1776లో జన్మించారు. సగ్రామంలోని వీధిబడిలోనే విద్యాబ్యాసం ప్రారంభమయింది. పన్నెండేళ్ళు వచ్చేసరికి సంస్కృత కావ్యాలు అధ్యయనం చేయడంతోపాటు స్వంతగా సంస్కృత శ్లోకాలు అల్లడం నేర్చుకున్నాడు. సంస్కృతంతోపాటు ఉర్దూ తెలుగు నేర్చుకున్నాడు. పద్నాలుగో ఏట ఏలూరుకు తూర్పుగా ఉన్న కొత్తూరు జాగీర్‌దార్‌గారి కాజీగారి దగ్గర పారశీక, హిందూస్తానీ భాషలు నేర్చుకున్నాడు. బొర్రయ్య కున్న చురుకుదనం, అపారమేధాసంపత్తిని గుర్తించిన కాజీగారు ఆప్యాయంగా, ఆనందంగా అమిత శ్రద్దతో భాషల అధ్యయనంపై ఆసక్తిని కలిగించాడు.

బొర్రయ్యకు పద్నాలుగు ఏళ్ళు వచ్చేసరికి బందరులో మోర్గాన్‌ దొర నేతృత్వంలో ఉన్న ఇంగ్లీషు బడిలో అతికొద్దికాలంలోనే ఇంగ్లీషు చదవడం, రాయడం, మాట్లాడడం నేర్చుకున్నాడు. బొర్రయ్యకున్న ప్రావీణ్యం శ్రద్దను గమనించిన దొరలు కూడా బాగా ప్రోత్సహించారు. దీనికి తోడు బొర్రయ్య అన్న నారాయణప్ప, అప్పటికే కుంఫిణీ కొలువులో ఉద్యోగిగా ఉన్నాడు. నారాయణప్ప నమ్మకం గల సేవకుడిగా పేరుంది. అన్న నారాయణప్ప వినయం, విధేయత, విశ్వాసం, నమ్మకంగల కుంఫిణీ ఉద్యోగి అయినందువల్ల అన్నలాగే కుంఫిణీ ఉద్యోగం సంపాదించాలనే కోరిక కూడా బొొర్రయ్యకు ఉంది "పైగా ఆరోజుల్లో కుంఫిణీ ఉద్యోగి అంటే సమాజంలో ఎనలేని గౌరవ మర్యాదలుండేవి. అది గొప్ప హోదాగా భావించేవారు. అన్నగారి లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న బొర్రయ్య అంటే పైఅధికారులకు, అనాటి దొరలకు మంచి అభిప్రాయం ఉండేది. దేశీయ పటాలానికి అధికారిగా ఉన్న కర్నల్‌ పియర్స్‌ దొరకు బొర్రయ్య అభిమాన పాాత్రుడయ్యాడు. అందునా బహుభాషాప్రావీణ్యం ఉన్నందువల్ల పియర్స్‌ దొర ప్రోత్సాహం బొర్రయ్యకు లభించింది. పియర్స్‌ దొర సిఫారసుతోనే బొర్రయ్యకు బందరు పే మాస్టర్‌ కచేరిలో ఉమేదువారిగా చేరే అవకాశం కలిగింది. ఉమేదువారీ అంటే జీతంలేని తాత్కాలిక గుమాస్తా అని అనేవారు. ఇది ఒక రకంగా ఉద్యోగిగా చేరడానికి ముందు పనినేర్చుకునే విధానం. వారి ప్రవర్తన పనిని బట్టి ఉద్యోగం లభిస్తుంది. నేర్చుకునేకాలంలో వారి పనిసామర్థ్యం బట్టి కొద్ది జీతంతో మొదలయి పెద్దపెద్ద పదవుల వరకూ వెళ్ళగలిగేవారు. బొర్రయ్యసహజంగా నమ్మకస్తుడిగా, వినయ వివేకశీలిగా ఉన్నందువల్ల అనతి కాలంలోనే మంచి జీతానికి కుదిరాడు. రైటరు ఉద్యోగంలో చేరడం అంటే ఆరోజుల్లో గొప్ప ఉద్యోగమే. ఉద్యోగంలో ఆనుపానులన్నీ కరతలామలకం చేసుకున్నాడు. అది బొర్రయ్య భావి జీవితానికి ఎంతో మేలయింది. దొరల అభిమానానికి పాత్రుడయ్యాడు. అందువల్ల ఒంగోలు, మునగాల, కొండపల్లి కసుబాలలో ఉండే సైనిక దళాలకు జీతాలు బట్వాడా చేసే స్థాయికి ఎదిగాడు ఎంతో నమ్మకమైన వ్యక్తికి మాత్రమే వేలకు వేల వరహాలు ఇచ్చి బట్వాడా చేసే అవకాశం ఉండేది. ప్రతి పనీలోనూ నమ్మకంగా ఉండేవాడు. పని చిన్నదా పెద్దదా అని కాకుండా, యిచ్చిన పని నమ్మకంగా చేసేవాడు. అదే అతన్ని ఉన్నత శిఖరాలకు చేర్చింది.

ఈ నేపథ్యంలో బొర్రయ్య మాధవాయపాలెంలో ఉన్న డెంటుదొర దగ్గర రైటరుగా కుదిరాడు. ప్రతిభవున్నవాడు కేవలం రైటరుగా పనిచేయడం అన్న నారాయణప్పకు నచ్చలేదు. అందువల్ల మళ్ళీ పియర్స్‌ దొరవద్ద హెడ్‌ రైటర్‌గా నియమించే ఏర్పాటు చేశాడు. ఇదే బొర్రయ్య జీవితంలో పెద్ద మలుపు. ఒక ఏడాది తిరిగేలోగా కల్నల్‌ మెకంజీ బొర్రయ్య పనితీరు గమనించి తన కొలువులో హెడ్‌ ఇంటర్‌ ప్రెటర్‌గాను, ట్రాన్స్‌ లేటర్‌గా (అనువాదకుడి గా) తీసుకున్నాడు. అంతే బొర్రయ్య జీవితకాలం మెకంజీ దగ్గరే వివిధ హోదాల్లో పనిచేశాడు. మెకంజీతోపాటు బొర్రయ్య హైదరాబాదు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ భారతీయ భాషల్లో పరిచయం లేని సర్వే ఇంజనీర్లకు కుడి భుజమయి మన దేశీయ విజ్ఞానం గొప్పదనాన్ని ప్రదర్శించేవాడు. అదే బొర్రయ్యను శాసన లివి పరిష్కరించే విధంగా తీర్చిదిద్దింది. ఈ కాలంలోనే ప్రాచీన నాణాల సేకరణ, ప్రాచీన తాళపత్ర గ్రంథాల సేకరణ, భారతీయ భాషా విజ్ఞాన సంపద గుది కూర్చిన గ్రంథాలు సేకరించి ఒక సంస్థ ఏర్పాటు చేసే స్థాయి కలిగించాడు. ఈ కాలంలోనే మెకంజీ నేతృత్వంలో నేర్చుకున్న గణితశాస్త్రం, రేఖాశాస్త్రం, భూగోళశాస్త్రం, ఖగోళశాస్త్రం మొదలయిన వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అభ్యసించి ఆచరణలో పెట్టాడు. ఈ శిక్షణలోనే వివిధ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. అంతకుముందే మెకంజీ సేకరించిన తమిళ, కన్నడ, సంస్కృత శాసనాలను చదివి విపుల వ్యాఖ్యానాలు తయారు చేశాడు. ఈ అధ్యయనంలోనే భూగోళ పటాలు తయారు చేసే పద్దతి నేర్చుకుని అది కార్య రూపంలో చూపాడు. దీనికి ఓ కారణం ఉంది. హైదరాబాదు నుంచి మద్రాసుకు మెకంజీతో పాటు కాలినడకన బయలు దేరవలసి వచ్చింది. ఈ పర్యటనవల్ల దేశీయ పటాలు తయారు చేసే అవకాశం అనుభవం కలిగింది. మెకంజీ తన జ్జాన సంపత్తి అంతా బొర్రయ్యకున్న అపార మేధాసంపత్తిని జోడించి దక్షిణ భారతదేశ నిర్మాణ పట రచనకు పురికొలిపింది.

బొర్రయ్యకు మరో ప్రత్యక్ష అనుభవం కలిగింది. 1779లో రంగపట్టణం ముట్టడి సమయంలో దారి పొదవునా కలిగిన అనుభవాలు సన్నివేశాలు వివరణాత్మకంగా ఒక డైరీ రాశాడు. అన్నీ పద్యరూంలోనే రూపొందించాడు. 1777 మే 4వ తేదీనాడు టిప్పు రాజధాని అయిన శ్రీరంగ పట్టణం పతనాన్ని బొర్రయ్య స్పయంగా చూశాడు. శ్రీరంగ పట్టణం ముట్టడిని ఆనాటి బీభత్స దృశ్యాలన్నింటినీ పద్యాలతో ఆవేశపూరితంగా వర్ణించాడు. బ్రిటీషు వారు టిప్పుసుల్తాన్‌ మృతదేహం కళ్ళారా చూచేవరకూ శ్రీరంగ పట్టణం తమ వశమయిందని నమ్మలేకపోయారు. రెపరెపలాడే బ్రిటీష్‌ పతాకం జాక్‌ కోట బురుజుల మీద ఎగరటాన్ని కవితగా వర్ణించాడు. బొర్రయ్య రచనల్లో ఇది చెప్పుకోదగినది. 1799 నాటికి అచ్చయింది. సర్‌ ఆర్దర్‌ వెల్లస్లీ 1800లో ధుండే అనే మహారాష్ట్ర నాయకునితో చేసిన పోరాటాన్ని ఒక కావ్యంగా రాశాడు. బొర్రయ్య రచనల్లో శ్రీరంగ చరిత్రము, శ్రీరంగరాజా వంశావళి, యాదవరాజ వంశావళి, కాంచీపుర మహత్యము, నూరు శ్లోకాలున్న సత్పురుష వర్ణనము అనే సంస్కృత శతకం మొదలయినవి ముఖ్యంగా కన్పీస్తున్నాయి.

బొర్రయ్య పర్యటించే ప్రతిచోట ప్రాచీన నాణాలు సేకరించేవాడు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రాచీన శాసనాల ప్రతిబింబాలు తీసి అవనరమైనచోట అనువదించి మెకంజీకి యిచ్చేవాడు. శ్రీరంగపట్టణం ముట్టడి తర్వాత ఒక హళె కన్నడ శాసనాన్ని చదివి అప్పటికప్పుడు అర్ధం చెప్పాడు. బొర్రయ్య భాషా నైపుణ్యం ప్రశంసిస్తూ మెకంజీ అ శాసన శిలకింద బొర్రయ్య పేరు చెక్కించి రాయల్‌ ఏషియాటిక్‌ సొసైటీకి పంపాడు.

నిజాము రాజ్యాల దేశపటం తయారు చేసి మద్రాసుకు సమర్పించిన ఘనత బొర్రయ్యకే దక్కుతుంది. బొర్రయ్య శ్రమకు మెచ్చి రెండువందల వరహాలు పారితోషికంగా యిచ్చాడు. ఈ ప్రోత్సాహం వల్ల బొరయ్య తన కింద మరి కొంతమందిని తయారుచేసి విషయ సేకరణ ఎలా చేయాలో నేర్పించాడు. వివిధ ప్రాంతాలకు పంపి, వారు చేసేపని విధానం నేర్పించాడు. వీరి సేకరణలో దేశ చరిత్రలు, స్థానిక చరిత్రలు, భూగోళం, వైద్యం, సాహిత్యం , రసాయనిక శాస్త్రం, 'ప్రాబీన శాసనాలు నాణాలు, ప్రాచీన వస్తువులు, బొమ్మలు హస్తకళలకు సంబంధించిన ఆకృతులెన్నో సేకరించారు. బొర్రయ్యకు సహకరించన వారిలో పురిగడ్డ మల్లయ, నారాయణరావు, ఆనందరావు, నిట్టల నాయిని, వెంకట్రావు మొదలయిన వారున్నారు. వీరు ఏరోజుకారోజు తమ దిన చర్యను అంచె టపాల ద్వారా బొర్రయ్యకు చేరవేసేవారు. వీరందరి కృషి వల్ల దక్షిణ భారతదేశంలోని ప్రతిగ్రామ చరిత్ర మత సంబంధమైన దేవాలయాలు, ఆశ్రమాలు, మశీదులు, శిల్పకళా నైపుణ్యం ప్రదర్శించే కట్టడాలు, తాళపత్ర గ్రంథాలు మొదలయినవి ఉన్నాయి.

మెకంజీ సంపుటాల్లో తెలుగు(ఆంధ్ర) భాషకు సంబంధించిన సంపుటాలు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారు నిడదవోలు వెంకటరావు, ఆచార్య చల్లా రాధాకృష్ణ శర్మ, పర్యవేక్షణలో ఎత్తి రాయించారు. ఈ సంపుటాలు కొన్ని తెలుగు విశ్వ విద్యాలయంవారి గ్రంథాలయంలో కూడా ఉన్నాయి. ఈ సంపుటాల్లో గ్రామ వృత్తాంతాల చరిత్రలేకాకుండా స్థానిక ప్రభువుల, దేశ పాలకుల వంశ వృతాంతాలు, శ్వేత మహాత్యాలు, నదులు, చెరువులు, దారులు, మొదలయిన వివరాలు ఉన్నాయి. బొర్రయ్య తనతోపాటు తన తమ్ముళ్ళయిన వెంకటలక్ష్మయ్య, రామస్వామినీ మెకంజీ వద్ద కొలువులో చేర్పించాడు. బొర్రయ్య మెకంజీ కొలువులో పని చేసింది కేవలం అరు సంవత్సరాలు మాత్రమే. ఒక జీవితకాల కృషి చేశాడు.' కాని 1803లో తన 26 వ యేట సన్నిపాతంవల్ల మరణించాడు. బొర్రయ్య మరణం మెకంజీని కలచివేసింది. మద్రాసు సముద్ర తీరంలో బొర్రయ్య అంత్యక్రియలు చేసిన ప్రదేశంలో ఒక శిలా ఫలకం వేయించాడు.

బొర్రయ్య మరణానంతరం లక్ష్మయ్యను మెకంజీ ప్రోత్సహించాడు 1815 నాటికి మెకంజీ భారతదేశానికి సర్వేయర్‌ జనరల్‌గా నియమితుడయ్యాడు. అనంతరం తనకు సహాయంగా ఉన్న లక్ష్మయ్యకు మద్రాసు పరిసరాల్లో ఉన్న ఒక గ్రామం ఈనాముగా యిచ్చి రెండు తరాలు దాకా అనుభవించే హక్కు ఏర్పాటు చేశాడు. 1811లోనే ఒక విల్లు రాస్తూ తన ఆస్టిలో పదోవంతు లక్ష్మయ్య కుటుంబానికి, అతని తమ్ముడయిన రామస్వామి కుటుంబానికి చెందే విధంగా రాశాడు తన దగ్గర పనిచేసిన కావలి సోదరుల కుటుంబాలకు జీవితకాలం ఏ లోటూ లేకుండా ఉండాలనే సత్సంకల్పం గల మెకంజీ ఔదార్యం తరతరాలకు మార్గదర్శకం.

మెకంజీ సేకరించిన సంకలనాలు అమూల్యమ్టైనవి, అవి వెలకట్టలేనవి. దేశ చరిత్రకు కావలసిన ఆకరాలు సమకూర్చిన కావలి సోదరుల కృషి భావితరాలకు తరగని సంపద. నిజానికి తొలి తెలుగు ఎపిగ్రఫిస్టు, అర్మియాలజిస్టు కావలి బొర్రయ్య అనే చెప్పాలి. భాషా పరంగా కొన్ని విషయాలు రేఖామాత్రంగా స్పృశించవలసిన అవసరం ఉంది.

లేఖన సంప్రదాయాలు

బొర్రయ్య ఆయన అనుచరులు సమకూర్చిన తెలుగు వృత్తాంతాల్లోని భాష ఆనాటి క్లిష్ట వ్యావహారికమనే చెప్పాలి. వీరి సేకరణలో ఆయా గ్రామాల్లోని వృద్ధులను, గ్రామాధికారులను, ఆయా కులాల పెద్దలను అడిగి సేకరించిన విషయాలతో పాటు తాళపత్ర గ్రంథాల్లొని వివరాలు ఆనాటి కైఫీయతులు. మెకంజీ సంకలనాలలో లేఖన సంప్రదాయాలు 7 విధాలుగా వర్గీకరించవచ్చు. ఆనాటి భాషలో తెలుగు శాసన భాష బాగా కనిపిస్తుంది.

1. పూర్ణబిందువు: పూర్ణభిందువు తర్వాత అక్షరం ద్విత్వం కావడం మెకంజీ సంకలనాల్లో ఉంది. ఉదా: మహారాజులుంగ్గారు (మెకంజీ సంపుటి 398 పుట 2) మచ్చలిబంద్దరిలో (మెకంజీ సంపుటి 47 పుట 33) ద్విత్వ లేఖనానికి మారుగా బిందువు రాయడం ఉదా: ఇంణి దరబారుకు పిలిపించి - మెకంజీ సంపుటి 80 పుట 105. కొన్ని సందర్భాల్లో నిర్దేతుకంగా పూర్ణ బిందువు రాయడం కూడా కనిపిస్తుంది. ఇది శాసన భాషలో కూడా కనిపిస్తోంది. శేరు సాహెబు ఆంమ్లీలో - మెకంజీ సంపుటి 45 పుట 43 ఆంలిస్తూన్నే- మెకంజీ సంపుటి 244 పుట 78

2 శాసన భాషలో రేఫకు బదులుగా వలవల గిలక రాయడం కనిపిన్తుంది. ఇది 1970 ప్రాంతం వరకూ ఉన్న ప్రామిసరీ నోట్లలోనూ, ఆస్థి మొదలయిన రిజిస్టేషన్‌ పట్టాల్లోనూ కనిపిస్తుంది. ఉదా: బలగ ౯ వ్వం బొప్పంగ - పండరంగనీ అద్దంకి శాసనం 770 ప్రాంతం. దర్వాజాకు తూప్పు ౯ లోతటుట మెకంజీ సంపుటి 272 పుట 6 వెంకట నరసింహ్వు శాస్తుల్ల ౯ తంముడు - మెకంజీ సంపుటి 104 పుట 1 వలపలగిలకకు పూర్వముందున్న అక్షరం ద్విత్వం పొందని రూపాలు కూడా కొన్ని ఉన్నాయి. కూచి ౯, ఖచు ౯ మొదలయినవి.

3. పదమధ్యంలోపించి సంయుక్తత ఏర్పడం దస్తావేజుల్లోనూ ఉందని సి.పి. బ్రౌన్‌ A Dictionary of the mixed dialects and foreign words used in Telugu పుట 31లో పేర్కొన్నాడు. - మ్లేచ్చా క్రాంతములయినంద్ను మెకంజీ సంపుటి 28 పుట 9 - మొదలయ్న వారితో మెకంజీ సంపుటి 113 పుట 102 ఇంకా వలశ్ని, కన్కు త్నఖా వెుదలయినవి.

4. బుకారానికి బదులు ఇత్వ సహిత రేఫ ప్రాచీనకాలంలో కనిపించే సంప్రదాయం. ఇదే మెకంజీ సంపుటాల్లో కూడా కనిపిస్తుంది.

కృిష్ణాజీ పంతులు వారి తాకీదు - మెకంజీ సంపుటి 105 పుట 158ప్రెత్తులుగా యేర్చరచినారు మెకంజీ సంపుటి 1 పుట 132

5. సంక్షేమ లిపి C contraction of the Script లేఖన సౌలభ్యం కోసం ఒక పదంలోని తొలి అక్షరాన్ని పదానికి మారుగా వాడటం నాటికీ నేటికీ ఉన్న సంప్రదాయం. కు॥ కుచ్చెళ్ళు - యెనిమిది కుచ్చెళ్ళున్నర మెకంజీ సంపుటి 1 పుట 74 భ॥ భరణము - భ 1కి అయిదు చవుతుల చొప్పున - మెకంజీ సంపుటి 20 పుట 4 అలాగే రూ॥ రూపాయి, శా॥ శాలివాహన చొ॥ చొప్పున తా॥ తారీఖుకు మొదలయినవి.

6. హ్రస్వం రాయవలసిన చోట దీర్ఘం రాయటం, దీర్ఘం రాయవలసిన చోట హ్రస్వం రాయటం విర్ని = వీరిని, విర్ని అందర్ని- మెకంజీ సంపుటి 93 పుట 61 బురూజు = బురుజు, బురూజు - మెకంజీ సంపుటి 80 పుట 93

7. గహ్వర, జిహ్వ మొదలయిన పదాలు రాసేటప్పుడు గంహ్వర, జింహ్వ అని రాయడం ఆనాటి కాలంలో ఉంది. నరసింహ్వ - మొదలుగునవి. - మహారాఘ్ల్రల ప్రభావం ఆంధ్రదేశం పై ఉన్న దనడానికి కొన్ని ఉదాహరణలు చెప్పవచ్చు.

శివాజి పరిపాలనా కాలంలో పన్ను వసూలు చేసే పద్దతిని చౌతు అనేవారు. అది ఆంధ్ర ప్రాంతంలో మనకు మహారాష్ట్ర నుంచి వచ్చిన పదం అని నిర్ధారణ. తెలుగు సీమలో రెడ్డి, కరణం, వెట్టి, తలారి మొదలయిన పన్నెండుమంది గ్రామోద్యోగుల్ని “బారాబలూతి” అని వ్యవహరించే సంప్రదాయం మహారాష్ట్ర నుంచి దిగుమతి అయిన పదం.

తెలుగు వారిలో కొందరి పేర్ల చివర రావు, పంతులు, అనే బిరుదు నామాలు మరాఠి సంప్రదాయ కరణమే. ఇవన్నీ మెకంజీ సంపుటాల్లో ఉన్నాయి. ఆరె మరాఠీలు - తెలుగు వారిపై ఉన్న భాషా ప్రభావాన్ని ఆచార్య పేర్వారం జగన్నాధం గారు వివరించారు. మెకంజీ సంకలనాల్లో ఉరుదూ, మరాఠీ, ఒరియా పదాలు గుర్తించి వివరించిన డాక్టర్‌ రాళ్ళబండి శ్రీరామశాస్త్రి, ఆచార్య దొణప్ప గారి పర్యవేక్షణలో పిహెచ్‌.డి. డిగ్రీ పొందిన వ్యాసంలో కూడా కొన్ని వివరాలు కన్పిస్తాయి.